Wednesday, November 13, 2024

Wi-Fi: ఇంట్లో Wi-Fi వాడుతున్నారా.. వెంటనే ఇలా చేయండి.. లేదంటే ఊహించని ప్రమాదం

భారతదేశ ఇంటర్నెట్ సిస్టమ్‌లో ఉపయోగించే ప్రముఖ TP-Link రౌటర్లలో ఒక ప్రధాన భద్రతా లోపం కనుగొన్నారు. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) వెంటనే ఈ విషయంలో హెచ్చరిక జారీ చేసింది.

Apple, Microsoft, Google, Mozilla వంటి కంపెనీల సాఫ్ట్‌వేర్, పరికరాలలో భద్రతా లోపాలను వేగంగా కనుగొనడంలో CERT-In ప్రసిద్ధి చెందింది. ఈసారి కూడా వారు TP-Link రూటర్‌లలో పెద్ద లోపాన్ని గుర్తించారు. దీని గురించి చాలా మంది వినియోగదారులకు ఇంకా తెలియకపోవచ్చు.

ఒక్క ఫైల్ వల్ల పెరిగిన టెన్షన్..

TP-Link రూటర్‌లలో ఒక లోపం ఉంది. అది “rf test” అనే ఫైల్ వల్ల ఏర్పడింది. ఈ ఫైల్‌ కారణంగా, రౌటర్‌లో నెట్‌వర్క్ దెబ్బతింటుంది. దీనిని బయటి వ్యక్తి ఎవరైనా నియంత్రించవచ్చు. వారు పాస్ వర్డ్ కూడా నమోదు చేయవలసిన అవసరం లేదు.

బయటపడిన లోపం..

TP-Link రౌటర్‌లలో ఒక లోపం కనుగొన్నామని CERT-In తెలిపింది. దానిని సద్వినియోగం చేసుకొని బయటి నుంచి వచ్చే ఏ హ్యాకర్ అయినా మీ రూటర్‌ని తన సొంతం చేసుకోవచ్చు. ఈ లోపం వెర్షన్ C5400X(EU)_V1_1.1.7 బిల్డ్ 20240510 కంటే ముందు ఉన్న TP-Link ఆర్చర్ మోడల్‌లలో మాత్రమే ఉంది. సాధారణ భాషలో అర్థం చేసుకోవడానికి, మీ రూటర్ మీ ఇంటి ప్రధాన ద్వారం అని అనుకుందాం. ఈ లోపం కారణంగా, బయటి వ్యక్తి (దొంగ) మీ ప్రధాన ద్వారాన్ని నియంత్రించవచ్చు.

సమస్యను ఎలా పరిష్కరించాలి?

– మీరు వీలైనంత త్వరగా మీ రూటర్ తాజా సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం చాలా ముఖ్యం. కంపెనీలు తరచుగా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను విడుదల చేస్తాయి. ఇందులో భద్రతా లోపాలు తొలగించబడతాయి.

– రూటర్‌లో వచ్చే డిఫాల్ట్ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌ను మార్చండి. సులభంగా పొందిన లేదా బలహీనమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించవద్దు.

– మీ Wi-Fi నెట్‌వర్క్ భద్రతను బలోపేతం చేయడానికి WPA3 లేదా WPA2 వంటి ఎన్‌క్రిప్షన్‌ని ఉపయోగించండి. ఈ ఎన్‌క్రిప్షన్ మీ డేటా దొంగిలించబడకుండా నిరోధిస్తుంది.

– రూటర్ రిమోట్ మేనేజ్‌మెంట్ ఫీచర్‌ను ఆఫ్ చేయండి. దీనితో, బయటి వ్యక్తి ఇంటర్నెట్ ద్వారా మీ రూటర్ సెట్టింగ్‌లను మార్చలేరు.

డిగ్రీ అవసరం లేదు.. ఈ AI స్కిల్ నేర్చుకుంటే లక్షల్లో జీతం!

ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హవా నడుస్తోంది. ప్రతీ రంగంలోనూ ఏఐ ప్రాధాన్యత పెరిగిపోయింది. భవిష్యత్తులో ఏఐ టూల్స్ నేర్చుకోవడం అనేది కంపల్సరీ అయిపోతుందని..

నేర్చుకోని వారి జీవితం అగమ్యగోచరంగా మారుతుందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ విషయంలో అనేక భయాలు, ఆందోళనలు ఉన్నాయి. ఏఐ మన ఫ్యూచర్ ని ఎలా ప్రభావితం చేయబోతుంది? ఏఐని తట్టుకుని నిలబడగలమా? వెనకబడిపోతామా? అన్న భయంతో ఇప్పటి నుంచి చాలా మంది ఏఐ స్కిల్స్ ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో గ్లోబల్ టెక్నాలజీ ఇన్నోవేటర్ ఐబీఎం ఎగ్జిక్యూటివ్ ఏఐకి సంబంధించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు.

సీఎన్బీసీ నివేదిక ప్రకారం.. 96 శాతం కంపెనీలు తమ సంస్థల నిర్వహణలో ఏఐని తీసుకొచ్చే పనిలో ఉన్నాయని అన్నారు. మూడింట రెండు వంతుల మంది ఉద్యోగులు తాము అసలు ఎప్పుడూ ఏఐ టెక్నాలజీతో పని చేయలేదని.. 2024 మార్చి నెలలో స్లాక్ వర్క్ ఫోర్స్ ల్యాబ్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అయితే ఏఐ స్కిల్స్ ని నేర్చుకోవడం మానేస్తే కెరీర్ పురోగతిని కోల్పోతారని ఐబీఎం గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ వర్క్ ఫోర్స్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ లిడియా లోగాన్ హెచ్చరిస్తున్నారు. ఏఐలో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కి అత్యధిక డిమాండ్ ఉందని.. ఈ స్కిల్ ని నేర్చుకోవాలని సూచిస్తున్నారు. ఈ స్కిల్ కి డిగ్రీ కూడా అవసరం లేదని చెబుతున్నారు.

ప్రస్తుతం ఎక్కువ ప్రాచుర్యం పొందిన ఏఐ సాధనాల్లో ఒకటైన చాట్ జీపీటీనీ వాడుతున్నట్లైతే.. ప్రాంప్ట్ లు ఎంత ఖచ్చితంగా ఉంటే ప్రతిస్పందనలు అంత బాగా వస్తాయి. అందుకే బోల్డ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కి ఇంత డిమాండ్ ఉందని అన్నారు. ప్రాంప్ట్ ఇంజనీర్ జాబ్ ఎలా ఉంటుందంటే.. తన ఉద్యోగి లేదా క్లయింట్ కి విలువైన సమాచారం పొందడానికి చాట్ జీపీటీ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ వంటి ఏఐ చాట్ బాట్ లకు సరైన ప్రశ్నలను లేదా సూచనలను రూపొందిస్తారు. ప్రాంప్ట్ ఇంజనీర్లకు, ప్రొడక్ట్ మేనేజర్స్ వంటి సరికొత్త ఉద్యోగాలకు డిగ్రీ కంటే కూడా టెక్నికల్, సాఫ్ట్ స్కిల్స్ కే ప్రాధాన్యత ఉంటుందని లోగాన్ వెల్లడించారు.

జీతాలు ఇలా:

లింక్డ్ ఇన్, ఇన్ డీడ్ వంటి వెబ్ సైట్స్ ప్రకారం.. కంపెనీలు ప్రాంప్ట్ ఇంజనీర్ కి ఏడాదికి సగటున రూ. 39.3 లక్షల జీతం ఇస్తాయట. 2 నుంచి 5 ఏళ్ల అనుభవం ఉంటే ఏడాదికి 6 లక్షల నుంచి 12 లక్షల జీతం ఇస్తాయట. ఐదేళ్ల అనుభవం ఉన్న సీనియర్ కైతే 12 లక్షల నుంచి 20 లక్షల జీతం ఇస్తాయట. ఫ్రెషర్ కైతే 2 లక్షల వరకూ ఉండవచ్చునట.

NZ vs AFG : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో మ‌రో సంచ‌ల‌నం.. న్యూజిలాండ్‌పై అఫ్గానిస్తాన్‌ ఘ‌న విజ‌యం..

New Zealand vs Afghanistan : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో మ‌రో సంచ‌ల‌నం న‌మోదైంది. మొన్న పాకిస్తాన్ జ‌ట్టును అమెరికా సూప‌ర్ ఓవ‌ర్‌లో ఓడించ‌గా తాజాగా ప‌టిష్ట న్యూజిలాండ్‌ను అఫ్గానిస్తాన్ మ‌ట్టిక‌రిపించింది. గ‌యానా వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో కివీస్ పై అఫ్గాన్ 84 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని సాధించింది.

ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 159 ప‌రుగులు చేసింది. అఫ్గాన్ బ్యాట‌ర్ల‌లో రహ్మానుల్లా గుర్బాజ్ (80; 56 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ కొట్టాడు. ఇబ్రహీం జద్రాన్(44; 41 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), అజ్మతుల్లా (22 13 బంతుల్లో 1 ఫోర్‌, 2సిక్స‌ర్లు) లు రాణించారు. కివీస్ బౌల‌ర్ల‌లో ట్రెంట్ బౌల్ట్‌, మాట్ హెన్రీ చెరో రెండు వికెట్లు తీశారు. లాకీ ఫెర్గూస‌న్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో కివీస్ త‌డ‌బ‌డింది. అఫ్గాన్ బౌల‌ర్ల దాటికి 15.2 ఓవ‌ర్ల‌లో 75 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. స్టార్ ఓపెన‌ర్ ఫిన్ అలెన్ డ‌కౌట్ కాగా డేవాన్ కాన్వే (8), కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ (9), డారిల్ మిచెల్ (5), మార్క్ చాప్‌మెన్ (4), బ్రాస్‌వెల్ (0) లు త‌క్కువ ప‌రుగుల‌కే పెవిలియ‌న్‌కు చేరుకున్నారు.

గ్లెన్ ఫిలిఫ్స్‌(18), మాట్ హెన్రీ (12) లు మాత్ర‌మే రెండు అంకెల స్కోరు సాధించారు. అఫ్గానిస్తాన్ బౌల‌ర్ల‌లో ఫజల్హక్ ఫారూఖీ, రషీద్‌ ఖాన్ లు చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. మ‌హ్మ‌ద్ న‌బీ రెండు వికెట్లు సాధించాడు. ఈ విజ‌యంతో అఫ్గానిస్తాన్ నాలుగు పాయింట్ల‌తో గ్రూప్ సిలో అగ్ర‌స్థానానికి చేరుకుంది.

అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు.. సీఎం రేవంత్ ఆదేశం

తెలుగు రాష్ట్రాల ప్రజలకు అత్యంత సుపరిచితుడు, మీడియా దిగ్గజం రామోజీరావు ఇక లేరు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. ఈరోజు (శనివారం) తెల్లవారుజామున 4.50 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు సంస్థ ప్రకటించింది. ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్‌గా ఉన్న రామోజీరావు గుండె సంబంధిత సమస్యలతో ఈ నెల 5న హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీంతో ప్రముఖలు రామోజీరావు మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.

ఈనాడు అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత చెరుకూరి రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. తెలుగు పత్రికా, మీడియా రంగానికి రామోజీరావు గారు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని రేవంత్ ట్వీట్ చేశారు. ఈనాడు అధినేత చెరుకూరి రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ నుండే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్ కు సీఎస్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

Renu Desai: చెప్పాల్సింది పవన్ కే చెప్పా.. ఇక చెప్పేదేం లేదు.. రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు

Renu Desai Crucial Comments on Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సంచలన కామెంట్ చేశారు. తాజాగా తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ తో కుమారుడు అకీరా నందన్ ప్రధానమంత్రి మోదీని కలిశారు.

ఈ సందర్భంగా దిగిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే ఆ ఫోటోల కింద వస్తున్న కామెంట్లకు సైతం స్పందిస్తున్నారు. ఈ క్రమంలో ఒక నెటిజన్ అంతా ఓకే గాని కళ్యాణ అన్న గురించి కూడా ఏమన్నా చెప్పొచ్చుగా వదిన. చాలా మంది వెయిటింగ్, ఏమైనా చెప్తారా? బట్ మీరు ఏ పోస్ట్ లోనూ చెప్పట్లేదు. మూడు రోజుల నుంచి అంటూ పవన్ కళ్యాణ్ గురించి స్పందించమని ఒకరు అడిగారు. అయితే నేను ఏదైనా చెబితే ప్రతి ఒక్కరు నేను అటెన్షన్ కోసం చెప్పానని అంటారు. అయితే నేను చెప్పాల్సింది ఏంటో ఆయనకు డైరెక్ట్ గా ఫోన్ కాల్ లో చెప్పేశాను.

మీరు హ్యాపీగా ఉండొచ్చు అంటూ ఆమె కామెంట్ చేసింది. ఇక అఖిరా నందన్ హైట్ ఎంత అనే విషయాన్ని కూడా ఆమె ఈ పోస్ట్ లోనే వెల్లడించింది. అకిరా నందన్ ఆరడుగుల 4 అంగుళాలు ఉంటాడని ఆమె చెప్పుకొచ్చింది. అలాగే అకిరా నందన్ అంత హైట్ అవ్వడానికి కాంప్లాన్ ఎన్నిసార్లు ఇచ్చారు అని అడిగితే ఇప్పటివరకు అసలు కాంప్లాన్ అనేది తాగలేదని ప్యూర్ గా వెజిటేరియన్ ఫుడ్ తింటాడని అది కూడా ఇంట్లో పండించిన ఆర్గానిక్ కూరగాయల తోనే తింటాడని, ఇద్దరు తల్లిదండ్రుల నుంచి వచ్చిన జెనెటిక్స్ కూడా అంత హైట్ రావడానికి ఉపయోగపడ్డాయని ఆమె కామెంట్ చేసింది. అలాగే ఈ ఫోటోలో ఆద్య మిస్సయిందని అంటే ఆమెకు స్కూలు మొదలైంది కాబట్టి ఆ రోజు ఆమె వెళ్లలేకపోయిందని రేణు చెప్పుకొచ్చింది.

NDA Government Formation : ‘ఇక్కడ కూర్చుంది పవన్ కాదు.. తుఫాన్’ – మోడీ

కేంద్రంలో మరోసారి విజయడంఖా మోగించిన బిజెపి (BJP)..ఈరోజు ఢిల్లీలో ఎన్డీయే 3.0 కూటమి సమావేశం ఏర్పాటు చేసింది. పాత పార్లమెంటు భవనంలో ఈ సమావేశం జరుగుతుంది.

ఈ సమావేశానికి NDA కూటమి నేతలంతా హాజరయ్యారు. ఈ సందర్బంగా మోడీ (Modi) మాట్లాడుతూ..విజయం సాధించి ఎన్డీయే సమావేశానికి వచ్చిన నేతలకు ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. మీరు నాకు బాధ్యతలు ఇచ్చారంటే మన మధ్య బంధం చాలా బలంగా ఉందని అర్థం అని మోడీ చెప్పుకొచ్చారు. ఎన్డీయే అధికారంలోకి రావడానికి రాత్రింబవళ్లు శ్రమించిన లక్షలాది మంది కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అన్నారు.

‘ఎన్నికల ముందు పొత్తు పెట్టుకున్న కూటమి ఇంతగా ఎప్పుడూ విజయం సాధించలేదు. ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే సంఖ్యాబలం, దేశాన్ని నడపాలంటే సర్వసమ్మతం అవసరం. దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని హామీ ఇస్తున్నా’ అని మోదీ స్పష్టం చేశారు. సౌత్ ఇండియాలో ప్రజలు ఎన్డీఏను అక్కున చేర్చుకున్నారని మోదీ తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలు తక్కువ కాలంలోనే అక్కడి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని చెప్పారు. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏకు బాసటగా నిలిచారని పేర్కొన్నారు. ‘తమిళనాడులో సీట్లు గెలవకున్నా ఎన్డీఏ ఓట్ షేర్ భారీగా పెరిగింది. భవిష్యత్తులో అక్కడ మనం కొత్త చరిత్ర రాయబోతున్నాం’ అని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను మోడీ ప్రత్యేకంగా అభినందించారు. ‘ఇక్కడ కూర్చున్నాడు చూడండి.. ఇతను పవన్ కాదు, తుఫాన్’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలు తమకు పెద్ద ఎత్తున మద్దతిచ్చారని, చంద్రబాబుతో కలిసి చరిత్రాత్మక విజయం సొంతం చేసుకున్నామని వివరించారు.

ఇక ఈ సమావేశంలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ప్రధాని మోడీ వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, శివరాజ్ సింగ్ చౌహాన్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి, కంగనా రనౌత్, చిరాగ్ పాశ్వాన్,చంద్రబాబు నాయుడు, హేమమాలిని, కేశవ్ ప్రసాద్ మౌర్య సహా పలువురు నేతలు భేటీలో ఉన్నారు. సభ ప్రారంభానికి ముందు జేపీ నడ్డా.. రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, చంద్రబాబు సహా పలువురు నేతలకు పూలమాలలు వేసి ఘనస్వాగతం పలికారు.

నారా చంద్రబాబు నాయుడు అనే నేను.. 12న ఉదయం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణం

12న ఉదయం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణం
గన్నవరం శివారు కేసరపల్లి ఐటీ పార్క్‌ సమీపంలో సభ?
ప్రధాని మోదీ, పలువురు సీఎంల రాక నేపథ్యంలో భారీ భద్రత
12 హెలిప్యాడ్‌లు.. లక్షన్నర మందికి సరిపడా ఏర్పాట్లు

సభ ఏర్పాట్లపై చర్చిస్తున్న తేదేపా నేతలు అచ్చెన్నాయుడు, టీడీ జనార్థన్‌ తదితరులు

ఈనాడు-అమరావతి, తాడేపల్లి, గన్నవరం గ్రామీణం న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న ఉదయం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా విజయోత్సవ సభ కూడా నిర్వహించనున్నారు. ప్రధాని మోదీతోపాటు ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కూటమి నేతలు హాజరు కానున్నారు. వేదిక ఎక్కడనేది ఇంకా నిర్ణయించలేదు. పలువురు ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో 12 హెలిప్యాడ్‌లు, గ్యాలరీలు, రవాణా ఏర్పాట్లు చేపట్టాల్సి ఉంటుంది.  సభ నిర్వహణ కోసం గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్, మంగళగిరి ఎయిమ్స్‌ సమీపంలో బ్రహ్మానందపురం ఏసీసీ భూములను అధికారులు, తెదేపా నేతలు పరిశీలించారు. ఐటీ పార్క్‌ వద్ద స్థలాలు అనుకూలంగా ఉన్నాయని, అక్కడైతే 1.5 లక్షల వరకు ప్రజలు వీక్షించేందుకు అవకాశం ఉంటుందని అంచనా వేశారు. ప్రధాని మోదీ సహా వివిధ రాష్ట్రాల నేతలు హాజరు కానున్న నేపథ్యంలో.. భద్రత, రవాణా, ప్రజలకు సౌకర్యాల పరంగా ఐటీ పార్కు సమీపంలోని స్థలాల్లో అయితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. విమానాశ్రయానికి ఎదురుగా చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఎనిమిది ఎకరాల స్థలాన్ని పరిశీలించి.. అక్కడ ముళ్ల కంపలను తొలగించాలని నాయకులకు సూచించారు. చంద్రబాబు తుది నిర్ణయం మేరకు ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు.

ప్రతి విశిష్ఠ అతిథికి ఒక్కో బృందం

చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ శుక్రవారం సాయంత్రం సమీక్షించారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయంలో డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడితోపాటు కృష్ణా జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో చర్చించారు. ‘ప్రధాని మోదీ హాజరవుతున్న నేపథ్యంలో.. భద్రతాపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డీజీపీతో చర్చించాం. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు. ప్రొటోకాల్‌ పరంగా వారికి కల్పించాల్సిన సౌకర్యాలపై ప్రత్యేక బృందాలను ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతి విశిష్ఠ అతిథికి ఒక్కో బృందం ప్రొటోకాల్‌ ఏర్పాట్లు చూస్తుంది’ అని నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ చెప్పారు. ‘గన్నవరం, మంగళగిరి ప్రాంతాల్లో స్థలాలు పరిశీలించాం. కాబోయే ముఖ్యమంత్రి నుంచి నిర్ణయం రాగానే.. యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉంది’ అని తెలిపారు. విజనరీ లీడర్‌గా గుర్తింపు పొందిన చంద్రబాబు వద్ద సీఎస్‌గా పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు.

సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకార ఏర్పాట్లపై తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఉన్నతాధికారులతో
సమావేశమైన తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు. చిత్రంలో సీఎస్‌ నీరభ్‌కుమార్‌ ప్రసాద్, డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా

పరిశీలించిన అచ్చెన్నాయుడు, టీడీ జనార్దన్‌

ప్రమాణ స్వీకార ఏర్పాట్లలో భాగంగా.. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని బ్రహ్మానందపురం ఏసీసీ భూములను అచ్చెన్నాయుడు, టీడీ జనార్దన్‌ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. అధికారులు రూపొందించిన రేఖా చిత్రాన్ని చూశారు. రహదారి మార్గాలపై వివరాలు తెలుసుకున్నారు. ‘హెలిప్యాడ్లు వేదికకు సమీపంలో ఉండాలి. సభా వేదిక, గ్యాలరీలు ఏర్పాటు చేయాలి. కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు చేస్తాం’ అని అచ్చెన్నాయుడు చెప్పారు. అనంతరం గన్నవరం విమానాశ్రయం ఎదురుగా ఉన్న స్థలాన్ని పరిశీలించారు. అక్కడైతే ప్రముఖుల రాకపోకలకు ఇబ్బంది ఉండదని, ఏర్పాట్లు చేయొచ్చని అధికారులు వివరించారు.

 

 

Congress: పట్టభద్రుల ఎమ్మెల్సీ ‘హస్త’గతం

వరంగల్‌- ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి చింతపండు నవీన్‌కుమార్‌ (తీన్మార్‌ మల్లన్న) విజయం సాధించారు. ఎలిమినేషన్‌ ప్రక్రియలో భాగంగా భాజపా బలపరిచిన అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి వచ్చిన రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ముగిసిన అనంతరం.. భారాస మద్దతిచ్చిన రాకేశ్‌రెడ్డి కంటే మల్లన్న 14 వేలకు పైగా ఓట్లతో ముందంజలో ఉండటంతో ఆయన గెలిచారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక రిటర్నింగ్‌ అధికారి దాసరి హరిచందన ఆయనకు గెలుపు ధ్రువీకరణ పత్రం అందించారు. మెజార్టీ పూర్తి వివరాలు శనివారం తెలియనున్నాయి.గత నాలుగుసార్లు భారాస అభ్యర్థులు విజయం సాధించిన ఈ స్థానంలో తాజాగా కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు.

బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు సుదీర్ఘంగా శుక్రవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. మూడు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన ఈ ప్రక్రియలో తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు నుంచి ఎలిమినేషన్‌ ప్రక్రియ వరకు మల్లన్నకు రాకేశ్‌రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. ఎలిమినేషన్‌ ప్రక్రియలో రాకేశ్‌రెడ్డి, మల్లన్న కంటే సుమారు 4 వేల వరకు ఎక్కువ ఓట్లు సాధించినా.. అప్పటికే మొదటి ప్రాధాన్యంలో మల్లన్నకు 18 వేల పైచిలుకు ఆధిక్యం దక్కింది. మల్లన్న గెలుపు ఖరారు కావడంతో కాంగ్రెస్‌ శ్రేణులు, ఆయన అనుచరులు నల్గొండలోని లెక్కింపు కేంద్రం బయట బాణసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేశారు.

20 వేల ఓట్లలో కానరాని ‘రెండో ప్రాధాన్యం’
స్వతంత్ర అభ్యర్థి, నాలుగో స్థానంలో ఓట్లు సాధించిన పాలకూరి అశోక్, భాజపా అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డిలకు కలిపి.. తొలి ప్రాధాన్యం కింద 73,110 ఓట్లు పడగా.. వీటిలో సుమారు 20 వేల బ్యాలెట్‌ పత్రాల్లో ఆ ఓటర్లు రెండో ప్రాధాన్య ఓట్లు వేయలేదు. దీంతో ఈ ఇద్దరు అభ్యర్థుల రెండో ప్రాధాన్య ఓట్లు తనకే వస్తాయని ధీమాగా ఉన్న రాకేశ్‌రెడ్డి ఆ మేరకు ఓట్లు కోల్పోయి.. ఓటమిని అంగీకరించారు. ‘సాంకేతికంగా ఓడినా.. నైతికంగా విజయం నాదే. నియోజకవర్గ పరిధిలో అధికార పార్టీ తరఫున 32 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు మంత్రులున్నా వారి అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చాను. ఓడినా ప్రజల మధ్యనే ఉంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన కేసీఆర్‌కు, ఓటేసిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, పట్టభద్రులందరికీ ధన్యవాదాలు’ అని రాకేశ్‌రెడ్డి అన్నారు.

నాలుగో ప్రయత్నంలో మల్లన్న విజయం
తీన్మార్‌ మల్లన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇది మూడోసారి. ఒకసారి శాసనసభకు కూడా పోటీ చేశారు. తొలిసారి 2015లో పట్టభద్రుల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా.. అనంతరం 2019లో హుజూర్‌నగర్‌ శాసనసభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2021 పట్టభద్రుల ఎన్నికల్లో రెండోసారి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. తాజా ఉప ఎన్నికలో అధికార పార్టీ బలపర్చిన అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఆయన స్వగ్రామం యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్‌.

రామోజీరావు అస్తమయం

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు కన్నుమూశారు.

ఈనాడు, హైదరాబాద్‌: ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు(Ramoji Rao) మృతిచెందారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రిలో తెల్లవారు జామున 3:45నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఈనెల 5న గుండె సమస్యలతో ఆయనకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. దీంతో హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల అనంతరం గుండెకు స్టెంట్ వేశారు. అనంతరం ఐసీయూలో చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్సపొందుతూ తెల్లవారుజామున మృతిచెందారు. ఆయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలిస్తున్నారు.

Vidya kanuka: విద్యాకానుకలో రూ.150 కోట్ల దోపిడీ

టెండర్లు లేకుండానే రూ.772 కోట్ల సామగ్రి సరఫరా బాధ్యతలు
న్యాయ సమీక్ష నుంచి తప్పించుకునేందుకు టెండర్ల విభజన
విద్యార్థుల సంఖ్య కంటే అదనంగా 9.31 లక్షల కిట్లు కొనుగోలు
నాలుగేళ్లుగా మాయ చేసిన వైకాపా ప్రభుత్వం
బ్యాగులు చినిగిపోయినా చర్యల్లేవు
దీనికోసం 5% కమీషన్‌ దండుకున్న ఉత్తరాంధ్రలోని వైకాపా కీలక మంత్రి

వైకాపా ప్రభుత్వంలో విద్యా కానుక పేరుతో రూ.150 కోట్లు కొల్లగొట్టారు. విద్యార్థుల సంఖ్య కంటే అధికంగా కొనుగోలు చేసినట్లు లెక్కలు చూపి సామగ్రి సరఫరా లేకుండానే నిధులు మింగేశారు. ఉత్తరాంధ్రకు చెందిన అప్పటి కీలక మంత్రి, ఆయన పేషీలోని పీఏ, కొందరు అధికారులు భారీగా ప్రజాధనానికి గండికొట్టినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఏడాది విద్యాకానుకకు ఎలాంటి టెండర్లు లేకుండా పాత గుత్తేదార్లకు సరఫరా బాధ్యతలు అప్పగించి, ముందుగానే డబ్బులు దండుకున్నట్లు విమర్శలున్నాయి. వైకాపా ప్రభుత్వంలో మంత్రి కీలకంగా ఉండడంతో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చినా ప్రభుత్వం మౌనంగా ఉండిపోయింది. నాణ్యతలేని బ్యాగ్‌లు సరఫరా చేసినా గుత్తేదార్లపై గానీ, అధికారులపై గానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా ఈ బ్యాగ్‌లను సరఫరా చేసిన గుత్తేదార్లకు టెండర్లు లేకుండానే అప్పగించేశారు. ఏసీబీ లేదా విజిలెన్స్‌ విచారణ జరిపితే భారీగా అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉంది.

కమీషన్ల కోసం టెండర్లు లేకుండానే..
విద్యార్థులకు ఈ ఏడాది అందించే విద్యా కానుక సామగ్రికి టెండర్లు నిర్వహించకుండానే పాత గుత్తేదార్లకు రూ.772 కోట్ల విలువ చేసే కాంట్రాక్టును నామినేషన్‌ పద్ధతిలో కట్టబెట్టారు. కమీషన్ల కోసం పాతవారికే ఇచ్చేశారనే ఆరోపణలున్నాయి. ఈ ఏడాది ఎన్నికలు ఉంటాయని ముందే తెలుసు.. దీనికి అనుగుణంగా టెండర్లు నిర్వహించాలి. కానీ, ఉత్తరాంధ్ర మంత్రి, ఉన్నతాధికారి కలిసి పాత గుత్తేదార్లకు ఎలాంటి టెండర్లు లేకుండా ఇచ్చేశారు. పాఠశాలల్లో 36.54 లక్షల మంది విద్యార్థులు ఉంటే 39.51 లక్షల కిట్లకు ఆర్డర్లు ఇచ్చారు.

మార్కెట్‌లో ధరలు ఎలా ఉన్నాయో ముందే తెలుసుకోవాలి. ధరలు పెరిగితే పాత ధరకు, ధరలు తగ్గితే తగ్గిన ధరకే కాంట్రాక్టు ఇవ్వాలి. కానీ సమగ్ర శిక్షా అభియాన్‌ పట్టించుకోలేదు. పాత ధరల చొప్పున ఇచ్చేశారు.
మార్కెట్‌లో కాగితం ధర తగ్గినా ఒక్కో నోట్‌పుస్తకం రూ.52 చొప్పున పాత ధరకే ఇచ్చేశారు. గతేడాది ఇద్దరు గుత్తేదార్లు నోట్‌ పుస్తకాలను సరఫరా చేశారు. వీరిలో ఒకరు రాయలసీమకు చెందిన వైకాపా సానుభూతిపరుడు. ఈ ఏడాది ఆయనొక్కరికే మొత్తం కాంట్రాక్టును నామినేషన్‌ పద్ధతిపై ఇచ్చేశారు. ఇందుకు ప్రతిఫలంగా ఎన్నికల ముందు కీలక ప్రజాప్రతినిధికి రూ.6 కోట్లు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. నోట్‌పుస్తకాల కాగితం నాణ్యత లేకపోవడంతో ఒక గుత్తేదారును తప్పించినట్లు అధికారులు చెబుతున్నా తెర వెనుక చాలా తతంగం నడిచిందని విమర్శలున్నాయి.
నోట్‌పుస్తకాల్లో కాగితం నాణ్యత లేదని గుత్తేదారును తప్పించిన అధికారులు బ్యాగ్‌ల విషయంలో దీన్ని పాటించలేదు. 2023-24 విద్యా సంవత్సరంలో ప్రకాశం జిల్లాకు సరఫరా చేసిన బ్యాగ్‌లు రెండు, మూడు నెలల్లోనే చినిగిపోయాయి. అయినా ఆ గుత్తేదారుకే ఈ ఏడాది బ్యాగ్‌ల సరఫరా కాంట్రాక్టు అప్పగించారు.
వైకాపా ప్రభుత్వ అస్తవ్యస్త నిర్ణయాలతో ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందని, రూ.కోట్లలో ప్రజాధనం వృథా అయిందని రాష్ట్ర అడిట్‌ విభాగం సైతం 2023లో నిగ్గుతేల్చింది. రూ.100 కోట్లు దాటిన ఏ టెండరునైనా జ్యుడిషియల్‌ ప్రివ్యూకు పంపాలన్నది నిబంధన. విద్యాకానుక టెండర్లను జోన్ల వారీగా విభజించి జ్యుడిషియల్‌ ప్రివ్యూ లేకుండా చేశారు.
విజిలెన్స్‌ తనిఖీల్లో బయటపడినా..
విద్యాకానుక-3లో భాగంగా సరఫరా చేసిన బ్యాగ్‌లు ఇచ్చిన మూడు నెలలకే చినిగిపోయాయి. అధికారుల లెక్కల ప్రకారం 47 లక్షల బ్యాగ్‌లు సరఫరా చేశారు. అందరి బ్యాగ్‌లు చినిగిపోయినా కేవలం 6 లక్షలు మార్పు చేసినట్లు చూపి.. గుత్తేదార్లు, అధికారులపై ఎలాంటి చర్యలు లేకుండా చేశారు. గుత్తేదార్ల నుంచి 5% కమీషన్‌ పిండుకున్న ఉత్తరాంధ్రకు చెందిన వైకాపా మంత్రి ఈ విషయంలో చక్రం తిప్పారు. బ్యాగ్‌ల పరిమాణం, నాణ్యతకు సంబంధించిన టెండర్‌ డాక్యుమెంట్‌ను మార్చేశారు. గుత్తేదారు నమూనాగా ఇచ్చిన బ్యాగ్‌లనూ మాయం చేశారు. బ్యాగ్‌ల నాణ్యతను నిర్ధారించిన సీపెట్‌ అధికారి ఒకరి హస్తం ఇందులో ఉన్నట్లు అప్పట్లో ఆరోపణలొచ్చాయి. విద్యార్థులకు ఇచ్చిన బ్యాగ్‌లు చినిగిపోతే విచారణకు ఆదేశించకుండా ఉత్తరాంధ్ర మంత్రి, కొందరు అధికారులు మరింత ఎక్కువ కమీషన్లు డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో నమూనాగా విజిలెన్స్‌ చేసిన తనిఖీల్లోనూ బ్యాగ్‌లు చినిగిపోయినట్లు బయటపడింది. కానీ వైకాపా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ గుత్తేదారులే కంపెనీల పేర్లు మార్చి, మళ్లీ బ్యాగ్‌లు సరఫరా చేస్తుండటం గమనార్హం.

ఈ దోపిడీకి సమాధానమేదీ?
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య కంటే అదనంగా విద్యాకానుక కిట్లు కొన్నట్లు లెక్కలు చూపి భారీగా ప్రజాధనానికి గండికొట్టారు. ఒక ఏడాది కిట్లు మిగిలితే వాటిని ఆ తర్వాత సంవత్సరం వినియోగించకుండా ఎప్పటికప్పుడు విద్యార్థుల సంఖ్య కంటే అదనంగా కొంటూనే వచ్చారు. మూడేళ్లలో 9,31,166 లక్షల కిట్లు అదనంగా కొనుగోలు చేశారు. ఒక్కో కిట్టుకు సరాసరిన రూ.1600 చొప్పున లెక్కించినా రూ.149 కోట్ల అవినీతి చోటుచేసుకుంది. ఇక మార్కెట్‌ ధరలు, టెండర్లలో నిర్ణయించిన ధరలను పోల్చి చూస్తే ఆ మొత్తం మరింత పెరుగుతుంది.

2021 అక్టోబరులో ప్రభుత్వ పాఠశాలల్లో 45.60 లక్షల మంది విద్యార్థులున్నట్లు లెక్కలు చూపారు. ఈ సంఖ్యపై 5% పెరుగుదలతో 2022-23 సంవత్సరానికి 47.88 లక్షల కిట్లు కొనేందుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. 45.14 లక్షల కిట్లకు టెండర్లు పిలిచారు. ఒక్కో కిట్టుకు రూ.1,565 చొప్పున ధర ఖరారు చేస్తూ రూ.960.48 కోట్లను అంచనా వ్యయంగా నిర్ణయించారు. విద్యార్థుల సంఖ్య 40.66 లక్షలకు పడిపోవడంతో నాలుగు లక్షలకు పైగా కిట్లు మిగిలిపోయాయి. వీటిని ఆ తర్వాత సంవత్సరం సైతం వినియోగించలేదు. వీటి విలువ రూ.70.13 కోట్లు.
2023-24 విద్యా సంవత్సరానికి కొత్త టెండర్లు పిలిచేటప్పుడు అంతకు ముందు ఏడాదిలో మిగిలిపోయిన నాలుగు లక్షల కిట్ల విషయాన్ని పట్టించుకోలేదు. ఈసారి కూడా విద్యార్థుల వాస్తవ సంఖ్యను పరిగణనలోకి తీసుకోకుండా మరోసారి అంచనాలకు మించి 43.10 లక్షల కిట్లకు టెండర్లు పిలిచారు. సరఫరా 39.98 లక్షలే తీసుకున్నామని అధికారులు అప్పట్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష సందర్భంగా విద్యా శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారమే ప్రభుత్వ బడుల్లో 36,54,539 మంది మాత్రమే ఉన్నారు. ఈ లెక్కన 3.43 లక్షల కిట్లు మిగలాలి. వీటికీ ఇంతవరకు లెక్కల్లేవు. 2022-23, 2023-24 రెండేళ్లలోనే 7 లక్షలకు పైగా కిట్లు మిగలాలి. గుత్తేదార్ల నుంచి సామగ్రి తీసుకోకుండానే కమీషన్ల కోసం అదనంగా చెల్లించినట్లు ఆరోపణలున్నాయి.

AP CID: బెవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై సీఐడీ కేసు

హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సోదాలు
కీలకపత్రాలు, దస్త్రాలు, కంప్యూటర్‌ పరికరాలు చోరీ చేశారంటూ ఫిర్యాదు
ఆధారాల ధ్వంసం, నేరపూరిత కుట్ర, చోరీ అభియోగాలపై కేసు

ఈనాడు-అమరావతి, హైదరాబాద్‌: జగన్‌ ప్రభుత్వ పెద్దలు, వైకాపా ముఖ్యనాయకులు సూత్రధారులుగా గత ఐదేళ్లుగా కొనసాగించిన మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారి అనే అభియోగాలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ మాజీ ఎండీ, ఐఆర్‌టీఎస్‌ అధికారి డి.వాసుదేవరెడ్డిపై సీఐడీ కేసు నమోదుచేసింది. ఏపీఎస్‌బీసీఎల్‌ ప్రధాన కార్యాలయం నుంచి దస్త్రాలు, కంప్యూటర్‌ పరికరాలు, ఇతర పత్రాలను వాసుదేవరెడ్డి ఈ నెల 6న కారులో తరలిస్తుండగా చూశానంటూ.. కంచికచర్ల వాసి గద్దె శివకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుపై ఈ కేసు పెట్టింది. విలువైన ఆధారాలు, వస్తువుల ధ్వంసం, చోరీ, నేరపూరిత కుట్ర తదితర అభియోగాలపై ఐపీసీ 427, 379 రెడ్‌విత్‌ 120బీ సెక్షన్ల కింద కేసు పెట్టింది. గురువారం రాత్రి ఈ కేసు నమోదు కాగా… శుక్రవారం ఉదయమే విజయవాడ నుంచి సీఐడీ బృందాలు హైదరాబాద్‌లోని వాసుదేవరెడ్డి నివాసానికి వెళ్లి రోజంతా సోదాలు చేశాయి. వైకాపా హయాంలో ప్రభుత్వ పెద్దలు, వైకాపా నాయకులు, వారి సన్నిహితులు కలిసి… మద్యం తయారీ, కొనుగోలు, సరఫరా, విక్రయాలన్నీ గుత్తాధిపత్యంలో ఉంచుకుని భారీ ఎత్తున దోచుకున్నారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరుగుతున్న తరుణంలో ఆ దోపిడీ, కుంభకోణానికి సంబంధించిన కీలక ఆధారాల్ని, పత్రాల్ని, హార్డ్‌డిస్క్‌లను మాయం చేసేందుకు వాసుదేవరెడ్డి ప్రయత్నాలు చేసినట్లు సీఐడీ గుర్తించింది.

ప్రశ్నిస్తే హడావుడిగా పారిపోయారు..
‘‘ఈ నెల 6న విజయవాడ ప్రసాదంపాడులోని సాయివిహార్‌ అపార్ట్‌మెంట్స్‌లో ఉన్న ఏపీఎస్‌బీసీఎల్‌ కార్యాలయం నుంచి ఓ వ్యక్తి కొన్ని దస్త్రాలు, కంప్యూటర్‌ పరికరాలు, పత్రాల్ని తీసుకొచ్చి ‘ఏపీ39 ఎన్‌క్యూ 6666’ నంబరు వాహనంలో లోడింగ్‌ చేయడం చూశాను. రాష్ట్రంలో అధికారమార్పిడి జరుగుతున్న తరుణంలో కీలక పత్రాల్ని మాయం, ధ్వంసం చేసేందుకు వాటిని దొంగతనంగా తరలిస్తున్నట్లు అక్కడ పరిస్థితులను బట్టి నాకు అనుమానం కలిగింది. ఆ పత్రాలను దొంగిలించి తీసుకెళ్తున్న వ్యక్తిని ప్రశ్నించగా.. సమాధానం ఇవ్వకుండా హడావుడిగా కారు డ్రైవ్‌ చేసుకుంటూ అక్కడి నుంచి పారిపోయారు. తర్వాత స్థానికుల్ని ఆరాతీస్తే కారులో పత్రాల్ని తీసుకెళ్లి పారిపోయిన వ్యక్తి ఏపీఎస్‌బీసీఎల్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అని తెలిసింది. దీనిపై తొలుత నున్న పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశా. కానీ వారు ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయాలి’’ అంటూ గద్దె శివకృష్ణ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదుచేసిన సీఐడీ ఉన్నతాధికారులు.. సమగ్ర దర్యాప్తు జరిపి 15 రోజుల్లోగా ప్రాథమిక నివేదిక అందజేయాలని కర్నూలు సీఐడీ డీఎస్పీ పి.శ్రీనివాసులును ఆదేశించారు.

హైదరాబాద్‌లోని నివాసంలో విస్తృత సోదాలు
హైదరాబాద్‌ నానక్‌రాంగూడలోని మైస్కేప్‌ కోర్ట్‌యార్డ్‌ గేటెడ్‌ కమ్యూనిటీలో 41వ నంబరు విల్లాలో నివసిస్తున్న వాసుదేవరెడ్డి ఇంటికి శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలోనే సీఐడీ అధికారులు చేరుకున్నారు. డీఎస్పీ నేతృత్వంలో మూడు వాహనాల్లో వచ్చిన బృందాలు.. తొలుత నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు చేరాయి. అక్కడి నుంచి నలుగురు పోలీసులను వెంట తీసుకొని వాసుదేవరెడ్డి ఉంటున్న విల్లాకు చేరుకున్నాయి. ఆ సమయంలో వాసుదేవరెడ్డి ఇంట్లోనే ఉండడంతో ఆయనను సుదీర్ఘంగా విచారించారు. ఆయన ఇంటినుంచి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రాత్రి పొద్దుపోయేవరకూ సోదాలు, విచారణ కొనసాగాయి.

వైకాపా నేత విల్లాలో నివాసం?
వాసుదేవరెడ్డి నివసిస్తున్న విల్లా సైతం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైకాపా నేతదేనని సమాచారం. కర్నూలు జిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి ఇటీవలి ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీచేసిన అభ్యర్థికి చెందిన విల్లాలోనే వాసుదేవరెడ్డి ఉంటున్నట్లు అక్కడి సిబ్బంది మీడియాకు వెల్లడించారు. అయితే ఆయన అద్దెకు ఉంటున్నారా.. కొన్నారా అనే అంశంపై స్పష్టత లేదు. ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా నేతలతో అంటకాగిన వాసుదేవరెడ్డిపై ఏప్రిల్‌లో ఎన్నికల సంఘం వేటు వేసిన సంగతి తెలిసిందే.

Andhra Pradesh: సీఎంవోలోని ముగ్గురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ

Andhra Pradesh: సీఎంవోలోని ముగ్గురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ

Andhra Pradesh: సీఎం పేషీలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. పూనం మాలకొండయ్య, రేవు ముత్యాల రాజు, నారాయణ్ భరత్ గుప్తాలను ప్రభుత్వం బదిలీ చేసింది. వారికి జీఏడీకి రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో సీఎస్ పేర్కొన్నారు. మరోపైపు నూతన సీఎస్‌గా నియామకమైన నీరభ్‌కుమార్ ప్రసాద్‌ సెక్రటేరియట్‌లోని మొదటి బ్లాక్‌లో బాధ్యతలు చేపట్టారు. సహచర అధికారులు సిబ్బందితో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని సీఎస్ వెల్లడించారు.. ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా తన పని ఉంటుంది.. మంచి చేసేలా కృషి చేస్తానని అన్నారు.. అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా అమలుకు కృషి చేస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానన్నారు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌.

కాగా, ఏపీ కేడర్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ను సీఎస్‌గా నియమించింది ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.. ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డిని బదిలీ చేసినట్టు పేర్కొంది ప్రభుత్వం.. 1987 బ్యాచ్‌కు చెందిన నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌.. ప్రస్తుతం ఏపీ పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతికశాఖ స్పెషల్‌ సీఎస్‌గా పనిచేస్తుండగా.. ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.. అయితే, తన ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహణ జవహర్ రెడ్డి చేతుల మీద జరపడానికి చంద్రబాబు విముఖతతో ఉన్నారని.. అందుకే ఈ పరిణామం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది.. మరోవైపు.. జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లినా.. తాజా ఉత్తర్వుల్లో బదిలీ చేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది..

AP Weather: ఏపీ ప్రజలకు అలెర్ట్.. పిడుగులతో కూడిన వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్

రుతుపవనాల ఉత్తర పరిమితి ఇప్పుడు రత్నగిరి, షోలాపూర్, మెదక్, భద్రాచలం, విజయనగరం, ఇస్లాంపూర్ గుండా కొనసాగుతుంది. రానున్న 3-4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి, మహారాష్ట్రలోని మరికొన్ని భాగాలు (ముంబయితో సహా), తెలంగాణ, కోస్తా ఆంధ్ర ప్రదేశ్ లోని మిగిలిన భాగాలు, దక్షిణ ఛత్తీస్‌గఢ్ & దక్షిణ ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య బంగాళాఖాతములోని మరిన్ని ప్రాంతాలు, వాయువ్య బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలలోకి వ్యాపించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇక ఉత్తర రాయలసీమ & పరిసర ప్రాంతాలపై గల సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఉన్న ఉపరితల అవర్తనము ఇప్పుడు దక్షిణ తెలంగాణ & పొరుగు ప్రాంతం పై కొనసాగుతున్నది. సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ & 5.8 కి.మీ మధ్యగల గాలి కోత ఇప్పుడు దాదాపు 16°N వెంబడి నడుస్తుంది. ఈ క్రమంలో రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

————————————

శుక్రవారం, శనివారం, ఆదివారం :-తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 – 40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

——————————–

శుక్రవారం :- తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 – 40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది.

శనివారం, ఆదివారం :- తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 – 40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది .

రాయలసీమ :-

—————-

శుక్రవారం :- తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 – 40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది.

శనివారం, ఆదివారం :- తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 – 40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది.

టీచర్ల బదిలీలపై నిరాధార ఆరోపణలు- ఖండించిన బొత్స సత్యనారాయణ!

పత్రికా ప్రకటన

టీచర్ల బదిలీలపై నిరాధార ఆరోపణలు- ఖండించిన బొత్స సత్యనారాయణ!

కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోడానికి వీలుగా
బదిలీలు నిలిపివేయాలని అధికారులకు నేనే విజ్ఞప్తి చేశా.

పత్రికా ప్రకటనలో బొత్స సత్యనారాయణ స్పష్టీకరణ

విజయనగరం, జూన్ 7

రాష్ట్రంలోని పాఠశాల విద్యా శాఖ పరిధిలో గతంలో జరిగిన ఉపాధ్యాయుల బదిలీల నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయం, దరిమిలా దానిపై ఆరోపణలతో పత్రికలు వార్తాంశాలు ప్రచురించాయి. నాపై వ్యక్తిగతమైన ఆరోపణలు చేస్తూ ప్రచురితమైన వార్తాంశాలు పూర్తిగా అవాస్తవం, అభూత కల్పనలతో నా వ్యక్తిత్వ హననానికి చేస్తున్న ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఎన్నికలకు ముందు నుంచీ కూడా ఇవే ఆరోపణలతో అనేక సార్లు వార్తలు ప్రచురించగా, అప్పుడే ఖండించిన విషయాలను మీకు గుర్తు చేస్తున్నాను.ఇప్పుడు మరోసారి ఖండిస్తున్నాను, గర్హిస్తున్నాను.
కొంత మంది ఉపాధ్యాయులు తమ ఆరోగ్య, కుటుంబ ఇతరత్రా ఇబ్బందులు, వివిధ వ్యక్తిగత సమస్యల రీత్యా బదిలీలు కోరుకుంటూ ఆర్జీ పెట్టుకోవడం జరిగింది. వాటిని పూర్తి పారదర్శకంగా పరిశీలించి క్షేత్ర స్థాయి నుంచి నివేదికలు తెప్పించుకున్న తరువాతనే అప్పట్లో నిర్ణయం తీసుకోవడమైనది.
ఈ నేపథ్యంలో ఫలితాలు వెలువడిన వెంటనే ఈ బదిలీలు నిలిపేయాల్సిందిగా సంబంధిత అధికారులను నేనే స్వయంగా కోరడం జరిగింది. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం వస్తున్న నేపథ్యంలో ఈ విషయంలో వారు తమకు నచ్చిన నిర్ణయం తీసుకోవచ్చు. బదిలీల కోసం అర్జీచేసుకున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిగణలోకి తీసుకుంటారా? లేదా? అన్నది కొత్త ప్రభుత్వం ఇష్టం. వాస్తవాలు ఇలా ఉంటే బదిలీలకోసం లంచాలు తీసుకున్నారంటూ తప్పుడు ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాంటి తప్పుడు పనులు చేయాల్సిన అగత్యం, అవసరం మాకు లేవు.

బొత్స సత్యనారాయణ
మాజీ మంత్రివర్యులు

Issued by O/o the Ex. Minister for Education

Aadhar: ఆధార్‌ కార్డ్‌ హోల్డర్లకు మిగిలింది మరో వారమే – గడువు దాటితే జేబుకు చిల్లు!

Update Aadhaar Details Free By Online: ఆధార్ కార్డ్లో అన్ని వివరాలను అప్డేట్ చేయడానికి, ఏవైనా తప్పులు ఉంటే సవరించడానికి ఇప్పుడు ‘ఫ్రీ ఆఫర్’ (Update Aadhaar Details For Free) నడుస్తోంది.

ఒకవేళ మీరు ఇల్లు మారితే ఆధార్లో అడ్రస్ ఛేంజ్ చేయడం దగ్గర నుంచి.. ఆధార్ కార్డ్పై ఉన్న పేరులో స్పెల్లింగ్ మిస్టేక్స్, పుట్టిన తేదీలో తప్పులు వంటి వాటిని సరిచేయడం వరకు అన్నీ ఇప్పుడు పూర్తి ఉచితం. అయితే, ఈ ఫ్రీ ఆఫర్కు మరికొన్ని రోజులే గడువు ఉంది.

ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువు

ఆధార్ వివరాలను ఉచితంగా మార్చుకునేందుకు ఉడాయ్ (UIDAI) ఈ నెల (జూన్ 2024) 14వ తేదీతో వరకే సమయం ఇచ్చింది. జూన్ 15వ తేదీ నుంచి ఫ్రీ ఆఫర్ వర్తించదు, ఆధార్ కార్డ్లో ఏవైనా మార్పులు చేయాలంటే డబ్బులు చెల్లించాల్సి వస్తుంది.

‘నా ఆధార్ కార్డ్లో అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయి, ఎలాంటి అప్డేషన్స్ అవసరం లేదు’ అని అనుకోవడానికి లేదు. మీ ఆధార్ కార్డ్ తీసుకుని పది సంవత్సరాలు దాటితే, గత పదేళ్లుగా ఆధార్ వివరాల్లో మీరు ఎలాంటి మార్పులు చేయకపోతే ఇప్పుడు ఆధార్ కార్డ్ను అప్డేట్ చేయాలి. ఒకవేళ, మీరు ఆధార్ కార్డ్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు వివరాల్లో ఒక్క మార్పు కూడా లేకపోయినప్పటికీ, అవే వివరాలతో మరోమారు అప్డేట్ చేయాలి. అయితే, ఇది నిర్బంధమేమీ కాదు, ఐచ్చికం. ఎలాగూ ఫ్రీ ఆఫర్ నడుస్తోంది కాబట్టి, ఒకసారి ఆధార్ను అప్డేట్ చేస్తే ఓ పనైపోతుంది.

ఇంటి అడ్రస్ సహా ఆధార్ వివరాలను జూన్ 14వ తేదీ వరకు (Last Date For Update Aadhaar Details) ఉచితంగా అప్డేట్ చేయవచ్చు. ఆన్లైన్ ద్వారా అప్డేట్ చేసే వాళ్లకే ఈ అవకాశం. ఆఫ్లైన్లో, అంటే ఆధార్ కేంద్రం/CSCకి వెళ్లి అడ్రస్ ఆధార్ సమాచారాన్ని అప్డేట్ చేయాలంటే దానికి కొంత ఛార్జీ చెల్లించాలి.

ఆధార్ కార్డ్లో అడ్రస్ వివరాలను ఫ్రీగా ఎలా అప్డేట్ చేయాలి? (How Update Address in Aadhaar Card For Free?)

మీరు ఇటీవలే ఇల్లు మారితే, కొత్త అడ్రస్ను మీ ఆధార్ వివరాల్లో అప్డేట్ చేయాలనుకుంటే అది చాలా చిన్న విషయం. మీ దగ్గర అడ్రస్ ప్రూఫ్ ఉంటే చాలు. ఈ నెల 14వ తేదీ లోపు, పూర్తి ఉచితంగా ఈ పని పూర్తి చేయొచ్చు. ఆధార్లో అడ్రస్ అప్డేట్ చేయడానికి… మీ ఆధార్ నంబర్, ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్, స్కాన్ చేసిన అడ్రస్ ప్రూఫ్ దగ్గర పెట్టుకోవాలి.

ఆధార్ కార్డ్లో అడ్రస్ వివరాలు మార్చడం:

myaadhaar.uidai.gov.in లింక్ ద్వారా ఆధార్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లండి
మీ ఆధార్ నంబర్ను సంబంధింత గడిలో పూరించండి
మీ ఆధార్తో లింక్ అయిన ఫోన్ నంబర్కు వచ్చే OTPని కూడా పూరించి, లాగిన్ అవ్వండి
మీ పేరు/ జెండర్/ పుట్టిన తేదీ, చిరునామాలో ఒక ఆప్షన్ ఎంచుకోండి
‘అప్డేట్ ఆధార్’ ఆప్షన్ ఎంచుకోండి
ఇంటి చిరునామా లేదా ఇతర సమాచారాన్ని అప్డేట్ చేయడానికి అక్కడ కనిపించే ఆప్షన్పై క్లిక్ చేయండి
స్కాన్ చేసిన ప్రూఫ్ కాపీలను అప్లోడ్ చేసి, డెమోగ్రాఫిక్ డేటాను (Demographic data) అప్డేట్ చేయండి

ఇప్పుడు మీకు ఒక్ అక్నాలెడ్జ్మెంట్ నంబర్ (URN) వస్తుంది. ఇది మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు, రిజిస్టర్డ్ ఈ-మెయిల్ అడ్రస్కు వస్తుంది. ఆధార్ అప్డేషన్ స్టేటస్ (Aadhaar Updation Status) చెక్ చేయడానికి URN ఉపయోగపడుతుంది. ఆధార్ అప్డేట్ చేసిన రెండు, మూడు రోజుల తర్వాత https://ssup.uidai.gov.in/checkSSUPStatus/checkupdatestatus లింక్ ద్వారా ఉడాయ్ పోర్టల్లోకి వెళ్లి, మీ ఆధార్ కార్డ్ అప్డేషన్ స్టేటస్తనిఖీ చేయవచ్చు.

ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు

ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు

హైదరాబాద్‌: ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో ఉదయం నుంచి వివిధ పత్రాలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. జగన్‌ హయాంలో మద్యం దోపిడీ పర్వాన్ని వాసుదేవరెడ్డి ముందుండి నడిపించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. వైకాపా అధికారంలో ఉన్న సమయంలో కరడుగట్టిన మద్దతుదారుగా పనిచేశారు. నూతన మద్యం విధానం పేరుతో ఆ పార్టీకి అనుచిత లబ్ధి చేకూరేలా భారీ ఎత్తున మద్యం సరఫరా చేశారని ఫిర్యాదులు అందాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో జే బ్రాండ్ తీసుకురావడంలో వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించారు. దీనిపై ఫిర్యాదుల నేపథ్యంలోనే సీఐడీ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.

 

Live Tv and News papers, epapers, News websites links

Live Tv and News papers, epapers, News websites links

First Session of XVI Andhra Pradesh Legislative Assembly Day 01 on 21-06-2024

1)    ABN live

2 ) ETV Andhra Pradesh

3) TV5 Live

4) TV9 Live

5 ) Sakshi Live

6 ) Ntv Live

NDTV Live

S.NO Telugu News website Epaper
1 Eenadu Epaper
2 Andhra Jyothi Epaper
3 Sakshi Epaper
4 Andhra Bhoomi Epaper
5 Andhra Prabha Epaper
6 Praja sakthi Epaper
7 Visalaandhra Epaper
8 Vaartha Epaper
9 Suryaa Epaper
10 Namasthe Telangana Epaper
11 V6 – Velugu Epaper
12 ManaTelangana Epaper
13 NavaTelangana Epaper
14 AadabHyderabad Epaper
15 Janam sakshi Epaper
16 manam Epaper

 

 

 

Eye Care: మీరు కళ్లజోడు వాడుతుంటారా? ఈ 5 టిప్స్ పాటిస్తే చాలు.. కళ్లజోడు అవసరమే ఉండదు..!

కళ్లజోడు చాలామంది లైఫ్ స్టైల్ లో భాగం అయిపోయింది. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్ లు, కంప్యూటర్లు, టీవీల ముందు గంటలు గంటలు గడపడం వల్ల ఇప్పట్లో చిన్న పిల్లలకు కూడా దృష్టి లోపం సమస్యలు వచ్చి కళ్ల జోడు వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కళ్లు మంట, కంటి చూపు తగ్గడం, కళ్లలో నీరు కారడం, కళ్లు పొడి బారడం వంటి సమస్యలు చాలామంది ఎదుర్కొంటున్నారు. అయితే ఈ కింది టిప్స్ ఫాలో అయితే కంటి చూపు మెరుగు పడటమే కాకుండా కళ్ల జోడు పెట్టుకునే అవసరం ఉండదు. కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరిచే ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటే..

కళ్లు ఆర్పడం..

ల్యాప్టాప్, మొబైల్, టీవి, కంప్యూటర్ ఇలా ఏదైనా సరే.. స్క్రీన్ వైపు తదేకంగా చూడకూడదు. అప్పుడప్పుడు కనురెప్పలు ఆర్పుతూ ఉండాలి. కనీసం 2 సెకెన్ల పాటూ కళ్లు మూసుకుని ఆ తరువాత తెరవాలి. 5 సెకెన్ల పాటూ కనురెప్పలు మూయడం, తీయడం వేగంగా చేయాలి. ఇలా కనీసం రోజులో 5 నుండి 7 సార్లు చేస్తుంటే కంటి అలసట తొలగిపోయి కంటి ఆరోగ్యం మెరుగవుతుంది.

వృత్తాకారం
కళ్లను వృత్తాకారంగా సవ్య దిశలోనూ, అపసవ్య దిశలోనూ తిప్పడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది. రోజుకు రెండుసార్లు ఈ వ్యాయామం చేయకూడదు.

పామింగ్..

కంటిచూపు మెరుగు పరచడానికి పామింగ్ చక్కగా సహాయపడుతుంది. రెండు అరచేతులను కలిపి బాగా రుద్దాలి. అప్పుడు అరచేతులలో మంట పుడుతుంది. కొన్ని సెకెన్ల పాటూ ఈ వెచ్చని అరచేతులను కళ్లమీద ఉంచాలి. ఇలా రోజులో 5 నుండి 7 సార్లు చేస్తే కంటిచూపు మెరుగవుతుంది.

కళ్లను కడగాలి..

కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే కళ్ల మీద కాస్త గట్టిగా నీటిని చల్లుకోవాలి. రోజులో కనీసం 15 నుండి 20 సార్లు ఇలా నీటిని చల్లుకుంటే మంచిది. సూర్యదయానికంటే ముందు ఇలా చేయడం వల్ల చాలామేలు జరుగుతుంది.

ఆహారం..

కంటి చూపు మెరుగవ్వడానికి ఆహారం చాలా ముఖ్యం. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విటమిన్-ఎ, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు, జింక్, విటమిన్-సి, ఇ వంటి పోషకాలు తీసుకోవాలి

AP News: స్పీకర్ రేసులో ఉన్నది వీరే..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన కొలువుదీరనుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ రోజే కొందరు మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. స్పీకర్ పదవిపై మాత్రం సస్పెన్స్ వీడటం లేదు. స్పీకర్ పోస్ట్ కోసం ముగ్గురు, నలుగురు పోటీ పడుతున్నారు.

ముగ్గురు పోటీ..?

స్పీకర్ పదవి కోసం పోటీ పడుతున్న వారిలో ప్రముఖంగా వినిపిస్తోన్న పేరు రఘురామ కృష్ణరాజు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో నరసాపురం నుంచి పోటీ చేసి గెలుపొందిన సంగతి తెలిసిందే. తొలి నుంచి వైసీపీ, జగన్ లక్ష్యంగా విమర్శలు చేయడంతో టార్గెట్ అయ్యారు. అందుకోసమే నాలుగున్నరేళ్లు ఢిల్లీలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అక్రమ కేసు బనాయించి రఘురామను వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేయించింది. ఆ తర్వాత టీడీపీలో చేరి, ఉండి నుంచి పోటీ చేసి, గెలుపొందారు. తనకు స్పీకర్ పదవి కావాలని టీడీపీ అధినేత చంద్రబాబును రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.

కళా వెంకట్రావు

రఘురామ తర్వాత ప్రముఖంగా వినిపిస్తోన్న పేరు కళా వెంకట్రావు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సారి చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణను మట్టి కరిపించారు. తనకు స్పీకర్ పదవి కావాలని కళా వెంకట్రావ్ అడుగుతున్నారని తెలిసింది.

ఆనం రాం నారాయణ రెడ్డి

కళా వెంకట్రావు తర్వాత మరొకరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సీనియర్ నేత ఆనం రాం నారాయణ రెడ్డి స్పీకర్ పదవిని ఆశీస్తున్నారు. ఆత్మకూరు నుంచి పోటీ చేసిన రాం నారాయణ రెడ్డి మేకపాటి విక్రమ్ రెడ్డిపై 7 వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. స్పీకర్ పదవి చేపట్టాలని ఆసక్తితో ఉన్నారు. ఇదే విషయం చంద్రబాబుతో చెప్పారని తెలిసింది. వీరేకాక మరో ఇద్దరు, ముగ్గురు కూడా స్పీకర్ పోస్ట్ కోసం పట్టు బడుతున్నారు.

AP CS: ఏపీ కొత్త సీఎస్‌గా నీరభ్ కుమార్

అమరాతి: ఏపీలో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించిన తర్వాత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీకి చెందిన నేతలు ప్రభుత్వ పదవుల నుంచి తప్పుకుంటున్నారు. మరోవైపు అధికారుల మార్పులు కూడా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఏపీ కొత్త సీఎస్‌గా నీరభ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు జీఏడీ పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్ జీవో జారీ చేశారు. నీరభ్ కుమార్ ప్రస్తాద్ ఇప్పటివరకు అటవీ, పర్యావరణ, సైన్స్ వంటి శాఖలకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వ్యవహరించారు. కాగా ఈయన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.

అరుణాచల గిరిప్రదక్షిణలో 44 ఎనర్జీ పాయింట్స్ – అవి ఏవి వాటి విశిష్టత ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Arunachalam Giri Pradakshina: శివం పంచభూతాత్మకం..పంచభూతాల స్వరూపుడైన శివుడు లింగరూపంలో వెలసిన 5 ప్రదేశాలే పంచభూతలింగాలు. వాటిలో ఒకటి అరుణాచలం.

ఇక్కడ విశిష్టత ఏంటంటే దేవుడు కొండపై కాదు కొండే దేవుడిగా వెలసిన క్షేత్రం ఇది. ఇక్కడ శంకరుడు అగ్నిలింగంగా కొలువయ్యాడు. అగ్నితత్వానికి నిదర్శనంగా అరుణాచలం కొండ ఎర్రగా కనిపిస్తుంది. ఈ క్షేత్రంలో గిరిప్రదిక్షిణ చేస్తే సాక్షాత్తూ పరమేశ్వరుడి చుట్టూ తిరిగినట్టే. అయితే ప్రదక్షిణ అంటే కొండచుట్టూ తిరిగేయడం కాదు…ఈ మార్గంలో చాలా ఆలయాలు, తీర్థాలు ఉన్నాయి. వాటిలో 44 ప్రధానమైన ప్రదేశాలున్నాయి. వీటినే 44 ఎనర్జీ పాయింట్లు అంటారు. ఇవన్నీ చూసుకుంటూ గిరిప్రదక్షిణ చేస్తే అద్భుతమైన ఫలితం పొందుతారు. 44 ఎనర్జీ పాయింట్లలో అష్టదిక్పాలకులు అధిపతులుగా 8 శివలింగాలు.. 8 నందులు ఉన్నాయి. ఇంతకీ అరుణాచలం గిరిప్రదక్షిణ ఎక్కడ ప్రారంభించాలి .. ఎలా సాగాలి… మార్గ మధ్యలో ఏం దర్శించుకోవాలి ఈ వివరాలన్నీఈ కథనంలో తెలుసుకుందాం…

ఆలయ ప్రధాన గోపురం రెండో ప్రాకారంలో బ్రహ్మతీర్థం నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభించాలి…గోపురం కింద శక్తి గణపతిని దర్శించుకుని బ్రహ్మతీర్థంలో నీళ్లు తలపై చల్లుకుని…బ్రహ్మలింగానికి నమస్కరించాక ప్రదక్షిణ మొదలవుతుంది…

మొత్తం 44 ఎనర్జీ పాయింట్లు దాటుకుని గమ్యానికి చేరుకోవాలి… ఇవే అవి…

1. బ్రహ్మలింగం – గిరి ప్రదిక్షిణ ప్రారంభించాల్సిన ప్రదేశం ఇది…

2. ఇంద్ర లింగం – ఇంద్రుడు ప్రతిష్టించిన శివలింగం , దీనికి శుక్రుడు – సూర్యుడు అధిదేవతలు. ఈ లింగాన్ని దర్శించుకుంటే కెరీర్ కి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి..

3. అగ్నిలింగం – అగ్ని తీర్థం – అరుణగిరి చుట్టూ మొత్తం 8 శివలింగాలున్నాయి..వాటిలో ఏడు రోడ్డుకి ఎడమవైపు ఉంటే అగ్నిలింగం కుడివైపు ఉంటుంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే కష్టకాలంలో ప్రమాదాల నుంచి గట్టెక్కిస్తాడు

4. శేషాద్రి స్వామి – ఈయన కామాక్షి అమ్మవారి స్వరూపంతో జన్మించారని చెబుతారు. అవధూత స్వరూపంలో భక్తులను అనుగ్రహించేవారు.

5. దక్షిణా మూర్తి – ఇది చాలా పురాతనమైన, శక్తివంతమైన ఆలయం…దాదాపు 1500 ఏళ్ల క్రితం నుంచి ఈ ఆలయం ఉంది.

6. రమణాశ్రమం – ఇక్కడ రమణమహర్షి తల్లి సమాధి ఉంటుంది..దానికి నమస్కరించుకుని రమణాశ్రమంలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి

7. మీనాక్షీ, సుందరేశ్వరుడు, గణేశ ఆలయాలు – పార్వతీ పరమేశ్వరుల శక్తి ఇక్కడుందని భక్తుల విశ్వాసం

8.ద్రౌపది ఆలయం – ఇక్కడ నుంచి గిరి దర్శనం అద్భుతంగా ఉంటుంది…జీవితంలో ఎదురుదెబ్బలు తిని విసిగిపోయినవారికి మానసిక స్థైర్యాన్నిస్తుంది ఈ ఆలయం

9.యమలింగం – యముడు పూజించిన ఈ శివలింగాన్ని దర్శించుకుంటే అకాలమృత్యువు దరిచేరదు. మృత్యుభయం తొలగిపోతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

10. పృథ్విలింగం – అరుణాచలం గిరిచుట్టూ ఉన్న 8 శివలింగాల్లో ఇదొకటి…

11. వాలమూరి గణపతి – తొండం కుడివైపు తిరిగిఉండే ఈ గణపయ్యను దర్శించుకుంటే అదృష్టం వరిస్తుంది

12. దూర్వాస ఆలయం – ఇక్కడ దూర్వాసుడిని కుంతీ దేవి ప్రతిష్టించిందని చెబుతారు – ఇక్కడున్న వేపచెట్టుకి పసుపుదారాలు కడితే సంతాన భాగ్యం కలుగుతుందని…రాళ్లు పేరిస్తే ఇల్లు కట్టుకుంటారని భక్తుల విశ్వాసం.

13. కాట్టు శివాశ్రమం – అటవీ అధికారుల అధీనంలో ఉండే ఈ ప్రదేశానికి వెళ్లాలంటే అనుమతులు తీసుకోవాలి. గిరి ప్రదక్షిణలో భాగంగా ఈ ఆశ్రమాన్ని రోడ్డుపైనుంచి దర్శనం చేసుకుని వెళ్లిపోవచ్చు..

14. అప్పు నంది – పంచభూతాలకు సంబంధించిన నందుల్లో ఇది జలసంబంధ నంది…వివాదాలను సమసిపోయేలా చేసి బంధాలను వృద్ధి చేస్తుంది ఈ నంది దర్శనం

15. తేయునంది – ఈ నందినుంచి చూస్తే గిరి చతుర్ముఖ దర్శనం ఉంటుంది…బ్రహ్మదేవుడు జీవుల సృష్టికి కావాల్సిన జ్ఞానం ఇక్కడి నుంచి పొందారని చెబుతారు.అందుకే ఇక్కడి నుంచి బహ్మదేవుడిలా కనిపిస్తుంది గిరి

16. శోణ తీర్థం – ఇక్కడ రెండు నందులుంటాయి. ఇక్కడున్న వినాయకుడిని జ్యోతి వినాయకుడు అంటారు..రమణమహర్షి గిరిప్రదిక్షిణ చేసేటప్పుడు సేదతీరిన ప్రదేశం ఇది..ఆ మహనీయుడు కూర్చోవడం వల్ల ఈ ప్రదేశం అత్యంత ప్రశాంతంగా ఉంటుంది…

17. నైరుతి లింగం – అష్ట లింగాల్లో నాలుగోది ఇది..రాక్షసరాజు నిరుతి ( నైరుతి దిక్కుకి అధిపతి) ప్రతిష్టించిన విగ్రహం ఇది. ఈ క్షేత్రానికి అధిపతి రాహువు..ఇక్కడ స్వామిని దర్శించుకుంటే దుష్టగ్రహబాధలు తొసగిపోయి కీర్తి ప్రతిష్టలు వస్తాయి..

 

IBPS RRB Recruitment: గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్‌ ఉద్యోగాలు, ఐబీపీఎస్‌ నోటిఫికేషన్ విడుదల

SaIBPS RRB Recruitment: ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఐబీపీఎస్‌ కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ ఫర్‌ రీజినల్ రూరల్ బ్యాంక్స్‌ నోటిఫికేషన్ గురువారం విడుదలైంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్‌ ఏ ఆఫీసర్లైన స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 అధికారుల నియామకంతో పాటు గ్రూప్‌ బిలో మల్టీ పర్సస్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.

ఐబీపీఎస్‌ రూరల్‌ బ్యాంక్‌ ఉద్యోగాల నియామక షెడ్యూల్‌ను ఇప్పటికే విడుదల చేశారు. పూర్తి నోటిఫికేషన్ ఐబిపిఎస్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నియమనిబంధనలు పూర్తిగా పరిశీలించిన తర్వాత దరఖాస్తు చేయాల్సిందిగా బ్యాంకింగ్‌ నిపుణులు సూచిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో పోస్టులకు దరఖాస్తు చేస్తే స్థానిక భాష విషయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. రాత పరీక్షల్లో అర్హత సాధించినా నియామకాలకు అయా బ్యాంకులు తిరస్కరించే అవకాశాలు ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌, దరఖాస్తుల నమోదు, ఎడిట్‌ ప్రక్రియను జూన్ 7 నుంచి 27 తేదీలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది.

అర్హులైన అభ్యర్థులకు ఐబీపీఎస్‌ ప్రీ ఎగ్జామ్‌ ట్రైనింగ్‌ను జులై 22 నుంచి 27వరకు అందిస్తారు. ఈ శిక్షణను ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ పద్ధతిలో నిర్వహిస్తారు.
జులై నెలాఖరులో హాల్‌ టిక్కెట్లను విడుదల చేస్తారు.
ఆగష్టులో ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తారు.
ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో ప్రాథమిక పరీక్ష ఫలితాలను విడుదల చేస్తారు. ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బి మెయిన్స్ పరీక్షలను సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నిర్వహిస్తారు.
2024 అక్టోబర్‌లో మెయిన్స్‌ ఫలితాలను విడుదల చేస్తారు. అక్టోబర్‌ చివరి వారం లేదా నవంబర్‌లో స్కేల్ 1, స్కేల్2, స్కేల్ 3 ఆఫీసర్ పోస్టులకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
ఎంపికైన అభ్యర్థుల జాబితాను 2025 జనవరిలో విడుదల చేస్తారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన బ్యాంకులు ఇవే..

తెలుగు రాష్ట్రాలకు చెందిన గ్రామీణ బ్యాంకులు కూడా ఐబీపీఎస్ తాజా నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాయి. వరంగల్ కేంద్రంగా పనిచేసే ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస బ్యాంక్ (285 పోస్టులు), కడప కేంద్రంగా ఉన్న ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ (100పోస్టులు), గుంటూరు కేంద్రంగా ఉన్న చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు (50పోస్టులు), చిత్తూరు కేంద్రంగా ఉన్న సప్తగిరి గ్రామీణ బ్యాంకు, హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకు (135పోస్టులు) తాజా నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తారు.

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగ నియామకాల ప్రక్రియ పూర్తిగా బ్యాంకుల యాజమాన్యాల పరిధిలోనే ఉంటాయని ఐబీపీఎస్ స్పష్టం చేసింది. అభ్యర్థిత్వాన్ని తిరస్కరించే హక్కు వాటికి ఉంటుందని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు.

దరఖాస్తు ఫీజు

స్కేల్‌ 1, స్కేల్ 2, స్కేల్‌ 3 ఆఫీసర్ ఉద్యోగాలకు, మల్టీ పర్పస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైన అభ్యర్థులు రూ.175 చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన అభ్యర్థులు రూ.850 ఫీజు చెల్లించాలి.

ఐబీపీఎస్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి ఈ లింకును అనుసరించండి. https://ibpsonline.ibps.in/rrbxiiimay24/

ఐబీపీఎస్‌ మల్టీ పర్పస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి ఈ లింకును అనుసరించండి. https://ibpsonline.ibps.in/rrb13oamay24/

ఐబీపీఎస్‌ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ చూడటానికి ఈ లింకును క్లిక్ చేయండి.
https://ibps.in/wp-content/uploads/CRP_RRBs_XIII_notification_6.6.24.pdf
ఐబీపీఎస్‌ పూర్తి నోటిఫికేషన్‌ దిగువ డాక్యుమెంట్‌లో చూడొచ్చు.

Fish Prasadam: ఆస్తమా పేషెంట్స్​కు అలర్ట్.. చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం..

హైదరాబాద్ లో చేప ప్రసాదం పంపిణీకి ఎంత డిమాండ్ ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ప్రతి సంవత్సరం మృగశిరకార్తె ప్రారంభంలో ఆస్తమాతో సహా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి చేప మందు చాలా సంవత్సరాలుగా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు బత్తిన కుటుంబీకులు.

ఈ నెల 8, 9న హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప మందు ప్రసాదం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం తరపున విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆస్తమాతో పాటు శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ చేప మందు ఉచితంగా పంపిణీ చేస్తారు. ఇందుకోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తరలిరానున్నారు. చేప ప్రసాదం కోసం ఇప్పటికే మూడు రోజుల ముందే ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌కి చేరుకున్నారు ప్రజలు. చేప ప్రసాదానికి భారీగా డిమాండ్ ఉండంతో నిర్వాహకులు స్థానికులకు పలు సూచనలు చేశారు.

చేప ప్రసాదం కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని బత్తిన కుటుంబీకులు చెప్పారు. చేప మందు కోసం వచ్చే ప్రజల కోసం టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త వినిపించింది. రెండు రోజుల పాటు.. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ మార్గంలో.. 130 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది.

ప్రధాన రైల్వే స్టేషన్లు సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లు, ప్రధాన బస్టాండ్లు అయిన జేబీఎస్, ఎంజీబీఎస్ నుంచి, శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. ఆర్టీసీ కల్పిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Smartphone: వారినికోసారైనా మీ స్మార్ట్‌ఫోన్‌ను ఇలా చేయండి.. లేదంటే డేంజర్‌లో పడ్డట్లే..

Smartphone Restart: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ అత్యంత ముఖ్యమైన విషయంగా మారింది. ప్రతీ విషయానికి ఫోన్‌పైనే ఆధారపడి జీవిస్తున్నాం. ఈ క్రమంలో వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని కోల్పోయే ప్రమాదం పెరుగుతుంది.

US నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (NSA) =నివేదిక మన ఫోన్‌లను, అందులోని డేటాను ఎలా సురక్షితంగా ఉంచుకోవచ్చో వివరించింది. హ్యాకర్లను నివారించేందుకు NSA నివేదిక కొన్ని సూచనలు జారీ చేసింది. వీటిని పాటించి, మన డేటాను చాలా జాగ్రత్తగా ఉంచుకోవచ్చు.

ఫోన్ రీస్టార్ట్ చేయాలి..

ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లను కొన్ని రోజులకు ఒకసారి రీస్టార్ట్ చేయాలని US నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (NSA) నివేదిక పేర్కొంది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, మాల్వేర్ అటాక్‌ల బారిన పడకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు స్మార్ట్‌ఫోన్‌ను రీస్టార్ట్ చేయాలని తెలిపింది. మాల్‌వేర్ ముప్పు నుంచి ఫోన్‌ను సురక్షితంగా ఉంచడంలో ఇది చాలా దోహదపడుతుందని పేర్కొంది.

ఫోన్‌ను సురక్షితంగా ఉంచేందుకు చిట్కాలు..

సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేయాలి: మీ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు అన్ని యాప్‌లను అప్‌డేట్ చేస్తూ ఉండాలి. ఇవి హ్యాకర్ల నుంచి ఫోన్‌ను రక్షించడంలో సహాయపడతాయి. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు తరచుగా సెక్యూరిటీ ప్యాచ్‌లను కలిగి ఉంటాయనే సంగతి తెలిసిందే.

పబ్లిక్ Wi-Fi నెట్‌వర్క్‌లతో జాగ్రత్త: పబ్లిక్ Wi-Fi నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తున్నప్పుడు ఏదైనా వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేసుకోవచ్చు. మీరు తప్పనిసరిగా పబ్లిక్ Wi-Fi నెట్‌వర్క్‌ని ఉపయోగిస్తే, VPNని ఉపయోగించండి.

బ్లూటూత్‌ను ఆఫ్‌లో ఉంచండి: మీరు బ్లూటూత్‌ని ఉపయోగించనప్పుడు, దాన్ని ఆఫ్‌లో ఉంచండి. తద్వారా మీ ఫోన్‌కి ఇతర, తెలియని స్మార్ట్ యాక్ససరీస్ కనెక్ట్ అవ్వలేవు.

యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడంలో జాగ్రత్త: Google Play Store లేదా Apple App Store వంటి అధికారిక యాప్ స్టోర్‌ల నుంచి మాత్రమే యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోండి. తెలియని మూలాల నుంచి యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడం మానుకోండి. ఎందుకంటే అవి మాల్వేర్ బారిన పడే అవకాశం ఉంది.

బలమైన పాస్‌వర్డ్, పిన్ ఉపయోగించండి: మీ ఫోన్ కోసం స్ట్రాంగ్ పాస్‌వర్డ్, పిన్‌ని సెట్ చేయండి. మీ పాస్‌వర్డ్‌లను క్రమం తప్పకుండా మారుస్తూ ఉండండి. ఫేస్ లాక్ లేదా వేలిముద్ర వంటి ఫీచర్‌లను కూడా ఉపయోగించండి.

Chandrababu Foods: చంద్రబాబు నాయుడు ఏం తింటారో తెలుసా.. ఇలా తింటే ఆరోగ్యం మీ సొంతం!

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన హోరా హోరీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. త్వరలోనే చంద్రబాబు.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వయసు 74. ఈ వయసులో కూడా ఆయన ఇంత చురుగ్గా.. ఓ పార్టీని నడిపిస్తున్నారంటే.. మామూలు విషయం కాదు. మరి చంద్రబాబు నాయుడు ఇంత ఆరోగ్యంగా ఉండటానికి ఆయన ఏం తింటారు? ఎలాంటి డైట్ ఫాలో అవుతారు? ఎక్కువగా ఏం తింటారో.. ఇప్పుడు తెలుసుకుందాం.

చంద్రబాబు నాయుడు తినే ఆహారం గురించి ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తను బతకడం కోసం తింటాను తప్ప.. తినడం కోసం బతకను అని చెప్పారు. ఆయన తీసుకునే ఆహారం చాలా సింపుల్‌గా ఉంటుందని వెల్లడించారు. ఎలాంటి ఆహారం పడితే అది తీసుకోనని.. కేవలం ఆరోగ్యంగా ఉండేవి మాత్రమే తింటానని తెలిపారు. ఎంత తింటున్నాం.. ఎన్ని క్యాలరీలు ఖర్చు అవుతున్నాయని లెక్కలు వేసుకుంటానని వెల్లడించారు.

చంద్రబాబు తినే డైట్ చాట్ ఇదే:

ఉదయం: ఇడ్లీ, జొన్న ఇడ్లీ, రాగి ఇడ్లీ, ఓట్స్ ఉప్మా, రెండు దోశలు, కొద్దిగా చట్నీ, రెండు ఉడకబెట్టిన గుడ్లు. వీటిల్లో ఏదో ఒక బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటారు. అలాగే బ్రేక్ ఫాస్ట్‌కి లంచ్‌కి మధ్యలో ఓ పండు.

మధ్యాహ్నం: రాగి, జొన్న, సజ్జలతో చేసిన రొట్టెలు లేదా అన్నం, రెండు, మూడు కూరలు. నూనె ఎక్కువగా లేనివి, కొద్దిగా పెరుగు. లంచ్‌కు ఈవెనింగ్ స్నాక్స్‌కు మధ్యలో కొన్ని నట్స్ లేదంటే జ్యూస్.

సాయంత్రం: ఏదైనా ఒక సూప్, కొద్దిగా స్నాక్స్, ఎగ్ వైట్.

రాత్రి: రాత్రి పడుకునే ముందు కేవలం ఒక గ్లాస్ పాలు మాత్రమే. మరీ ఎక్కువగా ఆకలి వేస్తే ఒక చిన్న పండు.

అదే విధంగా నేను ఆరు నుంచి ఏడు గంటల నిద్ర పోతానని వెల్లడించారు. ఈ డైట్ ఫాలో అవుతూ.. వాకింగ్ లేదా చిన్న చిన్న వ్యాయామాలు చేస్తానని చంద్రబాబు వెల్లడించారు. తిన్న ఫుడ్స్ బట్టి ఒక్కోసారి వ్యాయామాలు కూడా మారతాయట. ఇలా చంద్రబాబు డైట్ ఉంటుంది. బాబు ఎక్కడ ఉన్నా.. ఈ డైట్ అనేది ఫాలో అవుతానని ఓసారి చెప్పారు.

Solar Plant: జియో కొత్త సోలార్‌ సిస్టమ్‌.. 95 శాతం కరెంటు బిల్లు తగ్గింపు.. తక్కువ ధరల్లోనే..

నేటి కాలంలో సోలార్ సిస్టమ్ ఒక గొప్ప ఎంపిక. ఎందుకంటే మీరు 2 కిలోవాట్ల సోలార్ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే, మీ విద్యుత్ బిల్లు నెలకు 95% తగ్గుతుంది.

మీకు నాన్‌స్టాప్ కరెంటు లభిస్తుంది.

మీరు జియో ఈ కొత్త సోలార్ సిస్టమ్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, 2 kw 2000 వాట్ సోలార్ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి మీరు జియో నుండి మోనో క్రిస్టల్ లైనర్ లేదా పాలీ క్రిస్టల్ లైనర్ సోలార్ ప్యానెల్‌లను పొందవచ్చు. రెండూ గొప్ప ఫీచర్లతో ఉంటాయి. ఈ సోలార్ ప్యానెల్స్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి మీకు 200 చదరపు అడుగుల స్థలం అవసరం. దీని కోసం మీరు ఎనిమిది ప్యానెల్‌లను కూడా ఉపయోగించవచ్చు. ఇందులో 335 వాట్ల 6 ప్యానెల్లు ఇన్‌స్టాల్ చేస్తారు.

జియో ఆన్-గ్రిడ్ సోలార్ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా మీరు అనేక ప్రయోజనాలను పొందుతారు. దాని ధరను కొద్దిగా సర్దుబాటు చేయవచ్చు. మీరు ప్రభుత్వం నుండి సబ్సిడీ మొత్తాన్ని పొందుతారు. ఒకసారి మీరు దీన్ని ఇన్‌స్టాల్ చేస్తే, మీకు 5 సంవత్సరాల వారంటీ లభిస్తుంది. అలాగే మొత్తం 25 ఏళ్ల పాటు ఎలాంటి టెన్షన్ ఉండదు.

మీరు మీ ఇంటి వద్ద జియో ఆన్-గ్రిడ్ సోలార్ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేయాలనుకుంటే ఇది సోలార్ ఇన్వర్టర్‌లు, సోలార్ ప్యానెల్‌లను ఉపయోగిస్తుంది. చౌక ధరలలో లభిస్తుంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా అందిస్తుంది.

దీని సబ్సిడీ గురించి మాట్లాడితే.. 1 కిలోవాట్ నుండి 3 కిలోవాట్‌ల సోలార్ సిస్టమ్‌లపై రూ.15000 సబ్సిడీ ఉంటుంది. అలాగే 4 కిలోవాట్ల నుండి 10 కిలోవాట్ల సోలార్ సిస్టమ్‌లపై కిలోవాట్‌కు రూ.7940 సబ్సిడీ అందిస్తారు.

మంత్రి పదవుల కోసం టీడీపీలో భారీ పోటీ!

మంత్రి పదవుల కోసం టీడీపీలో

కేబినెట్‌లో చేరనున్న లోకేశ్‌!

పవన్‌ చేరికపై రాని స్పష్టత

జనసేనకు 3-4 బెర్తులు

రేసులో నాదెండ్ల, కొణతాల,

కందుల దుర్గేశ్‌, నానాజీ కూడా

బీజేపీకి రెండు పదవులిచ్చే చాన్సు

జిల్లాలు, సామాజిక సమీకరణల

ఆధారంగా చంద్రబాబు కసరత్తు

రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కోసం భారీ పోటీ నెలకొంది. ఈసారి పెద్దసంఖ్యలో ఎమ్మెల్యేలు గెలుపొందడంతో మంత్రి పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. మెరుగైన జట్టును ఎంపిక చేసుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు గట్టి కసరత్తు చేస్తున్నారు. తొలివిడతలో 9 లేదా 18మందితో మంత్రివర్గాన్ని ఏర్పరచి తర్వాత విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి. బాబు మంత్రివర్గంలో జనసేనకు 3 లేక 4 బెర్తులు, బీజేపీకి 1 లేదా 2మంత్రి పదవులు ఇవ్వనున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మంత్రివర్గంలో చేరతారా లేదా అన్నదానిపై స్పష్టత రాలేదు. ఆయన చేరితే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. పవన్‌ చేరని పక్షంలో ఆ పార్టీ నుంచి నాదెండ్ల మనోహర్‌, కొణతాల రామకృష్ణ, కందుల దుర్గేశ్‌, పంతం నానాజీల్లో ఇద్దరు ముగ్గురికి అవకాశం రావచ్చని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. బీజేపీ నుంచి సుజనా చౌదరి, డాక్టర్‌ పార్థసారథి, సత్యకుమార్‌లలో ఇద్దరికి అవకాశం ఉండవచ్చని సమాచారం. టీడీపీ యువనేత లోకేశ్‌ మంత్రివర్గంలో చేరడం ఖరారైంది. లోకేశ్‌, మనోహర్‌ ఇద్దరూ మంత్రివర్గంలోకి వస్తే ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొందరు సీనియర్లకు అవకాశం ఉండదని అంటున్నారు. లోకేశ్‌ మంత్రివర్గంలోకి రానిపక్షంలో ధూళిపాళ్ల నరేంద్ర, యరపతినేని శ్రీనివాసరావు, జీవీ ఆంజనేయులులో ఒకరికి చాన్స్‌ దక్కవచ్చు. కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్‌బాబు, అనగాని సత్యప్రసాద్‌, తెనాలి శ్రావణ్‌కుమార్‌ కూడా బెర్తులు ఆశిస్తున్నారు.

గోదావరిలో ఇద్దరు ముగ్గురికి..

ఉభయ గోదావరి జిల్లాల నుంచి టీడీపీ కోటా కింద యనమల రామకృష్ణుడు, పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జ్యోతుల నెహ్రూ పేర్లు పరిశీలనకు రావచ్చని, వీరిలో ఇద్దరు ముగ్గురికే అవకాశం దక్కుతుందంటున్నారు. రఘురామకృష్ణరాజు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్లు కూడా పరిశీలనకు తీసుకునే అవకాశం ఉంది.

ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అచ్చెన్నాయుడు, కళావెంకట్రావు, అయ్యన్నపాత్రుడు, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, పల్లా శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు, కూన రవికుమార్‌ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పి. నారాయణ మంత్రివర్గంలో చేరడం ఖాయమైంది. మరో బెర్తు కోసం ఆనం రామనారాయణరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి మధ్య పోటీ నెలకొంది.

ఉమ్మడి కృష్ణా జిల్లాలో బీజేపీ కోటా నుంచి సుజనా చౌదరికి అవకాశం లభిస్తే కొందరు టీడీపీ సీనియర్లకు చాన్సులు తగ్గిపోతాయి. ఈ జిల్లా నుంచి కొల్లు రవీంద్ర, శ్రీరాం తాతయ్య, బొండా ఉమా, వెనిగండ్ల రాము పేర్లు పరిశీలనకు రావచ్చంటున్నారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కిశోర్‌కుమార్‌రెడ్డి, అమరనాథ్‌రెడ్డిల్లో ఒకరికి చాన్స్‌ రావచ్చని అంటున్నారు.

అనంతపురం జిల్లాలో పయ్యావుల కేశవ్‌, కాల్వ శ్రీనివాసులు, గుమ్మనూరు జయరాం, సబితమ్మ, కందికుంట వెంకటప్రసాద్‌ పేర్లు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి రవికుమార్‌, డోలా బాలవీరాంజనేయ స్వామి పేర్లు పరిశీలించే అవకాశం ఉంది.

కర్నూలు జిల్లాలో బీసీ జనార్దనరెడ్డి, కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి, భరత్‌, ఫరూక్‌ పేర్లు వినిపిస్తున్నాయి. కడప జిల్లాలో రెడ్డప్పగారి మాధవి, వరదరాజులరెడ్డి, రాంభూపాల్‌రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

Teeth: పసుపు దంతాలతో బాధపడుతున్నారా.? ఇంట్లోనే ఇలా చేయండి..

అందాన్ని పెంచడంలో పళ్లు కీలక పాత్ర పోషిస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పళ్ల ఆకారంతో పాటు రంగు కూడా మన అందంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పసుపు పచ్చని పళ్ల కారణంగా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. పళ్లు పచ్చగా మారడానికి తీసుకునే ఆహారం మొదలు తాగే నీటి వరకు ఎన్నో కారణాలు ఉంటాయి. సాధారణంగా పళ్లు పచ్చగా మారితే వైద్యులను సంప్రదించి క్లీనింగ్ చేయించుకుంటారు.

అయితే ప్రతీసారి క్లీనింగ్ చేయించుకోవడం ఇబ్బందితో కూడుకున్న విషయం. అలా కాకుండా ఇంట్లో లభించే వస్తువులతోనే దంతాల రంగును తెలుపు రంగులోకి మార్చుకోవచ్చు. ఇంతకీ పసుపు రంగులో ఉన్న దంతాలను తెలుపు రంగులోకి మారాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

* దంతాలను నేచురల్‌గా పాలిష్‌ చేయడంలో అరటి తొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందుకోసం ముందుగా ఒక అరటి తొక్కను తీసుకోవాలి. తర్వాత అరటి బెరుడు భాగాన్ని తీసుకొని లోపలి తెల్లటి భాగం నుంచి మొదలు పెట్టి దంతాలపై నెమ్మదిగా రుద్దాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే కొన్ని రోజుల్లోనే మీ దంతాలు తెలుపు రంగులోకి మారుతాయి.

* పసుపు రంగులో ఉన్న దంతాలు తెలుపు రంగులోకి మార్చడంలో ఆవనూనె, ఉప్పు ఉయోగపడుతుంది. ఇందుకోసం కొంత ఆవనూనె తీసుకొని అందులో చిటికెడు ఉప్పు కలపాలి. అనంతరం ఈ మిశ్రంతో దంతాలపై రెండు నుంచి మూడు నిమిషాల పాటు మసాజ్‌ చేస్తే సరిపోతుంది. పసుపు రంగులో ఉన్న దంతాలు మళ్లీ తెలుపు రంగులోకి మారుతాయి.

* పసుపు రంగులో ఉన్న దంతాలు తిరిగి తెలుపు రంగులోకి మారడంలో బేకింగ్ సోడా ఎంతగానో పనిచేస్తుంది. ఇందుకోసం కొంత బేకింగ్ సోడా తీసుకొని అందులోని కొంచెం నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. అనంతరం బ్రష్‌పై అప్లై చేసి బ్రష్‌ చేసుకోవాలి. తర్వాత పళ్లను శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేస్తే త్వరగానే పళ్లు తెలుపు రంగులోకి మారుతాయి.

* స్ట్రాబెర్రీలు కూడా పసుపు పచ్చ పళ్లు తెలుపు రంగులోకి మారడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ముందుగా స్ట్రాబెర్రీలను తీసుకొని వాటిని మెత్తగా చేసుకోవాలి. అనంతరం ఆ పేస్ట్‌ను దంతాలపై అప్లై చేసిన కొద్ది సేపు అలాగే ఉంచాలి. అనంతరం కాసేపు దంతాలపై రుద్ది.. నాటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇది దంతాల రంగు తెలుపు రంగులోకి మారడంలో ఉపయోగపడుతుంది.

ఈ ఎంపీలిద్దరూ.. ఒకప్పుడు కలిసి సినిమా చేశారని తెలుసా..?

దిల్లీ: ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఊహించిన ఫలితాలు దక్కపోయినా.. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు కావాల్సిన సీట్లనైతే ఎన్డీయే సాధించింది. దాంతో మూడోసారి నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఈ సమయంలో ఇద్దరు ఎంపీలకు సంబంధించి 13 ఏళ్ల నాటి ఓ విషయం ఆసక్తిగా మారింది. అదేంటంటే..?

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌(Kangana Ranaut) హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మరోపక్క ఎన్డీయే కూటమికి పూర్తి మద్దతు పలుకుతోన్న లోక్‌జన శక్తి పార్టీ చీఫ్ చిరాగ్‌ పాసవాన్(Chirag Paswan) బిహార్‌లోని హాజిపుర్ స్థానం నుంచి గెలుపొందారు. వీరిద్దరూ ఒక సినిమాలో కలిసి నటించారని తెలుసా..? 2011లో వచ్చిన ‘మిలే నా మిలే హమ్‌’ చిత్రంలో హీరోహీరోయిన్‌గా చేశారు. నటనపై ఆసక్తి ఉన్న చిరాగ్‌.. ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయారు. ఈ తర్వాత రాజకీయ రంగప్రవేశం చేసి, తండ్రి రామ్‌విలాస్‌ పాసవాన్‌ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఐదు చోట్ల తన పార్టీని గెలిపించుకున్నారు. అటు కంగన బాలీవుడ్‌లో అగ్రనాయికగా ఉన్నారు. ఫ్యాషన్, క్వీన్, తను వెడ్స్ మను, మణికర్ణిక వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు తొలిసారి ఎంపీగా లోక్‌సభలో అడుగుపెట్టనున్నారు.

ఈ ఎన్నికల తర్వాత వారికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. ‘‘మీకు కంగనా నచ్చదా..? ఆమె సినిమా కెరీర్‌ నచ్చదా..?’’ అని అందులో చిరాగ్‌ ప్రశ్నించడం కనిపించింది. అందుకు ఆయన బదులిస్తూ..‘‘మేమిద్దరం కలిసి నటించడం ప్రేక్షకులకు నచ్చలేదు. కానీ ఇప్పుడు ఇద్దరం పార్లమెంట్‌కు వెళ్లనున్నాం’’ అని అన్నారు. ఇప్పుడు ఆ మాటే నిజమైంది. 13 ఏళ్ల తర్వాత ఇద్దరూ కలిసి పార్లమెంట్‌లో కనిపించబోతున్నారు.

Andhra news: ఏపీ సీఎం ముఖ్య కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ రవిచంద్ర?

అమరావతి: ఏపీ సీఎం ముఖ్య కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ముద్దాడ రవిచంద్రను నియమించే అవకాశముంది. సీఎం పేషీలో మరి కొందరు అధికారుల నియామకంపై కూడా కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం. మరో వైపు రాష్ట్రంలోని సలహాదారులను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 40 మంది సలహాదారులను తొలగిస్తూ సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్‌ 4వ తేదీ నుంచి తొలగింపు అమల్లోకి వస్తుందని పేర్కొంది.

మంత్రుల పేషీల్లోని పీఎస్‌లు, ఓఎస్డీలను మాతృశాఖకు పంపుతూ సాధారణ పరిపాలనశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 11లోగా ఆయా మంత్రుల వ్యక్తిగత కార్యదర్శులు, ఓఎస్డీలను వారి మాతృశాఖల్లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈమేరకు జీఏడీ ముఖ్యకార్యదర్శి సురేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రుల పేషీల్లోని ఫైళ్లు, రికార్డులు, డాక్యుమెంట్లను సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు అందజేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఫర్నిచర్, కంప్యూటర్, స్టేషనరీల జాబితాను సమర్పించాలని సాధారణ పరిపాలన శాఖ ఆదేశించింది. అలాగే పేషీలకు సంబంధించి నో డ్యూస్ సర్టిఫికెట్లు కూడా తీసుకోవాలని జీఏడీ తెలిపింది. మంత్రుల నివాసాల్లో ఉన్న ఫర్నిచర్ వివరాలను కూడా ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Health

సినిమా