ఐస్‌ బాత్‌తో మ్యాజిక్‌..! అందుకే సెలబ్రిటీలకు అంత పిచ్చి..! ఆ కారణాలు తెలిస్తే..

సోషల్ మీడియాలో చాలా ట్రెండ్స్ తరచుగా పుట్టుకొస్తున్నాయి. ఆహారం నుండి ఆరోగ్యం వరకు ప్రతిరోజూ ఒక కొత్త ట్రెండ్ కనిపిస్తుంది. ఈ ట్రెండ్‌లో ఇప్పుడు ఐస్ బాత్ ఒకటి. సోషల్ మీడియాలోప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీలు ఐస్ బాత్ చేస్తూ కనిపిస్తున్నారు. ఐస్ బాత్ అంటే.. చల్లటి నీటిలో స్నానం చేయడం.. ఈ రోజుల్లో చాలా మంది సెలబ్రిటీలు ఐస్ బాత్ చేస్తున్నారు. గత కొంత కాలంగా సెలబ్రిటీలు, సామాన్యుల మధ్య దీని ట్రెండ్ వేగంగా పెరిగింది. దీనినే క్రయోథెరపీ అని కూడా అంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అంతే కాదు చర్మానికి, మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. దాని అద్భుతమైన ప్రయోజనాలను తెలుసుకుందాం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

ఐస్ బాత్ అంటే ఏమిటి?

ఐస్ బాత్ అంటే చల్లటి నీటిలో స్నానం చేయటం. దీనినే చల్లని నీటిలో డిప్ లేదా క్రియోథెరపీ అని కూడా అంటారు. ఇందులో భాగంగా ఆ వ్యక్తిని 11 నుంచి 15 నిమిషాలు నీటిలో ఉంచుతారు. ఈ నీటిని 50 నుంచి 59 డిగ్రీల ఫారెన్ హీట్ మధ్య చల్లబరుస్తారు. దీన్ని సాధారణంగా వ్యాయామం తర్వాత ఆరోగ్య ప్రయోజనాల కోసం అథ్లెట్లు ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ, ప్రస్తుతం చాలా మంది సెలబ్రిటీలు కూడా ఐస్‌ బాత్‌ ట్రీట్‌మెంట్‌ ను అలవాటుగా చేసుకుంటున్నారు.
ఐస్‌ బాత్‌తో కండరాల రికవరీని వేగవంతం చేస్తుంది. గాయాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎక్కువ వ్యాయామం, శారీరక శ్రమ చేసిన తర్వాత ఐస్ బాత్ చేస్తే శరీర మంట, కండరాల నొప్పి చాలా వరకు తగ్గుతుందని చెబుతారు. అంతేకాదు.. ఐస్‌ బాత్‌తో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. గడ్డకట్టే నీటిలో స్నానం చేయడం ద్వారా దాని చల్లని ఉష్ణోగ్రత ప్రసరణను ప్రేరేపిస్తుంది. ఇది కండరాలకు రక్త ప్రవాహాన్ని, ఆక్సిజన్ పంపిణీని పెంచుతుంది.

ఐస్‌ బాత్‌ మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మంచి మానసిక ప్రశాంతతను అందజేస్తుంది. ఇలా చేయడం వల్ల విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది. ఇది నిరాశ, ఆందోళన లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది . రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఐస్ వాటర్ తో స్నానం చేయడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. ఆరోగ్యంతో పాటు, ఐస్ బాత్ మన చర్మానికి కూడా చాలా ప్రయోజనకరంగా పనిచేస్తుంది. ఐస్‌ బాత్‌ చల్లని ఉష్ణోగ్రత చర్మ రంధ్రాలను బిగించి, మంటను తగ్గించడం, గ్లోను ప్రోత్సహించడం ద్వారా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇలా ఆరోగ్యంతో పాటు అందానికి మూలం ఐస్‌ బాత్..అందుకే సెలబ్రిటీల్లో అంతా క్రేజ్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *