ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో కొద్దిగా బెల్లం తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఖాలీ కడుపుతో కాస్త బెల్లం తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్తున్నారు నిపుణులు. జీర్ణ సమస్యలు దూరమవుతాయి. శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్లడంలో హెల్ప్ చేస్తుంది. దీనిలోని ఐరన్, జింక్, సెలెనియం వంటి మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలోని పోషకాలు అనేక సమస్యలను దూరం చేస్తాయి. అవేంటో తెలుసుకుందాం.
ఉదయాన్నే బెల్లం తినటం వల్ల మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడేవారు గోరువెచ్చని నీటితో బెల్లం తీసుకుంటే మంచిది. ఇది లివర్ని డీటాక్స్ చేసి.. కాలేయంలోని ఫ్లష్ని, టాక్సిన్లను బయటకు పంపేస్తుంది. ఖాళీ కడుపుతో బెల్లం తీసుకోవటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్‌ని పెంచి.. ఎనిమియా సమస్యల నుంచి దూరం చేస్తుంది. సహజమైన కార్బ్స్ శరీరానికి అందుతాయి. ఇవి శరీరానికి మంచి ఎనర్జీని అందిస్తాయి. దంతాల ఆరోగ్యాన్ని కాపాడటంలో బెల్లం సహాయపడుతుంది. దీనిలోని కాల్షియం దంతక్షయం ఏర్పడకుండా రక్షిస్తుంది. చిగుళ్లను బలంగా మారుస్తుంది. బెల్లంలో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి మలబద్ధకం, గ్యా్స్, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సంబంధ సమస్యలు ఏర్పడుకుండా కాపాడుతాయి.
కొంతమందికి ఉదయం లేవగానే వాంతులు, వికారం వంటి సమస్యలు ఏర్పడుతుంటాయి. వీటి నుంచి బయటపడేందుకు బెల్లం తినడం మంచిది. ఉదయాన్నే 5 నుంచి 10 గ్రాముల బెల్లం తీసుకోవచ్చు. రెగ్యులర్‌గా తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. ఎక్కువ బెల్లం తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కడుపు ఉబ్బరం కూడా అవుతుంది. చలికాలంలో లేదా చల్లగా ఉన్న సమయాల్లో బెల్లం తింటే మంచి ప్రయోజనాలు పొందవచ్చు. నడుము, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి బాధపడేవారు ఉదయం కొద్దిగా బెల్లం తినడం అలవాటు చేసుకోండి. ఇది బెల్లీ ఫ్యాట్ కరిగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.
కొందరు ఉదయం లేవగానే తలనొప్పితో బాధపడుతుంటారు. ఇలాంటి వారు రోజూ బెల్లం తినడం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. జుట్టు రాలడం సమస్య ఎక్కువగా ఉన్నవారు ఉదయం పూట బెల్లం తినడం అలవాటు చేసుకోండి. దీనిలోని పోషకాలు జుట్టును ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. బెల్లంలో ఐరన్, కాల్షియం వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడతాయి. ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. బెల్లంలోని పోషకాలు చర్మంపై ముడతలు, మచ్చలు ఏర్పడకుండా కాపాడుతుంది. తద్వారా వయసు పెరిగినా యవ్వనంగా కనిపిస్తారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)