May Day: నేడే మేడే.. ఇంతకు మేడే అంటే ఏమిటి..? మేడే ఎప్పట్నుంచి స్టార్టయ్యింది??

May Day Celebrations: నేడు మేడే.. ఈ సందర్భంగా కార్మికులకు ప్రముఖులు మేడే శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నేడు కార్మికులు మేడేను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే, మేడే అంటే ఏమిటి.. మేడే ఎప్పట్నుంచి స్టార్ట్యయ్యింది? అనే సందేహాలు చాలా మందికి ఉంటాయి.. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

అయితే.. 1886, మే 1న షికాగోలోని హే మార్కెట్లో కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. కార్మికులకు 8 గంటల పని విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నాడు జరిగిన ఈ ఉద్యమానికి మద్దతుగా నాలుగు రోజుల తర్వాత షికాగోలోని హే మార్కెట్ లోనే భారీ ప్రదర్శన నిర్వహించారు. ఆ ఉద్యమం ఉద్రిక్తంగా మారింది. ఉద్యమం ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసులు కాల్పులు జరపడంతో అనేకమంది కార్మికులు తమ ప్రాణాలను కోల్పోయారు. అయితే, ఈ మారణకాండను నిరసిస్తూ అనేక దేశాల్లో ఉద్యమాలు నిర్వహించారు. షికాగోలోని హే మార్కెట్లో ప్రాణాలర్పించిన కార్మికులను స్మరించుకుంటూ ప్రతి ఏటా మే 1న కార్మిక దినోత్సవంగా జరపుకుంటున్నారు. 1923 నుంచి ఇండియాలో మేడేను నిర్వహిస్తున్నారు. మేడేను ప్రతి ఏటా కార్మికులు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. కార్మికుల ప్రాణత్యాగాలను నేడు గుర్తుచేసుకుంటారు. ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించి కార్మికుల ఐక్యతను చాటుతారు. నేడే మేడే అనే పాటలను ఈ సందర్భంగా ఆలపిస్తుంటారు.

ఈ మేడే.. ఎన్నో ప్రజా ఉద్యమాలను స్మరించుకునేలా చేస్తుంది. ఎంతోమంది కార్మికులు పోరాటాలు చేసి, తమ రక్తాలను చిందించి కార్మిక హక్కులను సాధించారు. అందులో ముఖ్యంగా 8 గంటల పని. ఒకప్పుడు కార్మికులు విశ్రాంతి లేకుండా పని చేయాల్సి వచ్చేది. ఈ క్రమంలో కార్మికులంతా కలిసి ఈ వెట్టిచాకిరి మేం చేయలేమంటూ ఎదురించి పోరాడి 8 గంటల పని విధానాన్ని తీసుకొచ్చారు. ఇది కార్మికులు సాధించిన విజయం.

మేడే సందర్భంగా కార్మికులకు ప్రముఖులు, రాజకీయ నేతలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మేడే ఉద్దేశాన్ని నిర్వచిస్తూ, కార్మికుల గొప్పతనాన్ని తెలియజేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *