Saturday, November 16, 2024

Evening Walking Benefits: ఈవినింగ్ వాకింగ్ చేస్తే.. ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..

వాకింగ్ అంటే అందరూ ఉదయం చేసే వాకింగ్ అనుకుంటారు. కానీ వాకింగ్ అనేది ఎప్పుడైనా చేయవచ్చు. సాయంత్రం కూడా వాకింగ్ చేయవచ్చు. ఈవినింగ్ వాకింగ్ చేయడం వల్ల కూడా చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ప్రతి రోజూ నడక కారణంగా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. దీంతో శరీరం ఫిట్‌గా మారుతుంది. మార్నింగ్ వాకింగ్ చేయడం కుదరని వాళ్లు.. ఈవినింగ్ వాకింగ్ చేయవచ్చు. సాయంత్రం నడక వల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధ పడేవారు ఈవినింగ్ వాకింగ్..

వాకింగ్ అంటే అందరూ ఉదయం చేసే వాకింగ్ అనుకుంటారు. కానీ వాకింగ్ అనేది ఎప్పుడైనా చేయవచ్చు. సాయంత్రం కూడా వాకింగ్ చేయవచ్చు. ఈవినింగ్ వాకింగ్ చేయడం వల్ల కూడా చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ప్రతి రోజూ నడక కారణంగా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. దీంతో శరీరం ఫిట్‌గా మారుతుంది.

మార్నింగ్ వాకింగ్ చేయడం కుదరని వాళ్లు.. ఈవినింగ్ వాకింగ్ చేయవచ్చు. సాయంత్రం నడక వల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధ పడేవారు ఈవినింగ్ వాకింగ్ చేయడం చాలా మంచిది.

అదే రాత్రి భోజనం చేసిన తర్వాత నడిస్తే.. గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. సాయంత్రం వాకింగ్ చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మైండ్ రీఫ్రెష్‌గా ఉండటమే కాకుండా.. రిలాక్స్ ఫీలవుతారు. నిద్ర లేమి సమస్యలు కూడా తగ్గుతాయి.

ఈవినింగ్ వాకింగ్ చేయడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు. ఉదయం కుదరని వారు ఈవినింగ్ వాకింగ్ చేయవచ్చు. మానసిక స్థిని పెంచడానికి సాయంత్రం నడక హెల్ప్ చేస్తుంది. అతిగా తినాలనే కోరికలు తగ్గుతాయి. కొలెస్ట్రాల్ అనేది వేగంగా కరుగుతుంది.

వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు ఈవినింగ్ వాకింగ్ చేస్తూ.. మంచి డైట్ మెయిన్ టైన్‌ చేస్తే.. త్వరగా బరువు తగ్గుతారు. బీపీ, డయాబెటీస్ కంట్రోల్ అవుతాయి. గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. హార్ట్ స్ట్రోక్ వంటివి రాకుండా ఉంటాయి.

Health Tips: మీ ఎత్తును బట్టి బరువు ఎంత ఉండాలి?

Normal Weight Chart by Height: ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండటానికి, శరీర బరువును నియంత్రించడం చాలా ముఖ్యం. అధిక శరీర బరువు అనేక తీవ్రమైన సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. నేటి కాలంలో స్థూలకాయం, అధిక బరువు సమస్య తీవ్రంగా మారుతోంది. WHO డేటా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల మందికి పైగా ప్రజలు అధిక బరువు , ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యల కారణంగా ఏటా దాదాపు 40 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, వారు ఎప్పుడు అధిక బరువుతో ఉన్నారో కూడా ప్రజలు గుర్తించరు. ఈ రోజు మేము మీకు ఒక ఫార్ములా చెబుతాము, దాని ద్వారా మీ ఎత్తుకు అనుగుణంగా మీ శరీర బరువు ఎలా ఉండాలో మీరు కనుగొనగలరు. మీరు అధిక బరువుతో ఉన్నారా లేదా ఊబకాయంతో ఉన్నారా అని కూడా తనిఖీ చేయగలుగుతారు.

సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) నివేదిక ప్రకారం, బాడీ మాస్ ఇండెక్స్‌ను లెక్కించడం ద్వారా మీరు ఎత్తుకు అనుగుణంగా ఖచ్చితమైన బరువును కనుగొనవచ్చు. సాధారణ భాషలో దీనిని BMI కాలిక్యులేటర్ అంటారు. దీని సాధారణ సూత్రం- BMI = బరువు / (ఎత్తు X ఎత్తు). ఈ ఫార్ములాతో BMIని లెక్కించడానికి, ముందుగా మీ బరువును Kgలో వ్రాసి, ఆపై మీ ఎత్తును మీటర్లలో వ్రాసి ఎత్తుతో గుణించండి. దీని తరువాత మీరు పొడవు యొక్క గుణకం ద్వారా బరువును విభజించండి. ఇప్పుడు మీరు పొందిన ఫలితాలను గమనించండి. మీ బరువు సరిగ్గా ఉందో లేక ఎక్కువగా ఉందో లేదో తెలుసుకోవడానికి మీరు దిగువ ఇచ్చిన BMI చార్ట్‌లో ఈ విలువను తనిఖీ చేయవచ్చు.

– మీ BMI 18.5 కంటే తక్కువ ఉంటే, మీరు తక్కువ బరువుతో ఉంటారు.

– BMI 18.5 మరియు 24.9 మధ్య ఉంటే, మీ బరువు ఖచ్చితంగా ఉంటుంది.

– 25 మరియు 29.9 మధ్య BMI కలిగి ఉండటం అధిక బరువుకు సంకేతం.

– BMI 30 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, మీరు ఊబకాయానికి గురవుతారు.

ఉదాహరణకు మీ ఎత్తు 5 అడుగులు , మీ బరువు 65 కిలోలు అనుకుందాం. ముందుగా మీరు పాదాలను అంగుళాలుగా మార్చుకోండి. ఒక అడుగులో 12 అంగుళాలు ఉంటాయి. దీని ప్రకారం, 5 అడుగుల 60 అంగుళాలు మారింది. ఇప్పుడు అంగుళాలను మీటర్లుగా మార్చండి. 1 అంగుళంలో 0.0254 మీటర్లు ఉన్నాయి. 60 అంగుళాలలో 1.524 మీటర్లు ఉంటుంది. ఇప్పుడు మీ ఎత్తును 1.524తో గుణించండి. దీని ఫలితం 2.322576. ఇప్పుడు మీ బరువును అంటే 65 కిలోల ఎత్తును 2.32తో గుణించండి. ఇది మీ BMIని 27.98గా ఇస్తుంది. ఇప్పుడు మనం పైన ఇచ్చిన చార్ట్‌ను పరిశీలిస్తే, ఈ BMI 25 కంటే ఎక్కువగా ఉంది, ఇది మీ ఎత్తుకు మీ బరువు ఎక్కువగా ఉందని మీరు అధిక బరువుతో ఉన్నారని చూపిస్తుంది. అటువంటి పరిస్థితిలో, మీరు కొన్ని కిలోల బరువు తగ్గాలి

Exam Marks: ఇదేందయ్యా ఇది.. పరీక్షలో 200కు 212 మార్కులు సాధించిన విద్యార్థి.. ఎక్కడంటే..

గుజరాత్ లోని దాహోద్ జిల్లాలో ప్రాథమిక పాఠశాల పరీక్ష ఫలితాలలో దారుణమైన తప్పిదం వివాదానికి దారితీసింది. దాంతో రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ యొక్క సమగ్రత గురించి ఆందోళనలను పెంచింది. నాలుగో తరగతి చదువుతున్న వాన్షిబెన్ మనీష్భాయ్ తన రిజల్ట్ షీట్ ను అందుకుని రెండు సబ్జెక్టుల్లో సాధించిన మార్కులను చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె గుజరాతీలో 200 కి 211 మార్కులు సాధించగా, అలాగే గణిత స్కోర్ షీట్ 200 కి 212 మార్కులు చూపించింది.

ఫలితాల మూల్యంకనం సమయంలో లోపం సంభవించిందని తరువాత వెల్లడైంది. తదనంతరం, సవరించిన రిజల్ట్ షీట్ జారీ చేయబడింది, గుజరాతీలో 200 కి 191, గణితంలో 200 కి 190 స్కోర్లను సరిచేసింది. మిగిలిన విషయాల స్కోర్లు మారలేదు. వాన్షిబెన్ గర్వంగా తన ఫలితాలను తన కుటుంబంతో పంచుకున్న తరువాత ఈ పొరపాటు వైరల్ గా మారింది. దగ్గరిగా గమనిస్తేకాని ఈ తప్పుని కనుగొనడం కష్టం.

ఈ పొరపాటుకు ప్రతిస్పందనగా,, పొరపాటుకు కారణాన్ని తెలుసుకోవడానికి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా నిరోధించడానికి జిల్లా విద్యా అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

AP HighCourt : పథకాలకు నిధులు నిలిపివేతపై ఏపీ హైకోర్టులో విచారణ – ఈసీ వాదన ఏమిటంటే ?

Elections 2024 : పథకాల నగదును లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయకుండా ఈసీ ఆదేశాలివ్వడంపై కొంత మంది లబ్దిదారులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇన్ పుట్ సబ్సిడీ నిధుల పంపిణీ నిలిపివేతపై ఏపీ హైకోర్టులో నేడు అత్యవసర పిటిషన్ దాఖలైంది. దీనిపై నేడు హైకోర్టు విచారణ చేపట్టింది. నిధుల విడుదల నిలిపివేస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించాలంటూ పిటిషనర్ కోరారు. ప్రభుత్వం వినతి ఇస్తే పునఃపరిశీలన చేస్తామని ఈసీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. అందుకు ఏజీ స్పందిస్తూ… ప్రభుత్వం తరఫున వినతి ఇస్తామని స్పష్టం చేశారు. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు ధర్మాసనం మే 9కి వాయిదా వేసింది.

తుపాను, కరవు వంటి విపత్తుల కారణంగా పంటలు నష్ట పోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ, విద్యా దీవెన పథకం నిధుల విడుదలకు అనుమతించాలని ఏపీ సీఎస్ చేసిన విజ్ఞాపనలను ఈసీ తోసిపుచ్చింది. ఇవి కొత్త పథకాలు కావని, ఇప్పటికే అమల్లో ఉన్నాయని ఏపీ ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ, ఎన్నికల ప్రక్రియ ముగిశాకే నిధులు విడుదల చేసుకోవాలని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ఈ వివాదం ఏపీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా స్పందించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని వెల్లడించారు. పోలింగ్ ముగిసిన తరువాత ఇవ్వాలని ఆదేశించిందని పేర్కొన్నారు.

డీబీటీ విధానం ద్వారా పలు పథకాల లబ్దిదారులకు చెల్లింపులు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఈసీకి లేఖ రాసింది. ఈ పథకాలన్నీ గత ఐదేళ్ల నుంచి అమల్లో ఉన్నవేనని.. కొత్త పథకాలు కావని పేర్కొంది. అమల్లో ఉన్న సంక్షేమ పథకాలు కాబట్టి నిధుల విడుదలకు అంగీకరించాలని కోరింది. అయితే, ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అభ్యర్థనను ఈసీ తోసిపుచ్చింది. అయితే ఈ పథకాలకు నిధులు ఎప్పుడో ఇవ్వాల్సి ఉంది. మార్చిలోనే సీఎం జగన్ బహిరంగసభ పెట్టి బటన్లు నొక్కిన చేయూత పథకం నిధులు. ఫీజు రీఎంబర్స్ మెంట్ తో పాటు రైతులకు ఇవ్వాల్సిన ఇన్ పుట్ సబ్సిడీ కూడా జమ కావాల్సి ఉంది. కానీ ఇంత కాలం పంపిణీ చేయలేదు. ఇప్పుడు ఎన్నికలకు ముందు లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తామని అడుగుతోంది.

ఇంకా వారం రోజుల ముందు పోలింగ్ ఉన్నందున ఇప్పుడు అత్యవసరంగా నగదు జమ చేయాల్సిన అవసరం లేదని.. అలా చేస్తే ఓటర్లను ప్రభావితం చేసినట్లు అవుతుందని విపక్షాలు అంటున్నాయి. ఇన్ని రోజులు ఆగిన ప్రభుత్వం పోలింగ్ ముగిసిన తర్వాత నిధులు అకౌంట్లలో జమ చేయవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నాయి. గురువారం హైకోర్టులో జరిగే విచారణను బట్టి .. తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Pomegranate : దానిమ్మ పండ్లు వీరు తింటే చాలా డేంజర్.. జాగ్రత్త..!

Pomegranate : పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనేది మనందరికీ తెలిసిందే. అయితే అందులోనూ దానిమ్మ పండ్లతో వచ్చే లాభాలు అంతా ఇంతా కాదు. దానిమ్మ పండ్లు ఒక రకంగా ఆరోగ్యానికి ఎన్నో ఔషధాలను అందిస్తాయి. అంతే కాకుండా ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతాయని మనందరికీతెలుసు. మరీ ముఖ్యంగా రక్తహీనతను తగ్గించడంలో దివ్య ఔషధంగా పని చేస్తాయి దానిమ్మ పండ్లు. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. ఈ పండ్లు రక్తహీనత ఉన్న ప్రతి ఒక్కరూ తినే విధంగా అయితే ఉండవని అంటున్నారు డాక్టర్లు. ఎందుకంటే అందులో కూడా కొన్ని కారణాలు ఉంటాయి.

Pomegranate : ఎండు దానిమ్మ తినొద్దు..
తక్కువ రక్తహీనత ఉన్న వారు దానిమ్మ పండ్లను అస్సలు తినొద్దు. ఎందుకంటే దానిమ్మ అంటేనే చల్లని పొండ్లు. కాబట్టి తక్కువ రక్తపోటు ఉన్న వారు తింటే మాత్రం వారిలో రక్త ప్రసరణ మందగించే ప్రమాదం కూడా ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా ఎండు దానిమ్మ తినకూడదు. దానిమ్మ తీపి పండు. ఈ విషయం తెలియక చాలామంది షుగర్ పేషెంట్లు తినడం వల్ల వారి బ్లడ్ లో షుగర్ లెవల్స్ బాగా పెరుగుతాయని డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి షుగర్ ఉన్న వారు దానిమ్మ పండ్లకు దూరంగా ఉండటమే చాలా బెటర్ అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఇక వీరితో పాటు మరొకరికి కూడా దానిమ్మ అస్సలు మంచిది కాదు. ఎలర్జీ సమస్యలు ఉన్న వారు తిన్నా సరే అలర్జీ సమస్యలు ఇంకా పెరుగుతాయని డాక్టర్లు చెబుతున్నారు. ఎందుకంటే దానిమ్మలో ఉండే కొన్ని ప్రత్యేక గుణాల వల్ల అలర్జీ సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇక దానిమ్మ జ్యూస్ ను ఖాళీ కడుపుతో తాగినా సరే అసిడిటీ సమస్యలు మరింత ఎక్కువగా అవుతాయి. అంతే కాకుండా శారీరక సమస్యలు కూడా ఎక్కువ అవుతాయని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే ఉదయాన్నే దీన్ని అస్సలు తినొద్దుపైన తెలిపిన సమస్యలు ఉన్న వారు మాత్రం అస్సలు దానిమ్మ పండ్లను తినొద్దని డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి ఒకవేళ వీరు తినాలనుకుంటే మాత్రం డాక్టర్ల సలహా మేరకు తింటే మంచిదని చెబుతున్నారు.

మరో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవరంటే..?

మ‌రో ఆరు రోజులు. నేటి(మంగ‌ళ‌వారం) నుంచి ఈ నెల 13న పోలింగ్ జ‌రిగే నాటికి.. కేవ‌లం ఆరు రోజులు మాత్ర‌మే గ‌డువు ఉంది. ఐదేళ్ళ‌పాటు కొత్త ప్ర‌భుత్వాన్ని ఎంచుకునేందుకు.. ఏపీలో పాల‌న మార్చాలా.. లేక కొన‌సాగించాలా? అని నిర్ణ‌యించుకునేందుకు మిగిలిన స‌మ‌యం కేవ‌లం ఆరు రోజులు మాత్ర‌మే. దీనిపై ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారు? ఏ పార్టీకి ఓటేయాలి? ఎవ‌రిని గ‌ద్దె నెక్కించాలని భావిస్తున్నారు.. అనేది కీల‌క అంశంగా మారింది.

ఈ కోణంలో చూసుకుంటే.. ఇప్ప‌టికే ప్ర‌ధాన పార్టీలు ప్ర‌చారాన్ని జోరుగా సాగిస్తున్నాయి. ఇదే స‌మ‌యం లో ఒక పార్టీపై మ‌రోపార్టీ పైచేయి సాధించేందుకు కూడా ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. ఓవ‌ర్ టేక్ పాలిటిక్స్ కు ఇప్పుడు ఏపీ కేరాఫ్‌గా మారిపోయింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విష‌యాన్ని టీడీపీ తెర‌మీదికి తెచ్చింది. దీనివ‌ల్ల వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ప్ర‌జ‌ల భూములు లాగేసుకుంటున్నార‌ని చెబుతోంది. ఇది ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్లింది. ముందు లైట్ తీసుకున్న వైసీపీ త‌ర్వాత‌.. అలెర్ట్ అయింది.

ఇప్పుడు ఆత్మ‌ర‌క్ష‌ణ‌లోనూ వైసీపీ నేత‌లు అల్లాడుతున్నారు. ఇదే స‌మ‌యంలో వైసీపీ మ‌రో విష‌యాన్ని తెచ్చి.. టీడీపీ కూట‌మిని డిఫెన్స్‌లో ప‌డేసింది. అదే మైనారిటీ రిజ‌ర్వేష‌న్లు. కూట‌మి అధికారంలోకి వ‌స్తే.. మైనారిటీ ముస్లింల‌కు ర‌క్ష‌ణ, రిజ‌ర్వేష‌న్ కూడా ఉండ‌బోవ‌ని వైసీపీ ప్ర‌చారం చేస్తోంది. ఇది కూట‌మిలో టీడీపీకి ఇబ్బందిగా మారింది. ఈ ప‌రిణామం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ఆ పార్టీ ప్ర‌య‌త్నిస్తోంది.

ఇలా.. మొత్తంగా ఏపీలో అయితే.. భిన్న‌మైన రాజ‌కీయం హ‌ల్చ‌ల్ చేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన స‌ర్వే.. ఇప్ప‌టి వ‌ర‌కు సాగిన ఒపీనియ‌న్ పోల్స్‌ను సైతం తిర‌గ‌రాసేలా.. ఈ ప్ర‌జాభిప్రాయం రాజ‌కీయాలు రెండు ఉండ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా చూస్తే. ఇప్ప‌టికీ.. ప్ర‌జ‌లు ఒక నిర్ణ‌యానికి రాలేద‌న్న‌ది నిర్వివాదాంశం. పైగా.. జ‌రుగుతున్న ప్ర‌చారంలోనూ.. వారికి అసంతృప్తి ఉంది.

కీల‌క‌మైన ప్ర‌త్యేక హోదా, క‌డ‌ప ఉక్కు, విభ‌జ‌న స‌మ‌స్య‌లు, విశాఖ ఉక్కు క‌ర్మాగారం ప్రైవేటు ప‌రం కాకుండా కాపాడుకోవ‌డం వంటివి కీల‌కం. వీటిని ఎవ‌రూ ప్ర‌స్తావించ‌డం లేదు. దీంతో ప్ర‌జ‌ల నాడి.. ఇప్ప‌టికీ ఒక‌వైపే ఏక‌ప‌క్షంగా ఉంద‌నిచెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. మ‌రో ఆరు రోజులు మాత్ర‌మే గ‌డువు ఉన్న నేప‌థ్యంలో పార్టీలు వ్య‌వ‌హ‌రించే తీరు.. పైనే ఇది ఆధార‌ప‌డి ఉంటుంది. మ‌రి ఈ ఆరు రోజుల్లో పార్టీలు.. ఆయా పార్టీల అధినేత‌లు ఏం చేస్తారో చూడాలి.

Home Loans: రూ. 50లక్షల వరకూ సులభంగా లోన్.. సొంతింటి కల ఇలా నెరవేరుతుంది..

సొంత ఇంటిని సమకూర్చుకునే ప్రయత్నంలో భాగంగా ప్రతి ఒక్కరూ ముందుగా హోమ్ లోన్ల గురించే ఆలోచిస్తారు. ముఖ్యంగా బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుంటారు. ఇదే సురక్షితమైన, లాభదాయకమైన మార్గం కూడా. అయితే అన్ని బ్యాంకులు ఒకే రకమైన వడ్డీ రేటును వసూలు చేయవు. వాటి నిబంధనల ప్రకారం మారుతూ ఉంటాయి. ఉద్యోగం, వ్యాపారం, చదువు తదితర కారణాలతో పల్లెటూర్ల నుంచి పట్టణాలకు వలసలు ఎక్కువయ్యాయి. చాలా మంది తమ సొంతూళ్లను వదిలి నగరాల బాట పడుతున్నారు. మంచి ఉద్యోగం, లాభదాయకమైన వ్యాపారం, నాణ్యత కలిగిన చదువుల కోసం ఈ మార్పు తప్పడం లేదు. ఇలా నగరాలకు వెళ్లిన వారి మొదటి ప్రాధాన్యం సొంతిల్లు సమకూర్చుకోవడమే. దానికోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు.

సొంతింటికి ప్రాధాన్యం..
సొంతిల్లు అనేది మన ఆర్థిక స్థిరత్వాన్ని, క్రమశిక్షణను సూచిస్తుంది. పెళ్లి చేసుకునే యువకులకు ఉద్యోగం తర్వాత ప్రధాన అర్హతగా సొంతింటిని చూస్తున్నారు. సరైన ఉద్యోగం, సక్రమమైన ఆదాయం కలిగి ఉంటే సొంతింటిని సమకూర్చుకోవడం సులభమేనని చెప్పవచ్చు. ఎందుకంటే వివిధ బ్యాంకులు అర్హత కలిగిన వారికి హోమ్ లోన్లను మంజూరు చేస్తున్నాయి. ప్రతినెలా ఈఎమ్ఐలు చెల్లించేలా రుణాలు ఇస్తున్నాయి.

బెస్ట్ బ్యాంకులు ఇవే..
నగరాలలో సొంత ఫ్లాట్ లేదా ఇల్లు సమకూర్చుకోవాలంటే దాదాపు రూ.50 లక్షలు అవసరం. ఈ నేపథ్యంలో రూ.50 లక్షల లోపు హోమ్ లోన్లు అందించే ఏడు ప్రధాన బ్యాంకుల గురించి తెలుసుకుందాం. అవి వసూలు చేస్తున్న వడ్డీరేట్లు, ప్రాసెసింగ్ ఫీజులనూ పరిశీలిద్దాం.

బ్యాంకు ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు హోమ్ లోన్లను మంజూరు చేస్తుంది. దాదాపు రూ.50 లక్షల వరకూ అందిస్తోంది. ఆ రుణాలపై దాదాపు 8.30 శాతం వడ్డీ విధించింది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా హోమ్ లోన్లు తీసుకునే అవకాశం ఉంది. ఈ బ్యాంకులో వడ్డీ రేటు 8.35 శాతంగా ఉంది.
హోమ్ లోన్లపై బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర లో 8.35 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు. దాదాపు రూ.50 లక్షల వరకూ రుణం మంజూరు చేస్తున్నారు. ఈ రుణాలపై జీరో ప్రాసెసింగ్ ఫీజు అమలవుతోంది.
సౌత్ ఇండియన్ బ్యాంక్ కూడా అర్హత కలిగిన వారికి హోమ్ లోన్లు మంజూరు చేస్తుంది. ఈ బ్యాంకు ఇచ్చిన రుణాలపై 8.35 శాతం వడ్డీరేటు విధించింది. అలాగే జీఎస్టీ తో పాటు 0.50 శాతం ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తుంది.
కెనరా బ్యాంకులో హోమ్ లోన్లు తీసుకునే వీలు ఉంది. ఈ బ్యాంకు ఇచ్చిన రుణాలపై 8.40 శాతం వడ్డీని వసూలు చేస్తుంది. దీనికి అదనంగా 0.50 శాతం ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.
సొంతింటి కోసం ఐడీబీఐ బ్యాంకు రూ.50 లక్షల వరకూ రుణాన్ని మంజూరు చేస్తుంది. ఈ బ్యాంకులో వడ్డీరేటు 8.40 శాతంగా ఉంది. అలాగే ప్రాసెసింగ్ ఫీజుగా 0.50 శాతం వసూలు చేస్తుంది.
హెచ్ఎస్ బీసీ బ్యాంకులో హోమ్ తీసుకుంటే 8.45 శాతం వడ్డీ రేటు ఉంటుంది. ఒకశాతం ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.

Trees : రోడ్డు పక్కన ఉన్న చెట్లకు తెల్ల రంగు ఎందుకు పూస్తారో తెలుసా?

White Color : సాధారణంగా రోడ్డు పక్కన ఉన్న చెట్ల కాండానికి తెల్లటి పెయింట్‌ మనం చూస్తూ ఉంటాం. ఇలా ఎందుకు వేస్తారనే సందేహం వస్తూ ఉంటుంది. తెలుపు రంగు పెయింట్ ప్రధానంగా మొక్కలను రక్షించడానికి ఉపయోగిస్తారు. సున్నం సాధారణంగా రోడ్డు పక్కన చెట్ల(Road Side Trees) కు పెయింట్ చేయడానికి ఉపయోగిస్తారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం చెట్టుకు సున్నం పూస్తే చెట్టు యొక్క బెరడు పగుళ్లు ఏర్పడదు. ఇది చెట్టు కాండాన్ని బలపరుస్తుంది. సున్నంతో పెయింట్ చేసినప్పుడు యొక్క మూలానికి చేరుకుంటుంది.

సున్నం కారణంగా కీటకాలు చెట్టు వేర్లపై దాడి చేయలేవు. ముఖ్యంగా చెదపురుగులు దరిచేరవు. ఇది మొక్క జీవిత కాలాన్ని(Life Span) పెంచుతుంది. చెట్టు బయటి పొరకు రక్షణను అందిస్తుంది. కార్నెల్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల ప్రకారం చెట్టుకు తెల్లటి పెయింట్ చేయడం వల్ల నేరుగా సూర్యకాంతి వల్ల చెట్టు దెబ్బతినే అవకాశాలను తగ్గిస్తుంది.

దాని తెలుపు రంగు కారణంగా చెట్టు ట్రంక్‌కు తక్కువ నష్టం ఉంటుంది. చెట్టుకు తెల్లగా రంగు వేయడం వెనుక మరో కారణం కూడా ఉంది. రోడ్డుపక్కన నాటిన చెట్లకు తెలుపు రంగు ఉండడంతో ఈ చెట్లు అటవీశాఖ పర్యవేక్షణలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యులెవరూ ఈ చెట్లను నరికివేయలేరు.

Jal Jeera Drink : సమ్మర్ స్పెషల్ డ్రింక్ జల్జీరా .. ఆరోగ్యానికి ఔషధం..!

Summer Special Drink : వేసవి(Summer) ప్రారంభమైన వెంటనే, నీటి కొరతను భర్తీ చేయడానికి ప్రజలు తమ ఆహారంలో రకరకాల పానీయాలను చేర్చుకోవడం ప్రారంభిస్తారు. వాటిలో ఒకటి జల్జీరా డ్రింక్(Jal Jeera Drink). జల్జీర రుచిగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. దీనిలో పుష్కలమైన యాంటీ-ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ డ్రింక్ మెరుగైన జీర్ణక్రియను నిర్వహించడంలో సహాయపడుతుంది. వేసవిలో డీహైడ్రేషన్(Dehydration) కారణంగా అనేక సమస్యలు వస్తాయి. అటువంటి పరిస్థితిలో, ఈ వేసవి పానీయం జల్జీరా తీసుకోవడం వల్ల ప్రేగులలో గ్యాస్, ఉబ్బరం, మైకము, కడుపు తిమ్మిరి, వాంతులు, ఆర్థరైటిస్ నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. వేసవిలో ఆరోగ్యాన్ని, రుచిని కాపాడే జల్జీరను ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

జల్జీరా తయారీకి కావలసినవి

కప్పు పుదీనా ఆకులు : ½
కప్పు కొత్తిమీర ఆకులు: ½
అంగుళాల అల్లం ముక్క:½
టేబుల్ స్పూన్లు తాజా నిమ్మరసం: 2
వేయించిన జీలకర్ర పొడి: ½ tsp
ఇంగువ: ¼ tsp
బ్లాక్ ఉప్పు : 2 tsp
ఉప్పు: ½ tsp
నల్ల మిరియాలు పొడి: ¼ tsp
పంచదార: 1 tsp
ఎండు యాలకుల పొడి: 2 tsp
చింతపండు పేస్ట్: 1 tbsp
కప్పులు చల్లని నీరు: 4
జల్జీరా తయారుచేసే విధానం

జల్జీరా చేయడానికి, ముందుగా పుదీనా ఆకులు(Mint Leaves), పచ్చి కొత్తిమీర, పచ్చి మిర్చి, అల్లం, ½ కప్పు నీరు బ్లెండర్‌లో వేసి, అన్ని పదార్థాలను మెత్తగా పేస్ట్ చేసి, గిన్నెలోకి తీసుకోవాలి.
ఇప్పుడు ఆ పేస్ట్ లో వేయించిన జీలకర్ర పొడి, ఇంగువ, నల్ల ఉప్పు, ఉప్పు,
వేసి మరో సారి గ్రైండ్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఒక గిన్నెలో మిగిలిన మూడున్నర కప్పుల నీళ్లు పోసి.. తాయారు చేసుకున్న పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లో ,నిమ్మరసం పిండుకోవాలి. అవసరమైతే మీరు వాటి పరిమాణాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. అంతే జల్జీరా డ్రింక్ రెడీ. రుచిని మెరుగుపరచడానికి, సర్వ్ చేయడానికి ముందు 3-4 గంటలు రిఫ్రిజిరేటర్‌లో ఉంచండి. ఆ తర్వాత గ్లాసులో కొన్ని ఐస్ ముక్కలను వేసి సర్వ్ చేయాలి.

AP News:మాజీ మంత్రిని రూ.7కోట్లు ఇవ్వాలంటూ బెదిరించిన.. టెన్త్​ క్లాస్​ స్టూడెంట్స్

ప్రకాశం జిల్లా ఒంగోలులోని మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు ఇంట్లో దొంగతనం పాల్పడిన ముగ్గురు వ్యక్తులను చాకచక్యంగా పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రెస్​మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.గత నెలలో 27వ తేదీన రాత్రి ఇరువురు అగంతకులు కత్తితో ఒంగోలులోని లాయర్ పేటలో ఉన్న మాజీమంత్రి శిద్ధా రాఘవరావు ఇంటిలోపలికి గోడ దూకి ప్రవేశించారని ఎస్పీ తెలిపారు. వాచ్​మెన్​పై దాడి చేశారు. అయితే పక్కనే టేబుల్ పక్కన నిద్రపోతున్న గన్​మాన్ లేవడంతో వారు వాచ్‌మెన్‌ను వదిలేసి పోయారు. దీనిపై శిద్ధా రాఘవరావు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. అప్పటి నుంచి పోలీసు బృందాలు అగంతకుల కోసం వెతికారు. తాజాగా సోమవారం ఉదయం 10:00కు వచ్చి బెదిరింపు లెటర్​ను శిద్ధా రాఘవరావు ఇంటి ముందువేసి పరారయ్యాడు. లేఖలో 7 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ, డబ్బు ఇవ్వకుంటే కుటుంబంతో సహా అంతం చేస్తామని బెదిరించారన్నారు. దీంతో అప్రమత్తమైనా పోలీసులు అగంతుకుల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు, సీసీ ఫుటేజ్ ఆధారంగా పట్టుకున్నట్లు చెప్పారు. బెదిరింపులకు పాల్పడిన వాళ్లు ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ముగ్గురు బాలురుగా గుర్తుంచామన్నారు. తల్లిదండ్లులు సైతం పిల్లలు ఏం చేస్తున్నారో గమనించాలని సూచించారు. ఒక్కసారి వారం రోజుల వెనక్కి వెళ్తే.. ఏప్రిల్ 27న మాజీ మంత్రి శిద్దా రాఘవరావు ఇళ్లు దోపిడికీ విఫలయత్నం జరిగింది. శుక్రవారం అర్థరాత్రి పన్నెండున్నర గంటల సమయంలో ఇద్దరు దొంగలు కత్తులతో మాజీ మంత్రి ఇంట్లోకి ప్రవేశించారు. వాచ్‌మేన్‌పై దాడి చేసి ఆయన్ని తమ కంట్రోల్‌లోకి తీసుకోవాలని భావించారు ఆ దొంగలు. వాచ్‌మేన్ కేకలు వేయడంతో గదిలో నిద్రిస్తున్న గన్‌మెన్ అలర్టయి బయటకు రావడంతో ఇద్దరు దుండగులు పరారయ్యారు. ఆ తర్వాత ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడం కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టడం జరిగిపోయింది.

BANK JOBS: బ్యాంక్ ఆఫ్ బరోడా భారీ నోటిఫికేషన్.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాలు

BANK JOBS: బ్యాంక్ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా..అయితే మీ కోసమే ఈ గుడ్ న్యూస్..బ్యాంక్ ఆఫ్ బరోడాలో పలు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు మే 15 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత: ఈ పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి: దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయస్సు 21 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జీతం: నెలకు 25,000
అప్లికేషన్ చివరి తేదీ: మే 15,2024

దరఖాస్తు ప్రక్రియ: అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారమ్ నింపి సంబంధిత పత్రాలతో పాటుగా అసిస్టెంట్ జనరల్ మేనేజర్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ప్రాంతీయ కార్యాలయం, బరోడా సిటీ రీజియన్ ,గ్రౌండ్ ఫ్లోర్, సూరజ్ ప్లాజా 1, సయాజిగంజ్, బరోడా – 390005 చిరునామాకు పంపాల్సి ఉంటుంది.

Duck Outs: క్రికెట్లో ఎన్ని రకాల ‘డక్ ఔట్స్’ ఉన్నాయో తెలుసా.. వివరాలు ఇలా..

ప్రస్తుతం భారతదేశంలో ఎన్నికల హడావిడి ఒకవైపు జరుగుతుండగా., మరోవైపు.. ఐపీఎల్ 17 సీజన్ జరుగుతోంది. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ సీజన్ చివరి దశకు చేరుకుంటుంది. ఆదివారం నాడు ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పరుగులు ఏమి చేయకుండా గోల్డెన్ డక్ అవుట్ గా వినతిగాడు. హర్ష ల్ పటేల్ బౌలింగ్ లో ధోని క్లీన్ బోల్డ్ కావడంతో గోల్డెన్ డక్ గా పెవిలియన్ చేరాడు. ఇకపోతే ఈ నేపథ్యంలో చాలా మందిని నెటిజెన్స్ అసలు గోల్డెన్ డక్ అంటే ఏంటి..? అసలు ఎన్ని రకాల డక్ ఔట్స్ ఉన్నాయి..?0 అంటూ తెగ గూగుల్ సెర్చ్ చేసేస్తున్నారు.

అసలు గోల్డెన్ డక్ అవుట్ అంటే ఏంటి..? అలాగే ఎన్ని రకాల డక్ ఔట్లు ఉన్నాయో.. మనం ఇప్పుడు చూద్దాం. ఇందులో భాగంగా మొదటగా బ్యాట్స్మెన్ తాను ఎదుర్కొన్న మొదటి బంతికే పరుగులు ఏమి చేయకుండా అవుట్ అయితే దానిని ‘గోల్డెన్ డక్ అవుట్’ అంటారు. అలాగే బ్యాట్స్మెన్ తాను ఎదుర్కొన్న రెండో బంతికి పరుగులు ఏమి చేయకుండా అవుట్ అయితే దాన్ని ‘సిల్వర్ డక్ అవుట్’ అంటారు.

అలాగే బ్యాట్స్మెన్ మూడో మందికి పరుగులు ఏమి చేయకుండా అవుట్ అవుతే దాన్ని ‘బ్రాంచ్ డకౌట్’ అంటారు. ఇక చాలా అరుదైన సందర్భంలో డైమండ్ డక్ ఔట్ కూడా అవుతుంటారు. అసలు ఈ డైమండ్ అకౌంట్ అంటే.. బ్యాట్స్మెన్ క్రీజ్ లోకి వచ్చిన తర్వాత అతడు ఎటువంటి బంతిని ఎదుర్కోకోకపోయినా గాని అవుట్ అయితే దాన్ని ‘డైమండ్ డక్ అవుట్’ అంటారు. ఇలాంటి డక్ ఔట్స్ ఎక్కువగా రన్ అవుట్స్ విషయంలో జరుగుతుంటాయి.

ఏపీని కమ్మేసిన మబ్బులు.. జిల్లాల్లో జల్లులు

ఏపీ ప్రజలను కొద్దిరోజులుగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్న అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగించే వార్తను రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పింది.ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈరోజు పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, మన్యం, అల్లూరి సీతారామరాజు , ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లా, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, బాపట్ల, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ విపత్తుల నిర్వహణ సంస్థ ఎల్లో అలర్ట్ జారీచేసింది. ఉత్తర కోస్తాలో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురవనున్నాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. దక్షిణ కోస్తాలో తేలికపాటి జల్లులు కురుస్తాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో జల్లులు పడతాయని సంస్థ వెల్లడించింది.

రాయలసీమలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఇక్కడ కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. భారీవర్షానికి కూడా అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. వడగాడ్పులు, తీవ్రమైన ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్న ప్రజలకు ఈ వానలు కాస్తంత ఊరటను కల్పించబోతున్నాయి. ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు మాత్రం తప్పనిసరిగా గొడుగు ధరించి బయటకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యమైన పనులుంటే ఉదయం సమయంలో పూర్తిచేసుకోవాలని, ఉదయం 11.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల్లోపు బయటకు వెళ్లొద్దని, వైద్యుల సలహాలు పాటించాలని, దాహం వేయకపోయినా తరుచుగా నీరు తాగుతుండాలని తెలియజేస్తున్నారు.

నిజం చెప్పటమే నేరమా..? 572 మంది ఉపాధ్యాయులకు నోటీసులు

ఉపాధ్యాయులు నిజం చెప్పడమే రాష్ట్రంలో నేరమైంది. అడ్డదారులు తొక్కకుండా తమ పాఠశాలల్లో సమస్యలను నమోదు చేసిన ఉపాధ్యాయులకు రాష్ట్ర ఉన్నతాధికారులు నోటీసులు పంపించడం చర్చనీయాంశమైంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.

పార్వతీపురం పట్టణం, విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: పాఠశాలల్లో సమస్యలను యూడైస్‌లో ఉపాధ్యాయులు నమోదు చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా రాష్ట్రాలకు ర్యాంకులు కేటాయించి నీతి ఆయోగ్‌ నిధులు విడుదల చేస్తుంది. కానీ పాఠశాలల్లోని సమస్యలను ఉన్నది ఉన్నట్లు నమోదు చేయడంతో రాష్ట్ర ర్యాంకు దిగజారిపోయింది. దీంతో ఉపాధ్యాయులు తప్పు చేశారని ఉన్నతాధికారులు నోటీసులు ఇచ్చినట్లు సంఘాల సభ్యులు చెబుతున్నారు. పార్వతీపురం మన్యంలో 32 పాఠశాలలకు తరగతి గదులు, 121 చోట్ల మరుగుదొడ్లు, 53 చోట్ల తాగునీరు, 56 పాఠశాలల్లో విద్యుత్తు, 336 చోట్ల ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేదని యూడైస్‌లో పేర్కొన్నారు. కానీ జాబితాలు తప్పుగా ఉన్నాయని, అన్నీ సక్రమంగా ఉన్నట్లు నివేదిక ఇవ్వాలని కోరుతున్నారన్నారు.

ఉమ్మడి జల్లాలో పరిస్థితి..
ఉమ్మడి జిల్లాల పరిధిలో పార్వతీపురం మన్యం నుంచి 537, విజయనగరంలో 35 మందికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. వీరిలో సంతకవిటి, ఎస్‌.కోట, వంగర, వేపాడ, గరివిడి, గుర్ల, మెరకముడిదాం, రేగిడి ఆమదాలవలస, రాజాం, రామభద్రపురం, బాడంగి, చీపురుపల్లి, పార్వతీపురం, సీతంపేట, భామిని, మక్కువ, బలిజిపేట, గుమ్మలక్ష్మీపురం, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, పాచిపెంట, పాలకొండ, సాలూరు, సీతానగరం, వీరఘట్టం మండలాలకు చెందిన వారున్నారు. సంబంధిత హెచ్‌ఎంలు, ఎంఈవోలు వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు.

ఎన్నడూ లేని విధంగా ఒత్తిడి..
గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యాశాఖపై ఈ అయిదేళ్లలో ఒత్తిడి పెంచారు. రాష్ట్రస్థాయి అధికారులు తనిఖీల పేరుతో ఉపాధ్యాయులను భయాందోళనకు గురి చేశారు. చిన్న చిన్న పొరపాట్లు, తప్పులకు నోటీసులు ఇస్తూ సస్పెన్షన్లు చేశారు. విద్యార్థుల ముందే ఉపాధ్యాయులను దూషించారు. ఈ వైఖరిపై ఉపాధ్యాయులు, సంఘాలు నిరసనలు, ఆందోళనలు చేసినా ఎలాంటి మార్పు రాలేదు.

గతేడాది విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాశ్‌ వీరఘట్టంలోని కేజీబీవీని సందర్శించారు. కొందరు విద్యార్థులకు పుస్తకాలు సరఫరా చేయలేదని డీఈవో, ఎంఈవో, పాఠశాల ఎస్‌వోని సస్పెండ్‌ చేయడం విమర్శలకు దారితీసింది.
ఉమ్మడి జిల్లాలో ముఖ హాజరు అమలు విషయంలో ఉన్నతాధికారుల తీరుతో గురువులు ఆందోళన చేపట్టారు.
వర్కు, నోట్‌ పుస్తకాలను దిద్దలేదని రాష్ట్రస్థాయి అధికారులు హడావుడి చేసి నోటీసులు జారీ చేశారు.
ఎన్నికల నేపథ్యంలో పాఠశాలల్లో ఉన్న పోలింగ్‌ బూత్‌లలో దివ్యాంగుల కోసం ర్యాంపుల నిర్మాణానికి బలవంతం చేయడంతో సొంత నిధులు వినియోగించామని పలువురు ఉపాధ్యాయులు చెబుతున్నారు.

Cash For Vote: ఏపీలో ఉద్యోగుల ఓటుకు నోటుపై ఈసీ ఆగ్రహం – తీవ్ర హెచ్చరిక.. !

ఏపీలో ఎన్నికల పోలింగ్ కు మరో ఆరు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో హోం ఓటింగ్ పూర్తి కాగా.. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉద్యోగుల ఓటింగ్ కొనసాగుతోంది. అయితే ఇందులో ఉద్యోగులు చాలా చోట్ల ఓటుకు నోటు తీసుకుంటున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. దీనిపై రాజకీయ పార్టీల్లోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఉద్యోగుల ఓటుకు నోటు వ్యవహారంపై ఈసీ ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో చాలా మంది ఉద్యోగులు ఓటుకు నోటు తీసుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా ఇవాళ తెలిపారు. ఇది చాలా దారుణం అన్నారు. పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో ఓటు వేసేందుకు 3.2 లక్షల మంది ఉద్యోగులకు అనుమతి ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. హోం ఓటింగ్ కు 28 వేల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. అత్యవసర సర్వీసులు కింద 31,000 మందికి అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. పోలీసులు 40 వేలు కూడా కలుపుకుంటే 4.3 లక్షల మంది ఇలా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేస్తున్నట్లు మీనా పేర్కొన్నారు.

ఇందులో 3 లక్షల 3 వేల మంది ఇప్పటివరకూ ఓటు వేశారని ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు. పలు కారణాల తో ఓటు వేయలేని వారి కోసం ఈ రోజు,రేపు మరో అవకాశం ఇచ్చామన్నారు. ఓటు వేయలేకపోయిన ఉద్యోగులు వారు సొంత నియోజకవర్గానికి వెళ్లి పోస్టల్ ఓటు వేయవచ్చన్నవారు. అయితే పోస్టల్ బ్యాలెట్ వేసే వారికి నగదు పంపిణీ చేస్తున్నట్లు ఫిర్యాదు వచ్చిందన్నారు. ఉద్యోగులు నగదు తీసుకోవడం చాలా దారుణమని ఆయన తెలిపారు. పశ్చిమ గోదావరిలో నగదు పంపిణీ చేస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఒంగోలులో యూపీఐ ద్వారా కొంతమంది ఉద్యోగులకు నగదు పంపిణీ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని సీఈవో తెలిపారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలిపారు. నగదు తీసుకోవాలనుకునే ఉద్యోగులకు ఆయన తీవ్ర హెచ్చరికలు చేసారు. కాల్ డేటా రికార్డు,బ్యాంక్ అకౌంట్ ఆధారంగా ఆయా ఉద్యోగులను సస్పెండ్ చేస్తామని సీఈవో హెచ్చరించారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించే ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవన్నారు.

Mobile Hacks : ఫోన్ లో ఈ 3 సెట్టింగ్స్ మారిస్తే చాలు.. మీ మొబైల్ కొత్త దానిలా పనిచేస్తుంది..!

Mobile Settings : ఫోన్ కొత్తగా ఉన్నప్పుడు.. చాలా స్మూత్‌గా, వేగంగా పని చేస్తుంది. ఈ సమయంలో ఫోన్ ఉపయోగించడం సరదాగా, ఆసక్తికరంగా ఉంటుంది. అయితే ఫోన్ పాతబడే కొద్దీ సాధారణంగా నెమ్మదించడం ప్రారంభమవుతుంది. అలాగే హ్యాంగ్ అవ్వడం కూడా జరుగుతుంది. దీంతో కొంత మంది విసిగిపోయి కొత్త ఫోన్స్(New Phones) కొనాలని ఆలోచిస్తారు. మరి కొందరు రిపేర్ షాప్ లో ఇస్తే బాగుపడుతుందని అనుకుంటారు. అయితే ఇప్పుడు ఇలాంటి చింత ఏమీ లేదు. ఎందుకంటే మీ ఫోన్ లో కొన్ని సెట్టింగ్స్ మార్చడం(Change Settings) ద్వారా.. మీ పాత ఫోన్‌ను కొత్తదిగా మార్చుకోవచ్చు. పాత ఫోన్ కొత్తదిగా ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము..

ఫోన్ లో క్రాష్ క్లియర్(Crash Clear) చేయడం అనేది ముఖ్యమైనది. ఫోన్ యాప్స్ లో క్రాష్ మెమరీని క్లియర్ చేయకపోవడం వల్ల ఫోన్ స్టోరేజ్, వేగంపై ప్రభావం చూపుతుంది. అయితే యాప్ క్రాష్ ఎలా క్లియర్ చేయవచ్చో మాకు ఇప్పుడు తెలుసుకోండి.

క్లియర్ క్యాచ్

ముందుగా, సెట్టింగ్‌లను ఓపెన్ చేయండి. ఆపై స్టోరేజ్‌పై క్లిక్ చేయండి . ఇప్పుడు స్టోరేజ్ ఎక్కువగా ఉన్న యాప్స్ డిస్ప్లే లో చూపబడతాయి. క్రాష్ ను క్లియర్ చేయాలనుకుంటున్న యాప్‌ను ఎంచుకోండి. ఇప్పుడు Clear Cache పై క్లిక్ చేయండి.

స్టోరేజ్ క్లియర్ చేయండి

మరింత స్టోరేజ్ ఖాళీ చేయాలనుకుంటే, ‘క్లియర్ స్టోరేజ్’ని ఎంచుకోండి. ఇది మొత్తం డేటాను తొలగిస్తుంది. వేగాన్ని పెంచడానికి వినియోగదారులు అనవసరమైన యాప్‌లు, అదనపు ఫోటోలను తీసివేయవచ్చు.

అప్‌డేట్‌లు కూడా ముఖ్యమైనవి,

యాప్ అప్డేట్స్(App Updates) ఫాలో అవ్వండి. అలాగే మొబైల్‌ను కూడా అప్‌డేట్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే అప్‌డేట్‌లు తరచుగా బగ్ ప్యాచ్‌లను కలిగి ఉంటాయి. అప్డేట్ చేయడం ద్వారా ఇవి స్మార్ట్‌ఫోన్‌లోని ఏదైనా తప్పు ప్రోగ్రామ్‌ను సరిచేయడమే కాకుండా, కొత్త ఫీచర్లను కూడా అందిస్తాయి.

Onion Benefits: ఉల్లిపాయను ఇలా తింటే రోగాలు పరార్‌.. వృద్ధాప్య ప్రభావాలను తగ్గిస్తుందని తెలుసా..!!

Onion Benefits: ఉల్లిపాయ కూరగాయల రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా ఉపయోగపడుతుంది. ఉల్లిపాయలో వృద్ధాప్య ప్రభావాలను తగ్గించే లక్షణాలు ఉన్నాయి. ఇది గుండె ఆరోగ్యానికి కూడా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. ఉల్లిపాయలో ఉన్న అతి పెద్ద ప్రత్యేకత ఏమిటంటే.. పచ్చిగా తింటే కూడా సులభంగా జీర్ణం అవుతుంది. ఉల్లిపాయలో కొవ్వు తక్కువగా ఉంటుంది, సల్ఫర్, ఫాస్పరస్, కాల్షియం, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి, ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. దానిని తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఉల్లిపాయను తింటే కలిగే లాభాలు:

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వృద్ధాప్య ప్రభావాలను తగ్గించుకోవాలనుకుంటే ప్రతిరోజూ ఉల్లిపాయను తినాలంటున్నారు. దీనివల్ల చర్మం బిగుతుగా మారుతుంది. వాడిపోయిన చర్మానికి జీవం వచ్చి గ్లో పెరుగుతుంది. ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు రాసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుందని చెబుతారు. పేను సమస్యలో కూడా ఇది మేలు చేస్తుంది.
ఉల్లిపాయ జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. పచ్చి ఉల్లిపాయ జీర్ణక్రియకు మంచిదని భావిస్తారు. అందుకే దీన్ని సలాడ్స్‌లో చేర్చుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ సమస్యను దూరం చేసుకోవచ్చు.
పచ్చి ఉల్లిపాయ రక్తంలో చక్కెరలో చాలా ప్రయోజనకరంగా పని చేస్తుంది. దీంతో షుగర్ అదుపులో ఉంటుంది. ఈ కూరగాయ మధుమేహ రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. దీనితో పాటు పచ్చి ఉల్లిపాయ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీంతో గుండె దృఢంగా మారుతుంది.
ఉల్లిపాయ విటమిన్ సికి మంచి మూలం. దీన్ని తినడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. రోజూ ఉల్లిపాయ తినడం వల్ల శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది, వ్యాధులను దూరం చేస్తుంది.
ఉల్లిపాయ తినడం వల్ల ఎముకల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉల్లిపాయ ఎముకలను దృఢంగా చేస్తుంది. ఎముకలను బలోపేతం చేయడం ద్వారా.. ఇది ప్రతి పనికి శరీరాన్ని సిద్ధం చేస్తుంది. కాబట్టి ఆహారంలో ఉల్లిపాయను చేర్చడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Mouth Ulcer: మౌత్ అల్సర్ ఇబ్బంది పెడుతుందా? ఈ హోం రెమెడీస్ పాటించండి!

Mouth Ulcer: నోటిపూత వల్ల ఏదైనా తినడం కష్టం అవుతుంది. నీరు త్రాగడం కూడా పక్కన పెట్టాల్సిందే. నీరు నాలుకను కుట్టింది. కడుపులో వేడి కారణంగా నాలుకపై బొబ్బలు తరచుగా కనిపిస్తాయి. అయితే.. కొన్ని ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. కానీ జీర్ణక్రియ, అలెర్జీ చాలా సాధారణమైనవి. వాపు, నొప్పి కారణంగా తినడానికి, త్రాగడానికి ఇబ్బందులు ఉన్నాయి. బొబ్బలు సమయానికి జాగ్రత్త తీసుకోకపోతే.. అవి గాయాలకు కూడా దారితీస్తాయని నిపుణులు అంటున్నారు. సాధారణంగా అల్సర్లు 7 నుంచి 10 రోజుల వరకు ఉంటాయి. కానీ కొన్ని మౌత్ అల్సర్స్ హోం రెమెడీస్‌ను పాటించడం వలన త్వరగా నయమవుతుంది. కొన్ని చర్యలతో దీన్ని నిర్మూలించవచ్చు. నోటిపూతలకు ఇంటి నివారణలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఉప్పు:

నాలుక పుండ్లను వాటి మూలాల నుంచి తొలగించడంలో ఉప్పు చాలా సహాయపడుతుంది. ఇది ఒక అద్భుతమైన హోం రెమెడీ. ఇది అల్సర్ వల్ల వచ్చే వాపు, నొప్పిని తగ్గిస్తుంది. దీనికోసం ఒక కప్పు వేడి నీటిలో 1 టీస్పూన్ ఉప్పు కలిపి ఈ నీటిని పుక్కిలించాలి. దీని వలన తక్షణ ఉపశమనం పొందుతారు.

పెరుగు:

దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాల కారణంగా పెరుగు అల్సర్‌లను తొలగించడంలో సహాయపడుతుంది. పెరుగులో సహజమైన ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది కడుపు సమస్యల నుంచి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. దీని కారణంగా బొబ్బలు నయం అవుతాయి. ఇది పేగు ఆరోగ్యానికి కూడా మంచిది.

తేనె-నిమ్మకాయ:

తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల అల్సర్‌లను తొలగించి త్వరగా ఉపశమనం కలిగిస్తుందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ తెలిపింది. ఇందుకోసం కొన్ని చుక్కల నిమ్మరసాన్ని తేనెతో కలిపి అల్సర్లపై రాస్తే త్వరగా ఉపశమనం లభిస్తుంది.

లవంగం నూనె:

నాలుక పుండ్లకు లవంగం నూనె దివ్యౌషధం. దీన్ని అప్లై చేయడం వల్ల పొక్కులు త్వరగా నయమవుతాయి. ఇందులో యూజినాల్ సమ్మేళనం కనుగొనబడింది. ఇది సహజ మత్తుమందుగా పనిచేస్తుంది. ఇది త్వరగా బొబ్బలు, వాపు రెండింటినీ తొలగించగలదు. దీని కోసం ఒక కప్పు వేడి నీటిలో కొన్ని చుక్కల లవంగం నూనె తీసుకొని పుక్కిలించాలి. దీంతో పొక్కులు త్వరగా మానిపోతాయి.

జామ ఆకులు:

జామ ఆకుల్లో చాలా రకాల గుణాలు ఉన్నాయి. ఇవి అల్సర్లను నయం చేయడంలో ఉపయోగపడతాయి. ఇందుకోసం ఒక కప్పు నీళ్లు తీసుకుని అందులో రెండు మూడు జామ ఆకులను వేసి మరిగించి తర్వాత నోరు కడుక్కోవాలి. అల్సర్ సమస్య నుంచి త్వరలో ఉపశమనం పొందుతారు.

PM Kisan: రైతులకు అలర్ట్.. త్వరలోనే పీఎం కిసాన్ 17వ విడత సాయం.. అలా చేయకపోతే డబ్బులు రానట్టే..

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM కిసాన్ యోజన) కింద దేశంలోని కోట్లాది మంది రైతులు ఆర్థికంగా ప్రయోజనం పొందుతున్నారు. రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్రం ఆర్థికసహాయం చేస్తున్న విషయం తెలిసిందే.. రైతులు ఇప్పటివరకు 16 వాయిదాల ప్రయోజనం పొందారు. ప్రభుత్వం త్వరలో 17వ విడత (PM కిసాన్) నగదను విడుదల చేయబోతోంది. అంతకుముందు ఫిబ్రవరి 28న 16వ విడత సొమ్ము రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయింది. నివేదికల ప్రకారం దేశంలోని కోట్లాది మంది రైతులు ఈ వాయిదాలను మే నెలాఖరులోగా లేదా జూన్ ప్రారంభంలో పొందే అవకాశం ఉంది. అయితే దీని గురించి.. ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

రైతులకు ఏటా రూ.6,000 ఆర్థిక ప్రయోజనం: దేశంలోని రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను అమలు చేస్తోంది. ఈ పథకం కింద, దేశంలోని అర్హులైన రైతులకు రెండు వేల రూపాయల చొప్పున మూడు వాయిదాలలో కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.6000 అందజేస్తుంది.

PM కిసాన్ తదుపరి విడత పొందడానికి e-KYC తప్పనిసరి: PM కిసాన్ యోజన లబ్ధిదారులు తదుపరి విడతను పొందాలనుకుంటే, e-KYCని చేయడం తప్పనిసరి. అందువల్ల, మీరు కూడా లబ్ధిదారులయితే ఈ ముఖ్యమైన పనిని ఇంకా పూర్తి చేయకపోతే, ఆలస్యం చేయకుండా ఈరోజే పూర్తి చేయండి. మీరు దీన్ని చేయకపోతే, మీరు PM కిసాన్ సమ్మాన్ యోజన 17వ విడత ప్రయోజనాన్ని పొందలేరు..

ప్రధాన మంత్రి కిసాన్ యోజన ఇ-కెవైసి ఎలా చేయాలి: ముందుగా పథకం అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.inకి వెళ్లాలి. దీని తర్వాత, ఇక్కడ మీరు ‘e-KYC’ ఎంపికపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి. అనంతరం సెర్చ్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది, దాన్ని ఇక్కడ నమోదు చేయండి. దీని తర్వాత మీరు సమర్పించుపై క్లిక్ చేయాలి.. దీన్ని చేసిన తర్వాత మీ e-KYC విజయవంతంగా పూర్తయినట్లే..

మీరు ఇంకా e-KYCని పూర్తి చేయకుంటే, దాన్ని పూర్తి చేయడానికి మీరు మీ సమీప CSC కేంద్రానికి వెళ్లవచ్చు. ఇక్కడ బయోమెట్రిక్ ఆధారిత e-KYC ని చేయవచ్చు..

అంతేకాకుండా.. మీరు బ్యాంకుకు వెళ్లి కూడా ఇ-కెవైసిని కూడా పొందవచ్చు. ఇ-కెవైసి ఫారమ్‌ను పూరించడం.. దానికి ఆధార్ కార్డ్ కాపీని జోడించడం ద్వారా మీ ఇ-కెవైసి పూర్తచేయవచ్చు..

Vaishakh Amavasya 2024: వైశాఖ అమావాస్య రోజు ఈ పనులు చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహిస్తుంది..

Vaishakh Amavasya 2024: హిందూ మతంలో అమావాస్య తేదీ చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఈ రోజున పూర్వీకులను పూజించే సంప్రదాయం ఉంది. పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడం ద్వారా ఆనందం మరియు శాంతి నెలకొంటాయి మరియు పితృ దోషం నుండి విముక్తి లభిస్తుంది. ప్రస్తుతం వైశాఖ మాసం కొనసాగుతోంది. ఈ మాసంలో అమావాస్య ఎప్పుడు జరుపుకుంటారో ఈరోజు తెలియజేస్తాము. వైశాఖ అమావాస్యకు జీవితంలోని అనేక సమస్యలను పరిష్కరించగల కొన్ని పరిహారాల గురించి కూడా మేము మీకు చెప్తాము.

వైశాఖ అమావాస్య 2024 ఎప్పుడు?

హిందూ క్యాలెండర్ ప్రకారం, వైశాఖ మాసంలోని కృష్ణ పక్ష అమావాస్య తిథి మే 07వ తేదీ ఉదయం 11.40 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది మే 08 ఉదయం 08:51 గంటలకు ముగుస్తుంది. ఈ కారణంగా మే 8న వైశాఖ అమావాస్యను జరుపుకోనున్నారు.

1. లక్ష్మీ దేవి అనుగ్రహం పొందడానికి

హిందూ మతంలో, పీపుల్ చెట్టును పూజించే సంప్రదాయం ఉంది. మీరు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే, వైశాఖ అమావాస్య రోజు ఉదయం పీపుల్ చెట్టుకు నీరు సమర్పించండి. దీని వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఆ వ్యక్తిపై నిలిచి ఉంటుంది.

2. ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి

మీరు కష్టపడి పనిచేస్తున్నప్పటికీ ఆర్థిక ఆశీర్వాదాలు పొందలేకపోతే ఈ పరిష్కారాలను ప్రయత్నించండి. వైశాఖ అమావాస్య రోజున తులసి జపమాలలో గాయత్రీ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇది ఆర్థిక పరిమితులను తొలగిస్తుంది మరియు స్థిరత్వాన్ని కాపాడుతుంది.

3. ఆనందం, శాంతి కోసం

వైశాఖ అమావాస్య నాడు ఆవులతో సహా జంతువులకు ఆహారం ఇవ్వడం శుభప్రదం. ఇది ఆనందం మరియు శాంతిని కాపాడుతుంది. ఈ రోజున పొరపాటున కూడా జంతువులు, పక్షులు ఇబ్బంది పెట్టకూడదు.

4. దానం చేయండి

వైశాఖ అమావాస్య నాడు స్నానం చేయడం మరియు దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. దానం చేయడం వల్ల పుణ్యాలు లభిస్తాయని, జీవితంలోని అనేక కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. అంతే కాకుండా పిత్ర దోషం ప్రభావం కూడా తగ్గుతుంది.

5. ఈ మంత్రాలను జపించండి

– ఓం పితృ దేవతాయై నమః
– ఓం పితృ గణాయ విద్మహే జగత్ధారిణే ధీమహి తన్నో పిత్రో ప్రచోదయాత్.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం సామాజిక, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. MannamWeb.com దీనిని ధృవీకరించలేదు. దీని కోసం నిపుణుల సలహా తీసుకోండి.

Dry Valleys: ఇక్కడ లక్షల ఏళ్లుగా వానజాడే లేదట..

ప్రకృతి చాలా విచిత్రమైనది. ప్రపంచంలో ఏదో ఒక ప్రాంతంలో కుంభవృష్టితో వరదలు వస్తుంటే, మరో ప్రాంతంలో కరవు తాండవిస్తుంటుంది. అలాగే, భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో ఎండలు మండిపోతుంటే, ధ్రువాలకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో చలి వణికిస్తుంది. కానీ ఈ భూమండలంపై ఓ ప్రాంతంలో ఏకంగా 20 లక్షల ఏళ్లుగా వర్షం జాడే లేదట. వరుసగా ఐదారేళ్లు వర్షం పడని ప్రాంతాలు చూశాం కానీ, ఇలా లక్షల ఏళ్లుగా వర్షం కురవని ప్రాంతం ఉంటుందా?
ప్రకృతి చాలా విచిత్రమైనది. ప్రపంచంలో ఏదో ఒక ప్రాంతంలో కుంభవృష్టితో వరదలు వస్తుంటే, మరో ప్రాంతంలో కరవు తాండవిస్తుంటుంది. అలాగే, భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో ఎండలు మండిపోతుంటే, ధ్రువాలకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో చలి వణికిస్తుంది. కానీ ఈ భూమండలంపై ఓ ప్రాంతంలో ఏకంగా 20 లక్షల ఏళ్లుగా వర్షం జాడే లేదట. వరుసగా ఐదారేళ్లు వర్షం పడని ప్రాంతాలు చూశాం కానీ, ఇలా లక్షల ఏళ్లుగా వర్షం కురవని ప్రాంతం ఉంటుందా? అనిపిస్తుంది కదా.. నిజమే కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రదేశం ఏ సహారా ఎడారో కాదు, ఆశ్చర్యంగా ఇటీవల ఎడారి దేశం ఎమిరేట్స్‌ను వర్షాలు ముంచెత్తాయి. అలాంటిది ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉండే ప్రాంతంలో లక్షల ఏళ్లుగా వర్షం పడలేదంటే నమ్మశక్యంగా లేదు కదా. కానీ ఇది నిజం. ఎక్కడంటే ఎటు చూసినా కిలోమీటర్ల ఎత్తున మంచుతో కప్పబడి ఉన్న అంటార్కిటికా ఖండంలో అలాంటి కరువు ప్రాంతం ఉంది.

ఏపీలో పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియపై పలుచోట్ల ఉద్యోగుల ఆగ్రహం

ఏపీలో పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియలో పలుచోట్ల గందరగోళం నెలకొంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు.

ఏపీలో పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియలో పలుచోట్ల గందరగోళం నెలకొంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. విధులు నిర్వహించే చోట ఓటు లేదని అధికారులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత నియోజకవర్గాలకు వెళ్లి వేయాలని చెప్పడంపై మండిపడుతున్నారు. దీనికోసం ఫాం-12 దరఖాస్తు చేసినా ఉపయోగమేంటని నిలదీస్తున్నారు. గుంటూరులో పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం ఉద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. నగరంలోని లయోలా పబ్లిక్‌ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రం వద్ద పలువురి పేర్లు ఓటర్ల జాబితాలో గల్లంతయ్యాయి. ఉన్నతాధికారుల తీరుపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునే అవకాశం రాలేదని కాకినాడ జిల్లాలో పలువురు మండిపడ్డారు. సుమారు 200 మందికి అవకాశం రాలేదంటూ ఉద్యోగులు నిరసన చేపట్టారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో సుమారు 30 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోలేకపోయారు. దీనిపై కాకినాడ జిల్లా కలెక్టర్‌ స్పందిస్తూ ఉద్యోగులు తమ ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు

ఏపీలో పెను సంచలనం.. దుమారం రేపుతున్న తాజా సర్వే.. సోషల్ మీడియాలో వైరల్..!

ఏపీలో పోలింగ్ సమయం సమీపిస్తున్న కొద్దీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సర్వేలు రాజకీయ పార్టీల్లో టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఏప్రియల్ 21 నుంచి మే5 మధ్యన నిర్వహించినట్లు పయోనీర్స్ పేరిట ఓ సర్వే చక్కర్లు కొడుతోంది. ఏప్రియల్ నెలలోనూ ఈ సంస్థ పేరిట ఓ సర్వే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ సర్వేతో పోలిస్తే ప్రస్తుతం విడుదల చేసిన సర్వేలో కొన్ని మార్పులు కనిపించాయి. ఏపీలో ఎన్డీయే కూటమి మెజార్టీ సీట్లు గెల్చుకుంటుందని ఈ సర్వే పేర్కొంది.

ఏపీలో పోలింగ్ సమయం సమీపిస్తున్న కొద్దీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సర్వేలు రాజకీయ పార్టీల్లో టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఏప్రియల్ 21 నుంచి మే5 మధ్యన నిర్వహించినట్లు పయోనీర్స్ పేరిట ఓ సర్వే చక్కర్లు కొడుతోంది. ఏప్రియల్ నెలలోనూ ఈ సంస్థ పేరిట ఓ సర్వే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ సర్వేతో పోలిస్తే ప్రస్తుతం విడుదల చేసిన సర్వేలో కొన్ని మార్పులు కనిపించాయి. ఏపీలో ఎన్డీయే కూటమి మెజార్టీ సీట్లు గెల్చుకుంటుందని ఈ సర్వే పేర్కొంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సర్వే ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సర్వేలపై అధికారపార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఈ సర్వే పార్టీకి వచ్చే సీట్లతో పాటు ఎంత శాతం ఓట్లు సాధిస్తాయనే విషయాన్ని ఈ సర్వే తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 48వేల శాంపిల్స్ సేకరించినట్లు వెల్లడించింది.

April 21st to 5th May-images-26.jpg

April 21st to 5th May-images-27.jpg

AP Elections: ‘‘నవ సందేహాలు’’ పేరుతో జగన్‌కు షర్మిల మరో లేఖ.. ఈసారి దేనిగురించంటే?

పయోనీర్స్ సర్వేలో ఏముంది..

పయోనీర్స్ ప్రీపోల్ సర్వే పేరిట ఓ రిపోర్టు సామాజిక మాద్యమాల్లో ఎక్కువుగా వైరల్ అవుతోంది. ఏప్రియల్ 21 నుంచి 5 మే మధ్య ఈ సర్వే చేసినట్లు రిపోర్టులో ఉంది. దాదాపు 25 లోక్‌సభ, 175 శాసనసభ స్థానాల్లో కంప్యూటర్ అసిస్టెడ్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ద్వారా సర్వే చేసినట్లు ఆ నివేదికలో ఉంది. సీట్ల పరంగా ఎన్డీయే కూటమి 126 అసెంబ్లీ, 20 లోక్‌సభ సీట్లలో గెలిచే అవకాశం ఉండగా..వైసీపీ 33 అసెంబ్లీ, 5 పార్లమెంట్ స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్లు ఈ సర్వే రిపోర్టులో ఉంది. 16 శాసనసభా స్థానాల్లో గట్టి పోటీ ఉందని పేర్కొంది. గత సర్వేలో మాత్రం ఎన్డీయే కూటమి 116 అసెంబ్లీ, 19లోక్‌సభ సీట్లు గెల్చుకునే అవకాశం ఉన్నట్లు తెలిపింది. వైసీపీ 46 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. గత సర్వేతో పోలిస్తే టీడీపీకి 10 సీట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. వైసీపీకి 13 స్థానాలు తగ్గుతాయని చెప్పింది. ఓట్ల శాతానికి సంబంధించి అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీయేకు 50.02 శాతం, వైఎస్సార్‌సీపీకి 44.12 శాతం, ఇండియా కూటమికి 3.96 శాతం, ఇతరులకు 2 శాతం ఓట్లు రావొచ్చని తెలిపింది.

లోక్‌సభ స్థానాలవారీ..

పయోనీర్స్ పేరిట వైరల్ అవుతున్న సర్వేలో లోక్‌సభ స్థానాల్లో ఎవరికి ఎంత శాతం ఓట్లు వస్తాయి.. లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయో ఈ సర్వే తెలిపింది. పార్లమెంట్ స్థానాలవారీ ఓట్ల శాతం కింది విధంగా ఉన్నాయి.

April 21st to 5th May-images-1.jpg

April 21st to 5th May-images-2.jpgApril 21st to 5th May-images-3.jpg

April 21st to 5th May-images-4.jpgApril 21st to 5th May-images-5.jpgApril 21st to 5th May-images-6.jpgApril 21st to 5th May-images-7.jpgApril 21st to 5th May-images-8.jpgApril 21st to 5th May-images-9.jpgApril 21st to 5th May-images-10.jpg

April 21st to 5th May-images-11.jpgApril 21st to 5th May-images-12.jpgApril 21st to 5th May-images-13.jpgApril 21st to 5th May-images-14.jpgApril 21st to 5th May-images-15.jpgApril 21st to 5th May-images-16.jpgApril 21st to 5th May-images-17.jpgApril 21st to 5th May-images-18.jpgApril 21st to 5th May-images-19.jpgApril 21st to 5th May-images-20.jpg

April 21st to 5th May-images-21.jpgApril 21st to 5th May-images-22.jpgApril 21st to 5th May-images-23.jpgApril 21st to 5th May-images-24.jpgApril 21st to 5th May-images-25.jpg

 

Diabetes Foods: షుగర్ పేషెంట్స్‌కు బెస్ట్ ఫుడ్స్.. ఎలాంటి భయం లేకుండా ఇవి తినండి..!

Diabetes Foods: ఇటీవల కాలంలో చాలామందిని వేధిస్తున్న జీవనశైలి వ్యాధి డయాబెటిస్ (Diabetes). దీని బారిన పడిన వారి రక్తంలో చక్కెర స్థాయిలు సరిగా ఉండవు. దీంతో గుండె జబ్బులు, స్ట్రోక్, మూత్రపిండ వ్యాధి, అంధత్వం వంటి అనారోగ్యాల ముప్పు పెరుగుతుంది. అందుకే మధుమేహ బాధితులు షుగర్ లెవల్స్ సరిగా మేనేజ్ చేసే ఆహారం తినాలి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తూ, తీవ్రమైన అనారోగ్యాల ముప్పును తగ్గించే ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ (Plant based food items) వీరికి మంచివని చెబుతున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ శిల్పా జోషి. ఆమె ఏబీపీ లైవ్ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. డయాబెటిస్ ఉన్నవారు ఎలాంటి భయం లేకుండా కొన్ని మొక్కల ఆధారిత ఆహార పదార్థాలు తినొచ్చని చెప్పారు. అవేంటంటే..

* నట్స్

బాదం, వాల్‌నట్స్, పిస్తా వంటి నట్స్‌లో హెల్తీ ఫ్యాట్స్‌, ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. అవి రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి. ఎక్కువసేపు కడుపు నిండిన భావనను అందిస్తాయి. నట్స్‌లో శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు కూడా ఉంటాయి. ఒక గుప్పెడు బాదం పప్పులు తింటే కొన్ని గంటల పాటు శక్తి లభిస్తుంది. ఈ గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి. వాల్‌నట్స్‌లో ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి, ఇవి మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

* శనగలు

శనగలు (Chickpeas) పోషకాల గనులు. వీటి నుంచి ప్రోటీన్, ఫైబర్, ఐరన్ శరీరానికి పుష్కలంగా అందుతాయి. ఇందులోని ఫైబర్‌ కారణంగా మెటబాలిజం నెమ్మదిస్తుంది, పీచు పదార్థం రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. ప్రోటీన్ కూడా రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. అందుకే శనగలు తింటే ఆకలిగా అనిపించదు. ఫలితంగా ఫుడ్ క్రేవింగ్స్‌ తగ్గుతాయి.

* బెర్రీస్

బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, రాస్‌బెర్రీల్లో షుగర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇవి డయాబెటిస్-ఫ్రెండ్లీ ఫుడ్‌గా గుర్తింపు పొందాయి. ఉదయం భోజనంలో కొన్ని బెర్రీలను తినవచ్చు. వీటిని సలాడ్‌కు టాపింగ్‌గా యాడ్ చేసుకోవచ్చు, స్మూతీస్‌లో కూడా కలుపుకోవచ్చు.

* విత్తనాలు

అవిసెలు (Flax seeds), చియా సీడ్స్‌, నువ్వులు, పుచ్చకాయ గింజలు, గుమ్మడికాయ గింజలలో ఫైబర్, మంచి కొవ్వులు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి డయాబెటిస్ బాధితులకు అవసరమైన న్యూట్రియెంట్స్ అందిస్తాయి. అందుకే వీటిని షుగర్ పేషెంట్లు ఎలాంటి భయం లేకుండా తినవచ్చు. వీటిని సలాడ్స్‌, పెరుగు లేదా స్మూతీలలో యాడ్ చేసుకోవచ్చు.

* మరిన్ని ఫుడ్స్

కాలిఫ్లవర్, క్యారెట్లు, బీట్‌రూట్, టమాటాలు, ఓట్స్, క్వినోవా, జొన్నలు, రాగులు, సజ్జలు వంటి మొక్కల ఆధారిత ఆహార పదార్థాలను డైట్‌లో చేర్చుకోవచ్చు. అలాగే యాపిల్, నారింజ, ద్రాక్ష, పైనాపిల్, పుచ్చకాయ వంటివి కూడా షుగర్ పేషెంట్లు తినొచ్చని వైద్యులు చెబుతున్నారు.

* ప్లాంట్-బేస్డ్‌ ఫుడ్స్ ఎలా తినాలి?

షుగర్ పేషెంట్లు తినే ఆహారంలో మొక్కల ఆధారిత ఆహారాలను చేర్చడానికి కొన్ని చిట్కాలు పాటించాలి. ప్రతి భోజనంలో కనీసం ఒక కూరగాయ లేదా పండు చేర్చుకోవాలి. వారానికి కొన్ని రోజులు మాంసం తినడం మానేసి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఫుడ్స్ తినడానికి ప్రయత్నించాలి. వంటకాల్లో బాదం పాలు లేదా సోయా పాలు వంటి మొక్కల ఆధారిత పాల ఉత్పత్తులను ఉపయోగించాలి.

Nani : జనసేనకు మద్దతుగా ముందుకొచ్చిన టాలీవుడ్ హీరో..

ఆంధ్రప్రదేశ్ లో మరో 6 రోజులలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసవత్తరంగా మారింది.అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారిన నియోజకవర్గం పిఠాపురం.ఈ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిల్చున్నారు .గత ఎన్నికలలో పవన్ గాజువాక ,భీమవరం రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికలలో పవన్ కల్యాణ్ కు సినిమా వారు ఎవరూ కూడా బహిరంగంగా సపోర్ట్ చేయలేదు .ఈ సారి టాలీవుడ్ లో చాల మంది సినీ ప్రముఖులు పవన్ కల్యాణ్ కు మద్దతు తెలుపుతున్నారు .ఈసారి జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తుంది.ఈ సారి తెలుగు దేశం,బీజేపీలతో కలిసి ఉమ్మడిగా పోటీ చేస్తున్నారు.ఈ క్రమంలో పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పిఠాపురంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది .

ఈసారి పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజక వర్గంలో ఎలాగైనా గెలిపించుకోవాలని టాలీవుడ్ లో పలువురు సినీ ప్రముఖులు ప్రచారం చేస్తున్నారు.అలాగే మెగా ఫ్యామిలీ కూడా పవన్ కు సపోర్ట్ గా నిలిచింది..సాయి తేజ్ ,వరుణ్ తేజ్ ,వైష్ణవ తేజ్ ఇప్పటికే పిఠాపురం లో జనసేనకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు .తాజాగా మెగా స్టార్ చిరంజీవి కూడా తన తమ్ముడు పవన్ ను గెలిపించాల్సిందిగా ఓ వీడియో ను రిలీజ్ చేసారు .ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .అలాగే టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని పవన్ కు తన మద్దతు తెలుపుతూ ట్వీట్ చేసారు.ప్రియమైన పవన్ కల్యాణ్ గారు మీరు అతి పెద్ద రాజకీయ యుద్దాన్ని ఎదుర్కొనబోతున్నారు .మీ సినిమా కుటుంబ సభ్యుడిగా మీరు కోరుకున్నదంతా సాధిస్తారని ఆశిస్తున్నాను .నేను మీకోసం మద్దతుగా నిలుస్తున్నాను ..ఆల్ ది వెరీ బెస్ట్ సార్ అంటూ నాని ట్వీట్ చేసారు .ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది .

AP Schemes: పథకాలకు ఈసీ బ్రేక్ పై హైకోర్టుకు లబ్దిదారులు – లంచ్ మోషన్ విచారణ..

ఏపీలో వైసీపీ సర్కార్ సంక్షేమ పథకాల లబ్దిదారులకు ఎన్నికల వేళ భారీ షాక్ తగిలింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పథకాలకు డబ్బులు విడుదల చేయకుండా ఈసీ నిన్న ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో చేయూత, విద్యాదీవెన, రైతు భరోసా వంటి పథకాలకు నిధులు విడుదల కాకుండా పోయాయి. దీంతో లబ్దిదారులు లబోదిబోమంటున్నారు. దీనిపై వైసీపీ వర్సెస్ విపక్షాల వార్ మొదలైంది. ఈ క్రమంలోనే మహిళా సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. రాష్ట్రంలో ఇప్పటికే కొనసాగుతున్న సంక్షేమ పథకాలకు ఎన్నికల కోడ్ పేరుతో నిధులు విడుదల చేయకుండా అడ్డుకోవడం సరికాదంటూ హైకోర్టులో మహిళా సంఘాలు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాయి. ఈ మేరకు ఈసీ ఇచ్చిన ఆదేశాలపై అత్యవసర విచారణ జరపాలని హైకోర్టును కోరాయి. దీంతో ఈ పిటిషన్ పై మధ్యాహ్నం విచారణ జరిపేందుకు హైకోర్టు అంగీకరించింది.

ఎన్నికలకు ముందే సీఎం జగన్ బటన్ నొక్కేసిన ఈ పథకాల డబ్బులు ఇప్పటివరకూ లబ్దిదారుల ఖాతాల్లో పడలేదు. ఈ నిదుల విడుదలకు అనుమతి ఇవ్వాలని వైసీపీ సర్కార్ ఈసీని ఆశ్రయించింది. అయితే ఈసీ మాత్రం ఎన్నికలు ముగిసేవరకూ పథకాల నిధుల విడుదలకు అనుమతి ఇవ్వలేమని తెలిపింది. ఎన్నికలు ముగిశాక నిధులు విడుదల చేసుకోవచ్చని క్లారిటీ ఇచ్చింది. దీంతో ఆయా పథకాలు అందుకుంటున్న లబ్దిదారులకు షాక్ తగిలింది. మరోవైపు దీనిపై రాజకీయ రచ్చ కూడా మొదలైంది. పథకాలను విపక్షాలు ఈసీ సాయంతో అడ్డుకుంటున్నాయని వైసీపీ ఆరోపిస్తుండగా.. విపక్షాలు మాత్రం జగన్ ఉద్దేశపూర్వకంగానే బటన్ నొక్కి ఇప్పటికీ నిధులు విడుదల చేయలేదని కౌంటర్లు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇవాళ తీసుకోబోయే నిర్ణయం కీలకంగా మారింది.

LIC Policy: కేవలం 87 రూపాయల పెట్టుబడితో.. 11 లక్షల రూపాయల రాబడి..

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC), ప్రముఖ బీమా ప్రొవైడర్, విభిన్న ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి వివిధ రకాల జీవిత బీమా పాలసీల(LIC Policy)ను అందిస్తోంది. LIC ఆధార్ శిలా యోజన అనేది మహిళలకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో తీసుకువచ్చిన ప్రత్యేక పథకం. ఈ నాన్-లింక్డ్ వ్యక్తిగత జీవిత బీమా(LIC Policy) ప్లాన్ అకాల మరణం సంభవించినప్పుడు బీమా చేసిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.

మహిళలకు ఆర్థిక భద్రత:
LIC దాని తక్కువ రిస్క్, కస్టమర్ సెంట్రిక్ పాలసీల(LIC Policy)కు ప్రసిద్ధి చెందింది. ఇది ఆర్థిక అవసరాలకు పరిష్కారాన్ని అందిస్తుంది. ఎల్‌ఐసి ఆధార్ శిలా యోజన కేవలం రూ. 87 రోజువారీ పెట్టుబడితో పాలసీదారులకు రూ.11 లక్షల వరకు ఆదా చేయడానికి అనుమతిస్తుంది.

ఈ పాలసీ (LIC Policy)కోసం కనిష్ట పాలసీ ప్రారంభ వయస్సు: 8 సంవత్సరాలు
గరిష్ట పాలసీ ప్రారంభ వయస్సు: 55 సంవత్సరాలు
కనిష్ట పాలసీ వ్యవధి: 10 సంవత్సరాలుగా
గరిష్ట పాలసీ కాలవ్యవధి: 20 ఏళ్లు
గరిష్ట మెచ్యూరిటీ వయస్సు: 70 ఏళ్లు
కనిష్ట పెట్టుబడి: రూ. 75,000
గరిష్ట పెట్టుబడి: రూ.3000

LIC ఆధార్ శిలా పథకం ప్రయోజనాలు:

మెచ్యూరిటీ బెనిఫిట్: పాలసీదారు పూర్తి కాల వ్యవధిని ఎంచుకుంటే ఎక్కువ మెచ్యూరిటీ ప్రయోజనం పొందుతారు. ఈ ఏకమొత్తాన్ని కొత్త పాలసీ(LIC Policy)లో మళ్లీ పెట్టుబడి పెట్టవచ్చు.
డెత్ బెనిఫిట్: బీమా చేసిన వ్యక్తి అకాల మరణం సంభవించినట్లయితే, పాలసీ నామినీకి ప్రయోజనం చెల్లించబడుతుంది.
గ్యారెంటీడ్ సరెండర్ విలువ: పాలసీదారులు రెండు వరుస పాలసీ సంవత్సరాలను పూర్తి చేసిన తర్వాత తమ పాలసీని సరెండర్ చేయడానికి ఎంచుకోవచ్చు. గ్యారెంటీ సరెండర్ విలువ పాలసీ వ్యవధిలో చెల్లించిన మొత్తం ప్రీమియంకు సమానంగా ఉంటుంది.
లోన్ బెనిఫిట్: పాలసీ సరెండర్ విలువను సాధించిన తర్వాత, పెట్టుబడిదారు రుణ ప్రయోజనాలను పొందవచ్చు.
ప్రీమియం చెల్లింపు: ప్రీమియం చెల్లింపు వ్యవధి పాలసీ వ్యవధితో సమానంగా రూపొందించారు. వార్షిక, నెలవారీ, త్రైమాసిక లేదా అర్ధ-వార్షిక పద్ధతులతో సహా వివిధ చెల్లింపు ఫ్రీక్వెన్సీలను అందిస్తుంది.

Fruits for Cholesterol: వేసవిలో ఒంట్లో కొవ్వును వెన్నలా కరిగించే పండ్లు.. మర్చిపోకుండా తినాలంటున్న నిపుణులు

అధిక కొలెస్ట్రాల్ ‘సైలెంట్‌ కిల్లర్’ వంటిది. ఇది మెల్లగా ప్రాణాన్ని హరిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే మందులు తప్పక తీసుకోవాలి. అలాగే అధిక కొవ్వు, అధిక కేలరీల ఆహారాలు అస్సలు తీసుకోకూడదు. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినాలి. అందుకే కొలెస్ట్రాల్ రోగుల ఆహారంలో ధాన్యాలు ఎక్కువగా చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. అయితే ఈ వేసవిలో ధాన్యాలు మాత్రమే తింటే సరిపోదు.. ఈ కింది వేసవి పండ్లను కూడా మీ రోజువారీ ఆహారంలో చేర్చితే శరీరంలో కొవ్వు ఇట్టే కరిగిపోతుంది.

మామిడిపండ్లు
వేసవిలో లభించే మామిడి పండ్లు తినడం ద్వారా కూడా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. మామిడిలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలు, ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. మామిడి పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

పుచ్చకాయ
వేసవి పుచ్చకాయల సీజన్. తక్కువ క్యాలరీలు, నీరు ఎక్కువగా ఉండే ఈ పండు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. పుచ్చకాయలో లైకోపీన్ ఉంటుంది. ఇది అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

ద్రాక్ష
వేసవిలో ద్రాక్షను ఎక్కువగా తినాలి. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంతో పాటు శరీరంలోని వాపులను తగ్గిస్తాయి. అంతేకాకుండా ద్రాక్షలో అధిక మొత్తంలో ఫైబర్, విటమిన్లు ఉంటాయి.

జామ
ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న జామ LDL కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, ఈ పండులో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది, ఇది అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

ఎండుద్రాక్ష
ఎండుద్రాక్షలో పాలీఫెనాల్స్ మరియు ప్యూనికాలాజిన్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి, ఇవి ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ఎండుద్రాక్ష గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఈ పండులో ఫైబర్, విటమిన్లు కూడా ఉంటాయి.

పండిన బొప్పాయి
పండిన బొప్పాయిలో పపైన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం అందిస్తుంది. అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. పండిన బొప్పాయిలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇది మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

యాపిల్స్
కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో యాపిల్స్ ఉత్తమం. ఈ పండ్లలో కరిగే ఫైబర్ ‘పెక్టిన్’ ఉంటుంది. ఇది LDL కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. యాపిల్స్‌లో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

అరటిపండు
ప్రతిరోజూ ఒక అరటిపండు తినడం వల్ల అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ నుంచి బయటపడవచ్చు. అరటిపండులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

AP Elections: సీన్‌లోకి చిరంజీవి…video released. వార్ వన్‌సైడేనా..!

ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. గెలుపు కోసం పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటిగా ఉంది. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఎన్డీయే కూటమి, మెగా ఫ్యామిలీ కష్టపడుతుంటే.. పవన్‌ను ఓడించే లక్ష్యంతో వైసీపీ వ్యూహలు రచిస్తోంది. ఈక్రమంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అన్నయ్య చిరంజీవి రంగంలోకి దిగారు. తమ్ముడిని గెలిపించాలంటూ ఓ ఎమోషనల్ వీడియోను రిలీజ్ చేశారు. దీంతో జనసైనికుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. చిరంజీవి బహిరంగంగా తమ్ముడిని గెలిపించాలంటూ వీడియో రిలీజ్ చేయడంతో మెగాస్టార్ కూటమికి మద్దతు ఇస్తున్నారనే సంకేతాలు వెలువడినట్లైంది. ఇప్పటివరకు బహిరంగంగా ఎవరికి మద్దతు అనేదానిపై చిరంజీవి స్పందించలేదు. తొలిసారి తన తమ్ముడిని గెలిపించాలంటూ పిఠాపురం ఓటర్లను చిరంజీవి కోరారు.

ఎమోషనల్ వీడియో..

తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గొప్పతనాన్ని వివరిస్తూ చిరంజీవి వీడియో రిలీజ్ చేశారు. అమ్మ కడుపులో ఆఖరివాడిగా పుట్టినా.. అందరికీ మంచి చేయాలి.. మేలు జరగాలి అనే విషయంలో ముందువాడిగా పవన్ కళ్యాణ్ ఉంటాడని చిరంజీవి తెలిపారు. తనకంటే జనం గురించి ఎక్కువుగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడి కళ్యాణ్‌బాబుది అంటూ చెప్పారు. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారని.. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టారన్నారు. సరిహద్దుల దగ్గర ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడే జవాన్ల కోసం పెద్ద మొత్తంలో సాయం చేయడంతో పాటు.. అనేక మందికి ఎందరికో పవన్ కళ్యాణ్ చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనానికి కావాల్సింది అనిపిస్తుందని వీడియో చిరంజీవి తెలిపారు. ఒక రకంగా చెప్పాంలటే సినిమాల్లోకి బలవంతంగా వచ్చాడని.. రాజకీయాల్లోకి ఇష్టంతో మాత్రమే వచ్చాడన్నారు.

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. ముద్రగడ ముఖ్య అనుచరుల రివర్స్

xr:d:DAF7VKhaV6Q:1515,j:6237910196473995995,t:24041306

ఏపీలో ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులో పోటీ చేస్తున్నాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సింగిల్‌గానే ఎన్నికలకు వెళుతోంది. అయితే కూటమిలో భాగంగా ఈసారి జనసేన ప్రత్యక్షంగా ఎన్నికల్లో ఉండటంతో కాపులు ఓట్లు ఎటు పడతాయనే చర్చ ఆసక్తికరంగా మారింది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ముద్రగడ పద్మనాభం కుమార్తె జనసేనకు సపోర్టు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే కాపు రాజకీయాల్లో పెను మార్పుల చోటు చేసుకోబోతోన్నాయి. కాపు సామాజిక వర్గం నుంచి ముద్రగడ పద్మనాభానికి బిగ్ షాక్ తగిలింది. ముద్రగడ పద్మనాభం ముఖ్య అనుచరులు విజయవాడలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాపు, బలిజ, ఒంటరి కుల సంఘాల నేతలు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి మద్దతు ఇవ్వాలని తీర్మానం చేశారు. ఇంతకాలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఈ సంఘాల నేతలు అనూహ్యంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ముద్రగడ పద్మనాభానికే కాకుండా అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా భారీ నష్టం కలిగే అవకాశాలున్నాయి.

ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కాపు ఎమ్మెల్యేలకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. తన కేబినెట్‌లో మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అయితే కులాన్ని కించపర్చేలా సొంత నేతలే మాట్లాడటం కాపులు రుచించుకోలేకపోయారు. కాపు జాతి నుంచి పవన్ లాంటి స్టార్ ఉంటే కులాన్ని కించపర్చడం సరికాదని చాలా మంది కాపు నేతలు లోలోపల మథన పడ్డారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్‌కు చేరింది. అటు సర్వేల్లో కూటమికే అధికారం ఖాయంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముద్రగడతో పాటు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కాపు, బలిజ, ఒంటరి కుల సంఘాల నేతలు ఝలక్ ఇచ్చారు.

Health

సినిమా