జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే నా పెళ్లి జరిగేది కాదు.. అశ్వనీదత్ కూతురు కామెంట్స్ వైరల్

జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే నా పెళ్లి జరిగేది కాదు.. అశ్వనీదత్ కూతురు కామెంట్స్ వైరల్


యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) సినిమాల ప్లానింగ్ వావ్ అనేలా ఉంది. ప్రస్తుతం దేవర, వార్2 సినిమాల షూటింగ్ లో పాల్గొంటున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్వరలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు.

అయితే అశ్వనీదత్( Ashwini Dutt ) కూతుళ్లలో ఒకరైన స్వప్నాదత్( Swapna Dutt ) జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే నా పెళ్లి జరిగేది కాదని చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తాను ప్రసాద్ వర్మ( Prasad Varma ) అనే వ్యక్తిని లవ్ చేశానని అయితే ఆ విషయాన్ని నాన్నకు చెప్పడానికి నా ధైర్యం సరిపోలేదని స్వప్నాదత్ పేర్కొన్నారు. నేను ప్రేమించిన వ్యక్తి కులం మా కులం వేరు కావడంతో నేను నాన్నకు నా లవ్ గురించి చెప్పలేకపోయానని స్వప్నాదత్ వెల్లడించారు. శక్తి షూట్ సమయంలో తారక్ కు ఈ విషయం చెబితే తారక్ నాన్నతో మాట్లాడి ఒప్పించారని స్వప్నాదత్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ చెప్పినా నాన్న మొదట అంగీకరించలేదని అయితే తారక్ మాత్రం ఎంతో కష్టపడి కన్విన్స్ చేశారని స్వప్నాదత్ వెల్లడించడం గమనార్హం. స్వప్నాదత్ చెప్పిన విషయాలు విని ఎన్టీఆర్ ను నెటిజన్లు ఎంతో ప్రశంసిస్తున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా సత్తా చాటాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ 100 నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో వైజయంతీ మూవీస్( Vyjayanthi Movies ) బ్యానర్ లో నటిస్తారేమో చూడాల్సి ఉంది. ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ బాక్సాఫీస్ ను షేక్ చేసే రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.