Friday, November 15, 2024

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పై కేసు

అమరావతి: వైకాపా ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy)పై కేసు నమోదైంది. కౌంటింగ్‌ ఏజెంట్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో తెదేపా నేతలు దేవినేని ఉమా, గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు ఆయనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. 153, 505, 125 సెక్షన్ల కింద సజ్జలపై కేసు పెట్టారు.

వైకాపా కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆ పార్టీ చీఫ్‌ కౌంటింగ్‌ ఏజెంట్ల అవగాహన సదస్సులో సజ్జల పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘మన టార్గెట్‌ ఇదీ అని దృష్టిలో పెట్టుకుని… దానికి అవసరమైనవి తెలుసుకోవాలి. అవతలివారు (ప్రత్యర్థి పార్టీలను ఉద్దేశించి) అడ్డం పడకుండా వారిని ఆపేందుకు ఏవేం నిబంధనలు ఉన్నాయో చూసుకోవాలి. మనవి ఒక్క ఓటు కూడా చెల్లనివిగా చేసే పరిస్థితి రాకుండా అడ్డుకునేందుకు ఏం చేయాలో చూసుకోవాలి. అంతే తప్ప రూల్‌ అలా ఉంది కాబట్టి దాని ప్రకారం పోదాం అని మనం కూర్చోకూడదు.

మనకు అనుకూలంగా, అవతలివాళ్ల ఆటలు సాగకుండా రూల్‌ని ఎలా చూసుకోవాలి? అవసరమైతే దానికోసం ఎంతవరకు ఫైట్‌ చేయాలనేది నేర్చుకుందాం. ఇందులో కౌంటింగ్‌ ఏజెంట్‌ తనవంతు పాత్ర పోషించేలా వారి మెదడులోకి మీరు (చీఫ్‌ కౌంటింగ్‌ ఏజెంట్లు) బాగా ఎక్కించాలి. పొరపాటున ఒకటి మనం వాదించినా పర్లేదు. కానీ, రూల్‌ కాదేమో అని వెనక్కి తగ్గేవాడైతే ఏజెంట్‌గా వద్దు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై తెదేపా నేతలు ఫిర్యాదు చేయడంతో తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

మీపై మీరు విజయం సాధిస్తారు ఇలా చేస్తే…

చాలామంది సంకల్పబలం, క్రమశిక్షణల గురించి ఓ అరగంట ప్రసంగించమంటే తడుముకోకుండా మాట్లాడతారు. కానీ వాటిని పాటించే విషయంలోనే వస్తాయి చిక్కులన్నీ. తమ దాకా వచ్చేసరికి అవి అందరికీ సాధ్యం కాదని తేల్చేస్తారు. అది పుట్టుకతోనే రావాలని చల్లగా జారుకుంటారు. అలాంటి వారికి సమాధనమే ఈ కింది విషయాలు..

దృఢనిర్ణయాలు తీసుకోవాలంటే? …

మీ మానసిక బలాన్ని పరీక్షించుకొని, పెంపొందించుకొనే మార్గాల్లో ముఖ్యంగా ప్రతి నిత్యం జీవితంలో కొన్ని ఇష్టం లేని, కష్టంగా కనిపించే పనుల్ని చేయడం ఒకటి. అలా తరచూ సాధన చేయాలి. వీటి వల్ల ప్రయోజనాలు కలుగుతాయని తెలిసినా మీ మనసు ఆ పనుల్ని ఏదో ఒక వంకతో వ్యతిరేకిస్తూనే ఉంటుంది. అయినా సరే ఆ పనులు చేయాలి. అలా చేయడం ద్వారా మీ మెదడులో నిక్షిప్తమైన వ్యతిరేక భావాలను అధిగమించగలుగుతారు. అంతర్గతంగా ఉన్న వ్యతిరేక శక్తులను అధిగమించడం ద్వారానే మనకు అవసరమైన అంతర్గత శక్తిని మేల్కొల్పగలం.

ఉదాహరణకు మీరు బస్సులో ప్రయణిస్తున్నారనప్పుడు సీటు దొరికితే హాయిగా కూర్చుంటారు, లేకపోతే తప్పదు కాబట్టి నిలబడి ప్రయాణిస్తారు. ఒకవేళ మీకు సీటు దొరికినా సరే ఆ సీటును ఇంకొకరికి ఇవ్వండి. ఓ పదిహేను లేదా ఇరవై నిమిషాలు నిలబడి ప్రయాణించండి. ఈ చిన్న విషయంలో మిమ్మల్ని మీరు పరీక్షించుకొని, మీలోని మానసిక నిరోధ భావాలను గమనించండి. అయినా మనస్సు మాట వినకుండా ఇంకొకరికి ఆ సీటు ఇచ్చి, ప్రయాణం చేయండి. ఆ తరువాత చూడండి. మీరు ఈ నిరోధ భావాల నుంచి బయటపడడానికి చేసిన సంఘర్షణ, చివరికి సాధించడం చూస్తే మీలో మీకే తెలియని ఆత్మవిశ్వాసం, ధైర్యం కలుగుతాయి.

భగవద్గీతలో శ్రీకృష్ణుడు, అర్జునుడితో మానసిక దౌర్బల్యాన్ని జయించాలని చెబుతూ ఎవరికైనా మనస్సును అదుపులో ఉంచుకోవడం దుస్సాధ్యమే, కానీ అభ్యాస, వైరాగ్యాల ద్వారా దాన్ని సాధించవచ్చని బోధిస్తాడు.

మీ ఇంట్లోని వారికి వారి పనుల్లో ఎప్పుడైనా సహాయం చేశారా?

ఈసారి ఈ విధంగా ప్రయత్నించండి! నేరుగా వంటింట్లోకి వెళ్ళి అమ్మతో “అమ్మా! నేను ఏదైనా సహాయం చేయనా?” అని అడగండి, ఎప్పుడూ ఆ మాట అడగని మీరు ఈ ప్రశ్న వేసేసరికి ఆవతలివారు కాస్త కంగారు పడి, మిమ్మల్ని కొత్తగా చూడడం సహజమే. అయినా సరే, వంటిల్లు సర్దడంలోనో, కూరలు తరగడంలోనో, గిన్నెలు కడగడంలోనో సహాయం చేయండి. అది చిన్న పనే అయినా, మీకిష్టం లేని పని చేసిన తరువాత ఒక్కసారి వారి కళ్ళలోని ఆ వెలుగును చూడండి. రెండూ మిమ్మల్ని సంకల్ప బలం వైపు నడిపిస్తాయి.

ఒక్కోసారి మీరు అలసిపోయి ఇంటికొస్తారు. రాగానే మీ శరీరాన్ని సోఫాలో పడేసి అందుబాటులో ఉన్న టీవీ రిమోట్ తీసుకొని, అలా ఎంతసేపు ఛానల్స్ మారుస్తూ కూర్చుంటారో మీకే తెలియదు. అప్పుడు స్నానం చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. కానీ బద్దకం మీ కన్నా బలమైంది కాబట్టి, అది అక్కడ నుంచి లేవనీయదు. అయితే ఈ సారి మీ బద్ధకం మాట వినకండి. కష్టమైనా సరే లేచివెళ్ళండి. చేయాలనుకున్న పని వాయిదా వెయ్యకుండా చేయండి. అప్పుడు చూడండి మీపై మీకే తెలియని దృఢత్వం, ఒక నమ్మకం, ధైర్యం కలుగుతాయి. ప్రయత్నిస్తే తప్పకుండా ఫలితం లభిస్తుంది.

ఒకరోజు మీరు కాఫీ, టీ, పాలల్లో చక్కెర లేకుండా తాగేందుకో లేదా కనీసం పెరుగన్నంలో ఉప్పు లేకుండా తినేందుకో ప్రయత్నించండి. మీ కన్నా ముందు మీ నాలుక ఈ ప్రయోగానికి ఒప్పుకోదు. దాన్ని జయించడానికేగా ఈ ప్రయత్నమంతా! అలాగే వేడినీళ్ళ స్నానం అలవాటున్న వాళ్ళు వరుసగా వారం రోజులు చన్నీటి స్నానం చేసి మీలోని శారీరక, మానసిక నిబ్బరాన్ని పరీక్షించి సాధించండి. చదువుకునేటప్పుడు కష్టమైన సబ్జెక్టుతో వాయిదా వేయకుండా పోరాడండి. కొన్ని మాటలు మాట్లాడే కన్నా మాట్లాడకుండా ఉంటేనే ఎక్కువ ప్రయోజనం ఉన్నప్పుడు మౌనాన్ని ఆశ్రయించండి. మీ ఉద్వేగాన్ని అదుపులో ఉంచుకోండి.

ఇలా అన్నీ ఒక్కొక్కటిగా మీ జీవితంలో ఫాలో అయ్యారంటే మీ మీద మీరు విజయం సాధిస్తారు కచ్చితంగా.

బే ఏరియాలో ఘనంగా ‘ఎన్టీఆర్‌ 101వ జయంతి’ ఉత్సవాలు

తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలను బే ఏరియాలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు ‘జయరాం కోమటి’ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

కాలిఫోర్నియా: తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలను బే ఏరియాలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు ‘జయరాం కోమటి’ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ అభిమానులు, తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు హాజరై ఘనంగా నివాళులు అర్పించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం కోసం బే ఏరియా నుంచి ఎంతోమంది ఎన్నారైలు ఆంధ్రప్రదేశ్‌ వెళ్లి పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా వారు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధిస్తుందని, కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు భక్త భల్లా, వెంకట్ కోగంటి, సుబ్బ యంత్ర, శ్రీనివాస్ వల్లూరిపల్లి, విజయ్ గుమ్మడి, సతీశ్‌ అంబటి, హరి సన్నిధి, వెంకట్ అడుసుమల్లి, లియోన్ రెడ్డి బోయపాటి, వెంకట్ మద్దిపాటి, సుధీర్ ఉన్నం, వెంకట్ జెట్టి, భరత్ ముప్పిరాళ్ల, రవి కిరణ్, నరహరి మార్నేని, హరి బాబు బొప్పూడి, వంశీ కృష్ణ నేలకుదిటి, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

England: లండన్‌ ఆస్పత్రిలో కీచకపర్వం.. భారత సంతతి డాక్టర్‌పై లైంగిక అభియోగాలు

England: ఇంగ్లండ్‌లోని లంకాషైర్‌ బ్లాక్‌పూల్‌ విక్టోరియా ఆస్పత్రిలో జర్జన్‌గా పనిచేస్తున్న భారత సంతతి వైద్యుడు 54 ఏళ్ల అమల్‌ బోస్‌పై లైంగిక దాడి అభియోగాలు నమోదయ్యాయి. గతేడాది మార్చిలో పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఆస్పత్రి బోస్‌ను సస్పెండ్‌ చేసింది. క్రౌన్‌ ప్రాసిక్యూషన్‌ సర్వీస్‌(CPS)తో విచారణ తర్వాత ఆరుగురు బాధిత మహిళలు బోస్‌పై 14 లైంగిక అభియోగాలు మోపారు.

2017 నుంచి 2022 వరకు..
బోస్‌ బ్లాక్‌పూల్‌ విక్టోరియా ఆస్పత్రిలో కార్డియోవాస్కులర్‌ సర్జరీ విభాగానికి అధిపతిగా పనిచేశాడు. 2017 నుంచి 2022 మధ్య ఆస్పత్రి సిబ్బందితోపాటు, రోగులు, వారి బంధువులపై లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపించారు. దీంతో పోలీసులు అరెస్ట్‌ చేశారు. బెయిల్‌పై విడుదలయ్యాడు. కేసు విచారణ కొనసాగుతోంది. జూన్‌ 7న లాంకాస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరు కావాల్సి ఉంది. బోస్‌పై ఆరోపణలను బ్లాక్‌పూల్‌ టీచింగ్‌ హాస్పిటల్స్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌ ధ్రువీకరించింది. పోలీసుల విచారణకు సహకరిస్తామని హామీ ఇచ్చింది. సేవలు యథావిధిగా కొనసాగిస్తూ, రోగులు, కుటుంబాలకు సురక్షితమైన, సంరక్షణ వాతావరణాన్ని నిర్వహించడంలో తమ నిబద్ధతను వారు నొక్కిచెప్పారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో..
ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఇదే తరహా వెలుగులోకి వచ్చింది. ఇంగ్లిండ్‌లో తన వద్ద చికిత్స తీసుకుంటున్న మహిళా రోగులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు భారత సంతతి వైద్యుడు తన నేరాన్ని అంగీకరించాడు. ఆగ్నేయ ఇంగ్లండ్‌లోని హాంప్‌షైర్‌లోని హవంత్‌ స్టాంటన్‌ సర్జరీ లో మాజీ జనరల్‌ ప్రాక్టీషనర్‌ మోహన్‌బాబు పోర్ట్స్‌ మౌత్‌ క్రౌన్‌ కోర్టులో మూడు వారాలపాటు జరిగిన విచారణకు హాజరయ్యాడు. లైంగిక వేదింపుల 2019 సెప్టెంబర్‌ నుంచి 2021 జూలై మధ్య జరిగాయని తెలిపాడు. బాధితుల్లో 19 ఏళ్ల యువతి కూడా ఉన్నట్లు కోర్టు పేర్కొంది. అదే క్లినిక్‌లో జనరల్‌ ప్రాక్టీషనర్‌ అయిన తన భార్యతోపాటు మోహన్‌బాబు పనిచేసిన స్టాంటన్‌ సర్జరీ ప్రాంగణంలో ముగ్గురు మహిళలను లక్ష్యంగా చేసుకున్నాడు. మోహన్‌బాబుపై అనేక ఫిర్యాదులు వచ్చాయని, బాధతులను అనుచితంగా తాకడం, గగుర్పాటు కలిగించే వ్యాఖ్యలు చేయడం వంటివాటిపైన ఆయనను పలుమార్లు హెచ్చరించినట్లు న్యాయ నిపుణులు పేర్కొన్నారు.

Singapore: సింగపూర్‌లో భారత సంతతి వ్యక్తి మృతి.. వాటర్‌ ట్యాంకు శుభ్రం చేస్తుండగా ఘటన!

Singapore: సింగపూర్‌లోని నేషనల్‌ వాటర్‌ ఏజెన్సీలో విష వాయువులు పీల్చి భారత సంతతికి చెందిన వ్యక్తి మృతిచెందాడు. మృతుడు తమిళనాడుకు చెందిన శ్రీనివాసన్‌ శివరామన్‌గా గుర్తించారు. శివరామన్‌ సింగరూర్‌లోని సూపర్‌సోనిక్‌ మెయిటెనెన్స్‌ సర్వీస్‌లో క్లీనింగ్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.

ట్యాంకు క్లీన్‌ చేయడానికి వెళ్లి..
మే 23న నేషనల్‌ వాటర్‌ ఏజెన్సీ పబ్‌కి చెందిన చోవాచు కాంగ్‌ వాటర్‌ వర్క్స్‌లో భాగంగా ట్యాంకు క్లీన్‌ చేసేందుకు వెళ్లాడు. ట్యాంకులో దిగి శుభ్రం చేస్తుండగా అందులో విష వాయువులు వెలువడ్డాయి. వాటిని పీల్చుకున్న శివరమాన్‌ అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన సిబ్బంది అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మరో ఇద్దరు కార్మికులు కూడా ఆస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈమేరకు సింగపూర్‌లో కార్మికులను నియమించే స్టార్‌ గ్రూప్‌ ఎస్ట్‌ కంపెనీ తెలిపింది.

హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ వాయువు..
ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో ట్యాంకులో హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ వాయువు వెలువడిందని, దానిని పీల్చడంతో ముగ్గురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారని తేల్చారు. శివరామన్‌ పరిస్థితి విషమించి ఆస్పత్రిలో మృతిచెందినట్లు పేర్కొన్నారు. మృతుడికి భార్య నర్మద, ఇద్దరు కూతుళ్లు మహాశ్రీ, శ్రీనిషా, సింగపూర్‌లోని ఆహార పరిశ్రమలో పనిచేస్తున్న మోహన్‌ నవీన్‌కుమార్‌ అనే సోదరుడు ఉన్నారు.

మృతదేహం అప్పగింత..
ప్రమాదం జరిగిన రోజే కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన అధికారులు శివరామన్‌ మృతదేహాన్ని మే 26న కుటుంబ సభ్యులకు అందించారు. మంగళవారం(మే 28న) అతడి మృతదేహాన్ని తమిళనాడులోని స్వగ్రామానికి తరలించినట్లు తెలిసింది.

మలేషియా వెళ్లాలనుకుని..
వాస్తవానికి శివరామన్‌ మే 27న మలేషియా వెళ్లాలనుకున్నాడు. ఈమేరకు సెలవు కూడా తీసుకున్నాడు. అంతకు ముందురోజు రెస్ట్‌ తీసుకోవాలని కూడా భావించాడు. కానీ ఇంతలోనే మే 23న అస్వస్థతకు గురై మృతిచెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

UK Royal Award: భారతీయ యువతికి లండన్‌ ప్రతిష్టాత్మక అవార్డు!

UK Royal Award: భారత్‌కు చెందిన ఓ టీనేజీ అమ్మాయి లండన్‌ ప్రతిష్టాత్మక అవార్డు అందుకుంది. అది కూడా లండన్‌ ప్రిన్స్‌ చార్లెస్‌ను కలిసి ఆయన చేతుల మీదుగా అందుకునే అరుదైన అవకాశం దక్కించుకుంది. ఎవరా యువతి.. అవార్డు ఎందుకు వచ్చింది. అనే వివరాలు తెలుసుకుందాం..

18 ఏళ్ల రిక్షా డ్రైవర్‌..
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని బహ్రెచ్‌ జిల్లాకు చెందిన 18 ఏళ్ల ఆర్తి రిక్షా డ్రైవర్‌. ఆమెను లండన్‌లోని ప్రతిష్టాత్మక అమల్‌ కూన్లీ ఉమెన్‌ ఎంపవర్మెంట్‌ అవార్డు వరించింది. ఈ అవార్డును బ్రిటిష్‌ స్వచ్ఛంద సంస్థ ప్రిన్స్‌ ట్రస్టు స్పాన్సర్‌ చేస్తుంది. ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుకు ఇంగ్లిష్‌ బారిస్టర్‌ అమల్‌ క్లూనీ పేరు పెట్టారు. ఆర్తి ప్రభుత్వ ఈ రిక్షా చొరవతో డ్రైవర్‌గా పనిచేసి ఇతర యువతను ప్రేరేపించింది. అందుకు లండన్‌ ప్రతిష్టాత్మక అవార్డుకు బ్రిటిష్‌ స్వచ్ఛంద సంస్థ అవార్డుకు ఎంపిక చేసింది.

పింక్‌ రిక్షా ఇనిషియేటివ్‌..
ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం 2020లో మిషన్‌శక్తి పథకాన్ని ప్రారంభించింది. రక్షణ, శిక్షణ, స్వావలంబన ద్వారా మహిళలకు సాధికారత కల్పించడమే ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కింద పింక్ ఈ రిక్షా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా మహిళలకు ఈ రిక్షాలు నడపడంలో శిక్షణ, ట్రాపిక్ నిబంధనల గురించి సమాచారాన్ని అందిస్తుంది. వితంతువుల, ఒంటరి తల్లులకు ఉపాధి కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఆర్తి గతేడాది జూలైలో భారత ప్రభుత్వం పింక్‌ ఈ రిక్షా పథకాన్ని పరిచయం చేసేందుకు ముందుకు వచ్చారు. యూపీలో ఆమె తొలి పింక్‌ ఈ రిక్షా డ్రైవర్‌. చిన్న వయసులో ఆమె అందించిన గొప్ప సహకారానికి ప్రిన్స్ ట్రస్ట్ అవార్డుని తెచ్చిపెట్టింది. అసమానతలకు వ్యతిరేకంగా తన చుట్టూ ఉన్నవారిలో శాశ్వతమైన మార్పు తీసుకొచ్చేలా ప్రపంచ పనిలో విజయం సాధించిన యువతులను ఈ అవార్డుతో సత్కరిస్తుంది ప్రిన్స్‌ ట్రస్టు. ఈ ఏడాది ఆర్తిని ఎంపిక చేసింది.

తొలి పింక్ ఈ రిక్షా డ్రైవర్‌గా..
ఇక ప్రతిష్టాత్మక లండన్‌ అవార్డు గెల్చుకున్న ఆర్తి.. పింక్‌ ఈరిక్షా డ్రైవర్‌. ఆమె కూడా ఒంటరి తల్లి. దీంతో మిషన్‌ శక్తి పథకం ద్వారా శిక్షణ పొంది తొలి ఈ రిక్షా డ్రైవర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అవార్డు గెలుచుకున్న సందర్భంగా ఆర్తి మాట్లాడుతూ సవాళ్లను ఎదుర్కొనేలా ఇతర అమ్మాయిలకు స్ఫూర్తినివ్వగలిగినందుకు గర్విస్తున్నానని తెలిపింది. ఈ కొత్త స్వాతంత్ర్యం ప్రపంచాన్ని వేరే కోణంలో చూసేందుకు నన్ను అనుమతించిందని పేర్కొంది. ఇప్పుడ నేను నా కలలన మాత్రమే కాకుండా నా కుమార్తె కలలను కూడా నెరవేరుస్తాను. ఈ చొరవే నాకు బకింగ్హామ్ ప్యాలెస్లో కింగ్ చార్లెస్ ను కలిసే అవకాశం లభించేలా చేసింది అని వెల్లడించింది. ఇది ఒక అద్భుతమైన అనుభవంగా అభివర్ణించింది. ప్రిన్స్‌ చార్లెస్‌ తనకు ఈ రిక్షా డ్రైవింగ్‌పై ఉన్న ఆసక్తిని శ్రద్ధగా విన్నారని తెలిపింది. తన ఆటో రిక్షా కాలుష్యం కలిగించని వాహనం అని చార్లెస్‌తో గర్వంగా చెప్పానని ఆర్తి పేర్కొంది.

Dr.Krishna Ella : తెలుగు సైంటిస్ట్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం!

Dr. Krishna Ella : ప్రజారోగ్యరంగంలో విశిష్ట సేవలు అందించే వారికి ఇచ్చే జాన్స్‌ హాప్కిన్స్‌ బ్లూమ్‌బెర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డీన్‌ పురస్కారాన్ని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక‍్టర్‌ కృష్ణ ఎల్లా అందుకున్నారు. అమెరికాలోని మేరీల్యాండ్‌ బాల్టిమోర్‌లో మే 22న జరిగిన బ్లూమ్‌బర్గ్‌ స్కూల్ కాన్వొకేషన్ వేడుకలో డీన్‌ ఎల్లెన్ జె.మెకెంజీ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు.

ప్రజారోగ్యానికి చేసిన కృషికి గుర్తింపు..
భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్న్‌ కృష్ణ ఎల్లా ప్రజారోగ్యానికి చేసిన కృషిని గుర్తించి ఈ పురస్కారం ప్రధానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కరోనా సమయంలో వ్యాక్సిన్‌ అభివృద్ధి చేసి కోవిడ్‌ తీవ్రతను తగ్గించారని తెలిపారు.

భారత్‌కు అంకితం..
పురస్కార గ్రహీత కృష్ణ ఎల్ల మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సైన్స్ అండ్ రిసెర్చ్‌లో ఎన్నో విజయాలు సాధించిన భారత్‌కు ఈ పురస్కారం అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ పురస్కారం భారత శాస్త్రవేత్తల బృందానికి దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. మోనోక్లోనల్‌ యాంటీబాడీల అభివృద్ధి కోసం భారత్‌ బయోటెక్‌ ఎనో‍్న పరిశోధనలు చేసి వ్యాక్సిన్‌ రూపొందించిందని తెలిపారు.

125 దేశాలకు వ్యాక్సిన్‌..
ఇదిలా ఉండగా డాక్టర్‌ ఎల్లా నేతృత్వంలోని భారత్‌ బయోటెక్‌ 220 పెటెంట్లు, 20 వ్యాక్సిన్లు, బయో థెరప్యూటిక్స్‌ కలిగి ఉంది. కోవిడ్‌ సమయంలో కోవ్యాగ్జిన్‌ వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసింది. కోవిడ్‌ నియంత్రణలో దేశీయంగా తయారు చేసిన వ్యాక్సిన్‌ ఇదే. హైదరాబాద్‌తో తయారు చేసిన వ్యాక్సిన్లను 125 దేశాలకు సరఫరా చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 9 బిలియన్‌ వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసింది.

America: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మరో తెలుగు విద్యార్థి దుర్మరణం

America: ఉన్నత చదవుల కోసం అమెరికాలో భారతీయ విద్యార్థు విషాదాంతాలు ఆగడం లేదు. మే 14న జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు దుర్మరణం చెందారు. పది రోజులు తిరగకుండానే తాజాగా మరో తెలుగు విద్యార్థిని అక్కడి రోడ్డు ప్రమాదం పొట్టన పెట్టుకుంది. న్యూయార్క్‌ నగరంలో ఈ ఘటన జరిగింది. ఈమేరకు భారత రాయబార కార్యాలయం ధ్రువీకరించింది. విద్యార్థి న్యూయార్క్‌ స్టేట్‌ యూనివర్సిటీలో చదువుకుంటున్నట్లు పేర్కొంది. న్యూయార్క్‌ స్టేట్‌ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి అచ్యుత్‌ బైక్‌ ప్రమాదంలో బుధవారం మధ్యాహ్నం మృతిచెందాడు. అతడి అకాల మరణం గురించి తెలిసి బాధపడ్డాం. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. బాధిత కుటుంబం, స్థానిక ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నాం. మృతదేహాన్ని భారత్‌కు పంపించేందుకు ఆ కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తాం’ అని కాన్సులేట్‌ జనరల్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు. అచ్యుత్‌ది ఏ ఊరు, తల్లిదండ్రుల వివరాలు తెలియాల్సి ఉంది.

ఆగని యాక్సిడెంట్‌ మరణాలు..
అమెరికాలో పలువురు భారతీయ యువతీ యువకులు వివిధ ప్రమాద ఘటనల్లో ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. మే 14న జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీయ అవసరాల, ఆర్యన్‌ జోషి, అన్వీశర్మ దుర్మరణం చెందారు. అమెరికాలోని జార్జియా రాష్ట్రంలోని అల్ఫారెట్టాలో కారు ప్రనమాదం ఈ ముగ్గురిని పొట్టన పెట్టుకుంది. మృతులు ముగ్గురు 18 ఏళ్లలోపు వారే. ఇక ఏప్రిల్‌లో జరిగిన కారు ప్రమాదంలో గుజరాత్‌లోని ఆనంద్‌కు చెందిన ముగ్గురు మహిళలు ప్రాణాలు కల్పోయారు. రేఖాబెన్‌ పటేల్, సంగీతాబెన్‌ పటేల్, మనీషాబెన్‌ పటేల్‌ మృమాదంలో మృతిచెందారు.

H1B Visa: లే ఆఫ్‌ల వేళ హెచ్‌ 1బీ వీసాదారులకు శుభవార్త!

H1B Visa: అగ్రరాజ్యం అమెరికాలో ఆర్థిక మాంద్యం పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో దిగ్గజ కంపెనీలు ఖర్చుల తగ్గింపుపై దృష్టిపెట్టాయి. ఈ క్రమంలో ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఇప్పటికే గూగుల్, టెస్తా, వాల్‌మార్ట్‌ వంటి మల్టీ నేషనల్‌కమపెనీలు ఉద్యోగులను తొలగించాయి. వీరిలో చాలా మంది విదేశీయులు ఉన్నారు. జాబ్‌ పోయిన నేపథ్యంలో స్వదేశాలకు వెళ్లడం తప్ప వేరే మార్గం లేదనుకుంటున్న హెచ్‌1బీ వీసా టెకీలకు అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్‌ సేవల సంస్థ (యూఎస్‌సీఐఎస్‌) శుభవార్త చెప్పింది. జాబ్‌ లేని వారికి ఉన్న ప్రత్యామ్నాయాలు తెలుపుతూ మార్గదర్శకాలు జారీ చేసింది.

అమెరికాలోనే ఉండే అవకాశం..
ప్రత్యామ్యాయాలను ఉపయోగించుకోవడం ద్వారా 60 రోజుల గ్రేస్‌ పీరియడ్, తర్వాత అమెరికాలో ఉండే అవకాశం లభించనుంది. తర్వాత లేఆఫ ఎదుర్కొంటున్న హెచ్‌1బీ వీసాదారులు నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ స్టేటస్‌ మార్పు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. స్టేటస్‌లో మార్పు కోరుతూ దరఖాస్తు చేసుకోవచ్చు. బలవంతపు పరిస్థితుల ఉపాధి అధికార పత్రం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కంపెనీ మారేందుకు పిటిషన్‌ దాఖలుచేసి లబ్ధి పొందే అవకాశం ఉంటుంది.

ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలి..
60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌లో ఈ ప్రత్యామ్నాయాల్లో ఏదైనా ఒకటి ఎంపిక చేసుకోవాలి. తద్వారా హెచ్‌1బీ వీసాదారులకు నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ స్టేటస్‌ కోల్పోయినప్పటికీ అధికారికంగా అమెరికాలో కొంతకాలం ఉండే అవకాశం పొందుతారు. అర్హత ఉన్న హెచ్‌1బీ నాన్‌ ఇమ్మిగ్రెంట్‌లు, కొత్త హెచ్‌1బీ పిటిషన్‌ దాఖలు చేసిన వెంటనే వేరే కంపెనీల్లో జాయిన్‌ అయ్యే అవకాశం ఉంటుంది. 180 రోజుల స్టేటస్‌ పెండింగ్‌ గడువు తర్వాత వారి స్టేటస్‌ అప్లికేషన్‌ను కొత్త కంపెనీ ఉద్యోగ ఆఫర్‌ కింద సర్దుబాటు చేసుకోవచ్చు. ఇక ప్రస్తుత స్టేటస్‌ను డిపెండెంట్‌ లేదా స్టూడెంట్‌ లేదా విజిటర్‌ స్టేటస్‌ కిందకు కూడా మార్చుకునే వీలు ఉంటుంది. ఈ నిర్ణయాలతో చట్టవిరుద్ధంగా దేశంలో ఉన్నట్లు పరిగణించకుండా ఉండే అవకాశం ఉంటుంది. సెల్ఫ్‌–పిటిషన్డ్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసా పిటిషన్లు వేసే ఉద్యోగుల స్టేటస్‌ అప్లికేషన్‌ సర్దుబాటుతోపాటే ఈ పిటిషన్‌ను కూడా ఒకేసారి ఫైల్‌ చేయవచ్చు. దీనివలన అమెరికాలోనే ఉండేందుకు ఏడాదిపాటు అవకాశం లభిస్తుంది.

Blue Origin : స్పేస్ టూరిస్ట్ గా తెలుగోడు.. అంతరిక్షం చివరి అంచుకు ప్రయాణం..

Blue Origin : అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కు చెందిన బ్లూ ఆరిజిన్ అనే కంపెనీకి చెందిన న్యూ షెఫర్డ్ అనే అంతరిక్ష నౌక మరో చారిత్రాత్మక ప్రయాణానికి సిద్ధమైంది. స్పేస్ టూరిజాన్ని పెంచే క్రమంలో భాగంగా రూపొందించిన ఈ స్పేస్ క్రాఫ్ట్ లో.. అమెరికాలో స్థిరపడిన తెలుగు వ్యక్తి తోటకూర గోపీచంద్ తో సహా ఆరుగురు.. అంతరిక్షం చివరి అంచు వరకు ప్రయాణించనున్నారు. వాస్తవానికి ఈ అంతరిక్ష నౌక ఎప్పుడో స్పేస్ లోకి వెళ్లాల్సి ఉండేది. అయితే అనుకొని అవాంతరాల వల్ల వాయిదా పడింది. చివరికి ఎట్టకేలకు నిప్పులు చిమ్ముకుంటూ అంతరిక్షంలోకి ఎగిసింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 8 గంటల 30 నిమిషాలకు పశ్చిమ టెక్సాస్ నుంచి అంతరిక్షంలోకి బయలుదేరింది.. ఈ న్యూ షెఫర్డ్ స్పేస్ క్రాఫ్ట్ లో గోపీచంద్ తోటకూర తో పాటు మరో ఐదుగురు అంతరిక్షం చివరి అంచు వరకు వెళ్లారు. అందులో మాసన్ ఏంజెల్, సిల్వర్ చిరోన్, కెన్నెత్, కరోల్ షాలర్, ఎయిర్ ఫోర్స్ మాజీ కెప్టెన్ డ్వైట్ ఉన్నారు. ఈ స్పేస్ క్రాఫ్ట్ కు బ్లూ ఆరిజన్ సంస్థ NS -25 mission అని పేరు పెట్టింది.

ఎవరి గోపీచంద్ తోటకూర

గోపీచంద్ తోటకూర స్వగ్రామం విజయవాడ. ఇతడి కుటుంబం అమెరికాలో స్థిరపడింది. గోపీచంద్ కు 8 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే విమానయానం మీద ఆసక్తి కలిగింది. ఆ వయసులోనే అతడు కేఎల్ఎం ఎయిర్ క్రాఫ్ట్ లోని కాక్ పిట్ లో అడుగుపెట్టాడు.. అప్పట్లో కలిగిన ఉత్సుకత అతడిని విమానయాన రంగం వైపు నడిపించింది. గోపీచంద్ ఎంబ్రి రిడిల్ ఏరోనాటికల్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ కోర్సు చదివాడు.. ఏవిషన్లో విభిన్నమైన పనులకు నాంది పలికాడు. అతడు కమర్షియల్ జెట్ ఫ్లయింగ్, బుష్ ఫైలటింగ్, ఏరోబాటిక్స్, సీ ప్లేన్ ఆపరేషన్, హాట్ ఎయిర్ బెలూన్ వంటి విభాగాలలో పలు రకాల కార్యకలాపాలు సాగిస్తున్నాడు. ఇతనికి పర్వతాలను అధిరోహించడం అంటే చాలా ఇష్టం. గతంలో కిలిమంజారో పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించాడు. ఆ తర్వాత అతడికి కొత్త ఎత్తులను జయించాలనే కోరిక పుట్టింది. గోపీచంద్ ఫ్రీజర్వ్ లైఫ్ కార్ప్ అనే సంస్థకు సహా వ్యవస్థాపకుడిగా ఉన్నాడు. ఇది మన దేశంలో వైద్య పరంగా రవాణాను పెంచింది. ఇతడు దాదాపు 2000 పైగా మెడికల్ ఎయిర్ అంబులెన్స్ మిషన్లను నిర్వహిస్తోంది. ఇక అట్లాంటాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో గోపీచంద్ వెల్నెస్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాడు. గోపీచంద్ కు అంతరిక్ష యానం అంటే చాలా ఇష్టం. ఇందులో భాగంగానే జస్ట్ బెజోస్ సంస్థ బ్లూ ఆరిజిన్ లో అతడు ప్రయాణిస్తున్నాడు.

ఇతర అంతరిక్ష యాత్రికుల వివరాలివి..

గోపీచంద్ తర్వాత.. ఆ క్యాప్సుల్ లో మరో అయిదుగురు ప్రయాణిస్తున్నారు. వారిలో ఎడ్ డ్వైట్ ఒకరు. ఈయన ఎయిర్ ఫోర్స్ మాజీ కెప్టెన్. 1961 లో అమెరికా ప్రెసిడెంట్ జాన్ కెన్నడి తర్వాత అంతరిక్ష యానం చేసిన నల్లజాతీయుడిగా పేరుపొందాడు. ఇతడు 1961 లో కెన్నడి ఏరోస్పేస్ రీఛార్జ్ పైలెట్ స్కూల్లో శిక్షణ పొందాడు.

మేసన్ ఏంజెల్ ఇండస్ట్రియస్ వెంచర్స్ నడుపుతున్నాడు. సిల్వైస్ చిరోన్, బ్రస్సెరీ.. మోంట్ బ్లాంక్ వ్యవస్థాపకుడు. కెన్నెత్ ఫ్యామిలీ ట్రీ మేకర్ ను సృష్టించాడు. కరోల్ షాలర్ విశ్రాంత సీపీఏ. అతడికి ఉన్న అనారోగ్యం వల్ల ఆంధ్రుడిగా మారే అవకాశం ఉన్నప్పటికీ ఆ సాహసాన్ని స్వీకరించాడు.

ఎలా నడుస్తుందంటే..

బ్లూ ఆరిజిన్ భూమి ఉపరితలం నుంచి 62 మైళ్ళ విస్తీర్ణంలో ఉన్న కర్మన్ రేఖ కు మించి క్యాప్సూల్ ముందుకు నడిపిస్తుంది. ఇది బాహ్య అంతరిక్షం సరిహద్దుగా ప్రయాణం సాగిస్తుంది. క్యాప్సూల్ లో ఉన్న ప్రయాణికులు భూమిని దాటిన తర్వాత క్యాబిన్ కిటికీలో భార రహిత స్థితిని అనుభవిస్తారు.

రెండు సంవత్సరాల క్రితమే..

బ్లూ ఆరిజిన్ రెండు సంవత్సరాల క్రితమే న్యూ షెఫర్డ్ రాకెట్ ను ప్రయోగించింది. అయితే ఈ మిషన్ టెక్సాస్ నుంచి లిఫ్ట్ ఆఫ్ అయిన తర్వాత విఫలమైంది. దీంతో నాసా రాకెట్ క్యాప్సూల్ ద్వారా అంతరిక్ష యాత్రికులను బయటికి పంపించాల్సి వచ్చింది. సెప్టెంబర్ 2022 లో ఈ ప్రయోగం నిర్వహించగా.. అంతరిక్ష నౌక, న్యూ షెఫర్డ్ రాకెట్ విఫలమయ్యాయి. విమానం, రాకెట్ మాక్స్ క్యూ పరిస్థితిని ఎదుర్కొన్నాయి. ఆ తర్వాత రాకెట్ నుంచి పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. ఆన్ బోర్డ్ కంప్యూటర్లు వైఫల్యాన్ని గుర్తించి.. ఇంజన్ ను షట్ డౌన్ చేశాయి. దీంతో రాకెట్ తిరిగి నేలపై కూలిపై ధ్వంసం అయింది. ఊహించిన దాని కంటే ఎక్కువ ఉష్ణోగ్రతల వల్ల ఇంజన్ నాజిల్ విఫలమైందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. ఆ తర్వాత బ్లూ ఆరిజిన్ డివైస్లను పూర్తిగా మార్చింది. ఆదివారం ఉదయం భారత కాలమానం ప్రకారం ఎనిమిది గంటల 30 నిమిషాలకు నింగిలోకి పంపించింది.

Jaya Badiga: కాలిఫోర్నియాలో తెలుగు మహిళ.. ఎంపీ కూతురుకు అరుదైన గౌరవం..

Jaya Badiga: ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా తెలుగు వారు కనిపిస్తారు. ఏ రంగాన్ని ఎంచుకున్నా.. అందులో తెలుగోడి ప్రావీణ్యం కనిపిస్తుంది. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం దక్కింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా విజయవాడకు చెందిన జయ బాడిగ నియమితులయ్యారు. 2022 నుంచి కోర్టు కమిషనర్‌గా వ్యవహరిస్తున్న జయ బాడిగ.. తాజాగా శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా నియమితులయ్యారు. దీంతో కాలిఫోర్నియాలో కోర్టు జడ్జిగా నియమితులైన తొలి తెలుగు మహిళగా అరుదైన గౌరవం దక్కించుకున్నారు. కోర్టు కమిషనర్‌గా పనిచేసిన సమయంలో జయ బాడిగ ఫ్యామిలీ లాలో జయ నిపుణురాలిగా పేరు సంపాదించుకున్నారు. టీచర్‌గానూ, మెంటార్‌గానూ వ్యవహరించారు.

మాజీ ఎంపీ కూతురు..
మచిలీపట్నం మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ కూతురే జయ బాడిగ. ఆమె విజయవాడలో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసాన్ని హైదరాబాద్‌లో పూర్తి చేశారు. 1991 నుంచి 1994 వరకూ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు. సైకాలజీ, పొలిటికల్ సైన్స్‌లో బీఏ పూర్తి చేశారు. తర్వాత అమెరికా వెళ్లిన ఆమె బోస్టన్‌ యూనివర్సిటీలో ఇంటర్ణేషనల్‌ రిలేషన్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ కమ్యూనికేషన్‌ విభాగంలో ఎంఏ పూర్తి చేశారు. తర్వాత శాంటా క్లారా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లాలో జూరిస్ డాక్టర్ పట్టా అందుకున్నారు. 2009లో కాలిఫోర్నియా స్టేట్‌ బార్ ఎగ్జామ్ క్లియ‌ర్ చేశారు.

పదేళ్లుగా న్యాయవాద వృత్తిలో..
జయ బాడిగ సుమారు పదేళ్లు న్యాయవాద వృత్తితో కొనసాగారు. అంతకు ముందు కాలిఫోర్నియా గవర్నర్ కార్యాలయంలోని అత్యవసర సేవల విభాగంలో విధులు నిర్వహించారు. కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్‌లో అటార్నీగా పనిచేశారు. 2022 నుంచి శాక్రమెంటో సుపీరియర్‌ కోర్టు కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జి రాబర్ట్ లాఫమ్ పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో.. ఆ స్థానంలో జడ్జిగా నియమితులయ్యారు జయ బాడిగ.

65 ఏండ్లు దాటిన అంగన్‍వాడీలు ఇంటికి

Telangana News
65 ఏండ్లు నిండిన అంగన్​వాడీలను సర్వీస్​ నుంచి తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వీస్​ బెనిఫిట్స్​కింద టీచర్లకు రూ.లక్ష, హెల్పర్లకు రూ.50 వేలు చెల్లించనుంది. అలాగే వారిని వృద్ధాప్య పింఛన్లకు అర్హులుగా ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్​నెలాఖరు నాటికి 65 సంవత్సరాలు నిండిన అంగన్​వాడీ టీచర్లు, మినీ టీచర్లు, హెల్పర్ల లిస్టులు పంపాలని విమెన్​డెవలప్​మెంట్​అండ్​చైల్డ్​వెల్ఫేర్​డిపార్ట్​మెంట్​జిల్లా సంక్షేమ అధికారులు (డీడబ్ల్యూవోలు)కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అధికారులు అర్హులైన అంగన్​వాడీల లిస్టులను తయారు చేసి స్టేట్​ఆఫీస్​కు పంపుతున్నారు.

రాష్ర్టవ్యాప్తంగా 2వేల మందికి పైనే….
ఇప్పటివరకు అంగన్​వాడీలకు రిటైర్​మెంట్​ఏజ్​లిమిట్​లేదు. వయోభారంతో రిజైన్​ చేయడం, మరణించడం లేదా ఇతర కారణాలతో పోస్టులు ఖాళీ అయినప్పుడు కొత్తవారిని నియమించేవారు. ప్రస్తుతం 65 నుంచి 70 ఏండ్లు పైబడిన వారు కూడా అంగన్​వాడీలుగా కొనసాగుతున్నారు. పెద్దగా చదువు లేకపోవడం, వయోభారం కారణంగా మారిన విధానాలకు అనుగుణంగా విధులు నిర్వహించడానికి వారు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో గత బీఆర్ఎస్​సర్కారు అంగన్​వాడీలకు 65 సంవత్సరాల ఏజ్​లిమిట్​తీసుకువచ్చింది. 2023 సెప్టెంబర్​5న సర్వీస్​డిస్​ఎంగేజ్​మెంట్​జీవో ఎంఎస్​ నంబర్​10 జారీ చేసింది. ఈ మేరకు అర్హులైన అంగన్​వాడీల లిస్టును పంపించాలని ఏప్రిల్​3న విమెన్​డెవలప్​మెంట్​అండ్​చైల్డ్​వెల్ఫేర్​డిపార్ట్​మెంట్​అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ర్టవ్యాప్తంగా 2వేల మందికి పైగా అంగన్​వాడీ టీచర్లు, మినీ టీచర్లు, హెల్పర్లు ఈ లిస్టులో ఉన్నట్టు సమాచారం. మంచిర్యాల జిల్లాలోనే దాదాపు 130 మంది ఉన్నారు.

సర్వీస్​ బెనిఫిట్స్​పెంచాలని డిమాండ్..
చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న అంగన్​వాడీలు తమకు ఇచ్చే సర్వీస్​ బెనిఫిట్స్​పెంచాలని డిమాండ్​ చేస్తున్నారు. ప్రభుత్వం టీచర్లకు రూ.లక్ష, హెల్పర్లకు రూ.50 వేల సర్వీస్​ బెనిఫిట్స్​తో పాటు వృద్ధాప్య పెన్షన్​ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అయితే, ఇంత తక్కువ మొత్తంతో తాము ఎట్లా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు నెలవారీ జీతంతో జీవితాలు వెళ్లదీస్తున్నామని, ఇప్పుడు కొడుకులు, బిడ్డలకు భారం కావాల్సి వస్తుందని వాపోతున్నారు. ఏ ఆధారమూ లేనివారి పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. టీచర్లకు రూ.10 లక్షలు, హెల్పర్లకు రూ.5లక్షలు సర్వీస్​ బెనిఫిట్స్​చెల్లించాలని, శాలరీలో సగం పెన్షన్​ఇవ్వాలని, అర్హులైన వారసులకు ఉద్యోగావకాశం కల్పించాలని కోరుతున్నారు. ప్రస్తుతం టీచర్లకు రూ.13,500, హెల్పర్లకు రూ.8,600 జీతం ఇస్తున్నారు.

వయసు నిర్ధారణ కోసం టెస్టులు
అంగన్​వాడీల వయసు నిర్ధారణ విషయంలో అధికారులు అయోమయానికి గురవుతున్నారు. చాలా ఏండ్ల కిందట నియమితులైన వారి దగ్గర వయసుకు సంబంధించిన సరైన ఆధారాలు లేవు. గతంలో ఐదో తరగతి, ఏడో తరగతి అర్హతతోనే అంగన్​వాడీ టీచర్లను నియమించారు. ఎలాంటి విద్యార్హతలు లేకున్నా హెల్పర్లను తీసుకున్నారు. అలాంటి వారి దగ్గర ఎడ్యుకేషనల్​క్వాలిఫికేషన్​సర్టిఫికెట్లు గానీ, డేట్​ఆఫ్​బర్త్​ సర్టిఫికెట్లు గానీ లేవు. ఆధార్​కార్డుల్లో కూడా అంచనా ప్రకారమే పుట్టిన తేదీ నమోదు చేశారు. చాలామంది ఇంకా తమకు 65 ఏండ్లు నిండలేదని పేర్కొంటున్నారు. దీంతో వయసు నిర్ధారణ కోసం బోన్​డెన్సిటోమెట్రీ టెస్టులు చేయించాలని ప్రభుత్వం సూచించింది. కలెక్టర్​పర్మిషన్​తో డిస్ర్టిక్ట్​ హాస్పిటల్స్​లో ఈ టెస్టులు చేయించనున్నట్టు అధికారులు తెలిపారు.

ఏపీ ఎన్నికల తొలి ఫలితం ఆ నియోజకవర్గానిదే.. చివరగా ఈ రెండు నియోజకవర్గాల రిజల్ట్!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై అందరి కళ్లు ఉన్నాయి. మళ్లీ వైఎస్సార్‌సీపీ గెలుస్తుందా.. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తోందా అనే చర్చ జరుగుతోంది. జూన్ 4 కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.. మరో మూడు రోజుల్లో ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే ఓట్ల లెక్కింపునకు సంబంధింంచి ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 4న కౌంటింగ్‌లో భాగంగా.. ముందుగా సైనికదళాల్లో పనిచేసే వారి ఓట్లు ఈటీబీపీఎస్ (ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్) ఆధారంగా పోలైనవి లెక్కిస్తారు. అనంతరం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ తర్వాత ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది.
కౌంటింగ్ రోజున ఉదయం 11 గంటల కల్లా ఫలితాలపై ట్రెండ్ ఎలా ఉందో ఒక అంచనాకు రావొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. మధ్యాహ్నానికి తుది ఫలితాలపై క్లారిటీ వచ్చేస్తుందంటున్నారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో 111 నియోజకవర్గాల్లో.. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటి పూర్తవుతుందని.. ఫలితాలు వెల్లడవుతాయని చెబుతున్నారు. మరో 61 నియోజకవర్గాల్లో ఫలితాలు సాయంత్రం 4 గంటలకు పూర్తిగా క్లారిటీ వస్తుందంటున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలకల్లా ఫలితాలు వెల్లడికానున్నట్లు తెలుస్తోంది.
అయితే జూన్ 4న తొలి ఫలితం ఏ నియోజకవర్గం.. చివరిగా ఏ నియోకవర్గాల ఫలితాలు వస్తాయనే చర్చ కూడా జరుగుతోంది. అయితే ఉమ్మడి జిల్లాలను బట్టి చూస్తే.. తొలిఫలితం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుంచి వెలువడే అవకాశం ఉంది. ఆ తర్వాత అదే జిల్లాలోని కొవ్వూరు, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల ఫలితాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది. నరసాపురం, కొవ్వూరు నియోజకవర్గాల్లో అత్యల్పంగా 13 రౌండ్లలోనే లెక్కింపు పూర్తవుతుంది. అలాగే విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం, ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం ఫలితాల కోసం సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచొడవరం, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గాల ఫలితాలు కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మరోవైపు తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (కుప్పం), వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (పులివెందుల), జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ (పిఠాపురం) నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు మధ్యాహ్నానికి వెల్లడవుతాయని చెబుతున్నారు.

కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.. అవసరమైన చోట అదనపు బలగాలను కూడా మోహరించారు. అలాగే కౌంటిగ్ కేంద్రంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే.. వారిని వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని మీనా హెచ్చరించారు. పోలింగ్ కేంద్రం బయట 144 సెక్షన్ అమల్లో ఉంటుందంటున్నారు. అంతేకాదు ఓట్ల లెక్కింపు రోజు ఎలాంటి అల్లర్లకు అవకాశం లేకుండా భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. అంతేకాదు జూన్‌ 4న సాయంత్రం 5 గంటల్లోపు ఫలితాలు దాదాపుగా వెల్లడించి.. అనంతరం విజయం సాధించిన అభ్యర్థులకు ధ్రువపత్రాల జారీ, ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలింపు ఉంటుందన్నారు. మొత్తం ప్రక్రియను రాత్రి 9 గంటల్లోపే పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెల్లడించిన తర్వాత ఎవరూ ఊరేగింపులు, ర్యాలీలు చేయడానికి అనుమతి లేదన్నారు.

మరోవైపు పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఓటరు డిక్లరేషన్‌కు సంబంధించి ఫారమ్ 13ఏ పై అధికారి సంతకం మాత్రమే ఉండి.. ఆ అధికారి పేరు, హోదా, సీలు లేకపోయినా ఆ పోస్టల్ బ్యాలెట్ చెల్లబాటు అవుతుందన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో అలాంటి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తిరస్కరించకూడదని తెలిపింది. ఈ నెల 25న సీఈవో ముఖేష్ కుమార్ మీనా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయగా.. ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు.

AP DEECET 2024 Rank Cards – Download here

AP DEECET 2024 Rank Cards – Download here
AP DEECET 2024 Rank Cards Download – AP DEECET-2024 Qualified / Not Qualified List for -Biological Science, Mathematics, Physical Science, Social Studies, English

ANDHRA PRADESH STATE DEECET – 2024 Rank Cards – Qualified / Not Qualified List released to take admission into two years Diploma in Elementary Education (D.El.Ed) in Government District institutes of Education and Training (D.I.E.Ts) and other Private Elementary Teacher Training Institutions in the state to be conducted by School Education Department, Govt of A.P

AP DEECET 2024 Rank Cards click here

Bhogapuram: భోగాపురంలో భూములు కొన్న ఐఏఎస్‌లు

విజయనగరం జిల్లా భోగాపురం మండలం రావాడ గ్రామ పంచాయతీ పరిధిలో కొందరు ఐఏఎస్‌ అధికారులు 5.33 ఎకరాలను కొద్ది నెలల కిందట కొనుగోలు చేశారు. కొందరు అధికారులు బృందంగా ఏర్పడి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ ప్రాంతం విశాఖకు 40 కి.మీ, విజయనగరానికి 30 కి.మీ.దూరంలో, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏడు కి.మీ. దూరంలో ఉంది. విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)- 2041 బృహత్తర ప్రణాళిక అమల్లోకి రావడంతోపాటు విమానాశ్రయం వల్ల భవిష్యత్తులో ఇక్కడి భూములకు మరింత విలువ పెరగనుంది. ఈ నేపథ్యంలోనే స్థానికుల నుంచి జిరాయితీ భూములు కొనుగోలు చేశారు. ఓ ప్రైవేటు వ్యక్తి ఆధ్వర్యంలో ఈ స్థలాలను సేకరించి కొనుగోలు చేసినట్లు సమాచారం.

లేఅవుట్‌కు అనుమతి కోరుతూ..
ఐఏఎస్‌లు కొనుగోలు చేసిన స్థలాలు విమానాశ్రయానికి సమీపంలో వీఎంఆర్‌డీఏ బృహత్తర ప్రణాళిక మిశ్రమ వినియోగ జోన్‌-3లో ఉన్నాయి. దీంతో ఇక్కడ నచ్చిన నిర్మాణాలు చేపట్టవచ్చు. పర్యాటక, వాణిజ్య, నివాస ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ లేఅవుట్‌ అనుమతి (ఎల్‌పీ) కోసం వీఎంఆర్‌డీఏకు ప్రతిపాదించినట్లు సమాచారం. ఆధునిక వసతులతో గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో దీన్ని అభివృద్ధి చేయనున్నారు. ఇందులో 85 ప్లాట్ల వరకు ఉండే విధంగా ప్రణాళిక చేసినట్లు తెలిసింది. ఉత్తరాంధ్రలో పనిచేస్తున్న వారితో పాటు ఇతర చోట్ల విధులు నిర్వహించే అధికారులు ఇక్కడ కొనుగోలు చేసినట్లు సమాచారం.

మిగిలింది ఒక్కరోజే..ఈ రోజైనా విధుల్లోకి తీసుకుని పోస్టింగ్‌ ఇస్తారా?

ఒక్క రోజు.. ఈ ఒక్క రోజే మిగిలింది. డైరెక్టర్‌ జనరల్‌ ర్యాంక్‌ కలిగిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు శుక్రవారం పదవీ విరమణ చేయనున్నారు. ఐదేళ్లుగా ఆయనకు పోస్టింగ్‌ ఇవ్వకుండా, సస్పెన్షన్ల మీద సస్పెన్షన్లు విధించి, అక్రమ కేసులతో వేధించిన జగన్‌ ప్రభుత్వం, వైకాపా వీరభక్త అధికార గణం.. సుదీర్ఘ సర్వీసులో చివరి రోజైనా ఆయన్ను విధుల్లోకి తీసుకుని పోస్టింగ్‌ ఇస్తుందా? లేదా? ఇప్పటి వరకూ ఆయన పట్ల అనుసరించిన కక్షసాధింపు ధోరణినే కొనసాగిస్తుందా అనేది నేడు తేలిపోనుంది. జగన్‌ ప్రభుత్వ తీరు చూస్తుంటే.. ఏబీవీని విధుల్లోకి తీసుకోకుండానే పదవీవిరమణ చేయించాలనే దురుద్దేశమే కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏబీవీ సస్పెన్షన్‌ చెల్లదని, ఆయన్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఈ నెల 8న ఆదేశాలిచ్చింది. 22 రోజులు గడిచినా ఆయన్ను విధుల్లోకి తీసుకోలేదు సరికదా! ఆ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. క్యాట్‌ ఆదేశాల నిలుపుదలకు నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు గురువారం ఉత్తర్వులిచ్చింది.

వాటిని ఏబీ వెంకటేశ్వరరావు.. సీఎస్‌ జవహర్‌రెడ్డికి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలోనూ అందజేశారు. చట్టం, నిబంధనలు పాటించే, న్యాయవ్యవస్థ ఆదేశాల అమలుకు కట్టుబడి ఉండే ఏ అధికారైనా సరే వెంకటేశ్వరరావును వెంటనే విధుల్లోకి తీసుకుని పోస్టింగ్‌ ఇవ్వాలి. ఏబీవీపై అభియోగాలు మోపటమే తప్ప గత ఐదేళ్లలో ప్రభుత్వం అవేవీ నిరూపించలేకపోయింది. ఆయనపై క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన కేసు తేల్చనేలేదు. క్రిమినల్‌ కేసులోనూ అభియోగపత్రం దాఖలు చేయలేదు. ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టుతో పాటు క్యాట్‌ కూడా ఆయనపై సస్పెన్షన్‌ ఎత్తేయాలని, విధుల్లోకి తీసుకోవాలనే ఆదేశాలిచ్చాయి. అయినా జగన్‌ సర్కారు వాటన్నింటినీ బేఖాతరు చేస్తూనే ఉంది. ఏబీవీ తప్పు చేసినట్లు తేలితే చర్యలు తీసుకోవటాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ అభియోగాలు నిరూపించట్లేదు. సస్పెన్షన్‌ ఎత్తేయాలని న్యాయస్థానాలు ఆదేశాలిచ్చినా అమలు చేయట్లేదు. పదవీవిరమణ చివరి రోజు వరకూ ఏబీవీని విధుల్లోకి తీసుకోకపోవటం ప్రభుత్వ ఫ్యాక్షనిజం కాదా?

ఆయనకు జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారు?
క్యాట్‌ ఆదేశాల నిలుపుదలకు నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు గురువారం ఉదయమే ఆదేశించినప్పటికీ.. రాత్రి వరకూ ఏబీ వెంకటేశ్వరరావును విధుల్లోకి తీసుకుంటూ సీఎస్‌ జవహర్‌రెడ్డి ఉత్తర్వులివ్వలేదు. శుక్రవారం ఏబీవీ పదవీ విరమణ చేయనున్నారు. అప్పటి వరకూ ఆయన్ను సస్పెన్షన్‌లో కొనసాగిస్తూ పోస్టింగ్‌ లేకుండానే సాగనంపాలనే దురుద్దేశంతోనే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందన్న చర్చ పోలీసు వర్గాల్లో సాగుతోంది. ప్రస్తుతం రాష్ట్ర క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారుల సీనియార్టీ జాబితాలో ఏబీ వెంకటేశ్వరరావు అగ్రస్థానంలో ఉన్నారు. అలాంటి సీనియర్‌ అధికారిని ప్రభుత్వమే ఇంతలా వెంటాడి, వేటాడి వేధించిన ఘటనలు దేశచరిత్రలోనే అరుదు. కానీ 34 ఏళ్ల పాటు పోలీసుశాఖకు సేవలందించిన ఏబీవీకి కేవలం కక్షసాధింపు కోసం జగన్‌ ప్రభుత్వం ఐదేళ్లపాటు పోస్టింగు ఇవ్వలేదు. దాదాపు నాలుగున్నరేళ్లుగా సస్పెన్షన్‌లో ఉంచింది. డీజీ క్యాడర్‌ అధికారైన ఏబీవీకి జగన్‌ ప్రభుత్వం వల్ల జరిగిన నష్టం పూడ్చలేనిది. ఎవరైనా తమ కెరీర్‌ చివరిదశలో అత్యున్నత పోస్టుల్లో బాధ్యతలు నిర్వహిస్తారు. అలాంటి అవకాశం లేకుండా ఆయన పదవీవిరమణ వరకూ సస్పెన్షన్‌లో ఉంచటం ప్రభుత్వ కక్షపూరిత విధానాలకు నిదర్శనం.

కాకులకు ఉన్న సంఘీభావ స్ఫూర్తి.. ఐపీఎస్‌ అధికారుల సంఘానికి లేదా?
ఒక కాకికి ఆపదొస్తే.. చుట్టూ పది కాకులు చేరి సంఘీభావం తెలుపుతాయి. అలాంటిది ఎంతో గొప్పగా చెప్పుకొనే ఐపీఎస్‌ అధికారుల్లో ఆ సంఘీభావం ఏమైపోయింది? ఆయన పదవీవిరమణ చేసే వరకూ విధుల్లోకి తీసుకోకుండా కక్ష సాధిస్తుంటే.. దాన్ని ఖండించాలని అనిపించలేదా? అధికార వైకాపా అంటే ఇంత భయమా? లేకా వీర భక్తా? వైకాపాతో అంటకాగుతూ.. ఎన్నికల్లో ఆ పార్టీకి లబ్ధి కలిగించేలా పనిచేసిన ఐపీఎస్‌ అధికారులపై పత్రికల్లో కథనాలు రాస్తే.. వారందరి తరఫున వకాల్తా పుచ్చుకుని ఐపీఎస్‌ అధికారుల సంఘం ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడి హోదాలో కాంతిరాణా తాతా వాటిని ఖండిస్తూ, మీడియాను విమర్శిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీడియాపైన రాజకీయ విమర్శలు చేస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు.

మరి ఏబీవీకి తీవ్ర అన్యాయం జరుగుతుంటే కాంతి రాణా ఇప్పుడు ఎక్కడున్నారు? ఆయన ఎందుకు స్పందించట్లేదు? ఐపీఎస్‌ అధికారుల సంఘం ఎక్కడుంది? ఎందుకు మాట్లాడదు?

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ ఎత్తేయాలని, ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలని పేర్కొంటూ క్యాట్‌ ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని ఐపీఎస్‌ అధికారుల సంఘం సీఎస్‌కు కనీసం ఒక లేఖైనా రాసిందా? ఏబీవీకి సంఘీభావంగా ఒక్క సమావేశమైనా నిర్వహించిందా? ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఒక ప్రకటనైనా విడుదల చేసిందా? వైకాపా అనుకూల అధికారులకు ఇబ్బందులొచ్చినప్పుడు, వారిపై విపక్షాలు విమర్శలు చేసినప్పుడు ఖండించటానికే ఐపీఎస్‌ అధికారుల సంఘం ఉందా?
వైకాపాకు కొమ్ముకాస్తూ పనిచేసే అధికారుల తీరును ఎండగడుతూ ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శలు చేస్తే మీసాలు మెలేసి మరీ ప్రతిపక్ష నాయకులపై విరుచుకుపడిన ఏపీ పోలీసు అధికారుల సంఘం ఏమైపోయింది? ఏబీవీకి జరిగిన అన్యాయంపై ఎందుకు ప్రశ్నించట్లేదు?
ఏబీ వెంకటేశ్వరరావుకు మద్దతుగా సామాన్య పౌరులు ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ఆయనకు పోస్టింగ్‌ ఇవ్వాలంటూ గురువారం సాయంత్రం వరకు 44,222 మంది ఛేంజ్‌.ఓఆర్‌జీలో సంతకాలు చేసి రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, ప్రధానమంత్రికి పంపించారు. సామాన్య పౌరులు చూపిన సంఘీభావం కూడా ఐపీఎస్‌ అధికారుల సంఘం చూపలేకపోయింది.
జవహర్‌రెడ్డీ.. కోర్టు ఆదేశాలంటే మీకు లెక్కలేదా?

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న జవహర్‌రెడ్డి.. ఏబీవీపై సస్పెన్షన్‌ ఎత్తేయాలంటూ క్యాట్‌ ఇచ్చిన ఆదేశాలను ఇప్పటి వరకూ ఎందుకు అమలు చేయలేదు? ఆ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఆఘమేఘాలపై హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌లో పిటిషన్‌ వేశారే.. మరి అదే హైకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయట్లేదు? ఇది కోర్టు ధిక్కారం కాదా? క్యాట్, హైకోర్టు ఉత్తర్వుల ప్రతుల్ని ఏబీ వెంకటేశ్వరరావు మీకు అందజేసి.. వాటిని అమలు చేయాలని కోరినా ఎందుకు విధుల్లోకి తీసుకోలేదు? సీనియర్‌ అధికారిపై ప్రభుత్వ పెద్దలు కక్ష సాధిస్తుంటే.. ఆ చర్యలను అమలు చేస్తున్న మిమ్మల్ని ఏమనాలి?

AP High Court: పోస్టింగ్‌ ఇవ్వకపోతే ఏబీవీకి తీవ్ర నష్టం

డీజీ ర్యాంకు కలిగిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ఐదేళ్లుగా కక్ష సాధిస్తూ, కోర్టుల ఉత్తర్వులనూ పెడచెవిన పెట్టి ఆయనకు పోస్టింగ్‌ ఇవ్వకుండా వేధిస్తున్న రాష్ట్రప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏబీవీపై సస్పెన్షన్‌ ఎత్తేస్తూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలన్న రాష్ట్రప్రభుత్వ విజ్ఞప్తిని హైకోర్టు గురువారం తోసిపుచ్చింది. ఏబీవీ శుక్రవారం పదవీవిరమణ చేయనున్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. రాష్ట్రప్రభుత్వం ఆయనను దాదాపు ఐదేళ్లుగా సస్పెన్షన్‌లోనే ఉంచిందని గుర్తుచేసింది. ఆయనపై సస్పెన్షన్‌ ఎత్తేస్తూ క్యాట్‌ ఇచ్చిన ఆదేశాల్ని ఈ దశలో నిలుపుదల చేస్తే… అది ఏబీవీకి తీవ్రనష్టం కలగజేస్తుందని జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్‌ పి.జ్యోతిర్మయిలతో కూడిన హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. ఆయనకు పోస్టింగ్‌ ఇవ్వడం వల్ల… ఏబీవీపై ప్రభుత్వం మోపిన అభియోగాల దర్యాప్తునకు ఎలాంటి అవరోధం కలగదని కోర్టు పేర్కొంది.

ఏబీవీకి పోస్టింగ్‌ ఇస్తే దర్యాప్తును ఆయన ప్రభావితం చేస్తారన్న రాష్ట్రప్రభుత్వ వాదన పసలేనిదిగా కొట్టిపారేసింది. ఏబీవీపై సస్పెన్షన్‌ను ఎత్తేస్తూ క్యాట్‌ ఇచ్చిన తీర్పును కొట్టేయాలంటూ రాష్ట్రప్రభుత్వం దాఖలుచేసిన అనుబంధ పిటిషన్‌పై… ప్రభుత్వం కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశాక తగిన ఉత్తర్వులిస్తామని తెలిపింది. జూన్‌ 20న కోర్టు వేసవి సెలవులు ముగిసిన వెంటనే అనుబంధ పిటిషన్‌పై విచారిస్తామని తెలిపింది. ఏబీవీపై సస్పెన్షన్‌ను ఎత్తేస్తూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ హైదరాబాద్‌ బెంచ్‌ ఈ నెల 8న ఇచ్చిన ఉత్తర్వుల్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి హైకోర్టులో రిట్‌పిటిషన్‌ దాఖలు చేశారు. క్యాట్‌ ఇచ్చిన తీర్పు తప్పులతడకగా ఉందని, వాస్తవాలు కళ్లెదుట కనిపిస్తున్నా వాటిని విస్మరించిందని ఆ పిటిషన్‌లో ప్రభుత్వం పేర్కొంది.

ఆ రికార్డులన్నీ హైకోర్టు స్వాధీనం చేసుకుని పరిశీలించాలని, లోతైన విచారణ జరిపించాలని కోరింది. ఆలోగా ఏబీవీపై సస్పెన్షన్‌ ఎత్తేస్తూ క్యాట్‌ ఇచ్చిన ఉత్తర్వుల్ని నిలుపుదల చేయాలని మరో అనుబంధ పిటిషన్‌ దాఖలుచేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్, ఏబీవీ తరఫున సీనియర్‌ న్యాయవాది ఆదినారాయణరావు, ఆయన సహాయకుడు ఎం.రాజీవ్‌కుమార్‌ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత అనుబంధ పిటిషన్‌పై హైకోర్టు బెంచ్‌ గురువారం ఉత్తర్వులు వెలువరిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది.

ఆ ఆందోళన అర్థరహితం
‘‘ఏబీవీ మే 31న పదవీవిరమణ చేస్తున్నారని ఏజీ చెబుతున్నారు. అలాంటప్పుడు క్యాట్‌ ఆదేశాల మేరకు ఆయనను సర్వీసులో చేర్చుకుని, పోస్టింగ్‌ ఇవ్వడం వల్ల సాక్షుల్ని ప్రభావితం చేస్తారని, దర్యాప్తునకు అవరోధం కలిగిస్తారన్న ఆందోళన అర్థరహితం. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 19 కింద ఏబీవీ ప్రాసిక్యూషన్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం మా దృష్టిలో ఉంది. కానీ ఆయనను సర్వీసులో చేర్చుకునేందుకు కేంద్రప్రభుత్వ ఉత్తర్వులు అడ్డం కాదు. ఆయనపై చట్టప్రకారం క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ కొనసాగించేందుకు ఎలాంటి అవరోధం ఉండదు. సాధారణంగా ఒక ఉద్యోగిపై విచారణ జరుగుతున్నప్పుడు ఆయన దానికి అవరోధాలు సృష్టిస్తారని, సాక్షుల్ని ప్రభావితం చేస్తారన్న ఉద్దేశంతో సస్పెండ్‌ చేస్తారు. కానీ ఏబీవీ ముందస్తు బెయిల్‌ పొందాక… దాన్ని రద్దుచేయాల్సిందిగా కోరుతూ ప్రాసిక్యూషన్‌ ఇంతవరకు ఎలాంటి పిటిషన్‌ దాఖలు చేయలేదు. ఆయన అలాంటి చర్యలకు పాల్పడలేదనడానికి అదే నిదర్శనం’’ అని కోర్టు పేర్కొంది. సుదీర్ఘమైన సర్వీసు కలిగిన, ఎన్నో కీలకమైన పదవులు నిర్వహించిన ఏబీవీకి సంబంధించి క్యాట్‌ ఉత్తర్వుల్ని అమలుచేయకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదని కోర్టు అభిప్రాయపడింది.

‘‘ఏబీవీ 1989లో సర్వీసులో చేరారు. 2015 జులై 6న నిఘా విభాగం అదనపు డీజీగా నియమితులయ్యారు. 2019 మార్చి 10న డీజీ ర్యాంకుకు పదోన్నతి పొందారు. ఆ తర్వాత ఆయనను బదిలీ చేసి, 2019 ఏప్రిల్‌ 22న ఏసీబీ డీజీగా పోస్టింగ్‌ ఇచ్చారు. 2020 ఫిబ్రవరి 8న ప్రభుత్వం ఆయనను సస్పెండ్‌ చేసింది. ఆయన సస్పెన్షన్‌ ఎత్తేస్తూ పోస్టింగ్‌ ఇవ్వాలని కోర్టు 2022 ఏప్రిల్‌ 22న ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వం 2022 జూన్‌ 14న ఆయనకు ప్రింటింగ్, స్టేషనరీ విభాగం కమిషనర్‌గా పోస్టింగ్‌ ఇచ్చింది. 2022 జూన్‌ 17న ఆయన బాధ్యతలు చేపట్టారు. మళ్లీ రాష్ట్రప్రభుత్వం జీఓ55 ద్వారా ఆయనను 2022 జూన్‌ 28న సస్పెండ్‌ చేసింది. ఆయన దాదాపు ఐదేళ్లు సస్పెన్షన్‌లో ఉన్నారు. ఈ నెల 31న పదవీ విరమణ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఆయనను సర్వీసులో చేర్చుకోకపోతే తీవ్రంగా నష్టపోతారు’’ అని కోర్టు పేర్కొంది.

లోయలో పడిన బస్సు 22 మంది మృతి

జమ్మూకశ్మీర్‌లో గురువారం ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులతో వెళ్తున్న బస్సు జమ్మూ జిల్లాలో అదుపు తప్పి దాదాపు 150 అడుగుల లోతు ఉన్న లోయలో పడిపోవడంతో 22 మంది దుర్మరణం చెందారు. మరో 57 మంది గాయాలపాలయ్యాయని అధికారులు తెలిపారు. జిల్లాలోని అఖ్నూర్‌ ప్రాంతం చౌకీ చోరా బెల్ట్‌లోని తుంగి-మోర్‌ వద్ద మధ్యాహ్నం 12.35 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ బస్సు హరియాణాలోని కురుక్షేత్ర నుంచి భక్తులను తీసుకుని జమ్మూకశ్మీర్‌లోని రియాసీ జిల్లా పౌనీ ప్రాంతంలో ఉన్న శివ్‌ ఖోరి వైపు వెళ్తుండగా దుర్ఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్‌ నుంచి ఈ బస్సు ప్రయాణం మొదలైంది. ప్రమాదం జరిగిన ట్టు తెలిసిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను అఖ్నూర్‌ సబ్‌ జిల్లా ఆస్పత్రికి తరలించినట్టు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. క్షతగాత్రులను జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ)కు తరలించినట్టు చెప్పారు.

బాధితుల్లో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారేనని తెలిపారు. ఆర్మీ, పోలీసులు, స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మానవహారంగా ఏర్పడి మరణించిన వారితోపాటు క్షతగాత్రులను పైకి తీసుకువచ్చారు. లోయలోనుంచి బస్సును బయటకు తీయడానికి ఆర్మీ క్రేన్లను వినియోగించిందని తెలిపారు. మూలమలుపులో ఎదురుగా వస్తున్న కారును తప్పించే ప్రయత్నంలో డ్రైవర్‌ విఫలంకావడంతో బస్సు లోయలో పడిందని గాయపడిన ప్రయాణికులు తెలిపారు.

ఈ విషాద ఘటన పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘ఈ ప్రమాదంలో ప్రాణనష్టం గురించి తెలిసి చెప్పలేనంత బాధ కలిగింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని ‘ఎక్స్‌’లో ముర్ము పోస్ట్‌ చేశారు. ఈ ప్రమాద ఘటనపై జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

ఈ ప్రమాదం హృదయవిదారకంగా ఉందని, ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.

బెంగళూరులో దిగిన ప్రజ్వల్‌ రేవణ్ణ.. అరెస్టు చేసిన సిట్‌ పోలీసులు

మహిళలపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ (Prajwal Revanna)ను బెంగళూరు (Bengaluru) పోలీసులు గురువారం అర్ధరాత్రి దాటాక అరెస్టు చేశారు. జర్మనీ నుంచి బయలుదేరిన ఆయన బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన వెంటనే సిట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను విచారణ నిమిత్తం సీఐడీ కార్యాయానికి తరలించారు.

మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు అయిన ప్రజ్వల్‌ రేవణ్ణ.. ఎన్డీయే కూటమి తరఫున హాసన నుంచి ఎంపీగా బరిలోకి దిగారు. పలువురు మహిళలపై ఆయన లైంగిక దాడి చేసినట్లు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో ఆయన గత ఏప్రిల్‌లో దేశం విడిచి పరారయ్యారు. ఇప్పటివరకు రేవణ్ణపై మూడు కేసులు నమోదు అయ్యాయి. ఆయన జాడ కోసం బెంగళూరు పోలీసులు ముమ్మరంగా గాలించారు. ఆయనపై నాలుగుసార్లు నోటీసులు, ఒక అరెస్టు వారెంటు, బ్లూ కార్నర్, రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ అయ్యాయి. దౌత్య పాస్‌పోర్టు రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు చేపట్టింది. విచారణకు హాజరు కావాలని ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణ, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ బహిరంగానే కోరారు.

ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసుల విచారణకు సహకరిస్తానని, మే 31న ‘సిట్‌’ ముందు హాజరవుతానని ఇటీవల తొలిసారి వీడియో సందేశంలో రేవణ్ణ పేర్కొన్నారు. మరోవైపు బెంగళూరు కోర్టులో రేవణ్ణకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తిరస్కరించింది.

Monsoon: చల్లని కబురు.. కేర‌ళ‌లోకి ప్రవేశించిన రుతుపవనాలు! మరో 2 రోజుల్లోనే ఏపీకి ఆగమనం

Monsoon: చల్లని కబురు.. కేర‌ళ‌లోకి ప్రవేశించిన రుతుపవనాలు! మరో 2 రోజుల్లోనే ఏపీకి ఆగమనం
ఈ ఏడాది మండుటెండలకు ప్రజలు బెంబేలెత్తిపోయారు. మునుపటి కంటే తీవ్ర స్థాయిలో భానుడు ప్రతాపం చూపాడంతో ప్రజలతోపాటు మూగజీవాలు కూడా అల్లాడిపోయాయి. తాజాగా వాతావరణ శాఖ వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించే చల్లని కబురు వినిపించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రుతుపవనాలు ఈ రోజు కేరళలో అడుగుపెట్టాయి. రుతుపవనాలు గురువారం ఉదయం కేరళను తాకినట్లు ఐఎండీ అధికారికంగా వెల్లడించింది. దీంతో ఆ రాష్ట్రంలోని 14 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మీదుగా వీచిన రెమల్ తుఫాను రుతుపవన ప్రవాహాన్ని బంగాళాఖాతం వైపు మళ్లించిందని, దీని ప్రభావంతో రుతుపవనాలు కేరళలో ప్రవేశించినట్లు పేర్కొంది.

కేరళతోపాటు లక్షద్వీప్‌లో రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 64.5 ఎంఎం నుంచి 115.5 ఎంఎం మ‌ధ్య వ‌ర్షపాతం న‌మోదు అయ్యే అవకాశం ఉన్నట్లు ఐఎంబీ వెల్లడించింది. కాగా ఇప్పటికే కేరళలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే మూడు, నాలుగు రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
మన దేశ ఆర్ధిక వ్యవస్థకు రుతుపవనాలు కీలక పాత్రపోషిస్తాయి. దేశ మొత్తం వ్యవసాయ ఉత్పత్తికి అవసరమైన 70 శాతం వర్షపాతం రుతుపవనాల ద్వారా లభిస్తుంది. సాధారణంగా ఇవి ప్రతీయేట జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు దేశ వ్యాప్తంగా విస్తరిస్తాయి. ఇక దేశంలోని కొన్ని ప్రాంతాలు మినహా మిగతా అన్ని చోట్ల సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

AP Elections : 1200 మందిని అరెస్టు. జైలు సరిపోవడం లేదు

Palnadu: 1200 మందిని అరెస్టు చేశాం.. నరసరావుపేట జైలు సరిపోవడం లేదు: ఎస్పీ మలికా గార్గ్‌

పల్నాడు జిల్లాలో పోలింగ్‌ సందర్భంగా ఆ తర్వాత జరిగిన హింసకు సంబంధించి దాదాపు 1200 మందిని అరెస్టు చేశామని ఎస్పీ మలికా గార్గ్‌ తెలిపారు. వినుకొండలో పోలీసులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ‘‘పల్నాడు జిల్లా పేరు దేశ వ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చింది. చెడు ఘటనలతో పల్నాడు ప్రచారంలోకి రావడం బాధిస్తోంది.
జిల్లాలో ఇంత ఫ్యాక్షనిజం ఉందా?అని అని నా స్నేహితులు అడుగుతున్నారు. ముఖ్యంగా నరసరావుపేట, మాచర్ల పేరు చెడుగా మార్మోగుతోంది. కర్రలు, రాడ్లు చేతుల్లో పట్టుకుని తిరగడం, దాడులు అవసరమా? పది రోజుల్లో జిల్లాలో 160 కేసులు నమోదయ్యాయి. దాదాపు 1200 మందిని అరెస్టు చేశాం.
నరసరావుపేట జైలులో ఖాళీలేక రాజమహేంద్రవరం జైలుకు పంపుతున్నాం. ఎగ్జిట్‌ పోల్స్‌ వివరాలు వస్తే ఇళ్లలోనే కూర్చుని వినండి. కౌంటింగ్‌ పూర్తయ్యే వరకు రోడ్లపై ఎవరూ తిరగవద్దు. జిల్లాలో 144 సెక్షన్‌ ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తాం. శాంతిభద్రతలపై రాజీపడే ప్రసక్తే లేదు. ఇప్పుడు నేను కూడా పల్నాడు జిల్లా వాసినే .. ఈ ప్రాంతానికి మంచి పేరు తేవాలన్నదే నా లక్ష్యం’’ అని ఎస్పీ స్పష్టం చేశారు.

రైల్వే ఆఫీసర్స్ ఫైట్ … గంటన్నర పాటు నిలిచిపోయిన రైళ్లు!

స్టేషన్‌ మాస్టర్‌, ఉద్యోగి మధ్య చోటుచేసుకున్న ఘర్షణ.. రైళ్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయానికి దారితీసింది. వందేభారత్‌ సహా పలు రైళ్లు దాదాపు గంటన్నర పాటు నిలిచిపోయాయి. వారణాసి రైల్వే జంక్షన్‌లో ఈ ఘటన ఇటీవల చోటుచేసుకున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన రైల్వే ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్యలకు ఉపక్రమించారు.

వారణాసి జంక్షన్‌లో పని చేస్తున్న ఎలక్ట్రికల్‌ సిగ్నల్‌ నిర్వాహకుడు షెహజాద్‌.. అక్కడి సెక్షన్‌ డిజిటల్‌ యాక్సిల్‌ కౌంటర్‌లోని రీసెట్‌ బాక్స్‌ను తెరిచేందుకు యత్నించాడు. అయితే, సరైన అనుమతి లేకుండా దాన్ని తెరిచేందుకు కుదరదని స్టేషన్‌ మాస్టర్‌ వారించాడు. తొలుత వాగ్వాదంతో మొదలై.. చివరకు తీవ్ర ఘర్షణకు దారితీసింది.

ఈక్రమంలో షెహజాద్‌ తనపై రాయితో దాడి చేశాడని, దీంతో తల, భుజానికి తీవ్ర రక్తస్రావం అయినట్లు స్టేషన్‌ మాస్టర్‌ ఆరోపించారు. కొద్దిసేపు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయానని, అందుకే రైళ్లను ఆపరేట్‌ చేయడం సాధ్యం కాలేదని ఉన్నతాధికారులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నాడు. సిగ్నల్‌ ఆపరేటర్‌ మాత్రం.. ఆయనే తనతో అమర్యాదగా ప్రవర్తించడంతోపాటు అసభ్య పదజాలంతో దూషించాడని ఆరోపించాడు. దీనిపై ముగ్గురు ఉన్నతాధికారులతో రైల్వేశాఖ దర్యాప్తు జరిపి ఓ నివేదిక రూపొందించింది.

వారణాసి రైల్వేజంక్షన్‌లో మే 28న సాయంత్రం 7.30 గంటల సమయంలో విధులు నిర్వర్తిస్తోన్న స్టేషన్‌మాస్టర్‌, ఎలక్ట్రిక్‌ సిగ్నల్‌ నిర్వాహకుడి మధ్య ఈ వివాదం చోటుచేసుకుంది. దీంతో ఈ జంక్షన్‌ మీదుగా వెళ్లే అనేక రైళ్లపై ప్రభావం పడింది. పట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌, బనారస్‌-బక్సర్‌ మెమూ ప్యాసింజర్‌, ఎర్నాకులం సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, వారణాసి మెమూ ఎక్స్‌ప్రెస్‌, పట్నా కాశీ జన్‌శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు సమీప స్టేషన్లలో నిలిచిపోయాయి.

తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆమోదం.. మార్చిన గీతం ఇదే!

Telangana State Song: జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతానికి రాజకీయపక్షాలు, ఉద్యమకారులు ఆమోదం తెలిపారు. ఈ రోజు వారితో సీఎం జరిపిన సమావేశంలో జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రతిపాదించారు.

ఈ సమావేశంలోనే జయ జయ తెలంగాణ గీతాన్ని కీరవాణి (MM Keeravani), సింగర్ రేవంత్ బృందం పాడి వినిపించింది. గీతంపై సీపీఐ, సీపీఎం, తెలంగాణ జన సమితి నేతల, కవులు, కళాకారులు, మేధావులు, ఉద్యమకారులు, జేఏసీ నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర గీతంలో మగ్దుం మొహియుద్దీన్, షేక్ బందగి, కొమరం భీమ్ లాంటి తెలంగాణ సాయుధ పోరాట యోధుల పేర్లు చేర్చాలని సీపీఐ సూచించినట్లు తెలుస్తోంది.


అయితే.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొన్ని చరణాలను ఈ గీతంలో మార్చినట్లు సమాచారం. పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం, గోదావరి కృష్ణమ్మలు తల్లీ నినున్న తడపంగా, పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా.. అంటూ కొత్త చరణాలను చేర్చినట్లు తెలుస్తోంది.

తెలంగాణ గీతానికి కాంగ్రెస్ మిత్ర పక్షాల మద్దతు లభించిందని సీఎం రేవంత్ (CM Revanth Reddy) సమావేశం అనంతరం ప్రకటించినట్లు సమాచారం. ఈ గీతాన్ని జూన్ 2న జాతికి అంకితం చేయనున్నట్లు సీఎం వెల్లడించినట్లు తెలుస్తోంది. తెలంగాణ చిహ్నంపై కూడా కసరత్తు జరుగుతోందని ఆయన చెప్పినట్లు సమాచారం. మరో సమావేశం తర్వాత చిహ్నాన్ని ఖరారు చేస్తామని సీఎం చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో జూన్ 2నే తెలంగాణ రాష్ట్ర కొత్త రాజముద్రను ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది.

Ap Elections 2024: ‘కౌంటింగ్ రోజు అలా చేస్తే జైలుకే’

AP CEO Warning To Political Party Candidates And Counting Agents: జూన్ 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల్లో ఎవరైనా అలజడి సృష్టిస్తే వారిని వెంటనే అరెస్ట్ చేస్తామని ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా (Mukesh Kumar Meena) స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ సాగేలా చూడాలన్నారు. మచిలీపట్నంలోని (Machilipatnam) కృష్ణా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారులతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. ఓట్ల లెక్కింపునకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని.. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అన్నారు. ఇప్పటికే కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చామని.. కౌటింగ్ కేంద్రాల్లోకి ఫోన్లు అనుమతించమని తెలిపారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాష్ట్ర పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ దళాలు సైతం భద్రతను పర్యవేక్షిస్తాయని అన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా జిల్లాల్లో పోలీస్ పికెటింగ్ ఉంటుందని పేర్కొన్నారు. ఫలితాల తర్వాత అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు.

పోస్టల్ బ్యాలెట్స్‌పై సీఈసీ స్పష్టత

మరోవైపు, పోస్టల్ బ్యాలెట్స్‌పై కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి స్పష్టత ఇచ్చింది. తాజా మార్గదర్శకాలపై వైసీపీ నేతలు అభ్యంతరం తెలుపుతున్న నేపథ్యంలో వాటిని తోసిపుచ్చుతూ.. కీలక ఆదేశాలిచ్చింది. డిక్లరేషన్‌పై గెజిటెడ్ అధికారి సంతకం మాత్రమే ఉండి, సీల్, హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుతుందని స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్లను వాలీడ్ చేయాలని రిటర్నింగ్ అధికారికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ సీఈవోకు లేఖ రాసిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు.

అంతకు ముందు సీఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ సీఈవో ఆదేశాలు జారీ చేశారు. ‘ఫామ్ 13ఏ’పై ఆర్వో సంతకంతో పాటు అన్ని వివరాలు ఉండాలి. అలా ఉండి స్టాంప్ లేకపోయినా ఆ బ్యాలెట్ చెల్లుబాటవుతుంది. ఆర్వో సంతకంతో పాటు బ్యాలెట్ ధ్రువీకరించే రిజిస్టర్‌తో సరిపోల్చుకోవాలి. ఫామ్ 13ఏలో ఓటరు, ఆర్వో సంతకం, బ్యాలెట్ సీరియల్ నెంబర్ లేకుంటే వాటిని తిరస్కరించవచ్చు. అలాగే, పోస్టల్ బ్యాలెట్ పేపర్‌పై నిబంధనల ప్రకారం ఓటు నమోదు చేయకపోయినా, ఆ ఓటు తిరస్కరించవచ్చు.’ అని ఎన్నికల సంఘం పేర్కొంది. పోస్టల్ బ్యాలెట్ తిరస్కరించాల్సిన పరిస్థితే వస్తే.. లోపలి కవర్ తెరవకుండా తిరస్కరించాలని అది కూడా ఫారం-13ఏలోని డిక్లరేషన్, ఫారం-13సీ లోని కవర్ బీ లోపల కనిపించని పక్షంలో తిరస్కరించవచ్చంటూ సూచించింది. అటు, డిక్లరేషన్ పై ఓటర్లు సంతకం చేయకపోయినా ఆ బ్యాలెట్ ను తిరస్కరించొచ్చని స్పష్టం చేసింది. దీనిపై వైసీపీ నేతలు అభ్యంతరం తెలపగా.. తాజాగా మరోసారి సీఈసీ స్పష్టత ఇచ్చింది. అయితే, సీఈసీ ఆదేశాలపైన వైసీపీ నేతలు హైకోర్టులలో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

సర్జరీతో 30 ఏళ్లు యవ్వనంగా మారుతున్న టర్కీవాసులు,

సర్జరీతో 30 ఏళ్లు యవ్వనంగా మారుతున్న టర్కీవాసులు,

ఫేస్ లిఫ్ట్ సర్జరీలు ఇప్పుడు సర్వసాధారణం. ఒకప్పుడు సెలబ్రిటీలకే పరిమితమైన ఈ సర్జరీలు ఇప్పుడు ఆర్థిక స్థోమత ఉన్న సామాన్యుల చేత చేయించుకుంటున్నారు.

ఈ సర్జరీలు ఒక వ్యక్తి యొక్క ముఖం చాలా భిన్నంగా కనిపిస్తాయి, కానీ వారి అంతర్గత వ్యక్తిత్వం అలాగే ఉంటుంది. టర్కీకి చెందిన ఒక వైద్య బృందం తమ రోగుల ముఖ మార్పు శస్త్రచికిత్సలకు ముందు మరియు తర్వాత వారి ఫోటోలను Instagramలో షేర్ చేసింది. ఈ ఫోటోలు చాలా మందిని షాక్‌కి గురి చేసి ఇంటర్నెట్‌లో చర్చనీయాంశంగా మారాయి.

ఫేషియల్ మేక్ఓవర్ ఒక వ్యక్తిని 30 ఏళ్ల వయస్సులో కనిపించేలా చేస్తుంది. సర్జరీ తర్వాత ఆ వ్యక్తి చాలా యవ్వనంగా కనిపించడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.

సర్జరీ తర్వాత కొత్త గడ్డం, స్టైలిష్ హెయిర్ కట్, ముఖం చాలా ఫ్రెష్ గా కనిపించాయి. అతని కొత్త లుక్ చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఈ ఫలితాలను సాధించడానికి, టర్కిష్ వైద్య బృందం చర్మం బిగుతుగా మార్చడం, కనురెప్పల స్థిరీకరణ, ముక్కును మార్చడం మరియు జుట్టు జోడించడం వంటి అనేక శస్త్రచికిత్సలు చేసింది. అయితే, మార్పులు చాలా పెద్దవిగా ఉన్నందున కొంతమంది నమ్మలేకపోయారు. ఫలితాలపై జోకులు వేయగా, మరికొందరు ఫోటోలు నిజమేనా అని ప్రశ్నించారు.

మరో వెబ్‌సైట్‌లో, “టర్కీలోని సర్జన్లు ఒకేసారి ఎనిమిది సర్జరీలు చేసి మనిషిని 30 ఏళ్లు యవ్వనంగా మార్చారు” అనే క్యాప్షన్‌తో శస్త్రచికిత్సల ఫలితాలను చూపించే చిత్రాన్ని ఒక వ్యక్తి పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరొక ఆశ్చర్యకరమైన ముఖ మేక్ఓవర్ శస్త్రచికిత్స చేయించుకున్న ఒక మహిళ చాలా చిన్న అమ్మాయిలా కనిపిస్తుంది, ఆమె మనవరాలు అని కూడా అనుకోవచ్చు. శస్త్రచికిత్స తర్వాత ఆమె ముఖం చాలా మెరుగ్గా, స్పష్టంగా కనిపించింది, ఆమె కళ్ళు కూడా రంగు మారినట్లు అనిపించింది. ఈ మార్పులు చాలా అద్భుతంగా ఉన్నందున ప్రజలు ఫలితాలను నమ్మలేకపోతున్నారు. దీని గురించి సందేహాలు ఉన్నప్పటికీ, ఇలాంటి అద్భుతమైన శస్త్రచికిత్సలకు ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి.

Amaravati: జూన్‌ 3న మంత్రుల పేషీలు, ఛాంబర్లు స్వాధీనం చేసుకుంటాం: జీఏడీ

Amaravati: జూన్‌ 3న మంత్రుల పేషీలు, ఛాంబర్లు స్వాధీనం చేసుకుంటాం: జీఏడీ
అమరావతి: జూన్ 3న మంత్రుల పేషీలు, ఛాంబర్లు స్వాధీనం చేసుకుంటామని కార్యాలయ సిబ్బందికి సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ఆదేశాలు జారీ చేసింది. సచివాలయం నుంచి తమ అనుమతి లేకుండా ఎలాంటి పత్రాలు, వస్తువులు బయటకు తీసుకెళ్లొద్దని ఆదేశాల్లో పేర్కొంది. ప్రత్యేకించి మంత్రుల పేషీలు, ప్రభుత్వశాఖల్లోని దస్త్రాలు, కాగితాలను తరలించేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. వాహన తనిఖీలు నిర్వహించాల్సిందిగా సచివాలయం భద్రతను చూసే ఎస్పీఎఫ్ సిబ్బందిని ఆదేశించింది. జూన్ 3న మంత్రుల పేషీలకు తాళాలు వేస్తామని, ఆ లోగా వాటిని ఖాళీ చేయాల్సిందిగా జీఏడీ ఆదేశించింది.

AP MDM Bill Software

AP MDM Bill Software download for Primary, UP , High Schools MDM EXCEL SOFTWARES FOR CLASSES 1 to 5, CLASSES 1 to 8, CLASSES 3 to 10, CLASSES 6 to 10 including Ragi Malt Jaggery

AP MDM Bill Software AP-MDM-JAGANANNA GORUMUDDA EXCEL PROGRAMME SOFTWARES Prepared by Sri Ramanjaneyulu Perumal and by Sri C Ramanjaneyulu

Instructions for MDM Bill Software:

MDM 2023 EXCEL PROGRAMME
RECTIFIED Consolidation Sheet లో EGGS, CHIKKIS Count Decimals వచ్చేవి. ఇది Clear చేశాము.
MS EXCEL లో మాత్రమే USE చెయ్యాలి. WPS లేదా Google Sheets లో పనిచెయ్యదు.

AP MDM Bill Software by  C.Ramanjaneyulu Download
AP MDM Bill Software by Ramanjaneyulu Perumal  Download

AP EMRS Result, Selection List 2024

AP EMRS Result, Selection List 2024 EMRS Allotment Order (Results) 6th and 7th, 8th, 9th Backlog AP Ekalvya Model Residential Schools EMRS Admissions 2024 Result, Selection List TWREIS Gurukulam 6th Class Merit List AP Ekalvya Model Residential Schools Admissions into 6th Class in all EMR Schools and backlog vacancies (if any) in Classes 7th, & 8th and 9th for the Academic Year 2024-25 Result Merit Selection List https://twreiscet.apcfss.in/

AP EMRS Result, Selection List 2024-25 విద్యా సంవత్సరానికిగాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గురుకులం ఆధ్వర్యంలో నడుపబడుతున్న (28) ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాలలో 6వ తరగతిలో గల 60 సీట్లను మరియు 7వ, 8వ, 9వ తరగతులలో గల మిగిలిన ఖాళీలను నింపడానికి న జరిగిన వ్రాత పరీక్ష ఫలితాలు, మెరిట్ లిస్ట్ విడుదల.

AP EMRS 2024 Selection list click here

AP EdCET Hall Tickets 2024

AP EdCET Hall Tickets 2024 Download Hallticket for AP EDCET 2024 https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/EDCET_HomePage.aspx Hall Tickets released for A.P. Education Common Entrance Test AP Ed.CET-2024

AP EdCET Hall Tickets 2024 AP Common Entrance Test (AP EdCET-2024 ) will be conducted on 08.06.2024 for admission into regular B.Ed. and B.Ed.Spl.(H.I. V.I and I.D) courses (2 Years) for the academic year 2024-2025.

Date & Time of APEdCET-2023: 08.06.2024 (Saturday) 9-00 am to 11-00 AM

Uploading Preliminary Key: 15.06.2024 (Sunday)

Last date and Time of objections in Preliminary Key: 18.06.2024 (Tuesday) 5.00 P.M.

AP EdCET Hall Tickets 2024 click here

Health

సినిమా