Friday, November 15, 2024

Opinion Polls: ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్‌ మధ్య తేడా ఏంటి.. వీటిలో ఎందులో ఖచ్చితత్వం ఎక్కువ?

Opinion Polls: ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా లోక్‌సభ ఎన్నికల గురించే చర్చ జరుగుతోంది. ఏ కూటమి అధికారంలోకి వస్తుంది.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి విజయం సాధిస్తారు అని జనం చర్చించుకుంటున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి.. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ నెగ్గుతుంది.. ఆ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది అంటూ చిన్నా, పెద్దా, ముసలి, ముతక మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే శనివారం లోక్‌సభ ఎన్నికల చివరి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పోలింగ్ 6 గంటలకు పూర్తి కాగానే. 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ఆధారంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో కొంతవరకు అంచనా వేసుకోవచ్చు. ఈ క్రమంలోనే ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ మధ్య తేడా ఏంటి అనే ప్రశ్న అందరిలో మెదులుతోంది.

ఎన్నికలు వచ్చాయంటే చాలు ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ అంటూ ఓటరు నాడీ తెలుసుకునేందుకు మీడియా, ఇతర సంస్థలు రకరకాల సర్వేలు చేపడుతూ ఉంటాయి. అయితే కేంద్ర ఎన్నికల సంఘం.. కౌంటింగ్ ప్రక్రియ ముగిసి రిజల్ట్స్‌ను ప్రకటించడానికి ముందు ఈ ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ వెలువడుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఈ రెండింటి మధ్య తేడా ఏంటి అనే సందేహం కలుగుతుంది. అయితే ఒపీనియన్ పోల్స్ అంటే పోలింగ్‌కు ముందు నిర్వహించేది కాగా.. ఎగ్జిట్ పోల్స్ అంటే పోలింగ్ తర్వాత నిర్వహించే సర్వే.

ఒపీనియన్ పోల్స్ (opinion polls) అంటే ఏంటి?
ఈ ఒపీనియన్ పోల్స్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విధించిన షరతులకు లోబడి ఆయా సంస్థలు వెల్లడిస్తాయి. అయితే ఈ ఒపీనియన్ పోల్స్‌ను ఎన్నికలు ప్రారంభం కావడానికి ముందు ఏ దశలోనైనా విడుదల చేయవచ్చు. అంటే ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకముందు.. షెడ్యూల్ వచ్చిన తర్వాత, పార్టీలు పొత్తులు పెట్టుకున్న తర్వాత.. ఈ ఒపీనియన్ పోల్స్‌ సర్వేలు చేపడతారు. ఎన్నికల్లో ప్రజల నాడిని తెలుసుకునేందుకు ఈ సర్వేలు చేపడతారు.

అయితే ఈ ఒపీనియన్ పోల్స్‌లో ఎవరిపై సర్వే నిర్వహించాలని ముందే నిర్వాహకులు నిర్ణయించుకుంటారు. అంటే యువత, రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, వికలాంగులు, వృద్ధులు ఇలా అన్ని వర్గాల వారిని కలిసి వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు. కులం, మతం ప్రాతిపదికన కూడా సమాచారాన్ని సేకరిస్తూ ఉంటారు. ఇలాంటి ఒపీనియన్ సర్వేలు సాధారణంగా రాజకీయ పార్టీలు నిర్వహిస్తూ ఉంటాయి. ప్రజల్లో తమ పార్టీ పట్ల ఎలాంటి వైఖరి ఉంది. ఓటర్లు పాజిటివ్‌గా ఉన్నారా లేక నెగటివ్‌గా ఉన్నారా అనేది తెలుసుకుంటారు.

ఎగ్జిట్ పోల్స్ (exit polls) అంటే ఏంటి?
అన్ని దశల పోలింగ్ పూర్తయిన తర్వాత వెలువరించేవే ఎగ్జిట్ పోల్స్. ఎన్నికలు జరిగిన రోజే.. ఓటర్ల నుంచి సమాచారాన్ని సేకరిస్తారు. పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన తర్వాత ఓటర్లు ఇచ్చే సమాధానాలను బట్టి ఏ పార్టీకి ఎక్కువ మంది ఓటేశారు అనే వివరాలను నమోదు చేస్తారు. ఆ సమాచారం ఆధారంగా పార్టీల ఓటింగ్ శాతం, గెలిచే సీట్ల సంఖ్య, అభ్యర్థులను అంచనా వేసి.. చివరి విడత ఎన్నికలు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటిస్తారు.

ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ ఎందులో ఖచ్చితత్వం ఎక్కువ?
ఒపీనియన్ పోల్ సర్వేలతో పోలిస్తే ఎగ్జిట్ పోల్స్‌‌.. తుది ఫలితాలకు కాస్త దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే ఒపీనియన్ పోల్ అంటే ఎన్నికలు జరగకముందు నిర్వహిస్తారు. కానీ ఎగ్జిట్ పోల్స్ అంటే.. ఎన్నికలు పూర్తి కాగానే తీసుకుంటారు కాబట్టి.. ఓటర్ల నాడీ పట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. ఒపీనియన్ పోల్‌లో ఒక పార్టీకి ఓటు వేస్తామని చెప్పిన ఓటరు.. పోలింగ్ సమయానికి మనసు మార్చుకుని.. వేరే పార్టీకి ఓటు వేసే పరిస్థితి ఉంటుంది. అందుకే ఓటు వేసిన తర్వాత అయితే ఖచ్చితమైన ఖచ్చితత్వం ఫలితం ఉంటుంది. అందుకే ఒపీనియన్ పోల్స్ కంటే ఎగ్జిట్ పోల్స్‌లోనే ఖచ్చితమైన సమాచారం వెల్లడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Jio: జియో నుంచి అదిరిపోయే ప్లాన్‌.. రూ.26 రీఛార్జ్‌తో 28 రోజులు.. ఇంకా..

రిలయన్స్ జియో కొద్ది కాలంలోనే ఇతర నెట్‌వర్క్ కంపెనీలతో పోటీ పడుతోంది. కొత్త కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టడం ద్వారా ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షిస్తోంది.

రిలయన్స్ జియో భారతీయ టెలికాం మార్కెట్లో అత్యధిక సంఖ్యలో వినియోగదారులను కలిగి ఉంది. కంపెనీ ఇప్పటికే ఉన్న కస్టమర్లకు అనేక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తుంది, వాటిలో కొన్ని కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి.

కంపెనీ కేవలం రూ. 26 ప్లాన్, డేటా ప్రయోజనాలు పూర్తి 28 రోజుల పాటు అందుబాటులో ఉంటాయి. రిలయన్స్ జియో రూ. 26 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ వాస్తవానికి JioPhone యాడ్-ఆన్ రీఛార్జ్ ప్లాన్. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేయడం వలన పరిమిత సమయం వరకు డేటా ప్రయోజనం లభిస్తుంది. ప్లాన్‌లో లభించే ప్రయోజనాల గురించి చెప్పాలంటే.. ఇది డేటాను మాత్రమే అందిస్తుంది. కాల్ లేదా SMS వంటి ప్రయోజనాలను కలిగి ఉండదు.

26 ప్లాన్, వినియోగదారులు మొత్తం 2GB డేటా పొందుతారు. ఈ డేటా 28 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది. తక్కువ డేటాను ఉపయోగించే లేదా JioPhoneని ఉపయోగించే సబ్‌స్క్రైబర్‌లకు ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది.

ఈ ప్లాన్‌ను ఇప్పటికే ఉన్న ఏదైనా జియోఫోన్ రీఛార్జ్ ప్లాన్‌తో టాప్-అప్‌గా ఉపయోగించవచ్చు. జియో యొక్క ఇతర ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల కంటే ఈ ప్లాన్ చాలా చౌకగా ఉంటుంది. మీరు తక్కువ డేటాను ఉపయోగిస్తుంటే, మీకు 28 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్ కావాలంటే ఈ ప్లాన్ మీకు మంచి ఎంపిక.

మీకు JioPhone లేకపోయినా, అటువంటి ప్రయోజనాలతో కూడిన ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే, మీరు రూ.155 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ పైన పేర్కొన్న ప్రయోజనాలను JioPhone కాని వినియోగదారులకు అందిస్తుంది. ఈ డేటా మాత్రమే ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో 2GB మొత్తం డేటాను కూడా అందిస్తుంది.

గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర..

LPG ధర: LPG సిలిండర్ వినియోగదారులకు లోక్‌సభ ఎన్నికల చివరి దశ ఓటింగ్ ప్రారంభం కావడానికి ముందు గొప్ప బహుమతి లభించింది. ఆయిల్ మార్కెటింగ్ పెట్రోలియం కంపెనీలు ఎల్‌పిజి సిలిండర్ ధరను రూ.72 తగ్గించాయి.

ఈరోజు జూన్ 1 నుంచి ఢిల్లీలో రూ.69.50, కోల్‌కతాలో రూ.72, ముంబైలో రూ.69.50, చెన్నైలో రూ.70.50 చొప్పున ఎల్‌పీజీ సిలిండర్ ధర తగ్గింది. ఈ మార్పు కేవలం వాణిజ్య సిలిండర్లలో మాత్రమే చేయబడింది. దేశీయ LPG సిలిండర్ పాత ధరకే అందుబాటులో ఉంటుంది.

2024 లోక్‌సభ ఎన్నికల చివరి దశలో 7 రాష్ట్రాలు మరియు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 57 స్థానాలకు ఈరోజు (జూన్ 1) ఓటింగ్ ప్రారంభం కానుంది. ఇంతకుముందు కూడా 19 కిలోల వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు శుభవార్త వచ్చింది.

ఈరోజు నుంచి ఈ బ్లూ సిలిండర్ ఢిల్లీలో రూ.1745.50కి బదులుగా రూ.1676.00కి అందుబాటులో ఉంటుంది.

కోల్‌కతాలో ఈరోజు ఎన్నికల రోజు సిలిండర్ రూ. 1787.00 సంపాదించబడుతుంది. గతంలో ఇక్కడ కమర్షియల్ సిలిండర్ రూ.1859కి లభించేది.

ముంబైలో నేటి నుంచి 19 కిలోల సిలిండర్ రూ.1698.50కి బదులుగా రూ.1629.00కి అందుబాటులోకి రానుంది.

ఇదిలా ఉండగా, చెన్నైలో ఇప్పుడు రూ.1911కి బదులుగా రూ.1840.50కి అందుబాటులో ఉంటుంది.

రివ్యూ: కీచురాళ్ళు.. మలయాళ థ్రిల్లర్‌ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా?

మలయాళంలో విజయవంతమైన ‘కీడమ్‌’ సినిమా ఓటీటీ ‘ఈటీవీ విన్‌’లో ‘కీచురాళ్ళుగా’ స్ట్రీమింగ్‌ అవుతోంది. ఎలా ఉందంటే?

చిత్రం: కీచురాళ్ళు; నటీనటులు: రజీషా విజయన్‌, శ్రీనివాసన్‌, విజయ్‌ బాబు, మణికందన్‌ తదితరులు; సంగీతం: సిద్ధార్థ ప్రదీప్‌; ఛాయాగ్రహణం: రాకేశ్‌ ధరణ్‌; ఎడిటింగ్‌: క్రిస్టీ సెబాస్టియన్‌; నిర్మాణ సంస్థలు: ఫస్ట్‌ ప్రింట్‌ స్టూడియోస్, ఫెయిరీ ఫ్రేమ్స్‌ ప్రొడక్షన్స్‌; దర్శకత్వం: రాహుల్‌ రిజీ నాయర్‌; ఓటీటీ ప్లాట్‌ఫామ్‌: ఈటీవీ విన్‌.

థియేటర్లలో సందడి చేసిన పలు చిత్రాలు, ఒరిజినల్‌ మూవీస్‌, వెబ్‌సిరీస్‌లతోపాటు ఇతర భాషల్లో విజయాన్ని అందుకున్న ప్రాజెక్టులను తెలుగు ప్రేక్షకులకు అందించడంలో ముందుండే ఓటీటీ సంస్థ ‘ఈటీవీ విన్‌’(ETV Win). అలా ఇటీవల రిలీజైన వాటిలో ‘కీచురాళ్ళు’ (Keechurallu) ఒకటి. మలయాళంలో విజయవంతమైన ‘కీడం’ (Keedam)కు డబ్బింగ్‌ ఇది. రజీషా విజయన్‌ ప్రధాన పాత్రలో దర్శకుడు రాహుల్‌ రిజీ నాయర్‌ తెరకెక్కించారు. మరి, ఈ సినిమా కథేంటి? ఎలా ఉందంటే? (Keechurallu Review)..

కథేంటంటే?: రాధిక (రజీషా విజయన్‌) సైబర్‌ సెక్యూరిటీ నిపుణురాలు. సొంతగా స్టార్టప్ కంపెనీ నిర్వహిస్తూ ఉంటుంది. ఈమె ప్రతిభను గుర్తించిన పోలీసులు సైతం నేరస్థులను పట్టుకునేందుకు అప్పుడప్పుడు సహాయం కోరుతుంటారు. అలాంటి అమ్మాయినే ఓ యువకుడు తన గ్యాంగ్‌తో కలిసి కాల్స్‌, అసభ్య సందేశాలతో వేధిస్తుంటాడు. రాధికకు పరిచయస్థులైన పోలీసులు, న్యాయవాది అయిన తండ్రి కూడా విషయాన్ని పెద్దది చేయకపోవడం మంచిదని ఆమెకు సలహా ఇస్తారు. అయినా వారి మాట కాదని రాధిక ముందడుగేస్తుంది. మరి, స్క్రాప్‌ బిజినెస్‌ ముసుగులో ఆ రౌడీ గ్యాంగ్‌ చేస్తున్న అక్రమ కార్యకలాపాలేంటి? వారి నుంచి రాధికకు ఎదురైన సవాళ్లేంటి? ఎలా బుద్ధి చెప్పింది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే (Keedam Review in Telugu).

ఎలా ఉందంటే?: కొందరు ఆకతాయిలు అమ్మాయిలకు ఫోన్‌ చేసి అసభ్యంగా ప్రవర్తించడం, ఒకవేళ తమకు ఎదురు తిరిగితే బ్లాక్‌ మెయిల్‌ చేసి బెదిరించడం లేదా బయట ఎక్కడ కనిపించినా వార్నింగ్‌ ఇవ్వడం.. ప్రతి రోజూ ఏదో ఓ చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నేటి సమాజంలో నెలకొన్న ఈ సమస్యనే దర్శకుడు రాహుల్‌ రిజీ నాయర్‌ తనదైన శైలిలో తెరపైకి తీసుకొచ్చారు. అయితే, సైబర్‌ సెక్యూరిటీ నిపుణురాలే బాధితురాలిగా కాకుండా సాధారణ అమ్మాయి పాత్ర కోణంలో ఈ కథను చూపించే ఉంటే మరింత ఎఫెక్టివ్‌గా ఉండేది. సినిమాని ఆసక్తికరంగా ప్రారంభించిన దర్శకుడు అసలు కథలోకి వెళ్లేందుకు కాస్త సమయం తీసుకున్నారు. హీరోయిన్‌ వ్యక్తిత్వం ఎలాంటిది? టెక్నాలజీ సాయంతో మనుషులను ఎలా చదువుతుంది? అన్న విషయాలు తెలియజేసేలా రాసుకున్న సన్నివేశాలు బాగున్నా నెమ్మదిగా సాగడం సహనానికి పరీక్షే. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తే.. ఈసారి ఏ అఘాయిత్యానికి పాల్పడతారోనని ఎంతోమంది ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడుతుంటారు. న్యాయవాది అయినా సరే ఆ భయం తప్పదని హీరోయిన్‌ తండ్రి పాత్ర ద్వారా చూపించిన విధానం అందరికీ కనెక్ట్‌ అవుతుంది. ఇలా తండ్రి సపోర్ట్‌ లేకపోయినా రంగంలోకి దిగిన రాధిక చేసే పోరాటం స్ఫూర్తినిచ్చేలా ఉంటుంది. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ సెకండాఫ్‌పై ఆసక్తి రేకెత్తిస్తుంది.

రాధికను టార్గెట్‌ చేసిన విలన్‌ గ్యాంగ్‌కు హెడ్‌ ఎవరు? వీరి నెట్‌వర్క్‌ ఏంటి? వంటి వాటినీ లోతుగా చూపించి ఉంటే మరింత పవర్‌ఫుల్‌గా ఉండేది. ఆయా క్యారెక్టర్లలను సింపుల్‌గా తేల్చేయడంతో హీరోయిన్‌ చేసే టెక్నాలజీ మ్యాజిక్‌ అలరించినా ఏదో వెలితి ఉన్న ఫీలింగ్‌ ప్రేక్షకుడికి కలుగుతుంది. ఫస్టాఫ్‌లో.. టెక్నాలజీతో టార్చర్‌ చేసిన వారిని అదే టెక్నాలజీతో బుద్ధి చెప్పిన రాధిక ప్లానింగ్‌ను సెకండాఫ్‌లో రివీల్‌ చేసిన తీరు బాగుంది. ఉత్కంఠభరితంగా ప్రీ క్లైమాక్స్‌ను క్రియేట్‌ చేశారు. పతాక సన్నివేశాలు ఊహకు తగ్గట్టే ఉంటాయి.

ఎవరెలా చేశారంటే?: తక్కువ పాత్రలతో రూపొందిన సినిమా ఇది. రజీషా విజయన్‌కే స్క్రీన్‌ ప్రెజెన్స్‌ ఎక్కువ. సమస్య వస్తే దిగులుపడకుండా తెగువ చూపే అమ్మాయి రాధిక పాత్రలో ఆమె ఒదిగిపోయారు. రజీషా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ‘రామారావు ఆన్‌ డ్యూటీ’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. దర్శకుడు రాహుల్‌ హీరోయిన్‌ కొలీగ్‌ రోల్‌లో సందడి చేశారు. రాధిక తండ్రిగా కనిపించిన శ్రీనివాసన్‌, పోలీసు పాత్రలు పోషించిన వారు, రౌడీ గ్యాంగ్‌ పరిధి మేరకు నటించారు. సాంకేతిక బృందం విషయానికొస్తే.. సినిమాటోగ్రఫీ బాగుంది. నేపథ్య సంగీతం ఓకే. 1:45 గం.ల నిడివితో సినిమాని క్రిస్పీగా ఎడిట్‌ చేశారు. వాస్తవికతకు దగ్గరగా ఉన్న కథలను తెరకెక్కించడం తన ప్రత్యేకత అని రాహుల్‌ మరోసారి చాటుకున్నారు.

కుటుంబంతో కలిసి చూడొచ్చా?: ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ చిత్రమే ఇది. ఒక్క చోట మినహా అసభ్యకరమైన సంభాషణలు లేవు. సన్నివేశాలూ లేవు.

బలాలు:
+ కథ
+ రజీషా విజయన్‌ నటన
బలహీనతలు:
– ప్రథమార్ధంలో కొంత సాగదీత
– పేలవమైన పలు విలన్‌ పాత్రలు
చివరిగా: రాధిక పోరాటం.. ఆసక్తికరం
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

కేంద్రం కీలక నిర్ణయం.. ఆ టాక్స్ తగ్గింపు! పెట్రోల్, డీజిల్ ధరలు..

ఓ వైపు ఎన్నికలు జరుగుతున్నపటికీ.. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని NDA గవర్నమెంట్ కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. మరీ ముఖ్యంగా ముడి చమురు విషయంలో టాక్స్ లను తగ్గిస్తూ..

ఎన్నికల వేళ ప్రతిపక్షాలకు షాకిచ్చింది. తాజాగా మరో టాక్స్ ను తగ్గించింది. దాంతో పెట్రోల్, డీజిల్ ధరలు ప్రభావితం కానున్నాయి. మరి కేంద్రం తీసుకున్న ఆ కీలక నిర్ణయం ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

కేంద్ర ప్రభుత్వం తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ముడి చమురు(క్రూడ్ పెట్రోలియం)పై విండ్ ఫాల్ టాక్స్ ను తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. అంతకు ముందు వరుసగా పెంచుకుంటూ పోయిన ఈ టాక్స్ ను.. తాజాగా తగ్గిస్తూ వస్తోంది కేంద్రం. వరుసగా మూడోసారి ఈ టాక్స్ ను తగ్గించింది కేంద్రం.. అది కూడా ఎన్నికల సమయంలోనే కావడం గమనార్హం. ముడి చమురుపై విండ్ ఫాల్ టాక్స్ ను రూ. 500 తగ్గించింది. దాంతో ప్రస్తుతం మెట్రిక్ టన్నుకు రూ. 5200 కు(62.33 డాలర్లు) చేర్చింది. తగ్గించకముందు ఇది రూ. 5700గా ఉంది. జూన్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని కేంద్రం తెలిపింది.

ఇదిలా ఉండగా.. ప్రతి 15 రోజులకు ఒకసారి కేంద్రం విండ్ ఫాల్ టాక్స్ లను సవరిస్తూ ఉంటుంది. అందులో భాగంగా అంతర్జాతీయంగా డీజిల్, పెట్రోల్ ధరలకు అనుగుణంగా ఇక్కడ రేట్లను పెంచడం, తగ్గించడం లేగా స్థిరంగా ఉంచడం జరుగుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే? టాక్స్ తగ్గించినా కూడా డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ATF) రేట్లు ఏం మారలేదు. దీనిపై టాక్స్ జీరోగానే ఉంది.. పెట్రోల్ కు కూడా ఇదే వర్తిస్తుంది. కాగా.. అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉంటే.. ఇక్కడ టాక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ధరలు తగ్గితే విండ్ ఫాల్ టాక్స్ తగ్గిస్తుంది. అయితే ఈ టాక్స్ తగ్గించినా, పెంచినా.. దేశియంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు ఉండకపోవచ్చు. కానీ వాటి ధరలు ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రేటు రూ. 107.41 గా ఉంది. లీటర్ డీజిల్ రూ. 95.65 వద్ద ఉంది.

IND vs BAN: నేడు భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్.. ఉచితంగా ఎలా చూడొచ్చడంటే?

India vs Bangladesh, ICC Mens T20 World Cup 2024 Warm-up 15th Match: నేడు, శనివారం, జూన్ 1న న్యూయార్క్‌లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో T20 ప్రపంచ కప్ 2024 (T20 World Cup 2024) వార్మప్ మ్యాచ్‌లో భారత్ vs బంగ్లాదేశ్ తలపడనున్నాయి.

పొట్టి ప్రపంచకప్‌ సన్నాహాల్లో ఇరు జట్లకు ఈ మ్యాచ్‌ కీలకం. మే 26న అమెరికా బయల్దేరిన టీమిండియా.. ఇప్పటికే ప్రాక్టీస్‌లో బిజీగా ఉంది. కాబట్టి లీగ్ ప్రారంభానికి ముందు టీమ్ బ్యాలెన్స్‌ను కనుగొనడానికి ఈ మ్యాచ్ భారత్‌కు ముఖ్యమైనది. మరోవైపు అమెరికాతో బంగ్లాదేశ్‌ తొలి ప్రాక్టీస్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. అయితే, ఈ వార్మప్ మ్యాచ్‌కు ముందు జరిగిన రెండు జట్ల టీ20 సిరీస్‌లో ఆతిథ్య అమెరికా 2-1 తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ ఘోర పరాజయం నుంచి బంగ్లాదేశ్ జట్టు కోలుకోవాలంటే టీమ్ ఇండియాపై విజయం సాధించాలని కోరుకుంటుంది.

ఇరుజట్ల రికార్డులు..

ఈ మ్యాచ్ ప్రాక్టీస్ మ్యాచ్ అయినప్పటికీ ఇటీవల ఇరు జట్ల మధ్య జరిగిన ముఖాముఖిని పరిశీలిస్తే ఇది ఉత్కంఠభరితమైన మ్యాచ్ అని భావిస్తున్నారు. క్రికెట్ ప్రపంచంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. గత కొన్నేళ్లుగా ఇరు జట్ల మధ్య ఎన్నో చిరస్మరణీయ మ్యాచ్‌లు జరగడం గమనార్హం. అయితే, మెన్ ఇన్ బ్లూ బెంగాల్ టైగర్స్‌ పైచేయి సాధించింది. రెండు జట్ల మధ్య జరిగిన 13 మ్యాచ్‌లలో భారతదేశం 12 విజయాలు సాధించింది.

ప్రాక్టీస్ మ్యాచ్ గురించి పూర్తి సమాచారం..

భారత్, బంగ్లాదేశ్ మధ్య టీ20 ప్రపంచకప్ ప్రాక్టీస్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది?

రేపు అంటే జూన్ 1న భారత్, బంగ్లాదేశ్ మధ్య టీ20 ప్రపంచకప్ ప్రాక్టీస్ మ్యాచ్ జరగనుంది.

భారత్, బంగ్లాదేశ్ మధ్య టీ20 ప్రపంచకప్ ప్రాక్టీస్ మ్యాచ్ ఎక్కడ జరుగుతోంది?

న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్ జరుగుతోంది.

భారత్, బంగ్లాదేశ్ మధ్య టీ20 ప్రపంచకప్ ప్రాక్టీస్ మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

అమెరికాలో ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతున్నందున ఇరుదేశాల మధ్య సమయం చాలా తేడా ఉంటుంది. అయితే, ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.

భారతదేశం vs బంగ్లాదేశ్ T20 ప్రపంచ కప్ ప్రాక్టీస్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఎక్కడ చూడాలి?

భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ వార్మప్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం డిస్నీ+హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంటుంది. అలాగే, స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లోని వివిధ ఛానెల్‌లలో ఈ మ్యాచ్‌ను టీవీలో చూడొచ్చు.

రెండు జట్లు..

టీమ్ ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యస్సావి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

రిజర్వ్‌ ప్లేయర్లు: శుభమాన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్

బంగ్లాదేశ్ జట్టు: నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), తస్కిన్ అహ్మద్, లిటెన్ దాస్, సౌమ్య సర్కార్, తాంజిద్ హసన్ తమీమ్, షకీబ్ అల్ హసన్, తౌహిద్ హృదయ్, మహమూద్ ఉల్లా రియాద్, జాకర్ అలీ అనిక్, తన్వీర్ ఇస్లాం, మహిదీ హసన్, రిషాద్ హుస్సేన్, రిషాద్ హుస్సేన్, షోరిఫుల్ ఇస్లాం, తంజిమ్ హసన్ సాకిబ్.

రిజర్వ్‌ ప్లేయర్లు: అఫీఫ్ హుస్సేన్, హసన్ మహమూద్.

తాబేలు ఉంగరం ధరిస్తే ఏమవుతుంది?

Tortoise Ring: చాలా మంది తాబేలు ఉంగరం ధరిస్తుంటారు. అసలు దీనిని ధరించడం వల్ల లాభాలేంటి నష్టాలేంటి? అసలు ఎందుకు పెట్టుకుంటారు వంటి వివరాలను తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్రంలో తాబేలుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. తాబేలును విష్ణువుతో సమానంగా పూజిస్తారు.

తాబేలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని నమ్ముతారు.

విపరీతమైన కోపం ఉన్నవారు ఈ తాబేలు ఉంగరం ధరిస్తే శాంతంగా ఉంటారని పెద్దల విశ్వాసం.

తాబేలు ఉంగరం ధరించడం వల్ల ఆర్థికంగా లాభపడతారట. ఈ ఉంగరం ధరించినవారు ఎప్పడూ డబ్బుకు ఇబ్బందిపడరు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వెండితో తయారుచేసిన తాబేలు ఉంగరం ధరిస్తే మంచిది.

వేరే లోహంతో తయారుచేసినది పెట్టుకుంటే సమస్యలు వస్తాయట.

మకర, వృషభ రాశుల వారు ఈ ఉంగరాన్ని ధరిస్తే మంచిదట.

కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు దీనిని ధరించకూడదు.

దీనిని కుడి చేతి ఉంగర వేలుకు మాత్రమే ధరించాలి.

శుక్రవారం పూట సంధ్యా సమయంలో ధరిస్తే మంచిది.

Nagpur Temperature: నాగ్‌పుర్‌లో 56 డిగ్రీలు నిజం కాదు.. వాతావరణ శాఖ స్పష్టత

Nagpur Temperature: నాగ్‌పుర్‌లో 56 డిగ్రీలు నిజం కాదు.. వాతావరణ శాఖ స్పష్టత

నాగ్‌పుర్‌: దేశంలో వేసవి తీవ్రత (Heatwave) విపరీతంగా ఉంది. పలు రాష్ట్రాల్లో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో గతంలో లేనంత రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ (Nagpur)లో గల ఓ వాతావరణ స్టేషన్‌లో గురువారం ఏకంగా 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు చూపించింది. దీంతో ప్రజలు హడలిపోయారు. అయితే, అది నిజం కాదని ఆ తర్వాత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఉష్ణోగ్రతను నమోదు చేసే సెన్సర్‌ సరిగా పనిచేయడం లేదని స్పష్టతనిచ్చింది.

నాగ్‌పుర్‌లో భారత వాతావరణ విభాగం నాలుగు ఆటోమేటిక్‌ వెదర్‌ స్టేషన్స్‌ (AWS)ను ఏర్పాటుచేసింది. ఇందులో రెండింట గురువారం అసాధారణ ఉష్ణోగ్రతలు (Highest Temperature) చూపించాయి. సోనేగావ్‌లోని ఏడబ్ల్యూఎస్‌ స్టేషన్‌లో 54 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా.. ఉత్తర అంబాజరీ రోడ్డులోని ఐఎండీ కేంద్రంలో రికార్డు స్థాయిలో 56 డిగ్రీలు నమోదైంది. మిగతా రెండు స్టేషన్లలో 44 డిగ్రీల ఎండలు ఉన్నట్లు రికార్డయ్యింది. దీంతో ఈ వార్త దేశమంతా వైరల్‌గా మారింది.

సల్మాన్‌ఖాన్‌ హత్యకు కుట్ర … పాక్‌ నుంచి ఏకే-47 తుపాకులు..!

ముంబయి: ఈ ఏడాది ఏప్రిల్‌లో బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) ఇంటి వద్ద కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ‘ఇది ట్రైలర్‌ మాత్రమే.. ముందుంది అసలు సినిమా’ అంటూ నాడు గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ (Lawrence Bishnoi) సోదరుడు అన్మోల్‌ పోస్ట్‌ పెట్టాడు. తాజా పరిణామాలు చూస్తుంటే ఆ వార్నింగ్‌ నిజమేననిపిస్తోంది. గత కొంతకాలంగా సల్మాన్‌ను టార్గెట్‌ చేసిన బిష్ణోయ్‌ గ్యాంగ్‌.. పక్కా ప్లాన్‌తో నటుడి హత్యకు కుట్రలు పన్నుతున్నట్లు తెలిసింది. ఇందుకోసం పాక్ నుంచి ఆయుధాలను తెప్పించింది కూడా..! మరోవైపు, అతడి కదలికలను ఎప్పటికప్పుడు చేరవేసేందుకు 15-20 మంది నిత్యం రెక్కీ నిర్వహిస్తున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

ఏకే-47 తుపాకులతో..
బాంద్రాలో నటుడి ఇంటి వద్ద కాల్పుల కేసులో దర్యాప్తు చేపట్టిన ముంబయి పోలీసులకు.. మరో హత్య కుట్ర గురించి తెలిసింది. సల్మాన్‌ కారుపై ఏకే-47 తుపాకులతో దాడి చేసేందుకు బిష్ణోయ్‌ గ్యాంగ్‌ (Bishnoi gang) ప్లాన్‌ చేసినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. ఇందుకోసం ఈ గ్యాంగ్‌ పాకిస్థాన్‌ (Pakistan)కు చెందిన ఓ ఆయుధాల సప్లయిర్‌ నుంచి తుపాకులు కొనుగోలు చేసినట్లు పోలీసు వర్గాల సమాచారం. ఏకే-47, ఎం-16, ఏకే-92 తుపాకులు, హై-కాలిబర్‌ ఆయుధాలను తెప్పించినట్లు తెలుస్తోంది. వీటితో సల్మాన్ ఖాన్‌ కారును చుట్టుముట్టి కాల్పులు జరపడం లేదా.. పన్వేల్‌లోని ఆయన ఫామ్‌హౌస్‌లోకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించాలని నిందితులు పథకం రచించినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి.

ఫామ్‌హౌస్‌ చుట్టుపక్కల పక్కా నిఘా..
ఈ కుట్రకు సంబంధించి తాజాగా బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు చెందిన నలుగురు వ్యక్తులను నవీ ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌, అతడి సోదరుడు అన్మోల్‌, మరో గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ సహా 17 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి పన్వేల్‌లోని నటుడి ఫామ్‌హౌస్‌ (Salman Farmhouse) పరిసర ప్రాంతాల్లో బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు చెందిన 15-20 మంది నివసిస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది. వీరంతా ఈ ప్రాంతంలో నిరంతరం రెక్కీ చేస్తూ సల్మాన్‌ కదలికలకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నట్లు సమాచారం. వీరి కోసం పోలీసులు ఇప్పుడు జల్లెడ పడుతున్నారు.

నాడే ఫామ్‌హౌస్‌లోకి వెళ్లేందుకు కుట్ర..
ఈ ఏడాది జనవరిలోనూ నటుడి (Bollywood Actor Salman Khan)పై దాడికి బిష్ణోయ్‌ గ్యాంగ్‌ విఫలయత్నం చేసింది. పన్వేల్‌లో ఆయనకు చెందిన అర్పితా ఫామ్‌హౌస్‌లోకి అక్రమంగా చొరబడేందుకు ఇద్దరు దుండగులు ప్రయత్నించారు. నటుడి అభిమానులమని చెబుతూ అజేష్ కుమార్ ఓం ప్రకాష్ గిల్, గురుసేవక్ సింగ్ తేజ్‌సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు సెక్యూరిటీ చెకింగ్‌లో నకిలీ ఐడీలు చూపించారు. వారి కదలికలు అనుమానాస్పదంగా అనిపించడంతో సిబ్బంది వారిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. దీనిపై దర్యాప్తు జరుగుతోంది.

రాజస్థాన్‌లో కృష్ణజింకలను వేటాడి చంపిన కేసులో సల్మాన్‌ ఖాన్‌ పేరు బయటకు వచ్చిన నాటి నుంచి బిష్ణోయ్‌ గ్యాంగ్ నటుడిని టార్గెట్ చేసింది. ఇటీవలి కాలంలో తమ ప్రణాళికలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. కెనడా కేంద్రంగా ఈ కుట్రలు జరుగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

‘ఓ తల్లికి కడుపుకోత’! – జిల్లా కేంద్రాసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంపై వెలసిన ఫ్లెక్సీలు

టెక్కలిలో జిల్లా కేంద్రాసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంపై ‘ఓ తల్లికి కడుపుకోత’ పేరిట వెలసిన ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి.

టెక్కలి మండలం రావివలస పంచాయతీ చిన్ననారాయణపురానికి చెందిన దాసరి మురళి, నిరోషా దంపతుల కుమారుడు సాయివినీత్‌(12).. మే 21న తోటిపిల్లలతో కలిసి క్రికెట్‌ ఆడాడు. పొదల్లోకి బాలు వెళ్లగా.. దాన్ని తీసుకువచ్చేందుకు వెళ్లిన సాయివినీత్‌కు ఏదో కరవడంతో..

కాసేపటికి స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే ఆ బాలుడ్ని కుటుంబ సభ్యులు టెక్కలిలోని జిల్లాకేంద్రాసుపత్రికి తరలించారు. వైద్యసిబ్బంది ఆ బాలుడికి ముల్లు గుచ్చి ఉంటుందేమోనని భావించి.. సుమారు రెండు గంటలపాటు నిర్లక్ష్యం చేసి..

తూతూమంత్రంగా వైద్యసేవలందించారు. చివరికి బాలుడి పరిస్థితి విషమించడంతో చేతులెత్తేసి.. శ్రీకాకుళంలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(రిమ్స్‌)కి రిఫర్‌ చేశారు. అంబులెన్స్‌లో తరలిస్తుండగా..

నరసన్నపేట చేరుకునేసరికి బాలుడి పరిస్థితి మరింత విషమించింది. అక్కడ ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా సాయివినీత్‌ మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. ఒక్కగానొక్క కుమారుడు కళ్లెదుటే మృతి చెందడంతో ఆ తల్లి తట్టుకోలేకపోయింది.

22న ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడింది. కాగా.. తమ కుమారుడు జ్ఞాపకాలు వెంటాడుతునే ఉండడంతో ఆ దంపతులకు కన్నీళ్లు ఆగడం లేదు.

తమకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదనే ఉద్దేశంతో.. ‘ఓ తల్లికి కడుపుకోత’ అంటూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ టెక్కలిలో పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ‘మాకు కడుపుకోత మిగిల్చిన మీకు శ్రద్ధాంజలి. పాముకాటుకు, ముళ్లు గుచ్చుకోవడానికి తేడా తెలియని వారికి శతకోటి వందనాలు’ అంటూ వైద్యుల నిర్లక్ష్యం తీరును ఎండగట్టారు. ఇప్పటికే రిఫరల్‌ ఆస్పత్రిగా పేరొందిన జిల్లాకేంద్రాసుపత్రిలో వైద్యుల తీరు మరోసారి చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మెరుగైన వైద్యసేవలందించేలా చర్యలు చేపట్టాలని పలువురు వేడుకుంటున్నారు.

దేవుడు అన్ని గమనిస్తూనే ఉంటాడు.. ఈ వీడియోనే నిదర్శనం…

మనం మంచి చేసినా.. చెడు చేసినా దానిని దేవుడు గమనిస్తూనే వుంటాడని పెద్దలు చెప్తుంటారు. సోషల్ మీడియా పుణ్యంతో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
రోడ్డు సిగ్నల్ వద్ద ఓ మహిళా భిక్షాటన చేస్తున్న మహిళను.. ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోవాల్సిందిగా మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ కాలితో తంతూ అక్కడ నుంచి వెళ్లగొట్టింది. ఆపై తన విధులను నిర్వర్తించేందుకు ప్రారంభించింది.

ఇంతలో ఏమైందో ఏమో కానీ ఎండకు తలతిరిగి కిందపడిపోయింది. అప్పుడు పక్కనే ఆమె వెళ్లగొట్టిన మహిళా భిక్షాటకురాలు ఆమె వద్ద వున్న వాటర్ బాటిల్‌లోని నీటిని మహిళా కానిస్టేబుల్ ముఖంపై చల్లి లేపింది. కాసిన్ని నీళ్లు కూడా తాగించింది.

దీంతో ట్రాఫిక్ పోలీస్ ఆ మహిళ చేయి పట్టుకుని నిలబడగలిగింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన వారంతా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ఈ క్రికెటర్​ను గుర్తుపట్టారా? వరల్డ్ కప్​లో ఆడాల్సినోడు.. మట్టి పిసుక్కుంటున్నాడు!

కెరీర్​లో ఎక్కడో ఉంటారనుకునే కొందరు క్రికెటర్లు.. కొన్ని కారణాల వల్ల అనుకున్నంతగా ఎదగరు. ఊహించిన స్థాయికి ఆటగాళ్లు చేరుకోకపోతే వాళ్లే కాదు.. ఆరాధించే అభిమానులు కూడా నిరాశకు లోనవుతారు.

ఇప్పుడో క్రికెటర్ విషయంలో టీమిండియా ఫ్యాన్స్ ఇలాగే బాధ పడుతున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే ఈపాటికి టీ20 వరల్డ్ కప్-2024​లో ఆడేవాడు. భారత జట్టుతో కలసి ప్రాక్టీస్ చేస్తూ బిజీబిజీగా ఉండేవాడు. ప్రపంచ కప్​లో టీమిండియాకు ఆడాలనే డ్రీమ్​ను నెరవేర్చుకునేవాడు. కానీ అలా జరగలేదు. మెగా టోర్నీలో ఆడాల్సినోడు.. ఇప్పుడు మట్టి పిసుక్కుంటున్నాడు. వరల్డ్ కప్​ స్క్వాడ్​లో అతడికి చోటివ్వలేదు సెలెక్టర్లు. అతడికి బదులు ఐపీఎల్​లో రాణించిన సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్​ను టీమ్​లోకి తీసుకున్నారు.

గతేడాది భారత జట్టులో విజయాల్లో అతడు కీలకపాత్ర పోషించాడు. వన్డేలు, టీ20ల్లో జట్టులో రెగ్యులర్ ప్లేయర్​గా మారాడు. ముఖ్యంగా పొట్టి ఫార్మాట్​లో టీమ్ సక్సెస్​లో అతడు కీలకంగా మారాడు. సుడులు తిరిగే లెగ్ కట్టర్స్, గూగ్లీలతో ప్రత్యర్థి బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించాడు. టీమ్​ కోసం అవసరమైతే ఫస్ట్ ఓవర్ కూడా వేశాడు. పరుగులు కట్టడి చేయడమే గాక వికెట్లు కూడా తీస్తూ జట్టుకు తిరుగులేని అస్సెట్​గా మారాడు. అతడే యంగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్. ఐపీఎల్​-2024కు ముందు జరిగిన ఆఫ్ఘానిస్థాన్ సిరీస్​లోనూ ఆడిన బిష్ణోయ్.. ఇప్పుడు మాత్రం టీమ్​లో లేకుండా పోయాడు. అతడ్ని మొదట్నుంచి టీ20 ప్రపంచ కప్ కోసమే సిద్ధం చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది టీమ్ మేనేజ్​మెంట్. అయినా అతడ్ని జట్టులోకి తీసుకోలేదు.

ఐపీఎల్​-2024కు ముందు వరకు అద్భుతంగా బౌలింగ్ చేస్తూ వచ్చిన బిష్ణోయ్ క్యాష్​ రిచ్ లీగ్​లో ఫెయిలయ్యాడు. వికెట్లు తీయకపోవడమే గాక భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు. దీంతో అప్పటిదాకా అతడు పడిన కష్టం కాస్తా వృథా అయింది. ఐపీఎల్​ కాదు.. ఇంటర్నేషనల్ క్రికెట్​ పెర్ఫార్మెన్స్​ను పరిగణనలోకి తీసుకొనే ఆటగాళ్లను ఎంపిక చేస్తామన్న బీసీసీఐ హ్యాండ్ ఇచ్చింది. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ సిరాజ్ లాంటి వాళ్ల విషయంలో ఐపీఎల్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోని బోర్డు.. రింకూ సింగ్, బిష్ణోయ్ విషయంలో మాత్రం దాన్నే ప్రధానంగా తీసుకొని వరల్డ్ కప్​కు సెలెక్ట్ చేయలేదు.

రవి బిష్ణోయ్​కు బదులుగా యుజ్వేంద్ర చాహల్​ను టీమ్​లోకి తీసుకున్నారు. దీంతో నిరాశలో కూరుకుపోయిన యంగ్ స్పిన్నర్.. ఐపీఎల్ ముగిసిన వెంటనే సొంతూరికి వెళ్లిపోయాడు. బంధువులతో కలసి అక్కడ టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మట్టి పొయ్యిని తయారు చేస్తూ ఓ ఫొటో దిగాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ బీసీసీఐపాలిటిక్స్​కు బిష్ణోయ్ బలిపశువుగా మారాడని కామెంట్స్ చేస్తున్నారు. బోర్డు చెత్త రాజకీయాల వల్ల అతడు ఇంటి దగ్గర కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఇలాంటి చెత్త నిర్ణయాల వల్లే భారత జట్టు ఐసీసీ ట్రోఫీలు నెగ్గడం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.

Dinner Time Mistakes: రాత్రి సమయంలో మీరు చేసే ఈ 5 తప్పులే బరువు పెరగడానికి అసలు కారణం..

Dinner Time Mistakes for weight gain: ఈ మధ్యకాలంలో అతిబరువుతో ఎక్కువ మంది బాధపడుతున్నారు. వెయిట్ లాస్ అవ్వడం అంత సులభం కాదు. అయితే, మనం బరువు పెరగకుండా ఉండడానికి కొన్ని చర్యలు తీసుకోవాలి.

మంచి డైట్, లైఫ్ స్టైల్, నిద్ర లేమి ఇవన్నీ బరువు పెరగడానికి అసలైన కారణాలు. బ్రేక్ఫాస్ట్ సమయం నుంచి రాత్రి భోజనం కొరకు మీరు తీసుకునే ఆహారం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మన జీవితంలో రాత్రి భోజనం ఎంతో ముఖ్యం అయితే, తీసుకునే ఆహారం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా మీరు రాత్రి సమయంలో కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. దీనివల్ల బరువు విపరీతంగా పెరిగిపోతారు. రాత్రి సమయంలో జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది. అందుకే హెవీ మీల్స్ తినకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ మొత్తంలో ఒకేసారి తీసుకోకుండా కొద్ది మొత్తంలో ఎక్కువసార్లు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అయితే రాత్రి పడుకునే ముందు ఎలాంటి పనులకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం.

భోజనం స్కిప్ చేయడం..
కొంతమంది రాత్రి సమయంలో భోజనం తినకుండా అలాగే పడుకుంటారు. అయితే ఇలా చేయడం వల్ల కూడా బాడీ మెటమాలిజం రేటు పై ప్రభావం పడుతుంది. ఆరోగ్య సమస్యలు వస్తాయి. మీరు భోజనం చేయకుంటా ఉండే బదులు సమతుల ఆహారం తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి. బరువు తగ్గడానికి రాత్రి సమయంలో భోజనం తినకుండా ఉంటే ఇది ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

భోజనం రాత్రి సమయంలో ఎక్కువ మొత్తంలో తింటారు. అది కూడా లేట్ నైట్ తినడం వల్ల ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం బరువు పెరగకుండా ఉంటారు. నిద్ర సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.కార్బోహైడ్రేట్స్ కూడా ఒక సమతుల ఆహారంలో ఒక భాగం అయితే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ మోతాదులో ఉండే ఆహారాలు రాత్రి సమయంలో తీసుకోకూడదు.ఈ ఆహారాలు బరువు పెరగడానికి కారణం అవుతాయి. సమతుల ఆహారం ఉండే కూరగాయలు వంటి ఆహారాలు మీ డిన్నర్నల్లో చేర్చుకోండి.

బరువు పెరగకుండా ఉండటానికి రాత్రి భోజనంలో ఫ్రైడ్ చేసిన ఆహారాలు తీసుకోకుండా దూరంగా ఉండాలి. అంతేకాదు ప్రాసెస్ చేసిన ఆహారాలు కూడా తీసుకోకూడదు. ఇది జీర్ణ ఆరోగ్యం పై ప్రభావం చూటమే కాదు, అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఇందులో కొవ్వులు, ఉప్పు ఎక్కువ మోతాదులో ఉంటాయి. అంతేకాదు క్యాలరీలు కూడా ఉంటాయి. గ్రిల్ చేసిన వాటికంటే ఉడికించిన ఆహారాలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఈ సమయంలో ఇంట్లో చేసుకున్న ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి. మీరు తీసుకునే ఆహారం ప్లేట్ కూడా చిన్నగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ మోతాదులో ఒకేసారి తినడం వల్ల బరువు అతిగా పెరిగిపోతారు. చిన్న మొత్తంలో ఎక్కువ సార్లు తినడానికి ప్రాధాన్యత ఇవ్వండి.

Cholesterol Tips: రెండు పదార్ధాలు చిటికెడు తీసుకుంటే చాలు కొలెస్ట్రాల్ మాయం

Cholesterol Tips: గత కొద్దికాలంగా లైఫ్‌స్టైల్ వ్యాధులు పెరిగిపోతున్నాయి. అధిక రక్తపోటు, మధుమేహం, గుండె వ్యాధులు, కొలెస్ట్రాల్ ఇలా ఒకదానికొకటి ఉత్పన్నమౌతున్నాయి.

ఈ అన్నింటికీ కారణంగా కొలెస్ట్రాల్. రక్తంలో పేరుకుపోతున్న చెడు కొలెస్ట్రాల్ మిగిలిన అన్ని అనారోగ్య సమస్యలకు కారణమౌతుంది. అందుకే కొలెస్ట్రాల్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎప్పటికప్పుడు తగ్గించుకుంటుండాలి. లేకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముందుగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. కొన్ని ఆహార పదార్ధాలు డైట్‌లో తప్పకుండా ఉండేట్టు చూసుకోవాలి. కొలెస్ట్రాల్ కారణంగా రక్తం గుండె వరకూ చేరడంలో ఇబ్బంది తలెత్తి గుండె వ్యాధులు సంభవిస్తుంటాయి. ముఖ్యంగా రెండు పదార్ధాలు తప్పకుండా తీసుకోవాలంటారు వైద్య నిపుణులు. రోజూ క్రమం తప్పకుండా ఈ రెండు పదార్ధాలు తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ వేగంగా తగ్గుతాయి. కేవలం కొలెస్ట్రాల్ తగ్గించడమే కాకుండా ఆరోగ్యపరంగా ఇంకా చాలా ప్రయోజనాలు చేకూరుతాయి.

ప్రతి కిచెన్‌లో లభించే దాల్చిన చెక్క అద్భుతమైన ఔషధమనే చెప్పాలి. దాల్చిన చెక్క రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో హై కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ముందుగా దాల్చిన చెక్కను పౌడర్‌గా చేసుకుని భద్రపర్చుకోవాలి. రోజూ ఉదయం లేచినవెంటనే కేవలం చిటికెడు దాల్చిన చెక్క పౌడర్ తీసుకోవాలి. కొన్నిరోజుల్లోనే మంచి ఫలితాలు కన్పిస్తాయి. అయితే చిటికెడు మించి తీసుకోకూడదు. ఎందుకంటే స్వభావరీత్యా వేడి చేస్తుంది. అందుకే చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి.

మరో అద్బుతమైన పదార్ధం ఫ్లక్స్ సీడ్స్. ఈ సీడ్స్ తీసుకుంటే చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ముఖ్యంగా కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఫ్లక్స్ సీడ్స్ అద్బుతంగా పనిచేస్తాయి. ఫ్లక్స్ సీడ్స్ విత్తనాలను మిక్సీలో పౌడర్‌గా చేసుకుని ఉంచుకోవాలి. రోజూ ఉదయం ఓ గ్లాసు గోరు వెచ్చని నీటిలో ఒక స్పూన్ ఫ్లక్స్ సీడ్స్ పౌడర్ కలుపుకుని తాగుతుండాలి. ఇలా చేయడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా ఇంకా ఇతర ప్రయోజనాలు కలుగుతాయి.

Marriage dates in 2024: కళ్యాణ గడియలు వచ్చేస్తున్నాయ్ – జూన్‌, జులైలో పెళ్లి ముహూర్తాల తేదీలు ఇవే!

Wedding Dates 2024: కల్యాణం అనే కమనీయ ఘట్టం ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో కీలకమైంది. హిందూ మతంలో వివాహ కార్యక్రమానికి సంబంధించి ఎన్నో ఆచారాలు, వ్యవహారాలు, కట్టుబాట్లు, సంప్రదాయాలున్నాయి.

ఒక్కప్పుడు ఇద్దరు వ్యక్తులకు పెళ్లి చేయాలంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసేవారు. కాలక్రమేణా వివాహ ఘట్టంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఎన్ని మార్పులు వచ్చినా పెళ్లి ముహూర్తాలకు మాత్రి ప్రతిఒక్కరూ ప్రాధాన్యత ఇస్తుంటారు.

మన దేశంలో వివాహానికి సంబంధించి పలు ప్రాంతాల్లో పలు రకాల ఆచారాలను, సంప్రదాయాలను పాటిస్తుంటారు. కొన్ని చోట్ల మూడు రోజుల పాటు పెళ్లి వేడుకలను జరుపుకుంటే.. ఇంకొన్ని చోట్ల ఐదు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. ఇంకొందరైతే 16 రోజులు జరుపుకుంటారు. భారతీయ వివాహ వ్యవస్థకు ఇప్పటికే ప్రత్యేకస్థానం ఉండటానికి ఇదే కారణం.

ఇక జ్యోతిష్యం, పంచాంగం ప్రకారం పెళ్లి వంటి ముఖ్యమైన కార్యాలకు, జాతకంలోని శుక్రుడి స్థానాన్ని కీలకంగా తీసుకుంటారు. కొత్త కాలంగా పెళ్లికి సంబంధించి మంచి ముహూర్తాలు లేవు. మూడాలు ఉండటంతో మార్చి వరకే పెళ్లిళ్ల ముహూర్తాలు పెట్టారు పురోహితులు. అయితే మరికొన్ని రోజుల్లోనే అద్భుతమైన ముహుర్తాలు రానున్నాయి. అందుకే తమ పిల్లలకు వివాహం చేసేందుకు ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 11వ తేదీ నుంచి మాఘమాసం ప్రారంభమైంది. ఈ సమయం నుంచి ఏప్రిల్ 26వ తేదీ వరకు పెళ్లిళ్లు జరిగాయి. అయితే ఆ తర్వాత మూఢం, శూన్యమాసం వచ్చింది. ఈ మధ్య కాలంలో వివాహాది కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత మళ్లీ శ్రావణ మాసంలోనే వివాహాలకు శుభ ముహుర్తాలు ఉన్నాయని పండితులు అంటున్నారు.

వచ్చే నెల జూన్ , జులైలో పెళ్లి ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. జూన్ 29, శనివారం జూలై 9, మంగళవారం, జూలై 11, గురువారం, జూలై 12, శుక్రవారం, జూలై 13, శనివారం, జూలై 14, ఆదివారం, జూలై 15, సోమవారం తేదీల్లో మాఘ, ఉత్తర ఫాల్గుణి, హస్తా, స్వాతి నక్షత్రాల వేళ శుభ ముహుర్తాలు ఉన్నాయి.

అయితే తర్వాత వచ్చే చాతుర్మాసం కారణంగా ఆగస్టు 2024 నుంచి అక్టోబర్ 2024 వరకు తెలుగు ముహూర్తాలకు తేదీలు లేవని చెబుతున్నారు పురోహితులు. మళ్లీ నవంబరులో ఉత్తర భాద్రపద, రేవతి, రోహిణి, మార్గశిర, హస్త, స్వాతి నక్షత్రం వేళ వివాహానికి శుభ ముహుర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత డిసెంబర్ నెలలో కూడా వివాహాది శుభకార్యక్రమాలకు శుభ ముహూర్తాలు ఉన్నాయి.

ఈసారి దేశవ్యాప్తంగా లక్షలాది పెళ్లిళ్లు జరగనున్నాయి. ఒక్కో ముహుర్తానికి వేలాది సంఖ్యలో పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. త్వరలోనే అంటే వచ్చే నెలలోనే వివాహాది శుభ కార్యక్రమాలకు శుభ ముహుర్తాలు ప్రారంభం కావడంతో మార్కెట్లో వ్యాపారాలు కూడా జోరందుకునే అవకాశం కనిపిస్తోంది.

ఫోన్‌పే వాడే వారికి ఈజీగా లోన్! ఇక ఎవ్వరిని అప్పు అడగాల్సిన పని లేదు!

ప్రస్తుతం అంతా డిజిటల్ పేమెంట్స్ చేసేందుకే మొగ్గుచూపుతున్నారు. డిజిటల్ పేమెంట్స్ యాప్స్ అందుబాటులోకి వచ్చాక చెల్లింపుల విధానం ఈజీ అయిపోయింది.

చేతిలో నగదు లేకున్నా సరే ఆన్ లైన్ పేమెంట్స్ చేయొచ్చు. దాదాపు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరు గూగుల్ పే, ఫోన్ పే వంటి చెల్లింపు యాప్స్ ని వినియోగిస్తున్నారు. అయితే ఈ యాప్స్ ద్వారా ట్రాన్సాక్షన్స్ మాత్రమే కాదు.. మీ తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు లోన్ కూడా పొందొచ్చు. మీరు ఫోన్ పే వాడుతున్నట్లైతే మీకు గుడ్ న్యూస్. ఇప్పుడు ఫోన్ పే పలు రకాల లోన్స్ ను అందిస్తోంది. నిమిషాల వ్యవధిలోనే రుణం పొందొచ్చు. అప్పు కోసం ఎవరి వద్దకో వెళ్లాల్సిన పనిలేదు.

ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్ ఫోన్ పే తన యూజర్ల కోసం లోన్స్ అందించేందుకు రెడీ అయ్యింది. బంగారం నుంచి కారు, బైక్ కొనుగోలు వరకు రుణాలు పొందొచ్చు. ఫోన్ పే ఈ కొత్త సర్వీసులను యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఇది వరకు ఫోన్ పే ద్వారా పర్సనల్ లోన్స్ ను పొందే సౌలభ్యం ఉండేది. ఈ లోన్స్ ను ఇతర లెండింగ్ సంస్థలతో కలిసి అందించేది. ఇకపై ఫోన్‌పే ద్వారా ఇతర రుణాలు కూడా పొందొచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌పై లోన్స్ తీసుకోవచ్చు. ఇంకా గోల్డ్ లోన్స్, బైక్ లోన్స్, కారు లోన్స్, హోమ్ లోన్స్ వంటివి తీసుకోవచ్చు. ప్రాపర్టీ మీద కూడా రుణాలు లభిస్తాయి. ఎడ్యుకేషన్ లోన్స్ కూడా పొందొచ్చు.

యూజర్లకు లోన్స్ అందించేందుకు ఫోన్‌పే పలు లెండింగ్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఫిన్‌టెక్ సంస్థలు ఇందులో ఉన్నాయి. టాటా క్యాపిటల్, ఎల్అండ్‌టీ ఫైనాన్స్, హీరో ఫిన్‌కార్ప్, ముత్తూట్ ఫిన్‌కార్ప్, డీఎంఐ హౌసింగ్ ఫైనాన్స్, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్, రూపే, వోల్ట్ మనీ, గ్రేడ్ రైట్ వంటి పలు సంస్థలతో ఫోన్‌పే ఒప్పందం కుదుర్చుకుంది. ఆన్ లైన్ లోనే ఈజీగా లోన్ పొందొచ్చు. ఫోన్ పే యూజర్లు నిమిషాల్లోనే రూ. 5 లక్షల వరకు సులభంగా లోన్ పొందొచ్చు. ఫోన్ పే రూల్స్ ప్రకారం అర్హులైన యూజర్లకు లోన్స్ అందించనుంది.

Highest Temperature: దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత.. 56 డిగ్రీలు నమోదు.. 24 గంటల్లో 54 మంది మృతి

Highest Temperature: ఈసారి ఎండాకాలం మామూలుగా లేదు. మాడు పగిలే ఎండలతో దేశ చరిత్రలోని రోజురోజుకూ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ ఉన్నాయి. మొదట రాజస్థాన్‍‌లోని ఫలోడీలో ఏకంగా 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. ఇది జరిగిన కొన్ని రోజులకే దేశ రాజధాని ఢిల్లీలోని ముంగేష్ పూర్‌లో ఏకంగా 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై.. భారతదేశ చరిత్రలోనే అత్యంత అధిక ఉష్ణోగ్రతగా రికార్డు సృష్టించింది. ఈ క్రమంలోనే తాజాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్ ఈ రికార్డును రెండు రోజుల్లోనే చెరిపేసింది. మన దేశ చరిత్రలో ఇప్పటివరకు నమోదు కాని విధంగా ఏకంగా 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై.. సంచలనం సృష్టించింది. ఈ ఎండకు నాగ్‌పూర్ వాసులు తట్టుకోలేకపోయారు.

భారత వాతావరణ విభాగం.. నాగ్‌పుర్‌లో 4 ఆటోమేటిక్‌ వెదర్‌ స్టేషన్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే ఆ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్‌లో రెండింట్లో గురువారం అసాధారణ ఉష్ణోగ్రతలు చూపించడం సంచలనంగా మారింది. సోనేగావ్‌లోని ఏడబ్ల్యూఎస్‌ స్టేషన్‌లో ఏకంగా 54 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. ఉత్తర అంబాజరీ రోడ్డులోని ఐఎండీ కేంద్రంలో రికార్డు స్థాయిలో 56 డిగ్రీలు నమోదైంది. మిగతా రెండు స్టేషన్లలో 44 డిగ్రీల ఎండలు ఉన్నట్లు రికార్డు అయింది.

ఇక ఇటీవల ఢిల్లీలోని ముంగేష్‌పుర్‌లో 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది దేశ చరిత్రలో అత్యధికం కావడంతో వాతావరణ శాఖ స్పందించింది. ఆ వాతావరణ స్టేషన్‌లోని సెన్సార్‌ సరిగా పనిచేస్తుందో లేదో తనిఖీ చేస్తున్నట్లు ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర వెల్లడించారు. ఈ క్రమంలోనే తాజాగా నాగ్‌పుర్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడం మరోసారి చర్చకు దారితీసింది. దీంతో సెన్సార్‌ పనితీరుపై మరోసారి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇప్పటికే వడదెబ్బ కారణంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 24 గంటల వ్యవధిలోనే 54 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా బీహార్‌లో 32 మంది చనిపోగా.. ఆ తర్వాత ఒడిషాలో 10 మంది, జార్ఖండ్‌లో ఐదుగురు, రాజస్థాన్‌లో ఐదుగురు, ఉత్తరప్రదేశ్‌లో ఒకరు, ఢిల్లీలో ఒకరు మరణించారు. ఇక రానున్న రెండు రోజుల్లో ఉత్తర్‌ప్రదేశ్, ఢిల్లీ, చండీగఢ్‌, హర్యానాలోని పలు ప్రాంతాల్లో దుమ్ము తుపాను వచ్చే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తీవ్రమైన వడగాలులు ఉన్నందున దేశంలో జాతీయ ఎమర్జెన్సీని విధించే అవకాశాలను పరిశీలించాలని రాజస్థాన్‌ హైకోర్టు కేంద్రానికి సూచించింది.

మరోవైపు దేశంలోకి కాస్త ముందుగానే ఇప్పటికే నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో ప్రజలకు ఇది కాస్త ఊరటనిచ్చే విషయం. గురువారం కేరళ తీరాన్ని తాకిన ఈ నైరుతి రుతుపవనాలు.. ప్రస్తుతం దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల్లో క్రమంగా విస్తరిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కూడా కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో దేశం మొత్తం విస్తరించే అవకాశం ఉండటంతో శనివారం నుంచి వడగాలుల తీవ్రత కాస్త తగ్గొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై శనివారం క్లారిటీ రానుందా!

పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై శనివారం క్లారిటీ రానుందా!

పోస్లల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో వైసీపీ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్
ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు విషయంలో వైసీపీ వేసిన పిటిషన్ మీద హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్‌కు సంబంధించి ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల్లోని ఓ నిబంధనపై వైసీపీ అభ్యంతరం తెలుపుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల మీద రిటర్నింగ్ అధికారి సీల్ లేకున్నా కూడా అనుమతించాలని సూచించింది. అయితే దీనిపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. క్రమంలోనే ఈ నిబంధన మీద హైకోర్టును ఆశ్రయించగా.. వైసీపీ పిటిషన్ మీద విచారణ జరిపిన హైకోర్టు.. తీర్పును హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు సాయంత్రం 6 గంటలకు తీర్పు చెబుతామని పేర్కొంది.

Bhaje Vaayu Vegam Review: రివ్యూ: భజే వాయు వేగం.. కార్తికేయ హిట్‌ కొట్టారా?

Bhaje Vaayu Vegam Review: రివ్యూ: భజే వాయు వేగం.. కార్తికేయ హిట్‌ కొట్టారా?
చిత్రం: భజే వాయు వేగం; నటీనటులు: కార్తికేయ, ఐశ్వర్య మేనన్, రాహుల్‌ టైసన్, తనికెళ్ల భరణి, శరత్‌ లోహితస్వ, పి.రవిశంకర్, కృష్ణచైతన్య, సుదర్శన్‌ తదితరులు; సంగీతం: కపిల్‌ కుమార్‌; ఛాయాగ్రహణం: ఆర్‌.డి.రాజశేఖర్‌; రచన, దర్శకత్వం: ప్రశాంత్‌ రెడ్డి; నిర్మాణ సంస్థ: యూవీ కాన్సెప్ట్స్‌; విడుదల తేదీ: 31-05-2024.

గత కొన్నేళ్లుగా ఎదురవుతున్న వరుస పరాజయాలకు ‘బెదురులంక 2012’ సినిమాతో చెక్‌ పెట్టారు హీరో కార్తికేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda). ఈ జోష్‌లోనే ఇప్పుడు ‘భజే వాయు వేగం’ (Bhaje Vayu Vegam)తో అలరించేందుకు సిద్ధమయ్యారు. ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’, ‘గామి’ విజయాల తర్వాత యూవీ సంస్థ నుంచి వచ్చిన చిత్రమిది. కొత్త దర్శకుడు ప్రశాంత్‌ రెడ్డి తెరకెక్కించారు. టీజర్, ట్రైలర్లు ఆసక్తి రేకెత్తించేలా ఉండటంతో ప్రేక్షకుల్లో దీనిపై మంచి అంచనాలేర్పడ్డాయి. మరి, ఈ చిత్ర కథేంటి? అది సినీప్రియులకు ఎలాంటి అనుభూతిని అందించింది? తెలుసుకుందాం పదండి (Bhaje Vaayu Vegam Review in Telugu)..

కథేంటంటే: వరంగల్‌ సమీపంలోని రాజన్నపేటకు చెందిన కుర్రాడు వెంకట్‌ (కార్తికేయ). తల్లిదండ్రులు వ్యవసాయంలో నష్టాలు రావడంతో అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటారు. దీంతో అనాథైన వెంకట్‌ను తండ్రి స్నేహితుడు లక్ష్మయ్య (తనికెళ్ల భరణి) చేరదీసి.. తన కొడుకు రాజు (రాహుల్‌ టైసన్‌)తో పాటు పెంచి పెద్ద చేస్తాడు. క్రికెటర్‌ అవ్వాలన్న లక్ష్యంతో వెంకట్‌.. మంచి ఉద్యోగం సంపాదించాలన్న కోరికతో రాజు ఊరి నుంచి హైదరాబాద్‌కు వస్తారు. కానీ, కొందరు చేసిన కుట్రల వల్ల అనుకున్న లక్ష్యాల్ని చేరుకోలేకపోతారు. దీంతో వెంకట్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లు వేస్తూ.. రాజు ఓ స్టార్‌ హోటల్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తుంటారు. ఓసారి వాళ్ల తండ్రి అనారోగ్యానికి గురవుతాడు. ఆయన్ని కాపాడాలంటే ఆపరేషన్‌ చేయాలని.. అందుకు రూ.20 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెబుతారు. దీంతో ఆ డబ్బు సంపాదించే క్రమంలో వెంకట్‌.. డేవిడ్‌ (రవిశంకర్‌) గ్యాంగ్‌ దగ్గర క్రికెట్‌ బెట్టింగ్‌ వేస్తాడు. ఆ బెట్టింగ్‌లో వెంకట్‌ గెలిచినా.. తను గెలుచుకున్న డబుల్‌ అమౌంట్‌ రూ.40లక్షలు ఇచ్చేందుకు డేవిడ్‌ మనుషులు నిరాకరిస్తారు. పైగా రాత్రి 9గంటల కల్లా రూ.40 లక్షలు ఎదురు ఇవ్వాలని.. లేదంటే చంపేస్తామని బెదిరించి వెళ్తారు. ఈ క్రమంలో వెంకట్‌ చేసేదేమీ లేక డేవిడ్‌ కొనుక్కున్న కొత్త కారును తన అన్నతో కలిసి కొట్టేస్తాడు. అయితే దాంట్లో డేవిడ్‌కు చెందిన రూ.8 కోట్లతో పాటు, రూ.5000 కోట్ల హవాలా డబ్బుకు సంబంధించిన రూ.2 వేల నోటు ఉంటుంది. అంతేకాకుండా డేవిడ్‌ అన్న, హైదరాబాద్‌ మేయర్‌ జార్జ్‌ (శరత్‌ లోహితస్వ) కొడుకు శవం కూడా ఉంటుంది. దీంతో ఆ కారును దక్కించుకునేందుకు డేవిడ్‌ తన గ్యాంగ్‌తో వెంకట్‌ వెంటపడతాడు. మరోవైపు కనిపించకుండా పోయిన జార్జ్‌ కొడుకు కోసం హైదరాబాద్‌ పోలీసులంతా సిటీని జల్లెడ పడతారు. మరి, ఆ తర్వాత ఏమైంది? ఓవైపు డేవిడ్‌ గ్యాంగ్‌ నుంచి.. మరోవైపు పోలీసుల నుంచి వెంకట్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? తన తండ్రిని కాపాడుకునేందుకు తనేం చేశాడు? అసలు జార్జ్‌ – డేవిడ్‌ల కథేంటి? తన అన్న కొడుకును డేవిడ్‌ ఎందుకు చంపాడు? ఈ నిజం జార్జ్‌కు తెలిసిందా? అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి (Bhaje Vaayu Vegam Review).

ఎలా సాగిందంటే: తండ్రి సెంటిమెంట్‌ను.. ఓ క్రైమ్‌ ఎలిమెంట్‌ను మిళితం చేసి రూపొందించిన థ్రిల్లర్‌ ‘భజే వాయు వేగం’. క్రికెటర్‌ అవ్వాలన్న లక్ష్యంతో పల్లెటూరి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ సామాన్య కుర్రాడు.. తండ్రి ప్రాణాలను కాపాడుకునే క్రమంలో ఒక అసాధారణమైన క్రైమ్‌లో ఇరుక్కుంటే దానినుంచి ఎలా బయటపడ్డాడన్నది క్లుప్తంగా ఈ చిత్ర కథాంశం. లైన్‌గా చూసుకున్నప్పుడు దీంట్లో ఓ మంచి యాక్షన్‌ థ్రిల్లర్‌కు కావాల్సిన మసాలాలన్నీ చక్కగా కుదిరినట్లు అనిపిస్తుంది.. ప్రచార చిత్రాల్ని కట్‌ చేసిన తీరు చూస్తే ఈ చిత్రం టైటిల్‌ కూడా దీనికి సరిగ్గా కుదిరినట్లే కనిపించింది.. కానీ, తెరపై సినిమా చూస్తున్నప్పుడు కథనమంతా చాలా రొటీన్‌గా నెమ్మదిగా సాగిన అనుభూతి కలుగుతుంది. పైగా దీంట్లో ఉన్న ఒకటి, రెండు ట్విస్టులు కూడా ఊహకు అందేలాగే ఉంటాయి. ఇక నాయకానాయికల మధ్య వచ్చే చిన్న ప్రేమ కథ కూడా ఏమాత్రం మెప్పించదు. విరామ సన్నివేశాలు థ్రిల్‌ పంచినా.. సినిమాని ముగించిన తీరు అసంతృప్తిగా అనిపిస్తుంది.

హీరోని పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌లో కూర్చొబెట్టే సీన్‌తో సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. అక్కడి నుంచి కథ ఫ్లాష్‌బ్యాక్‌లోకి టర్న్‌ అవుతుంది. కథానాయకుడి బాల్యం.. లక్ష్మయ్య కుటుంబంలోకి వెళ్లాక వాళ్లతో పెనవేసుకున్న అనుబంధాలు.. క్రికెటర్‌గా మారాలన్న లక్ష్యంతో హైదరాబాద్‌లో అడుగుపెట్టడం.. ఇలా నెమ్మదిగా అతని ప్రపంచాన్ని పరిచయం చేశారు. ఆ వెంటనే జార్జ్, డేవిడ్‌ల నేర చరిత్రను చూపించి ఆసక్తిరేకెత్తించారు. ఈ మధ్యలో వచ్చే నాయకానాయికల లవ్‌ట్రాక్‌ బలవంతంగా ఇరికించినట్లు ఉంటుంది. హీరో తండ్రి అనారోగ్యానికి గురవడం.. డబ్బుల కోసం అతను డేవిడ్‌ గ్యాంగ్‌ వద్ద బెట్టింగ్‌ వేసి గెలవడం.. ఈ క్రమంలో వాళ్ల మధ్య తలెత్తే ఘర్షణతో అసలు కథ మొదలవుతుంది. ఇక ఎప్పుడైతే హీరో డేవిడ్‌ కారును కొట్టేస్తాడో అక్కడినుంచి సినిమా వేగం పుంజుకుంటుంది. ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు థ్రిల్లింగ్‌గా ఉంటాయి. కాకపోతే ఆ థ్రిల్‌ను ద్వితీయార్ధం ఆసాంతం కొనసాగించలేకపోయాడు దర్శకుడు. వెంకట్‌ – డేవిడ్‌ల మధ్య నడిచే ఛేజింగ్‌ ఎపిసోడ్‌లో బలమైన సంఘర్షణ కనిపించదు. ఓ దశలో సినిమా అక్కడక్కడే తిరిగిన అనుభూతి కలుగుతుంది. ఓవైపు జార్జ్‌ కొడుకు హత్య.. మరోవైపు డ్రగ్స్‌ కేసు.. ఈ హీరో మెడకు చుట్టుకున్నప్పటినుంచి కథ రసవత్తరంగా మారుతుంది. ఓవైపు డేవిడ్‌ గ్యాంగ్‌.. మరోవైపు పోలీసుల నుంచి తప్పించుకొని హీరో తన తండ్రిని ఎలా కాపాడుకుంటాడు.. అతని మెడకు చుట్టుకున్న కేసుల నుంచి ఎలా బయటపడతాడన్న ఆసక్తి ప్రేక్షకుల్లో కలుగుతుంది. అయితే హీరో ఆ సమస్యల్ని పరిష్కరించుకునే తీరు ఊహలకు తగ్గట్లుగానే ఉంటుంది. ముఖ్యంగా ఓ రెగ్యులర్‌ కమర్షియల్‌ ఫార్మాట్‌లో సినిమాని ముగించిన తీరు ప్రేక్షకుల్ని ఏమాత్రం మెప్పించదు.

ఎవరెలా చేశారంటే: క్రికెటర్‌ అవ్వాలనుకునే సగటు మధ్యతరగతి కుర్రాడిగా వెంకట్‌ పాత్రలో కార్తికేయ చక్కగా ఒదిగిపోయారు. యాక్షన్, ఎమోషన్‌ సీన్స్‌లో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆయన ప్రేయసిగా ఐశ్వర్య మేనన్‌ తెరపై అందంగా కనిపించింది. కాకపోతే వాళ్ల ప్రేమకథలో ఫీల్‌ లేదు. ఆమె పాత్ర ద్వితీయార్ధంలో ఓ ఎపిసోడ్‌లో కీలకంగా నిలుస్తుంది. హీరో సోదరుడిగా రాజు పాత్రలో రాహుల్‌ టైసన్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. తండ్రి పాత్రలో తనికెళ్ల భరణి కనిపించిన తీరు బాగున్నా.. ఆయన ప్రతిభకు తగ్గ బలమైన సన్నివేశాలు పడలేదు. ద్వితీయార్ధంలో ఆయన పాత్రను పూర్తిగా కోమాలో ఉంచేశారు. ప్రతినాయకుడిగా రవిశంకర్‌ తనదైన నటనతో భయపెట్టాడు. శరత్‌ లోహితస్వ, పృథ్వీరాజ్‌ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉన్నాయి. దర్శకుడు ప్రశాంత్‌ ఎంచుకున్న కథలో కొత్తదనమున్నా.. దాన్ని ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో తెరపైకి తీసుకురావడంలో తడబడ్డాడు. ముఖ్యంగా ప్రథమార్థం బాగా నెమ్మదిగా సాగిన అనుభూతి కలుగుతుంది. కపిల్‌ కుమార్‌ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు ఒక్కటీ గుర్తుంచుకునేలా లేవు. ఆర్‌.డి.రాజశేఖర్‌ విజువల్స్‌ మెప్పిస్తాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

బలాలు:
+ కార్తికేయ నటన
+ విరామ సన్నివేశాలు
+ ద్వితీయార్ధంలోని కొన్ని థ్రిల్లింగ్‌ మూమెంట్స్‌
బలహీనతలు:
– నెమ్మదిగా సాగే ప్రధమార్ధం
– ముగింపు
చివరిగా: అక్కడక్కడా థ్రిల్‌ చేసే ‘భజే వాయు వేగం’
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Gam Gam Ganesha Review: రివ్యూ: గం గం.. గణేశా.. ఆనంద్‌ దేవరకొండ క్రైమ్‌ కామెడీ మూవీ మెప్పించిందా?

Gam Gam Ganesha Review: రివ్యూ: గం గం.. గణేశా.. ఆనంద్‌ దేవరకొండ క్రైమ్‌ కామెడీ మూవీ మెప్పించిందా?
Gam Gam Ganesha Review || చిత్రం: గం గం గణేశా; నటీనటులు: ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ, నయన్‌ సారిక, ఇమ్మాన్యుయేల్‌, వెన్నెల కిషోర్‌, రాజ్‌ అర్జున్‌, సత్యం రాజేశ్‌ తదితరులు; సంగీతం: చైతన్‌ భరద్వాజ్‌; ఎడిటింగ్‌: కార్తిక్‌ శ్రీనివాస్‌ ఆర్‌; సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాది; నిర్మాత: కేదార్‌ శెలగంశెట్టి, వంశీ కారుమంచి; రచన, దర్శకత్వం: ఉదయ్‌ బొమ్మిశెట్టి; విడుదల: 31-05-2024

విజయ్‌ దేవరకొండ సోదరుడిగా వెండితెరకు పరిచయమైనా తన ఇమేజ్‌కి సరిపోయేలా కథలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకుసాగుతున్న యువ కథానాయకుడు ఆనంద్‌ దేవరకొండ. ‘బేబీ’తో గతేడాది బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఆనంద్‌.. ఇప్పుడు క్రైమ్‌ కామెడీ జానర్‌లో యాక్షన్‌ అంశాలు మేళవించిన ‘గం గం.. గణేశా’ (Gam Gam Ganesha Review) అంటూ ప్రేక్షకుల ముందుకువచ్చారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? (Gam Gam Ganesha Review) ఆనంద్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

కథేంటంటే: గణేశ్‌ (ఆనంద్‌ దేవరకొండ) అనాథ. స్నేహితుడి(ఇమ్మాన్యుయేల్‌)తో కలిసి చిల్లర దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ప్రేమించిన అమ్మాయి శ్రుతి (నయన్‌ సారిక) డబ్బున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవడంతో ఎలాగైనా తానూ ధనవంతుడు కావాలనుకుంటాడు. దీంతో ఓ నగల దుకాణంలో రూ.7 కోట్ల విలువైన వజ్రాన్ని దొంగతనం చేసే డీల్‌ ఒప్పుకొని ఆ పని పూర్తి చేస్తాడు. అత్యాశకు పోయి ఆ వజ్రాన్ని తానే విక్రయించి డబ్బు సంపాదించాలనుకుంటాడు. వజ్రాన్ని చెన్నై తీసుకెళ్తుండగా పోలీసులు తనిఖీలు చేస్తుండటంతో భయపడి అటుగా వెళ్తున్న భారీ వినాయకుడి విగ్రహం తొండంలో దాన్ని పడేస్తాడు. నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి కిషోర్‌రెడ్డి (రాజ్‌ అర్జున్‌) ఆర్డర్‌ మేరకు ఆ వినాయకుడి విగ్రహాన్ని ముంబయిలో ప్రత్యేకంగా తయారుచేయించి, ఊరికి తీసుకొస్తుంటాడు కిరాయి రౌడీ రుద్ర (కృష్ణ చైతన్య). అయితే, కిషోర్‌రెడ్డి ఊరికి వెళ్లాల్సిన ఆ విగ్రహం కాస్తా తన ప్రత్యర్థి రాజకీయ నాయకుడు ఉన్న రాజావారిపల్లెకు వెళ్తుంది. ఇంతకీ ఆ విగ్రహంలో ఏముంది? కిషోర్‌రెడ్డి ప్రత్యేకంగా ఆ విగ్రహాన్ని తయారు చేయించడం వెనుక కారణం ఏంటి? వినాయకుడి విగ్రహంలో ఉండిపోయిన ఆ వజ్రాన్ని గణేశ్‌ ఎలా తిరిగి సంపాదించాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: భయం.. అత్యాశ.. కుట్ర.. ప్రతీ మనిషి ఏదోఒక సమయంలో ఈ మూడింటి గురించి ఆలోచిస్తాడు. ఆయా సందర్భాలు ఎదురైనప్పుడు వాటి నుంచి తప్పించుకునేందుకు లేదా కావాల్సింది దక్కించుకునేందుకు ఎంతకైనా తెగిస్తాడు. కొన్నిసార్లు ప్రాణాలను సైతం పణంగా పెడతాడు. కథానాయకుడికి ఈ మూడూ పరీక్ష పెడితే వాటి నుంచి ఎలా తప్పించుకుని బయటపడ్డాడన్నదే ‘గం. గం.. గణేశ్‌’. ఈ ఎలిమెంటుకి కామెడీ జోడించి వినోదాన్ని పంచడంలో దర్శకుడు ఉదయ్‌శెట్టి పాసయ్యారు. ఒక ఆసక్తికర వస్తువు, అంశం చుట్టూ కథానాయకుడు, విలన్‌ గ్యాంగ్‌ తిరగడం అన్నది కొత్త పాయింట్ ఏమీ కాదు. (Gam Gam Ganesha Review) కానీ, దానికే కాస్త కామెడీ, కాస్త థ్రిల్‌ జోడించి ఉదయ్‌శెట్టి మూవీని అందించాడు.

గణేశ్‌, అతడి లైఫ్‌ స్టైల్‌ను పరిచయం చేస్తూ కథను మొదలుపెట్టిన దర్శకుడు.. లవ్ ట్రాక్‌తో అసలు పాయింట్‌కు రావడానికి కాస్త కథను సాగదీశాడు. ఎప్పుడైతే గణేశ్‌కి డబ్బు సంపాదించాలన్న కసి పుడుతుందో అప్పటి నుంచే అసలు కథ మొదలవుతుంది. ఒకవైపు గణేశ్‌ కథ చూపిస్తూనే మరోవైపు కిషోర్‌రెడ్డి ప్రత్యేక వినాయకుడి విగ్రహాన్ని ముంబయి నుంచి తీసుకొచ్చే ప్లాట్‌ను సమాంతరంగా నడిపాడు. పోలీసులకు భయపడి గణేశ్‌ ఆ వజ్రాన్ని వినాయకుడి తొండంలో వేయడం, కిషోర్‌రెడ్డి తయారు చేయించిన విగ్రహం రాజావారి పల్లెకు వెళ్లడంతో తర్వాత ఏం జరుగుతుందన్న ఉత్కంఠతో విరామమిచ్చిన తీరు బాగుంది. రాజావారి పల్లెకు చేరిన తర్వాత ద్వితీయార్ధం మరింత ఆసక్తికరంగా మారుతుంది. ప్రత్యర్థి రాజకీయ నాయకుడి ఊరి నుంచి కిషోర్‌రెడ్డి ఆ విగ్రహాన్ని తీసుకెళ్లేందుకు రుద్ర, అతడి గ్యాంగ్‌ చేసే ప్రయత్నాలు ఒకవైపు… వజ్రం కోసం గణేశ్‌, అతడి స్నేహితుడు వేసే ప్లాన్‌లు ఆద్యంతం నవ్వులు పంచుతూ ద్వితీయార్ధం సాగుతుంది. మతి భ్రమించిన డాక్టర్‌ ఆర్గానిక్‌ డేవిడ్‌గా వెన్నెల కిషోర్‌ పాత్ర కనిపించిన ప్రతిసారీ థియేటర్‌లో నవ్వులే నవ్వులు. (Gam Gam Ganesha Review) డాక్టర్‌ డేవిడ్‌ వల్ల అటు రుద్ర గ్యాంగ్‌, ఇటు గణేశ్‌ పడే ఇబ్బందులు ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్విస్తాయి. ఆ ట్రాక్‌ మొత్తం హెలేరియస్‌గా పండింది. మధ్యలో గణేశ్‌కు నీలవేణి (ప్రగతి శ్రీవాస్తవ)తో లవ్‌ ట్రాక్‌ పెట్టడం అసలు కథ కాస్తకు పక్కకు వెళ్లినట్లు అనిపిస్తుంది. పతాక సన్నివేశాల్లో స్వామీజీ (రాంజగన్‌) పాత్రతో ఊహించని ట్విస్ట్‌ ఇచ్చి అలరించాడు దర్శకుడు. ఆయా సన్నివేశాలు, తుపాకీలతో కాల్చుకోవడం ‘స్వామి రారా’ క్లైమాక్స్‌ను గుర్తు చేస్తాయి.

ఎవరెలా చేశారంటే: ‘బేబీ’ వంటి లవ్‌ ఎమోషనల్‌ డ్రామా తర్వాత ఆనంద్‌ దేవరకొండ క్రైమ్‌ కామెడీతో వైవిధ్యంగా ప్రయత్నించారు. గణేశ్‌ పాత్రకు ఆయన చక్కగా సూటయ్యారు. యాక్షన్‌కు అవకాశం ఉన్నా, దాని జోలికి పోకుండా తన పాత్ర పరిధి మేరకు నటించారు. ఎమోషనల్‌ డైలాగ్స్‌, భావోద్వేగ సన్నివేశాల్లో నటన ఇంకాస్త మెరుగుపడాల్సి ఉంది. ఈ చిత్రంలో కథానాయికలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ప్రథమార్ధంలో నయన్‌ సారిక, ద్వితీయార్ధంలో ప్రగతి శ్రీవాస్తవ జస్ట్‌ టైమ్‌పాస్‌ అంతే. కిషోర్‌రెడ్డిగా రాజన్‌, రుద్రగా కృష్ణ చైతన్య తమదైన శైలిలో నటించారు. ఆనంద్‌ స్నేహితుడిగా ఇమ్మాన్యుయేల్‌, మెంటల్‌ డాక్టర్‌ ఆర్గాన్‌ డేవిడ్‌గా వెన్నెల కిషోర్‌ పాత్రలు సినిమాకు ప్రధానబలం. (Gam Gam Ganesha Review) ఆ రెండు పాత్రలు చక్కటి హాస్యాన్ని పంచాయి. ఎక్కడా కూడా అసభ్యతకు తావులేకుండా కామెడీని పండించడం మెచ్చుకోదగిన విషయం. సాంకేతికంగా సినిమా బాగుంది. చైతన్‌ భరద్వాజ్‌ పాటలు, ఆదిత్య జవ్వాది సినిమాటోగ్రఫీ బాగున్నాయి. కార్తిక్‌ శ్రీనివాస్‌ ఎడిటింగ్‌ షార్ప్‌గా ఉంది. ఉదయ్‌ బొమ్మిశెట్టి ఎంచుకున్న కథ కొత్తదేమీ కాకపోయినా ఎంటర్‌టైనింగ్‌గా చెప్పడంలో పర్వాలేదనిపించారు. ప్రతినాయకుడి పాత్రను కూడా ఇంకాస్త బలంగా చూపించాల్సింది. ప్రథమార్ధంలో లవ్‌ ట్రాక్‌ అవసరం లేదు. దానికి బదులు ద్వితీయార్ధంలోనే వెన్నెల కిషోర్‌ ట్రాక్‌ పెంచి ఉంటే ప్రేక్షకులు మరింత ఆస్వాదించేవారు.

బలాలు
+ నటీనటులు,
+ వెన్నెల కిషోర్‌, ఇమ్మాన్యుయేల్‌ కామెడీ
+ ద్వితీయార్ధం
బలహీనతలు
– ప్రథమార్ధంలో లవ్‌ ట్రాక్‌
– అక్కడక్కడా నెమ్మదిగా సాగే సన్నివేశాలు
చివరిగా: ఎంటర్‌టైనింగ్‌ గణేశా..! (Gam Gam Ganesha Review)
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే

Gangs Of Godavari Review: రివ్యూ: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి’… మాస్ గెటప్‌లో విష్వక్‌సేన్‌ మెప్పించారా…?

Gangs Of Godavari Review: రివ్యూ: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి’… మాస్ గెటప్‌లో విష్వక్‌సేన్‌ మెప్పించారా…?
నటీన‌టులు: విష్వక్‌సేన్‌, అంజ‌లి, నేహాశెట్టి, నాజ‌ర్‌, పి.సాయికుమార్‌, హైప‌ర్ ఆది, ప‌మ్మిసాయి, మ‌ధునంద‌న్‌, ప్ర‌వీణ్‌, గోప‌రాజు ర‌మ‌ణ‌, పృథ్వీరాజ్‌, మ‌యాంక్ ప‌రాఖ్‌, ఆయేషా ఖాన్ (ప్ర‌త్యేక‌ గీతం) త‌దిత‌రులు. ఛాయాగ్ర‌హ‌ణం: అనిత్ మ‌దాడి, సంగీతం: యువ‌న్ శంక‌ర్ రాజా, కూర్పు: న‌వీన్ నూలి, క‌ళ‌: గాంధీ న‌డికుడిక‌ర్‌, నిర్మాణం: సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ, సాయి సౌజ‌న్య‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: కృష్ణ‌చైత‌న్య‌. నిర్మాణ సంస్థ‌: సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, విడుద‌ల‌: 31 మే 2024

కొన్ని నెలలుగా మూత‌ప‌డిన థియేట‌ర్ల త‌లుపులు మ‌ళ్లీ తెర‌చుకునేలా ఈ వారం మూడు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. అందులో గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి ఒక‌టి. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నుంచి రావ‌డం… విష్వక్‌సేన్‌ (Vishwak sen) క‌థానాయ‌కుడిగా న‌టించిన సినిమా కావ‌డంతో విడుద‌ల‌కి ముందే సినిమా ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించింది. ర‌చ‌యిత కృష్ణ‌చైత‌న్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతోపాటు… ప్ర‌చార చిత్రాలూ ప్రేక్ష‌కుల్ని ప్ర‌త్యేకంగా ఆక‌ర్షించాయి. మ‌రి సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు క‌థేమిటో చూద్దాం…
క‌థేంటంటే?
ఎద‌గ‌డం మ‌న హ‌క్కు అని న‌మ్మిన ఓ యువ‌కుడు లంక‌ల ర‌త్నాక‌ర్ (విష్వక్‌ సేన్‌). తండ్రి చెప్పిన ఆ మాట‌ని చిన్న‌ప్పుడే బాగా ఒంట‌బ‌ట్టించుకుంటాడు. త‌న‌లోని మ‌నిషిని ప‌క్క‌న‌పెట్టి, ఎదుటివాళ్ల‌ని వాడుకోవ‌డ‌మే ప‌నిగా పెట్టుకుంటాడు. చిన్నచిన్న దొంగ‌త‌నాలు చేసే ర‌త్నాకర్‌ … స్థానిక ఎమ్మెల్యే దొర‌సామి (గోప‌రాజు ర‌మ‌ణ‌)కి కుడిభుజంగా మార‌తాడు. దొర‌సామి, నానాజీల మ‌ధ్య న‌డుస్తున్న రాజ‌కీయ వైరంలోకీ త‌ల‌దూర్చుతాడు (Gangs Of Godavari Review). ఆ రాజ‌కీయం అత‌న్ని ఎక్కడిదాకా తీసుకెళ్లింది? అత‌ను కోరుకున్న‌ట్టు ఎదిగాడా, లేదా? లంక‌ల్లోని ప‌గ అత‌న్ని ఎలా వెంటాడింది? బుజ్జి(నేహాశెట్టి), ర‌త్న‌మాల (అంజ‌లి)ల‌తో రత్నాకర్‌కు ఉన్న సంబంధం ఏమిటి? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
గోదావ‌రి నేప‌థ్యంలో సినిమా అనగానే ప‌చ్చ‌టి ప‌ల్లెసీమ‌లు, ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణ‌మే గుర్తొస్తుంది. ఇప్ప‌టివరకు మ‌న సినిమాల్లో ఎక్కువ‌గా చూపించింది అదే. కృష్ణ‌చైత‌న్య మాత్రం కాస్త భిన్నంగా ఎరుపెక్కిన గోదావ‌రిని ఈ సినిమాలో చూపించారు (Telugu Movie Review). అక్క‌డి రాజ‌కీయాలు, ఆధిప‌త్య పోరు, లంక గ్రామాల్లోని ప‌గ‌, ప్ర‌తీకారాల‌తో ఓ యువ‌కుడి ప్ర‌యాణాన్ని ముడిపెడుతూ క‌థ‌ని మ‌లిచారు. అక్క‌డ‌క్క‌డా రంగ‌స్థ‌లం ఛాయ‌లు క‌నిపించే ఈ క‌థ ప‌రిధి గోదావ‌రి అంతా విస్తృతంగానే వుంటుంది. ప్ర‌తీ పాత్ర‌కీ దానిదైన ఓ ప్ర‌యాణంతో స్క్రిప్ట్‌ని రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు. కానీ విష్వక్‌సేన్‌, అంజ‌లి పాత్ర‌లు మిన‌హా మిగ‌తా ఏ పాత్ర‌లూ ప్ర‌భావం చూపించ‌వు. గాఢ‌త‌, భావోద్వేగాలే ఇలాంటి క‌థ‌ల‌కు బ‌లం. కానీ ఇందులో చాలా స‌న్నివేశాలు మ‌రీ ఎక్కువ‌ నాట‌కీయత‌తో సాగడం.. ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌ల్లో బ‌లం లేక‌పోవ‌డం.. క‌థానాయిక నేహాశెట్టి పాత్ర కూడా పెద్ద‌గా ప్ర‌భావం చూపించేలా లేక‌పోవ‌డంతో ఆశించిన భావోద్వేగాలు పండ‌లేదు (Movie Review). మంచి విజువ‌ల్స్‌, సంగీతంతో కూడిన ఖ‌రీదైన స‌న్నివేశాలు తెర‌పైన చ‌ప్ప‌గా సాగిపోతూ ఉంటాయి. రాజ‌కీయ క్రీడ‌లో భాగంగా క‌థానాయ‌కుడు వేసే ఎత్తులు పైఎత్తులు చాలానే ఉంటాయి. వాటిని మరింత ఉత్కంఠభ‌రితంగా తెరకెక్కిస్తే బాగుండేది. ఇంత గాఢ‌మైన క‌థ‌ని, నేప‌థ్యాన్ని ఆవిష్క‌రిస్తున్న‌పుడు ప్ర‌తినాయ‌కుల్ని మ‌రీ అంత బ‌ల‌హీనంగా చూపించ‌డం క‌థ‌కు ఏమాత్రం అత‌క‌లేదు.

లంక గ్రామాల్లో క‌త్తి పట్టే సంప్ర‌దాయంతో స‌న్నివేశాల్ని మొద‌లుపెట్టిన ద‌ర్శ‌కుడు వేగంగానే క‌థా ప్ర‌పంచంలోకి తీసుకెళ్లారు (Gangs Of Godavari Review telugu). క‌థానాయ‌కుడిని మాస్‌గా ఆవిష్క‌రించిన తీరు, పోరాటాలు, అంజ‌లి పాత్ర ప్ర‌యాణం ప్ర‌థ‌మార్థానికి ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి. క‌థానాయ‌కుడి పాత్ర‌లో మాస్ కోణం, అత‌ని వ్య‌క్తిత్వం వ‌ర‌కూ స‌మ‌స్య‌లేమీ లేక‌పోయినా… ఆ పాత్ర ఎదుగుద‌ల చూపెట్టిన తీరే మ‌రీ సినిమాటిక్‌గా అనిపిస్తుంది. ఓ ఎమ్మెల్యేని కిడ్నాప్ చేయ‌డం, మ‌రో ఎమ్మెల్యేని చంపి న‌దిలోకి విసిరేయ‌డం వంటి స‌న్నివేశాలే అందుకు ఉదాహ‌ర‌ణ‌. ద్వితీయార్థం సినిమాలో న‌దిలో సాగే ఓ స‌న్నివేశం బాగుంది. చివ‌ర్లో తండ్రీ, కూతుళ్ల బంధం నేప‌థ్యంలో భావోద్వేగాల్ని పండించే ప్ర‌య‌త్నం చేసినా అదేమీ ప్ర‌భావం చూపించ‌లేదు.
ఎవ‌రెలా చేశారంటే?
యువ నాయ‌కుడు లంక‌ల ర‌త్నాక‌ర్‌గా విష్వక్‌సేన్‌ (Vishwak sen) త‌న‌దైన ముద్ర వేశాడు. త‌న‌లోని మాస్ కోణానికి త‌గిన శ‌క్తివంత‌మైన పాత్ర ఇది. అందుకు త‌గ్గ‌ట్టుగానే హుషారుగా న‌టించాడు. పోరాటాలు, పాట‌ల‌పైనా ప్ర‌భావం చూపించారు. అంజ‌లి పాత్ర అర్థ‌వంతంగా ఉంటుంది. ఆ పాత్ర‌పై ఆమె అంతే ప్ర‌భావం చూపించారు. నేహాశెట్టి అందంగా క‌నిపించింది. కానీ ఆ పాత్ర ప్ర‌యాణంలోనే కొన్ని స‌మ‌స్య‌లున్నాయి. నాజ‌ర్‌, గోప‌రాజు ర‌మ‌ణ, సాయికుమార్, ప్ర‌వీణ్‌, ప‌మ్మి సాయి, హైప‌ర్ ఆది త‌దిత‌రులు కీల‌క‌మైన పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. గ్యాంగ్స్‌లో క‌నిపించే పాత్ర‌లూ బ‌లంగా గుర్తుండిపోయేలా ఉంటాయి. సాంకేతిక విభాగాలే ఈ సినిమాకి ప్ర‌ధాన‌ బ‌లం. కెమెరా విభాగం అత్యుత్త‌మ ప‌నితీరుని ప్ర‌ద‌ర్శించింది. 90వ ద‌శ‌కం నేప‌థ్యాన్ని ఆవిష్క‌రించిన తీరు ఆక‌ట్టుకుంటుంది. ప్ర‌తీ ఫ్రేమ్ విలువైన‌దిగా ఉంటుంది. యువ‌న్ శంకర్ రాజా నేప‌థ్యసంగీతం మ‌రో ఆక‌ర్ష‌ణ ఈ సినిమాకి. చాలారోజుల త‌ర్వాత తెలుగు సినిమాకు ప‌ని చేయడంతో ఈ సినిమాపై చాలా ప్ర‌భావం చూపించారు. మోత మోగిపోద్ది, సుట్టంలా సూసి పాట‌లు, చిత్రీక‌ర‌ణ బాగున్నాయి (Gangs Of Godavari Review). క‌ళ‌, కూర్పు త‌దిత‌ర విభాగాల ప‌నితీరు కూడా మెప్పిస్తుంది. ర‌చ‌యిత‌గా కృష్ణ‌చైత‌న్య ముద్ర ఈ సినిమాపై క‌నిపిస్తుంది కానీ, ఆయ‌న ర‌చ‌న ప‌రంగానే ఈ సినిమాకి చాలాచోట్ల లోటు చేశారు. త‌ర్వాత ఏం జ‌రుగుతుంద‌నే ఆత్రుత‌, ఆస‌క్తిని రేకెత్తించే సన్నివేశాలు ఉంటే బాగుండేది. గోదావ‌రిలో ఎరుపు, గోదావ‌రి లంక‌ల్లో ఏడుపు నాతోనే ఆగిపోవాలి… స‌హా చాలా సంభాష‌ణ‌లు గుర్తుండిపోతాయి. నిర్మాణం ఉన్న‌తంగా ఉంది.
+ బ‌లాలు
+ విష్వ‌క్‌సేన్ న‌ట‌న
+ క‌థా నేప‌థ్యం
+ ఛాయాగ్ర‌హ‌ణం, నేప‌థ్య సంగీతం
– బ‌ల‌హీన‌త‌లు
– భావోద్వేగాలు
– నాట‌కీయ‌త‌తో కూడిన స‌న్నివేశాలు
చివ‌రిగా: గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి… ఎరుపెక్కిన గోదావ‌రి

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

‘పేరెంట్ టీచర్ హోమ్ విజిట్ ప్రోగ్రాం’ గురించి ముఖ్య అంశాలు. తెలుగులో ..

“Parent-Teacher Home Visit Program” from the Academic Year 2024-25 Orders

School Education Enhancing the Academic Performance of students studying from Classes 1-12 in Government Schools and Colleges Implementation of “Parent-Teacher Home Visit Program” in the State from the Academic Year 2024-25 Orders Issued.

పాఠశాల విద్య – ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలల్లో 1-12 తరగతుల చదువుతున్న విద్యార్థుల అకడమిక్ పనితీరును మెరుగుపరచడం కొరకు – 2024-25 విద్యా సంవత్సరం నుండి రాష్ట్రంలో “తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల గృహ సందర్శన కార్యక్రమం” అమలు మీద ఉత్తర్వులు – జారీ చేయబడ్డాయి.

1వ తరగతిలో విద్యర్థికి నాణ్యమైన స్పృహ ప్రారంభం కావడం అత్యవసరం, ఇది ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థుల క్రియాశీల ప్రమేయం ద్వారా మాత్రమే సాధించబడుతుంది.

విద్యలో తల్లిదండ్రుల ప్రమేయం విద్యాపరమైన ఫలితాలను గణనీయంగా పెంచుతుందని రుజువు చేయబడింది. .

జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ జాయిస్ ఎప్స్టీన్, తల్లిదండ్రులు తమ విద్యలో చురుకుగా నిమగ్నమై ఉన్న విద్యార్థులు ఉన్నత గ్రేడ్‌లు సాధించడానికి, క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేందుకు మరియు గ్రాడ్యుయేట్ మరియు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం ఉందని కనుగొన్నారు.

అదనంగా, కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీ, లాంగ్ బీచ్ నుండి డాక్టర్ విలియం జేన్స్, తల్లిదండ్రుల ప్రమేయం మెరుగైన విద్యార్థుల ప్రవర్తనకు దారితీస్తుందని, ప్రేరణ మరియు అధిక ఆత్మగౌరవానికి దారితీస్తుందని నిరూపించారు, ఇవి విద్యావిషయక విజయానికి కీలకమైన అంశాలు.

విద్యార్థుల ఇళ్లను సందర్శించే ఉపాధ్యాయులు విద్యా ఫలితాలపై గణనీయమైన సానుకూల ప్రభావాన్ని చూపుతారని అధ్యయనాలు చెబుతున్నాయి.

హార్వర్డ్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ కరెన్ ఎల్. మ్యాప్ ఉపాధ్యాయుల ఇంటి సందర్శనలు విద్యార్థుల హాజరు రేటును పెంచడానికి మరియు ఉన్నత విద్యా పనితీరుకు దారితీస్తుందని కనుగొన్నారు.

ఉపాధ్యాయులు గృహ సందర్శనలు నిర్వహించిన విద్యార్థులు అటువంటి సందర్శనలు పొందని వారితో పోలిస్తే 24% ఎక్కువ హాజరు రేటు మరియు మెరుగైన గ్రేడ్‌లు. పొందినట్టు తెలుస్తుంది

అదనంగా, జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీలో డాక్టర్ స్టీవెన్ షెల్డన్ చేసిన పరిశోధనలో గృహ సందర్శనలు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల మధ్య సంబంధాన్ని బలోపేతం చేస్తాయి, ఇది మెరుగైన కమ్యూనికేషన్ మరియు సహకారానికి దారితీస్తుందని, ఇది విద్యార్థుల విజయాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తుందని వెల్లడించింది.

ఈ అధ్యయనాలు విద్యార్థులకు విద్యా అనుభవాలు మరియు ఫలితాలను మెరుగుపరచడంలో పేరెంట్-టీచర్ హోమ్ విజిట్ ప్రోగ్రామ్ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాయి.

పేరెంట్ టీచర్ హోమ్ విజిట్ అమలుకు సంబంధించిన కీలక మార్గదర్శకాలు :

  • ఫ్రీక్వెన్సీ: తరగతి ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థి ఇంటిని సంవత్సరానికి రెండుసార్లు సందర్సించాలి
  • ఎప్పుడెప్పుడు అంటే : మొదటి సందర్శన జూన్‌లో ఉంటుంది మరియు రెండవ సందర్శన జనవరిలో ఉంటుంది.
  • జూన్ సందర్శన: జూన్ సందర్శన సమయంలో, తరగతి ఉపాధ్యాయుడు విద్యార్థి పనితీరు మరియు అవసరాల ఆధారంగా వ్యక్తిగతీకరించిన విద్యా ప్రగతి ప్రణాళికను అభివృద్ధి చేస్తారు.
  • జనవరి సందర్శన: జనవరిలో, ఉపాధ్యాయులు తిరిగి సందర్శించి, విద్యార్ధి పురోగతి మరియు ఏదైనా కొత్త పరిణామాల ఆధారంగా విద్యా ప్రగతి ప్రణాళిక రివైజ్ చేస్తారు
  • Personalization: ప్రతి సందర్శన వ్యక్తిగతీకరించిన విద్యా పురోగతి ప్రణాళికను రూపొందించడం మరియు సవరించడంపై దృష్టి పెడుతుంది.
  • Convenience: తల్లిదండ్రులకు అనుకూలమైన సమయాల్లో సందర్శనలు షెడ్యూల్ చేయబడతాయి.

Download Parent Teacher home visit program GO MS 26 copy

పదవీ విరమణ చేసిన ఏబీ వెంకటేశ్వరరావు.. చివరి రోజు సంచలన కామెంట్స్..

AB Venkateswara Rao Retirement: ఏబీ వెంకటేశ్వరరావు పదవీ విరమణ చేశారు. ఆయన పదవీ విరమణ చేసేందుకు రిలీవ్ చేస్తూ ప్రభుత్వం(Andhra Pradesh Government) ఉత్తర్వులు జారీ చేసింది. కొద్ది సేపటి క్రితమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి(Jawahar Reddy) ఉత్తర్వులు ఇచ్చారు. అయితే, శుక్రవారం ఉదయమే ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వం. ఇదే రోజున సాయంత్రం పదవీ విరమణకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయనను విధుల్లోకి తిరిగి చేర్చిన ప్రభుత్వం.. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ బాధ్యతలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని హోం సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ఈ మేరకు జీఐడీ నుంచి జీవో నెంబర్ 1013ను ప్రభుత్వం జారీ చేసింది.

కొన్నేళ్లుగా ప్రభుత్వంపై న్యాయపరంగా పోరాడిన ఏబీ వెంకటేశ్వరరావు.. రిటైర్ అవ్వాల్సిన రోజున విధుల్లో చేరారు. ఉదయం బాధ్యతలు చేపట్టిన ఆయన సాయంత్రం పదవీ విరమణ చేశారు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా విధులు నిర్వహించి పదవీ విరమణ చేశారు. విజయవాడ ముత్యాలంపాడులోని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కార్యాలయంలో పదవీ విరమణ చేశారు ఏబీ వెంకటేశ్వరరావు. పోలీసు శాఖ పరంగా డీజీలో హోదాలో ఉన్నారు ఏబీవీ. కాగా, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు.. ఏబీవీని కలిసి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏబీవీని ఆలింగనం చేసుకుని అభినందనలు తెలిపారు. వీరిద్దరూ ఒకే బ్యాచ్‌మేట్స్ కావడంతో పరస్పరం క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు ఇరువురు అధికారులు.

ఈ సందర్భంగా ప్రసంగించిన ఏబీవీ..

‘నేను ఇంజినీరింగ్ చదువుకుని తొలుత టాటామోటార్స్‌లో ఉద్యోగం చేశాను. అదే సంస్థలోలో ఉన్నా.. లేక అమెరికా వెళ్లినా.. ఇప్పుడు నా జీవితం వేరే విధంగా ఉండేది. ఐపీఎస్‌గా అధర్మాన్ని, అన్యాయాన్ని, అణచివేతను ఎదుర్కోవడం నా వృత్తిధర్మంగా పనిచేశాను. నా సర్వీసులో చట్టాన్ని కాపాడేండేందుకు అక్రమాలను, అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు పాటుపడ్డాను. అన్యాయాన్ని ఎదుర్కొన్నా తప్పితే నేను ఎవరికీ అన్యాయం చేయలేదు. నేను ఈ రోజు పూర్తి సంతృప్తితో రిటైర్ అవుతున్నాను. నా సర్వీసులో నీతి నిజాయితీతో వ్యవహరించాను. ఎవరికీ అన్యాయం చేయకపోవడంతోనే ఈరోజు నేను లక్షల మంది అభిమానం పొందాను. నాకు ఎదురైన సవాళ్లు, కష్టాలు చూసి నా అభిమానులు ఉద్వేగ్వంతో ఏడ్చారు. నా నిజాయితీ, ధర్మం, పోరాటమే నన్ను కాపాడింది. నా సర్వీసులో దుర్మార్గులనూ చూశా.. నాకు వ్యతిరేకంగా వ్యవహరించాలని కొందరు ఎంత డబ్బు ఇచ్చినా కొందరు అంగీకరించలేదు. నాకు అండగా నిలిచిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. రిటైర్ అయినా నా జీవితం ఉన్నంతవరకు ప్రజా సేవలో ఉంటాను. నా శేష జీవితంలోనూ అన్యాయాన్ని, అణచివేతను ఎదురిస్తా. దుష్ట శిక్షణ-శిష్టరక్షణ చేసేందుకు నా రిటైర్డ్ జీవితంలో అవకాశం వస్తుందని ఆశిస్తున్నా. నాకు ఆప్తులుగా ఉండి అండగా ఉన్న వారికి రుణపడి ఉంటా’ అని అన్నారు.

ఉదయం మీడియాతో మాట్లాడుతూ..

ఉదయం విధుల్లో చేరే సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. చాలా రోజుల తరువాత మళ్లీ విధుల్లోకి చేరడంపై సంతోషం వ్యక్తం చేశారాయన. రెండు సంవత్సరాల తరువాత ఇదే ఆఫీసులో చార్జ్ తీసుకుంటున్నానని, తనకు అభినందనలు తెలిపేందుకు వచ్విన వారికి కృతజ్ఞతలు చెప్పారు. ‘ఈరోజు నా పదవీ విరమణ రోజు.. ఈ రోజే పోస్టింగ్ ఆర్డర్ తీసుకున్నా.. సాయంత్రం పదవీ విరమణ చేసే అవకాశం నాకు మాత్రమే వచ్చింది. కారణాలు ఏమైనా ఆల్ ఈజ్ వెల్ అని భావిస్తున్నా. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాను. ఎలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. పోస్టింగ్ ఆర్డర్లు వచ్చాయి. విధుల్లో చేరాను. ఇంతకాలం నాకు అండగా ఉండి ధైర్యం చెప్పిన మిత్రులు, శ్రేయోభిలాషులకు రుణపడి ఉంటాను. కుటుంబ సభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు. యూనిఫాంతో రిటైర్ కావడం నా కల నెర వేరినట్లుగా భావిస్తున్నాను.’ అని ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం కక్షపూరిత వైఖరి..

ఐదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చీ రాగానే.. ఏబీ వెంకటేశ్వరరావుపై ఫోకస్ పెట్టింది. ఆయనపై కక్షగట్టిన సర్కార్.. అకారణంగా ఆయనను సస్పెండ్ చేసింది. దీంతో ఆయన క్యాట్‌ను ఆశ్రయించారు. అప్పడు వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తి వేయాలని ఏపీ ప్రభుత్వానికి క్యాట్ సూచించింది. దీనిపై జగన్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అయితే క్యాట్ ఉత్తర్వులపై జోక్యం చేసుకోబోమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అలా ఐదేళ్లుగా ఏబీ వెంకటేశ్వరరావు న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. ఆయన పోరాటం ఫలించి.. పదవీ విరమణ రోజు విధుల్లో చేరారు. ఇప్పుడు పదవీ విరమణ పొందారు.

హెయిర్ కట్ నచ్చలేదని బాలుడి ఆత్మహత్య..

ఇటీవల చిన్నారులు చిన్న విషయాలకు కలత చెందడం, గొడవలకు దిగడం, అంతెందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలను కూడా మనం చూస్తూనే ఉన్నాం. క్షణికావేశంలో నిండు నూరేళ్ల జీవితాన్ని అర్థంతరంగా ముగించుకుంటున్నారు.

ఇంట్లో తమ తల్లిదండ్రుల శోకాన్ని మిగిల్చుతూ ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. తాజాగా ఓ బాలుడు హెయిర్ కట్ నచ్చలేదని తనకు ఇష్టమైన కటింగ్ కాకుండా వేరేలా కటింగ్ చేయించారని తండ్రితో గొడవ పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బాలుడు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం… గంగారం మండలంలోని చింతగూడెం గ్రామానికి చెందిన ఈసం కాంతరావుకి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడైన హర్షవర్ధన్ (9) సీతానాగారం హాస్టల్ లో ఆరో తరగతి చదువుతున్నాడు.

వేసవి సెలవుల్లో ఇంటి వద్ద ఉన్నాడు. ఈ క్రమంలో నాలుగు రోజుల కిందట హర్షవర్ధన్ తండ్రి కాంతారావు కటింగ్ షాపుకు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో తనకు ఇష్టం లేని కటింగ్ చేపించారని తండ్రితో గొడవకు దిగాడు. సముదాయించిన తండ్రి అతన్ని ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం హర్షవర్ధన్ తల్లిదండ్రులు ఇంటి వెనుక పనులు చేసుకుంటుండగా హర్షవర్ధన్ పురుగుల మందు సేవించాడు. ముందుగా నర్సంపేట లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నయం కాకపోవడంతో అక్కడ నుండి హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం మృతి చెందినట్లు సమాచారం. గంగారం ఎస్సై రవికుమార్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టం తరలించారు.హర్షవర్ధన్ మృతితో చింతగూడెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

బాబా పిలుస్తున్నాడు అంటూ హిమాలయాలకు అక్కాచెల్లెల్లు! చివరికి!

బాబా పిలుస్తున్నాడు అంటూ హిమాలయాలకు బయలు దేరారు ముగ్గురు అమ్మాయిలు. ఇంట్లో ఓ లెటర్ కూడా రాశారు. తమ కోసం వెతకొద్దని, మూడు నెలల తర్వాత ఇంటికి తిరిగొస్తామని.. కానీ

విశ్వాసం ఉండవచ్చు కానీ అంధ విశ్వాసం ఉండకూడదు. ఇదే మూఢత్వంగా మారిపోతుంది కొన్ని సార్లు. మూఢత్వం మనస్సును ఆలోచింపనివ్వకుండా చేస్తుంది. ఆధ్యాత్మిక చింతన మాటున అంధ విశ్వాసాలకు బలౌతున్నారు. చదువులేని వాళ్లు కాదు.. వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ సైతం ఇదే దారిలో కొనసాగుతున్నారు. ఇప్పుడు ముగ్గురు అమ్మాయిల జీవితాలను చిధ్రం చేసింది ఇదే అంధ విశ్వాసం. బాబా పిలుస్తాడని, ఆధ్యాత్మిక చింతనలో బతికేస్తూ.. హిమాలయాలకు వెళ్లానని ఇంట్లో ఓ ఉత్తరం ముక్క రాసి పరారయ్యాడు ఈ బాలికలు. వెతికితే.. తాము తిరిగి రామని కూడా బెదిరించారు. అందులో తాము త్వరగానే ఇంటికి వస్తామని చెప్పారు. కానీ నిజంగానే త్వరగానే వచ్చారు సజీవంగా కాదు.. శవాలుగా. కన్న తల్లిదండ్రులకు శోక సంద్రంలో ముంచేశారు.

‘బాబా పిలుస్తున్నాడు.. హిమాలయాలకు వెళ్తున్నాం.. మూడు నెలల తర్వాత తిరిగొస్తాం.. ఈలోపు మీరు మా గురించి వెతికితే ఆత్మహత్య చేసుకుంటాం. ’ అని లెటర్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయారు ముగ్గురు అమ్మాయిలు. వీరిది బీహార్ రాష్ట్రం. వీరు ముగ్గురు స్నేహితులు. తొమ్మిదో తరగతి చదువుతున్నారు. గౌరీ కుమారి, మోహినీ కుమారి, మాయా కుమారి స్కూల్ మేట్స్. ఈ ముగ్గురు ఈ నెల 13న ఇంట్లో నుండి పరారయ్యారు. బాబా పిలిచారని, హిమాలయకు వెళ్లాలని, మూడు నెలల తర్వాత అనగా ఆగస్టు 13న తిరిగి ఇంటికి వస్తామంటూ లేఖ రాసి వెళ్లిపోయారు. తమ కోసం పేరెంట్స్ వెతకకుండా.. ఓ బెదిరింపు కూడా చేశారు. తమను వెతికితే.. ఆత్మహత్య చేసుకుంటామని తెలిపారు. అయితే అన్నంత పని చేశారు.

ఇప్పుడు మధురలోని బజ్జా బ్రిడ్జి సమీపంలోని రైల్వే ట్రాక్ పై ముగ్గురు అమ్మాయిల మృతదేహాలను గుర్తించారు పోలీసులు. వీరిని మిస్సైన గౌరీ కుమారి, మోహినీ కుమారి, మాయ కుమారిలుగా గుర్తించారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్ నుండి నగరానికి చేరుకుని, వారి తమ కుమార్తెలుగా గుర్తించారు. కన్నీరు మున్నీరు అవుతున్నారు. కాగా, ముగ్గురు అమ్మాయిల మొబైల్ ఫోన్లు మాయమయ్యాయి.అయితే బీహార్ పోలీసులు తమ కేసును సరిగ్గా పట్టించుకోలేదని, లేకుంటే తమ పిల్లలు బతికేవారంటూ ఆరోపిస్తున్నారు బాలికల తల్లిదండ్రులు. స్థానిక పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని కన్నీటి పర్యంతం అవుతున్నారు. అయితే పోలీసులు ఈ ఆరోపణలు ఖండించారు. ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసుకున్నామని, బాలికలు స్వచ్చందంగా ఇంటి నుంచి వెళ్లిపోయారని, వారు వెళ్లిపోవడానికి గల కారణాలను వివరిస్తూ లేఖలు రాసి వెళ్లిపోయారని, వారి కోసం వెతుకుతున్నామని, మథురలో మృతదేహాలు లభ్యమైన విషయం తెలియడంతో వారి కుటుంబాలకు సమాచారం అందించామని పోలీసులు తెలిపారు

ఇంగ్లాండ్‌ నుంచి భారత్‌కు లక్ష కిలోల బంగారం తరలింపు

Gold Reserves | ముంబయి: ఇంగ్లాండ్‌ నుంచి భారీఎత్తున బంగారం నిల్వలను ఆర్‌బీఐ (RBI) భారత్‌కు తరలించింది. దాదాపు 100 టన్నులు అంటే లక్ష కిలోల పసిడిని దేశీయ ఖజానాలో చేర్చింది. 1991 తర్వాత ఈ స్థాయిలో బంగారాన్ని తరలించడం ఇదే తొలిసారి. అప్పట్లో ఆర్థిక సంక్షోభం కారణంగా భారత్‌ పెద్దఎత్తున పసిడి నిల్వలను తనఖా పెట్టాల్సివచ్చింది.

రవాణా, నిల్వ సర్దుబాట్లలో భాగంగానే భారత్ ఇంతమొత్తం బంగారాన్ని తీసుకొచ్చింది. దేశీయంగా ముంబయి మింట్‌ రోడ్డు సహా నాగ్‌పుర్‌లోని పాత కార్యాలయాల్లో ఆర్‌బీఐ పుత్తడిని నిల్వ (Gold Reserves) చేస్తుంటుంది. కొన్నేళ్లుగా కేంద్ర బ్యాంకు పెద్దఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తూ వస్తోంది. దీన్ని ఎక్కడ నిల్వ చేయాలనేది ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో విదేశాల్లోని మన నిల్వలు గణనీయంగా పెరిగాయి. దీంతో కొంత మొత్తాన్ని భారత్‌కు తీసుకురావాలని నిర్ణయించింది.

చాలా దేశాల కేంద్ర బ్యాంకులు బ్యాంక్ ఆఫ్‌ ఇంగ్లండ్‌లో తమ బంగారాన్ని నిల్వ చేస్తుంటాయి. అదే బాటలో భారత్‌ సైతం అక్కడి డిపాజిటరీల్లో పెద్దఎత్తున పసిడిని నిల్వ చేస్తూ వచ్చింది. 2024 మార్చి ముగిసేనాటికి ఆర్‌బీఐ (RBI) వద్ద 822.1 టన్నుల బంగారం ఉంది. దీంట్లో 413.8 టన్నులు ఇతర దేశాల్లో నిల్వ చేసి ఉంచింది. ఇటీవల కొన్నేళ్లుగా వరుసగా కొనుగోలు చేస్తూ వచ్చిన కేంద్ర బ్యాంకు గత ఏడాది 27.5 టన్నుల పసిడిని కొత్తగా నిల్వల్లో చేర్చింది. ఈ ఏడాది కొనుగోళ్ల జోరు మరింత పెరిగింది. జనవరి- ఏప్రిల్‌ వ్యవధిలోనే 2023 మొత్తం కంటే ఒకటిన్నర రెట్లు అధిక బంగారం కొనుగోలు చేయడం గమనార్హం.

కొన్ని నెలల కసరత్తు..
రవాణా, భద్రత విషయాలను పరిగణనలోకి తీసుకుంటే 100 టన్నుల బంగారాన్ని భారత్‌కు తరలించడం మామూలు విషయం కాదు. దీనివెనక కొన్ని నెలల కసరత్తు అవసరం. ఆర్‌బీఐ, ఆర్థికశాఖ సహా వివిధ ప్రభుత్వ శాఖలు, స్థానిక యంత్రాంగం మధ్య సమగ్ర సమన్వయం ఉండాలి. ఈ బంగారాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు తొలుత ఆర్థికశాఖ నుంచి ఆర్‌బీఐ కస్టమ్స్‌ సుంకం మినహాయింపు తీసుకుంది. సాధారణంగా అన్ని దిగుమతులపై వర్తించే ఐజీఎస్టీ మాత్రం తప్పలేదు. తద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా పంచుకోవాల్సి ఉండటమే దీనికి కారణం.

ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని భారత్‌కు తరలించేందుకు ప్రత్యేక విమానాన్ని ఉపయోగించారు. పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. తాజా తరలింపుతో ఆర్‌బీఐ నిర్వహణ వ్యయాలు స్వల్ప స్థాయిలో తగ్గుతాయి. ఇప్పటి వరకు బంగారం నిల్వ చేసినందుకు బ్యాంక్‌ ఆఫ్ ఇంగ్లాండ్‌కు చెల్లిస్తూ వచ్చిన రుసుము ఇకపై చెల్లించనక్కరలేదు.

ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? ఎప్పుడు విడుదల చేస్తారో తెలుసా?

Exit Polls Explained: భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు అంటే.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలకు ప్రతిరూపం అని చెప్పవచ్చు. మనదేశంలో ఎన్నికలు చాలాదేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.

ఇప్పుడు రెండునెలలుగా ఎన్నికల హంగామా దేశంలో నడుస్తోంది. ఏ దేశాల్లో ఈ ఎన్నికలు నిర్వహిస్తో వస్తున్నారు. ఇప్పటివరకూ ఆరు దశల పోలింగ్ పూర్తయింది. ఇక జూన్ 1న ఏడోదశ పోలింగ్ తో ఎన్నికల క్రతువు ముగుస్తుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆరోజు ఎన్నికల ఫలితాలు వెల్లడి అవుతాయి. ప్రస్తుతం ఎన్నికల ఫలితాలపై అందరూ టెన్షన్ తో ఎదురుచూస్తున్నారు. అయితే, దానికంటే ముందుగా అంటే జూన్ 1 వ తేదీన చివరిదశ పోలింగ్ పూర్తి అయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడి అవుతాయి. అసలు ఫలితాల కంటే ముందుగా వచ్చే ఈ రిజల్ట్స్ పై కూడా అందరూ ఆసక్తి కనబరుస్తారు. ఎందుకంటే, కొంతవరకూ ఓటింగ్ పల్స్ తెలుస్తుందని చాలామంది నమ్ముతారు. అసలు ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటి? వీటిని ఎవరు ఎందుకు నిర్వహిస్తారు? ఎందుకు వీటిని చివరి దశ పోలింగ్ తరువాత మాత్రమే వెల్లడిస్తారు? అసలు ఫలితాలకు.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు.. మధ్యలో వ్యత్యాసం ఉంటుందా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇప్పుడు అర్ధం చేసుకుందాం.

ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటి?
Exit Polls Explained: ఓటు వేయడానికి వెళ్లిన ఓటరు పోలింగ్ కేంద్రం నుంచి బయటకు రాగానే.. అతను ఏపార్టీకి ఓటు వేశాడు? ఎందుకు వేశాడు? వంటి విషయాలను తెలుసుకుని.. ఆ అభిప్రాయాల్ని క్రోడీకరించి.. ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయి అనే అంచనా వేయడమే ఎగ్జిట్ పోల్స్. ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ దాదాపుగా ఎన్నికల నిర్వహణ అంత క్లిష్టంగానే ఉంటుంది. ఓటర్లను ఎంపిక చేసుకోవడం.. వారి నుంచి ప్రశ్నలకు సమాధానం రాబట్టడం.. వాటిని శాస్త్రీయంగా విశ్లేషించడం.. వాటిని వెల్లడి చేసాయడం ఇంత ప్రాసెస్ ఉంటుంది.

ఎగ్జిట్ పోల్స్ ఎలా నిర్వహిస్తారు?
Exit Polls Explained: చాలా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తాయి. ఒక్కో సంస్థ ఒక్కో మార్గంలో దీనిని నిర్వహిస్తుంది. ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో చాలా కీలకమైనది సాంపిల్ ఎంపిక. ఉదాహరణకు ఒకరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయనుకుందాం. అప్పుడు అక్కడ ఉన్న నియోజకవర్గాలు.. వాటిలో కీలక నియోజకవర్గాలు వీటి నుంచి ఎగ్జిట్ పోల్స్ కోసం సాంపిల్స్ ఎంచుకుంటారు. అది కూడా మహిళలు, పురుషులు, వయసు, ఆర్థిక స్థితిగతులు ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ పై ఆధారపడి శాంపిల్స్ కలెక్ట్ చేస్తారు. ఎన్నిలలో ఓటింగ్ కు సంబంధించి కొన్ని ప్రశ్నలను సిద్ధం చేసుకుని వాటిపై ఓటు వేసి బయటకు వచ్చిన వారి అభిప్రాయాలు తెలుసుకుంటారు. కొన్ని సంస్థలు నమూనా బ్యాలెట్ నిర్వహిస్తాయి. అంటే, బ్యాలెట్ పేపర్ లాంటిది ఇచ్చి వారు ఏ గుర్తుపై ఓటు వేశారో అదే గుర్తుపై ఓటు వేయమని కోరతాయి. ఈ సాంపిల్స్ ఒక్కో నియోజకవర్గంలోనూ వందల సంఖ్యలో తీసుకుంటారు.. వేర్వేరు పోలింగ్ స్టేషన్స్ నుంచి వీటిని కలెక్ట్ చేస్తారు. ఇలా సేకరించిన సాంపిల్స్ మదింపు చేసి ఏ పార్టీకి లేదా ఏ అభ్యర్ధికి ఎంత శాతం ఓట్లు రావచ్చు అనే ఒక అంచనా వేస్తారు. ఆ అంచనాల ఆధారంగా ఫలితాలు సిద్ధం చేస్తారు.

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎందుకు చివరి దశ వరకూ ప్రకటించరు?
Exit Polls Explained: నిర్ణీత సమయానికి ముందే ఎగ్జిట్ పోల్‌లను ప్రచురించడం ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని నిబంధన ప్రకారం ఉల్లంఘనగా ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. అలాంటివి ఓటర్ల మనస్సులపై ప్రభావం చూపుతాయని భావిస్తారు. మన దేశంలో ఒకే విడతలో ఎన్నికలు జరగవు. ఒక రాష్ట్రంలో రెండు విడతలుగా ఎన్నికలు జరిగాయని అనుకుందాం. మొదటి విడత పోలింగ్ ఎగ్జిట్ పోల్స్ వెంటనే ప్రకటిస్తే.. ఏ అనే పార్టీకి విజయావకాశాలు ఉన్నాయని వెల్లడి అయితే, రెండో విడత పోలింగ్ లో పాల్గొనే ఓటర్లపై ఆ ప్రభావం పడుతుంది. అందుకనే, ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెంటనే ప్రకటించకుండా.. అన్ని దశల పోలింగ్ పూర్తయ్యాకా వెలువరించేలా ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.
అసలు ఫలితాలు.. ఎగ్జిట్ పోల్ ఫలితాల మధ్య తేడా ఉండవచ్చా?
Exit Polls Explained: నూటికి నూరు శాతం కచ్చితమైన ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ లో రావడం జరగదు. ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్ చెప్పడం వరకూ హెల్ప్ అవుతాయి. అంతేకానీ.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల లానే అసలు ఫలితాలు ఉండడం అనేది జరగదు. ఎందుకంటే, ఎగ్జిట్ పోల్స్ కోసం కొద్ది మంది అభిప్రాయాలు మాత్రమే తీసుకుంటారు. అలాగే ఓటు వేసిన వారు కచ్చితంగా ఈ పార్టీకే ఓటు వేశామని నిజమే చెబుతారనేది నమ్మడం కష్టమే. కేవలం ముందస్తుగా ఒక అంచనాకు రావడానికి మాత్రమే ఎగ్జిట్ పోల్స్ ఉపయోగపడతాయని చెప్పవచ్చు. ఇక ఎగ్జిట్ పోల్ ఫలితాలను నిర్వహించే సంస్థ క్రెడిబిలిటీ మీద కూడా ఆధారపడి ఉంటాయి. శాంపిల్స్ సేకరణ.. వాటి విశ్లేషణ జరిపే విధానాలు కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రభావితం చేస్తాయి.

ఈ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎప్పుడు?
చివరి దశ పోలింగ్ జూన్ 1 సాయంత్రం 6 గంటలతో ముగుస్తుంది. ఆ తరువాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకటన ఉంటుంది. ఆయా సంస్థలు వీటిని టీవీ ఛానల్స్, యూట్యూబ్, వివిధ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రసారం చేస్తాయి.

సీనియర్ ఎన్టీఆర్ పక్కన నుంచొన్న ఆ చిన్నోడు.. ఇప్పుడు గ్లోబల్ స్టార్

టాలీవుడ్ ఇండస్ట్రీలో దిగ్గజ నటుల్లో ఒకరు నందమూరి తారక రామారావు. కళామతల్లి ముద్దుబిడ్డగా ఎదిగిన ఎన్టీఆర్.. ఆ తర్వాత ప్రజా హృదయాలను గెలుచుకున్న రాజకీయ నేతగా మారారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో మారుమూల గ్రామంలో పుట్టి.. మన దేశం అనే మూవీలో చిన్న పాత్ర పోషించి.. అంచెలంచెలుగా ఎదుగుతూ టాప్ స్థానానికి చేరుకున్నాడు. పౌరాణిక, ఇతిహాస గాధలకు కేరాఫ్ అడ్రస్ అయ్యాడు. కృష్ణుడు, రాముడు ఎలా ఉంటాడో చాలా మందికి తెలియదు కానీ.. ఎన్టీఆర్‌నే దైవంలా భావించారు తెలుగు ప్రేక్షకులు. ఆయన తెరపై కనిపిస్తుంటే జైజైలు పలకడంతో పాటు హారతులు పట్టేవారంటే.. అతని నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారు. తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషల్లో దాదాపు 303 చిత్రాల్లో నటించారు.

ఆయన చివరిగా నటించింది శ్రీనాథ కవి సార్వభౌముడు. కానీ అందరికీ తుది చిత్రంగా నిలిచిపోయింది మాత్రం మేజర్ చంద్రకాత్. ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్న ఫోటో స్టిల్ కూడా ఆ చిత్రంలోనిదే. ఇందులో మోహన్ బాబు, నగ్మా, రమ్యకృష్ణ హీరో హీరోయిన్లు. ఊర్వశి శారద, ఎన్టీఆర్‌కు భార్యగా నటించింది. పరుచూరి బ్రదర్స్ అందించిన కథను తెరకెక్కించాడు రాఘవేంద్ర రావు. ఎం ఎం కీరవాణి అందించిన మ్యూజిక్ సూపర్ డూపర్ హిట్. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే.. ఈ ఫోటోలో నందమూరి తారక రామారావు పక్కన ఉన్న ఈ బాబును గమనించారా..? అతడు ఎవరో చెప్పుకోండి చూద్దాం. బహుశా అతడు ఊహించి ఉండడు.. అతనంత స్టార్ హీరోను అవుతానని. ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరో మాత్రమే కాదు గ్లోబల్ స్టార్.

ఇంతకు ఆ చిన్నోడు ఎవరంటే.. నందమూరి తారకరామారావు మనవడు జూనియర్ ఎన్టీఆర్. అవును తాత పక్కన ఒదిగి ఉన్న ఈ బాలుడు టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాసెస్ తారక్. బ్రహ్మర్షి విశ్వామిత్ర, బాల రామయణం వంటి చిత్రాలతో బాల నటుడిగా అలరించిన నందమూరి వారసుడు.. అత్యంత పిన్న వయస్సులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. నిను చూడాలని మూవీతో హీరోగా మారిన యంగ్ టైగర్.. స్టూడెంట్ నంబర్ 1తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. మీసాలు సరిగా రాని ఈ కుర్రాడు.. టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. అక్కడ నుండి వెనుదిరిగి చూసుకోలేదు. ఇంతింతై.. వటుడింతై అన్నట్లుగా ఎదిగాడు. ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్‌గా మారాడు. దేవర మూవీతో పాటు వార్ 2 చిత్రాలను చేస్తున్నాడు తారక్.

హనుమత్ జయంతి 2024 : ఆంజనేయుడి అనుగ్రహం కోసం చేయాల్సిన పరిహారాలు.. ఇవే

హనుమాన్ జయంతి ఏడాదికి మూడుసార్లు వస్తుంది. చైత్ర పౌర్ణమిరోజు , వైశాఖ దశమి రోజు ( జూన్ 1) , మార్గశిర మాసంలో జరుపుకుంటారు. చైత్ర మాసానికి సంబంధించిన హనుమాన్​ జయంతి ఇప్పటికే పూర్తి కాగా..

వైశాఖ దశమి హనుమాన్ జయంతిని జూన్​ 1 శనివారం నాడు జరుపుకోనున్నారు. మరి ఈ రోజున స్వామి వారి అనుగ్రహం కోసం ఎలాంటి పరిహారాలు పాటించాలో.. పురాణాల్లో ఏముంది..పండితులు ఏం చెబుతున్నారో.. తెలుసుకుందాం. . .

దృక్​ పంచాంగం ప్రకారం.. వైశాఖ మాసం కృష్ణ పక్షం దశమి తిథి అంటే 2024 జూన్​1వ తేదీనే హనుమాన్ జయంతిని జరుపుకోనున్నారు. హనుమాన్ జయంతి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి పసుపు లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించి హనుమంతుని విగ్రహానికి సింధూరం, తమలపాకులు సమర్పించాలి. మల్లె నూనెతో దీపం వెలిగించి, గులాబీ పూల దండను విగ్రహం/పటానికి వేసి భజరంగబలికి ఇష్టమైన బెల్లం, పప్పును నైవేద్యంగా పెట్టాలి. హనుమాన్ చాలీసా 7 సార్లు చదవాలి. ఇంట్లో రామాయణ పారాయణం చేయడం చాలా మంచిది. హారతి ఇచ్చిన తరువాత శక్తి మేరకు పేదవారికి వస్త్రాలు, ఆహారం, డబ్బును దానం చేయొచ్చు.

చేయాల్సిన పరిహారాలు..

హనుమాన్ జయంతి నాడు ( జూన్ 1) స్వామి వారికి గులాబీ పూల దండ వేస్తే.. ఆయన అనుగ్రహం పొందవచ్చని.. ఉద్యోగం లేదా వ్యాపారంలో అడ్డంకులు తొలగిపోతాయని స్కంద పురాణంలో పేర్కొన్నారు
చాలా కాలంగా ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే, హనుమాన్ జయంతి నాడు నెయ్యిలో వాము కలిపి ఆంజనేయుడికి సమర్పించాలని.. ఇది అనారోగ్యం నుంచి మిమ్మల్ని కాపాడుతుందని.. ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు.
తమలపాకులు అంటే హనుమంతుడికి మహా ఇష్టం. వాటి మీద జైశ్రీరామ్ అని రాసి తమలపాకుల దండ సమర్పించడం వల్ల హనుమంతుడి అనుగ్రహం మీ మీద ఉండి.. కోరుకున్నవన్నీ జరుగుతాయని చెబుతున్నారు.
వ్యాపారాన్ని మెరుగుపరచడానికి, హనుమాన్ జయంతి నాడు స్వామికి సింధూర రంగు వస్త్రాన్ని సమర్పించాలని.. ఆంజనేయ స్వామి గుడిని కాషాయం జెండాలతో అలంకరించాలని అంటున్నారు. ఇది వ్యాపారంలో వచ్చే ఆకస్మిక సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తుందని చెబుతున్నారు.
హనుమాన్ జయంతి రోజు ఆంజనేయుడికి శనగపిండి, ఎర్ర చోళం సమర్పించాలి. అలాగే మల్లె నూనె దీపాన్ని వెలిగించాలి. హనుమాన్ చాలీసా పఠించాలి. ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని.. అప్పుల సమస్యల నుంచి బయట పడి ఆదాయం పెరిగేందుకు అవకాశాలు లభిస్తాయని అంటున్నారు.
ఆర్థిక శ్రేయస్సు కోసం తెల్ల కాగితంపై కాషాయ రంగుతో స్వస్తిక్ గుర్తు రాసి హనుమంతునికి సమర్పించి.. ఆ తరువాత ఇంట్లో భద్రంగా ఉంచుకోవాలని అంటున్నారు. ఇలా చేస్తే ఆర్థిక బాధలు తొలగిపోతాయని అంటున్నారు.
శని దోషం పోగొట్టేందుకు ఆంజనేయస్వామి విగ్రహం ముందు ఆవనూనెతో దీపం వెలిగించి అందులో నల్ల నువ్వులు వేయాలని.. ఇలా చేయడం వల్ల శని అశుభ ప్రభావాల నుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు.

వావ్ : మెరుస్తున్న పుట్టగొడుగులు.. చూడాలంటే అక్కడకు వెళ్లాల్సిందే..

పుట్టగొడుగులు ఒక ఆహారంగానే చాలామందికి తెలుసు. ఇవి పర్యాటకులను కూడా ఆకర్షించే శక్తి ఉన్నవి. సాధారణ పుట్టగొడుగులను చూడడానికి ఎవరూ రారు, కానీ ఆ పుట్టగొడుగులు మెరుస్తూ కనిపిస్తే కచ్చితంగా వాటిని చూసేందుకు ఎంతో మంది వస్తారు. అలాంటి మెరుస్తున్న పుట్టగొడుగులు మనదేశంలోనే ఉన్నాయి. వాటిని సహజమైన టార్చ్ లైట్లుగా స్థానికులు భావిస్తారు. రాత్రిపూట అడవిలో వాటి వెలుతురులోనే ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి మిలమిల మెరిసే పుట్టగొడుగులు ఉన్నది కర్నాటక అడవుల్లో( ఉత్తర కన్నడ). ఈ పుట్టగొడుగులకు బయోలుమినిసెన్స్ లక్షణం ఉంది. అంటే స్వయంగా వెలిగే శక్తిని కలిగి ఉన్నాయి.

ఉత్తర కన్నడలోని పల్లెటూళ్లలో నదీతీరంలో కప్పలు, చేపలు పట్టి పట్టే చేపలు, దట్టమైన అడవిలో చెట్లకింద వ్యాపించే పుట్టగొడుగులు సందర్శకులను కట్టిపడేస్తాయి. తాజాగా ఓ ఫోటోగ్రాఫర్ గోపి జాలీ తన కెమెరాలో అరుదైన పుట్టగొడుగును బంధించారు. అడవిలో కొన్ని జాతుల పుట్టగొడుగులు చాలా విచిత్రంగా కనువిందు చేస్తాయి. తడిగా ఉండే, కఠినమైన వాతావరణాల్లో పెరుగుతాయి, కొన్నిసార్లు విషపూరిత పదార్థాలను వెదజల్లుతూ విస్తారమైన ఆకారాలు.. వివిధ రంగుల్లో కనిపిస్తాయి అత్యంత ఆకర్షణీయమైన లక్షణాలతో మెరుస్తూ ఉంటాయి. 70 రకాల శిలీంధ్రాలు చీకటిలో కాంతిని విడుదల చేస్తయి, ఇవి సాధారణంగా గుర్తించలేని జీవులను ఆకర్షణీయంగా ఉంటాయి.

బయోలుమినిసెంట్ పుట్టగొడుగులు జీవరసాయన ప్రక్రియ ద్వారా కాంతిని ఉత్పత్తి చేసే శిలీంధ్రాలున్న వివిధ జాతుల పుట్టగొడుగులు. . ఉత్తర కన్నడ అడవులు అయస్కాంతంలా దూర ప్రాంతాల ప్రజలను కాంతితో ఆకర్షిస్తాయి. ఈ పుట్టగొడుగులను పగటిపూట సాధారణ పుట్టగొడుగుల్లాగా గుర్తించడం కష్టం. వీటి గురించి తెలిసిన వారు మాత్రమే గుర్తించగలరు. లూసిఫేరేస్ అనే ఎంజైమ్ పుట్టగొడుగులు, తుమ్మెదలు మరియు కొన్ని సముద్ర జీవులతో సహా వివిధ రకాల జీవులలో బయోలుమినిసెన్స్‌కు బాధ్యత వహిస్తుంది. ఈ ఎంజైమ్ ఆక్సిజన్ సమక్షంలో ఆక్సీకరణం చెంది కాంతి రూపంలో శక్తిని విడుదల చేస్తుంది. పుట్టగొడుగులు విడుదల చేసే కాంతి సాధారణంగా ఆకుపచ్చ రంగులో ఉంటుంది. పుట్టగొడుగులలోని బయోలుమినిసెన్స్ వివిధ రకాల సహజ విధులను నిర్వహిస్తుంది. ఇది కీటకాలను ఆకర్షించగలదు, ఇది పుట్టగొడుగుల బీజాంశం వ్యాప్తికి కూడా సహాయపడుతుంది.

ఈ ప్రదేశంలో కనిపెట్టిన పుట్టగొడుగులను ప్రపంచంలో ఇప్పటివరకు కనిపెట్టిన పుట్టగొడుగుల్లో 97వ బయోలుమినిసెంట్ శిలీంధ్రాలుగా గుర్తించారు.రుతుపవనాల సమయంలో శాస్త్రవేత్తల బృందం ఆ ప్రాంతంలో పర్యటించింది. రెండు వారాలు పాటు పరిశోధించి అక్కడి పుట్టగొడుగులను పరిశీలించింది. ఇక్కడ వారు వందలాది జాతుల పుట్టగొడుగులను గుర్తించారు. అవి సైన్స్‌కు కూడా చాలా కొత్తవి. అక్కడి స్థానికులు వీటిని ఎలక్ట్రిక్ పుట్టగొడుగులు అని పిలుస్తారు. చీకట్లో చిన్న చిన్న దీపాల్లా పుట్టగొడుగులు ఎంతో అందంగా మెరుస్తూ ఉంటాయి. ఆకుపచ్చని వెలుగుతో కనుల విందు చేస్తాయి. ఈ ఫంగస్ తన నుండి సొంత కాంతిని విడుదల చేస్తుంది. ఇది చూడాలంటే అక్కడికి వెళ్లి తరించాల్సిందే. పరిశోధకుల పర్యటన తర్వాత ఈ పుట్టగొడుగులను రోరీడోమైసెస్ జాతికి చెందిన పుట్టగొడుగులుగా గుర్తించారు. ఇవి మన దేశంలో మొదటిసారి గుర్తించినట్టు చెప్పారు శాస్త్రవేత్తలు.

ప్రపంచవ్యాప్తంగా 20వేల శిలీంధ్ర జాతులు ఉంటే, అందులో 70 రకాల పుట్టగొడుగులు మాత్రమే శక్తిని కలిగి ఉంటాయి. ఇవి తమ నుంచి కాంతిని విడుదల చేయగలవు. అలాంటివే మేఘాలయ అడవుల్లోపరుచుకొని ఉన్నాయి. ఈస్ట్ ఖాసీ హిల్స్ జిల్లాలోని మావ్లిన్నాంగ ప్రాంతంలో నీటి ప్రవాహానికి దగ్గరలో ఈ మెరిసే పుట్టగొడుగులను మొదటిసారి కనుగొన్నారు. అలాగే వెస్ట్ జైంతియా హిల్స్ జిల్లాలోని క్రాంగ్ షూరి జిల్లాలో అదే రకమైన పుట్టగొడుగులను స్థానికులు గమనించారు. అప్పటినుంచి ఆ ప్రాంతం చాలా హైలెట్ అయింది

Health

సినిమా