Friday, November 15, 2024

IPLలో అట్టర్ ఫ్లాప్.. అయినా వరల్డ్ కప్ టీమ్​కు వైస్ కెప్టెన్.. హార్దిక్​పై నమ్మకానికి కారణాలివే!

టీ20 వరల్డ్‌ కప్ జట్టు ప్రకటన గురించి క్రికెట్ అభిమానులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. టీమిండియా అనే కాదు ఇతర జట్ల విషయంలోనూ అందరిలోనూ ఎగ్జయిట్​మెంట్ నెలకొంది.

అయితే భారత జట్టు ఎంపిక మాత్రం ఇతర టీమ్స్ కంటే ఇంకా ఎక్కువ అటెన్షన్ తీసుకుంది. దీనికి కారణం ప్రస్తుత క్రికెట్​లోని టాప్ స్టార్స్​లో ఎక్కువ మంది టీమిండియాలో ఉండటమే. నిన్నటి నుంచి వరల్డ్ కప్ స్క్వాడ్స్ ప్రకటన మొదలైంది. తొలుత న్యూజిలాండ్, ఆ తర్వాత సౌతాఫ్రికా, అనంతరం ఇంగ్లండ్ తమ ప్రపంచ కప్ జట్లను ప్రకటించాయి. పొట్టి కప్పులో ఆడే భారత జట్టు ఏదో కూడా ఇవాళ క్లారిటీ వచ్చేసింది. బీసీసీఐ టీ20 వరల్డ్ కప్ టీమ్​ను అనౌన్స్ చేసింది. అయితే ఆ జట్టుకు హార్దిక్ పాండ్యాను వైస్ కెప్టెన్ చేయడంతో అందరూ షాకయ్యారు.

భారత వరల్డ్ కప్ జట్టులో మిగతా వాళ్ల సెలెక్షన్ ఎలా ఉన్నా హార్దిక్ వైస్ కెప్టెన్సీ అంశమే ఇప్పుడు హాట్ టాపిక్​గా మారింది. చెత్తాటతో విమర్శల పాలవుతున్న అతడు.. ప్రపంచ కప్ జట్టులో ఉంటాడా? లేదా? కూడా అనుమానంగా మారింది. ఈ ఐపీఎల్​లో హార్దిక్ 9 మ్యాచుల్లో 197 రన్స్ చేసి 4 వికెట్లే తీశాడు. దీంతో అతడు అక్కర్లేదు.. ఆ ప్లేసులో ఇతర యంగ్​స్టర్స్​కు అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో టీమ్ అనౌన్స్​ చేసిన బీసీసీఐ.. పాండ్యాను జట్టులోకి తీసుకుంది. అతడికి బెర్త్ ఇవ్వడమే గాక ఏకంగా వైస్ కెప్టెన్​గానూ ప్రమోషన్ ఇచ్చింది. దీంతో బోర్డు ఎందుకిలా చేసింది? బీసీసీఐ పెద్దలకు అసలు ఏమైంది? ఏం చూసి హార్దిక్​కు ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నారు? టీమ్​లో చోటు ఇవ్వడమే గొప్ప అంటే ఇంకా వైస్ కెప్టెన్సీ కూడానా? అంటూ విమర్శకులు విరుచుకుపడుతున్నారు. అయితే నిశితంగా గమనిస్తే హార్దిక్ మీద బోర్డు నమ్మకం ఉంచడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి.

గత కొన్నేళ్లుగా టీమ్​లో హార్దిక్ రెగ్యులర్ ప్లేయర్ అనేది తెలిసిందే. గాయాలతో దూరమైనప్పుడు తప్పితే ప్రతి సిరీస్​లోనూ అతడు టీమ్​లో భాగంగా ఉన్నాడు. సింగిల్ హ్యాండ్​తో భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్​లో హ్యూజ్ ఎక్స్​పీరియెన్స్ ఉండటం అతడికి ప్లస్ అయింది. ఒత్తిడిలోనూ ఎలా ఆడాలో పాండ్యాకు తెలిసి ఉండటం కలిసొచ్చింది. గతంలో ప్రెజర్ సిచ్యువేషన్స్​లో నుంచి టీమ్​ను ఒడ్డున పడేసిన ట్రాక్ రికార్డు ఉండటం సెలెక్టర్లకు మరింత భరోసాను ఇచ్చింది. రోహిత్​ వారసుడిగా ఫ్యూచర్ టీ20 టీమ్ కెప్టెన్​గా ముందు నుంచి అతడ్ని ప్రిపేర్ చేశారు. అందుకే ఐపీఎల్​లో ఫెయిలైనా హార్దిక్​పై నమ్మకం ఉంచి ప్రపంచ కప్ జట్టులో చోటు కల్పించారు. పాండ్యా మీద కోచ్ ద్రవిడ్, బీసీసీఐ పెద్దలకు ఉన్న గురి కారణంగా అతడికి వైస్ కెప్టెన్సీ పోస్ట్ దక్కింది.

Lifestyle: పొట్ట చుట్టూ కొవ్వు పెరుగుతోందా.? ఉదయాన్నే ఈ డ్రింక్స్ తాగండి

మారుతోన్న జీవన విధానం తీసుకుంటున్న ఆహారంలో మార్పు. శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోవడం కారణం ఏదైనా. పొట్ట చుట్టూ కొవ్వు సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి బయటపడాలంటే తీసుకునే ఆహారంలో మార్పులు చేయాలని, వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తారని తెలిసిందే. సాధారణంగా పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం ప్రారంభిస్తే, గుండె జబ్బులు, రక్తంలో చక్కెర పెరగడం, స్ట్రోక్, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలకు కూడా దారితీసే అవకాశాలు ఉంటాయి. అయితే కొన్ని రకాల డ్రింక్స్‌ను తీసుకుంటే పొట్ట చుట్టూ కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. ఇంతకీ ఆ డ్రింక్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* పొట్టు చుట్టూ కొవ్వును తగ్గించడానికి జీలకర్ర నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఒక గ్లాసు నీటిలో రెండు చెంచాల జిలకర్రను వేసి రాత్రంతా నానబెట్టాలి. అనంతరం ఉదయం లేవగానే ఈ నీటిని తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఇందులో నిమ్మరసం కూడా ఇందులో కలుపుకోవచ్చు. రెండు వారాల పాటు ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగితే పొట్ట కొవ్వు తగ్గడం ప్రారంభమవుతుంది.

* బరువు పెరగకుండా ఉండేందుకు అల్లం నీరు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఒక గ్లాసు నీటిలో ఒక అంగుళం అల్లం ముక్కను వేసి మరిగించాలి. ఈ నీటిని రోజుకు రెండుసార్లు తీసుకుంటే సరిపోతుంది. ఇలా క్రమం తప్పకుండా తీసుకుంటే కొవ్వు క్రమంగా తగ్గిపోతుంది.

* దాల్చిన చెక్క నీరు కూడా బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఒక గ్లాసు నీటిని తీసుకొని అందులో దాల్చిన చెక్కపొడిని వేయాలి. అలా మరిగించిన నీటిని ప్రతీ రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే బరువు తగ్గడాన్ని గమనించవచ్చు.

May Day: నేడే మేడే.. ఇంతకు మేడే అంటే ఏమిటి..? మేడే ఎప్పట్నుంచి స్టార్టయ్యింది??

May Day Celebrations: నేడు మేడే.. ఈ సందర్భంగా కార్మికులకు ప్రముఖులు మేడే శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నేడు కార్మికులు మేడేను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే, మేడే అంటే ఏమిటి.. మేడే ఎప్పట్నుంచి స్టార్ట్యయ్యింది? అనే సందేహాలు చాలా మందికి ఉంటాయి.. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు..

అయితే.. 1886, మే 1న షికాగోలోని హే మార్కెట్లో కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. కార్మికులకు 8 గంటల పని విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నాడు జరిగిన ఈ ఉద్యమానికి మద్దతుగా నాలుగు రోజుల తర్వాత షికాగోలోని హే మార్కెట్ లోనే భారీ ప్రదర్శన నిర్వహించారు. ఆ ఉద్యమం ఉద్రిక్తంగా మారింది. ఉద్యమం ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసులు కాల్పులు జరపడంతో అనేకమంది కార్మికులు తమ ప్రాణాలను కోల్పోయారు. అయితే, ఈ మారణకాండను నిరసిస్తూ అనేక దేశాల్లో ఉద్యమాలు నిర్వహించారు. షికాగోలోని హే మార్కెట్లో ప్రాణాలర్పించిన కార్మికులను స్మరించుకుంటూ ప్రతి ఏటా మే 1న కార్మిక దినోత్సవంగా జరపుకుంటున్నారు. 1923 నుంచి ఇండియాలో మేడేను నిర్వహిస్తున్నారు. మేడేను ప్రతి ఏటా కార్మికులు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. కార్మికుల ప్రాణత్యాగాలను నేడు గుర్తుచేసుకుంటారు. ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించి కార్మికుల ఐక్యతను చాటుతారు. నేడే మేడే అనే పాటలను ఈ సందర్భంగా ఆలపిస్తుంటారు.

ఈ మేడే.. ఎన్నో ప్రజా ఉద్యమాలను స్మరించుకునేలా చేస్తుంది. ఎంతోమంది కార్మికులు పోరాటాలు చేసి, తమ రక్తాలను చిందించి కార్మిక హక్కులను సాధించారు. అందులో ముఖ్యంగా 8 గంటల పని. ఒకప్పుడు కార్మికులు విశ్రాంతి లేకుండా పని చేయాల్సి వచ్చేది. ఈ క్రమంలో కార్మికులంతా కలిసి ఈ వెట్టిచాకిరి మేం చేయలేమంటూ ఎదురించి పోరాడి 8 గంటల పని విధానాన్ని తీసుకొచ్చారు. ఇది కార్మికులు సాధించిన విజయం.

మేడే సందర్భంగా కార్మికులకు ప్రముఖులు, రాజకీయ నేతలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మేడే ఉద్దేశాన్ని నిర్వచిస్తూ, కార్మికుల గొప్పతనాన్ని తెలియజేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Horse Gram Health Benefits: ఉలవలతో కరుగును రాళ్లు..! ఎంత పనిచేసినా అలసట రావొద్దంటే వీటిని తినండి

ఉలవలను ఉడికించి లేదా మొలకెత్తించి కూడా తీసుకోవచ్చు. ఇవి అనేక రోగాలను నివారిస్తాయి. శరీరంలోని గ్లూకోజ్ ను అదుపు చేయడంలో ఉలవలు ఎంతో మేలు చేస్తాయి.

ఇదే కాదు ఉలవలు బీపీని కూడా అదుపులో ఉంచుతాయి. రక్తహీనతతో బాధపడేవారు తరచూ ఉలవలను కషాయంగా కాని, చారు రూపంలా గాని తీసుకుంటే శరీరంలో కొత్త రక్తం వస్తుంది. ఉలవల్లో ప్రొటీన్లు అధికంగా ఉన్నాయి. ఇవి శరీరానికి శక్తిని ఇచ్చి నీరసం, నిసత్తువను తగ్గిస్తాయి. ఎదిగే పిల్లలకు వారి శరీర నిర్మాణం చక్కగా ఉండేందుకు ఉలవలు ఎంతో మేలు చేస్తాయి.

కిడ్నీలో రాళ్లను నయం చేయడానికి ఉలవలను ఉపయోగించవచ్చు. ఇది ఫినోలిక్ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్లు, స్టెరాయిడ్లు మరియు సపోనిన్లు వంటి అనేక ఫైటోకెమికల్స్‌ను కలిగి ఉంటుంది. కిడ్నీ సమస్యలను నివారించడంలో ఉలవలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. వీటిలోని పోషకాలు కిడ్నీ రాళ్లు ఏర్పడకుండా కాపాడతాయి. రోజూ ఉదయాన్నే ఉలవల నీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని మూత్రపిండాల్లో రాళ్లు తొలగిపోతాయి.

పెరిగే పిల్లలకు ఉలవలు తినిపిస్తే చాలా మంచిది. ఇవి పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలలో సహాయపడతాయి. వారిని బలంగా ఉంచుతాయి. తరచూ ఎక్కిళ్లు వస్తుంటే ఉలవలు తీసుకోవడం చాలా మంచిది. ఉలవలు తినడం ద్వారా ఎక్కిళ్లు రాకుండా ఉంటాయి. బరువు ఎక్కువగా ఉన్నవారు ఉలవలు తింటే చాలా మంచిది. వీటిలోని ఫైబర్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగించడంలో సహాయపడుతుంది. తద్వారా బరువు నియంత్రణలో ఉంచుతుంది.

ఉలవల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది పేగు కండరాల కదలికల్ని మెరుగుపరుస్తుంది. తద్వారా మలం సాఫీగా వచ్చేలా చేసి మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. ఓ కప్పు ఉలవ చారుకు సమానంగా కొబ్బరి నీళ్లు తీసుకుంటే మూత్రంలో మంట నుంచి ఉపశమనం పొందవచ్చు. తరచూ మూత్రంలో మంటతో బాధపడేవారు ఈ చిట్కా ట్రై చేయండి.

రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొవ్వులను కరిగించడంలో ఉలవలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. తద్వారా గుండెకు రక్తసరఫరా మెరుగుపర్చి హృదయ సంబంధ సమస్యలు రాకుండా కాపాడతాయి. జ్వరంతో పాటు ఆయాసం, దగ్గు వంటి సమస్యలు ఉన్నవారు ఉలవల కషాయం తాగడం మంచిది. ఈ కషాయం జ్వరం, దగ్గు వంటి సమస్యలను తగ్గిస్తుంది.

ఉలవలు శరీరంలో ఉన్న వేడిని హరిస్తాయి. వాతం, శ్వాస, మూలవ్యాధి, ఖఫం తగ్గించడం వంటి వాటికి ఉలవలు ఎంతో ఉపయోగపడతాయి. రుతు సమస్యలను నివారిస్తుంది. ఉలవలలోని ఐరన్, ఫాస్ఫరస్ ఎనీమీయాను నివారిస్తాయి. ఇందులోని కాల్షియం ఎముకులకు, కండరాలకు శక్తినిస్తుంది. ఇక ఇందులోని ఫైబర్ మలబద్దకం రాకుండా అడ్డుకుంటుంది.

అశ్లీల వీడియోల రచ్చ..ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ సస్పెన్షన్‌ వేటు..

లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటకలోని హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోల కేసు కలకలం రేపుతోంది. మాజీ ప్రధాని దేవేగౌడ పెద్ద కుమారుడు హెచ్‌ఆర్‌ రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్‌ రేవణ్ణ వ్యవహారంపై కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆందోళన ఉధృతం చేశారు. జేడీఎస్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ప్రజ్వల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ జేడీఎస్‌ కోర్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. షోకాజ్‌ నోటీసులు కూడా జారీ చేసింది. మరోవైపు ఈ వివాదం వెనక కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ హస్తం ఉందని ప్రజ్వల్ బాబాయ్, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌.డి. కుమారస్వామి ఆరోపించారు. వీడియోలు ప్రజ్వల్‌వేనన్న ఆధారాలు ఎక్కడున్నాయని ఆయన ప్రశ్నించారు. వీడియో క్లిప్పులు ఉన్న పెన్‌డ్రైవ్‌లు ఎక్కడి నుంచి వచ్చాయని, ఎవరు పంపిణీ చేశారనే విషయాలపైనా దర్యాప్తు సాగాలని కుమారస్వామి డిమాండ్‌ చేశారు. వీడియోల పంపిణీ వెనుక ఉన్నదెవరో తేలాలన్నారు. ప్రజ్వల్‌పై అభియోగాలు వాస్తవమని తేలితే చట్టప్రకారం శిక్ష తప్పదన్న కుమారస్వామి ఈ కేసుతో తన తండ్రి దేవేగౌడకు, తనకూ ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

మరోవైపు జర్మనీకి పారిపోయిన ప్రజ్వల్‌ రేవణ్ణను భారత్‌కు తీసుకొస్తామని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్‌ ఈ దిశగా చర్యలు ప్రారంభించింది. వీడియోలకు సంబంధించిన పెన్‌డ్రైవ్‌లను అధికారులు ఫోరెన్సిక్‌ విభాగానికి పంపడంతో పాటు మిగిలిన ఆధారాలను సేకరిస్తారు. రెండు వారాల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని ప్రభుత్వం సిట్‌కు గడువు విధించింది.

ఎన్నికల వేళ ఈ వ్యవహారం జేడీఎస్‌ ప్రతిష్ఠను దెబ్బతీయడంతో పాటు ఆ పార్టీతో పొత్తులో ఉన్న బీజేపీకి ఇబ్బందికర పరిణామంగా మారింది. ఈ వ్యవహారానికి దూరంగా ఉంటున్నారు కమలనాథులు. నాలుగో దశలో భాగంగా ఉత్తర కర్ణాటకలో మే7న పోలింగ్‌ జరగనుంది.

TTD: “గోవింద కోటి” రాసిన బెంగుళూరుకు చెందిన కీర్తన, విఐపి బ్రేక్ లో శ్రీవారి దర్శనం

TTD: మొట్టమొదటిసారిగా “గోవింద కోటి”ని రాసిన విద్యార్థిని కీర్తనకు మంగళవారం ఉదయం టిటిడి శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పించింది. బెంగుళూరుకు చెందిన ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కుమారి కీర్తన 10 లక్షల ఒక వెయ్యి 116 సార్లు గోవింద కోటిని రాసింది.

ఈ సందర్భంగా కీర్తన మీడియాతో మాట్లాడుతూ, తమ పెద్దలు, ఊరివారు చిన్నతనం నుండి రామకోటి రాయడం చూసేదానినన్నారు. మా కులదైవము అయినా శ్రీ వేంకటేశ్వరస్వామి అనుగ్రహంతో గోవింద కోటి రాసే అవకాశం తనకు కలగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. 2023 నవరాత్రుల నుండి గోవింద కోటిని రాయడం ప్రారంభించినట్లు చెప్పారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం గోవింద కోటిని భక్తిశ్రద్ధలతో రాసినట్లు తెలిపారు.

చిన్నతనం నుండి శ్రీ వేంకటేశ్వరస్వామి వారిపై అచంచలమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయని, స్వామి అనుగ్రహంతోనే తాను తక్కువ సమయంలో 10 లక్షల మార్లు గోవింద కోటి రాయగలిగినట్లు చెప్పారు. గోవింద కోటి రాస్తున్న సమయంలో తాను సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్న అనుభూతి కలిగిందని వివరించారు.

విద్యార్థులు, చిన్న పిల్లలు, యువతి యువకులలో ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు గోవింద కోటి రాసే బృహత్తర కార్యక్రమాన్ని టిటిడి ప్రవేశపెట్టిన విషయం విదితమే. ఇందులో భాగంగా 10 లక్షల 1,116 సార్లు గోవింద కోటి రాసిన వారికి మాత్రమే శ్రీవారి బ్రేక్ దర్శనం, కోటి సార్లు గోవిందా కోటి రాసిన వారికి, వారితో పాటు, వారి కుటుంబ సభ్యులకు బ్రేక్ దర్శనం కల్పించాలని టిటిడి నిర్ణయించింది.

Vastu Tips: మీ పరుసులో ఈ ఐదు వస్తువులు ఉంటే లక్ష్మీ దేవి మీ వెంట ఉన్నట్లే..

Vastu Tips: వాస్తు ప్రకారం వస్తువులను ఉంచినట్లయితే, అవి శుభ ఫలితాలను ఇస్తాయి. ఇది కాకుండా, మీరు ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతుంటే, వాస్తు శాస్త్రంలో దీనికి కొన్ని పరిష్కారాలు కూడా ఉంటాయి. కొన్ని వస్తువులను మీ పర్సులో ఉంచుకుంటే, లక్ష్మీ దేవి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి, ఆర్థిక సమస్యలు దూరం అవుతాయట. వాస్తు శాస్త్రంలో ఈ విషయాలు చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. లక్ష్మీదేవి నాణెం

వాస్తు శాస్త్రం ప్రకారం, మీ పర్సులో లక్ష్మీ దేవి యొక్క నాణెం ఉంచుకుంటే, అది సంపదను ఆకర్షిస్తుంది. లక్ష్మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయి. మీ పర్సులో వెండి లేదా రాగి నాణేన్ని ఉంచుకోవచ్చు. నాణెం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలని గుర్తుంచుకోండి.

2. పసుపు ముద్ద

పసుపు ముద్ద చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. వాస్తు శాస్త్రంలో ఇది సానుకూలతకు చిహ్నంగా పరిగణిస్తారు. మీ పర్సులో పసుపు ముద్దను ఎర్రటి గుడ్డలో చుట్టి ఉంచడం వల్ల అదృష్టం, ప్రతికూలతను దూరం చేస్తుంది.

3. కుబేర్ యంత్రం

కుబేరుడిని సంపద దాత అంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం, కుబేరు యంత్రాన్ని పసుపు గుడ్డలో చుట్టి పర్సులో ఉంచుకోవడం వల్ల ఆనందం, శ్రేయస్సు, సంపదలు లభిస్తాయి. ఇది ఆర్థిక సమస్యలను కూడా పరిష్కరిస్తుంది.

4. ఉప్పు

పర్సులో ఉప్పు ఉంచుకోవడం శుభప్రదం. ఉప్పు చెడు కన్ను నుండి రక్షిస్తుంది. సానుకూలతను ఆకర్షిస్తుంది. ఒక చిన్న కాగితంలో ఉప్పు ముక్కను చుట్టి పర్సులో ఉంచుకోవచ్చు.

5. శ్రీ యంత్రం

పర్స్‌లో శ్రీ యంత్రాన్ని ఉంచుకోవడం ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. మత విశ్వాసాల ప్రకారం, సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఇక్కడ నివసిస్తుంది. కుంభర్ యంత్రాన్ని ఎర్రటి గుడ్డతో చుట్టి పర్సులో ఉంచుకోవడం వల్ల ఆనందం, శ్రేయస్సు, విజయం లభిస్తాయి.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం సామాజిక, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. MannamWeb.com దీనిని ధృవీకరించలేదు. దీని కోసం నిపుణుల సలహా తీసుకోండి.

AP Politics: రానున్న ఎన్నికల్లో వీరిదే విజయం.. ప్రముఖ సర్వే సంస్థ..

రైజ్ సర్వే సంస్థ తాజాగా వెల్లడించిన ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి స్పష్టమైన ఆధిక్యత సాధించనుంది.

సంస్థ నిర్వాహకుడు పుల్లెట ప్రవీణ్ మంగళ వారం వెల్లడించిన ఫలితాల ప్రకారం.. కూటమి పార్టీలు 108 నుంచి 120 వరకు స్థానాల్లో గెలువనున్నాయని తెలుస్తోంది.

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 41 నుంచి 54 స్థానాల లోపే పరిమితం కానుందని సర్వే సంస్థ వెల్లడించింది. అలానే 43 స్థానాల్లో హోరాహోరీ పోరు జరుగనుందని తెలిపింది. ఒక్క స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ దక్కించుకోనుందని సర్వే సంస్థ పేర్కొంది. కూటమి పార్టీలకు 51% రానుండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 44 శాతానికి పరిమితం కానుందని తాజా సర్వేలో తేలింది.

ఒక్క రాయలసీమలో మినహా మిగతా అన్ని రీజన్లోనూ కూటమి ఆధిక్యం ప్రదర్శిస్తోంది. లోక్ సభ స్థానాల్లో కూటమికి 18 స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నాయని సంస్థ వెల్లడించింది.

Viral news : King Fisher Beers: లైట్ బీర్ల పొరాటంలో విజయం.. సన్మానించిన మందుబాబులు

King Fisher Beers: లైట్ బీర్ల పొరాటంలో విజయం సాధించాడు తాగుబోతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు. మంచిర్యాల జిల్లాలో తాగుబోతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొట్రంగి తరుణ్ బీర్ల కోసం చేసిన పోరాటంలో విజయం సాధించారు.

మంచిర్యాలలోని పలు వైన్ షాప్‌లలో, బార్లలో కింగ్ ఫిషర్ లైట్ బీర్లు అందుబాటులో లేకపోవడంతో నిన్న(సోమవారం) జిల్లా ఎక్సైజ్ అధికారికి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే తమకు బీర్లు అందుబాటులో లేకపోవడం ఇబ్బందిగా మారిందని లెటర్ ప్యాడ్ మీద రాతపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. దీంతో స్పందించిన అధికారులు తెల్లారేసరికి వైన్స్, బార్లలో కింగ్ ఫిషర్ లైట్ బీర్లు అందుబాటులో ఉంచారు. పలు వైన్స్, బార్లు తిరుగుతున్న తరుణ్‌ను మందుబాబులు అభినందించి శాలువాతో సన్మానించారు. 24 గంటల్లో తమ డిమాండ్ ను నెరవేర్చడంతో తాగుబోతుల సంఘం హర్షం వ్యక్తం చేసింది.

Bank Holiday On May 1: మే 1న బ్యాంకులు మూసి ఉంటాయా? ఉండవా?

భారతదేశంలో మహారాష్ట్ర ఏర్పడినందుకు గౌరవసూచకంగా మే 1న మహారాష్ట్ర దినోత్సవంగా జరుపుకుంటారు. 1960లో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించిన తర్వాత అధికారికంగా రాష్ట్రం ఏర్పడిన రోజు వార్షికోత్సవాన్ని జరుపుకొంటారు. అలాగే మే 1వ తేదీని కార్మిక దినోత్సవంగా కూడా పాటిస్తారు. కార్మికులు కార్మిక ఉద్యమాన్ని గౌరవించే రోజు. ఇది కార్మికుల హక్కులు, విజయాలను గుర్తించడానికి, అలాగే న్యాయమైన వేతనాలు, మెరుగైన పని పరిస్థితులు, సామాజిక న్యాయం కోసం జరుగుతున్న పోరాటాలను హైలైట్ చేయడానికి కార్మిక మేడే జరుపుకొంటారు.

మే 1న బ్యాంకులు మూసి ఉంటాయా?

అయితే భారతదేశంతో సహా అనేక దేశాల్లో సాధారణంగా మే 1న బ్యాంకులు మూసి ఉంటాయి. దీనిని కార్మిక దినోత్సవం లేదా అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం అని పిలుస్తారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, అస్సాం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మణిపూర్, కేరళ, బెంగాల్, గోవా, బీహార్‌లలో బ్యాంకులు మూసి ఉంటాయి.

మేడే రోజు ఈ నగరాల్లో బ్యాంకులు బంద్‌

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకారం మహారాష్ట్ర దిన్/మే డే (లేబర్ డే) కోసం తిరువనంతపురం, పాట్నా, పనాజీ, నాగ్‌పూర్, ముంబై, కోల్‌కతా, కొచ్చి, ఇంఫాల్, గౌహతి, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, బేలాపూర్‌లలో బ్యాంకులు మూసివేయనున్నారు.

మహారాష్ట్ర దినోత్సవం అంటే ఏమిటి

మహారాష్ట్ర దినోత్సవం, మహారాష్ట్ర దిన్ అని కూడా పిలుస్తారు, ఇది రాష్ట్ర ఏర్పాటుకు గుర్తుగా మహారాష్ట్రలో జరుపుకునే రాష్ట్ర సెలవుదినం.

భారతీయ రాష్ట్రాలలో వివిధ పేర్లతో కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటారు కార్మిక దినోత్సవం భారతీయ రాష్ట్రాలలో వివిధ పేర్లతో జరుపుకుంటారు, అత్యంత సాధారణమైనది మే డే. హిందీలో, దీనిని కమ్గర్ దిన్ అని పిలుస్తారు. కన్నడలో కార్మికరా దినచరనేగా, తెలుగులో కార్మిక దినోత్సవం, మరాఠీలో కమ్‌గర్ దివాస్‌గా, తమిళంలో ఉజైపలర్ ధీనం, మలయాళంలో తొజిలాలి దినం, బెంగాలీలో ష్రోమిక్ దిబోష్ జరుపుకొంటారు.

దారుణం: కూతురికి తక్కువ మార్కులు వచ్చాయని కత్తితో పొడిచిన కసాయి తల్లి!

టెన్త్, ఇంటర్ రిజల్ట్స్ వస్తుంటే విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరుగులెడుతున్నాయి. ఫెయిల్ అవుతామన్న టెన్షన్ కన్నా.. ఒక వేళ పాసై.. తక్కువ మార్కులు వస్తే అమ్మ, నాన్న చేతిలో ఎన్ని తిట్లు తినాలో, ఎన్ని దెబ్బలు కాయాలో అన్న భయంతోనే బతుకుతున్నారు.

ఇక తల్లిదండ్రుల ఆగ్రహానికి, ఆవేశానికి ఇరుగింటి, పొరుగింటి వాళ్ల సూటీపోటీ మాటలు కూడా అగ్నికి ఆజ్యం పోసినట్లు అవుతుంటాయి. ఇలాంటి మాటలను భరించలేక మానసికంగా క్రుంగిపోతున్నారు ఈ టీనేజ్ విద్యార్థులు. సాధారణంగా ఆశించిన మార్కులు పిల్లలు సాధించలేకపోతే వారిని సతాయిస్తూనే ఉంటారు తల్లిదండ్రులు. వీళ్ల కన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్లతో పోల్చి చూస్తూ హేళన చేస్తూనే ఉంటారు. ఇదే తీవ్ర నిర్ణయాలకు దారి తీస్తుంటాయి.

తాజాగా మార్కులు విషయమై తల్లి కూతుళ్ల మధ్య గొడవ జరిగింది. మార్కులు తక్కువ రావడంపై వీరిద్దరి మధ్య మాటా మాటా పెరిగి.. చివరకు కత్తులతో దాడి చేసుకునేంత వరకు వెళ్లింది. ఈ దాడిలో కూతురు చనిపోయింది. తల్లి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరింది. ఈ ఘటన కర్ణాటకలోని బనశంకరీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పద్మజకు సాహితీ అనే 18 ఏళ్ల కూతురు ఉంది. ఆమె స్థానికంగా ఉన్న కాలేజీలో పీయూసీ సెకండియర్ (తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ సెకండ్ ఇయర్‌తో సమానం) చదువుతోంది. ఇటీవల పరీక్షలు రాయగా.. తాజాగా ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలపై తల్లి కూతుళ్లైన సాహితీ, పద్మజ గొడవ పడ్డారు. ఎందుకు తక్కువ మార్కులు వచ్చాయంటూ కూతురిపై గట్టిగా అరవడంతో పాటు చేయి చేసుకుంది. చివరకు ఈ ఘర్షణ ఎంతకు దారి తీసిందంటే.. ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకునేంతగా.

మార్కులు తక్కువ రావడంతో కూతురిపై కక్ష గట్టినట్లుగా ప్రవర్తించిన తల్లి.. కత్తి తీసుకుని కూతురు సాహితీని పొడిచింది. సాహితీ కూడా ప్రతిఘటించే క్రమంలో తల్లిపై కత్తితో దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపైన సాహితీ మృతి చెందింది. గాయపడ్డ తల్లి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కాగా, ఈ ఘటనపై బనశంకరీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. స్థానికులు చెబుతున్న దాని ప్రకారం.. తల్లీ కూతుళ్ల మధ్య నిత్యం గొడవలు జరిగేవని, కూతురు సాహితీపై తల్లి పద్మజ ఎప్పుడూ అరుస్తూనే ఉండేదని చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మార్కుల విషయంలో పేరెంట్స్ ఇలా ఆలోచిస్తున్న నేపథ్యంలోనే.. పిల్లలు దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు.

India squad T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టు ఇదే..

అమెరికా, వెస్టిండీస్‌లో జరగనున్న పురుషుల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. ఈ మేరకు నేడు బీసీసీఐ టీమిండియాను ప్రకటించింది. ఈమేరకు జట్టుకు సంబంధించి కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. తాజాగా అధికారిక ప్రకటన వెలువడింది. జూన్ 1 నుంచి టోర్నీ ప్రారంభం కానుండగా, జూన్ 29న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
India squad T20 World Cup 2024: అమెరికా, వెస్టిండీస్‌లో జరగనున్న పురుషుల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. ఈ మేరకు నేడు బీసీసీఐ టీమిండియాను ప్రకటించింది. ఈమేరకు జట్టుకు సంబంధించి కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. తాజాగా అధికారిక ప్రకటన వెలువడింది. జూన్ 1 నుంచి టోర్నీ ప్రారంభం కానుండగా, జూన్ 29న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

15 మంది సభ్యులతో కూడిన టీమ్‌లో చాలా మంది పేర్లు ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు జట్టులో అవకాశం లభించింది. అదే సమయంలో గాయంతో దాదాపు ఏడాదిన్నర పాటు టీమిండియాకు దూరమైన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ తిరిగి వచ్చాడు. అదే సమయంలో, బ్యాకప్ వికెట్ కీపర్‌గా చోటు సంపాదించడంలో సంజూ శాంసన్ విజయం సాధించాడు.

జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (కీపర్), సంజు శాంసన్ (కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్.

రిజర్వ్‌లు – శుభమాన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్.

2024 పురుషుల T20 ప్రపంచ కప్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జూన్ 9న న్యూయార్క్‌లోని ఐసెన్‌హోవర్ పార్క్‌లో షెడ్యూల్ చేశారు. భారత్ గ్రూప్ దశ ప్రయాణం న్యూయార్క్‌లో మూడు మ్యాచ్‌లతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఫ్లోరిడాలో నాల్గవ మ్యాచ్ జరుగుతుంది.

2022లో మెల్‌బోర్న్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌ను ఓడించిన ఇంగ్లండ్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా నిలిచింది.

T20 ప్రపంచ కప్ 2024 గ్రూపులు..
గ్రూప్ A: ఇండియా, పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా, యూఎస్‌ఏ

గ్రూప్ బి: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్

గ్రూప్ సి: న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, ఉగాండా, పాపువా న్యూ గినియా

గ్రూప్ డి: దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్

NDA Alliance Joint Manifesto: ఎన్డీఏ కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..

NDA Alliance Joint Manifesto: ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతలు కలిసి మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్యనేతలు పాల్గొన్నారు.

ఆడబిడ్డ పథకం కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18వేలు అందజేత.
మహిళందరికీ ఉచిత బస్సు ప్రయాణం.
దీపం పథకం కింద ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఉచిత పంపిణీ.
నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి.
ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్. స్వచ్ఛమైన తాగునీటి సరఫరా.
‘తల్లికి వందన’ కింద చదువుకున్న పిల్లలు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం.
యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు.
రైతులకు ఏడాదికి రు.20 వేల చొప్పున ఆర్థిక సాయం.
ఆక్వారైతులకు రు.1.50కే యూనిట్ విద్యుత్.
సముద్ర వేట విరామ సమయంలో మత్స్యాకారులకే రూ.20వేల ఆర్థిక సాయం.
బోట్ల మరమ్మతులకు ఆర్థిక సాయం.
ప్రతిపేద కుటుంబానికి రెండు సెంట్ల ఇంటి స్థలం. నాణ్యమైన సామాగ్రితో ఇంటి నిర్మాణం.
ఉచిత ఇసుక.
భూ హక్కు చట్టం రద్దు.
బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం.
వృద్ధాప్య పింఛను నెలకు రూ.4 వేలు, పెంచిన పింఛను ఏప్రిల్-2024 నుంచే అమలు.
బీసీలకు 50 ఏళ్లకు నెలకు రూ.4వేల పింఛను.
రాజధానిగా అమరావతి కొనసాగింపు.
కలలకు రెక్కల పథకం ద్వారా వడ్డీలేని రుణాలు.
ఎన్డీయే తెచ్చిన ఈబీసీల 10 శాతం రిజర్వేషన్ అమలు.
బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు.
వాలంటీర్లకు రూ.10వేల గౌరవ వేతనం.
కాపు సంక్షేమం కోసం రూ.15వేల కోట్ల ఖర్చు.
ఆదరణ పథకం

RBI: వసూలు చేసిన వడ్డీ కస్టమర్లకు తిరిగి ఇవ్వాల్సిందే.. బ్యాంకులకు ఆర్బీఐ హెచ్చరిక!

అధిక వడ్డీలు వసూలు చేస్తూ కస్టమర్లను బ్యాంకులు మోసం చేయకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చర్యలు తీసుకుంటోంది. సోమవారం ఈ మేరకు బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్సియల్ కంపెనీల(NBFC)కు ఆదేశాలు జారీ చేసింది.

లోన్‌లపై అధిక వడ్డీని వసూలు చేసిన సందర్భాలను ఆర్‌బీఐ గుర్తించింది. దీంతో కస్టమర్‌ల నుంచి వసూలు చేసే వడ్డీలు న్యాయంగా, పారదర్శకంగా ఉండేలా చూసుకోవాలని, తమ విధానాలను వెంటనే సమీక్షించాలని ఆర్థిక సంస్థలను ఆదేశించింది.

2023 మార్చి 31తో ముగిసే కాలానికి సంబంధించి బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల ఆన్‌సైట్ పరిశీలనలో, వడ్డీని వసూలు చేయడంలో ఆర్థిక సంస్థలు అన్యాయమైన పద్ధతులను ఉపయోగిస్తున్న సందర్భాలను కనుగొన్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇటీవలి సర్క్యులర్‌లో పేర్కొంది.

రిజర్వ్‌ బ్యాంక్‌ తన సర్క్యులర్‌లో.. న్యాయబద్ధత, పారదర్శకత దృష్ట్యా, అన్ని నియంత్రిత సంస్థలు(బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు వంటివి) రుణాల పంపిణీ విధానం, వడ్డీ వర్తింపు, ఇతర ఛార్జీల గురించి తమ పద్ధతులను సమీక్షించుకోవాలని ఆదేశించింది. అవసరమైన విధంగా సిస్టమ్ లెవల్‌ మార్పులు సహా దిద్దుబాటు చర్యలను తీసుకోవాలని స్పష్టం చేసింది.

* ఆర్‌బీఐ గమనించిన కొన్ని అన్యాయమైన పద్ధతులు

– కొన్ని సందర్భాల్లో, బ్యాంకులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లోన్‌ పేమెంట్‌లను షెడ్యూల్ కంటే ముందే తీసుకుంటున్నాయని ఆర్‌బీఐ గుర్తించింది. అయితే మొత్తం లోన్‌ అమౌంట్‌ ఆధారంగా వడ్డీని కాలిక్యులేట్‌ చేస్తున్నాయి.

– లోన్‌ డిస్‌బర్సల్‌ లేదా రీపేమెంట్‌ విషయంలో, కొన్ని బ్యాంకులు రుణం బకాయి ఉన్న కాలానికి మాత్రమే వడ్డీని వసూలు చేయకుండా, నెల మొత్తానికి వడ్డీని వసూలు చేస్తున్నాయి.

– లోన్‌ అప్రూవ్‌ చేసిన తేదీ నుంచి లేదా లోన్‌ అగ్రిమెంట్‌పై సంతకం చేసిన తేదీ నుంచి వడ్డీని వసూలు చేయడం. వాస్తవానికి కస్టమర్‌కు ఫండ్స్‌ ఇచ్చిన తేదీ నుంచి వడ్డీని లెక్కించాలి. అలాగే, చెక్కు ద్వారా ఇచ్చిన లోన్‌ల విషయంలో, కస్టమర్ చాలా రోజుల తర్వాత చెక్కును స్వీకరించినప్పటికీ, కొన్నిసార్లు చెక్కు తేదీ నుంచి వడ్డీని వసూలు చేస్తున్నారు.

* వసూలు చేసిన వడ్డీ తిరిగి ఇవ్వాల్సిందే

కస్టమర్‌లతో వ్యవహరించేటప్పుడు న్యాయబద్ధత, పారదర్శకత స్ఫూర్తికి అనుగుణంగా లేని వడ్డీని వసూలు చేసే నాన్‌ స్టాండర్డ్‌ ప్రాక్టీస్‌లు తీవ్రమైన ఆందోళనకు కారణమని ఆర్‌బీఐ పేర్కొంది. ఇటువంటి పద్ధతులు ఎక్కడ వెలుగులోకి వచ్చినా, బ్యాంకులు, NBFCలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు అదనపు వడ్డీని కస్టమర్లకు చెల్లించేలా RBI పర్యవేక్షక బృందాలు చర్యలు తీసుకుంటాయి. ఇతర ఛార్జీలను కస్టమర్‌లకు రీఫండ్‌ చేసేలా చూస్తాయన సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. రుణాలు ఇవ్వడానికి కొన్ని సందర్భాల్లో చెక్కులను జారీ చేయడానికి బదులుగా ఆన్‌లైన్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్‌లను ఉపయోగించమని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రుణదాతలను ప్రోత్సహిస్తోంది.

Chandrababu Naidu : 74 ఏళ్ల వయసులో కూడా తగ్గని బాబు జోరు…ఈ ఘనత ఆయనకే సొంతం…!

Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఎంపీ స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఇక ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఎవరికి వారే జోరుగా ప్రచారాలు కొనసాగిస్తున్నారు ఇక ఈ ప్రచారాలలో ఎవరి మాటలు వారివి ఎవరి లెక్కలు వారివని చెప్పాలి. ఇక ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా తీవ్రస్థాయిలో శ్రమిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పోటీ చేస్తున్నటువంటి నాయకులు అందరిలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పెద్దవారని చెప్పాలి. కానీ వయసు తో సంబంధం లేకుండా చంద్రబాబు మాత్రం మిగిలిన ఏపీ అధినేతలతో సమానంగా ఉత్సాహంగా పర్యటన చేస్తూ ప్రచారాలు చేస్తున్న తీరు ఆంధ్ర రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది. అయితే ఎన్నికలకు ముందు రాజకీయ ప్రత్యర్థులు సైతం చంద్రబాబును ముసలాడిగా ఎటకారం చేసే ప్రయత్నాలు చేసినప్పటికీ ఎన్నికల సమీపిస్తున్న వేళ చంద్రబాబు కనబరుస్తున్న జోరు ప్రత్యర్థులను సైతం అవ్వాక్కు అయ్యేలా చేస్తుంది.

Chandrababu Naidu : చంద్రబాబు స్టామినా…
అయితే ప్రస్తుతం చంద్రబాబు వయసు 74 ఏళ్లు అయినప్పటికీ రాజకీయాల్లో ఆయన చూపిస్తున్న ఉత్సాహం చూస్తే ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో పోల్చి చూస్తే రాజకీయ పార్టీ నేతలు అందరూ కూడా చంద్రబాబు కంటే చాలా చిన్నవారు.ఇక అంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు 55 సంవత్సరాలు ఉండగా , వైయస్ జగన్మోహన్ రెడ్డికి 51 సంవత్సరాలు ఉంటాయి. అంటే వీరిద్దరూ కూడా చంద్రబాబు కంటే 20 సంవత్సరాలు చిన్నవారే. వయసులో ఇంత తేడా ఉన్నప్పటికీ చంద్రబాబు మాత్రం రాజకీయాలలో వారికి సమానంగా ఉత్సాహం చూపుతూ పోటీపడుతున్నారు. అంతెందుకు ప్రస్తుతం వేసవికాలం కావడంతో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా యువ నాయకులు సైతం ఎండ వేడికి తట్టుకోలేక సాయంత్రం వేళలో ప్రచారాలు చేస్తున్నారు.

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఇటీవల బస్సు యాత్రను సాయంత్రం వేళలో నిర్వహించారు. కానీ వయసులో అందరి కంటే పెద్దవాడు అయిన చంద్రబాబు మాత్రం దానికి విరుద్ధంగా పగలు రాత్రి తేడా లేకుండా ప్రచారాలను నిర్వహిస్తూ వస్తున్నారు. దీంతో ఎన్నికల సమయంలో చంద్రబాబు కనబరుస్తున్న ఉత్సాహం చూసి యువ నేతలు సైతం ఆశ్చర్యపోతున్నారు. 74 ఏళ్ల వయసులో ఇంతలా శ్రమించడం అనేది కేవలం చంద్రబాబుకు మాత్రమే సాధ్యమని కొనియాడుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో కీలక ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు ఫిట్ నెస్ అందర్నీ ఆకర్షిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Telangana SSC /10th Class results

Telangana SSC Results 2024: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. పరీక్ష పత్రాల మూల్యాంకనం, కంప్యూటీకరణ కూడా పూర్తవడంతో ఫలితాలను చేసేందుకు తెలంగాణ విద్యాశాఖ అధికారులు సిద్ధమయ్యారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో ఫలితాలను వెల్లడించనున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా టెన్త్ క్లాస్ ఫలితాల వెల్లడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. మొత్తం 5.08 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 2,7,952 మంది బాలురు కాగా, 2,50, 433 మంది బాలికలున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,676 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఓ వైపు పరీక్షలు జరుగుతుండగానే.. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు పరీక్షా పత్రాల మూల్యాకనం 19 కేంద్రాల్లో నిర్వహించారు. అనంతరం కోడింగ్, డీ కోడింగ్ ప్రక్రియ కూడా పూర్తి చేశారు. తెలంగాణ టెన్త్ రిజల్ట్స్‌ను https://results.cgg.gov.in వెబ్‌సైట్‌పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. విద్యార్థల హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే.. స్క్రీన్‌పై రిజల్ట్స్‌ ప్రత్యక్షం అవుతాయి. ఫలితాలతో పాటు మార్కుల మెమో కూడా ఉంటుంది. గతేడాది రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 13వ తేదీతో ముగియగా.. రిజల్ట్స్ మే 10వ తేదీన విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 15 రోజులు ముందే పరీక్షలు పూర్తయ్యాయి.

ఇప్పటికే ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు వెల్లడైన విషయం తెలిసిందే. ఏపీ పది పరీక్షల్లో 86.69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 84.32 శాతం, బాలికలు 89.17 శాతం మంది పాస్ అయ్యారు. పార్వతీపురంమన్యం జిల్లాలో అత్యధిక ఉత్తీర్ణత శాతం 96.37 కాగా.. కర్నూలు జిల్లాలో అత్యల్ప ఉత్తీర్ణత శాతం 62.47 నమోదైంది. ఏపీలో మే 24 నుంచి జూన్ 3 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. 2,803 స్కూల్స్‌లో 100 శాతం ఉత్తీర్ణత సాధించగా.. 17 పాఠశాలలో ఒక్కరు కూడా పాస్ కాలేదు.

Eenadu results link click here

Sakshi Results Link..click here

8th Pay Commission : 8వ పే కమిషన్​పై బిగ్​ అప్డేట్​.. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​ న్యూస్​!

8th Pay Commission date : 8వ పే కమిషన్​ గురించి అప్డేట్​ కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ముఖ్యమైన సమాచారం! 8వ పే కమిషన్​ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి అధికారిక ప్రతిపాదన అందింది.

త్వరలోనే.. దీనిని కేంద్రం పరిశీలించే అవకాశం ఉంది.

8వ పే కమిషన్​ ఏర్పాటుకు సంబంధించి.. కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్​ శాఖకు లేఖ రాసింది ఐఆర్​టీఎస్​ఏ (ఇండియన్​ రైల్వే టెక్నికల్​ సూపర్​వైజర్స్​ అసోసియేషన్​). ప్రస్తుత వ్యవస్థలో ఉన్న లోపాలను కూడా.. ఈ లేఖలో లేవనెత్తింది ఐఆర్​టీఎస్​ఏ. భవిష్యత్తులో లోపాలు లేని వ్యవస్థను రూపొందించాలని సూచించింది.

8వ పే కమిషన్​ని ఎందుకు ఏర్పాటు చేస్తారు?

సాధారణంగా.. 10ఏళ్ల కాల వ్యవధిలో సెంట్రల్​ పే కమిషన్​ని ఏర్పాటు చేస్తారు. ప్రస్తుత పరిస్థితులపై అధ్యయనం చేసి, వాటిని రివ్యూ చేసి, జీతాలు, అలోవెన్స్​లు, ఇతర సౌకర్యాలకు సంబంధించిన మార్పులను సిఫార్సు చేస్తారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పే, ఆలోవెన్స్​తో పాటు ఇతర విషయాలను కాలక్రమేన రివ్యూ చేసేందుకు ఒక శాశ్వత వ్యవస్థను రూపొందించాలని.. 3వ, 4వ, 5వ పే కమిషన్స్​ సిఫార్సు చేశాయి.

8th Pay Commission : వేతనాలతో పాటు అనేక విషయాలను తన లేఖలో ప్రస్తావించింది ఐఆర్​టీఎస్​ఏ. కొత్త సెంట్రల్​ పే కమిషన్​ని ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేసింది. ఉద్యోగులకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ఇబ్బందులు, లోపాలను తొలగించాలని పేర్కొంది. వేతనాలు, అలోవెన్స్​లు, వర్కింగ్​ కండీషన్​, ప్రమోషన్​లు, పోస్ట్​ క్లాసిఫికేషన్స్​లోని సమస్యలను తొలగించేందుకు.. 8వ పే కమిషన్​కి తగినంత సమయం ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేసింది.

మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ 8వ పే కమిషన్​తో ఉపయోగం ఉందా? అంటే కచ్చితంగా ఉంటుంది. డీఏ హైక్​, వేతనాల సవరణకు ఈ కమిషన్​ చాలా అవసరం.

హెచ్ ఆర్ ఏ సంగతి ఏంటి..?

DA hike news : ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యాన్ని ప్రభుత్వం 50 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. ఇది 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ విషయంలో ఎలాంటి సమస్య లేనప్పటికీ.. అందుకు అనుగుణంగా పెరగాల్సిన హెచ్ఆర్ఏ విషయంలో కొంత అనిశ్చితి, గందరగోళం నెలకొంది. సాధారణంగా, డీఏ పెంపుతో పాటు ఇంటి అద్దె అలవెన్స్ కూడా పెరుగుతుంది. అయితే 7వ వేతన సంఘం హెచ్ఆర్ఏ సవరణకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ప్రత్యేక ఉత్తర్వులను కానీ, నోటిఫికేషన్ ను కానీ జారీ చేయలేదు

డిగ్రీపాసై ఖాళీగా ఉన్నారా?.. వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోండి

ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు పొందాలంటే అవసరమైన విద్యార్హతలు, స్కిల్స్ ఉండాల్సిందే. లేకపోతే ప్రస్తుత పోటీప్రపంచంలో నిలదొక్కుకోవడం కష్టం.

ప్రైవేట్ సెక్టార్ లో మీరు ఏ రంగాన్ని ఎంచుకున్నా దానికి సంబంధించిన నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఖచ్చితమైన ప్రణాళికతో చదవాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షల్లో అసాధారణ ప్రతిభ కనబర్చాల్సి ఉంటుంది. ఇటీవల నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఏపీ ఎకనామిక్స్ & స్టాటిస్టికల్ సబార్డినేట్ సర్వీస్‌లో అసిస్టెంట్‌ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చి 6న నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

డిగ్రీ ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నట్లైతే వీలైనంత త్వరగా ఈ పోస్టులకు అప్లై చేసుకోండి. అసిస్టెంట్‌ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 8 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

అసిస్టెంట్‌ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఖాళీల సంఖ్య:

05
అర్హత:

బ్యాచిలర్ డిగ్రీ (స్టాటిస్టిక్స్) లేదా బ్యాచిలర్ డిగ్రీ (మ్యాథమెటిక్స్/ ఎకనామిక్స్/ కామర్స్/కంప్యూటర్ సైన్స్)లో స్టాటిస్టిక్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
వయోపరిమితి:

01.07.2024 నాటికి 18 – 42 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు ఫీజు:

అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.120 కలిపి మొత్తం రూ.370 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థుల, తెల్లరేషన్ కార్డు ఉన్న అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.120 నుంచి మినహాయింపు కల్పించారు.
దరఖాస్తు విధానం:

ఆన్‌లైన్‌
ఎంపిక విధానం:

రాత పరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ.37,640- రూ.1,15,500 ఇస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

18-04-2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది:

08-05-2024.

Health Benefits Of Ridge Gourd: వేసవిలో బీరకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Health Benefits Of Ridge Gourd: కూరగాయల్లో బీరకాయకు ఉండే ప్రత్యేకత వేరు. బీరకాయ అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. బీరకాయ కూర, బీరకాయ పప్పు, బీరకాయ కోడిగుడ్డు, బీరకాయ పచ్చడి లాంటివి చేసుకుని తినడానికి ఇష్టపడుతుంటారు.ముఖ్యంగా వేసవిలో బీరకాయను ఎక్కువగా తీసుకోవాలి. బీరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దీనిని ఎవరైనా ఎప్పుడైనా తినవచ్చు. బీరకాయలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

బీరకాయ తినడానికి కూడా తొందరగా జీర్ణం అవుతుంది. ముఖ్యంగా బీరకాయను వేసవికాలంలో తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి. బీరకాయలో 92 శాతం నీరు ఉంటుంది. దీనివల్ల శరీరానికి వేసవికాలంలో అనేక ప్రయోజనాలు ఉంటాయి. బీరకాయలోని పొటాషియం, సోడియం, మెగ్నీషియం పుష్కలంగా ఉండడం వల్ల బీరకాయను తీసుకుంటే బాడీ హైడ్రేట్ అవుతుంది.

డయాబెటీస్ వ్యాధితో బాధపడుతున్న వారికి కూడా బీరకాయ తోడ్పడుతుంది. బీరకాయను తినడం వల్ల మెగ్నీషియం అధికంగా ఉండి ఎక్కువసేపు ఆకలి కాకుండా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నివారించడానికి బీరకాయ తోడ్పడుతుంది. బీరకాయలో ఉండే మెగ్నీషియం వంటి ఇన్సులిన్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అంతేకాదు బరువు తగ్గేందుకు కూడా బీరకాయ తోడ్పడుతుంది. బీరకాయలో ఉండే కేలరీలు, ఫైబర్, నీరు బరువును తగ్గించేందుకు కూడా సహాయపడతాయి.

బీరకాయ తినడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ కూడా మెరుగవుతుంది. బీరకాయలో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. బీరకాయలోని పొటాషియం రక్తపోటును నియంత్రించడం, రక్తనాళాలపై ఒత్తిడిని తగ్గించేందుకు ప్రయత్నిస్తుంది. క్యాన్సర్ వంటి అనేక ప్రమాదాల నుంచి బీరకాయలోని పోషకాలు తగ్గించడానికి తోడ్పడతాయి. రోగనిరోధక శక్తిని పెంచి, ఇమ్యూనిటీ వ్యవస్థలను బలపరచేందుకు కూడా బీరకాయ ఉపయోగపడుతుంది.

APMS Exam Result: ఏపీ మోడల్‌ స్కూల్స్‌ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

APMS Results: ఏపీలోని ఆదర్శ పాఠశాలల్లో (APMS) 6వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశపరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఏప్రిల్ 29న ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఐడీ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా 164 మోడల్ స్కూల్స్‌లో ఏప్రిల్ 21న ఈ పరీక్ష నిర్వహించగా.. 31,376 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు ప్రవేశాలకు సంబంధించిన మరింత సమాచారం కోసం ఆయా మోడల్ స్కూల్స్‌లో సంప్రదించాల్సి ఉంటుంది.

ఏపీలోని 164 ఆదర్శ పాఠశాలల్లో (Mode Schools) ఆరో తరగతిలో 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశానికి సంబంధించిన నోటిఫికేషన్ మార్చి 1న వెలువడిన సంగతి తెలిసిందే. విద్యార్థులు మార్చి 1 నుండి ఏప్రిల్ 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 21న ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 వరకు మండలాల్లో ఉన్న ఆదర్శ పాఠశాలల్లోనే 5వ తరగతి స్థాయి సిలబస్‌తో తెలుగు/ ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించారు. మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహించారు. అభ్యర్థులు వారివారి మండల కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉన్నాయి. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు అడిగారు. 5వ తరగతి స్థాయిలోనే ప్రశ్నలు ఉన్నాయి. పరీక్షలో అర్హత మార్కులకు ఓసీ, బీసీ విద్యార్థులకు 35గా; ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 30గా నిర్ణయించారు. పరీక్షలో విద్యార్థులు చూపిన ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో మాత్రమే బోధిస్తారు, చదువుకోవడానికి విద్యార్థులు ఎలాంటి ఫీజులు కట్టనవసరం లేదు. ఈ పాఠశాలలన్నీ కూడా సీబీఎస్‌ఈకి అనుబంధంగా ఉన్నాయి.

APMS 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాల కోసం క్లిక్ చేయండి..

Food Tips: ఫ్రిడ్జ్‌లో చపాతీ పిండిని కలిపి పెడుతున్నారా.. చాలా డేంజర్

Food Tips: తరచూ తినే ఆహార పదార్థాల్లో మిగిలిన వాటిని ఫ్రిడ్జిల్లో స్టోర్ చేస్తుంటారు. ఇలా కొన్ని రోజుల పాటు కూడా పెట్టుకుని తినే వారు ఉంటారు. పాలు, పెరుగు, కూరగాయలు, పండ్లు, వండిన కూరలు, ఆహారం వంటివి చాలా పదార్థాలను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తుంటారు. ఈ తరుణంలో చపాతీలు చేసుకునేందుకు పిండి కలుపుకుని అప్పటి వరకు సరిపడా చేసుకున్న తరువాత తిరిగి దానిని మళ్లీ ఉపయోగిస్తారు. ఈ తరుణంలో మిగిలిన పిండిని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తుంటారు. అయితే ఇలా చేయడం ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం.

చపాతీ పిండిని ఎప్పటికి అప్పుడు కలిపి చేసుకోవడం వల్ల చక్కగా వస్తాయి. అంతేకాదు ఇలా తినడం ఆరోగ్యానికి కూడా మంచిది. కానీ మిగిలిన పిండిన ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి దానిని తిరిగి ఉపయోగించడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇలా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసిన చపాతీ పిండిని చపాతీలు చేసుకుని తినడం వల్ల కడుపు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కడుపు నొప్పి, అజీర్తి, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు ఎదురవుతాయట. ఫ్రిడ్జిలో పెట్టిన పిండిని చపాతీలు చేసుకుని తినడం వల్ల కడుపులో బ్యాక్టీరియా సమస్యలు తలెత్తుతాయి.

చపాతీ పిండిని ఎప్పటికి అప్పుడు తినడం వల్ల శరీరానికి మంచి పోషకాలు అందుతాయి. కానీ దానిని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి తినడం వల్ల అందులోని పోషకాలను కోల్పోయే అవకాశం ఉంటుందట. అంతేకాదు ఇలా తయారు చేసే చపాతీలు రుచిని కోల్పోతాయి. అందువల్ల ఫ్రిడ్జిలో స్టోర్ చేసిన చపాతీ పిండిని అస్సలు వాడకూడదని నిపుణులు చెబుతున్నారు.

ONGC Recruitment 2024: పరీక్ష లేకుండానే ఓఎన్జీసీలో ఉద్యోగాలు, 66 వేలకు పైగా జీతం

ONGC Recruitment 2024: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్‌లో ఎలాంటి పరీక్ష లేకుండానే ఉద్యోగాలు పొందే అద్భుత అవకాశం లభిస్తోంది. ఓఎన్జీసీలో ఉద్యోగం అంటే ఎవరైనా సరే ఎగిరి గంతేసే పరిస్థితి.

అలాంటిది ఏకంగా పరీక్ష లేకుండానే ఉద్యోగం పొందే అవకాశం. జీతభత్యాలు భారీగానే ఉంటాయి.

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ సంస్థ ఓఎన్జీసీలో ఉద్యోగాలు పొందేందుకు మంచి అవకాశం. జూనియర్, అసోసియేట్ కన్సల్టెంట్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్ధులు ఓఎన్జీసీ అధికారిక వెబ్‌సైట్ ongcindia.com ఓపెన్ చేసి ఆన్‌లైన్‌లో అప్లై చేయడం, రిజల్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఓఎన్జీసీ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 24 పోస్టులు భర్తీ చేయనుంది. ఓఎన్జీసీలో ఉద్యోగం పొందాలనుకునేవాళ్లు మే 10లోగా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. మీరు కూడా ఈ పోస్టులకు అప్లై చేయాలని అనుకుంటుంటే కొన్ని అంశాలు తెలుసుకోవల్సి ఉంటుంది.

ఓఎన్జీసీ అస్సోం అసెట్ ద్వారా ప్రొడక్షన్, డ్రిల్లింగ్, మెకానికల్ అంశాల్లో జూనియర్ అండ్ అసోసియేట్ కన్సల్టెంట్ పోస్టులు భర్తీ చేయనుంది. మొత్తం 28 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్ధులు 63 ఏళ్లలోపు ఉండవచ్చు. ఓఎన్జీసీ నోటిపికేషన్‌లో పూర్తి వివరాలుంటాయి.

జూనియర్ , అసోసియేట్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీ అభ్యర్ధుల అర్హత, అనుభవం ఆధారంగా ఉంటుంది. అభ్యర్ధుల దరఖాస్తుల్ని షార్ట్ లిస్ట్ చేసిన తరువాత పరీక్ష, మెయిల్ వివరాలు మెయిల్ ద్వారా అందుతాయి. ఈ ఉద్యోగాలకు జీతం 66 వేల నుంచి ప్రారంభమౌతుంది. అన్ని ప్రయోజనాలు కలుపుకుంటే 1 లక్ష వరకూ వర్తిస్తుంది.

మంగళవారం ఇలా చేస్తే ..అన్నింటిలోనూ విజయం మీదే.!

మంగళవారం హిందూమతంలో హనుమంతుడికి అంకితం చేశారు. హనుమంతుడిని రాముని గొప్ప భక్తుడిగా భావిస్తారు. బలం, ధైర్యం, జ్ఞానానికి చిహ్నంగా భావిస్తారు. మత విశ్వాసాల ప్రకారం, మంగళవారం నాడు హనుమంతుడిని పూజించడం వల్ల అన్ని రకాల కష్టాల నుండి విముక్తి పొంది, కోరికలు నెరవేరుతాయని నమ్ముతుంటారు.

నిర్మలమైన మనస్సుతో ఆంజనేయ స్వామిని పూజిస్తే కార్యసిద్ధి, సంతోషం, ఐశ్వర్యం లభిస్తాయి. అంతే కాకుండా కుజుడు కూడా బలవంతుడు అవుతాడు. శాస్త్రం ప్రకారం, మంగళవారం ఉపవాసంతో పాటు కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల మీకు చాలా ప్రయోజనాలు లభిస్తాయి. ఏమిటి ఏంటో చూద్దాం.

మంగళవారం ఉపవాసం:
శాస్త్రం ప్రకారం, మీరు మంగళవారం ఉపవాసం ఆచరిస్తే, మీరు హనుమంతుని ప్రత్యేక అనుగ్రహాన్ని పొందుతారు. దీనితో, మీరు మీ అన్ని పనులలో విజయం సాధిస్తారు. ఉపవాస సమయంలో, మీరు హనుమంతుడిని పూజించాలి. ‘ఓం మంగళాయ నమః’ అనే మంత్రాన్ని పఠించాలి.

నైవేద్యంగా లడ్డూలు:
ఆంజనేయ స్వామికి లడ్డూలంటే చాలా ఇష్టం. మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి లడ్డూలు నైవేద్యంగా పెడితే అదృష్టానికి పూర్తి సహకారం అందుతుంది. దీనితో మీ అదృష్టం ప్రకాశిస్తుంది.

ఆంజనేయ స్వామి ఆరాధన:
హిందూ మతంలో, మంగళవారం ఆంజనేయుడికి అంకితం.ఈ రోజున ఆంజనేయ స్వామిని పూజిస్తే అంగారకుడి శక్తి పెరుగుతుంది. ఈ రోజున, ఆంజనేయ స్వామి విగ్రహం లేదా చిత్రం ముందు దీపం వెలిగించి, పసుపు, కుంకుమలను సమర్పించండి. దీనితోపాటు హనుమాన్ చాలీసా పఠించండి. ఇలా చేయడం వల్ల హనుమంతుడు మరింత సంతోషిస్తాడు.

హనుమాన్ చాలీసా జపించండి:
చేపట్టిన పనులు పూర్తికాగా..ఇబ్బుందులు ఎదుర్కొంటున్నట్లయితే మీరు మంగళవారం నాడు హనుమాన్ చాలీసా పఠించాలి. ఈ రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కష్టాలన్నీ దూరమై మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.
దాతృత్వం:
మంగళవారం దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున ఎర్రని వస్త్రం, బెల్లం, పప్పు, గోధుమలను దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇలా చేయడం ద్వారా మీరు మీ అన్ని ప్రయత్నాలలో విజయం పొందుతారు.

XUV 3X0: రూ.7.5 లక్షలకే కొత్త కారు.. మతిపోయే ఫీచర్లు, బంపర్ మైలేజ్!

దిగ్గజ కార్ల తయారీ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా సరికొత్త కారును మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇందులో మతిపోయే ఫీచర్లు ఉన్నాయి.

ఇంకా ధర కూడా చాలా తక్కువనే ఉంది. అందువల్ల సామాన్యులు కూడా ఈ కారును సులభంగానే కొనొచ్చు. ఇంతకీ మహీంద్రా కంపెనీ ఏ కారును మార్కెట్‌లోకి తీసుకువచ్చింది? దీని ధర ఎంత? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? వంటి అంశాలను మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. మహీంద్రా కంపెనీ తాజాగా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ కారును మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర అందుబాటులోనే ఉంది. రూ.7.49 లక్షల నుంచి ధర ప్రారంభం అవుతోంది. ఇది ఎక్స్‌షోరూమ్ రేటు.

ఇది కాంపాక్ట్ ఎస్‌యూవీ. అలాగే ఎక్స్‌యూవీ 300కు ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్. అప్‌డేటెడ్ డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ ప్రమాణాలు ఈ కొత్త కారులో ఉన్నాయి. ఈ కొత్త ఎస్‌యూవీ కారు బుకింగ్స్ మే 15 నుంచి ప్రారంభం అవుతాయని కంపెనీ పేర్కొంది. అటు మహీంద్రా డీలర్‌షిప్స్ వద్ద, ఇటు ఆన్‌లైన్‌లో ఒకేసారి బుకింగ్స్ స్టార్ట్ అవుతాయి. ఇక కారు డెలివరీస్ మే 26 నుంచి ప్రారంభం అవుతాయి. ఈ కారు డిజైన్ అదిరింది. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కారు వెనుక భాగంలో ఇన్‌ఫినిటీ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ ఉంటుంది. దీంతో అదిరే లుక్ వచ్చింది.

మహీంద్రా కంపెనీ కొత్త కారులో వరల్డ్ క్లాస్ టర్బో ఇంజిన్స్ ఉన్నాయి. అదిరే పనితీరు దీని సొంతం. ఇందులో ఎంస్టాలియన్ టీజీడీఐ అండ్ టర్బో డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఈ కారు కేవలం 4.5 సెకన్లలోనే 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అంతేకాకుండా ఈ ఎస్‌యూవీ లీటరుకు 20.1 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. మ్యానువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్‌కు ఇది వర్తిస్తుంది. ఇందులో 6 స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్ కూడా ఉంటుంది. కంపెనీ ఈ కారులో పరిశ్రమలోనే తొలిసారిగా స్కైరూఫ్ టీఎం, డ్యూయెల్ జోన్ క్లైమెట్ కంట్రోల్, 65 వాట్ యూఎస్‌బీ ఫాస్ట్ చార్జింగ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్, 3 స్మార్ట్ స్టీరింగ్ మోడ్స్, లెవెల్ 2 అడాస్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

అంతేకాకుండా ఈ కారులో ట్విన్ హెచ్‌డీ స్క్రీన్స్ ఉంటాయి. హర్మన్ కార్డన్ ప్రీమియం ఆడియో సిస్టమ్ విత్ యాంప్లిఫయర్ అండ్ సబ్ ఊఫర్ ఉంటుంది. 360 డిగ్రీ సరౌండ్ వ్యూ సిస్టమ్, బ్లైండ్ వ్యూ మానిటర్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇంకా ఈ కారులో ఆరు ఎయిర్ బ్యాగ్స్, నాలుగు డిస్క్ బ్రేక్స్, మూడు పాయింట్ సీటు బెల్ట్ విత్ రిమైండర్స్, ఐఎస్‌వో ఎఫ్ఐఎక్స్ చైల్డ్ సీట్లు వంటివి కూడా ఉన్నాయి. ఈ కారు వివిధ వేరియంట్ల రూపంలో లభిస్తోంది. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 15.49 లక్షల వరకు ఉంటుంది.

Cinnamon Water: ఈ నీళ్లతో కలిగే లాభాలు వింటే ఇక జీవితాంతం వదిలిపెట్టరు, అన్ని వ్యాధులకు చెక్

Cinnamon Water: ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో మసాలా దినుసులు కీలకమైనవి. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో మసాలా దినుసుల వినియోగం ఎక్కువ.

వివిధ రకాల మసాలా దినుసులు ప్రతి వంటింట్లో తప్పకుండా ఉంటాయి. వీటిలో అతి ముఖ్యమైనది దాల్చిన చెక్క. దాల్చిన చెక్కతో కలిగే ప్రయోజనాలు వింటే నోరెళ్లబెట్టడం ఖాయం.

ప్రతి వంట ఇంట్లో తప్పకుండా లభించే దాల్చిన చెక్కను కేవలం వంటల్లో రుచి కోసమే కాకుండా ఆరోగ్యరీత్యా ఉపయోగించవచ్చు. ఆయుర్వేదం ప్రకారం దాల్చినచెక్కలో అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. ఆధునిక జీవన విధానంలో ప్రధాన సమస్యగా మారిన అధిక బరువుకు చెక్ చెప్పేందుకు దాల్చినచెక్క నీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి. శరీరంలోని కొవ్వును సులభంగా కరిగించే మూలకాలు ఇందులో ఉంటాయి. స్థూలకాయం లేదా అధిక బరువు సమస్యతో బాధపడేవారికి దాల్చిన చెక్క నీళ్లు మంచి ఔషధంలా పనిచేస్తాయి. రోజూ క్రమం తప్పకుండా ఉదయం పరగడుపున తీసుకుంటే మంచి ఫలితాలు కన్పిస్తాయి. శరీరంలో పేరుకున్న కొవ్వు వేగంగా కరుగుతుంది.

ముందుగా దాల్చిన చెక్కల్ని పౌడర్ చేసుకుని భద్రపర్చుకోండి. రోజూ ఒక స్పూన్ పౌడర్ ఒక గ్లాసు నీటిలో మరిగించి కషాయంలా చేసుకోవాలి. ఈ నీళ్లను చల్లార్చి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరం మెటబోలిజం కూడా వృద్ధి చెందుతుంది. రోజూ క్రమం తప్పకుండా దాల్చిన చెక్క నీరు లేదా కషాయం తాగడం వల్ల మధుమేహం వ్యాధిగ్రస్థులకు సైతం చాలా మంచిది. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించే హార్మోన్ ఇన్సులిన్‌లా పనిచేస్తాయి. కనీసం నెలరోజులు క్రమం తప్పకుండా తీసుకుంటే ఫలితం గమనించవచ్చు.

దాల్చినచెక్కలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా శరీరంలోని మలినాలు బయటకు తొలగిపోతాయి. ఎలాంటి వ్యాధులు దరిచేరవు. అంతేకాకుండా మెటబోలిజం వృద్ధి చెందడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు. స్ఖూలకాయం సమస్యకు చెక్ చెప్పవచ్చు. అయితే వారం పదిరోజులు వాడితే సరిపోదు. కనీసం 6-8 వారాలు వాడిన తరువాతే ఫలితాలు చూడవచ్చు.

దాల్చినచెక్కను యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా ఉపయోగిస్తారు. ఆర్ధరైటిస్, పంటి నొప్పి వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. మెదడు ఉత్తేజితమౌతుంది. సీజనల్ ఫ్లూ, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు, ఫుడ్ పాయజనింగ్ వంటి సమస్యలు దూరమౌతాయి. రోజూ దాల్చినచెక్క నీటిని తాగడం వల్ల చర్మ సమస్యలు కూడా దూరంగా ఉంటాయి. చర్మానికి కొత్త నిగారింపు వస్తుంది.

Sattu pindi in Summer: వేసవిలో సత్తు పిండితో బోలెడన్ని బెనిఫిట్స్.. ఎలా చేయాలో తెలుసుకోండి

చాలా మందికి సత్తు పిండి అంటే ఏంటో తెలీదు. ఈ సత్తు పిండి ఆరోగ్యానికి ఎంతో మంచిది. అందులోనూ వేసవిలో తింటే శరీరానికి మరింత మంచిది. ఇది ఒక పురాతన వంటకం. ఈ సత్తు పిండిని.. గోధుమలు, జొన్నలు, బియ్యం నుంచి తయారు చేస్తారు. ఇందులో పోషకాలు అనేవి సమృద్ధిగా ఉంటాయి. ప్రతిరోజూ తగిన మోతాదులో తీసుకుంటే.. శరీరానికి చాలా మంచిది. శరీరానికి కూడా సత్తువ లభిస్తుంది. ఈ పిండి తెలంగాణ, ఏపీ, మధ్య ప్రదేశ్‌లో ఎక్కువగా ప్రసిద్ధి చెందింది. మరి ఈ సత్తు పిండి అంటే ఏంటి? ఎలా తయారు చేస్తారు? ఇది తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:
ఈ సత్తు పిండితో తయారు చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. దీని వల్ల పలు రకాల వ్యాధులతో పోరాడే శక్తి మీకు లభిస్తుంది. వేసవిలో తీసుకుంటే అలసట, నీరసం దూరం అవుతాయి.

రక్త హీనత సమస్య మాయం:
సత్తు పిండిలో ఎక్కువగా ఐరన్ లభిస్తుంది. సత్తు పిండిని తీసుకోవడం వల్ల రక్త హీనత సమస్య తగ్గుతుంది. ఐరన్ లోపం తలెత్తకుండా ఉంటుంది. రక్తంలో ఆక్సిజన్ సరఫరాను కూడా మెరుగు పరుస్తుంది.
వెయిట్ లాస్:
వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు సత్తు పిండిని తీసుకోవచ్చు. వీటితో తయారు చేసే ఆహారాలు తీసుకుంటే.. అధిక ఆకలిని నియంత్రిస్తుంది. ఇందులో ఫైబర్ కూడా అధిక మోతాదులో ఉంటుంది. కాబట్టి కొద్దిగా తీసుకున్నా కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. అదే విధంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. తద్వారా ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు.

డయాబెటీస్ కంట్రోల్:
డయాబెటీస్‌తో బాధ పడేవారు కూడా సత్తు పిండిని తీసుకోవచ్చు. సత్తు పిండిలో ఉండే ఫైబర్.. షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తుంది. అంతే కాకుండా డయాబెటీస్ వల్ల కలిగే అనారోగ్య సమస్యల నుంచి వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఇంకా గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది.

సత్తు పిండిని ఎలా తయారు చేస్తారు:
సత్తు పిండిని వారి ప్రాంతాల బట్టి ఎవరికి నచ్చినట్టు తయారు చేస్తారు. అయితే చాలా మంది ఎక్కువగా ఇలా చేస్తారు. బెండులు, శనగలు, రాగులు, మొగ్గలు వంటి ధాన్యాలను రాత్రంతా నానబెట్టాలి. ఆ తర్వాత వీటిని బాగా ఉడికించాలి. ఉడికించిన వాటిని.. మళ్లీ ఎండబెట్టి.. పొడిగా చేయాలి. ఇప్పుడు పిండి తయారవుతుంది. దీంతో రొట్టెలు అయినా తయారు చేసుకోవచ్చు. లేదంటే రాగి జావలా ఇది కూడా తయారు చేసుకుని తాగవచ్చు.

Barley Water: అమృతమే ఈ నీరు.. రోజూ ఒక గ్లాసు తాగారంటే ఈ సమస్యలకు దివ్యౌషధం.. వడదెబ్బ ప్రమాదమే ఉండదు..

సూరీడు ఏమాత్రం తగ్గడం లేదు.. 45 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. మే నెల రాక ముందే ఉష్ణోగ్రతలు ఇలా ఉంటే.. మున్ముందు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈక్రమంలో చాలా మంది డీ హైడ్రేషన్ తో వడదెబ్బ బారిన పడుతున్నారు. వేసవి తాపం కారణంగా ఎన్ని మంచినీళ్లు తాగినా దాహం తీరదు..

సూరీడు ఏమాత్రం తగ్గడం లేదు.. 45 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. మే నెల రాక ముందే ఉష్ణోగ్రతలు ఇలా ఉంటే.. మున్ముందు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈక్రమంలో చాలా మంది డీ హైడ్రేషన్ తో వడదెబ్బ బారిన పడుతున్నారు. వేసవి తాపం కారణంగా ఎన్ని మంచినీళ్లు తాగినా దాహం తీరదు.. దీంతో చాలామంది ఏవేవో డ్రింకులంటూ తాగుతుంటారు.. ఆ తర్వాత అనారోగ్యం పాలవుతుంటారు. ప్రస్తుత కాలంలో వడదెబ్బ, డీహైడ్రేషన్, అతిసారం లాంటి వాటికి చెక్ పెట్టాలంటే బార్లీ నీళ్లు తాగాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. బార్లీ గింజల్లోని పోషకాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. బార్లీ వాటర్‌లో శరీర వేడిని తగ్గించి తక్షణ శక్తిని అందించే గుణాలు, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. బార్లీ నీటిలో కాల్షియం, ఫైబర్‌, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్‌, జింక్‌, కాపర్‌, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉండటంటో శరీరాన్ని బోలెడన్ని ప్రయోజనాలు లభిస్తాయి.. ముఖ్యంగా వేసవిలో బార్లీ నీళ్లు తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో.. ఇప్పుడు చూడండి..

బార్లీవాటర్​ ప్రయోజనాలు..
గుండె ఆరోగ్యం: బార్లీలో బీటా-గ్లూకాన్ అనే కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. బీటా-గ్లూకాన్ చెడు (LDL) కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి.. మంచి (HDL) కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. ఇలా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

కడుపు సమస్యలు దూరం: వేసవిలో చాలా మంది అజిర్తీ, గ్యాస్, కడుపు సమస్యలతో బాధపడుతుంటారు.. అలాంటి వారు బార్లీ నీళ్లు తాగడం చాలా మంచిది. జీర్ణాశయం మెరుగుపడి.. అజీర్తి సమస్య దూరమవుతుంది. క‌డుపులో మంట‌, అసిడిటీ, గ్యాస్‌, అజీర్ణం, మ‌ల‌బద్ధకం ఉన్న‌వారు ఈ నీటిని తాగడం మంచిది. అంతేకాకుండా బార్లీ నీరు వ్య‌ర్థ‌ ప‌దార్థాల‌న్నీ బ‌య‌టికి వెళ్లేలా చేస్తుంది.

డీహైడ్రేషన్​ను నివారిస్తుంది: బార్లీలో పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. డీహైడ్రేషన్ సమయంలో ఈ ఎలక్ట్రోలైట్లు శరీరం నుంచి కోల్పోతాయి. కావున ఈ ఎలక్ట్రోలైట్లను భర్తీ చేయడానికి, శరీరం హైడ్రేషన్ స్థాయిలను నిర్వహించడానికి బార్లీ నీటిని క్రమం తప్పకుండా తాగాలి.

డయాబెటిస్‌లో: బార్లీ నీరు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. బీటా-గ్లూకాన్ రక్తప్రవాహంలో చక్కెరను గ్రహించడాన్ని నెమ్మదిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలలో స్పైక్‌లను నివారిస్తుంది. ఇంకా డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

బరువు తగ్గేలా చేస్తుంది: ఆకలిని నియంత్రించే హార్మోన్లను విడుదల చేయడానికి శరీరాన్ని బార్లీ ప్రేరేపిస్తుంది. బార్లీ వాటర్ తీసుకున్నప్పుడు కడుపునిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఈ హార్మోన్లు జీవక్రియను పెంచి.. బరువు తగ్గడానికి దోహదం పడతాయి.

రోగనిరోధక శక్తి – ఇన్ఫెక్షన్లు: బార్లీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇంకా ఫ్రీ రాడికల్స్‌ వల్ల కలిగే నష్టం నుంచి కణాలను రక్షిస్తాయి. ఇంకా అన్ని ఇన్ఫెక్షన్ల ప్రభావం నుంచి కాపాడతాయి.

బార్లీ నీరు ఎలా తయారు చేయాలి..
బార్లీని వేయించుకొని లేదా ఎండలో ఆరబెట్టి పొడి చేసుకోని నిల్వ ఉంచుకోవాలి..

ఆ తర్వాత గిన్నెలో నీళ్లు తీసుకుని.. దానిలో రెండు చెంచాల బార్లీ పొడి వేసి కలపాలి..

ఆ తర్వాత నీటిని మరిగించాలి..

ఉడికించిన నీటిని చల్లార్చి వడకట్టుకోని తాగవచ్చు.. లేకపోతే.. అలా తాగినా మంచిదే..

బార్లీ నీటిలో కొంచెం ఉప్పుతో పాటు మజ్జిగ కూడా కలుపుకుని తాగొచ్చు..

Internet Speed : మీ ఫోన్‌లో ఇంటర్నెట్‌ స్లోగా ఉందా..? అయితే.. ఈ సెట్టింగ్స్‌ మార్చుకోండి!

How to Increase Your Internet Speed : నేటి సాంకేతిక కాలంలో ఇంటర్నెట్‌ అనేది మనందరి జీవితంలో ఓ ముఖ్యమైన భాగంగా మారిపోయింది. నిద్రలేచింది మొదలు.. నిద్రపోయే వరకు నిత్యజీవితంలో అనేక పనులు ఇంటర్నెట్‌ ఆధారంగా మొబైల్‌తోనే చేస్తున్నాం. పాల ప్యాకెట్‌ దగ్గర నుంచి రెంట్‌ పే చేయడం, డబ్బు లావాదేవీలు, కొనడాలు, సినిమాలు, గేమ్స్‌ వంటి అనేక పనులు ఇంటర్నెట్‌ లేకుండా సాధ్యం కాదు. అయితే కొన్నిసార్లు ఇంటర్నెట్ వేగం సడెన్‌గా తగ్గిపోతుంది. దీంతో బ్రౌజింగ్, డౌన్‌లోడ్ సరిగా జరగదు. చాలా పనులు మధ్యలోనే ఆగిపోతాయి. ఈ పరిస్థితుల్లో మనం తీవ్ర ఆందోళనకు గురవుతాం. అయితే ఈ చిట్కాలను ఉపయోగించి ఇంటర్నెట్ వేగాన్ని పెంచుకోవచ్చు. అవేమిటంటే..

స్మార్ట్‌ఫోన్‌లన్నింటిలో ‘ఫైట్ మోడ్’ ఆప్షన్ ఉంటుంది. దీని కోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఫైట్ మోడ్‌ను ఆఫ్ చేసి.. కొద్దిసేపటి తర్వాత ఆన్ చేస్తే, మీ ఫోన్ ఇంటర్నెట్ పూర్తి వేగంతో పనిచేస్తోంది.
మీ ఫోన్ నెట్ స్పీడ్‌ని మెరుగుపరచడానికి మరొక సులభమైన మార్గం మెుబైల్ డేటా ఆప్షన్‌ను ఆఫ్ చేయడం. మీరు ఫోన్ డేటాను కాసేపు ఆఫ్ చేసి.. కొద్దిసేపటి తర్వాత రీస్టార్ట్ చేయడం ద్వారా మొబైల్ డేటా ఫుల్ స్పీడ్‌తో రన్ అవుతుంది.
సాధారణంగా ఇంటర్నెట్ స్పీడ్ నెట్వర్క్ టైప్‌ను బట్టి ఉంటుంది. 4G నెట్‌వర్క్ ఉంటే ఇంటర్నెట్ స్పీడ్‌గా ఉంటుంది. కొన్ని నెట్‌వర్క్ సరిగ్గా పని చేయవు. దీని కోసం మొదట ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి మొబైల్ నెట్‌వర్క్‌ను 4Gకి ఎనేబుల్ చేయాలి. తర్వాత నెట్వర్క్ సెట్టింగ్స్‌కు వెళ్లి యాక్సెస్ పాయింట్ పేర్లపై క్లిక్ చేసి ఏపీఎన్ ను డిఫాల్ట్ గా రీసెట్ చేయాలి.
చాలా సందర్భాల్లో మొబైల్ నెట్‌వర్క్ సరిగ్గా రాకపోవడానికి కారణం మీ డివైజ్ లేటెస్ట్ అప్‌డేట్‌తో ఇన్‌స్టాల్ చేయకపోవడం కూడా కారణం కావచ్చు. అందువల్ల, ఫోన్ లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌తో అప్‌డేట్ అయ్యిందో లేదో చెక్‌ చేసుకోండి.

స్పీడ్ టెస్టులో మీ ఇంటర్నెట్ వేగం తక్కువగా ఉన్నట్లు తేలితే DNS సర్వర్‌ మార్చుకోవడం ద్వారా వేగాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది.
క్రాష్, కుక్కీలను క్లియర్ చేయాలి. మోబైల్ ఫోన్ లో క్రాష్, కుక్కీలను క్లియర్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన మీ ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ వేగవంతం అవుతుంది.
డేటా సేవింగ్ మోడ్‌ని ఆన్ చేయాలి. ఫోన్ లో డేటా సేవింగ్ మోడ్ ను ఆన్ చేయడం కూడా ఇంటర్నెట్ వేగం పెంచుకునే అవకాశం ఉంటుంది.
బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లను క్లోజ్ చేయాలి. ఒకేసారి చాలా యాప్‌లను రన్ కావడం వల్ల ఇంటర్నెట్ వేగం తగ్గే అవకాశం ఉంటుంది. RAMని ఖాళీ చేయడం వలన ఇంటర్నెట్ వేగం పెరుగుతుంది. ఇందుకోసం బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లను క్లోజ్ చేయాలి.
ఆటో-అప్‌డేట్‌లను నిలిపివేయాలి. ఆటోమేటిక్ అప్‌డేట్‌లు చాలా డేటాను తీసుకుంటాయి. దీని వలన ఇంటర్నెట్ వేగం తగ్గుతుంది. ఈ నేపథ్యంలో యాప్‌ల ఆటోమేటిక్ అప్‌డేట్‌లను ఆఫ్ చేయాలి.

AP: గురువుకు శిష్యుల సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఆయనపై ప్రేమతో కారు బహుకరించి

ప్రతి విద్యార్థి జీవితంలో గురువుది కీలకపాత్ర. పాఠాలు చెప్పడంతోనే బాధ్యత తీరిపోతుందనే భావన లేకుండా.. జీవిత పాఠాలను కూడా నేర్పిస్తారు గురువులు. అలాంటి గొప్ప మనసుండే ఓ గురువును శిష్యులు సర్‌‌ప్రైజ్ చేశారు.. ఆయన ఊహించని గిఫ్ట్‌ను ఇచ్చారు. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు ఏకంగా కారును బహుమతిగా ఇచ్చారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మద్దిరాల జవహర్‌ నవోదయ విద్యాలయలో బండి జేమ్స్‌ ఆర్ట్స్ ఉపాధ్యాయుడు. గతంలో అనంతపురం జిల్లాలోని లేపాక్షి నవోదయ, నెల్లూరు జిల్లా నవోదయలో బోధించి, 2016 నుంచి మద్దిరాల నవోదయలో పనిచేస్తున్నారు. ఏప్రిల్‌ 30తో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడిని సత్కరించి గురుదక్షిణ ఇవ్వాలని లేపాక్షి నవోదయ పూర్వ విద్యార్థులు నిర్ణయించుకున్నారు.
ఆదివారం మద్దిరాల నవోదయలో సన్మానోత్సవం ఏర్పాటు చేసి… కార్యక్రమం మధ్యలో ఓ కారు తెచ్చి జేమ్స్‌ దంపతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ నల్లూరి నరసింహారావు, ఇతర అధ్యాపకులు లేపాక్షి పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు జేమ్స్‌ దంపతులను సత్కరించారు. గురువుకు శిష్యుల్ ఇచ్చిన కారు విలువ ఏకంా రూ.12లక్షలు.

కడుపున పుట్టిన బిడ్డలు ప్రయోజకులైన రోజు తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారో.. వారి కన్నా ఎక్కువ ఆనందపడేవారు ఎవరైనా ఉన్నారా అంటే.. వాళ్లే ఉపాధ్యాయులు.

తాము విద్యాబుద్ధులు నేర్పిన విద్యార్థులు.. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరితే.. తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా టీచర్లే సంబరపడతారు. కేవలం పుస్తకాల్లోని పాఠాలు మాత్రమే జీవిత పాఠాలను బోధిస్తూ.. వారిని మంచి మార్గంలో నడిపిస్తూ.. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకునేలా ప్రోత్సాహం, మద్దతిస్తారు టీచర్లు. విద్యార్థుల జీవితాల్లో గురువుది కీలక పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక తమ జీవితాల్లో ముఖ్య పాత్ర పోషించి… లైఫ్‌లో ఉన్నత స్థాయికి చేరుకునేలా ప్రోత్సాహించిన గురువుకు మర్చిపోలేని గురు దక్షిణ సమర్పించారు కొందరు విద్యార్థులు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వివరాలు.

ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌, పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలంలో చోటు చేసుకుంది. జిల్లాలోని మద్దిరాల జవహర్‌ నవోదయ విద్యాలయలో బండి జేమ్స్‌ అనే వ్యక్తి ఆర్ట్స్ ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నాడు. ఆయన గతంలో అనంతపురం జిల్లాలోని లేపాక్షి నవోదయ, నెల్లూరు జిల్లా నవోదయలో బోధించారు. ఇక 2016 నుంచి మద్దిరాల నవోదయలో పనిచేస్తున్నారు. ఏప్రిల్‌ 30తో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడిని సత్కరించి గురుదక్షిణ ఇవ్వాలని లేపాక్షి నవోదయ పూర్వ విద్యార్థులు నిర్ణయించుకున్నారు. అయితే గురు దక్షిణగా ఏదో శాలువా కప్పి.. సత్కారం చేయడం కాకుండా.. వారు కాస్త భారీగా ఆలోచించారు. గురువుకు జీవితంలో మర్చి పోలేని బహుమతిని గురు దక్షిణగా ఇచ్చి.. కృతజ్ఞతలు తెలియజేశారు.

పూర్వ విద్యార్థులంతా.. ఆదివారం మద్దిరాల నవోదయలో ఆర్ట్స్‌ ఉపాధ్యాయుడు జేమ్స్‌కి సన్మానోత్సవం ఏర్పాటు చేశారు.. కార్యక్రమం మధ్యలో ఓ కారు తెచ్చి జేమ్స్‌ దంపతులకు బహుకరించి.. ఆయనకు ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ నల్లూరి నరసింహారావు, ఇతర అధ్యాపకులు లేపాక్షి పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు జేమ్స్‌ దంపతులను సత్కరించారు. జేమ్స్‌కు పూర్వ విద్యార్థులు.. గురు దక్షిణగా ఇచ్చిన ఈ కారు విలువ రూ.12లక్షలు. టీచర్‌ మీద ప్రేమతో ఇంత ఖరీదైన గిఫ్ట్‌ ఇవ్వడం ప్రస్తుతం సంచలనంగా మారింది. గురువుపై విద్యార్థులు చూపిన ప్రేమ ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది.

Karnataka: దేవెగౌడ మనవడి అశ్లీల వీడియోలపై సిట్‌..

ర్ణాటక రాష్ట్రం హాసన్‌ సిటింగ్‌ ఎంపీ, జేడీఎస్‌ నాయకుడు ప్రజ్వల్‌ రేవణ్ణపై వస్తున్న ‘అశ్లీల పెన్‌డ్రైవ్‌’ ఆరోపణలపై కర్ణాటక ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది.

బెంగళూరు, ఏప్రిల్‌ 28 : కర్ణాటక రాష్ట్రం హాసన్‌ సిటింగ్‌ ఎంపీ, జేడీఎస్‌ నాయకుడు ప్రజ్వల్‌ రేవణ్ణపై వస్తున్న ‘అశ్లీల పెన్‌డ్రైవ్‌’ ఆరోపణలపై కర్ణాటక ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. ఏడీజీపీ బీకే సింగ్‌ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేశామని రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర్‌ ఆదివారం ప్రకటించారు. కాగా.. అశ్లీల వీడియోల అంశం హల్‌చల్‌ చేస్తున్న సమయంలోనే ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ జర్మనీలోని ఫ్లాంక్‌ఫర్ట్‌కు వెళ్లిపోవడం మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది.
అయితే సిట్‌ దర్యాప్తులో భాగంగా ఆయన్ని వెనక్కి తీసుకువచ్చి విచారిస్తామని పరమేశ్వర్‌ తెలిపారు. మరోవైపు.. ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణకు సంబంధించి పలు వీడియోలు ప్రస్తుతం రాష్ట్రమంతటా వైరల్‌గా మారాయి. ప్రజ్వల్‌ రేవణ్ణ పలువురు మహిళలతో అశ్లీలంగా ఉన్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి. దీంతో బాధిత మహిళలు న్యాయం చేయాలని టీవీ చానళ్లు, మహిళా కమిషన్‌ను ఆశ్రయిస్తున్నారు. ప్రజ్వల్‌ అశ్లీల వీడియోలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ నాగలక్ష్మి చౌదరి సీఎంకు లేఖ రాశారు.

ఈ విషయమై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ఆదివారం బెంగళూరులో మాట్లాడుతూ.. ప్రజ్వల్‌ దేశం విడిచి పారిపోవడం సిగ్గుచేటన్నారు. కాగా.. తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కావాలని మార్ఫింగ్‌ వీడియోలను ప్రచారం చేశారని ప్రజ్వల్‌ రేవణ్ణ ఆరోపించారు. ఇదిలా ఉండగా, లైంగిక వేధింపులు, నిర్బంధం ఆరోపణలపై మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ, ఆయన కుమారుడు హాసన్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై ఆదివారం హోలినరసిపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఫిర్యాదుదారు రేవణ్ణ సతీమణి భవాని బంధువుగా పేర్కొన్నారు. తాను వంటమనిషిగా పనిచేయడం ప్రారంభించిన నాలుగు నెలల తర్వాత రేవణ్ణ తనను వేధించారని, ఆయన కుమారుడు ప్రజ్వల్‌ తన కుమార్తెకు వీడియో కాల్స్‌ చేసి అసభ్యంగా మాట్లాడేవారని ఆమె ఆరోపించారు.

Health

సినిమా