ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి.


మే 12 నుండి మే 20 వరకు జరిగిన ఈ సప్లిమెంటరీ పరీక్షల్లో వేలాది మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఈ పరీక్షలు రాసిన విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://bie.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చు. అంతేగాక, ఫలితాలను మరింత సులభంగా తెలుసుకునేందుకు మనమిత్ర WhatsApp నెంబర్‌ 9552300009 ను కూడా ఉపయోగించవచ్చు. విద్యార్థులు ఫలితాలు చూసే ముందు తమ హాల్ టికెట్ నంబర్ ను సిద్ధంగా పెట్టుకోవాలని బోర్డు అధికారులు సూచిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.