Home Loans: రూ. 50లక్షల వరకూ సులభంగా లోన్.. సొంతింటి కల ఇలా నెరవేరుతుంది..

సొంత ఇంటిని సమకూర్చుకునే ప్రయత్నంలో భాగంగా ప్రతి ఒక్కరూ ముందుగా హోమ్ లోన్ల గురించే ఆలోచిస్తారు. ముఖ్యంగా బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుంటారు. ఇదే సురక్షితమైన, లాభదాయకమైన మార్గం కూడా. అయితే అన్ని బ్యాంకులు ఒకే రకమైన వడ్డీ రేటును వసూలు చేయవు. వాటి నిబంధనల ప్రకారం మారుతూ ఉంటాయి. ఉద్యోగం, వ్యాపారం, చదువు తదితర కారణాలతో పల్లెటూర్ల నుంచి పట్టణాలకు వలసలు ఎక్కువయ్యాయి. చాలా మంది తమ సొంతూళ్లను వదిలి నగరాల బాట పడుతున్నారు. మంచి ఉద్యోగం, లాభదాయకమైన వ్యాపారం, నాణ్యత కలిగిన చదువుల కోసం ఈ మార్పు తప్పడం లేదు. ఇలా నగరాలకు వెళ్లిన వారి మొదటి ప్రాధాన్యం సొంతిల్లు సమకూర్చుకోవడమే. దానికోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

సొంతింటికి ప్రాధాన్యం..
సొంతిల్లు అనేది మన ఆర్థిక స్థిరత్వాన్ని, క్రమశిక్షణను సూచిస్తుంది. పెళ్లి చేసుకునే యువకులకు ఉద్యోగం తర్వాత ప్రధాన అర్హతగా సొంతింటిని చూస్తున్నారు. సరైన ఉద్యోగం, సక్రమమైన ఆదాయం కలిగి ఉంటే సొంతింటిని సమకూర్చుకోవడం సులభమేనని చెప్పవచ్చు. ఎందుకంటే వివిధ బ్యాంకులు అర్హత కలిగిన వారికి హోమ్ లోన్లను మంజూరు చేస్తున్నాయి. ప్రతినెలా ఈఎమ్ఐలు చెల్లించేలా రుణాలు ఇస్తున్నాయి.

బెస్ట్ బ్యాంకులు ఇవే..
నగరాలలో సొంత ఫ్లాట్ లేదా ఇల్లు సమకూర్చుకోవాలంటే దాదాపు రూ.50 లక్షలు అవసరం. ఈ నేపథ్యంలో రూ.50 లక్షల లోపు హోమ్ లోన్లు అందించే ఏడు ప్రధాన బ్యాంకుల గురించి తెలుసుకుందాం. అవి వసూలు చేస్తున్న వడ్డీరేట్లు, ప్రాసెసింగ్ ఫీజులనూ పరిశీలిద్దాం.

బ్యాంకు ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు హోమ్ లోన్లను మంజూరు చేస్తుంది. దాదాపు రూ.50 లక్షల వరకూ అందిస్తోంది. ఆ రుణాలపై దాదాపు 8.30 శాతం వడ్డీ విధించింది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా హోమ్ లోన్లు తీసుకునే అవకాశం ఉంది. ఈ బ్యాంకులో వడ్డీ రేటు 8.35 శాతంగా ఉంది.
హోమ్ లోన్లపై బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర లో 8.35 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు. దాదాపు రూ.50 లక్షల వరకూ రుణం మంజూరు చేస్తున్నారు. ఈ రుణాలపై జీరో ప్రాసెసింగ్ ఫీజు అమలవుతోంది.
సౌత్ ఇండియన్ బ్యాంక్ కూడా అర్హత కలిగిన వారికి హోమ్ లోన్లు మంజూరు చేస్తుంది. ఈ బ్యాంకు ఇచ్చిన రుణాలపై 8.35 శాతం వడ్డీరేటు విధించింది. అలాగే జీఎస్టీ తో పాటు 0.50 శాతం ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తుంది.
కెనరా బ్యాంకులో హోమ్ లోన్లు తీసుకునే వీలు ఉంది. ఈ బ్యాంకు ఇచ్చిన రుణాలపై 8.40 శాతం వడ్డీని వసూలు చేస్తుంది. దీనికి అదనంగా 0.50 శాతం ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.
సొంతింటి కోసం ఐడీబీఐ బ్యాంకు రూ.50 లక్షల వరకూ రుణాన్ని మంజూరు చేస్తుంది. ఈ బ్యాంకులో వడ్డీరేటు 8.40 శాతంగా ఉంది. అలాగే ప్రాసెసింగ్ ఫీజుగా 0.50 శాతం వసూలు చేస్తుంది.
హెచ్ఎస్ బీసీ బ్యాంకులో హోమ్ తీసుకుంటే 8.45 శాతం వడ్డీ రేటు ఉంటుంది. ఒకశాతం ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *