ఒకరి వ్యక్తిత్వం…వారు పుట్టిన తేదీ, సమయం, రాశి, తిథి..ఆ రోజు గ్రహాల స్థితిని బట్టి అంచనా వేస్తారు. అయితే పుట్టిన నెల ఆధారంగా కూడా లక్షణాలు చెప్పొచ్చంటారు జ్యోతిష్య పండితులు.
ఏప్రిల్ నెలలో పుట్టిన వారు స్నేహానికి విధేయులు. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపిస్తారు. ఏరంగులో ఉన్నప్పటికీ ఆకర్షణీయమైన లుక్ వీరి సొంతం. నమ్మకానికి మరో పేరు వీరు..ఎదుటివారి నుంచి కూడా అదే ఆశిస్తారు. జీవితంలో ఏ సంబంధంలోనైనా జాగ్రత్తగా ఉంటారు.
ఏప్రిల్ నెలలో పుట్టిన వారు స్వతంత్ర భావాలు కలిగిఉంటారు, వారి పనులు వారే స్వయంగా వారి ఆలోచనలకు అనుగుణంగా చేసుకుంటారు. ఎవ్వరి జోక్యాన్ని అస్సలు ఇష్టపడరు. అవసరం అయితే ఆ పని నుంచి తప్పుకుంటారు కానీ ఇతరులు రుద్ది చెబితే మాత్రం తగ్గేదేలే అంటారు
ఈ నెలలో పుట్టిన వారు శక్తివంతులు, తెలివితేటలు మెండుగా ఉంటాయి,చాలా యాక్టివ్ గా ఉంటారు.
కోపం ఎక్కువైనప్పటికీ ఇతరలు మంచికోసమే ఆగ్రహాన్ని ప్రదర్శిస్తారు. వేరే వారికి మార్గదర్శకత్వంగా ఉంటారు
ఏప్రిల్లో పుట్టిన వారికి మానసిక ధైర్యం వీరికి చాలా ఎక్కువ..ఎప్పటికప్పుడు ప్రణాళికలు వేసుకుని పనులు చేసుకుంటారు. తలపెట్టిన పనిని మధ్యలో వదిలేయరు..ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పూర్తిచేసి చూపిస్తారు
ఏప్రిల్ నెలలో పుట్టిన వారు ప్రతి విషయంలో ముక్కుసూటిగా, నిజాయితీగా ఉంటారు. నిజాయితీ కారణంగా చాలామందికి శత్రువుగా మారినా వారిని ఎదుర్కొంటారు కానీ తమ తీరుని మాత్రం మార్చుకోవాలి అనుకోరు
ఇంట్లో, కార్యాలయంలో, వారి వ్యక్తిగత జీవితంలోనూ మంచి స్థానంలో ఉంటారు..ఉండాలని ఆశపడతారు..అందుకు తగిన ప్రయత్నం చేస్తారు.
జీవితంలో అభివృద్ధి చెంది తమ ఆశలు నెరవేర్చుకుంటారు..తృప్తికరమైన జీవితాన్ని గడుపుతారు
ఏప్రిల్ నెలలో పుట్టిన వారి దాంపత్య జీవితం బావుంటుంది. ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు ఉండవు. పరస్పర అవగాహన ఉంటుంది
అదృష్టంతో పాటూ పరిస్థితులు కూడా సహకరిస్తాయి
ఏప్రిల్ నెలలో పుట్టిన వారు సోమరితనం దరిచేరనివ్వరు.. పనినే దైవంగా భావిస్తారు.
ఏప్రిల్లో పుట్టిన వారి ఆరోగ్యం: ఈ నెలలో పుట్టిన వారికి సహజంగా కంటి, పంటి, చెవికి సంబంధించిన సమస్యలు వస్తాయి. జ్వరం, తలపోటు ఎక్కువగా బాధిస్తుంటాయి
ఆర్థిక స్థితి: ఈ నెలలో జన్మించిన వారు బాగా సంపాదిస్తారు. అనుకోని ధననష్టం ఉంటుంది కానీ ఎలాంటి సమస్యలను అయినా తట్టుకుని జీవితంలో స్థిరంగా నిలబడతారు
అనుకూలవారాలు: సోమవారం, శుక్రవారం అదృష్టాన్నిస్తాయి..మంగళవారం, గురువారం కలిసొస్తుంది
కలిసొచ్చే రంగులు: పింక్ కలర్ వీరికి కలిసొచ్చే రంగు
నోట్: ఈ ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.