ఏపీ గ్రౌండ్ రియాలిటీ.. ఎంపీ,ఎమ్మెల్యేలు, మంత్రులపై సంచలన సర్వే

ఏపీలో( Andhra Pradesh) కూటమి ఏడాది పాలన పూర్తి చేసుకుంది. రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. ఇటువంటి సమయంలో ప్రతి అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి?


ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం ఎలా పని చేస్తోంది? తదితర అంశాలను ప్రాతిపదికగా తీసుకొని చేపట్టిన సర్వే ఫలితాలను రైజ్ సంస్థ ప్రకటించింది. 175 అసెంబ్లీ సీట్లతో పాటు 25 పార్లమెంట్ సీట్లలోనూ టార్జా పరిస్థితులను వివరిస్తూ ప్రవీణ్ పుల్లట నేతృత్వంలోని రైజ్ సర్వే సంస్థ గత కొద్ది రోజులుగా సర్వే చేపట్టింది. ఇప్పటివరకు రీజియన్ల వారీగా ఫలితాలను ప్రకటించిన ప్రవీణ్ పుల్లట. ఇప్పుడు సమగ్రంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను, సర్వేలో తేలిన అంశాలను వెల్లడించారు. ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ పెద్దల పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయం, ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరు వంటివి ఈ సర్వేలో వెల్లడయ్యాయి.

ప్రభుత్వ పనితీరుకు సంబంధించి ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చింది. కూటమి ప్రభుత్వ( aliens government ) పనితీరు బాగుందని 52.8% ప్రజలు అభిప్రాయపడ్డారు. బాగాలేదని 26%.. ఫర్వాలేదని 21.2% ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వ పనితీరు బాగుందని అడిగితే.. కూటమి ప్రభుత్వ పనితీరు బాగుందని 51%, వైసీపీ ప్రభుత్వ పనితీరు బాగుందని 38 శాతం మంది అభిప్రాయపడ్డారు. మరో 11 శాతం మంది మాత్రం చెప్పలేమని చెప్పేశారు. ఎక్కువ సంక్షేమం అందించిన సీఎం జగన్ అని 52%, చంద్రబాబు అని 48 శాతం మంది చెప్పారు. కూటమి ఎమ్మెల్యేల పనితీరు గురించి అడిగితే బాగుందని కేవలం 28 శాతం మంది చెప్పడం విశేషం. 64 శాతం మంది బాగాలేదని తేల్చి చెప్పడం గమనార్హం. ఏ సీఎం హయాంలో అభివృద్ధి ఎక్కువగా జరిగిందని అడిగితే చంద్రబాబు అని 59%, జగన్ అని మరో 41 శాతం మంది చెప్పారు. అమరావతిపై అభిప్రాయం అడిగితే దానిపైన ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారని 78% మంది, రాజధాని అభివృద్ధి చెందాలని మరో 22 శాతం మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఆరుగురు మంత్రుల పనితీరు భేష్
రాష్ట్ర మంత్రివర్గంలో( cabinet ) ఆరుగురు మంత్రుల తీరు బాగుందని ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, లోకేష్, నారాయణ, రామానాయుడు, పయ్యావుల కేశవ్ పనితీరు బాగుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక కొండపల్లి శ్రీనివాస్, గుమ్మిడి సంధ్యారాణి, కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, అచ్చెనాయుడు, ఆనం రామనారాయణరెడ్డి పనితీరు పర్వాలేదని చెప్పారు. కానీ పదిమంది మంత్రుల పనితీరు బాగాలేదని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. అందులో కొల్లు రవీంద్ర, సత్య కుమార్ యాదవ్, పార్థసారథి, దూల బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్దన్ రెడ్డి, సవిత, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్ ఉన్నారు.

ఎంపీల విషయానికి వస్తే..
ఎంపీల పనితీరుకు సంబంధించి గ్రీన్ జోన్లో( Green zone ) తొలి స్థానంలో పెమ్మసాని చంద్రశేఖర్, రెండో స్థానంలో కింజరాపు రామ్మోహన్ నాయుడు, మూడో స్థానంలో బైరెడ్డి శబరి, నాలుగో స్థానంలో కేసినేని చిన్ని, ఐదో స్థానంలో లావు శ్రీకృష్ణదేవరాయలు, ఆరో స్థానంలో పుట్టా మహేష్, ఏడో స్థానంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గురుమూర్తి ఉన్నారు. ఆరెంజ్ జోన్ లో బాలసౌరి, శ్రీ భరత్, పురందేశ్వరి, కలిశెట్టి అప్పలనాయుడు, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, దగ్గుమల్ల ప్రసాదరావు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, శ్రీనివాస వర్మ, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, హరీష్ మాధుర్ ఉన్నారు. రెడ్ జోన్ లో మాగుంట శ్రీనివాసుల రెడ్డి, తెన్నేటి కృష్ణ ప్రసాద్, అంబికా లక్ష్మీనారాయణ, వైయస్ అవినాష్ రెడ్డి, తనుజారాణి, బస్తిపాటి నాగరాజు ఉన్నారు.

గ్రీన్ జోన్ లో 32 మంది..
ఎమ్మెల్యేల విషయానికి వస్తే గ్రీన్ జోన్లో ( Green zone )32 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఇచ్చాపురం, టెక్కలి, బొబ్బిలి, అనకాపల్లి, భీమిలి, గాజువాక, నర్సీపట్నం, పాయకరావుపేట, విశాఖ తూర్పు, అమలాపురం, మండపేట, పిఠాపురం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, గోపాలపురం, పాలకొల్లు, ఉండి, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, మంగళగిరి,పొన్నూరు, కొండేపి, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, చంద్రగిరి, పలమనేరు, కుప్పం, పుంగనూరు, పులివెందుల, హిందూపూరం, ఉరవకొండ, బనగానపల్లి నియోజకవర్గాలు సేఫ్ జోన్ లో ఉన్నాయి.

ఆరెంజ్ జోన్ లో 90 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆమదాలవలస , ఎచ్చెర్ల,పలాస, గజపతినగరం, నెల్లిమర్ల, సాలూరు, కురుపాం, విజయనగరం, రాజాం,ఎస్ కోట, చోడవరం, పెందుర్తి, విశాఖ నార్త్,విశాఖ వెస్ట్, ప్రత్తిపాడు, అనపర్తి,జగ్గంపేట, కొత్తపేట, ముమ్మిడివరం, పెద్దాపురం, రంపచోడవరం, తుని, అచంట, దెందులూరు, కైకలూరు, నరసాపురం, నిడదవోలు, తాడేపల్లిగూడెం, తణుకు, గన్నవరం, జగ్గయ్యపేట, మచిలీపట్నం, మైలవరం, నందిగామ, నూజివీడు, పామర్రు,, పెడన, పెనమలూరు, విజయవాడ వెస్ట్, బాపట్ల, చిలకలూరిపేట, గురజాల, వినుకొండ, మాచర్ల, రేపల్లె,తాడికొండ, తెనాలి, వేమూరు, దర్శి,అద్దంకి, పర్చూరు, కందుకూరు, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం, ఒంగోలు,ఆత్మకూరు, కోవూరు, సర్వేపల్లి, వెంకటగిరి, చిత్తూరు, మదనపల్లె, నగరి, పీలేరు,తంబళ్లపల్లె, జమ్మలమడుగు, కడప,కమలాపురం,, మైదుకూరు, ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటి, ధర్మవరం, కదిరి, కళ్యాణదుర్గం, మడకశిర, పెనుకొండ,పుట్టపర్తి, రాప్తాడు, రాయదుర్గం, తాడిపత్రి,డోన్, కర్నూలు, మంత్రాలయం, నందికొట్కూరు, నంద్యాల,పత్తికొండ, శ్రీశైలం, ఎమ్మిగనూరు నియోజకవర్గాలు ఉన్నాయి.

రెడ్ జోన్ లో 53 నియోజకవర్గాలు నిలిచాయి. నరసన్నపేట, పాతపట్నం, శ్రీకాకుళం, చీపురుపల్లి, పార్వతీపురం, పాలకొండ, అరకు, మాడుగుల,పాడేరు, విశాఖ సౌత్, ఎలమంచిలి, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, గన్నవరం, రాజానగరం, రామచంద్రపురం, రాజోలు, భీమవరం, చింతలపూడి, కొవ్వూరు, పోలవరం, ఉంగటూరు, అవనిగడ్డ, గుడివాడ, తిరువూరు, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, ప్రతిపాడు, సత్తెనపల్లి, నరసరావుపేట, పెదకూరపాడు, చీరాల, సంతనూతలపాడు, గూడూరు, కావలి, ఉదయగిరి, సూళ్లూరుపేట,జీడి నెల్లూరు, పూతలపట్టు, సత్యవేడు, శ్రీకాళహస్తి, తిరుపతి, బద్వేలు, రైల్వేకోడూరు, అనంతపురం అర్బన్,సింగనమల, గుంతకల్, ఆదోని, ఆళ్లగడ్డ, ఆలూరు, కోడుమూరు, పాణ్యం ఉన్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.