Saturday, November 16, 2024

ఒకే ఫోన్ నంబర్‌తో రెండు బ్యాంక్ ఖాతాలను కలిగి ఉన్నవారికి `RBI` నుండి ముఖ్యమైన సమాచారం

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా ఉంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికీ కనీసం ఒక బ్యాంకు ఖాతా ఉంటుంది. ఎందుకంటే నేటి కాలంలో బ్యాంకు ఖాతా లేకుండా ఏ పనీ జరగదు.

అయితే, బ్యాంకు ఖాతా తప్పనిసరి అని నియమం లేదు, కానీ ప్రభుత్వ హామీలు పొందడానికి, మీరు తప్పనిసరిగా బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి. అంతేకాదు ఒకే నంబర్‌తో మరిన్ని ఖాతాలు తెరిచే అవకాశం ఉండడంతో చాలా మంది పలు రకాల బ్యాంకు ఖాతాలను తీసుకుంటున్నారు. కొంతమంది ఉపాధి కోసం బ్యాంకు ఖాతాలు తీసుకుంటే, మరికొందరు గృహ రుణాలు మరియు కారు రుణాల కోసం బ్యాంకు ఖాతాలను తీసుకుంటారు.

అయితే ఇటీవలి కాలంలో ప్రజల సొమ్మును సురక్షితంగా ఉంచేందుకు బ్యాంకులకు ఆర్‌బీఐ కఠిన చర్యలు తీసుకుంటోంది. దీంతో చాలా మంది తమ డబ్బును బ్యాంకుల్లో నిల్వ చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఖాతాల భద్రతలో మార్పులు తీసుకొచ్చేందుకు బ్యాంకుల సహకారంతో ఆర్బీఐ కొత్త నిబంధనలను అమలు చేస్తోంది. అయితే ప్రస్తుతం చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్న వారి కోసం ఆర్బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.

అయితే, ఈ రోజుల్లో ఆధార్ కార్డు మరియు మొబైల్ నంబర్‌తో బ్యాంక్ ఖాతాను నమోదు చేయడం తప్పనిసరి. అదే సమయంలో, ఎక్కువ ఖాతాలు ఉన్నవారు కూడా అన్ని చోట్లా ఒకే మొబైల్ నంబర్‌ను నమోదు చేస్తున్నారు. అయితే, ఇకపై అలా ఉండదని, అయితే మీరు కొత్త బ్యాంక్ ఖాతాను తెరిచినప్పుడు, మీరు KYC ఫారమ్‌ను పూర్తి చేయాల్సి ఉంటుందని RBI స్పష్టం చేసింది. దీని కోసం, RBI KYC యొక్క నియమాలు మరియు ప్రమాణాలను కూడా మార్చింది. ఈ ఆర్డర్ ప్రకారం, ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలను కలిగి ఉన్న మరియు ఒకే నంబర్‌కు లింక్ చేయబడిన కస్టమర్‌లు KYC చేయడానికి అప్‌డేట్ చేయవచ్చు. ఉమ్మడి ఖాతాల విషయంలో, మరొక మొబైల్ నంబర్‌ను KYC ఫారమ్‌లో అప్‌డేట్ చేయాలి.

`RBI` KYC తప్పనిసరి…
అయితే, ఈ రోజుల్లో, KYC కోసం బ్యాంక్ ఖాతాను తెరవడం ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఒక వ్యక్తి బ్యాంక్ ఖాతాను తెరిచినప్పుడు, అతను అందించిన సమాచారం సరైనదని నిర్ధారించడానికి KYC తప్పనిసరిగా నిర్వహించబడాలి. అందుకే కొత్త ఖాతాదారులు కేవైసీ చేయించుకోవాలని బ్యాంకులు ఖాతాదారులకు చెబుతున్నాయి.

Bank Holidays : జూన్ లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా?

మే నెల మరికొద్ది రోజుల్లో పూర్తవుతుంది .. మరో తొమ్మిది రోజుల్లో జూన్ నెల రాబోతుంది.. ప్రతి నెల బ్యాంకులకు సెలవులు ఉంటాయి.. అదేవిధంగా జూన్ లో కూడా సెలవులు ఉన్నాయి..

తాజాగా ఆ వివరాలను రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది.. ప్రతి నెల సెలవుల జాబితాను ముందుగానే తెలుసుకోవడంలో సహాయపడుతుంది, తద్వారా మీరు మీ వెకేషన్ కోసం ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు.. ఇక జూన్ లో ఏకంగా 10 రోజులు సెలవులు ఉన్నాయని తెలుస్తుంది.. ఆ లిస్ట్ ను ఒకసారి చూసేద్దాం..

జూన్ లో బ్యాంక్ సెలవుల లిస్ట్..

జూన్ 2- ఆదివారం, బ్యాంకులకు సెలవు..

జూన్ 9- ఆదివారం,మహారాణా ప్రతాప్ జయంతి,హిమాచల్ ప్రదేశ్, హర్యానా మరియు రాజస్థాన్

జూన్ 10- సోమవారం, శ్రీ గురు అర్జున్ దేవ్ జీ అమరవీరుల దినోత్సవం,పంజాబ్

జూన్ 14 – శుక్రవారం, పహిలి రాజా, ఒరిస్సా

జూన్ 15 – శనివారం – రాజా సంక్రాంతి, ఒరిస్సా

జూన్ 17 – సోమవారం, బక్రీద్

జూన్ 21- శుక్రవారం, వట్ సావిత్రి వ్రతం, అనేక రాష్ట్రాలు

జూన్ 22- శనివారం,సంత్ గురు కబీర్ జయంతి

జూన్ 30- ఆదివారం, దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు..

ఈరోజుల్లో బ్యాంకులు పనిచెయ్యవు ఏదైన పని ఉంటే ముందు రోజుల్లో చూసుకోవడం మంచిది..

10,000 steps a day: రోజుకు 10వేల అడుగులు మంచిదేనా? నిపుణుల మాట ఇదే..!

నడక.. మిగతా వాటితో పోలిస్తే తేలికైన వ్యాయామం. మనం వేసే ప్రతి అడుగు ఆరోగ్యదాయని అని, మన ఆయుష్షును పెంచుతుందని ఇప్పటికే ఎన్నో సార్లు ఎన్నో అధ్యయనాల్లో వెల్లడైంది. మరి ఆరోగ్యకర జీవనానికి రోజుకు ఎన్ని అడుగులు వేయాలి? 10వేల అడుగులు వేస్తే చాలా ఆరోగ్య ప్రయోజనాలను (Health Benefits) పొందొచ్చని దశాబ్దాలుగా ఉన్న మాట. గత కొన్నేళ్లుగా వైద్య నిపుణులు, ప్రభుత్వాలు కూడా దీన్ని ప్రోత్సహిస్తున్నాయి. మరి ఈ ‘రోజుకు 10వేల అడుగులు (10,000 Steps a Day)’ అనేది ఎలా నిర్ధరించారు? దీనిపై నిపుణులు ఏమంటున్నారు?

గడియారాల కంపెనీ యాడ్‌తో మొదలై..
వాస్తవానికి రోజుకు 10వేల అడుగులు వేస్తే ఆరోగ్యానికి మంచిదనే సలహా శాస్త్రవేత్తల నుంచి వచ్చింది కాదు. 1964 టోక్యో ఒలింపిక్స్‌కు ముందు జపాన్‌కు చెందిన గడియారాల కంపెనీ (Japanese company) ‘యమసా’ తమ ఉత్పత్తుల కోసం ఇచ్చిన ఓ ప్రకటనలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఆ సమయంలో యమసా (Yamasa) కంపెనీ కొత్తగా ఓ ‘పెడోమీటర్‌’ను ఆవిష్కరించింది. అది మెటల్‌ బాల్‌తో ఉండే ఒక లెక్కింపు పరికరం. దాన్ని నడుముకు ధరిస్తే మనం రోజుకు ఎన్ని అడుగులు వేశామో లెక్కిస్తుంది. ఒలింపిక్స్‌ సమయంలో దానికి విశేష ఆదరణ దక్కడమే గాక.. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ‘రోజుకు 10వేల అడుగులు (10,000 Steps a Day)’ అనే మాట వ్యాప్తి చెందింది. ఆ తర్వాత ఈ సలహాపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేయడం ప్రారంభించారు.

అధ్యయనాలు ఏం చెప్పాయంటే..?
దీనిపై గతేడాది అమెరికాకు చెందిన జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ, పోలండ్‌లోని లాడ్జ్‌ మెడికల్‌ యూనివర్సిటీ ఓ అధ్యయనాన్ని ప్రచురించాయి. ఇందుకోసం దాదాపు 2.26లక్షల మందితో 17 వేర్వేరు పరిశోధనలు జరిపింది. రోజుకు ఎంతసేపు నడవాలనే ప్రశ్నకు పరిశోధకులు రకరకాల ప్రత్యామ్నాయాలు సూచించారు. వేసే అడుగుల సంఖ్యను బట్టి విభిన్న ప్రయోజనాలుంటాయని వివరించారు.

‘‘రోజుకు దాదాపు 4వేల అడుగులు నడిస్తే అకాల మరణాలకు అడ్డుకట్ట వేయవచ్చు. ఇది అల్జీమర్స్‌, డిమెన్షియా వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. అధికబరువు/ఊబకాయం, డయాబెటిస్‌ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. 2337 అడుగులతో గుండె సంబంధిత (కార్డియోవాస్కులర్‌) జబ్బులతో మరణించే అవకాశాలు తగ్గుతాయి. రోజుకు వెయ్యి అడుగుల చొప్పున నడకను అదనంగా పెంచుకోగలిగితే గుండెజబ్బుల మరణాలు 15 శాతం తగ్గిపోతాయి. 500 అడుగులు పెంచితే.. అవి ఏడు శాతం మేర తగ్గుతాయి. 60 ఏళ్లు పైబడినవారు రోజుకు ఆరు వేల అడుగుల నుంచి 10 వేల అడుగులు నడిస్తే అకాల మరణాల ముప్పు 42 శాతం తగ్గుతుంది’’ అని ఈ పరిశోధకులు సూచించారు.

చిన్న లక్ష్యాలు పెట్టుకోవాలి..
‘‘రోజూ గరిష్ఠంగా ఎంత నడవాలనే అంశంలో ఇప్పటికీ స్పష్టత లేదు. ఎంత ఎక్కువ నడిస్తే (Walking) అంత మంచి లాభాలుంటాయి. మెరుగైన ప్రయోజనాల కోసం 8వేల నుంచి 10వేల అడుగులు నడవడం అనేది ఉత్తమం. వీలైనంత ఉత్తేజంగా ఉండండి. వ్యాయామాన్ని ఆస్వాదించండి. కనీసం రోజుకు అరగంట అయినా వర్కౌట్‌ చేస్తే ఆరోగ్యకర ప్రయోజనాలు (Health Benefits) అందుతాయి’’ అని పరిశోధకులు చెబుతున్నారు. అయితే, ఒక్క రోజులోనే 10వేల అడుగులను చేరుకోలేకపోవచ్చు. వేగంగా నడవాలన్న ప్రయత్నంలో కొన్ని సార్లు గుండె మీద ఒత్తిడి పడుతుంది. కాబట్టి 2,500 నుంచి 3000లతో మొదలుపెట్టి నెమ్మదిగా ప్రతి 15రోజులకి ఐదు వందల చొప్పున పెంచుకుంటూ వెళ్లినా మేలే. బరువు ఉన్నవాళ్లు వెయ్యితో మొదలుపెట్టినా చాలు. అలాగే వృద్ధాప్యంలో ఉన్నవాళ్లు తమ శక్తి మేరకే లక్ష్యాన్ని పెట్టుకోవాలి అని సూచిస్తున్నారు.

గమనిక: ఈ సమాచారం వైద్య నిపుణులు, పరిశోధకుల అధ్యయనాలను పరిశీలించి ఇచ్చినది మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపై ముందుగా వైద్యులను సంప్రదించిన తర్వాతే ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవడమే ఉత్తమం..!

Betel Leaf : తమలపాకు లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా.!

Betel Leaf : తమలపాకులో అనేక ఆరోగ్య లక్షణాలు ఉన్నాయి. ఈ తమలపాకులో విటమిన్ సి, నియాసిన్, థయామిన్, కెరోటిన్, రిబోప్లావిన్ లాంటి పోషకాలు అధికంగా.

ఈ తమలపాకును నమలటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే తమలపాకును తాంబులం రూపంలో తినటం కంటే వాటిని నీటిలో మరిగించి ఆ నీటిని తీసుకోవటం వలన ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆ ప్రయోజనాలు ఏమిటి అనేది ఇప్పుడు మనకు తెలుసుకుందాం..

దీనికోసం ముందుగా పొయ్యి మీద ఒక పాత్రను పెట్టుకోవాలి. తర్వాత దానిలో ఒక గ్లాసు నీరు పోసుకోవాలి. ఒక తమలపాకులు తీసుకొని దానిని ముక్కలుగా కట్ చేసి ఆ వాటర్ లో వెయ్యాలి. ఐదు నుండి ఏడు నిమిషాల వరకు ఆ వాటర్ ను మరిగించి వడగట్టిన తర్వాత తాగాలి. మలబద్ధక సమస్య ఉన్నవారు కూడా ఈ తమలపాకు నీటిని తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ప్రేగు కదలికలు కూడా బాగా జరిగేలా చూస్తుంది. శరీరంలో వాపులను కూడా తగ్గించేస్తుంది. ఈ తమలపాకులో యాంటీ ఇన్ ఫ్ల మెంటరీ లక్షణాలు ఉండటం వలన చాతిలో పేరుకుపోయినటువంటి కఫాన్ని కూడా తొలగిస్తుంది. అంతేకాక జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటి సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఈ తమలపాకు నీరు మధుమేహన్ని నియంత్రించడంలో కూడా మేలు చేస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉచ్చటమే కాకుండా మధుమేహం కారణంగా వచ్చే సమస్యలను కూడా దూరం చేస్తుంది.

చెడు కొలెస్ట్రాల్ మరియు ట్రై గ్లీజరైడ్స్ స్థాయిలను కూడా తమలపాకు నీరు తగ్గిస్తుంది. దీని ద్వారా గుండె ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. ఈ తమలపాకులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఆంటీ ఇన్ ఫ్లమెంటరీ గుణాలు అధికంగా ఉండటం వల్ల అస్తమా లాంటి సమస్యలను అదుపులో ఉంచుతుంది. అంతేకాక తమలపాకును మౌత్ ప్రెషనర్ గా కూడా వాడతారు. ఇది నోటి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపడేలా చేస్తుంది. తమలపాకు నోటిలోని బ్యాక్టీరియా పెరుగుదలను కూడా నియంత్రిస్తుంది. అయితే ఈ తమలపాకు నీటిని ఎప్పుడు పడితే అప్పుడు తాగటం కూడా అంతా మంచిది కాదు. రోజులో ఒకసారి మాత్రమే ఈ తమలపాకు నీరు తీసుకోవటం మంచిది..

Rice : వైట్ రైస్ కన్నా బ్రౌన్ రైస్ ఎందుకు బెస్టో తెలిస్తే.. మీరు అస్సలు వదలరు..!

Rice : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా వైట్ రైస్ నే వాడుతున్నారు. కానీ వైట్ రైస్ తో పోలిస్తే బ్రౌన్ రైస్ అనేది ఎంతో ఆరోగ్యకరమైన ఆహారంగా చెబుతారు.

ఈ బ్రౌన్ రైస్ ను ముడి బియ్యం లేక దంపుడు బియ్యం అని అంటారు. ఈ బియ్యం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచగలిగే ఎన్నో ముఖ్యమైన పోషకాలను కలిగి ఉన్నది. నిజానికి వైట్ రైస్, బ్రౌన్ రైస్ కంటే తక్కువగా ప్రాసెస్ అనేది అవుతుంది. దీనిలో ఫైబర్ కంటెంట్ అనేది అధికంగా ఉంటుంది. అయితే బ్రౌన్ రైస్ ని తీసుకోవడం వల్ల తొందరగా బరువు తగ్గవచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే సాధారణంగా బియ్యాన్ని ఎక్కువ గా పాలీస్ చేస్తారు. దీంతో పోషకాలు అనేవి చాలా తక్కువ ఉంటాయి. బ్రౌన్ రైస్ అనేది అలా కాదు. దీనిని కేవలం బయట పొట్టు మాత్రమే తీసేస్తారు.

దీని వలన ఒక సూక్ష్మక్రిమి పొర అనేది అందులోనే ఉంటాయి. ఎన్నో పోషకాలు కలిగి ఉన్న ఈ బియ్యం గోధుమ లేఖ లేత గోధుమ రంగులో ఉంటాయి. ఇక తెల్ల బియ్యం పొట్టు, ఊక, పొరతో పాటుగా బాగా పాలిష్ అవుతుంది. అందువలన సాధారణ బియ్యం కంటే బ్రౌన్ రైస్ లోనే ఎక్కువ పోషకాలు ఉన్నాయి. అయితే బ్రౌన్ రైస్ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..ఒక కప్పు బ్రౌన్ రైస్ లో పోషకాలు ఇలా ఉన్నాయి. క్యాలరీలు- 248, ఫైబర్- 3.2గ్రా, కొవ్వు-2గ్రా, కార్బోహైడ్రేట్లు- 52 గ్రా,ప్రోటీన్ – 5.5 గ్రా, ఐరన్- డివి 6%, మెగ్నీషియం -19%, మాంగనీస్ – 86% థయామిన్ (B1)- 30%, నియాసిడ్ (B3)- 32%, పెరి డాక్సిన్(B6)- 15%, పాంతోతేనిక్ యాసిడ్ (B)- 50% మేర పోషకాలు కలిగి ఉన్నాయి..

Rice : వైట్ రైస్ కన్నా బ్రౌన్ రైస్ ఎందుకు బెస్టో తెలిస్తే.. మీరు అస్సలు వదలరు..!

బ్రౌన్ రైస్ ప్రాసెస్ చేసిన ఆహారాల కన్నా ఎంతో వేగంగా బరువు తగ్గేలా చేస్తుంది. అనగా బరువు తగ్గించే గుణాలు బ్రౌన్ రైస్ లో ఉన్నాయి. ఉదాహరణకు ఒక కప్పు బ్రౌన్ రైస్ లో 3.5 గ్రాముల ఫైబర్ అనేది కలిగి ఉంటుంది. అయితే ఒక కప్పు తెల్ల బియ్యంలో ఒక గ్రామ్ కన్నా తక్కువ ఫైబర్ కలిగి ఉంటుంది. ఫైబర్ అనేది ఎక్కువ సేపు కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది. బరువు తగ్గటానికి కూడా ఎంతో సహాయం చేస్తుంది. వైట్ రైస్ కన్నా బ్రౌన్ రైస్ బరువు తగ్గటానికి ఎంతో మేలు చేస్తుంది అని వైద్య నిపుణు లు చెబుతున్నారు..

బంగాళాఖాతంలో అల్ప పీడనం.. తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక.. భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌

ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లో కాస్త భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. సాధారణంగా మే నెల చివరి వారంలో.. ఎండలు మండిపోతాయి. కానీ ఈసారి మాత్రం ఇందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. వేసవి తాపం తక్కువగా ఉండే మార్చి, ఏప్రిల్‌లో ఎండలు మండిపోగా.. భానుడు భగభగ మండిపోవాల్సిన మే నెలలో మాత్రం.. తరచుగా వర్షాలు కురుస్తూ.. వాతావరణం చల్లచల్లగా మారుతోంది. ఇక ఈ ఏడాది దేశంలోకి రుతుపవనాలు త్వరగానే ప్రవేశిస్తాయని.. జూన్‌ మొదటి వారంలోగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా వాతావరణ శాఖ అధికారులు రెండు తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఆ వివరాలు..

ఈనెల 22న బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దాని ప్రభావం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. అల్పపీడనం వల్ల ఏపీ, తెలంగాణలో నేటి నుంచి అనగా.. మంగళవారం నుంచి మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్నారు. ఈనెల 24న అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందంటున్నారు. దాని వల్ల గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు. అల్ప పీడన ప్రభావం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో.. భారీ ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని.. తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు.

ఇక నేడు అనగా మంగళవారం సాయంత్రం సాయంత్రం తర్వాత హైదరాబాద్‌లోనూ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీచేశారు. ఇక అల్పపీడనం బలపడి వాయుగుండంగా బలపడే క్రమంలో తెలంగాణలో ఎండల తీవ్రత పెరిగి సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇక బంగాళా‌ఖాతంలో ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు సూచించారు.

బెంగళూరు రేవ్‌ పార్టీ.. ఎంట్రీ ఫీజు ఎంతో తెలిస్తే కళ్లు తిరిగి పడిపోతారు!

‘రేవ్‌ పార్టీ’.. తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్‌ టాపిక్‌. బెంగళూరు రేవ్‌ పార్టీలో తెలుగు ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రెటీలు పట్టుబడటం సంచలనంగా మారింది. బర్త్‌డే పార్టీ సందర్భంగా రేవ్‌ పార్టీ నిర్వహించారనే సమాచారంతో పోలీసులు రైడ్‌ చేసి.. వంద మందికి పైగా సినీ, రాజకీయ ప్రముఖలను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ప్రముఖ నటి హేమా రేవ్‌ పార్టీలో పట్టుబడినట్లు పోలీసులు అధికారికంగా ధృవీకరించారు. అంతకంటే ముందు.. ఆమె పేరు కన్నడ మీడియాలో మారుమోగిపోయింది. కానీ, అదంతా ఫేక్‌ అని హేమా ఒక వీడియో చేసింది. కానీ, పోలీసులు అధికారికంగా ఆమె పేరు వెల్లడించడంతో.. ఆమె అబద్ధాలు చెబుతున్నట్లు తేలిపోయింది.

అయితే.. ఈ రేవ్‌ పార్టీ చాలా పెద్ద ఎత్తులో జరిగినట్లు తెలుస్తోంది. భారీగా డ్రగ్స్‌ ఇతర మాదకద్రవ్యాలు పట్టుబడినట్లు పోలీసులు కూడా వెల్లడించాడు. వాసు అనే బిజినెస్‌ మెన్‌ బర్త్‌ డే సందర్భంగా బెంగళూరులో ఈ రేవ్‌ పార్టీని నిర్వహించినట్లు పోలీసులు వెల్లడించాడు. అయితే.. పెద్ద ఎత్తున్న డ్రగ్స్‌ అందుబాటులో ఉంచడంతో.. ఈ రేవ్‌ పార్టీకి ఎంట్రీ ఫీజు కూడా పెట్టినట్లు సమాచారం. ఒక్కొక్కరి నుంచి ఏకంగా రూ.50 లక్షలు ఫీజు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో ఇచ్చి మీర.. చాలా మంది సెలబ్రెటీలు ఈ రేవ్‌ పార్టీలో పాల్గొన్నారు. చట్టవ్యతిరేక కార్యక్రమం కావడంతో.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. డబ్బుతో పాటు పరువు పోయిందని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

ఈ రేవ్‌ పార్టీకి సంబంధించి బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ పలు సంచలన విషయాలు వెల్లడించారు. ‘సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ’ పేరుతో నిర్వహించిన ఈ రేవ్‌ పార్టీకి ఎంట్రీ ఫీజు కింద రూ.50 లక్షలు పెట్టారని ఆయన పేర్కొన్నారు. పార్టీలో వంద మంది పాల్గొన్నారని, వారిలో సినీ నటి హేమ కూడా ఉన్నారని స్పష్టం చేశారు. అలాగే పరువురు మోడల్స్‌, బుల్లితెర నటులు, బడా బాబుల కుమారులు, బిజినెస్‌మెన్లు, రాజకీయ నేతల కుమారులు పాల్గొన్నారు.

Success Story: స్కూల్ టీచర్ నుంచి రూ.300 కోట్ల కంపెనీకి అధిపతి.. ఎంతోమందికి ఈమె ఆదర్శం

సాధారణంగా ఒక మంచి పుస్తకాన్ని చదివితే మనకు గుర్తుంటుందో లేదో తెలియదు. కానీ, కొంతమంది విజయగాథలు వింటే.. అది మెదడులో చెరగకుండా ముద్ర వేసుకుపోతుంది. అంతేకాకుండా.. వారి సక్సెస్‌ అనేది పది మందికి ఆదర్శంగా నిలిస్తుంది. ఇక లైఫ్‌ లో దేనిని సాధించాలేం, ఇది అసాధ్యాం అనుకున్న వారు సైతం.. వారి మీద వారికి నమ్మకం కలిగి దేనినైనా సాధించగలం అనేలా చేస్తుంది. అందుకే దేనినైనా మార్పు, సాధించాలనే పట్టుదల ఉంటే.. అది ఒక మనిషి విజయగాథ నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. అయితే, అలాంటి గొప్ప సక్సెస్‌ అందుకున్న వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయిన ఓ అమ్మాదయి కూడా ఒకరు. ఆమె పేరు ప్రేరణ ఝున్‌ఝున్‌వాలా. కేవలం స్కూల్‌ టీచర్‌ గా మొదలుపెట్టిన ఆమె ప్రయాణం నేడు రూ.300 కోట్ల కంపెనీకి అధిపతిగా ఎదిగారు. మరి, ఆమె విజయాగాథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రేరణ ఝున్‌ఝున్‌వాలా.. ఈమె భారతీయ ఎంటర్‌ప్రైనర్ గా సింగపూర్‌లో ప్రీస్కూల్ నిర్వహిస్తున్నారు. కాగా, ప్రేరణ ఒకప్పుడు స్కూల్ టీచర్‌గానే పని చేశారు. ఈ క్రమంలోనే ఎంతోమంది చిన్నారులకు పాఠాలు బోధించారు.అయితే స్కూల్ టీచర్‌గా ఉన్న క్రమంలోనే.. సింగపూర్‌లో లిటిల్ పాడింగ్టన్ అనే ప్రీస్కూల్ నెలకొల్పారు. ఆ తర్వాత.. ఆమె ‘క్రియేటివ్ గెలిలియో’ పేరుతో ఎడ్యుకేషన్ స్టార్టప్ ప్రారంభించారు. కాగా, ఈ స్టార్టప్ అనేది ప్రధానంగా 3-10 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలకు విద్యాభ్యాసంపై దృష్టిసారించింది. ఇక ఈ క్రియోటివ్ గెలిలియో ద్వారా.. పిల్లలకు పుస్తకాలకు మించిన కార్యకలాపాలు, అనుభవాలు నేర్చుకునే అవకాశం లభించింది.

అయితే ప్రేరణ ఝున్‌ఝున్‌వాలా తన గ్రాడ్యుయేషన్ ను న్యూయార్క్ యూనివర్సిటీలో పూర్తి చేశారు. కాగా, అక్కడ ఆమె కంపెనీ రెండు యాప్స్ లాంచ్ చేసింది. అవే టూండమీ, లిటిల్ సింఘం. ఈ రెండు యాప్స్‌కి విశేషమైన స్పందన లభించింది. అలా ఒక్కొక్కటి 1 కోటికిపైగా డౌన్‌లోడ్స్ నమోదయ్యాయి. ముఖ్యంగా..భారత ప్లే స్టోర్ లోని 20 టాప్ ఎడ్యుకేషన్ యాప్స్‌ను దాటుకుని ఈ కిండ్స్ లర్నింగ్ యాప్స్ ముందుకెళ్లడం విశేషం. అయితే ప్రేరణ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. ఈ యాప్స్ ద్వారా చిన్నారులకు తగిన అభ్యాస ప్రయాణం, వీడియో కథనాలు, గేమిఫికేషన్ అందిస్తున్నాయి. కానీ, ఓ స్కూల్‌ టీచర్‌ గా పిల్లలకు పాఠలు బోధించిన ప్రేరణ.. ఎడ్యుకేషన్ స్టార్టర్ బిజినెస్‌లోకి అడుగుపెట్టేందుకు ఎలాంటి బిజినెస్ ఎడ్యుకేషన్ కోర్సులు చేయలేదు.

కాకపోతే, ఇలాంటి బిజినెస్‌ రంగంలో అడుగుపెట్టేందుకు చాలామంది స్టార్టప్ ఫౌండర్లు ఐఐటీ, ఐఐఎం లేదా ఇతర బిజినెస్ స్కూల్స్ లో శిక్షణ తీసుకునేందుకు ఇష్టపడతారు. కానీ ప్రేరణ ఎలాంటి అనుభవం లేకుండానే ఎడ్యుటెక్ స్టార్టప్ వ్యాపారంలో దూసుకెళ్తున్నారు. ఇకపోతే ప్రేరణ కంపెనీ గతేడాది రూ.60 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం ప్రేరణ ఝున్‌ఝున్‌వాలా స్టార్టప్ విలువ 40 మిలియన్ డాలర్లు అంటే.. దాదాపు రూ.330 కోట్లుగా ఉంటుందని అంచనా.

క్యాట్ తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన ఏపీ సర్కార్

అమరావతి: సీనియర్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలను ఆపడం లేదు. ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వాలని, జీతభత్యాలు తక్షణమే చెల్లించాలని క్యాట్ (Central Administrative Tribunal) ఇదివరకే స్పష్టం చేసింది. క్యాట్ ఆదేశాలను జగన్ సర్కార్ లెక్క చేయడం లేదు. ఆ ఆదేశాలపై హైకోర్టులో సవాల్ చేసింది. ఆ కేసు ఈ నెల 23వ తేదీ (గురువారం) రోజున విచారణ జరగనుంది.

క్యాట్ ఆదేశాలు

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేయాలని క్యాట్ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. రెండోసారి తనను సస్పెండ్ చేయడాన్ని ఏబీ వెంకటేశ్వరరావు సవాల్ చేయడంతో క్యాట్ ఈ నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఏబీ వెంకటేశ్వరరావుని సర్వీస్‌లోకి తీసుకుని ఆయనకు రావాల్సిన జీతభత్యాలు ఇవ్వాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. సస్పెన్షన్ చట్ట విరుద్దమని, ఒకసారి సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన తర్వాత కూడా రెండోసారి సస్పెండ్ చేయడం ఉద్యోగిని వేధించడమేనని అభిప్రాయ పడింది.

ఏం జరిగిందంటే..?

గత ప్రభుత్వ హయాంలో నిఘా పరికరాల కోసం తన కుమారుడికి చెందిన సంస్థకు ఏబీ వెంకటేశ్వరరావు కాంట్రాక్ట్ ఇప్పించారు. కొనుగోలు అంశంపై గత ప్రభుత్వంలో ఉన్నతాధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినా వినిపించుకోలేదు. 2019లో వైసీపీ అధికారం చేపట్టడంతో ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతల నుంచి జగన్ సర్కార్ తప్పించింది. 9 నెలల పాటు పోస్టింగ్ ఇవ్వలేదు. నిఘా పరికరాల వ్యవహారం, ఇజ్రాయెల్‌కు రహస్యాలు చెరవేశారని కేసు నమోదు చేసి విధుల నుంచి తప్పించింది. దాంతో ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్‌ను ఆశ్రయించారు. తొలిసారి క్యాట్, కేంద్ర హోంశాఖలో ఊరట కలుగలేదు. సుప్రీంకోర్టుకు వెళ్లడంతో అనుకూలంగా తీర్పు వచ్చింది. బాధ్యతలు చేపట్టే సమయంలో మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దానిపై మరోసారి క్యాట్‌ను ఆశ్రయించగా విచారించింది. ఏబీవీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ ఆదేశాలను జగన్ సర్కార్ ఇప్పటికీ పాటించడం లేదు.

హైకోర్టును ఆశ్రయించిన సర్కార్

ఏబీవీకి పోస్టింగ్ ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మనసు రావడం లేదు. క్యాట్ తీర్పు కాపీని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఏబీ వెంకటేశ్వర రావు పంపించారు. పోస్టింగ్, జీతభత్యాల గురించి అందులో ప్రస్తావించారు. ఆ ఫైల్‌ను సీఎం జగన్‌కు సీఎస్ పంపించారు. సీఎం జగన్ ఆదేశాలతో క్యాట్ తీర్పుపై హైకోర్టులో సవాల్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం రోజున హైకోర్టు వెకేషన్ బెంచ్‌లో అప్పీల్ చేశారు. ఆ కేసు విచారణ గురువారం జరగనుంది.

రాష్ట్ర గీతం రెడీ.. విడుదల ఎప్పుడంటే..?

తెలంగాణ రాష్ట్ర గీతంపై (Telangana Geetham) ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. జూన్ 2వ తేదీన ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీతో (Sonia Gandhi) ఈ గీతాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రముఖ కవి అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతానికి కొన్ని మార్పులు చేశారు. ఒకటిన్నర నిమిషం నిడివిలో ఈ గీతం సిద్ధం అవుతోంది. సినీ సంగీత దర్శకుడు కీరవాణితో ఈ పాటను రేవంత్ ప్రభుత్వం కంపోజింగ్ చేయించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న.. ఇంతవరకు రాష్ట్రం గీతం లేకుండేది. గతంలో జరిగిన కేబినెట్ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.

రాష్ట్ర గీతంలో మార్పులు

తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర గీతం ఉండాలని ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గతంలో అందెశ్రీ రాసిన రాష్ట్ర గీతాన్ని అమోదిస్తూ కేబినెట్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే తెలంగాణ ఉద్యమం కంటే ముందు ఈ గీతాన్ని రచించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కొన్ని మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇందులో భాగంగానే ఆ గీతం రాసిన అందెశ్రీకి కొన్ని మార్పులు చేయాలని ప్రభుత్వం సూచించింది. అందులో భాగంగా అందెశ్రీ ఈ గీతంలో మార్పులు చేసి ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం అమోదముద్ర వేసింది. ఆ గీతాన్ని సినీ సంగీత దర్శకుడు కీరవాణితో కంపోజింగ్ చేశారు. జూన్2న రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో.. ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది.

Food For Joint pain: కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా.. ఈ ఆహార పదార్థాలతో ఎంతో ఉపశమనం లభిస్తుంది

Food For Joint pain: కీళ్ల నొప్పులు భరించలేనంతగా ఉండడం వల్ల ప్రజలు లేవడం లేదా కూర్చోవడం కష్టంగా మారుతుంది. కీళ్ల నొప్పులకు యూరిక్ యాసిడ్, ఆర్థరైటిస్ వంటి వ్యాధులు కారణం కావచ్చు. కీళ్లలో నొప్పి కారణంగా, అక్కడ తరచుగా వాపు ఉంటుంది. అటువంటి పరిస్థితిలో కీళ్ల నొప్పులు, వాపులను వదిలించుకోవడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవచ్చు. ఇవి వాపు, నొప్పిని తగ్గించడమే కాకుండా బలహీనమైన ఎముకలను బలపరుస్తాయి. కాబట్టి, కీళ్ల నొప్పులను తగ్గించుకోవడానికి ఎలాంటి వాటిని ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కీళ్ల నొప్పులు, వాపు నుండి ఉపశమనం పొందడానికి ఈ 5 యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారాలను తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

1. వెల్లుల్లి:

వెల్లుల్లి ఆహార రుచిని పెంచుతుంది. కీళ్ల నొప్పులకు చాలా మేలు చేస్తుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో మేలు చేస్తాయి. అల్లంవెల్లుల్లి ముద్దను నూనెలో వేడి చేసి కీళ్లపై రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది. ప్రతిరోజూ 1 లవంగం, వెల్లుల్లిని ఉడికించి తినడం ద్వారా కూడా ప్రయోజనం పొందుతారు. దీన్ని తీసుకోవడం ద్వారా మీ రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది మరియు వాపు తగ్గుతుంది.

2. పసుపు:

పసుపులోని కర్కుమిన్ యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో కూడిన శక్తివంతమైన సమ్మేళనం. గాయమైనా, గాయం వల్ల వాపు వచ్చినా వెంటనే పసుపు ముద్దను మెత్తగా నూరి రాసుకోవాలి. ఇది వాపు మరియు నొప్పి నుండి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. అలాగే, పసుపు పాలను మీ ఆహారంలో చేర్చుకోండి, ఇది కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి, ప్రతి రాత్రి పడుకునే ముందు పసుపు పాలు తాగండి.

3. దాల్చిన చెక్క:

కీళ్ల నొప్పుల కారణంగా మీరు లేచి కూర్చోలేకపోతే దానిని తగ్గించుకోవడానికి దాల్చిన చెక్క ఒక గొప్ప ఎంపిక. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్న ఈ మసాలాను తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది కీళ్ల మధ్య ఘర్షణను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

4. అల్లం:

అల్లం కూడా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో కూడిన మసాలా. ఇందులో ఉండే జింజెరాల్ సమ్మేళనం కీళ్లలో వాపు మరియు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. అల్లం ఉడకబెట్టి దాని నీటిని త్రాగాలి. అల్లం లడ్డు కూడా చేసి తినొచ్చు. ఇది కాకుండా, మీరు పచ్చి అల్లం కూడా నమలవచ్చు.

5. బెర్రీలు:

మీ ఆహారంలో బెర్రీలను చేర్చడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే వాటిలో అధిక స్థాయిలో ఆంథోసైనిన్‌లు ఉంటాయి, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ ఎఫెక్ట్‌లతో కూడిన మరో రకమైన యాంటీఆక్సిడెంట్.

మీ ఆహారంలో ఈ 5 యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారాలను చేర్చడం ద్వారా, మీరు కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు మరియు ప్రక్రియలో మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.

డిగ్రీ పాసైతే చాలు.. ఈ ఉద్యోగాలు మీకోసమే.. నెలకు 78,000 జీతం

ప్రస్తుత రోజుల్లో ఉన్నత స్థాయి, మంచి వేతనంతో కూడిన ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు సాధించాలంటే కనీసం డిగ్రీ అయినా ఉండాల్సిందే. దీంతో పాటు సరైన స్కిల్స్ ను కలిగి ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగాలకు కాంపిటీషన్ హెవీగా ఉంది. నేటి రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగం సాధించడమంటే ఓ యుద్ధాన్ని గెలిచినట్టే. మరి మీరు కూడా డిగ్రీ ఉత్తీర్ణులై ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఇదే మంచి అవకాశం. డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు వెంటనే అప్లై చేసుకోండి.

పూణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియెరాలజీ(ఐఐటీఎం) కాంట్రాక్ట్ ప్రాతిపాదికన ప్రాజెక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 65 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి అభ్యర్థులు డిగ్రీ, పీజీ, బీటెక్, ఎంటెక్ ఉత్తీర్ణత, నెట్‌/ సీఎస్‌ఐఆర్‌-యూజీసీ/ గేట్‌ స్కోరుతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే పోస్టులను అనుసరించి నెలకు 25 వేల నుంచి 78 వేల వరకు అందిస్తారు. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 18 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:
ఖాళీల సంఖ్య:
65
ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-III:
04
ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-II:
11
ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-I:
04
ట్రైనింగ్‌ కోఆర్డినేటర్‌:
01
సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌:
02
ట్రైనింగ్‌ కోఆర్డినేటర్‌:
01
సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌:
02
ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-II:
08
ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-I:
33
రిసెర్చ్‌ అసోసియేట్‌ (డీప్‌ ఓషియన్‌ మిషన్‌):
02
అర్హత:
పోస్టులను అనుసరించి అభ్యర్థులు ఎంఎస్సీ/ఎంటెక్‌, బీటెక్/బీఈ, ఎంటెక్‌/ఎంఈ, బ్యాచిలర్‌ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమానంతో పాటు సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
పోస్టులను అనుసరించి అభ్యర్థులు 35- 45 సంవత్సరాలు మించకూడదు.
జీతం:
పోస్టులను అనుసరించి ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 25000 నుంచి రూ.78,000 వరకు అందుకోవచ్చు.
దరఖాస్తు విధానం:
ఆన్‌ లైన్
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
22-05-2024
దరఖాస్తుకు చివరి తేదీ:
18-06-2024

Health Tips: మీ గుండెకి ఇది బ్రహ్మాస్త్రం.. రోజూ ఇలా చేశారంటే వందేళ్లు హాయిగా బ్రతికినట్టే.!

రోజుకు మీరు ఎన్ని గంటలు నిద్రపోతున్నారు? పగలు ఎన్ని గంటలు? రాత్రి ఎన్ని గంటలు? కనీసం ఆరు గంటలైన నిద్రపోతున్నారా?
లేదంటే.. మీ హెల్త్ డేంజర్ జోన్ లో ఉన్నట్టే. అవును. ఇది నిజమేనని డాక్టర్లు చెబుతున్నారు. రోజు మొత్తంలో కనీసం ఆరు గంటలైన నిద్రపోని వారిలో గుండెకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందట. నిద్రలేమి కారణంగా తీవ్ర ఒత్తిడి పెరగడమే కాకుండా అది శరీరంలోని రక్తప్రసరణపై ప్రభావం చూపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. తద్వారా రక్తనాళాల్లో ఒత్తిడి ఏర్పడి అది మెల్లగా గుండెపై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు.

ముఖ్యంగా రాత్రివేళల్లో నిద్ర ఆరోగ్యానికి ఎంతో మంచిదని అన్నారు. ఇటీవల ఓ 4 వేల మంది పురుషులు, మహిళలపై పలు పరీక్షలు చేసిన పరిశోధకులు.. రాత్రి వేళల్లో ఆరు గంటలు కంటే తక్కువ సమయం నిద్రించినవారిలో 27 శాతం మేర గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నట్టు నిర్ధారించారు. ఆరు అంతకంటే ఎక్కువ సమయం నిద్రించిన వారిలో ఈ సమస్య అంతగా లేదని గుర్తించారు. అందుకే సరైన నిద్ర అవసరం. ఎంత ఒత్తిడి ఉన్నా.. ఎన్ని పనులు ఉన్నా.. నిద్రించే సమయాన్ని కాస్త కేటాయిస్తే.. ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చునని పరిశోధకులు సూచిస్తున్నారు. కంటి నిండా నిద్ర లేదంటే అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

UTS App: రైలు జనరల్‌ టికెట్లు ఇంటి నుంచే బుక్‌ చేసుకోవచ్చు. అదెలా? ఈ యాప్‌ ట్రై చేయండి..

దేశంలో అత్యంత చవకైన, ఎక్కువ మంది ఉపయోగించే ప్రయాణం సాధనం రైలు. వీటి ద్వారా దేశంలో ఏ మూలకైనా వెళ్లే వీలుంటుంది. కాబట్టి సామాన్య, మధ్య తరగతి ప్రజలందరూ రైలు పైనే ఆధారపడతారు. మన దేశంలోని రైల్వే స్టేషన్లన్నీ సీజన్ తో సంబంధం లేకుండా అన్ని వేళలా రద్దీగా ఉంటాయి. ఇక పండగలు, పర్వదినాల సమయంలో కిక్కిరిసిపోతాయి. అలాంటిప్పుడు ప్రత్యేక రైళ్లను కూడా ఆ శాఖ నడుపుతుంది.

సాధారణ టికెట్లకు అవస్థలు..
సాధారణంగా అన్ని రైళ్లలో రిజర్వేషన్ బోగీలతో సాధారణ బోగీలు ఉంటాయి. టికెట్లు ముందుగా రిజర్వేషన్ చేసుకున్న వారికి రిజర్వేషన్ బోగీలలో సీటు కేటాయిస్తారు. వారందరూ సౌకర్యంగా ప్రయాణం సాగించవచ్చు. ఇక సాధారణ బోగీలలో ప్రయాణం అంటే నరకమే. నిలబడటానికి చోటు దొరికితే చాలు అనే పరిస్థితి ఉంటుంది. అంతకంటే కష్టమైన విషయం ఏమిటంటే సాధారణ బోగీలలో ప్రయాణించేవారు టికెట్ తీసుకోవడానికి దాదాపు గంట లేదా రెండు గంటల ముందు స్టేషన్ కు రావాలి. అక్కడ క్యూలో నిలబడి టికెట్ తీసుకోవాలి.

రైల్వే శాఖ చర్యలు..
ప్రయాణికుల సౌకర్యం కోసం రైల్వే శాఖ అనేక చర్యలు తీసుకుంటుంది. వారికి మెరుగైన సేవలు అందించేందుకు ప్రణాళికా బద్దంగా పనిచేస్తుంది. అందులో భాగంగా అన్ రిజర్వ్ డ్ టిక్కెట్ సిస్టమ్ (యూటీఎస్) యాప్ తీసుకువచ్చింది. దీని ద్వారా సాధారణ బోగీలలో ప్రయాణించే వారు కూడా రిజర్వేషన్ టిక్కెట్ల మాదిరిగా ముందుగానే టిక్కెట్లు తీసుకోవచ్చు. స్టేషన్ లో క్యూ లో వేచి ఉండాల్సిన అవసరం ఉండదు.

నిబంధనల మార్పు..
యూటీఎస్ యాప్ ను ఎక్కువ మంది ఉపయోగించుకోవాలా నిబంధనలను రైల్వే శాఖ సవరించింది. గతంలో ఉన్న నిబంధనలను మార్చింది. ప్రయాణికులకు మరింత మేలు చేకూర్చేందుకు గణనీయమైన మార్పులు చేసింది. సవరించిన నిబంధనలు, ప్రయాణికులకు కలిగే ఉపయోగాలను తెలుసుకుందాం.

ఎంతో సులభం..
యూటీఎస్ యాప్ ద్వారా సాధారణ రైలు టిక్కెట్ బుకింగ్ ను సులభతరం చేసింది. ముఖ్యంగా జియో ఫేసింగ్ దూర పరిమితిని ఎత్తివేసింది. గతంలో సాధారణ టిక్కెట్లు బుక్ చేసుకోవాలంటే దూర పరిమితి ఉండేది. ఆ లోపల ఉన్నవారికే ఆ అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ నిబంధనను ఎత్తివేసింది. దీంతో సాధారణ టిక్కెట్లతో పాటు ప్లాట్ ఫాం టిక్కెట్లను కూడా ప్రయాణికులు ఎక్కడి నుంచి అయినా బుక్ చేసుకోవచ్చు. దీనికి దూర పరిమితి లేదు. టిక్కెట్లను కొనుగోలు చేయడానికి స్టేషన్ లో వేచి ఉండాల్సిన అవసరం కూడా ఉండదు.

ప్రయాణికులకు ఉపయోగం..
నార్త్ వెస్ట్రన్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కెప్టెన్ శశి కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. యూటీఎస్ యాప్ లో చేసిన అప్ డేట్ లు ప్రయాణికులకు ఎంతో ఉపయోగంగా ఉంటాయి. సాధారణ బోగీల ప్రయాణికులు సులభంగా టిక్కెట్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే దూర పరిమితిని తొలగించడంతో మరింత మేలు జరుగుతుంది. యూటీఎస్ యాప్ ద్వారా ఏ ప్రదేశం నుంచి అయినా అన్‌రిజర్వ్‌డ్ టిక్కెట్లను పొందవచ్చు.

దూర పరిమితి తొలగింపు..
గతంలో ప్రయాణికులు యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్లు పొందాలంటే స్టేషన్ ప్లాట్‌ఫాం నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో ఉండాలి. అప్పుడే యాప్ సపోర్టు చేసేది. ఇప్పుడు ఆ దూరపరిమితిని తీసివేశారు. ఎక్కడి నుంచి అయినా, ఎంత దూరంలో ఉన్నా టిక్కెట్లు పొందే వీలు ఉంది.

పర్యావరణ రక్షణ..
యూటీఎస్ యాప్ ద్వారా జనరల్, ప్లాట్‌ఫాం, సీజన్ టిక్కెట్‌లను పొందే వీలుంది. ఇది ప్రయాణికుల సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, కాగితం వినియోగాన్ని తగ్గించి, పర్యావరణ పరిరక్షణకు దోహదం పడుతుంది.

Google Pay : గూగుల్‌ పే పెమెంట్‌ యాప్‌ నిలిపివేత.. జూన్‌ నుంచే అమలు

Google Pay : ఆన్‌లైన్‌ పేమెంట్‌ యాప్‌లలో అత్యంత ప్రజాదరణ పొందిన యాప్‌ గూగుల్‌ పే. చాలాదేశాల్లో తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అయితే ఈ సర్వీస్‌ను జూన్‌ 4 తర్వాత నిలిపివేయాలని సంస్థ నిర్ణయించింది. ఈ విషయాన్ని గూగుల్‌ సంస్థ గతంలోనే ప్రకటించింది.

రెండు దేశాల్లో కొనసాగింపు..
ప్రపంచంలోని అన్ని దేశాల్లో గూగుల్‌ పే సేవలు నిలిచిపోనున్నాయి. అయితే ఇదే సమయంలో ఇండియా, సింగపూర్‌లో ఈ సేవలు కొనసాగుతాయని సంస్థ ప్రతినిధి తెలిపారు. నిలిచిపోయిన దేశాల్లో కొత్త వాలెట్‌ గూగుల్‌ వాలెట్‌ అమలు చేస్తుంది. అమెరికాలో గూగుల్‌ పే కన్నా, గూగుల్‌ వాలెట్‌ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ కూడా ఈ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో భారతీయ యూజర్లు ఆందోళన చెందాల్సిన పనిలేదు.

జూన్‌ 4 వరకు వినియోగంలోనే..
ఇదిలా ఉంటే 2024, జూన్‌ 4 వరకు ప్రపంచ వ్యాప్తంగా గూగుల్‌ పే సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. గడువు తీరిన తర్వాత అమెరికన్‌ యూజర్లు అమౌంట్‌ సెండ్‌ చేసుకోవడానికి, రిసీవ్‌ చేసుకోవడానికి అవకాశం ఉందు. అమెరికాలోని గూగుల్‌ పే యూజర్లు గూగుల్‌ వాలెట్‌కి మారాలని సూచించింది. గూగుల్‌ పేను కంపెనీ 180 దేశాల్లో రీప్లేస్‌ చేస్తుందని సమాచారం. అన్ని దేశాల్లో ఆదరణ లేకపోవడం.. నిర్వహణ భారంతోనే గూగుల్ సంస్థ పేమెంట్స్ నుంచి వైదొలుగుతున్నట్టు సమాచారం.

Chanakya Tips In Telugu : ఈ 6 గుణాలపై మీకు నియంత్రణ లేకుంటే జీవితంలో ఓడిపోతారు

భారతదేశంలో చాణక్యుడు, అతని సూత్రాల గురించి తెలియని వారు ఉండరమో. తన చాణక్య నీతిలో మనిషులకు సంబంధించిన అనేక విషయాలను చెప్పాడు. మనిషి చేసే దోషాల గురించి సవివరమైన సమాచారాన్ని అందించాడు. ఒక వ్యక్తి తన సద్గుణాల వల్ల జీవితంలో విజయం సాధిస్తే, విజయవంతమైన పని కూడా చెడు పనుల వల్ల విఫలమవుతుందని చాణక్యుడు చెప్పాడు.

కొన్ని లక్షణాలు ఉంటే ఎంత ప్రయత్నించినా విజయం సాధించలేరు. అలాంటి వాటికి ఎప్పుడూ దూరంగా ఉండాలని ఆచార్య చాణక్యుడు ప్రజలకు సలహా ఇస్తున్నాడు. ఒకరి జీవనశైలి, లక్షణాలు, లోపాలు వారి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని చాణక్యుడు చెప్పాడు. కొన్ని విషయాలను ఫాలో అయితే జీవితంలో విజయం సాధిస్తారు.

ప్రతి ఒక్కరిలో కొన్ని లోపాలు ఉంటాయి. కానీ ఈ లోపాలను సకాలంలో తొలగించకపోతే, పరిణామాలు మీ జీవితాంతం మిమ్మల్ని ప్రభావితం చేస్తాయని చాణక్యుడు చెప్పాడు. చాణక్య నీతి ప్రకారం, మీ వైఫల్యానికి బలమైన చెడు లక్షణాలు ఏంటో మీరు తెలుసుకోవాలి.

మనశ్శాంతి
జీవితంలో సంతోషంగా ఉండాలంటే ప్రశాంతమైన మనస్సు అవసరమని చాణక్యుడు చెప్పాడు. మనశ్శాంతి లేకుండా ఏ మనిషి సంతోషంగా ఉండలేడు. అస్థిరమైన మనస్సు ఉన్న వ్యక్తులు జీవితంలో సంతోషంగా ఉండలేరు లేదా సరిగ్గా ఏమీ చేయలేరు. అలాంటి వారిని జీవితాంతం అనేక సమస్యలు చుట్టుముడుతాయి. అలాంటి వారి లోపం వలన జీవితంలో అనేక అపజయాలను కూడా ఎదుర్కొంటారు.

అసూయ
చాణక్య నీతి ప్రకారం, కొంతమంది ఇతరుల ఆనందాన్ని చూసినప్పుడు బాధపడతారు. అలాంటి వ్యక్తులు జీవితాంతం ఒంటరిగా ఉంటారు. ఇతరుల విజయాన్ని చూసి అసూయపడి నశిస్తారు. అలాంటి వారికి జీవితంలో విజయం లేదా ఇతరుల మద్దతు లభించదు.

మనసుపై నియంత్రణ
చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి తన మొత్తం శరీరాన్ని మనస్సు ద్వారా నియంత్రించుకుంటాడు. మనస్సు నియంత్రణ లేని మనిషి మనస్సు, శరీరం ద్వారా ఏ మంచి పని చేయలేడు. అటువంటి అస్థిరమైన మనస్సు ఉన్నవారు ఏ పనిపైనా దృష్టి పెట్టి విజయం సాధించలేరు. ఇది వైఫల్యానికి ప్రధాన కారణం.

క్రమశిక్షణ
క్రమశిక్షణ లేని వ్యక్తులు జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేరు. బహుశా అదృష్టవశాత్తూ అలాంటి వ్యక్తులు విజయం సాధించవచ్చు కానీ అది ఎక్కువ కాలం నిలవదు. మీ పనులు విజయవంతం కావాలంటే క్రమశిక్షణతో చేయడం చాలా ముఖ్యం. ఈ గుణం లేకుండా ఏ మనిషి విజయం సాధించలేడు.

అంకితభావం
మీరు జీవితంలో విజయవంతమైన వ్యక్తి కావాలంటే, ఏదైనా పనిని పూర్తి అంకితభావంతో, నిజాయితీతో చేయండి. పనిలో అజాగ్రత్తగా ఉండే వ్యక్తులు జీవితంలో విజయం సాధించలేరు. వారిని ఎవరూ నమ్మి ఉద్యోగం ఇవ్వరు.

లక్ష్యం లేకపోవడం
కష్టకాలంలో కూడా లక్ష్యాన్ని వదులుకోకుండా, ఓర్పుతో, నిజాయితీతో పని చేసేవారు కచ్చితంగా విజయం సాధిస్తారని చాణక్యుడు చెబుతున్నాడు. విజయం గులాబీ లాంటిది, దాని మార్గం ముళ్ళతో నిండి ఉంటుంది. కానీ గమ్యం చాలా అందంగా ఉంటుంది. లక్ష్యం లేని మనిషి జీవితంలో విజయం సాధించలేడని చాణక్యుడు చెప్పాడు.

HIV: సెక్స్‌ వర్కర్‌ నిర్లక్ష్యం.. హెచ్‌ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!

అమెరికాలో ఓ సెక్స్‌ వర్కర్‌ తీరు వందల మందిని భయం గుప్పిట్లోకి నెట్టింది. తనకు హెచ్‌ఐవీ పాజిటివ్‌ అని తెలిసినా.. అనేక మందితో లైంగిక సంబంధం నెరిపింది. ఈ విషయం తెలిసి కంగుతున్న అధికారులు.. స్థానికులను అప్రమత్తం చేశారు. ఆమెతో శృంగారంలో పాల్గొన్న వారు తక్షణమే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తూ హెల్త్‌ అలర్ట్‌ జారీ చేశారు. సదరు మహిళను అరెస్టు చేశారు. ఈ ఘటన అమెరికాలోని ఒహైయో రాష్ట్రంలో వెలుగు చూసింది.

ఒహైయోలోని మరియెట్టాకు చెందిన లిండా లెచెసే ఓ సెక్స్‌ వర్కర్‌. అక్కడి మార్కెట్‌ వీధిలో అనేక మందిని ఆకర్షిస్తుండేది. ఇలా 2022లో జనవరి నుంచి ఇప్పటివరకు అనేక మందితో లైంగిక సంబంధం కొనసాగించింది. ఇదే సమయంలో ఆమె హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకోగా.. పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. అయినా సరే లిండా తన కార్యకలాపాలను కొనసాగించింది. రెండున్నరేళ్లలో దాదాపు 211 మందితో ఆమె సన్నిహితంగా మెలిగినట్లు అధికారులు గుర్తించారు.

లిండా చర్యలతో అప్రమత్తమైన అధికారులు.. పబ్లిక్‌ హెల్త్‌ నోటీసులు జారీ చేశారు. ఆమెతో సన్నిహితంగా మెలిగిన వారందరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని పొరుగు రాష్ట్రాలతోపాటు స్థానిక పౌరులకు సూచించారు. ఆమె క్లయింట్లకు వ్యక్తిగతంగా ఫోన్లు చేస్తూ.. మిగతా ఎవరైనా ఉంటే తమకు తెలియజేయాలని సూచిస్తున్నామని వాషింగ్టన్‌ కౌంటీ షెరీఫ్‌ కార్యాలయ అధికారులు, మెరియెట్టా పోలీసులు వెల్లడించారు.

Driving Licence | ఇక డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఓ ఆఫీసుకెళ్లక్కర్లేదు.. జూన్ ఒకటో తేదీ నుంచి కేంద్రం కొత్త రూల్స్

Driving Licence | ఇప్పుడు విద్యార్థుల నుంచి కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‭ల వరకూ ప్రతి ఒక్కరూ వాహనం కలిగి ఉన్నారు. వారు తమ వాహనాన్ని నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.

ఈ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే పెద్ద ప్రక్రియ ఉంటుంది. ఆర్టీఓ కార్యాలయం చుట్టూ తిరగాలి. ముందుగా స్లాట్ బుకింగ్, డ్రైవింగ్ టెస్ట్, బయో మెట్రిక్ తదితర అంశాల కోసం ఆర్టీఓ ఆఫీసు చుట్టూ నాలుగైదుసార్లు తిరిగితే గానీ డ్రైవింగ్ లైసెన్స్ అందుకోలేరు. కానీ, ఈ సమస్యలకు చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. జూన్ ఒకటో తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. దీని ప్రకారం ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణ చేయనక్కర్లేదు. స్లాట్ బుకింగ్.. డ్రైవింగ్ టెస్ట్ అవసరం లేదు. ఎటువంటి టెస్టుల్లేకుండానే తేలిగ్గానే డ్రైవింగ్ లైసెన్స్ పొందొచ్చు.

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రోడ్డు రవాణా సంస్థ జారీ చేసిన నిబంధనల ప్రకారం ఇక నుంచి ప్రైవేట్ డ్రైవింగ్ ఇన్‌స్టిట్యూట్‌లే డ్రైవింగ్ టెస్టులు నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేస్తాయి. డ్రైవింగ్ లో శిక్షణ పూర్తి చేశాక.. టెస్ట్ చేసి మరీ ప్రైవేట్ డ్రైవింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు డ్రైవింగ్ సర్టిఫికెట్ జారీ చేస్తాయి. ఈ సర్టిఫికెట్ ఆధారంగా డ్రైవింగ్ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకుంటే తేలిగ్గానే పొందొచ్చు.

అన్ని రకాల డ్రైవింగ్ సంస్థలకు కేంద్ర రోడ్డు రవాణా సంస్థ ఈ తరహా అనుమతులు ఇవ్వదు. ఫోర్ వీల్ డ్రైవింగ్ టెస్ట్ సంస్థకు మూడెకరాల భూమి ఉండాలి. నిబంధనలకు అనుగుణంగా డ్రైవింగ్ టెస్టులు నిర్వహించడానికి అన్ని సౌకర్యాలు ఉండాలి. డ్రైవింగ్ శిక్షణ ఇచ్చే వారు కూడా హైస్కూల్ విద్య పూర్తి చేసుకోవడంతోపాటు డ్రైవింగ్‌లో ఐదేండ్ల అనుభవంతోపాటు బయో మెట్రిక్ టెక్నాలజీపై అవగాహన ఉండాలి. లైట్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ నాలుగు వారాలు గానీ, కనీసం 29 గంటల శిక్షణ గానీ ఉండాలి. ఇందులో 21 గంటలు ప్రాక్టికల్, ఎనిమిది గంటలు థియరీ ఉండాలి.

హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆరు వారాలు, 39 గంటల శిక్షణ అవసరం. 31 గంటల పాటు ప్రాక్టికల్, మిగతా ఎనిమిది గంటలు థియరీ ఉంటుంది. ఈ నిబంధనలు పాటించే వారికి మాత్రమే డ్రైవింగ్ టెస్ట్ సర్టిఫికెట్ జారీచేసే అధికారం కల్పిస్తుంది కేంద్ర రోడ్డు రవాణా సంస్థ. ఇలా ప్రైవేట్ డ్రైవింగ్ సంస్థల ద్వారా తీసుకునే డ్రైవింగ్ సర్టిఫికెట్‌తో లైసెన్స్ కోసం దరఖాస్తు చేయాలి. అలా చేస్తే ఎటువంటి ఇతర పరీక్షల్లేకుండానే లైసెన్సు మంజూరు అవుతుంది. అయితే ముందుగా ఆర్టీవో ఆఫీసులో ఎల్ఎల్ఆర్ తీసుకున్న తర్వాత ఈ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది.

ఆఫ్రికాకు పెద్దిరెడ్డి జంప్ – చెప్పకనే చెప్పారుగా !?

మంత్రి పెద్దిరెడ్డి ఆఫ్రికాలో కాంట్రాక్టులు చేస్తున్నారట.. అందుకని ఇక్కడి తన వాహనాలన్నింటినీ ముంబై పోర్టు నుంచి ఆఫ్రికాకు ఎక్స్ పోర్టు చేసేస్తున్నారు.

ఆఫ్రికాలో మైనింగ్ చేయాలనుకుంటే… ఇక్కడి నుంచే ఎందుకు వాహనాలు తీసుకెళ్లాలి ?. అక్కడే సమకూర్చుకోవచ్చు కదాఅనే డౌట్ సామాన్యలకు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ వ్యాపారాలకూ అవసరమే కదా .. ఉన్న పళంగా ఇక్కడి వ్యాపారాలను మూసేస్తున్నారా అంటే సమాధానం లేదు.

ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి వైసీపీ నేతలు చాలా వరకూ సర్దుకుంటున్నారు. వైసీపీ సర్కార్ లో పెద్దిరెడ్డి వ్యవహరించిన తీరుతో.. ప్రభుత్వం మారగానే ఆయన వ్యాపారాలన్నీ మూతపడటం ఖాయమన్న అంచనాలు ఉన్నాయి. ఆయన వ్యాపారాలన్నీ లొసుగులతో నిండిపోయినవే. కాంట్రాక్టులు.. మైనింగ్ సహా చాలా దందాలున్నాయి. మైనింగ్ మంత్రిగా ఆయన చేసిన అరాచకాల గురించి చెప్పాల్సిన పని లేదు. చంద్రబాబు మీద అంగళ్లలో హత్యాయత్నం చేయించడమే కాదు.. వందల మంది టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టించారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధానమంత్రి పీలేరులో మంత్రి పెద్దిరెడ్డి మాఫియా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు కూడా.

అందుకే ముందు జాగ్రత్తగా ఆయన సర్దుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. గత రెండు వారాలుగా ఆయన సైలెంట్ గా ఉంటున్నారు. ఈ సైలెన్స్ వెనుక అసలు వ్యవహారం తన ఆస్తులు, వ్యాపారాలను మెల్లగా దేశం దాటించేయడం. అదే చేస్తున్నారు. ఆధారాలతో సహా టీడీపీ నేతలు విమర్శలు చేయడంతో మీడియా ముందుకు వచ్చారు. తమ మైనింగ్ వ్యాపారం కోసం ఆఫ్రికా తరలిస్తున్నామని చెప్పుకొచ్చారు. మరి ఇక్కడి వ్యాపారాలపై ఆశల్లేవా అంటే.. ఆయన తడబడుతున్నారు. కొత్తవి కొంటామని చెప్పుకొస్తున్నారు.

పెద్దిరెడ్డి తరహాలోనే చాలా మంది విదేశాలకు వెళ్లిపోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వల్లభనేని వంశీ అమెరికాలో ల్యాండయ్యారు. కొడాలి నాని చప్పుడు చేయడం లేదు. ఇంకా చాలా మంది అధికారులు కూడా ఈ జాబితాలో ఉన్నట్లుగా చెబుతున్నారు.

AP Elections 2024: వైసీపీకి 151 మించి సీట్లు వస్తే.. ప్రశాంత్‌ కిశోర్‌(పీకే) మరో సంచలనం!

సీఎం జగన్‌ (YS Jagan) చెప్పినట్లుగా వైసీపీకి 151 మించి అసెంబ్లీ సీట్లొస్తే తన ముఖాన పేడకొడతారని.. లేదంటే ఆయనకే అది జరుగుతుందని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌(పీకే) వ్యాఖ్యానించారు. ఇటీవల విజయవాడ ఐ-ప్యాక్‌ కార్యాలయానికి వెళ్లిన జగన్‌ .. ఆ సంస్థ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్‌ ప్రభావమేమీలేదంటూ తేలిగ్గా మాట్లాడారు. ఐప్యాక్‌ టీమ్‌ హెడ్‌ రుషిరాజ్‌ బృందమే వైసీపీ కోసం కష్టపడినట్లు తెలిపారు. ఏపీలో ఫలితాలపై తాజాగా యూట్యూబ్‌ చానల్‌ మోజో జర్నలిస్ట్‌ బర్కా దత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్‌ స్పందించారు.
రాసిపెట్టుకోండి!

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ ఘోర పరాజయాన్ని చవిచూడబోతున్నారని పునరుద్ఘాటించారు. టీడీపీ- జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి రానుందని తెలిపారు. దేశంలో మళ్లీ బీజేపీయే గెలుస్తుం దని స్పష్టం చేశారు. ప్రధాని మోదీపై ప్రజల్లో వ్యతిరేకత లేదని.. మళ్లీ ఆయన సారథ్యంలోనే కేంద్రంలో సర్కారు ఏర్పడుతుందన్నారు. అయితే తామే రాబోతున్నామని రాహుల్‌ గాంధీ, తేజస్వి యాదవ్‌లాంటివారు కూడా చెబుతున్నారని.. జగన్‌ మాటలూ అలాంటివేనని పీకే కొట్టిపారేశారు. కేవలం సంక్షేమ పథకాలతోనే ప్రభుత్వాలు ఏర్పడవన్నారు.

పోలింగ్ సిబ్బంది 14 వ తేదీ కూడా డ్యూటీ చేసినట్లే! CEO ముకేశ్ కుమార్ గారి ఉత్తర్వులు విడుదల.

పోలింగ్ సిబ్బంది 14 వ తేదీ కూడా డ్యూటీ చేసినట్లే! CEO ముకేశ్ కుమార్ గారి ఉత్తర్వులు విడుదల.
ఈ ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకుని డ్యూటీ సర్టిఫికెట్లు ఇవ్వవలసినదిగా జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు.

ఒక్కొక్కరి ఖాతాలో రూ. 18,500, 15,000 .. మీ అకౌంట్‌లో డబ్బులు పడ్డాయా.. లేదా..?

చాలా వరకు రాష్ట్రాల్లో నగదు బదిలీ పథకాలు అమలవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈతరహా పథకాలు అమలు చేస్తోంది. కిసాన్‌ సమ్మాన్‌ స్కీమ్‌లో భాగంగా రైతుల ఖాతాలో నగదు జమ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో అనేక నగదు బదిలీ పథకాలు అమలవుతున్నాయి. 2019 ఎన్నికల్లో విజయం సాధించి.. అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. నవ రత్నాల పేరుతో అనేక నగదు బదిలీ పథకాలు ప్రారంభించారు. వీటి ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరి ఖాతాలో.. ఆయా పథకాలకు సంబంధించిన నిధులను జమ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఏపీలో వారు ఒక్కొక్కరి ఖాతాలో 18,500, 15 వేల రూపాయలు జమ చేసింది ప్రభుత్వం. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో.. అనేక నగదు బదిలీ పథకాల అమలు ఆగిపోయింది. ఇక గత సోమవారం అనగా.. మే 13న పోలింగ్‌ ముగియడంతో.. ఆ పథకాల నిధులు ఇప్పుడు లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మహిళలకు, రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహిళలకు సంబంధించి ఈబీసీ నేస్తం, చేయూత, ఆసరా పథకాల నిధులను జమ చేసింది. దీనిలో భాగంగా వారి ఖాతాలో18,.500, 15 వేల రూపాయలు జమ అయ్యాయి.

ఏపీలో అగ్రవర్ణాలలోని పేద మహిళలకు వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం కింద ఒక్కొక్కరికి రూ.15 వేలు అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ పథకానికి సంబంధించి ఈ ఏడాది మార్చి నెలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కినా.. లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ కాలేదుకాలేదు. అయితే పోలింగ్‌కు ముందు లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేయాలని భావించినా ఈసీ అనుమతించలేదు. దాంతో పోలింగ్‌ ముగిసిన తర్వాత అనగా తాజాగా ఈబీసీ నేస్తం కింది అర్హులైన మహిళల అకౌంట్‌లలో రూ.15వేల చొప్పున జమ చేశారు.

ఈ పథకంతో పాటు.. వైఎస్సార్‌ చేయూత కింద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 45-60 సంవత్సరాల వయస్సు కలిగిన అర్హులైన మహిళలకు జగన్‌ సర్కార్‌ ఏడాదికి రూ.18,750 అందిస్తోంది. దీనిలో భాగంగా మార్చి నెలలోనే సీఎం జగన్‌.. బటన్‌ నొక్కి వైఎస్సార్‌ చేయూత నిధులు విడుదల చేశారు. కానీ ఆ మొత్తం లబ్ధిదారుల ఖాతాలో జమ అవ్వలేదు. ఈ క్రమంలో తాజాగా పోలింగ్‌ ముగియడంతో.. ఏపీ ప్రభుత్వం.. ఈ పథకానికి సంబంధించి అర్హులైన లబ్ధిదారులు ఒక్కొక్కరి ఖాతాలో రూ.18,750 జమ చేసింది.

అలాగే వైఎస్సార్ ఆసరా కింద ప్రభుత్వం డ్వాక్రా మహిళలకురూ.1843 కోట్లను వారి, వారి ఖాతాలలో జమ చేశారు. రైతులకు సైతం రూ.1,236 కోట్లను ఇన్‌పుట్ సబ్సిడీ కింద విడుదల చేశారు. ఈ పథకాలకు సంబంధించిన అర్హుల జాబితాను ఇప్పటికే ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచారు. అర్హత ఉన్నలబ్ధిదారుల ఖాతాలో ఈ డబ్బుల్ని జమ చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ కాకపోతే.. దగ్గరలోని గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని సంప్రదించాల్సి ఉంటుంది.

5 నెలల్లో 30 వేల మందిని చంపాడు! ఇరాన్‌ అధ్యక్షుడి రక్తచరిత్ర!

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. 63 ఏళ్ల రైసీ.. తూర్పు అజర్‌బైజాన్‌కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న అజర్‌బైజాన్ సరిహద్దు నగరం జోల్ఫా సమీపంలో ప్రమాదం జరిగింది. అయితే.. ప్రమాదంలో చనిపోయిన ఇబ్రహీం రైసీ.. గతం అంత గొప్పగా ఏం లేదు. ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడి మరీ ఇరాన్‌కు అధ్యక్షుడయ్యాడు. అలాగే.. అధ్యక్షుడు కాకముందు ఇరాన్‌ న్యాయ వ్యవస్థలో ఎన్నో కీలక విధులు నిర్వహించిన రైసీ.. తన హయంలో చరిత్ర సిగ్గుపడే ఘటనలో భాగస్వామ్యం అయ్యాడు. ‘అదే 1988 ఉరి శిక్షలు’. ప్రస్తుతం ఇరాన్‌ అధ్యక్షుడి మరణంతో.. 1988లో జరిగిన దారుణం మరోసారి చర్చలో భాగమైంది.

ఇరాన్‌ దేశంలో రాజకీయ ఖైదీలను అత్యంత దారుణంగా ఉరి వేసి చంపేశారు. 1988లో ఇరాన్ రాజకీయ ఖైదీలను ఉరితీసిన నలుగురు వ్యక్తులలో ఒకరిగా రైసీని హుస్సేన్-అలీ మోంటజేరి పేర్కొన్నారు. ఆయనతో పాటు మోర్టెజా ఎష్రాఘి(ప్రాసిక్యూటర్ ఆఫ్ టెహ్రాన్), హోస్సేన్-అలీ నయేరీ(న్యాయమూర్తి), మోస్తఫా పూర్మొహమ్మది(ఎవిన్‌లో ఎంఓఐ ప్రతినిధి). కొన్ని వేల మంది రాజకీయ ఖైదీలు అక్రమంగా విధించిన మరణశిక్షల్లో ప్రాసిక్యూషన్‌ కమిటీ ప్రమేయం ఉందనే కారణంతో.. ఈ నలుగురు వ్యక్తులు ఉన్న కమిటీని ‘డెత్‌ కమిటీ’గా పిలుస్తారు.

దేశవ్యాప్తంగా ప్రభుత్వ నిర్బంధంలో ఉన్న రాజకీయ ఖైదీలకు ఉరి అమలు చేసే ప్రక్రియ 19 జూలై 1988 నుంచి ప్రారంభం అయి.. ఓ ఐదు నెలల పాటు ఈ మరణకాండ సాగింది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఈ సామూహిక ఉరిశిక్షలు అమలు చేశారు. ఒక్కొక్కరిగా ఉరివేస్తే.. సమయం పడుతుందని.. ఆరుగురి చొప్పున భారీ క్రేన్లకు వేలాడదీసి చంపేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇరాన్ పీపుల్స్ ముజాహెదీన్ పార్టీ, ఫెడయన్,తుదే పార్టీ ఆఫ్ ఇరాన్(కమ్యూనిస్ట్)తో పాటు ఇతర వామపక్ష వర్గాల మద్దతుదారులను ఉరితీశారు. కచ్చితంగా ఎంత మందిని ఉరితీశారు అనే సమాచారం ఇప్పటికీ లేదు. 2500 నుంచి 30 వేల మంది రాయకీయ ఖైదీలను ఉరితీసి ఉంటారని పలు నివేదికలు పేర్కొన్నాయి. హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన ఇబ్రహీం రైసీ 2001లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఇరాన్‌లో మతతత్వ పాలనకు ఆయన గట్టి మద్దతుదారుడు. రైసీ ఇరాన్ సుప్రీం అయతుల్లా ఖమేనీకి సన్నిహిత సహచరుడు. అతని వారసుడిగా ఎదిగాడు. మరి ఈ ఇబ్రహీం రైసీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

సిట్‌ సభ్యులు మాచర్ల ఎందుకు వెళ్లలేదు?

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజు, ఆ మర్నాడు పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణకు నియమించిన సిట్‌.. అసలు మాచర్ల పట్టణానికి వెళ్లలేదని తెలుస్తోంది. మాచర్లలో తెదేపా నేత కేశవరెడ్డి ఇంటిపై వైకాపా నాయకులు దాడి చేశారు. అయిదు వాహనాల్లో వచ్చి ఢీకొట్టిపోయారు. ఘటనలో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. మాచర్ల మండలం కంభంపాడులో రోడ్డుపైనే పోలీసులున్నా కర్రలతో కొట్టుకున్నారు. వెల్దుర్తి మండలం కేపీ గూడెంలో పోలింగ్‌ ఏజెంట్లుగా కూర్చున్న తెదేపావారిపై దాడులకు తెగబడ్డారు. పోలింగ్‌ సరళిని పరిశీలించడానికి వెళ్లిన కాంగ్రెస్‌ అభ్యర్థి రామచంద్రారెడ్డిపైనా దాడి చేశారు. వైకాపా నేత, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సొంతూరు వెల్దుర్తి మండలం కండ్లకుంటలో అయితే తెదేపా ఏజెంట్లుగా కూర్చున్న వారి కుటుంబసభ్యులపై దాడులకు తెగబడ్డారు. మాచర్లలో తెదేపా అభ్యర్థి బ్రహ్మారెడ్డి కారును తగలబెట్టారు. ఇలాంటి ఘటనలెన్నో మాచర్ల, వెల్దుర్తి మండలాల్లో చోటుచేసుకున్నా సిట్‌ సభ్యులు పర్యటించకపోవడం గమనార్హం. కేవలం కారంపూడి, రెంటచింతల ఠాణాల్లో ఎఫ్‌ఐఆర్‌ పత్రాలను పరిశీలించి, ఆపై ఘటనా స్థలాలను చూసి వెళ్లిపోయారు. మాచర్లకు సిట్‌ సభ్యులు వచ్చారా? రాలేదా? అనే విషయమై మాచర్ల గ్రామీణ సీఐ సురేష్‌ యాదవ్, టౌన్‌ సీఐ బ్రహ్మయ్యలను ‘ఈనాడు’ సంప్రదించగా, ఎవరూ రాలేదని సమాధానమిచ్చారు. ఎక్కువ అల్లర్లు జరిగిన ప్రాంతాలను పరిశీలించకుండా నివేదిక ఇవ్వడంపై ప్రతిపక్ష నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సోమవారం మూడోరోజు సిట్‌ సభ్యులు నరసరావుపేట టూటౌన్‌ పోలీసుస్టేషన్‌లో పలు పత్రాలు పరిశీలించారు. పెండింగ్‌ అరెస్టులపై ఆరాతీసినట్టు సమాచారం. నరసరావుపేట గ్రామీణ పరిధిలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పమిడిపాడు ఘటనకు సంబంధించి జనసేన, తెదేపా నేతలను అరెస్టు చేసినట్టు తెలిసింది. టూటౌన్‌ పరిధిలో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని సీఐ భాస్కర్‌ తెలిపారు. ఏయే పార్టీల వారిని, ఎంతమందిని అరెస్టుచేశారనే విషయాలను కూడా పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.

వాహనదారులకు బిగ్ అలర్ట్.. డ్రైవింగ్ లైసెన్సులపై కొత్త రూల్స్

వాహనదారులకు బిగ్ అలర్ట్.. డ్రైవింగ్ లైసెన్సులపై కొత్త రూల్స్
ప్రస్తుతం దేశంలో వాహనాలను నడపాలనుకుంటే కచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే. అయితే ఈ లైసెన్స్ పొందాలంటే జిల్లా కేంద్రం, రెవెన్యూ డివిజన్ ప్రాంతాల్లో ఆర్టీవో కార్యాలయంలో మాత్రమే ఈ లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ కాస్త ఇబ్బందులకు గురి చేస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల సరికొత్త రూల్‌ను తీసుకొచ్చింది.
ఇక నుంచి ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన ప్రైవేటు సంస్థల్లోను డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేసే విధంగా చట్టాలు మార్చింది. ఈ కొత్త రూల్స్ జూన్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. కాగా రూల్స్ ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొంది ప్రభుత్వం నిర్దేశించిన అన్ని సదుపాయాలు ఉన్న ప్రైవేటు సంస్థలు డ్రైవింగ్ టెస్టులు నిర్వహించి, సర్టిఫికెట్ ఇవ్వవచ్చు.
అలాగే ఫోర్ వీలర్, అంతకంటే ఎక్కువ లైసెన్స్ టెస్ట్ నిర్వహించాలంటే ప్రైవేట్ డ్రైవింగ్ సెంటర్ కి కనీసం 3 ఎకరాల స్థలం, ట్రైనర్లకు హైస్కూల్ విద్య, డ్రైవింగ్ లో ఐదేళ్ల అనుభవం కచ్చితంగా ఉండాలి. కాగా ఈ రూల్స్ ప్రకారం.. లైట్ వెహికల్స్ కు 29 గంటలు, హెవీ వెహికల్స్ కు 39 గంటల శిక్షణ తప్పని సరిగా ఇవ్వాలని.. ఆ తర్వాతే వారికి టెస్ట్ ద్వారా లైసెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలని కేంద్ర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిష్టాత్మకంగా కేంద్రం తీసుకున్న ఈ కొత్త నిర్ణయం దేశ ప్రజలకు ఏ మాత్రం ఉపయోగకరంగా మారుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.

నాలుగు రోజుల్లో పది సప్లమెంటరీ పరీక్షలు.. షెడ్యూల్ ఇదే..!

పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలు ఈ నెల 24 నుంచి జరగనున్నట్లు విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ తెలిపారు. ఈ రోజు అన్ని జిల్లాల విద్యాశాధికారులతో ఆయన వర్చువల్‌గా జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్‌లోనే పరీక్షల తేదీ, షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ నెల 24 నుంచి జూన్ 3వ తేదీ వరకూ పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 685 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సప్లమెంటరీ పరీక్షల కోసం లక్షా 61 వేల 877 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు చెప్పారు.

ఈ నెల 24వ తేదీ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 నిమిషాల వరకూ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు 8.45కే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఉదయం 9.30 నిమిషాలు దాటితే పరీక్షా కేంద్రాల్లో అనుమతి ఉండదని తేల్చి చెప్పారు. 24న ఫస్ట్ లాంగ్వేజ్, 25న సెకండ్ లాంగ్వేజ్, 27న థర్డ్ లాంగ్వేజ్, 28న గణితం, 29న ఫిజికల్ సైన్స్, 30న బయోలాజిక్ సైన్స్, 31న సోషల్, జూన్ 1,2న ఓఎస్ఎస్సీ పేర్ 1,2 పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 86 మంది ఫ్లైయింట్ స్వ్కాడ్ అధికారులు పరీక్షలను పర్యవేక్షిస్తారని విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ స్పష్టం చేశారు.

Maldives : మల్దీవుల్లో గంట ముందుకు గడియారం.. ఎందుకో తెలుసా?

Maldives : అందమైన ప్రకృతికి నిలయం మాల్దీవులు. పూర్తిగా పర్యాటకంపై ఆధారడిన ఈ ద్వీపదేశంలో ప్రకృతి వింతలు చోటు చేసుకుంటాయి. వీటితో పాటు మరో వింత కూడా ఉంటుంది అదే సమయం. ఈ దీవుల్లోని కొన్ని రిసార్ట్స్ లలో వారి సొంత సమయం ఉంటుంది. ‘ద్వీప సమయం’ అని పిలువబడే ఇది అతిథులు విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. మాల్దీవుల్లోని చాలా గడియారాలు ఆ దేశం అధికారిక టైమ్ జోన్ కంటే కనీసం ఒక గంట ముందుకు పెడతారు. -ఇది గ్రీన్విచ్ మీన్ టైమ్ (జీఎంటీ +5) కంటే 5 గంటలు ముందు.

సెయింట్ రెగిస్ మాల్దీవ్స్, వొములి రిసార్ట్, వెస్టిన్ మాల్దీవ్స్, మిరియాంధూ రిసార్ట్ అండ్ రిట్జ్-కార్ల్టన్ మాల్దీవులు, ఫారీ దీవులతో పాటు మారియట్ గ్రూప్ గొడుగు కింద ఉన్న నాలుగు మాల్దీవుల ఆస్తుల్లో జేడబ్ల్యూ మారియట్ ఒకటి. మొత్తం నాలుగు రిసార్టులు ఐలాండ్ టైమ్ ను పాటిస్తాయి.

ఎక్కువ పగటి సమయం..
సమయాన్ని సర్దుబాటు చేయడం వల్ల పగటి సమయం పెరుగుతుంది. ఇది అతిథులు ఎక్కువగా ఆనందంగా గడిపేందుకు దోహదం చేస్తుంది.

‘మాల్దీవుల్లోని చాలా రిసార్టులు సొంత ప్రైవేట్ ద్వీపాలలో ఉన్నాయి. మాలే ప్రధాన భూ భాగానికి మైళ్ల దూరంలో ఉన్నందున.. అవి తరచూ వారి సొంత నిర్ణయాలు తీసుకుంటాయి. అంటే ‘దీవ్స్ టైమ్’. దీని ద్వారా పర్యాటకులు ప్రతిరోజూ అదనపు పగలు, అదనపు సమయం రిసార్ట్ లో లభిస్తుంది.’ అని సెయింట్ రెగిస్ మాల్దీవులు వోములి రిసార్ట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ జిలా వెగో వివరించారు.

మాల్దీవుల చుట్టూ బహుళ ఆస్తులను కలిగి ఉన్న మరో లగ్జరీ రిసార్ట్ గ్రూప్ ‘సోనేవా’లో కూడా మాలే టైమ్ కంటే గంట ముందుగానే గడియారాల్లో టైమును సెట్ చేస్తారు. ‘ద్వీపం’ అనే పదానికి బదులుగా గడియారం షిఫ్ట్ కు దాని ప్రతి లక్షణాల పేరు పెట్టారు. (ఉదాహరణకు సోనేవా జానీ దీనిని ‘సోనేవా జానీ సమయం’ అని పిలుస్తారు.)

‘ఉదయం 7 గంటలకు సూర్యోదయం, రాత్రి 7:15 గంటలకు అస్తమించడంతో, మా అతిథులు పగటి వేడి నుంచి ఉపశమనం పొంది, ఉదయం జాగింగ్ లేదా చల్లని సాయంత్రం క్రీడల కోసం పూర్తి సమయంతో ఆస్వాదిస్తారు’ అని సోనేవా జానీ జీఎం చార్లెస్ మోరిస్ చెప్పారు.

సౌత్ బీచ్ లో అద్భుతమైన సూర్యాస్తమయాలను వీక్షించేందుకు రాత్రి 7:45 గంటల వరకు ప్రశాంతమైన అందాన్ని కూడా ఇది వారికి అందిస్తుంది. ఇతర రిసార్టుల్లోని సిబ్బంది ఇలా చెప్తున్నారు.. అనధికారిక టైమ్ జోన్ అతిథులకు సూర్యాస్తమయం ముందు ఎక్కువగా బయట గడిపేందుకు.. విందు సమయంలో సూర్యాస్తమయం ఆస్వాదించేందుకు సాయపడుతుంది. ఆ గోల్డెన్ అవర్ కోసం తరుచూ స్పెషల్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తారు.

ఉదాహరణకు, వెస్టిన్ మాల్దీవ్స్ మిరియాంధూ రిసార్ట్ సన్ రైజ్ యోగా, రన్ సెషన్లను నిర్వహిస్తుంది – దీన్ని వెస్టిన్ రన్ అని పిలుస్తారు.

రిట్జ్-కార్ల్టన్ మాల్దీవులు, ఫారీ ఐలాండ్స్ తన పూల్ సైడ్ బార్ లో సూర్యాస్తమయం మాల్దీవుల బోడుబెరు డ్రమ్ ప్రదర్శనతో విందు చేస్తే, సెయింట్ రెగిస్ వారి అతిథుల కోసం సాయంత్రం 6:45 గంటలకు షాంపైన్ బాటిల్ ను అందిస్తుంది.

మాల్దీవులకు మొదటి సారి వచ్చే సందర్శకులకు ద్వీప సమయం ఇప్పటికీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మతమార్పిడి వల్ల అతిథులు గందరగోళానికి గురవుతారని తాము అర్థం చేసుకున్నామని సెయింట్ రెగిస్ సిబ్బంది చెప్తున్నారు. దీనిని పరిష్కరించేందుకు బట్లర్లు అతిథులకు వారి బసకు ముందే ద్వీప సమయాన్ని తెలుపుతారు.

మాల్దీవుల్లోని ప్రతి రిసార్ట్ ద్వీప సమయాన్ని అనుసరించదు. ఇందులో కురుంబా కూడా ఉంది. ఇది దేశంలో మొదటి రిసార్ట్ ఉంటుంది.

‘కురుంబా మాల్దీవుల్లో మేము ద్వీప సమయాన్ని ఉపయోగించం, ఎందుకంటే మాల్దీవుల్లో మొదటి రిసార్ట్ గా ద్వీప సమయం అనే భావన ఉనికిలో లేదు’ అని 1972 నుంచి కొనసాగుతున్న కురుంబా రిసార్ట్ ప్రస్తుత మేనేజర్ అలీ ఫరూక్ చెప్పారు.

‘మా జట్టు సభ్యుల్లో చాలా మంది మాలే నుంచి ప్రయాణిస్తారు. కాబట్టి మేము వారి పని-జీవిత సమతుల్యతను గౌరవించేందుకు ఇష్టపడతాం, అతిథులు వన్ టైమ్ జోన్ లో ఉండడం సౌకర్యవంతంగా, గందరగోళానికి గురికాకుండా ఉంటుందని భావిస్తాం. కురుంబా విమానాశ్రయం నుంచి చిన్న స్పీడ్ బోట్ రైడ్ మాత్రమే, కాబట్టి వారు ఇక్కడ ఉన్నప్పుడు సమయంలో తేడా ఉండదు.

1,190 లోతట్టు ద్వీపాలతో కూడిన మాల్దీవుల ద్వీప సమూహం 90,000 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో ఉంది. దేశంలోని 160కి పైగా రిసార్టుల్లో ఎక్కువ భాగం వ్యక్తి గత ద్వీపాల్లో ఉన్నాయి. వీటిలో చాలా వరకు రాజధాని మాలేలోని వెలానా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్లోట్ విమానంలో ప్రవేశిస్తాయి. ఈ విమానాలు చీకటి పడిన తర్వాత ఎగరలేవు.. కాబట్టి పగటి వేళలు విలువైనవి.

OTT Movies: ఓటీటీ లవర్స్ కు పండగే.. ఈ వారం అదరగొట్టే సినిమాలు ఇవే..

ఓటీటీలో ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. థియేటర్స్ లో ప్రతి శుక్రవారం కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటే.. ఓటీటీలో థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలు ఆతర్వాత ఓటీటీల్లో అలరిస్తున్నాయి. రిలీజ్ అయిన నెల రోజులకు ఓటీటీలోకి వస్తున్నాయి. ఇక ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాల పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ వారం ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

అమెజాన్ ప్రైమ్ లో ఈ వారం స్ట్రీమింగ్ కానున్న సినిమాలు ఇవే..

1. ది వన్‌పర్సెంట్‌ క్లబ్‌ సీజన్‌-1- మే 23

2. ది బ్లూ ఎంజెల్స్‌ – మే 23

3. డీఓఎం సీజన్‌-2 – మే 24

4. బాంబ్‌సెల్‌- మే 25

నెట్‌ఫ్లిక్స్‌
5. గారోడెన్న్‌ది వే ఆఫ్‌ ది లోన్‌ ఉల్ఫ్- మే 23

6. ఇల్లూజన్స్‌ ఫర్‌ సేల్- మే 23

7. ఇన్‌ గుడ్‌ హ్యాండ్స్‌-2- మే 23

8. ఫ్రాంకో ఎస్కామిల్లా: లేడీస్ మ్యాన్‌- మే 23

9. అట్లాస్‌ – మే 24

10. ముల్లిగన్‌ పార్ట్‌-2 – మే 24

11. మై ఓని గర్ల్‌- మే 26

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌
12. డోరామ్యాన్‌ సీజన్-19 – మే 20

13. షిన్‌ చిన్‌ సీజన్-16 – మే 20

14. మార్వెల్‌ స్టూడియోస్:అసెంబుల్డ్‌: ది మేకింగ్‌ ఆఫ్‌ ఎక్స్‌మెన్- మే 22

15. పాలైన్– మే 22

16. ది కర్దాషియన్స్- సీజన్-5- మే 23

17. ది బీచ్‌ బాయ్స్‌- మే 24

18. ఆడుజీవితం(ది గోట్‌ లైఫ్‌)- మే 26 (అంచనా )

19. రోలాండ్‌ గారోస్ – మే 26

ఆహా
20. ప్రసన్నవదనం- మే 24

యాపిల్ టీవీ ప్లస్
21. ట్రైయింగ్‌ సీజన్‌-4- మే 22

The Goat Life: రూ. 150 కోట్లు కొల్లగొట్టిన బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలో… గోట్ లైఫ్ ఇక్కడ చూసేయండి!

The Goat Life: ఈ ఏడాది విడుదలైన మలయాళ చిత్రాలు ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ సంచలనం రేపాయి. ఈ లిస్ట్ లో ది గోట్ లైఫ్ కూడా ఉంది. వాస్తవ సంఘటనల ఆధారంగా ది గోట్ లైఫ్: ఆడు జీవితం తెరకెక్కింది. సలార్ ఫేమ్ పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర చేశాడు. ది గోట్ లైఫ్ చిత్రానికి బ్లెస్సీ దర్శకుడు. రచయిత బెన్యమిన్ రాసిన ఆడు జీవితం నవల ఆధారంగా బ్లెస్సీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. బ్లెస్సీ ఆలోచన సినిమా రూపం దాల్చడానికి 16 ఏళ్ల సమయం పట్టింది. 2008లోనే ది గోట్ లైఫ్ చిత్రాన్ని తెరకెక్కించాలని బ్లెస్సీ అనుకున్నాడు.

మొదట ఈ కథను ఆయన హీరో సూర్యకు చెప్పాడు. అప్పట్లో సూర్యకు ఉన్న కమిట్మెంట్స్ రీత్యా ఆయన తిరస్కరించాడు. దర్శకుడు బ్లెస్సీ కోరిన బడ్జెట్ సమకూర్చేందుకు నిర్మాతలు ఎవరూ ముందుకు రాలేదు. దాంతో ది గోట్ లైఫ్ మూవీ తెరపైకి వచ్చేందుకు సుదీర్ఘ సమయం పట్టింది. ఈ చిత్రం కోసం హీరో పృథ్విరాజ్ సుకుమారన్ చాలా కష్టపడ్డారు. ఆయన 30 కేజీలకు పైగా బరువు తగ్గినట్లు సమాచారం.

మార్చి 28న ది గోట్ లైఫ్ థియేటర్స్ లోకి వచ్చింది. మలయాళంతో పాటు పలు భాషల్లో విడుదల చేశారు. వరల్డ్ వైడ్ ది గోట్ లైఫ్ రూ. 150 కోట్ల వసూళ్ళు రాబట్టింది. ఈ సెన్సేషనల్ సర్వైవల్ థ్రిల్లర్ ఓటీటీ లోకి వచ్చేస్తుంది. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. ది గోట్ లైఫ్ మూవీ డిజిట్ల రైట్స్ ప్రముఖ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసింది. హాట్ స్టార్ ప్రతినిధులు మే 26 నుండి స్ట్రీమ్ కానుందట. దీంతో ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆడు జీవితం కథ విషయానికి వస్తే… కేరళలో హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనుభవిస్తున్న నజీబ్ మహ్మద్(పృథ్విరాజ్ సుకుమారన్) సౌదీ అరేబియా వెళ్లాలి అనుకుంటాడు. అక్కడ కొన్నాళ్ళు ఉండి డబ్బులు సంపాదించుకుని తిరిగి స్వదేశం రావాలనేది నజీబ్ కోరిక. కుటుంబానికి మంచి జీవితం ఇవ్వాలనే ఆశతో ఓ ఏజెంట్ ద్వారా సౌదీ అరేబియా వెళతాడు. కానీ ఆ ఏజెంట్ మోసం చేస్తాడు. అనుకోకుండా నజీబ్ ఓ అరబ్ షేక్ వద్ద బానిసగా బ్రతకాల్సి వస్తుంది. ఎడారిలో గొర్రెలు కాస్తూ దుర్భరమైన ఒంటరి జీవితం అనుభవిస్తాడు. మరి నజీబ్ ఇండియాకు వచ్చాడా? లేదా? అతని జీవితం ఎలా ముగిసింది అనేది కథ…

Virat Kohli: ఇది కోహ్లి రాసిన కథ , RCB పోరాడిన తీరు అమోఘం

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ప్లేఆఫ్స్‌కు చేరుతుందని ఓ నెల ముందు ఎంతమంది ఊహించివుంటారు..? బహుశా ఒక్కరూ ఉండరేమో! ఆ జట్టు ప్రదర్శన అలాంటిది మరి! ఎనిమిది మ్యాచ్‌ల్లో ఏడు ఓటములతో పట్టికలో అట్టడుగున ఉన్న ఆర్సీబీ.. ఇంకొక్క ఓటమి చవిచూస్తే ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించే స్థితిలో నిలిచిందప్పుడు. అభిమాని సంగతి అటుంచితే.. మిగతా జట్లు దూసుకుపోతున్న వేళ.. ఆ జట్టు ఆటగాళ్లు కూడా తమ అవకాశాలపై ఆశాభావంతో ఉండి ఉండరు. కానీ జరిగింది అద్భుతం కన్నా ఏమాత్రం తక్కువ కాదు.ప్లేఆఫ్స్‌ రేసు నుంచి మొదటగా నిష్క్రమిస్తుందనుకున్న జట్టు వరుసగా ఆరు విజయాలతో ఔరా అనిపించింది. ఆశలన్నీ అడుగంటిన వేళ.. ప్రపంచమంతా తమను పక్కనపెట్టేసిన సమయాన, పట్టువదలకుండా.. ఆర్సీబీ పోరాడిన తీరు నభూతో..!

జట్టు నిండా స్టార్లేమీ లేరు. మ్యాక్స్‌వెల్‌, డుప్లెసిస్‌ లాంటి వాళ్లు ఫామ్‌తో తంటాలు పడ్డారు. అలాంటి నేపథ్యంలో ఓ నెల రోజులు గెలుపు మొహమే చూడని బెంగళూరు తన రాతను మార్చుకున్న తీరు స్ఫూర్తిదాయకం. మరి ఆర్సీబీ దశ తిరగడానికి ప్రధాన కారణమేంటి అన్న ప్రశ్న తలెత్తినప్పుడు.. జవాబుగా కనిపించేది విరాట్‌ కోహ్లి మాత్రమే. అతడు టోర్నీ ఆసాంతం అదిరే బ్యాటింగ్‌తో పరుగుల వరద పారించడం ఒక ఎత్తు.. నిరాశ దరిచేరనీయకుండా సహచరుల్లో స్ఫూర్తిని రగిలించడం మరో ఎత్తు. కెప్టెన్‌గా దిగిపోయినా నాయకత్వ పాత్రను అద్భుతంగా పోషిస్తూనే ఉన్నాడు విరాట్‌. తాను ఆడుతూ సహచరులకు ప్రేరణనిస్తూ సాగిపోతున్నాడు. ఫీల్డ్‌లో చిరుతలా కదిలే కోహ్లిని చూస్తేనే సహచరుల్లో ఎనలేని ఉత్సాహం వస్తుంది. బౌలర్‌ వికెట్‌ తీసినప్పుడో, ఫీల్డర్‌ ఓ అద్భుత క్యాచ్‌ పట్టినప్పుడో అతడు సంబరాలు చేసుకునే తీరు, ప్రదర్శించే కసి అసంకల్పితంగానే సాటి ఆటగాళ్లకు ఉత్తేజాన్నిస్తుంది. ముఖ్యంగా జట్టులో యువ ఆటగాళ్లకు అతడు గొప్పగా మార్గనిర్దేశనం చేస్తాడు. ఓటమిని అంగీకరించని వ్యక్తిత్వం వల్ల కోహ్లి చిన్న అవకాశాన్నైనా వదలకుండా పోరాడతాడు. మాటల్లో అదే చెప్తాడు. చేతల్లోనూ అదే చేస్తాడు. నిరుడు మహిళల ప్రిమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో అమ్మాయిల ఆర్సీబీ జట్టు తొలి అయిదు మ్యాచ్‌లూ ఓడింది. అప్పుడు అమ్మాయిలకు ప్రేరణ కలిగిస్తూ.. ‘‘2019లో వరుసగా ఆరు మ్యాచ్‌లు ఓడిపోయాం. అప్పుడు నేనే కెప్టెన్‌. ఏం చేయాలో అర్థం కాలేదు. క్రికెట్‌ కెరీర్లో అంతకుముందెప్పుడూ వరుసగా 6 మ్యాచ్‌లు ఓడిపోలేదు. అనూహ్యమైన విషయాలు జరుగుతాయి. దురదృష్టమూ వెంటాడుతుంది. కానీ నమ్మకం కోల్పోవద్దు. ఒక్క శాతం అవకాశం కూడా ఉంటుంది. కొన్నిసార్లు అది సరిపోతుంది. ఆ ఒక్క శాతం గురించి ఎలా ఆలోచిస్తారన్నది కీలకం. ఆ ఒకటిని 10గా, 10ని 30గా మారుస్తూ మాయ చేయాలి. మనల్ని ఎవరూ నమ్మనప్పుడు గెలవడం అద్భుతంగా ఉంటుంది’’ అని కోహ్లి ప్రసంగించాడు. అతని మాటలు మంత్రంలా పనిచేశాయేమో అమ్మాయిల జట్టు వరుసగా తర్వాతి రెండు మ్యాచ్‌లు గెలిచింది. ఈ సీజన్‌లో ఏకంగా టైటిల్‌ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఐపీఎల్‌లోనూ బెంగళూరు అదే స్ఫూర్తితో సాగుతోంది. ఏప్రిల్‌ 21న కేకేఆర్‌ చేతిలో ఓటమితో ఏడో పరాజయాన్ని ఖాతాలో వేసుకున్నప్పుడు ప్లేఆఫ్స్‌ చేరేందుకు ఆర్సీబీకి ఉంది ఒక్క శాతం అవకాశమే.

ఆడి.. ఆడించి!: కోహ్లి పట్టుదల, ఎలాంటి స్థితిలోనూ ఆశలు వదులుకోని తత్వమే ఆర్సీబీ ఇక్కడిదాకా రావడంలో ప్రధాన పాత్ర పోషిందనడం అతిశయోక్తి కాదు. తానెంత బాగా ఆడుతున్నా… సహచరుల ఫామ్‌తో సతమతమవుతుంటే, వరుస ఓటములు ఎదరవుతుంటే ఏ ఆటగాణ్నైనా నిరాశ ఆవహిస్తుంది. కానీ కోహ్లి కేవలం ఓ ఆటగాడు కాదు.. పోరాట యోధుడు. ఫలితాలతో సంబంధం లేకుండా పరుగుల వేటలో విరామం లేకుండా సాగిపోయాడు. అవకాశాన్ని వదలొద్దని, ఆఖరి మ్యాచ్‌ వరకూ విశ్రమించొద్దని ప్రతి ఆటగాడికి నూరిపోశాడు. తాను బ్యాటింగ్‌లో నిలకడ కొనసాగిస్తూ ఓ ఉదాహరణగా నిలిచాడు. స్ట్రైక్‌ రేట్‌పై విమర్శలకు ధనాధన్‌ ఇన్నింగ్స్‌ సమయంలోనే సమాధానమిచ్చాడు.

సన్‌రైజర్స్‌పై 20 బంతుల్లో 42 (210 స్ట్రైక్‌ రేట్‌), గుజరాత్‌పై 44 బంతుల్లో 70 (159), పంజాబ్‌పై 47 బంతుల్లోనే 92 (195), దిల్లీపై 13 బంతుల్లో 27 (207), చెన్నైపై 29 బంతుల్లో 47 (162) పరుగులు చేసి విమర్శకుల నోళ్లు మూయించాడు. కోహ్లి అంటే అంతే మరి. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 708 పరుగులు చేసిన అతనే అత్యధిక పరుగుల వీరుడు. అతని సగటు 64.36 కాగా స్ట్రైక్‌ రేట్‌ 155.60గా ఉండటం విశేషం. అత్యధిక పరుగుల ఆటగాళ్లలో రెండో స్థానంలో ఉన్న రుతురాజ్‌ (583)కు కోహ్లికి అంతరం 100 పరుగుల పైనే. ఇది కోహ్లి ఆధిపత్యానికి నిదర్శనం. అతడు డ్రెస్సింగ్‌ రూమ్‌లో సహచరులను ఎంతగా ప్రోత్సహిస్తాడన్నది ఏ ఆటగాడిని అడిగినా చెబుతాడు. ఆరంభంలో తడబడ్డ పటీదాద్‌ లాంటి ఆటగాడు క్రమంగా పుంజుకుని చెలరేగిపోతున్నాడంటే అందులో కోహ్లి పాత్ర లేదని ఎలా చెప్పగలం. మరోవైపు తన ఫీల్డింగ్‌ నైపుణ్యాలతో, ఫిట్‌నెస్‌తో కోహ్లి ఎప్పటికప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. 35 ఏళ్ల అతను గుజరాత్‌ ఆటగాడు షారుఖ్‌ ఖాన్‌ను రనౌట్‌ చేసిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. బ్యాటర్‌ వికెట్లకు అడ్డంగా పరుగెత్తుతున్నాడు.. పాయింట్‌ నుంచి పరుగెత్తుతూ వచ్చిన కోహ్లి బంతి అందుకుని త్రో విసిరే క్రమంలో పడిపోయాడు. కానీ అతని గురి తప్పలేదు. అతని స్ఫూర్తితోనే బెంగళూరు ఆటతీరు మారింది. కోహ్లి భుజాలపై భారాన్ని సహచరులూ పంచుకోవడం మొదలు పెట్టారు . బౌలింగ్‌ కుదురుకుంది. బ్యాటింగ్‌ గాడినపడింది. కోహ్లీలోని కసి అందరికీ పాకింది. ఆ కసి ఆర్సీబీకి కప్పుతెచ్చిపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వరుస విజయాలిచ్చిన విశ్వాసమో.. ఆటగాళ్ల పోరాటం పెంచిన ధీమానో.. ఇప్పుడు ప్రతి ఆర్సీబీ అభిమాని నోట ఒకటే మాట…ఈ సాలా కప్‌ నమదే!

కొన్నిసార్లు గెలిచేందుకు ఒక్క శాతం అవకాశం ఉంటుంది. ఆ ఒక్క శాతం గురించి ఎలా ఆలోచిస్తారన్నది కీలకం. ఆ ఒకటిని 10గా, 10ని 30గా మారుస్తూ మాయ చేయాలి. మనల్ని ఎవరూ నమ్మనప్పుడు గెలవడం అద్భుతంగా ఉంటుంది

సన్‌రైజర్స్‌, కోల్‌కతా, రాజస్థాన్‌లు నిస్సంకోచంగా బలమైన జట్లే. అందులో ప్రతి జట్టుకూ కప్పు కొట్టే సత్తా ఉందనడంలో సందేహం లేదు. కానీ వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి, అసాధ్యమనుకున్న దాన్ని సుసాధ్యం చేసిన బెంగళూరు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.

Health

సినిమా