Saturday, November 16, 2024

Software Engineer: టెకీలకు కొత్త కష్టాలు.. ఇక ఈ జన్మలో పెళ్లియోగం లేనట్లే! నెట్టింట రచ్చ

కాలం మారుతోంది. ఖర్చులు పెరుగుతున్నాయి. వీటికి అనుగుణంగా సంపాదన కూడా ఉండాలని నేటి తరం యువత భావిస్తోంది. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా.. లక్షల్లో సంపాదన ఉన్నా యువతులు తమను పెళ్లాడేందుకు ఆసక్తి చూపడం లేదంటూ కొందరు టెకీలు తలలు పట్టుకుంటున్నారు. భారీ ప్యాకేజీ ఉన్న వారివైపే మొగ్గు చూపుతున్నారట. తాజా పరిణామం నెట్టింట కొత్త చర్చకు దారితీసింది. ఇందుకు సంబంధించిన..
కాలం మారుతోంది. ఖర్చులు పెరుగుతున్నాయి. వీటికి అనుగుణంగా సంపాదన కూడా ఉండాలని నేటి తరం యువత భావిస్తోంది. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా.. లక్షల్లో సంపాదన ఉన్నా యువతులు తమను పెళ్లాడేందుకు ఆసక్తి చూపడం లేదంటూ కొందరు టెకీలు తలలు పట్టుకుంటున్నారు. భారీ ప్యాకేజీ ఉన్న వారివైపే మొగ్గు చూపుతున్నారట. తాజా పరిణామం నెట్టింట కొత్త చర్చకు దారితీసింది. ఇందుకు సంబంధించిన సోసల్ మీడియా పోస్ట్‌ ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. వివరాల్లోకెళ్తే..

ఓ యువకుడు బాగా చదువుకుని ఇంజనీరింగ్‌ కొలువు కొట్టాడు. ఉద్యోగం వచ్చింది కదా అని రెండేళ్ల తర్వాత తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని అరేంజ్‌డ్‌ మ్యారేజ్‌ చేసుకునేందుకు సిద్ధపడ్డాడు. అలా ఓ అమ్మాయిని చూసేందుకు వారి ఇంటికి వెళ్లారు. మాటల మధ్యలో వరుడి వార్షిక వేతనం ఎంత అని వధువు తరపు బంధువులు ప్రశ్నించారు. రూ.8 లక్షలు అని వరుడు సమాధానం చెప్పాడు. దీంతో వెంటనే వధువు సదరు పెళ్లి సంబంధాన్ని తిరస్కరించింది. కారణం ఏంటని ప్రశ్నించగా తనకు ఉద్యోగం లేదని, వరుడికి కనీసం ఏడాదికి రూ.25 లక్షల జీతం ఉంటే తప్ప కుటుంబం గడవదని ఇంత తక్కువ జీతంతో కుటుంబాన్ని నడపడం కష్టమని వివరణ ఇచ్చింది. వధువు సమాధానం విని వరుడు తరపు బంధువులు నోరెల్ల బెట్టారు.
ఏడాదికి రూ.8 లక్షల ప్యాకేజీ ఉన్న తనను వివాహం చేసుకునేందుకు ఓ యువతి తిరస్కరించిందని తన గోడును స్నేహితునికి చెప్పుకుని గొల్లుమన్నాడు. దీంతో సదరు స్నేహితుడు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఏడాదికి రూ.8 లక్షలు సంపాదించే తన ఇంజనీర్‌ ఫ్రెండ్‌ వివాహ కష్టాలు తెలిపాడు. దీంతో ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. నెట్టింట పోస్ట్​ చేసిన ఒక్క రోజులోనే 5.1లక్షల వీక్షణలు​, వేలల్లో లైక్స్​ వచ్చాయి. అయితే.. చాలా మంది ఆ వదువుకు మద్దతుగా కామెంట్స్​ చేస్తున్నారు.

‘పర్లేదు. అంచనాలు పెట్టుకోవడంలో తప్పేముంది? పెళ్లికి ముందే ఆమె తన అంచనాలను స్పష్టంగా వెల్లడించింది. ఇది అబ్బాయికి సదావకాశం. రాబోయే 2-4 సంవత్సరాలలో తన వార్షిక వేతనం రూ. 25 లక్షలకు పెంచుకునే పనిలో ఉంటాడు. లేదంటే ఏడాదికి రూ.5 లక్షలు ఆశించే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు అంటూ ఓ యూజర్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. దంపతులు మెట్రో నగరంలో నివసించాల్సి వస్తే ఏడాదికి రూ.8 లక్షలు చాలా తక్కువ. కనీసం రూ.15 లక్షలైనా ఉండాలని మరో యూజర్‌ వాస్తవాన్ని అంగీకరించాల్సిందేనని రాసుకొచ్చాడు. ఏదైమైనా ఇదే ట్రెండ్ మనుముందు కొనసాగితే టెకీలంతా పెళ్లికాని ప్రసాదులై పోతారేమో.. నని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

వాషింగ్‌మెషిన్‌ని 2 వారాలకి ఓసారి ఇలా క్లీన్ చేస్తే బట్టల మురికి చక్కగా పోతుంది..

బట్టల్ని ఉతకడానికి చాలా మంది వాషింగ్ మెషిన్ వాడతారు. దీంతో త్వరగా పని అయిపోతుంది. వాషింగ్ మెషీన్ శుభ్రంగా క్లీన్ చేయడం తప్పనిసరి. దీని వల్ల బట్టలు కూడా నీట్‌గా క్లీన్ అవుతాయి. అయితే, మరి వాషింగ్‌మెషిన్‌ని ఎలా క్లీన్ చేయాలో తెలుసుకోండి.

వంటసోడా..
వెనిగర్, బేకింగ్ సోడాని కలపండి. దీనిని స్పాంజితో తీసి మెషిన్‌ లోపల బాగా రుద్దాలి. ఆ తర్వాత కాస్తా వేడినీరు పోసి క్లీన్ చేయొచ్చు. దీని వల్ల మురికి త్వరగా పోతుంది. తర్వాత మీరు శుభ్రమైన గుడ్డతో వాషింగ్ మెషిన్‌ని క్లీన్ చేయండి. దీంతో చక్కగా క్లీన్ అవుతుంది.

వైట్ వెనిగర్..
మీరు వెనిగర్‌తో వాషింగ్ మెషిన్‌ని క్లీన్ చేయండి. దీని కోసం ముందుగా వెనిగర్ తీసుకుని డిటర్జెంట్ డిస్పెన్సర్‌లో వేయండి. ఆ తర్వాత వాషింగ్ మెషిన్‌ని ఆన్ చేసి స్పిన్ చేయండి. ఈ టైమ్‌లో వెనిగర్ వాషింగ్ మెషిన్ లోపలి భాగాన్ని నానబెడుతుంది. దీంతో మురికిమొత్తం బయటికి వస్తుంది. ఆ తర్వాత మామూలుగా బట్టలు ఉతికినట్లే నీరు పోసి తిప్పి మెషిన్‌లో సరిగ్గా ఉతకొచ్చు.

నిమ్మ, టూత్‌పేస్ట్..
ఇందుకోసం ముందుగా నిమ్మకాయని సగానికి కట్ చేయాలి. తర్వాత ఆముక్కకి పేస్టుని రాయండి. అది వాషింగ్‌ మెషిన్‌లో వేసి కొన్ని నీరు పోయండి. కావాలనుకుంటే మరింత పేస్టు కూడా వేయండి. తర్వాత దానిని ఆన్ చేయండి. నీరు పోసి క్లీన్ చేయండి. దీని వల్ల వాషింగ్ మెషిన్ క్లీన్‌గా మెరుస్తుంది.

ఎన్నిరోజులకోసారి..
తప్పనిసరిగా వాషింగ్ మెషిన్‌ని ప్రతి రెండు వారాలకి ఓ సారి క్లీన్ చేస్తే అది బట్టలలోని సూక్ష్మక్రిములని దూరం చేస్తుంది. వాషింగ్ మెషిన్ శుభ్రంగా ఉంటేనే మన బట్టలు కూడా చక్కగా క్లీన్ అవుతాయి. లేదంటే బట్టలు ఉతికాక కూడా మురికి వదలదు. మనం సరిగ్గా క్లీన్ చేయకపోతే బట్టల్లోని మురికి అలానే ఉండి పోతుంది.

వీటిని ఉతకొద్దు..
అన్ని బట్టల్ని వాషింగ్ మెషిన్‌లో వేయకపోవడమే మంచిది. ఇందులో ముఖ్యంగా లోదుస్తులు. వీటి ద్వారా ఇందులోని క్రిములు ఇతర బట్టలకి వ్యాపించే అవకాశం ఉంది. దీంతో ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి. చిన్న పిల్లల బట్టలు సపెరేట్‌గా ఉతకండి.

Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికల వేళ భారత్‌పై చైనా కుట్రలు.. కేంద్రాన్ని అలర్ట్ చేసిన మైక్రోసాఫ్ట్

Lok Sabha Elections: ప్రస్తుతం దేశం మొత్తం సార్వత్రిక ఎన్నికల సమరానికి తెరలేచింది. మరోసారి గెలిచి కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టాలని ఎన్డీఏ కూటమి ఆరాటపడుతుండగా.. నరేంద్ర మోదీ సర్కార్‌ను గద్దె దించాలని ప్రతిపక్ష ఇండియా కూటమి వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే ఈసారి ఎన్నికలు రసవత్తరంగా సాగుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే దిగ్గజ టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్ కీలక విషయాలు వెల్లడించింది. భారత్‌లో జరగనున్న ఎన్నికల్లో డ్రాగన్ తలదూర్చే యత్నాలు చేస్తోందని మైక్రోసాఫ్ట్.. ఆందోళన వ్యక్తం చేసింది.

భార‌త్‌లో మరికొన్ని రోజుల్లో జ‌ర‌గ‌నున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో చైనా జోక్యం చేసుకునే అవ‌కాశాలు ఉన్నాయని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్-ఏఐని ఉపయోగించుకుని.. లోక్‌స‌భ ఎన్నిక‌లపై చైనా ప్రభావం చూపించే అవకాశం ఉందని తెలిపింది. ఏఐ ఆధారిత సమాచారంతో భారత్‌తో పాటు అమెరికా, ద‌క్షిణ కొరియా దేశాల్లో ఉన్న ఎన్నిక‌ల‌పైన కూడా ప్రభావం ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి.
ఎన్నిక‌ల వేళ ఏఐ ఆధారిత సమాచారాన్ని సోష‌ల్ మీడియా వేదికగా ద్వారా ప్రచారం చేయ‌నున్నారని మైక్రోసాఫ్ట్ తెలిపింది. భారత్‌లో కీల‌క‌ంగా ఉండే ఎన్నిక‌లు త‌మ‌కు అనుకూలంగా ఉండే రీతిలో చైనా ఆ ప్రచారం చేసే అవకాశం ఉందని పేర్కొంది. సోషల్‌ మీడియాలో మీమ్స్‌, డీప్‌ ఫేక్‌ ఫొటోలు, వీడియోలు, ఆడియోల రూపంలో ఆ కామెంట్ ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే చైనాకు మద్దతుగా ఉండే రీతిలో ఆ సోషల్ మీడియా కంటెంట్‌ను రూపొందించ‌నున్నారని వెల్లడించింది. ఇలాంటి ఎత్తుగ‌డ‌ల‌తో లోక్‌సభ ఎన్నికల్లో ప్రభావం చూప‌డం త‌క్కువే అన్న అభిప్రాయాన్ని కూడా మైక్రోసాఫ్ట్ వ్యక్తం చేసింది.
ఈ ఏడాది ప్రపంచంలోని దాదాపు 64 దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ప్రపంచ జనాభాలో ఈ దేశాల వాటా 49 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది అభిప్రాయాలను ప్రభావితం చేసేందుకు చైనా ప్రణాళికలు రచిస్తోందని తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ ఇంటిలిజెన్స్ టీమ్‌ హెచ్చరికల ప్రకారం.. చైనా కేంద్రంగా పనిచేసే కొన్ని సైబర్ గ్రూప్‌లు వివిధ దేశాల్లో జరిగే ఎన్నికలను ప్రభావితం చేయనున్నాయని.. ఆ గ్రూప్‌లకు ఉత్తర కొరియాలోని మరికొన్ని గ్రూపులు సహాయం అందించనున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇప్పటికే ఇలాంటి ఆరోపణలు చైనా మీద ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో తైవాన్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తప్పుడు సమాచారాన్ని తైవాన్‌లో చైనా విస్తృతంగా వ్యాప్తి చేయించిందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఇదే విధంగా వివిధ దేశాల్లో కూడా ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఒక ప్రభుత్వ సంస్థ ఏఐ కంటెంట్‌ను వినియోగించడం ఇదే తొలిసారి అని మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది.

Clay Pot Water Benefits: వేసవిలో కుండలోని నీళ్లు తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..

నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. ఎంత నీరు తాగితే అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందులోనూ ప్రస్తుతం సమ్మర్ కాబట్టి.. నీటిని మరింత ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే.. చెమట రూపంలో శరీరంలోని నీరు బయటకు వెళ్లిపోతుంది. దీంతో డీహైడ్రేషన్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అయితే వేసవి తాపం నుంచి బయట పడేందుకు చాలా మంది.. ఫ్రిజ్‌లోని వాటర్ తాగుతూ ఉంటారు. కానీ ఫ్రిజ్‌ వాటర్ ఎక్కువగా తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు..
నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. ఎంత నీరు తాగితే అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందులోనూ ప్రస్తుతం సమ్మర్ కాబట్టి.. నీటిని మరింత ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే.. చెమట రూపంలో శరీరంలోని నీరు బయటకు వెళ్లిపోతుంది. దీంతో డీహైడ్రేషన్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అయితే వేసవి తాపం నుంచి బయట పడేందుకు చాలా మంది.. ఫ్రిజ్‌లోని వాటర్ తాగుతూ ఉంటారు. కానీ ఫ్రిజ్‌ వాటర్ ఎక్కువగా తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఫ్రిజ్ వాటర్ కంటే.. కుండలోని నీటిని తాగడం చాలా ఆరోగ్యం అని, శరీరానికి ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు. మరి కుండ నీళ్లు తాగితే ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

నేచురల్‌గానే చల్లగా ఉంటాయి:
కుండలోని నీరు సహజంగానే చాలా చల్లగా ఉంటాయి. ఫ్రిజ్ లోని వాటర్ కంటే ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఫ్రిజ్‌లోని చల్లని నీరు తాగితే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ కుండ నీరు తాగితే శరీరానికి చలువ చేస్తుంది.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:
ఇప్పుడంటే వంట పాత్రల్లో ఎన్నో రకాలు వచ్చాయి. కానీ పూర్వం మాత్రం అన్నీ మట్టి కుండల్లోనే చేసేశారు. నిల్వ ఉంచే పదార్థాలు సైతం వీటిల్లోనే ఉండేవి. మట్టి పాత్రల్లో చాలా రకాల పోషకాలు ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. కాబట్టి ఇవి శరీరానికి చాలా మంచిది. శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. తద్వారా వ్యాధులతో పోరాడే శక్తి మీకు లభిస్తుంది.
గొంతు నొప్పి – జలుబు రావు:
కుండ నీరు తాగడం వల్ల గొంతు నొప్పి, జలుబు, వేడి చేయడం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అదే ఫ్రిజ్‌లోని వాటర్ తాగితే గొంతు నొప్పి, జలుబు వంటివి త్వరగా ఎటాక్ చేస్తాయి. మట్టి కుండలోని నీటిని తాగితే.. ఈ సమస్యలు దూరం అవుతాయి.

జీర్ణ క్రియ మెరుగు పడుతుంది:
కుండలను బంక మట్టితో తయారు చేస్తారు. కాబట్టి ఇవి సహజంగానే ఆల్కలీన్.. కాబట్టి ఇందులో నిల్వ చేసిన నీరు పీహెచ్ లెవల్స్ కంటే బ్యాలెన్స్‌గా ఉంటాయి. కాబట్టి జీర్ణ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఈ నీటిని తాగడం వల్ల జీర్ణ క్రియ అనేది మెరుగు పడుతుంది. అలాగే మల బద్ధకం వంటి సమస్య కూడా తగ్గుతుంది

ఎలాంటి బ్యాక్టీరియా ఉండవు:
సాధారణ నీటి కంటే.. కుండలోని నీటిలో ఎలాంటి కెమికల్స్ అనేవి ఉండవు. మట్టికుండ.. నీటిలోని సూక్ష్మ జీవులకు వ్యతిరేకంగా పోరాడతాయి. కాబట్టి ఈ నీటిలో వైరస్, బ్యాక్టీరియా వంటివి ఉండవు. జబ్బుల బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది.

Hanuman Jayanti: హనుమాన్ జయంతిని ఏడాదిలో రెండుసార్లు ఎందుకు జరుపుకుంటారో తెలుసా ?

పవన్‌పుత్ర హనుమాన్ ఒక జన్మదినాన్ని ఆయన జయంతిగా జరుపుకుంటారు. మరొక జన్మదినాన్ని విజయ అభినందన మహోత్సవంగా జరుపుకుంటారు. హిందూ మత గ్రంధాల ప్రకారం సంకత్మోచన హనుమంతుడు కార్తీక మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజు మంగళవారం మేషరాశిలో జన్మించాడు. అదే సమయంలో చైత్రమాసంలో మరోసారి హనుమంతుడి జయంతిని కూడా జరుపుకుంటారు. దీని వెనుక ఒక పౌరాణిక కథ ఉంది. ఆ పురాణాల ప్రకారం హనుమంతుడికి పుట్టినప్పటి నుండి అద్భుతమైన శక్తులు ఉన్నాయి.

హనుమంతుడికి హిందూ మతంలో విశిష్ట స్థానం ఉంది. హిందూ మతంలో ప్రతి రోజు ఏదో ఒక దేవత లేదా దేవుళ్లకు అంకితం చేయబడినట్లుగా మంగళవారం కూడా పవన పుత్ర హనుమాన్‌కి అంకితం చేయబడింది. హనుమంతుడి జయంతి సంవత్సరానికి రెండుసార్లు జరుపుకుంటారు. ఈ రెండు వార్షికోత్సవాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

హనుమంతుడు శ్రీ రామునికి గొప్ప భక్తుడు. హిందూ మతంలో అతని ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అన్ని బాధలను , కష్టాలను తొలగిస్తాడని విశ్వాసం. అందుకే అతనిని సంకత్మోచనుడు అని కూడా పిలుస్తారు. శ్రీ రామ నవమిలాగే హనుమాన్ జయంతి రోజు కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఎందుకంటే హనుమంతుడు జన్మించాడు. అయితే హనుమాన్ జయంతిని ఏడాదికి ఒకసారి కాదు రెండు సార్లు జరుపుకుంటారని మీకు తెలుసా. దీని వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకుందాం.

హనుమాన్ జయంతి ఎప్పుడు? (హనుమాన్ జయంతి 2024 ఎప్పుడు)
వాల్మీకి రామాయణం ప్రకారం హనుమంతుడు కార్తీక మాసంలోని కృష్ణ పక్షం చతుర్దశి తేదీన స్వాతి నక్షత్రంలో జన్మించాడు. అందుకే ఈ తేదీని హనుమంతుని జన్మదినంగా జరుపుకుంటారు. అదే సమయంలో చైత్ర మాసం పౌర్ణమి రోజున జరుపుకునే హనుమాన్ జయంతి వెనుక ఒక పురాణ కథ ఉంది. ఈ ఏడాది 2024లో హనుమాన్ జయంతి ఏప్రిల్ 23న జరుపుకోనున్నారు.

పవన్‌పుత్ర హనుమాన్ ఒక జన్మదినాన్ని ఆయన జయంతిగా జరుపుకుంటారు. మరొక జన్మదినాన్ని విజయ అభినందన మహోత్సవంగా జరుపుకుంటారు. హిందూ మత గ్రంధాల ప్రకారం సంకత్మోచన హనుమంతుడు కార్తీక మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజు మంగళవారం మేషరాశిలో జన్మించాడు.

అందుకే హనుమాన్ జయంతిని ఏడాదికి రెండుసార్లు
అదే సమయంలో చైత్రమాసంలో మరోసారి హనుమంతుడి జయంతిని కూడా జరుపుకుంటారు. దీని వెనుక ఒక పౌరాణిక కథ ఉంది. ఆ పురాణాల ప్రకారం హనుమంతుడికి పుట్టినప్పటి నుండి అద్భుతమైన శక్తులు ఉన్నాయి. బాల్యంలో ఒకసారి, హనుమంతుడికి ఆకలిగా అనిపించినప్పుడు అతను సూర్యుడిని ఒక పండుగా కనిపించాడు. దానిని తినడానికి సూర్యుడి వెనుక పరిగెత్తడం ప్రారంభించాడు. అతని దగ్గరికి వెళ్లి, అతను సూర్యుడిని మింగడానికి ప్రయత్నించాడు. దీని కారణంగా భూమి మొత్తం చీకటి వ్యాపించింది. ఇంద్ర దేవుడు ఈ విషయం తెలుసుకుని సూర్యుడిని తినకుండా ఆపడానికి హనుమంతుడిని పిడుగుతో కొట్టాడు. దీంతో హానుమాన్ కింద పడిపోయాడ.

ఈ విషయం హనుమాన్ తండ్రి పవన్‌ దేవుడికి తెలియడంతో… అతను చాలా కోపంతో విశ్వం మొత్తం గాలిని నిలిపివేశాడు. దాని కారణంగా భూమిపై గాలి లేకపోవడంతో హకారాలు ఏర్పడ్డాయి. దీని తరువాత బ్రహ్మ దేవుడు వాయు దేవుడి కోపాన్ని చల్లార్చాడు. హనుమంతుడికి ప్రాణం పోశాడు. చైత్ర మాసం పౌర్ణమి రోజున హనుమంతుడు కొత్త జీవితాన్ని పొందాడని నమ్ముతారు. ప్రతి సంవత్సరం చైత్ర మాసం శుక్ల పక్ష పౌర్ణమి నాడు హనుమాన్ జయంతిని జరుపుకోవడానికి కారణం ఇదే.

హనుమాన్ జయంతి గురించి అడిగే కొన్ని ప్రశ్నలు.. వాటి సమాధానాలు
హనుమాన్ జయంతి సందర్భంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి?

సమాధానం- హనుమంతుడి జయంతి రోజున ఇంట్లో సుందరకాండ పారాయణం చేసి పేదలకు బూందీ లడ్డూ ప్రసాదం పంచండి. హనుమాన్ జయంతి నాడు, బజరంగబలికి సింధూరం, తమలపాకును సమర్పించండి.

హనుమాన్ జయంతి నాడు ఏమి చేయకూడదు?

సమాధానం- ఈ రోజున, మహిళలు పూజ సమయంలో బజరంగ్ బాన్ పఠించకూడదు. ఉపవాసం ఉన్నవారు ఉప్పు తినకూడదు.

హనుమాన్ జయంతి రోజున ఏమి దానం చేయాలి?

హనుమంతుడి జయంతి రోజున లిచీ, యాపిల్, దానిమ్మ మొదలైన ఎరుపు రంగు పండ్లను కూడా దానం చేయవచ్చు. ఈ రోజున ఎరుపు రంగు పండ్లను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు.

హనుమాన్ జయంతి రోజున హనుమంతుడికి ఏమి అందించాలి?

ఈ రోజున తమాల పాలకులు, బెల్లం , శనగలు, అరటిపండు, లడ్డూ, బూందీ, డ్రై ఫ్రూట్స్ వంటి పదార్ధాలను నైవేద్యంగా సమర్పించాలి. దీనితో పాటు కుంకుమపువ్వుతో చేసిన అన్నం కూడా నైవేద్యంగా పెట్టవచ్చు.

హనుమంతునికి ఇష్టమైన పండు ఏది?

సమాధానం- మత విశ్వాసాల ప్రకారం హనుమంతుడికి అరటిపండ్లు ప్రియమైనవి. అందుచేత హనుమంతుడి జయంతి రోజున అరటి పండ్లను సమర్పించవచ్చు.

హనుమంతుడికి ఏ ప్రసాదం అంటే ఇష్టం?

సమాధానం- హనుమంతుడి జయంతి పూజ సమయంలో ప్రసాదం లేదా లడ్డూ లేదా శనగపిండి బర్ఫీ వంటి స్వీట్లను అందించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.

AP Politics: వారందరికీ ఏప్రిల్ నుంచే రూ. 4 వేలు పింఛన్‌ పంపిణీ..

రాష్ట్రంలో పింఛనుదార్ల మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ జగన్‌(YS Jagan) వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. తూర్పుగోదావరి(East Godavari) జిల్లా నల్లజర్లలో(Nallajarla) మీడియా సమావేశంలోనూ, పశ్చిమ గోదావరి(West Godavari) జిల్లా నరసాపురం, పాలకొల్లు పట్టణాల్లో నిర్వహించిన ప్రజాగళం యాత్రలోనూ చంద్రబాబు(Chandrababu) మాట్లాడారు.

రాజమహేంద్రవరం, భీమవరం/నరసాపురం/పాలకొల్లు, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): ‘‘ఏప్రిల్‌ నుంచే రూ.4 వేల చొప్పున పింఛన్‌ ఇస్తాను. ఏప్రిల్‌, మే, జూన్‌ల్లో మీరు తీసుకునే రూ.మూడు వేలకు అదనంగా వెయ్యి చొప్పున జూలై నుంచి ఇచ్చే పింఛన్‌లో కలిపి అందిస్తాను’’ అని తెలుగుదేశం పార్టీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పింఛనుదార్ల మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ జగన్‌(YS Jagan) వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో మీడియా సమావేశంలోనూ, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పాలకొల్లు పట్టణాల్లో నిర్వహించిన ప్రజాగళం యాత్రలోనూ చంద్రబాబు మాట్లాడారు. పింఛనుదార్లను చంపేసి మరోసారి శవరాజకీయం చేసి లబ్ధి పొందాలని జగన్‌ ప్రయత్నం చేస్తున్నారని, ఇది క్షమించరాని నేరమని ఆగ్రహించారు.

వలంటీర్ల ఉద్యోగాలు ఉంటాయి…

‘‘వలంటీర్ల వ్యవస్థను ఎన్నికల్లో జోక్యం చేసుకోనీయవద్దని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలిచ్చింది. పెన్షన్లు డోర్‌ డెలివరీ చేయవద్దని చెప్పలేదు. ఈసీ ఇచ్చిన ఆర్డర్‌ ఒకటైతే, జగన్‌ ప్రభుత్వం చేసిన పని మరొకటి. వలంటీర్లను అధికార పార్టీ ఎన్నికల కోసం ఉపయోగించుకుంది. జగన్‌…వలంటీర్లు తమ సైన్యం అంటున్నాడు. రాజీనామా చేసిన వలంటీర్లకు ఉద్యోగాలు ఇచ్చే మొదటి ఫైలుమీద సంతకం పెడతానని సిగ్గులేకుండా చెబుతున్నాడు. మేం తటస్థంగా ఉండమని మాత్రమే వలంటీర్లను అడిగాం. మీ వ్యవస్థకు మేం వ్యతిరేకం కాదు. ఇంకా మీలో బాగా చదువుకున్నవారి కెరీర్‌ పెరిగేలా, మరింత ఆదాయానికి ఏమి చేయాలో చేసే బాధ్యత మాదని పదేపదే చెప్పాం. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 26 వేల మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వారితో పింఛన్ల పంపిణీ చేయిస్తే ఒక రోజు కాకపోతే, రెండోరోజుకు అయిపోతుంది. అలాంటిది చేయలేదు. పైగా నేనేదో అడ్డుపడినట్టు ప్రచారం చేస్తున్నారు.. మేం చాలా స్పష్టంగా ఉన్నాం. వలంటీర్లు రాజకీయాల్లో జోక్యంచేసుకోవడానికి వీల్లేదు. వలంటీర్లకు పూర్తిగా హామీ ఇచ్చాం. మీ ఉద్యోగాలు ఉంటాయి. మీ కెరీర్‌ కూడా బిల్డప్‌ చేస్తామని చెప్పాం’’

పెన్షన్‌ పేటెంట్‌ టీడీపీదే..

‘‘పెన్షన్ల పేటెంట్‌ హక్కు టీడీపీదే. ఎన్నికల్లో గెలవగానే పెన్షన్లు పెంచుతామని మొదట చెప్పిన పార్టీ తెలుగుదేశం. మొదట తేదీనే ఇస్తాం. ఇంటి దగ్గరే ఇస్తాం. పెంచిన రూ.4వేలు ఇస్తాం. ఒకవేళ ఒక నెలలో తీసుకోకపోతే మూడు నెలల వరకూ ఒకేసారి తీసుకునే వెసులుబాటు ఇస్తాం. మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటాను. సైకో తాత్కాలికంగా ఆనందిస్తాడు. అంతిమంగా ధర్మం గెలుస్తుంది. గడిచిన ఐదేళ్లలో జగన్‌ రూ.13 లక్షలకోట్లు అప్పుతెచ్చాడు. ఖజానా ఖాళీ అయ్యింది. ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు ఇవ్వలేదు. జగన్‌ను చూస్తుంటే పాత సినిమాలో విలన్‌ నాగభూషణం గుర్తుకొస్తున్నాడు. ఫ్యాన్‌ అరిగిపోయింది. దాన్ని ముక్కలు ముక్కలు చేయాలి. జగన్‌ ఎక్స్‌ఫైర్డ్‌ మెడిసిన్‌.’’

వచ్చాడు.. బచ్చా

‘‘నా 40 ఏళ్ల అనుభవంలో ఎవరూ నాతో పెట్టుకోలేదు. వచ్చాడు.. బచ్చా.. వదలను.. నా తడాఖా చూపిస్తా. జాబ్‌ రావాలంటే రాష్ట్రంలో ఎన్డీయే రావాలి. నిరుపేదలకు రెండు సెంట్ల స్థలం ఇచ్చి ఇళ్లను నిర్మించి ఇస్తాం. వైసీపీ ఇచ్చింది సెంటు స్థలం. దానికి కూడా లంచాలు తీసుకున్నారు. కొత్తగా భూహక్కు చట్టం తీసుకొచ్చారు. ఇప్పటివరకు జగన్‌ ప్రభుత్వ స్థలాలు అమ్ముకున్నాడు. ఈ చట్టం అమల్లోకి వస్తే ప్రజల ఇళ్లు, ఆస్తులు కూడా తనఖా పెట్టి అప్పులు తెచ్చుకుంటాడు. ఒంటిమిట్టలో ఒక కార్మికుడు తనకున్న నాలుగు ఎకరాల భూమి అమ్ముకుందామని అనుకున్నాడు. కానీ రికార్డులు తారుమారయ్యాయి. ఎవరికి చెప్పినా.. న్యాయం జరగలేదు. చివరికి రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత భార్య, కూతురు విషం తాగి మరణించారు.’’ అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘పెన్షనర్ల పట్ల జగన్‌ నీచంగా, దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఆయనను ఈసీ ప్రశ్నించాలి. జగన్‌ చేతకాని తనం, దురుద్దేశ చర్యలతో కొంతమంది పెన్షనర్లు చనిపోయారు. అవి ప్రభుత్వ హత్యలు. ఈ హత్యలు చేసిన ముఖ్యమంత్రికి ప్రభుత్వంలో కొనసాగే నైతిక హక్కు లేదు. వెంటనే రాజీనామా చేయాలి’’

‘‘నేను మెగా డీఎస్సీపై తొలి సంతకం పెడతానంటే.. జగన్‌ రాజీనామా చేసిన వలంటీర్ల నియామకంపై తొలి సంతకం చేస్తానంటున్నాడు. నాది సమాజహితం. జగన్‌ది స్వార్ధం. జాబ్‌ రావాలంటే రాష్ట్రంలో ఎన్డీయే రావాలి, గంజాయ్‌ కావాలంటే జగన్‌ రావాలి’’

Gold Price: బంగారం ధర ఎప్పుడు తగ్గుతుంది? ఇప్పుడు కొనడం మంచిదేనా.. నిపుణులు ఏమంటున్నారు?

Gold Price: బంగారం ధరలు చుక్కలు చూయిస్తున్నాయి. రికార్డ్ గరిష్ఠాల్లో ట్రేడింగ్ అవుతున్నాయి. ప్రస్తుతం తులం బంగారం రూ.70 వేలు దాటింది. మరి ఇప్పుడు బంగారం కొనడం మంచిదేనా? బంగారం ధర ఎప్పుడు తగ్గొచ్చు? బులియన్ మార్కెట్ నిపుణులు ఏమంటున్నారు? ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Gold Price: బంగారం ధరలు రోజు రోజు భారీగా పెరుగుతున్నాయి. రెండు రోజుల్లో తులం బంగారం రూ. 1300 పైన పెరిగింది. ప్రస్తుతం గ్రాము గోల్డ్ రేటు 7 వేల పైనే ఉంది. మరి ఈ సమయంలో బంగారం కొనుగోలు చేయడం మంచిదేనా? బంగారాన్ని నగల రూపంలో కొంటే బెటరా లేదా బాండ్స్ రూపంలో కొనడం మంచిదా? బంగారం ధరలు పెరిగేందుకు కారణాలేంటి, ఈ పసిడి ధరలు ఎప్పుడు తగ్గుతాయి? ధరలు తగ్గే వరకు వేచి చూడడం మంచిదేనా? బులియన్ మార్కెట్ నిపుణులు ఏమంటున్నారు అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఇటీవలి కాలంలో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ధర పెరగుదలతో పోలిస్తే.. తగ్గడం చాలా స్వల్పంగా ఉంది. ఆర్థిక అనిశ్చితి, స్టాక్ మార్కెట్లలో ఒడుదొడుకుల వంటి కారణాలతో పెట్టుబడిదారులు బంగారాన్ని భద్రమైన సాధనంగా భావిస్తున్నారు. గోల్డ్ రేట్ల పెరుగుదల వెనుక అంతర్జాతీయ పరిణామాలుఉంటాయి. ప్రపంచ ప్రధాన మార్కెట్లలో లండన్ బులియన్ మార్కెట్ ఒకటి. ధరలను నిర్ణయించేది ఈ మార్కెట్టే. పెద్ద పెద్ద మైనింగ్ దిగ్గజాలు, పారిశ్రామికవేత్తలు ఈ సంస్థలో ఉన్నారు. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 2,256 డాలర్ల స్థాయిలో ట్రేడింగ్ అవుతోంది. 2023 నాటి గరిష్ఠ ధరతో పోలిస్తే 8 శాతం ఎక్కువ. భారత కరెన్సీ విలువ సైతం పడిపోవడం గోల్డ్ ధరలు పెరిగేందుకు కారణమవుతోంది. ప్రతి ఏడాది భారత్ కు 800 టన్నుల బంగారం దిగుమతి అవుతుంటుంది. అమెరికాలో ఆర్థిక సంక్షోభం ధరల పెరుగుదలకు మరో కారణంగా బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
గత 20 ఏళ్ల కాలాన్ని గమనించినట్లయితే బంగారం ధరలు క్రమం తప్పకుండా పెరుగుతున్నాయి. దీనికి కారణం దాని డిమాండ్ పెరగడమే. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు, ఎన్నికల వాతావరణం, డొనాల్డ్ ట్రంప్ గెలిచే అవకాశాలు ఉన్నాయన్న ఊహాగానాలు, రాజకీయ పరమైన మార్పులు సైతం బంగారం పెరిగేందుకు కారణమవుతున్నాయి.
బంగారం ధర ఎప్పుడు తగ్గొచ్చు?
బంగారం ధరల పెరుగుదల 2025 వరకు కొనసాగే అవకాశం ఉందని జేపీ మోర్గాన్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థలు అంచనా వేస్తున్నాయి. అంటే ఈ ఏడాదంతా ధరలు పెరిగే అవకాశాలే ఉన్నాయని అర్థమవుతోంది. వచ్చే ఏడాదిలో కాస్త ఊరట లభించవచ్చు.

బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్న క్రమంలో పసిడిపై పెట్టుబడి పెడితే మంచి రాబడి వచ్చే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అయితే, నగలు లేదా బంగారు నాణాలు కొనుగోలు చేస్తే మొత్తం ధరలో తరుగు కమిషన్ కింద 20 శాతం పోతుంది. అంటే మీరు రూ.100 పెట్టి బంగారం కొంటే దాని అసలు విలువ రూ.80 మాత్రమే. అదే గోల్డ్ బాండ్ కొనుగోలు చేస్తే నెల నెలా వడ్డీ వస్తుంది. బాండ్స్ పోతాయనే భయం ఉండదు. డిజిటల్ గోల్డ్ ద్వారా 4 కిలోల వరకు కొనుగోలు చేయవచ్చు. వాటిపై పన్ను మినహాయింపులు సైతం లభిస్తాయి.

పోస్టాఫీస్‌లో మీరు పొదుపు చేస్తున్నారా? మీకు కేంద్రం శుభవార్త!

ప్రస్తుతం ప్రతి మనిషికి ఆర్థిక క్రమ శిక్షణ ఎంతో అవసరం. ఈ మద్య కాలంలో మనిషికి ఎప్పుడు ఎం జరుగుతుందో తెలియని పరిస్థితి. అయితే ఎటువంటి పరిస్థితులు వచ్చినా తట్టుకునే సామర్ధ్యం ఉండాలి. అందుకోసం మనం సంపాదించే డబ్బులో ఎంతో కొంత పొదుపు చేస్తూ ఉండాలి అని నిపుణులు చెబుతుంటారు. అలా చేయకుంటే కష్టకాలంలో మనకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. పొదుపు చేయడానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పొదుపు చేసుకునే సౌలభ్యం ఉంది. తాజాగా పోస్టాఫీస్ లో పొదుపు చేసేవారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.

సాధారంగా మార్కెట్ లో కొన్ని ప్రైవేట్ సంస్థలు పొదుపునకు సంబందించిన ఎన్నో రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఆకర్షణీయమైన పథకాలను అమలు చేస్తున్నాయి. అయితే చాలా మందికి ప్రైవేట్ సంస్థలపై పెద్దగా నమ్మకం కుదరదు. అందుకే ప్రభుత్వ రంగాలకు సంబంధించిన సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచే పోస్టాఫీస్ పరిధిలో పలు పెట్టుబడి పథకాలను కేంద్రం అమలు చేస్తుంది. పోస్టాపీస్ లో జీవిత బీమా పథకాలను తీసుకువస్తుంది. తాజాగా జీవిత బీమా తీసుకున్న పాలసీదారులకు కేంద్ర శుభవార్త చెప్పింది. పోస్టాఫీస్ లు ఆరు రకాల జీవిత బీమా పథకాలు ఆఫర్ చేస్తున్నాయి. ఇందులో సురక్ష పేరుతో హూల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్, సువిత కన్వర్బబుల్ హూల లైఫ్ ఇన్సురెన్స్ గ్యారంటీ , సంతోష్ ఎండోమెంట్ ప్లాన్, సురక్ష అనే పేరుతో జాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్, సుమంగల్ పేరుతో యాంటీసిపేటెడ్ ఎండోమెంట్ ప్లాన్, పాల్ జీవన్ బీమా అనే పేరుతో చిల్డ్రన్ ప్లాన్ పథకాలను కేంద్రం ప్రకటించింది.

ఈ పథకాలకు కేంద్ర ప్రభుత్వం బోనస్ లు కూడా ప్రకటించింది. బోనస్ ఏప్రిల్1 వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. వాస్తవానికి మార్చి 13 న కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీస్ లైఫ్ ఇన్సూరెన్స్ నిబంధనలకు సంబంధించిన బోనస్ ప్రకటించింది. ఈ బోనస్ ప్రకారం.. ప్రతి 1000 లైఫ్ ఇన్సూరెన్స్ కు 60 రూపాయలు వరకు బోనస్ రూపంలో పెట్టబడిదారుడికి వస్తుంది. ఇక పిల్లల కోసం పాలసీలతో పాటు ఎండోమెంట్ పథకాలలో 1000 హామీకి 48 రూపాయలు బోనస్, యాంటీసిపేటెడ్ ఎండోమెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్ పై 1000 రూపాయలకు గాను 45 రూపాయల వరకు బోనస్ లభిస్తుంది. కేంద్రం టెర్మినల్ బోనస్ ప్రవేశపెట్టింది.. దీని ప్రకారం ప్రతి 10 వేల రూపాయలకు 20 టెర్మినల్ బోనస్ లభిస్తుంది. చాలా మందికి పోస్టాఫీస్ లో ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయని తెలియదు. మరి ఎందుకు ఆలస్యం.. దగ్గరలోని పోస్టాఫీస్ కి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకొని పోదుపు మొదలు పెట్టండి.

ఇంటి నుంచే ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం… దీన్ని ఎలా నిర్వహిస్తారో తెలుసా…

లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 19న జరగనుంది. మొదటి దశ ఓటింగ్‌కు ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయం శుక్రవారం రాజస్థాన్‌లో ప్రారంభమైంది. రాజస్థాన్‌లో 58 వేల మంది ఓటర్లు ఇంటి నుంచే ఓటు వేశారు. మొదటి దశలో 35,542 మంది ఇంటింటికి ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. ఇందుకోసం మార్చి 27వ తేదీనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది.
ఇంటి ఓటింగ్ కోసం ప్రత్యేక ఓటింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. దీని శిక్షణ ఏప్రిల్ 4 నాటికి పూర్తయింది. హోమ్ ఓటింగ్ అంటే ఏమిటి, ఈ విధంగా ఓటు వేసే అవకాశం ఎవరికి లభిస్తుంది, ఒకరు ఎలా దరఖాస్తు చేసుకోవచ్చు అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఇంటి నుంచే ఓటింగ్ అంటే ఏమిటి, ఎవరికి అవకాశం ఉంటుంది ?

ఎన్నికల సంఘం అధికారులు ఓటర్ల ఇళ్లకు వెళ్లి ఓటు వేసేలా చేసే ప్రక్రియను ఇంటింటికి ఓటింగ్ అంటారు. గత ఎన్నికల్లో కూడా ఇంటింటికి ఓటింగ్ నిర్వహించి విజయం సాధించారు. ఈ ప్రత్యేక పోలింగ్ బృందాలు పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓటింగ్ నిర్వహిస్తాయి. మొదటి విడతలో ఏప్రిల్ 5 నుంచి 14 వరకు ఇంటింటికి ఓటింగ్ నిర్వహించనున్నారు.

కొంతమంది ఓటర్లకు ఇంటింటికి ఓటు హక్కు కల్పించారు. ఎన్నికల ప్రవర్తన నియమాలు, 1961 చట్టంలోని 27Aలోని గైర్హాజరీ ఓటరు విభాగం కింద వారిని గుర్తించారు. ఇంటింటికి ఓటు వేసేందుకు ఓటర్లను ఎంపిక చేసేందుకు కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి.

ఇందులో ఓటరు వయస్సు 80 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. వికలాంగ ఓటర్లకు ఈ అవకాశం లభిస్తుంది. కోవిడ్ వంటి అంటు వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ అవకాశం ఇవ్వనున్నారు. అలాగే కొన్ని అవసరమైన సేవలతో అనుబంధించి ఉన్న వ్యక్తులకు ఇంటి వద్ద ఓటు వేసే అవకాశం ఇవ్వనున్నారు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?

హోమ్ ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకునే అర్హత గల దరఖాస్తుదారులు తమ లోక్‌సభ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారికి ఫారం 12-డిని సమర్పించాలి. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన 5 రోజుల్లోగా ఓటరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత ఇద్దరు ఎన్నికల సంఘం అధికారులు పోలింగ్ బృందంతో కలిసి ఓటరు ఇంటికి వస్తారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేయడానికి వారికి సహాయం చేయాలి.

ఈ ఓటింగ్ సమయంలో పారదర్శకతను కొనసాగించడానికి, ఈ ఓటర్ల జాబితాను తయారు చేస్తారు. ఆ ప్రాంత పార్టీ అభ్యర్థులతో జాబితాను పంచుకున్నారు. ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, బ్యాలెట్ పేపర్ రిటర్నింగ్ అధికారి వద్ద భద్రంగా ఉంచుతారు. ఈ బ్యాలెట్ పేపర్ల లెక్కింపు ప్రక్రియ సాధారణ ఓట్ల లెక్కింపు సమయంలో జరుగుతుంది.

రాజస్థాన్‌లో రెండో దశ ఇంటి ఓటింగ్ ప్రక్రియ ఏప్రిల్ 2న పూర్తయింది. ఈ విధంగా రెండో విడత ఇంటింటికి 22,500 మంది ఓటర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో 17,324 మంది సీనియర్ సిటిజన్లు, 5,222 మంది వికలాంగ ఓటర్లు ఉన్నారు. వీటికి పోలింగ్ ఏప్రిల్ 14 నుంచి 21 వరకు జరగనుంది. రాజస్థాన్‌లో ఇంటింటికి పోలింగ్‌ జరగడం ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇలా చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇంటింటికి ఓటింగ్ నిర్వహించి విజయవంతం చేశారు.

భారీగా బంగారం కొంటున్న RBI. దీని వెనుక పెద్ద కథే ఉంది!

భారీగా పెరుగుతున్న బంగారం ధరలను దృష్టిలో ఉంచుకున్న.. భారత్ ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో భారతదేశంలో విదేశీ మారక నిల్వల స్థాయి రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఇప్పుడు అది గరిష్ట స్థాయికి చేరుకున్నట్లు సమాచారం. గత కొన్ని నెలలుగా బంగారం ధర భారీగా పెరిగిపోతున్న క్రమంలో.. దానిని నిల్వ ఉంచేందుకు.. భారత్ బంగారాన్ని భారీగానే కొనుగోలు చేస్తూ..దానిని నిల్వ చేస్తూ వస్తోంది. గత రెండేళ్లలో ఎప్పుడు లేని విధంగా ఈసారి ఇండియా .. బంగారాన్ని కొనుగోలు చేసింది. కానీ, ఇప్పటివరకు ఎంత బంగారం సేకరించారన్న విషయాన్నీ బయటకు చెప్పలేదు కానీ.. భారత్ లో బంగారం నిల్వల విలువ మాత్రం గరిష్ట స్థాయికి చేరుకుందని. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అయితే, అసలు ఎంత స్థాయిలో ఇప్పటివరకు బంగారం నిల్వలు జరుగుతున్నాయన్న విషయం తెలియదు కానీ, అధికారిక లెక్కల ప్రకారం.. 2022 మార్చి నాటికి ఫారిన్ ఎక్స్చేంజి నిల్వలలో 51.487 బిలియన్ డాలర్స్ విలువైన బంగారం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో 2023 మార్చి నాటికి అప్పటికి ఉన్న విలువలతో పోల్చితే.. 6.287 బిలియన్ డాలర్స్ రెట్టింపు అయిందట. ఇక ఇప్పుడు చూసినట్లయితే.. ఒక్క జనవరి నెలలోనే.. 8.7 టన్నుల బంగారాన్ని ఆర్బీఐ కొనుగోలు చేసింది. గత రెండు సంవత్సరాల నుంచి చూసినట్లయితే కనుక.. ఇంత బంగారాన్ని సేకరించడం ఇదే మొదటిసారి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం.. ఈ 2024 జనవరి నాటికి ఆర్బీఐ దగ్గర ఉన్న బంగారం నిల్వలు 812.3 టన్నులకు చేరుకున్నట్లు సమాచారం.

ఈ విషయాలన్నీ కూడా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. లేవరేజ్ పాలసీ రివ్యూ నిర్ణయాలను శక్తికాంత దాస్ శుక్రవారం వెల్లడించారు. ఈ క్రమంలోనే మార్చి 29 నాటికీ ఫారెన్ నిల్వలు 645.6 బిలియన్ డాలర్స్ వరకు చేరుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఒకవేళ భవిష్యత్తులో ఒక డాలర్ కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చినపుడు.. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు ఈ నిల్వలను కొనసాగిస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగానే గత నాలుగు నుంచి ఐదు సంవత్సరాలుగా దీనిపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని.. భారత్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు భావి తరాలకు ఉపయోగపడతాయని. అంతా భావిస్తున్నారు. ఇక రానున్న రోజుల్లో ఈ సేకరణ మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. అలాగే దానికి సంభందించిన భద్రతా చర్యలను కూడా పటిష్టంగానే చేపడుతున్నారు.

manjummel boys telugu review: రివ్యూ: మంజుమ్మ‌ల్ బాయ్స్‌.. మలయాళ సూపర్‌హిట్‌ తెలుగులో ఎలా ఉంది?

మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించిన ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ మూవీ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా?

Manjummel Boys telugu review: చిత్రం: మంజుమ్మ‌ల్ బాయ్స్‌; న‌టీన‌టులు: సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి, జార్జ్ మ‌రియ‌న్‌, లాల్ జూనియ‌ర్ త‌దిత‌రులు; సంగీతం: సుశిన్ శ్యామ్‌; ఛాయాగ్ర‌హ‌ణం: షైజు ఖలీద్; ద‌ర్శ‌క‌త్వం: చిదంబ‌రం; నిర్మాణ సంస్థ‌: మైత్రీ మూవీ మేక‌ర్స్‌; విడుద‌ల తేదీ: 06-04-2024

ఈ మధ్య కాలంలో మ‌ల‌యాళంలో బాగా వినిపించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్‌లో మంజుమ్మ‌ల్ బాయ్స్ ఒక‌టి. రూ.20కోట్ల ప‌రిమిత బ‌డ్జెట్‌తో నిర్మిత‌మైన ఈ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ ఏకంగా రూ.200కోట్ల పైచిలుకు వ‌సూళ్లు రాబ‌ట్టి కొత్త రికార్డులు నెల‌కొల్పింది. దీంతో ఇప్పుడా సినిమాని అదే పేరుతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చింది ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్‌. మ‌రి ఈ చిత్ర కథేంటి? ఇది తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎలాంటి అనుభూతి అందించింది? ఇక్క‌డా భారీ వ‌సూళ్లు కొల్ల‌గొట్టే అవ‌కాశ‌ముందా?

క‌థేంటంటే: కేర‌ళ‌లోని కొచ్చికి చెందిన కుట్ట‌న్ (షౌబిన్ షాహిర్‌), సుభాష్ (శ్రీనాథ్ భాషి)తో పాటు వారి స్నేహితులంద‌రూ సొంత ఊళ్లోనే చిన్నాచిత‌కా ఉద్యోగాలు చేసుకుంటూ జీవ‌నం సాగిస్తుంటారు. ఈ గ్యాంగ్‌కు మంజుమ్మ‌ల్ బాయ్స్ పేరుతో ఓ అసోసియేష‌న్ ఉంటుంది. వీరంతా క‌లిసి ఓసారి కొడైకెనాల్ ట్రిప్‌నకు వెళ్తారు. ఈ విహార‌యాత్ర‌కు సుభాష్ తొలుత రాన‌ని చెప్పినా.. కుట్ట‌న్ బ‌ల‌వంతం మీద ఆఖ‌రి నిమిషంలో కారెక్కుతాడు. ఈ మంజుమ్మ‌ల్ బ్యాచ్ కొడైకెనాల్‌లోని అంద‌మైన ప్ర‌దేశాల‌న్నీ చూశాక ఆఖ‌రిలో గుణ కేవ్స్ చూడ‌టానికి వెళ్తారు. ఆ గుహ‌లు బ‌య‌ట నుంచి చూడ‌టానికి ఎంత ర‌మ‌ణీయంగా ఉంటాయో.. అంతే ప్ర‌మాద‌క‌రం కూడా. ఎందుకంటే అక్క‌డ వంద‌ల అడుగుల లోతున్న ఎన్నో ప్ర‌మాద‌క‌ర‌మైన లోయ‌లుంటాయి. వాటిలో డెవిల్స్ కిచెన్ కూడా ఒక‌టి. దాదాపు 150 అడుగుల‌కు పైగా లోతున్న ఆ లోయ‌లో 13మందికి పైగా ప‌డ‌గా.. ఏ ఒక్క‌రూ ప్రాణాల‌తో తిరిగి రాలేదు. అందుకే గుణ కేవ్స్‌లోని ఆ ప్ర‌మాద‌క‌ర లోయ‌లున్న ప్రాంతాలున్న చోటుకు వెళ్ల‌డాన్ని అట‌వీశాఖ వారు.. పోలీసులు నిషేధిస్తారు. కానీ, మంజుమ్మ‌ల్ బాయ్స్ అక్క‌డున్న అట‌వీ సిబ్బంది కళ్లుగ‌ప్పి.. ఫెన్సింగ్ దాటి గుణ కేవ్స్‌లోని ఆ ప్ర‌మాద‌క‌ర‌మైన ప్ర‌దేశానికి వెళ్తారు. అక్క‌డ వారంతా స‌ర‌దాగా గ‌డుపుతుండ‌గా అనుకోకుండా సుభాష్ అక్క‌డే ఉన్న అతి ప్ర‌మాద‌క‌ర‌మైన డెవిల్స్ కిచెన్ లోయ‌లోకి జారిప‌డ‌తాడు. మ‌రి ఆ త‌ర్వాత ఏమైంది? ఆ లోయ నుంచి సుభాష్‌ను ప్రాణాల‌తో కాపాడి తీసుకురావ‌డానికి తోటి మిత్రులంతా ఏం చేశారు? పోలీసులు వాళ్ల‌పై తిర‌గ‌బ‌డ‌టానికి కార‌ణ‌మేంటి? ఆ ప్ర‌మాద‌క‌ర‌మైన లోయ‌లోకి వెళ్ల‌డానికి పోలీసులు, ఫైర్ డిపార్ట్‌మెంట్ సిబ్బందే భ‌య‌ప‌డుతున్న‌ప్పుడు సుభాష్‌ను ర‌క్షించేందుకు కుట్ట‌న్ మాత్ర‌మే లోయ‌లోకి దిగేందుకు ఎందుకు సిద్ధ‌ప‌డ్డాడు?వాళ్లిద్ద‌రూ ఆఖ‌రికి ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డ్డారా? లేదా?అన్న‌ది తెర‌పై చూసి తెలుసుకోవాలి.

ఎలా సాగిందంటే: ఇది య‌థార్థ క‌థ‌. 2006లో గుణ కేవ్స్‌లో చిక్కుకున్న త‌న మిత్రుడ్ని ర‌క్షించుకునేందుకు ఎర్నాకులం మంజుమ్మ‌ల్ బాయ్స్ చేసిన సాహ‌సానికి తెర రూప‌మే ఈ చిత్రం. దీన్ని ద‌ర్శ‌కుడు చిదంబ‌రం ఎంతో నిజాయితీగా స‌హ‌జ‌త్వం ఉట్టిప‌డేలా తెర‌పై చూపించ‌గ‌లిగాడు. సినిమా చూస్తున్నంత సేపూ ఆ ఇరుకు లోయ‌లో.. ఆ క‌టిక చీక‌ట్ల మ‌ధ్య తామే చిక్కుకున్నామేమో అని ప్రేక్ష‌కుల‌కు అనిపించేలా క‌థ‌ని ఉత్కంఠ‌భ‌రితంగా న‌డిపించాడు. నిజానికి కొన్ని మ‌ల‌యాళ క‌థ‌ల్లో స్లోనేరేష‌న్ స‌హ‌నానికి ప‌రీక్ష పెడుతుంద‌నే విమ‌ర్శ త‌ర‌చూ వినిపిస్తుంటుంది. ఇది ఈ చిత్ర విష‌యంలోనూ త‌ప్ప‌కుండా మ‌ళ్లీ వినిపిస్తుంది. మంజుమ్మ‌ల్ బాయ్స్ నేప‌థ్యాన్ని.. వారి ప్ర‌పంచాన్ని ప‌రిచ‌యం చేస్తూ నెమ్మ‌దిగా మొద‌లైన క‌థ ఆ తర్వాత బ‌లంగా ప‌ట్టేస్తుంది. నిజానికి విరామం వ‌ర‌కు అస‌లు క‌థ మొద‌లు కాకున్నా.. పెద్ద‌గా డ్రామా, మలుపులు లేకున్నా మంజుమ్మ‌ల్ గ్యాంగ్ అల్ల‌రి బాగానే కాల‌క్షేపం చేయిస్తుంది. వీళ్లు ఎప్పుడైతే గుణ కేవ్స్ చూడాల‌ని నిర్ణ‌యించుకుంటారో అక్క‌డే క‌థ మ‌లుపు తిరుగుతుంది. ఇక సుభాష్ డెవిల్స్ కిచెన్‌లో ప‌డిన త‌ర్వాత నుంచి క‌థ ఒక్క‌సారిగా ఉత్కంఠ‌భ‌రితంగా మారిపోతుంది. అక్క‌డి నుంచి చివ‌రి వ‌ర‌కు సుభాష్‌ను ఎలా బ‌య‌ట‌కు తీసుకొస్తారా? అన్న ఆస‌క్తి ప్రేక్ష‌కుల్ని తొలిచేస్తుంటుంది. ద్వితీయార్ధ‌మంతా ఈ స‌ర్వైవ‌ల్ డ్రామాతోనే ముందుకు సాగుతుంది.

సుభాష్ లోయ‌లో ప‌డ్డాక లోప‌ల త‌న ప‌రిస్థితి ఏంటో తెలియ‌క తోటి మిత్రులంతా ప‌డే ఆవేద‌న మ‌దిని బ‌రువెక్కిస్తుంది. ఇలాంటి ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితుల్లో చిక్కుకున్న‌ప్పుడు పోలీసులు స్పందించే తీరును సినిమాలో చాలా స‌హ‌జంగా చూపించారు. పోలీసుల‌తో పాటు స్థానిక ప్ర‌జ‌లు మంజుమ్మ‌ల్ బాయ్స్‌కు సాయం చేసేందుకు ముందుకు రాకున్నా.. మిత్రుడ్ని కాపాడుకునేందుకు వాళ్లు ప‌డే ఆరాటం, త‌ప‌న ప్రేక్ష‌కుల్ని క‌ట్టిప‌డేస్తాయి. లోయలోకి వర్షపు నీరు ఉప్పెన‌లా ముంచెత్తుతుంటే ఆ ప్రవాహాన్ని అడ్డుకునేందుకు తోటి స్నేహితులంతా అడ్డుగా ప‌డుకోవ‌డం ఉద్వేగ‌భ‌రితంగా అనిపిస్తుంది. నిజానికి సుభాష్ లోయ‌లో ప‌డ్డాక త‌న‌కెదుర‌య్యే ప్రాణ‌పాయ ప‌రిస్థితుల‌తో కొంత డ్రామా క్రియేట్ చేసుకునే అవ‌కాశ‌ముంది. కానీ, దాన్ని ద‌ర్శ‌కుడు వాడుకోలేదు. కాక‌పోతే త‌న ప్ర‌స్తుత ప‌రిస్థితిని ఓవైపు చూపిస్తూనే.. మ‌రోవైపు చిన్న‌నాటి జ్ఞాప‌కాల‌ను గుర్తు చేస్తూ క‌థ‌కు బ‌ల‌మైన ఎమోష‌న్స్ అందించే ప్ర‌య‌త్నం చేశాడు. అవి ముగింపును భావోద్వేగ‌భ‌రితంగా మార్చ‌డంలో బాగా ఉప‌యోగ‌ప‌డ్డాయి. సుభాష్‌ను ర‌క్షించేందుకు కుట్ట‌న్ లోయ‌లోకి దిగే ఎపిసోడ్ ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతుంది. లోయ‌లో నెత్తురోడుతూ నిస్స‌హాయంగా ప‌డి ఉన్న సుభాష్‌ను చూస్తున్న‌ప్పుడు అప్ర‌య‌త్నంగానే క‌ళ్లు చెమ్మ‌గిల్లుతాయి. ఇక ఆ ఇరుకైన లోయ‌లో ఎన్నో స‌వాళ్లు దాటుకొని సుభాష్‌ను కుట్ట‌న్ చేరుకున్న‌ప్పుడు వ‌చ్చే ఓ చిన్న ట్విస్ట్ ప్రేక్ష‌కుల్ని ఉలిక్కిప‌డేలా చేస్తుంది. ముగింపు అంద‌రి మ‌న‌సుల్ని బ‌రువెక్కిస్తుంది.

ఎవరెలా చేశారంటే: కుట్ట‌న్‌గా షౌబిన్ షాహిర్‌తో పాటు మిగిలిన మిత్ర బృంద‌మంతా స‌హ‌జ‌మైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. వాళ్లు చేసే అల్ల‌రి ప‌నులు, గొడ‌వ‌లు, వారి స్నేహ బంధం ప్ర‌తి ఒక్క‌రికీ క‌నెక్ట్ అయ్యేలా చాలా స‌హ‌జంగా ఉంటాయి. ద‌ర్శ‌కుడు క‌థ‌ను నిజాయితీగా తెరపై చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. కాక‌పోతే సినిమాలో పెద్ద‌గా వేగం క‌నిపించ‌దు. అలాగే ద్వితీయార్ధంలో మ‌రీ ట్విస్ట్‌లు, మ‌లుపులు కూడా క‌నిపించ‌వు. కానీ, సినిమాలో ఎక్క‌డా ఉత్కంఠ‌త‌కు లోటుండ‌దు. గుణ కేవ్ సెట‌ప్ ఈ సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. దాన్ని ఛాయాగ్రాహ‌కుడు త‌న కెమెరాతో ఎంతో చ‌క్క‌గా ఒడిసి ప‌ట్టాడు. క‌మ‌ల్ క‌ల్ట్ సినిమా గుణ నేప‌థ్యాన్ని.. ఆ చిత్రంలోని క‌మ్మ‌ని నీ ప్రేమ లేఖ‌లే పాట‌ను ద‌ర్శ‌కుడు ఈ చిత్రంలో చ‌క్క‌గా వాడుకున్నాడు. అలాగే నేప‌థ్య సంగీతం కూడా సినిమాని మ‌రో స్థాయిలో నిల‌బెట్టింది. టెక్నిక‌ల్‌గా ఈ చిత్రం చాలా ఉన్న‌తంగా క‌నిపిస్తుంది.

బ‌లాలు
+ క‌థా నేప‌థ్యం
+ ఉత్కంఠ‌త‌కు గురి చేసే ద్వితీయార్ధం
+ విజువ‌ల్స్‌, నేప‌థ్య సంగీతం
బ‌ల‌హీన‌త‌లు
– నెమ్మ‌దిగా సాగే క‌థ‌నం
చివ‌రిగా: మంజుమ్మ‌ల్ బాయ్స్‌.. క‌ట్టిప‌డేసే స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్‌.
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Gold Kulfi: బంగారం ధరించడమే కాదు అక్కడ తింటున్నారు – 24 క్యారెట్ల గోల్డ్ కుల్ఫీ ధర ఎంతో తెలుసా?

Gold Kulfi Of Indore: బంగారాన్ని నగలుగా చేయించుకుని ధరించడం ఇప్పటి వరకు చూశాం. కానీ, ఇప్పుడు బంగారంతో చక్కటి కుల్ఫీలు చేయించుకుని తింటున్నారు. బంగారంతో కుల్ఫీలు చేయడం ఏంటి? వాటిని తినడం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా? కానీ, మీరు విన్నది నూటికి నూరుపాళ్లు నిజం. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఏకంగా 24 క్యారెట్ల గోల్డ్ కుల్ఫీ అమ్ముతున్నారు. కస్టమర్లు ఎగబడి మరీ కొంటున్నారు. అరుదైన కుల్ఫీని తిని ఎంజాయ్ చేస్తున్నారు.

ఫుడ్ వెరైటీస్ కు పెట్టింది పేరు!
ఇండోర్ అనగానే చక్కటి ఫుడ్ వెరైటీస్ కు పెట్టింది పేరు. అక్కడ ఎన్నో రకాలపైనా వంటకాలు లభిస్తాయి. అన్నింటితో పోల్చితే అక్కడి కుల్ఫీ టేస్టీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. గత వేసవి వరకు ఎర్రటి గుడ్డలు చుట్టిన పెద్ద పెద్ద కుండలతో కూడిన కుల్ఫీ బండ్లు వీధుల్లో తిరుగుతూ కనిపించేవి. నేచురల్ గా కుండల కూలింగ్ లో ఉండే కుల్ఫీలను జనాలు ఎంతో ఇష్టంగా తినేవాళ్లు. కానీ, ఈ ఎండకాలంలో కుల్ఫీలు కొత్త హంగులు అద్దుకున్నాయి. ఏకంగా బంగారంతో కూడిన కుల్ఫీలను అమ్ముతున్నారు దుకాణదారులు. వీటిని తినేందుకు కస్టమర్లు ఎగబడుతున్నారు.

24 క్యారెట్ల బంగారు కుల్ఫీ
ఇండోర్ సిటీలోని ఫుడ్ షాపుల్లో గోల్డ్ కుల్ఫీ ప్రత్యేకంగా నిలుస్తుంది. 24 క్యారెట్ల బంగారు వర్క్ తో అలంకరించబడిన కుల్ఫీలు బాగా అమ్ముడుపోతున్నాయి. స్పెషల్ కుల్ఫీకి బంగారు పూతతో కూడిన కవర్ ను చుట్టి అందిస్తున్నారు. ప్రకాష్ కుల్ఫీ & ఫలూదా షాప్ యజమాని బంటీ యాదవ్, షాహీ కుల్ఫీతో సహా ఏకంగా 18 రకాల కుల్ఫీలను కస్టమర్లకు అందిస్తున్నారు. బంటి తాత ఈశ్వరీలాల్ 1965లో ఈ దుకాణాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో కేసర్ కుల్ఫీని మాత్రమే అందించేవారు. ఆ దుకాణం తన తండ్రి చేతికి వచ్చాక జీడిపప్పు, సీతాఫలం, మామిడి రుచులను యాడ్ చేశారు. ఇప్పుడు బంటి, తన సోదరుడు శివ కలిసి జీడిపప్పు-గుల్కంద్, పాన్, స్ట్రాబెర్రీ, జామూన్, మలై, చాక్లెట్, ఫిగ్-డ్రై ఫ్రూట్స్ వంటి రుచులను అందిస్తున్నారు.

ఇండోర్ గోల్డ్ కుల్ఫీ ప్రత్యేకత ఏంటంటే?
నిజానికి బంగారు కుల్ఫీ అందించాలనే ఆలోచన.. బంటి సోదరులకు బంగారం మీద ఉన్న ఇష్టమే కారణం అయ్యింది. తమ కస్టమర్లకు ప్రత్యేకమైన కుల్ఫీ అందించాలని భావించారు. అందులో భాగంగానే కుల్ఫీకి బంగారు కవర్ చుట్టి అందిస్తున్నారు. కుల్ఫీ తయారీ కోసం ఫతేహాబాద్ నుంచి పాలను తీసుకొస్తారు. వాటిని సన్నని సెగ మీద వేడి చేస్తారు. సాంప్రదాయకంగా, కుల్ఫీని కుండలో తయారు చేస్తారు. వాటిని కుల్ఫీ పీసెస్ గా చేసి ఫ్రిజ్ లో పెడతారు. కస్టమర్లకు ఇష్టమైన కుల్ఫీని అందిస్తారు. బంగారు కుల్ఫీ కావాలి అనుకునే వారికి కుల్ఫీ చుట్టూ బంగారం పేపర్ చుట్టి అందిస్తున్నారు. ఈ పేపర్ కుల్ఫీని తింటున్నప్పుడు నెమ్మదిగా కరిగి నోట్లోకి వెళ్తుంది. ప్రస్తుతం గోల్డ్ కుల్ఫీ బాగా ఫేమస్ అయ్యింది. బంగారు కుల్ఫీ ధరను రూ. 2,999గా నిర్ణయించారు. బంటీ దుకాణానికి కస్టమర్ల తాకిడి కూడా బాగా పెరిగింది. ప్రస్తుతం ఈ గోల్డ్ కుల్ఫీకి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట బాగా వైరల్ అవున్నాయి.

వీడియో: తాతకు మనవడి అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్.. కళ్లు చెమ్మగిల్లుతాయి..

ప్రతి పిల్లాడికి తాత, నానమ్మలతో ఎన్నో అద్భుతమైన క్షణాలు ఉంటాయి. కనేది తల్లిదండ్రులే అయినా అల్లారు ముద్దుగా పెంచేది మాత్రం తాతానానమ్మలే. వారికి మనవడు, మనవరాలు అంటే ఎనలేని ఆప్యాయత ఉంటుంది. వారిని కాలు కింద పెట్టకుండా చూసుకుంటారు. పిల్లల్ని ఎంతో గారం చేస్తారు. ఏ మనవడు ఫస్ట్ సైకిల్ ఎక్కినా, బైక్ ఎక్కినా అది తాతదే అయి ఉంటుంది. మొదట లోకాన్ని చూడటం మొదలు పెట్టేది తాత భుజాల మీద అనే చెప్పాలి. అలాంటి తాతకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే అవకాశం అందరూ మనవళ్లకు రాకపోవచ్చు. కానీ, ఈ మనవడు మాత్రం కాస్త లక్కీ అనే చెప్పాలి. తన తాతకు అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తాతకు మనవడు అంటే ఒక హీరో. చిన్నప్పటి నుంచి అలాగే చూసుకుంటారు. బండి మీద ఎక్కించుకుని ఊరు మొత్తం తిప్పి తీసుకొస్తారు. అలాగే ఈ తాత కూడా తన మనవడిని తన టీవీఎస్ 50పై ఎక్కించుకుని చిన్నప్పుడు ఊరంతే తిప్పేవాడు. ఆ మనవడు ఇప్పుడు పైలట్ అయ్యాడు. ఆ పైలట్ మనవడు తన తాతకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. విషయం ఏంటంటే.. తమిళనాడుకు చెందిన ప్రదీప్ కృష్ణన్ పైలట్ గా చేస్తున్నాడు. అతను ఫ్లై చేసే ఇండిగో విమానంలో తన కుటుంబం కూడా ఉంది. తన తల్లి, తాత, నానమ్మలు అదే విమానంలో ప్రయాణిస్తున్నారు.

చిన్నతనంలో తనను టీవీఎస్ 50 మీద ఎక్కించుకుని తిప్పిన తాతకు ఈ పైలట్ మనవడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాడు. తన కుటుంబం ఆ విమానంలో ఉన్న విషయాన్ని ప్రయాణికులతో పంచుకున్నాడు. అలాగే తన తాత గురించి ప్రత్యేకించి చెప్పుకొచ్చాడు. తన చిన్నతనంలో ఎక్కువ శాతం తాత బండి మీద వెనకాల కూర్చుని తిరిగిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. ఇలా తన తాత మొదటిసారి విమానం ఎక్కడం.. అది కూడా తాను ఫ్లై చేసే విమానం ఎక్కడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. తాతను పరిచయం చేస్తూ.. అందరూ హాయ్ చెప్పాలని ప్రయాణికులను కోరాడు. ప్రయాణికులు అంతా చప్పట్లు కొడుతూ తాతకు స్వాగతం పలికారు.

తన కుమారుడు చేసిన ఈ పని చూసి ఆ తల్లి కళ్లు చెమ్మగిల్లాయి. ఈ వీడియో తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. ప్రతి పైలట్ డ్రీమ్ తమ కుటుంబాన్ని తాము నడిపే విమానంలో తిప్పడమే అంటూ చెప్పుకొచ్చాడు. పైలట్ ప్రదీప్ పోస్ట్ చేసిన ఈ వీడియో చూసి నెటిజన్స్ ఎమోషనల్ అవుతున్నారు. ఇలాంటి మనవడు ఉన్నందుకు ఆ తాత ఎంతో లక్కీ అంటూ చెప్తున్నారు. నిజంగా ప్రదీప్ ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఐస్‌ బాత్‌తో మ్యాజిక్‌..! అందుకే సెలబ్రిటీలకు అంత పిచ్చి..! ఆ కారణాలు తెలిస్తే..

సోషల్ మీడియాలో చాలా ట్రెండ్స్ తరచుగా పుట్టుకొస్తున్నాయి. ఆహారం నుండి ఆరోగ్యం వరకు ప్రతిరోజూ ఒక కొత్త ట్రెండ్ కనిపిస్తుంది. ఈ ట్రెండ్‌లో ఇప్పుడు ఐస్ బాత్ ఒకటి. సోషల్ మీడియాలోప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీలు ఐస్ బాత్ చేస్తూ కనిపిస్తున్నారు. ఐస్ బాత్ అంటే.. చల్లటి నీటిలో స్నానం చేయడం.. ఈ రోజుల్లో చాలా మంది సెలబ్రిటీలు ఐస్ బాత్ చేస్తున్నారు. గత కొంత కాలంగా సెలబ్రిటీలు, సామాన్యుల మధ్య దీని ట్రెండ్ వేగంగా పెరిగింది. దీనినే క్రయోథెరపీ అని కూడా అంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అంతే కాదు చర్మానికి, మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. దాని అద్భుతమైన ప్రయోజనాలను తెలుసుకుందాం.

ఐస్ బాత్ అంటే ఏమిటి?

ఐస్ బాత్ అంటే చల్లటి నీటిలో స్నానం చేయటం. దీనినే చల్లని నీటిలో డిప్ లేదా క్రియోథెరపీ అని కూడా అంటారు. ఇందులో భాగంగా ఆ వ్యక్తిని 11 నుంచి 15 నిమిషాలు నీటిలో ఉంచుతారు. ఈ నీటిని 50 నుంచి 59 డిగ్రీల ఫారెన్ హీట్ మధ్య చల్లబరుస్తారు. దీన్ని సాధారణంగా వ్యాయామం తర్వాత ఆరోగ్య ప్రయోజనాల కోసం అథ్లెట్లు ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ, ప్రస్తుతం చాలా మంది సెలబ్రిటీలు కూడా ఐస్‌ బాత్‌ ట్రీట్‌మెంట్‌ ను అలవాటుగా చేసుకుంటున్నారు.
ఐస్‌ బాత్‌తో కండరాల రికవరీని వేగవంతం చేస్తుంది. గాయాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎక్కువ వ్యాయామం, శారీరక శ్రమ చేసిన తర్వాత ఐస్ బాత్ చేస్తే శరీర మంట, కండరాల నొప్పి చాలా వరకు తగ్గుతుందని చెబుతారు. అంతేకాదు.. ఐస్‌ బాత్‌తో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. గడ్డకట్టే నీటిలో స్నానం చేయడం ద్వారా దాని చల్లని ఉష్ణోగ్రత ప్రసరణను ప్రేరేపిస్తుంది. ఇది కండరాలకు రక్త ప్రవాహాన్ని, ఆక్సిజన్ పంపిణీని పెంచుతుంది.

ఐస్‌ బాత్‌ మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మంచి మానసిక ప్రశాంతతను అందజేస్తుంది. ఇలా చేయడం వల్ల విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది. ఇది నిరాశ, ఆందోళన లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది . రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఐస్ వాటర్ తో స్నానం చేయడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. ఆరోగ్యంతో పాటు, ఐస్ బాత్ మన చర్మానికి కూడా చాలా ప్రయోజనకరంగా పనిచేస్తుంది. ఐస్‌ బాత్‌ చల్లని ఉష్ణోగ్రత చర్మ రంధ్రాలను బిగించి, మంటను తగ్గించడం, గ్లోను ప్రోత్సహించడం ద్వారా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇలా ఆరోగ్యంతో పాటు అందానికి మూలం ఐస్‌ బాత్..అందుకే సెలబ్రిటీల్లో అంతా క్రేజ్‌.

Cumin Water: జీలకర్ర నీరు పరగడుపున తాగడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా? ఈ 4 వ్యాధులు పరార్‌..

జీలకర్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది అందరి ఇళ్లలో ప్రతి వంటగదిలో అందుబాటులో ఉంటుంది. జీలకర్ర అనేది ప్రతి వంటల్లో ఉపయోగిస్తుంటారు. దీని వల్ల ఆహారం రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జీలకర్ర వాడకం ఆరోగ్య ప్రయోజనాలలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రముఖ డైటీషియన్ ఆయుషి యాదవ్ మాట్లాడుతూ రోజూ జీలకర్ర నీటిని తాగితే అద్భుతమైన..
జీలకర్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది అందరి ఇళ్లలో ప్రతి వంటగదిలో అందుబాటులో ఉంటుంది. జీలకర్ర అనేది ప్రతి వంటల్లో ఉపయోగిస్తుంటారు. దీని వల్ల ఆహారం రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జీలకర్ర వాడకం ఆరోగ్య ప్రయోజనాలలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రముఖ డైటీషియన్ ఆయుషి యాదవ్ మాట్లాడుతూ రోజూ జీలకర్ర నీటిని తాగితే అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయని చెప్పారు. జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి, దాని నీటిని తాగడం చాలా ముఖ్యం.

జీలకర్ర నీటిని ఖాళీ కడుపుతో తాగితే శరీరంలోని అనేక వ్యాధులు నయమవుతాయి. బలహీనమైన శరీరాన్ని బలోపేతం చేయడంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని రోజూ తాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. జీలకర్రలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది మీ వ్యాధిని నయం చేయడంలో మీకు చాలా సహాయపడుతుంది. మీరు ప్రతిరోజూ ఉదయం తప్పనిసరిగా జీలకర్ర నీటిని తాగాలి. ఇది శరీరంలో వాపులను తగ్గించడానికి కూడా పనిచేస్తుంది. ఇది మాత్రమే కాదు, వివిధ వ్యాధుల నుండి మిమ్మల్ని దూరంగా ఉంచడంలో ఇది చాలా సహాయపడుతుంది. అలాగే శరీరంలోని మురికిని తొలగిస్తుంది. చాలా మందికి శ్వాస సంబంధిత సమస్యలు చాలా ఉన్నాయి. మీరు ఖాళీ కడుపుతో ప్రతిరోజూ జీలకర్ర నీటిని తాగితే, మీరు శ్వాస ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యల నుండి బయటపడవచ్చు. శ్వాసకోశంలో ఉపశమనం కలిగించవచ్చు. మీరు దాని నీటిని చాలా వేడిగా తాగాల్సిన అవసరం లేదు. మీరు దానిని గోరువెచ్చగా మాత్రమే తాగాలి.జీలకర్ర నీటిలో యాంటీఆక్సిడెంట్ పదార్థాలు ఉన్నాయి. ఇది మీ శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో మీకు సహాయపడుతుంది. ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత ఈ నీటిని తాగాలి.

Amazon Smart TV Offers: మీ హాల్లోకి పెద్ద టీవీ కొనాలనుకుంటున్నారా? అమెజాన్‌లో భారీ డీల్స్‌.. మిస్‌ కాకండి..

మీ ఇంట్లో హాల్లో పెట్టుకునేందుకు పెద్ద టీవీ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. మార్కెట్లో టాప్‌ బ్రాండ్లకు సంబంధించిన 50 అంగుళాల టీవీలపై ప్రముఖ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫారం అమెజాన్లో భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో శామ్సంగ్‌, ఎల్జీ, సోనీ, షావోమీ వంటి ప్రముఖ బ్రాండ్లు కూడా ఉన్నాయి. కేవలం పరిమాణం మాత్రమే కాకుండా.. అధిక రిజల్యూషన్‌తో, మంచి సౌండ్‌ క్లారిటీతో కూడిన టీవీలు సేల్లో ఉన్నాయి.
మీ ఇంట్లో హాల్లో పెట్టుకునేందుకు పెద్ద టీవీ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. మార్కెట్లో టాప్‌ బ్రాండ్లకు సంబంధించిన 50 అంగుళాల టీవీలపై ప్రముఖ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫారం అమెజాన్లో భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో శామ్సంగ్‌, ఎల్జీ, సోనీ, షావోమీ వంటి ప్రముఖ బ్రాండ్లు కూడా ఉన్నాయి. కేవలం పరిమాణం మాత్రమే కాకుండా.. అధిక రిజల్యూషన్‌తో, మంచి సౌండ్‌ క్లారిటీతో కూడిన టీవీలు సేల్లో ఉన్నాయి. 4కే రిజల్యూషన్‌, హెచ్‌డీఆర్‌(హై డైనమిక్‌ రేంజ్‌), అత్యాధునిక సాంకేతికతతో కూడాని ఫీచర్లు, ఫంక్షనాలిటీలో కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. వాటిల్లో తక్కువ ధరకు లభ్యమయ్యే 50 అంగుళాల స్క్రీన్‌ కలిగిన టీవీలను మీకు పరిచయం చేస్తున్నాం.

సోనీ బ్రేవియా 50 అంగుళాల స్మార్ట్‌ ఎల్‌ఈడీ గూగుల్‌ టీవీ..
అత్యుత్తమ స్మార్ట్ టీవీల్లో ఇది ఒకటి. దీనిలో 4కే రిజల్యూషన్‌తో కూడిన విజువల్స్‌ వస్తాయి. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో అసమానమైన స్పష్టతను అదిస్తుంది. 178 డిగ్రీల విస్తృత వీక్షణ కోణంతో, గదిలోని ప్రతి మూలకు ఒకేలా చిత్రం కనిపించేలా చేస్తుంది. మూడు హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు, యూఎస్‌బీ పోర్ట్‌ కనెక్టివిటీని అందిస్తుంది. 20 వాట్స్ అవుట్‌పుట్, డాల్బీ ఆడియోతో క్రిస్టల్-క్లియర్ ఆడియోను అందిస్తుంది. గూగుల్‌ టీవీ వాయిస్‌ సెర్చింగ్‌క సపోర్టు చేస్తుంది. నెట్‌ఫిక్స్‌, అమెజాన్‌, ప్రైమ్‌ వీడియో, డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ వంటి ప్రీ ఇన్‌స్టాల్డ్‌ యాప్స్‌ ఉంటాయి. టెలివిజన్ యాపిల్‌ ఎయిర్‌ ప్లే, యాపిల్‌ హోమ్‌ కిట్‌, అలెక్సా వంటి ఫీచర్స్‌ ఉంటాయి. ఈ టీవీ ధర అమెజాన్‌లో ఆఫర్‌పై రూ. 50,999గా ఉంది.

శామ్సంగ్‌ 50 అంగుళాల 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ క్యూఎల్‌ఈడీ టీవీ..
దీనిలో మూడు హెచ్‌డీఎంఐ, రెండు యూఎస్‌బీ పోర్టులు ఉంటాయి. టీవీ నుండి మొబైల్ మిర్రరింగ్, ట్యాప్ వ్యూ, యాంబియంట్ మోడ్+తో సహా పలు స్మార్ట్ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. డాల్బీ అట్మాస్ టెక్నాలజీ, అడాప్టివ్ సౌండ్+తో లీనమయ్యే ధ్వనిని అందిస్తుంది. అలాగే యాక్టివ్ వాయిస్ యాంప్లిఫైయర్ ధ్వనించే వాతావరణంలో కూడా క్రిస్టల్-క్లియర్ డైలాగ్‌నుఅందిస్తుంది. అమెజాన్ ఆఫర్‌లతో దీనిని రూ. 69,990కి కొనుగోలు చేయొచ్చు.
ఎల్‌జీ 50 అంగుళాల 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్‌ ఎల్‌ఈడీ టీవీ..
ఈ టీవీలోని డిస్‌ప్లే 4కే అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్‌తో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఇన్‌బిల్ట్‌ వైఫై, మూడు హెచ్‌డీఎంఐ, రెండు యూఎస్‌బీ పోర్టులు ఉంటాయి. వర్చువల్ సరౌండ్ 5.1 అప్-మిక్స్ అనుభవం కోసం 20 వాట్స్ అవుట్‌పుట్, ఆల్ సౌండ్ టెక్నాలజీతో రిచ్, లీనమయ్యే సౌండ్‌ను అందిస్తుంది. ఏఐ థింక్యూ ఆధారంగా పనిచేసే యాపిల్‌ ఎయిర్‌ ప్లే 2 అండ్‌ హోమ్‌ కిట్‌ అమర్చి ఉంటుంది. ఏ5 ఆల్‌ ప్రాసెసర్‌ 4కే జెన్‌6, హెచ్‌డీఆర్‌10, గేమ్‌ ఆప్టిమైజర్‌, ఫిల్మ్‌మేకర్‌ మోడ్‌ వంటివి ఉంటాయి. దీని ధర అమెజాన్లో రూ. 40,990గా ఉంది.

షావోమీ 50 అంగుళాల స్మార్ట్‌ ఆండ్రాయిడ్‌ ఎల్‌ఈడీ టీవీ..
ఈ టీవీలో 4కే అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన డిస్‌ ప్లే ఉంటుంది.. 178 డిగ్రీల° విస్తృత వీక్షణ కోణాన్ని అందిస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, 3 హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు, 2 యూఎస్‌బీ పోర్ట్‌లతో కనెక్టివిటీ ఉంటుంది. 30 వాట్స్ అవుట్‌పుట్ సౌండ్, డాల్బీ ఆడియో, కిడ్స్ మోడ్, యూనివర్సల్ సెర్చ్, ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ + హాట్‌స్టార్ వంటి ప్రసిద్ధ యాప్‌లకు మద్దతు ఉంటుంది. అమెజాన్లో ఈ టీవీ ధర రూ. 34,999గా ఉంది.

వీయూ 50 అంగుళాల స్మార్ట్ ఎల్‌ఈడీ గూగుల్‌ టీవీ..
ఈ టీవీ కూడా 4కే అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్, 178-డిగ్రీల వైడ్ వ్యూయింగ్ యాంగిల్‌తో వస్తుంది. వైఫై, బ్లూటూత్ 5.1 సామర్థ్యాలతో పాటు 3 హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు ఉంటాయి. 104 వాట్ డీజే సౌండ్‌తో పాటు అంతర్నిర్మిత సబ్‌వూఫర్, ఇమ్మర్సివ్ ఆడియో కోసం డాల్బీ అట్మాస్ సపోర్ట్‌ ఉంటుంది. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి కావాల్సిన యాప్స్‌ అందులో వస్తాయి. కిడ్స్ మోడ్, క్రోమ్‌కాస్ట్‌ బిల్ట్-ఇన్ ఫీచర్లు వస్తాయి. యాక్టివ్‌ వాయిస్‌ రిమోట్‌తో హ్యాండ్స్-ఫ్రీ కంట్రోల్‌ ఉంటుంది. అమెజాన్ డీల్స్‌లో ఇప్పుడు ఈ స్మార్ట్‌ టీవీ రూ. 32,999కే కొనుగోలు చేయొచ్చు.

Wooden Comb: జుట్టు దువ్వడానికి ప్లాస్టిక్‌ దువ్వెన మంచిదా? చెక్క దువ్వెన మంచిదా?

జుట్టుకు క్రమం తప్పకుండా నూనె రాసుకుంటూ ఉండటం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే షాంపూ చేసిన తర్వాత కూడా కండీషనర్ ఉపయోగించాలి. కానీ దువ్వెన ఉపయోగించే విషయంలో చాలా మంది తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటారు. జుట్టు సంరక్షణలో షాంపూ-కండీషనర్ ఎంత ముఖ్యమో దువ్వడం కూడా అంతే ముఖ్యం. కానీ దువ్వెన వాడే విషయంలో మనకు అంతగా అవగాహన ఉండదు..
జుట్టుకు క్రమం తప్పకుండా నూనె రాసుకుంటూ ఉండటం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే షాంపూ చేసిన తర్వాత కూడా కండీషనర్ ఉపయోగించాలి. కానీ దువ్వెన ఉపయోగించే విషయంలో చాలా మంది తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటారు. జుట్టు సంరక్షణలో షాంపూ-కండీషనర్ ఎంత ముఖ్యమో దువ్వడం కూడా అంతే ముఖ్యం. కానీ దువ్వెన వాడే విషయంలో మనకు అంతగా అవగాహన ఉండదు.

చాలా మంది జుట్టు దువ్వడానికి ప్లాస్టిక్ దువ్వెనలు ఉపయోగిస్తుంటారు. అలాగే దువ్వెన మురికిగా ఉంటే, దానిని క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. కానీ సమయం లేకపోవడం వల్ల హడావిడిగా అదే దువ్వెనతో దువ్వుతూ ఉంటారు.

ప్లాస్టిక్ దువ్వెనతో జుట్టును దువ్వడం వల్ల ఎక్కువ జుట్టు రాలుతుంది. అంతేకాకుండా ప్లాస్టిక్ దువ్వెనను ఉపయోగించడం వల్ల తలకు సరైన రక్త ప్రసరణ జరగదు. దీనివల్ల జుట్టు సమస్య మరింత పెరుగుతుంది. కాబట్టి జుట్టు సంరక్షణ కోసం చెక్క దువ్వెనను ఎంచుకోవడం మంచిది.

చెక్క దువ్వెనను ఉపయోగించడం వల్ల తలకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీని కారణంగా, ఆక్సిజన్ తగినంత మొత్తంలో జుట్టు మూలాలకు చేరుతుంది. ఇది జుట్టు మూలాలను బలపరుస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. సాధారణంగా స్కాల్ప్ నుంచి సెబమ్ ఉత్పత్తి అవుతుంది. ఆ సెబమ్ మిగిలిన వెంట్రుకలకు చేరకపోతే, అది తలపై పేరుకుపోయి, తలలో జిడ్డుగా మారుతుంది. తల చర్మం జిడ్డుగా మారినప్పుడు చెక్క దువ్వెనను ఉపయోగించడం వల్ల ఈ సెబమ్ స్కాల్ప్‌తో పాటు మిగిలిన జుట్టుకు వ్యాపిస్తుంది.

చుండ్రు, తలపై మృతకణాలు పేరుకుపోవడం అనే సమస్యలు ప్లాస్టిక్ దువ్వెన వల్ల పెరుగుతాయి. కానీ చెక్క దువ్వెనను ఉపయోగించడం వల్ల చుండ్రు సమస్యను సులభంగా నివారించవచ్చు. ప్లాస్టిక్ దువ్వెనతో జుట్టును విడదీయడం కష్టం. కానీ చెక్క దువ్వెనతో జుట్టును దువ్వడం సులువుగా ఉంటుంది. అలాగే చెక్క దువ్వెనలతో జుట్టు చిక్కుతీయడం కూడా చాలా సులభం.

Galaxy m15 5g: సామ్‌సంగ్‌ నుంచి బడ్జెట్‌ 5జీ ఫోన్‌.. రూ. 13 వేలకే..

ప్రస్తుతం 5జీ స్మార్ట్‌ ఫోన్‌ల హవా నడుస్తోంది. దేశంలో 5జీ నెట్‌వర్క్‌ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో కంపెనీలు వరుసగా బడ్జెట్ ధరలో 5జీ ఫోన్‌లను లాంచ్‌ చేస్తూ వస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్ సైతం తక్కువ ధరలో 5జీ ఫోన్‌ను తీసుకొస్తోంది. గ్యాలక్సీ ఎమ్‌15 పేరుతో తీసుకొస్తున్న ఈ 5జీ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎమ్‌15 పేరుతో 5జీ ఫోన్‌ను తీసుకొస్తోంది. ఈ ఫోన్‌ ఏప్రిల్‌ 8వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుండగా ప్రస్తుతం కంపెనీ ప్రీ బుకింగ్స్‌ను ప్రారంభించింది.

ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.5 ఇంచెస్‌తో కూడిన సూపర్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. మీడియా టెక్‌ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది

కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌ రెయిర్‌ కెమెరాతో కూడిన ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ను అందించనున్నారు. 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇవ్వనున్నారు. ఈ ఫోన్‌ను 4జీబీ, 6జ జీబీ ర్యామ్‌తో పాటు 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌తో తీసుకురానున్నారు.

ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 25 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందిస్తున్నారు. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 5 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను ఉచితంగా అందిస్తారు.

ఈ స్మార్ట్ ఫోన్‌ 4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 13,499కాగా, 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 14,999గా ఉంది. ఈ ఫోన్‌ను సెలెస్టియల్ బ్లూ, స్టోన్‌ గ్రే, బ్లూ టోపేజ్‌ కలర్స్‌లో తీసుకురానున్నారు.

Telangana: తుక్కుగూడ సభ వేదికగా మాస్టర్ స్కెచ్.. కాంగ్రెస్‌లోకి 12 మంది BRS ఎమ్మెల్యేలు..?

ఆపరేషన్ తుక్కుగూడ.. పదిలక్షల మందితో భారీ జన జాతర. రేవంత్‌రెడ్డి కటౌట్ సైజులు నేషనల్ రేంజ్‌కి చేరుకునే వేదిక.. తెలంగాణ కాంగ్రెస్‌ ఖలేజా చూపెట్టడానికి మరో సువర్ణావకాశం.. ఇలా అనేకానేక స్పెషాలిటీస్‌తో ప్రచారం చేసుకుంటోంది హస్తం క్యాడర్. కానీ.. తుక్కుగూడకు సంబంధించి వీటన్నిటికీ మించి సూపర్‌స్పెషాలిటీ ఒకటుంది. రేవంత్‌ రెడ్డి ప్రిస్టీజియస్‌గా భావిస్తున్న ఆ ప్రత్యేకత ఏంటి? బీఆర్‌ఎస్ పార్టీకి షాకిచ్చే ఆ ఎలిమెంట్ ఏమై ఉంటుంది..?
2023… సెప్టెంబర్ 17.. వేదిక తుక్కుగూడ మైదానం.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సమరం కోసం పూరించిన శంఖారావం.. పోటెత్తిన జనం.. చెప్పిమరీ అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ పార్టీ. అందుకే.. తమకు కలిసొచ్చిన తుక్కుగూడ సెంటిమెంట్‌ను లోక్‌సభ ఎన్నికల్లో కూడా రిపీట్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఈనెల ఆరున శనివారం సాయంత్రం జరిగే తుక్కుగూడ జనజాతర సభతో హిస్టరీ రిపీట్‌ చేయాలన్నది రేవంత్ టీమ్ లక్ష్యం. పదిలక్షలమంది జనాన్ని సమీకరించాలన్నది టార్గెట్. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లాంటి జాతీయ నేతలు హాజరయ్యే సభ కనుక దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.

70 ఎకరాల్లో సభ, 550 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు… వారం రోజులుగా రూపుదిద్దుకుంటున్న సభా వేదిక.. ఆదిలాబాద్ మొద‌లు ఆలంపూర్ వ‌ర‌కు, జహీరాబాద్ నుంచి భ‌ద్రాచ‌లం వ‌ర‌కు జరుగుతున్న జన సమీకరణ… ఇవన్నీ కలిసి తుక్కుగూడ సభ తెలంగాణ రాజకీయాల్లో మోస్ట్‌వాంటెడ్‌గా మార్చేశాయ్. వీటన్నికంటే ముఖ్యంగా పాంచ్‌న్యాయ్-పచీస్ గ్యారంటీస్ పేరుతో లాంచనంగా విడుదలైన కాంగ్రెస్ మేనిఫెస్టో తుక్కుగూడ సభావేదిక మీదే జనానికి పరిచయం కాబోతోంది. అందుకే దేశం చూపు తుక్కుగూడ వైపు అంటూ ప్రచారం చేసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ.

కనీసం 13 ఎంపీ స్థానాలు గెలవాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. ఆ మేరకు పార్టీ లీడర్‌షిప్‌ను బలోపేతం చేసుకుంటోంది. గేట్లెత్తేశామని ఓపెన్‌గా చెప్పిమరీ ఆపరేషన్ ఆకర్ష్ షురూ చేస్తోంది. అందుకే… తుక్కుగూడ సభను చేరికల సభగా కూడా అంతర్గతంగా ప్రకటించుకుంటోంది. కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలుంటాయని ఇప్పటికే సంకేతాలు కూడా వచ్చేశాయ్.

హైకమాండ్ సమక్షంలో పార్టీలో చేర్చుకునేందుకు కొన్నాళ్లుగా ప్రతిపక్ష నేతలకు గాలం వేస్తోంది కాంగ్రెస్ పార్టీ. టచ్‌లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతూ వస్తోంది టీమ్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఏ పార్టీ నుంచి ఎవరెవరు ఎంతెంతమంది కాంగ్రెస్‌లో చేరతారనే చర్చ కూడా జోరుగా జరుగుతోంది. ఒక్క గులాబీ పార్టీ నుంచే ఏకంగా 12 మంది కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం జరుగుతున్న ఎమ్మెల్యేలు వీరే…

కాలె యాదయ్య – చేవెళ్ల
తెల్లం వెంకట్‌రావు- భద్రాచలం
గంగుల కమలాకర్- కరీంనగర్
అరికెపూడి గాంధీ- శేరిలింగంపల్లి
కోవా లక్ష్మి – అసిఫాబాద్
సుధీర్ రెడ్డి – ఎల్‌బీనగర్
ప్రకాష్ గౌడ్- రాజేందర్ నగర్
కె. మాణిక్‌ రావ్- జహీరాబాద్
ముఠా గోపాల్ -ముషీరాబాద్
కాలేరు వెంకటేష్- అంబర్ పేట్
మాగుంటి గోపినాథ్ -జూబ్లీహిల్స్
బండారి లక్ష్మారెడ్డి – ఉప్పల్
కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరుపుతున్న ఈ 12 మందిలో కరడుగట్టిన బీఆర్‌ఎస్‌ నేతలు కూడా ఉన్నారు. వీరిలో ఎంతమంది కాంగ్రెస్‌లో చేరతారు.. ఎంతమంది వెనక్కు తగ్గుతారు అనేది ఆసక్తికరం. కానీ. బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ ఇవ్వడానికి కాంగ్రెస్‌ పార్టీ సీరియస్‌గా వర్కవుట్ చేస్తోంది. అటు.. చేరికల విషయంలో కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గతంగా తర్జన భర్జన మాత్రం ఆగలేదు.

బీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ లేవకుండా దెబ్బకొట్టాలని చూస్తున్న రేవంత్‌రెడ్డి మాత్రం.. ఆపరేషన్ ఆకర్ష్‌ని గట్టిగానే ప్రయోగిస్తున్నారు. ఒకవైపు జనసమీకరణ.. మరోవైపు చేరికల సునామీ.. ఇలా రెండు విధాలుగా తుక్కుగూడ సభను విజయవంతం చేసి.. జాతీయస్థాయిలో ఢిల్లీ పెద్దల సమక్షంలో తన స్టామినాను మరోసారి చాటుకోవాలన్నది రేవంత్‌రెడ్డి సంకల్పంగా తెలుస్తోంది.

Delhi: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సీబీఐ విచారణకు ఆదేశించిన ఢిల్లీ కోర్టు..

ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైలులో ఉన్న కవితను విచారించేందు సీబీఐ సిద్ధమైంది. ఈ క్రమంలో కవితను విచారించేందుకు కోర్టును అనుమతి కోరింది సీబీఐ. కోర్టు నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో జైల్లోనే కవిత విచారణ జరగనుంది. లిక్కర్ స్కాం కేసులో మార్చి 15న ఎమ్మెల్సీ కవితను ఈడీ అదుపులోకి తీసుకుంది. మరో వైపు ఇదే కేసులో విచారించేందుకు సీబీఐ ఎమ్మెల్సీ కవితకు పలుమార్లు నోటీసులు పంపించగా.. కవిత మాత్రం సీబీఐ నోటీసులు పట్టించుకోకుండా విచారణకు హాజరు కాలేదు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత పేరును నిందితురాలిగా ఛార్జిషీట్‎లో సీబీఐ చేర్చింది. ఈ మేరకు నిందితురాలిగా పేర్కొంటూ 41A కింద సమన్లు పంపింది. ఇటీవల లిక్కర్ స్కాం కేసులో ఫిబ్రవరి 26న ఢిల్లీలోని తమ కార్యాలయానికి విచారణకు రావాలని సీబీఐ కవితకు నోటీసులు పంపింది. అయినప్పటికీ కవిత విచారణకు హాజరుకాకపోవడంతో జైల్లోనే కవితను విచారించేందుకు కోర్టు అనుమతి కోరింది సీబీఐ.

గడిచిన 20 రోజులుగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవిత తన 16 ఏళ్ల కుమారుడి పరీక్షల కారణంగా తనకు మధ్యంతర బెయిల్‌ను అనుమతి ఇవ్వాలని గురువారం కోర్టును కోరారు. ఇదే క్రమంలో ఈడీ, సీబీఐ కేసులతో ప్రమేయం ఉన్నందున బెయిల్ మంజూరు చేయొద్దని ఈడీ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. దీనిపై సుదీర్ఘ వాదనలు విన్న ఢిల్లీ అవెన్యూ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరుపై తీర్పును రిజర్వ్ చేసింది. ఏప్రిల్ 8కు వాయిదా వేసింది. సోమవారం ఉదయం 10.30కి కవితను కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. దీంతో ఆమె కేసుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా కవితను విచారించేందుకు సీబీఐ ఏజెన్సీకి అనుమతి ఇవ్వగా మధ్యంతర బెయిల్‎పై ఎలాంటి తీర్పు వెలువడుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Realme C65: రూ.12 వేలలోపే కొత్త బడ్జెట్ ఫోన్ లాంచ్ చేసిన రియల్‌మీ – కేవలం 30 సెకన్ల ఛార్జింగ్‌తో!

Realme C65 Launched: రియల్‌మీ సీ65 స్మార్ట్ ఫోన్ వియత్నాంలో లాంచ్ అయింది. ఇందులో రెండు కలర్ ఆప్షన్లు, మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్‌లో 6.67 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఉంది. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్లలో ఉన్నాయి. ఈ ఫోన్ మనదేశంలో కూడా త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

రియల్‌మీ సీ65 ధర (Realme C65 Price)
ఈ స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర 36,90,000 వియత్నాం డాంగ్‌లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.12,000) నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 42,90,000 వియత్నాం డాంగ్‌లుగానూ (మనదేశ కరెన్సీలో సుమారు రూ.14,000), 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 47,90,000 వియత్నాం డాంగ్‌లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.16,000) ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్‌కు సంబంధించిన సేల్ వియత్నాంలో జరుగుతోంది. మనదేశంలో ఈ ఫోన్ ధర రూ.10 వేలలోపే ఉండే అవకాశం ఉంది.
రియల్‌మీ సీ65 స్పెసిఫికేషన్లు (Realme C65 Specifications)
ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మీ యూఐ 5.0 ఆపరేటింగ్ సిస్టంపై పని చేయనుంది. ఇందులో 6.67 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 88.7 శాతంగా ఉంది. 12ఎన్ఎం మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై రియల్‌మీ సీ65 రన్ కానుంది. 8 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ అందించారు. దీన్ని వర్చువల్‌లో మరో 8 జీబీ పెంచుకోవచ్చు.

ఇక కెమెరాల విషయానికి వస్తే… ఫోన్ వెనకవైపు రెండు సెన్సార్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతో పాటు మరో సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందింాచరు. ఈ ఫోన్‌లో 256 జీబీ వరకు స్టోరేజ్ ఉంది. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 2 టీబీ వరకు పెంచుకోవచ్చు.

బ్లూటూత్ వీ5.3, జీపీఎస్, ఏ-జీపీఎస్, గ్లోనాస్, బైదు, గెలీలియో, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, వైఫై, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఉన్నాయి. ఐపీ54 వాటర్ రెసిస్టెంట్ బిల్ట్‌ను ఈ ఫోన్‌లో అందించారు. యాక్సెలరోమీటర్, గైరోస్కోప్, లైట్ సెన్సార్, మ్యాగ్నెటిక్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్‌లను ఈ ఫోన్‌లో అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్క భాగంలో ఉంది. డైనమిక్ బటన్, ఎయిర్ జెస్చర్ సపోర్ట్ కూడా ఈ ఫోన్‌లో చూడవచ్చు.

రియల్‌మీ సీ65లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. కేవలం 30 సెకన్ల పాటు ఫోన్‌ను ఛార్జింగ్ చేస్తే 43 నిమిషాల కాలింగ్ టైమ్‌ను ఇది అందించనుంది. దీని మందం 0.76 సెంటీమీటర్లు కాగా బరువు 185 గ్రాములుగా ఉంది.

Success Story: రూ.500తో ముంబైలో అడుగుపెట్టి రూ.5,000 కోట్ల సంపాదన..

Dr.A. Velumani: అందరి దారి వేరు ఆయన ఒక్కడి దారు వేరు. పేదరికంలో పుట్టి పెరగటమే తన విజయానికి నిజమైన బలమని చెబుతారు డాక్టర్ వేలుమణి. తమిళనాడులో పుట్టి పెరిగిన ఆయన ఉద్యోగం కోసం ముంబై వెళ్లి వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన తీరు ఖర్చితంగా నేటి యువతకు పెద్ద పాఠం.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది దేశంలో అతిపెద్ద థైరాయిడ్ టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేసిన థైరోకేర్ సంస్థ ఫౌండర్ డాక్టర్ ఆరోగ్యసామి వేలుమణి ప్రయాణం గురించే. కోయంబత్తూరులో ఫ్రెషర్ కావటంతో 50 ఉద్యోగాలకు రిజెక్ట్ అయ్యాక ఒక జాబ్ వచ్చింది. కంపెనీ మూతపడటంతో రూ.500తో ముంబైలో ప్రభుత్వ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వచ్చి సెలక్ట్ అయ్యారు. అక్కడే పీహెచ్డీ వరకు చదువు పూర్తి చేశారు.

ఉద్యోగం మానేయాలని తీసుకున్న సడెన్ నిర్ణయం నుంచి పుట్టిందే వ్యాపార ఆలోచన. అప్పట్లో రూ.2 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న ఆయన థైరాయిడ్ టెస్టింగ్ గురించి తన చదువులో నేర్చుకున్న కీలక విషయాలతో తక్కువ ధరకే టెస్టింగ్ సేవలను అందించటం ప్రారంభించారు. తొలుత ఫాంచైజింగ్ మోడల్ లో నాణ్యమైన సేవలను సరసమైన ధరలకు అందించి దేశమంతటా వ్యాపారాన్ని విస్తరించారు. అయితే తన కంపెనీలో కేవలం ఫెషర్లకు మాత్రమే ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించుకుని దానినే కొనసాగించారు.

కరోనా సమయంలో దేశంలో టెస్టింగ్ కోసం తొలుత కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పొందిన తొలి ప్రైవేట్ ల్యాబొరేటరిగీ థైరోకేర్ నిలిచింది. అలా ఒక్క రూపాయి కూడా అప్పు లేకుండా 40 శాతం లాభాలతో కంపెనీని ఏకండా 25 ఏళ్లకు పైగా నిరంతంగా వృద్ధి చెందేలా చేశారు వేలుమణి. భార్య సాయంతోనే తానింతటి వాడనయ్యానని ఎప్పుడూ గుర్తుచేసుకుంటారు. తన ప్రయాణంలో తనను ముందుకు నడిపిన చాలా మందికి కృతజ్ఞతలు చెబుతుంటారు. అలా కేవలం రూ.500తో ముంబైలో ప్రారంభమైన ప్రయాణం కంపెనీని భార్య మరణం తర్వాత 2016లో రూ.5000 కోట్లకు విక్రయించి ముగించారు. ప్రస్తుతం దేశంలోని అనేక మంది యువ వ్యాపారవేత్తలకు గైడెన్స్ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. వ్యాపారంలో వేగం కంటే విజయం సాధించటం ముఖ్యమని ఆయనను చూస్తేనే తెలుస్తుంది.

TTD: తిరుమల దర్శనానికి వచ్చే భక్తులకు టిటిడి గుడ్ న్యూస్..!!

వేసవి సెలవులకు తిరుమలకు వచ్చే భక్తులకు టిటిడి గుడ్ న్యూస్ చెప్పింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు వచ్చే యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మూడు నెలల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. సాధారణ భక్తులకు ఎక్కువ దర్శన వేళలు కల్పించడానికి సిఫార్సు లేఖలపై విఐపి దర్శనాన్ని రద్దు చేసినట్లు వివరించారు. క్యూలైన్లు కంపార్ట్మెంట్లో వేచి ఉండే భక్తులకు అన్న ప్రసాదం, మజ్జిగ, వైద్య సదుపాయాలు నిరంతరం అందిస్తామని ప్రకటించారు. ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో విఐపి లు నేరుగా వచ్చే వారికి మాత్రమే టిటిడి బ్రేక్ దర్శనం కల్పిస్తుంది. సిఫార్సు లేఖలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో సాధారణ భక్తులకు వేగంగా దర్శన అందుబాటులోకి వచ్చింది. ఇదే సమయంలో వేసవి రద్దీ వేల ఎక్కువ సంఖ్యలో వచ్చే భక్తులకు సేవలు అందించేందుకు 2500 మంది శ్రీవారి సేవకులను నియమించారు. మాడవీధులు, నారాయణగిరి గార్డెన్స్ వెంబడి కూల్ పెయింటింగ్స్, డ్రింకింగ్ వాటర్ పాయింట్లు నెలకొల్పారు.

వేసవి వేడి రోజులలో శేషాచల అటవీ ప్రాంతాల్లో ఫ్లాష్ అగ్ని ప్రమాదాలను నివారించడానికి టీటీడీ అటవీశాఖ, ప్రభుత్వ అగ్నిమాపక శాఖ ద్వారా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ధర్మారెడ్డి వెల్లడించారు. ఈనెల 9న ఉగాదినాడు తిరుమలలో ఆస్థానం నిర్వహించనున్నారు. ఇప్పటికే అవసరమైన ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. సెలవులు ప్రారంభం కానుండటంతో ఈ నెలాఖరు నుంచి రెండు నెలలపాటు తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ సంఖ్య ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు ఈవో ధర్మారెడ్డి వివరించారు.

Viral Pic: ఆ ఒక్కడే రోడ్డు మధ్యలోనే నిలబడ్డాడు.. రోడ్డేయకుండా ఆపాడు

Viral Pic: మనుషులు పెరుగుతున్నారు.. అవసరాలు పెరుగుతున్నాయి. ఇలాంటప్పుడు కొత్త రోడ్లు వేయడం, నూతన వంతెనలు నిర్మించడం, అధునాతన ఫ్లై ఓవర్లు ఏర్పాటు చేయడం అనివార్యమవుతోంది. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాలలో రోడ్లను విస్తరించాలి అనుకున్నప్పుడు అటు ఇటు పక్కల ఉన్న భవనాలను తొలగించాల్సి వస్తోంది.. కోర్టు కేసులు, మన్నుమశానం వంటివి అడ్డు తగలకుంటే.. ప్రభుత్వాలు ఇలాంటి పనులను సులభంగానే చేయగలుగుతున్నాయి. ఇలా రోడ్లను విస్తరించకుంటే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫలితంగా అపారంగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తున్నాయి. మనదేశంలో రోడ్డు విస్తరణ, లేక ఇంకా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కోర్టు కేసుల నుంచి మొదలు పెడితే స్థానికుల అభ్యంతరాల వరకు అన్నీ ఇబ్బందులే. అందువల్లే మనదేశంలో నేటికీ చాలా ప్రాంతాల్లో రోడ్లు విస్తరణకు నోచుకోలేదు.. ఇప్పుడంటే కొత్త కొత్త హైవేలు నిర్మాణమవుతున్నాయి. వంతెనలు ఏర్పాటవుతున్నాయి. కానీ ఒకప్పుడు ఇలా ఉండేది కాదు.

మన దేశం సంగతి పక్కన పెడితే.. నిర్మాణరంగంలో మన పొరుగున ఉన్న చైనా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అనితర సాధ్యమైన స్థాయిలో భవనాలను నిర్మిస్తోంది. సముద్ర జలాల మీదుగా వంతెనలు ఏర్పాటు చేస్తోంది. ప్రతిష్టాత్మకమైన త్రీ గోర్జెస్ వంటి హైడల్ ప్రాజెక్టును నిర్మించింది. ఇలా చెప్పుకుంటూ పోతే చైనా నిర్మాణ కౌశలం ఎంతో విస్తారమైనది.. కమ్యూనిస్టుల పాలనలో ఉన్న ఆ దేశంలో కూడా రోడ్ల విస్తరణ లేదా నూతన వంతెన నిర్మాణంలో మన దేశం లాగానే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలా ఏర్పడిన ఓ ఇబ్బంది వంతెన నిర్మాణ ఆకృతిని పూర్తిగా మార్చేసింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటో ప్రకారం.. చైనాలో ఓ ప్రాంతంలో అతిపెద్ద వంతెన నిర్మించారు. ఆ వంతెన చూసేందుకు చాలా బాగుంది. అటు ఇటు నాలుగు లైన్ల వరుసతో నిర్మించిన రోడ్డుతో అధునాతనంగా కనిపిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఒక దగ్గర ఆ వంతెన ఆకృతి మలుపులు తిరిగింది. అక్కడ పర్వతాల వంటివి అడ్డుగా లేవు. సముద్రమో, నదులు ఆటంకం గా లేవు. అక్కడ ఆటకం కలిగించింది ఓ కుటుంబం. ఎందుకంటే ఆ వంతెన నిర్మించిన మార్గంలో ఒక కుటుంబం నివాసం ఉంటోంది. వంతెన నిర్మాణ క్రమంలో తమ ఇంటిని తొలగించేందుకు ఆ కుటుంబం ఒప్పుకోలేదు. అధికారులు బతిమిలాడినా ఆ కుటుంబం మెట్టు దిగలేదు. చివరికి చేసేది ఏమీ లేక అధికారులు ఆ ఇంటి దగ్గరికి వచ్చేసరికి వంతెన ఆకృతిని పూర్తిగా మార్చేశారు. వంతెన నిర్మించినప్పటికీ ఆ కుటుంబం ఆ ఇంట్లోనే నివాసం ఉంటోంది. సోషల్ మీడియాలో ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇండియాలోనే కాదు ఎక్కడైనా సరే ఇలాంటి నిరసనకారులు ఉంటారు. కమ్యూనిస్టు ప్రభుత్వమయినప్పటికీ అలాంటి నిరసనకారుల ముందు చైనా తలవంచింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

AP Inter Results 2024: ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ – ఫలితాలు త్వరలోనే వచ్చేస్తున్నాయ్!

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు మరికొద్ది రోజుల్లో వెలువడనున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియ్ బోర్డు సమాయత్తమవుతోంది. ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు ఒకేసారి వెలువడనున్నాయి.
AP Inter Results: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు మరికొద్ది రోజుల్లో వెలువడనున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియ్ బోర్డు సమాయత్తమవుతోంది. ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు ఒకేసారి వెలువడనున్నాయి. ఇంటర్ ఫలితాలను ఏప్రిల్‌ రెండోవారం లేదా మూడో వారంలో వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఏప్రిల్ 12న ఇంటర్ ఫలితాలు వెలువడనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇంటర్మీడియట్‌ జవాబుపత్రాల మూల్యాంకనం ముగియగా.. మరోసారి జవాబుపత్రాల పరిశీలన, మార్కుల నమోదు ప్రక్రియ పూర్తికాగానే ఫలితాలు విడుదల చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా 1,559 సెంటర్లలో మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ ప‌బ్లిక్‌ పరీక్షలు జ‌రిగిన విష‌యం తెల్సిందే. ఈ ఏడాది ఇంట‌ర్ విద్యార్థులు మొత్తం 10,52,221 మంది ఉన్నారు. ఇందులో మొదటి సంవత్సరం 4,73,058 మంది, రెండో సంవత్సరం 5,79,163 మంది ఉన్నారు. ఒకేషనల్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు దాదాపు లక్ష వరకు ఉన్నారు. ఇంటర్ పరీక్షలు ముగియడంతో.. మూల్యాంకన ప్రక్రియ కూడా మొదలుపెట్టారు. ఏప్రిల్‌ 4న మూల్యాంకన ప్రక్రియ పూర్తయింది. సుమారుగా 23వేల మంది అధ్యాపకులు పాల్గొన్నారు. ఒక్కో అధ్యాపకుడూ రోజుకు 30 జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారు. మూల్యాంకనం చేసిన జవాబు పత్రాలను రీవెరిఫికేషన్ చేసిన తర్వాత మార్కులు అప్‌లోడ్ చేయనున్నారు. ఇవన్నీ అయిపోగానే ఫలితాలను వెల్లడించనున్నారు.

గతేడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇంటర్ ఫస్టియర్‌తోపాటు సెకండియర్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 26న విడుదల చేశారు. అంటే 22 రోజుల్లోనే ఫలితాలను వెల్లడించారు. ఈసారి కూడా అంతే సమయంలో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. ఏప్రిల్ 12 లేదా ఆ తర్వాత ఒకట్రెండు రోజుల్లో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

ఏపీ ఇంటర్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
Step 1: ఏపీ ఇంటర్ విద్యార్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్  https://bie.ap.gov.in/  సందర్శించండి
Step 2: హోం పేజీలో ఏపీ ఇంటర్ రిజల్ట్స్ 2024 లింక్ (Andhra Pradesh Inter Results 2024 link) మీద క్లిక్ చేయండి
Step 3: హాల్ టికెట్ నెంబర్ (రిజిస్ట్రేషన్ నెంబర్), పుట్టిన తేదీ లాంటి వివరాలు నమోదు చేయాలి
Step 4: విద్యార్థుల ఫలితాలు మీ స్క్రీన్ మీద కనిపిస్తాయి
Step 5: విద్యార్థులు రిజల్ట్స్‌ స్కోర్ కార్డును పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోండి
Step 6: ఇంజినీరింగ్, మెడిసిన్, డిగ్రీల ప్రవేశాల సమయంలో మీ ఇంటర్ స్కోర్ కార్డు అవసరాల కోసం రిజల్ట్ ు ప్రింటౌట్ తీసుకోవడం బెటర్.

ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్లు..

https://examresults.ap.nic.in

www.bie.ap.gov.in

Motorola లేటెస్ట్ Curved 5G Phone పైన బిగ్ డీల్ అందుకోండి.!

కొత్త స్మార్ట్ ఫోన్ కొనడానికి చూస్తున్న వారికి ఈరోజు గొప్ప డీల్ అందుబాటులో వుంది. Flipkart ఈరోజు Motorola లేటెస్ట్ Curved 5G Phone పైన బిగ్ డీల్ ఆఫర్ చేస్తోంది. అందుకే, ఈ కొత్త కర్వ్డ్ డిస్ప్లే 5జి స్మార్ట్ ఫోన్ చాలా చవక ధరకే లభిస్తోంది. అందుకే, ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ కర్వ్డ్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్ ఆఫర్ ను మీకోసం అందిస్తున్నాను.

Motorola Edge 40 Neo
మోటోరోలా ఎడ్జ్ 40 నియో ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. రూ. 23,999 రూపాయల ప్రారంభ ధరతో ఇండియన్ మార్కెట్లో విడుదలైన ఈ ఫోన్, ఈరోజు వెయ్యి రూపాయలు డిస్కౌంట్ తో రూ. 22,999 రూపాయలకే లభిస్తోంది. అంతేకాదు, ఈరోజు ఈ ఫోన్ పైన 2,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు.
ఈ స్మార్ట్ ఫోన్ ను SBI, Axis మరియు ICICI బ్యాంక్స్ యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్స్ తో కొనే వారికి రూ. 2,000 రూపాయల అధనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ ఆఫర్ లతో ఈ ఫోన్ ను కేవలం రూ. 20,999 రూపాయల ధరకే అందుకోవచ్చు.
Motorola Edge 40 Neo
మోటోరోలా ఎడ్జ్ 40 నియో స్మార్ట్ ఫోన్ ను ఆల్రౌండ్ ఫీచర్స్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ వేగాన్ లెథర్ డిజైన్ తో వస్తుంది. ఇందులో 6.55 ఇంచ్ 10-bit Full HD+ రిజల్యూషన్ డిస్ప్లేని 144Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డిస్ప్లే లో ఇన్ డిస్ప్లే ఫింగర్ కూడా వుంది.

ఈ మోటోరోలా ఫోన్ Dimensity 7030 ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 8GB RAM + 128GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ లో వెనుక 50MP + 13MP డ్యూయల్ రియర్ మరియు ముందు 32MP సెల్ఫీ కెమేరా ఉన్నాయి. ఈ ఫోన్ లో 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు 68W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ లను కలిగి వుంది.

Jio జబర్దస్త్ ప్లాన్: రూ. 234 కొత్త ప్లాన్ తో 56 రోజుల అన్లిమిటెడ్ లాభాలు అందుకోండి.!

JIo జబర్దస్త్ ప్లాన్: ఇప్పటికే తన పోర్టుఫోలియోలో చాలా ప్రీపెయిడ్ ప్లానులను అందించిన రిలయన్స్ జియో మరొక కొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది. రిలయన్స్ జియో ఈ కొత్త ప్లాన్ ను తక్కువ ధరలో ఎక్కువ లాభాలను అందించేలా తీసుకు వచ్చింది. అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ డేటా మరియు ఎస్ఎంఎస్ లాభాలను కూడా ఈ ప్లాన్ అందిస్తుంది. రిలయన్స్ జియో హరి కొత్తగా తీసుకొచ్చిన ఈ ప్లాన్ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందామా.

జియో కొత్తగా విడుదల చేసిన రూ. 234 ప్రీపెయిడ్ ప్లాన్ గురించే మనం మాట్లాడుతోంది. ఈ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ ను JioBharat Phone యూజర్ల కోసం ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ జియో భారత్ ఫోన్ యూజర్లకు 56 రోజుల అన్లిమిటెడ్ ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, స్మార్ట్ ఫోన్ యూజర్లు ఈ ప్లాన్ ను రీచార్జ్ చేసే అవకాశం ఉండదు. ఇది కేవలం జియో భారత్ ఫోన్ యూజర్లకు మాత్రమే చెల్లుతుంది.
JioBharat Phone Rs. 234 Plan
రిలయన్స్ జియో తన జియో భారత్ ఫోన్ యూజర్ల కోసం ఈ కొత్త రూ. 234 ప్రీపెయిడ్ ప్లాన్ ను అందించింది. ఈ ప్లాన్ 56 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది.

అంతేకాదు, ఈ ప్లాన్ తో రోజుకు 0.5 GB చొప్పున 56 రోజుల పాటు డైలీ డేటాని అందిస్తుంది. అలాగే, ఈ డేటా లిమిట్ ముగిసిన తరువాత 64 Kbps స్పీడ్ వద్ద 56 రోజులు అన్లిమిటెడ్ డేటాని పొందవచ్చు.

ఇక ఈ ప్లాన్ అందించే మరిన్ని ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ ప్లాన్ తో 28 రోజులకు 300 SMS చొప్పున 56 రోజులకు 600 SMS లను అందిస్తుంది. అంతేకాదు, JioSaavn మరియు JioCinema యాప్స్ కి ఉచిత యాక్సెస్ ను కూడా తీసుకు వస్తుంది.

RDO ఆఫీసునే జప్తు చేపించిన ఓ రైతు కథ! సామాన్యుడి సత్తా చూపాడు!

సాధారణంగా బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకపోతే.. ఆస్తులను జప్తు చేస్తారు. ఏమాత్రం కనికరం చూపకుండా.. ప్రాపర్టీని స్వాధీనం చేసుకంటారు. మరీ ముఖ్యంగా అన్నదాతలు అప్పు చెల్లించకపోతే వారు తాకట్టు పెట్టిన భూములను వేలం వేస్తారు అధికారులు. కానీ తొలిసారి ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. రైతుకు నష్టపరిహారం చెల్లించడంలో అలసత్వం వహించినందుకు ప్రభుత్వ కార్యాలయాన్ని జప్తు చేయాల్సిందిగా భూసేకరణ, పునరావాస, పునర్నిర్మాణ మండలి సంచలన తీర్పు వెల్లడించింది. ఆ వివరాలు..

ఈ సంఘటన వరంగల్ లో చోటు చేసుకుంది. పారిశ్రామిక అవసరాల కోసం రైతుల నుంచి భూమిని సేకరించి, నష్టపరిహారం చెల్లించకపోవడంతో ఈ తీర్పు వెల్లడించింది. ఆర్డీవో ఆస్తులను జప్తు చేయాలని ఆదేశాలు జారీచేసింది. అయితే ఈ తీర్పు వెనక ఓ రైతు అలుపెరగని పోరాటం ఉంది. ఏం జరిగింది అంటే.. వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు కోసం భూమి ఇచ్చిన ఓ రైతుకు అధికారులు నష్టపరిహారం చెల్లించలేదు. దాంతో వరంగల్‌ ఆర్డీవో ఆస్తుల జప్తునకు భూసేకరణ, పునరావాస, పునర్నిర్మాణ మండలి ఆదేశాలు ఇచ్చింది. గురువారం ఉదయం మండలి అధికారులు, సిబ్బంది ఆర్డీవో ఆఫీసులోని ఏసీలు, కూలర్‌లు, కంప్యూటర్లు, ప్రింటర్లు, ఆర్డీవో వాహనాన్ని సీజ్‌ చేస్తూ.. స్టిక్కర్లు అతికించారు. ఈ సంఘటన సంచలనంగా మారింది.

Rdo office seized

వివరాల్లోకి వెళ్తే వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటలో ఏర్పాటు చేసిన టెక్స్‌టైల్‌ పార్కు కోసం 2014-16 సంవత్సరాల మధ్య భూసేకరణ జరిగింది. ఇందుకోసం శాయంపేటకు చెందిన సముద్రాల యాకస్వామి, ఆయన కుమార్తెకు చెందిన వివిధ సర్వే నంబర్లలోని 20 ఎకరాల భూమిని సేకరిస్తున్నట్టు రెవెన్యూ అధికారులు తొలుత నోటీసులు ఇచ్చారు. ఇందుకు పరిహారంగా ఎకరానికి రూ.10 లక్షల చొప్పున ఇస్తామని తెలిపారు. కొన్ని రోజుల తర్వాత భూసేకరణ అవసరం లేదన్నారు. మళ్లీ నాలుగేళ్ల తర్వాత భూమిని సేకరిస్తున్నట్లు నోటీసులు జారీచేశారు.

గతంలో నిర్ణయించిన రూ.పది లక్షల పరిహారమే చెల్లిస్తామని పేర్కొన్నారు. దీనిపై యాకస్వామి అభ్యంతరం వ్యక్తం చేశాడు. పరిహారం పెంచాల్సిందిగా హైదరాబాద్‌లోని భూసేకరణ, పునరావాస, పునర్నిర్మాణ మండలిని ఆశ్రయించాడు. సర్వే నంబర్లలోని లోటుపాట్ల కారణంగా మొత్తం 20 ఎకరాలకు కాకుండా.. 12 ఎకరాలకు నష్టపరిహారం పెంచి ఇవ్వాలని పిటిషన్ వేశారు. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత 6 నెలల క్రితం యాకస్వామికి అనుకూలంగా తీర్పు వచ్చింది.

Rdo office seized

ఎకరాకు రూ.20 లక్షల చొప్పున 12 ఎకరాలకు రూ.2.40 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. కానీ, ఈ తీర్పును అధికారులు పట్టించుకోకపోవడంతో యాకస్వామి మళ్లీ పిటిషన్‌ వేశారు. దాంతో ఆర్డీవో కార్యాలయ ఆస్తులు జప్తుచేసి యాకస్వామికి నష్టపరిహారం చెల్లించాలని తాజాగా తీర్పునిచ్చింది. దీంతో అధికారులు గురువారం కార్యాలయానికి వచ్చి వస్తువులను సీజ్‌ చేశారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళతామని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్‌ తెలిపారు.

SBI: ఈ స్కీమ్‌లో ఒకేసారి పెట్టుబడి పెట్టండి.. ప్రతి నెలా అదనపు ఆదాయం పొందండి

మీకు ప్రతి నెల కొంత అదనపు ఆదాయం రావాలని కోరుకుంటున్నారా? అయితే మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో అందుకోసం బెస్ట్ స్కీం ఉంది. అదే SBI యాన్యుటీ డిపాజిట్ స్కీమ్(SBI Annuity Deposit Scheme). దీనిలో ఒకేసారి కొంత మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి.. ఆ తర్వాత ప్రతి నెలా అసలు మొత్తంతో పాటు నెలవారీ వడ్డీని కూడా పొందవచ్చు.

మీకు ప్రతి నెల కొంత అదనపు ఆదాయం రావాలని కోరుకుంటున్నారా? అయితే మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో అందుకోసం బెస్ట్ స్కీం ఉంది. అదే SBI యాన్యుటీ డిపాజిట్ స్కీమ్(SBI Annuity Deposit Scheme). దీనిలో కొంత మొత్తాన్ని ఒకేసారి డిపాజిట్ చేసి.. ఆ తర్వాత ప్రతి నెలా అసలు మొత్తంతో పాటు నెలవారీ వడ్డీని కూడా పొందవచ్చు. ఈ వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒకసారి ఖాతాలో మిగిలి ఉన్న మొత్తంపై లెక్కింపు చేస్తారు. SBI యాన్యుటీ డిపాజిట్లపై లభించే వడ్డీ రేట్లు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ల మాదిరిగానే ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో SBI యాన్యుటీ స్కీమ్ వడ్డీ రేటు , అర్హతల వివరాల గురించి ఇప్పుడు చుద్దాం.
SBI వార్షిక డిపాజిట్ పథకంలో ఒకసారి డబ్బును డిపాజిట్ చేయడం ద్వారా దీనిని EMI రూపంలో ఆదాయం పొందవచ్చు. అయితే ఇందులో మీరు డిపాజిట్ చేయాల్సిన వ్యవధి 3, 5, 7 లేదా 10 సంవత్సరాలను ఎంచుకోవచ్చు. మీరు పెట్టుబడి పెట్టిన మొత్తంపై వడ్డీ లభిస్తుంది. SBI ఈ డబ్బును సమాన వాయిదాలలో చెల్లిస్తారు. ఈ EMIలలో ప్రాథమిక డబ్బు, వడ్డీలో కొంత భాగం ఉంటాయి. ఈ పథకంలో వడ్డీ త్రైమాసికంలో వసూలు చేయబడుతుంది. ఇందులో ప్రతి నెలా రిటర్నులలో తగ్గింపు ఉంటుంది.

ఈ పథకంలో పెట్టుబడిని భారతదేశంలోని SBI ఏ శాఖలోనైనా చేయవచ్చు. ఈ పథకంలో కనీస పెట్టుబడి(investment) మొత్తం రూ. 1,000 నుంచి మొదలవుతుంది. ఈ పథకం కోసం గరిష్ట డిపాజిట్ మొత్తంపై పరిమితి లేదు. మీకు ఏదైనా జరిగితే SBI యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ నుంచి రిటర్న్‌లను స్వీకరించడానికి నామినీలను ఎంపిక చేసుకోవచ్చు. కస్టమర్లు మొదట డబ్బును డిపాజిట్ చేయాలి, ఆ తర్వాత వారు ప్రతి నెలా వారీగా చెల్లింపులను 1వ తేదీన అందుకుంటారు. నెలకు వద్దనుకుంటే 36, 60, 84 లేదా 120 నెలల మధ్య డిపాజిట్ వ్యవధిని కూడా ఎంచుకోవచ్చు.

భూకంపం నుంచి భారీ టవర్‌ను ఈ స్టీల్‌బాల్‌ ఎలా రక్షించింది?

భారీ భూకంపం తైవాన్‌ను (Taiwan earthquake) కుదిపేసింది. తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. 1,011 మంది గాయపడ్డారు. ప్రకంపనల తీవ్రతకు ఆ ద్వీపం వ్యాప్తంగా దాదాపు 770 భవనాలు దెబ్బతిన్నాయి. భారీ వంతెనలు కొన్ని సెకన్లపాటు అటూ, ఇటూ ఊగాయి. రోడ్లపై వాహనాలు కుదుపులకు లోనైన పలు వీడియోలు బయటకొచ్చాయి. భూకంప కేంద్రానికి 80 మైళ్ల దూరంలో ఉన్న తైపీలోనూ భవనాలు ప్రమాదకర స్థాయిలో కుదుపులకు గురయ్యాయి. కానీ, ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఆకాశహర్మ్యం అయిన తైపీ-101 (Taipei-101)కి మాత్రం ఏమీ కాలేదు. ఆధునిక ఇంజినీరింగ్‌ సాధించిన అద్భుత విజయంగా అభివర్ణిస్తున్న ఈ భారీ నిర్మాణంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక వ్యవస్థే అందుకు కారణం. దాని విశేషాలేంటో చూద్దాం.

660 టన్నుల గోళం..
భూకంపం సంభవించినప్పుఏడు 1,667 అడుగుల తైపీ-101 (Taipei-101) కొద్దిగా ఊగినట్లు వీడియో ఫుటేజీల్లో కనిపిస్తోంది. కానీ, భారీ కుదుపులకు మాత్రం లోనుకాలేదు. 101 అంతస్తుల ఈ ఆకాశహర్మ్యంలో పై భాగంలో ఏర్పాటుచేసిన గోళం లాంటి వస్తువే అందుకు కారణం. దీన్నే ఇంజినీరింగ్‌ పరిభాషలో ‘ట్యూన్డ్‌ మాస్‌ డ్యాంపెనర్‌’గా వ్యవహరిస్తారు. 87 నుంచి 92 అంతస్తుల మధ్య ఈ భారీ గోళాన్ని 92 మందమైన కేబుల్స్‌తో బిగించారు. దీని బరువు 660 టన్నులు. మొత్తం 41 భారీ ఉక్కు షీట్లతో నిర్మించారు. దీని వ్యాసం 18 అడుగులు. ఇది ఏ దిశలోనైనా దాదాపు 5 అడుగుల వరకు కదులుతుంది. ఫలితంగా, భారీ ప్రకంపనల వల్ల వచ్చే కుదుపులను ప్రతిఘటించే లేదా తగ్గించే లోలకంలా (pendulum) పని చేస్తుంది.

ఎలా పనిచేస్తుందంటే..
‘‘భవనం ఊగినప్పుడు ట్యూన్డ్‌ మాస్‌ డ్యాంపెనర్లు వ్యతిరేక దిశలో కదులుతాయి. తైపీ-101లో ఈ గోళం వేలాడుతూ ఉంటుంది. అకస్మాత్తుగా టవర్‌లో కుదుపులు వచ్చినప్పుడు అది వ్యతిరేక దిశలో ఊగుతుంది. తద్వారా గతిశక్తిని గ్రహిస్తుంది. గోళానికి, టవర్‌కు మధ్య ఉన్న హైడ్రాలిక్‌ సిలిండర్లు ఆ శక్తిని ఉష్ణంగా మార్చి చెదరగొడతాయి’’ అని ‘సూపర్‌టాల్‌: హౌ ద వరల్డ్స్‌ టాలెస్ట్‌ బిల్డింగ్స్‌ ఆర్‌ రీషేపింగ్‌ అవర్‌ సిటీస్‌ అండ్‌ లైవ్స్‌’ పుస్తక రచయిత స్టీఫెన్‌ వివరించారు.

భారీ గాలుల నుంచి కూడా..
ప్రపంచవ్యాప్తంగా ఆకాశహర్మ్యాల్లో ఇలాంటి ట్యూన్డ్‌ మాస్‌ డ్యాంపెనర్లను వాడుతున్నట్లు స్టీఫెన్‌ తెలిపారు. భూకంపాల సమయంలో వచ్చే ప్రమాదకర కుదుపుల వల్ల కలిగే ‘హార్మోనిక్‌ వైబ్రేషన్స్‌’ కారణంగా భవనాలు కుప్పకూలుతాయని తెలిపారు. భవనాలు వాటి సొంత రెసొనెన్స్‌ (Resonance) వద్ద కంపిస్తే కుదుపులు క్రమంగా పెరగడమే అందుకు కారణమని భౌతికశాస్త్ర సూత్రాల ఆధారంగా వివరించారు. వాటి నుంచి రక్షించేందుకే ఈ డ్యాంపెనర్లను ఏర్పాటుచేస్తారని తెలిపారు. భారీ గాలులు వీచే సమయంలో భవనంలో ఉండేవారికి కలిగే అసౌకర్యం నుంచి కూడా ఇది రక్షణ కల్పిస్తుందని చెప్పారు.

నిర్మాణంలోనూ ప్రత్యేకత..
ఈ డ్యాంపెనర్‌తో పాటు భారీ ప్రకంపనలను సైతం తట్టుకునేలా తైపీ-101 నిర్మాణంలో ప్రత్యేక ఏర్పాట్లుచేసినట్లు స్టీఫెన్‌ తెలిపారు. లోతైన పునాదిపై 380 కాంక్రీటు, ఉక్కు పిల్లర్లతో ఈ టవర్‌ను నిర్మించినట్లు వెల్లడించారు. అలాగే బిల్డింగ్‌ మూల నిర్మాణాన్ని భారీ బీములు, ఉక్కు పిల్లర్లతో అనుసంధానించినట్లు చెప్పారు. ఇవన్నీ ఈ ఆకాశహర్మ్యానికి పటిష్ఠతను చేకూర్చినట్లు చెప్పారు. డిజిటల్‌ డిజైనింగ్‌ దశలోనే అన్ని రకాల ప్రమాదాలను తట్టుకునేలా దీన్ని పరీక్షించినట్లు చెప్పారు.

Health

సినిమా