Friday, November 15, 2024

LIC: ఎల్‌ఐసీలో బెస్ట్‌ స్కీమ్‌.. రోజూ రూ.45 డిపాజిట్‌తో మెచ్యూరిటీ తర్వాత రూ.25 లక్షలు

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) సేవింగ్ స్కీమ్‌లు భద్రత, రాబడి రెండింటి పరంగా బాగా ప్రాచుర్యం పొందాయి. ఇందులో, పిల్లలు, వృద్ధులు, మహిళలకు వయస్సు ఆధారంగా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో చాలా వరకు మీరు చిన్న మొత్తాలను పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా భారీ ఫండ్‌ను కూడగట్టవచ్చు. అటువంటి పథకం ఎల్‌ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ. దీనిలో మీరు రోజుకు కేవలం రూ. 45 ఆదా చేయడం ద్వారా రూ. 25 లక్షలు పొందవచ్చు. ఇది కాకుండా ఈ ఎల్‌ఐసీ పథకంలో అనేక ఇతర ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

చిన్న పొదుపులు, పెద్ద లాభం

మీరు తక్కువ ప్రీమియంతో మీ కోసం పెద్ద ఫండ్‌ను సేకరించాలనుకుంటే, జీవన్ ఆనంద్ పాలసీ ఒక గొప్ప ఎంపికగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది టర్మ్ పాలసీ లాంటిదే. మీ పాలసీ అమల్లో ఉన్నంత కాలం మీరు ప్రీమియం చెల్లించవచ్చు. ఈ పథకంలో పాలసీదారుడు కేవలం ఒకటి మాత్రమే కాకుండా అనేక మెచ్యూరిటీ ప్రయోజనాలను పొందుతాడు. ఎల్‌ఐసీ ఈ పథకంలో కనీసం రూ. 1 లక్ష హామీ అందిస్తుంది. అయితే గరిష్ట పరిమితి ఏదీ నిర్ణయించబడలేదు.
రూ.45 డిపాజిట్ చేయడం ద్వారా రూ.25 లక్షలు ఎలా పొందాలి:

ఎల్‌ఐసీ జీవన్ ఆనంద్ పాలసీలో మీరు ప్రతి నెలా దాదాపు రూ.1358 డిపాజిట్ చేయడం ద్వారా రూ.25 లక్షలు పొందవచ్చు. దాని ప్రకారం చూస్తే ప్రతిరోజూ రూ.45 మాత్రమే ఆదా చేయాల్సి ఉంటుంది. అయితే ఎల్‌ఐసీ ఈ పాలసీ దీర్ఘకాలిక ప్రణాళికగా పరిగణిస్తారు. దీని పాలసీ వ్యవధి 15 నుంచి 35 ఏళ్లు. అంటే, మీరు ప్రతిరోజూ రూ. 45 ఆదా చేయడం ద్వారా 35 సంవత్సరాల పాటు ఈ పాలసీ కింద పెట్టుబడి పెడితే, ఈ పథకం మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత మీకు రూ. 25 లక్షల మొత్తం లభిస్తుంది. వార్షిక ప్రాతిపదికన మీరు ఆదా చేసిన మొత్తాన్ని పరిశీలిస్తే అది దాదాపు రూ.16,300 అవుతుంది.

మీరు 35 సంవత్సరాల పాటు ఈ ఎల్‌ఐసి పాలసీలో ప్రతి సంవత్సరం రూ. 16,300 పెట్టుబడి పెడితే, మొత్తం డిపాజిట్ మొత్తం రూ. 5,70,500 అవుతుంది. ఇప్పుడు పాలసీ టర్మ్ ప్రకారం, ప్రాథమిక హామీ మొత్తం రూ. 5 లక్షలు అవుతుంది. మెచ్యూరిటీ వ్యవధి తర్వాత మీకు రూ. 8.60 లక్షల రివిజనరీ బోనస్, రూ. 11.50 లక్షల చివరి బోనస్ అందుకుంటారు. ఎల్‌ఐసీ జీవన్ ఆనంద్ పాలసీలో బోనస్ రెండుసార్లు ఇవ్వబడుతుంది. అయితే దీనికి మీ పాలసీ తప్పనిసరిగా 15 సంవత్సరాలు ఉండాలి.

ఈ ప్రయోజనాలు కూడా ఈ పథకంలో..

జీవన్ ఆనంద్ పాలసీని తీసుకునే పాలసీదారు ఈ పథకం కింద ఎలాంటి పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందరు, కానీ ఇందులో మీరు నాలుగు రకాల రైడర్‌లను పొందుతారు. వీటిలో యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబిలిటీ రైడర్, యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్, న్యూ టర్మ్ ఇన్సూరెన్స్ రైడర్ మరియు న్యూ క్రిటికల్ బెనిఫిట్ రైడర్ ఉన్నాయి. డెత్ బెనిఫిట్ గురించి మాట్లాడితే, పాలసీదారుడు ఏదైనా కారణం వల్ల మరణిస్తే, నామినీ పాలసీలో 125 శాతం డెత్ బెనిఫిట్ పొందుతారు.

కూటమి మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఫిక్స్.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

టమి మేనిఫెస్టోను ఈ నెల 30న విడుదల చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో కూటమి అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌ మాట్లాడుతూ కూటమి మేనిఫెస్టో విడుదలపై స్పష్టత ఇచ్చారు. తమ మేనిఫెస్టో చూస్తే ప్రజల కళ్లల్లో ఆనందం కనిపిస్తుందని చెప్పారు. ఎన్డీయే కూటమికి ఓటు వేయాలని, లేని పక్షంలో ప్రజలకే నష్టమని చెప్పారు. రాష్ట్రంలో రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయని విమర్శించారు. భవన నిర్మాణ కార్మికుల నిధులను సైతం దోచుకున్నారని ఆరోపించారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను పునరుద్ధరిస్తామని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి నియోజకవర్గాల్లోకి ఇతరులను రానివ్వారని, వాళ్లు మాత్రం ఎక్కడికైనా వస్తారని, ఏ జిల్లాలోనైనా దోచుకుంటారని పవన్ మండిపడ్డారు. అరటి తొక్కలాంటి జగన్ ప్రభుత్వాన్ని చెత్తబుట్టలో వేయండని పిలుపునిచ్చారు. వైసీపీకి ఓటేస్తే కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నట్లేనని పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు. నియోజవకర్గానికి హాని చేసే ఏ నేతనైనా నిలదీయాలని సూచించారు. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని పక్కన పెట్టుకుని వైసీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ఓట్లు అడుతున్నారని పవన్ కల్యాణ్ ఎద్దేవాచేశారు. అసలు చలమలశెట్టి సునీల్‌కు ఎందుకు ఓటు వేయాలని నిలదీశారు. తాము గెలిస్తే గిరిజనుల తరపున అసెంబ్లీలో పోరాడతామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.

IPL 2024: విధ్వంసం.. కేవలం 10 బంతుల్లోనే ఫిఫ్టీ కొట్టేశాడు!

గుజరాత్ టైటాన్స్ పై రికార్డ్ విజయాన్ని సాధించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్. 200 పరుగుల భారీ టార్గెట్ ను కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 16 ఓవర్లలోనే దంచికొట్టి.. ప్రపంచ క్రికెట్ ను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఇక ఈ మ్యాచ్ లో కొన్ని ఊహించని, నమ్మశక్యం కాని సంఘటనలు క్రికెట్ ప్రేమికులను షాక్ కు గురిచేస్తున్నాయి. అందులో ఒకటి విల్ జాక్స్ మెరుపు సెంచరీ. అతడి విధ్వంసాన్ని వర్ణించడానికి పదాలు కూడా సరిపోవు. మరి అతడి మెరుపు బ్యాటింగ్ లో విశేషాలు బోలెడున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం పదండి.

ఆర్సీబీ గెలవడానికి చివరి 6 ఓవర్లలో 53 పరుగులు కావాలి. ఈ దశలో కోహ్లీ(69), విల్ జాక్స్(44) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. మరి వీరిద్దరిలో సెంచరీ ఎవరు చేస్తారు? విరాట్ కోహ్లీనే అని అందరూ అనుకుంటారు. కానీ క్రికెట్ దిగ్గజాలే ఆశ్చర్యపడేలా, ప్రేక్షకులే అవాక్కైయ్యేలా తన బ్యాట్ కు పనిచెప్పాడు జాక్స్. తన తొలి ఫిఫ్టీని 31 బంతుల్లో చేసిన అతడు.. సెంచరీ మార్క్ ను చేరుకోవడానికి కేవలం 10 బంతులు మాత్రమే తీసుకున్నాడు. కేవలం రెండు ఓవర్లలోనే మ్యాచ్ ను ముగించేశాడు. మెహిత్ శర్మ వేసిన 15వ ఓవర్లో వరుసగా.. 4, 6, నోబాల్ 6, 2, 6, 4, 0లతో ఏకంగా 29 పరుగులు పిండుకున్నాడు. దీంతో 44 రన్స్ నుంచి ఒక్క ఓవర్లలోనే 73 పరుగులకు చేరుకున్నాడు. ఆ తర్వాత వరల్డ్ క్లాస్ స్పిన్నర్ గా పేరుగాంచిన రషీద్ ఖాన్ ఓవర్లో తన విశ్వరూపం చూపాడు.

కాగా విల్ జాక్స్ దంచుడు చూసి తొలి బంతికి సింగిల్ ఆడి అతడికి స్ట్రైక్ ఇచ్చాడు కోహ్లీ. ఇక ఆ తర్వాత వరుస బంతుల్లో 6, 6, 4, 6, 6లతో మ్యాచ్ ను ముగించేయడమే కాకుండా.. సంచలన శతకాన్ని నమోదు చేశాడు. అసలు ఇలా మ్యాచ్ ముగుస్తుందని బహుశా ఎవ్వరూ ఊహించి ఉండరు. కానీ విల్ జాక్స్ శివతాండవంతో.. అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. తొలి అర్దశతకానికి 31 బంతులు ఆడి.. ఆ తర్వాత ఫిఫ్టీని కేవలం 10 బంతుల్లోనే అందుకుని విధ్వంసానికి మరోపేరుగా మారాడు. ఇక జాక్స్ ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 10 సిక్సులు ఉన్నాయి. 41 బంతుల్లో సెంచరీ మార్క్ ను అందుకున్నాడు జాక్స్.

50 మందిని కాపాడిన బాలుడు.. CM రేవంత్‌​ చేతుల మీదుగా సన్మానం

మూడు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా, నందిగామలోని అలెన్ హోమియో అండ్ హెర్బల్ ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రమాదాన్ని గమనించిన 15 ఏళ్ల బాలుడు ఒకరు.. భయపడకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించి.. సుమారు 50 మందిని కాపాడాడు. బాలుడి చూపిన సమయస్ఫూర్తి, ధైర్యసాహసాలను ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సదరు సాహస బాలున్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సత్కరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

ఫార్మ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో అది గమనించిన విద్యార్థి సాయిచరణ్‌ వెంటనే స్పందించి.. బిల్డింగ్‌ మీదకు వెళ్లి తాడు కట్టి.. ప్రమాదంలో చిక్కుకున్న 50 మంది కార్మికులు బయటకు వచ్చేలా సాయం చేశాడు. ఇక బాలుడు ప్రదర్శించిన తెగింపు, దైర్య సాహసాల గురించి తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. సాయి చరణ్‌, అతడి కుటుంబాన్ని తన నివాసానికి పిలిపించుకుని మరీ అభినందించారు. బాలుడి సాహసాన్ని మెచ్చుకున్న రేవంత్ రెడ్డి.. శాలువా కప్పి.. అతడిని సన్మానించారు. సాయి చరణ్‌కి మంచి భవిష్యత్ ఉండాలని ఆకాంక్షించారు. సాయిచరణ్ చూపించిన ధైర్య, సాహసాలు ఎంతో మంది యవతకు స్ఫూర్తి అని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు.

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామకు చెందిన సాయిచరణ్ ఇటీవలే పదో తరగతి పూర్తి చేశాడు. ఈ నెల 26న నందిగామలో స్థానిక ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. తన స్నేహితుడి తల్లి అదే కంపెనీలో పనిచేస్తుంది. ఇక ప్రమాదం గురించి తెలుసుకున్న సాయిచరణ్ వెంటనే అక్కడికి చేరుకున్నాడు. అప్పటికే చాలా మంది కార్మికులు బయటికి వచ్చేయగా.. మరో 50 మంది వరకు భవనంలో చిక్కుకుపోయారు. కాపాడండి అంటూ అరుస్తున్న వారి ఆర్తనాదాలు విన్న సాయి చరణ్.. అగ్నిమాపక సిబ్బందికి సాయం చేశాడు.

వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. ప్రమాదం జరిగిన బిల్డింగ్‌ నాలుగో అంతస్తుకు వెళ్లి.. తాడు కట్టి దాని సాయంతో అక్కడున్న వాళ్లు కిందికి వచ్చేలా సాయం చేశాడు. అతడు చూపిన తెగువ, ధైర్యం, సమయస్ఫూర్తి వల్ల భవనంలో చిక్కుకున్న 50 మంది తాడు సాయంతో కిందకు దిగి.. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. లేదంటే ప్రాణ నష్టం సంభవించేది. ఆ సమయంలో సాయి చరణ్ చూపించిన ధైర్య సాహసాలను ఎమ్మెల్యే వీరపల్లి శంకర్, డీసీపీ నారాయణరెడ్డి అభినందించారు. ఇక ఎమ్మెల్యే శంకర్ సాయి చరణ్‌కు 5 వేల రూపాయల రివార్డ్‌ ఇవ్వడానికి ముందుకు రాగా బాలుడు తిరస్కరించాడు. అతడి వ్యక్తిత్వంపై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపించారు. ఇక తాజాగా సీఎం రేవంత్‌ కూడా సాయి చరణ్‌ను అభినందించాడు.

Health Tips: గుండెపోటు రాకుండా చేసే ఆహర పదార్దాలు ఇవే…వీటిని తింటే గుండెలో బ్లాకులు రమ్మన్నా రావు…

శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్‌లు ఉంటాయి.అవి HDL,LDL, వీటిని మంచి,చెడు కొలెస్ట్రాల్ అని కూడా అంటారు. అధిక స్థాయి HDL లేదా మంచి కొలెస్ట్రాల్ గుండె జబ్బులను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.LDL లేదా చెడు కొలెస్ట్రాల్ గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

పోషకాహార నిపుణులు హెచ్‌డిఎల్ స్థాయిలను వ్యాయామంతో మాత్రమే కాకుండా ఈ క్రింది ఆహారాల సహాయంతో కూడా పెంచవచ్చు అని తెలిపారు.

చియా విత్తనాలు: చియా విత్తనాలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, ఇతర ఆరోగ్యకరమైన పోషకాలకు మంచి మూలం. అటువంటి పరిస్థితిలో, చియా విత్తనాలను ఆహారంలో చేర్చడం వల్ల ఎల్‌డిఎల్ స్థాయిలు,రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.

బార్లీ: నానబెట్టిన బార్లీ గింజలు బీటా గ్లూకాన్‌ను పెంచుతాయి. ఇందులో ఉండే ఫైబర్ కారణంగా, ఇది ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను పెంచడానికి పనిచేస్తుంది.

వాల్నట్: వాల్‌నట్స్‌లో ప్రధానంగా ఒమేగా-3 కొవ్వులు ఉంటాయి. ఇది ఒక రకమైన మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్, ఇది గుండె జబ్బుల నుండి రక్షించడానికి పనిచేస్తుంది. దీన్ని తినడం వల్ల హెచ్‌డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్ స్థాయి కూడా పెరుగుతుంది.

సోయాబీన్: మాంసం వలె శాఖాహారంగా, సోయాబీన్స్‌లో కొవ్వు, ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మాత్రమే కాదు, సోయాలోని ఐసోఫ్లేవోన్లు HDL స్థాయిలను పెంచుతాయి ,ఫైటోఈస్ట్రోజెన్లు LDL స్థాయిలు , ట్రైగ్లిజరైడ్లను తగ్గించడం ద్వారా మీ లిపిడ్ ప్రొఫైల్‌ను మెరుగుపరుస్తాయి.

డబుల్ మీనింగ్ సాంగ్ అని బ్యాన్ చేశారు.. కట్ చేస్తే దేశాన్నే ఊపేసింది.. ఇప్పటికీ ట్రెండింగే

ఇండస్ట్రీలో కాంట్రవర్సీలో కామనే.. చిన్న చిన్న విషయాలకు కూడా మనోభావాలు దెబ్బతిన్నాయంటూ రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఓ పెద్ద వస్తుందంటే చాలు..

ఖచ్చితంగా ఎదో ఒక కాంట్రవర్సీ పుట్టుకు వస్తుంది. ల్లో స్పెషల్ సాంగ్స్ పక్కా ఉంటాయి. ఐటెం సాంగ్స్ కే హైలెట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇలానే ఓ ఐటెం సాంగ్ ను డబుల్ మీనింగ్ సాంగ్ అంటూ బ్యాన్ చేశారు. సంజయ్ దత్ ,మాధురీ దీక్షిత్ నటించిన ఓ మూవీలోని సాంగ్ కే హైలెట్ అయ్యింది. అంతే కాదు దేశాన్నే ఓ ఊపు ఊపేసింది ఆ సాంగ్ ఇప్పటికీ ఆ సాంగ్ వినిపిస్తూనే ఉంది. ఇంతకూ ఆ సాంగ్ ఏంటంటే.. అంతే కాదు ఎవర్ గ్రీన్ సాంగ్ గా నిలిచింది. ఆ సాంగ్ ఏంటంటే..

1993లో విడుదలైన ఖల్‌నాయక్‌ భారీ హిట్ సొంతం చేసుకుంది. అత్యధిక వసూళ్లు సాధించి బాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ .. ఖల్‌నాయక్ లో మాధురి దీక్షిత్ ఐటమ్ సాంగ్‌లా వచ్చిన పాట చోళీ కే పీచే క్యా హై.. ఈ సాంగ్ ట్రెండ్ సెట్ చేసింది. అప్పట్లో ఈ సాంగ్ కోసమీ క్యాసెట్స్ ను కొన్నారట.. ఏకంగా కోట్లకు పైగా క్యాసెట్స్ అమ్ముడయ్యాయట..

కేవలం ఒక్క వారంలో 1 కోటికి పైగా అమ్ముడయ్యాయి ఈ మూవీ క్యాసెట్స్. ఆ పాట మాధురీ దీక్షిత్‌ని ఓవర్‌నైట్‌లో స్టార్ హీరోయిన్ ను చేసింది. మాధురీ దీక్షిత్‌, నీనా గుప్తా కలిసి సాంగ్ కు డాన్స్ చేశారు. అయితే ఈ సాంగ్ విషయంలోనూ కాంట్రవర్సీ జరిగింది. పాటలో డబుల్ మీనింగ్ ఉందంటూ కొందరు వ్యతిరేకించారు. ఈ పాట డబుల్ మీనింగ్ లిరిక్స్ ఉన్నాయంటూ దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోలో ఈ సాంగ్ ను బ్యాన్ చేశారు.అయినా కూడా ఈ సాంగ్ ట్రెండ్ సెట్ చేసింది. రీసెంట్ గా ఈ సాంగ్ ను రీమేక్ చేశారు. బాలీవుడ్ లో కరీనా కపూర్, కృతి సనన్ , టబు నటించిన ‘ది క్రూ’ లో రీమేక్ చేశారు .

Rain Alert : హమ్మయ్య మళ్లీ వర్షాలొస్తున్నాయ్.. 14 జిల్లాలకు రెయిన్ అలర్ట్

Rain Alert to Telangana today : గ్రేటర్ లోనే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 9 గంటల తర్వాతి నుంచి సాయంత్రం 5 గంటలు దాటినా.. బయటికి వెళ్లాలంటే జంకాల్సిన పరిస్థితి ఉంది. తీవ్రమైన ఎండలు, వేడిగాలులు, ఉక్కపోత.. ఒకటేమిటి.. అన్నీ ఎక్కడలేని చికాకును తెప్పిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలే కాదు.. రాత్రి ఉష్ణోగ్రతల్లోనూ మార్పొచ్చింది. ఇళ్లలో ఫ్యాన్లు 24 గంటలు తిరుగుతూ ఉన్నా.. ఉక్కపోత తగ్గడం లేదు.

వేసవి తాపాన్ని భరించలేక ప్రజలు కూల్ డ్రింక్స్, ఇతర శీతల పానీయాలు తాగడానికి మక్కువ చూపుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఎండలు.. అగ్నిగుండాన్ని తలపిస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణశాఖ ఒక కూల్ న్యూస్ చెప్పింది. నేడు రాష్ట్రంలోని 14 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

నిర్మల్, కుమురంభీమ్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, పెద్దపల్లె, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సంగారెడ్డి, భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలలో వర్షాలు పడొచ్చని వెల్లడించింది. హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. వర్షాలు పడితే మండుటెండల నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఇప్పటికే రాష్ట్రంలో 45 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణం మారితే.. ఉష్ణోగ్రతలు 36-40 డిగ్రీల మధ్య నమోదవుతాయని తెలిపింది. ఇక ఆదివారం హైదరాబాద్ లో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Leopard: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో చిరుత.. భయాందోళనలో సిబ్బంది

Leopard at Shamshabad: నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విమానాశ్రయంలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. ఆదివారం వేకువజామున విమానాశ్రయంలోని పెట్రోలింగ్ సిబ్బంది రన్‌వే‌పై చిరుతను గుర్తించారు.

శంషాబాద్ విమానాశ్రయంలో ఆదివారం తెల్లవారుజామున చిరుత కనిపించడం అందరినీ కలవరపెడుతోంది. విధుల్లో భాగంగా పెట్రోలింగ్ చేస్తున్న సిబ్బందికి రన్‌వేపై చిరుత కనిపించింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది.. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో గొల్లపల్లి వద్ద చిరుత ఎయిర్ పోర్ట్ ప్రహరీ దూకుతుండగా ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగిలింది. దీంతో ఒక్కసారిగా ఎయిర్ పోర్ట్‌ కంట్రోల్ రూమ్‌లో అలారం మోగిందని సిబ్బంది వెల్లడించారు. అలారం మోగడంతో అప్రమత్తమైన సిబ్బంది.. సీసీటీవీలను పరిశీలించారు.

సీసీటీవీలో ఓ చిరుతతో పాటుగా రెండు చిరుత పిల్లలు కూడా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని ఎయిర్ పోర్ట్ సిబ్బంది.. అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. దీంతో అటవీ సిబ్బంది హుటాహుటిన ఎయిర్ పోర్ట్‌లోకి చేరుకున్నారు. చిరుతను, పిల్లలను బంధించేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ చిరుత వారి కంట పడలేదు. దీంతో సిబ్బంది చిరుతకోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలిస్తున్నారు.

పెన్షన్ దారులకు గుడ్ న్యూస్.. పెన్షన్ల పంపిణీపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన

ఆసరా పెన్షన్ల పంపిణీపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన ప్రకటన చేసింది. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో మే 1వ తేదీ నుండి 5 తేదీ వరకు పెన్షన్లు జమ చేస్తామని వెల్లడించింది.

కాగా, ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో పెన్షన్ పంపిణీ నుండి వాలంటీర్లను పక్కన పెట్టిన ఈసీ.. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయాలని రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈసీ ఆదేశాల నేపథ్యంలో పెన్షన్ పంపిణీ విధివిధానాల్లో అధికారులు మార్పులు చేపట్టారు.

నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోనే పెన్షన్లు జమ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లతో పంచాయితీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. మే 1వ తేదీ నుండి 5 వరకు లబ్దిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. నేరుగా లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో పెన్షన్లు వేస్తామని పేర్కొన్నారు. బ్యాంక్ ఖాతా లేని వారికి, దివ్యాంగులకు నేరుగా ఇంటి వద్దే పెన్షన్లు అందిస్తామని తెలిపారు. సచివాలయ ఉద్యోగాల ద్వారా మే 5 వరకు పెన్షన్ల పంపిణీ పూర్తి చేస్తామని వెల్లడించారు.

Singareni Jobs : సింగరేణిలో 327 ఉద్యోగాలు..దరఖాస్తులకు కొత్త తేదీలు ఇవే..

ప్రముఖ గవర్నమెంట్ సంస్థ సింగరేణి భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. 327 ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు ఏప్రిల్ 15 నుంచి మే 4 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తామని అధికారులు పేర్కొన్నారు. అయితే ఆ తేదీల్లో మార్పులు ఉన్నట్లు తాజాగా కొత్త తేదీలను ప్రకటించారు.. మే 15 నుంచి జూన్ 4వ తేదీ అప్లై చేసుకొనే అవకాశాన్ని కల్పిస్తున్నారు.. ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..

మొత్తం పోస్టులు..327

పోస్టుల వివరాలు..

ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌: మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ(ఈ-ఎం), ఈ2 గ్రేడ్‌-42, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ(సిస్టమ్స్‌), ఈ2 గ్రేడ్‌-07.

నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌: జూనియర్‌ మైనింగ్‌ ఇంజనీర్‌ ట్రెయినీ(జేఎంఈటీ), టీ-ఎస్‌ గ్రేడ్‌ సీ-100, అసిస్టెంట్‌ ఫోర్‌మ్యాన్‌ ట్రెయినీ(మెకానికల్‌)టీ-ఎస్‌ గ్రేడ్‌ సీ-09, అసిస్టెంట్‌ ఫోర్‌మ్యాన్‌ ట్రెయినీ(ఎలక్ట్రికల్‌)టీ-ఎస్‌ గ్రేడ్‌ సీ-24, ఫిట్టర్‌ ట్రెయినీ, క్యాట్‌ 1-47, ఎలక్ట్రీషియన్‌ ట్రెయినీ, క్యాట్‌ 1-98 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు..

అర్హతలు..

ఈ పోస్టులకు డిగ్రీ పీజీ, ఐఐటీ, డిప్లొమా లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి..

వయసు..

పోస్ట్‌ను అనుసరించి జూన్‌ 1, 2024 నాటికి కనీస వయసు 18 ఏళ్లు, గరిష్ట వయసు 30 ఏళ్లు ఉండాలి.. మిగిలిన వారికి వయసులో సడలింపు ఉంటుంది..

ఎంపిక ప్రక్రియ..

రాత పరీక్ష, మెరిట్‌ జాబితా రూపొందిస్తారు. టైపింగ్, డేటాఎంట్రీ, కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ విభాగాల్లో స్కిల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు..

ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం తేదీ, చివరి తేదీలు : 15.05.2024 నుంచి 04.06.2024 వరకు అప్లై చేసుకోవచ్చు..
వెబ్‌సైట్‌: https://scclmines.com/ .. ఈ పోస్టుల గురించి మరిన్ని విషయాలను తెలుసుకోవాలంటే ఈ వెబ్ సైట్ ను పరిశీలించండి..

ఉద్యోగాల భర్తీకి మార్చి నెలలో నోటిఫికేషన్ జారీ చేసింది. తాజా ప్రకటన ప్రకారం ఈ పోస్టులకు మే 15వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.. ఈ విషయాన్ని గుర్తుంచుకోని అప్లై చేసుకోగలరు..

నీరు రివర్స్‌లో ప్రవహించడం మీరు ఎప్పుడైనా చూశారా..? ఈ వీడియో చూస్తే అవాక్కే..! ఎక్కడో కాదండోయ్..

అడవులు, జలపాతాలు, దేవాలయాలు, స్మారక చిహ్నాలతో కూడిన ఛత్తీస్‌గఢ్ భారతదేశంలో చాలా ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఛత్తీస్‌గఢ్‌లో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.
ఇక్కడ మీరు మీ సెలవులను హ్యాపీగా ఎంజాయ్‌ చెయొచ్చు. అలాగే, ఇక్కడ మైన్‌పట్ అనే ప్రాంతం ఎంతో ప్రత్యేకమైనది. ఇక్కడి ప్రకృతి అందాలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. నిజానికి మైన్‌పట్‌ చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవులను కలిగి ఉంటుంది. అందువల్ల వేసవిలో కూడా ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రతి సీజన్‌లోనూ ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. కాబట్టి మీరు ఛత్తీస్‌గఢ్‌ని సందర్శించాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, ఖచ్చితంగా ఈ స్థలాన్ని తప్పక చూసిరండి.

మైన్‌పట్‌లో ఒక ప్రత్యేక ప్రదేశం ఉంది. ఆ ప్రాంతానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా ఓ యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వైరల్ అవుతున్న వీడియో చూసిన నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు. వీడియోలో యువకుడు చెబుతున్న దాని ప్రకారం.. భారతదేశంలో గురుత్వాకర్షణ కూడా పని చేయని ప్రదేశం గురించి చెప్పాడు. ఛత్తీస్‌గఢ్‌లో ఒక గ్రామం ఉంది. ఇక్కడ నీరు రివర్స్‌లో ప్రవహిస్తుంది. అవును మీరు విన్నది నిజమే. ఇక్కడ నీరు తలక్రిందులుగా ప్రవహిస్తుంది.

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో @jethi_vlogs షేర్ చేశారు. ఈ వీడియో ఛత్తీస్‌గఢ్‌లోని మైన్‌పట్‌లోనిది. ఇక్కడ గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా నీరు ప్రవహించే ప్రదేశం. ఈ ప్రదేశాన్ని ఉల్టాపానీ అంటారు. వీడియోలో, యువకుడు ఒక చిన్న నీటి ప్రవాహం దగ్గర నిలబడి ఉన్నట్లు పేర్కొన్నాడు. ఈ యువకుడు నిలబడి ఉన్న చోట ఒకవైపు కొండ, మరోవైపు వాలు కనిపిస్తుంది. గురుత్వాకర్షణ కారణంగా నీరు ఎల్లప్పుడూ ఎత్తు నుండి దిగువకు ప్రవహిస్తుంది. కానీ, ఇక్కడ దీనికి విరుద్ధంగా జరిగింది. ఈ ప్రదేశంలో వాలు నుండి నీరు ఎత్తైన దిశలో ప్రవహిస్తోందని యువకుడు పేర్కొన్నాడు. దీనిని నిరూపించడానికి, యువకుడు నీరు పైకి ప్రవహిస్తున్నందున దిగువకు కాకుండా పైకి వెళ్ళే నీటిలో ఒక ఆకును వదలాడు. వీడియో చూసిన తర్వాత మీ కళ్లను మీరే నమ్మలేరు.


ఈ వీడియోను లక్షలాది మంది ప్రజలు లైక్ చేసారు. అనేక మంది వివిధ స్పందనలను వ్యక్తం చేశారు. ‘భారతదేశం న్యూటన్ కోసం కాదు’ అని ఒక వినియోగదారు అన్నారు. మరొకరు “అది సాధ్యం కాదు అని అంటున్నారు. ఇలా చాలా మంది నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.

Heatwave: డేంజర్‌.. డేంజర్‌..! బయటకు రాకుండా ఉంటేనే బెటర్.. తెలంగాణ, ఏపీలో హీట్‌వేవ్ వార్నింగ్‌

Oplus_131072

డేంజర్‌..! మీరు ఇళ్ల నుంచి బయటికి వెళ్తున్నారా? బీ కేర్‌ఫుల్!. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి కాలు బయటపెట్టకండి. ఎందుకంటే, తెలుగురాష్ట్రాలకు రెడ్ వార్నింగ్‌ ఇచ్చింది వాతావరణశాఖ.
మరో 3 రోజులపాటు ఎండలు మండిపోతున్నాయని హెచ్చరించింది ఐఎండీ.. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండ వేడికి జనాలు ఒక్కరి బిక్కిరి అవుతున్నారు. ఏప్రిల్ నెల నుంచి కొన్ని జిల్లాల్లో 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. తీవ్రమైన ఎండలకు తోడు వడగాల్పులు వీస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది.

8 జిల్లాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు..

దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. శుక్రవారం దాదాపు 8 జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటింది. గత పదేళ్లలో ఏప్రిల్‌ నెల చివరి వారంలో ఒకేసారి ఇన్ని కేంద్రాల్లో ఈస్థాయి ఎండలు చూడటం ఇదే తొలిసారి. 45 డిగ్రీలు దాటిన కరీంనగర్‌, ములుగు, నల్గొండ, జగిత్యాల, యాదాద్రి, వరంగల్‌, వనపర్తి జిల్లాలకు రెడ్‌ వార్నింగ్‌ జారీ చేసింది వాతావరణశాఖ.

జమ్మికుంట-45.6, మంథని-45.2, నిడదమానురు-45.2, కోల్వాయి-45.1, మాడుగలపల్లి-45.1, మర్యాల-45.1, వీణవంక-45.1, వెల్గటూరు-45.1, భద్రాచలం-44, హైదరాబాద్‌-42 గా నమోదైంది..

తెలంగాణలో మరో మూడు రోజులపాటు ఎండలు మండిపోనున్నాయి. వృద్దులు, పిల్లలు, వీధి వ్యాపారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు. వీలయినంతవరకూ ఓర్‌ఎస్‌, చలువ చేసే ఇతర జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.

ఏపీలోనూ భానుడి భగభగలు..

ఏపీలోనూ భానుడి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు కొనసాగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. ఇవాళ 58 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 148 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.

శ్రీకాకుళంలో 17 మండలాల్లో తీవ్ర వడగాల్పులు

ఇక నిన్న ఏపీలోని నంద్యాలజిల్లా చాగలమర్రిలో 45.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. తిరుపతిజిల్లా రేణిగుంటలో 45.7, కడపజిల్లా ఖాజీపేట, పార్వతీపురంమన్యం జిల్లా సాలూరులో 45.7, విజయనగరంజిల్లా గజపతినగరం, కర్నూలుజిల్లా కోడుమూరులో 44.8, అనంతపురంజిల్లా తాడిపత్రిలో 44.4, పల్నాడుజిల్లా మాచెర్లలో 44.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ వెల్లడించింది.

ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని విపత్తుల సంస్థ అధికారులు సూచించారు. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Climb Stairs: ప్రతిరోజూ మెట్లు ఎక్కండి.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి..

ప్రస్తుత కాలంలో పని అంతా చాలా ఫాస్ట్‌గా అయిపోవాలి. ఆఖరికి తిండి విషయంలో కూడా ఇలాగే చేస్తున్నారు. అందుకే ఇప్పుడున్న జనరేషన్‌లో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ రకరకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు.
ఇప్పుడు లిఫ్టులు వచ్చాక.. చాలా మంది మెట్లు ఎక్కడమే మర్చి పోయారు. ఎప్పుడో కరెంట్ పోయినప్పుడు తప్ప.. మెట్లు అనేవి ఎక్కడం లేదు. కానీ ప్రతి రోజూ మెట్లు ఎక్కడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజూ మెట్లు ఎక్కితే మీ గుండె ఆరోగ్యం మెరుగు పడటమే కాకుండా.. ఈజీగా బరువు తగ్గుతారు. ఇలా ఎన్నో అనారోగ్య సమస్యలు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు. కానీ ఇప్పుడు ఎవరూ అంతగా పట్టించుకోవడం లేదు. హడావిడిగా లేవడం.. తినడం.. వెళ్లడం.. ఇదే అవుతుంది. మెట్లు ఎక్కడం మొదలు పెడితే మీరు వ్యాయామం కూడా చేయాల్సిన పని లేదు. మెట్లు ఎక్కడం వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

కీళ్ల నొప్పులు తగ్గుతాయి:

ప్రతి రోజూ మెట్లు ఎక్కుతూ దిగడం వల్ల కీళ్ల నొప్పులు అనేవి తగ్గుతాయి. చాలా మంది కీళ్ల సమస్యలు ఉన్నాయని మెట్లు ఎక్కరు. కానీ కీళ్ల సంబంధి సమస్యలు ఉన్నవారు మెట్లు ఎక్కడం వల్ల చాలా రిలీఫ్ దొరుకుతుంది. నరాలు, కండరాలు ఫ్రీ అవుతాయి.

గుండె ఆరోగ్యం:

మెట్లు ఎక్కడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. పలు అధ్యయనాల్లో కూడా ఈ విషయం వెల్లడైంది. మెట్లు ఎక్కడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ అనేది కరికి.. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రక్త ప్రసరణ కూడా మెరుగు పడుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా పని చేస్తుంది.

కండరాలు బలంగా ఉంటాయి:

మెట్లు ఎక్కడం వల్ల కండరాలు అనేవి బలంగా, శక్తివంతంగా మారతాయి. మెట్లు ఎక్కడం వల్ల కాళ్లు, తొడలు, తుంటి కండరాలు శక్తి వంతం అవడమే కాకుండా.. పొట్ట కండరాలు కూడా బలోపేతం అవుతాయి. దీంతో కండరాలు బలంగా మారతాయి. దీని వల్ల ఫిట్ నెస్ పెరుగుతుంది.
ఒత్తిడి, ఆందోళనకు చెక్:

మెట్లు ఎక్కడం వల్ల శరీరక ఆరోగ్యమే కాకుండా.. మానసిక ఆరోగ్యం కూడా బావుంటుంది. మెట్లు ఎక్కడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు అనే ఫీల్ గుడ్ రసాయనాలు రిలీజ్ అవుతాయి. దీని వల్ల ఒత్తిడి, ఆందోళన అనేవి తగ్గుతాయి. అంతే కాకుండా మంచి నిద్ర కూడా పడుతుంది.

Good Health : మీరు 40 ఏళ్లు దాటిన మహిళలా.. అయితే కచ్చితంగా ఈ వైద్య పరీక్షలు చేయించుకోండి..!

మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్లకు కొన్ని రకాల జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మహిళలు ఆరోగ్యం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంత ఆరోగ్యంగా ఉన్నట్లు అనిపించినా, వయసు రీత్యా కొన్ని ఆరోగ్య పరీక్షలు ఏడాదికొకసారైనా చేసుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.

ముఖ్యంగా నలభై ఏళ్లలోకి అడుగుపెట్టిన స్త్రీలు కొన్ని టెస్టులు తప్పనిసరిగా చేసుకోవాలి. దీనివల్ల పలు దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధులను త్వరగా గుర్తించి బయటపడే వీలుంది.

రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, మంచి డైట్ తీసుకున్నంత మాత్రాన ఏ జబ్బూ రాదనుకుంటే పొరపాటు. ఏ కారణం చేతైనా రోగాలు చుట్టుముట్టే అవకాశం ఉంది. అందుకే నలభై ఏళ్లలోకి అడుగుపెట్టగానే మహిళలు కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాలి. రాబోయే జబ్బుల్ని ముందుగానే గుర్తిస్తే. వాటి నుంచి బయటపడొచ్చు. అందుకు వైద్య నిపుణులు సూచిస్తున్న కొన్ని పరీక్షలివి.

మమ్మోగ్రామ్

నలభై ఏళ్లలోకి అడుగు పెట్టిన మహిళలు రెండేళ్లకొకసారైనా మమ్మోగ్రామ్ చేయించుకోవాలి. మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్‌కు గురవుతున్న సగటు వయసు యాభై నుంచి డెబ్బై నాలుగేళ్లు. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ సూచన ప్రకారం 45-54 ఏళ్ల మహిళలు ఏడాదికోసారి, యాభై ఐదేళ్లు పైబడిన వాళ్లు రెండేళ్లకోసారి మమ్మోగ్రామ్ పరీక్షలు చేయించుకోవాలి. ఈ టెస్టుల వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పును త్వరగా తెలుసుకోవచ్చు.

కంటి పరీక్షలు

సాధారణంగా నలభై ఏళ్లు పైబడిన మహిళల్లో కంటికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కంటి చూపు మందగించడం, తలనొప్పి వంటివి రావొచ్చు. కనీసం రెండేళ్లకోసారైనా కంటి పరీక్షలు నిర్వహించుకోవడం వల్ల కంటి చూపు బాగుండేలా చూసుకోవచ్చు. 65 ఏళ్లు పైబడితే గ్లకోమా, మాక్యులర్ డీజనరేషన్ వంటి జబ్బులు రావొచ్చు. అందువల్ల ఈ వయసు మహిళలు ప్రతి ఏడాది కంటి పరీక్షలు చేయించుకోవాలి.

షుగర్ టెస్ట్
నలభైల్లోకి అడుగుపెట్టగానే బ్లడ్ గ్లూకోజ్ పరీక్షలు చేయించుకోవాలి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. మధుమేహం వచ్చే అవకాశం
ఉందా లేదా అనే సంగతిని ముందుగానే గుర్తించి, జాగ్రత్త పడొచ్చు. రెండు, మూడేళ్లకోసారైనా ఏ1సీ వంటి టెస్టులు చేయించుకోవాలి.

హెపటైటిస్-సి

1945- 65 మధ్య జన్మించిన వాళ్లను ‘బేబీ బూమర్స్’ అంటారు. అప్పట్లో సరైన ‘హెపటైటిస్-సి’ వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడం వల్ల బేబీ బూమర్స్‌కు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అందువల్ల ఈ కాలంలో జన్మించిన వాళ్లు మాత్రమే కాకుండా యాభై ఏళ్లు పై బడిన వాళ్లు తప్పనిసరిగా హెపటైటిస్-సి టెస్టులు చేయించుకోవాలి.

వినికిడి పరీక్షలు
యాభై ఏళ్లు పైబడిన వాళ్లలోని నలభై శాతం మందిలో వినికిడి శక్తి కొంత తగ్గిపోతుంది. అందువల్ల వినికిడి పరీక్షలు చేయించుకోవడం వల్ల ఈ సమస్యలు దరి చేరకుండా నియంత్రించుకోవచ్చు.

థైరాయిడ్

ఈ రోజుల్లో ముప్పై, నలభై ఏళ్ల వయసు వారిని కూడా థైరాయిడ్ సమస్యలు వేధిస్తున్నాయి. అందులోనూ అరవై ఏళ్లు పైబడిన వాళ్లకు థైరాయిడ్ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకని వయసు పైబడిన వాళ్లు ఈ హార్మోన్ పరీక్షలు నిత్యం చేయించుకుంటూ ఉంటే ఆరోగ్యంగా ఉండొచ్చు.

బోన్ మెజర్మెంట్
వయసు పైబడుతున్న కొద్దీ ఎముకలు పెళుసుగా మారుతుంటాయి. దీంతో చిన్న గాయాలకే ఎముకలు విరిగిపోతాయి. అందువల్ల నలభై, యాభై సంవత్సరాల వయసున్న వాళ్లు ‘డ్యుయల్ ఎనర్జీ ఎక్స్-రే లేదా డీఎక్స్పో’ వంటి పరీక్షలు చేయించుకోవాలి. ఎముకలు ఎంత బలంగా ఉన్నాయో వీటి వల్ల తెలుస్తుంది. లోపాలేమైనా ఉంటే వైద్యుల సలహాలు తీసుకోవాలి. అరవై అయిదేళ్లు పైబడిన వాళ్లు ఆస్టియోపొరోసిస్ పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి.

బీపీ- కొలెస్ట్రాల్ పరీక్షలు

చిన్నవయసు వాళ్లు కూడా బీపీ బారిన పడుతున్న రోజులివి. అందువల్ల నలభై ఏళ్లు వచ్చిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా బీపీ చెక్ చేసుకోవాలి. దీనితోపాటు కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకు ని ఎల్డీఎల్, హెచ్ఎఎల్ ఎంత శాతం ఉందో తెలుసుకోవాలి.

ఈ ఏరియాల్లో ఇన్వెస్ట్ చేస్తే తిరుగుండదు.. ట్రాఫిక్ సమస్య ఉండదు కాబట్టి ఎగబడతారు!

హైదరాబాద్ లో స్థలం కొనలేకపోతున్నామని బాధపడుతున్నారా? ధరలు తక్కువ ఉన్నప్పుడే హైదరాబాద్ లో స్థలం కొనుక్కుని ఉంటే ఈ పాటికి రిచ్ అయిపోదుమని అనుకుంటున్నారా?
అయితే మీ కోసమే ఈ అవకాశం. హైదరాబాద్ లో కొనలేకపోయినవారికి నగర శివారుల్లో కొనుగోలు చేసి ధనవంతులయ్యే అవకాశం ఉంది. నగర శివారుల్లో స్థలం కొంటే అక్కడ డిమాండ్ ఏముంటుంది అనుకోకండి. ఫ్యూచర్ లో అక్కడ స్థలాలు డైమండ్స్ లా మారిపోతున్నాయి. మరి డిమాండ్ కి తగ్గట్టు డైమండ్ గా మారే ఏరియాలపై ఓ లుక్కేయండి.

ఔటర్ రింగ్ రోడ్ కి రెండు వైపులా మెరుగైన రోడ్ నెట్ వర్క్ ను నిర్మించడమే లక్ష్యంగా హెచ్ఎండీఏ పని చేస్తుంది. నగర శివారు ప్రాంతాల్లో కొత్త రోడ్లను నిర్మిస్తుంది. అది కూడా ఐటీ కారిడార్ కి కనెక్ట్ అయ్యేలా ఈ రోడ్లను నిర్మిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ 33 రేడియల్ రోడ్లతో పాటు వాటికి అనుసంధానంగా లింకు రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. దీని వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో పట్టణీకరణ మరింత వేగవంతమైంది. ఇప్పటి వరకూ 137కి పైగా లింకు రోడ్ల నిర్మాణ పనులు చేపట్టారు. వీటిలో ఐటీ కారిడార్ పరిధిలో ఉన్నవే త్వరగా పూర్తయ్యాయి. ఐటీ కారిడార్ ని ఆనుకుని పెద్ద మొత్తంలో నివాస ప్రాంతాలు విస్తరిస్తున్నాయి. దీని కారణంగా ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని లింక్ రోడ్స్ ని డెవలప్ చేస్తున్నారు. దీని వల్ల ట్రాఫిక్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. కాబట్టి సాఫ్ట్ వేర్ ఉద్యోగులు సిటీకి దూరమైనా గానీ ఈ ప్రాంతాల్లో ఇల్లు కొనడానికి లేదా స్థలం కొనడానికి ముందుకొస్తారు. కాబట్టి ఇప్పుడు కనుక ఆ ఏరియాల్లో స్థలం కొని పెట్టుకుంటే భవిష్యత్తులో మంచి లాభాలను పొందవచ్చు.

ఐటీ కారిడార్ వైపు తెల్లాపూర్, నార్సింగి, మణికొండ ఏరియాలు ఉన్నాయి. అయితే తెల్లాపూర్ నుంచి శంకరపల్లి వరకూ ఒక లింక్ రోడ్డును నిర్మించేందుకు గత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆల్రెడీ తెల్లాపూర్ నుంచి ఈదుల నాగులపల్లి వరకూ ఒక రోడ్డును నిర్మించారు. ఈదుల నాగులపల్లి నుంచి మోకిలా, కొండకల్ ప్రాంతాలను కలుపుతూ శంకరపల్లి వరకూ మరొక రోడ్డు నిర్మిస్తున్నారు. ఇలా శివారు ప్రాంతాల్లో అవుటర్ రింగ్ రోడ్ కి ఇరువైపులా ఉన్న ప్రాంతాలను కలుపుతూ కొత్త రోడ్లను నిర్మిస్తున్నారు. దీనివల్ల ఐటీ కారిడార్ వైపు మెరుగైన రోడ్ కనెక్టివిటీ అనేది అందుబాటులోకి వస్తుంది. ఈ లింక్ రోడ్లు అందుబాటులోకి వస్తే ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ కష్టాలు ఉండవని.. లింక్ రోడ్ల వల్ల ప్రధాన రోడ్ల మీద ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని అంటున్నారు. కాబట్టి తెల్లాపూర్, నార్సింగి, మణికొండ, శంకరపల్లి, మోకిలా, కొండకల్, ఈదుల నాగులపల్లి వరకూ ఈ ఏరియాల్లో ఎక్కడ ప్రాపర్టీ కొనుగోలు చేసినా భారీ లాభాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.

స్థలాల ధరలు(చదరపు అడుగుల్లో):

తెల్లాపూర్: రూ. 4,200/-
నార్సింగి: రూ. 5,450/- నుంచి రూ. 10,900/-
మణికొండ: రూ. 12,650/-
శంకరపల్లి: రూ. 1900/- నుంచి రూ. 2,500/-
మోకిలా: రూ. 5,500/-
కొండకల్: రూ. 3,900/-
ఈదుల నాగులపల్లి: రూ. 5,000/- నుంచి రూ. 5,600/-
అపార్ట్ మెంట్ ధరలు (చదరపు అడుగుల్లో):

తెల్లాపూర్: రూ. 7,150/-
నార్సింగి: రూ. 9,950/-
మణికొండ: రూ. 7,750/-
శంకరపల్లి: రూ. 2,300/-
మోకిలా: రూ. 3,200/-
కొండకల్: రూ. 6,500/-
గమనిక: ఈ ధరలు పలు వెబ్ సైట్స్ నుంచి సేకరించినవి. ఇవే ధరలు ఉండకపోవచ్చు. గమనించగలరు.

JEE అడ్వాన్స్డ్ 2024 రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. అప్లయ్ చేసుకోండిలా

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్డ్ 2024 రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. జేఈఈ మెయిన్ లో కటాఫ్ మార్కులు పొంది ఉత్తర్ణత సాధించిన 2.50 లక్షల మంది అభ్యర్థులకు జేఈఈ అడ్వాన్స్ డ్ (JEE Advanced 2024 ) పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది.
ఈ పరీక్షకు ఏప్రిల్ 27 నుంచి మే 7 వరకు దరఖాస్తులు స్వీకరించ నున్నారు. షెడ్యూల్ ప్రకారం JEE Advanced 2024 దరఖాస్తు ప్రక్రియ శనివారం (ఏప్రిల్27) సాయంత్రం 5 గంటలకు ప్రారంభం అయింది. మే17నుంచి 26 వరకు అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంచుతాయి.

మే 26న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ -2 పరీ క్షలు నిర్వహించనున్నారు. అనంతరం జేఈఈ అడ్వాన్స్ డ్ 2024 ఫలితాలను జూన్ 9, 2024న విడుదల చేస్తారు.

దరఖాస్తు విధానం, ఫీజు

ఈ ఏడాది అన్ని కేటగిరీలకు సంబంధించిన జేఈఈ అడ్వాన్స్ డ్ 2024 దరఖాస్తు ఫీజును అధికారులు పెంచారు.ఎస్టీ,ఎస్సీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులు రూ.1600, ఇతర అభ్యర్థులందరూ రూ. 3200 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఎలా చేయాలి

అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://jeeadv.ac.in/ సందర్శించాలి.
అందులో రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయాలి.
కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఇచ్చిన ఫామ్ లో మీ వివరాలను నమోదు చేయాలి
తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి మీ అప్లికేషన్ సమర్పించాలి.
తదుపరి అవసరా లకోసం అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి.

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు.
టీడీపీ హయాం కన్నా ఎక్కువ రోడ్లేశామన్నారు. ఎంత అంటే 43వేల కోట్ల రోడ్లేశామన్నారు. అందరూ ఓహో అనుకున్నారు. కానీ రోడ్లవి అని అందరూ తర్వాత అయిన అడుగుతారని డౌట్ వచ్చిందేమో కానీ వెంటనే సర్దుకున్నారు. టీడీపీ హయంలో వర్షాలు పడలేదట.. కరువు అట.. తన పాలనలో వర్షాలు విచ్చలవిడిగా పడటం వల్ల రోడ్లు కొట్టుకుపోయాయట. అంటే జగన్ చెప్పిన దానికి అర్థం 43వేల కోట్లు పెట్టి రోడ్లేశారు కానీ వర్షాలకు కొట్టుకుపోయాయన్నమాట.

జగన్ రెడ్డి చెప్పిన ఈ మాట ఇప్పుడు వైరల్ అవుతోంది. అవునా.. నిజంగా రోడ్లేశారా.. ఎప్పుడు అని అందరూ చెక్ చేసుకుంటున్నారు. వేసిన రోడ్డు మా ఊళ్లో ఎప్పుడు కొట్టుకుపోయిందా అని టెన్షన్ పడుతున్నారు. కామెడీ ఏమిటంటే.. ఇలా రోడ్లు కొట్టుకుపోవడం వల్లనే.. అభివృద్ధి నేది పెద్దగా కనిపించకపోవచ్చునని కూడా తీర్మానించారు. జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు అప్పులు చేశారు.
అందులో ఓ పది శాతం సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యంక్ కు పంచారు. మిగతా డబ్బు ఏమైందో లెక్కలు చెప్పలేదు.

విచిత్రం ఏమిటంటే.. ఐదేళ్లుగా ప్రతి ఒక్క లీటర్ పెట్రోల్, డీజిల్ పై రోడ్ల కోసం ఒక్కో రూపాయి ప్రత్యేకంగా వసూలు చేస్తూ వస్తున్నారు. వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానిి ఆదాయం వచ్చింది. వాటిని కూడా రోడ్ల కోసం ఖర్చు పెట్టారు. అంతర్జాతీయ బ్యాంకుల నుంచి తెచ్చిన డబ్బులు కూడా దారి మళ్లించారు. కానీ అప్పులు మాత్రం అలా మిగిలిపోయాయి. చెప్పుకోవడానికి మాత్రం రోడ్లు వేశారు.. వర్షాలకు కొట్టుకుపోయయంట.

మార్కెట్‌లో ఆరోగ్యాన్ని పాడు చేసే నకిలీ బాదం పప్పు.. దీనిని ఈ 4 పద్దతుల్లో ఈజీగా గుర్తించండి..

బాదంలో కాల్షియం, ఒమేగా 3 పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం, రిబోఫ్లావిన్, విటమిన్ ఇ వంటి అనేక పోషకాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు తినే రైస్ నుంచి పండ్లు, కూరగాయలు ఇలా అన్ని కల్తీ వస్తువులు వస్తున్నట్లు.. మార్కెట్ లో మీ ఆరోగ్యానికి హాని కలిగించే నకిలీ బాదం కూడా మార్కెట్లోకి వస్తోంది. ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన బాదంపప్పును తినడం వల్ల శక్తిని అందించడమే కాకుండా గుండె, మెదడు, చర్మం, జుట్టు, ఎముకలు లేదా మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుతుంది. అయితే నకిలీ బాదం తినడం వలన ఆరోగ్య ప్రయోజనానికి బదులు హాని కలుగుతుంది.
బాదంపప్పు తినడం వలన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోజూ బాదంపప్పు తినడం వలన జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇది నిజం కూడా.. ఎందుకంటే బాదంలో ఉండే లక్షణాలు మొత్తం శారీరక ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడటమే కాదు. దీనిని తినడం వలన మెదడుకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. బాదంలో కాల్షియం, ఒమేగా 3 పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం, రిబోఫ్లావిన్, విటమిన్ ఇ వంటి అనేక పోషకాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు తినే రైస్ నుంచి పండ్లు, కూరగాయలు ఇలా అన్ని కల్తీ వస్తువులు వస్తున్నట్లు.. మార్కెట్ లో మీ ఆరోగ్యానికి హాని కలిగించే నకిలీ బాదం కూడా మార్కెట్లోకి వస్తోంది.
ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన బాదంపప్పును తినడం వల్ల శక్తిని అందించడమే కాకుండా గుండె, మెదడు, చర్మం, జుట్టు, ఎముకలు లేదా మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుతుంది. అయితే నకిలీ బాదం తినడం వలన ఆరోగ్య ప్రయోజనానికి బదులు హాని కలుగుతుంది. కనుక నకిలీ, నిజమైన బాదంను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.

బాదంను రుద్దడం ద్వారా తేడా గుర్తించవచ్చు
మార్కెట్లో బాదం కొనుగోలు చేసి ముందు దాని రంగుపై శ్రద్ధ వహించండి. సాధారణ రంగు కంటే బాదం ముదురు రంగులో ఉంటే.. అప్పుడు ఆ బాదం ను టిష్యూ పేపర్‌తో రుద్దండి. నకిలీ బాదంపప్పు రంగు కోల్పోవడం ప్రారంభమవుతుంది.

ఈ విధంగా నిజమైన బాదంను గుర్తించవచ్చు
బాదం ఆరోగ్యానికి ప్రయోజనకరమైనది మాత్రమే కాదు. దీని నూనెను ఆహారం నుంచి చర్మ సంరక్షణ వరకు ప్రతిదానిలో కూడా ఉపయోగిస్తారు. అసలు, నకిలీ అనే తేడా తెలుసుకోవడనికి బాదం పప్పును పగలగొట్టి, దానిని మీ చేతితో నలగగొట్టండి. నిజమైన బాదం అయితే మీ చేతులకు నూనెను అంటుకుంటుంది. అప్పుడు ఆ చాలా పాతది కాదని .. దానిలో నూనె ఆరిపోలేదని గుర్తించవచ్చు.

రుచి ద్వారా గుర్తించే పద్ధతి
బాదంపప్పులు కొంటున్నట్లయితే దుకాణదారు నుంచి రెండు బాదంపప్పులను తీసుకొని వాటిని రుచి చూడవచ్చు. దాని రుచి నిజమైనదా .. నకిలీదా అని గుర్తించడంలో సహాయపడుతుంది. అయితే ఈ ట్రిక్‌లో కల్తీ బాదం దొరికే అవకాశం కంటే నాణ్యమైన బాదం ను కనుగొనే అవకాశం ఉంది.

నీటిలో నానబెట్టిన తర్వాత ఆకృతి
బాదంపప్పులను నీళ్లలో నానబెట్టి గిన్నెలో నుంచి తీసిన తర్వాత నీళ్ల రంగు మారిందో లేదో చూసుకోవాలి. బాదం నానబెట్టిన నీటిలో రంగును ఎక్కువగా కనిపిస్తే.. ఆ బాదంపై సింథటిక్ రంగులు ఉపయోగించినట్లు గుర్తించాలి. అయితే అదే సమయంలో నిజమైన బాదం నీటిలో నానబెట్టితే చాలా బాగా ఉబ్బుతుంది.

Home Loan : గుడ్‌న్యూస్‌.. ఇల్లు కట్టుకునేవారికి కేంద్రం ప్రభుత్వం ఏకంగా 30 లక్షల సాయం..!

Home Loan : బడుగు బలహీన వర్గాల కోసం, నిరుపేద వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తోంది. ఆర్థికంగా వెనకబడిన వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసే విధంగా అనేక రకాల పథకాలను ప్రవేశపెట్టింది.

ఈ నేపథ్యంలోనే సొంతంగా ఇల్లు నిర్మించుకోవాలి అని కలలు కనే వారికి కేంద్ర ప్రభుత్వం 30 లక్షల రూపాయలను సాయంగా అందించే ప్రయత్నాలు చేస్తుంది.

Home Loan : ప్రధానమంత్రి ఆవాస్ యోజన…

ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనే కోరిక ఉంటుంది. మరి ముఖ్యంగా పేద కుటుంబాలు మధ్యతరగతి వాళ్లు ,ఇల్లు కట్టుకోవాలని ఎన్నో రకాలుగా కలలు కంటూ ఉంటారు. ఈ కలను కేవలం కొంతమంది మాత్రమే సహకారం చేసుకోగలరు. మరి కొంతమందికి ఎంత కష్టపడినా ఈ కల కలగానే మిగిలిపోతుంది. ఈ క్రమంలోనే నిరుపేదలు సైతం సొంత ఇల్లు కట్టుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది.ఇక ఈ పథకం ద్వారా ఇల్లు నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం 30 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇక ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని నరేంద్ర మోడీ 2015 లో ప్రారంభించగా ఈ పథకం ద్వారా మొత్తం 20 మిలియన్ ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ పథకం 2024 చివరి వరకు పొడిగించబడింది.

ఇక ఈ పథకం ద్వారా పేద ప్రజలకు , ఇల్లు నిర్మించుకోవడానికి దాదాపు 30 లక్షలు వరకు అందజేస్తారు.చిరు వ్యాపారస్తులు, దుకాణదారులు, స్వయం ఉపాధి పొందేవారు సొంతంగా ఇల్లు నిర్మించుకునేందుకు ఈ పథకం ద్వారా సహాయం పొందవచ్చు. ఇక ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.30 లక్షల వరకు సబ్సిడీ అందిస్తుంది. ఇక ఈ రుణం 20 ఏళ్ల కాలానికి అందుబాటులో ఉంటుంది. ఈ సబ్సిడీ రూపంలో 2.67 లక్షల వడ్డీని ఆదా చేసుకోవచ్చు.అలాగే ఈ స్కీమ్ ద్వారా రూరల్ ప్రాంతాలలో కాకుండా మెట్రో నాన్ మెట్రో నగరాలలో దాదాపు 35 లక్షల వరకు ఇండ్లను కొనుగోలు చేసుకోవచ్చు. దీనిలో 30 లక్షల రుణం లభిస్తుంది.

Home Loan : అర్హులు ఎవరంటే…

ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ రుణాన్ని పొందాలంటే లబ్ధిదారులు కచ్చితంగా కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. దీనిలో భాగంగా లబ్ధిదారుల ఆదాయం 18 లక్షలు దాటినట్లయితే 12 లక్షల రుణాన్ని పొందగలుగుతారు. అలాగే 18 ఏళ్లు నిండిన వారు,భారతదేశ నివాసం ఉన్నవారు ఈ స్కీమ్ కి అర్హులవుతారు. అలాగే వార్షిక ఆదాయం 3 లక్షలు నుండి 6 లక్షల మధ్య ఉండాలి. రేషన్ కార్డు బిపిఎల్ జాబితాలో తప్పనిసరిగా పేరు ఉండాలి.

Home Loan : దరఖాస్తు ప్రక్రియ…

ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. అలాగే జన సేవ కేంద్రం , గ్రామ సేవక్ ద్వారా కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. కానీ 2024 సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ ఫామ్ ఇంకా ప్రారంభం కాలేదని సమాచారం.

కావలసిన పత్రాలు..

ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే కొన్ని పత్రాలు అవసరమవుతాయి. అదేంటంటే..

ఆధార్ కార్డు

పాస్ పోర్ట్ సైజు ఫోటో ,

జాబ్ కార్డు

బ్యాంక్ పాస్ బుక్

స్వచ్ఛభారత్ మిషన్ రిజిస్ట్రేషన్ నెంబర్

ఉపయోగంలో ఉన్న ఫోన్ నెంబర్
ఇన్ కమ్ సర్టిఫికెట్.

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదే…మే 24 నుంచి పరీక్షలు..

ఇంటర్‌మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఏప్రిల్ 25న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు జరగనున్నాయి.
ఈ పరీక్షలు ఒకే రోజు రెండు విడతలుగా నిర్వహించనున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగగా, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఇంటర్ సెకండ్ ఇయర్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు మే 1 నుంచి 4 వరకు జరుగుతాయి. ఇవి కూడా రెండు విడతలుగా నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్టు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో షిఫ్టులో పరీక్షలు జరుగుతాయి. ఇక, జూన్‌ 6వ తేదీన నైతికత, మానవ విలువల పరీక్ష, జూన్‌ 7వ తేదీన పర్యావరణ విద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారు.

ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌…

వచ్చే నెల 24వ తేదీన ఫస్ట్‌ ల్యాంగ్వేజ్‌ పేపర్‌-1, 2 ఉంటుంది. మే 25వ తేదీన ఇంగ్లిష్‌ పేపర్‌-1, 2 పరీక్ష నిర్వహిస్తారు. మే 27న మ్యాథమెటిక్స్‌ పేపర్‌-1ఏ, 2ఏ, బయాలజీ పేపర్‌-1, 2, సివిక్స్‌ పేపర్‌-1, 2 పరీక్షలు జరుగుతాయి. మే 28వ తేదీన మ్యాథమెటిక్స్‌ పేపర్‌-1బీ, 2బీ, జువాలజీ పేపర్‌-1, 2 ఉంటుంది. మే 29వ తేదీన హిస్టరీ పేపర్‌-1, 2, ఫిజిక్స్‌ పేపర్‌-1, 2, ఎకనామిక్స్‌ పేపర్‌-1, 2 జరుగుతుంది.

మే 30వ తేదీన కెమిస్ట్రీ పేపర్‌-1, 2, కామర్స్‌ పేపర్‌-1, 2, సోషియాలజీ పేపర్‌-1, 2, ఫైన్‌ఆర్ట్స్, మ్యూజిక్‌ పేపర్‌-1, 2 మే 31వ తేదీన పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-1, 2, లాజిక్‌ పేపర్‌-1, 2, బ్రిడ్జికోర్సు గణితం పేపర్‌-1, 2 జూన్‌ 1వ తేదీన మోడ్రన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1, 2, జాగ్రఫీ పేపర్‌-1, 2 పరీక్షలు జరుగుతాయి. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ఫీజు వివరాలను కూడా బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 18 నుంచి ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభమయ్యింది, ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 24 వరకు అవకాశం కల్పించగా, ఫీజు చెల్లింపు గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు.

Electric Bike: కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌

Oplus_131072

మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. దీని కారణంగా ఆటో కంపెనీలు వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకుంటూ పూర్తి ఫీచర్లతో కూడిన కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి. Okaya EV తన ప్రీమియం బ్రాండ్ ఫెర్రాటో కింద వచ్చే వారం అంటే 2 మే 2024న భారత మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను కూడా విడుదల చేయబోతోంది..
మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. దీని కారణంగా ఆటో కంపెనీలు వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకుంటూ పూర్తి ఫీచర్లతో కూడిన కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి. Okaya EV తన ప్రీమియం బ్రాండ్ ఫెర్రాటో కింద వచ్చే వారం అంటే 2 మే 2024న భారత మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను కూడా విడుదల చేయబోతోంది. లాంచ్‌కు ముందే, కంపెనీ ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ టాప్-స్పీడ్, టార్క్ వంటి అనేక ప్రత్యేక లక్షణాల గురించి సమాచారాన్ని అందించింది.
కస్టమర్ల కోసం ఒకాయ డిస్‌రప్టర్ బుకింగ్ ప్రారంభమైంది. కంపెనీ ఆఫ్‌లైన్ స్టోర్‌లు లేదా కంపెనీ అధికారిక సైట్ ద్వారా కూడా మీరు ఈ బైక్‌ను మీ ఇంటి సౌకర్యం నుండి బుక్ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను బుక్ చేసుకోవాలంటే ముందుగా కొంత మొత్తాన్ని చెల్లించాలి.

కంపెనీ గొప్ప బుకింగ్ ఆఫర్‌తో ముందుకు వచ్చింది. కేవలం రూ. 500 చెల్లించి ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను బుక్ చేసుకునే మొదటి 1000 మంది కస్టమర్‌లకు కంపెనీ సౌకర్యం కల్పిస్తోంది. 1000 తర్వాత కస్టమర్లు ఈ బైక్‌ను బుక్ చేసుకోవడానికి రూ. 2500 బుకింగ్ మొత్తాన్ని చెల్లించాలి.
ఒకాయ డిస్‌రప్టర్ బైక్‌ల శ్రేణి గురించి మాట్లాడితే, ఈ ఎలక్ట్రిక్ బైక్ 3.97 kWh LFP బ్యాటరీతో శక్తిని పొందుతుంది. ఈ బైక్ బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ తో 129 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ బైక్ రైడింగ్ ఖర్చు చాలా తక్కువ, ఈ బైక్ రైడింగ్ ఖర్చు కిలోమీటరుకు 25 పైసలు మాత్రమే. టాప్ స్పీడ్ గురించి మాట్లాడితే.. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 95 కిమీగా ఉంటుందని కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలిసింది.

భారతదేశంలో ఒకాయ డిస్‌రప్టర్ ధర

ఒకాయ నుండి స్టైలిష్ గా కనిపించే ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర ఇంకా ప్రకటించలేదు. మే 2న లాంచ్ ఈవెంట్ సందర్భంగా ఈ బైక్ ధరను కంపెనీ ప్రకటించనుంది.

ఇది సామాన్యుడి బైక్.. మైలేజీ 160 కి.మీ.. జస్ట్ రూ.70 వేలు మాత్రమే…

హీరో కంపెనీ ఈ ఎలక్ట్రిక్ వేరియంట్‌కు రైడ్ టెస్టింగ్ కూడా చేసినట్లు సమాచారం. అయితే ఈ బైకుని త్వరలో మార్కెట్లో చూడవచ్చు. ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో హీరో ఇంజిన్, గేర్‌బాక్స్‌ను పవర్ ఫుల్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో రీప్లేస్ చేసింది.
భారతదేశపు నంబర్ వన్ ద్విచక్ర వాహన తయారీదారి హీరో స్ప్లెండర్ ఎలక్ట్రిక్ అనే కొత్త మోడల్‌ను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. హీరో కంపెనీ ఈ ఎలక్ట్రిక్ వేరియంట్‌కు రైడ్ టెస్టింగ్ కూడా చేసినట్లు సమాచారం. అయితే ఈ బైకుని త్వరలో మార్కెట్లో చూడవచ్చు. ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో హీరో ఇంజిన్, గేర్‌బాక్స్‌ను పవర్ ఫుల్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో రీప్లేస్ చేసింది.

అయితే ఇందులో హీరో స్ప్లెండర్ అద్భుతమైన ఇంకా లేటెస్ట్ ఫీచర్స్ చూడవచ్చు. ఇంకా దీనిని 4 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు అలాగే సింగిల్ ఛార్జ్ తో 150 కి.మీల దూరం ప్రయాణించవచ్చు. దీని టాప్ స్పీడ్‌ పరిశీలిస్తే గంటకు 90 కి.మీ వెళ్లగలదు ఇంకా దీనిలో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ని చూడవచ్చు.
డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ స్పీడ్, బ్యాటరీ లెవెల్, రీడింగ్ మోడ్ ఇంకా ఉష్ణోగ్రత వంటి సమాచారాన్ని చూపిస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్స్, మెసేజెస్, సైడ్ స్టాండ్ సెన్సార్, LED హెడ్‌లైట్, LED టెయిల్ లైట్, సేఫ్టీ ఫీచర్స్ , ముందు ఇంకా వెనుక డిస్క్ బ్రేక్స్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి. హీరో స్ప్లెండర్‌లో అత్యంత ప్రత్యేకత ఏమిటంటే దాని మైలేజీ. బ్యాటరీ 4 నుండి 6 గంటల్లో ఫుల్ ఛార్జింగ్‌తో 140 కి.మీ నుండి 160 కి.మీ ప్రయాణిస్తుందని పేర్కొన్నారు. దీని ఇంజిన్ అలాగే గేర్‌బాక్స్‌ను మోటారు అండ్ బ్యాటరీతో రీప్లేస్ చేస్తుంది. ఇందులో 9 KW మిడ్-షిప్ మౌంటెన్ ఎలక్ట్రిక్ మోటార్ ప్యాక్ ఉంటుంది.
ఈ బైక్ 170 ఎన్ఎమ్‌ టార్క్‌ను విడుదల చేస్తుంది. పవర్ ఫుల్ 4 KWH లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో 160KM రేంజ్ అందిస్తుంది. నివేదిక ప్రకారం, హీరో ఈ ఎలక్ట్రిక్ ఫ్లాష్‌ను చాలా కాలంగా అభివృద్ధి చేస్తున్నారు ఇంకా డ్రైవింగ్ టెస్ట్ కూడా జరిగింది. సోర్సెస్ ప్రకారం, ఇప్పుడు మీరు ఈ హీరో ఎలక్ట్రిక్ స్ప్లెండర్ కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదు త్వరలోనే మార్కెట్‌లో చూడవచ్చు. దీని ధర గురించి చెప్పాలంటే, దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.70,000గా చెప్పబడుతుంది. ఈ బైక్ భారతీయ మిడిల్ క్లాస్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. అయితే దీని అఫీషియల్ లాంచ్ తేదీ డిసెంబర్ అని అంటున్నారు.

Mangalsutra : ఆడవాళ్లు మంగళసూత్రం తాడుని ఏరోజు మార్చాలి..? ప్రతి ఒక్క స్త్రీ తప్పక తెలుసుకోవాల్సిన విషయం.!

Mangalsutra : వివాహమైన ప్రతి మహిళకి ఐశ్వర్యం మెడలో తాళిబొట్టు. భర్త భార్యకి కట్టినప్పుడు వేదమంత్రాలతో తంతు జరుగుతుంది. మంగళసూత్రానికి సంబంధించిన విషయాలను ప్రతి భర్త తెలుసుకొని భార్య అలా మంగళసూత్రం వేసుకునేలాగా చూసుకోవాలి.
భర్త ప్రాణాలు ఆ మంగళసూత్రంలోనే ఉంటాయి. కాబట్టి ఏ విషయంలో భర్తనే ఎక్కువగా జాగ్రత్తలు భార్యకు చెప్పాలి. మంగళసూత్రం ఎలా ధరిస్తే శుభం సిరిసంపదలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్లి అయినప్పటినుంచి స్త్రీలు మంగళసూత్రం ధరించడం అనేది భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఇప్పటిది కాదు.. పెళ్లినాడు వరుడు వధువుకు తాళి కట్టే సాంప్రదాయం ఆరో శతాబ్దంలోనే ఆరంభమైంది.సూత్రం అనే శబ్దం. సంస్కృత నుంచి పుట్టింది పెళ్లి సమయంలో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మెడలో తాడి బొట్టు మాత్రమే కడతాడు. ఆ తర్వాత ఆడవారు మంగళసూత్రంలో పగడాలు, ముత్యాన్ని చిన్నచిన్న విగ్రహాలను ధరిస్తూ ఉంటారు. అలా ధరించడం ఫ్యాషన్ అనుకుంటే అది పొరపాటే అలా చేయవద్దు. అలాగే మంగళసూత్రం భార్యాభర్తల అనుబంధానికి ప్రతీక మంగళసూత్రం. అంటే శుభప్రదం శోభాయ మానం సూత్రం అంటే తాడు ఆధారమని అర్థం.

Mangalsutra : మంగళసూత్రం ఏరోజు మార్చాలంటే…?

వివాహంలో భాగంగా వరుడు వధూమలలో మూడు ముళ్ళలు వేస్తాడు. భర్త ఆరోగ్యంగా ఉండాలని తన సంసారం నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో సాగాలని పదో మెడలో మూడు ముళ్ళను వేయిస్తారు. వేద పండితులు కోటి దేవతల సాక్షిగా ఈ పెళ్లి జరిగినట్టు దేవదేవతలు అందరూ కూడా నూతన వధూవరుని దీవిస్తారని నమ్మకం. అయితే ప్రస్తుతం కొందరు మహిళలు మంగళ సూత్రాలను పక్కన పెడుతున్న మంగళసూత్రం బదులుగా నల్లపూసల హారాన్ని ప్రస్తుతం నడుస్తున్న ట్రెండుకు తగినట్లుగా ఉన్న మంగళ సూత్రాలను ఉపయోగిస్తున్నారు. నలుపు రంగు శివుడు బంగారు వర్ణంలో పార్వతి దేవి కొలువై ఉంటుంది. ఎటువంటి కీడు జరగకుండా ఉండాలని ఆ పార్వతీ పరమేశ్వరులే శ్రీ హృదయానికి అంటూనే ఉంటారు. అందుకే మంగళ సూత్రాన్ని స్త్రీ హృదయం వరకు ఉండేలా చేస్తారు. హృదయ స్థానానికి మంగళసూత్రం తాకుతూ ఉండటం వల్ల ఆ స్త్రీ సుమంగళీగా ఉంటుంది.మంగళసూత్రం ధరించటం వలన స్త్రీకి ఎక్కలేని శక్తి. ఎక్కడైనా పోరాడగలను ధైర్య సాహసాలు కలుగుతాయి. మంగళ సూత్రాలలో పసుపు తాడుని వాడుతారు. వరుడు మూడు ముళ్ళు వేసిన తర్వాత ఒక్కోముడికి కుంకుమ అద్దత్తుతారు. మంగళ సూత్రాలు బంగారం చేయించుకున్న మచ్చలు తాడు మాత్రం పసుపు తాడుని వాడాలి.

Mangalsutra : ఆడవాళ్లు మంగళసూత్రం తాడుని ఏరోజు మార్చాలి..? ప్రతి ఒక్క స్త్రీ తప్పక తెలుసుకోవాల్సిన విషయం…!

ఇతర ఏ లోహాలతో తయారు చేసినవి వాడవద్దు.. పసుపు కుంకుమలలో సర్వమంగళీ ఉంటుంది. మరికొంతమంది లక్ష్మీదేవి బొమ్మ మంగళసూత్రంపై కనిపించే విధంగా వేసుకుంటారు. అసలు ఇలాంటివి చేయవచ్చా లేదా అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం.. మనకి ఆదర్శ దంపతులు అంటే గుర్తుకొచ్చేది ఎవరు సీతారాములు. సీతమ్మ అంటే రాముడికి ఎంత ఇష్టమో చెప్పాల్సిన అవసరం లేదు.
అలాంటి సీతే తన మంగళ సూత్రాలపై రాముల వారి బొమ్మను కానీ రంగులు కాని వేయించుకోలేదు. సీతమ్మవారు ఎలాగైతే మంగళసూత్రాన్ని చేసి వేసుకున్నార.. అలా చేస్తే కచ్చితంగా సిరిసంపదలు కలుగుతాయి, దేవుడు ప్రతిభను అస్సలు మంగళ సూత్రాలపై వెయ్యవద్దు. ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిభ ఉన్న మంగళసూత్రం వేసుకోవద్దు. మంగళసూత్రం ఎప్పుడు హృదయం కింది వరకు ఉండాలి. పొరపాటున మంగళసూత్రం తెగిపోతే వెంటనే ఐదు వరుసల దారం తీసుకొని దానికి ఒత్తుగా పసుపు రాసి పసుపు కొమ్ము తీసుకొని ఎవరూ లేకపోతే మీకు మీరే వేసుకోవాలి. తర్వాత మంచి రోజు చూసి ఉదయం 9 గంటల లోపు మళ్ళీ మంగళసూత్రాన్ని వేసుకోవాలి. ఇవన్నీ భార్యా పాటిస్తే భర్త ఆయుష్షు బలంగా ఉంటుంది. వందేళ్లు సుఖంగా జీవిస్తాడని శాస్త్రాలే చెప్తున్నాయి..

598 మంది టీచర్లకు షోకాజ్‌ మండిపడుతున్న ఉపాధ్యాయ సంఘాలు

పార్వతీపురం, ఏప్రిల్‌ 27 : జిల్లాలోని 598 మంది ఉపాధ్యాయులకు శనివారం విద్యాశాఖ అధికారులు షోకాజ్‌ నోటీసులు అందించారు. కనీస సౌకర్యాలు లేని పాఠశాలలకు సంబంధించిన వాస్తవాలను ఏకీకృత జిల్లా సమాచార దరఖాస్తులో నమోదు చేయలేదనే కారణంతో నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. అయితే దీనిపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వెంటనే నోటీసులను వెనక్కి తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ కార్యాలయ అధికారికి శనివారం సాయం త్రం వారు వినతిపత్రం అందించారు. పాఠశాలల్లో కనీస మౌలిక వసతుల లేకపోతే.. ఉన్నట్టు ఎలా ఉపాధ్యాయులు ధ్రవీకరిస్తారని ప్రశ్నించారు. పాఠశాలల్లో వాస్తవ పరిస్థితు లపై సమాచారం అందిస్తే ..
వెంటనే నోటీసులను వెనక్కి తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ కార్యాలయ అధికారికి శనివారం సాయం త్రం వారు వినతిపత్రం అందించారు. పాఠశాలల్లో కనీస మౌలిక వసతుల లేకపోతే.. ఉన్నట్టు ఎలా ఉపాధ్యాయులు ధ్రవీకరిస్తారని ప్రశ్నించారు. పాఠశాలల్లో వాస్తవ పరిస్థితు లపై సమాచారం అందిస్తే ..

ఉపాధ్యాయులు తప్పు చేసినట్టుగా షోకాజ్‌ నోటీసులు జారీ చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. జిల్లాలోని అనేక పాఠశాలల్లో ఇంటర్నెట్‌, తాగునీరు, మరుగుదొడ్లు తదితర సదుపాయాలు లేవని, దీనిపై వాస్తవ సమాచారాన్ని అందిస్తే.. విద్యాశాఖ ఉన్నతాధికారులు జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు. ఉపాధ్యాయు లపై చర్యలు తీసుకొనేందుకు విద్యాశాఖ ఉపక్రమిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. షోకాజ్‌ నోటీసులకు వెంటనే సమాధానం ఇవ్వాలని ఉపాధ్యాయులపై ఒత్తిడి తేవడం చూస్తుంటే.. వైసీపీ ప్రభుత్వం ఇంకా తమను వేధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టుగా ఉందని విమర్శించారు. తక్షణమే నోటీసులను వెనక్కి తీసుకోవాలని, లేదంటే పెద్దఎత్తు ఆందోళన చేస్తామని నాయకులు హెచ్చరించారు.

Hyderabad Metro Rail: మెట్రో ప్రయాణికులకు బంపర్ న్యూస్.. త్వరలో అందుబాటులోకి 13 మెట్రో స్టేషన్లు

హైదరాబాద్ నగరవాసులకు మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు మెట్రో ఫేజ్-2కి సంబంధించి క్లారిటీ వచ్చేసింది. ఇందులో భాగంగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్ మార్గంలో నాగోల్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 14 కి.మీ మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారు.
ఫేజ్-2లో మొత్తం 13 మెట్రో స్టేషన్లు ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయని హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. నాగోల్ మెట్రో స్టేషన్‌తో ప్రారంభమై.. నాగోల్‌ చౌరస్తా, అల్కాపురి చౌరస్తా, కామినేని ఆసుపత్రి, ఎల్బీనగర్‌ కూడలి, సాగర్‌ రింగ్‌రోడ్డు, మైత్రీనగర్‌, కర్మన్‌ఘాట్‌, చంపాపేట రోడ్‌ కూడలి, ఒవైసీ ఆసుపత్రి, డీఆర్‌డీవో, హఫీజ్‌ బాబానగర్‌, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో కొత్త మెట్రో స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయని ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మెట్రో రైలు ఎలైన్‌మెంట్, స్టేషన్ల ఏర్పాటుకు శనివారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. మెట్రో రైలు స్టేషన్లకు సంబంధించి వాటి పేర్ల ఖరారుకు ట్రాఫిక్ పోలీసులు, సాధారణ ప్రజల నుంచి సలహాలు స్వీకరించాలని సూచనలు చేశారు.

గుండ్రని ముఖమా.. మీరు ఆ విషయంలో చాలా యాక్టివ్.. సైన్స్ ఇదే చెబుతోంది..

ఒక వ్యక్తి అందం, అభినయం కనిపించేది ముఖం (Face)లోనే. ఎలా మాట్లాడుతున్నారు, విషయాలను ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారనే దాన్ని బట్టి ఒకరిపై ఎదుటి వారికి ఇంప్రెషన్ ఏర్పడుతుంది.
అయితే ముఖం వ్యక్తిత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. పురాతన నమ్మకాలు, ఆధునిక పరిశోధనలు ముఖ ఆకారం (Face shape), వ్యక్తిత్వ లక్షణాల మధ్య ఒక ఆసక్తికరమైన సంబంధాన్ని వెల్లడించాయి. ధైర్యం నుంచి సృజనాత్మకత వరకు ముఖం ఒకరి గురించి చాలా విషయాలను వెల్లడించగలదని ఈ స్టడీస్ చెబుతున్నాయి. వివిధ ఫేస్ షేప్స్‌తో సంబంధం ఉన్న వ్యక్తిత్వ లక్షణాలు ఏవో పరిశీలిద్దాం.

* గుండ్రని ముఖం

గుండ్రని ముఖం (Round Face) అంటే విశాలమైన నుదురు, చబ్బీ చీక్స్, గుండ్రని గడ్డం కలిగి ఉండటం. ఈ ముఖ ఆకారం కలిగిన వ్యక్తులు సాధారణంగా ఫ్రెండ్లీగా ఉంటారు. వీరి దగ్గరికి వెళ్లి ఈజీగా మాట్లాడొచ్చు. రౌండ్ ఫేస్ ఉన్న పీపుల్ శ్రద్ధ వహించేవారుగా కనిపిస్తారు. ఈ సోషల్లీ యాక్టివ్ పీపుల్ ఇతరులతో సమయాన్ని గడపడం ఆనందిస్తారు. అయితే, వారు గొడవలు జోలికి అసలు వెళ్లరు. సంబంధాలలో సామరస్యాన్ని కోరుకుంటారు.

* స్క్వేర్ ఫేస్

చతురస్రాకార ముఖం (Square face) అంటే బలమైన దవడ, విశాలమైన నుదురు, చతురస్రాకార గడ్డం కలిగి ఉండటం. ఈ ముఖ ఆకారం కలిగిన వ్యక్తులు సాధారణంగా దృఢ నిశ్చయంతో, ధైర్యంతో, ధీరులుగా కనిపిస్తారు. వారు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను పొందుతారు. ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా కంట్రోల్ చేయగలరు. విశ్లేషణాత్మకంగా ఆలోచిస్తారు, సమస్యలను పరిష్కరించడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తారు. స్వతంత్రంగా ఆలోచిస్తారు.

* డైమండ్ షేప్డ్‌ ఫేస్

డైమండ్ ఆకారపు ముఖం అంటే ఎత్తుగా ఉన్న చీక్‌బోన్స్‌ (High cheekbones), సన్నని నుదురు, పదునైన గడ్డం కలిగి ఉండటం. ఈ ముఖ ఆకారం కలిగిన వ్యక్తులు సాధారణంగా ఆకర్షణీయంగా, సాహసోపేతంగా, అసాధారణంగా కనిపిస్తారు. వారు గుంపు నుంచి వేరుగా ఉండటానికి భయపడరు. ప్రత్యేకమైన లేదా అసాధారణ అనుభవాలకు ఆకర్షితులవుతారు. అయితే, వారు అనూహ్యంగా లేదా నిరంతరం అవిశ్రాంతంగా ఉన్నట్లు కూడా కనిపించవచ్చు.

* హార్ట్-షేప్డ్‌ ఫేస్

హృదయ ఆకారపు ముఖం (Heart shaped face) అంటే నుదురు వెడల్పుగా ఉండి, గడ్డం వైపు సన్నగా ఉండటం. ఈ ముఖ ఆకారం కలిగిన వ్యక్తులు సాధారణంగా ప్రేమలో పడేవారు, సున్నితమైనవారు, దయగలవారుగా కనిపిస్తారు. వీరు సొంత ఎమోషన్స్‌తో బాగా కనెక్షన్ కలిగి ఉంటారు. హార్ట్-షేప్ ఫేస్ ఉన్న వ్యక్తులు మంచి ఆర్టిస్టులు కూడా అవుతారు. వీరిలో క్రియేటివిటీ ఎక్కువ. అయితే వీరు సెల్ఫ్ డౌట్, అభద్రతకు గురవుతారు. * ఓవల్ ఫేస్
ఓవల్ ఫేస్ (Oval face) అంటే పొడవు ఎక్కువగా, వెడల్పు తక్కువగా ఉండి, సమతుల్యమైన నిష్పత్తులు, మృదువుగా గుండ్రని దవడ కలిగి ఉండటం. ఈ ముఖ ఆకారం కలిగిన వ్యక్తులు సాధారణంగా సమతుల్యంగా, సామరస్యంగా ఉంటారు. పరిస్థితిని రెండు వైపులా చూడగలిగే ప్రత్యేక ప్రతిభ వీరికి ఉంటుంది. సమస్యలకు పరిష్కారాలను కనుగొనే నైపుణ్యం సైతం ఉంటుంది. వీరు చాలా చాకచక్యంగా ఉంటారు. మంచి కమ్యూనికేటర్లు, మంచి శ్రోతలు కూడా. ఓవెల్ ఫేస్ గల వ్యక్తులు స్టైలిష్‌గా కనిపించవచ్చు.

Ragi Payasam: డయాబెటిస్‌ వాధ్యిగ్రస్తులు.. ఈ ఆరోగ్యకరమైన స్వీట్‌ మీకోసం..!

Ragi Payasam Recipe: రాగి సేమియా పాయసం ఒక రుచికరమైన, పోషకమైన డెజర్ట్. ఇది పండుగలు, ప్రత్యేక సందర్భాలకు లేదా రోజువారీ ఆహారంలో భాగంగా కూడా తయారు చేసుకోవచ్చు.
రాగిలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. దీనిని పిల్లలు, పెద్దలు తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. రాగి సేమియా పాయసం లోని ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఐరన్ కూడా గుండె ఆరోగ్యానికి ముఖ్యమైనది, ఎందుకంటే ఇది ఆక్సిజన్‌ను శరీర కణాలకు రవాణా చేయడంలో సహాయపడుతుంది. రాగి సేమియా పాయసం లోని విటమిన్లు B శరీరం ఆహారం నుండి శక్తిని ఉపయోగించుకోవడంలో సహాయపడతాయి. రాగి సేమియా పాయసం లోని ఫైబర్ మిమ్మల్ని ఎక్కువ సేపు కడుపు నిండినట్లు అనిపించేలా చేస్తుంది, ఇది అతిగా తినడాన్ని నివారించడంలో సహాయపడుతుంది. దీని తయారు చేసుకోవడం ఎంతో సులభం. మీరు కూడా ఇక్కడ చెప్పిన విధంగా తయారు చేసుకోండి..
కావాల్సిన పదార్థాలు:

రాగి సేమియా – 1 కప్పు
కొబ్బరి పాలు – 2 కప్పులు
ఎండుకొబ్బరి తురుము – 1/4 కప్పు
బెల్లం పొడి – 1 కప్పు
యాలకుల పొడి – 1/2 టీస్పూన్
నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు, బాదం, కిస్మిస్ – (అలంకరణకు)

తయారీ విధానం:

ఒక బాణలిలో నెయ్యి వేడి చేసి, జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకోండి. అదే బాణలిలో మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, రాగి సేమియా వేసి, గోధుమ రంగు వచ్చేవరకు వేయించుకోండి. ఒక గిన్నెలో కొబ్బరి పాలు పోసి మరిగించండి. మరిగిన కొబ్బరి పాలలో ఉడికించిన సేమియా, ఎండుకొబ్బరి తురుము, బెల్లం పొడి వేసి బాగా కలపాలి. పాయసం చిక్కబడేవరకు ఉడికించాలి. చివరగా యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేసి కలపి స్టౌ ఆఫ్ చేయండి. వేడిగా లేదా చల్లగా సర్వ్ చేయండి.

రాగి సేమియా పాయసం ప్రయోజనాలు:

రాగి పోషకాల సరసభూమి. ఇందులో ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

రాగి రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది.

ఎముకల ఆరోగ్యానికి మంచిది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

చర్మానికి మేలు చేస్తుంది.

డయాబెటిస్ నియంత్రణకు సహాయపడుతుంది.
గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

క్యాన్సర్ వ్యాప్తిని నిరోధిస్తుంది.

బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

Vizag Capital: మళ్లీ అధికారంలోకి రాగానే విశాఖ నుంచే పాలన

Vizag Capital: ఏపీలో మూడు రాజధానులపై మరోసారి క్లారిటీ ఇచ్చారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఈ రోజు ఎన్నికల మేనిఫెస్టో 2024ను విడుదల చేసిన ఆయన..
మూడు రాజధానులపై స్పష్టత ఇచ్చారు. మళ్లీ అధికారంలోకి రాగానే విశాఖపట్నం రాజధానినిగా పరిపాలన సాగుతుందన్నారు. అంతేకాదు, రాష్ట్రానికి గ్రోత్‌ ఇంజిన్‌గా.. విశాఖను అభివృద్ధి చేస్తాం అన్నారు. అమరావతిని శాసనరాజధానిగా.. కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఇక, రెండు పేజీలతో కూడిన వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేశారు సీఎం జగన్‌.. 9 ముఖ్యమైన హామీలతో కూడిన మేనిఫెస్టో చదివి వినిపించారు వైసీపీ అధినేత.

ఇక, వైసీపీ 2024 ఎన్నికల మేనిఫెస్టో విషయానికి వస్తే.. రెండు విడతల్లో పెన్షన్‌ రూ.3,500 దాకా పెంచుతామని హామీ ఇచ్చారు సీఎం జగన్‌.. (2028 జనవరిలో రూ.250, 2029 జనవరిలో రూ.250 పెంచుతాం).. 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ తప్ప మరొకటి లేదన్నారు.. అమ్మ ఒడి, విద్యాకానుక, మహిళలకు వైఎస్సార్‌ చేయూత తదితర పథకాల కొనసాగుతాయని స్పష్టం చేశారు.. వైఎస్సార్‌ చేయూత పథకం 4 విడతల్లో రూ.75 వేల నుంచి ఎనిమిది విడతల్లో రూ. లక్షా 50 వేలకు పెంచుతాం.. అమ్మ ఒడి రెండు వేలకు పెంచుతాం. రూ. 17వేలు చేస్తాం. తల్లుల చేతికి రూ.15 వేలు అందిస్తాం.. వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం కొనసాగిస్తాం.. నాలుగు దఫాల్లో రూ.60 వేల నుంచి రూ.లక్షా 20వేలకు పెంచుతాం.. నాలుగు దఫాల్లో ఈబీసీ నేస్తం 45 వేల నుంచి లక్షా 5 వేల రూపాయలకు పెంచనున్నట్టు వెల్లడించారు. వైస్సార్‌ రైతు భరోసా రూ.13,500 నుంచి రూ.16 వేలకు పెంపు.. కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపజేయనున్నట్టు వెల్లడించారు. మత్స్యకార భరోసా కింద ఐదు విడతల్లో రూ.50 వేలు అందజేస్తామన్న సీఎం.. వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద రూ.3 లక్షల రుణాలు ఇవ్వనున్నట్టు హామీ ఇచ్చారు.
ఇక, ఆటోలకు ట్యాక్సీలు కొనుగోలు చేసేవారికి వడ్డీ రాయితీ. ఆటోలకు, ట్యాక్సీలకు వచ్చే ఐదేళ్లలో రూ.50 వేలు పెంచుతాం.. వాహన మిత్రను ఐదేళ్లలో రూ.50 వేల నుంచి లక్ష రూపాయలకు పెంచుతాం అన్నారు సీఎం జగన్‌.. లారీ డ్రైవర్లు, టిప్పర్‌ డ్రైవర్లకు కూడా వాహన మిత్ర వర్తింపు.. రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా.. చేనేతలకు ఏడాదికి రూ.24 చొప్పున, ఐదేళ్లలో రూ.లక్షా 20 వేలు
వైఎస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా కొనసాగిస్తాం అన్నారు. లా నేస్తం కొనసాగింపు, అర్హులై ఇళ్ల స్థలాలు లేనివాళ్లందరికీ ఇళ్లు.. ఇళ్ల పట్టాలు కొనసాగుతాయని వెల్లడించారు సీఎం వైఎస్‌ జగన్‌.

కొనుగోలు దారులకు ఫ్లిప్‌కార్ట్‌ బంపరాఫర్‌

ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ కొనుగోలు దారులకు బంపరాఫర్‌ ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, గృహోపకరణాలపై డిస్కౌంట్లు లభించనున్నాయి.

వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్ పొందుతారు. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ యూపీఐ,నో-కాస్ట్ ఈఎంఐలపై తగ్గింపు పొందవచ్చు. ఈ సేల్‌లో మొబైల్‌లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఫ్యాషన్‌తో పాటు పలు రకాల ఉత్పత్తులుంటాయి.

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్స్‌లో భాగంగా ఎస్‌బీఐ కార్డు ద్వారా చేసే కొనుగోళ్లపై 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్ అందింస్తుంది. దీంతో పాటు ఫ్లిప్‌కార్ట్‌ పే లేటర్‌ ఆప్షన్‌, కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన స్మార్ట్‌ఫోన్లపై భారీ ఎత్తున డిస్కౌంట్లు అందిచనున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు మరికొన్ని ప్రత్యేక సేల్స్‌ను ఫ్లిప్‌కార్ట్‌ అందుబాటులోకి తేనుంది.

ఇంటర్నెట్ ఉంటే ఇల్లే ఆఫీస్.. లక్ష రూపాయల జీతం.. ఎలాగో తెలుసుకోండి..

Money Earning: ఒకప్పుడు ఉద్యోగం చేయాలంటే పట్నం వెళ్లాల్సి వచ్చేది. కొన్ని నెలల పాటు కంపెనీల చుట్టూ తిరిగితే ఏదో చిన్న ఉద్యోగం లభించేది. అనుభవం, తెలివి రకరకాల ప్రత్యేకలతో కొన్నేళ్ల తరువాత ప్రమోషన్లు వచ్చేవి.
అప్పటికీ గానీ జీతం పెరిగేది కాదు. కానీ ఇప్పుడు ఇప్పుడు కొందరు కార్యాలయాన్ని నమ్ముకోవడం లేదు. ఏ కంపెనీ కోసం ఎదురుచూడడం లేదు. ఇంటర్నెట్ ను ఏర్పాటు చేసుకొని ఇంటినే కార్యాలయంగా మార్చుకుంటున్నారు. కాలు బయటపెట్టకుండా లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. అదెలాగో తెలుసకోండి..

వీడియోలతో సంపాదన:
నేటి కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ తప్పని సరిగా ఉంటుంది. అదీ స్మార్ట్ ఫోన్ అయి ఉంటుంది. దీంతో ఈ మొబైల్ తో విభిన్న వీడియోలు తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు.కొందరు దీనిని వృత్తిగా మార్చుకొని ప్రత్యేక కేటగిరీల వీడియోలు తీసి అప్లోడ్ చేస్తుున్నారు.దీని కోసం ఇంట్లో ఇంటర్నెట్ ఓ కంప్యూటర్ ఉంటే చాలు. వాటి ద్వారా క్వాలిటీ వీడియోలో అప్లోడ్ చేసి లక్షల రూపాయలు సంపాదించేవారు ఉన్నారు.

బ్లాగింగ్ ద్వారా..
కొందరు తమ అనుభవాలను ఇతరులతో పంచుకోవాలని చూస్తారు. ఒక కాలమ్ ను ఏర్పాటు చేసి బ్లాగ్ లను రాయొచ్చు. ఒకప్పుడు ఇవి సరదా కోసం రాసేవారు. కానీ ఇప్పుడు ఒక అంశాన్ని తీసుకొని అందులో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రముఖలుగా మారిన తరువాత కొన్ని సంస్థలు వారిని నియమించుకుంటున్నారు. వీరు బ్లాగులు రాయడానికి కార్యాలయానికి వెళ్లనక్కర్లేదు. ఇంట్లో నుంచే రాయొచ్చు.

కంటెంట్ రైటర్స్:
ప్రస్తుతం వెబ్ సైట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. వీటిలో స్టోరీలు రాసేందుకు కంటెంట్ రైటర్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఒక కేటగిరిలో పట్టు ఉంటే వాటిలో మంచి స్టోరీ రాయగలిగితే మంచి సంపాదన ఉంటుంది. కొందరు ఈ వెబ్ సైట్ల ద్వారా లక్షల రూపాయలు సంపాదించిన వారు ఉన్నారు.

Health

సినిమా