చెద పురుగులు పట్టాయా

న ఇంట్లో చెక్క అల్మారాలు, మంచాలు, తలుపులకు చెదపురుగులు పడుతూ ఉంటాయి. ఎంతో ఖరీదైన చెక్కను తెచ్చి ఇష్టంగా చేయించుకున్న అరలతో సహా పుస్తకాలు, దుస్తులను కూడా ఇవి పాడుచేస్తుంటాయి.


ఒకసారి చేరితే వీటిని వదిలించుకోవడం చాలా కష్టం. రసాయనాలతో కూడిన స్ర్పేలకు బదులు కొన్ని ఇంటి చిట్కాలు ఉపయోగించి కొంతమేరకు వీటి బెడదను తగ్గించుకోవచ్చు.

  • చెద పురుగులను నివారించడంలో కర్పూరం పొడి ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇవి ఎక్కువగా చేరే మంచాలు, తలుపులు, కిటికీలు, అరల మూలల్లో సందుల్లో కర్పూరం పొడిని చల్లితే రెండు రోజుల్లో మంచి ఫలితం కనిపిస్తుంది.
  • ముదురు వేపాకులను తెచ్చి ఎండబెట్టి మెత్తని పొడిలా చేయాలి. ఈ పొడిని గది మూలల్లో, అరల్లో, చెక్క సమాన్ల మీద చల్లితే వారం రోజుల్లో చెద పురుగులన్నీ చనిపోతాయి.
  • పుస్తకాలు, దుస్తులు భద్రపరచుకునే చెక్క బీరువాల్లో; కంప్యూటర్‌ టేబుల్‌, డైనింగ్‌ టేబుల్‌ వద్ద కలరా వుండలు ఉంచితే చెద పురుగులు చేరవు.
  • చెదపురుగులు ఉన్నాయన్న అనుమానం వచ్చిన ప్రదేశాల్లో చిటికెడు నల్ల జీలకర్ర ఉంచినా మంచి ఫలితం కనిపిస్తుంది.
  • మంచాలు, సోఫాలు, టేబుళ్లు, కుర్చీల మీద కొద్దిగా వెనిగర్‌ చిలకరిస్తే ప్రయోజనం ఉంటుంది.
  • ఇంట్లో ఉండే సామాన్లు, పుస్తకాలను ఎక్కువకాలం ఒకేచోట ఉంచకుండా కనీసం ఆర్నెల్లకోసారి కదిలిస్తూ ప్రదేశాలు మారుస్తూ ఉంటే చెదలు చేరవు.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.