తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న యంగ్ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) పేరు కచ్చితంగా ఉంటుంది.
మిస్ ఇండియా గా పేరొందిన మీనాక్షి చౌదరి కి కెరీర్ ప్రారంభం లో పెద్దగా హిట్స్ పడలేదు. వరుసగా ఫ్లాప్స్ ఎదురైనప్పటికీ ఈమెకు అవకాశాలు రావడమే విశేషం. ‘హిట్ 2’ మొదటి బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న మీనాక్షి చౌదరి, ఆ తర్వాత లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి చిత్రాలతో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ సినిమాలకు ముందు ఆమె కెరీర్ లో మట్కా, గుంటూరు కారం, మెకానిక్ రాకీ వంటి డిజాస్టర్ ఫ్లాప్స్ ఉన్నాయి. అయితే రీసెంట్ గా ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఒక సినిమా ఒప్పుకొని చాలా పెద్ద తప్పు చేసానని చెప్పుకొచ్చింది.
ఆ సినిమా మరేదో కాదు తమిళ సూపర్ స్టార్ విజయ్(Thalapathy Vijay) నటించిన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(GOAT ). గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది. కానీ విజయ్ కి ఉన్నటువంటి అపరితమైన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి కమర్షియల్ హిట్ గా నిల్చింది. ఇందులో మీనాక్షి చౌదరి ఒక హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం లో తన పాత్రకు ప్రాధాన్యత లేనట్టుగా అనిపించిందని, అనవసరంగా ఆ సినిమాని ఒప్పుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అంతే కాదు ఈమె మహేష్ బాబు ‘గుంటూరు కారం’ లో కూడా సెకండ్ హీరోయిన్ రోల్ చేసింది. ఇందులో కూడా ఆమె పోషించిన పాత్ర అత్యంత ప్రాధాన్యత లేని పాత్ర అనొచ్చు.
కేవలం మహేష్ బాబు కి సర్వీస్ చేసేందుకే ఆమెని ఈ చిత్రంలో పెట్టినట్టుగా అనిపించింది. ఆమెకు ఉన్న డైలాగ్స్ కూడా తక్కువే. మీనాక్షి చౌదరి ‘గోట్’ చిత్రం చేసి తప్పు చేసానని అంటుంది కానీ, వాస్తవానికి ఆమె గుంటూరు కారం చిత్రం చేయకుండా ఉండాల్సింది అని ఆమె అభిమానుల అభిప్రాయం. ఇప్పుడు మీనాక్షి చౌదరి కి ఇలాంటి రోల్స్ చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈమెకు టాలీవుడ్ లో శ్రీలీల కి మించి క్రేజ్, డిమాండ్ ఉంది. ఆమె గత రెండు చిత్రాల్లో కూడా నటిగా మంచి మార్కులు కొట్టేసింది. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి అర్థవంతమైన పాత్రలు పోషిస్తూ ముందుకు దూసుకెళ్తే మీనాక్షి చౌదరి టాలీవుడ్ నెంబర్ 1 హీరోయిన్ గా మారిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం ఆమె నవీన్ పోలిశెట్టి తో కలిసి ‘అనగనగ ఒక రాజు ‘ అనే చిత్రం లో నటిస్తుంది.