రాత్రిపూట భోజనం చేయకుండా టిఫిన్ తింటున్నారా? ఇది తెలుసుకోండి!

ప్రస్తుత రోజుల్లో భోజనం చేయడాన్ని చాలామంది తగ్గించేస్తున్నారు. బిర్యానీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత సమయవేళలు లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు బిర్యానీలు..


అందులోను మాంసాహార బిర్యానీలు లాంగించేసి అనారోగ్యాలకు గురవుతున్నారు. కొంతమంది సమయం లేదని, మరికొందరు డైటింగ్ అంటూ రాత్రిపూట భోజనం మానేసి టిఫిన్ తింటుంటారు. ఆరోగ్య పరంగా ఇది చాలా క్లిష్టమైన విషయం. దీనివల్ల ప్రయోజనాలేమిటి? నష్టాలేమిటి? అనే విషయాలను తెలుసుకుందాం.

భోజనం మానేయడంవల్ల కలిగే లాభాలు

బరువు తగ్గడానికి సహాయపడుతుంది… రాత్రిపూట తినే ఆహారం సాధారణంగా జీర్ణం కాకుండా కొవ్వుగా మారిపోతుంది. అందుకే రాత్రి భోజనం మానేయడం వల్ల కొంతమేర బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మెరుగైన నిద్ర… రాత్రి భోజనం చేయకుండా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ పనిభారం తగ్గుతుంది. దీంతో నిద్ర చక్కగా పడుతుంది…

రాత్రిపూట భోజనం మానేయడం వల్ల కలిగే నష్టాలు

శక్తి లేకపోవడం… రోజంతా పనిచేసిన తర్వాత శరీరానికి శక్తి అవసరం. రాత్రి భోజనం మానేస్తే శరీరానికి కావాల్సిన శక్తి లభించదు. దీంతో మరుసటి రోజు ఉదయం నీరసంగా అనిపించవచ్చు. జీర్ణ సమస్యలు… రాత్రిపూట భోజనం మానేస్తే అజీర్తి, ఆమ్లం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పోషకాల లోపం… రాత్రి భోజనంలో అవసరమైన పోషకాలు లభించకపోతే శరీరానికి పోషకాల లోపం ఏర్పడుతుంది. రాత్రిపూట తేలికపాటి టిఫిన్ తీసుకోవడం మంచిది.

ఏమేం తినాలి.. ఏమేం తినకూడదంటే

ఒక గ్లాస్ పాలు తాగాలి. గుడ్డు తింటే మంచిది. మొక్కజొన్న, ఫ్రూట్ సలాడ్, మొక్కజొన్న రొట్టె లాంటివి తినొచ్చు. కారంగా ఉన్న ఆహారం, ఎక్కువగా నూనె వాడిన ఆహారం, మసాలా ఆహారం, చక్కెర అధికంగా ఉన్న ఆహారం తీసుకోకూడదు. రాత్రి 7.00 గంటల తర్వాత తినడం మంచిది కాదు. తక్కువ పరిమాణంలో తినడంతోపాటు త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని తినాలి. రాత్రిపూట భోజనం చేయడం లేదా మానేయడం అనేది వ్యక్తిగత నిర్ణయం. అయితే, ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు వైద్యుని సలహా తీసుకోవడం మంచిది. ఏది తిన్నా ఏడు గంటలకల్లా తినేస్తే మంచి ఆరోగ్యం మీ సొంతమవుతుంది.