Friday, November 15, 2024

PMKVY: ప్రధానమంత్రి స్కీమ్.. నెలకు రూ. 8000 పొందండి ఇలా..

PMKVY: కేంద్ర ప్రభుత్వం యువత కోసం రకరకాల పథకాలు తీసుకొని వచ్చిన విషయం తెలిసిందే. ఉద్యోగాల కల్పనకు ఎంతో ప్రయత్నం చేస్తోంది. స్కిల్ డెవలప్ చేస్తూనే..

చదువుల కోసం స్కాలర్‌షిప్‌లు ఇస్తుంది. అలాంటి వాటిలో ఇప్పుడు మనం ఓ ప్రత్యేకమైన పథకం గురించి తెలుసుకుందాం. దీని ద్వారా 10వ తరగతి పాసైనా చాలు, ఇంట్లోనే ఉంటూ రూ.8,000 నెలకు పొందవచ్చు.

ఈ పథకం పేరు ఏంటో కాదు ప్రధాన మంత్రి కౌశల్ వికాస పథకం. దీన్ని పీఎం స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ అని పిలుస్తారు. భారతీయ యువతకు ఇది ఒక మంచి స్కీమ్ అని చెప్పవచ్చు. ఇది నిరుద్యోగ యువతను త్వరగా ఉద్యోగాలు పొందేలా చేస్తోంది. మీరు భారత పౌరుడు లేదా పౌరురాలు అయితేనే ఈ స్కీమ్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. నిరుద్యోగ యువత కోసమే ఈ పథకం. ఇక దీని ద్వారా లక్షల మంది యువత, ఇంట్లోనే ఉంటూ, ఆన్‌లైన్‌లో శిక్షణ తీసుకోవచ్చు. అయితే దీని కోసం స్కిల్ ఇండియా డిజిటల్ పై ప్రాక్టికల్ కోర్సు చేస్తూ నెలకు రూ.8 వేలు చొప్పున పొందవచ్చు.

కోర్సు పూర్తైన తర్వాత కేంద్ర ప్రభుత్వం సర్టిఫికెట్ కూడా లభిస్తుంది. ఇందులో రకరకాల కోర్సులు చెయ్యవచ్చు. ఈ సర్టిఫికెట్ భారతదేశంలో అన్నిచోట్లా చెల్లుబాటు అవుతుందట. తద్వారా యువతకు ఏ రాష్ట్రంలోనైనా ఉద్యోగ అవకాశాలు సులభంగా లభిస్తాయి. ఇక ఈ పథకం కింద లబ్ధిదారుడికి టీషర్ట్ లేదా జాకెట్, డైరీ, ఐడీ కార్డు, బ్యాగ్ మొదలైన వాటిని ఇస్తారు. ఇంట్లో నుంచే ఆన్‌పైన్ ప్రక్రియ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలి యువత. ఇందుకోసం అధికారిక వెబ్ సైట్ https://www.pmkvyofficial.org/home-page ని సంప్రదించాలి.

దరఖాస్తుదారుడు భారత పౌరుడై.. నిరుద్యోగ యువత ఈ పథకానికి అర్హులు అవుతారు. ఇక వారి వయసు 18 ఏళ్లకు పైబడి ఉండాలి. కనీస విద్యార్హతగా 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి. దరఖాస్తుదారుడికి హిందీ, ఇంగ్లీష్ ప్రాథమిక పరిజ్ఞానం కొంతైనా అవగాహన ఉండాలి. ఆధార్ కార్డు, ఏదైనా గుర్తింపు కార్డు, విద్యార్హత పత్రాలు, నివాస ధృవీకరణ పత్రం, మొబైల్ నెంబరు, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్ లు ఉండాలి.

దీన్ని ఎలా అప్లే చేసుకోవాలి అంటే.. ముందుగా పైన తెలిపిన వెబ్ సైట్ కు వెళ్లి హోమ్ పేజీలో PMKVY ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఆప్షన్‌పై క్లిక్ చెయ్యాలి. అప్పుడు రిజిస్ట్రేషన్ ఫారం కనిపిస్తుంది. అక్కడ తెలిపిన సమాచారాన్ని అందించాలి. తర్వాత అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సమాచారం అందించిన తర్వాత చివరగా సబ్మిట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. సింపుల్ గా మీరు ఇంట్లోనే ప్రధానమంత్రి నైపుణ్య అభివృద్ధి పథకం కింద ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

Glue Berry : ఈ పండ్లు వందల సమస్యలకు దివ్య ఔషధం.!

Glue Berry : మన చుట్టూ ఉన్నటువంటి పకృతిలో ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. పూర్వకాలం నుండి ఆయుర్వేదంలో వాటిని విరివిగా వాడుతున్నారు. పకృతి ఒడిలో పుట్టిన మరో ఔషధగని నక్కెర కాయల చెట్టు.

ఈ చెట్టు చాలా చోట్ల రోడ్ల వెంట విరిగా కనిపిస్తుంది. చెట్టు నిండ పండ్లతో ఉండే ఈ చెట్టును పిచ్చి చెట్టు అనుకోని కొంతమంది అసలు పట్టించుకోరు. కానీ ఈ మొక్క ప్రయోజనాలు తెలిస్తే మాత్రం ఎంతో ఆశ్చర్యపోతారు. ఈ చెట్టు నుండి వచ్చే పండ్లు ఔషధ గుణాలకు ఎంతో ప్రసిద్ధి. ఈ పండుతో చేసిన ఊరగాయలు మరియు కూరలు అద్భుత రుచి కలిగి ఉంటాయి. ఈ నక్కెర పండ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమంది వీటిని విరిగా చెట్టు, బంక నక్కెర, బంక కాయలు, బంక కాయల చెట్టు ఇలా ఎన్నో రకాలుగా పిలుస్తూ ఉంటారు. విరిగి పండ్లలో ప్రోటీన్, క్రూడ్ ఫైబర్, కార్బోహైడ్రేట్, కొవ్వు,ఫైబర్, ఐరన్, ఫాస్పరస్ మరియు కాల్షియం లాంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. దీనితో పాటు యాంటీ ఇన్ ఫ్లమెంటరీ లక్షణాలు కూడా దీనిలో ఉన్నాయి. ఇన్ని పోషకాలు కలిగిన ఈ బంక పండ్లను తినటం వల్ల కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

ఈ చెట్టును మనలో చాలా మంది చూసే ఉంటారు. విరిగి కాయల చెట్టు మూడు నుండి నాలుగు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ విరిగి చెట్టుకు కాయలు గుత్తులు గుత్తులుగా కాస్తూ ఉంటాయి. విరిగి కాయలు పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో అలాగే పండిన తర్వాత లేత ఎరుపు రంగులోకి వస్తాయి. వీటి కాయల లోపల కండ కలిగి సాగే గుణంతో తీపి పదార్థం అనేది ఉంటుంది. అందుకే దీనిని బంకకాయల చెట్టు అని కూడా పిలుస్తారు. ఈ విరిగి కాయలను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. వీటిని తినడం వలన డయాబెటిస్ అదుపులో వస్తుంది అని పరిశోధనలో కూడా తేలింది. ఈ పండ్లు తినటం వలన రక్తంలోని గ్లూకోస్ స్థాయి కూడా కంట్రోల్ లో ఉంటుంది. మలబద్ధకం, అజీర్తి,గ్యాస్ సంబంధించిన సమస్యలు తగ్గుముఖం పడతాయి అని ఆయుర్వేద నిపుణులు తెలిపారు. వర్షాకాలంలో చర్మంపై కురుపులు రావడం సర్వసాధారణమైనది. ముఖ్యంగా పిల్లల్లో కూడా ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఈ బంక చెట్టు ఆకులను మెత్తగా నూరుకొని చర్మంపై రాస్తే ఉపశమనం కలుగుతుంది. దురద,అలర్జీ సమస్యలతో బాధపడేవారికి కూడా ఈ మొక్క సహాయం చేస్తుంది. దీనికోసం ఈ పండ్ల గింజలను మెత్తగా రుబ్బుకొని దురద ఉన్నచోట రాస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది..

Glue Berry : ఈ పండ్లు వందల సమస్యలకు దివ్య ఔషధం…!

గొంతు నొప్పి తగ్గించేందుకు కూడా ఈ చెట్టు బెరడు కషాయం పనిచేస్తుంది. దీనిలో బెరుడు, నీటిలో వేసి మరిగించి దానిని వడపోసి తాగాలి. రుచి కోసం నల్ల మిరియాలు,తేనెను కలుపుకోవచ్చు. ఇది మీ గొంతు నొప్పిని కూడా తగ్గిస్తుంది. అంతేకాక ఈ చెట్టు బెరడు కషాయం మహిళలకు పీరియడ్స్ నొప్పి నుండి కూడా ఎంతో ఉపశమనం కలుగుతుంది. కొన్ని పదార్థాలు తిన్న తరువాత చాలా మందికి చిగుళ్ళు మరియు పంటి నొప్పి లాంటివి మొదలవుతాయి. ఇది మొత్తం నోటి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తినటం వలన నోటి పూత కూడా నయం అవుతుంది. నోటి ఆరోగ్యం కోసం నక్కెర చెట్టు బెరడు పొడిని తీసుకొని, రెండు కప్పుల నీటిలో కలిపి, మరిగించి,ఈ పానీయాన్ని తీసుకోవడం చాలా మంచిది. లేకుంటే ఈ కషాయంతో నోటిని పుక్కిలించిన కూడా ఫలితం అనేది దక్కుతుంది. దీంతో పంటి నొప్పి,అల్సర్లు,చిగుర్లు వాపులు అన్నీ కూడా వెంటనే నయం అవుతాయి. ఆర్థరైటిస్ తో బాధపడే వారు కూడా కీళ్ల నొప్పుల నుండి గ్లూబెర్రీ రెగ్యులర్ గా తీసుకున్నట్లయితే ఉపశమనం లభిస్తుంది. ఈ అధ్యయనం ప్రకారం. ఈ గ్లూబేర్రి పండ్లు మరియు ఆకులు అనాల్జేసిక్ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పుల నుండి కూడా ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాక మీ వయసు కంటే ముందే మీ జుట్టు బూడిద రంగులోకి మారుతున్నట్లు ఉంటే బంక చెట్టు మీకు వంటింటి ఔషధంగా కూడా పనిచేస్తుంది. దీని పండ్లు నుండి తీసిన రసాన్ని జుట్టు మీద అప్లై చేయడం వలన నేరిసిన జుట్టు సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది. మీరు ఈ పండు రసాన్ని నూనెతో కలిపి కూడా తీసుకోవచ్చు. ఈ మిశ్రమం తలనొప్పి సమస్య నుండి కూడా వెంటనే ఉపశమనం కలిగిస్తుంది. అయితే ఈ పండ్లు అరగటానికి ఎక్కువ టైం పడుతుంది. కావున వీటిని తక్కువ మోతాదులో తీసుకోవడం చాలా మంచిది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు…

చంద్రబాబు ప్రభుత్వమొస్తే స్పీకర్ ఆయనేనట ! రఘురామ ఫ్యాన్స్ కు నిరాశే..!

ఏపీలో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై టీడీపీ ధీమాగా కనిపిస్తోంది. ఆ పార్టీకి కచ్చితంగా 125 సీట్లకు పైగా వస్తాయని రఘురామకృష్ణంరాజు, 130 సీట్లు వస్తాయని బుద్ధా వెంకన్న వంటి వారు జోస్యాలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ జూన్ 4న ఫలితాల్లో ఎన్డీయే కూటమి గెలిస్తే ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వంలో ఏ పదవుల్లో ఎవరు ఉండాలనే దానిపై మూడు పార్టీల్లోనూ అంతర్గత చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇదే క్రమంలో అసెంబ్లీ స్పీకర్ పదవికి పలు పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇందులో ఉండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న రఘురామకృష్ణంరాజు పేరు నిన్న మొన్నటివరకూ వినిపించింది. ఆయనే పలుమార్లు తాను స్పీకర్ గా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నట్లు చెప్పుకున్నారు. అయితే చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అని కూడా చెప్పేశారు. మరోవైపు తాజాగా స్పీకర్ పదవికి మరో పేరు పరిశీలనకు వస్తున్నట్లు తెలుస్తోంది.
రాయలసీమలోని ఉరవకొండ నియోజకవర్గం నుంచి పలుమార్లు గెలిచిన టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ పేరు తాజాగా స్పీకర్ రేసులోకి వచ్చింది. గతంలో పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి లభించని పయ్యావులకు విపక్షంలో ఉన్న సమయంలో పీఏసీ ఛైర్మన్ పదవి ఇచ్చి చంద్రబాబు గౌరవించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గెలవని పయ్యావుల కేశవ్..ఆ పార్టీ ఓడి విపక్షంలో ఉన్నప్పుడు మాత్రం గెలుస్తూ వస్తున్నారు. ఈసారి ఆ సంప్రదాయం మారి మరోసారి పయ్యావుల గెలిచి, కూటమి కూడా గెలిస్తే అప్పుడు స్పీకర్ పదవి ఆయనకు ఖాయమంటున్నారు.

Fahadh Faasil: చికిత్సే లేని వ్యాధితో బాధపడుతున్న పుష్ప విలన్..

Fahadh Faasil:మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపాడు. తాను ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ తో బాధపడుతున్నానని, 41 ఏళ్ళ వయస్సులో ఈ వ్యాధి బారిన పడినట్లు తెలిపాడు.

ఈ వ్యాధి వలన ఎంతో ఒత్తిడికి గురవుతామని, ఏ విషయంపైనా ఏకాగ్రత, ధ్యాస ఉండదట.. హైపర్ యాక్టివ్, హైపర్ ఫోకస్, ఇంపల్సివిటీ లాంటి లక్షణాలు ఇందులో కనిపిస్తాయని ఆయన తెలిపాడు. అంటే ఇదొక మెంటల్ డిసార్డర్ అని చెప్పుకోవచ్చు.

అంతేకాకుండా చిన్నతనంలో ఈ వ్యాధిని గుర్తిస్తే ఏమైనా ప్రయోజనం ఉండేది అని, కానీ ఈ వయసులో బయటపడేసరికి వైద్యులు సైతం ఏమి చేయలేకపోతున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఫహాద్ గురించి తెలుగు ప్రేక్షకులకు గుర్తుచేయాల్సిన అవసరం లేదు.. పుష్ప సినిమాతో ఫహాద్ తెలుగువారికి సుపరిచితుడుగా మారాడు.

పార్టీ లేదా పుష్ప అనే ఒక్క డైలాగ్ తో పాన్ ఇండియా గుర్తింపును అందుకున్నాడు.పుష్ప 2 లో కూడా ఫహాద్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ మధ్యనే ఆవేశం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఫహాద్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇక హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా మంచి విజయాలను అందుకుంటున్నాడు. ఈ ఏడాది హిట్ అయిన సినిమాల్లో ప్రేమలు సినిమా ఒకటి. ఆ సినిమాకు నిర్మాత ఫహాద్ నే.

ఇక సినిమాలతో పాటు సామజిక సేవా కార్యక్రమాల్లో కూడా ఫహాద్ ముందు ఉంటాడు. సోమవారం కేరళలోని ఒక చిల్డ్రన్ రీ హాబిలిటేషన్ సెంటర్ ఓపెనింగ్ కు ముఖ్య అతిధిగా విచ్చేసిన ఫహాద్.. తన వ్యాధి గురించి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఫహాద్ డిసార్డర్ న్యూస్ నెట్టింటి వైరల్ గా మారింది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Tea Boiling Time : టీని మూడు నిమిషాలకంటే ఎక్కువగా మరిగించేవారు చదవాలి ఇది

టీ అంటే మంచి మందికి ఇష్టమైనది. పొద్దున్నే లేచి రోజు మొదలు పెట్టేందుకు టీ ఉండాల్సిందే. లేదంటే అస్సలు రోజంతా పని చేయాలి అనిపించదు కొందరికి. ప్రతి ఒక్కరికి టీ తయారు చేయడానికి వారి స్వంత స్టైల్ ఉంటుంది.

అయితే టీ తాగే వారికి చేసే తప్పుల గురించి తెలియదు. టీ తయారు చేయడం, తాగడం అంటే చాలా మందికి ఇష్టమే. కానీ కొన్ని సందర్భాల్లో టీ చేసే సమయంలో చిన్న చిన్న తప్పులు చేస్తారు. దీనివల్ల కలిగే ఆరోగ్య దుష్ప్రభావాలు చాలా మందికి తెలియదు.

మీరు మీ టీని ఎక్కువ సేపు మరిగిస్తే.. మీ కోసం ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురు చూస్తున్నాయన్నది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పాలతో టీ తాగినప్పుడు అందించే శక్తి అది ఎక్కువగా మరిగించి తాగినప్పుడు పోతుంది. టీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ, ఎక్కువసేపు మరిగించడం వల్ల దాని ప్రయోజనాలను కోల్పోతుంది.

ఎందుకు అతిగా మరిగించొద్దు?

టీని ఎక్కువగా మరిగించకూడదని ఎందుకు చెప్తారో చూద్దాం. టీలో చాలా టానిన్లు ఉంటాయి. ఇది శరీరంలోకి ప్రవేశించే అనేక అణువులను విచ్ఛిన్నం చేయడంలో ఇబ్బందిని సృష్టిస్తుంది. టీని ఎక్కువసేపు అంటే నాలుగైదు నిమిషాల కంటే ఎక్కువసేపు మరిగిస్తే.. టానిన్లు శరీరంపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. దీంతో శరీరంలోకి చేరిన ఐరన్‌ను శరీరం గ్రహించలేకపోతుంది. ఇది కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తుంది.

జీర్ణ సమస్యలు

ఎక్కువగా మరిగించిన టీ మీలో జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. కడుపు నొప్పి, ఇతర కడుపు సమస్యలు వస్తాయి. ఇది కాకుండా క్యాన్సర్‌కు కారణమయ్యే క్యాన్సర్ కారకాలు టీని ఎక్కువగా మరిగిస్తే ఏర్పడతాయి. పాలలోని ప్రొటీన్లు పోయి డీహైడ్రేషన్‌కు దారి తీస్తుంది. వాటిని జీర్ణం చేయడానికి శరీరం చాలా కష్టపడాలి.

పోషకాల నష్టం

టీని అతిగా మరిగిస్తే.. అన్ని పోషకాలు పోతాయి. సరిగ్గా తయారుచేసిన టీ రోగనిరోధక శక్తిని, పోషకాలను పెంచుతుంది. కానీ నిరంతరం మరిగిస్తే పాలలోని కాల్షియం, విటమిన్లు, విటమిన్ బి, బి12, సి పోతాయి. అలాంటి వాటిని కొంచెం జాగ్రత్తగా నిర్వహించాలి. తక్కువగా మరిగించాలి.

అక్రిలామైడ్ వంటి క్యాన్సర్ కారక సమ్మేళనాలు టీలో ఎక్కువగా ఉంటాయి. కానీ ఇలా జరగాల్సిన అవసరం లేదు. అయితే వస్తుందనే అవకాశం కూడా తోసిపుచ్చలేం. కానీ ఎక్కువగా మరిగిస్తే మాత్రం ప్రమాదకరమైన మొత్తంలో ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది.

ఎంత సమయం మరిగించాలి?

చాలా మందికి పాల టీని కాయడానికి సరైన సమయం తెలియదు. మరికొందరు టీని ఎక్కువ సేపు మరిగించి తీసుకుంటే.. రుచిగా ఉంటుందనే నమ్మకంతో దానిని మరిగించడం కొనసాగిస్తారు. కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ టీ 3-5 నిమిషాల కంటే ఎక్కువ మరిగించొద్దు. మూడు నిమిషాలే చాలా ఎక్కువ అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఎక్కువ మరిగిస్తే.. టీ ప్రయోజనాలను పూర్తిగా నాశనం చేస్తుంది. టీని చేదుగా కూడా చేస్తుంది. అందువల్ల టీ తయారుచేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.

Bachhala Malli: బచ్చల మల్లిగా అల్లరి నరేష్.. ఆసక్తిరేపుతున్న ఫస్ట్ లుక్ పోస్టర్

హీరో అల్లరి నరేష్(Allari Naresh) తన కొత్త సినిమాను ప్రకటించాడు. కొత్త దర్శకుడు సుబ్బు మంగాదేవి(Subbu Mangadevi) దర్శకత్వంలో బచ్చల మల్లి(Bachhala Malli) అనే సినిమాను చేస్తున్నాడు.

హాస్య క్రియేషన్స్ బ్యానర్ పై రాజేష్ దండ, బాలాజీ గుట్ట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో హనుమాన్ బ్యూటీ అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. చేతిలో బీడీ పట్టుకొని మాసిన గడ్డంతో రిక్షాలో కూర్చొని మాసీ లుక్ లో కనిపిస్తున్నాడు.

ఇక పోస్టర్ లో పేరు: మళ్ళీ, ఇంటిపేరు: బచ్చల, చేసేది: ట్రాక్టర్ డ్రైవెర్.. ఈ బచ్చల మల్లి ఖచ్చితంగా మీకు చాలా రోజులు గుర్తుండిపోతారు. అంటూ బచ్చల మల్లి పాత్ర గురించి వివరించారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాదు.. సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక అల్లరి నరేష్ కెరీర్ లో 62వ సినిమాగా వస్తున్న ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. 1990లో దశకంలో తుని ప్రాంతంలో జరిగిన యదార్థ సంఘటలన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. మరి ఈ సినిమా అల్లరి నరేష్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

NTR Jayanthi: ‘భారతరత్న’.. మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్

లెజెండ్ నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Ramarao) కు అత్యున్నత పురస్కారం రావాలని ఆకాక్షించారు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi). మే 28, విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు 101వ జయంతిని (NTR Birth Anniversary) పురస్కరించుకుని ఎన్టీఆర్‌ను స్మరించుకున్నారు చిరంజీవి (Chiranjeevi). ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఎన్టీఆర్‌ను ‘భారతరత్న’ (Bharat Ratna) పురస్కారంతో గౌరవించాలని మరోమారు చిరంజీవి ఈ ట్వీట్‌లో పేర్కొనడం విశేషం. ఎందుకంటే, ఇంతకుముందు పలుమార్లు కూడా ఆయన ఇదే విషయాన్ని ప్రస్తావించారు. తనకు పద్మవిభూషణ్ వచ్చిన సందర్భంలోనూ ఎన్టీఆర్ పేరు ప్రస్తావించి, ఆయనకు ‘భారతరత్న’తో గౌరవించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఎక్స్ వేదికగా..

‘‘కొందరి కీర్తి అజరామరం. తరతరాలు శాశ్వతం. భావితరాలకు ఆదర్శం. నందమూరి తారక రామారావుగారిని ఈ రోజు గుర్తుచేసుకుంటూ, వారు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నాను. తెలుగు వారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను..’’ అంటూ చిరంజీవి పేర్కొన్నారు (Megastar Chiranjeevi post on NT Ramarao). చిరంజీవి చేసిన ఈ పోస్ట్‌కు నెటిజన్లు కూడా రియాక్ట్ అవుతున్నారు. చిరంజీవిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చిరంజీవ అనే కాదు కానీ.. ఎప్పటి నుండో ఈ కోరిక తెలుగు తమ్ముళ్లకు మిగిలిపోయింది. మరి ఇకనైనా కేంద్ర ప్రభుత్వం (Central Government) ఆ దిశగా ఏమైనా ఆలోచన చేస్తుందేమో చూడాలి..

AP Elections Counting 2024: ఆంధ్రప్రదేశ్‌లో 144 సెక్షన్- కీలక నిర్ణయం తీసుకున్న ఎన్నికల సంఘం

AP Assembly Elections Counting 2024 Updates: ఆరు రోజులే ఇంకా ఆరు రోజులే. కౌంటింగ్‌కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఉత్కంఠ పెరిగిపోతోంది. అందరి సందేహాలు, పార్టీ అంచనాలు, గెలుపు లెక్కలు తేలే సమయం వచ్చేస్తోంది. ఎవరు గెలుస్తారు అనే ప్రశ్న ఓవైపు ప్రజలను, నేతలను గ్రిల్ చేస్తుంటే కౌంటింగ్ సజావుగా ఎలా జరపాలనే సందేహం అధికారులను వేధిస్తోంది. ఎవరి ప్లాన్ ఏంటీ… ఎవరి మదిలో ఏముంది ఎవరు ఎక్కడ ఎలాంటి విధ్వంసానికి దిగుతారో అన్న అనుమాన వారిలో ఉంది. అందుకే అలాంటి వాటికి ఆస్కారం లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర బలగాలను భారీగా ఈసారి రంగంలో దింపుతోంది ఎన్నికల సంఘం.

20 కంపెనీల కేంద్ర బలగాల

జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు కోసం 20కంపెనీల బలగాలను బందోబస్తు కోసం ఆంధ్రప్రదేశ్‌లోకి దింపుతోంది ఎన్నికల సంఘం. ఇప్పటికే ఘర్షణలతో హీటెక్కిన పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రితోపాటు ఇతర సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ బలగాలను మోహరించబోతున్నారు. ఆయా ప్రాంతాల్లో అణువణువూ గాలించి అనుమానితలను అదుపులోకి తీసుకోనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోనున్నారు.

కౌంటింగ్ రోజు 144 సెక్షన్

కేంద్ర బలగాలు ఉన్న ప్రాంతంతోపాటు మిగతా ప్రాంతాలపై కూడా ఎన్నికల సంఘం నజర్ పెట్టింది. అందుకే లెక్కింపు రోజున ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 144 సెక్షన్ వధిస్తున్నట్టు ప్రకటించింది. ఆ రోజు ప్రజల రోజు వారి పనులకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో జూన్‌ ఆరో తేదీ వరకు ర్యాలీలు, ఊరేగింపులపై నిషేధం ఉంది. అదే టైంలో బాణాసంచాపై కూడా ఆంక్షలు పెట్టారు.

విస్తృత తనిఖీలు

లెక్కింపు రోజున ఘర్షణలు జరిగేందుకు ఏమాత్రం ఆస్కారం లేకుండా పోలీసు శాఖ పటిష్ట చర్యలు తీసుకుటోంది. అనుమానం ఉన్న ప్రాంతాల్లో మెరుపు దాడులు చేస్తోంది. కార్డన్ సెర్చ్ పేరిట తనిఖీలు చేపట్టి అనుమానితులను అదుపులోకి తీసుకుంటోంది. బయట వ్యక్తులు ఎవరైనా ఉంటే వారి పూర్తి వివరాలు తెలుసుకుని వారిని వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరిస్తోంది. వారికి కౌన్సిలింగ్ ఇస్తోంది. మరోవైపు పేలుడు పదార్థాలు, ఇతర మారణాయుధాయలపై కూడా నిఘా పెట్టింది పోలీసు శాఖ.

కార్డన్ సెర్చ్‌లో భాగంగా కాలం చెల్లిన వాహనాలను, ధ్రువపత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు పోలీసులు. అనుమానం ఉన్నప్రాంతంలో ప్రతి ఇంచ్ వెతుకుతున్నారు. అక్కడ నివాసం ఉంటున్న వారి పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు. ఆధార్, ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులు అడిగి వివరాలు నమోదు చేసుకుంటున్నారు. వివిధ ప్రాంతాల్లో ఇలాంటి తనిఖీలు మొదటి సారి జరుగుతున్నందున ప్రజలు కాస్త ఆందోళన చెందుతున్నారు.

అదుపులో శాంతి భద్రతలు

పోలీసు శాఖ, ఇతర అధికారులు, సిట్ బృందాల ఆధ్వర్యం చేపట్టిన చర్యలు కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్‌కుమార్ మీనా తెలిపారు. పోలింగ్ తర్వాత కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయని కేంద్ర బలగాల రంగ ప్రవేశంతో పరిస్థితి అదుపులోకి వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం ప్రజలు ప్రశాంతంగా తిరుగుతున్నారని ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదని వివరించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యి… ఎన్నికల కోడ్‌ తొలగిపోయే వరకు ఇదే పరిస్థిత కొనసాగించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నట్టు మీనా వెల్లడించారు.

ఈ విటమిన్లు బ్రహ్మస్త్రాలు.. ఇలా చేస్తే.. గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదానికి చెక్ పెట్టినట్లే..

ధమనులలో కొలెస్ట్రాల్ చేరడం వల్ల శరీరంలో రక్తం సరిగా ప్రవహించదు. దీని కారణంగా, గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదం చాలా రెట్లు పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో, ఆహారంలో ధమనులకు అవసరమైన విటమిన్లు తీసుకుంటే.. చాలా ప్రభావవంతంగా ఉంటుంది. వాస్తవానికి శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని సరఫరా చేయడానికి ధమనులు పనిచేస్తాయి. ఈ ధమనులు సరళంగా, శుభ్రంగా ఉన్నంత వరకు, ఈ పనిలో ఎటువంటి ఆటంకం ఉండదు. కానీ పేలవమైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా, దానిలో కొలెస్ట్రాల్ అధికంగా పేరుకుపోతుంది. ఇది గట్టిగా, ఇరుకైనదిగా చేస్తుంది. ఈ పరిస్థితిని ధమనులు గట్టిపడటం (అథెరోస్క్లెరోసిస్) అంటారు.

గుండె జబ్బులు, స్ట్రోక్‌లకు ధమనులు గట్టిపడటం ప్రధాన ప్రమాద కారకం.. అటువంటి పరిస్థితిలో, ధమనులను ఆరోగ్యంగా ఉంచడం చాలా ముఖ్యం. దీని కోసం, మీరు మీ ఆహారంలో ఇక్కడ పేర్కొన్న ఈ 5 విటమిన్లను చేర్చుకోవాలి.. ఈ విటమిన్లు ధమనులను శుభ్రంగా ఉంచడంలో, కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

విటమిన్ డి..
విటమిన్ డి ప్రధాన మూలం సూర్యకాంతి.. అయితే ఇది కొన్ని ఆహారాల నుంచి కూడా పొందవచ్చు. మాయో క్లినిక్ తక్కువ స్థాయిలో విటమిన్ డి ధమనులు గట్టిపడే ప్రమాదాన్ని పెంచుతుందని నివేదించింది. అటువంటి పరిస్థితిలో, కొవ్వు చేపలు, గుడ్డు పచ్చసొన, పుట్టగొడుగులు వంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల విటమిన్ డి తగినంత మొత్తంలో పొందవచ్చు..

విటమిన్ సి..
విటమిన్ సి ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్.. ఇది ధమనులను ఆక్సీకరణ నష్టం నుంచి రక్షిస్తుంది. ఆక్సీకరణ నష్టం అనేది కొలెస్ట్రాల్ ధమని గోడలకు అంటుకునేలా చేసే ప్రక్రియ. పండ్లు, కూరగాయలు విటమిన్ సి మంచి వనరులు. నారింజ, నిమ్మ, ద్రాక్ష, మొలకలు, బ్రకోలీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

విటమిన్ ఇ..
విటమిన్ E కూడా LDL (చెడు) కొలెస్ట్రాల్ ఆక్సీకరణను నిరోధించే ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్. ఇది ధమని గోడలపై కొలెస్ట్రాల్ పేరుకుపోయే అవకాశాన్ని తగ్గిస్తుంది. బాదం, పొద్దుతిరుగుడు గింజలు, బచ్చలికూర, కివీ వంటి విటమిన్ ఇ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం ద్వారా ధమనులను ఆరోగ్యంగా ఉంచవచ్చు

విటమిన్ B3 (నియాసిన్ / విటమిన్ B3)..
నియాసిన్ అని కూడా పిలువబడే విటమిన్ B3.. HDL (మంచి) కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి, ట్రైగ్లిజరైడ్స్ (రక్తంలో కొవ్వు రకం) తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది ధమనులలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. చేపలు, వేరుశెనగలు, ట్యూనా, చికెన్ వంటి ఆహారాల ద్వారా శరీరానికి నియాసిన్ అవసరాన్ని తీర్చవచ్చు.

విటమిన్ K1 (ఫైలోక్వినోన్ / విటమిన్ K1)
విటమిన్ K1 రక్తం గడ్డకట్టడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంతే కాదు, ధమనుల గోడలలో కాల్షియం పేరుకుపోకుండా నిరోధిస్తుంది. బచ్చలికూర, కాలే, మొలకలు వంటి ఆకుపచ్చని ఆకు కూరలు విటమిన్ K1 అద్భుతమైన మూలాలు.. ఇవి ధమనుల సంకుచితాన్ని నిరోధించడంలో సహాయపడతాయి.

ఇంట‌ర్‌తో ఎన్‌డీఏలోకి అడుగుపెట్టి ల‌క్షకుపైగా జీతం పొందండి!

ఏటా యూపీఎస్‌సీ నిర్వహించే నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ అండ్‌ నేవల్‌ అకాడెమీ (ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ) పరీక్షకు స‌మ‌యం వ‌చ్చింది. దేశ రక్షణలో భాగస్వాములు కావాలని ఆశించే యువత‌కు ఎన్‌డీఏ వార‌దిలా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో బీఏ, బీఎస్సీ, బీటెక్‌లలో నచ్చిన కోర్సు ఉచితంగా చ‌దువుకుని, శిక్షణ త‌ర్వాత కేంద్ర ర‌క్షణ రంగంలో లెవెల్‌-10 వేతనశ్రేణితో ఆర్మీ/నేవీ/ఎయిర్‌ ఫోర్స్‌లలో ఉద్యోగం పొంద‌వ‌చ్చు. ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ – 2024(2) ప్రకటనకు సంబందించిన విశేషాలు మీకోసం…

ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ పరీక్షను యూపీఎస్‌సీ ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తోంది. ఈ ప‌రీక్ష‌లో ఉత్తీర్ణ‌త సాధించిన‌వారు ఎంపికైనవారు పుణెలోని నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ (ఎన్‌డీఏ)లో బీటెక్, బీఎస్సీ, బీఏ కోర్సులు చదువుకుంటూ వ‌స‌తి, భోజ‌నం ఉచితంగా పొందుతూ రక్షణ రంగంలో ప్రాథమిక శిక్షణ తీసుకోవ‌చ్చు. నేవల్‌ అకాడెమీ (ఎన్‌ఏ)కి ఎంపికైనవాళ్లు కేరళలోని ఎజమాళలో బీటెక్ విద్య అలాగే, ఎన్‌డీఏ, ఎన్‌ఎల్లో చదువు పూర్తిచేసుకున్నవారికి జేఎన్‌యూ, న్యూదిల్లీ డిగ్రీలను ప్రదానం అందిస్తోంది. ఈ శిక్ష‌ణ‌ సమయంలో ప్రతినెలా రూ.56,100 ఉప‌కార‌వేతం అందిస్తారు. ఆర్మీలో లెఫ్టినెంట్, నేవీలో సబ్‌ లెఫ్టినెంట్, ఎయిర్‌ ఫోర్స్‌లో ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ (పైలట్‌)/ గ్రౌండ్‌ డ్యూటీ ఆఫీసర్‌ హోదాతో విధులు నిర్వహిస్తూ.. మొదటి నెల నుంచే రూ.లక్షకుపైగా జీతం పొందుతారు.

ఖాళీలు వివ‌రాలు..

ఆర్మీ వింగ్‌కు ఏదైనా గ్రూపుతో ఇంటర్‌ ఉత్తీత‌, ఎయిర్‌ ఫోర్స్, నేవల్‌ వింగ్స్‌ (ఎన్‌డీఏ), 10+2 క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌ (ఇండియన్‌ నేవల్‌ అకాడమీ)లకు ఎంపీసీ గ్రూపుతో జనవరి 2, 2006 – జనవరి 1, 2009 మధ్య జన్మించి ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరంలో ఉన్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీలో 370 (ఆర్మీ 208 (10 మహిళలకు), నేవీ 42 (6 మహిళలకు), ఎయిర్‌ ఫోర్స్‌ మొత్తం 120 ఇందులో 92 ఫ్లైయింగ్‌ (2 మహిళలకు), గ్రౌండ్‌ డ్యూటీ టెక్నికల్‌ 18 (2 మహిళలకు), గ్రౌండ్‌ డ్యూటీ నాన్‌ టెక్నికల్‌ 10 (2 మహిళలకు)) ఉన్నాయి. నేవల్‌ అకాడెమీ (10+2 క్యాడెట్‌ స్కీం)లో 34 (5 మహిళలకు) ఖాళీలు ఉన్నాయి. పరీక్ష‌కు తెలుగు రాష్ట్రాల్లో అనంతపురం, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ ప‌రీక్షా కేంద్రాలు ఉన్నాయి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: జూన్‌ 4 సాయంత్రం 6 వరకు స్వీకరిస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.వంద. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు మినహాయించారు.

పరీక్ష తేదీ: సెప్టెంబరు 1

వెబ్‌సైట్‌: https://upsc.gov.in/

FD Interest Rates: ఎఫ్‌డీలపై వడ్డీ రేట్ల సవరణ… ఆ బ్యాంకు ఖాతాదారులకు ఇక పండగే..!

భారతదేశంలో నమ్మకమైన పెట్టుబడి సాధనంగా ఎఫ్‌డీలు బాగా ప్రాచుర్యం పొందాయి. స్థిర ఆదాయం ఇచ్చే ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెడితే తమ సొమ్ము భద్రంగా ఉంటుందని ఇక్కడ ప్రజల నమ్మకం. ఈ నమకాన్ని నిలబెట్టుకుంటూ భారతదేశంలో అన్ని ఎఫ్‌డీలపై ప్రత్యేక వడ్డీలను అందిస్తూ వినియోగదారులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యాక కీలక వడ్డీ రేట్లను సవరించాయి. అలాగే సీనియర్‌ సిటిజన్లకు ప్రత్యేక వడ్డీను అందిస్తున్నాయి. మే నెలలో చాలా బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటును సవరించాయి. ఎస్‌బీఐ, డీసీబీ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, ఉత్కర్ష్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంకులు వినియోగదారులను ఆకట్టుకునేందుకు వడ్డీ రేట్లను సవరించాయి. కాబట్టి ఈ బ్యాంకుల్లో తాజా సవరణ తర్వాత ఎఫ్‌డీలపై ఎంత స్థాయిలో వడ్డీను సవరించాయో? ఓ సారి తెలుసుకుందాం.

డీసీబీ బ్యాంక్‌
డీసీబీ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను (రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు) సవరించింది . డీసీబీ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం కొత్త రేట్లు మే 22, 2024 నుంచి అమల్లోకి వచ్చాయి. 19 నెలల నుంచి 20 నెలల కాలవ్యవధిలో రివిజన్ తర్వాత సాధారణ కస్టమర్లకు 8 శాతం, సీనియర్ సిటిజన్లకు 8.55 శాతం అత్యధిక ఎఫ్‌డీ వడ్డీ రేటును బ్యాంక్ అందిస్తోంది. అత్యధిక పొదుపు ఖాతా వడ్డీ రేటు 8 శాతం వరకు అందించబడుతుంది. ఈ పెద్ద బ్యాంక్ ఇప్పుడు పొదుపు ఖాతాపై 8 శాతం వరకు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.55 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తుంది.

ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు
ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలపై ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. కొత్త ఎఫ్‌డీ వడ్డీ రేట్లు మే 15, 2024 నుంచి అమల్లోకి వస్తాయి. మార్పు తరువాత బ్యాంక్ ప్రస్తుతం సాధారణ పౌరులకు ఏడు రోజుల నుంచి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 3 శాతం నుంచి 7.90 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. సీనియర్ సిటిజన్‌ల కోసం పైన పేర్కొన్న రేటు కంటే బ్యాంక్ 0.50 శాతం పీఏ అదనపు స్ప్రెడ్‌ను అందిస్తుంది. వడ్డీ రేటు 3.50 శాతం నుంచి 8.40 శాతం వరకు ఉంటుంది. 500 రోజుల కాలవ్యవధిపై అత్యధిక వడ్డీ రేటు 8 శాతం, 8.40 శాతం వడ్డీ అందిస్తారు.

Bank Holidays: వినియోగదారులకు అలర్ట్‌.. జూన్‌లో బ్యాంకులు ఎన్ని రోజులు మూసి ఉంటాయో తెలుసా?

ప్రతినెల బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా. చాలా మంది ప్రతి రోజు వివిధ లావాదేవీ నిమిత్తం బ్యాంకులకు వెళ్తుంటారు. అయితే బ్యాంకు పనుల కోసం వెళ్లేవారు ప్రతి నెల రాగానే బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీని వల్ల సమయం ఆదాతో పాటు ఆర్థిక నష్టం కలుగకుండా చేసుకోవచ్చు.

ఇక మే నెల ముగియబోతోంది. జూన్‌ నెలలో బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉండనున్నాయో ఆర్బీఐ జాబితాను విడుదల చేస్తుంటుంది. జూన్‌లో 10 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఇందులో, ఆదివారం, రెండవ, నాల్గవ శనివారం కారణంగా 6 రోజుల పాటు బ్యాంకులు మూసి ఉండనున్నాయి.

పండుగల కారణంగా మిగిలిన రోజుల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. జూన్ నెలలో 10 బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఈ బ్యాంకు సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవని గుర్తించుకోండి. జూన్ 2న ఆదివారం కారణంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. 8 జూన్ రెండవ శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి. 9 జూన్ ఆదివారం దేశ వ్యాప్తంగా బ్యాంకులు బంద్‌.

జూన్‌ 15న YMA డే లేదా రాజా సంక్రాంతి కారణంగా భువనేశ్వర్, ఐజ్వాల్ జోన్‌లలో బ్యాంకులు మూసి ఉంటాయి. జూన్‌16న ఆదివారం, జూన్‌ 17న బక్రీ ఈద్ కారణంగా, దేశవ్యాప్తంగా దాదాపు బ్యాంకులు మూసి ఉంటాయి.

జూన్‌ 18న బక్రీ ఈద్ కారణంగా జమ్ము మరియు శ్రీనగర్ జోన్‌లలో బ్యాంకులు బంద్‌. జూన్‌ 22న నాల్గవ శనివారం, జూన్‌ 23, 30న ఆదివారం కారణంగా సాధారణంగా బ్యాంకులు బంద్‌ ఉంటాయి.

IRS Officer: డేటింగ్ యాప్‌లో పరిచయం.. 3 నెలలకే సివిల్ సర్వెంట్ ఫ్లాట్‌లో యువతి డెడ్‌బాడీ లభ్యం! ఏం జరిగిందో..

ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్‌) అధికారికి డేటింగ్‌ యాప్‌లో పరిచయమైన మహిళ.. మూడు నెలలకే అతడి ప్లాట్‌లో శవమై కనిపించింది. స్థానికంగా తీవ్రకలకలం రేపిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని సెక్టార్ 100లోని లోటస్ బౌలేవార్డ్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఐఆర్‌ఎస్‌ అధికారి సౌరభ్ మీనా నివాసం ఉంటున్నారు. ఆయనకు బీహెచ్‌ఈఎల్‌లో హెచ్‌ఆర్‌ శిల్పా గౌతమ్‌తో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. ఏం జరిగిందో తెలియదు గానీ శనివారం మధ్యాహ్నం శిల్పా గౌతమ్‌.. ఐఆర్‌ఎస్‌ ఆఫీసర్‌ సౌరభ్ మీనా ప్లాట్‌లో ఉరివేసుకుని కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శిల్పా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శిల్పా, సౌరభ్‌ల మధ్య గత మూడేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోందని గౌతమ్‌ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

డేటింగ్‌ యాప్‌ ద్వారా వీరికి పరిచయం ఏర్పడిందని, త్వరలోనే పెళ్లి చేసుకుంటానని నమ్మించి సౌరభ్‌ తన కుమార్తెను మోసం చేసినట్లు మృతురాలి తండ్రి గౌతమ్‌ తెలిపారు. శిల్పా, సౌరభ్‌ల మధ్య గత మూడేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోందని గౌతమ్‌ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతో వీరి మధ్య గతకొంత కాలంగా గొడవలు జరుగుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆమెను భౌతికంగా వేధించడంతోపాటు చివరకు హత్య కూడా చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరోవైపు శిల్పా తండ్రి ఆరోపణలను సౌరభ్‌ ఖండించాడు. తమకు మూడు నెలల కిందటే డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయం ఏర్పడిందని, ఆమె తల్లిదండ్రులు చెబుతున్నట్లు మూడేళ్ల క్రితం కాదని పోలీసులకు తెలిపాడు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, సౌరభ్‌ను అదుపులోకి తీసుకున్నారు. సౌరభ్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు శిల్పా మరణంపై దర్యాప్తు చేస్తున్నట్లు నోయిడా అదనపు డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (DCP) మనీష్ కుమార్ మిశ్రా తెలిపారు. పోలీసులు సౌరభ్‌ను కోర్టులో హాజరుపరిచగా.. కోర్టు అతనికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ మిశ్రా తెలిపారు. శిల్పా మృతికి గల కారణాలను తెలుసుకోవడానికి పోస్ట్‌మార్టం నివేదిక రావల్సి ఉందని, ఈలోగా శిల్పా-సౌరభ్‌ల మొబైల్ ఫోన్‌లను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఫ్లాట్‌లోని సీసీటీవీ పుటేజీని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

17 వేలకే బ్రాండెడ్ ల్యాప్‌టాప్.. దీని అసలు ధర 59 వేలు.. బెస్ట్ డీల్

17 వేలకే బ్రాండెడ్ ల్యాప్‌టాప్.. దీని అసలు ధర 59 వేలు.. బెస్ట్ డీల్
సినిమా వార్తలు
ఛీ వీళ్లసలు మనుషులేనా.. బాలనటిని సైతం వదల్లేదు.. తండ్రి ఫిర్యాదుతో
ఛీ వీళ్లసలు మనుషులేనా.. బాలనటిని సైతం వదల్లేదు.. తండ్రి ఫిర్యాదుతో
Fahadh Faasil: అరుదైన వ్యాధితో బాధపడుతున్న పుష్ప విలన్‌.. జీవితాంతం భరించాల్సిందే అంటూ
Fahadh Faasil: అరుదైన వ్యాధితో బాధపడుతున్న పుష్ప విలన్‌.. జీవితాంతం భరించాల్సిందే అంటూ
అందమైన భార్య.. కానీ ఆమెకు ఉన్న అలవాటుతో భర్త..!
అందమైన భార్య.. కానీ ఆమెకు ఉన్న అలవాటుతో భర్త..!
ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చిన కల్కి టీమ్.. ఇది నెక్ట్స్ లెవల్ అంతే!
ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చిన కల్కి టీమ్.. ఇది నెక్ట్స్ లెవల్ అంతే!
అసలు ఎవరీ నటాషా? హార్దిక్ లైఫ్ లోకి ఎలా వచ్చింది! పాండ్యా భార్య లైఫ్ స్టోరీ!
అసలు ఎవరీ నటాషా? హార్దిక్ లైఫ్ లోకి ఎలా వచ్చింది! పాండ్యా భార్య లైఫ్ స్టోరీ!
విద్యార్థుల పరీక్షలు అయిపోయాయి. ఇంటర్ లోకి వచ్చే పదో తరగతి విద్యార్థులకైనా, ఇంటర్ పూర్తి చేసి పై చదువులకి వెళ్ళేవాళ్ళకైనా ల్యాప్ టాప్ చాలా అవసరం. అయితే ఇప్పుడు మంచి కాన్ఫిగరేషన్ తో బెస్ట్ ల్యాప్ టాప్ కొనాలంటే కనీసం 40 వేల నుంచి 50 వేలు బడ్జెట్ ఉండాలి. అయితే మీరు 20 వేల లోపు బడ్జెట్ లో 59 వేల విలువ చేసే ల్యాప్ టాప్ ని సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్ 59 వేల బ్రాండెడ్ ల్యాప్ టాప్ ని 71% తగ్గించి విక్రయిస్తుంది.

లెనోవో కంపెనీ గురించి తెలిసిందే. ఒక నమ్మకమైన బ్రాండ్ గా ఎదిగింది. ల్యాప్ టాప్స్, థింక్ ప్యాడ్స్, కంప్యూటర్లు, మానిటర్లు, కీబోర్డు, మౌస్ వంటి కంప్యూటర్ పరికరాలను తయారు చేసే కంపెనీ. ఈ కంపెనీ నుంచి తయారైన ప్రాడెక్ట్ లెనోవో థింక్ ప్యాడ్. ఇది 6త్ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్ తో వస్తుంది. ఈ థిన్ అండ్ లైట్ హెచ్డీ ల్యాప్ టాప్ 16 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్డీ హార్డ్ డిస్క్ తో వస్తుంది. 14 అంగుళాల డిస్ప్లే సైజుతో వస్తుంది. ఈ ల్యాప్ టాప్ కొన్న తర్వాత ఆపరేటింగ్ సిస్టం కోసం ప్రత్యేకించి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టం ఇన్స్టాల్ చేసి ఉంటుంది. అంతేకాకుండా ఎంఎస్ ఆఫీస్, వైఫై, వెబ్ క్యామ్, ఇంటెల్ గ్రాఫిక్స్ తో వస్తుంది.

అయితే ఇది రీఫర్బిష్డ్ ల్యాప్ టాప్. అంటే ఇది వరకు కొన్న కస్టమర్ వెనక్కి పంపిన ల్యాప్ టాప్. దీన్ని కంపెనీ తీసుకుని చిన్న చిన్న రిపేర్లు ఉంటే సెట్ చేసి తక్కువ ధరకు విక్రయిస్తుంటుంది. ఈ ల్యాప్ టాప్ కొన్నాక అంతకు ముందు వాడినట్టు ఉంటుంది. అయితే కంపెనీ దీని మీద ఆరు నెలల వారంటీ ఇస్తుంది. 805 రూపాయలు చెల్లిస్తే ఇంకో 6 నెలల వారంటీ అదనంగా వస్తుంది. ఈ ల్యాప్ టాప్ ని లక్షకు పైగా కొన్నారు. వారిలో 85 శాతం మంది పాజిటివ్ రేటింగ్ ఇచ్చారు. డబ్బుకు న్యాయం జరిగిందని, మన్నికైన ల్యాప్ టాప్ అని, మంచి ర్యామ్ అని రివ్యూలు ఇచ్చారు.

దీని అసలు ధర రూ. 58,990 కాగా రూ. 41,591 తగ్గింపుతో 17,399కే విక్రయిస్తున్నారు. ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ఉంటే ఆ కార్డు రకాన్ని బట్టి ల్యాప్ టాప్ ధర మరింత తగ్గుతుంది. మరి ఇంతకంటే మిడిల్ క్లాస్ వారికి బెస్ట్ డీల్ దొరకదు. ఈ ల్యాప్ టాప్ కొనేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

కారుకి ఉద్యోగి పేరు పెట్టిన రతన్ టాటా.. ఇందుకు కదా ఆయనను గ్రేట్ అనేది

టాటా కార్లకు ఈ దేశంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మిడిల్ క్లాస్ వాళ్ళను దృష్టిలో పెట్టుకుని రతన్ టాటా తీసుకునే నిర్ణయాలు ఎంతో సాహసోపేతంగా ఉంటాయి. ఆయన తీసుకొచ్చిన నానో కారు కానివ్వండి.. టాటా స్టార్ బజార్ కానివ్వండి.. ఇలా కొన్ని మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం తక్కువ ధరకు అందించేలా అందుబాటులోకి తీసుకొస్తారు. నానో కొన్ని కారణాల వల్ల ఆగిపోయినా మళ్ళీ ఎలక్ట్రిక్ వెర్షన్ తో రాబోతుంది. ఇక రతన్ టాటా తన కంపెనీలో పని చేసే ఉద్యోగులకు ఎంతో విలువ ఇస్తారు. ఆయన కారు డ్రైవర్ తో కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడతారు. ఎంత ఎత్తుకి ఎదిగినా చాలా నిరాడంబరంగా ఉంటారు. అలాంటి రతన్ టాటా.. తన కంపెనీ కారుకి ఒక ఉద్యోగి పేరు పెట్టారంటే నమ్ముతారా? కానీ ఇది నిజం.

సాధారణంగా ఏ కంపెనీ కారు చేసినా గానీ ఉద్యోగి పేరు పెట్టడం అనేది జరగదు. కానీ రతన్ టాటా మాత్రం ఏకంగా ఉద్యోగి పేరు మీద ఒక మోడల్ ని అంకితం చేశారు. టాటా కంపెనీలో కష్టపడి పని చేసి సంస్థ విజయంలో కీలకపాత్ర పోషించిన ఉద్యోగి పేరుని టాటా సుమో కారుకి పెట్టారు. ఆ ఉద్యోగి పేరు సుమంత్ మోల్గావ్కర్.. ఈయన టాటా మోటార్స్ సంస్థ ఎండీగా పని చేశారు. అయితే ఈయన రోజూ లంచ్ సమయంలో ఏదో సాకు చెప్పి బయటకు వెళ్లేవారు. అలా వెళ్లిన చాలా సేపటికి మళ్ళీ ఆఫీస్ కి వచ్చేవారు. దీంతో ఈయన మీద ఆఫీస్ లో రూమర్లు క్రియేట్ చేశారు. ఈయన రోజూ ఈ సమయంలో ఏం చేస్తున్నారా అని కొంతమంది ఉద్యోగులు రహస్యంగా ఆయనను ఫాలో అయ్యారు. అప్పుడు మోల్గావ్కర్ ట్రక్ డ్రైవర్లతో కలిసి రోడ్డు పక్కన భోజనం చేస్తూ కనిపించారు.

ఎందుకు వాళ్లతో ఏం పని అనుకున్నారు. అయితే ఆయన టాటా వాహనాలు వాడే డ్రైవర్లు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అని అడిగేవారు. సమస్యలు తెలుసుకునేవారు. బాగున్న అంశాలు ఏంటి? లోపాలు ఏంటి అని గుర్తించిన తర్వాతే ఆఫీస్ కి తిరిగి వచ్చేవారు. ఇక కంపెనీలో పని చేస్తున్న ఆర్ అండ్ డీ టీమ్ కి సలహాలు, సూచనలు ఇచ్చేవారు. అలా లోపాలను సరిద్దిదుతూ ఎప్పటికప్పుడు టాటా కార్లను మార్కెట్ లో సక్సెస్ అవ్వడంతో కృషి చేశారు. సంస్థ విజయంలో ఇంత అంకితభావంతో పని చేసినందుకు కృతజ్ఞతగా.. సుమంత్ మోల్గావ్కర్ పదాల్లోని మొదటి రెండు అక్షరాలను టాటా కారుకి నామకారణం చేశారు. సుమంత్ లో సుని, మోల్గావ్కర్ లో మోని తీసుకుని సుమోగా మార్కెట్లో విడుదల చేశారు. ఇది ఆయన తన ఉద్యోగికి ఇచ్చిన అరుదైన గౌరవం. ఇక టాటా సుమో కూడా అప్పట్లో బాగా సక్సెస్ అయ్యింది. చివరగా టాటా సుమో గోల్డ్ 2018లో లాంఛ్ అయ్యింది. 10 సీట్లు కలిగిన ఈ ఎస్యూవీ ధర రూ. 5.26 లక్షల నుంచి రూ. 8.93 లక్షల మధ్య ఉంది.

Digital transactions: ఏపీ మద్యం దుకాణాల్లో డిజిటల్‌ లావాదేవీలు

Digital transactions: ఏపీ మద్యం దుకాణాల్లో డిజిటల్‌ లావాదేవీలు

ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఐదేళ్లుగా నగదునే తీసుకుంటూ డిజిటల్‌ చెల్లింపులకు ఆస్కారమే లేకుండా చేసేసిన వైకాపా ప్రభుత్వం.. ఎన్నికల తర్వాత ఇప్పుడు డిజిటల్‌ పద్ధతుల్లో స్వీకరించాలని లక్ష్యాల్ని విధించి మరీ విక్రయాలు చేయిస్తోంది. కొన్ని జిల్లాల్లోని దుకాణాల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ చేపట్టే మద్యం విక్రయాలకు డిజిటల్‌ చెల్లింపులనే తీసుకోవాలని మౌఖికంగా ఆదేశాలిచ్చింది. మరికొన్ని జిల్లాల్లో 70-80 శాతం లావాదేవీలకు డిజిటల్‌ చెల్లింపులే స్వీకరించాలని, సాధ్యమైనంత వరకూ నగదు తీసుకోవద్దని ఆదేశించింది. ఏపీఎస్‌బీసీఎల్‌ ఎండీగా పనిచేసిన వైకాపా వీర విధేయ అధికారి వాసుదేవరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసి, ఆ స్థానంలో కొన్నిరోజుల కిందట టీఎస్‌ చేతన్‌ను నియమించింది. ఆయన బాధ్యతలు చేపట్టాక సేల్స్‌మెన్, సూపర్‌వైజర్లకు లక్ష్యాలు విధించి మరీ డిజిటల్‌ లావాదేవీలు చేయాలని చెబుతున్నారు.

వినియోగదారులపై ఒత్తిడి
ఫోన్‌పే, గూగుల్‌ పే, పేటీఎం లేదా కార్డు స్వైపింగ్‌ వంటి ఏదో ఒక డిజిటల్‌ పద్ధతిలో చెల్లింపులు చేయాల్సిందేనంటూ రెండు రోజులుగా వినియోగదారులపై సేల్స్‌మెన్‌ ఒత్తిడి తీసుకొస్తున్నారు. నగదు రూపంలో చెల్లింపులు వద్దని చెబుతున్నారు. దీంతో దుకాణాల వద్ద వినియోగదారులతో ఘర్షణలు, వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. డిజిటల్‌ పద్ధతుల్లో చెల్లింపులు స్వీకరించాలని లక్ష్యాలు విధిస్తున్న ఏపీఎస్‌బీసీఎల్‌… ఆ రూపంలో చెల్లించే వినియోగదారులపై అదనపు భారం వేస్తోంది. ఒక సీసా కొంటే చాలు దాని ఎమ్మార్పీపై అదనంగా రూ. 1.18 వసూలు చేస్తోంది. మద్యం సీసాను స్కాన్‌ చేసి డిజిటల్‌ చెల్లింపుల ఆప్షన్‌ ఎంపిక చేస్తే చాలు… దానిపై అదనపు ధర పడిపోతోంది. ఈ భారం ఏపీఎస్‌బీసీఎల్‌ మోయకుండా వినియోగదారులపైనే వేస్తోంది.

New Traffic Rules in India From June 1: జూన్ 1 నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్.. మారబోయే నిబంధనలివే

New Traffic Rules in India from June 1 All You Need to know: కొత్త ట్రాఫిక్ రూల్స్ 2024 జూన్ 1 నుంచి అమలు కానున్నాయి. ఇకపై ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే జేబులు గుల్ల కావడం ఖాయం. ప్రభుత్వ ప్రాంతీయ రవాణా కార్యాలయం(RTO) 2024 జూన్ 1 నుంచి కొత్త వాహన నియమాలను జారీ చేయనుంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినమైన, భారీ జరిమానాలను కూడా విధించనున్నారు. ఇదిలా ఉంటే జూన్ 1 నుంచి కొత్త డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు మారునున్న సంగతీ తెలిసిందే..

కొత్తగా వచ్చిన ట్రాఫిక్ నిబంధనలు ఈ విధంగా ఉండనున్నాయి..

కొత్త నిబంధన ప్రకారం అతి వేగంగా వాహనాలు నడిపినట్లు పట్టుబడితే రూ.1000 నుంచి 2000 వరకు జరిమానా విధించనున్నారు.

అదే సమయంలో లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

18 ఏళ్ల లోపు వారు వాహనం నడిపితే వారికి రూ. 25వేలు ఫైన్ వేస్తారు. ఇవే కాకుండా హెల్మెట్, సీటు బెల్ట్ లేకుండా వాహనాలు నడిపితే రూ.100 ఫైన్ కట్టాల్సి ఉంటుంది.

మైనర్ కి 25 ఏళ్ల వయసు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందకుండా ఆంక్షలు విధిస్తారు.

Engineering: ఇంజనీరింగ్‌లో ఏ బ్రాంచ్‌ తీసుకుంటే ఎక్కువ ప్లేస్‌మెంట్స్‌ ఉంటాయి? ప్రస్తుతం డిమాండ్‌ ఉన్న కోర్సులేంటి?

ఇంజనీరింగ్‌ కాలేజీల్లో త్వరలోనే అడ్మీషన్స్‌ జరగనున్నాయి. ఈ క్రమంలో ఏ బ్రాంచ్‌ ఎంచుకుంటే ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి? ప్రస్తుతం ట్రెండ్‌ సెట్‌ చేస్తున్న బ్రాంచ్‌లేవి?

కెరీర్‌ పరంగా ఏ బ్రాంచ్‌కి ఇప్పుడు ఎక్కువ డిమాండ్‌ ఉంది వంటి వివరాలపై JNTUH ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ విష్ణువర్థన్‌ అందించే కెరీర్‌ గైడెన్స్‌ మీకోసం..

►ఇంజనీరింగ్‌లో బ్రాంచ్‌ ఎంచుకునేటప్పుడు వాటికున్న డిమాండ్‌, ప్లేస్‌మెంట్స్‌ కూడా ముఖ్యం. ప్రస్తుతం ఏ బ్రాంచ్‌ నుంచి ఎక్కువగా ప్లేస్‌మెంట్స్‌ వస్తున్నాయి?
విష్ణువిర్ధన్‌: గత 5-10 ఏళ్లుగా CSE బ్రాంచ్‌కే ఎక్కువ ప్లేస్‌మెంట్స్‌ వస్తున్నాయి. అయితే కోర్‌ బ్రాంచ్‌లకు మంచి ప్యాకేజీలతో ప్లేస్‌మెంట్స్‌ వస్తున్నాయి. దేని ప్రాధాన్యత దానిదే.

► JNTUHలో ప్లేస్‌మెంట్స్‌ ఎలా వస్తున్నాయి? ఏ బ్రాంచ్ నుంచి ఎక్కువ మంది స్టూడెంట్స్‌ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగం దక్కించుకుంటున్నారు?
మా కాలేజీలో CSE బ్రాంచ్‌కి దాదాపు 90 శాతం ప్లేస్‌మెంట్స్‌ వచ్చాయి. మొత్తం కాలేజీ పరంగా 60 శాతం ప్లేస్‌మెంట్స్‌ వస్తుంటాయి. గతేడాది దాదాపు 80 కంపెనీలు వచ్చాయి. యావరేజ్‌గా 5-6 లక్షల ప్యాకేజీతో స్టూడెంట్స్‌ ప్లేస్‌ అవుతున్నారు.

►సాధారణంగా విద్యార్థులకు ఏ ఏడాదిలో ప్లేస్‌మెంట్స్‌ ఛాన్స్‌ దక్కుతుంది?
దాదాపుగా నాలుగో ఏడాది మొదటి సెమిస్టర్‌ నుంచి కంపెనీలు రావడం మొదలుపెడతాయి. సెలక్ట్‌ అయిన విద్యార్థులకు వాళ్లే ట్రైనింగ్‌ ఇస్తారు.

►సాఫ్ట్‌వేర్‌ సంబంధిత కంపెనీలు వస్తుంటాయా? లేద కోర్‌ కంపెనీలు కూడా వస్తుంటాయా?
రెండూ. ఇప్పుడున్న ట్రెండ్స్‌ ప్రకారం కేవలం కంప్యూటర్‌ ఆధారిత ఉద్యోగాలకే డిమాండ్‌ అనుకోవడం అపోహ మాత్రమే. కోర్‌ కంపెనీలు కూడా భారీ జీతంతో రిక్రూట్‌ చేసుకుంటాయి.

►ఇంతకుముందు CSE కి సమానంగా ECE కి కూడా డిమాండ్‌ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడంతా CSE వైపే ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. కారణం?
ECE కోర్‌ సబ్జెక్ట్స్‌ అయిన VLSI వంటి వాటిపై గ్రోత్‌ ఉంది కానీ ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉంటున్నాయి. అందుకే కంప్యూటర్‌ కోర్సుల వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు.

► కోర్‌ బ్రాంచెస్‌ అయిన సివిల్‌, మెకానికల్‌, ఈఈఈ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి?
వీళ్లకు దాదాపు 60 శాతానికి పైగా ఉ‍ద్యోగ అవకాశాలు ఉంటున్నాయి. ఇంతకుముందు మా స్టూడెంట్‌ మెటలర్జీ విద్యార్థికి 13 లక్షల అత్యధిక వేతనంతో ప్లేస్‌మెంట్‌లో కొలువు సంపాదించింది.

► ఇంజనీరింగ్‌ పూర్తవగానే చేతిలో ఉద్యోగం ఉండాలి అని భావించేవాళ్లు ఎలాంటి స్కిల్స్‌ డెవలప్‌ చేసుకుంటే మంచిది?
కమ్యూనికేషన్‌ స్కిల్స్‌లో చాలా మంచి పట్టుండాలి. టెక్నికల్‌ స్కిల్స్‌ బాగా తెలుసుండాలి. ఏ బ్రాంచ్‌కి చెందిన వాళ్లు అయినా కనీసం 1-2 కోర్‌ సబ్జెక్ట్స్‌లో మంచి నైపుణ్యం ఉండాలి. ఫైనల్‌ ఇయర్‌లో చేసే ప్రాజెక్ట్స్‌ కూడా చాలా ముఖ్యం. ఇండస్ట్రీకి అవసరమైన ప్రాజెక్ట్స్‌ తీసుకోవాలి. ఇవి ఇంటర్వ్యూలో మీకు ఆగా హెల్ప్‌ అవుతాయి.

అలెర్ట్: రేపు, ఎల్లుండి జాగ్రత్త.. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు!

మే నెల మొదటి వారంలో భానుడి ప్రతాపం మాములుగా లేదు. నిప్పుల కొలిమి మీద నడుస్తున్నామ అన్నట్లు ఎండల తీవ్రత్త ఎక్కువగా ఉండేది. అయితే కొన్ని రోజుల నుంచి వర్షాలు పడటంతో వాతావరణ చల్లబడింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కాస్తా ఉపశమనం లభించింది. అయితే మరోసారి ఎండలు విజృంభించనున్నాయి. రానున్న రెండు రోజుల్లో ఎండలు తీవ్ర స్థాయిలో ఉండనున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దని సూచించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు రోజుల నుంచి ఎండలు మండిపోతున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు చిన్నపాటి వర్షంతో కాస్తా వాతావరణం చల్లబడింది. అయితే తిరిగి మరోసారి ఎండలు తమ ప్రతాపం చూపేందుకు సిద్ధమయ్యాయి. రెండు రోజుల నుంచి పగలు బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇప్పటికే ఎంతో ఎంతో జాగ్రత్తగా ఉన్నప్పటికి రానున్న రెండు రోజులు మరింత జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.

మంగళ, బుధవార్లో రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, వడగాల్పుల ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. రాయలసీమ, దక్షిణ కోస్తాలో ఎండలు ఎక్కువగా ఉంటాయని తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లోని చాలా జిల్లాలో రానున్న 48 గంటలు తీవ్రమైన హీట్ వేవ్ ఉంటుందని స్పష్టం చేసింది. రేపు 149 మండలాల్లో తీవ్ర వడగాలులు, 160 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. వృద్ధులు , గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈరోజు తిరుపతి జిల్లాలోని సత్యవేడులో 41.9 డిగ్రీలు, నెల్లూరు జిల్లాలోని మనుబోలులో 41.5, బాపట్ల జిల్లాలోని వేమురూలు, కృష్ణా జిల్లాలోని పెడనలో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. నిన్న రాష్ట్రంలోని పలు చోట్ల 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రాబోయే రెండు రోజులు ఏపీలోని పలు ప్రాంతాల్లో వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచనలు చేసింది. పిల్లలు, పెద్దలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, నీళ్లు, ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది అని చెబుతున్నారు. మొత్తంగా రానున్న రెండు రోజులు ఏపీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఎండల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న ప్రాణాలకే ప్రమాదమని అధికారులు సూచిస్తున్నారు.

Shokalu for kids: మీ పిల్లలకు ఈ శ్లోకాలు నేర్పించండి.. జీవితంలో దేనికి భయపడరు, ఓటమి అనేది ఎరుగరు

Shokalu for kids: నేటి తరం పిల్లలకు సంస్కృతి, సంప్రదాయాల గురించి తల్లిదండ్రులు తప్పనిసరిగా వివరించాలి. సంప్రదాయ నృత్యాల నుండి ప్రతిరోజు పఠించే శ్లోకాలు, మంత్రాల వరకు అన్ని నేర్పించడం వల్ల వారికి మంచి జరుగుతుంది.

జీవితంలో ఎటువంటి పరిస్థితిని అయినా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ఓటమిని చూసి భయపడరు. దైవ ఆశీస్సులు లభిస్తాయి. సులభంగా నేర్చుకోగలిగే, హృదయానికి దగ్గరగా ఉండే కొన్ని మంత్రాలు, శ్లోకాలు ఉన్నాయి. వీటిని పిల్లలకు నేర్పించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. వాళ్లు ధైర్యంగా ఉండగలుగుతారు. ప్రతి పనిని పూర్తి సామర్థ్యంతో చేస్తారు. పిల్లలకు నేర్పించాల్సిన అత్యంత శక్తివంతమైన సంస్కృత శ్లోకాలు ఇవి.

యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత్ |

అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ ||

భగవద్గీతలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన అర్థవంతమైన శ్లోకాలలో ఇది ఒకటి. ఎప్పుడైతే ధర్మం నశించి, అధర్మం పెరుగుతుందో ఆ సమయంలో భూమిపై అవతరిస్తానని శ్రీకృష్ణుడు స్వయంగా అర్జునుడికి చెప్పాడు. భగవద్గీత లోని ఈ శ్లోకం చాలా సులభంగా పఠించవచ్చు. ధర్మంగా ఎలా ఉండాలి అనే విషయాన్ని పిల్లలకు నేర్పించాలి. సమాజంలో విలువలు, నైతికత అనేవి వారికి నేర్పించాలి.

వక్రతుండ్ మహాకాయ సూర్యకోటి సంప్రభ |

నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ।।

శివుడి కుమారుడైన గణేశుడికి అంకితం చేసిన శ్లోకం ఇది. పనులన్నింటిలోనూ ఉన్న అడ్డంకులను తొలగించమని కోరుకుంటూ వినాయకుడిని పూజిస్తూ ఈ శ్లోకం జపించడం మంచిది. ఎందుకంటే అడ్డంకులను తొలగించేవాడిగా వినాయకుడిని పిలుస్తారు. ఏదైనా కొత్త పని లేదా పరీక్షల సమయంలో ఈ ప్రార్థన చేసుకోవడం వల్ల గణేశుడి ఆశీస్సులు లభిస్తాయి. ఎటువంటి హాని జరగకుండా, అడ్డంకులు రాకుండా మీ చదువు సక్రమంగా సాగుతుంది. ఈ శ్లోకం మనిషి చేసే అన్ని ప్రయత్నాలు విజయవంతం అయ్యేలా చేసేందుకు భగవంతుడిని కోరే శక్తివంతమైన ప్రార్థన. ఈ శ్లోకాన్ని పిల్లలకు బోధించడం వల్ల ఏదైనా పనిని ప్రారంభించేముందు దేవుడు ఆశీర్వాదం తీసుకోవాలని వారికి నేర్పించడం.

అసతో మా సద్గమయ

తమసో మా జ్యోతిర్గమయ ।

మృత్యోర్మ అమృతం గమయ..||

పాఠశాలలో పిల్లలకు తప్పనిసరిగా ఈ శ్లోకాన్ని నేర్పిస్తారు. తరగతి ప్రారంభమయ్యే ముందు ఈ శ్లోకం పఠిస్తారు. అసత్యం నుండి సత్యం వైపు, చీకటి నుండి వెలుగులోకి, మరణం నుండి అమృతం వైపు నడిపించమని కోరుకుంటూ ఈ శ్లోకాన్ని జపిస్తారు. జ్ఞానోదయం, విముక్తిని అందించమని దేవుళ్ళని అభ్యర్థించడం ఈ శ్లోకం అర్థం. ఇది మనల్ని జ్ఞానమార్గంలో నడిపించడానికి నిరాశ నుంచి ఆశకు మరణ భయం నుండి విముక్తి కలిగిస్తుంది.

సర్వమంగళమాంగల్యే శివే సర్వార్థసాధికే ।

శరణ్యేత్ర్యంబకే గౌరీ నారాయణి నమోయస్తుతే ।।

ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా ఈ శ్లోకాన్ని వినే ఉంటారు. బలం రక్షణ ఇవ్వమని కోరుకుంటూ తమ కోరికలను తీర్చమంటూ దేవతలను వేడుకోవడం. దుర్గామాతకు అంకితం చేసిన ఈ శ్లోకం పిల్లలకు తప్పనిసరిగా నేర్పించాలి . ఎందుకంటే ఇది వారి మనసులో రక్షణ భావాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. ఈ మంత్రం సంక్షేమం, విజయం కోసం దీవెనలు ఇవ్వమని అమ్మవారిని వేడుకోవడం.

గురు బ్రహ్మ గురు విష్ణువు గురు దేవో మహేశ్వరః |

గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ||

చిన్నతనం నుంచి పిల్లలను తీర్చిదిద్దే ఉపాధ్యాయులందరికీ ఈ శ్లోకం అంకితం. హిందూమతంలో గురువు భగవంతుని కంటే ఉన్నతమైన స్థానాన్ని కలిగి ఉంటాడని చెప్తారు. ఈ శ్లోకం ఆ నమ్మకాన్ని సంగ్రహిస్తుంది. ఒకరి జీవితంలో గురువు అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి. అక్షరాలు నేర్పించడం నుంచి జీవిత పాఠాలు బోధించడం వరకు గురువు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. అందుకే ప్రతిరోజు గురువును కలిసినప్పుడు పిల్లలు ఈ శ్లోకం జపిస్తూ నమస్కరించడం మంచిది. ఉపాధ్యాయులు పిల్లలకు మార్గదర్శకులుగా ఉంటూ, జ్ఞానాన్ని అందిస్తారు.

కర్మాణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |

మా కర్మఫలహేతుర్భూర్మా తే సఙ్గోయస్త్వకర్మాణి ।।

భగవద్గీతలోనే మరొక అర్థవంతమైన శ్లోకం ఇది. ఈ శ్లోకం ఒకరు తాము చేస్తున్న పనులు, బాధ్యతలపై దృష్టి పెట్టడం గురించి బోధిస్తుంది. ఏదైనా పని చేపడితే అది ఎంత ఫలవంతంగా ఉంటుంది, మనకు ఏ విధంగా ప్రయోజనం చేకూరుస్తుందో వివరిస్తుంది. బాధ్యతా భావాన్ని కలిగిస్తుంది. కష్టపడి పని చేయమని చెబుతుంది

ప్రమాదంలో జగన్ ? ఎవరిని నమ్మాలో తెలియట్లేదు-లండన్ లో ఏఏజీ పొన్నవోలు కంటతడి..!

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత సీఎం జగన్ కుటుంబ సమేతంగా యూరప్ పర్యటనకు వెళ్లిపోయారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎలా జరిగాయన్న దానిపై ఐప్యాక్ టీమ్ తో భేటీలో అంతకుముందే జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

గతంలో గెలిచిన 151 సీట్ల కంటే ఈసారి ఎక్కువగా గెలువబోతున్నట్లు జగన్ వారికి తెలిపారు. దీంతో వైసీపీ నేతలు, క్యాడర్ కూడా జగన్ పై ఉన్న నమ్మకంతో ధీమాగా కనిపిస్తున్నారు.

ఇలాంటి సమయంలో జగన్ కు నమ్మిన బంటుగా పేరు తెచ్చుకున్న అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి లండన్ లో వైసీపీ ఎన్నారై నేతలతో భేటీలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. వైసీపీ ఎన్నారై నేతలను ఉద్దేశించి మాట్లాడిన అదనపు ఏజీ పొన్నవోలు ఓ దశలో కన్నీటి పర్యంతం అయ్యారు. చివరికి సదరు నేతలు ఆయనకు సర్దిచెప్పారు. దీంతో తిరిగి మాట్లాడారు. ఎన్నికల్లో తమకు అండగా నిలిచినందుకు త్వరలో కలిసి విందు చేసుకొందామని చెప్పి ఈ భేటీ ముగించారు. అయితే ఈ వ్యాఖ్యల సందర్భం ఏంటో మాత్రం వివరించలేదు.

వైసీపీ ఎన్నారై నేతలతో మాట్లాడుతూ పొన్నవోలు సుధాకర్ రెడ్డి జగన్ ప్రమాదంలో ఉన్నారని, ఆయన్ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అంతే కాదు ఎవరిని నమ్మాలో తెలియడం లేదంటూ మరో కీలక వ్యాఖ్య చేశారు. అనంతరం కంటతడి పెట్టేసారు. ఒక్క జగగన్న కోసం కాదని, పేదోళ్ల కోసం ఆయన్ను కాపాడుకోవాలన్నారు. ఆయన కష్టం తనకు తెలుసని, ఆయన ప్రమాదంలో ఉన్నారని తెలిపారు. జగన్ వినే వారు కాదని, ఏదైతే అది అవుతుందని అనుకునే వారన్నారు. మనల్ని పలకరించారా లేదా అన్నది కూడా వదిలేయాలని, ఆయన్ను కాపాడుకోవడం ఒక్కటే మన మోటివ్ అన్నారు.

ఇండేన్, HP, భారత్ గ్యాస్ వాడుతున్నారా? ఆ పని చేయకపోతే నష్టపోతారు!

ఇంట్లో గ్యాస్ సిలిండర్ లేకపోతే రోజు గడవని పరిస్థితి. ఇప్పుడు చాలా మంది ఇళ్లలో గ్యాస్ సిలిండర్లు ఉంటున్నాయి. పేదవారి కోసం సబ్సిడీ కూడా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం.

కొంతమంది బ్లాక్ మార్కెట్ లో విచ్చలవిడిగా గ్యాస్ సిలిండర్లు అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం నకిలీ కనెక్షన్స్ పై దృష్టి పెట్టింది. నకిలీ కనెక్షన్స్ కి చెక్ పెట్టేందుకు కేంద్రం కేవైసీ చేయించుకోవాలని సూచిస్తుంది. ఈ క్రమంలో పలు గ్యాస్ కంపెనీలు కస్టమర్లకు కేవైసీ చేసుకోవాలని సూచిస్తున్నాయి. ఇండేన్, హెచ్పీ, భారత్ గ్యాస్ సహా పలు గ్యాస్ కంపెనీలు వినియోగదారులకు కేవైసీ చేసుకోమని సందేశాలు పంపుతున్నాయి. వీలైనంత త్వరగా కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేస్తున్నాయి. కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటి నుంచో చెబుతూ వస్తుంది.

పెట్రోలియం మంత్రిత్వ శాఖ దీనిపై గతంలోనే నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో కేవైసీ చేసుకోకపోతే నష్టమా అంటే అలా ఏం లేదని నివేదికలు చెబుతున్నాయి కానీ ప్రభుత్వం డెడ్ లైన్ నిర్ణయిస్తే గ్యాస్ వినియోగదారులకు నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. కేవైసీకి మే 31 లాస్ట్ డేట్ అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. కానీ కేవైసీ చేసుకుంటే మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే నకిలీ కనెక్షన్స్ కి చెక్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా ఏ క్షణం అయినా నిర్ణయం తీసుకోవచ్చు. డెడ్ లైన్ పెడితే.. సమయం సరిపోకపోతే నష్టం వాటిల్లే అవకాశం ఉంది. పైగా సబ్సిడీ కూడా అందకపోవచ్చు.

కేవైసీ చేసుకోండిలా:

గ్యాస్ సిలిండర్ ని ఇంటికి తీసుకొచ్చే సిబ్బంది ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేస్తారు. బయోమెట్రిక్ ద్వారా ఆధార్ ని ధృవీకరిస్తారు. ఎల్పీజీ కనెక్షన్ తో ఆధార్ లింక్ చేసుకునేందుకు ఎటువంటి ఛార్జీలు ఉండవు. ఆన్ లైన్ లో కూడా కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. ఇండేన్ గ్యాస్ వినియోగదారులైతే కనుక.. ఇండియన్ ఆయిల్ యాప్ డౌన్ లోడ్ చేసి కేవైసీ చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో చేసుకోవడం తెలియకపోతే ఆఫ్ లైన్ లో కూడా కేవైసీ చేసుకోవచ్చు. అందుకోసం సంబంధిత డీలర్ ఆఫీస్ కి వెళ్లి ఒక ఫారం పూర్తి చేయాలి. అక్కడ కస్టమర్ పేరు, ఫోన్ నంబర్, భర్త లేదా తండ్రి పేరు వంటి వివరాలు ఇవ్వాలి. అడ్రస్ ప్రూఫ్ కింద ఆధార్ లేదా ఇతర డాక్యుమెంట్లు జత చేయాలి. దీంతో కేవైసీ ప్రక్రియ ముగుస్తుంది.

కేవైసీ చేయకుంటే రెండు రకాలుగా నష్టపోతారు:

ఇలా చేయడం వల్ల కేవైసీ డేటా మొత్తం ప్రభుత్వం దగ్గర ఉంటుంది. దీంతో నకిలీ కనెక్షన్స్ అనేవి బయటపడి బ్లాక్ మార్కెట్ తగ్గుతుంది. దీని వల్ల ప్రభుత్వానికి ప్రయోజనం చేకూరడమే కాకుండా భవిష్యత్తులో పేదల కోసం మేలు చేకూర్చే నిర్ణయం తీసుకునే అవకాశం ఉండచ్చు. బ్లాక్ మార్కెట్ ని ఆపితే సరైన సమయానికి నిరుపేదలకు గ్యాస్ సిలిండర్లు అందుతాయి. ప్రస్తుతం ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద అర్హులైన పేదలకు రూ. 300 సబ్సిడీ వస్తుంది. ఈ సబ్సిడీ కోసమైనా పేదలు తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాలి. కేవైసీకి డెడ్ లైన్ లేదు కదా అని నిర్లక్ష్యం చేస్తే బ్లాక్ మార్కెట్ దందా వల్ల పేద ప్రజలకు సకాలంలో గ్యాస్ సిలిండర్లు రావు. ఒకవేళ ప్రభుత్వం కనుక గడువు తేదీ నిర్ణయిస్తే కనుక కేవైసీ చేయించుకోలేకపోతే రూ. 300 సబ్సిడీని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి సకాలంలో గ్యాస్ సిలిండర్లు రావాలన్నా లేదా సబ్సిడీ కోల్పోకుండా ఉండాలన్న ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్పీ గ్యాస్ వంటి కంపెనీల సిలిండర్లు వాడే కస్టమర్లు.. వీలైనంత త్వరగా కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవడం మంచిది.

Prajwal Revanna: నన్ను క్షమించండి.. విచారణకు హాజరవుతా: ప్రజ్వల్‌ రేవణ్ణ

లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ (Prajwal Revanna) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆయన.. కేసు విచారణకు సహకరిస్తానని, శుక్రవారం (మే 31న) ‘సిట్‌’ ముందు వ్యక్తిగతంగా హాజరవుతానంటూ తొలిసారి ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ‘‘నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. నాపై తప్పుడు కేసులు బనాయించారు. ఇవన్నీ రాజకీయ కుట్రలో భాగమే. ఇప్పటికే కుంగుబాటుకు లోనయ్యాను. అయితే, న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది’’ అని తెలిపారు.

తన ఆచూకీ చెప్పనందుకు.. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, జేడీఎస్‌ శ్రేణులకు ప్రజ్వల్‌ క్షమాపణలు చెప్పారు. ‘‘విదేశాల్లో ఎక్కడున్నానో సరైన సమాచారం ఇవ్వనందుకు కుటుంబసభ్యులకు, కుమారస్వామికి, పార్టీ కార్యకర్తలకు క్షమాపణలు చెబుతున్నా. ఏప్రిల్ 26న పోలింగ్‌ ముగిసినప్పుడు నాపై ఎటువంటి కేసు లేదు. ఆ తర్వాత రెండు, మూడు రోజులకు ఆరోపణలు వెల్లువెత్తినట్లు చూశాను’’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇతర సీనియర్ నాయకులూ తనపై వచ్చిన ఆరోపణలపై బహిరంగంగా మాట్లాడారని, ఇది రాజకీయ కుట్రేనని ఆరోపించారు.

ఎన్డీయే కూటమి అభ్యర్థిగా హాసన నుంచి పోటీ చేసిన ప్రజ్వల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయనకు సంబంధించినవిగా చెబుతున్న కొన్ని అభ్యంతరకర వీడియోలు వెలుగులోకి రావడమే గాక.. బాధిత మహిళలు ఒక్కొక్కరిగా బయటకు వచ్చి ఆయనపై ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలోనే కర్ణాటకలో ఆయనపై అత్యాచారం, కిడ్నాప్‌ కేసు నమోదైంది. అయితే.. ఏప్రిల్‌ 27నే ప్రజ్వల్‌ దేశం విడిచి జర్మనీ వెళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి.

పరారై.. నెల రోజులు..!
ప్రజ్వల్‌ విదేశాలకు పరారై నెల రోజులైనా.. ఇప్పటివరకు ఆయన ఆచూకీని ప్రత్యేక దర్యాప్తు బృందం గుర్తించలేకపోయింది. నాలుగుసార్లు నోటీసులు, ఒక అరెస్టు వారెంటు, బ్లూ కార్నర్, రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ అయ్యాయి. దౌత్య పాస్‌పోర్టు రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు చేపట్టింది. విచారణకు హాజరు కావాలని ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణ, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ బహిరంగ విన్నపాలు చేసుకున్నా అటునుంచి స్పందన లభించలేదు. సరిగ్గా నెల రోజులకు ప్రజ్వల్‌ ఈమేరకు స్పందించారు.

Government Schemes: బ్యాంకు ఎఫ్‌డీ కంటే ఎక్కువ సంపాదించే 5 ప్రభుత్వ పథకాలు ఇవే..!

ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి పోస్టాఫీసు స్మాల్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేట్లను మారుస్తుంది. ఏప్రిల్-జూన్ 2024 త్రైమాసికానికి ఈ చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు లేదు. విశేషమేమిటంటే చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు లేనప్పటికీ, ప్రభుత్వ బ్యాంకుల ఎఫ్‌డిలతో పోలిస్తే అవి మెరుగైన రాబడిని ఇస్తున్నాయి. పోస్ట్ ఆఫీస్ చిన్న పొదుపు పథకం పెట్టుబడిదారులకు 8.2 శాతం వరకు రాబడిని ఇస్తుంది. ఇది కాకుండా, ఈ ప్రభుత్వ పథకాలు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలను కూడా అందిస్తాయి. ఈ రోజు మనం బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడిని ఇచ్చే పోస్టాఫీసు 5 చిన్న పొదుపు పథకాల గురించి తెలుసుకుందాం.

సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్:
సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ అనేది భారత ప్రభుత్వానికి చెందిన పథకం. భారతదేశంలో నివసిస్తున్న సీనియర్ సిటిజన్లు ఈ పథకంలో తమ ఖాతాను తెరవవచ్చు. ఈ పథకంలో ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే, పెట్టుబడిదారులు వ్యక్తిగత, ఉమ్మడి ఖాతాలను తెరవవచ్చు. ఈ పథకంలో పన్ను ప్రయోజనం మాత్రమే కాకుండా సాధారణ ఆదాయం కూడా అందుబాటులో ఉంటుంది. ఈ పథకం వార్షిక రాబడి 8.2 శాతం ఇస్తోంది. ఇండియా పోస్ట్ వెబ్‌సైట్ ప్రకారం.. ఖాతాలో కనీసం రూ.1,000 పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ట పరిమితి రూ. 30 లక్షలు.

కిసాన్ వికాస్ పత్ర:
కిసాన్ వికాస్ పత్ర అనేది భారత ప్రభుత్వం జారీ చేసిన పొదుపు ధృవీకరణ పత్రం. ఈ పథకం స్థిర వడ్డీ రేటు, హామీతో కూడిన రాబడిని అందిస్తుంది. ఈ పథకంలో పన్ను ప్రయోజనం లేదు. కిసాన్‌ వికాస్‌ పత్రలో పెట్టుబడిదారులు సంవత్సరానికి 7.5 శాతం చక్రవడ్డీని పొందుతారు. పెట్టుబడి మొత్తం 115 నెలలు లేదా 9 సంవత్సరాల 7 నెలల్లో రెట్టింపు అవుతుంది. ఈ పథకంలో కనీస పెట్టుబడి రూ. 1000, గరిష్ట పెట్టుబడిపై పరిమితి లేదు.

నెలవారీ ఆదాయ పథకం:
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ పెట్టుబడిదారులకు స్థిరమైన ఆదాయాన్ని సంపాదించడానికి అవకాశాన్ని ఇస్తుంది. ఇందులో కనీసం రూ.1,500, గరిష్టంగా రూ.9 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. మీరు ఉమ్మడి ఖాతాను తెరిస్తే, దాని గరిష్ట పరిమితి రూ. 15 లక్షలు. ఈ పథకంలో పెట్టుబడిదారుడికి 80C కింద పన్ను మినహాయింపు లభించదు. ఈ పథకంలో పెట్టుబడిదారులు ప్రతి నెలా ఇచ్చే 7.4 శాతం వార్షిక రాబడిని పొందుతారు.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్:
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్‌లో కూడా పెట్టుబడిదారుల డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. దీనితో పాటు, పెట్టుబడిదారుడు హామీతో కూడిన రాబడిని కూడా పొందుతారు. ఈ పథకంలో పెట్టుబడిదారులు 7.7 శాతం సమ్మేళనం వడ్డీని పొందుతారు. అయితే మెచ్యూరిటీ తర్వాత వడ్డీ మొత్తం అందుతుంది. వ్యక్తిగత ఖాతాతో పాటు, ముగ్గురు వ్యక్తులు ఉమ్మడి ఖాతాను కూడా తెరవవచ్చు. ఒక సంరక్షకుడు మైనర్ లేదా మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి తరపున NSC ఖాతాను నిర్వహించవచ్చు. పథకం కింద కనిష్టంగా రూ. 1,000, గరిష్ట పెట్టుబడిపై పరిమితి లేదు. పథకం కింద ఎన్ని ఖాతాలనైనా తెరవవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం వలన 80C కింద పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది.

మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్:
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ అనేది భారతీయ మహిళల్లో పొదుపు సంస్కృతిని పెంపొందించడానికి ఉద్దేశించిన ప్రభుత్వ పథఖం. అయితే ఈ పథకంలో పన్ను ప్రయోజనం లేదు. ఈ పథకంలో వచ్చే వడ్డీపై పన్ను విధించబడుతుంది. ఇందులో వ్యక్తి ఆదాయ స్లాబ్ ఆధారంగా పన్ను మినహాయించబడుతుంది. ఈ పథకంపై పెట్టుబడిదారుడికి 7.5 శాతం వడ్డీ లభిస్తుంది.

Mukesh Ambani: అంబానీ మరో సంచలన నిర్ణయం.. వార్షిక ప్లాన్‌ రూ.299.. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌లకు పెద్ద దెబ్బ

నెట్‌ఫ్లిక్స్-అమెజాన్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు ముఖేష్ అంబానీ సరికొత్త ప్లాన్‌ వేశారు. వాస్తవానికి, రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని ముఖేష్ అంబానీ మరోసారి పెద్ద వ్యాపారంలోకి దిగేందుకు ప్రయత్నిస్తూ నెట్‌ఫ్లిక్స్-అమెజాన్ వంటి పెద్ద ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు ఎదురుదెబ్బ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. రిలయన్స్ జియో తన వినియోగదారులకు భారీ బహుమతిని అందించింది. కంపెనీ ప్రీమియం యాన్యువల్ పేరుతో కొత్త యాడ్-ఫ్రీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ వార్షిక ధర రూ. 299.

నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వార్షిక ప్లాన్‌లు వేలకు వేలు ఖర్చవుతుండగా, ముఖేష్ అంబానీ కేవలం రూ. 299కి OTT ప్లాట్‌ఫారమ్ Jio సినిమా వార్షిక ప్లాన్‌ను ప్రారంభించడం ద్వారా ఈ కంపెనీలకు పెద్ద దెబ్బే అని చెప్పాలి.

మీరు రూ.299తో 12 నెలల పాటు ఆనందించవచ్చు:

మీడియా నివేదికల ప్రకారం, రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం ఎటువంటి ప్రకటనలు లేకుండా కొత్త ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ప్రీమియం కంటెంట్ కోసం ఇది అత్యంత సరసమైన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లలో ఒకటిగా పరిగణిస్తారు. కొత్త యాడ్-రహిత ప్రీమియం ప్లాన్ ధర 12 నెలల కాలానికి రూ.299. ప్రకటన రహిత కంటెంట్‌ను ఆస్వాదించాలనుకునే వినియోగదారులకు ఇది అనుకూలంగా ఉంటుంది.

జియో ప్రీమియం వార్షిక ప్రణాళిక

కొత్త ప్రీమియం వార్షిక ప్లాన్‌తో మీరు ఒక సంవత్సరం పాటు ఎలాంటి ప్రకటనలు లేకుండా ‘ప్రీమియం’తో సహా మొత్తం కంటెంట్‌ను చూడవచ్చు. ఇది కాకుండా మీరు 4K నాణ్యతతో కంటెంట్‌ను ఆస్వాదించవచ్చు. మీరు మొబైల్ యాప్‌లో ఆఫ్‌లైన్ మోడ్‌లో కంటెంట్‌ను చూడవచ్చు. ఈ ప్లాన్‌లో కనెక్ట్ చేయబడిన టీవీతో సహా ఏదైనా పరికరంలో ప్రత్యేకమైన సిరీస్‌లు, చలనచిత్రాలు, హాలీవుడ్ కంటెంట్, పిల్లల షోలు, టీవీ వినోదాలను చూసే సదుపాయాన్ని కస్టమర్‌లు పొందుతారు.

వార్షిక ప్రీమియం జియోసినిమా ప్లాన్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. మీరు JioCinema అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా దీనికి సబ్‌స్క్రయిబ్ చేసుకోవచ్చు. అయితే ఇది ఒక స్క్రీన్ లేదా అంతకంటే ఎక్కువ యాక్సెస్‌ను అందిస్తుందా అనేది జియో స్పష్టం చేయలేదు.

నెలవారీ ప్లాన్ కంటే వార్షిక ప్లాన్ చాలా చౌకగా..

JioCinema అందించే వార్షిక ప్లాన్ నెలవారీ ప్లాన్ కంటే మెరుగైనది. ప్రమోషనల్ ఆఫర్‌ల కారణంగా నెలవారీ సింగిల్ స్క్రీన్ ప్లాన్ ధర నెలకు రూ.29. అయితే, వార్షిక లెక్కింపు చేసినప్పుడు ఇది మొత్తం రూ. 348కి వస్తుంది. ఇది కొత్త రూ.299 ప్లాన్ కంటే రూ.49 ఎక్కువ. నెలకు సాధారణ ధర రూ.59 కంటే కొత్త ప్లాన్ చాలా సరసమైనది.

నెట్‌ఫ్లిక్స్-అమెజాన్ పరిస్థితి

నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ గురించి మాట్లాడితే, వారి సబ్‌స్క్రిప్షన్ పొందడానికి మీరు కనీసం రూ.99 నుండి రూ.149 వరకు చెల్లించాలి. దీని తర్వాత, ఫీచర్లు, వీడియో నాణ్యత ప్రకారం ప్లాన్ ధర పెరుగుతూనే ఉంటుంది.

అప్పు చేసి జిరాక్స్‌ షాప్‌.. వందల కోట్ల వ్యాపారవేత్త సక్సెస్‌ స్టోరీ

ఎక్కడ మొదలు పెట్టాం అన్నది ముఖ్యం కాదు.. ఎక్కడికి చేరుకున్నాం అన్నదే ప్రధానం. పట్టుదల, కృషి, తెలివితేటలతో వ్యాపార రంగంలో ఉన్నత శిఖరాలకు చేరిన ఎందరో వ్యాపారవేత్తలు ఉన్నారు.

అయితే నడకకు దూరం చేసిన విధికి తన విజయంతో గుణపాఠం చెప్పిన స్ఫూర్తిదాయక వ్యాపారవేత్త విశాల్ మెగా మార్ట్ వ్యవస్థాపకుడు రామచంద్ర అగర్వాల్.

పోలియో బాధితుడైన రామచంద్ర తన వైకల్యానికి ఎప్పుడూ కుంగిపోలేదు. తన కాళ్ల మీద తాను నిలబడాలన్న కసితో తెలిసినవారి వద్ద అప్పు చేసి 1986లో ఒక చిన్న ఫోటోస్టాట్ దుకాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత కోల్‌కతాలో 15 ఏళ్ల పాటు బట్టల వ్యాపారం చేశారు. అక్కడి నుంచి ఢిల్లీకి మకాం మార్చిన ఆయన 2001-02లో విశాల్ రిటైల్ సంస్థను స్థాపించారు. ఆ వ్యాపారంలో విజయం సాధించి క్రమంగా విశాల్ రిటైల్స్ విశాల్ మెగా మార్ట్ గా మారింది.

రెండో దెబ్బ
రూ.1000 కోట్ల ల ఆయన కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. అయితే 2008లో స్టాక్ మార్కెట్ పతనం కారణంగా ఆయన కంపెనీ విశాల్ మెగా మార్ట్ అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో ఆయన తన కంపెనీని శ్రీరామ్ గ్రూపునకు విక్రయించాల్సి వచ్చింది. ఎవరైనా అయితే ఇంత పెద్ద దెబ్బ తగిలితే ఇక్కడితో ఆగిపోతారు. కానీ రామచంద్ర అలా ఆగిపోలేదు.

మరోసారి విధి కొట్టిన దెబ్బను తట్టుకుని ముందుకు సాగి వీ2 రిటైల్‌ సంస్థను స్థాపించి రిటైల్ మార్కెట్లో మరోసారి తనదైన ముద్ర వేశారు. ఆయన కంపెనీ వీ2 రిటైల్ మార్కెట్ ప్రస్తుతం దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైల్ కంపెనీలలో ఒకటిగా ఉంది. రూ .800 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది.

ఈ పొడి సర్వరోగ నివారిణి.. రోజుకు అర స్పూన్ తీసుకున్న బోలెడు ఆరోగ్య లాభాలు

ఇటీవల కాలంలో మధుమేహం, ఊబకాయం, రక్తపోటు, క్యాన్సర్ ( Diabetes, obesity, hypertension, cancer )ఇలా ఎన్నో జబ్బులు మానవుల్ని పట్టి పీడిస్తున్నాయి.

ఈ జబ్బులు శారీరకంగానే కాకుండా మానసికంగా మరియు ఆర్థికంగా కూడా దెబ్బతీస్తున్నాయి. వీటికి దూరంగా ఉండాలి అంటే కచ్చితంగా ఆరోగ్యమైన జీవన శైలిని అలవాటు చేసుకోవాలి. మంచి ఆహారాన్ని తీసుకోవాలి. నిత్యం వ్యాయామం చేయాలి. అలాగే ఇప్పుడు చెప్పబోయే పొడి సర్వరోగ నివారిణిగా పనిచేస్తుంది. ఈ పొడిని నిత్యం అర స్పూన్ చొప్పున తీసుకున్న చాలు బోలెడు ఆరోగ్య లాభాలు పొందుతారు.

అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక చిన్న కప్పు మెంతులు( fenugreek ) వేసి దోరగా వేయించుకుని తీసుకోవాలి. ఆ తర్వాత అదే పాన్ లో ఆర కప్పు వాము మరియు పావు కప్పు నల్ల జీలకర్ర( Black cumin ) విడివిడిగా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో మెంతులు. వాము( Ajwain ) మరియు నల్ల జీలకర్ర వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని ఒక టైట్ జార్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.

రోజు నైట్ డిన్నర్ పూర్తి చేశాక ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర స్పూన్ తయారు చేసుకున్న పొడిని కలిపి తీసుకోవాలి. ఆపై ఎటువంటి ఆహారం తీసుకోకూడదు. మెంతులు, వాము, నల్ల జీలకర్ర ఈ మూడింటి కలయిక మన శరీరంలో ఎన్నో అద్భుతాలను సృష్టిస్తుంది. నిత్యం మెంతులు వాము జీలకర్ర పొడిని తీసుకోవడం వల్ల శరీరంలో పెరిగిపోయిన విష పదార్థాలు బయటకు తొలగిపోతాయి. మధుమేహం ఉన్నవారికి ఈ పొడి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. అలాగే ఈ పొడిని రోజు తీసుకోవడం వల్ల బ్యాడ్‌ కొలెస్ట్రాల్ కరుగుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది. అంతేకాదు ఊబకాయం నుంచి బయటపడడానికి, క్యాన్సర్ రిస్క్ ను తగ్గించడానికి, హార్మోన్లలో హెచ్చుతగ్గులను సరి చేయడానికి, రోగ నిరోధక వ్యవస్థను బలపరచడానికి కూడా ఈ పొడి అద్భుతంగా సహాయపడుతుంది. కాబట్టి సర్వరోగ నివారిణి ఆయన ఈ పొడిని తప్పకుండా రెగ్యులర్ డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.

ప్రాణాలు తీస్తున్న డేంజర్ సాల్ట్.. మహిళల కంటే పురుషులే ఎక్కువ మంది చనిపోతున్నారట..

ఉప్పు చేసే మేలు కంటే.. కీడే ఎక్కువ.. అందుకే.. ఉప్పు ఆరోగ్యానికి పెను ముప్పుగా మారుతోందని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తంచేసింది.. వాస్తవానికి డబ్ల్యూహెచ్ఓ తరచుగా ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని సిఫార్సులను జారీ చేస్తుంది.

ఏ వ్యాధి నుంచి జాగ్రత్తగా ఉండాలి? ఏ వ్యాధి తీవ్రమైనది.. ఏది కాదు అనే సమాచారాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తరచూ అందిస్తుంది.. ఇది కాకుండా, పౌరులు ఎలాంటి ఆహారాలు తినాలి.. ఏమి తినకూడదు అనే సమాచారాన్ని కూడా తరచుగా అందిస్తుంది. ఈ సమయంలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉప్పు గురించి ముఖ్యమైన సమాచారాన్ని పంచుకుంది. ముఖ్యంగా ఉప్పు ఎక్కువగా తినే వారికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. దీని ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఉప్పు తినే వ్యక్తులకు ఏమి జరిగింది? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎందుకు ఈ సమాచారాన్ని వెల్లడించింది.. ఉప్పు ఆరోగ్యానికి ఎలా హాని కలిగిస్తుంది.. అనే వివరాలను ఇప్పుడు తెలుసుకోండి..

ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులకు సంబంధించిన వ్యాధులు పెరుగుతున్నందున ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ హెచ్చరిక చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఐరోపాలో ప్రతిరోజూ కనీసం 10,000 మంది గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారు. అంటే ఏటా 40 లక్షల మంది గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారన్నమాట.. అంటే యూరప్‌లోని మొత్తం మరణాలలో 40 శాతం గుండె జబ్బుల కారణంగానే సంభవిస్తున్నాయి.

9 లక్షల మరణాలను నివారించవచ్చు..

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ మరణాలు సంభవిస్తున్నాయి.. ఉప్పు తీసుకోవడం తగ్గించడం ద్వారా ఈ సంఖ్యను తగ్గించవచ్చు. రోజూ తీసుకునే ఉప్పులో కనీసం 25 శాతం తగ్గించాలి. అలా జరిగితే 2030 నాటికి 9 లక్షల మరణాలను అరికట్టవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరోపియన్ డైరెక్టర్ హన్స్ క్లూగే తెలిపారు.

ఒక టీస్పూన్ ఉప్పు సరిపోతుంది

ఐరోపాలో 30 నుంచి 79 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ముగ్గురిలో ఒకరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఉప్పు.. ఐరోపాలో, 53 దేశాలలో 51 దేశాలు రోజువారీ ఉప్పును 5 గ్రాముల కంటే ఎక్కువగా తీసుకుంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ 5 గ్రాముల ఉప్పు లేదా అంతకంటే తక్కువ తినాలని సిఫార్సు చేస్తోంది. అంటే, ఒక టీస్పూన్ లేదా అంతకంటే తక్కువ ఉప్పు తీసుకోవడం మంచిది. కానీ ఐరోపాలో దీనిని విస్మరించి ఎక్కువగా వినియోగిస్తున్నారు.. యూరోపియన్లు ప్రాసెస్ చేసిన ఆహారాలు, స్నాక్స్ తినడానికి ఇష్టపడతారు. వీటిలో అత్యధిక మొత్తంలో ఉప్పు ఉంటుంది. అందుకని ఈ ఆహారాలు తినడం మానుకోవాలని సూచించింది.

చనిపోయినవారిలో మగవారే ఎక్కువ

ఉప్పు ఎక్కువగా తినడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇది గుండె జబ్బులకు దారి తీస్తుంది. క్రమంగా గుండెపోటు రావచ్చని ఆరోగ్య సంస్థ చెబుతోంది. ప్రపంచంలోనే అత్యధిక రక్తపోటు రోగులు యూరప్‌లో ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. గుండె జబ్బుల వల్ల మహిళల కంటే పురుషులే ఎక్కువగా మరణిస్తున్నారు. ఈ నిష్పత్తి 2.5 గా ఉన్నట్లు పేర్కొంది.

ఉప్పు తినడం ప్రమాదకరం..

30 నుంచి 69 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు పశ్చిమ ఐరోపాలో కంటే తూర్పు ఐరోపా, మధ్య ఆసియాలో గుండె జబ్బులతో చనిపోయే అవకాశం ఐదు శాతం ఎక్కువ. ఉప్పు తినడం ఎంత ప్రమాదకరమో స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ గణాంకాలు ఐరోపాకు చెందినవే అయినప్పటికీ.. ఏ దేశంలోనైనా ఎవరైనా ఉప్పు ఎక్కువగా తీసుకుంటే, వారు గుండె జబ్బులను ఎదుర్కోవలసి ఉంటుంది. అందువల్ల ఉప్పును మితంగా తినాలని ఆరోగ్య సంస్థ సూచిస్తోంది.

Actor Karthik Kumar – Suchitra: తనను ‘గే’ అన్నందుకు మాజీ భార్యపై కోటి రూపాయల పరువు నష్టం కేసు వేసిన నటుడు

Karthik Files One Crore Defamation Case Against Ex Wife Suchitra: సింగర్ సుచిత్రకు సంబంధించిన వార్తలు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఆమె తన మాజీ భర్తపై చేసిన ఆరోపణల నేపథ్యంలో అతడు లీగ‌ల్ నోటీసులు పంపాడు. ఈ మేరకు ఆమెపై పరువు నష్టం కేసు వేశాడు. ఇంతకీ ఆమె ఏ వాఖ్యలు చేసినందుకు పరువునష్టం కేసు వేశాడు. ఎంత వేశాడు అనే విషయానికొస్తే..

సింగర్ సుచిత్రం ఈ మధ్య ఎక్కడ విన్నా ఈ పేరే వినిపిస్తోంది. ప్లే బ్యాక్ సింగర్‌గా రంగం ప్రవేశం చేసిన ఆమె.. ఆ తర్వాత కోలీవుడ్‌లో పలు బ్లాక్ బస్టర్ సినిమాల్లో తన సాంగ్‌లతో ఫుల్ క్రేజ్ అండ్ పాపులారిటీ సంపాదించుకుంది. మన్మధన్, కాక్క కాక్క, జేజే, పోకిరి, వల్లవన్ వంటి సినిమాల్లో తన స్వరంతో సినీ ప్రియుల్ని ఉర్రూతలూగించింది. కోలీవుడ్‌లోనే కాకుండా తెలుగులోనూ ఎన్నో సినిమాల్లో పాడి ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది.

అంతేకాకుండా ఓ వైపు సింగర్‌గా చూస్తూ మరోవైపు సినిమాల్లో కూడా నటించింది. డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా తనదైన శైలిలో దూసుకుపోయింది. అయితే తన కెరీర్ పీక్స్‌లో ఉందన్న సమయంలో ‘సుచి లీక్స్’ పేరుతో కోలీవుడ్‌లో పెను సంచలనం సృష్టించింది. సెలబ్రిటీల ప్రైవేట్ ఫొటోలను, వీడియోలను లీక్ చేసి ఇండస్ట్రీని షేక్ చేసింది. అయితే ఇదే విషయంపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడింది. అంతేకాకుండా తన మాజీ భర్త నటుడు కార్తీక్ కుమార్‌పై కూడా పలు ఆరోపణలు చేసింది. ఇందులో భాగంగానే తన మాజీ భర్త ‘గే’ (స్వలింగ సంపర్కుడు) అంటూ ఆ ఇంటర్వ్యూలో పేర్కొంది. అంతేకాకుండా నటుడు ధనుష్, కార్తీక్ కలిసి అర్థరాత్రి మగవాళ్లతో పార్టీలు చేసుకుంటారని తెలిపింది. అయితే ఈ వార్తలపై ఆ మధ్య సింగర్ సుచిత్ర మాజీ భర్త కార్తీక్ స్పందించిన విషయం తెలిసిందే.

‘‘నేను గే నా? ఒకవేళ స్వలింగ సంపర్కుడిని అయ్యుంటే దాన్ని బయటకు చెప్పుకోవడానికి నాకు ఎలాంటి సిగ్గు లేదు. అది ఎలాంటిది అయినా గర్వంగా చెప్పుకునే వాడిని’’ అంటూ తెలుపుతూ ఓ వీడియో కూడా రిలీజ్ చేశాడు. అయితే కార్తీక్ అక్కడితో ఆగలేదు. తన మాజీ భార్య సుచిత్రకు లీగల్ నోటీసులు పంపించాడు. మోహిని షూటింగ్ టైంలో నటుడు ధనుష్‌తో తన మాజీ భర్త కార్తీక్‌కు ఉన్న రిలేషన్‌పై తనకు అనుమానాలు ఉన్నాయని.. అలాగే కార్తీక్ స్వలింగ సంపర్కుడని పేర్కొనడంతో సుచిత్రపై కార్తీక్ పరువు నష్టం కేసు వేశాడు.

తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించినందున రూ.1 కోటి నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ తన న్యాయవాది ద్వారా సుచిత్రకు మే 16న లీగల్ నోటీసులు పంపించాడు. ఈ కేసుపై మే 24న విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు.. ఇకనుంచి కార్తీక్‌పై ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయకుండా సుచిత్రపై న్యాయమూర్తి మధ్యంతర నిషేధం విధించారు. ఈ కేసు తదుపరి విచారణను జూలై 1కి వాయిదా వేశారు.

వైఎస్ జగన్‌పై రాయిదాడి కేసు.. నిందితుడి బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి మీద రాయిదాడి కేసులో నిందితుడు సతీష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విజయవాడ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సతీష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ మీద విజయవాడ కోర్టులో సోమవారం విచారణ జరిగింది. విజయవాడలోని 8వ అదనపు జిల్లా న్యాయస్థానంలో నిందితుడు సతీష్ తరుఫున లాయర్ సలీమ్ వాదనలు వినిపించారు. సతీష్ నిరపరాధి అని.. పోలీసులు ఈ కేసులో అతన్ని ఇరికించారంటూ వాదనలు వినిపించారు. అయితే సతీష్ కావాలనే ముఖ్యమంత్రి మీద దాడి చేశారంటూ ప్రభుత్వం తరుఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఇక ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. తీర్పును రిజర్వ్ చేశారు. బెయిల్ పిటిషన్‌కు సంబంధించి రేపు (మంగళవారం) కీలక ఉత్తర్వులు వెలువరించే అవకాశం ఉంది.

మరోవైపు ఎన్నికల ప్రచారం సమయంలో వైఎస్ జగన్ మీద రాయిదాడి జరిగింది. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా విజయవాడలో సీఎం జగన్ పర్యటించిన సమయంలో రాయితో దాడి చేశారు. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ సమీపంలో నిర్వహించిన రోడ్‌షోలో సీఎం జగన్ మీద రాయి విసిరారు. ఈ ఘటనలో వైఎస్ జగన్ ఎడమకన్ను పైభాగంలో గాయమైంది. జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి కన్నుకు కూడా గాయమైంది. అయితే అప్పట్లో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఈ ఘటనపై ఎమ్మెల్యే వెల్లంపల్లి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు . దర్యాప్తులో రాయి విసిరిన వ్యక్తి అజిత్‌సింగ్‌నగర్‌ వడ్డెర కాలనీకి చెందిన సతీష్‌కుమార్‌‌గా గుర్తించి అరెస్ట్ చేశారు. వైఎస్ జగన్ రోడ్‌షో సమయంలో సతీష్‌ తన జేబులో నుంచి కాంక్రీట్‌ రాయిని తీసి సీఎంను లక్ష్యంగా చేసుకుని విసిరినట్లు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. అనంతరం కోర్టు ఎదుట హాజరుపరచగా.. కోర్డు కస్టడీకి అప్పగించింది. అప్పటి నుంచి రిమాండ్‌లో ఉన్న సతీష్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా.. ఆ పిటిషన్ మీద విజయవాడ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.

Health

సినిమా