భారతదేశం మరియు పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న ఈ గ్రామం భూమిపై స్వర్గం

భారతదేశంలో చూడదగ్గ అందాలతో అలరించే ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఈ ప్రదేశాలు మీకు ఒక కలల ప్రపంచంలా అనిపిస్తాయి. మీరు కూడా ఈ వేసవిలో హిల్ స్టేషన్‌కి వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే.. ఈ రోజు మేము ఒక భూతల స్వర్గపు ప్రదేశం గురించి కనుగొన్నాము. ఈ ప్రదేశం చాలా అందంగా ఉంటుంది. ఒక్కసారి ఇక్కడకు వెళ్తే.. తిరిగి రావాలని మీకు అనిపించదు. ఆ హిల్ స్టేషన్ భారతదేశం.. పాకిస్తాన్ మధ్య ఉన్న అందమైన గ్రామం భూతల స్వర్గం అని చెప్పవచ్చు.

వేసవి సెలవులు మొదలయ్యాయి. పిల్లలను అందమైన ప్రదేశాలకు తీసుకుని వెళ్ళడానికి తల్లిదండ్రులు ఆసక్తిని చూపిస్తారు. అటువంటి పరిస్థితిలో వేసవి సెలవుల్లో చల్లని ప్రదేశానికి వెళ్లాలని ప్లాన్ చేసుకునేవారు మనాలి, సిమ్లా, ముస్సోరీ లేదా నైనిటాల్ వంటి ప్రదేశాలను సందర్శించాలని ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఈ ప్రదేశాలు ఇప్పటికె రద్దీగా మారాయి. కనుక ఈ రోజు అందమైన .. తక్కువ రద్దీ ఉన్న స్థలం గురించి తెలుసుకుందాం. అంతే కాదు ఈ ప్రదేశం ఏదైనా విదేశీ హిల్ స్టేషన్ అనిపిస్తుంది.


ఈ హిల్ స్టేషన్ భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉన్న కరణ్ లోయ. ఇది జమ్మూ కాశ్మీర్‌లో భారతదేశం.. పాకిస్తాన్ మధ్య నియంత్రణ రేఖకు చాలా దగ్గరగా ఉన్న చాలా అందమైన, ప్రశాంతమైన గ్రామం. కనుక ఈ రోజు ఆ అందమైన హిల్ స్టేషన్ గురించి.. ఇక్కడికి ఎలా చేరుకోవచ్చు, ఏమి చూడవచ్చు? ఇది ఎందుకు అంత ప్రత్యేకమైనది అనే విషయాల గురించి తెలుసుకుందాం?

జమ్మూ కాశ్మీర్‌లోని కుపర్వారాలో ఉన్న ఈ గ్రామం ఇటీవల పర్యాటక రంగం కోసం తెరవబడింది. ఇక్కడకు వచ్చిన పర్యాటకులు అందమైన ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కరణ్ గ్రామం గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ గ్రామానికి ఒక వైపు భారతదేశం, మరోవైపు పాకిస్తాన్ ఉన్నాయి. రెండు వైపులా ఒకే నది ప్రవహిస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు.. రెండు వైపులా ఉన్న ప్రజలు ఒకరినొకరు చూసుకునేవారు. కొంచెం కొంచెం సంభాషణ కూడా చేసుకునేవారు

భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పుడు ఈ గ్రామాల మధ్య కొన్ని పరిమితమైన కండిషన్స్ అమలులో ఉన్నాయి. అయితే స్థానిక ప్రజలు ఇప్పటికీ ఆ పాత సోదరభావాన్ని గుర్తుంచుకుంటారు. కరోన్ లోయ అందాలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశం సహజ సౌందర్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడకు ఒకసారి వచ్చిన వారు జీవితాంతం ఈ జ్ఞాపకాలను తమ హృదయంలో ఉంచుకుంటారు.

భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉన్న ఈ కొండ ప్రాంతం స్వర్గంలా అందంగా కనిపిస్తుంది. పర్వతాలు, పచ్చదనం, నదులు, చాలా ప్రశాంతత ఉన్న చోట. కరణ్ వ్యాలీకి సంబంధించిన అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఇక్కడ జనసమూహం లేదా హారన్ల శబ్దం ఉండదు. పక్షుల కిలకిలరావాలు, ప్రవహించే నది గర్జన శబ్దం, పచ్చని పర్వతాల నీడ మాత్రమే మీకు లభిస్తుంది.

ఇక్కడి లోయలు చాలా పచ్చగా, విశాలంగా ఉన్నాయి. మీరు సినిమా సెట్ మీద నిలబడి ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ సాంప్రదాయ చెక్క ఇళ్ళు, పొలాల్లో పనిచేసే వ్యక్తులు, ఎత్తైన పర్వతాలను చూస్తారు.

ఈ లోయ గుండా కిషన్ గంగా నది ప్రవహిస్తుంది. ఇది ఈ ప్రాంత అందాన్ని మరింత పెంచుతుంది. నదిలోని స్వచ్ఛమైన,చల్లని నీరు స్ఫటిక నీలం రంగులో కనిపిస్తుంది. దీని ఒడ్డున కూర్చుని సూర్యాస్తమయాన్ని చూడటం ఒక చిరస్మరణీయ అనుభవంగా మారుతుంది.

కరణ్ వ్యాలీకి సమీప విమానాశ్రయం శ్రీనగర్. ఇది ఇక్కడి నుంచి దాదాపు 110 కి.మీ. దూరంలో ఉంది. మీరు శ్రీనగర్ నుంచి కుప్వారాకు టాక్సీ లేదా స్థానిక రవాణా ద్వారా ప్రయాణించవచ్చు. దీని తరువాత కుప్వారా నుంచి కొండ రోడ్ల ద్వారా వాహనాల ద్వారా చేరుకోవచ్చు. ఆ దారి కొంచెం కష్టమే.. అయితే అక్కడికి చేరుకున్నప్పుడు మీ అలసట అంతా మర్చిపోతారు. ఈ ప్రదేశం LOC కి సమీపంలో ఉంది.. కనుక ఇక్కడికి వెళ్లే ముందు స్థానిక గైడ్ అనుమతి, సహాయం తప్పనిసరి.