AP Rains: మరో నాలుగు రోజులు వర్షాలు..

www.mannamweb.com


AP Rains: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తుంటే.. మరికొన్ని జిల్లాల్లో ఎండలు దంచికొడుతున్నాయి.. ఇక, ఐఎండీ సూచనల ప్రకారం.. రాబోయే నాలుగు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.. దక్షిణ కేరళ మీదగా ఆవర్తనం కొనసాగుతుందని,, దీని ప్రభావంతో ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

రాబోవు నాలుగు రోజులపాటు క్రింది విధంగా వాతావరణం ఉండనున్నట్లు ఎండీ కూర్మనాథ్ వివరించారు. దీని ప్రభావంతో రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్,గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే కర్నూలు, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఇక, ఎల్లుండి పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతోంది వాతావరణశాఖ.. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు.. మరోవైపు.. 13 మే, సోమవారం రోజు.. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, పల్నాడు మరియు ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మరోవైపు.. ఈ నెల 14వ తేదీన మంగళవారం రోజు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, కోనసీమ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ పేర్కొంది.. ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు. ఇక, శుక్రవారం సాయంత్రం 6 గంటల నాటికి కృష్ణాజిల్లా అవనిగడ్డలో 79 మీమీ, గుంటూరు జిల్లా తుళ్లూరులో 69.7 మీమీ, కృష్ణాజిల్లా ఉంగుటూరులో 61మిమీ, ఏలూరు జిల్లా ఆగిరిపల్లి లో 60మిమీ, అల్లూరి జిల్లా డుంబ్రిగూడలో 57.5మిమీ, అనకాపల్లి జిల్లా రావికమతంలో 53మిమీ, తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో 52మిమీ, విజయనగరం జిల్లా వేపాడలో 51.5మిమీ, ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో 48మిమీ చొప్పున వర్షపాతం నమోదైనట్టు వెల్లడించారు.