Friday, November 15, 2024

AP News | మంత్రి పదవి రాకపోవడంపై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు

AP News | మంత్రి పదవి దక్కకపోవడంపై టీడీపీ సీనియర్‌ నేత, నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి రాకపోవడంపై తనకు బాధేమీ లేదని స్పష్టం చేశారు.

గతంలో తనకు కూడా 26 ఏండ్లకే మంత్రి పదవి దక్కిందని చెప్పారు. అప్పుడు సీనియర్లంతా బాధపడ్డారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కొత్త రక్తం రావాలని, యువ మంత్రులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వ హయాంలో కొంతమంతి అధికారులు ఓవర్‌ యాక్షన్‌ చేశారని తెలిపారు. వారిని చంద్రబాబు క్షమించినా.. తాను మాత్రం క్షమించనని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల కోసం అనేక ఇబ్బందులు పడ్డామని తెలిపారు. ఏపీకి ఇప్పుడు మంచి రోజులు వచ్చాయని పేర్కొన్నారు.

టీడీపీ సీనియర్‌ నేత, నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడికి చంద్రబాబు కేబినెట్‌లో చోటు దక్కకపోవడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. కూటమి అధికారంలోకి వస్తే టీడీపీలో అత్యంత సీనియర్‌ నాయకుడు, చంద్రబాబుకు సమకాలీకుడు అయిన అయ్యన్నపాత్రుడికి మంత్రి పదవి గ్యారంటీ అని చాలామంది ఊహించారు.

కానీ అనూహ్యంగా ఆయనకు కేబినెట్‌లో చోటు దక్కలేదు. విశాఖ జిల్లా నుంచి వంగలపూడి అనితకు మంత్రి పదవి కేటాయించారు. అయ్యన్నపాత్రుడు అసంతృప్తిలో ఉన్నట్లు చర్చ మొదలయ్యింది. ఈ నేపథ్యంలోనే స్పందించిన అయ్యన్నపాత్రుడు ఆ వార్తలను ఖండించారు.

Chandrababu: అఖిల భారత సర్వీసుల గౌరవాన్ని దెబ్బతీశారు

కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌ల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి
ఐదేళ్లలో చాలా అన్యాయంగా ప్రవర్తించారని ఆగ్రహం
గాడి తప్పిన వ్యవస్థలను దారిలో పెడతానని వ్యాఖ్య

అమరావతి: రాష్ట్రంలోని అఖిల భారత సర్వీసులకు చెందిన కొందరు అధికారులు గత ఐదేళ్లలో వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని, అసంతృప్తిని వ్యక్తంచేశారు. ఐఏఎస్, ఐపీఎస్‌ వంటి గౌరవప్రదమైన సర్వీసులో ఉన్న అధికారులు అలా వ్యవహరిస్తారని, పరిపాలన అంత అన్యాయంగా తయారవుతుందని తానెప్పుడూ అనుకోలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంపై ప్రజల్లో అంత కసి, నిస్పృహ వచ్చాయంటే గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసకర, ప్రజావ్యతిరేక విధానాలే కారణమని, ఈ విషయంలో కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌లకూ కీలకపాత్ర ఉందని ఆయన పేర్కొన్నారు. ‘నాకేదో అన్యాయం జరిగిందన్న బాధ లేదు. నాకు జరిగిన అన్యాయం గురించి నేనెప్పుడూ మాట్లాడను. రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి మళ్లీ మీతో వివరంగా మాట్లాడతాను’ అని వారికి స్పష్టంచేశారు. వ్యవస్థలను మళ్లీ పరిపాలన గాడిలో పెడతానని అన్నారు.

గురువారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. తనకు అభినందనలకు తెలియజేసేందుకు వచ్చిన అధికారులను ఉద్దేశించి ఐదారు నిమిషాలు మాట్లాడారు. పరిపాలన భ్రష్టుపట్టడంలో కొందరు అధికారులు పోషించిన పాత్రపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ విభాగాలన్నీ నిస్తేజమయ్యాయని, వ్యవస్థలన్నీ గాడి తప్పాయని మండిపడ్డారు. ‘గత ఐదేళ్లలో కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌లు వ్యవహరించిన తీరు చాలా బాధించింది. చాలా అన్యాయంగా ప్రవర్తించారు. ఆ సర్వీసులకు ఉండే గౌరవాన్ని దెబ్బతీశారు’ అని తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. ఆయనను మొదటిసారి అలా చూసిన అధికారులు నిశ్చేష్టులయ్యారు. చంద్రబాబుని కలిసేందుకు పుష్పగుచ్ఛాలతో వచ్చిన అధికారులందరినీ సీఎం కార్యాలయ భవనంలోని మొదటి అంతస్తు సమావేశ మందిరంలో కూర్చోబెట్టారు. బాధ్యతల స్వీకరణ ప్రక్రియ పూర్తయ్యాక చంద్రబాబు ఆ మందిరంలోకి వెళ్లారు. గత ప్రభుత్వంలో అత్యంత వివాదాస్పద అధికారులుగా పేరుపొందిన శ్రీలక్ష్మి, పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, సునీల్‌ కుమార్‌ వంటివారు ముందు వరుసలో, ఆయనకు సమీపంలోనే కూర్చున్నారు.

మీరే ఆత్మవిమర్శ చేసుకోండి..
చంద్రబాబు అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘నేను 1995లో మొదటిసారి ముఖ్యమంత్రిని అయ్యాను. ఇక్కడున్న అధికారుల్లో కొందరు అప్పట్లో నాతో కలిసి బ్రహ్మాండంగా పనిచేశారు. దేశానికే ఆదర్శంగా నిలిచారు. కానీ గత ఐదేళ్లలో ఏం చేశారో, ఎలా పనిచేశారో ఆత్మవిమర్శ చేసుకోవాలి’ అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రంలో గత ఐదేళ్లలో చూసినంత దారుణమైన పరిస్థితులు గతంలో ఎన్నడూ లేవు. ఏం జరిగిందో ఇప్పుడు నేను వివరంగా మాట్లాడాలనుకోవడం లేదు. నా మీద పవిత్రమైన బాధ్యత ఉంది. మళ్లీ పరిపాలన గాడిలో పెడతాను. వచ్చే ఒకటి రెండు రోజులు పూర్తిచేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. తర్వాత పూర్తిస్థాయిలో పాలనపై దృష్టి పెడతాను’ అని చంద్రబాబు తెలిపారు. ఆయన తాను చెప్పాలనుకున్న విషయాల్ని సూటిగా చెప్పేసి సమావేశాన్ని ముగించారు.

అంతకుముందు చంద్రబాబును కలిసేందుకు శ్రీలక్ష్మి, పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు వెళుతుండగా అనుమతిలేదంటూ అధికారులు వారిని సమావేశమందిరంలోనే కూర్చోబెట్టారు.

ఉద్యోగుల భవిష్య నిధి లెక్కలేవి ?

నాలుగేళ్లుగా విడుదల కాని పీఎఫ్‌ బ్యాలెన్స్‌ షీట్స్‌

ఉద్యోగి జీతం నుంచి మినహాయించిన సొమ్ముపై ఆందోళన

ప్రతినెలా సుమారు రూ.3 కోట్ల నుంచి 5 కోట్లు సొమ్ము మినహాయింపు

నాలుగేళ్లలో సుమారు రూ.240 కోట్ల సొమ్ముకు జమాఖర్చులు నిల్‌

బ్యాలెన్స్‌ షీట్‌ లేకపోవడంతో రుణ దరఖాస్తులకు అవకాశం లేదు

పదవీ విరమణ చేసే ఉద్యోగికి దక్కని బ్యాలెన్స్‌ షీట్స్‌

నిడమర్రు, జూన్‌ 13 : తమ భవిష్యత్తు కోసం ప్రభుత్వ ఉద్యోగులు దాచుకొన్న సొమ్ము ఉందో లేదో ఏమైందో తెలియని పరిస్థితి నెలకొంది. తాము దాచుకొంటున్న సొమ్ము తమ ఖాతాల్లో ఎంతవరకు జమయ్యాయో లేదో తెలియని పరిస్థితి. నెల వారీగా తమ జీతం నుంచి మినహాయించిన సొమ్ము తమ పీఎఫ్‌ ఖాతాల్లోకి జమ అవుతోందో లేదో అని ఉమ్మడి పశ్చిమ జిల్లాలో వేలాదిమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఆన్‌లైన్‌ ద్వారా ఎప్పటికప్పుడు తమ బ్యాలెన్స్‌ షీట్లు చూసుకొనే ఉద్యోగులు గత ప్రభుత్వ హయాంలో ఆన్‌లైన్‌ చేయకపోవడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఉమ్మడి పశ్చిమ జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగుల నుంచి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారి జీత భత్యాల నుంచి సుమారు రూ.6 వేల నుంచి రూ. 15 వేల వరకు సొమ్ము మినహాయించబడి సదరు డ్రాయింగ్‌ అథారిటీ ద్వారా జిల్లా పరిషత్‌ కార్యాలయంలో గల ప్రావిడెంట్‌ ఫండ్‌ విభాగానికి పంపిస్తారు. ఉమ్మడి పశ్చిమ జిల్లాలో సుమారు 7,726 మంది ఉద్యోగులకు గత నాలుగేళ్లుగా ప్రావిడెంట్‌ ఫండ్‌ బ్యాలెన్స్‌ షీట్స్‌ ఇవ్వలేదని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. సుమారు 2020-21, 2021-22, 2022-23, 2023-24 సంవత్సరాలకు గాను ఉద్యోగులు.. ఉపాధ్యాయులు, ప్రభుత్వ సర్వెంట్లకు తమ భవిష్యనిధి ఖాతా బ్యాలెన్స్‌ షీట్లు ఇవ్వకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రతినెల కోట్ల రూపాయల సొమ్ము మినహాయింపు..

ప్రతి నెల ఉద్యోగికి మంజూరైన జీతభత్యాల నుంచి ఆయా డ్రాయింగ్‌ అథారిటీ వారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొంత సొమ్ము మినహాయించి ఫ్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతాలకు పంపిస్తారు. ఈవిధంగా పంపబడిన సొమ్ము ఆయా ఉద్యోగుల పీఎఫ్‌ ఖాతాలలో జమ చేస్తారు. జమ చేసిన సొమ్ము వారి ఖాతాల్లోకి చేరాలి. ప్రతి ఉద్యోగికి తన సొమ్ము తమ ఖాతాలలో జమ చేయబడుతుందో లేదో అనుమానం ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం వారికి తమ ఖాతా బ్యాలెన్స్‌ షీట్లు ప్రతి ఏడాది ఇవ్వకపోవడమే అని తెలుస్తుంది. ప్రతినెల ఒక ఉద్యోగి సగటున రూ. 7 వేల నుంచి రూ. 10 వేల వరకు సొమ్మును తన ఖాతాలోకి జమచేసుకొంటాడు. ఈ లెక్కన నెలకు రూ.5 కోట్లు సొమ్ము జమచేయబ డుతుంది. నెలకు రూ.5 కోట్లు చొప్పున ఏడాదికి 60 కోట్లు రూపాయలు సొమ్ము చేయబడుతుంది. ఈ నాలుగేళ్లలో సుమారు రూ.240 కోట్లు సొమ్ముకు జమాలెక్కలు లేకుండా పోయాయని ఉద్యోగులు మొత్తుకుంటున్నారు. గతంలో ఎన్నిసార్లు విజ్ఞాపన పత్రాలు సమర్పించినా బుట్టదాఖాలాలు అయ్యాయే గానీ ఈ విషయం ముందుకు సాగలేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. బ్యాలెన్స్‌ షీట్‌ లేకపోవడంతో బుణ దరఖాస్తులు పెట్టుకోవడం లేదు.

పీఎఫ్‌ ఖాతా సక్రమ నిర్వహణ నిల్‌..

ఉద్యోగుల పీఎఫ్‌ ఖాతాలు సక్రమ నిర్వహణ లేకపోవడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. తమ మినహాయింపు సొమ్ము తమ ఖాతాలో ఉన్నదీ లేనిదీ తెలియక ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. తమ సమస్యలు పరిష్క రించాలంటూ రోడ్డు ఎక్కడానికి సిద్ధమవుతున్నారు పీఎఫ్‌ సొమ్ములో సవరణ లు కూడా జరుగుతున్నదీ లేనిది తెలియక ఉద్యోగులు నష్టపోతున్నారు.

రిటైర్డ్‌ ఉద్యోగికి దక్కని బ్యాలెన్స్‌ షీట్స్‌..

ఈ ఏడాది పెద్దమొత్తంలో ఉద్యోగులు పదవీ విరమణ చేయబోతున్నారు. పదవీ విరమణ చేయబోయే ఉద్యోగులకు కూడా తమ భవిష్య నిధి ఖాతాల బ్యాలెన్స్‌ షీట్లు అందక తికమక పడుతున్నారు. తమ ఖాతా స్టేట్‌మెంట్ల కోసం పలుమార్లు ఆఫీసుల చుట్టూ తిరగుతున్నారు. లెక్కలు తేలక అధికారులు ఎంత సొమ్ము ఇస్తే అంతే తీసుకోవాల్సి వస్తోందని పదవీ విరమణ చేసే ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎనిమిది చదివాడు.. ఏపీలో మంత్రి అయ్యాడు…AP లో మంత్రుల విద్యార్హతలు ఇవే…

ఎనిమిది చదివాడు.. ఏపీలో మంత్రి అయ్యాడు…AP లో మంత్రుల విద్యార్హతలు ఇవే…

ఏ ఉద్యోగానికైనా కనీస విద్యార్హత ఉంటుంది. కానీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, మంత్రుల వంటి చట్ట సభల్లో శాసనాలు చేసే పోస్టులకు మాత్రం టెన్త్‌ ఫెయిల్‌ అయినా పర్వాలేదు..

ఇంటర్‌ వరకు చదివినా పర్వాలేదు ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కొలువు దీరిన మంత్రులు ఏమి చదవుకున్నారు.. ఎంత వరకు చదువుకున్నారనే అంశాన్ని ఒక సారి పరిశీలిస్తే మెడిసిన్‌ చదివిన వారు ఒకరు ఉండగా, పిహెచ్‌డీలు చేసి డాక్టరేట్లు సంపాదించిన వారు ఇద్దరు ఉన్నారు. తక్కిన వారిలో ఎక్కువ మంది డిగ్రీలు, పీజీలు, ఎంబిఏలు చేసిన వారు ఉన్నారు. వీరితో పాటు టెన్త్‌ డిస్కంటిన్యూ చేసిన వారు, అంత కంటే తక్కువ చదివిన వారు కూడా ఉన్నారు.

మంత్రుల అందరిలో కంటే తక్కువ చదవు చదువుకున్నది బీసీ జనార్థనరెడ్డి. ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రకారం ఈయన కేవలం 8వ తరగతి మాత్రమే చదవారు. కర్నూలు జిల్లా బనగానపల్లి గవర్నమెంట్‌ హైస్కూల్‌ నుంచి ఎస్‌ఎస్‌ఎల్సీ ఇన్‌కంప్లీట్‌ చేశారు. బొబ్బల చిన్నోళ్ల జనార్థనరెడ్డి.. బీసీ జనార్థనరెడ్డిగా ఫేమస్‌. ఈయన 2014లో తొలి సారి బనగానపల్లె నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డిపై 17,341 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో కాటసాని రామిరెడ్డి చేతిలో ఓటమి చవిచూసిన జనార్థనరెడ్డి 2024 ఎన్నికల్లో విజయం సాధించి మంత్రి పదవిని దక్కించుకున్నారు.

పిఠాపురం నుంచి తొలిసారి గెలుపొంది మంత్రి పదవిని దక్కించుకున్న జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ ఇంటర్‌ వరకు చదువుకున్నారు. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో నెల్లూరులోని సెయింట్‌ జోసెఫ్‌ ఇంగ్లీషు మీడియం హైస్కూల్‌ నుంచి టెన్త్‌ క్లాస్‌ పాస్‌ అయినట్లు పేర్కొన్నారు.

అద్దంకి నుంచి నాలుగోసారి గెలిచిన గొట్టిపాటి రవికుమార్‌ తాజాగా మంత్రి పదవి దక్కించుకున్నారు. ఈయన కూడా ఇంటర్‌ వరకే చదువుకున్నారు. ఇంజనీరింగ్‌ విద్యను మధ్యలోనే డిస్‌కంటిన్యూ చేశారు.

కొలుసు పార్థసారథి కూడా ఇంటర్‌ వరకు చదువుకున్నట్లు ఎన్నికల సంఘానికి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు. హైదరాబాద్‌ సెయింట్‌ జోసెఫ్‌ జూనియర్‌ కళాశాల నుంచి ఇంటర్‌ చదివిన పార్థసారథి, హైదరాబాద్‌లోని సీబీఐటీలో బీటెక్‌ చేరి డిస్‌కంటిన్యూ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈయన మంత్రిగా పని చేశారు.

రెండో సారి మంత్రి అయిన నారా లోకేష్‌ అమెరికా స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీ నుంచి ఎంబీఏ చదివారు. మరో సీనియర్‌ నేత కింజరాపు అచ్చెన్నాయుడు డిగ్రీ చదివారు.

రెండో సారి మంత్రి పదవిని దక్కించుకున్న కొల్లు రవీంద్ర రెండు డిగ్రీలు చేశారు. బీఏ, ఎల్‌ఎల్‌బీ చదివారు.

ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ స్పీకర్‌గా పని చేసి, తాజాగా చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న నాదెండ్ల మనోహర్‌ ఎంబీఏ చేశారు.

తొలి సారి మంత్రి పదవి దక్కించుకున్న వంగలపూడి అనిత ఎంఏ, ఎంఈడీ చేసి, ఉపాధ్యాయురాలిగా పని చేస్తూ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు.

టీడీపీలో సీనియర్‌ నేత అయినప్పటికీ తొలి సారి మంత్రి పదవిని దక్కించుకున్న పయ్యావుల కేశవ్‌ డిగ్రీతో పాటు మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా చేశారు.

మాజీ ఎమ్మెల్సీ, తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన గుమ్మిడి సంధ్యారాణి బీఎస్సీ చేశారు.

రేపల్లె నుంచి గెలిచి మంత్రి పదవిని సొంతం చేసుకున్న అనగాని సత్యప్రసాద్‌ కూడా డిగ్రీ చదివారు.

నిడదవోలు నుంచి గెలిచి మంత్రి పదవిని పొందిన జనసేన నేత కందుల దుర్గేష్‌ ఆర్థిక శాస్త్రంలో ఎంఏ చదివారు. కర్నూలు నుంచి గెలిచి మంత్రిగా అయిన టీజీ భరత్‌ యుకేలో ఎంబీఏ చదివారు.

పెనుగొండ నుంచి తొలిసారి గెలిచి మంత్రి అయిన ఎస్‌ సవిత డిగ్రీ చదివారు.

రామచంద్రాపురం నుంచి గెలిచి అందరి అంచనాలను తారుమారు చేస్తూ మంత్రి పదవిని దక్కించుకున్న వాసంశెట్టి సుభాష్‌ బీస్సీ, ఎల్‌ఎల్‌బీ చదువుకున్నారు.

విజయనగరం నుంచి గెలిచి మంత్రి అయిన కొండపల్లి శ్రీనివాస్‌ కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చదివారు.

రాయచోటి నుంచి గెలిచి మంత్రిగా పదవిని దక్కించుకున్న మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి బీడీఎస్‌ చేశారు.సీనియర్‌ నేతలైన ఎన్‌ఎండీ ఫరూక్‌ పియూసీ, ఆనం రామనారాయణరెడ్డి బీకాం, బీఎల్‌ చదవుకున్నారు.

ధర్మవరం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచి మంత్రి పదవిని సొంతం చేసుకున్న నత్యకుమార్‌ యాదవ్‌ రాజనీతి శాస్త్రంలో ఎంఏ చదువుకున్నారు

.ఇక కొండపి నుంచి హ్యట్రిక్‌ విజయం సాధించి మంత్రి పదవిని సొంతం చేసుకున్న డాక్టర్‌ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి ఎంబీబీఎస్‌ చదువుకున్నారు.

పాలకొల్లు నుంచి గెలిచి మంత్రిగా పదవిని సొంతం చేసుకున్న నిమ్మల రామానాయుడు జాగ్రఫీలో ఎంఫీల్, పిహెచ్‌డీ చేశారు.

రెండో సారి మంత్రి పదవిని సొంతం చేసుకున్న పి నారాయణ ఎమ్మెస్సీ, పిహెచ్‌డీ చేశారు. స్టాటిస్టిక్స్‌లో గోల్డ్‌మెడల్‌ సాధించారు.

చంద్రబాబు వద్దకు ఈ ఇద్దరికి నో పర్మిషన్, వారి బొకేలు కూడా తీసుకోని సీఎం

IAS, IPS Officers Que to Meet CM Chandrababu : ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. గన్నవరం ఐటీ పార్క్ సమీపంలోని కేసరపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఏపీ నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేశారు.

డిప్యూటీ సీఎంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్లు ప్రమాణం చేశారు. వీరితో పాటు మరో 23 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా సహా సినీ, రాజకీయ , ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు తరలివచ్చారు.

బాధ్యతల స్వీకరణ
ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. గురువారం సాయంత్రం 4.41 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్లోని తన ఛాంబర్లో పండితుల మంత్రోచ్చారణల మధ్య బాధ్యతలు చేపట్టారు. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ తదితరులు ఉన్నారు. సీఎం హోదాలో సచివాలయానికి వచ్చిన చంద్రబాబుకు వివిధశాఖలకు చెందిన ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

మెగా డీఎస్సీ పై మొదటి సంతకం
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ పత్రంపై మొదటి సంతకం చేశారు. (కేటగిరిల వారీగా : ఎస్జీటీ : 6,371; పీఈటీ : 132; స్కూల్ అసిస్టెంట్స్: 7725; టీజీటీ: 1781; పీజీటీ: 286; ప్రిన్సిపల్స్: 52) ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు ఫైల్పై రెండో సంతకం, సామాజిక పింఛన్లు రూ.4వేలకు పెంపు దస్త్రంపై మూడో సంతకం, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం, స్కిల్ క్యాలిక్యులేషన్ పై ఐదో సంతకం చేశారు.

ఐఏఎస్, ఐపీఎస్ ల క్యూ
చంద్రబాబు బాధ్యతల స్వీకరణ సందర్భంగా సచివాలయం మొదటి బ్లాక్ లోని సీఎం చాంబర్ వద్ద కోలాహలం నెలకొంది. బాధ్యతలు చేపట్టిన సీఎం చంద్రబాబును టీడీపీ నేతలు, ఉద్యోగ సంఘాల నేతలు, పలువురు అధికారులు కలిసి శుభాకాంక్షలు చెప్పారు. ఆ సమయంలో కాగా, కొందరు వివాదాస్పద ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించారు. వారిలో శ్రీలక్ష్మి, అజయ్ జైన్, సునీల్ కుమార్, పీఎస్సార్ ఆంజనేయులు ముఖ్యమంత్రి కార్యాలయం వద్దకు వచ్చారు. అయితే, చంద్రబాబును కలిసేందుకు వారికి పర్మీషన్ దక్కలేదు. దాంతో వారు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఐఏఎస్ శ్రీలక్ష్మి గతంలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. పీఎస్సార్ ఆంజనేయులు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. సునీల్ కుమార్ వైసీపీ హయాంలో సీఐడీ చీఫ్ గా పనిచేశారు.

వారి తీరు బాధించింది
గడచిన ఐదేళ్లలో కొందరు ఐఏఎస్ ల తీరు బాధించిందని ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సచివాలయంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో అన్నారు. వారుఇలా వ్యవహరిస్తారని తాను ఎప్పుడూ అనుకోలేదన్నారు. 1995 నుంచి పలు దఫాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నా ఇలాంటి పరిస్థితిని తాను ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు అన్నారు. గడచిన ఐదేళ్లలో వారు వ్యవహరించిన తీరుపై ఆత్మ విమర్శ చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. త్వరలోనే మరోసారి శాఖల వారీగా ఐఏఎస్, ఐపీఎస్ లతో సమావేశం అవుతానన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రవీణ్ ప్రకాష్, శ్రీ లక్ష్మీ, పీఎస్ఆర్ ఆంజనేయులు అందించిన బొకేలను చంద్రబాబు తిరస్కరించినట్లు సమాచారం.

Mega DSC పై ఏపీ ప్రభుత్వం జీవో జారీ

అమరావతి: మెగా డీఎస్సీపై ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 16,347 ఉపాధ్యాయ పోస్టులను డిసెంబర్‌ 31 నాటికల్లా భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్‌ ప్రసాద్‌ ఆదేశాలు జారీ చేశారు.


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాలుగోసారి బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ దస్త్రంపై సీఎం మొదటి సంతకం చేశారు.

ఈ మేరకు వీటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. వీటిలో ఎస్‌జీటీ: 6,371; పీఈటీ : 132; స్కూల్‌ అసిస్టెంట్స్‌: 7725; టీజీటీ: 1781; పీజీటీ: 286; ప్రిన్సిపల్స్‌ పోస్టులు 52 ఉన్నాయి.

AP School Visits and Inspection processes – Application

AP School Visits and Inspection processes – Application Enhancement of School Visits and Inspection processes – Utilization of Visits/Inspections Application within the School Attendance Application – Instructions Issued

School Education – Enhancement of School Visits and Inspection processes – Utilization of Visits/Inspections Application within the School Attendance Application – Instructions Issued Rc.No.ESE02-30/55/2023-A&I-CSE Dated: 12/06/2024

Read:

1. CSE Procs.Rc.No.21/A&I/2015, Dated:31-10-2015.

2. CSE Procs.Rc.No.ESE02-30/55/2023-A&I-CSE, Dated 01-03-2024

3. Review of Visits/Inspection Reports on the CSE website.

In continuation of the instructions issued vide reference 2nd read above, it has been observed that the utilization of the online Visit/Inspection form by the RJDs, DEOs, DyEOs and Mandal Educational officers have been inadequate. Only a few Officers have met their monthly targets, most of the inspecting Officers in the State did not use the online Visit/Inspection form, which indicates the negligence and dereliction in the duties.

All the Regional Joint Directors of School Education and District Educational Officers are reminded that the School visits and inspections are crucial for maintaining and enhancing the quality of education. It ensures accountability and supporting the overall development of the education system.

In view of the upcoming reopening of schools on 13th June 2024 and to improve the supervision and administration of educational institutions and offices under the School Education Department, the following instructions are issued:

All the Regional Joint Directors of School Education, District Educational Officers, Deputy Educational Officers and Mandal Educational Officers in the State must strictly follow the instructions regarding the utilization of the Visit/Inspection form within the School Attendance Application.
All inspecting officers must meet their monthly targets for school visits & inspections as specified in the reference 1st cited above.
All the RJDSEs and DEOs are instructed to disseminate the above to all the Deputy Educational Officers and Mandal Educational Officers under their jurisdiction and ensure that the inspecting officers regularly report their visits / inspections through the designated online application only.

Non – compliance of these instructions will be viewed seriously and appropriate disciplinary action will be initiated against the officers concerned who fails to meet their inspection targets.

Download CSE Proceedings

UDISE+ స్టూడెంట్ మాడ్యూల్లో 2023-24 విద్యార్థులను 2024-25 విద్యా సం.కు ప్రమోట్ చేయు విధానం

UDISE+ స్టూడెంట్ మాడ్యూల్లో 2023-24 విద్యార్థులను 2024-25 విద్యా సం.కు ప్రమోట్ చేయు విధానం

పాఠశాల విద్యా శాఖ నూతనం గా ప్రవేశ పెట్టిన UDISE + పోర్టల్ లో స్టూడెంట్ ఇన్ఫో పోర్టల్ డేటా అంత మైగ్రేట్ చేయబడును.. అడ్మిషన్స్ కూడా గత సంవత్సరం ఉన్న వాటిని ప్రస్తుత సంవత్సరానికి Progression Activities ద్వారా అప్డేట్ చేసి విద్యార్థులను 2024-25 విద్యా సం.కు ప్రమోట్ చేయవలసి ఉంది. (PROC.ESE02-31021/36/2024-IT-CSE Dated: 12/06/2024)

అలానే ఇక నుంచి విద్యార్థుల నమోదు కూడా ఈ UDISE + పోర్టల్ లోనే ఎంటర్ చేయవలసి ఉంది.. ఈ ప్రక్రియ లో భాగం గా UDISE+ స్టూడెంట్ మాడ్యూల్లో 2023-24 Progression Activities అప్డేట్ చేసి విద్యార్థులను 2024-25 విద్యా సం.కు ప్రమోట్ చేయు పూర్తి విధానం తెలుసుకొనుటకు క్రింది వీడియో లింకు క్లిక్ చేసి చూడండి.

Transfer of Students:
రాష్ట్రంలో లేదా రాష్ట్రం వెలుపల ఒక పాఠశాల నుండి మరొక పాఠశాలకు బదిలీ చేయాలనుకుంటున్న విద్యార్థులను సంబంధిత HM/ ప్రిన్సిపాల్ పాత పాఠశాలలో వదిలివేయాలి. కొత్త పాఠశాల HM/ ప్రిన్సిపాల్ PEN నంబర్ లేదా ఆధార్ / పుట్టిన సంవత్సరం కలయికను నమోదు చేయడం ద్వారా డ్రాప్‌బాక్స్ నుండి విద్యార్థిని ఎంపిక చేస్తారు. విజయవంతంగా పూర్తయిన తర్వాత మునుపటి పాఠశాల నమోదు చేసిన విద్యార్థి యొక్క మొత్తం డేటా కొత్త పాఠశాల లాగిన్‌లో స్వయంచాలకంగా పూరించబడుతుంది. HM/ప్రిన్సిపాల్ దానిని ధృవీకరించాలి . విద్యార్థుల బదిలీకి అదనపు పత్రాలు అవసరం లేదు.

CBN Cabinet: బాబు క్యాబినెట్‌లో లోపించిన ‘పెద్దరికం’.. పాతవాసనలు ఎందుకు వద్దనుకున్నట్టు?

తెలుగు దేశం పార్టీలో పెద్దరికం సినిమాకు సీక్వెల్ నడుస్తోంది. అధినేత ఓకే చేసిన 24 క్యాబినెట్ కుర్చీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా పెద్దోళ్లకు దక్కలేదెందుకు? సీనియర్లందరికీ మొండిచెయ్యి చూపడమేంటి? నిన్నమొన్న వచ్చిన జూనియర్లు జాక్‌పాట్ కొట్టడమేల? అధిష్టానం ఆలోచనా తీరు సడన్‌గా ఎందుకిలా మారింది..?

తెలుగు దేశం పార్టీలో పెద్దరికం సినిమాకు సీక్వెల్ నడుస్తోంది. అధినేత ఓకే చేసిన 24 క్యాబినెట్ కుర్చీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా పెద్దోళ్లకు దక్కలేదెందుకు? సీనియర్లందరికీ మొండిచెయ్యి చూపడమేంటి? నిన్నమొన్న వచ్చిన జూనియర్లు జాక్‌పాట్ కొట్టడమేల? అధిష్టానం ఆలోచనా తీరు సడన్‌గా ఎందుకిలా మారింది..? అంటూ టీడీపీ లోపలా వెలుపలా ఆసక్తికరమైన చర్చ. అటు.. సీనియర్ల విషయంలో చంద్రబాబు అమలు చేసిన సింగిల్ పాయింట్ ఫార్ములాపై కూడా హాట్‌హాట్‌గా మాటలు నడుస్తున్నాయి. ఏమిటా ఫార్ములా? కొత్త తరం కోసం కొత్త నాయకత్వం ఇదేనా బాబు అమలు చేసిన వ్యూహం?

గంటా శ్రీనివాసరావు, కళావెంకట్రావు, అయ్యన్నపాత్రుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జ్యోతుల నెహ్రూ, అశోక్ గజపతిరాజు, యనమల రామక్రిష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, బండారు సత్యనారాయణ మూర్తి.. ఇదంతా టీడీపీలో పెద్ద తలకాయల జాబితా. వీళ్లంతా తెలుగుదేశం పార్టీకి లోకల్‌ బ్రాండ్ అంబాసిడర్లు. వాళ్లవాళ్ల ప్రాంతాల్లో టీడీపీని భుజం మీద మోసి, జనంలోకి తీసుకెళ్లినవాళ్లు. పార్టీ ఆవిర్భావం నుంచి దాదాపు ముప్పై-నలభై ఏళ్లుగా మనం చూస్తూ వస్తున్న సూపర్‌సీనియర్లు. తెలుగుదేశం రంగు-రుచి- వాసన బాగా వంటబట్టించుకుని పార్టీ పనుల్లోనే మునిగిపోయి, నానిపోయి.. పార్టీయే ప్రాణంగా బతికిన ఆ డజనుమంది పెద్దోళ్ల ఆచూకీ.. చంద్రబాబు తాజా క్యాబినెట్‌లో గల్లంతైంది. కారణం ఏమిటి చెప్మా?

ఏపీలో కొత్తగా కొలువుదీరిన 24 మంది మంత్రుల్లో 20 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు. వీళ్లలో 17 మంది కొత్తవాళ్లు.. 8 మందయితే పూర్తిగా ఫ్రెష్షర్స్. గతంలో అసెంబ్లీ మొహమే చూడని ఫస్ట్‌ టైమ్ ఎమ్మెల్యేలు. కానీ.. చంద్రబాబు బెటాలియన్‌లో చోటు దక్కించుకున్నారు. గెలిచొచ్చిన సీనియర్ మోస్ట్‌ లీడర్ల పేర్లయితే క్యాబినెట్ లిస్టులో గల్లంతయ్యాయి. ప్రత్తిపాటి పుల్లారావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, పరిటాల సునీత లాంటి వాళ్లను మినహాయిస్తే.. వీళ్లకంటే గొప్పగొప్ప సీనియారిటీలున్న లీడర్లందరూ ఇప్పుడు మంత్రివర్గానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి. అధినేత నిర్ణయమే శిరోధార్యం అనుకుని గప్‌చుప్‌గా ఉండిపోయారు సీనియర్లు. కానీ.. క్యాబినెట్ కూర్పులో చంద్రబాబు చేసిన ఈ ప్రయోగం.. సాహసోపేతమైనదన్న మాటైతే వినిపిస్తోంది.

ముఖ్యంగా విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి, కడప.. ఈ నాలుగు జిల్లాల్లో జూనియర్లకే మంత్రి పదవులివ్వడాన్ని పార్టీ అధిష్టానం గట్టిగా సమర్థించుకుంటోంది. ఇక్కడ సీనియర్-జూనియర్ ఇష్యూను టాకిల్ చేయడం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరించింది తెలుగుదేశం అధిష్టానం. ఆయా జిల్లాల్లో సీనియర్ ఫ్యామిలీల మధ్య ఉండే విభేదాల్ని సర్దుబాటు చెయ్యాలంటే.. అందరినీ క్యాబినెట్‌కి దూరంగా పెట్టడమొక్కటే మార్గం. ఒకరికిస్తే మరొకరు నొచ్చుకుంటారు కనుక… కొత్తవాళ్లకు ఛాన్స్ ఇవ్వడం ద్వారా పాతవాళ్లందరి నోళ్లూ మూయించవచ్చని హైకమాండ్ భావించిందా?

ఉమ్మడి విశాఖ జిల్లాలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచిన గంటా శ్రీనివాసరావుకు ఓటమెరుగని ధీరుడిగా పేరుంది. అటు.. పార్టీకి వీరవిధేయుడు అయ్యన్నపాత్రుడు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేసి జైలుక్కూడా వెళ్లారు. గంటా శ్రీనివాసరావు కొన్నాళ్లు పార్టీకి దూరంగా ఉన్నారు. పైగా.. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో పార్టీ ఆమోదం లేకుండానే రాజీనామా చేశారు. మొదట్లో విశాఖ జిల్లా నుంచి అయ్యన్నకు క్యాబినెట్‌లో చోటిద్దామని పార్టీ భావించినప్పటికీ.. ఆఖర్లో వెనక్కు తగ్గింది. ఆయనకిస్తే గంటా కినుక వహిస్తారనేది ఒక కారణం. ఎందుకంటే.. జిల్లాల్లో గంటా-అయ్యన్న మధ్య నడిచే ఆధిపత్యపోరు లోకల్‌గా అందరికీ తెలుసు. మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ కూడా విశాఖ టీడీపీలో మరో సీనియర్ నేత. ఆయన అల్లుడు రామ్మోహన్‌కు కేంద్ర క్యాబినెట్‌లో అవకాశం రావడంతో.. రాష్ట్ర క్యాబినెట్‌లో తనకు ఛాన్స్ ఇవ్వాలని పట్టుబట్టే అవకాశం లేదు. ఇలా సీనియర్లందరికీ తలోరకంగా చెక్ పెడుతూ.. చివరాఖరికి.. పాయకరావు పేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు అవకాశమిచ్చారు. తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలిగా, పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా సీనియర్ల కంటే యాక్టివ్‌గా ఉన్న అనితను క్యాబినెట్‌లోకి తీసుకుని.. ఫ్యూచరిస్టిక్ పాలిటిక్స్‌కి తెరతీశారు చంద్రబాబు. ఎస్సీగా, మహిళగా అనితకు ఛాన్స్ ఇచ్చి.. విశాఖ జిల్లా రాజకీయాల్ని కీలక మలుపు తిప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు.

మరో ఉత్తరాంధ్ర జిల్లా విజయనగరంలో సైతం దాదాపుగా ఇదే ఫార్ములానా వర్కవుట్ చేసింది టీడీపీ హైకమాండ్. పార్టీ ఆవిర్భావం నుంచి లెగసీని కొనసాగిస్తూ వస్తున్న అశోక్‌గజపతిరాజు, కళావెంకట్రావు కుటుంబాలకు ఈసారి క్యాబినెట్‌లో ప్లేస్ లేకుండా పోయింది. అశోక్‌గజపతి రాజు కుమార్తె పూసపాటి అదితి విజయలక్ష్మి విజయనగరం ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణను ఓడించి చీపురుపల్లిలో ఘన విజయం సాధించారు కళావెంకట్రావు. నాలుగుసార్లు మంత్రిగా, రాజ్యసభ మెంబర్‌గా, గతంలో టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా పనిచేసిన కళావెంకట్రావు సీనియారిటీ ఈసారి క్యాబినెట్ కూర్పుపై ప్రభావం చూపలేకపోయింది. గజపతి, కళా వెంకట్రావు ఫ్యామిలీల్లో ఏ ఒక్కరికిచ్చినా మిగతా వారు నొచ్చుకుంటారు. అందుకే.. గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్‌ను మంత్రివర్గంలోకి తీసుకుని జిల్లాలో నవయువ కెరటంగా పరిచయం చేసుకుంటోంది టీడీపీ. యూఎస్‌లో చదివి మాస్టర్స్ డిగ్రీ తీసుకున్న కొండపల్లి.. బొబ్బిలి ఎంపీగా మూడుసార్లు గెలిచిన పైడితల్లినాయుడుకి మనవడు. మంత్రి బొత్స సోదరుడు అప్పల నర్సయ్యను ఓడించిన కొండపల్లి శ్రీనివాస్‌కి బెర్త్ కట్టబెట్టి.. విజయనగరం జిల్లా టీడీపీ బ్రాండ్‌కి కొత్త కలర్ ఇచ్చేశారు చంద్రబాబు.

ఇక.. తూర్పుగోదావరి జిల్లా.. దశాబ్దాల తరబడి ఈ జిల్లాను తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలబెట్టిన సీనియర్లు అరడజను మంది దాకా ఉన్నారు. యనమల, చినరాజప్ప, బుచ్చయ్య, జ్యోతుల నెహ్రూ.. వీళ్లందరూ జిల్లాలో పార్టీకి వెన్నెముకలు. సీనియారిటీ విషయంలో ఎవ్వరికి ఎవ్వరూ తగ్గరు. ఒకరిని డామినేట్ చేయాలని మరొకరు చూస్తారు. ముఖ్యంగా యనమల వారసురాలిగా తుని ఎమ్మెల్యే దివ్యకు మహిళా కోటాలో ఛాన్స్ రావచ్చని అందరూ భావించారు. అది కార్యరూపం దాల్చలేదు. వియ్యంకుడికి, అల్లుడికి టిక్కెట్లిప్పించుకున్న యనమల.. క్యాబినెట్లో మాత్రం తన మార్క్ చూపించుకోలేకపోయారు. సీనియర్లలో ఏ ఒక్కరికి అవకాశమిచ్చినా మిగతా వాళ్లు అలకపాన్పు నెక్కుతారు కనుక.. చంద్రబాబు మరోవైపు చూశారు. రామచంద్రాపురం ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచిన వాసంశెట్టి సుభాష్‌ని క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. వైసీపీ యువజన విభాగంలో పనిచేసిన సుభాష్.. మూడు నెలల కిందటే టీడీపీలో చేరారు. శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. గోదావరి జిల్లాల్లో బలంగా ఉన్న శెట్టిబలిజ వర్గాన్ని తమ వైపు మళ్లించుకోవడానికే సుభాష్‌ని ప్రయోగించినట్టు తెలుస్తోంది. ఈవిధంగా ఒక్క షాట్‌తో ఐదారు బిగ్ ఫ్యామిలీల్ని దారికి తెచ్చుకుంది టీడీపీ అధిష్టానం.

రాయలసీమలోని జగన్ సొంత జిల్లా కడపలోనూ టీడీపీ ఇదే పంథాను ఫాలో అయ్యింది. వరదరాజులురెడ్డి, బీజేపీలో ఉన్న ఆదినారాయణరెడ్డి, కడప గడ్డపై భార్య మాధవిరెడ్డిని గెలిపించుకున్న రెడ్డప్పగారి శ్రీనివాసులురెడ్డి.. వీళ్లంతా కడప జిల్లా నుంచి క్యాబినెట్‌ బెర్త్ కోసం ఆశించారు. సీనియర్ల మధ్య ఇంత పోటీ ఉంది గనుకే.. జూనియర్ వైపు మొగ్గు చూపారు చంద్రబాబు. రాయచోటి నుంచి గెలిచిన 43 ఏళ్ల యువకుడు.. డెంటల్ డాక్టర్ మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డిని పిక్ చేసుకుంది టీడీపీ హైకమాండ్. పేరుకు జూనియరే ఐనా గడికోట శ్రీకాంత్‌రెడ్డి లాంటి సీనియర్ వైసీపీ లీడర్‌ని ఓడించిన జెయింట్ కిల్లర్‌గా.. క్యాబినెట్ కుర్చీని దక్కించుకున్నారు రాంప్రసాద్‌రెడ్డి. ఆవిధంగా కడప జిల్లాలో మిగతా సీనియర్లను కూల్‌డౌన్ చేసింది టీడీపీ.

ఇదీ… సీనియర్‌-జూనియర్ ఇష్యూను చంద్రబాబు ట్యాకిల్ చేసిన తీరు.. 4 జిల్లాల్లో ఆయన పాటించిన సింగిల్ పాయింట్ ఫార్ములా. చిన్నవాళ్లకు పెద్దపీటలు వేశాం.. అలాగని పెద్దవాళ్లను చిన్నచూపు చూడలేదు.. అని ఆయా నేతలకు పరోక్షంగా సంకేతాలిచ్చింది హైకమాండ్. పెద్దోళ్ల సేవల్ని పార్టీలో ఎలా వినియోగించుకోవాలన్న విషయంలో చంద్రబాబుకు క్లారిటీ ఉందట. రేపటిరోజున నామినేటెడ్ పదవులు గానీ, ఎమ్మెల్సీ పోస్టులు గానీ, రాజ్యసభకు అవకాశాలు గానీ.. సీనియర్ల కోసం వెయిటింగ్‌లో ఉన్నాయట. వీటన్నింటికీ మించి గవర్నర్‌ పదవులు కూడా సిద్ధమౌతున్నాయి. ఎందుకంటే.. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీకి.. బీజేపీ మరో బంపరాఫర్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. టీడీపీ కోసం ఒకటో రెండో గవర్నర్ పదవుల్ని రిజర్వు చేసిందట. సీనియర్ నేతలు అశోక్‌గజపతిరాజు, యనమల రామక్రిష్ణుడుతో పాటు మరికొందరి పేర్లు పరిశీలనలో ఉన్నాయట. అందుకే. సీనియర్లూ.. ప్లీజ్ కీప్ క్వయిట్.. వేచి ఉండండి… మీకోసం కూడా ఉందిలే మంచికాలం ముందుముందునా.. అంటూ సానుకూల సంకేతాలిచ్చారు చంద్రబాబు.

Kurnool MP: ఎంపీటీసీ పదవికి రాజీనామా చేసిన కర్నూలు ఎంపీ నాగరాజు

కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు.. ఎంపీటీసీ పదవికి రాజీనామా చేశారు.

కర్నూలు: కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు.. ఎంపీటీసీ పదవికి రాజీనామా చేశారు. గురువారం తన రాజీనామా పత్రాన్ని జిల్లా పరిషత్ సీఈవో నర్సారెడ్డికి అందజేశారు. నాగరాజు 2021లో కర్నూలు మండలం పంచలింగాల గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీటీసీగా గెలుపొందారు.
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తెదేపా తరఫున ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. సమీప ప్రత్యర్థి వైకాపా అభ్యర్థి రామయ్యపై 1,11,298 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం ఎంపీ కావడంతో ఎంపీటీసీ పదవికి నాగరాజు రాజీనామా చేశారు.

Andhra Pradesh: గుడ్‌న్యూస్‌ చెప్పిన ఏపీ సర్కార్.. అప్పటి నుంచే పెంచిన పెన్షన్‌ అమలు..

Andhra Pradesh: పెన్షన్‌దారులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఈ రోజు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు.. తొలిరోజు ఐదు ఫైన్లపై సంతకాలు చేశారు..

ఇక, ఆ తర్వాత సచివాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి నిమ్మల రామానాయుడు.. గత ప్రభుత్వాన్ని ఎండగడుతూనే.. తన ప్రభుత్వం అమలు చేయనున్న పథకాలను వెల్లడించారు.. ఈ సందర్భంగా పెన్షన్‌ దారులకు శుభవార్త చెప్పారు.. గడచిన ఏప్రిల్ నెల నుంచి పెంచిన పెన్షన్ అమలు చేస్తామన్న ఆయన.. జులై ఒకటో తేదీన వృద్ధులకు గత 3 నెలల పెంచిన పెన్షన్‌తో కలిపి మొత్తంగా రూ. 7 వేలు ఇస్తాం అన్నారు.. భద్రత, భరోసా ఇచ్చేలా ఐదు ఫైళ్లపై సీఎం చంద్రబాబు సంతకాలు చేశారు.. చెప్పిన విధంగా హామీలను నిలబెట్టుకుంటూ సీఎం నిర్ణయాలు తీసుకున్నారని ప్రశంసలు కురిపించారు.

గత ఐదేళ్లల్లో జగన్ యువతను గంజాయికి బానిసల్లా చేశారని ఆరోపించిన మంత్రి నిమ్మల… యువతకు, నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మెగా డీఎస్సీపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు. ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు చేసే ఫైల్‌పై రెండో సంతకం చేశారు. మూడో సంతకం పెన్షన్ల మొత్తాన్ని పెంచే ఫైల్ పై పెట్టారు. నాలుగో సంతకం అన్నా క్యాంటీన్ల ఫైలుపై పెట్టారు. స్కిల్ సెన్సస్ ఫైలు మీద ఐదో సంతకం చేశారని వెల్లడించారు. అయితే, ల్యాండ్, శాండ్, వైన్, మైన్ దోపిడీకి గతంలో వైఎస్‌ జగన్‌ తెర లేపారు. భూములను దోచుకోవడానికి ల్యాండ్ టైటలింగ్ యాక్టును తెచ్చారు.. అందుకే రద్దు చేశామన్నారు. డాక్యుమెంట్ల మీద.. సర్వే రాళ్ల పైనా జగన్ ఫొటోనే.? అని ప్రశ్నించారు. ప్రైవేటు ఆస్తులను సైతం తన గుప్పెట్లో పెట్టుకోవడం కోసం ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ గత ప్రభుత్వం తెచ్చిందని విమర్శించారు.. ఇచ్చిన హామీ మేరకు ఆ యాక్టును రద్దు చేస్తూ ఫైలుపై సీఎం సంతకం చేశారని తెలిపారు. ఇక, గడచిన ఏప్రిల్ నెల నుంచి పెంచిన పెన్షన్ అమలు చేస్తాం.. జులై ఒకటో తేదీన వృద్ధులకు గత మూడు నెలల పెంచిన పెన్షనుతో కలిపి మొత్తంగా రూ. 7 వేలు ఇస్తాం అని వివరించారు..

మరోవైపు.. మానవత్వం లేని సీఎంగా జగన్ వ్యవహరించారని మండిపడ్డారు నిమ్మల.. అన్నా క్యాంటీన్లను రద్దు చేసి మాజీ సీఎం జగన్ శాడిస్టిక్ గా వ్యవహరించారు.. కానీ, మానత్వంతో సీఎం చంద్రబాబు మళ్లీ ప్రారంభించేందుకు సంతకం చేశారని తెలిపారు. ఇక, యువతకు ఉపాధి కల్పించే ప్రక్రియలో భాగంగా స్కిల్ సెన్సస్ ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం చేశారని వివరించారు. పెన్షన్లను ఇంటింటికి అందిస్తాం. గ్రామ వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం అన్నారు.. కొందరు రాజీనామా చేశారు. వలంటీర్ల వ్యవస్థపై త్వరలో సమీక్ష జరుపుతాం.. సచివాలయ వ్యవస్థ వల్ల స్థానిక సంస్థల నిర్వీర్యం కానివ్వం. సచివాలయ వ్యవస్థను స్థానిక సంస్థలతో అనుసంధానిస్తాం అన్నారు. ఇక, శాఖల వారీగా శ్వేత పత్రాలు ఇస్తాం అని ప్రకటించారు మంత్రి నిమ్మల రామానాయుడు.

ఇక, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ.. ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ఐదు సంతకాలు పెట్టారు. జగన్ చెప్పినట్టు ఉద్యోగాల కల్పన చేయలేకపోయారు. జగన్ ఐదేళ్లపాటు విడతల ముఖ్యమంత్రిగా పని చేశారు. అన్నా క్యాంటీన్ల మూసేయడం లేదంటూ నాటి మంత్రి బొత్స సభను పక్క దోవ పట్టించారని మండిపడ్డారు బాల వీరాంజనేయ స్వామి.. మరోవైపు.. మంత్రి సవితమ్మ మాట్లాడుతూ.. ఏపీని చంద్రబాబు స్వర్ణాంధ్రగా మారుస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. యువతను నిర్వీర్యం చేసేలా గత ఐదేళ్ల పాలన నడిచింది. జగన్ పాలనలో సామాన్య రైతుల నుంచి ల్యాండ్ లార్డ్స్ కూడా భయపడేలా ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ తెచ్చారు. పాలన చేతకాని జగన్.. అన్నా క్యాంటీన్లను కూడా మూసేశారని మండిపడ్డారు మంత్రి సవితమ్మ.

Cloves For Weight Loss: లవంగం ఇలా తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు.. అది ఎలానో తెలుసా?

Cloves For Weight Loss: లవంగం మనం వంటలో నిత్యం వేసుకొని తీసుకుంటాం. లవంగంతో టీతో కూడా తీసుకువచ్చి ఇందులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం లవంగంలో మెటబాలిజం రేటును పెంచి బరువు తగ్గించే గుణాలు ఉన్నాయి.

లవంగంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా మ్యాంగనీస్, విటమిన్ కే, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో మెడిసినల్ గుణాలు ఉండటం వల్ల జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. ముఖ్యంగా ఇది మంటను తగ్గిస్తుంది. బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడుతుంది. పంటి ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే యుగెనెల్ యాంటీ ఆక్సిడెంట్ లాగా పని చేస్తుంది.

లవంగం నీరు..
లవంగం రాత్రంతా నానబెట్టిన నీటిని తీసుకోవడం వల్ల కూడా మంచి హైడ్రేషన్ అంతం తో పాటు మెటాబాలిజం రేటు ఉంది బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.

లవంగం టీ..
లవంగాలను వేడి నీటిలో సిమ్‌లో పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించి వాటిని వడకట్టుకొని తీసుకోవటం వల్ల కూడా ఇది జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియను పెంచి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ఇదీ చదవండి:
బీన్స్‌ తింటే ఆ మందులు వాడాల్సిన అవసరంలేదు.. మీకు తెలియని ప్రయోజనాలు కూడా పుష్కలం..

స్పైస్..
మీరు చేసుకున్న వంటల్లో కాస్త ఈ లవంగం పొడి వేసుకున్న మంచి ఫ్లేవర్ రావడంతో పాటు రుచిగా కూడా ఉంటుంది. ఇది కర్రీలో కూడా వేసుకుని తీసుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి.

స్మూథీస్..
లవంగం మీరు తీసుకునే స్మూథీస్ లో కూడా వేసుకోవచ్చు. ఇది పంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. మెటబాలిజం బూస్టింగ్ ఇచ్చే గుణాలు ఉంటాయి. మంచి జీర్ణక్రియకు సహాయపడుతుంది. లవంగం తీసుకోవడం వల్ల కడుపు ఎక్కువసేపు నిండిన అనుభూతిని కలిగి ఉంటుంది.

బేక్..
అంతేకాదు మీరు ఏమైనా బేక్‌ చేసిన ఫుడ్స్ తీసుకున్నా లవంగాన్ని తీసుకోవచ్చు. ముఖ్యంగా ఇవి మాఫిన్స్, కేక్స్, కుకీస్ లో కూడా లవంగం పొడిని వేసుకొని నేరుగా ఆస్వాదించవచ్చు. దీంతో బరువు సులభంగా తగ్గుతారు.

ఇదీ చదవండి:
ప్రతిరోజు నానబెట్టిన ఒక్క వాల్‌నట్‌ తిన్నా 10 ప్రయోజనాలు తెలుసా?

లవంగం ఆయిల్..
ఇప్పటివరకు మనం లవంగంతో పంటి నొప్పిని మాత్రమే తగ్గుతుంది అనుకుంటాం. కానీ లవంగం ఆయిల్ తో కాస్త ఆలివ్ ఆయిల్ గోరువెచ్చగా చేసుకొని మీ వంటలో వినియోగిస్తే రుచి అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా సలాడ్స్ తీసుకుంటే బరువు నిర్వహిస్తుంది.

లవంగం చాయ్..
లవంగం ఉపయోగించి టీ కూడా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా లవంగం దాల్చిన చెక్క, యాలకులు, అల్లం వేసి లవంగం టీ ని తయారు చేసుకోవాలి. ఇది జీర్ణ క్రియను మెరుగు చేస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడి పేగు ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

Pradeep Vijayan: బ్రేకింగ్.. నటుడు ప్రదీప్ విజయన్ మృతి

Pradeep Vijayan: కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. నటుడు ప్రదీప్ విజయన్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. తమిళ్ సినిమాల్లో కమెడియన్ గా, విలన్ గా నటించి మెప్పించిన ఆయన జూన్ 13 న పాలవాక్కంలోని తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

35 ఏళ్ల ప్రదీప్ కు ఇంకా పెళ్లి కాలేదు. సింగిల్ గా ఒక రూమ్ లో ఉంటున్నాడు.

తేగిడి, మేయాద మాన్, టెడ్డీ, ఇరుంబు తిరైమరియు రుద్రన్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇరుంబు తిరై తెలుగులో అభిమన్యుడు పేరుతో రిలీజ్ అయ్యింది. విశాల్, సమంత నటించిన ఈ సినిమాలో ప్రదీప్ విజయన్ విలన్ గా కనిపించాడు. అర్జున్ కు డబ్బు అందజేసే ఒక బ్యాంక్ మేనేజర్ పాత్రలో అతను కనిపించాడు. ఈ సినిమా తరువాత ప్రదీప్ కు మంచి పాత్రలే దక్కాయి.

ఒంటరిగా ఉంటున్న ప్రదీప్ కు అతని స్నేహితుడు బుధవారం ఉదయం 9.30 గంటలకు అతనికి కాల్ చేయడానికి ప్రయత్నించగా అటునుంచి స్పందన లేదు. ఆ తరువాత, అతని స్నేహితులు కొందరు పదేపదే కాల్ చేసినప్పటికీ కాల్స్ సమాధానం ఇవ్వలేదు. దీంతో ఒకరికి అనుమానం వచ్చి రూమ్ దగ్గరకు వెళ్లి తలుపు కొత్తగా.. అది ఎంతకు తెరుచుకోలేదు. వెంటనే అతను నీలాంగరై పోలీసులను అప్రమత్తం చేయడంతో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ సంఘటనా స్థలానికి చేరుకొని డోర్ బద్దలుకొట్టి లోపలి వెళ్లగా అప్పటికే ప్రదీప్ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.

ప్రదీప్ కొన్నిరోజులుగా కళ్ళు తిరుగుతున్నాయని, శ్వాస అందడం లేదని స్నేహితులతో చెప్పినట్లు వారు తెలిపారు. గుండెపోటు వలన ప్రదీప్ మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా తలకు, చేతులకు గాయాలు ఉండడంతో బాత్ రూమ్ లో పడడం వలన తగిలి ఉంటాయని చెప్పుకొస్తున్నారు. పోలీసులు అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం రాయపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నీలంకరై పోలీసులు.. ప్రదీప్ ది అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారని, ప్రాథమిక విచారణలో ప్రమాదవశాత్తు కిందపడిపోయిన కేసుగా తేలిందని తెలిపారు. ఇక ప్రదీప్ మరణ వార్త విన్న పలువురు ప్రముఖులు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు.

Big Breaking: మరోసారి జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్‌ దోవల్

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. అయితే జాతీయ భద్రతా సలహాదారు (NSA)గా అజిత్‌ దోవల్‌ను మరోసారి నియమించారు. గతంలో రెండుసార్లు జాతీయ భద్రతా సలహాదారుగా చేసిన ఆయన..

మూడోసారి కూడా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెల 10 నుంచి ఆయన నియామకం అమల్లోకి రానున్నట్లు క్యాబినేట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ వెల్లడించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే డా.పీకే మిశ్రా ప్రధాని మోదీకి ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగనున్నారు. మరోవైపు ప్రధాని మోదీకి సలహాదారులుగా అమిత్ ఖేర్‌, తరుణ్ కపూర్‌లను నియమించారు. రెండేళ్ల కాలపరిమిత కోసం ఈ ఇద్దరిని నియమించారు.

అజిత్‌ దోవల్ కేరళ కేడర్‌కు చెందిన రిటైర్డ్‌ ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి. అలాగే మాజీ ఇండియన్ ఇంటెలిజెన్స్ అండ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి. 1945లో ఉత్తరాఖండ్‌లో జన్మించిన ఆయన భారత్‌లో అత్యంత పిన్న వయస్కుడైన పోలీస్ అధికారిగా కీర్తి చక్ర మెరిటోరియస్ సర్వీస్, సైనిక సిబ్బందికి గాలంటరీ అవార్డును అందుకున్నారు. 2016లో సర్జికల్ స్ట్రైక్, 2019లో బాలాకోట్ వైమానిక దాడులు అజిత్ దోవల్ పర్యవేక్షణలోనే జరిగాయి. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాటును పరిష్కరించేందుకు కూడా చర్యలు తీసుకున్నారు.

అజిత్ దోవల్ విషయానికి వస్తే.. ఆయన ఏడేళ్లపాటు పాకిస్థాన్‌లో రహస్య కార్యకర్తగా పనిచేసినట్లు టాక్ ఉంది. అలాగే పలు మిలిటెంట్ గ్రూపులపై నిఘా సేకరిస్తున్నట్లు సమాచారం. సీక్రెట్ ఏజెంట్‌గా ఒక ఏడాది పనిచేసిన ఆయన.. ఆ తర్వాత ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌లో ఆరేళ్లపాటు పనిచేశారు. అంతేకాదు 1984లో ఖలిస్తానీ ఖలిస్థానీ మిలిటెన్సీని ఉక్కిరిబిక్కిరి చేయడానికి ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ కోసం నిఘాను సేకరించడంలో దోవల్ కీలక పాత్ర పోషించారు. అజిత్ దోవల్ తన కెరీర్‌లో ఎక్కువ భాగం ఇంటెలిజెన్స్ బ్యూరో (IB)లో యాక్టివ్ ఫీల్డ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా గడిపారు. 2009లో పదవీ విరమణ చేసిన తర్వాత, దోవల్ వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వ్యవస్థాపక డైరెక్టర్ అయ్యారు. ఆ తర్వాత 2014, 2019లో మోదీ హయాంలో రెండుసార్లు జాతీయ భద్రత సలహాదారుడిగా నియమించబడి సేవలు అందించారు. ఇప్పుడు మూడోసారి కూడా ఆయనకే ఈ కీలక బాధ్యతలు అప్పగించారు.

Yediyurappa: బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యడియూరప్పపై అరెస్ట్‌ వారెంట్‌

బెంగళూరు: కర్ణాటక (Karnataka) మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్‌ నేత బీఎస్‌ యడియూరప్ప (BS Yediyurappa).. ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనపై పోక్సో కేసు కూడా నమోదైంది. తాజాగా బెంగళూరు కోర్టు గురువారం ఆయనపై నాన్‌-బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ (Arrest Warrant) జారీ చేసింది. త్వరలోనే ఆయనను అరెస్టు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.

ఈ కేసు (POCSO case)లో అవసరమైతే యడియూరప్పను అరెస్టు చేస్తామని ఈ ఉదయం రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కేసు విచారణ నిమిత్తం సీఐడీ అధికారులు సమన్లు జారీ చేశారు. అయితే, ప్రస్తుతం ఆయన దిల్లీలో ఉన్నందున జూన్‌ 17న సీఐడీ ముందు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

17 ఏళ్ల బాలికపై యడియూరప్ప (EX CM Yediyurappa) లైంగిక దాడికి పాల్పడినట్లు లోక్‌సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. మోసం కేసులో సాయం చేయాలంటూ బాధితురాలు, ఆమె తల్లి ఫిబ్రవరి 2న యడియూరప్పను కలిశారు. ఆ సమయంలో తన కుమార్తెను భాజపా నేత బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పోక్సో కేసు నమోదైంది.

ఈ కేసుపై సీఐడీ దర్యాప్తు చేపట్టింది. ఆరోపణలు చేసిన బాధితురాలి తల్లి ఇటీవల ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో ప్రాణాలు కోల్పోయారు. అయితే, అంతకంటే ముందే బాధితురాలు, ఆమె తల్లి వాంగ్మూలాలను సీఐడీ రికార్డ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసిన తర్వాత యడియూరప్ప వాయిస్‌ శాంపిళ్లను కూడా అధికారులు సేకరించారు. కాగా.. ఈ ఆరోపణలను మాజీ సీఎం ఖండించారు. తనపై కేసు కొట్టేయాలని కోర్టును ఆశ్రయించారు.

ys jagan: ‘ఐదేళ్లు కళ్లు మూసుకున్నాం.. మరో ఐదేళ్లు కళ్లు మూసుకోండి’ జగన్‌ కామెంట్స్‌ వైరల్‌

ys jagan: ‘ఐదేళ్లు కళ్లు మూసుకున్నాం.. మరో ఐదేళ్లు కళ్లు మూసుకోండి’ జగన్‌ కామెంట్స్‌ వైరల్‌

అమరావతి: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్‌ జగన్‌ (YS Jagan) మాట్లాడుతున్న తీరు చూసి, అందరూ నవ్వుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా అయితే, మామూలుగా ట్రోలింగ్ చేయడం లేదు. తాజాగా వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీలతో తన క్యాంపు కార్యాలయంలో జగన్‌ సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు విని అక్కడున్నవారే ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.

ఈ సమావేశంలో జగన్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాం. ఈ ఎన్నికల్లో ఏమైందో తెలియదు. కళ్లు మూసుకుంటే ఐదేళ్లు అయిపోయాయి. మళ్లీ 2024 నుంచి 2029 వరకు కళ్లు మూసుకుంటే ఎన్నికలు వచ్చేస్తాయి. మనం గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే.. సినిమాలో ఫస్ట్‌ ఆఫ్‌ మాత్రమే అయింది’’ అని జగన్‌ అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

‘అలా కళ్లు మూసుకుని ఐదేళ్లు గడపబట్టే, పాలన లేక ఆంధ్రప్రదేశ్‌ మటాష్‌ అయిపోయింది’, ‘కళ్లు మూసుకుంటేనే మీకు 11 సీట్లు వచ్చాయి’, ‘ఐప్యాక్‌ స్క్రిప్ట్‌ లేకపోతే మాటలు ఇలాగే ఉంటాయి’, ‘2049 వరకూ కళ్లు మూసుకుని ఉండాలి’, ‘అన్నా నువ్వు నిజంగానే సీఎంగా చేశావా’, ‘2060 వరకూ కళ్లు తెరవద్దు అన్నా’, ‘మేమూ అదే చెప్పాం సర్‌.. మీరు ఇక కళ్లు మూసుకుని ప్రశాంతంగా పడుకోండి’, ‘కళ్లు మూసుకోవడం కాదన్నా, ఎందుకు ఓడిపోయామో కళ్లు తెరిచి బూతులు మాట్లాడకుండా పోరాటం చేయండి’, ‘పవర్‌.. పవర్‌.. పవర్‌.. వచ్చే ఎన్నికల గురించి ఇప్పుడే మాట్లాడుతున్నావా జగనన్నా. అవి వచ్చేలోపు ప్రజలకు ఏం చేయాలో దాని గురించి ఆలోచించవచ్చు కదా’ అంటూ కామెంట్లు, మీమ్స్‌తో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

నీ లేఖ నా మనసును హత్తుకుంది: నారా రోహిత్‌ లేఖకు చంద్రబాబు రిప్లై

నీ లేఖ నా మనసును హత్తుకుంది: నారా రోహిత్‌ లేఖకు చంద్రబాబు రిప్లై

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ తన కుటుంబ సభ్యుడు, సినీ నటుడు నారా రోహిత్‌ రాసిన లేఖపై ఆయన స్పందించారు. ‘‘ప్రియమైన నారా రోహిత్‌, నీ లేఖ నా మనసును హత్తుకుంది. మన కుటుంబ సభ్యుల అండ, ఆశీస్సులు సదా నా వెంట ఉన్నాయి కాబట్టే, ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా నిలబడగలిగాను. నీకు ఎల్లప్పుడూ నా శుభాశీస్సులు వెన్నంటి ఉంటాయి. – ప్రేమతో, నీ పెదనాన్న’’ అని చంద్రబాబు ‘ఎక్స్‌’ఖాతాలో రిప్లై ఇచ్చారు.

చంద్రబాబుకు శుభాకాంక్షలు చెబుతూ రోహిత్‌ పోస్ట్‌ చేసిన లేఖ ఇదే..
‘పెదనాన్న.. గత నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఎన్నో ఒడుదొడుకులను చూశారు. తట్టుకున్నారు. ఆత్మవిశ్వాసంతో నిలబడ్డారు. కానీ, గత ఐదేళ్ల కాలంలో ఎంతో మథనపడ్డారు. పార్టీని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. మీకు కష్టం వచ్చినప్పుడు వాళ్లు అందరూ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా మీ కోసం నిలబడ్డారు.

అప్పుడు తెలిసింది గత నలభై ఏళ్ల మీ కష్టానికి మీరు పొందింది ప్రజల గుండెల్లో కదిలించలేని స్థానం అని. ఈ ఎన్నికల్లో చరిత్రలో ఎవరూ మళ్లీ తిరగరాద్దాం అనే సాహసం చేయలేని విజయాన్ని అందుకున్నారు. ఆ విజయం ఎన్డీయే కూటమిది మాత్రమే కాదు.. ఆంధ్రా ప్రజలది. తెలుగువారిది. మన అందరిదీ..’’ ఆల్‌ ది వెరీ బెస్ట్‌ అని పేర్కొంటూ రోహిత్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసిన లేఖను చంద్రబాబు రీట్వీట్‌ చేశారు.

Chandrababu: మెగా డీఎస్సీపై చంద్రబాబు తొలి సంతకం.. 16,347 పోస్టులు

Chandrababu: మెగా డీఎస్సీపై చంద్రబాబు తొలి సంతకం.. 16,347 పోస్టులు

వెలగపూడి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) గురువారం బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం 4.41 గంటలకు సచివాలయం మొదటిబ్లాక్‌లోని తన ఛాంబర్‌లో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం హోదాలో సచివాలయానికి వచ్చిన చంద్రబాబుకు వివిధశాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు ఘన స్వాగతం పలికారు.

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు.. 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ దస్త్రంపై సీఎం మొదటి సంతకం చేశారు. (కేటగిరిల వారీగా పోస్టుల వివరాలు: ఎస్‌జీటీ : 6,371; పీఈటీ : 132; స్కూల్‌ అసిస్టెంట్స్‌: 7725; టీజీటీ: 1781; పీజీటీ: 286; ప్రిన్సిపల్స్‌: 52) ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దు ఫైల్‌పై రెండో సంతకం, సామాజిక పింఛన్లు రూ.4వేలకు పెంపు దస్త్రంపై మూడో సంతకం, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగు, నైపుణ్య గణనపై ఐదో సంతకం చేశారు.

కష్టాలు పడి.. కసిగా ఎగసి! క్వారీలపై దాడులు. రూ.300 కోట్ల జరిమానాలు అయునా తొణకని రవికుమార్‌

వైసీపీ వేధింపులు తట్టుకుని నిలబడిన గొట్టిపాటి

ఐదేళ్లలో ఎన్నో ఇబ్బందులు

పార్టీ మారాలని జగన్‌ సర్కారు తీవ్ర ఒత్తిళ్లు

క్వారీలపై దాడులు.. మూసివేతలు

రూ.300 కోట్ల వరకు జరిమానాలు

అయునా తొణకని రవికుమార్‌

క్వారీలు మూయించారు.. వందల కోట్ల జరిమానాలు విధించారు.. పార్టీ మారాలని అనేక రకాలుగా ఒత్తిళ్లు తెచ్చారు.. ఆర్థికంగా నష్టపరిచారు.. అధికార యంత్రాంగాన్ని ప్రయోగించి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని చూశారు.. అనుచరుల ఫ్యాక్టరీల మీదకూ దండెత్తారు.. అయినా అన్నిటినీ భరించి వైసీపీని దీటుగా ఎదుర్కొన్నారు.. ఈ కష్టాలను గుర్తించిన టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు మంత్రి పదవి కట్టబెట్టారు. కొత్తగా కొలువుదీరిన రాష్ట్ర మంత్రివర్గంలో బాపట్ల జిల్లా నుంచి ఈయనతోపాటు రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌కు అమాత్యయోగం వరించింది. వీరిద్దరూ తొలిసారి మంత్రి పదవి చేపట్టడం గమనార్హం.

గొట్టిపాటి 2004లో ప్రకాశం జిల్లా మార్టూరు నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి గెలిచి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మార్టూరు స్థానం రద్దయింది. 2009 ఎన్నికల్లో గొట్టిపాటి అద్దంకి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి హ్యాట్రిక్‌ కొట్టారు. తర్వాతి పరిస్థితుల్లో టీడీపీలో చేరారు. 2019, 2024లో టీడీపీ నుంచి గెలుపొందారు. వరుసగా ఐదు సార్లు గెలుపొంది ఓటమెరుగని నేతగా గుర్తింపు పొందారు.

2019-24 మధ్య గొట్టిపాటే లక్ష్యంగా జగన్‌ సర్కారు పెద్ద ఎత్తున కక్షసాధింపులకు తెరలేపింది. పార్టీ మారాలని పై స్థాయిలో పెద్దఎత్తున ఒత్తిళ్లు వచ్చాయి. వేటికీ లొంగకపోవడంతో ఆయన ఆర్థికమూలాలను దెబ్బకొట్టేందుకు పథక రచన చేసి గనుల అధికారులను ఆయన ఫ్యాక్టరీలపైకి ఉసిగొల్పారు. దాదాపు రూ.300 కోట్ల మేర జరిమానాలను విధించారు. క్వారీలు మూయించారు. కేసులు పెట్టించారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు ఆయన బంధువుల గ్రానైట్‌ క్వారీల్లో తనిఖీల పరంపరకు వైసీపీ తెరలేపింది. అయినా గొట్టిపాటి చలించలేదు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అన్నిటినీ తట్టుకుని నిలబడడం వల్లే తొలిసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకోగలిగారు.

ఈసారి ఎలాగైనా గొట్టిపాటిని ఓడించాలని జగన్మోహన్‌రెడ్డి బాబాయి, టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సిఫారసు మేరకు పల్నాడు జిల్లాకు చెందిన పాణెం హనిమిరెడ్డిని అద్దంకి వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిపారు. వలంటీర్లను రెచ్చగొట్టడం మొదలుకుని జగన్‌ సిద్ధం సభకు సైతం అద్దంకి నియోజకవర్గాన్నే వేదికగా ఎంచుకుని కవ్వింపు చర్యలకు దిగారు. రవికుమార్‌ వాటిని తిప్పికొట్టి ఎమ్మెల్యేగా వరుసగా ఐదోసారి విజయం సాధించడమే కాకుండా మంత్రి పదవి సాధించారు.

కన్నడనాట సంచలనం రేపిన హీరో దర్శన్ అరెస్ట్.. ఎవరీ ప్రవిత్రా గౌడ?

మర్డర్ కేసులో హీరో దర్శన్ తూగుదీప అరెస్ట్ కావడం కన్నడనాట కలకలం రేపింది. తన ప్రియురాలు ప్రవిత్రా గౌడను ఇబ్బందిపెట్టిన రేణుకాస్వామి అనే అభిమానిని హత్య చేయించాడనే ఆరోపణలతో దర్శన్ జైలుపాలయ్యాడు.

భార్యను పట్టించుకోకుండా ప్రియురాలి కోసం ఇంతకు తెగించాడనే వాస్తవాన్ని అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రవిత్రా గౌడ మాయలో పడి ఇంతదాకా తెచ్చుకున్నాడని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మిగతా నిందితులతో పాటు వీరిద్దరూ కూడా ఇప్పుడు బెంగళూరు జైల్లో ఉన్నారు.

ఎవరీ ప్రవిత్రా గౌడ?
పవిత్ర గౌడ కన్నడ నటి. సినిమాలు, టెలివిజన్ తో పాటు మోడల్ గానూ పనిచేశారు. ఆమె చత్రిగలు సార్ చత్రిగలు, అగమ్య, ప్రీతి కితాబు సినిమాల్లో నటించారు. 2016లో వచ్చిన 54321 సినిమాతో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఖుషీ టీవీ షోతో పాపులయ్యారు. నటనకు దూరమయ్యాక ఫ్యాషన్ డిజైనింగ్‌లోకి ప్రవేశించారు. రెడ్ కార్పెట్ స్టూడియో 777 పేరుతో బోటిక్‌ని నిర్వహిస్తున్నారు. జనవరి 24న సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన వీడియో కలకలం రేపింది. దర్శన్ తో తాను కలిసివున్న ఫొటోలతో రూపొందించిన ఈ వీడియోను షేర్ చేసి.. పదేళ్ల మా అనుబంధాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు ప్రకటించడంతో వీరి వ్యవహారం బహిర్గతమైంది.

పవిత్రను రెండో పెళ్లి చేసుకున్న దర్శన్?
జగ్గు దాదా సినిమా సమయంలో దర్శన్ పవిత్ర గౌడకు కలిశారని.. ఆడిషన్‌కి వెళ్లినప్పుడు ఒకరికొకరు పరిచయం అయ్యారని తెలుస్తోంది. అక్కడి నుంచి వీరిద్దరూ దగ్గరయ్యారని, పవిత్రను దర్శన్ రెండో పెళ్లి కూడా చేసుకున్నాడని కూడా వార్తలు వచ్చారు. అయితే పవిత్రకు కూడా అంతకుముందే పెళ్లై కూతురు ఉంది. 18 ఏళ్ల వయసులో సంజయ్ సింగ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తర్వాత వీరిద్దరూ విడిపోయారు. దర్శన్ తో పరిచయం తర్వాత ఆమె జీవితమే మారిపోయింది. అయితే పవిత్ర తన కాపురంలో చిచ్చు పెట్టిందని దర్శన్ భార్య విజయలక్ష్మి పలుమార్లు వాపోయారు.

రేణుకాస్వామిని ఎందుకు చంపారు?
చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన రేణుకాస్వామికి హీరో దర్శన్ అంటే అభిమానం. తాను అభిమానించే హీరో భార్యను పట్టించుకోకుండా ప్రియురాలి మాయలో పడిపోవడం అతడు జీర్ణించుకోలేకపోయాడు. దర్శన్ కాపురంలో చిచ్చు పెట్టిన పవిత్రా గౌడపై కోపం పెంచుకుని ఆమెను బద్నాం చేయాలనుకున్నాడు. సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాడు. పవిత్రను తిడుతూ అసభ్య మెసేజ్ లు, ఫొటోలతో ఆమెను విసిగించాడు. అతడి అకౌంట్ ను బ్లాక్ చేసినా ఆగడాలు ఆగకపోవడంతో ఆమె దర్శన్ కు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.

బెల్టుతో బాది, గొడకేసి కొట్టి..
తన ప్రియురాలిని ఇబ్బంది పెడుతున్న రేణుకాస్వామిని హత్య చేయడానికి ఒక గ్యాంగ్ తో రూ.30 లక్షలకు దర్శన్ డీల్ కుదుర్చుకున్నట్టు బెంగళూరు పోలీసులు వెల్లడించారు. పథకంలో భాగంగా రేణుకాస్వామిని రాత్రి సమయంలో చిత్రదుర్గ దర్శన్ ఫ్యాన్ క్లబ్ కన్వీనర్ రాఘవేంద్ర ఇంటి నుంచి బయటకు తీసుకువచ్చి.. దర్శన్ దగ్గరకు తీసుకుపోయాడు. అప్పటితో కిరాయి మనుషులతో రెడీ ఉన్న దర్శన్.. రేణుకాస్వామిని చూడగానే ఆగ్రహంతో ఊగిపోయాడు. బెల్టుతో బాది, గొడకేసి కొట్టి అతడిని చంపేశారు. తర్వాత శవాన్ని డ్రైనేజీలో పారేశారు. ముందుగా కుదుర్చున్న ఒప్పందం ప్రకారం ముగ్గురు నిందితులు అన్నపూర్ణేశ్వరి నగర పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. డబ్బుల గొడవ కారణంగా రేణుకాస్వామిని తామే హత్యచేసినట్టు పోలీసులతో చెప్పారు. వీరి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించి మొత్తం కూపీ లాగడంతో కుట్ర బయటపడింది. ఈ కేసులో దర్శన్, పవిత్రతో పాటు ఇప్పటివరకు 13 మందిని అరెస్ట్ చేశారు. వీరికి కోర్టు 6 రోజుల పాటు పోలీస్ కస్టడీ విధించింది. దర్శన్, పవిత్ర కార్లను పోలీసులు సీజ్ చేశారు.

రేణుకాస్వామి చంపినట్టుగానే..
రేణుకాస్వామి అంత్యక్రియలు బుధవారం చిత్రదుర్గలో జరిగాయి. రేణుకాస్వామి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. తమ కుమారుడిని పాశవికంగా హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని రేణుకాస్వామి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. తమ కొడుకుని చంపినట్టుగానే హీరో దర్శన్ ను చంపాలంటూ వారు నినదించారు. 3 నెలల గర్భవతిగా ఉన్న రేణుకాస్వామి భార్య సహన శోకసంద్రంలో మునిగిపోయింది. దర్శన్ ను పిచ్చిగా అభిమానించడమే తన భర్త చేసిన పాపమా అంటూ ఆమె రోదించింది. తన భర్తను చంపినట్టుగానే దర్శన్ ను చంపాలని వేడుకుంది.

Mini Projector: రూ. 3వేలతో ఇంటిని థియేటర్‌గా మార్చేయండి.. అదిరిపోయే ప్రొజెక్టర్‌

Mini Projector: రూ. 3వేలతో ఇంటిని థియేటర్‌గా మార్చేయండి.. అదిరిపోయే ప్రొజెక్టర్‌

ప్రస్తుతం ఇంట్లోనే థియేటర్‌ సెటప్‌ చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. మరీ ముఖ్యంగా ఓటీటీ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య తగ్గింది. ఇంట్లోనే బిగ్‌ స్క్రీన్‌లపై సినిమాలు చూస్తున్నారు. ఇక మరికొందరు ప్రొజెక్టర్ల సహాయంతో సినిమాలను వీక్షిస్తున్నారు. అయితే ప్రొజెక్టర్లు అనగానే ఎక్కువ ధర ఉంటాయని భావిస్తారు. కానీ తక్కువ బడ్జెట్‌లో కూడా ప్రొజెక్టర్లు అందుబాటులో ఉన్నాయి..

ప్రస్తుతం తక్కువ ధరకే ప్రొజెక్టర్లు లభిస్తున్నాయి. ఒకప్పుడు ప్రొజెక్టర్లు అంటే ఎక్కువ ధర ఉండేవి. కానీ ప్రస్తుతం భారీగా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఈకామర్స్‌ సంస్థ అమెజాన్‌లో ఓ ప్రొజెక్టర్‌పై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది.


Portable Mini Projector Color LED LCD Video Multimedia Home Theater పేరుతో ఈ మినీ ప్రొజెక్టర్‌ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. తక్కువ పరిమాణం, లైట్‌ వెయిట్‌తో ఉన్న ఈ ప్రొజెక్టర్‌ను ఎక్కడికైనా సింపుల్‌గా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే దీని ఇన్‌స్టాలేషన్‌ కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు.

ఈ ప్రొజెక్టర్‌ గరిష్టంగా 170 ఇంచెస్‌ స్క్రీన్‌ను ప్రొజెక్ట్ చేయగలదు. అయితే 50 నుంచి 100 ఇంచెస్‌ స్క్రీన్‌ మంచి క్వాలిటీ వీడియో ప్రొజెక్ట్ అవుతుంది. గేమ్స్‌ ఆడుకునే వారికి సినిమాలు వీక్షించేవారికి ఈ ప్రొజెక్టర్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఇక ఈ మినీ ప్రొజెక్టర్‌ను హెచ్‌డీఎమ్‌ఐ, యూఎస్‌బీకి సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రొజెక్టర్‌ను టీవీలు, ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, డిజిటల్‌ కెమెరాలకు సులభంగా కనెక్ట్ చేయొచ్చు. 400 ల్యూమన్స్‌ బ్రైట్‌నెస్‌, 1080పీ రిజల్యూషన్‌ స్క్రీన్‌ను అందిస్తుంది.

ఈ ప్రొజెక్టర్‌ను వైఫైతో కనెక్ట్‌ చేసుకోవచ్చు. 1920 x 1080 డిస్‌ప్లే రిజల్యూషన్‌ ఈ ప్రొజెక్టర్‌ సొంతం. ఇందులో ఎల్‌సీడీ డిస్‌ప్లే టెక్నాలజీని అందించారు. ధర విషయానికొస్తే ఈ మిని ప్రొజెక్టర్‌ అసలు ధర రూ. 5,999కాగా అమెజాన్‌లో 50 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ. 2999కే లభిస్తోంది.

ఉచిత ఆధార్ అప్డేట్ పై కేంద్రం కీలక నిర్ణయం!

ఉచిత ఆధార్ అప్డేట్ గడువుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.ఈ గడువును మరి కొద్ది రోజుల పాటు పొడిగించింది. ఉచిత ఆధార్ అప్డేట్ గడువు రేపటితో ముగుస్తున్న నేపధ్యంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఈ గడువును మరో మూడు నెలల పాటు పెంచుతున్నట్లు ప్రకటించింది.

ఈ గడువును సెప్టెంబర్ 14, 2024 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆధార్ కార్డులో ఏమైనా తప్పుల సవరణకు మరో అవకాశం లభించినట్లు అయ్యింది. ఈ నిర్ణయంతో ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకునేవారు ఆన్ లైన్ లో ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు.

కాగా భారతదేశంలో ఎక్కడికి వెళ్లినా ఆధార్ కార్డును ఒక గుర్తింపు కార్డు కింద పరిగణిస్తారు. ఆధార్ నిబందనల ప్రకారం ప్రతి పదేళ్లకు ఒకసారి వ్యక్తికి సంబందించిన వివరాలను అప్డేట్ చేసుకోవాలి.

దీని కోసం సరైన దృవపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ఉచిత ఆధార్ అప్డేట్ కోసం కేంద్రం జూన్ 14 వరకు గడువు విధించింది. ఈ గడువు రేపటితో ముగుస్తుండటంతో మరో సారి గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ గడువు అనంతరం కూడా ఎప్పటిలాగే ఆధార్ కేంద్రాలలో రూ.50 రుసుముతో అప్డేట్ చేసుకోవచ్చు.

కొణిదల ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ.. చెదిరిన బావ బావమరిది బంధం

చాలా రోజులుగా మెగా ఫ్యామిలీలో చిచ్చు నడుస్తోంది పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )రాజకీయ పరిస్థితుల కారణంగా అల్లు ఫ్యామిలీ( Allu family ) దూరమైపోతున్న పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.

నిజానికి ఇది కొణిదల ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫామిలీ అనడానికి లేదు. ఇది పూర్తిగా పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్ అని చెప్పుకోవచ్చు. తన మామ ఆయన పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుంటే వైసీపీలో ఉన్న తన వ్యక్తిగత స్నేహితుడి కోసం వెళ్లి ప్రచారం చేశాడు. అల్లు అర్జున్ అక్కడే మొదలైంది అసలు చిచ్చు.

అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా సాక్షిగా యుద్ధం చేసుకున్నారు. ఏది ఏమైనా మెగా ఫ్యామిలీ అంతా ఒకటే అనే భ్రమలు అందరు ఉంటారు. కానీ ఇప్పుడు ఆ భ్రమను తొలగుతున్నట్టుగా కనిపిస్తున్నాయి.

తాజాగా నిన్న జరిగిన ప్రమాణ స్వీకారానికి అల్లు అర్జున్( Allu Arjun ) తరఫున ఎవరు హాజరు కాకపోవడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతుంది. చాలా ఏళ్లుగా అల్లు అరవింద్ తో పవన్ కళ్యాణ్ కి మంచి టర్మ్స్ లేవు కారణాలు ఏంటో తెలియదు కానీ అల్లు అరవింద్ అంటే చాలు పవన్ కళ్యాణ్ విరుచుకు పడిపోతాడు.

ఇప్పుడు అదే తత్వం అల్లు అర్జున్ కి కూడా వచ్చింది గతంలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పెట్టుకున్నాడు. మల్లి కాస్త వెనక్కి తగ్గాడు. ఇక ఇప్పుడు రాజకీయాలు మారుతున్నాయి లెక్కలు వాటి సమీకరణాల రూపు రేఖలు కూడా మారుతున్నాయి. కాబట్టి చిరంజీవి( Chiranjeevi ) తన తమ్ముడి విజయాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్న సందర్భంలో తన పక్కన ఎప్పుడూ ఉండే అల్లు అరవింద్ లేకపోవడంతో నిజంగానే అల్లు ఫ్యామిలీకి కొణిదల ఫ్యామిలీకి మధ్య గ్యాప్ వచ్చింది అని అందరూ అనుకుంటున్నారు. పైగా మోది పవన్ కళ్యాణ్ మరియు చిరంజీవిలతో కొత్త రాజకీయం చేయబోతున్నాడు. ఇలాంటి సందర్భంలో అల్లు అరవింద్( Allu Arvind ), అల్లు అర్జున్ వీరికి వ్యతిరేకంగా ఉండడానికి కారణాలు ఏంటో మరికొన్ని రోజులు ఆగితే బయటకు వస్తాయి.

ఇక పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయడం కోసం అల్లు అర్జున్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి నాగబాబు సైతం అగ్నికి ఆజ్యం పోశారు. తమ్ముడు గెలుపు నీ ఎంజాయ్ చేయడం వరకు ఓకే కానీ ఫ్యాన్స్ ని గెలకడమే కాస్త ఇబ్బంది. ఏది జరుగుతున్నా చిరంజీవి ఎప్పటి లాగానే గుమ్మనంగా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. తాజాగా సాయి ధరంతేజ్ సైతం అల్లు అర్జున్ ని అలాగే అతని భార్య స్నేహారెడ్డిని సోషల్ మీడియాలో అన్ ఫాలో అయ్యాడు. దీంతో కొణిదెల ఫ్యామిలీ ఒక గ్రూప్ అయిపోతే అల్లు ఫ్యామిలీ మరో గ్రూప్ అయిపోయిందని అభిప్రాయానికి వస్తున్నారు అందరూ

T20 World Cup 2024: న్యూయార్క్‌ స్టేడియం వద్ద బుల్డోజర్లు.. కూల్చివేతకు రంగం సిద్ధం!

న్యూయార్క్‌ మైదానం.. టీ20 ప్రపంచ కప్‌ కోసం తాత్కాలికంగా నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అక్కడి మ్యాచులన్నీ పూర్తి కావడంతో దానిని కూల్చివేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

టీ20 ప్రపంచ కప్‌ టోర్నీకి సహ ఆతిథ్య దేశంగా యూఎస్‌ఏ ఉన్న సంగతి తెలిసిందే. ఈ మెగా సంగ్రామం కోసం న్యూయార్క్‌లో తాత్కాలికంగా స్టేడియాన్ని యూఎస్‌ఏ క్రికెట్ అసోసియేషన్‌ నేతృత్వంలో ఐసీసీ నిర్మించింది. డ్రాప్‌ ఇన్‌ పద్ధతిలో పిచ్‌లు తయారుచేయించింది. ఇదే మైదానంలో భారత్‌ మూడు మ్యాచ్‌లు ఆడింది. అందులో పాకిస్థాన్‌తో పోరు కూడా ఉంది.

తాజాగా యూఎస్‌ఏతో మ్యాచ్‌ అనంతరం ఆ వేదికను తొలగించేందుకు బుల్డోజర్లను సిద్ధం చేసి ఉంచిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అక్కడి సదుపాయాలను స్థానిక క్లబ్‌లు, అభిమానులు వినియోగించుకునేలా వాటిని జాగ్రత్తగా విడదీసి పెడతారు. కేవలం ఐదు నెలల ముందే ప్రపంచ కప్‌ కోసం ఈ మైదానాన్ని సిద్ధం చేయడం విశేషం.

ఇకపై ఫ్లోరిడాలో మ్యాచ్‌లు.. కానీ
న్యూయార్క్‌ వేదికగా మొత్తం 8 మ్యాచ్‌లు జరిగాయి. దాదాపు అన్నీ తక్కువ స్కోరింగ్‌ మ్యాచులే. ఇకపై ఫ్లోరిడా వేదికగా గ్రూప్ – A మ్యాచుల్లోని నాలుగు ఇక్కడే జరుగుతాయి. అందులో భారత్ – కెనడా మ్యాచ్‌ కూడా ఉంది. అయితే, పాకిస్థాన్‌కు తన చివరి మ్యాచ్‌ (ఐర్లాండ్‌తో జూన్ 16) అత్యంత కీలకం. అదే సమయంలో యూఎస్‌ఏకూ ముఖ్యమే.

ఆ జట్టు ఐర్లాండ్‌తో (జూన్ 14న) మ్యాచ్‌లో విజయం సాధిస్తే ‘సూపర్ – 8’కి చేరుతుంది. కానీ, ఇప్పుడు ఫ్లోరిడాను వర్షం ముంచెత్తుతోంది. దీంతో పాక్‌ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. యూఎస్‌ఏ-ఐర్లాండ్‌ మ్యాచ్‌ వర్షం వల్ల రద్దయినా.. పాక్‌ ఇంటిముఖం పట్టినట్లే. ఇప్పటికే అక్కడ ‘ఎమర్జెన్సీ’ని స్థానిక ప్రభుత్వం ప్రకటించింది. శ్రీలంక – నేపాల్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే.

Andhra Pradesh:ఏపీకి సూపర్ గుడ్ న్యూస్.. రూ.50 వేల కోట్ల ప్రాజెక్టు?

BPCL Refinery:టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి పెద్ద పెద్ద ప్రాజెక్టులు క్యూ కడుతున్నాయి. తాజాగా బీపీసీఎల్ ఆంధ్రాలో భారీ ప్రాజెక్టు స్టార్ చేయడానికి యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.రూ.50 వేల కోట్ల వ్యయంతో రిఫైనరీ ఏర్పాటు కోసం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.

ఈ రిఫైనరీ ఏర్పాటు కోసం బీపీసీఎల్ మూడు రాష్ట్రాలను పరిశీలిస్తుండగా.. అందులో ఏపీ కూడా ఉంది అని అంటున్నారు.

స్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ భారీ ప్రాజెక్టు ఏపీకి రావాలని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.ఏడాదికి 12 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న రిఫైనరీ నెలకొల్పాలని బీపీసీఎల్ భావిస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం 50 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. అయితే ఈ రిఫైనరీ నెలకొల్పేందుకు మూడు రాష్ట్రాలను బీపీసీఎల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో ఒకచోట ఈ రిఫైనరీని ప్రారంభించాలని బీపీసీఎల్ ఆలోచిస్తున్నట్లు తెలిసింది.పెరుగుతున్న ఇంధన డిమాండ్‌ను తీర్చడానికి భారతదేశానికి మరిన్ని రిఫైనరీలు అవసరం ఉంది. అందులో భాగంగా బీపీసీఎల్ తూర్పు తీరంలో లేదా పశ్చిమ తీరంలో మరొక రిఫైనరీని ప్లాన్ చేస్తోంది. చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయి” అని ఒక అధికారి చెప్పినట్లు ఎకనమిక్స్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. కొత్త రిఫైనరీ కోసం ఏపీ, యూపీ, గుజరాత్ రాష్ట్రాలను పరిశీలిస్తున్నట్లు సమచారం.

మరోవైపు బీపీసీఎల్ ఛైర్మన్ కృష్ణ కుమార్ సైతం ఇటీవల ఇదే విషయంపై మాట్లాడారు. 2029 నాటికి బీపీసీఎల్ తన సామర్థ్యాన్ని 45 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం బీపీసీఎల్‌కు ముంబై, కోచి, మధ్యప్రదేశ్‌లోని బినాలో రిఫైనరీలు ఉన్నాయి. కొత్త రిఫైనరీ ఏర్పాటు కోసం తూర్పు తీర ప్రాంతం, పశ్చిమ తీరప్రాంతాలను బీపీసీఎల్ పరిశీలిస్తోంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసే ఆలోచనలు సైతం చేస్తున్నట్లు సమాచారం. ఎకనమిక్స్ టైమ్స్ ప్రచురించిన ఈ కథనం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఏపీలో రూ.50 వేలకోట్ల పెట్టుబడి ఒకేసారి వస్తే.. స్థానికులకు భారీగా ఉద్యోగాలు లభిస్తాయని.. వేల మందికి పరోక్షంగా లబ్ధి కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ భారీ ప్రాజెక్టును ఏ మేరకు ఏపీకి తీసుకువస్తారనేదీ చూడాలి మరి.

AP High court: వాసుదేవరెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా

బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ వాసుదేవరెడ్డి వేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈనెల 18కి వాయిదా వేసింది.

అమరావతి: కీలక డాక్యుమెంట్లు మాయం చేశారని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ మాజీ ఎండీ, ఐఆర్‌టీఎస్‌ అధికారి డి.వాసుదేవరెడ్డిపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా.. తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ వాసుదేవరెడ్డి వేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈనెల 18కి వాయిదా వేసింది. వాసుదేవరెడ్డికి మధ్యంతర బెయిల్‌ ఇవ్వొద్దని సీఐడీ తరఫు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. అనంతరం పిటిషన్‌పై విచారణను వాయిదా వేసిన కోర్టు.. ఈ లోపు అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరించింది.

ఏపీఎస్‌బీసీఎల్‌ ప్రధాన కార్యాలయం నుంచి దస్త్రాలు, కంప్యూటర్‌ పరికరాలు, ఇతర పత్రాలను వాసుదేవరెడ్డి ఈ నెల 6న కారులో తరలిస్తుండగా చూశానంటూ.. కంచికచర్ల వాసి గద్దె శివకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుపై ఈ కేసు పెట్టింది. విలువైన ఆధారాలు, వస్తువుల ధ్వంసం, చోరీ, నేరపూరిత కుట్ర తదితర అభియోగాలపై ఐపీసీ 427, 379 రెడ్‌విత్‌ 120బీ సెక్షన్ల కింద సీఐడీ కేసు నమోదు చేసింది.

నాటి బడి చదువులు – నేటి వాస్తవం – రేపటి అవసరాలు : – డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్

నాటి బడి చదువులు – నేటి వాస్తవం – రేపటి అవసరాలు :

– డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్

30-40 సంవత్సరాల క్రితం వసతులు లేని వానాకాలం బడులలో తెలుగు మీడియంలో చదివిన వారు , 6 వ తరగతి లో ఇంగ్లీష్ అక్షరాలు నేర్చుకున్నవారు …. అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. 1990 లలో వచ్చిన సాంకేతిక మార్పులు, దేశంలోని ఆర్థిక విధానాల మార్పుల వలన దేశవిదేశాలలో ఉద్యోగ అవకాశాలు వచ్చాయి . ముఖ్యంగా సాప్ట్ వేర్ మరియు ఫార్మా రంగాలలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు ఏర్పడ్డాయి . ఆ అవకాశాలను అందిపుచ్చుకున్న భారతీయ యువతలో అత్యధిక శాతం ప్రభుత్వ బడులలో , మాతృభాషా మాధ్యమంలో చదువుకున్నవారే . వాస్తవానికి వారిలో అత్యధికులు 6 వ తరగతిలో ఇంగ్లీష్ అక్షరాలు నేర్చుకున్నవారే! ఈ ఉద్యోగ అవకాశాలను మధ్యతరగతి పట్టణ , గ్రామీణ యువత ఎక్కువగా అందుకున్నారు. కొత్త టెక్నాలజీ లో వారికి కాలేజీలలో శిక్షణ లేకపోయినా ; ప్రభుత్వాలు ఎటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ , శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయకపోయినా … లక్షలాది మంది యువత ఆ అవకాశాలను అందిపుచ్చుకున్నారు.

దానికి ప్రధాన కారణాలు

అ) ‘ బడి ‘ వారికి చదవడం , రాయడం , సాధారణ లెక్కలు చేయడం వంటి బేసిక్ స్కిల్స్ పటిష్టంగా నేర్పింది.

ఆ) లెక్కలు బాగా చేయడం ద్వారా వారికి లాజిక్ , క్రిటికల్ థింకింగ్ అనే నైపుణ్యాలు బాగా అలవడ్డాయి. నిజానికి ఇవే సాప్ట్ వేర్ ఉద్యోగానికి కావలసిన అతి ముఖ్యమైన నైపుణ్యాలు.

ఇ ) చాలా మంది విద్యార్థులు టెస్ట్ బుక్స్ మాత్రమే చదివేవారు. ఒక వేళ గైడ్ లు చదివినా, అది వారికి కష్టమైన సబ్జెక్ట్స్ లోనో / మాష్టార్లు లేని సబ్జెక్టు లలో మాత్రమే చదివేవారు. తద్వారా సెల్ఫ్ లెర్నింగ్ behaviour వారికి అలవాటు అయ్యింది. టెస్ట్ బుక్ చదవకుండా నోట్స్ మాత్రమే చదవటం అనేది వారికి అలవాటు చేయబడలేదు.
కొంతమంది ఉపాధ్యాయులు అయితే నోట్స్ / గైడ్ లను చదవడాన్ని పూర్తిగా వ్యతిరేకించే వారు.

ఈ) విద్యార్థి చదివిన దానికి , వ్రాసిన దానికి మాత్రమే మార్కులు వేసేవారు. అప్పటి విద్యార్థుల మార్కులు పూర్తిగా వారి కష్టార్జితం . ఇందులో ఎవరి దయ , దాక్షిణ్యం లేదు.
ఆ మార్కులు ఎవరో వారికి ఉదారంగా, అయాచితంగా వేసినవి కావు. పేపర్లు సులువుగా ఇవ్వడం ద్వారా వారు మార్కులు తెచ్చుకొన్నవారు కాదు! బడిలోని ‘పరీక్షలు’ వారికి కష్టపడటం అనేది జీవితంలో భాగం అని తెలియజెప్పాయి మరియు అది జీవిత విలువలుగా మారేటట్లు చేశాయి .

ఉ) అప్పటి బడులలో , ఇంట్లో వసతుల లేమి అనేది వారికి పరిస్థితులకు అనుగుణంగా ఒదిగిపోవడం , పొదుపు చేయడం మరియు లక్ష్యాన్ని చేరడం నేర్పాయి.

‘ నాలుగు- ఐదు ‘ సంవత్సరాలు బడికి హాజరు అయిన వారికి చదవడం , రాయడం రాకపోవడం అనేది ఉండేది కాదు. బడి తయారు చేసిన నిరక్షరాస్యులు (Schooled illiterates ) అనే వారు దాదాపు ఉండేవారు కారు.

**************

నేటి వాస్తవం :

గత రెండు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ లో ‘బడిఈడు’ పిల్లలు నేర్చుకునే తీరుతెన్నులు , వారి స్వభావాలు ( Learning attitudes & Behaviours ) , ప్రస్తుత వాస్తవ అభ్యసనాస్థాయిలను ( Actual Learning levels ) పరిగణలోకి తీసుకోకుండా ; పిల్లల భవిష్యత్ ను గాలికి వదిలేసి, పార్టీ ల యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే పాఠశాల విద్యావిధానాలు రూపొందించి , తల్లిదండ్రులకు మాత్రం అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తున్నారు .

విద్యాశాఖ 2022 జూలై లో అన్ని ప్రభుత్వ బడుల్లో బేస్ లైన్ పరీక్ష నిర్వహించింది. గడచిన 25 సం. రాలలో విద్యాశాఖ మరియు ఉపాధ్యాయులు నిజాయితీగా నిర్వహించిన ఏకైక పరీక్ష ఇది. ఈ పరీక్ష ‘శాంపిల్ సర్వే ‘ కాదు. ప్రభుత్వ బడికి రోజూ హాజరయ్యే ప్రతీ విద్యార్థి బేస్ లైన్ పరీక్ష వ్రాసారు . బేస్ లైన్ పరీక్ష ఫలితాల ప్రకారం ‘ 6,7,8 తరగతులు చదివే విద్యార్థుల్లో

అ) 41.5 % మందికి సరళమైన తెలుగు వాక్యాలు ఉన్న ఈ క్రింద పేరా కూడా చదవటం రాదు.
“మా పొలం చాలా పెద్దది. నాన్న రోజూ పొలానికి వెళ్తారు. మా పొలంలో వరి వేశాము. ఈ సంవత్సరం ధాన్యం బాగా పండింది. “

ఆ ) 65.2% మందికి మూడు సరళ ఇంగ్లీషు పదాలు మాత్రమే ఉన్న ఈ క్రింది చిన్న వాక్యాలు కూడా చదవటం రాదు.
a) what is the time?
b) This is a large house .
c) I like to read
d) she has many books

ఇ ) 58.6% మంది కి ఈ క్రింద ఇచ్చిన చిన్నపాటి భాగాహారాలు కూడా చేయడం రాదు.
a) 37/2
b) 58/4
c) 79/6

ఇవి ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థుల వాస్తవ సామర్థ్యాలు . కనీస సామర్థ్యాలు అయిన చదవడం , వ్రాయడం , చిన్న చిన్న లెక్కలు చేయడం కూడా రావడం లేదు. 10 సం. రాలు బడికి వెళ్ళాక కూడా బడి లక్షలాది పేద పిల్లలను నిరక్షరాస్యులు గానే సమాజంలోకి పంపుతుంది.

బడి పిల్లలకు కనీస నైపుణ్యాలు లేకపోవడానికి , ఇంగ్లీష్ మీడియం కు అవినాభావ సంబంధం ఉంది . 2005 నుండి ప్రతీ సంవత్సరం ప్రధమ్ సంస్థ విడుదల చేస్తున్న ‘ అసర్ ‘ నివేదికల ప్రకారం ‘ ఒక వైపున ఇంగ్లీష్ మీడియం పెరిగేకొలది , మరోవైపు కనీసం చదవడం రాయడం రాని విద్యార్ధుల శాతం కూడా గణనీయం గా పెరుగుతుంది.

‘ప్రపంచ బ్యాంక్ 2018 లో విడుదల చేసిన రిపోర్ట్ ‘ Learning : To realise Education’s promise’ 77 వ పేజీ లో ఈ విధంగా ఉంది “ ధారాళంగా చదవలేని వ్యక్తులు మార్కెట్ లోని ఉపాధి అవకాశాలు అందుకోలేరు, తదుపరి విద్యావకాశాలు కూడా ఉపయోగించుకోలేరు . త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న ఆధునిక మార్కెట్ లలో వచ్చే అత్యధిక జీతాలు ఇచ్చే ఉద్యోగాలను వీరు పొందలేరు , ఎందుకంటే ఉద్యోగ శిక్షణకు కూడా సాధారణంగా చదివే స్థాయి కన్నా మెరుగైన నైపుణ్యాలు ( reading competency beyond minimum proficiency ) ఎంతో అవసరం.

******************

రేపటి అవసరాలు :

కృత్రిమ మేధ (Artificial intelligence) యుగం లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే మన విద్యార్థులకు బడిలో నేర్పాల్సిన నైపుణ్యాలు ‘ సృజనాత్మకత , విమర్శనాత్మక ఆలోచన ‘.
ఇవి రావాలంటే పిల్లలకు కథలు చెప్పడం – వారి చేత చెప్పించడం , ఆర్ట్స్ , సంగీతం అనేవి ప్రాథమిక దశ నుండి ఉన్నప్పుడే వారికి సృజనాత్మకత వస్తుంది.

బడులలో ( ప్రభుత్వ / ప్రైవేట్ ) అంతర్జాతీయ స్థాయి సైన్స్ ల్యాబ్ లు ఉన్నప్పుడే … వారిలో శాస్త్రీయ సృజనాత్మకత పెరుగుతుంది.

Language labs ద్వారా వివిధ భాషలలో నైపుణ్యాన్ని పెంచి సాహిత్యం చదవడం అలవాటు చేయడం సృజనాత్మకత పెంపుదలకు ఎంతో అవసరం.

గూగుల్ CEO ‘ సుందర్ పిచాయ్ ‘ ఈ విధంగా చెప్పారు ‘ సబ్జెక్టు లను బట్టీ పట్టడం కాకుండా , వాటిని పూర్తిగా అవగాహన ఆకళింపు చేసుకోవాలి , అప్పుడే రాబోయే రోజులలోని సాంకేతిక మార్పులను అర్ధం చేసుకొని , అవకాశాలను అందిపుచ్చుకోగలరు అని’ .

ఇవి సాధ్యపడాలంటే రెండు విషయాలు ప్రధానంగా జరగాలి

a) సృజనాత్మకత , విమర్శనాత్మక ఆలోచన అనే విషయాలలో ప్రవేశం కల్పించడానికి , నైపుణ్యం సాధించడానికి చాలా సమయం పడుతుంది. అంత సమయం విద్యార్థికి ఒత్తిడి లేకుండా దొరకాలంటే ఏకైక మార్గం ” మాతృభాషా మాధ్యమం లో బట్టీ పట్టాల్సిన అవసరం లేని నాణ్యమైన విద్య ను అందించడం” .

b) పరీక్షల నిర్వహణ లోనూ, మూల్యాంకనం లోనూ పారదర్శకత ఉండాలి.

ఇవి చేయడానికి స్వల్పకాలిక రాజకీయ లబ్ది కోసం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రభుత్వాలు కాదు , ముందు చూపుతో ప్రజలను నడిపించే దార్శనికులు నాయకత్వం వహించే ప్రభుత్వం కావాలి.

పెద్దిరెడ్డికి చెక్ పెడుతున్న చంద్రబాబు, ఏపీఎండీసీ స్కామ్, విచారణకు కమిటి ??

ఆంధ్రప్రదేశ్ లో కొలువుతీరిన ఎన్డీఏ ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవకతవకల బయటకు లాగాలని ఫోకస్ పెడుతోందని వెలుగు చూసింది. కుప్పంలో చంద్రబాబును ఓడించాలని అనేక ప్రయత్నాలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని టార్గెట్ చెయ్యాలని, ఆయన లోసుగులు బయట పెట్టాలని ఎన్డీఏ ప్రభుత్వంలోని పెద్దలు ఆలోచిస్తున్నారని తెలిసింది..

గత వైసీపీ ప్రభుత్వంలో గనుల శాఖా మంత్రిగా పని చేసిన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి భారీ మొత్తంలో అవినీతికి పాల్పడ్డారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)లో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఆయన కుమారుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిఫార్సు లేఖలు ఇవ్వడంతో వందల మందికి ఉద్యోగాలు ఇచ్చేశారని ఆరోపణలు ఉన్నాయి.

ఇదే సంస్థలో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి ఎక్కువ ప్రధాన్యత ఇవ్వకుండా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సిఫార్సుతో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు పెద్దపీట వేశారని ఆరోపణలు ఉన్నాయి. 2019 వరకు ఏపీఎండీసీ సంస్థలో కేవలం 50 మంది మాత్రమే కాంట్రాక్టు ఉద్యోగులు ఉండేవారని, పెద్దిరెడ్డి చేతికి గనుల శాఖ వచ్చిన తరువాత ఆ సంస్థలో సుమారు 400 మందికిపైగా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు చేరారని ఆ సంస్థలో పని చేస్తున్న కొందరు ఆరోపించారు.

కేవలం పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సిఫార్సు లేఖలు తీసుకు వచ్చి ఏపీఎండీసీ సంస్థలో ఉద్యోగాల్లో చేరారని ఆరోపణలు ఉన్నాయి. ఎలాంటి అర్హతలు లేకున్నా వందల మందికి ఆ సంస్థలో ఉద్యోగాలు ఇచ్చారని, చాలా మందికి రూ. 70 వేల నుంచి రూ. 80 వేలు జీతం ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ఎపీఎండీసీలో తొలుత ఎండీగా పని చేసిన మధుసూదన్ రెడ్డి, తరువాత వచ్చిన ఇన్ చార్జ్ మంత్రి వెంకటరెడ్డి నిబంధనలకు విరుద్దంగా వందల మందికి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి.

కార్పోరేట్ సంస్థల్లో పని చేసిన వైసీపీ సానుభూతిపరులు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ కోసం పని చేసిన ఇంటర్ పాస్ అయిన వాళ్లకు ఏపీఎండీసీలో ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇచ్చారని, మిగిలిన వారు కడప జిల్లాకు చెందిన వారని ఆరోపణలు ఉన్నాయి. ఏపీఎండీసీలో జరిగిన అవకతవల గురించి విచారణ జరిపిస్తే మొత్తం వ్యవహారం బయటకు వస్తుందని, మింగేసిన డబ్బులు వారి నుంచి కక్కించాలని చంద్రబాబు ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిసింది.

OTT Updates : ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న ఆరు తెలుగు సినిమాలివే!

ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్. ఈ వారం ఏకంగా ఆరు తెలుగు సినిమాలు, సిరీస్‌లు ఓటీటీలో సందడి చేయనున్నాయి. కరోనా తర్వాత ఓటీటీ హవా కొనసాగుతుంది.

ప్రతి ఒక్కరూ థియేటర్స్ కంటే ఓటీటీలో మూవీస్ చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ కూడా భారీ ధరకు సినిమాలను కొనుగోలు చేసి సినిమా థియేటర్లో విడుదలైన 15 నుంచి 30 రోజుల్లోనే రిలీజ్ చేస్తున్నాయి. అయితే రీసెంట్‌గా విడుదలైన పలు సినిమాలు ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్నయి. ఇంతకీ అవి ఏవీ అనుకుంటున్నారా?

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా, నేహా శెట్టి హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో విడుదలై పాటివ్ టాక్ సొంత చేసుకుంది. కాగా ఈ సినిమా జూన్ 14న నెట్ ఫ్లిక్స్‌లో విడుదలకు సిద్ధమైంది. తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. కాగా, ఈ సినిమా థియేటర్లలో విడుదలైన 15 రోజులకే ఓటీటీలోకి వస్తుంది.

డియర్ నాన్న.. చైతన్య రావు హీరోగా నటించిన డియర్ నాన్న మూవీ ఆహా ఓటాటీలో జూన్ 14 నుంచి సందడి చేయనుంది. ఈ సినిమాకు కుంభంసపాటి దర్శకత్వం వహించారు.

పరువు .. నివేతా పేతురాజ్ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ పరువు.జ దీనిని చిరంజీవి చిన్న కూతురు సుస్మిత కొణిదెల ప్రొడ్యూస్ చేసింది. కాగా, ఈ సినిమా శుక్రవారం ( జూన్ 14 ) నుంచి జీ5, ఓటాటీలో స్ట్రీమింగ్ కానుంది.

యక్షిణి.. బాహుబలిప్రొడ్యూసర్స్ నిర్మించిన యక్షిణి వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. వీటితో పాటు, పారిజాతపర్వం, రష్ సినిమాలు కూడా ఈ వారం ఓటాటీలో సందడి చేయనున్నాయి. చైతన్యరావు, సునీల్, శ్రద్ధా దాస్ ప్రధాన పాత్రలో నటించిన పారిజాత పర్వం జూన్ 12న నేరుగా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే, దర్శకుడు అల్లరి రవిబాబు కథను అందిస్తూ ప్రొడ్యూస్ చేసి తెలుగు మూవీ రష్ థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఈటీవీ విన్ ఓటీటీలో జూన్ 13న రిలీజైంది. ఈ వారం ఇది కూడా ఓటీటీలో సందడి చేనుంది.

BREAKING : మాజీ సీఎం కేసీఆర్‌కు ఈడీ బిగ్ షాక్

BREAKING : మాజీ సీఎం కేసీఆర్‌కు ఈడీ బిగ్ షాక్

Sheep Distribution :మాజీ సీఎం కేసీఆర్‌ (Ex. CM KCR) కు ఈడీ షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ పథకంపై మనీలాండరింగ్ ( PMLA ) కింద ఈడీ కేసు నమోదు చేసింది.

గొర్రెల పంపిణీలో అవకతవకలపై పూర్తి వివరాలను ఇవ్వాలంటూ పశుసంవర్ధక శాఖకు ఈడీ (ED) లేఖ రాసింది. 10 రకాల సమాచారాన్ని ఇవ్వాలని కోరింది. ఈ క్రమంలో పశుసంవర్ధక శాఖ ఎండీకి నోటీసులు పంపింది.

Health

సినిమా