గుండ్రని ముఖమా.. మీరు ఆ విషయంలో చాలా యాక్టివ్.. సైన్స్ ఇదే చెబుతోంది..

ఒక వ్యక్తి అందం, అభినయం కనిపించేది ముఖం (Face)లోనే. ఎలా మాట్లాడుతున్నారు, విషయాలను ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారనే దాన్ని బట్టి ఒకరిపై ఎదుటి వారికి ఇంప్రెషన్ ఏర్పడుతుంది.
అయితే ముఖం వ్యక్తిత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. పురాతన నమ్మకాలు, ఆధునిక పరిశోధనలు ముఖ ఆకారం (Face shape), వ్యక్తిత్వ లక్షణాల మధ్య ఒక ఆసక్తికరమైన సంబంధాన్ని వెల్లడించాయి. ధైర్యం నుంచి సృజనాత్మకత వరకు ముఖం ఒకరి గురించి చాలా విషయాలను వెల్లడించగలదని ఈ స్టడీస్ చెబుతున్నాయి. వివిధ ఫేస్ షేప్స్‌తో సంబంధం ఉన్న వ్యక్తిత్వ లక్షణాలు ఏవో పరిశీలిద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

* గుండ్రని ముఖం

గుండ్రని ముఖం (Round Face) అంటే విశాలమైన నుదురు, చబ్బీ చీక్స్, గుండ్రని గడ్డం కలిగి ఉండటం. ఈ ముఖ ఆకారం కలిగిన వ్యక్తులు సాధారణంగా ఫ్రెండ్లీగా ఉంటారు. వీరి దగ్గరికి వెళ్లి ఈజీగా మాట్లాడొచ్చు. రౌండ్ ఫేస్ ఉన్న పీపుల్ శ్రద్ధ వహించేవారుగా కనిపిస్తారు. ఈ సోషల్లీ యాక్టివ్ పీపుల్ ఇతరులతో సమయాన్ని గడపడం ఆనందిస్తారు. అయితే, వారు గొడవలు జోలికి అసలు వెళ్లరు. సంబంధాలలో సామరస్యాన్ని కోరుకుంటారు.

* స్క్వేర్ ఫేస్

చతురస్రాకార ముఖం (Square face) అంటే బలమైన దవడ, విశాలమైన నుదురు, చతురస్రాకార గడ్డం కలిగి ఉండటం. ఈ ముఖ ఆకారం కలిగిన వ్యక్తులు సాధారణంగా దృఢ నిశ్చయంతో, ధైర్యంతో, ధీరులుగా కనిపిస్తారు. వారు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను పొందుతారు. ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా కంట్రోల్ చేయగలరు. విశ్లేషణాత్మకంగా ఆలోచిస్తారు, సమస్యలను పరిష్కరించడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తారు. స్వతంత్రంగా ఆలోచిస్తారు.

* డైమండ్ షేప్డ్‌ ఫేస్

డైమండ్ ఆకారపు ముఖం అంటే ఎత్తుగా ఉన్న చీక్‌బోన్స్‌ (High cheekbones), సన్నని నుదురు, పదునైన గడ్డం కలిగి ఉండటం. ఈ ముఖ ఆకారం కలిగిన వ్యక్తులు సాధారణంగా ఆకర్షణీయంగా, సాహసోపేతంగా, అసాధారణంగా కనిపిస్తారు. వారు గుంపు నుంచి వేరుగా ఉండటానికి భయపడరు. ప్రత్యేకమైన లేదా అసాధారణ అనుభవాలకు ఆకర్షితులవుతారు. అయితే, వారు అనూహ్యంగా లేదా నిరంతరం అవిశ్రాంతంగా ఉన్నట్లు కూడా కనిపించవచ్చు.

* హార్ట్-షేప్డ్‌ ఫేస్

హృదయ ఆకారపు ముఖం (Heart shaped face) అంటే నుదురు వెడల్పుగా ఉండి, గడ్డం వైపు సన్నగా ఉండటం. ఈ ముఖ ఆకారం కలిగిన వ్యక్తులు సాధారణంగా ప్రేమలో పడేవారు, సున్నితమైనవారు, దయగలవారుగా కనిపిస్తారు. వీరు సొంత ఎమోషన్స్‌తో బాగా కనెక్షన్ కలిగి ఉంటారు. హార్ట్-షేప్ ఫేస్ ఉన్న వ్యక్తులు మంచి ఆర్టిస్టులు కూడా అవుతారు. వీరిలో క్రియేటివిటీ ఎక్కువ. అయితే వీరు సెల్ఫ్ డౌట్, అభద్రతకు గురవుతారు. * ఓవల్ ఫేస్
ఓవల్ ఫేస్ (Oval face) అంటే పొడవు ఎక్కువగా, వెడల్పు తక్కువగా ఉండి, సమతుల్యమైన నిష్పత్తులు, మృదువుగా గుండ్రని దవడ కలిగి ఉండటం. ఈ ముఖ ఆకారం కలిగిన వ్యక్తులు సాధారణంగా సమతుల్యంగా, సామరస్యంగా ఉంటారు. పరిస్థితిని రెండు వైపులా చూడగలిగే ప్రత్యేక ప్రతిభ వీరికి ఉంటుంది. సమస్యలకు పరిష్కారాలను కనుగొనే నైపుణ్యం సైతం ఉంటుంది. వీరు చాలా చాకచక్యంగా ఉంటారు. మంచి కమ్యూనికేటర్లు, మంచి శ్రోతలు కూడా. ఓవెల్ ఫేస్ గల వ్యక్తులు స్టైలిష్‌గా కనిపించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *