Saturday, November 16, 2024

Credit Card: క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు తీస్తున్నారా.. కన్వినెన్స్ ఫీజును ఇలా తప్పించుకోండి..!

Credit Card: క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు తీస్తున్నారా.. కన్వినెన్స్ ఫీజును ఇలా తప్పించుకోండి..!

Credit Card: బ్యాంకింగ్ లింకేజీ తర్వాత వినియోగదారులకు క్రెడిట్ కార్డులను ఎక్కువగా జారీ చేసింది. దీంతో పట్టణం నుంచి పల్లె టూరి వరకు క్రెడిట్ కార్డుల వాడకం పెరిగింది. ఈ క్రెడిట్ కార్డుల్లో కూడా డిఫరెంట్ టైప్స్ అందజేశాయి బ్యాంకులు. షాపింగ్ కు ఒక రకమైనవి.. ట్రావెలంగ్ కు ఒక రకమైనవి అందజేశాయి. కస్టమర్ యూసేజ్ ను బట్టి వాటి క్యాష్ లిమిట్ ను పెంచుకుంటూ పోతున్నాయి.

అయితే, భారత్ లో ఎక్కువ మంది క్రెడిట్ కార్డులను వాడడం ప్రారంభించారు. పట్టణాల నుంచి పల్లెల వరకు కార్డుల సంఖ్య ఎక్కువైంది. దీనికి తోడు క్రెడిట్ రూపే కార్డులు రావడంతో చిన్న చిన్న కిరాణా షాపుల్లో కూడా ఈ కార్డులతో బిల్లు కట్టి నెల తర్వాత కార్డులో కట్టుకుంటున్నారు. డ్యూ టైములో కడితే ఎటువంటి అదనపు చెల్లింపులు లేకపోవడంతో ఎక్కువ మంది క్రెడిట్ కార్డులను వాడుతున్నారు.

రైతులకు కూడా క్రెడిట్ కార్డులు ఇస్తున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డుగా పిలుచుకునే ఈ కార్డులతో రైతులు వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులైన విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేయవచ్చు. దీంతో భారీ ప్రయోజనాలు కల్పించారు. అయితే క్రెడిట్ కార్డులు చేతిలో ఉన్నాయనే ధీమా ప్రతి ఒక్కరికి ఉంది. కానీ ఇవి కేవలం వాడకం కోసం మాత్రమే వీటి నుంచి డబ్బు తీస్తే మాత్రం కన్వినెన్స్ ఫీజు అని బ్యాంకులు అదనపు భారం మోపుతాయి. ఏదైనా మెడికల్, ఇంకేమైనా ఎమర్జన్సీ టైములో ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చు. లేదంటే కార్డు నుంచి బ్యాంకుకు డబ్బులను ట్రాన్స్ ఫర్ చేయవచ్చు కానీ కన్వినెన్స్ ఫీజు రూపంలో 3 శాతం వరకు అదనపు భారం పడుతుంది. దీని నుంచి తప్పించుకునేందుకు ఒక చిట్కా ఉంది.

హౌజింగ్.కామ్ అనేయాప్ ద్వారా క్రెడిట్ కార్డుల నుంచి బ్యాంకుకు డబ్బులను ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. ఇందులోకి వెళ్లి ఎడ్యుకేషన్ ఫీజ్ ను క్లిక్ చేసి మన బ్యాంక్ అకౌంట్ వివరాలను నమోదు చేసి HS50 అని టైప్ చేసి ట్రాన్స్ ఫర్ చేస్తే కన్వినెన్స్ ఫీజుపై 50 శాతం సబ్సిడీ వస్తుంది. మిగిలిన 50 శాతం వాలెట్ లో యాడ్ అవుతుంది. ఈ డబ్బును మరోసారి వాడుకోవచ్చు. ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మాత్రమే దీన్ని వాడి డబ్బు తీసుకోవచ్చు.

Mahindra Thar కార్ల ధరలకు రెక్కలు.. బేస్ వేరియంట్లపై భారీగా పెంపు..

మహింద్రా థార్ కు దేశంలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కారు అమ్మకాలలో దూసుకుపోతూ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. దేశీయ తయారీ సంస్థ మహింద్రా నుంచి విడుదలైన ఈ కారు మంచి డిజైన్, అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. అయితే మార్కెట్ లోని కొన్ని థార్ బేస్ వేరియంట్ల ధరలు పెరిగాయి. పాత ధరకు రూ.10 వేల వరకూ ఎక్కువగా మారాయి. పెరిగిన మార్పులలో ఈ కారు రూ.11.35 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది.

Brand expansion..
మహింద్రా కంపెనీ మార్కెట్లో తన బ్రాండ్ ను విస్తరించేందుకు అనేక చర్యలు తీసుకుంటోంది. లేటెస్త్ ఫీచర్లతో వినియోగదారులకు అవసరమైన విధంగా కార్లను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ఎస్ యూవీ సిగ్మెంట్ లో ఎక్స్ యూవీ 3ఎక్స్ ఓ కారును విడుదల చేసింది. అలాగే తన ప్రసిద్ధ థార్ ధరలను సవరించింది. కొన్ని బేస్ వేరియంట్లపై రూ.10 వేలు పెంచింది. ఈ మార్పులతో ఈ కారు ధర 11.35 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అలాగే అత్యంత ఖరీదైన వేరియంట్ రూ. 17.6 లక్షలుగా ఉంది.

These are the base variants where the price has increased..

మహింద్రా సంస్థ ఈ కింది తెలిపిన బేస్ వేరియంట్ల ధరను రూ.పదివేలకు పెంచింది. వీటిలో ఏఎక్స్ (ఓ) డీజిల్ ఎంటీ ఆర్ డబ్ల్యూడీ, ఎల్ ఎక్స్ డీజిల్ ఎంటీ ఆర్ డబ్ల్యూడీ, ఎల్ ఎక్స్ పెట్రోల్ డబ్ల్యూడీ ఉన్నాయి. పెరిగిన ధరలతో ఇవి వరుసగా 11.35 లక్షలు, 12.85 లక్షలు, 14.1 లక్షలకు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలు. ఇతర వేరియంట్ల ధరలు మాత్రం ఎప్పటిలాగే కొనసాగుతున్నాయి.

ఇంజిన్ సామర్థ్యం..
దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలలో మహింద్రా థార్ ఒకటి. సాధారణ వినియోగంతో పాటు ఆఫ్ రోడింగ్ చేయడానికి కూడా ఈ కారు అద్బుతంగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్ లోని మారుతీ సుజుకీ జిమ్నీ, ఫోర్స్ గుర్కా తదితర కార్లతో పోటీ పడుతుంది. థార్ కార్లు 1 పెట్రోల్, 2 డీజిల్ ఇంజన్ ఎంపికలతో అందుబాటులోకి వచ్చాయి. 1.5 లీటర్ సీఆర్ డీఈ డీజిల్, 2.0 లీటర్ టీజీడీఐ పెట్రోల్ ఇంజన్ సామర్థ్యంతో పనిచేస్తాయి.

త్వరలో కొత్త ఆవిష్కరణ..
మహింద్రా కంపెనీ మరో కొత్త ఆవిష్కరణకు సన్నాహాలు చేస్తోంది. థార్ లో ఫైవ్ డోర్ వెర్షన్ ను విడుదల చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ కొత్త ఎస్ యూవీకి ఇంకా పేరు పెట్టలేదు. అయితే మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం.. కొత్త కారుకు ఆర్మ్ డా అని పేరు పెట్టే అవకాశం ఉంది. అలాగే ఈ ఏడాది ఆగస్టు 15 న భారతీయ మార్కెట్లో విడుదల చేస్తారని భావిస్తున్నారు. కానీ దీనిపై ఇంత వరకూ మహింద్రా అధికారంగా ఏ ప్రకటనా చేయలేదు.

పెరిగిన డిమాండ్..
మహింద్రా థార్ కార్లకు ఈ ఏడాది డిమాండ్ బాగా ఏర్పడింది. కార్ల కోసం బుక్కింగ్ లు విపరీతంగా పెరిగాయి. ఫిబ్రవరి నాటికే 7100 బుక్కింగ్ లు జరిగినట్టు సమాచారం. థార్ కోసం వెయిటింగ్ పిరియడ్ ఆరు వారాలకంటే ఎక్కువగా ఉంటోంది. సాధ్యమైనంత వరకూ వినియోగదారులకు వేగంగా డెలివరీ చేసేందుకు మహింద్రా ప్రయత్నిస్తోంది.

Kumaraswamy: ప్రజ్వల్‌ ఇకనైనా లొంగిపో.. కుమారస్వామి విజ్ఞప్తి

బెంగళూరు: వీలైనంత త్వరగా భారత్‌కు వచ్చి పోలీసులకు లొంగిపోవాలని లైంగిక దౌర్జన్యాల కేసులో కీలక నిందితుడు- ఎంపీ ప్రజ్వల్‌కు మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. కీలక నిందితుడు- ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) బాబాయి, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి (Kumaraswamy) మరోసారి విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి వచ్చి విచారణను ఎదుర్కోవాలని కోరారు. ప్రజ్వల్ రేవణ్ణపై ఆరోపణల విషయంలో తమ పార్టీకి, భాజపాకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని మాజీ ముఖ్యమంత్రి అన్నారు. ఈ కేసుకు పొత్తుకు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు.

ప్రజ్వల్ ఏప్రిల్ 27న దౌత్యపరమైన పాస్‌పోర్టుతో జర్మనీకి వెళ్లినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హాసన్‌ నియోజకవర్గ ఎన్నికలు జరిగిన మరునాడు విదేశాలకు వెళ్లిన ప్రజ్వల్‌ ఇంకా పరారీలోనే ఉన్నారు.

ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ, ఎమ్మెల్యే రేవణ్ణపై లైంగిక ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటుచేసింది. ఈ కేసు విచారణకు హాజరుకావాలని వీరిద్దరికీ సిట్‌ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. అందుకు వారం రోజుల సమయం కావాలని ప్రజ్వల్‌ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చిన దర్యాప్తు బృందం ఆయనపై లుక్‌అవుట్‌ నోటీసు జారీ చేసింది. దీంతో ప్రజ్వల్‌ దేశంలో అడుగుపెట్టగానే పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది.

ప్రజ్వల్‌ను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు కుమారస్వామి మాట్లాడుతూ ‘‘అతడు కర్ణాటకలో ఉన్నప్పుడే నా దగ్గరికి ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు విదేశాల్లో ఉండి నాతో మాట్లాడతాడా. నేను ఇప్పటికే నాపైనా, హెచ్‌డీ దేవేగౌడపైన గౌరవం ఉంటే 48 గంటల్లోగా పోలీసుల ముందు లొంగిపోవాలని, విచారణకు సహకరించాలని విజ్ఞప్తి చేశాను. ఇప్పటికైనా లొంగిపోవాలని మళ్లీ ప్రజ్వల్‌ను కోరుతున్నాను. నా మాటను గౌరవించి ప్రజ్వల్‌ తిరిగి వస్తాడని ఆశిస్తున్నాను. ప్రస్తుతం ప్రజ్వల్‌ ఎక్కడ ఉన్నాడో అతడి తండ్రి హెచ్‌డీ రేవణ్ణకు కూడా తెలియదు. ఎవరితోనూ కాంటాక్ట్‌లో లేడు. కొందరు న్యాయవాదుల సలహాతో విదేశాలకు వెళ్లాడని తెలిసింది’’అని అన్నారు.

నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రజ్వల్‌ ఎవరికీ చెప్పకుండా విదేశాలకు వెళ్లాడని తెలిపారు. ఒక వారంలో వచ్చి విచారణకు హాజరవుతానని ప్రకటించిన అనంతరం అతనిపై అత్యాచారం కేసు నమోదు చేయడంతో భారత్‌కు వచ్చేందుకు వెనకడుగువేసి ఉండవచ్చని పేర్కొన్నారు. కొందరు వ్యాపారవేత్తలు ప్రజ్వల్‌కు సహాయం చేస్తున్నారనే వార్తలపై కుమారస్వామి స్పందిస్తూ తనకు ఆ విషయం గురించి తెలియదన్నారు. తమ కష్టాలు పంచుకోవడానికి ప్రజలు తప్ప తన వద్దకు ఏ వ్యాపారవేత్త రారని అన్నారు. ఇలాంటి కేసులతో దేవెగౌడ కుటుంబాన్ని రాజకీయంగా అంతం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు.

MS Dhoni: ‘సమయం ఆసన్నమైంది’.. ధోని సంచలన పోస్ట్.. ఫ్యూచర్ ప్లాన్స్‌పై క్లారిటీ ఇచ్చేశాడా?

ఐపీఎల్ 17వ సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ సర్దుకుంది. కీలక మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి 14 పాయింట్లతో ప్లేఆఫ్స్‌లో నాల్గవ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఓటమి కారణంగా చెన్నై ప్లేఆఫ్ కల అసంపూర్తిగా మిగిలిపోయింది. ప్లే ఆఫ్స్ లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ మంగళవారం మే 21న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. మరికాసేపట్లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. అంతకు ముందు టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఫేస్‌బుక్‌లో ఓ పెద్ద ప్రకటన చేశాడు. సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండని మిస్టర్ కూల్ ఫేస్ బుక్ లో 3 వాక్యాలను పోస్ట్ చేశాడు. ‘ విశ్రాంతి తీసుకోవడానికి ఇది సరైన సమయం. ముఖ్యమైన పనులు చేయడానికి ఇది అనువైన సమయం. నేను నా సొంత జట్టును ప్రారంభిస్తున్నాను!’ అని ధోని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ధోని ఏ ఉద్దేశంతో ఈ పోస్ట్ ను షేర్ చేశాడు? ఇప్పుడు ధోనీ కొత్త జట్టు ఏది? ఆ జట్టు క్రికెట్‌కు సంబంధించినదా లేక మరేదైనా ఉందా? దీనిపై క్రికెట్ అభిమానులు, ధోనీ అనుచరులు తలలు పట్టుకుంటున్నారు.

గతంలో ధోనీ తీసుకున్న పలు నిర్ణయాలు ఆశ్చర్యానికి గురిచేశాయి. అనూహ్యంగా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు. అలాగే ధోని సోషల్ మీడియా పోస్ట్‌లలో దేనినైనా అలాగే అంచనా వేయడం తప్పు, ఎందుకంటే ధోనీ కూడా అలాంటి పోస్ట్‌ల ద్వారా ప్రమోషన్లు చేస్తున్నాడు. ధోనీ తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో తన సొంత జట్టును ప్రారంభిస్తున్నట్లు తెలిపాడు. అయితే ఈ జట్టు క్రికెట్‌కు సంబంధించినదా? లేదా ధోని IPLలో జట్టును తీసుకోబోతున్నాడా? అనే చర్చ జరుగుతోంది. మరోవైపు ధోనీ ఇంకేమైనా స్టార్ట్ చేసి తన టీమ్‌ని అక్కడికి తీసుకురావాలనుకుంటున్నాడా? అనే టాక్ కూడా ఉంది. ఇప్పుడు ధోనీ కొత్త జట్టు ఏది? అతను ధోనీ జట్టుకు కెప్టెన్ అవుతాడా లేక మరెవరైనా ఉంటారా? అంటూ అభిమానులు లెక్కలేసుకుంటునన్నారు . అయితే ధోని షేర్ చేసిన ఈ పోస్ట్‌కు అర్థం రానున్న రోజుల్లో తేలిపోతుందని అభిమానులు భావిస్తున్నారు. అందుకే అందరూ ధోని సోషల్ మీడియా అకౌంట్లపై ఓ కన్నేసి ఉంచుతున్నారు.

కాగా, ఐపీఎల్ 17వ సీజన్‌కు ముందు మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుని రుతురాజ్ గైక్వాడ్‌కు పగ్గాలు అందించాడు. రీతురాజ్ నాయకత్వంలో చెన్నై 14 మ్యాచ్‌లకు గాను 7 గెలిచింది. మరో 7 మ్యాచుల్లో పరాజయం పాలై ప్లే ఆఫ్స్ కు చేరకుండానే నిష్ర్కమించింది.

కేంద్రం సూపర్ స్కీమ్.. ప్రతి విద్యార్థి సులువుగా రూ.4 లక్షలు పొందే అవకాశం?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పదుల సంఖ్యలో పథకాలను అమలు చేస్తున్నా చాలా పథకాలకు సరైన ప్రచారం దక్కడం లేదు. అయితే కేంద్రం అమలు చేస్తున్న పథకాలలో కొన్ని పథకాల ద్వారా విద్యార్థులకు అదిరిపోయే ప్రయోజనాలు లభిస్తున్నాయి. వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ లోన్ స్కీమ్ పేరుతో మోదీ సర్కార్ ఒక స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం.

యువతకు కేంద్రం ఆర్థిక సహాయం చేయాలనే మంచి ఆలోచనతో ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకున్న యువత తమ నైపుణ్యాలను మెరుగుపరచుకుని సులువుగా ఉద్యోగం సాధించవచ్చు. ఈ స్కీమ్ లో భాగంగా కేంద్రం ఇచ్చే మొత్తాన్ని వొకేషనల్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ కోర్సు కోసం ఉపయోగించవచ్చు. విద్యార్థులు ఇతర ఖర్చుల కోసం కూడా ఈ స్కీమ్ కు సంబంధించిన డబ్బులను ఉపయోగించవచ్చు.

విద్యార్థి అవసరాలను బట్టి లోన్ మంజూరు కానుండగా గరిష్టంగా 4 లక్షల రూపాయల వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ విషయంలో రుణం ఇచ్చే సంస్థను బట్టి వడ్డీ రేటు మారుతుంది. తీసుకున్న రుణాన్ని 7 సంవత్సరాలలో తిరిగి చెల్లించాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది. ఎవరైతే రుణాన్ని తీసుకుంటారో వాళ్లు 7 సంవత్సరాలలో తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

స్టేట్ స్కిల్ కార్పొరేషన్ మద్దతు ఉన్న సంస్థలో ప్రవేశం పొందిన వాళ్లు ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న విద్యార్థులు ఈ లోన్ కోసం దరఖాస్తు చేసుకుని స్కీమ్ బెనిఫిట్స్ ను పొందే అవకాశాలు అయితే ఉంటాయి. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ , నివాస ధృవీకరణ పత్రం, అకౌంట్ వివరాలు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ పత్రం కలిగి ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

TSRTC To TGSRTC: ఇకపై టీఎస్ఆర్టీసీ పేరు కాస్త ‘టీజీఎస్ఆర్టీసీ’ గా పేరు మార్పు..

TSRTC To TGSRTC: ఇకపై టీఎస్ఆర్టీసీ పేరు కాస్త ‘టీజీఎస్ఆర్టీసీ’ గా పేరు మార్పు..

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) పేరు మార్చబడింది. ఆర్టీసీ సంస్థ TSRTC పేరు TGSRTC గా మార్చబడిందని సంస్థ ఎండీ సజ్నార్ X వేదికగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టీఎస్‌ఆర్‌టీసీ పేరును టీజీఎస్‌ఆర్‌టీసీ గా మార్చారు. దీని ప్రకారం, X యొక్క అధికారిక ఖాతా కూడా TGSRTCకి మార్చబడింది. ప్రయాణీకులు తమ విలువైన సూచనలు, సలహాలు, ఫిర్యాదులను సవరించిన వినియోగదారు ఖాతా ద్వారా తెలియజేయాలని ఎండీ సజ్నార్ అభ్యర్థించారు. TGSRTC అందించే సేవల గురించి మరింత తెలుసుకోవడానికి మా సోషల్ మీడియా ఖాతాలను అనుసరించమని కూడా ఆయన కోరారు.

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ టీఎస్ పేరును టీజీగా మారుస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అంటే తెలంగాణలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లకు TG అనే పేరు పెట్టనున్నారు. దీని ప్రకారం., TSRTC పేరు TGSRTC గా మార్చబడింది.

తెలంగాణ రాష్ట్ర అధికారిక సంక్షిప్త రూపాన్ని TS నుంచి TG గా మార్చాలని సీఎస్ శాంతికమారి ఇటీవల ఆదేశించారు. అధికారిక పేరును ఉపయోగించే అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఏజెన్సీలు, ఇంకా ఇతర స్వతంత్ర సంస్థలు, కమీషన్‌ లు రాష్ట్రాన్ని TG గా గుర్తించడం అవసరం. పాలసీ డాక్యుమెంట్లు, నోటీసులు, సర్క్యులర్లు, లెటర్‌హెడ్లు అలాగే అధికారిక పత్రాలపై TG కనిపించాలని ప్రభుత్వం కోరుకుంది. TS తరఫున ఇప్పటికే ముద్రించిన పత్రాలపై ఈ నెలాఖరులోగా నివేదిక సమర్పించాలని సీఎస్ ఆదేశించారు.

Pinnelli: ఈవీఎం విధ్వంసం కేసులో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్‌

Pinnelli: ఈవీఎం విధ్వంసం కేసులో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్‌
ఈవీఎంను ధ్వంసం చేసి, హింసాత్మక ఘటనలకు పాల్పడిన కేసులో మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ముమ్మరంగా గాలించి సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలోని ఓ కంపెనీ గెస్ట్‌హౌస్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఇస్నాపూర్‌ లోకేషన్‌ గురించి మాచర్ల పోలీసులు.. పటాన్‌చెరు పోలీసుల సహకారం తీసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకోగలిగారు.
పోలింగ్‌ రోజు మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రెంటచింతల మండలం పాల్వాయిగేటు (పోలింగ్‌ కేంద్రం 202)లో ఈవీఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యేపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐపీసీ, ప్రజాప్రాతినిధ్య చట్టం, పీడీపీపీ చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో పిన్నెల్లిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐపీసీ కింద 143, 147, 448, 427, 353, 452, 120బి, ఆర్పీ చట్టం 131, 135 సెక్షన్లతో కేసులు నమోదయ్యాయి. ఈనెల 20నే పిన్నెల్లిపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

Virat Kohli Security Threat: మరికాసేపట్లో ఎలిమినేటర్.. విరాట్ కోహ్లీ భద్రతకు ముప్పు..

Virat Kohli Receives Security Threat Ahead Of RR vs RCB Eliminator: ఎలిమినేటర్ మ్యాచ్‌కు ముందు దురదృష్టకర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్‌కు భద్రతా ముప్పు ఉన్నట్లు సమాచారం రావడంతో మంగళవారం ఆర్సీబీ తన ప్రాక్టీస్ సెషన్‌ను రద్దు చేసుకుంది.

ఉగ్రవాద అనుమానంతో నలుగురు ఐసిస్ టెర్రరిస్టులను అరెస్ట్ చేయడం ఇందుకు బలం చేకూరుస్తుంది. తీవ్రవాద ముప్పుతో మ్యాచ్‌కు ముందు జరిగే ప్రెస్ కాన్ఫరెన్స్‌ను కూడా రద్దు చేసినట్లు సమాచారం.

బెంగాలీ దినపత్రిక ఆనందబజార్ పత్రిక గుజరాత్ పోలీసు అధికారులను ఉటంకిస్తూ, RCB వారి ప్రాక్టీస్ సెషన్‌ను రద్దు చేయడం, ఇరుపక్షాలు విలేకరుల సమావేశం నిర్వహించకపోవడం వెనుక ప్రధాన కారణం విరాట్ కోహ్లీకి భద్రతా ముప్పు అని సూచించింది.

ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అనుమానంతో గుజరాత్ పోలీసులు సోమవారం రాత్రి అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. నలుగురు నిందితుల రహస్య ప్రదేశాన్ని శోధించిన పోలీసులు ఆయుధాలు, అనుమానాస్పద వీడియోలు, టెక్స్ట్ సందేశాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

భద్రతా అధికారులు ఈ సమాచారాన్ని RR, RCB రెండింటికి తెలియజేసినట్లు సమాచారం. అయితే RR మాత్రం తన ప్రాక్టీస్‌ను యథావిధిగా కొనసాగించింది. కానీ RCB మాత్రం ప్రాక్టీస్ సెషన్ ఉండదని భద్రతా సిబ్బందికి తెలియజేసింది. ప్రాక్టీస్ సెషన్‌ను రద్దు చేయాలనే తమ ఆకస్మిక నిర్ణయానికి RCB ఎటువంటి అధికారిక కారణం చెప్పలేదని నివేదిక పేర్కొంది. RCB, RR రెండూ సోమవారం అహ్మదాబాద్‌లో దిగాయి. ఆదివారం, సోమవారం విశ్రాంతి తీసుకోవడానికి వారికి తగినంత సమయం ఉంది.

మరికాసేపట్లో ఎలిమినేటర్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఈ విషయం బయటకి రావడం అభిమానుల్లో ఆందోళనలనే రేకెత్తిస్తోంది. ఎలాగైనా ఈ మ్యాచ్ గెలిచి క్వాలిఫైయర్-2 కు చేరుకొని తద్వారా ఫైనల్ చేరాలని ఆర్సీబీ తహతహలాడుతుంది.

AP Weather: ఏపీకి మళ్లీ రెయిన్ అలర్ట్ వచ్చేసింది. ఏపీలోని ఈ జిల్లాలకు వర్షాలు..

ఏపీకి మళ్లీ రెయిన్ అలర్ట్ వచ్చేసింది. నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు పరిసర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సగటున సముద్ర మట్టానికి 3.1 కి.మీ వరకు విస్తరించి ఉంది. నేడు అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా మారుతుందని అంచనా వేస్తున్నారు.

దీని ప్రభావంతో మే 22, బుధవారం విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

మే 23, గురువారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

మంగళవారం రాష్ట్రంలో అనంతపురం జిల్లా నార్పలలో 26.5, చిత్తూరులో 22.5, చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో 21.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

10 సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు.. ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం: సీఈవో ఎంకే మీనా

అమరావతి: పోలింగ్‌ రోజున ఏపీలో మొత్తం 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని.. మాచర్లలో 7 ఘటనలు చోటుచేసుకున్నట్లు సీఈవో ముఖేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఘటనలన్నీ వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పరిశీలించాం. ఈవీఎం ధ్వంసం చేసినా డేటా భద్రంగా ఉంది. దీంతో కొత్త ఈవీఎంలతో పోలింగ్‌ కొనసాగించాం’’

‘‘ఈ ఘటనకు సంబంధించి సిట్‌కు పోలీసులు అన్ని వివరాలను అందించారు. 20న రెంటచింతల ఎస్‌ఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. మొదటి నిందితుడిగా పిన్నెల్లిని పేర్కొన్నారు. 10 సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు పెట్టారు. ఏడేళ్ల వరకూ శిక్షలు పడే అవకాశం ఉంది. ఆయనను అరెస్టు చేయడానికి పోలీసు బృందాలు వెళ్లాయి. మిగతా చోట్ల కూడా కేసులు పెట్టి దర్యాప్తు చేస్తున్నాం. ఎవర్నీ వదిలే ప్రసక్తి లేదు. ఈ ఘటన నమోదు అయిన సమయంలో ఈసీ ఆదేశాలతో బదిలీలు జరిగాయి. ఈవీఎం ధ్వంసం ఘటనలో మేమేమీ దాచిపెట్టలేదు. ఘటన జరిగిన మరుసటి రోజే ఆధారాలను పోలీసులకు అప్పగించాం’’ అని సీఈవో స్పష్టం చేశారు.

‘‘ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనను సిగ్గుమాలిన చర్యగా ఈసీ పేర్కొంది. ఇలాంటి ఘటనలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. స్వేఛ్చాయుత ఎన్నికల నిర్వహణలో వైఫల్యంగా ఈసీ దీనిని గుర్తించింది’’ అని సీఈవో తెలిపారు.

MLA Pinnelli: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లికి లుకౌట్ నోటీసులు

మాచర్ల ఎమ్మెల్యే పిన్నె్ల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) మళ్లీ పరారయ్యారు. నియోజకవర్గంలోని రెంటచింతల మండలం పాల్వాయి గేటులో ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలో అరెస్ట్ చేయాలని..

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్దం

పిన్నెల్లికి లుకౌట్ నోటీసులు ఇచ్చిన పోలీసులు

విదేశాలకు పారిపోయేందుకు చూస్తున్నారని లుకౌట్ నోటీసులు జారీ

పిన్నెల్లి సోదరుల కోసం గాలిస్తున్న పోలీసు బృందాలు

మొత్తం 3చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో పిన్నెల్లి మీద కేసు నమోదు

ఐపీసీ, ఆర్పీ, పీడీపీపీ చట్టాల పరిధిలో సెక్షన్ల నమోదు

IPC కింద 143, 147, 448 427, 353, 452, 120 B సెక్షన్లతో కేసు నమోదు

PD PP చట్టం కింద మరో కేసు నమోదు

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) మళ్లీ పరారయ్యారు. నియోజకవర్గంలోని రెంటచింతల మండలం పాల్వాయి గేటులో ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలో అరెస్ట్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సీఈవో, డీజీపీకి క్లియర్ కట్‌గా ఆదేశాలు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పిన్నెల్లి కోసం వేట మొదలుపెట్టారు. బుధవారం ఉదయం నుంచి పిన్నెల్లి కోసం గాలిస్తుండగా.. ఆయన ఎక్కడున్నారో కనిపెట్టిన పోలీసులు అరెస్ట్ చేసేందుకు యత్నించగా సంగారెడ్డి సమీపంలో కారు మారి మరో కారులో పారిపోయారు!. ముంబై – హైదరాబాద్ జాతీయ రహదారి పై కంది సమీపంలో ఈ ఘటన జరిగింది. అయితే.. ఎమ్మెల్యే కారు డ్రైవర్‌ను మాత్రం పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. కారులోనే మొబైల్ వదిలేసి పిన్నెల్లి బ్రదర్స్ పరారైనట్లు సమాచారం. డ్రైవర్ సహా వాహనాన్ని ఏపీ పోలీసులు హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. తెలంగాణకు పారిపోయిన పిన్నెల్లిని పట్టుకోవడానికి పలు బృందాలుగా విడిపోయిన పోలీసులు గాలిస్తున్నారు.
ఎక్కడున్నారు..?

కాగా.. సంగారెడ్డి నుంచి హైదరాబాద్‌ వచ్చారా..? లేకుంటే రూటు మార్చారా..? ఒకవేళ హైదరాబాద్ వచ్చి ఉంటే ఎక్కడున్నారు..? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏపీ నుంచి వచ్చిన బృందాలు హైదరాబాద్‌లో పిన్నెల్లి కోసం గట్టిగానే గాలిస్తున్నాయి. పిన్నెల్లితో పాటు ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిని కూడా అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నారు. ఏ క్షణమైనా పిన్నెల్లి సోదరులను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే అతి తెలివి ప్రదర్శించిన బ్రదర్స్.. ఫోన్లు ట్రేస్ చేయకుండా ఉండేందుకు కారులోని వదిలేసి పారిపోయినట్లుగా టాక్ నడుస్తోంది. నేషనల్ హైవేపై మారిన కారు నంబర్‌ సహాయంతో పిన్నెల్లిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదివరకు.. ఇప్పుడు!

కాగా.. ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియకు తీవ్ర విఘాతం కలిగిస్తూ హింసకు పాల్పడిన పిన్నెల్లి బ్రదర్స్ అరెస్టు భయంతో ఇప్పటికే ఒకసారి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గన్‌మెన్లను సైతం వదిలి పారిపోవడంతో అప్పట్లో పెద్ద హాట్ టాపిక్కే అయ్యింది. మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు రావడంతో పోలీసుల సూచన మేరకు హైదరాబాద్ వచ్చామని కవరింగ్ ఇచ్చుకున్నారు. ఇప్పుడు మరోసారి ఇలా పోలీసులు గాలిస్తుండగా పరారయ్యారు. తనను అరెస్ట్ చేయకుండా పిన్నెల్లి కోర్టును ఆశ్రయించి, బెయిల్ కోసం ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఎప్పుడేం జరుగుతుందో అని వైసీపీలో హైటెన్షన్ వాతావరణమే నెలకొంది.
ఆర్పీ యాక్ట్ కింద 131, 135 సెక్షన్ల నమోదు

ఈ నెల 20వ తేదీనే పిన్నెల్లిపై కేసు నమోదు చేసిన పోలీసులు

ఇదీ సంగతి..

ఈవీఎంలు ధ్వంసం చేసిన ఘటనలో కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్

వెంటనే చర్యలు తీసుకోవాలని సీఈవో, డీజీపీకి ఆదేశాలు

రంగంలోకి దిగిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు

విషయం తెలుసుకుని పరారవ్వడానికి పిన్నెల్లి బ్రదర్స్ యత్నం

ముంబై – హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్నట్లు గుర్తింపు

కంది సమీపంలో కారు వదిలేసి బ్రదర్స్ పరారీ

ఫోన్లు కూడా వదిలేసి వెళ్లిపోయినట్లు సమాచారం

హైదరాబాద్‌కు వెళ్లిన గాలింపు బృందాలు

పిన్నెల్లిపై 4 నాన్ బెయిలబుల్ సెక్షన్‌ల కింద కేసులు

3 సెక్షన్‌ల కింద 2 సంవత్సరాలు, ఒక సెక్షన్ కింద 7 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం

Nandamuri Chaitanya Krishna: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు చైతన్య కృష్ణ మాస్ వార్నింగ్..

Nandamuri Chaitanya Krishna: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు చైతన్య కృష్ణ మాస్ వార్నింగ్..

నందమూరి ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు ముఖ్యంగా బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హీరోలుగా సక్సెస్ అయ్యారు. అలాగే తారక రత్న, హరికృష్ణ కూడా హీరోలుగా చేసి ఆకట్టుకున్నారు. అయితే ఈ ఇద్దరూ ఎక్కువ సినిమాల్లో నటించలేదు. ఇక బాలయ్య గురించి ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ రామ్ అటు హీరోగా ఇటు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాను అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ చేయనున్న సినిమాను కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో వెలుగులోకి వచ్చారు. ఆయనే నందమూరి చైతన్య కృష్ణ. 2003లో వచ్చిన ‘ధమ్’ సినిమాతో చైతన్యకృష్ణ వెండితెరకు పరిచయం అయ్యారు. కాకపోతే ఈ సినిమాలో జగపతిబాబు కూడా ఉన్నారు.

ఆ తర్వాత 20 ఏళ్లకు బ్రీత్ అనే సినిమాతో హీరోగా రీ లాంచ్ అయ్యారు చైనత్య కృష్ణ. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఎంత డిజాస్టర్ అంటే టాలీవుడ్ లోనే జీరో కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు చైతన్య కృష్ణ. తెలుగు దేశం పార్టీని సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేస్తూ ఉంటారు. అలాగే తమను విమర్శించినా వారిపై కూడా చైతన్య కృష్ణ ఫైర్ అవుతూ ఉంటారు. తాజాగా చైతన్య కృష్ణ జూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు వైసీపీ ఫ్యాన్స్ కు కలిపి వార్నింగ్ ఇచ్చారు చైతన్య కృష్ణ.

ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ను షేర్ చేశారు. జూనియర్‌ఫ్యాన్స్ కు ఇదే నా వార్నింగ్‌.. ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ నేతలు కొండాలి నాని, వల్లభనేని వంశీ. మీరు సపోర్ట్ చేశారు అని అంటారు. కానీ మీరు ఎవరు సపోర్ట్ చేయడానికి.? మా బొ** కూడా పీకలేరు.. నేను ఉండగా చంద్రబాబు మావయ్య, బాలకృష్ణ బాబాయ్‌ని ఎవరూ ఏం చేయలేరు అంటూ తన ఫెస్ బుక్ లో రాసుకొచ్చారు నందమూరు చైతన్య కృష్ణ. అలాగే నా సినిమా బ్రీత్ మూవీ రిలీజ్ టైంలోనూ జూనియర్ ఫ్యాన్స్, వైఎస్సార్ సీపీ వాళ్లు కలిసి నన్ను బాగా ట్రోల్ చేశారని, జాగ్రత్త గా ఉండండి అంటూ కృష్ణ చైతన్య వార్నింగ్‌ ఇచ్చారు. ఈ వార్నింగ్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఆకాశానంటుతున్న కంచి పట్టు చీరల ధరలు..రెండేళ్లలో 50 శాతం పెరుగుదల!

కాంచీపురం చేనేత పట్టుచీరలు ప్రపంచప్రసిద్థిగాంచినవి. కేంద్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన ఈ పట్టుచీరల ధర ఇప్పుడు 50 శాతం పెరిగాయి. వెండి, బంగారం ధర రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతుండటంతో దాని ప్రభావం చీరల ధర పై పడుతుంది.

ఈ ఏడాది పెళ్లిళ్ల సీజన్‌ కావటంతో కాంచీపురం పట్టు చీరలను కొనుగోలు చేసేందుకు పెళ్లి వారు పరిగెడుతుంటారు. కానీ, ఆకాశాన్నంటుతున్న బంగారం ధరల కారణంగా చీరలుధరలు పెరగటంతో వారి జేబులకు చిల్లులు పడుతున్నాయి. కాంచీపురం పట్టు చీరల ధర గత ఎనిమిది నెలల్లో 50% పెరిగింది.దీని వలన ధరపై అవగాహన ఉన్న వినియోగదారులు తక్కువ బంగారం , వెండి కంటెంట్ లేదా రెండు విలువైన లోహాలు లేని చీరలను కొనుగోలు చేయటం ప్రారంభిస్తున్నారు.

చాలా మంది కస్టమర్లు నిర్దిష్ట బడ్జెట్‌తో వస్తారని తక్కువ బంగారం,వెండితో కూడిన (కాంచీపురం) పట్టు చీరలను ఇష్టపడతారని టెక్స్ టైల్స్ యజమానులు చెబుతున్నారు. అయితే కొందరు తమ బడ్జెట్‌కు తగ్గట్టుగా చీరలను ఆర్డర్ చేసేవారని ఇంతలో పట్టు చీరల ధర పెరగడంతో వారు కొనుగోలు పై వెనక్కి తగ్గుతున్నారని..దీని ప్రభావం నేత నేసిన వారిపై అమ్మకాలు జరిపే మా పై పడుతున్నాయని వారు అన్నారు.

అక్టోబర్ 1, 2023న 22 క్యారెట్ల బంగారం ధర గ్రాము 5,356 నుండి ఉండేదని..మే 21, 2024 నాటికి గ్రాము 6,900కి పెరిగిందన్నారు.అదేవిధంగా, వెండి ధరలు కూడా అదే సమయంలో గ్రాముకు 75.5 రూపాయల నుండి 101కి పెరిగింది. ఈ పెరుగుదలతో కాంచీపురంలో రూ. 10,000 కోట్ల పట్టు చీరల పై ప్రభావం చూపిందన్నారు.
కాంచీపురం పట్టు చీరల తయారీదారుల సంఘం వీకే ధమోదరన్ మాట్లాడుతూ.. గతేడాది అక్టోబర్‌ నుంచి ఈ మే వరకు చీరల ధరలు 40%-50% పెరిగాయి. “కాంచీపురం సిల్క్ చీర ధర ప్రధానంగా బంగారం, వెండి ధరల ద్వారా నిర్ణయించబడుతుంది, ఎందుకంటే రెండు లోహాలను పట్టు చీరలలో వాడటానికి ఉపయోగిస్తారు. చేనేత కాంచీపురం పట్టు చీర తక్కువ ధరకు లభించకపోవటంతో బంగారం, వెండి మిశ్రమం లేని ‘జారీ’తో కొనుగోలు చేయడం కొనుగోలు దారులు ప్రారంభించారన్నారు. ఇది మా వ్యాపారస్తులపై నేత కార్మికులపై పెను ప్రభావం చూపుతోంది ” అని ఆయన చెప్పారు.

పిన్నెల్లి అరెస్టుకు సీఈసీ డెడ్ లైన్ !

అమరావతి: పోలింగ్‌ రోజు ఈవీఎం, వీవీప్యాట్‌లను ధ్వంసం చేసి అరాచకం సృష్టించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఆయన కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఆయనను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు హైదరాబాద్‌కు చేరుకున్నాయి. పల్నాడు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఈ బృందాలను ఏర్పాటు చేశారు. పిన్నెల్లిని తక్షణమే అరెస్టు చేయాలని ఈసీ పోలీసులను ఆదేశించింది.

మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్‌ కేంద్రం 202లో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నియోజకవర్గంలో పోలింగ్‌ కేంద్రం 202తోపాటు ఏడు కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఈవీఎంల ధ్వంసానికి సంబంధించిన అన్ని వీడియో పుటేజీలను జిల్లా ఎన్నికల అధికారులు తమకు అందజేశారని, దీంతో ఎమ్మెల్యే పేరును నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఈ ఘటనల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి చెప్పాలని సీఈఓ ముకేశ్‌ కుమార్‌ మీనాను ఆదేశించింది.

మాచర్ల ఎమ్మెల్యే ఈవీఎం ధ్వంసం చేసిన వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంత చేసినా కేసు కూడా నమోదు చేయకపోవడంతో ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
దీంతో ఢిల్లీలోని సీఈసీ కార్యాలయం వెంటనే స్పందించింది. సీఈవో ముఖేష్ కుమార్ మీనాకు నోటీసులు పంపింది. ఆ వీడియోలో ఉన్నది ఎమ్మెల్యే నా.. ఎమ్మెల్యే అయితే ఇంకా కేసు ఎందుకు పెట్టలేదు.. ఎందుకు అరెస్టు చేయలేదో చెప్పాలని స్పష్టం చేసింది. తక్షణం చర్యలు తీసుకుని ఐదు గంటల లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
అంటే క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేసిన విషయాన్ని ఐదు గంటల కల్లా సీఈసీకి తెలియచేయాల్సి ఉంది. ఈ విషయాన్ని డీజీపీపి సీఈవో తెలియచేశారు. దీంతో పిన్నెల్లి అరెస్టుకు ప్రత్యేక బృందాల్ని హైదరాబాద్ కు పంపారు.
కానీ ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లారు. ప్రత్యేక బృందాల సమాచారం ఆయనకు చేరుతూండటంతో.. ఎప్పటికప్పుడు తప్పించుకుంటున్నారు. ఐదు గంటలలోపు పిన్నెల్లిని అరెస్టు చేయలకపోతే వ్యవస్థలు మొత్తం విఫలమైనట్లే. వ్యవస్థల్లో ఉన్న మనుషుల ద్వారా తాను అనుకున్నట్లుగా చేయిస్తున్న వైసీపీ పెద్దలు పిన్నెల్లిని కాపాడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు పిన్నెల్లిని అరెస్టు చేయలేకపోతే.. ఏపీలో వ్యవస్థలు ఎంతగా దిగజారిపోయాయో దేశానికి తెలుస్తుంది.

BCCI సంచలన నిర్ణయం! టీమిండియా హెడ్‌ కోచ్‌గా శ్రీలంక దిగ్గజం!

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 తర్వాత టీమిండియా కొత్త హెడ్‌ కోచ్‌ రానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హెడ్‌ కోచ్‌గా ఉన్న రాహుల్‌ ద్రవిడ్‌ పదవీకాలం ముగియనుండటంతో.. కొత్త కోచ్‌ వేటలో పడింది బీసీసీఐ. ఇప్పటికే కోచ్‌ పదవికి దరఖాస్తులు చేసుకోవాలంటూ నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసింది. 2024 నుంచి 2027 వరకు టీమిండియాకు హెడ్‌ కోచ్‌గా పనిచేసేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా బీసీసీఐ సూచించింది. టీమిండియా హెడ్‌ కోచ్‌గా, ద్రవిడ్‌ వారుసులుగా వస్తున్నారంటూ చాలా పేర్లు వినిపించాయి. వీవీఎస్‌ లక్ష్మణ్‌, వీరేందర్‌ సెహ్వాగ్‌, స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇలా చాలా పేర్లే వార్తల్లో నిలిచాయి. కానీ, బీసీసీఐ మాత్రం శ్రీలంక దిగ్గజ మాజీ క్రికెటర్‌ను టీమిండియా కోచ్‌గా తీసుకొచ్చేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం.

ఎవరా లంక దిగ్గజ క్రికెటర్‌ అని ఆలోచిస్తున్నారా.. ఇంకెవరు మహేల జయవర్దనే. కెప్టెన్‌గా, ఆటగాడిగా.. శ్రీలంకను పటిష్టమైన జట్టుగా నడిపించిన జయవర్దనే అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయిన తర్వాత.. కోచింగ్‌ వైపు రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టాడు. చాలా కాలం ముంబై ఇండియన్స్‌కు కూడా కోచ్‌గా పనిచేశాడు. జయవర్డనే కోచ్‌గా ఉన్న సమయంలోనే ముంబై ఇండియన్స్‌ రెండు సార్లు(2017, 2019) ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిచింది. అంతకంటే ముందు జయవర్దనే ఇంగ్లండ్‌ జట్టుకు బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా పనిచేశాడు. జయవర్దనే కెప్టెన్సీలో శ్రీలంక జట్టు 2007 ప్రపంచ కప్ ఫైనల్‌ ఆడింది. ఆ వరల్డ్‌ కప్‌ తర్వాత బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలనే ఉద్దేశ్యంతో 2009లో కెప్టెన్‌గా వైదొలిగాడు. వన్డే వరల్డ్ కప్ 2011 ఫైనల్‌లో టీమిండియాపై జయవర్దనే సెంచరీ కూడా బాదాడు.

వన్డే వరల్డ్‌ కప్‌ తర్వాత తిరిగి లంక కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన జయవర్దనే.. 2013లో కెప్టెన్నీకి రాజీనామా చేశాడు. 2014లో టెస్ట్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మహేల.. 2015 వన్డే వరల్డ్‌ కప్‌ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి. కోచ్‌గా తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించాడు. ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా, ముంబై ఇండియన్స్‌ కోచ్‌గా మంచి సక్సెస్‌ ఉన్న జయవర్దనేను టీమిండియా హెడ్‌ కోచ్‌గా తీసుకొని రావాలని గట్టి పట్టుదలతో ఉంది. ఈ విషయమై ఇప్పటికే జయవర్దనేతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు సమాచారం. అదే జరిగితే.. టెక్నికల్‌గా అద్భుతమైన దిగ్గజ ఆటగాడు టీమిండియాకు హెడ్‌ కోచ్‌గా వస్తాడు. ద్రవిడ్‌కు తగ్గ వారసుడు కూడా అవుతాడని క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు. మరి జయవర్దనే టీమిండియా కోచ్‌గా వస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Raisin Water : ఎండు ద్రాక్ష నీళ్లు తాగితే ఇన్ని లాభాలా…?? మరీ ముఖ్యంగా ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు…!

Raisin Water : ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో అధిక బరువు కూడా ఒకటి. అధిక బరువు కారణంగా ఎంతో మంది చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వెయిట్ లాస్ కావటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాయామం, వాకింగ్, హెల్దీ డైట్,జిమ్ ఇలా ఎన్నో ట్రై చేస్తున్నారు. అయితే కొన్ని రకాల సింపుల్ చిట్కాలతో వెయిట్ లాస్ కావచ్చు అని నిపుణులు అంటున్నారు. వెయిట్ లాస్ అయ్యేందుకు ఎండు ద్రాక్ష నీరు ఎంతో మేలు చేస్తుంది. క్రమం తప్పకుండా ఎండు ద్రాక్ష నీరు తాగుతూ మంచి డైట్ ను మెయిన్ టైన్ చేస్తూ వ్యాయామం చేస్తే మీకు కేవలం పది రోజుల్లోనే మార్పు కనిపిస్తుంది. ఈ నీళ్లను తాగటం వలన మీ బాడీ కూడా ఆరోగ్యంగా మరియు ఫిట్ గా కూడా ఉంటుంది. మరి ఇంకా ఎండుద్రాక్ష నీటిలో ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఎండు ద్రాక్ష నీటిని తీసుకోవటం వలన శరీరం అనేది డిటాక్సిఫై అవుతుంది. మన రోజు వారి జీవితంలో మనకు తెలియకుండానే కాలుష్యం మరియు తినే ఆహారం ఇలా రకరకాల కారణాల వలన శరీరంలోకి మలినాలు అనేవి చేరతాయి. కావున ఎండు ద్రాక్ష నీటిని తాగటం వలన శరీరంలో ఉన్నటువంటి మలినాలు బయటకు వెళ్తాయి. శరీరం ఫ్రీ రాడికల్స్ తో పోరాడే శక్తి ని కూడా కలిగిస్తుంది. బరువు పెరగటానికి,నిద్రలేమి సమస్యలకు కూడా ఒక కారణంగా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సరైన నిద్ర లేకపోవడం వల్ల, తిన్నది కూడా అరగకపోవటం వలన శరీరంలో కొవ్వు అనేది నిల్వ ఉండిపోతుంది. అంతేకాదు గ్యాస్ ఎసిడిటీ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కావున మీరు ఎండుద్రాక్ష నీరు గనక తాగితే నిద్రలేమి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.

ఈ ఎండు ద్రాక్ష నీటిలో పొటాషియం మరియు మెగ్నీషియం లాంటి పోషకాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి శరీరంలో ఉన్న ద్రవాల స్థాయిలను కంట్రోల్ లో ఉంచుతుంది. చమట కారణంగా కోల్పోయినటువంటి శక్తిని ఈ నీళ్ల ద్వారా తిరిగి మనకు లభిస్తుంది. నాడీ వ్యవస్థ పరితీరును మరియు కండరాల తీరును కూడా సరిచేస్తుంది. ఎండు ద్రాక్ష నీటిని తీసుకోవటం వలన గట్ హెల్త్ కూడా మెరుగుపడుతుంది. శరీరం నుండి మలినాలను అన్నిటిని కూడా బయటకు పంపిస్తుంది. ఎండు ద్రాక్షలో ఉన్న ఫైబర్ జీర్ణశక్తి,మలబద్ధకం లాంటి సమస్యలను రాకుండా చూస్తుంది. ఈ ఎండుద్రాక్ష ప్రతిరోజు తీసుకోవడం వలన తక్కువ టైంలో వెయిట్ లాస్ అవ్వచ్చు. ఈ ఎండుద్రాక్ష నీటిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కావున ఈ నీటిని తాగటం వలన కడుపు నిండిన ఫీలింగ్ అనేది వస్తుంది. గోరు వెచ్చని నీటిలో మూడు లేక నాలుగు ఎండు ద్రాక్షలను వేసి రాత్రంతా కూడా నానబెట్టాలి. ఉదయం లేవగానే ఆ నీటిని తాగడంతో పాటుగా ఎండు ద్రాక్షలు కూడా తింటే చాలా మంచిది..

వాహనదారులకు బిగ్‌ షాక్‌.. టోల్‌ ఛార్జీల మోత.. వివరాలివే

దేశంలో ఉన్న వాహనదారులకు మరో పిడుగు లాంటి వార్త అందింది. ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ ఛార్జీలు ఆకాశాన్నంటుతున్న ఈ క్రమంలో వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం మరో బిగ్‌ షాక్‌ ను ఇచ్చింది. ఎందుకంటే.. ఇకపై నేషనల్‌ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌ వేలపై వెళ్లడం మరింత ఖరీదుగా మారనుంది. అనగా.. టోల్ ట్యాక్స్‌ ఛార్జీలను భారీగా పెంచేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సిద్దమైంది. ఎప్పటి నుంచి ఈ ఛార్జీల పెంపు అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయో తెలుసుకుందాం.

దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణం చేసే వాహనదారులకు తాజాగా ఓ బిగ్‌ షాక్‌ తగిలింది. ఇకపై హైవేలపై ప్రయాణించే వాహనదారులకు టోల్‌ ప్లాజాల్లో ఛార్జీలు పెరగనున్నాయి. అయితే ఈ టోల్‌ గేట్‌ ఛార్జీలు జూన్ 2 నుంచి పెంపు అమల్లోకి రానుందని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) వెల్లడించింది. ఇకపోతే ప్రతి ఏటా ఏప్రిల్‌ 1న ఈ రుసుములు పెరుగుతాయి. అయితే రోడ్ల నిర్వహణకు ఈ ఛార్జీలను పెంచుతారు. ఇక ఈసారి లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పెంపు వాయిదా పడింది. ఈ క్రమంలోనే.. టోల్‌ ఛార్జీల పెంపును వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఎన్‌హెచ్‌ఏఐను ఆదేశించింది కాగా, దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా.. చివరి విడత జూన్‌ 1న ఎన్నికలు ముగియనున్నాయి. ఆ రోజు అర్ధరాత్రి నుంచి ఈ టోల్‌ ఛార్జీల ధరలు పెరుగుతాయి. ఇప్పటికే ఈ మేరకు టోల్‌ప్లాజాల నిర్వాహకులకు NHAI ఉత్తర్వులను జారీ చేసింది. పైగా ఈ టోల్‌ రుసుముల పెంపు సగటున 5 శాతం వరకు ఉంటుంది.

Big shock for motorists

ఇక హైదరాబాద్‌, విజయవాడ (65) నేషనల్ హైవేను ఉదాహరణగా తీసుకుంటే.. ఈ హైవేపై తెలంగాణలోని చౌటుప్పల్‌ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్‌, ఆంధ్రప్రదేశ్‌లోని చిల్లకల్లు వద్ద టోల్‌ప్లాజాలు ఉన్నాయి. అయితే అక్కడ కార్లు, వ్యాన్‌లకు ఒక వైపు ప్రయాణానికి రూ.5, రానూపోనూ కలిపి రూ.10, తేలికపాటి గూడ్స్ వెహికల్స్ ఒక వైపు రూ.10, ఇరు వైపులా అయితే రూ.20 ఉంటుంది. అదే విధంగా బస్సు, ట్రక్కులకు రూ.25, రూ.35, భారీ రవాణా వాహనాల అయితే రూ.35, రూ.50 చొప్సున పెంచారు. కాకపోతే 24 గంటల లోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు ఛార్జీలో 25 శాతం మినహాయింపు ఉంటుంది. ఇక స్థానికుల నెలవారీ పాస్‌ను కూడా పెంచారు. ఆ పాసులను రూ.330 నుంచి 340కి పెంచారు. పెంచిన ధరలు 2025 మార్చి 31 వరకు అమలులో ఉండనున్నాయి.

అమెరికా ‘వీసా’వహులకు తీపి కబురు

ఆగస్టు వరకు విద్యార్థి ఇంటర్వ్యూలు
జూన్‌ నుంచి దశల వారీగా స్లాట్ల విడుదల
అమెరికాలో ఉన్నత విద్య చదవాలనుకునే విద్యార్థులకు జూన్, జులై, ఆగస్టు కోటాకు సంబంధించిన మరిన్ని విద్యార్థి వీసా(ఎఫ్‌-1) ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. అమెరికాలో ఫాల్‌ ఎడ్యుకేషన్‌ సీజన్‌ ఆగస్టు-సెప్టెంబరులో ప్రారంభమవుతుంది. సాధారణంగా సీజన్‌ చివరి వారంలో ఒక దఫా ఇంటర్వ్యూలో వీసా దరఖాస్తు ఆమోదం పొందనివారికి మరో అవకాశం కల్పిస్తారు. ఈ దఫా ఆగస్టు నెలాఖరు వరకు వీసా స్లాట్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించటం విశేషం. ఆ సీజన్‌లో అమెరికా వెళ్లేందుకు ఇప్పటికే స్లాట్లు తీసుకున్న విద్యార్థులకు సోమవారం నుంచి హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయంలో వీసా ఇంటర్వ్యూలు ప్రారంభించారు. ప్రస్తుత సీజన్‌కు సంబంధించిన తొలి విడత ఇంటర్వ్యూ తేదీల(స్లాట్ల)ను అమెరికా ఈ నెల రెండో వారం ప్రారంభంలోనే విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ దఫా పెద్దసంఖ్యలో భారతీయ విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు వీలుగా దశలవారీగా స్లాట్లు విడుదల చేయనున్నట్లు ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు. విద్యార్థి వీసా సీజన్‌లో ఆగస్టు చివరి వరకు స్లాట్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్లు అమెరికా రాయబార కార్యాలయం మంగళవారం ప్రకటించింది. చివరి నిమిషంలో వెళ్లేవారికీ ఉపయుక్తంగా ఉండాలన్న ఆలోచనతో ఆగస్టు దాకా ఇంటర్వ్యూలు నిర్వహించాలని నిర్ణయించారు. త్వరలో మరిన్ని స్లాట్లు విడుదల చేయనున్నారు. దిల్లీలోని రాయబార కార్యాలయం, హైదరాబాద్, చెన్నై, ముంబయి, కోల్‌కతాలలోని కాన్సుల్‌ జనరల్‌ కార్యాలయాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు అధికారిక వెబ్‌సైట్‌లో స్లాట్లు అందుబాటులో ఉన్నట్లు కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయం ప్రకటించింది.

విద్యార్థులకు 24న అవగాహన కార్యక్రమం
ప్రస్తుత ఫాల్‌ సీజన్‌తోపాటు 2025 స్ప్రింగ్‌ సీజన్‌లో అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థుల కోసం హైబ్రిడ్‌ విధానంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ మంగళవారం ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటించింది. ఈ నెల 24వ తేదీన ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపింది. ఆన్‌లైన్‌లో హాజరు కావాలనుకునేవారు bit.ly/EdUSASVS24 ద్వారా రిజిస్టర్‌ చేసుకోవాలని సూచించింది. హైదరాబాద్‌లో ప్రత్యక్షంగా హాజరు కావాలనుకునేవారికి ఎస్‌.ఎల్‌.జూబ్లీ కాంప్లెక్స్, 4వ అంతస్తు, రోడ్‌ నంబర్‌ 36, జూబ్లీహిల్స్‌లో శుక్రవారం మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల మధ్య కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమంలో అమెరికా వీసా కాన్సులర్‌ అధికారి వీసా దరఖాస్తు ప్రక్రియపై అవగాహన కల్పించనున్నారు.

కోర్టు సంచలన తీర్పు.. తల్లికి కుమార్తె భరణం ఇవ్వాల్సిందే

సాధారణంగా విడాకుల కేసుల్లో.. భర్త భార్యకు భరణం ఇవ్వాల్సి వస్తుంది. వివాహం తర్వాత చాలా వరకు కుటుంబాల్లో ఆడవారు ఇంటి బాధ్యతలు, కుటుంబ సభ్యులను చూసుకోడం వంటి విధులకు పరిమితం అవుతారు. ఇక దురదృష్టం కొద్ది.. వారి బంధం బీటలు వారితే.. ఇన్నాళ్లు ఇంటికే పరిమితమైన ఆడవారు.. విడిపోయిన తర్వాత బయటకు వెళ్లి తమ కోసం ఉపాధి వెతుక్కోలేరు.. చాలా సందర్భాల్లో దొరకదు కూడా. దాంతో విడాకులు కేసుల్లో.. విడిపోయిన తర్వాత భర్త.. తన భార్యకు భరణం ఇవ్వాలని కోర్టులు ఆదేశిస్తాయి. అయితే ఈ మధ్య కాలంలో భార్య కూడా భర్తకు భరణం ఇవ్వాలంటూ కొన్ని కోర్టులు సంచలన తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఓ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. కుమార్తె తల్లికి భరణం ఇవ్వాల్సిందే అంటూ సంచలన తీర్పు వెల్లడించింది. ఆ వివరాలు..

పిల్లలకు తల్లిదండ్రుల ఆస్తులనే కాదు.. వారి బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత కూడా వారిపై ఉందని.. దీనిలో అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేదని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. తండ్రి మరణం తర్వాత.. తల్లిని తన ఇంటికి పిలిపించుకుని.. ఆస్తులు లాక్కుని.. ఆ తర్వాత తల్లిని బయటకు గెంటేసింది ఓ కుమార్తె. దాంతో బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. కన్నవారి ఆస్తిలో హక్కు కోరే కుమార్తెకు.. వారిని చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని అభిప్రాయపడింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఇండోర్‌ కోర్టు ఈ మేరకు సంచలన తీర్పు ఇచ్చింది. వయసు మళ్లిన తల్లికి జీవన భృతి కింద కుమార్తె భరణం చెల్లించాలని కోర్డు ఆదేశాలు చేసింది.

మధ్యప్రదేశ్‌కు చెందిన 78 ఏళ్ల మహిళ.. తన కుమార్తె (55)పై కోర్టులో కేసు దాఖలు చేసింది. తనకు ఒక్కతే కుమార్తె సంతానమని.. ఆమె తన ఆస్తి మొత్తం లాక్కుని.. కోవిడ్‌ సమయంలో తనను ఇంటి నుంచి తరిమేసిందని ఆ వృద్ధురాలు ఆరోపించారు. తన భర్త మధ్యప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్‌గా పనిచేసే వాడని.. అతడు 2001లో మరణించాడని చెప్పుకొచ్చింది. భర్త చనిపోయిన దగ్గర నుంచి తాను ఒంటరిగా ఉంటున్నాను అని.. ఈ క్రమంలో కోవిడ్‌కు ముందు తన కుమార్తె.. తనను ఆమె ఇంటికి తీసుకెళ్లిందని తెలిపింది.

కొన్ని రోజులు తనను బాగానే చూసుకుందని.. ఆ తర్వాత తన పేరుపై వారసత్వంగా సంక్రమించిన ఇంటిని అమ్మించి.. ఆ డబ్బులను తీసుకుందని బాధితురాలు చెప్పుకొచ్చింది. అలాగే తన భర్త ఈపీఎఫ్ ఖాతాలోని డబ్బులను కూడా కుమార్తె తీసుకుందని చెప్పుకొచ్చింది. తన దగ్గర ఉన్న ఆస్తి మొత్తం లాక్కుందని చెప్పుకొచ్చింది.

ఆ తర్వాత నుంచి తనను చిత్ర హింసలకు గురి చేసిందని.. మరీ ముఖ్యంగా 2020 మార్చిలో లాక్‌డౌన్‌ విధించిన సమయంలో.. కుమార్తె తనను ఎన్నో బాధలకు గురి చేసిందని వృద్ధురాలు వెల్లడించింది. అంతటితో ఆగక.. తనను ఇంట్లో నుంచి తరిమేసిందని చెప్పుకొచ్చింది. కుమార్తె మాటలు నమ్మి సర్వం కోల్పోయానని.. తనకు న్యాయం చేయాలని వేడుకుకుంది. కుమార్తె తన ఆస్తి మొత్తం లాక్కోవడంతో.. ప్రస్తుతం తనకు ఉండటానికి ఇల్లే కాదు.. తిండికి కూడా ఇబ్బందులు పడుతున్నట్టు వృద్ధురాలు వాపోయింది.

ఇక తన కుమార్తె చీరల దుకాణం నడుపుతూ నెలకు రూ.22,000 వరకు సంపాదిస్తోందని, ఆమె నుంచి తనకు భరణం ఇప్పించాలని వృద్ధురాలు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో అభ్యర్థించింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి మాయ విశ్వలాల్.. తల్లిని పోషించగల స్తోమత కుమార్తెకు ఉందని నిర్దారించారు. ఆ వృద్ధురాలికి నెలకు రూ.3,000 చొప్పున భరణం చెల్లించాలని కుమార్తెను ఆదేశించారు. ప్రస్తుతం ఈ తీర్పు సంచలనంగా మారింది.

పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర

బంగారంకు ఉన్న ప్రత్యేకత గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ముఖ్యంగా..ఈ బంగారంను ఇష్టపడని వారంటూ ఎవ్వరూ ఉండరు. అయితే అందమైన ఈ బంగారు అభరణలు ధరించాలనే కోరిక మహిళలకు మాత్రమే ఉంటుదనుకుంటే.. పొరపాటే ఎందుకంటే.. ఇటీవల కాలంలో పురుషులు సైతం దీనిపై ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. కానీ, వీటి ధరలు రోజు రోజుకి కొండెక్కి కూర్చుంటున్నాయి. ఈ మధ్య తరుచుగా బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూ పసిడి ప్రియులకు షాక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలోతాజాగా పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త అందింది ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఇటీవలే వరుసగా గోల్డ్‌ రేట్లు పెరుగుతూ ఉన్న విషయం తెలిసిందే. దీంతో పసిడి ప్రియులు బంగారం కొనలంటనే భయపడుత్నునారు. ఇలాంటి సమయంలో తాజాగా బంగారం ధర ఒక్కసారిగా దిగొచ్చింది. దీంతో బంగారం కొనేవారికి కాస్త ఊరట లభించందని చెప్పవచ్చు. అయితే ఈరోజు దేశీయ మార్కెట్‌, అలాగే ఇంటర్నేషనల్‌ మార్కెట్లో బంగారం, వెండి రేట్లు ఎంత ఉన్నాయనేది తెలుసుకుందాం. గత రెండు రోజుల కిందట బంగారం ధరలతో పోలిస్తే ఈరోజు బంగారం ధర భారీగానే తగ్గింది. అయితే స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ఇటీవల 2450 డాలర్ మార్కును దాటగా.. ప్రస్తుతం అది 2420 డాలర్ల వద్ద ఉంది. ఇక స్పాట్ సిల్వర్ ధర ఔన్సుకు 32 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇదే సమయంలో రూపాయి కాస్త పతనమైంది. డాలర్‌తో చూస్తే ప్రస్తుతం మారకం విలువ రూ. 83.318 వద్ద ఉంది.ఇకపోతే దేశీయ మార్కెట్లో చూసినట్లయితే.. ఈరోజు బంగారం ధరలు హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా పతనం అయ్యాయి.

The price of gold has fallen drastically

కాగా, ఇక్కడ 22 క్యారెట్స్ గోల్డ్ రేటు.. ఇవాళ ఒక్కరోజే ఏకంగా రూ. 600 పతనమైంది. అయితే తులానికి ఆల్ టైమ్ గరిష్టమైన రూ. 68,900 మార్కు నుంచి రూ. 68,300 మార్కుకు చేరింది. అంతకుముందు రోజు చూస్తే ఏకంగా రూ. 500, అంతకుమునుపు చూస్తే రోజు రూ. 800 మేర పెరగడం గమనార్హం. అయితే హైదరాబాద్‌ లో 24 క్యారెట్లకు చెందిన గోల్డ్ రేటు ఒక్కరోజులో రూ. 650 దిగొచ్చింది. ప్రస్తుతం 10 గ్రాములకు రూ. 74,510 మార్కుకు చేరింది. ఇది కిందటి రోజున రూ. 540 పెరిగి రూ. 75,160 వద్ద జీవన కాల గరిష్టాల వద్ద ట్రేడయింది. అంతకుముందు కూడా వరుస రెండు రోజుల్లో రూ. 870, రూ. 540 చొప్పున పెరిగిన సంగతి తెలిసిందే. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు తగ్గాయి. కాగా, ఇక్కడ కూడా 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ. 600 దిగొచ్చి రూ. 68,450 మార్కుకు చేరింది. అంతకుముందు వరుస రెండు రోజుల్లో రూ. 800, రూ. 500 చొప్పున పెరిగాయి. అలాగే 24 క్యారెట్ గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 650 దిగొచ్చి రూ. 74,660 పలుకుతోంది. కానీ, హైదరాబాద్‌తో పోలిస్తే ఢిల్లీలో బంగారం ధర కాస్త ఎక్కువగా ఉంటుంది.

అయితే బంగారం ధరల బాటలోనే వెండి రేట్లు కూడా దిగొచ్చాయి. ఢిల్లీలో ఒక్కరోజే రూ. 1900 తగ్గిన సిల్వర్ కిలోకు ఇప్పుడు రూ. 94,600 మార్కుకు చేరింది. అంతకుముందు 3 రోజుల వ్యవధిలోనే రూ. 10 వేలకు పైగా పెరగడం గమనార్హం. ఇదే సమయంలో హైదరాబాద్ నగరంలో కూడా ఒక్కరోజులో రూ. 1900 రేటు తగ్గగా ప్రస్తుతం కేజీ రూ. 99 వేల మార్కు వద్ద ఉంది. ఇటీవల ఇది రూ. లక్ష మార్కు దాటిన విషయం తెలిసిందే. అయితే బంగారం ధరలు మళ్లీ భారీ స్థాయిలో పెరిగేందుకు ప్రధాన కారణం.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మళ్లీ తగ్గిస్తుందన్న అంచనాలు పెరిగిపోవడమే. ఈ క్రమంలోనే.. . బంగారం ధరలు పెరిగాయి. ఆ తర్వాత ఒక్కసారిగా ప్రాఫిట్ బుకింగ్ కారణంగా ఇవాళ మాత్రం రేట్లు దిగొచ్చాయి.

AP Elections 2024: పోలింగ్ బూత్‌లో ‘పిన్నెల్లి’ విధ్వంసకాండపై ఈసీ సీరియస్.. డీజీపీకి కీలక ఆదేశాలు

అమరావతి, ఆంధ్రజ్యోతి మే-22: ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌ (AP Election 2024) రోజున పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (MLA Pinnelli Ramakrishna Reddy) చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా ఆలస్యంగా వెలుగుచూస్తున్నాయి. టీడీపీ శ్రేణులపై దాడులతో పాటు ఓటమి భయంతో పిన్నెల్లి సోదరులు బూత్‌లలోకి స్వయంగా చొరబడి ఈవీఎంలను ధ్వంసం చేసిన కలకలం రేపింది. పిన్నెల్లి దాష్టీకాలకు సంబంధించిన సీసీ ఫుటేజ్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని ఎన్నికల కమిషన్‌ తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలకు ఆదేశించింది. ఈవీఎంలను ధ్వంసం చేయడాన్ని ఈసీ తీవ్రంగా పరిగణించింది. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పిన్నెల్లిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర సీఈఓ, డీజీపీకి సీఈసీ ఆదేశాలు ఇచ్చింది. కాగా.. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన.. చట్టాలను కాపాడాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న పిన్నెల్లి ఇలా చేయడం సిగ్గుచేటు.

అడ్డం దొరికిపోయిన పిన్నెల్లి..!
ఈ ఘటనకు సంబంధించి వెబ్‌ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను కేంద్ర ఎన్నికల అధికారులు నిశితంగా పరిశీలించారు. ఈవీఎంల ధ్వంసం ఘటనకు సంబంధించి కేసు దర్యాప్తులో సహకరించేందుకు పల్నాడు జిల్లా ఎన్నికల అధికారులు అటువంటి అన్ని పోలింగ్ స్టేషన్ల వీడియో ఫుటేజీని పోలీసులకు అందజేశారు. విచారణలో ఎమ్మెల్యే పేరును నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ఈసీ చాలా తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది ఈసీ. ఈ మేరకు సీఈవో ముఖేష్ కుమార్ మీనాకు కూడా ఈసీ నుంచి ఆదేశాలు అందాయి. తద్వారా ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించే విషయంలో భవిష్యత్తులో ఎవరూ ఇటువంటి దుశ్చర్యలకు సాహసం చేయరని ఎన్నికల కమిషన్ భావిస్తోంది. ఇదిలా ఉంటే.. సిట్‌ రంగంలోకి దిగాక పోలీసులు పిన్నెల్లిపై కేసు పెట్టారా..? అంతకుముందే నమోదు చేశారా..? అన్న విషయంలో స్పష్టత లేదు. అయితే.. ఈ వీడియో బయటికి రాకముందు మాచర్ల నియోజకవర్గంలో ఎక్కడా గొడవలు చేయలేదని ఎమ్మెల్యే పిన్నెల్లి శుద్ధపూస కథలు చాలానే చెప్పారు.

అసలేం జరిగింది..?

రెంటచింతల మండలంలోని పాల్వాయి గేటులో ప్రశాంతంగా పోలింగ్‌ జరుగుతుండగా.. అక్కడ టీడీపీకే ఎక్కువ ఓట్లు పోలవుతున్నాయని.. తనకు ఓట్లు వేయడం లేదన్న అక్కసుతో పిన్నెల్లి బరితెగించారు. గ్రామంలోని 202వ నంబర్‌ పోలింగ్‌ బూత్‌లోకి ప్రవేశించి.. ఈవీఎంను ఎత్తి నేలకేసికొట్టారు. అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంటుపై ఆయన, ఆయన అనుచరులు దాడిచేశారు. అలాగే మరో ఏడు పోలింగ్‌ కేంద్రాల్లోనూ పిన్నెల్లి ఈవీఎంలు ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఆ ఏజెంట్‌పై అదేరోజు బూత్‌ బయటే గొడ్డలితో దాడి చేశారు. మరోవైపు.. మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్‌ రోజు, ఆ మర్నాడు జరిగిన హింసాత్మక సంఘటనల నేపథ్యంలో పిన్నెల్లి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిని 14న గృహనిర్బంధం చేశారు. కానీ అర్ధరాత్రి వారిరువురూ ఇంటి నుంచి పరారయ్యారు. వారు తప్పించుకుపోతున్నా పోలీసులు చోద్యం చూశారన్న విమర్శలున్నాయి. సదరు పోలీసులపై కూడా నేటి వరకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. సిట్ రంగంలోకి దిగినా ఈ వ్యవహారంలో ఇంతవరకూ ఎలాంటి పురోగతి లేకపోవడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అయితే పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం అంత సమస్యాత్మకం అయినప్పటికీ ఇద్దరే పోలీసులు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. పిన్నెల్లిని వెంటనే అరెస్ట్ చేయాలని టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. పల్నాడు అల్లర్లపై వేసిన సిట్‌ ఒక డొల్ల తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

Dark Side of Rave Parties : రేవ్ పార్టీలో ఏమి చేస్తారో తెలుసా? పార్టీలకు, రేవ్ పార్టీలకు ఉన్న డిఫరెన్స్ అదే

Things to Do at Rave Parties : సినిమా ఇండస్ట్రీలో సెలబ్రెటీలు తరచూ పార్టీలు చేసుకుంటారు. సెలబ్రేట్ చేసుకోవడానికి సెలబ్రెటీలే ఏముంది కానీ.. అందరూ తరచూ వివిధ కారణాలతో పార్టీలు చేసుకుంటారు.

కానీ అలాంటి వాటిలో పోలీసులు ఎక్కువగా ఇన్​వాల్వ్ కారు. మరి ఈ రేవ్​ పార్టీలపై ఎందుకు అంత ఆసక్తి చూపిస్తారు. తాజాగా బెంగుళూరులోని రేవ్ పార్టీ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్​గా మారింది. పార్టీలకు, రేవ్ పార్టీలకు ఉండే డిఫరెన్స్ ఏంటి? అసలు రేవ్ పార్టీలో ఏమి చేస్తారు?

కొంతమంది కలిసి ఓ అకేషన్​ని సెలబ్రేట్ చేసుకుంటే దానిని పార్టీ అంటారు. అలాంటి పార్టీల్లో రేవ్ పార్టీ కూడా ఒకటి. దీనిలో కొంతమంది సభ్యులు కలిసి.. సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ.. ఇది పూర్తిగా ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్​(EDM) తో నిండి ఉంటుంది. ఎప్పుడూ ఊహించని ఓ ట్రాన్స్​లోకి మిమ్మల్ని తీసుకుపోతుంది. ఆ పార్టీలో ఉన్న సభ్యులందరూ ఒకే రిథమ్​తో.. డీజేలు చేసే స్పిన్నింగ్ ట్రాక్​లతో ఎంజాయ్ చేస్తూ.. మరో కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. ఇది కేవలం పార్టీ అనేకంటే.. ఓ అనుభవంగా చెప్పవచ్చు. ఎందుకంటే..

బౌండరీలు లేని లోకం అది..

రేవ్ పార్టీలో బయటి ప్రపంచంలోని నియమాలు వర్తించవు. సొంతంగా.. మీకు నచ్చినట్టు ఉంటూ.. మ్యూజిక్​ని ఎంజాయ్ చేయవచ్చు. మీ అభిరుచిని పంచుకునే ఇతరులతో కనెక్ట్ అయ్యేందుకు స్వేచ్ఛ ఉంటుంది. ఎనర్జీని ఒకరినుంచి మరొకరికి ట్రాన్ఫర్ చేయడం, పూర్తిగా ఎంజాయ్ చేసే వాతావరణం ఈ పార్టీల్లో ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ తరహా పార్టీలో ఇవే చేయాలి.. ఇవి చేయకూడదనే నిబంధనలు ఏమి ఉండవు. నచ్చినవారితో నచ్చినంత సేపు గడిపేయొచ్చు.

ఎప్పుడు మొదలైంది అంటే..

ఈ రేవ్ పార్టీ కల్చర్ 1980లో చికాగోలో ప్రారంభమైంది. అప్పుడు ఇది నైట్ కల్చర్ కాదు. డే టైమ్​లో కూడా చేసుకునేవారు. డీజేలు కొత్త బీట్​లు చేయడం, ఎనర్జీని పెంచే వాతావరణాన్ని సృష్టించడం చేసేవారు. ఇంతకు ముందు ఎప్పుడూ వినని మ్యూజిక్ దానిలో ఉండేది. అనంతరం యూకే చేరుకుంది. యూకేలో ఈ రేవ్ పార్టీ తన రూపాన్నే మార్చేసింది.

పార్టీ లొకేషన్ షేర్ చేసేది అప్పుడే..

యూకేలో రేవ్​పార్టీలు భారీగా చేసేవారు. రాత్రిళ్లు చేసే డ్యాన్స్ పార్టీలకు ఇవి ప్రత్యామ్నాయంగా మారిపోయాయి. సీక్రెట్ ప్లేస్​లలో వీటిని నిర్వహించేవారు. అయితే ఈవెంట్​కు వచ్చే కొన్ని గంటల ముందు మాత్రమే లొకేషన్ షేర్ చేస్తారు. ముందే రివేల్ చేస్తే పార్టీ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని భావిస్తారు. ఈ కల్చర్​లో కొకైన్ వంటి మాదక ద్రవ్యాలు, డ్రింక్స్ చేరడంతో సంస్కృతికి ఈ పార్టీలు విరుద్ధంగా మారిపోయాయి. త్వరిత కాలంలోనే ప్రపంచంలోని ప్రతిమూలకు ఈ పార్టీ కల్చర్ వ్యాపించింది.

కేవలం మ్యూజిక్ మాత్రమే కాదు.. అంతకుమించి..

రేవ్ పార్టీలు కేవలం మ్యూజిక్ అనుభవమే కాదు.. రేర్ అనుభవాన్ని ఇస్తాయి. డ్యాన్స్ చేయడం, మ్యూజిక్ వినడమే కాదు.. మీ మనసుకు నచ్చినట్టు ఉండడమనేదే ఈ పార్టీల ప్రధాన లక్షణం. అర్థరాత్రి ఆపే పార్టీలు కావు ఇది. ఉదయం వరకు రేవర్​లలో ఉత్సాహాన్ని పెంచే ఓ మాయలోకంగా చెప్పవచ్చు. ఇంద్రియాలకు ఈ పార్టీలు విందునిస్తాయనే చెప్పవచ్చు. తెలియకుండానే మీలో ఎనర్జీ, ఉల్లాసం పెరుగుతుంది. ఈ పార్టీల గురించి బయటకు తెలియకుండా మ్యూజిక్ వినేందుకు ఎక్కువగా హెడ్ ఫోన్స్ వినియోగిస్తారు. పార్టీ అయ్యేంత సేపు ఈ హెడ్ ఫోన్స్​లో మ్యూజిక్ ప్లే అవుతూనే ఉంటుంది.

ఒకప్పుడు చిల్​ అవుట్ జోన్​లు

చిల్​ అయ్యేందుకు ఒకప్పుడు రేవ్ పార్టీలు జరిపేవారు.చాలామంది ఈ పార్టీలోని రేవర్​లు లైఫ్​ టైమ్​ ఫ్రెండ్స్​గా మార్చుకునేవారు. ఇప్పుడు మాదక ద్రవ్యాలు, మందు, అసాంఘిక కార్యకలాపాలకు ఇవి వేదికగా మారాయి. ఎలాంటి హద్దులు దీనిలో ఉండవు కాబట్టి.. కొందరు ఈ పార్టీల పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. అందుకే దీనిపై పోలీసులు నిఘా పెట్టడం ప్రారంభించారు.

గెలిచే సీట్లు ఇవే .. జనసేన ఆశలు

నువ్వా నేనా అన్నట్టుగా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోరు హోరా హోరీగా జరిగింది . వైసిపి 175 స్థానాల్లోనూ ఒంటరిగా పోటీ చేయగా , టిడిపి, జనసేన బిజెపిలు ఆ సీట్లను సర్దుబాటు చేసుకుని మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి.

ఈ పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ , 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను పోటీకి దించింది . ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను తాము గెలుచుకుంటామనే ధీమా జనసేన పార్టీ ( Jana Sena Party )ఉంది. గతంలో మాదిరిగా పూర్తిగా కొత్త వాళ్లకు టికెట్ల ను కేటాయించకుండా, ఇతర పార్టీల నుంచి జనసేనలో చేరిన బలమైన నేతలకు టికెట్లు కేటాయించారు. రాజకీయంగా అనుభవం ఉన్న వారి ఎక్కువమంది కావడంతో గెలుపు పై జనసేన భారీగానే ఆశలు పెట్టుకుంది.

జనసేన వర్గాల లెక్కల ప్రకారం చూసుకుంటే కనీసం 21 లో 17 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తాము అని, లోక్ సభ తాము పోటీ చేసిన కాకినాడ మచిలీపట్నం లోక్ సభ కు పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ విజయం సాధిస్తామని జనసేన పార్టీ అంచనాతో ఉంది.

కాకపోతే అసెంబ్లీ సీట్ల విషయంలోనే ఎక్కువ టెన్షన్ పడుతోంది. ముఖ్యంగా పోలవరం, పాలకొండ రైల్వేకోడూరు స్థానాల్లో గెలుపు కష్టమనే అభిప్రాయా,నికి వచ్చినట్లు సమాచారం. దీంతోపాటు నెల్లిమర్ల నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన లోకం మాధవితో పాటు , ఎన్నికలకు ముందు జనసేన నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ ,అలాగే తిరుపతిలో పోటీ చేసిన ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు.

రాజోలు ,రాజానగరం, పి గన్నవరం నియోజకవర్గంలో సైతం వైసీపీ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో తప్పకుండా విజయం తమదే అన్న ధీమా జనసేన వర్గాల్లో కనిపిస్తోంది . ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పోటీ చేసిన పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి .పవన్ భారీ మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా జనసేన పార్టీ కీలక నేతలే అంచనా వేస్తున్నారు. పిఠాపురం ఎఫెక్ట్ తో కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ ( Tangella Uday Srinivas )కూడా విజయం సాధిస్తారని , ఇక మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిగా పోటీకి దిగిన బాల శౌరి కూడా విజయం సాధిస్తారని జనసేన ధీమాతో ఉంది.

ఖాళీ కడుపుతో 30 నిమిషాలు మార్నింగ్‌ వాక్‌ చేస్తే చాలు.. బరువు తగ్గడం ఖాయం

రోజుకు 30 నిమిషాల మార్నింగ్ వాక్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మొత్తం శ్రేయస్సును మెరుగుపరుస్తుంది. నడక వంటి శారీరక శ్రమ బరువును నియంత్రించడంలో మరియు కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది.

మీ దినచర్యలో 30 నిమిషాల చురుకైన నడకను జోడించడం వలన మీరు బరువు తగ్గడంతోపాటు ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు.

రెగ్యులర్ వాకింగ్ శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సాధారణంగా, శారీరక వ్యాయామాలు మరియు కార్యకలాపాలు ఆందోళన, నిరాశ, ఒత్తిడి మరియు ఇతర సమస్యలను నివారించేందుకు సహాయపడతాయని చెబుతారు. మార్నింగ్‌ వాక్‌ వల్ల వీటి కంటే ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు.. ఏంటంటే..

మెరుగైన శక్తి స్థాయి :

ఖాళీ కడుపుతో ఉదయం నడక మీ శక్తిని పెంచుతుంది, మీరు రిఫ్రెష్ మరియు శక్తిని పొందేలా చేస్తుంది. నడక వంటి సాధారణ శారీరక శ్రమ మీ శక్తి స్థాయిలను పెంచడానికి గొప్ప మార్గం. ఇది రోజంతా అలసట మరియు ఉత్సాహాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

గుండె ఆరోగ్యాన్ని బలపరుస్తుంది :

ఉదయాన్నే చురుకైన నడక మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ సాధారణ వ్యాయామం గుండె ఆరోగ్యాన్ని మరియు రక్తపోటును తగ్గిస్తుంది. ప్రతిరోజూ ఉదయం వ్యాయామం చేయడం వల్ల మీ స్ట్రోక్ మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని ముందుగానే తగ్గించుకోవచ్చు.

జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది :

జీర్ణక్రియను ఉత్తేజపరిచేందుకు ఖాళీ కడుపుతో ఉదయాన్నే నడవడం మంచిది. ఈ అభ్యాసం మీ ఉదర కండరాల సహజ సంకోచాన్ని ప్రోత్సహిస్తుంది. నడకను ఒక సాధారణ అలవాటుగా చేసుకోండి మరియు మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోండి.

మెరుగైన మానసిక ఆరోగ్యం :

మెరుగైన ఆత్మగౌరవం, మెరుగైన మానసిక స్థితి మరియు తగ్గిన ఆందోళన సమస్యలతో సహా మీ మానసిక ఆరోగ్యానికి నడక గొప్ప ప్రయోజనాలను కలిగి ఉంటుంది. శారీరక శ్రమ మీ శరీరం మానసిక స్థితి మరియు ఆత్మగౌరవాన్ని మెరుగుపరిచే ఎండార్ఫిన్‌లను విడుదల చేయడంలో సహాయపడుతుంది. ఉదయం నడక యొక్క ఈ శారీరక ప్రయోజనాలు మీ రోజువారీ జీవితంలో మీకు చాలా ప్రయోజనం చేకూరుస్తాయి.

మెరుగైన నిద్ర :

మార్నింగ్ వాక్‌తో పగటిపూట చురుకుగా ఉండటం వల్ల మీరు సులభంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. సూర్యరశ్మి సహజంగా మీ సిర్కాడియన్ రిథమ్‌ను ఏర్పాటు చేయడంలో సహాయపడుతుంది, ఇది మీ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. మీ దినచర్యకు 30 నిమిషాల మార్నింగ్ వాక్ జోడించడం వల్ల మీ మెదడు కార్యకలాపాలు పెరుగుతాయి. శారీరక శ్రమ మెదడుకు రక్త సరఫరాను పెంచుతుంది మరియు మీ అభిజ్ఞా పనితీరు, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నడక వంటి మితమైన వ్యాయామం, కాలక్రమేణా జ్ఞాపకశక్తి నష్టం యొక్క ప్రభావాలను తగ్గించడానికి నిరూపితమైన మార్గం.

బరువు తగ్గడం

ఖాళీ కడుపుతో 30 నిమిషాల మార్నింగ్ వాక్ అనే నియమాన్ని అనుసరించండి. రోజంతా శక్తిని పొందండి. ఈ సాధారణ అభ్యాసాన్ని మీ రోజువారీ షెడ్యూల్‌లో చేర్చడం ద్వారా మీరు ఈ అనేక ప్రయోజనాలను సులభంగా పొందవచ్చు.

డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నారా?.. టెక్ మహీంద్రాలో ఉద్యోగాలు.. మిస్ చేసుకోకండి

ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగంలో లేఆఫ్స్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఏక్షణం జాబ్ పోతుందో తెలియక ఐటీ ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వరల్డ్ వైడ్ గా దిగ్గజ ఐటీ కంపెనీలు భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

ఐటీ ఉద్యోగాలు గాల్లో దీపాల మదిరిగా అయిపోయాయి. ఉన్నపలంగా జాబ్ పోతే ఎలా బ్రతకాలి, కుటుంబాలను ఎలా పోషించుకోవాలో తెలియక ఐటీ ఎంప్లాయీస్ దిగుల చెందుతున్నారు. ఇలాంటి తరుణంలో ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మహీంద్రా గుడ్ న్యూస్ అందించింది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. మీరు డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్నట్లైతే ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి.

ఇటీవల దేశీయ టెక్ దిగ్గజాలు అయినటువంటి ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇంకా ఇతర సంస్థలు కొత్త నియామకాలను చేపట్టకపోగా ఉన్న ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. దీంతో ఐటీ రంగంలోకి రావాలనుకునే బీటెక్ డిగ్రీ కలిగిన విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో టెక్ మహీంద్రా మాత్రం సీనియర్‌ సాప్ట్‌వేర్ ఇంజినీర్‌ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో 5 నుంచి 12 ఏళ్ల వర్క్ ఎక్స్ పీరియెన్స్ ఉండాలి. ఎస్‌ఏపీ, ఐఎస్‌యూ బిల్లింగ్‌ అండ్‌ ఏఎంపీ ఇన్‌వాయిసింగ్‌-1, బిజినెస్‌ మాస్టర్‌ డేటా తదితరాల్లో నైపుణ్యాలు ఉండాలి.

ఈ ఉద్యోగాలకు ఎంపికైతే హైదరాబాద్ కేంద్రంగా పనిచేయాల్సి ఉంటుంది. అసోసియేట్‌ టెక్‌ స్పెషలిస్ట్‌ ఉద్యోగాల కోసం పోటీ పడే అభ్యర్థులు డిగ్రీ పాసై ఉండాలి. సంబంధిత విభాగంలో 5 నుంచి 10 ఏళ్ల పని అనుభవం కలిగి ఉండాలి. ఎస్‌ఏపీ ఎస్‌/ 4హెచ్‌ఏఎన్‌ఏ, సెంట్రల్‌ ఫైనాన్స్‌-2 పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్‌ కలిగి ఉండాలి. ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులకు పోటీ పడే అభ్యర్థులు డిగ్రీ పాసై ఉండాలి. సంబంధిత విభాగంలో 6 నుంచి 12 ఏళ్ల పని అనుభవం తప్పనిసరి. ఎస్‌/ 4 హెచ్‌ఏఎన్‌ఏ-1 ఫైనాన్షియల్ అకౌంటింగ్ స్కిల్స్‌ కలిగి ఉండాలి. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

62 ఏళ్లు నిండేవరకు వారిని సర్వీసులో కొనసాగించండి

ఇప్పటికే పదవీ విరమణ చేసి 62 ఏళ్లు పూర్తికాని వారికి ఉపశమనం

రాష్ట్ర సర్కారుకు హైకోర్టు ఆదేశం

వ్యవసాయ పరపతి సంఘాలకు సంబంధించి కోర్టును ఆశ్రయించిన వారికే వర్తింపు

అమరావతి, మే 21 : పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు.. ప్రాథమిక వ్యవసాయ కో ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ(పీఏసీసీఎస్‌) ఉద్యోగులకు వర్తిస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది. 62 ఏళ్లు నిండేవరకు పీఏసీసీఎస్‌ ఉద్యోగులను సర్వీసులో కొనసాగించాలని అధికారులను ఆదేశించింది. వ్యాజ్యాలు విచారణలో ఉండగా 60 ఏళ్లకే పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఇప్పటికీ 62 ఏళ్లు నిండకుంటే వారిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని తేల్చిచెప్పింది.

వారికి వేతన బకాయిలను కూడా చెల్లించాలని పేర్కొంది. ఈ ఉత్తర్వులు 60 ఏళ్లు పూర్తికాకముందు కోర్టును ఆశ్రయించిన పిటిషనర్లకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌ ఇటీవల తీర్పు ఇచ్చారు. పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను తమకు కూడా వర్తింప చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పలు ప్రాథమిక వ్యవసాయ కో ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు.

వారి తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. పదవీ విరమణ వయసు పెంచుతూ ప్రభుత్వం చేసిన చట్టం పిటిషనర్లకు వర్తిస్తుందన్నారు. దీంతో పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ పీఏసీసీఎ్‌సలు కూడా తీర్మానాలు చేశాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ..

పదవీ విరమణ వయసును పెంచే విషయంలో ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. కో ఆపరేటివ్‌ సొసైటీల రిజిస్ట్రార్‌ తీర్మానాలను ఆమోదించనంత వరకు వాటికి ఎలాంటి విలువ ఉండదన్నారు. ఈ విషయంలో హైకోర్టు ధర్మాసనం ఇప్పటికే తీర్పు ఇచ్చిందని తెలిపారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పు పిటిషనర్లకు వర్తించదని స్పష్టం చేశారు. 62 ఏళ్ల వయసు నిండే వరకు పీఏసీసీఎస్‌ ఉద్యోగులను సర్వీసులో కొనసాగించాలని ఆదేశించారు.

Rave Party: బెంగళూరు రేవ్ పార్టీలో కీలక సూత్రధారి ఎవరంటే..

Rave Party: బెంగళూరు రేవ్ పార్టీలో కీలక సూత్రధారి ఎవరంటే..

అమరావతి: బెంగళూరు (Banglore) ఎలక్ట్రానిక్ సిటీ (Electronic City) సమీపంలోని ఓ ఫాం హౌస్‌ (Farm House)లో జరిగిన రేవ్ పార్టీ (Rave Party)లో ఐదుగురిని పోలీసులు నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే. అయితే రేవ్ పార్టీ లో కీలక సూత్రధారి విజయవాడ వాసి లంకపల్లి వాసు (Vasu)గా పోలీసులు గుర్తించారు. వన్ టౌన్ కొత్తపేటలోని ఆంజనేయవాగుకు చెందిన వ్యక్తిగా పేర్కొన్నారు. విజయవాడలోనూ అతిపెద్ద బుకీల నెట్‌వర్క్‌ను వాసు విస్తరించాడు. పైకి మాత్రం వ్యాపారం, ఫార్మా రంగాల పేర్లను ఉపయోగించుకుంటున్నాడని, డీజీపీ కార్యాలయంలో కొంత మంది అధికారుల పేర్లను వాసు ఉపయోగించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. బెట్టింగ్‌లతో పాటు డ్రగ్స్ వ్యవహారంలోనూ వాసు కీలక సూత్రధారి. విజయవాడలోని గాంధీనగర్‌లో తన స్నేహితుడితో కలిసి రూ.6 కోట్లతో ఒక స్థలం కొనుగోలు చేశాడు. బెంగళూరు పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్లలో ఏపీ పోలీసుల నంబర్లు ఉండటంతో లోతుగా విచారణ జరుపుతున్నారు. వాసు దందాలకు కొంతమంది పోలీసులు అండగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. విచారణ కొనసాగుతోంది.

బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫాం హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీకి సుమారు 150 మంది వరకు హాజరయ్యారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు నాన్ స్టాప్‌గా పార్టీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ పార్టీలో ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు (Police) తెలిపారు. నిర్వాహకుడు వాసుతోపాటు అరుణ్ (Arun), సిద్దికి (Siddiqui), రన్‌దీర్ (Randhir), రాజ్ భవ్‌ (Raj Bhav)లను పోలీసులు అరెస్టు చేశారు. వాసు బర్త్‌డే పార్టీలో డ్రగ్స్ వినియోగించినట్లు పోలీసులు తెలిపారు. సిద్దికి, రన్‌దీర్, రాజ్‌భవ్‌లను డ్రగ్స్ పెడ్లర్లుగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బెంగళూరు పోలీసుల ఎఫ్ఐఆర్ కాపీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి చిక్కింది.

కాగా బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలో రేవ్‌ పార్టీ జరిగింది. జీఆర్‌ ఫామ్‌హౌస్‌లో బర్త్‌ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్‌ పార్టీని నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగింది. జీఆర్‌ ఫామ్‌హౌస్‌ అనేది హైదరాబాద్‌‌కు చెందిన గోపాల్‌ రెడ్డికి చెందినదిగా పోలీసుల విచారణలో తేలింది. తెల్లవారుజామున 3 వరకు జరుగుతున్న రేవ్‌ పార్టీపై పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో సంచలన విషయాలు వెలుగు చూశాయి.

రేవ్ పార్టీలో పోలీసులకు డ్రగ్స్‌, కోకైన్‌ లభ్యమయ్యాయి. దీనిలో ముఖ్యంగా తెలుగు రాష్టాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు బెంగుళూరు పోలీసులు గుర్తించారు. రేవ్‌ పార్టీలో తెలుగు సీనీ ఇండస్టీకి చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు. రేవ్‌ పార్టీలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి పేరుతో పాస్‌ ఉన్న కారు సైతం లభ్యమయ్యాయి. ఎలక్ట్రానిక్‌ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ సినీ ప్రముఖులు ఎవరన్న విషయం మాత్రం ఇప్పటి వరకూ బయటకు రాలేదు.

కన్నడ సీరియల్‌ నటులతోపాటు 20 మందికిపైగా మోడల్స్‌ పార్టీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో 17 గ్రాముల ఎండీఎంఏ, కొకైన్‌తోపాటు 15 ఖరీదైన కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి పేరుతో పాస్‌ ఉన్న కారు సైతం లభ్యమైందని తెలిసింది. ఐతే.. ఈ ఆరోపణలను కాకాణి ఖండించారు. ఆ కారుతో తనకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. ఎలక్ర్టానిక్‌ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, ఈ పార్టీలో పాల్గొన్న 30 మంది యువతులు, 70 మంది యువకులు ఏపీ, హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు విమానంలో వచ్చినట్టు తెలుస్తోంది. ఈవెంట్‌ కోసం ఫౌంహౌస్‌ నిర్వాహకులకు రూ.30 నుంచి రూ.50 లక్షలు చెల్లించినట్టు సమాచారం. రేవ్‌ పార్టీలో పాల్గొన్న వారిలో సినీ, రాజకీయ ప్రముఖులు ఎంతమంది ఉన్నారు..? ఎవరెవరు డ్రగ్స్‌ తీసుకున్నారు..? అనేది తెలియరాలేదు. అందుకోసం మెడికల్‌ టెస్టులు నిర్వహిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

AP Results: ఏపీ ఎన్నికల్లో విజయంపై వైసీపీ లెక్క ఇలా- టీడీపీ లెక్క అలా..!

AP Results: ఏపీ ఎన్నికల్లో విజయంపై వైసీపీ లెక్క ఇలా- టీడీపీ లెక్క అలా..!

ఏపీలో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయంపై అధికార, విపక్ష పార్టీలు ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. జూన్ 4న వెలువడే ఫలితాల్లో తాము విజయఢంకా మోగించడం ఖాయమని చెప్పుకుంటున్నారు.

అయితే వీరి ధీమా వెనుక గల కారణమేంటన్న అనుమానం వారికి ఓట్లేసిన, వేయని ఓటర్లలోనూ కలుగుతోంది. దీనికి కారణం రాష్ట్రంలో ఫలితాలపై వ్యక్తమవుతున్న మిశ్రమ అంచనాలే.

ఏపీలో వైసీపీ గతంలో సాధించిన 151 సీట్లకు పైగా గెలిచి దేశమంతా తమవైపు తిరిగి చూసేలా చేస్తుందని సీఎం జగన్ ఇప్పటికే ప్రకటించారు. అయితే వైసీపీలో అంతర్గతంగా నేతల మధ్య జరుగుతున్న చర్చను బట్టి చూస్తుంటే కనీసం 120 సీట్లు గెల్చుకోవడం ఖాయమనే మాట వినిపిస్తోంది. అటు కూటమి నేతలను కదిపితే కనీసం 100-115 సీట్లు ఖాయమంటున్నారు. గాలి బాగా వీస్తే ఈ సంఖ్య 140 వరకూ వెళ్తుందని చెప్తున్నారు.

అయితే వైసీపీ లెక్కను ఓసారి చూస్తే.. రాయలసీమలో గతంలో 49 సీట్లు గెల్చుకుని దాదాపు క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ.. ఈసారి కూడా దానికి కాస్త అటు ఇటుగా అంటే 35-40 సీట్లు గెల్చుకుంటుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కోస్తాంధ్రలో ప్రతీ జిల్లాల్లోనూ నామమాత్రపు సీట్లు లభించినా 9 ఉమ్మడి జిల్లాల్లో 40-50 సీట్లు ఖాయమని అంచనా వేస్తున్నారు. దీంతో మరోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు కూటమి అంచనాలను ఓసారి గమనిస్తే .. రాయలసీమలో వైసీపీకి 25-30 సీట్లు వస్తాయని, మరో 20 సీట్లు తాము కైవసం చేసుకోవడం ఖాయమని భావిస్తున్నారు. అలాగే కోస్తాంధ్రలో జనసేనతో పొత్తు కారణంగా టీడీపీ, బీజేపీ కలిపి ఏకపక్షంగా పలు జిల్లాల్ని స్వీప్ చేయడం ఖాయమని లెక్కలేసుకుంటున్నారు. కోస్తాంధ్రలోనే తమకు మ్యాజిక్ మార్కుకు అవసరమైన మెజార్టీ సీట్లు వచ్చేస్తాయని కూటమి పార్టీల నేతల అంచనా. అప్పుడు రాయలసీమ సీట్లను కూడా కలుపుకుంటే భారీ మెజార్టీ ఖాయమంటున్నారు.

AP Polycet 2024 Counselling: ఏపీ పాలిసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. జూన్‌ 10 నుంచి తరగతులు

AP Polycet 2024 Counselling: ఏపీ పాలిసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. జూన్‌ 10 నుంచి తరగతులు

ఆంధ్రప్రదేశ్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. తాజా షెడ్యూల్‌ ప్రకారం మే 23 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నాగరాణి తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలన 27 నుంచి జూన్‌ 3 వరకు చేపట్టనున్నారు. మే 31 నుంచి జూన్‌ 5వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్ల ఎంపికకకు అవకాశం కల్పించారు. ఐచ్ఛికాలు మార్చుకునేందుకు మే 5వ తేదీలోనే వెసులుబాటు కల్పించారు. ఇక మే 7న సీట్ల కేటాయింపు ఉంటుంది. మే 10 నుంచి 14 వరకు విద్యార్ధులు సీట్లు పొందిన కాలేజీల్లో ప్రవేశాలు పొందవల్సి ఉంటుంది. విద్యార్థులు సీటు పొందిన కాలేజీల్లో వ్యక్తిగతంగా లేదంటే ఆన్‌లైన్‌ విధానం ద్వారా రిపోర్టు చేయాల్సి ఉంటుంది. అనంతరం జూన్‌ 10 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

కాగా ఈ ఏడాది పాలిసెట్‌ ఫలితాలు మే 8వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాల్లో మొత్తం 1,24,430 మంది అర్హత సాధించారు. వీరిలో బాలికలు 50,710 (89.81 శాతం) మంది, బాలురు 73,720 (73.72 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే ఈ ఏడాది పాలీసెట్‌ ఉత్తీర్ణత 87.61 శాతం నమోదైంది. ఈ పరీక్షకు మొత్తం 1.42 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. పాలీసెట్‌లో వచ్చిన ర్యాంకు, రిజర్వేషన్‌ కేటగిరి, ఇతర అంశాల ఆధారంగా కౌన్సెలింగ్‌లో ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీల్లో వివిధ డిప్లొమా కోర్సుల్లో సీటు కేటాయిస్తారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీలు మొత్తం 267 ఉన్నాయి. వాటిల్లో మొత్తం 82,870 సీట్లు అందుబాటులో ఉన్నట్లు ఇప్పటికే సాంకేతిక విద్యాశాఖ స్పష్టం చేసింది.

Aarambham OTT: అదిరిపోయే ట్విస్టులు.. ఓటీటీలో లేటెస్ట్ సైంటిఫిక్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Aarambham OTT: అదిరిపోయే ట్విస్టులు.. ఓటీటీలో లేటెస్ట్ సైంటిఫిక్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

సాధారణంగా థియేటర్లలో రిలీజైన నెల రోజుల తర్వాత సినిమాలు ఓటీటీలోకి వస్తుంటాయి. కొన్ని సినిమాలు మూడు వారాలకే డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తాయి. మూవీ మేకర్స్, ఓటీటీ సంస్థల ఒప్పందం మీద ఇది ఆధారపడి ఉంటుంది. అయితే ఇటీవల సత్యదేవ్ నటించిన కృష్ణమ్మ వారం రోజులకే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం దేశమంతా ఎలక్షన్లు, ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. కాబట్టి సినిమా థియేటర్లలో సందడి ఉండడం లేదు. అందుకే థియేటర్లలో రిలీజైన సినిమాలు వెంటనే ఓటీటీ బాట పడుతున్నాయి. అలా థియేటర్లలో విడుదలైన రెండు వారాలకే ఓ సూపర్ హిట్ సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి రానుంది. అదే ఆరంభం. అజయ్‌ నాగ్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో మోహన్‌ భగత్‌, సుప్రితా సత్యనారాయణ్‌, భూషణ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మే 10న థియేట‌ర్ల‌లో రిలీజైన ఆరంభం సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఓ క‌న్న‌డ న‌వ‌ల ఆధారంగా టైమ్ లూప్ కాన్సెప్ట్‌కు సైంటిఫిక్ థ్రిల్లర్ అంశాలను జోడించి ఎంతో ఆసక్తికరంగా ఈ సినిమాను రూపొందించారు మేకర్స్. ఆద్యంతం ఆకట్టుకునే కథనం, ట్విస్టులు ఉండడంతో సినిమాకు విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి.
ఇలా థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఆరంభం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ ఈ సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మే 23 నుంచే ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. అంటే థియేటర్లలో విడుదలైన రెండు వారాలకే ఈ మూవీ ఓటీటీలో సందడి చేయనుందన్న మాట.

సినిమా కథ ఏంటంటే.. ఓ హత్యకేసులో రెండున్నరేళ్లు జైలు జీవితం గడుపుతాడు మిగిల్‌ అనే వ్యక్తి. ఉరిశిక్ష ఖరారు కాగా జైలు నుంచి పారిపోతాడు. భారీ భద్రత ఉండగా అతడెలా కారాగారం నుంచి తప్పించుకున్నాడో తెలుసుకునేందుకు డిటెక్టివ్‌ రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో డిటెక్టివ్‌కి మిగిల్‌కు సంబంధించిన పుస్తకం ఒకటి వెలుగులోకి వస్తుంది. అందులో ఉన్న డెజావు కాన్సెప్ట్‌ ఏంటి? దాని గురించి మిగిల్‌కు చెప్పిందెవరు? అసలు అతడు హత్య చేశాడా, లేదా? అన్నది తెలుసుకోవాలంటే ఆరంభం సినిమా చూడాల్సిందే అంటున్నారు మేకర్స్.

Health

సినిమా