IPL 2024: విధ్వంసం.. కేవలం 10 బంతుల్లోనే ఫిఫ్టీ కొట్టేశాడు!

గుజరాత్ టైటాన్స్ పై రికార్డ్ విజయాన్ని సాధించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్. 200 పరుగుల భారీ టార్గెట్ ను కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 16 ఓవర్లలోనే దంచికొట్టి.. ప్రపంచ క్రికెట్ ను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఇక ఈ మ్యాచ్ లో కొన్ని ఊహించని, నమ్మశక్యం కాని సంఘటనలు క్రికెట్ ప్రేమికులను షాక్ కు గురిచేస్తున్నాయి. అందులో ఒకటి విల్ జాక్స్ మెరుపు సెంచరీ. అతడి విధ్వంసాన్ని వర్ణించడానికి పదాలు కూడా సరిపోవు. మరి అతడి మెరుపు బ్యాటింగ్ లో విశేషాలు బోలెడున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం పదండి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

ఆర్సీబీ గెలవడానికి చివరి 6 ఓవర్లలో 53 పరుగులు కావాలి. ఈ దశలో కోహ్లీ(69), విల్ జాక్స్(44) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. మరి వీరిద్దరిలో సెంచరీ ఎవరు చేస్తారు? విరాట్ కోహ్లీనే అని అందరూ అనుకుంటారు. కానీ క్రికెట్ దిగ్గజాలే ఆశ్చర్యపడేలా, ప్రేక్షకులే అవాక్కైయ్యేలా తన బ్యాట్ కు పనిచెప్పాడు జాక్స్. తన తొలి ఫిఫ్టీని 31 బంతుల్లో చేసిన అతడు.. సెంచరీ మార్క్ ను చేరుకోవడానికి కేవలం 10 బంతులు మాత్రమే తీసుకున్నాడు. కేవలం రెండు ఓవర్లలోనే మ్యాచ్ ను ముగించేశాడు. మెహిత్ శర్మ వేసిన 15వ ఓవర్లో వరుసగా.. 4, 6, నోబాల్ 6, 2, 6, 4, 0లతో ఏకంగా 29 పరుగులు పిండుకున్నాడు. దీంతో 44 రన్స్ నుంచి ఒక్క ఓవర్లలోనే 73 పరుగులకు చేరుకున్నాడు. ఆ తర్వాత వరల్డ్ క్లాస్ స్పిన్నర్ గా పేరుగాంచిన రషీద్ ఖాన్ ఓవర్లో తన విశ్వరూపం చూపాడు.

కాగా విల్ జాక్స్ దంచుడు చూసి తొలి బంతికి సింగిల్ ఆడి అతడికి స్ట్రైక్ ఇచ్చాడు కోహ్లీ. ఇక ఆ తర్వాత వరుస బంతుల్లో 6, 6, 4, 6, 6లతో మ్యాచ్ ను ముగించేయడమే కాకుండా.. సంచలన శతకాన్ని నమోదు చేశాడు. అసలు ఇలా మ్యాచ్ ముగుస్తుందని బహుశా ఎవ్వరూ ఊహించి ఉండరు. కానీ విల్ జాక్స్ శివతాండవంతో.. అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. తొలి అర్దశతకానికి 31 బంతులు ఆడి.. ఆ తర్వాత ఫిఫ్టీని కేవలం 10 బంతుల్లోనే అందుకుని విధ్వంసానికి మరోపేరుగా మారాడు. ఇక జాక్స్ ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 10 సిక్సులు ఉన్నాయి. 41 బంతుల్లో సెంచరీ మార్క్ ను అందుకున్నాడు జాక్స్.

Related News

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *