హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి ఈ సమీక్షకు హాజరయ్యారు. ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై చర్చించేందుకు ఈ నెల 18న తెలంగాణ మంత్రి మండలి భేటీ కావాలని నిర్ణయించారు. ఆ మేరకు ఉద్యోగులు, ఆస్తులు, అప్పుల విభజనపై నివేదిక ఇవ్వాలని సీఎం.. అధికారులను ఆదేశించారు.
పెండింగ్ అంశాల పరిష్కారానికి కార్యాచరణ తయారు చేయాలని సూచించారు. రెండు రాష్ట్రాల సయోధ్యతో ఉద్యోగుల బదిలీ సమస్యను పరిష్కరించాలని పేర్కొన్నారు. పీటముడి అంశాలపై రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేలా కార్యాచరణ ఉండాలని చెప్పారు. జూన్ 2 తర్వాత ఏపీ ఆధీనంలో ఉన్న లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ వంటి భవనాలను స్వాధీనం చేసుకోవడానికి ఏర్పాట్లు చేయాలన్నారు.
Telangana news: హైదరాబాద్‌లో ఏపీ ఆధీనంలో ఉన్న భవనాల స్వాధీనానికి సీఎం రేవంత్ ఆదేశం
Spam Calss: ఆ మొబైల్ ఫోన్లు అన్నీ బ్యాన్.. కేంద్రం సంచలన నిర్ణయం
మొబైల్ ఫోన్ వాడే అందరికీ అలెర్ట్. టెలికం కంపెనీలకు గవర్నమెంట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. సైబర్ క్రైమ్‌లో పాలు పంచుకున్న 28,200 మొబైల్ ఫోన్లపై నిషేధం విధించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
దేశవ్యాప్తంగా ఈ నిర్ణయం అమలులోకి ఉంటుంది. అలాగే మొబైల్ సిమ్ కార్డులకు సంబంధించి కూడా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సిమ్ కార్డులను రీవెరిఫికేషన్ చేసుకోవాలని సూచించింది. 20 లక్షల మొబైల్ కనెక్షన్లకు రీవెరిఫికేషన్ చేయాలని టెలికాం సంస్థలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఒకవేళ సిమ్ కార్డుల రీవెరిఫికేషన్ విఫలమైతే.. ఆ సిమ్ కనెక్షన్లను తొలగించాలని కంపెనీలకు కేంద్రం సూచించింది. అందువల్ల సిమ్ కార్డు యూజర్లు, మొబైల్ హ్యాండ్ సెట్ ఉన్నవారు ఈ విషయంపై స్పష్టతతో ఉండాలి. సైబర్ క్రైమ్స్‌ను అడ్డుకోవాలనే టార్గెట్‌గా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వం వద్ద డేటా ప్రకారం 28,200 మొబైల్ హ్యాండ్ సెట్స్.. సైబర్ క్రైమ్‌లో ఇన్వాల్వ్ అయ్యాయి. ఈ మొబైల్ హ్యాండ్ సెట్స్‌లో దాదాపు 20 లక్షల నెంబర్లను వినియోగించారు. రీవెరిఫికేషన్ అనంతరం ఈ సిమ్ కార్డులు అన్నింటిపై నిషేధం అమల్లోకి వస్తుంది. ఫోన్లపై కూడా బ్యాన్ పడనుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఈ మొబైల్ హ్యాండ్ సెట్లపై బ్యాన్ వేయాలని టెలికాం కంపెనీలకు టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. అలాగే 20 లక్షల మొబైల్ కనెక్షన్లకు రీవెరిఫికేషన్ చేయాలని సూచించింది. డిజిటల్ మోసాల నుంచి పౌరులను రక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ప్రభుత్వం ఇటీవలనే డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్‌ను ప్రవేశపెట్టింది . దీని ద్వారా సైబర్ క్రైమ్స్, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్‌కు అడ్డుకట్ట వేయవచ్చు. ఇన్‌ఫర్మేషన్ ఎక్స్చేంజ్, రియల్‌టైమ్ ఇంటెలిజెన్స్ షేరింగ్, ఇతర విభాగాల మధ్య కోఆర్డినేషన్ వంటివి ఈ కొత్త ప్లాట్‌ఫామ్ ద్వారా సులభంగా జరపొచ్చు. టెలికం కంపెనీలు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఐడెంటిటీ డాక్యుమెంట్ ఇష్యూయింగ్ అథారిటీస్ ఇలా పలు రకాల విభాగాలు అన్నీ ఈ ప్లాట్‌ఫామ్ కింద లింకై ఉంటాయి. కలిసి పని చేస్తాయి. అందువల్ల సమస్యలను వేగంగా పరిష్కరించే వీలుంటుంది.
AP Politics: ముగిసిన పోలింగ్.. సజ్జల దుకాణం బంద్..,నెల మధ్యలో షాక్
అధికార వైసీపీకి సజ్జల భార్గవ్ నేతృత్వంలో విశేష సేవలందించిన సోషల్ మీడియా విభాగం మంగళవారం మూతబడింది. ప్రభుత్వ సలహాదారుగా, ప్రభుత్వంలో అన్నీ తానై వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు భార్గవ్ నేతృత్వంలో నడుస్తున్న ఈ విభాగం పలు వివాదాలకు కారణమైన సంగతి తెలిసిందే.
చివరకు ఇటీవల ఎన్నికల సంఘం కేసు కూడా నమోదు చేసింది.
ఎన్నికలు ఇలా ముగిశాయో లేదో ఇక మీ అవసరం లేదంటూ 130 మందికి పైగా ఉన్న ఉద్యోగులకు బై చెప్పేశారు. తాడేపల్లి జాతీయ రహదారిపై వైసీపీ ప్రధాన కార్యాయలానికి దగ్గరలో సజ్జల రామకృష్ణారెడ్డి కార్యాలయం పైనే ఈ సోషల్ మీడియా కార్యాలయం వుంది. కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్టు పోలింగ్ జరిగిన సోమవారమే ప్రకటించారు.
నెల మధ్యలో షాక్
నెల మధ్యలో ఆఫీసు మూసేసి ఇంటికి పొమ్మనడం రెండు, మూడేళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులకు షాక్ ఇచ్చినట్లైంది. కనీసం నెలాఖరు వరకూ కొనసాగించాల్సిందిగా వారు చేసిన వినతిని పట్టించుకోలేదు సరికదా.. చివరకు ఎప్పటినుంచో వాడుతున్న ల్యాప్‌టాప్‌లతో పాటు కంపెనీ ఇచ్చిన మొబైల్ ఫోన్‌లు కూడా తమకు అప్పగించి వెళ్లాలని సూచించడం ఉద్యోగులను ఆశ్చర్చపరచింది.
రెండేళ్లుగా వాడుతున్న పాత ఫోన్లు సజ్జల ఏం చేసుకొంటారో? సెకెండ్ హ్యాండ్ మార్కెట్‌లో అమ్ముకొంటారా? ఇంతకాలం రేయింబవళ్లు కష్టపడి చేసిన పనికి గుర్తింపు గౌరవమే లేదంటూ వారు అవేదన వ్యక్తం చేస్తున్నారు. మే నెల జీతం కూడా ఇవ్వకుండా జూన్ 4న ఫలితాల రోజు వచ్చి తీసుకోండని చెప్పి పంపించి వేయడం వారిని మరింత బాధించింది. వాడుకొని వదిలేసే విషయంలో వైసీపీ తీరు మారనేలేదని తిట్టుకొంటూ పాపం సోషల్ మీడియా సిబ్బంది ఇంటి ముఖం పట్టారు.
తెలుగు ప్రేక్షకులకు బిగ్ షాక్. 10 రోజులపాటు థియేటర్లు బంద్
రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ఊహించని షాక్ తగిలింది.
తెలంగాణ రాష్ట్రంలో పది రోజులపాటు థియేటర్లు బంద్ కానున్నాయి. అక్యుపెన్సి తక్కువ ఉండటంతో తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు తాత్కాలిక విరామం ప్రకటించాయి.
శుక్రవారం నుంచి పది రోజులపాటు షోలు వేయవద్దని తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది.
ఎన్నికలు అలాగే ఇతర కారణాలతో ఇటీవల పెద్ద సినిమాలు రిలీజ్ కావడం లేదు.
దీంతో సినిమా హాళ్ళకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. నగరాలతో పోలిస్తే పట్టణాలు అలాగే మండలాలలో ఇది మరింత దారుణంగా ఉందని… తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది.
Bhuma Akhilapriya body guard Nikhil attacked: నంద్యాలలో అర్థరాత్రి, అఖిలప్రియ బాడీగార్డుపై మర్డర్ ప్లాన్.
Bhuma Akhilapriya body guard Nikhil attacked: ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ కక్షలు మళ్లీ మొదలయ్యాయా? అవుననే అంటున్నారు అక్కడి ప్రజలు. ఎన్నికల పోలింగ్ తర్వాత ప్రశాంతంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా భూమా అఖిలప్రియ బాడీగార్డుపై మర్డర్ ప్లాన్ జరిగింది.
దీని వెనుక ఎవరున్నారు? రాజకీయ ప్రత్యర్థులా? లేక ఫ్యాక్షన్ కక్షలా? ఇలా రకరకాల ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
అసలేం జరిగిందంటే.. మంగళవారం అర్థరాత్రి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డు నిఖిల్ రోడ్డుపై ఓ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. మాటల తర్వాత పక్కకు వస్తున్న సమయంలో వేగంగా వచ్చిన కారు అతడ్ని హిట్ కొట్టింది. కారు వేగానికి నిఖిల్ పైకి వెళ్లి కిందపడ్డాడు. ఈలోగా కారు ముందుకు వెళ్లి ఆగింది. అందులో నుంచి ముగ్గురు వ్యక్తులు దిగి ఆయన్ని వెంటాడారు. చివరకు నిఖిల్ వీధిలోకి పారిపోవడంతో ఆ వ్యక్తులు అక్కడి నుంచి కారులో పరారయ్యారు.
తీవ్రంగా గాయపడిన నిఖిల్‌ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తోటి వ్యక్తి తరలించాడు. వెంటనే భూమా ఫ్యామిలీకి సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. అయినా పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నమాట. ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నారనేది మిస్టరీగా మారింది. కారులో వచ్చిన వ్యక్తులెవరు? అర్థరాత్రి ఆ సమయంలో నిఖిల్ రోడ్డుపై ఉన్నట్లు ప్రత్యర్థులకు ఎవరు సమాచారం ఇచ్చారు? ఇలా రకరకాల ప్రశ్నలు పోలీసులను వెంటాడుతున్నాయి.
ఆరునెలల కిందట టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నంద్యాలలో యువగళం పేరిట పాదయాత్ర చేపట్టారు. ఆ సమయంలో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై నిఖిల్ దాడి చేశాడు. ఆ నేపథ్యంలోనే ఆయన వర్గీయులు తిరిగి దాడికి పాల్పడినట్టు అక్కడి ప్రజలు భావిస్తున్నారు. తాజా ఘటనతో నేతల ఇళ్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కారు, వ్యక్తుల వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
WhatsApp New Feature: ఇకపై అలా కుదరదు.. ఆ సమస్యలకు వాట్సాప్ చెక్.. కొత్త ఫీచర్ భలే భలే!!
WhatsApp New Feature: ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ అంటే తెలియని వారుండరు. ఈ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ఉపయోగిస్తున్నారు. స్నేహితులు, బంధువులతో చాట్ చేయడానికి, ఆడియో-వీడియో కాల్‌లు చేయడానికి, ఫొటోలు, వీడియోలు, ఫైల్‌లను షేర్ చేయడానికి ఈ యాప్‌ను ఎక్కువగా ఉపయోగిస్తారు. అందువల్ల తమ యాప్ ద్వారా వినియోదారులకు ఎలాంటి భంగం కలగకుండా ఉండేందుకు వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్లున తీసుకొస్తూనే ఉంది. తాజాగా వాట్సాప్ తమ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త అందించింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వాట్సాప్ త్వరలో తీసుకురానున్న ఆ ఫీచర్ ద్వారా మీ ప్రొఫైల్ ఫోటోను ఎవరూ స్క్రీన్‌షాట్ తీసుకోలేరు. తాజా సమాచారం ప్రకారం.. ప్రొఫైల్ ఫొటో స్క్రీన్‌షాట్‌లను తీయకుండా వినియోగదారులను నిరోధించే ఫీచర్‌పై WhatsApp పని చేస్తోంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వాట్సాప్ డీపీలతో చాలా మోసాలు జరిగాయి. వాట్సాప్ డీపీ ఫొటోలను మార్పింగ్ చేసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడిన ఘటనలు ఎన్నో జరిగాయి. అంతేకాకుండా వేధించడం వంటి సంఘటనలు కూడా జరిగాయి. ఇలాంటి వాటిని అరికట్టేందుకు వాట్సాప్ ఈ ఫీచర్‌ను తీసుకువస్తుంది.
WabetaInfo నివేదిక ప్రకారం.. ఇది వినియోగదారులను ఒకరి ప్రొఫైల్ ఫొటోని స్క్రీన్‌షాట్‌లను తీయకుండా పరిమితం చేస్తుంది. మీ అనుమతి లేకుండా మీ ప్రొఫైల్ ఫోటోను ఎవరూ షేర్ చేయలేరు. అయితే ఇప్పటి వరకు ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వినియోగదారులకు మాత్రమే వచ్చింది. ఇంకా iOS వినియోగదారులకు అందుబాటులో లేదు. త్వరలో ఇది iOS వినియోగదారులకు కూడా అందుబాటులోకి రానుంది.
ఈ అప్‌డేట్ వచ్చినప్పుడు ప్రొఫైల్ ఫొటోల స్క్రీన్‌షాట్‌లను తీసే సదుపాయం నిలిపివేయబడిందని మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంటే అప్పుడు ఎవరూ WhatsApp లోపల నేరుగా మీ ప్రొఫైల్ ఫోటో స్క్రీన్‌షాట్ తీసుకోలేరు. అయితే ఈ ఫీచర్ అనుమతి లేకుండా ఫోటోలను షేర్ చేయడం వల్ల వచ్చే సమస్యను చాలా వరకు తగ్గిస్తుంది. కాగా వాట్సాప్ వినియోగదారులకు వారి వ్యక్తిగత సమాచారంపై మరింత నియంత్రణను ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. ఈ ఫీచర్‌తో ప్రొఫైల్ ఫొటోల దుర్వినియోగం తగ్గుతుందని సంస్థ భావిస్తున్నారు.
Good news SBI hikes FD rates: ఎఫ్‌డీ రేట్లు పెంచిన ఎస్‌బీఐ.. లేటెస్ట్ వడ్డీ రేట్లు ఇవే.
దిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (fixed deposit ) వడ్డీ రేట్లను పెంచింది. రూ.2 కోట్లలోపు రిటైల్ డిపాజిట్లపైనా, అలాగే, రూ.2 కోట్ల పైబడిన బల్క్ డిపాజిట్లపైనా వడ్డీ రేట్లను సవరించింది. కొత్త వడ్డీ రేట్లు మే 15 నుంచి అమల్లోకి వచ్చినట్లు ఎస్‌బీఐ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
రూ.2 కోట్లలోపు రిటైల్ డిపాజిట్లపై ఎస్‌బీఐ గరిష్ఠంగా 75 బేసిస్ పాయింట్ల మేర ఎస్‌బీఐ వడ్డీని పెంచింది. 46 రోజుల నుంచి 179 రోజుల ఎఫ్‌డీపై గతంలో 4.75 శాతం వడ్డీకి బదులు ఇకపై 5.50 శాతం చెల్లించనుంది. సీనియర్ సిటిజన్లకు 5.25 శాతంగా ఉన్న ఈ వడ్డీని శాతానికి పెంచింది. 211 రోజుల నుంచి ఏడాదిలోపు ఎఫ్‌డీలపై ప్రస్తుతం ఉన్న వడ్డీని 6 నుంచి 6.25 శాతానికి పెంచింది. సీనియర్ సిటిజన్లకు గరిష్ఠంగా 6.75 శాతం వడ్డీ లభించనుంది.
ఇక 7 రోజుల నుంచి 45 రోజుల బల్క్ డిపాజిట్లపై వడ్డీని 25 బేసిస్ పాయింట్ల మేర ఎస్‌బీఐ పెంచింది. ప్రస్తతం ఈ ఎఫ్‌డీలపై 5 శాతం వడ్డీ అందిస్తుండగా.. ఇకపై 5.25 శాతం చొప్పున వడ్డీ ఇవ్వనుంది. 46 రోజుల నుంచి 179 రోజుల ఎఫ్‌డీపై 50 బేసిస్ పాయింట్లు పెంచి 5.75 శాతం నుంచి 6.25 శాతానికి వడ్డీ పెంచింది. ఇదే కాలానికి సీనియర్ సిటిజన్లకు 6.75 శాతం వడ్డీ లభిస్తుంది.
రూ.2కోట్లలోపు డిపాజిట్లపై వడ్డీ ఇలా..
వాకింగ్ చేసేటప్పుడు కచ్చితంగా పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా
వ్యాయామాల్లో అత్యంత సులువైనది మరియు అందరికీ అనువైనది వాకింగ్.( walking ) పైగా ఇది ఎటువంటి ఖర్చులేని వ్యాయామం. మన దినచర్యలో వాకింగ్ ను భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతుంటాడు.
అది అక్షరాల నిజం. వాకింగ్ వల్ల శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎన్నో లాభాలు పొందుతారు. వాకింగ్ శరీర కొవ్వును కరిగిస్తుంది. రక్తపోటును( blood pressure ) అదుపులో ఉంచుతుంది. ఎముకల నష్టాన్ని తగ్గిస్తుంది. ఒత్తిడిని చిత్తు చేయడంలో సహాయపడుతుంది. నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.
అలాగే వాకింగ్ చేయడం వల్ల గుండె జబ్బులు( Heart diseases ) వచ్చే ప్రమాదం తగ్గుతుంది. జీవితకాలం పెరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే వాకింగ్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ వాకింగ్ ను అలవాటు చేసుకోవాలి. అయితే వాకింగ్ చేసేటప్పుడు కచ్చితంగా పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. అవేంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. వాకింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా శరీరానికి అవసరమయ్యే అన్ని పోషకాలను అందించాలి. పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. లేదంటే నీరసంగా, బద్ధకం( Dull, lethargic ) గా మారిపోతారు.
వాకింగ్ చేసేటప్పుడు తలను స్ట్రైట్ గా పెట్టాలి. కొందరు తలను నేలకు వచ్చి వంగినట్లు నడుస్తుంటారు. ఇలా చేయడం వల్ల మెడ నొప్పి, నడుం నొప్పి వంటివి వేధిస్తాయి. అలాగే ఖాళీ కడుపుతో ఎప్పుడూ వాకింగ్ ప్రారంభించకూడదు. వాకింగ్ కు ముందు కనీసం వాటర్ ను అయినా తీసుకోవాలి. వాకింగ్ ముందు వార్మప్ చేయడం చాలా ముఖ్యం. లేదంటే కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు( Joint pain, knee pain ) మొదలవుతాయి. అలాగే వారం మొత్తం వాకింగ్ చేయడం వల్ల కండరాలకు అంత మంచిది కాదు. కాబట్టి వారానికి ఐదు రోజులు వాకింగ్ చేస్తే సరిపోతుంది. రెండు రోజులు వాకింగ్ నుంచి బ్రేక్ తీసుకోవచ్చు. జ్వరంగా ఉన్నప్పుడు అస్సలు వాకింగ్ చేయకూడదు. ఎందుకంటే ఆ సమయంలో శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది. అలాంటప్పుడు వాకింగ్ చేస్తే శరీరం మరింత బలహీనంగా మారుతుంది. ఇక వాకింగ్ ఆరోగ్యానికి మంచిదే. కానీ అధికంగా చేయడం మాత్రం చాలా ప్రమాదకరం. రోజుకు ప్రతీ వ్యక్తి 35 నుంచి 45 నిమిషాల పాటు వాకింగ్ చేడచ్చు.
Health tips | భోజనానికి ముందు, తర్వాత ఆ రెండూ అస్సలు తీసుకోవద్దు..!
భారత వైద్య పరిశోధనా మండలి హెచ్చరిక
మితంగానే వాటిని సేవించాలని సూచన
న్యూఢిల్లీ, మే 14: మనలో చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది.
ఇవి లేకపోతే ఎంతో మందికి పొద్దు గడవదు. కానీ, వీటిని మితంగా సేవించాలని, పరిమితికి మించి సేవిస్తే అనర్థాలు తప్పవని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) స్పష్టం చేసింది. దేశంలో ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను ప్రోత్సహించేందుకు ఐసీఎంఆర్ ఇటీవల జాతీయ పౌష్ఠికాహార సంస్థ (ఎన్‌ఐఎన్)తో కలిసి 17 సరికొత్త ఆహార మార్గదర్శకాలను జారీచేసింది. టీ, కాఫీని అధికంగా సేవిస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరించారు.
వీటిలో ఉండే కెఫీన్ కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపించి టీ, కాఫీపై శారీరకంగా ఆధారపడే తత్వాన్ని పెంపొందిస్తుందని ఐసీఎంఆర్ పరిశోధకులు వివరించారు. మనం సేవించే ప్రతి కప్పు (150 మిల్లీలీటర్ల) బ్రూవ్డ్ కాఫీలో 80 నుంచి 120, ఇన్‌స్టంట్ కాఫీలో 50-65, టీలో 30-65 మిల్లీగ్రాముల కెఫీన్ ఉంటుందని పేర్కొంటూ.. రోజుకు 300 మిల్లీగ్రాముల కెఫీన్‌ను మాత్రమే తీసుకోవాలని సూచించారు. భోజనం చేయడానికి గంట ముందు, భోజనం చేసిన తర్వాత టీ, కాఫీ తాగకూడదని, లేకపోతే వాటిలోని టానిన్లు మన దేహంలో ఇనుము శోషణ శక్తిని తగ్గిస్తాయని తెలిపారు.
దీంతో ఐరన్ లోపం ఏర్పడి రక్తహీనత లాంటి సమస్యలకు దారితీస్తుందన్నారు. కాఫీని ఎక్కువగా సేవిస్తే అధిక రక్తపోటు, గుండెకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. అయితే, పాలు లేకుండా టీ తాగడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడటంతోపాటు గుండె జబ్బులు, ఉదర క్యాన్సర్ ముప్పు తగ్గడం లాంటి ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు.
గరుడ పురాణం ప్రకారం… చనిపోయిన వాళ్ల బంగారం మనం వేసుకోవచ్చా…?
మీ జాతకంలో సూర్యుని స్థానం బలహీనపడటం మొదలౌతుందట. అది మీ ఆరోగ్యం నుంచి, ఆర్థిక పరిస్థితి వరకు మొత్తం ప్రభావితం చేస్తుంది.
ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్లు చనిపోయినప్పుడు…
వారి బంగారం, విలువైన వస్తువులను వారి పిల్లలు, వారసులు తీసుకుంటూ ఉంటారు. కొందరు ఆ బంగారాన్ని గుర్తుగా వాళ్లే ఉంచుకుంటారు. కొందరు మాత్రం.. అలా వేసుకోకూడదు అని.. ఆ బంగారాన్ని కరిగించి.. వేరే వస్తువు చేయించుకుంటూ ఉంటారు. కానీ.. ఇందులో ఏది నిజం. శాస్త్రాల ప్రకారం.. చనిపోయిన బంగారం వేరే వాళ్లు వేసుకోవచ్చా..? వేసుకోకూడదా..? ఇప్పుడు తెలుసుకుందాం…
జోతిష్యశాస్త్రం మన జీవితానికి సంబంధించి చాలా విషయాలు చెబుతుంది. దానిని అనుసరిస్తే మనం కూడా ఆనందంగా ఉంటామని నమ్ముతారు. ఆ జోతిష్యశాస్త్రం ప్రకారమే… చనిపోయిన వారు ధరించిన బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులను మరొకరు వాడకపోవడమే మంచిదట. ఎందుకంటే.. బంగారం సూర్య గ్రహానికి సంబంధించినది. చనిపోయిన వారి ఆభరణాలు ధరించడం వల్ల ప్రతికూల ప్రభావాలు పెరుగుతాయట. అంతేకాదు.. మీ జాతకంలో సూర్యుని స్థానం బలహీనపడటం మొదలౌతుందట. అది మీ ఆరోగ్యం నుంచి, ఆర్థిక పరిస్థితి వరకు మొత్తం ప్రభావితం చేస్తుంది.
దీనికి ప్రధాన కారణం ఏమిటంటే బంగారం సూర్యుని లోహం. వ్యక్తి మరణించిన తరువాత, ఆ ఆభరణాల సూర్య శక్తి తగ్గుతుంది. జీవించి ఉన్న వ్యక్తి ఆ నగలను ధరించినప్పుడు, ఈ ఆభరణాల అనేక ప్రతికూల ప్రభావాలు అతని జీవితంలో కనిపించడం ప్రారంభిస్తాయి. ఇది మీ ఆర్థిక పరిస్థితిని కూడా ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది ఎందుకంటే బలహీనమైన సూర్యుడు ప్రతిచోటా మీకు హాని కలిగించవచ్చు. మరణించిన వ్యక్తి ఆభరణాలను ధరించడం వలన మీ ఉద్యోగంపై ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చు. మీరు వ్యాపారంలో నష్టాలను చవిచూడవచ్చు. మీరు ఊహించని విధంగా మీ పని చెడిపోవచ్చు.
జీవించి ఉన్న వ్యక్తి ఆభరణాలను లేదా మరణించిన వ్యక్తికి ఇష్టమైన మరేదైనా వస్తువును ఉపయోగిస్తే, అతని ఆత్మకు శాంతి లభించదని గరుణ్ పురాణం చెబుతుది. ఇలా చేయడం ద్వారా, మరణించిన వ్యక్తి ఆత్మ ఎల్లప్పుడూ సమీపంలో ఉంటుంది. మోక్షం కూడా లభించదట.
ఎవరైనా ఇలా చేస్తే, చనిపోయిన వ్యక్తి ఆత్మ ఆకర్షణ ఎల్లప్పుడూ జీవించి ఉన్న వ్యక్తుల పట్ల ఉంటుంది. అది పితృ దోషానికి కూడా కారణం కావచ్చు. ఈ కారణంగా, మరణించిన వ్యక్తి ఏదైనా ప్రియమైన వస్తువును, ముఖ్యంగా ఆభరణాలను ఉపయోగించకుండా ఉండటమే మంచిది. కావాలంటే.. గుర్తుగా ఓచోట ఉంచుకోవచ్చు,
లేదు.. ఆ వస్తువును మీరు వాడాలి అనుకుంటే.. శుద్ధి చేసి ఉపయోగించవచ్చు, ఆ ఆభరణాలను గంగా జలంలో 24 గంటలు ఉంచి.. శుద్ధి చేసి.. ఆ తర్వాత.. వాడితే ఈ దోషాలు ఉండవట. శుధ్ది చేసిన వెంటనే కూడా వాడకూడదట. పసుపు దారంతో కట్టి.. 21 రోజులు పక్కన ఉంచి.. ఆ తర్వాత ధరించవచ్చట. అలా కాదు అంటే.. ఆ బంగారాన్ని కరిగించి.. మళ్లీ.. కొత్తగా చేయించుకోవచ్చు. ఇక బంగారం మాత్రమే కాదు.. వెండి వస్తువులు అయినా.. శుధ్ధి చేయకుండా ధరించకపోవడమే మంచిది.
Postal Ballot : పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్.. కనిపించే దానికంటే ప్రమాదకరమా..!
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 90 శాతానికి పైగా పోస్టల్ బ్యాలెట్‌లు నమోదయ్యాయని ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా గతరోజు ప్రకటించారు.
దాదాపు 4.44 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో మరో 1.2 శాతం ఓటింగ్ శాతం పెరిగింది. AARA మస్తాన్, TV9 లో మాట్లాడుతూ, ఈ పోస్టల్ బ్యాలెట్లలో 70-75 శాతం కూటమికి వచ్చాయని చెప్పారు. మొత్తం ఓటర్లలో తక్కువ శాతమే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ ధైర్యంగా ముఖం చాటేస్తోంది. కానీ, ఇది కనిపించేంత సులభం కాదు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు 1.2 శాతం మంది ఓటు వేయగా, అది తక్కువ శాతమేనని అంగీకరించారు. కానీ ప్రతి ఉద్యోగి ఇంట్లో సగటున కనీసం మూడు ఓట్లు ఉంటాయి.
అంటే మనం 13.32 లక్షల మంది ఓటర్ల గురించి మాట్లాడుతున్నాం అంటే మొత్తం ఓటర్లలో 3.3 శాతం అంటే గణనీయ సంఖ్య. ఒక కుటుంబంలోని సభ్యులందరూ ఇదే పద్ధతిలో ఓటు వేయరని చెప్పగల వ్యక్తులు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి వేరు. జీతాల్లో జాప్యం, డీఏలు, టీఏలు చెల్లించకపోవడం, పీఎఫ్ నిధులు మళ్లించడం తదితర కారణాలతో వారి కుటుంబాలు మొత్తం నష్టపోయాయి. వారి ఆర్థిక పరిస్థితి చితికిపోయి, సంపాదించే వ్యక్తి కష్టాల్లో కూరుకుపోవడంతో కుటుంబమంతా కష్టాల్లో కూరుకుపోయింది. కాబట్టి, కుటుంబం మొత్తం ఇదే పద్ధతిలో ఓటు వేసే అవకాశం ఉంది. తీవ్రమైన పోటీ ఉన్న ఎన్నికల్లో 3.3 శాతం ఓట్లు చాలా పెద్దవి. జగన్ నియమించిన సచివాలయ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌లో తమకు ఓటేస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ భావిస్తోంది.
కానీ మెజారిటీ వారి చాలీచాలని జీతాలతో సంతృప్తి చెందకపోవడంతో వారి ఓట్లు కూడా సందేహాస్పదంగా ఉన్నాయి. వీరిలో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమైనప్పటికీ జగన్ ఉద్యోగ క్యాలెండర్ వాగ్దానం జరగకపోవడంతో తిరస్కరించారు. మరోవైపు సచివాలయ ఉద్యోగులకు పెద్దపీట వేసే మెగా డీఎస్సీపై తొలి సంతకం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
Avoid Rice : ఒక నెల రోజుల పాటు అన్నం తినకపోతే ఏమవుతుందో తెలుసా..?
బరువు తగ్గడానికి ప్రజలు చాలా కష్టపడతారు. ఆహార నియంత్రణ కూడా చాలా ముఖ్యం. బరువు తగ్గాలనుకునే వారు నెల రోజులు అన్నాన్ని వదిలేస్తే.. మరికొద్ది రోజుల్లో తేడా మీకే తెలుస్తుంది.
బియ్యం వేగంగా కేలరీలను పెంచుతుంది.. జీవక్రియను నెమ్మదిస్తుంది. ఇది పొట్ట కొవ్వు, ఊబకాయాన్ని పెంచుతుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే ఒక నెలపాటు అన్నం మానేయండి.
మనం ఎక్కువ కార్బోహైడ్రేట్లను తీసుకున్నప్పుడు వాటిని జీర్ణం చేయడానికి మనకు ఎక్కువ చక్కెర అవసరం. అప్పుడు మన శరీరంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. శరీరంలో షుగర్ లెవెల్ పెరిగితే మధుమేహం సమస్య తీవ్రమవుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు సమస్య పెరుగుతుంది. అలాగే థైరాయిడ్, పీసీఓడీ బాధితులకు కూడా ఇది మంచిది కాదు. ఏదైనా వ్యాధితో బాధపడేవారు శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి అన్నం తక్కువగా తినాలి. షుగర్ లెవల్స్ అదుపులో ఉంచుకోవాలి.
అన్నం తినడం వల్ల బద్ధకం పెరుగుతుంది. తరచుగా నిద్ర వస్తుంది. దీనివల్ల పనిపై ఆసక్తి ఉండదు. కానీ, అన్నం తినడం మానేస్తే శరీరం మునుపటి కంటే చురుగ్గా మారుతుంది. సోమరితనం తగ్గుతుంది. కూర్చున్న, నిలబడినా నిద్ర మత్తు ఉండదు. మీరు ఇంతకు ముందెన్నడూ అనుభవించని అనేక మార్పులను మీరు గమనిస్తారు. శరీరం బరువు తగ్గినట్లు అనిపిస్తుంది. దీంతో మీ మెదడు మరింత చురుకుగా ఉండటం వల్ల మీరు వేగంగా పని చేస్తారు.
బియ్యంలో లభించే కార్బోహైడ్రేట్లు మన శరీరానికి శక్తినివ్వడానికి అవసరం. దాన్ని పక్కన పెడితే మనల్ని బలహీనపరుస్తుంది. దీనివల్ల కండరాలు బలహీనపడతాయి. శరీరంలో పోషకాలు, ఖనిజాల లోపం సంభవించవచ్చు. శరీరంలోని కొవ్వును తగ్గించడమే లక్ష్యం కావాలి. కండరాలను బలహీనపరచవద్దు. కాబట్టి రైస్ ఫుడ్ ను ఎప్పటికప్పుడు మితంగా తీసుకుంటూ, పూర్తిగా దూరంగా ఉండకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
మధుమేహం అదుపులో ఉండాలంటే, బరువు తగ్గాలంటే నెల రోజుల పాటు అన్నం పూర్తిగా మానేయాలని నిర్బంధం లేదు. రోజూ కొద్ది మొత్తంలో తీసుకోవచ్చు. ఇది మితంగా ఉండాలి. మనం బియ్యం ఆహారాన్ని నివారించినట్లయితే, మన రోజువారీ ఆహార జాబితాలో పోషకమైన ఆహార పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.
ఏపీలో గెలిచేదెవరు?
తెలంగాణ వ్యాప్తంగా రూ.2 వేల కోట్ల బెట్టింగులు!
ఏపీ వాళ్లు ఉండే ఏరియాలు, బార్డర్ జిల్లాల్లో ఫుల్
వైఎస్సార్సీపీదే పవర్ అని కొందరు.. కూటమిదే గెలుపని మరికొందరు పందేలు
పిఠాపురం, మంగళగిరి, కుప్పం, పులివెందులలో గెలుపు, మెజారిటీపైనా పోటాపోటీ
హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్ కొనసాగుతోంది. హైదరాబాద్ లో ఉన్న ఏపీ వాళ్లతో పాటు తెలంగాణ వాళ్లు కూడా ఇందులో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఏపీ వాళ్లు ఎక్కువగా నివాసం ఉండే కూకట్ పల్లి, కేపీహెచ్ బీ, మియాపూర్, శేరిలింగంపల్లి, వనస్థలిపురం, ఎల్బీ నగర్, దిల్ సుఖ్ నగర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, నిజాంపేట్, ప్రగతినగర్, ఉప్పల్ ఏరియాల్లో ఈ బెట్టింగ్స్ జోరుగా సాగుతున్నాయి.
ఇక్కడ వ్యాపారులు, సినిమా వాళ్లు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వాళ్లు బెట్టింగ్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆఫ్ లైన్ తో పాటు ఆన్ లైన్ లోనూ పందేలు కొనసాగుతున్నాయి. వందకు వంద ఇస్తామని కొందరు పందేలు కాస్తుంటే.. వందకు నూటా యాభై ఇస్తామని మరికొందరు పందేలు కాస్తున్నారు. వీటితో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఎక్కువ శాతం ఉన్న ఏపీ వాళ్లు.. ఓ ప్రధాన సామాజిక వర్గానికి చెందిన వాళ్లు కూటమి అధికారంలోకి వస్తుందని బెట్టింగులు కడుతున్నారు.
ఇక్కడ లక్ష బెట్టింగ్ కట్టి గెలిస్తే రూ.2లక్షలు చెల్లించేలా బెట్టింగ్ కాస్తున్నారు. పార్టీ పరంగానే కాకుండా నియోజకవర్గాల స్థాయిలోనూ గెలుపోటములపై బెట్టింగ్స్ కొనసాగుతున్నాయి. ఇలా తెలంగాణ వ్యాప్తంగా రూ.2 వేల కోట్ల పందేలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
కీలక నియోజక వర్గాలపై ఎక్కువ
ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుంది? ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది? అన్న అంశాలపై ప్రధానంగా బెట్టింగ్ జరుగుతోంది. అలాగే, పలు కీలక నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు? గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుంది? అన్న అంశంపై కూడా ఎక్కువ బెట్టింగ్ సాగుతోంది. 175 సీట్లలో వైఎస్సార్సీపీ 110 సీట్లు దాటుతుందని ఎక్కువ మంది పందెం కట్టగా.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని మరికొంతమంది బెట్టింగ్ కడుతున్నారు.
వైఎస్సార్సీపీకి 120 సీట్లు వస్తాయని ఓ వర్గం, రావని మరో గ్రూపు.. జగన్‌కు అరవై సీట్లు మించవని ఒక వర్గం బెట్టింగ్ ఆడుతోంది. అలాగే, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం, టీడీపీ చీఫ్ చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం, నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరి, సీఎం జగన్ పోటీ చేస్తున్న పులివెందులతో పాటు కొడాలి నాని, వల్లభనేని వంశీ, రఘురామకృష్ణరాజు, ఫురందేశ్వరి, సీఎం రమేశ్, బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురం, విజయవాడ ఎంపీతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాలపై బెట్టింగ్ రాయుళ్లు ఎక్కువ ఫోకస్ పెట్టారు.
వీటితో పాటు పల్నాడు, గుంటూరు, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని నియోజకవర్గాల స్థాయిలో అభ్యర్థుల గెలుపోటములపై పందేలు కాస్తున్నారు. పార్లమెంట్ విషయానికొస్తే.. విశాఖపట్నం, గుంటూరు, ఒంగోలు, రాజమండ్రిపై బెట్టింగ్స్ జరుగుతున్నాయి. విశాఖపట్నం నుంచి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్, బొత్స ఝాన్సీ, గుంటూరులో దేశంలోనే అత్యంత ఆస్తిపరుడైన అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, కిలారీ రోశయ్య బరిలో ఉండడంతో జోరుగా పందేలు కాస్తున్నారు. ఒంగోలులో మాగుంట శ్రీనివాసులు రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజమండ్రిలో పురంధేశ్వరి, ముత్యాల నాయుడు, పోటీలో నిలవడంతో ఈ సీట్లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
టాప్ ప్లేస్‌లో పల్నాడు, కృష్ణా, గుంటూరు
పోలింగ్ ముగిసిన తర్వాత పందేలు జోరందుకున్నాయి. ఇప్పటి వరకు పల్నాడు, కృష్ణా, గుంటూరు జిల్లాలు పందేల్లో టాప్ ప్లేస్ లో ఉన్నాయి. ఈ మూడు జిల్లాల్లో అభ్యర్థులు వందలు, వేల కోట్ల ఆస్తి పరులు కావడం.. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగడం, పోటాపోటీగా ఖర్చు చేయడంతో స్టేట్ వైడ్ హైప్ క్రియేట్ అయ్యింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో తక్కువగా బెట్టింగ్స్ సాగుతున్నాయి.
వీటితోపాటు ఎన్ఆర్ఐలు బరిలోకి దిగిన సెగ్మెంట్లలో ఇప్పటికే వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్టు తెలుస్తోంది. పల్నాడు ప్రాంతంలో ఎకరాలకు ఎకరాల భూములు బెట్టింగ్ కింద అగ్రిమెంట్ చేసుకున్నట్టు సమాచారం. బెట్టింగ్స్ లో బుకీల హవా నడుస్తోంది. గెలిచిన సొమ్ములో కనీసం పది శాతం నుంచి 20 శాతం వరకు కమీషన్ తీసుకుంటూ భరోసా ఇస్తున్నారు. నగదు, స్వైపింగ్ మెషీన్ల ద్వారా హైదరాబాద్ కేంద్రంగానే ఎక్కువ బెట్టింగ్స్ సాగుతున్నాయి.
బార్డర్ జిల్లాల్లో ఫుల్
రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలు ఏపీ బార్డర్‌ను కలిగి ఉన్నాయి. వీటిలో కోదాడ, హుజూర్ నగర్, మధిర, సత్తుపల్లి, వైరా, అలంపూర్ నియోజకవర్గాల్లో ఏపీ నుంచి వచ్చి ఉంటున్న వాళ్లు, ఇక్కడ వ్యాపారం చేస్తున్న వారు బెట్టింగ్ కాస్తున్నారు. కొన్ని గ్రామాల్లో రూ.5 కోట్లు బెట్టింగ్ కాసినట్లు చెప్తున్నారు. ఎక్కువ శాతం వైఎస్సార్ సీపీనే తిరిగి అధికారంలోకి వస్తుందని బెట్టింగ్ కాసిన ట్లు తెలుస్తోంది. కూటమి ప్రభావం, పవన్ కల్యాణ్ గెలుపు, ఓటమి, ముఖ్య నేతల మెజారిటీపై ఎక్కువ పందేలు కాశారు.
Download AP SSC Supplementary exam Hall Ticket 2024
AP SSC Supplementary exam time table 2024 Released: Check AP 10th Supplementary exam dates 2024
AP SSC Supplementary exam Hall Ticket 2024 or AP 10th Class Supplementary exam hall ticket 2024 will be released by the BSE AP on its official website, https://www.bse.ap.gov.in/.
Class 10 students who have registered for the Supplementary board examinations can check details and download the AP 10th class supplementary exam hall ticket 2024 from the SSC web page.
APRJC and APRDC 2024 Results: ఏపీఆర్ జేసీ, ఏపీఆర్ డీసీ, గురుకుల ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింగ్ ఇదే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెసిడెన్షియల్, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గానూ ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్‌కుమార్, ఏపీఆర్‌ఐసీ సొసైటీ సెక్రటరీ నరసింహారావు ఫలితాలను విడుదల చేశారు. ఏప్రిల్25న ఈ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏపీఆర్‌జేసీ, ఏపీఆర్ డీసీ రెండు ప్రవేశ పరీక్షల ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ప్రవేశ పరీక్షల్లో వచ్చిన మార్కులు, రిజర్వేషన్, స్థానికత ఆధారంగా ఆయా రెసిడెన్షియల్, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో సీట్లు కేటాయిస్తారు. అధికారిక వెబ్‌సైట్లో విద్యార్థులు తమ క్యాండిడేట్‌ఐడీ, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి, ఫలితాలను తెలుసుకోవచ్చు. ఏపీఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష 2024 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఏపీఆర్‌జేసీ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు ఇంటర్ ఫస్టియర్‌లో ఆయా గురుకులాల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, ఈఈటీ, సీజీటీ గ్రూపుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అలాగే APRDC పరీక్షలో అర్హత సాధించిన వారికి డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో డిగ్రీ గురుకుల కాలేజీల్లో పలు కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అలాగే ఏపీ ఆర్‌ఎస్ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఐదో తరగతిలో అడ్మిషన్లు ఇస్తారు. ఐదో తరగతితోపాటు 6,7,8 తరగతుల్లో మిగిలివున్న సీట్లను కూడా భర్తీ చేస్తారు.
ఏపీ ఆర్‌ఎస్ 2024 ఐదో తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రాష్ట్రంలోని రెసిడెన్సియల్ పాఠశాలల్లో 5 నుంచి 8వ తరగతి వరకు ప్రవేశాలకు నిర్వహించిన ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25,216 మంది విద్యార్థులు హాజరయ్యారు. జూనియర్ కాలేజీల్లో ప్రవేశ పరీక్షకు అత్యధికంగా 49,308 మంది హాజరయ్యారు. నాగార్జునసాగర్ డిగ్రీ కాలేజీలో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షకు 963 మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు.
ఏపీఆర్ డీసీ 2024 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇల్లును ఇలా తుడిస్తే ఒక్క దోమ, ఈగ కూడా రాదు..
ఆడవాళ్లు ఇంటిని ప్రతి రోజూ లేదా రెండు మూడు రోజులకోసారి ఖచ్చితంగా తుడుస్తుంటారు. దీనివల్ల ఇళ్లు శుభ్రంగా ఉంటుంది. అయితే ఇంటిని తుడిచే నీటిలో కొన్ని కలిపితే ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాదు తెలుసా? అవేంటంటే?
వాతావరణం మారుతున్న కొద్దీ దోమల బెడద పెరుగుతూనే ఉంటుంది. దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ, మలేరియా సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అయితే కొన్ని సింపుల్ ట్రిక్స్ తో మీ ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాకుండా చేయొచ్చు. ముఖ్యంగా ఇళ్లును తుడుస్తూ. అవును ఇంటిని తుడిచే నీటిలో కొన్ని పదార్థాలను కలిపి తుడిస్తే ఇంట్లోకి చీమలు, దోమలు రానేరావు. ఇందుకోసం ఏ చేయాలంటే?
దాల్చిన చెక్క
దాల్చిన చెక్క ఒక మసాలా దినుసు. దీన్ని మనం ఎన్నో ఆహారాల్లో వేస్తుంటాం. ఇది ఫుడ్ రుచిని పెంచడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు ఇది దోమలను రాకుండా కూడా చేయగలదు తెలుసా? అవును ఈ కిచెన్ మసాలాను మాప్ నీటిలో కలిపి ఇంటిని తుడిస్తే ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాదు. అవును దాల్చిన చెక్క వాసన దోమలకు అస్సలు నచ్చదు. దీంతో దోమలు ఇంట్లోకి వచ్చే సాహసం చేయవు.
ఎలా ఉపయోగించాలి
దాల్చిచ చెక్కతో దోమలను ఇంట్లోకి రాకుండా చేయాలంటే.. 2 నుంచి 3 దాల్చిన చెక్క ముక్కలను తీసుకుని నీటిలో మరిగించండి. ఆ తర్వాత చల్లార్చి ఈ దీన్ని మెత్తగా రుబ్బుకుని ఈ వాటర్ తో ఇంటిని తుడవాలి. దీంతో దోమలు ఇంట్లోకి రావు.
article_image4
డిష్ వాషర్ సబ్బు
డిష్ వాషర్ సబ్బుతో కూడా దోమలను తరిమికొట్టొచ్చు. ఇందుకోసం దీన్ని మాప్ నీటిలో కలిపి ఇంటిని శుభ్రం చేయాలి. ఈ విధంగా చేస్తే ఇంట్లోకి దోమలు, ఈగలు రానేరావు. ఉన్నదోమలు, ఈగలు కూడా పారిపోతాయి.
ఎలా ఉపయోగించాలి
ఈ నీటితో రోజుకు 2 సార్లు ఇంటిని తుడవాలి. ఈ నీటితో ఇంటిని శుభ్రం చేసిన తర్వాత నేలను సాదా నీటితో కూడా శుభ్రం చేయాలి.
వెనిగర్
వెనిగర్ తో కూడా మీరు దోమలు ఇంట్లోకి రాకుండా చేయొచ్చు. ఇంట్లోంచి దోమలను నాశనం చేయడానికి ఇంటిని తుడిచే నీటిలో వెనిగర్ ను కలపాలి. వెనిగర్ బలమైన వాసనకు దోమలు పారిపోతాయి.
కర్పూరం
కర్పూరం వాసన దోమలకు అస్సలే నచ్చదు. వీటి వాసన వచ్చిన చోట ఒక్క దోమ కూడా ఉండదు. అందుకే ఇంట్లోంచి దోమలను తరిమికొట్టడానికి కర్పూరం అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందుకోసం కర్పూరాన్ని గ్రైండ్ చేసి నీటిలో కలిపి ఇంటిని తుడవండి. లేదా కర్పూరం ముక్కలను ఇంట్లోని ప్రతి మూల ఉంచండి. దీని వాసనకు ఇంట్లోంచి దోమలు పారిపోతాయి.
జేబులు ఖాళీ చేస్తున్న PhonePe, Google Pay, Paytm.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
నేటి కాలంలో ప్రతిది ఆన్‌లైన్ అయ్యింది. అగ్గిపెట్టె దగ్గర నుంచి వాషింగ్ మెషిన్ల వరకు ప్రతి దాన్ని ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేస్తున్నాం. ఇక యూపీఐ యాప్స్ వినియోగం పెరిగాక.. చేతిలో డబ్బుల పట్టుకు తిరగడం చాలా వరకు తగ్గిపోయింది. రోడ్డు పక్కన దుకాణాలు మొదలు.. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ఎక్కడ చూసినా ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. స్టార్మ్ ఫోన్ తీశామా.. స్కాన్ చేశామా.. పేమెంట్ చేశామా.. అంతే. చిల్లర సమస్య లేదు.. దొంగ నోట్ల ప్రసక్తి లేదు. అయ్యో పర్స్ మర్చిపోయాం.. డబ్బులు తేలేదు అన్న ఇబ్బంది లేదు. యూపీఐ చెల్లింపుల వల్ల కొనుగోళ్లు చాలా సౌకర్యవంతం అయ్యాయి అని చెప్పవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు యూపీఐ చెల్లింపుల వ్యవస్థను స్వీకరిస్తున్నాయి.
అయితే ఇది నాణానికి ఒకవైపు మాత్రమే అంటున్నారు. డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి రావటం వల్ల నగదు లావాదేవీలను చాలా సులభతరం అయ్యాయి. దాంతో పాటు ప్రజలు తమ డబ్బును ఖర్చు చేసే విధానంపై భారీ ప్రభావాన్ని చూపుతున్నట్లు నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం చూసుకుంటే.. యూపీఐ యాప్స్.. జనాల జేబులకు చిల్లు పెడుతున్నాయంటూ షాకింగ్ విషయాలు వెల్లడించింది. ఇంద్రప్రస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఢిల్లీ అనే సంస్థ భారతదేశంలో యూపీఐ చెల్లింపులపై చేసిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి.
ఈ నివేదికలో.. యూపీఐ, ఇతర డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌లు నగదు బదిలీ ప్రక్రియను మునుపటి కంటే చాలా సులభతరం చేశాయని అనేక మంది ప్రజలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారట. ఇది ఒకవైపు మాత్రమే అని.. మరో వైపు ఈ యూపీఐ యాప్స్ వల్ల డబ్బు ఖర్చు చేసే వియంలో.. జనాలు కంట్రోల్లో ఉండటం లేరనే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో అయితే బయటకు వెళ్తే.. ఖర్చులకు సరిపడా డబ్బులు పట్టుకెళ్లేవాళ్లం.
ఎంత నగదు తీసుకెళ్లామో అంత మేర లేదంటే ఇంకా తగ్గించి ఖర్చు చేసుకుని వచ్చే వాళ్లం. కానీ యూపీఐ పేమెంట్స్ పెరగడంతో.. ఈ కంట్రోలింగ్ విధానం దెబ్బ తిన్నది. మనసుకు నచ్చినవి కొంటున్నం.. స్కాన్ చేసి.. పేమెంట్ చేస్తున్నాం. దాంతో ఖర్చుల మీద అదుపు లేకుండా పోతుంది. ఫలితంగా యూపీఐ చెల్లింపుల వల్ల ప్రజలు అనవసర ఖర్చులు ఎక్కువగా చేస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.
తాజా అధ్యయనం ప్రకారం యూపీఐ, ఇతర డిజిటల్ చెల్లింపు పద్ధతులను ఉపయోగించడం వల్ల భారతదేశంలో 75 శాతం మంది ప్రజలు ఎక్కువ ఖర్చు చేశారని వెల్లడైంది. సర్వే ప్రకారం దాదాపు 81 శాతం మంది వ్యక్తులు రోజువారీగా యూపీఐ యాప్స్ ద్వారా లావాదేవీలు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే యూపీఐ వల్ల చెల్లింపులు సులభతరంగా మారాయని 91.5 శాతం మంది ప్రజలు వెల్లడించారు.
ఇదే క్రమంలో వ్యక్తులు యూపీఐ ద్వారా సగటు రోజుకు రూ.200 ఖర్చు చేస్తున్నట్లు వెల్లడైంది. ఏప్రిల్ మాసంలో యూపీఐ లావాదేవీల సంఖ్య దేశంలో 1,330 కోట్లకు చేరుకున్నాయి. ఏడాది ప్రాతిపదికన యూపీఐ లావాదేవీల సంఖ్య 50 శాతం పెరిగింది. యూపీఐ యాప్స్ వల్ల ప్రయోజనాల సంగతి మాట అటుంచితే.. జనాల చేత విపరీతంగా ఖర్చు చేయిస్తూ.. జేబుకు చిల్లు పెడుతున్నాయని నివేదిక వెల్లడించింది.
YS Jagan: ఫారిన్ టూర్‌కు ఏపీ సీఎం జగన్.. ఫ్యామిలీ వెకేషన్ ఎన్ని రోజులంటే..
జగన్ విదేశీ టూర్‌కు సీబీఐ కోర్ట్ అనుమతి ఇచ్చింది. మే 17 నుండి జూన్ 1 వరకు సీఎం జగన్ విదేశీ టూర్ కు వెళ్లనున్నారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ గత రెండు నెలల నుంచి ప్రజల మధ్యే తిరుగుతూ ప్రచారాన్ని హోరెత్తించారు.
అయితే మే 13న 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ పూర్తి అయింది. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఖాళీ సమయం, తీరిక దొరకదని భావించి చాలా మంది పొలిటికల్ లీడర్స్ రిలాక్స్ మూడ్ లోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ కూడా తన సతీమణి వైఎస్ భారతితో కలిసి లండన్ కు వెళ్లనున్నారు. అక్కడ తన కుమార్తెతో సరదాగా గడిపేందుకు కుటుంబంతో కలిసి వెళ్లే క్రమంలో హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టును అనుమతి కోరుతూ పిటిషన్ వేశారు. అయితే దీనిపై గత వారం వాదోపవాదనలు జరిగాయి. మే 15న సీబీఐ కేసు విచారణకు వస్తున్న నేపథ్యంలో అనుమతి ఇవ్వకూడదని సీబీఐ తరఫు న్యాయవాదులు వాదించారు.
అయితే సీఎం జగన్ తరఫు న్యాయవాదులు కూడా అందుకు కౌంటర్ చేశారు. జగన్ ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నారని, ప్రస్తుతం ఆయన రాజ్యంగబద్దమైన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారని, ఆయనను నమ్ముకుని ఒక రాష్ట్రంతో పాటు పార్టీ నేతలు ఉన్నారని కోర్టుకు తెలిపింది. దీనిపై వాదనలు విన్న సీబీఐ న్యాయమూర్తి తీర్పును మే 14కు వాయిదా వేశారు. తిరిగి ఈరోజు తీర్పు వెలువరించే క్రమంలో సీఎం వైఎస్ జగన్ కు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. చట్టంలోని రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ ప్రకారం బెయిల్ లో ఉన్న వ్యక్తికి అతని పరిస్థితులు, ప్రవర్తనను బట్టి విదేశాలకు వెళ్లేందుకు అవకాశం కల్పించవచ్చని తెలిపింది. దీంతో మే 17 నుంచి జూన్ 1 వరకు లండన్ వెళ్లేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కుటుంబంతో కలిసి వెకేషన్‌కు విదేశాలకు వెళ్లేందుకు సీఎం జగన్ కోరిన అనుమతిని మంజూరు చేసింది. సీబీఐ కేసుల్లో బెయిల్ మీద ఉన్న సీఎం జగన్ ఇప్పటికే చాలా సార్లు ఇలా అనుమతి తీసుకుని లండన్, దావోస్ వెళ్లారు. గతంలో తన కుమార్తె పెద్ద చదువుల నిమిత్తం ఆమెను లండన్ లో విడిచిపెట్టి వచ్చేందుకు కూడా తోడుగా వెళ్లారు. ఇలా చాలా సార్లు సీఎం జగన్ విదేశాలకు వెళ్లి తిరిగి కోర్టు చెప్పిన గడువులోపు తిరిగి రావడంతో ఈ సారి కూడా విదేశాలకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కోర్టు.
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. జీతం లక్ష పైనే..!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. కేవలం ఇంటర్ అర్హతతో భారీ జీతంతో ఉద్యోగాలు పొందే అవకాశం వచ్చింది. భారత ప్రభుత్వ క్యాబినెట్ సెక్రటేరియట్ విభాగం, ట్రైనీ పైలట్ ఉద్యోగాల కోసం మే 13న రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌తో కేబినెట్ సెక్రటేరియట్ మొత్తం 15 పోస్టులను భర్తీ చేయనుంది. ఎంపికైన అభ్యర్థుల నెల జీతం రూ. 1.5 లక్షలకు పైగా ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయడానికి 2024 జూన్ 10 వరకు గడువు ఉంది. రిక్రూట్‌మెంట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
అర్హతలు
ఈ రిక్రూట్‌మెంట్ కోసం అప్లై చేసుకునేవారు గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి 50 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులతో 12వ తరగతి పాస్ అయ్యి ఉండాలి. అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అందించిన వ్యాలీడ్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ లేదా హెలికాప్టర్ పైలట్ కమర్షియల్ లైసెన్స్ ఉండాలి. భారత పౌరులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయో పరిమితి
క్యాబినెట్ సెక్రటేరియట్‌లో ట్రైనీ పైలట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయసు 30 ఏళ్లు ఉండాలి, గరిష్టంగా 40 ఏళ్లు మించకూడదు.
అప్లికేషన్ ప్రాసెస్
క్యాబినెట్ సెక్రటేరియట్ రిక్రూట్‌మెంట్ 2024 కోసం ఆఫ్‌లైన్ అప్లికేషన్ సబ్‌మిట్ చేయాలి. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. అర్హత, ఆసక్తి ఉన్నవారు అధికారిక వెబ్‌సైట్ cabsec.gov.in ద్వారా అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నిర్ణీత ఫార్మాట్‌లో ఫారమ్ నింపాలి. దీన్ని ‘లోధి రోడ్, హెడ్ పోస్ట్ ఆఫీసర్, న్యూఢిల్లీ-110003’ అడ్రస్‌కు పంపించాలి. రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జీతం ఎంత?
ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 1.52 లక్షల జీతం ఉంటుంది.
క్యాబినెట్ సెక్రటేరియట్ బాధ్యతలు
ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో కమర్షియల్ ట్రాన్సాక్షన్స్ సులభతరం చేసే అడ్మినిస్ట్రేషన్ పనులను క్యాబినెట్ సెక్రటేరియట్ నిర్వహిస్తుంది. ఇందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా (ట్రాన్సాక్షన్ ఆప్ కమర్షియల్) రూల్స్ 1961, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా (అలకేషన్ ఆఫ్ బిజినెస్) రూట్స్ 1961 రూల్స్ ఫాలో అవుతుంది. క్యాబినెట్, దాని కమిటీలకు సెక్రటేరియల్ సపోర్ట్ ఇవ్వడంతో పాటు మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయానికి కృషి చేస్తుంది.
అలాగే మంత్రిత్వ శాఖలు, విభాగాల మధ్య విభేదాలను పరిష్కరించడం, కార్యదర్శుల స్టాండింగ్, స్పెషల్ కమిటీల ద్వారా ఏకాభిప్రాయం సాధించడానికి కృషి చేయడం ద్వారా ప్రభుత్వ నిర్ణయాలను సులభతరం చేస్తుంది. పాలసీ డిసీజన్స్ కోసం అవసరమైన మద్దతు అందిస్తుంది. ఇందుకు అవసరమైన ఉద్యోగాలను సైతం భర్తీ చేస్తుంది. తాజాగా ట్రైనీ పైలట్ పోస్టుల నియామకానికి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
Southwest Monsoon: శుభవార్త చెప్పిన ఐఎండీ.. మరో నాలుగు రోజుల్లో రుతుపవనాలు
దేశంలోని రైతాంగానికి భారత వాతావరణ విభాగం (IMD) తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) సమయానికి ముందే దేశంలోకి ప్రవేశిస్తాయని అంచనా వేసింది. సాధారణంగా ఏటా మే 22 నాటికి దక్షిణ అండమాన్ సముద్రంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. అక్కడ నుంచి క్రమంగా వారం, పది రోజుల్లో బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రంలోకి ప్రవేశించి కేరళ తీరాన్ని తాకుతాయి. కానీ, ఈసారి మూడు రోజులు ముందే.. మే 19 నాటికి చేరుకుంటాయని ఐఎండీ తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొంది.
జూన్ 1 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది సానుకూల పరిణామమని నిపుణులు చెబుతున్నారు. అయితే రుతుపవనాలు సకాలంలో దేశాన్ని తాకాలంటే అరేబియా సముద్రంలో వాతావరణం అనుకూలించాలి. ఒకవేళ, అరేబియా సముద్రంలో అల్పపీడనం లేదా వాయుగుండం ఏర్పడితే నైరుతి రాకను జాప్యం తప్పదు.
ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఈ నెలాఖరులోగా అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్న వాతావరణ నిపుణులు… మరికొద్ది రోజుల్లో స్పష్టత వస్తుందని చెబుతున్నారు. వాస్తవానికి గత ఏడాది కూడా నైరుతి రుతుపవనాలు మే 19నే దక్షిణ అండమాన్‌లోకి ప్రవేశించాయి. కానీ అరేబియా సముద్రంలో తుఫాను, ప్రతికూల పరిస్థితుల వల్ల జూన్ 8న కేరళలోకి ప్రవేశించాయి.
ఈ ఏడాది దేశంలో నైరుతి రుతుపవనాలు జూన్ నుంచి సెప్టెంబరు మధ్య సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం కురిపిస్తాయని ఏప్రిల్ 15 నాటి ముందస్తు అంచనాల్లో ఐఎండీ తెలిపింది. వర్షపాతం 106 శాతం మేర ఉంటుందని, ఒకవేళ అంచనా తగ్గినా 101 శాతం పక్కా అని అంచనా వేసింది. దేశంలోని నాలుగు ప్రాంతాల్లో వర్షపాతంపై ఈ అంచనాలను మే చివరి వారంలో మళ్లీ సవరించనుంది.
1971-2020 మధ్య కాలానికి సగటు వర్షపాతం 87 సెం.మీ. గతేడాది మాత్రం సాధారణం కంటే (94.4%) వర్షపాతం నమోదయ్యింది. అయితే, IMD గతేడాది 96%గా ఉంటుందని అంచనా వేసింది. అంతకుముందు 2022లో సాధారణం కంటే ఎక్కువ 106%, 2021లో 99% ‘సాధారణ’ వర్షపాతం నమోదయ్యింది. అయితే, 2020లో 109% ‘సాధారణం కంటే ఎక్కువ’వర్షపాతం కురిసింది.
20 వేలకే బ్రాండెడ్ బిగ్ QLED Smart Tv అందుకోండి.!
కొత్త స్మార్ట్ టీవీ కొనాలని ఆలోచిస్తున్న వారికి మంచి ఆఫర్ ఈరోజు అందుబాటులో వుంది. ఇటీవలే ఫ్లిప్ కార్ట్ అందించిన బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి గొప్ప ఆఫర్లను అందించిన ఫ్లిప్ కార్ట్, ఇప్పుడు కొత్తగా ప్రకటించిన బిగ్ బచాత్ డేస్ సేల్ నుండి కూడా గొప్ప ఆఫర్లు అందించింది. ఈ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో 20 వేలకే బ్రాండెడ్ బిగ్ QLED Smart Tv ఆఫర్ ని అందించింది.
QLED Smart Tv Deal
ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ డేస్ సేల్ సేల్ మే 11 నుంచి 17 తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ నుండి ఈ రోజు గొప్ప స్మార్ట్ టీవీ డీల్ ను అందించింది. ఈ సేల్ నుండి Thomson Phoenix 43 ఇంచ్ బిగ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీని 34% డిస్కౌంట్ తో రూ. 20,999 రూపాయల ఆఫర్ ధరకే అందిస్తోంది.
ఈ క్యూలెడ్ టీవీని ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి HDFC Bank క్రెడిట్ / డెబిట్ కార్డ్ EMI ఆప్షన్ కొనే వారికి రూ. 1,200 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ స్మార్ట్ టీవీని 20 వేల రూపాయల కంటే తక్కువ ధరకే పొందవచ్చు.
Thomson Phoenix (43) QLED Smart Tv
ఈ థాంసన్ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ సైజు 4K రిజల్యూషన్ కలిగిన క్యూలెడ్ స్క్రీన్ తో వస్తుంది. ఈ టీవీ స్క్రీన్ Dolby Vision, HDR10 మరియు HLG సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుందని థాంసన్ చెబుతోంది. ఈ టీవీ Dolby Atmos, Dolby Digital Plus మరియు DTS TruSurround సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 40W స్పీకర్లతో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది.
ఈ థాంసన్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ HDMI, USB మరియు డ్యూయల్ బ్యాండ్ WiFi తో అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఇందులో 2GB RAM మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉన్నాయి.
ఆ 8 గంటలు జగన్ ఏం చేశారు??
ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి 13వ తేదీన ఏం చేశారు? అనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. ఉదయం ఎనిమిది గంటల సమయంలో కడపలోని భాకరాపురంలో తన ఓటుహక్కును వినియోగించుకున్నారు.
ఆ తర్వాత ఎక్కడా మీడియాకు కనిపించలేదు. నేరుగా తాడేపల్లిలోని ఇంటికి చేరుకున్నారు. ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు జగన్ ఏం చేశారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
ఆపద్ధర్మ సీఎం స్పందించలేదా?
ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. పల్నాడు, తెనాలి, తాడిపత్రి, నరసరావుపేట… ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఉద్రిక్తత ఏర్పడింది. దాడులు, విధ్వంసాలు జరిగాయి.
ఈ సంఘటనలు జరుగుతున్నా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎందుకు స్పందించలేదంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఓటర్లకు సలహాలివ్వడంకానీ, సూచనలివ్వడంకానీ చేయలేదని, సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి అడపా దడపా మాట్లాడి వెళ్లిపోయేవారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఏం చేశారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
బిజీగా గడిపిన చంద్రబాబు, పవన్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మంగళగిరిలో ఓటు వేసిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సరళి ఎలా జరుగుతుంది? ఎక్కడెక్కడ గొడవలు జరుగుతున్నాయి? వైసీపీని ఎదుర్కొనేందుకు టీడీపీ చేపట్టాల్సిన చర్యలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
పోలింగ్ కేంద్రాల్లో లోటుపాట్లు గమనించి వాటి విధివిధానాలను పరిశీలించారు. సోమవారం మొత్తం చంద్రబాబు బిజీబిజీగా గడిపారు. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలో ఓటు వేశారు. తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు.
నిరసన తెలిపిన టీడీపీ శ్రేణులు
పోలింగ్ రోజు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు అప్పటితో ముగియలేదు. మంగళవారం కూడా తాడిపత్రి, తిరుపతి.. తదితర ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు టీడీపీ శ్రేణులపై దాడులకు పాల్పడ్డాయి. చంద్రగిరి కూటమి అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది.
తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలను వెళ్లివస్తుండగా ఆయనపై దాడి జరిగింది. వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీగా అక్కడికి తరలిరావడంతో పోలీసులు వారిపై లాఠీఛార్జి చేశారు. గొడవకు పాల్పడినవారిని వదిలేసి తమపై లాఠీఛార్జి చేయడంపై టీడీపీ శ్రేణులు పోలీసులకు నిరసన తెలిపాయి.
AP నిశిరాత్రిలో ఘోరం.. అయిదుగురి సజీవదహనం
సొంతూరిపై మమకారం… ఓటు వేయాలని దృఢ సంకల్పం.. పిల్లాజెల్లాతో ఇంటిల్లిపాదీ స్వస్థలాలకు విచ్చేశారు.. త్రికరణ శుద్ధితో బాధ్యతను నిర్వర్తించారు. బంధుమిత్రులతో రెండు మూడు రోజులు సంతోషంగా గడిపారు. ఉద్యోగ విధులకు వెళ్లాలనే కొండంత ఆశతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. అంతలోనే మృత్యువు.. టిప్పరు రూపంలో దూసుకొచ్చి.. బస్సు డ్రైవరుతో సహా నాలుగు నిండు ప్రాణాలను బలిగొంది. కళ్లు తెరిచేలోపే.. అగ్నికీలలకు ఆహుతైన విషాదమిది. గాఢ నిద్రలో ఉన్న పదుల సంఖ్యలో ప్రయాణికులను తీవ్ర గాయాలపాలుజేసింది. క్షతగాత్రుల ఆర్తనాదాలు మిన్నంటిన వేళ స్థానికులు అప్రమత్తమై.. 108, పోలీసులకు సమాచారం చేరవేశారు.
స్థానికులు, క్షతగాత్రుల వివరాల మేరకు… బాపట్ల జిల్లా చినగంజాం నుంచి పర్చూరు, చిలకలూరిపేట మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు మంగళవారం రాత్రి అరవింద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. వీరిలో చినగంజాం, గొనసపూడి, నీలాయపాలెం వారు ఎక్కువగా ఉన్నారు. వీరంతా సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసి.. హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైన వారే. మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో చిలకలూరిపేట మండలం అన్నంబట్లవారిపాలెం – పసుమర్రు గ్రామాల మధ్య ఈవూరివారిపాలెం రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా శరవేగంగా కంకరతో వచ్చిన టిప్పర్.. బస్సును ఢీ కొట్టింది. క్షణాల్లో టిప్పర్‌కు మంటలు రేగి.. ఆపై వేగం తీవ్రత దృష్ట్యా బస్సుకు మంటలు వ్యాపించాయి.
తేరుకునేలోపే తెల్లారిన బతుకులు
ప్రమాద తీవ్రతకు క్షణాల్లో ట్రావెల్స్ బస్సు చోదకుడు.. మరో నలుగురు ఆహుతి అయ్యారు. మరో 20 మంది వరకు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల ఆర్తనాదాలు, బంధువుల శోకాలతో ఆ ప్రాంతంలో విషాదం మిన్నంటింది. స్థానికులు దుర్ఘటన సమాచారాన్ని 108, పోలీసులకు చేరవేయడంతో హుటాహుటిన వారు ప్రమాద స్థలికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా.. చిలకలూరిపేట, యద్దనపూడి, చీరాల, యడ్లపాడు నుంచి 108 వాహనాలను ప్రమాద స్థలికి రప్పించారు. బస్సులో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసి.. 108 వాహనాల్లో 20 మంది క్షతగాత్రులను చిలకలూరిపేట ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు.చిలకలూరిపేట నుంచి అగ్నిమాపక శకటం వచ్చి మంటలు ఆర్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. బైపాస్ వర్క్ జరుగుతుండటం.. తారు రోడ్డుపై మట్టి భారీగా పేరుకుపోవడం.. టిప్పర్ వేగంగా దూసుకురావడం.. టిప్పర్ చోదకుడు వేగాన్ని నియంత్రించ లేకపోవడం ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది.
ఎలక్షన్ కి 2 రోజుల ముందు హడావిడి.. 6 పధకాల డబ్బు ఎప్పుడిస్తారు..?
‘పోలింగ్ ముగిసింది. అక్కచెల్లెమ్మలు, అవ్వా తాతలు, అన్నదాతలు, విద్యార్థులతో అవసరం తీరిపోయింది. ఇక వాళ్లతో పనేముంది?’ అని సర్కారు భావిస్తోంది.
అసలిస్తారా.. నొక్కేస్తారా?
అవసరం తీరిపోయిందని వదిలేస్తారా?
ఆరు పథకాల సొమ్ములు ఇచ్చేదెప్పుడు?
పోలింగ్‌కు 2 రోజుల ముందు హడావుడి
డబ్బులిచ్చేస్తామంటూ లేఖల మీద లేఖలు
నిబంధనలకు విరుద్ధమని ఈసీ బ్రేక్
పోలింగ్ తర్వాత నిధుల జమకు ఓకే
ఇప్పుడు చడీచప్పుడు చేయని ప్రభుత్వం
కాంట్రాక్టర్లకు చెల్లింపులపైనే ఆసక్తి!?
నిధులు సర్దేస్తారనే అనుమానాలు
(అమరావతి – ఆంధ్రజ్యోతి)
‘పోలింగ్ ముగిసింది. అక్కచెల్లెమ్మలు, అవ్వా తాతలు, అన్నదాతలు, విద్యార్థులతో అవసరం తీరిపోయింది. ఇక వాళ్లతో పనేముంది?’ అని సర్కారు భావిస్తోంది. ఎప్పుడో నొక్కిన బటన్‌ల డబ్బులు పోలింగ్‌కు ముందు వేసేస్తామని హడావుడి చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు… పోలింగ్ ముగిశాక ఆ మాటే ఎత్తడంలేదు. బటన్ నొక్కుడు సొమ్ములు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు ఇప్పుడు ఎలాంటి ఆటంకాలూ లేవు. పోలింగ్ తర్వాత జమ చేసుకునేందుకు ఎన్నికల కమిషన్ ఎప్పుడో అనుమతి ఇచ్చింది. అయినా సరే… ఈ విషయంలో ప్రభుత్వం వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. ఈ సొమ్ములను అస్మదీయ కాంట్రాక్టర్లకు సర్దేస్తారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో జనవరి 23న ఆసరా, ఫిబ్రవరి 28న కల్యాణమస్తు, షాదీ తోఫా, మార్చి 1న విద్యా దీవెన, మార్చి 6న రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, మార్చి 7న చేయూత, మార్చి 14న ఈబీసీ నేస్తం పథకాలకు ‘బటన్’ నొక్కారు. వీటన్నింటి విలువ రూ.14,165 కోట్లు. ఇవన్నీ డీబీటీ పథకాలే. అంటే, బటన్ నొక్కిన 24 గంటల్లో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ కావాలి. ఏదైనా సమస్య వచ్చినా 48 గంటలు దాటొద్దు. కానీ… బటన్ నొక్కుడే తప్ప డబ్బులు జమ చేసిందే లేదు. సరిగ్గా పోలింగ్‌కు ముందు సొమ్ములు జమచేసి రాజకీయ లబ్ధి పొందాలన్న వ్యూహంతో… కావాలనే జాప్యం చేశారు. ఎన్నికలకు రెండ్రోజుల ముందు లబ్ధిదారులకు నగదు బదిలీ చేస్తామంటూ సీఎస్ జవహర్ రెడ్డి, ఆర్థికశాఖ అధికారులు హడావుడి చేశారు. అయితే, ఇది ఓటర్లను ప్రభావితం చేస్తుందని, మిగతా పార్టీలు సమానావకాశాలు కోల్పోతాయంటూ ఈసీ తిరస్కరించింది. హైకోర్టులో సింగిల్ బెంచ్ తీర్పుతో వచ్చిన వెసులుబాటును ఉపయోగించుకుని నిధులు జమ చేయాలని చూశారు. హైకోర్టు తీర్పును ఈసీకి పంపి మళ్లీ అనుమతి అడిగారు. దీనిపై ఈసీ మండిపడింది. వరుస ప్రశ్నలు సంధించి… ఎన్నికల్లో లబ్ధికోసమే డబ్బులు వేయాలని నిర్ణయించుకున్నట్లు నిర్ధారించింది. పోలింగ్ పూర్తయిన వెంటనే… 14నే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేసుకోవచ్చునని స్పష్టం చేసింది.
కష్టాలు తీరాయా?
‘‘లబ్ధిదారులు చాలా ఇక్కట్లు పడుతున్నారు. వారి జీవనానికి బటన్ నొక్కుడు డబ్బులు చాలా అవసరం. ఇప్పుడు విడుదల చేయాల్సిందే’’ అని పోలింగ్‌కు ముందు సీఎస్ పదేపదే ఈసీకి లేఖలు రాశారు. సోమవారం పోలింగ్ ముగిసింది. మంగళవారం ఉదయం నుంచి ఏ క్షణమైనా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు వేయొచ్చు. కానీ, మంగళవారం పొద్దుపోయే వరకూ ఒక్కరి ఖాతాలోనూ డబ్బు పడలేదు. మే 9న హైకోర్టు తీర్పు వచ్చిన రోజు రాత్రి కూడా తెల్లారేసరికి డబ్బులు పడిపోవాలంటూ ఆర్థిక శాఖ అధికారులు హడావుడి చేశారు. బడ్జెట్ లేదు, బీఆర్‌వోలు లేవు… తాము చేయలేమంటూ అధికారులు అడ్డంతిరిగినప్పటికీ రూ.9,600 కోట్లు చెల్లించేందుకు అంతా సిద్ధం చేశారు. టీడీపీ అడ్డం పడుతోందంటూ తీవ్రవిమర్శలు చేశారు. మరిప్పుడు ఈసీ అడ్డంకి లేదు, టీడీపీ అడ్డం పడడం లేదు మరెందుకు ఇవ్వలేదు. అసలు ఇస్తారా? లేదా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఎలాగూ ఎన్నికలైపోయాయి కాబట్టి… లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినా ఇప్పుడు వచ్చే రాజకీయ ప్రయోజనమేమీ లేదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ నిధులను కాంట్రాక్టర్లకు చెల్లిస్తే కమీషన్లయినా వచ్చి పడతాయనే దిశగా ఆలోచిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పారిశ్రామిక సంస్థలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలపై రగడ జరిగింది. కోడ్ అడ్డం ఉన్నందున ఇవ్వలేకపోతున్నామంటూ జగన్ చెప్పుకున్నారు. అది ముగిసి ఏడాదిన్నరయింది. అసెంబ్లీ ఎన్నికల కోడ్ కూడా వచ్చింది. ఇప్పటివరకు ఆ ప్రోత్సాహకాలు జమకాలేదు. ఇలాంటి విన్యాసాలు ఈ ఐదేళ్లలో జగన్ చాలాచేశారు. ఇప్పుడు ఆ ఆరు పథకాల నిధులనూ లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసే అవకాశం లేదని అంచనా. పైగా… కోడ్ వచ్చినప్పటి నుంచి కాంట్రాక్టర్లకు చెల్లింపులపైనే ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఎన్నికల షెడ్యూలు విడుదల నుంచి ఇప్పటివరకు ఏకంగా రూ.20వేల కోట్లదాకా బిల్లులు చెల్లించారు. కోడ్‌కు 10రోజుల ముందు రూ. 7,000 కోట్లు చెల్లించారు. అప్పుడే బటన్ నొక్కుడు డబ్బులు జమచేసే అవకాశమున్నా, ఆ పని చేయలేదు.
సిద్ధంగా రూ.7,000 కోట్లు
ఈ నెల 10వ తేదీన కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద రూ.3,000 కోట్లు రాష్ట్ర ఖజానాకు వచ్చాయి. మంగళవారం ఆర్‌బీఐలో సెక్యూరిటీలు వేలం వేసి రూ.4,000 కోట్లు అప్పు తెచ్చారు. రాష్ట్రానికి ప్రతి రోజూ వచ్చే సొంత ఆదాయం ఉంటుంది. ఇవన్నీ కలుపుకుంటే ప్రభుత్వం వద్ద ఇప్పుడు రూ.8000 కోట్లకు పైగా డబ్బు ఉంది. అయినా… ఆ 6 పథకాల లబ్ధిదారుల ఖాతాల్లోకి మాత్రం ఆ నగదును ప్రభుత్వం జమ చేయడం లేదు.
AP Elections 2024: సీఎం జగన్ కుట్రను భగ్నం చేసిన ఎన్నికల కమిషన్.. డబ్బులు ఎక్కడ జగన్
అమరావతి: అంతన్నారు.. ఇంతన్నారు… ఎన్నికలు కొద్ది రోజుల ముందు తెగ హడావిడి చేశారు. సంక్షేమానికి తానే అంబాసిడర్ అన్నట్లు గొప్పలు చెప్పుకునే జగన్ రెడ్డి (CM Jagan) తాము డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాలు గడవు అన్నట్లు బిల్డప్ ఇచ్చారు. 10వతేదీ రాత్రికే డబ్బులు ఇవ్వాలన్నట్లు హడావిడి చేశారు. ఎన్నికల కోడ్ (Election Code)కు ముందు సంక్షేమ పథకాల (Welfare schemes) బటన్ (Button) నొక్కి.. సరిగ్గా ఎన్నికలు జరిగే సమయంలో లబ్దిదారుల ఖాతాల్లో నగదు బదిలీ చేసి ఓటర్లకు గాలం వేద్దామనుకుంటే ఎన్నికల కమిషన్ (Election Commission) ఆ కుట్రను భగ్నం చేసింది.
సీన్ కట్ చేస్తే.. నిన్న (సోమవారం)తో ఎన్నికలు (Elections) అయిపోయాయి. 14వ తేదీన లబ్దదారుల ఖాతాలకు డీబీటీ (DBT) ద్వారా డబ్బులు విడుదల చేయవచ్చని ఈసీ చెప్పింది. అయినప్పటికీ ఇవ్పటి వరకు లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు పడలేదు. దీంతో ‘డబ్బులు ఎప్పుడు ఇస్తావ్ జగన్’ అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ 10వ తేదీ రాత్రికే డబ్బులు ఇవ్వాలంటూ హడావిడి చేసిన జగన్ ప్రభుత్వం కోర్టు (Court)లో లంచ్ మోషన్ (Lunch Motion)లో తెగ హడావిడి చేసింది. జనవరి 23న బటన్ నొక్కినప్పటికీ మే 10వ తేదీ వరకు నిధులు విడుదల చేయలేదు. ఆరు పథకాలకు ఎన్నికలకు ముందు నిధులు విడుదల చేసి రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నం చేసింది. అయితే జగన్ ప్రభుత్వం కుయుక్తులను ఎన్నికల కమిషన్ అడ్డుకుంది. 14వ తేదీన నిధులు విడుదల చేసుకోవచ్చని తెలిపింది. అయితే ఆరు పథకాలకు సుమారు రూ. 14వేల కోట్లు జమ చేయాల్సి ఉన్నప్పటికీ జగన్ సర్కార్ (Jagan Govt.) నుంచి ఉలుకూ పలుకూ లేదు. దీంతో ప్రతిపక్షాలు, ప్రజలు జగన్ సర్కార్ తీరును ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ముందు చేసిన హడావిడి అంతా ఉత్తిత్తిదేనా? అని దుమ్మెత్తి పోస్తున్నారు.
AP ప్రభుత్వ పాఠశాలల్లో బీటెక్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్
ఉన్నత పాఠశాలల్లో ట్యాబ్‌లు, ఇంటరాక్టివ్ ఫ్లాట్‌ప్యానల్స్ వినియోగంపై ఉపాధ్యాయులు, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంజినీరింగ్ నాలుగో ఏడాది చదివే విద్యార్థులను నియమిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వెల్లడించారు. దీనికి ఉపకారవేతనంగా రూ.12 వేలు చెల్లిస్తారు. రవాణా కింద కళాశాల నుంచి బడి వరకు ఉండే దూరానికి కి.మీ.కు రూ.2 చొప్పున ఇస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 7,094 ఉన్నత పాఠశాలలకు కలిపి 2,379 మంది ఇంటర్న్‌షిప్ చేయనున్నారు. ఒక్కో విద్యార్థికి మూడు పాఠశాలలు అప్పగిస్తారు. జూన్ 12 నుంచి వీరు పాఠశాలల్లో పని చేసేలా ఇంజినీరింగ్ విద్యార్థులను వివిధ స్థాయిల్లో ఎంపిక చేస్తారు.
DGML: ఆంధ్రప్రదేశ్‌లో బంగారం ఉత్పత్తి ఈ ఏడాదిలోనే
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి బంగారం గనిలో ఈ సంవత్సరాంతానికి బంగారం ఉత్పత్తి మొదలు కానున్నట్లు తెలుస్తోంది.
జొన్నగిరి గనిలో ప్రయోగాత్మక కార్యకలాపాలు
250 ఎకరాల భూసేకరణ
60% పూర్తయిన ప్రాసెసింగ్ కర్మాగారం
లిథియమ్ గనులపైనా దృష్టి పెట్టిన దక్కన్ గోల్డ్ మైన్స్
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి బంగారం గనిలో ఈ సంవత్సరాంతానికి బంగారం ఉత్పత్తి మొదలు కానున్నట్లు తెలుస్తోంది. మనదేశంలో, ప్రైవేటు రంగంలో తొలి బంగారం గని ఇదే కావడం ప్రత్యేకత. దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (డీజీఎంఎల్) అనే కంపెనీకి అనుబంధ సంస్థ అయిన జెమైసోర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్, జొన్నగిరి బంగారం గనిని అభివృద్ధి చేస్తోంది. దీని కోసం ఇప్పటికే 250 ఎకరాలకు పైగా భూమిని సేకరించడంతో పాటు ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టింది. ప్రాసెసింగ్ ప్లాంట్ పనులు దాదాపు 60% పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రయోగాత్మక కార్యకలాపాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ ప్లాంట్ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో జరిగితే ఏటా 750 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందని అంచనా. ఇప్పటి వరకు ఈ గనిపై రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు దక్కన్ గోల్డ్ మైన్స్ గతంలో వెల్లడించింది.
ఇతర జిల్లాల్లోనూ
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోనూ కొన్ని బంగారం గనులను గుర్తించి, అభివృద్ధి చేసే ప్రయత్నాలు కొంతకాలంగా జరుగుతున్నాయి. ఈ గనులను తవ్వేందుకు ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్‌ఎండీసీ లిమిటెడ్ ఆసక్తిగా ఉంది. కొంతకాలం క్రితం ఈ గనులను తమకు అప్పగించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్‌ఎండీసీ కోరింది. ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. జొన్నగిరి గనులతో పాటు, ఈ గనులు కూడా అభివృద్ధి చేసిన పక్షంలో ఆంధ్రప్రదేశ్‌కు బంగారం గనుల రాష్ట్రంగా జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది.
ఆఫ్రికాలో లిథియమ్ గనులు
దక్కన్ గోల్డ్ మైన్స్ మనదేశంలో వివిధ ప్రాంతాల్లో గనులు నిర్వహిస్తోంది. ఈ సంస్థ తాజాగా ఆఫ్రికాలోని మొజాంబిక్‌లో లిథియమ్ గనులు కొనుగోలు చేసింది. దీని కోసం మాగ్నిఫికా గ్రూప్ ఆఫ్ మొజాంబిక్‌తో కలిసి దక్కన్ గోల్డ్ మొజాంబిక్ ఎల్‌డీఏ అనే జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేసింది. ఇందులో దక్కన్ గోల్డ్ మైన్స్‌కు 51% వాటా ఉంటుంది. భవిష్యత్తులో ఈ వాటాను 70 శాతానికి పెంచుకునే అవకాశం ఉంది. రోజుకు 100 టన్నుల లిథియమ్, టాంటలమ్, ఇతర ఖనిజాలను ప్రాసెస్ చేసే సామర్థ్యం కల ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తారు.
బంగారం గనుల కోసం పోటీ
రాజస్థాన్‌లో 2 బంగారం గనుల కోసం అగ్రశ్రేణి సంస్థలు పోటీ పడుతున్నాయి. వేదాంతా గ్రూపు సంస్థ అయిన హిందూస్థాన్ జింక్, జిందాల్ పవర్, జేకే సిమెంట్ ఇందులో ఉన్నాయి. రాజస్థాన్‌లోని కంక్రియా గారా గోల్డ్ బ్లాక్, భూకియా-జగ్‌పురా గోల్డ్ బ్లాక్‌లను రాజస్థాన్ ప్రభుత్వ గనుల శాఖ వేలం వేస్తోంది.
This Week Theatre and OTT Releases: ఈ వారం థియేటర్ / ఓటీటీలో సందడే సందడి.. ఏకంగా ఇన్ని సినిమా, సిరీస్‌లా..?
This Week theatre and OTT Releases: గత కొన్ని వారాల నుంచి ఎన్నికల ఎఫెక్ట్ సినిమాలపై పడింది. ఎన్నికల హడావుడి కారణంగా సినిమాలేవి థియేటర్లలో రిలీజ్ కావడానికి ముందుకు రాలేదు. అయితే ఓటీటీలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇందులో భాగంగానే వేసవి సెలవులను బాగా ఉపయోగించుకుంటున్నాయి. ప్రతి వారం ఓటీటీలో సినిమాల జాతరే జరుగుతోంది. థియేటర్లలో సినిమాలు రిలీజ్ కాకపోవడంతో ఓటీటీల వైపు ఆడియన్స్ మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ సంస్థలు కొత్త కొత్త సినిమాలు, సిరీస్‌లను రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి.
అయితే ఎప్పటిలానే ఈ వారం కూడా వచ్చేసింది. అందువల్ల ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్‌లేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వారం విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా.. అది వాయిదా పడింది. ఈ మూవీ మే 31న రిలీజ్ కానుంది.
రాజు యాదవ్..
జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను నటిస్తున్న కొత్త సినిమా ‘రాజు యాదవ్’. ఈ మూవీతో గెటప్ శ్రీను హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీ మే 17న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో అంకిత కారాట్ హీరోయిన్‌గా నటిస్తోంది.
అపరిచితుడు..
అలాగే విలక్షణ నటుడు విక్రమ్ నటించిన ‘అపరచితుడు’ మూవీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ మూవీ కూడా మే 17న గ్రాండ్‌గా రీ రిలీజ్ కానుంది. ఈ సినిమాలు తప్పితే థియేటర్లలో సందడి చేసే సినిమాలు ఏమీ లేవు. అయితే ఓటీటీలో మాత్రం 20కి పైగా సినిమాలు/సిరీసులు అదరగొట్టడానికి సిద్ధంగా ఉన్నాయి.
ఓటీటీ మూవీస్/ సిరీస్ లిస్టు
నెట్‌ఫ్లిక్స్
మే 15 – ఆష్లే మ్యాడిసన్: సెక్స్, లైస్& స్కాండల్(ఇంగ్లీష్‌సిరీస్)
మే 15 – బ్లడ్ ఆఫ్ జ్యూష్ సీజన్-2(ఇంగ్లీష్ సిరీస్)
మే 16 – బ్రిడ్జర్టన్ సీజన్-3 పార్ట్1 (ఇంగ్లీష్ సిరీస్)
మే 16 – మేడమ్‌వెబ్ (ఇంగ్లీష్‌మూవీ)
మే 17 – పవర్ (ఇంగ్లీష్‌సినిమా)
మే 17 – ద 8 షో (కొరియన్ సిరీస్)
మే 17 – థెల్మా ది యూనికార్న్ (ఇంగ్లీష్ మూవీ)
అమెజాన్ ప్రైమ్
మే 16 – ఔటర్ రేంజ్ సీజన్-2(ఇంగ్లీష్ సిరీస్)
మే 17 – 99(ఇంగ్లీష్ సిరీస్)
హాట్‌స్టార్
మే 13 – క్రాష్(కొరియన్ సిరీస్)
మే 14 – చోరుడు(తెలుగు డబ్బింగ్ మూవీ)
మే 15 – అంకుల్ సంషిక్(కొరియన్ సిరీస్)
మే 17 – బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్(హిందీ యానిమేటెడ్ సిరీస్)
జీ5
మే 17 – బస్తర్:ది నక్సల్ స్టోరీ(హిందీ సినిమా)
మే 17 – తళమై సెయిలగమ్(తమిళ సిరీస్)
జియో సినిమా
మే 13 – డిమోన్ స్లేయర్(జపనీస్ సిరీస్) – మే 13
మే 14 – C.H.U.E.C.O సీజన్-2(స్పానిష్ సిరీస్)
మే 17 – జర హట్కే జర బచ్కే(హిందీ మూవీ)
బుక్ మై షో
మే 13 – గాడ్జిల్లా X కాంగ్: ది న్యూ ఎంపైర్(తెలుగు డబ్బింగ్ మూవీ)
సోనీ లివ్
మే 16 – లంపన్(మరాఠీ సిరీస్)
ఆపిల్ ప్లస్ టీవీ
మే 17 – ద బిగ్ సిగార్(ఇంగ్లీష్ సిరీస్)
ఎమ్ఎక్స్ ప్లేయర్
మే 17 – ఎల్లా(హిందీ మూవీ)
Neck pain: టెక్ నెక్ (మెడ నొప్పి)కి వ్యాయామం పనిచేస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..
Neck pain: తరచూ మొబైల్ ఫోన్లు, కంప్యూటర్, ల్యాప్ టాప్ ల ముందు పనులు చేస్తున్న వారికి మెడ నొప్పి బాధిస్తుంటుంది. ల్యాప్ టాప్ ల ముందు తల ముందుకు వంచి గంటల తరబడి పనిచేస్తుంటారు. దీంతో మెడ నరాల్లో సమస్య ఎదురవుతుంది. దీనిని టెక్ నెక్ అని కూడా అంటారు. టెక్ నెక్ అంటే ఎలక్ట్రానిక్ వస్తువులను ఎక్కువ సేపు చూడటం వల్ల ఏర్పడే సమస్యను టెక్ నెక్ అంటారు. తరచూ ఫోన్లను చూడటం వల్ల ఈ సమస్య ఎక్కువగా ఏర్పడుతుంది. ఇష్టం వచ్చినట్లు కూర్చుని గంటల తరబడి ఫోన్లలో తలపెట్టి చూస్తుంటారు. దీంతో చాలా మందికి మెడ నొప్పి సమస్య ఏర్పడుతుంది.
సాధారణంగా ఫోన్లు లేదా ల్యాప్ టాప్ ల ముందు పనిచేసేటప్పుడు అయినా మెడను భుజాలపై ఉంచి పనిచేయాలి. ఇలా చేయడం వల్ల గురుత్వాకర్షణ రేఖ అనేది నిటారుగా ఉంటుంది. అయితే ఎక్కువ సేపు మెడను వంచి పనిచేయడం వల్ల ఈ టెక్ నెక్ సమస్య ఎదురవుతుంది. అయితే ఇలా ఏర్పడే సమస్య కారణంగా ఇది దీర్ఘకాలిక సమస్యగా మారిపోతుందని నిపుణులు అంటున్నారు.
టెక్ నెక్ నెమ్మదిగా తలనొప్పిగా మారుతుందట. మెడ నొప్పి నుంచి నెమ్మదిగా తలనొప్పి వంటి సమస్య ఎదురవుతుందని అంటున్నారు. అందువల్ల ల్యాప్ టాప్ ల ముందు కూర్చునే సమయంలో జాగ్రత్తగా, కరెక్ట్ పొజీషన్ లో కూర్చోవాలట. దీని గురించి చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇది చివరికి దీర్ఘకాలిక సర్వైకల్ స్పాండిలోసిస్‌కు దారి తీస్తుంది. మెడను మాత్రమే కాకుండా, వెనుక భుజాలను కూడా ప్రభావితం చేస్తుంది.టెక్ నెక్ చివరికి సర్వైకల్ స్పాండిలోసిస్‌గా మారుతుంది.
టెక్ నెక్ లక్షణాలు:
దిగువ మెడ, ఎగువ వెనుక భాగంలో నొప్పి, అసౌకర్యం
తలనొప్పి
మెడ, ఎగువ వీపు, భుజాలలో దృఢత్వం
వెర్టిగో
చికిత్స
నొప్పి తీవ్రంగా ఉంటే, ఫిజియోథెరపీ, యాంటీ ఇన్ఫ్లమేటరీ కండరాల సడలింపులను సిఫార్సు చేస్తారు. “ఈ సమస్యను పరిష్కరించడానికి వ్యాయామం చేయడం, భంగిమను మెరుగుపరచడం చాలా ముఖ్యం” అని నిపుణులు అంటున్నారు.
వ్యాయామాలు:
నాగుపాము భంగిమ
వెన్నెముక భ్రమణాలు
మెడ భ్రమణాలు
వాల్ పుష్-అప్స్
వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఆర్‌సీ, లైసెన్స్ వెంట పెట్టుకోనక్కర్లేదు.. పూర్తి వివరాలు..
ట్రాఫిక్ రూల్స్ మారాయ్. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి తీసుకుని రోడ్డెక్కితే.. జేబుకు తడిసిమోపెడు అయినట్టే. ఒక డ్రైవింగ్ లైసెన్స్ మాత్రమే కాదు.. ఆర్‌సీ, పొల్యూషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ ఇలా వాహనానికి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ ఉంటేనే కుదురుతుంది. లేదంటే మోటార్ వాహన చట్టం ప్రకారం కఠిన చర్యలే..
ట్రాఫిక్ రూల్స్ మారాయ్. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి తీసుకుని రోడ్డెక్కితే.. జేబుకు తడిసిమోపెడు అయినట్టే. ఒక డ్రైవింగ్ లైసెన్స్ మాత్రమే కాదు.. ఆర్‌సీ, పొల్యూషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ ఇలా వాహనానికి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ ఉంటేనే కుదురుతుంది. లేదంటే మోటార్ వాహన చట్టం ప్రకారం కఠిన చర్యలే. ఒకవేళ మీరెప్పుడైనా కంగారుగా ఇంట్లో లైసెన్స్, ఇతర పత్రాలను మర్చిపోయి.. మీ వాహనంతో సహా ట్రాఫిక్ పోలీసులకు తనిఖీల్లో దొరికారంటే..! కచ్చితంగా రూ. 5 వేల వరకు ఫైన్ చెల్లించాల్సిందే. అందుకే డ్రైవింగ్ లైసెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అయితే మీకు ఇప్పుడొకటి చెప్పనా.? ఈ ఒక్క యాప్ ఉంటే.. లైసెన్స్, ఆర్‌సీ లాంటివి ఏవి కూడా మీ వెంట పెట్టుకోనక్కర్లేదు. ఎందుకంటే.!
వాహనానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్‌ను ఒకే చోట పొందేలా పలు యాప్‌లను రూపొందించింది కేంద్ర ప్రభుత్వం. అవే Digilocker, mParivahan మొబైల్ యాప్‌లు. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, పొల్యూషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ లాంటి డాక్యుమెంట్స్‌ను మీరు ఈ యాప్‌లలో అప్‌లోడ్ చేసుకోవచ్చు. దీంతో మీకు అవసరమైనప్పుడల్లా.. ఎప్పుడైనా, ఎక్కడైనా లైసెన్స్, ఆర్‌సీని ఉపయోగించుకోవచ్చు. ఈ రెండు యాప్‌లు దేశవ్యాప్తంగా చెల్లుబాటులో ఉన్నాయ్. దీంతో డైవింగ్ చేసేటప్పుడు మీ దగ్గర అవసరమైన డాక్యుమెంట్స్ హార్డ్ కాపీలు లేకున్నా పర్లేదు. 2018వ సంవత్సరం నుంచి కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఈ డిజిలాకర్, mParivahan యాప్‌లలో అప్‌లోడ్ చేసిన పత్రాలను ఒరిజినల్‌విగా నిర్ధారించాలని చెప్పడం.. మీ దగ్గర ఈ యాప్ ఉన్నా ఇకపై నో ప్రాబ్లం.