ఏపీలో ఎన్నికల రాజకీయం హోరా హోరీగా మారుతోంది. ఇతర పార్టీల కంటే ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ ముందున్నారు. అభ్యర్దుల ఎంపిక ప్రక్రియ కసరత్తు తుది దశకు చేరింది. ఈ సమయంలో రాప్తాడు వేదికగా భారీ సిద్దం సభ నిర్వహిస్తున్నారు. ఈ సభ ద్వారా సీఎం జగన్ కీలక ప్రకటనలకు సిద్దమయ్యారు. అదే సమయంలో వైనాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్న జగన్ మరో ముఖ్య నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ అసెంబ్లీ పరిధిలోనూ అమలుకు డిసైడ్ అయ్యారు.
జగన్ కొత్త వ్యూహం : ముఖ్యమంత్రి జగన్ ప్రతీ నియోజకవర్గంలో గెలుపు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అభ్యర్దుల ఎంపికలో అనూహ్య నిర్ణయాలు ప్రకటించారు. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ గెలుపే ప్రామాణికంగా పోటీ చేసే అభ్యర్దులను ఎంపిక చేస్తున్నారు. ఇక, ఎన్నికల నిర్వహణ పైన ఫోకస్ చేసారు. నియోజకవర్గంల ఇప్పటికే పార్టీ పరిశీలకులతో పాటుగా ప్రతీ వార్డులోనూ కన్వీనర్లను నియమించారు. ఇక, ఇప్పుడు ప్రతీ పోలింగ్ బూత్ స్థాయిలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రతీ పోలింగ్ బూత్ పరిధిలో 15 మందితో కమిటీల ఏర్పాటుకు నిర్ణయించారు. ఈ మేరకు ఎమ్మెల్యేలకు బాధ్యతలు కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తగా ఉన్న దాదాపు 47 వేలకు పైగా పోలింగ్ కేంద్రాల్లో ఈ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు.
ప్రతీ సీటు – ప్రతీ ఓటు : ఈ కమిటీల్లో స్థానికంగా పోలింగ్ బూత్ పరిధిలో పార్టీ కోసం పని చేస్తున్న వారికి సామాజిక వర్గాల వారీగా, మహిళలకు అవకాశం కల్పిస్తూ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ ఇంటితో వార్డు వాలంటీర్ తో సహా మమేకం అయ్యేలా మార్గనిర్దేశనం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో పథకాలు, సామాజిక న్యాయం అమలు చేస్తున్నా..పోల్ మేనేజ్మెంట్ ఎన్నికల సమయంలో కీలకం కానుంది. దీంతో..ముఖ్యమంత్రి జగన్ అప్రమత్తం అయ్యారు. కొత్త అభ్యర్దులు పెద్ద సంఖ్యలో పోటీలో ఉండటంతో..ఎక్కడా ఎన్నికలు చేయటంతో ఏ విషయంలోనూ నిర్లిప్తత ఉండకూడదని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలోనూ ప్రతీ ఇంటితోనూ పార్టీ కేడర్ మమేకం అయ్యేలా ఏకండా 15 మందితో స్థానికంగా ఎంపిక చేసి వారితో బూత్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు.
కమిటీలు – వార్ రూమ్ సిద్దం : ప్రచారంతో పాటుగా..పోలింగ్ రోజున వీరి పాత్ర కీలకంగా మారనుంది. దీనికి సంబంధించి సీఎం జగన్ రోడ్ మ్యాప్ ఖరారు చేసారు. పక్కాగా ప్రతీ పోలింగ్ బూత్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు నియోజకవర్గాల్లోని పరిస్థితులను ఎప్పటికిప్పుడు సమాచారం సేకరిస్తూ..అవసరమైన మార్గనిర్దేశం చేసేందుకు వీలుగా రాష్ట్ర స్థాయిలో సీనియర్లతో వార్ రూమ్ నిర్వహణకు నిర్ణయించారు. దీని ద్వారా ప్రతీ సీటు..ప్రతీ ఓటు కీలకమని సీఎం జగన్ స్పష్టం చేస్తున్నారు. ఇక, రాప్తాడు సభలో సీఎం జగన్ ఎన్నికల వరాలు ప్రకటిస్తారనే ప్రచారం సాగుతోంది. ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా ముందుగానే ఎన్నికల హామీలను ప్రకటించటం ద్వారా పై చేయి సాధించి..ప్రతిపక్షాలను ఆత్మరక్షణలోకి నెట్టాలని భావిస్తున్నారు. దీంతో..జగన్ నిర్ణయాల పైన ఆసక్తి కొనసాగుతోంది.
ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయం – లెక్క మార్చేనా..!!
Naraka lokam : అమ్మో. నరకం ఇలా ఉంటుందా.. మరణించాక ఆత్మ ఎన్ని రోజులకు అక్కడికి చేరుకుంటుంది.!
Naraka lokam : పాపాలు చేస్తే యముడు నరకానికి తీసుకెళ్లి సలసలా మరిగే నూనెలో అప్పడం వేయించినట్టు వేయిస్తాడని మనం చాలా సినిమాల్లో చూసాం.. మరి ఈ సినిమాల్లో చూపించినట్లుగా నరకం అనేది నిజంగా ఉందా..
ఉంటే అది ఎక్కడ ఉంది.. నరకంలో ఏ తప్పుకు ఏ శిక్ష వేస్తారు. ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.. గరుడ పురాణం ప్రకారం యమలోకం మన భూమికి 86 వేల యోజనాలు అనగా 11 లక్షల ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో నైరుతి దిక్కులో ఉంటుంది. నరకలోకానికి అధిపతి యమధర్మరాజు. ఇక్కడ యముడికి సహాయకుడిగా చిత్రగుప్తుడు వ్యవహరిస్తాడు. భూమి మీద ఎక్కడ ఏం జరుగుతుందో సాటిలైట్స్ ద్వారా మనం తెలుసుకుంటున్నట్లే యమలోకంలో చీఫ్ అకౌంటెంట్గా విధులు నిర్వహించే చిత్రగుప్తుడు ఈ భూమి మీద జీవులు చేసే ప్రతి కర్మను పంచభూతాల ద్వారా సేకరిస్తూ ఆ డేటాని తన దగ్గర ఉన్న డేటాబేస్ లో పొందుపరుస్తూ ఉంటాడు.
తన రికార్డ్స్ లో ఉన్న జీవికి ఎక్స్పైరీ డేట్ సమీపించగానే శరీరం నుండి ఆత్మను వేరు చేసి దాన్ని సూక్ష్మ శరీరంలోనికి ప్రవేశపెట్టి ముందు ప్రవేశపెట్టడం చిత్రగుప్తుని యొక్కవిదీ.. పాప పుణ్యాలనుచిత్రగుప్తుడు చెప్పిన దాని బట్టి విచారించిన యమధర్మరాజు అతని పాపాలను బట్టి వివిధ రకాల శిక్షలను విధిస్తాడు. జీవుడు ప్రయాణించి ప్రయాణించి 171 రోజుకి యముని సోదరుడు విచిత్ర భవనం అనే నగరానికి చేరుకుంటారు.. ఆ తర్వాత నరకానికి వెళ్ళినప్పుడు యముడు వారి పాపాలను బట్టి శిక్ష వేస్తూ ఉంటాడు. ఇతరుల భార్యని అపహరించి తమ వాంఛలను తీర్చుకునే వారిని ఆపకుండా పాములతో కరిపిస్తూ ఉంటారు.. తప్త సూర్మి వావి వరసలు మరిచి వరుస కాని వారితో శృం.. చేసే వారికి ఈ శిక్షను అమలు చేస్తారు. ఇలా చేసిన వారిని లోహంతో చేయబడిన పురుష స్త్రీ రూపాలను సలసలా మరిగించి వాటిని కౌగిలించుకునేలా చేస్తారు. బ్రాహ్మణులు పేదలను హింసిస్తూ వారి ఆభరణాలను దోచుకునే వారికి ఈ శిక్షను విధిస్తారు.
ఇక్కడ పాపి శరీరాన్ని కణకణా మండే ఇనుప కడ్డీలు మీద ఉంచి సూదిగా ఉన్న ఇనుప పూజలతో గుచ్చుతూ దండిస్తారు. ఇక్కడ పదునైన ముళ్ళు ఉన్న బూరుగు చెట్టు మీదకి కించి తాళ్లతో మెడకు బిగించి కిందకు లాగుతారు. గాడిదలను పెంచి వేటనే వృత్తిగా పెట్టుకున్న బ్రాహ్మణులను ఇక్కడ అంప కోలాల చే వేటాడి క్రూరంగా హింసిస్తారు. ఇక లాలా భాక్ష ఎవరైతే వారి భార్యను తన అవసరానికి వాడుకుని డబ్బు సంపాదిస్తారో.. అలాంటి వారికి ఏ సెక్షన్ విధిస్తారు. ఇక్కడ వీర్యముతో నిండిన పెద్ద చెరువులో పడవేసి దానిని తగిస్తారు.. ఆచారములను సక్రమంగా పాటించని వారిని ఇక్కడ మలమూత్రాదులచే నిండిన చెరువున పడవేస్తారు. ఇక 17వది సారమే యువతరం ఊరు మీద పడి దోచుకొనుట విషము పెట్టుట.m వంటి పాపములు చేసిన వారిని చాకులాంటి పదునైన పళ్ళు కలిగిన 700 కుక్కల మధ్యలో పాడవేసి వాటితో వారిని కరిపిస్తారు.. సూలాప్రోధము జంతువులను హింసిస్తూ వాటితో డబ్బు సంపాదించే వారికి ఈ శిక్షను విధిస్తారు. ఇక్కడ పాపిని ఉరికంబానికి వేలాడు తీసి సూలాలతో శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి వారి మాంసాన్ని కాకులకు గద్దలకు ఆహారంగా వేస్తారు..
50MP కెమెరా,11GB RAM తో Poco C55 స్మార్ట్ ఫోన్ పై భారీ ఆఫర్! ధర రూ.5999 కే
కొత్త POCO C55 స్మార్ట్‌ఫోన్‌పై ఇప్పుడు 50% తగ్గింపు ప్రకటించబడింది. రూ.11,999 గా ఉన్న ఈ డివైజ్ ఇప్పుడు రూ.5,999 కు అందుబాటులో ఉంది. దీన్ని ఎక్కడ కొనుగోలు చేయాలో ఇక్కడ వివరాలు తెలుసుకుందాం.
Poco C55 స్మార్ట్‌ఫోన్ భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గొప్ప బడ్జెట్ సెగ్మెంట్ లో ఉన్న స్మార్ట్‌ఫోన్ పరికరంగా లాంచ్ చేయబడింది. ఈ స్మార్ట్‌ఫోన్ 11GB RAM మరియు 50MP డ్యూయల్ AI కెమెరాతో వస్తుంది. ఇది 5000mAh బ్యాటరీతో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌గా వస్తుంది.
POCO C55 ధర వివరాలు: ప్రస్తుతం, ఎవరూ ఊహించని విధంగా, Poco C55 స్మార్ట్‌ఫోన్ పరికరం యొక్క ధర ఫ్లిప్‌కార్ట్‌లో 50% భారీగా తగ్గించబడింది. దీనితో, ఈ కొత్త Poco C55 పరికరం నేరుగా రూ. 5,999 కు తగ్గింది. సిటీ బ్యాంక్ కస్టమర్‌లు కూడా 10% మరియు రూ.1500 వరకు అదనపు తగ్గింపును పొందుతారు.
POCO C55 స్పెసిఫికేషన్‌ల వివరాలు: POCO C55 స్మార్ట్‌ఫోన్ 120Hz టచ్ శాంప్లింగ్‌తో 6.7″ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ధర వద్ద లభించే అతిపెద్ద డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌లలో POCO C55 ఒకటి. .ఇది అద్భుతమైన డిస్‌ప్లే క్లారిటీని అందిస్తుంది.
స్టోరేజ్: ఈ స్మార్ట్‌ఫోన్ పరికరం 64GB స్టోరేజ్‌తో పాటు 11GB RAMకి సపోర్ట్ చేస్తుంది. దీని అసలు RAM 4GB ఇది 6GB యొక్క రెండు వేరియంట్లలో వస్తుంది. దీని స్టోరేజ్ 64GB మరియు 128GB రెండు N వేరియంట్లలో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో అదనపు స్టోరేజ్ సపోర్ట్ కూడా ఉంది. ఇది 1TB స్టోరేజీ కి మద్దతు ఇస్తుంది.
కెమెరా వివరాలు: ఈ కొత్త POCO C55 స్మార్ట్‌ఫోన్ పరికరం యొక్క కెమెరా ఫీచర్ గురించి మాట్లాడుతూ, ఇది 50MP ప్రధాన కెమెరాతో AI కెమెరా ఫీచర్‌ను కలిగి ఉంది. వెనుక భాగంలో, ఈ పరికరం 5MP సెల్ఫీ స్నాపర్ కెమెరాను కలిగి ఉంది. మరియు POCO C55 స్మార్ట్‌ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ G85 SoC ద్వారా శక్తిని పొందుతుంది.
బ్యాటరీ వివరాలు: ఈ POCO C55 స్మార్ట్‌ఫోన్ పరికరం ఆండ్రాయిడ్ 12తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌కు మద్దతు ఇస్తుంది. POCO C55 స్మార్ట్‌ఫోన్ పరికరం 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 39 గంటల డాక్ సమయాన్ని కూడా అందిస్తుంది. అలాగే, ఇది 27 గంటల వీడియో వీక్షణ అనుభవాన్ని కూడా అందిస్తుంది
POCO C55 స్మార్ట్‌ఫోన్ హై-గ్రాఫిక్స్ గేమ్‌లను ఆడుతున్నప్పుడు 10.5 గంటల బ్యాటరీ జీవితాన్ని అందిస్తుందని కంపెనీ ప్రచారం చేసింది. ఈ ధరలో అటువంటి బలమైన్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశం. కాబట్టి, ఈ అవకాశాన్ని కోల్పోకండి మరియు ఇప్పుడే ఆర్డర్ చేయండి.
Viral Video: ఏపీలో వండర్ కిడ్.. వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన 4 నెలల చిన్నారి..
Viral Video: ఏపీలో వండర్ కిడ్.. వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన 4 నెలల చిన్నారి..
ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన ఓ పాప నాలుగు నెలల వయసులో వండర్ క్రియేట్ చేస్తోంది. ఒకటి, రెండు వస్తువులు కాదు ఏకంగా 120 వస్తువులను గురించి చెప్పి వరల్డ్ రికార్డ్ సాధించింది. ఆ చిన్నారి కంటి చూపు మెరుగుపర్చడం కోసం సన్నిహితుల సలహాతో బ్లాక్ అండ్ వైట్ కార్డులను చూపించడం మొదలుపెట్టారు పాప తల్లి.
ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన ఓ పాప నాలుగు నెలల వయసులో వండర్ క్రియేట్ చేస్తోంది. ఒకటి, రెండు వస్తువులు కాదు ఏకంగా 120 వస్తువులను గురించి చెప్పి వరల్డ్ రికార్డ్ సాధించింది. ఆ చిన్నారి కంటి చూపు మెరుగుపర్చడం కోసం సన్నిహితుల సలహాతో బ్లాక్ అండ్ వైట్ కార్డులను చూపించడం మొదలుపెట్టారు పాప తల్లి. తన కుమార్తె ఆ కార్డులను శ్రద్ధగా చూస్తుండటాన్ని గమనించి మరింత తర్పీదునిచ్చింది. పిట్ట కొంచెం కూత ఘనం అనే పదానికి నిదర్శనం ఈ పాప. ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన రమేష్, హోమ దంపతుల కుమార్తె కైవల్య 4 నెలల వయస్సులోనే 120 రకాల పక్షులు, కూరగాయలు, పండ్లు, జంతువులు, పూలు ఫోటోలను గుర్తుపట్టగలుగుతుంది. ఈ విషయం తెలుసుకున్న తల్లి తండ్రులు ఆశ్చర్యానికి గురయ్యారు. పుట్టిన నాలుగు నెలల కాలంలోనే ఈ ఘనత సాధించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని పాప తల్లిదండ్రులు చెపుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరిలో ఎదో ఒక టాలెంట్ ఉంటుంది. తన కూతురులో ఉన్న టాలెంట్ బయటకు తీయాలనే ఉద్దేశంతో ఒక ప్రయోగం చేశానన్నారు పాప తల్లి హోమ.
చిన్న వయసులోనే పాపకు అన్ని రకాల జంతువులు, కూరగాయలు, ఫ్రూట్స్ ఇతరత్రా వాటిని గుర్తు పట్టే విధంగా తాను చేసిన ప్రయోగం సత్ఫలితాన్ని ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల వయసులో బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను చూపించానని చెప్పారు. అప్పుడు పాపలో చురకు తనాన్ని చూసి నాలుగో నెల నుంచి కలర్ ఫోటోలో ఉన్న 120 రకాల జంతువులు, పండ్లు, కూరగాయలు, పూలు ఫోటోలను చూపిస్తుంటే పాప వాటిని చేత్తో పట్టుకొని గుర్తు పడుతోందని వివరించారు. దీనిని గమనించి తల్లి తండ్రులు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు పంపగా వారు తిరస్కరించారు. తన పాపకు ఉన్న టాలెంట్ ఎలాగైనా బయటకు తీయాలన్న పట్టుదలతో నోబెల్ వరల్డ్ రికార్డ్స్‌కు అప్లై చేయడంతో వారు పాప వీడియో పంపాలని సూచించినట్లు తెలిపారు. పాప గుర్తు పట్టే బొమ్మల వీడియోలు నోబెల్ వరల్డ్ రికార్డ్స్‌కు పంపామని.. వారం రోజుల వ్యవధిలో వారు పాప టాలెంట్ గుర్తించి వరల్డ్ రికార్డ్స్‌కు సెలెక్ట్ అయినట్లు చెప్పారన్నారు. ఈ విషయం తమకు తెలియడంతో ఆనందానికి అవధులు లేకుండా పోయాయని పాప తల్లిదండ్రులు చెపుతున్నారు. రెండు రోజులు క్రితం నోబెల్ వరల్డ్ రికార్డ్ సంబంధించిన సర్టిఫికెట్, పతకాన్ని తమకు అందాయని కుటుంబ సభ్యులు తెలిపారు. టాలెంట్ ఉంటే ఎంతటి అవరోధాన్ని అయిన అందుకోవచ్చు అనే దానికి నిదర్శనం మా 4 నెలల పాప కైవల్య అని భావిస్తున్నామన్నారు తల్లి తండ్రులు.
Popular Chief Minister: దేశంలోనే అత్యంత పాపులర్ సీఎం ఎవరంటే..?
దేశంలో అత్యంత ప్రజాదారణ కలిగిన ముఖ్యమంత్రుల జాబితా ఒకటి తాజాగా వెల్లడైంది. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో నిర్వహించిన సర్వేలో అత్యంత ప్రజాదారణ కలిగిన ముఖ్యమంత్రులు జాబితాలో ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు 52.7 శాతం ఓట్లతో మొదటి స్థానంలో నిలించారు.
వివాదరహితుడుగా ఉన్న నవీన్ పట్నాయక్‌కు ప్రజలు బెస్ట్ ముఖ్యమంత్రిగా పట్టంకట్టారు. ఆ తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రెండో స్థానంలో నిలించారు. ఈయనకు 51.3 శాతం మంది ప్రజలు రేటింగ్ ఇచ్చారు.
ఆ తర్వాతి స్థానంలో 48.6 శాతం ఓట్లతో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వాశర్మ మూడో స్థానంలో నిలువగా, నాలుగో స్థానంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పాటిల్ 42.6 శాతం ఓట్లు, త్రిపుర ముఖ్యంమత్రి మాణిక్ సాహుకు 41.4 శాతం ఓట్లు దక్కాయి. ఆయన అత్యంత ప్రజాదారణ కలిగిన ముఖ్యమంత్రుల జాబితాలో ఐదో స్థానంలో నిలించారు.
మాణిక్ సాహా తర్వాతి స్థానంలో 41.1 శాతం ఓట్లతో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, 40.1 శాతం ఓట్లతో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిలు ఈ జాబితాలో ఆరు, ఏడు స్థానాల్లో నిలించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాత్రం ఎనిమదో స్థానం దక్కింది. ఈయనకు 36.5 శాతం మాత్రమే రేటింగ్ వచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు 35.8 శాతం రేటింగ్‌తో తొమ్మిదో స్థానంలో నిలువగా, 32.8 శాతం ఓట్లతో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పదో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో గత నాలుగున్నరేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి చోటే దక్కలేదు.
మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతి
టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన డ్రగ్ ఇన్‌స్పెక్టర్ రాత పరీక్షలో జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన బెజ్జారపు మౌనిక ప్రథమ ర్యాంకు సాధించారు. శుక్రవారం రాత్రి విడుదల చేసిన ఫలితాల్లో 450 మార్కులకు 348 మార్కులతో రాష్ట్రంలో ప్రథమ స్థానాన్ని సాధించారు. హైదరాబాద్‌లో బీఫార్మసీ, అస్సాంలో ఎంఫార్మసీ పూర్తిచేశారు. పంచాయతీ కార్యదర్శిగా ఆరు నెలలు పనిచేసి కేంద్రం నిర్వహించిన ఫార్మసిస్టు ఉద్యోగ పరీక్షలో ప్రథమ స్థానం సాధించి హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐలో ఉద్యోగం చేస్తున్నారు. ప్రస్తుతం డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగానికి ఎంపిక కావడంతో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన మౌనికను పలువురు అభినందించారు.
షర్మిలకు మరో రెండు పార్టీల మద్దతు!
ఏపీలో కాంగ్రెస్ ఒంటరి కాదు. 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తామని ఇటీవల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీతో మరో రెండు జాతీయ పార్టీలు పొత్తు పెట్టుకోనున్నాయి. ఈ విషయాన్ని సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ తెలిపారు.
ఇండియా కూటమిలో కాంగ్రెస్, వామపక్ష పార్టీలున్న సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు కుదుర్చుకుని ఒక సీటులో పోటీ చేసి గెలుపొందింది. సీపీఎం ఎక్కువ ఆశించి భంగపడింది. ఏపీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీతో ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోడానికి సిద్ధపడ్డాయి. సీపీఐ నాయకుడు నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని మోదీ అడుగులకు చంద్రబాబు, జగన్ మడుగులొత్తుతున్నారని విమర్శించారు.
ఏపీలో టీడీపీ, వైసీపీలకు వ్యతిరేకంగా పోటీ చేస్తామని ఆయన అన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని సీపీఐ, సీపీఎం ఎన్నికల బరిలో దిగుతామని ఆయన తెలిపారు. నిజానికి టీడీపీతో అవగాహన కుదుర్చుకుని ఎన్నికల బరిలో దిగాలని సీపీఐ ఆలోచించింది. అయితే బీజేపీతో చంద్రబాబు అంటకాగుతుండడంతో పొత్తు సాధ్యం కాదనే నిర్ణయానికి సీపీఐ వచ్చింది. అందుకే ఇప్పుడు యూటర్న్ తీసుకుని మళ్లీ టీడీపీ, వైసీపీలను విమర్శించడం మొదలు పెట్టారు.
ఏపీలో షర్మిల రాకతో కాంగ్రెస్‌కు ఆదరణ పెరిగిందని ఇతర పార్టీలు అంచనా వేస్తున్నాయి. కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికలకు వెళితే… టీడీపీ, వైసీపీలను తూర్పారపట్టొచ్చని వామపక్షాలు అనుకుంటున్నాయి. అయితే ఇప్పటికే 20 నుంచి 30 స్థానాల్లో పోటీ చేస్తామని సీపీఎం నేతలు ప్రకటించారు. కాంగ్రెస్‌తో పొత్తుకు సీపీఎం ఏ మేరకు ముందుకొస్తుందో చూడాలి.
AP CETS 2024 Schedule: ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్స్ విడుదల-తేదీలివే..!
ఏపీలో ఈ ఏడాది నిర్వహించే పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్స్ ను ఉన్నత విద్యామండలి ఇవాళ విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరానికి అంటే 2024-25కు వివిధ విద్యాసంస్ధల్లో ప్రవేశాల కోసం ఈ ఉమ్మడి పరీక్షలను నిర్వహించనున్నారు. ఇందులో ఈఏపీసెట్, ఐసెట్, లాసెట్, ఈసెట్, ఎడ్ సెట్, పీజీ సెట్, పీజీ ఈసెట్, పీఈ సెట్ వంటి పరీక్షలు ఉన్నాయి. వీటిని ఏయే వర్శిటీలు నిర్వహించనున్నాయి, కన్వీనర్లు ఎవరన్న వివరాలనూ ప్రకటించారు.
వచ్చే విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్ , ఫార్మసీ కోర్సులకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈఏపీసెట్ ను కాకినాడ జేఎన్టీయూ నిర్వహించనుంది. అలాగే ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈసెట్ ను అనంతపురం జేఎన్టీయూ నిర్వహించనుంది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల కోసం నిర్వహించే ఐసెట్‌ను శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నిర్వహించనుంది. అలాగే పీజీఈసెట్ ను వెంకటేశ్వర యూనివర్సిటీ, ఎడ్ సెట్‌ను ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహించనున్నాయి.
అలాగే లా సెట్ ను నాగార్జున యూనివర్సిటీ, పీఈ సెట్‌ను నాగార్జున యూనివర్సిటీ, పీజీ సెట్‌ను ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహించబోతున్నాయి. మరోవైపు ఎడ్ సెట్‌ను వైఎస్సార్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ నిర్వహిస్తుంది. ఈ పరీక్షలన్నీ ఆన్ లైన్ విధానంలోనే నిర్వహించనున్నారు. ఈఏపీసెట్ ను మే 13 నుంచి 13 వరకూ నిర్వహిస్తారు. ఈసెట్ ను మే 8న నిర్వహిస్తారు. ఐసెట్ ను మే 6న, ఎడ్ సెట్ ను జూన్ 8న, లాసెట్ ను జూన్ 9న, పీజీ సెట్ ను జూన్ 3 నుంచి 7 వరకూ నిర్వహిస్తారు. ఏడీసెట్ ను జూన్ 13న నిర్వహిస్తారు.
షర్మిల కుమారుడి వివాహ వేడుకకు జగన్ దూరం
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తనయుడు వైఎస్ రాజారెడ్డి వివాహ వేడుకకు షర్మిల సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకాలేదు.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తనయుడు వైఎస్ రాజారెడ్డి వివాహ వేడుకకు షర్మిల సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకాలేదు. రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో శనివారం షర్మిల తనయుడి వివాహం జరిగింది. కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన వేడుకకు వైఎస్ విజయమ్మతో సహా సన్నిహితులు హాజరయ్యారు.
వైయస్ షర్మిల రెడ్డి కుమారుడి ఎంగేజ్మెంట్ వేడుక జనవరి 18వ తేదీన హైదరాబాద్లోని గండిపేటలో ఉన్న గోల్కొండ రిసార్ట్స్ లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు వైఎస్ షర్మిల సోదరుడైన ఏపీ సీఎం జగన్ తో పాటు, పవన్ కళ్యాణ్ తదితరులు కూడా హాజరయ్యారు.
LIC Amritbaal: ఎల్‌ఐసీ నుంచి కొత్త చిల్డ్రన్ ప్లాన్.. ఐదేళ్లు కడితే చాలు!
LIC launches Amritbaal: ఎల్‌ఐసీ కొత్త చిల్డ్రన్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. అమృత్‌బాల్ పేరిట దీన్ని విడుదల చేసింది. చిన్నారుల ఉన్నత విద్య కోసం నిధిని సమకూర్చుకోవాలనుకునే వారి కోసం ఈ పాలసీని విడుదల చేసింది.
LIC launches Amritbaal | ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మరో కొత్త పాలసీని ప్రవేశపెట్టింది. పిల్లల చదువుల కోసం దీర్ఘకాలంలో మదుపు చేయాలనుకునే వారి కోసం ‘అమృత్‌బాల్’ (ప్లాన్ నం.874) (LIC Amritbaal) పేరిట కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఇదో నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్, సేవింగ్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఫిబ్రవరి 17 నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది.
ప్రధాన ఫీచర్లు..
పిల్లల ఉన్నత చదువులను దృష్టిలో పెట్టుకునే తల్లిదండ్రుల కోసం ఎల్‌ఐసీ ఈ పాలసీని తీసుకొచ్చింది. ఇందులో అతితక్కువ పాలసీ చెల్లింపు కాలవ్యవధి ఉంటుంది. ఒకేసారి చెల్లించే ఆప్షన్ కూడా ఉంది. పైగా ఆకర్షణీయమైన గ్యారెంటీడ్ అడిషన్ (వెయ్యి రూపాయలకు రూ.80) అందిస్తారు. ప్రీమియం కాలవ్యవధిలో బీమా హామీ కూడా ఉంటుంది. పిల్లల ఉన్నత చదువుల కోసం ఎక్కువ మొత్తం అవసరమయ్యే 18-25 ఏళ్ల వయసు మధ్య పాలసీ మెచ్యూర్ అవుతుంది. దీంతో చిన్నారుల ఉన్నత చదువులకు అవసరమయ్యే నిధిని సమకూర్చుకోవడానికి వీలు పడుతుంది. రైడర్లను కూడా యాడ్ చేసుకోవచ్చు.
పూర్తి వివరాలు..
చిన్నారుల కోసం ఉద్దేశించిన ఈ పాలసీని 30 రోజుల చిన్నారి పేరు మీద కూడా తీసుకోవచ్చు. గరిష్ఠ వయో పరిమితి 13 ఏళ్లు. మెచ్యూరిటీ కనిష్ఠ వయసు 18 ఏళ్లు కాగా.. గరిష్ఠ వయస్సును 25 ఏళ్లుగా ఎల్‌ఐసీ నిర్ణయించింది.
అతి తక్కువ ప్రీమియం చెల్లింపు కాలవ్యవధి ఉంటుంది. 5, 6, 7 ఆప్షన్లు ఎంచుకోవచ్చు. పాలసీ టర్మ్ కనీసం 10 ఏళ్లు ఉంటుంది. గరిష్ఠంగా 25 ఏళ్లు ఎంచుకోవచ్చు.
ఇందులో సింగిల్ ప్రీమియం చెల్లించే ఆప్షన్ కూడా ఉంది. ఒకవేళ ఈ ఆప్షన్ ఎంచుకుంటే.. కనీస పాలసీ టర్మ్ 5 ఏళ్లు ఉంటుంది. గరిష్ఠంగా 25 ఏళ్ల పాలసీ టర్మ్‌ను కూడా ఎంచుకోవచ్చు.
కనీస సమ్ అష్యూర్డ్‌పై రూ.2 లక్షలుగా నిర్ణయించారు. గరిష్ఠ మొత్తంపై పరిమితి లేదు. విద్యా అవసరాలను దృష్టిలో పెట్టుకుని, చెల్లింపు సామర్థ్యం ఆధారంగా మీకు నచ్చిన మొత్తాన్ని ఎంచుకోవచ్చు.
ఎంచుకున్న బీమా హామీ (సమ్ అష్యూర్డ్) మొత్తానికి ప్రతి వెయ్యి రూపాయలకు రూ.80 చొప్పున ఏటా పాలసీ చెల్లుబాటులో ఉన్నంత కాలం యాడ్ అవుతూ వస్తుంది.
పాలసీ చెల్లించే సమయంలో పాలసీదారుడికి జరగరానిది ఏదైనా జరిగితే డెత్ బెన్‌ఫిట్స్ కూడా నామినీకి అందిస్తారు. సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్‌తో పాటు, గ్యారెంటీడ్ అడిషన్స్ కింద అప్పటి వరకు జమ అయిన మొత్తాన్ని చెల్లిస్తారు.
ఈ పాలసీకి రైడర్లను కూడా జత చేసుకోవచ్చు. ప్రీమియం బెన్‌ఫిట్ రైడర్‌ను గనుక ఎంచుకుంటే.. ఒకవేళ ప్రపోజర్‌కు జరగరానిది ఏదైనా జరిగితే మిగిలిన కాలవ్యవధికి గాను ఆ మొత్తాన్ని ఎల్‌ఐసీనే చెల్లిస్తుంది.
8 ఏళ్లలోపు చిన్నారులపై పాలసీ తీసుకుంటే.. 2 ఏళ్ల పాలసీ గడువు తర్వాత లేదా చిన్నారికి 8 ఏళ్లు వచ్చాక (ఏది ముందైతే అది) బీమా హామీ ప్రారంభం అవుతుంది. 8 ఏళ్లు పైబడిన వారికి తీసుకుంటే.. పాలసీ జారీ చేసిన నాటి నుంచే రిస్క్ కవరేజీ అందిస్తామని ఎల్‌ఐసీ పేర్కొంది.
ఈ పాలసీ కింద రుణ సదుపాయం కూడా ఉంది. ఈ ప్లాన్‌ను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయొచ్చు. నెలవారీ, మూడు నెలలకోసారి, అర్ధ సంవత్సరానికి, ఏడాదికోసారి చొప్పున ప్రీమియం చెల్లించే వెసులుబాటు ఉంది.
పాలసీ ఉదాహరణతో..
5 ఏళ్ల బాబు పేరు మీద రూ.5 లక్షల సమ్ అష్యూర్డ్‌పై పాలసీ తీసుకున్నారనుకుందాం. ప్రీమియం టర్మ్ 7 ఏళ్లు, పాలసీ టర్మ్ 20 ఏళ్లు ఎంచుకున్నారనుకుందాం. అప్పుడు ఏటా రూ.73,625 (జీఎస్టీ అదనం) చొప్పున ఏడేళ్ల పాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఆపై 20 ఏళ్ల పాటు అంటే బాబుకు 25వ ఏడాది వచ్చే వరకు పాలసీ కొనసాగుతుంది. చెల్లించిన మొత్తం రూ.5.15 లక్షలు కాగా.. గ్యారెంటీడ్ అడిషన్స్ కింద రూ.8 లక్షలు సమకూరుతుంది. మెచ్యూరిటీ కింద రూ.13 లక్షలు అందుతుంది.
పూర్తి వివరాలకు ఎల్‌ఐసీ ఏజెంట్‌ను లేదా ఎల్‌ఐసీ సేల్స్ బ్రోచర్‌ను చూడండి..
ఒకే యువకుడు.. నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు
ఒకే యువకుడు.. నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు
ప్రభుత్వ ఉద్యోగాలకు విపరీతమైన పోటీ ఉన్న ఈ రోజుల్లో ఒక ఉద్యోగం సాధించాలంటే ఎంతో కష్టపడాలి.
ప్రభుత్వ ఉద్యోగాలకు విపరీతమైన పోటీ ఉన్న ఈ రోజుల్లో ఒక ఉద్యోగం సాధించాలంటే ఎంతో కష్టపడాలి. అలాంటిది.. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం సూరిపల్లి గ్రామానికి చెందిన రంజిత్ ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికై ఔరా అనిపిస్తున్నారు. గ్రామానికి చెందిన వేణుగోపాల్-అరుణ దంపతుల పెద్ద కుమారుడు రంజిత్. ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడి చదివారు. ఏడు నెలల క్రితం రైల్వేశాఖలో టెక్నీషియన్ ఉద్యోగం, అనంతరం ఎక్సైజ్ పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు. ఇటీవల ప్రకటించిన గ్రూప్-4 ఫలితాల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. తాజాగా శనివారం ప్రకటించిన టౌన్ ప్లానింగ్ అధికారి పరీక్ష ఫలితాల్లో ఉద్యోగం పొందారు. రంజిత్ ప్రస్తుతం ఎక్సైజ్ పోలీసు కానిస్టేబుల్ శిక్షణలో ఉన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారి ఉద్యోగంలో చేరనున్నట్లు తెలిపారు. నాలుగు ఉద్యోగాలు సాధించిన రంజిత్‌ను గ్రామస్థులతో పాటు పలువురు అభినందించారు.
ఆ గుహలోకి వెళ్లడమంటే.. ప్రాణాలపై ఆశ వదిలేసుకోవడమే!
Veryovkina Cave The World Deepest Cave In Georgia
ఎన్నో గుహలు చూసుంటారు. గుహ అన్వేషకులు వాటన్నింటి చూసుండొచ్చు కానీ ఈ గుహ జోలికి మాత్రం పోయుండరు. ఎందుకంటే వెళ్తే తిరిగి రావడం అంటూ లేని వింత గుహ. ఆ గుహను బయటి నుంచే చూస్తే హడలిపోతాం. ఇక లోపలకి వెళ్లే సాహసం చేస్తే ఇంక అంతే సంగతులు. ఆ గుహ ఎక్కడుందంటే..
ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైన గుహ. జార్జియాలోని నల్లసముద్ర తీరానికి చేరువలో ఉన్న ఈ గుహ మృత్యుగుహగా పేరుమోసింది. క్రాస్నోయార్‌స్క్‌కు చెందిన గుహాన్వేషకులు కొందరు దీనిని 1968లో తొలిసారిగా గుర్తించారు. వెరియోవ్‌కినా అనే ఈ గుహ 7,293 అడుగుల లోతు ఉంటుంది. బయట నిలబడి దీని లోపలకు చూపు సారిస్తే, లోపలంతా చీకటిగా భయంగొలిపేలా కనిపిస్తుంది. దాదాపు గడచిన యాబై ఏళ్లలో ముప్పయిసార్లు గుహాన్వేషకులు ఈ గుహ లోపలి చివరి వరకు వెళ్లడానికి ప్రయత్నించారు.
ఈ ప్రయత్నాల్లో కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకోవడంతో దీనికి మృత్యుగుహ అనే పేరు స్థిరపడింది. పలుసార్లు ఈ గుహలో గుహాన్వేషకుల మృతదేహాలు బయటపడ్డాయి. చివరిసారిగా 2021లో సెర్జీ కోజీవ్ అనే రష్యన్ గుహాన్వేషకుడి మృతదేహం ఈ గుహలో మూడువేల అడుగుల లోతు వద్ద కనిపించగా, దానిని వెలికితీశారు. గుహ లోపల దిగువకు వెళ్లే కొద్ది ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లోకి పడిపోతాయి. ఈ పరిస్థితుల్లో అడుగు భాగానికి చేరుకునే ప్రయత్నంలో హైపోథెర్మియాకు లోనై గుహాన్వేషకులు మరణిస్తున్నారని, తగిన జాగ్రత్తలు లేకుండా, ఈ గుహ అడుగుభాగానికి చేరుకోవాలని ప్రయత్నించడమంటే కోరి చావును కొని తెచ్చుకోవడమేనని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
హోమ్‌లోన్‌పై గుడ్‌న్యూస్.. త్వరలో కొత్త రుణాలు ..వివరాలు
దేశంలో అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ హోమ్ లోన్‌పై గుడ్‌న్యూస్ చెప్పింది. కస్టమర్లకు త్వరలో రెండు కొత్త లోన్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇందులో ‘హోమ్ సేవర్ ప్రొడక్ట్’ పేరిట ఓ లోన్‌ను ఏప్రిల్‌లో, హోమ్ రిఫర్బిష్‌మెంట్ లోన్‌లను రాబోయే నెలల్లో ప్రారంభించాలని యోచిస్తోందని బ్యాంక్ సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు.
హోమ్ సేవర్ ప్రొడక్ట్ అనేది ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం లాంటిది. ఎస్‌బీఐ అందిస్తున్న మ్యాక్స్‌గెయిన్ హోమ్ లోన్ స్కీమ్‌కి పోటీగా దీన్ని భావించవచ్చు. ఇక హోమ్ రీఫర్బిష్‌మెంట్ లోన్ విషయానికి వస్తే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో విలీనానికి ముందు హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ ఈ లోన్‌ను అందించేది. ఇప్పుడు ఈ లోన్‌ను త్వరలో పునఃప్రారంభిస్తున్నారు.
ఈ రెండు లోన్లు ఇప్పటికే ఉన్న కస్టమర్లతోపాటు కొత్త కస్టమర్లకు అందించనున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్టగేజ్ బ్యాంకింగ్, హోమ్ లోన్, ల్యాప్ కంట్రీ హెడ్ అరవింద్ కపిల్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. అయితే బ్యాంకు గృహ రుణాలపై వసూలు చేసే రేటు కంటే హోమ్ రిఫర్బిష్‌మెంట్ లోన్ 100 బేసిస్ పాయింట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రస్తుతం ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటుతో లింక్ అయిన గృహ రుణాలపై 8.55 నుంచి 9.10 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. కాగా ఇప్పటివరకూ ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ సర్వీస్ సెంటర్లను దశలవారీగా బ్యాంక్ బ్రాంచ్‌లుగా మార్చబోతున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పేర్కొంది.
Guava జామకాయే కదా ఏం చేస్తుందిలే అనుకోకండి.. ఇది ఎన్ని సమస్యలను తగ్గిస్తుందో తెలుస్తే షాకే?
జామకాయను ఇష్టపడని వారుండరు. నిజానికి ఇది టేస్టీగా ఉండటమే కాదు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అవును జామకాయను తినడం వల్ల ఎన్నో రోగాల ముప్పు తప్పుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
జామకాయను తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయంటే?
మనం ఎక్కువగా తినే పండ్ల లీస్ట్ లో ఆపిల్, బనానా, పైనాపిల్, మామిడి, బొప్పాయి, ద్రాక్షలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ మన చుట్టూ ఉన్నా మనం తినని పండ్లు జామకాయ. అవును ఇవి మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉన్నా.. వీటిని మాత్రం తినరు. ఎందుకంటే ఇవి మన ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేయవని. కానీ ఇవి మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతాయి తెలుసా? అసలు ఈ పండును తింటే మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
జామకాయల్లో విటమన్ సి మెండుగా ఉంటుంది. జామకాయలో విటమిన్ సి నారింజ కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది తెలుసా? ఈ విటమిన్ సి మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. దీంతో అంటువ్యాధులు, ఇతర రోగాలకు మనం దూరంగా ఉంటాం. శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
జీర్ణక్రియకు సహాయపడుతుంది
జామకాయల్లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఒక జామకాయలో 3 గ్రాముల ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఈ ఫైబర్ ప్రేగు కదలికలను నియంత్రించడానికి సహాయపడుతుంది. మలబద్దకం సమస్య రాకుండా చేస్తుంది.
డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది
ప్రపంచ వ్యాప్తంగా డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ సమస్య మనకు రావొద్దంటే ప్రతిరోజూ శారరీక శ్రమ చేయడంతో పాటుగా ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. జామకాయల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఎంతో సహాయపడుతుంది. దీన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెరగవు.
గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది
జామకాయ కూడా మన గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. దీనిలోని పొటాషియం గుండెను సంరక్షిస్తుంది. పొటాషియం ముఖ్యమైన ఖనిజం. ఇది అధిక రక్తపోటును నియంత్రించేందుకు సహాయపడుతుంది. అలాగే గుండె ఆరోగ్యాన్నికాపాడుతుంది.
యాంటీ క్యాన్సర్ గుణాలు
జామకాయలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి క్యాన్సర్ తో పోరాడుతాయి. జామకాయల్లో లైకోపీన్ మెండుగా ఉంటుంది. ఇది క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ పండు కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
జామకాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంతో పాటుగా మన చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. మన చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంచే కొల్లాజెన్ ఉత్పత్తికి విటమిన్ సి అవసరం. ఇది మన చర్మాన్ని దృఢంగా ఉంచుతుంది. చర్మ సమస్యలను తగ్గిస్తుంది.
Oats – ఓట్స్ ఎవరెవరు తినకూడదు.. వారికి ఎందుకు డేంజర్
ఓట్స్ ఎవరెవరు తినకూడదు.. వారికి ఎందుకు డేంజర్
ఓట్స్( Oats ).. వీటి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఇటీవల కాలంలో ఓట్స్ వినియోగం భారీగా పెరిగింది. ఓట్స్ తో ఉప్మా, ఇడ్లీ, దోశ, స్మూతీ ఇలా రకరకాల వంటలు తయారు చేసుకుని తింటున్నారు.
ముఖ్యంగా బరువు తగ్గాలని భావించేవారు తప్పకుండా డైట్ లో ఓట్స్ ఉండేలా చూసుకుంటున్నారు. ఎందుకంటే, వెయిట్ లాస్ కు ఓట్స్ చక్కగా తోడ్పడతాయి. అదే సమయంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి.అయితే ఓట్స్ ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ.. కొందరు మాత్రం వాటిని తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మరి ఇంతకీ ఆ కొందరు ఎవరు..? వారికి ఎందుకు ఓట్స్ డేంజర్..? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు ఓట్స్ ను ఎవైడ్ చేయడమే మంచిది.
ఎందుకంటే ఓట్స్ లో ఫాస్పరస్ ఉంటుంది. ఇది కిడ్నీ వ్యాధులను మరింత అధికం చేస్తుంది.
అలాగే కొందరికి ఓట్స్ తిన్న ప్రతిసారి కడుపు ఉబ్బరం, అజీర్తి, గ్యాస్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు( Digestive problems ) తలెత్తుతుంటాయి. అలాంటి వారు కూడా ఓట్స్ ను తినకపోవడం ఉత్తమం. మధుమేహం వ్యాధితో బాధపడుతున్న వారు ఓట్స్ ను చాలా అంటే చాలా మితంగా తీసుకోవాలి.
ఎందుకంటే ఓట్స్ లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ తప్పేలా చేస్తాయి. అందుకే మధుమేహం ఉన్న వారు ఓట్స్ ను తక్కువగా తీసుకోలేదు. లేదా దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక మిగతా వారు మాత్రం ఓట్స్ ను ఎలాంటి భయం లేకుండా రెగ్యులర్ గా తీసుకోవచ్చు.
ఓట్స్ గుండె సంబంధిత జబ్బులకు అడ్డుకట్ట వేస్తుంది. అది ఆకలిని దూరం చేసే శరీరాన్ని ఎక్కువ సమయం పాటు శక్తివంతంగా ఉంచుతుంది. రక్తపోటు అదుపులో ఉండేలా చూస్తుంది. మరియు వేగంగా బరువు తగ్గడానికి సైతం గ్రేట్ గా సహాయపడుతుంది.
SUV Under 6 Lakh: క్రెటా, గ్రాండ్ విటారాలకు చెక్ పెట్టేసిన రూ. 6లక్షల కార్.. భద్రతలోనే కాదండోయ్ ఫీచర్లలోనూ నెంబర్ వన్..!
SUV Under 6 Lakh: భారత మార్కెట్లో సరసమైన SUVలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ విభాగంలో, ప్రజలు టాటా పంచ్, మారుతి బ్రెజ్జా, నెక్సాన్‌లను బాగా ఇష్టపడుతున్నారు.
ఈ మూడు కార్ల మధ్య విక్రయాల్లో తీవ్ర పోటీ నెలకొంది. గత నెలలో టాటా మోటార్స్ మినీ SUV పంచ్ అమ్మకాలలో కొత్త రికార్డును సృష్టించింది.
జనవరి 2024లో, మారుతీ బాలెనో తర్వాత దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా టాటా పంచ్ నిలిచింది. టాటా ఈ మినీ SUV జనవరిలో 17,978 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో ఈ ఎస్‌యూవీ 12,006 యూనిట్లను విక్రయించింది. టాటా నెక్సాన్ విక్రయాలు 17,182 యూనిట్లుగా ఉన్నాయి.
ఇటీవలే కంపెనీ దీనిని సన్‌రూఫ్‌తో కూడిన CNG వేరియంట్‌లో విడుదల చేసింది. CNG కారణంగా ఇది ఇప్పుడు అమలు చేయడానికి ఆర్థికంగా మారింది. టాటా నుంచి ఈ 5-సీటర్ SUV 5-స్టార్ గ్లోబల్ NCAP సేఫ్టీ రేటింగ్‌తో వస్తుంది.
పంచ్ ధర రూ. 6 లక్షల నుంచి మొదలై రూ. 9.52 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇందులో 366 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. పంచ్ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయించింది. మారుతి అత్యధికంగా అమ్ముడవుతున్న బ్రెజ్జా, బాలెనో, డిజైర్ వంటి కార్లతో నిరంతరం పోటీపడుతోంది. పరిమాణంలో కాంపాక్ట్ అయినప్పటికీ, పంచ్‌లో 5 మంది కూర్చోవడానికి తగినంత స్థలం ఉంది. ఈ కారులో 366 లీటర్ల బూట్ స్పేస్ ఉంది.
టాటా పంచ్ దాని అద్భుతమైన రైడ్ నాణ్యతకు కూడా ప్రసిద్ధి చెందింది. ఆటోమొబైల్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ కారు దాని ధరను పరిగణనలోకి తీసుకుంటే దాని విభాగంలో అత్యుత్తమ హై స్పీడ్, హైవే స్టెబిలిటీని అందిస్తుంది. కారు సస్పెన్షన్ పనితీరు కఠినమైన రోడ్లపై చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే, ఇది అధిక వేగంతో అద్భుతమైన స్థిరత్వాన్ని అందిస్తుంది.
కంపెనీ టాటా పంచ్‌లో 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ని ఉపయోగిస్తోంది. ఈ ఇంజన్ గరిష్టంగా 88 bhp శక్తిని, 115 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ అలాగే 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికను కలిగి ఉంది. టాటా పంచ్ పెట్రోల్‌లో 20.09kmpl, CNGలో 26.99km/kg మైలేజీని అందిస్తుంది.
ఫీచర్ల గురించి మాట్లాడితే, పంచ్‌లో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, ఆటో ఎయిర్ కండిషనింగ్, ఆటోమేటిక్ హెడ్‌లైట్లు, కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత పరంగా, ఇది డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, వెనుక డీఫాగర్, వెనుక పార్కింగ్ సెన్సార్, వెనుక వీక్షణ కెమెరా, ISOFIX యాంకర్ వంటి లక్షణాలను కలిగి ఉంది. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో టాటా పంచ్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కూడా పొందింది.
Biometric Attendance In Schools Uncalled For: CAG
Hyderabad: The state govt has incurred a wasteful expenditure of Rs 29 crore by implementing the Aadhaar-Based Biometric Attendance System (ABAS) to record teacher-student attendance in schools without due feasibility study and assessing technical data requirement, said CAG in its report.
After a lot of deliberations with stakeholders and changes in plans, the govt finally decided in 2018 to implement ABAS in 9,349 schools of 12 selected districts, based on the results of the National Achievement Survey and on the criteria of high dropout rate.
It was decided to provide 12,705 biometric devices and 9,349 IRIS devices at a revised cost of Rs 72 crore. During the review meeting in March 2019, it was observed that only 64 per cent of teacher attendance and up to 16 per cent of student attendance was recorded on the biometric devices for the period Oct 2018-Feb 2019. The huge mismatch in student attendance was attributed to lack of updation of students’ biometric data in the Unique Identification Authority of India (UIDAI) database.
ఏపీ రాష్ట్ర ప్రజలకు శుభవార్త.. త్వరలో భారత్ బియ్యం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ అందింది. కిలో కేవలం రూ. 29కే లభించే భారత్ బియ్యం త్వరలోనే ఏపీకి కూడా రానుంది.
ఇప్పటికే తెలంగాణ, కర్ణాటకలో అమ్మకాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. మరో 10 రోజుల్లోనే ఆంధ్రాలో కూడా మొదలుపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
ఉమ్మడి అనంతపురం కదిరిలో ఇటీవలే విజయవంతంగా ప్రయోగాత్మకంగా ప్రారంభించామని పేర్కొన్నారు. ఎన్సిసిఎఫ్, నాఫెడ్, కేంద్రీయ బండార్ దుకాణాల ద్వారా అమ్మకాలు చేపట్టనున్నట్లు వివరించారు.
బియ్యం రేట్లు కిలో 60 రూపాయలకు చేరిపోయాయి. నగరాల్లో అయితే భగ్గుమంటున్నాయి. ఏటికేడు పెరుగుతున్న బియ్యం రేట్లతో జనం విసిగివేసారిపోయారు. భారత్ రైస్ వారికి మంచి ఆల్టర్ నేటివ్ లా అనిపిస్తోంది. అందుకే.. భారత్ రైస్ కోసం ఆన్ లైన్ లో అప్లే చేసుకుంటున్నారు జనాలు. త్వరలోనే పలు ప్రముఖ రీటైల్ ఔట్ లెట్లలోనూ భారత్ రైస్ 5 కేజీలు, 10 కేజీల బ్యాగుల అమ్మకాలు మొదలుకానున్నాయి.
Black Spots – ముఖంపై ఎలాంటి మచ్చలు ఉన్న ఈ ఒక్క రెమెడీతో పోగొట్టుకోవచ్చు.. తెలుసా
మొటిమలు, ఎండల ప్రభావం, హార్మోన్ల అసమతుల్యత, పిగ్మెంటేషన్ తదితర కారణాల వల్ల ముఖంపై నలుపు లేదా గోధుమ రంగు మచ్చలు ఏర్పడుతుంటాయి. ఇవి ముఖ సౌందర్యాన్ని తీవ్రంగా దెబ్బ తిస్తాయి.
ఈ క్రమంలోనే మార్కెట్లో లభ్యమయ్యే క్రీమ్స్ ను కొనుగోలు చేసి వాడుతుంటారు. అయితే ఆ క్రీమ్స్ లో ఎన్నో రసాయనాలు నిండి ఉంటాయి. అవి చర్మ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. అందుకే కెమికల్స్ తో నిండి ఉండే క్రీమ్స్ ను వాడటం బదులుగా ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ సూపర్ పవర్ ఫుల్ హోమ్ రెమెడీని పాటిస్తే చాలా సులభంగా మరియు సహజంగా మచ్చలను నివారించుకోవచ్చు.
ముఖంపై ఎలాంటి మచ్చలు( Blemishes ) ఉన్నా సరే ఈ ఒక్క రెమెడీ తోనే పోగొట్టుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోయాలి. వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో నాలుగు నుంచి ఆరు లవంగాలు( Clove ), రెండు అనాస పువ్వులు వేసి కనీసం పదిహేను నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత స్టైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకుని చల్లార బెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి( Sandalwood Powder ) వేసుకోవాలి. అలాగే వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ వేసుకుని కలుపుకోవాలి. చివరిగా సరిపడా తయారు చేసుకున్న వాటర్ ను కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి కాస్త మందంగా అప్లై చేసుకుని ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి. రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే కనుక ముఖ చర్మం పై ఎలాంటి మచ్చలు ఉన్నా సరే క్రమంగా మాయం అవుతాయి. క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది. పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల మొటిమల నుంచి విముక్తి లభిస్తుంది. చర్మం ప్రకాశవంతంగా, బిగుతుగా సైతం మారుతుంది.
Mishri: వేసవిలో పటిక బెల్లం వాడితే శరీరానికి ఎంత చలవో తెలుసా?
పటిక బెల్లాన్ని మిశ్రి లేదా ఇండియన్ రాక్ షుగర్ అని పిలుస్తారు. మన తెలుగిళ్లలో ఇది ఉండే అవకాశం ఎక్కువే. ఎందుకంటే దేవునికి ప్రసాదంగా ఎక్కువమంది దీన్నే నివేదిస్తూ ఉంటారు.
పటిక బెల్లం అంటే మరేదో కాదు శుద్ధి చేయని చక్కెర. చెరుకు సిరప్తో తయారు చేసే పదార్థమే ఇది కూడా. అయితే చక్కెర, చెరుకు రసంతో పోలిస్తే పటిక బెల్లంలోనే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ.
సాధారణ చక్కెరకు బదులు పటిక బెల్లాన్ని ఉపయోగించడం వల్ల జీవక్రియకు మేలు కలుగుతుంది. వీటిలో ఇన్ఫ్లమేషన్తో పోరాడే ఖనిజాలు, సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం ఆరు రుచులతో కూడిన భోజనమే ఆరోగ్యకరమైనది. ఇందులో తీపి కూడా ఒక రుచి. ఆ తీపి రుచి కోసం చాలామంది రకరకాల స్వీట్లు తింటూ ఉంటారు. వాటికి బదులు చిన్న ముక్క పటికబెల్లం తినడం మంచిది. ఇది శరీరంపై శీతలీకరణ ప్రభావాన్ని చూపిస్తుంది. శరీరం నుంచి వాత, పిత్త, కఫ అనే మూడు దోషాలను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది.
వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నప్పుడు ఈ పటిక బెల్లంతో రీఫ్రెష్ డ్రింక్ తయారు చేసుకోవచ్చు. పంచదారకు బదులు పటికి బెల్లాన్ని వేస్తే చాలు, ఇది తక్షణ శక్తిని అందిస్తుంది. శరీరానికి ఎలక్ట్రోలైట్స్ను అందించి సమతుల్యం చేస్తుంది. మనసును రిలాక్స్గా ఉంచుతుంది.
జీర్ణ క్రియ వ్యవస్థ ఆరోగ్యానికి కూడా పటిక బెల్లం ఎంతో సహాయపడుతుంది. జీర్ణ ఎంజైమ్ల ఉత్పత్తిని ప్రోత్సహించి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇది ఆహారాన్ని త్వరగా విచ్ఛిన్నం అయ్యేలా చేసి జీర్ణం సక్రమంగా అయ్యేలా చేస్తుంది.
ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలకు ఐరన్, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు అవసరం. ఇవన్నీ కూడా పటిక బెల్లంలో ఉంటాయి.
దగ్గు, జలుబు వంటివి వేధిస్తున్నప్పుడు ఆయుర్వేదంలో పటికబెల్లం ఉపయోగించే ఔషధాలను తయారు చేస్తారు. ఎండుమిర్చి, నెయ్యి, పటిక బెల్లం పొడి కలిపి తీసుకోవడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుందని ఆయుర్వేదం చెబుతోంది.
శరీరంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించే శక్తి దీనికి ఉంది. పటిక బెల్లంలో గ్లైసిరైసిన్ అనే సమ్మేళనం ఉంది. దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ.
పటిక బెల్లం నాడీ వ్యవస్థపై, నరాలపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గించడానికి సహాయపడుతుంది. కాబట్టి రోజుకో చిన్న ముక్క పటిక బెల్లం తింటే అన్ని విధాలా మంచిది.
తిరుమల భక్తులకు అలర్ట్.. శ్రీవారి అర్జిత సేవా టికెట్ల విడుదల ఎప్పుడో తెలుసా
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ తెలిపింది. ఫిబ్రవరి 19న మే నెల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటాను విడుదల చేస్తామని ప్రకటించింది. 19న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదల చేయనుంది.
ఈ సేవా టికెట్ల కోసం ఫిబ్రవరి 21వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చిన చెప్పింది. అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్‌లో టికెట్లు మంజూరు చేయనుంది. లక్కీ డిప్లో టికెట్లు పొందిన వారు డబ్బు చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫిబ్రవరి 22న వర్చువల్ సేవల కోటా విడుదల చేయనుంది.
ఇక మే నెలకు సంబంధించిన స్పెషల్ దర్శనం టికెట్లను ఈ నెల 24న విడుదల చేయనుంది. 24న ఉదయం 10గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేస్తామని టీటీడీ తెలిపింది. అదే రోజు మధ్యాహ్నం 3గంటలకు రూమ్స్ బుకింగ్ కోటాను విడుదల చేస్తామని తెలిపింది. అదేవిధంగా వృద్ధులు, దివ్యాంగులు, దర్శన టికెట్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాలను గమనించి బోర్డుకు సహకరించాలని టీటీడీ కోరింది.
నీటిలో తడిస్తే చేతివేళ్లకు ముడతలు.. ఎందుకో తెలుసా?
స్విమ్మింగ్ చేసినప్పుడు లేదా వర్షంలో ఎక్కువసేపు తడిసినప్పుడు చేతివేళ్లు, కాళ్లపై ఉండే చర్మం ముడతలు పడుతుంది.
కానీ ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు సైంటిస్టులు. అయితే తాజాగా అందుకుగల కారణాన్ని, దానివల్ల కలిగే లాభాలను తెలుసుకోగలిగారు. చేతివేళ్లు ముడతలు పడటానికి వెచ్చటి నీటిలో అయితే 3.5 నిమిషాలు, చల్లని నీటిలో అయితే 10 నిమిషాల సమయం పడుతుందని, అయినప్పటికీ గరిష్టంగా రింకిల్స్ వచ్చేందుకు 30 నిమిషాలు అవసరమన్నారు.
‘ఓస్మోసిస్’ అని పిలువబడే ప్రక్రియ ద్వారా కణాలలోకి నీరు ప్రవహించడంతో చర్మంపై పొరలు ఉబ్బుతాయి. ఫలితంగా నీటి అణువులు ఇరువైపులా ద్రావణాల సాంద్రతను ఈక్వలైజ్ చేయడానికి పొర మీదుగా కదులుతాయి. దీనివల్ల ముడతలు ఏర్పడతాయని గుర్తించారు. అయితే 1935 నాటికి, మధ్యస్థ నరం తెగిపోయిన గాయాలతో బాధపడుతున్న పేషెంట్లలో ముడతలు పడలేదని కనుగొన్నారు. వారి ఆవిష్కరణ వేలిముద్రల నీటి ప్రేరిత ముడతలు నిజానికి నాడీ వ్యవస్థ ద్వారా కంట్రోల్ చేయబడతాయని సూచించింది. ఆ తర్వాత 1970వ దశకంలో రక్త ప్రసరణ వంటి అపస్మారక ప్రక్రియల నియంత్రణను ప్రభావితం చేసే నరాల నష్టాన్ని అంచనా వేయడానికి చేతులను నీటిలో ముంచడాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు.
2023 నాటికి న్యూరాలజిస్టులు ఐనార్ వైల్డర్-స్మిత్(Einar Wilder-Smith), అడెలైన్ చౌ (Adeline Chow) రక్త ప్రవాహంలో గణనీయమైన తగ్గుదల ఉన్నప్పుడు చేతివేళ్లు ముడతలు పడటం ప్రారంభించాయని కనుగొన్నారు. 500 మంది వాలంటీర్ల సహాయంతో మరో సైంటిస్టు డేవిస్ ప్లాస్టిక్ వస్తువును పట్టుకోవడానికి ఎంత శక్తిని ఉపయోగించాలో కొలిచాడు. చేతులు తడిగా ఉన్న వ్యక్తుల కంటే పొడిగా, ముడతలు లేని చేతులు ఉన్నవారికి తక్కువ శక్తి అవసరమని అతను కనుగొన్నాడు. కాబట్టి వస్తువుపై వారి పట్టు మెరుగ్గా ఉంది.
Keera dosa – కీరదోస, అల్లంతో ఇలా చేస్తే చాలు..ఎంత పెద్ద పొట్ట ఉన్నా మంచులా కరిగిపోతుంది..
ఈ రోజుల్లో అధిక బరువు అనేది ఒక సమస్యగా మారింది.. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు అధిక బరువుతో ఇబ్బంది పడతారు..మన జీవన విధానం, మన ఆహారపు అలవాట్లే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.
అధిక బరువు సమస్యతో బాధపడే వారు బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బరువును తగ్గించే రకరకాల ప్రొడక్ట్స్ ను వాడుతూ ఉంటారు..అలా బాధపడేవారికి అదిరిపోయే చిట్కా ఒకటి ఉంది దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం..
బరువు తగ్గించడంలో కీరదోస మరియు అల్లం మనకు ఎంతగానో దోహదపడతాయి. అల్లం మరియు కీరదోస మనకు సులభంగా లభించేవే. అలాగే ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అల్లంలో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయి..అల్లాన్ని ఉపయోగించడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు సులభంగా తగ్గుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. తల తిరగడం వంటి సమస్యలు తగ్గుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. శరీరంలో నొప్పులు తగ్గుతాయి. అలాగే కీరదోస కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు ఆకలి కాకుండా ఉంటుంది. అలాగే దీనిలో క్యాలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో ఇలా అనేక రకాలుగా కీరదోస కూడా మనకు సహాయపడుతుంది. అల్లం, కీరదోసతో మనం జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. ముందుగా కీరదోసపై ఉండే చెక్కును తీసేసి ముక్కలుగా చేసుకుని జార్ లో వేసుకోవాలి.. ఒక గ్లాస్ నీళ్లు పోసి గ్రేయిండ్ చెయ్యాలి..రుచి కొరకు ఇందులో నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న జ్యాస్ ను రోజూ ఉదయం పరగడుపున తాగాలి. పరగడుపున కుదరని వారు అల్పాహారానికి అర గంట ముందు అయినా దీనిని తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. అలాగే ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది…
Roti: చపాతీలు చేసేటప్పుడు ఇంటి సభ్యులను లెక్కపెట్టి చేస్తున్నారా? అలా చేస్తే అంతా అశుభమే..
బరువు తగ్గడం కోసం ఇప్పుడు ఎక్కువ మంది రాత్రిపూట చపాతీలను తినడానికే ఇష్టపడుతున్నారు. అన్నం తినడం తగ్గించారు. అయితే రోటీలు చేసేటప్పుడు కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి.
ఆహారం మిగలకుండా చేయడం, ఇంట్లో నివసించే సభ్యులను లెక్కపెట్టి దానికి అనుగుణంగా చపాతీలను చేయడం వంటివి చేస్తుంటారు. ఇవన్నీ కూడా ఇంట్లోని వ్యక్తులపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని చెబుతున్నారు నిపుణులు. రోటీలు చేయడానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన నమ్మకాలు ఉన్నాయి. వీటిని పాటిస్తే జీవితం సుఖంగా సాగిపోతుంది అని చెబుతున్నారు.
1. చపాతీలు చేయడానికి ముందు ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారో లెక్కపెట్టి, ఆ సభ్యులకి రెండు లేదా మూడు చొప్పున లెక్క గట్టి చపాతీలు చేస్తున్నారా? అలా చేస్తే ఇకపై చేయడం మానేయండి. అలా తయారు చేయడం వల్ల సూర్యభగవంతుడిని అవమానపరిచినట్టే అని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇలా చపాతీలను లెక్కపెట్టడం వల్ల జాతకంలో సూర్యుడి స్థానం బలహీన పడుతుందని అంటారు.అలా బలహీనపడితే కుటుంబంలో సంతోషం, శాంతి పై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి లెక్కపెట్టడం మానేసి ఎన్ని చపాతీలు అవుతాయో అన్ని చపాతీలు చేసి సర్దుకోవడం ఉత్తమం.
2. చపాతి పిండి కలిపేశాక కొంత భాగాన్ని ఫ్రిజ్లో దాచే అలవాటు కొంతమందికి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మరుసటి రోజు పెద్దగా కష్టపడకుండా నేరుగా రోటీ చేసుకోవచ్చని అనుకుంటారు. ఇలా చపాతీ పిండి మిగిలితే దాన్ని ఫ్రిజ్లో దాచి ఉంచుకోవడం వల్ల ఆ వ్యక్తులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నమ్మకం ఉంది. ముఖ్యంగా రాహువు చెడు ప్రభావాన్ని చూపిస్తాడని అంటారు. అంతేకాదు ఇలా దాయడం వల్ల బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. ఇది శరీరానికి కూడా హాని కలిగిస్తుందని సైన్స్ చెబుతోంది.
3. ఎవరికైనా చపాతీలు వడ్డించేటప్పుడు ప్లేట్లో రెండు లేదా నాలుగు చపాతీలు పెట్టండి. కానీ మూడు చపాతీలు మాత్రం పెట్టకండి. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మాత్రమే ప్లేట్లో మూడు చపాతీలను పెట్టి సంతాప దినం రోజు నివేదిస్తారు. ఇలా కొన్ని కమ్యూనిటీలలో చేస్తారు. కాబట్టి బతికున్న వ్యక్తికి మూడు చపాతీలు పెట్టడం అనేది మంచిది కాదు. అది కేవలం చనిపోయిన వారికి సంబంధించినవి.
4. రోటీలు ఇంట్లో చేసినప్పుడు ఎప్పుడైనా కూడా ఆవు కోసం ఒకటి లేదా రెండు చపాతీలు చేయడం మంచిది. అది కూడా మొదటి రోటీని ఆవుకి పెడితే పితృ దోషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. ఇక చివరి రోటీని కుక్క కోసం తయారు చేసి పెడితే మంచిది. ఇలా చేయడం వల్ల శత్రుభయం నుండి బయటపడవచ్చు.
5. భారతదేశంలో అతిథులను చాలా గౌరవంగా చూస్తారు. వారిని దేవుళ్లతో సమానమని నమ్ముతారు. కాబట్టి ఎవరైనా ఇంటికి అతిధులు ఆలస్యంగా వస్తే ఆహారం పెట్టడానికి వీలుగా అదనపు చపాతీలను చేయాలి. ఎప్పుడూ ఇంటి సభ్యులకు సరిపడా ఖచ్చితంగా చపాతీలను చేయకూడదు. అదనంగా చపాతీలు చేయాల్సిన అవసరం ఉంది. ఇది సాంప్రదాయపరంగా కూడా మంచి ఆలోచన.
Hair Tips : బట్టతలపై వెంట్రుకలు మొలిపించే అద్భుతం.తుంగ గడ్డలు గురించి ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..
ఆయుర్వేదంలో ప్రతి మొక్కలోను ఏదో ఒక ఔషధ గుణం ఉంటుంది. ఆయుర్వేద శాస్త్రంలో కొన్ని కోట్లాది మొక్కల ఔషధ గుణాలు వాటి ఏ ఏ జబ్బులను తగ్గిస్తాయో వివరంగా తెలిపారు.
ప్రతి మొక్క లోను అందులోని పదార్థాలు వాటి లక్షణాలు అవి ఏ ఏ జబ్బులను తగ్గిస్తాయో ఆయుర్వేదంలో వివరంగా ఉంది అలాంటి ఒక అద్భుతమైన మొక్క గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మన పొలం గట్ల మీద ఊరి చివరన ఖాళీ ప్రదేశాల్లోనూ బంజరు స్థలాల్లోనూ కలుపు మొక్కగా పెరిగే తుంగ గడ్డి గురించి ప్రస్తుతం మనం చర్చించుకుందాం. తుంగ గడ్డి అనేది ఓ కలుపు మొక్క గా మనం భావిస్తూ ఉంటాం. ఈ తుంగ గడ్డి భూమి లోపల తుంగ గడ్డలు ఉంటాయి. వీటినే కొన్ని ప్రాంతాల్లో తుంగభటికలు తుంగమస్తలు అని పిలుస్తారు వీటిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి ఈ తుంగ గడ్డలతో ఏ ఏ వ్యాధులు నివారించవచ్చు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ప్రస్తుతం తుంగ గడ్డలు గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
తుంగ గడ్డలు జాండీస్ కు రామబాణం అనే చెప్పాలి తుంగ గడ్డలతో చేసిన కషాయం తాగితే కామెర్ల వ్యాధి
తగ్గిపోతుంది ముఖ్యంగా కాలేయంలో ఇన్ఫెక్షన్లు ఇతర సమస్యలకు ఈ తుంగ గడ్డ అద్భుతంగా పనిచేస్తుంది ముఖ్యంగా తుంగ గడ్డలను వేడి నీటిలో మరగబెట్టిన తర్వాత ఆ నీటిని తాగితే కాలేయంలో ఇన్ఫెక్షన్ తగ్గి కామెర్లు తగ్గుముఖం పడతాయి.
అలాగే తుంగ గడ్డలను పేస్టుగా చేసి అందులో తేనె కలిపి నాకితే పేగు పూత వ్యాధి తగ్గిపోతుంది. ముఖ్యంగా అల్సర్ సంబంధిత వ్యాధులకు తుంగ గడ్డలు బాగా పనిచేస్తాయి. అదేవిధంగా మధుమేహం తగ్గించడంలో కూడా తుంగ గడ్డలు అద్భుతంగా పనిచేస్తుంటాయి.
తుంగ గడ్డలతో బట్టతలపై వెంట్రుకలు రావడం ఖాయం.
తుంగ గడ్డలు బట్టతలపై వెంట్రుకలు తిరిగి మొలిపించడంలో అద్భుతంగా పనిచేస్తుంటాయి. ముఖ్యంగా తుంగ గడ్డలను ఎండబెట్టి దాన్ని కొబ్బరి నూనెలో మరిగించి తలకు పట్టిస్తే వెంట్రుకలు రాలిపోవడం తగ్గిపోతుంది, అంతేకాదు బట్టతలపై కూడా వెంట్రుకలు మొలిచేందుకు పునరుద్జీవంగా పనిచేస్తుంది. తుంగ గడ్డల ఎండబెట్టి వాటిని చూర్ణంగా చేసి ఆ పొడిలో, చందనం కలిపి ముఖంపై రాసుకుంటే మొటిమలు మచ్చలు పోయి ముఖం కాంతివంతంగా మారుతుంది అంతేకాదు నల్లటి నలుపు సైతం తొలగిపోయి మొహం చంద్రబింబంలా మెరిసిపోవడం ఖాయమని ఆయుర్వేద శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
తుంగ గడ్డలు ఒక రకంగా చెప్పాలంటే సర్వరోగ నివారిణి అని చెప్పాలి వీటి పైన ఇప్పటికీ ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. మీ ప్రాంతంలో కూడా తుంగ గడ్డలు లభించినట్లయితే ఆయుర్వేద నిపుణుడి సలహాలతో వాడటం ద్వారా అనేక వ్యాధులనుంచి బయటపడే అవకాశం ఉంటుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
CTM For Skin Care చర్మ సంరక్షణ కోసం సీటీఎమ్ తప్పనిసరి.. సీటీఎమ్..అంటే..?
ప్రస్తుతంపెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇందులో ప్రజలు విభిన్నంగా స్టైలిష్‌గా కనిపించడానికి చాలా ముందుగానే సన్నాహాలు చేస్తుంటారు. ఈ వేసవి కాలంలో మెరిసే చర్మాన్ని పొందడానికి చాలా మంది బ్యూటీ పార్లర్లకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కానీ, ఒక్కోసారి ఇలా చేసినా మనకు కావాల్సినంత గ్లో రాదు.ఐతే చర్మ సంరక్షణ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అంశాలున్నాయి. అవేంటంటే..?
చర్మ సంరక్షణ విషయంలో సీటీఎమ్ అనేది ట్రెండ్‌లో ఉంది. పెళ్లికి కొన్ని రోజుల ముందు ఈ రొటీన్‌ని ఫాలో అవడం మొదలుపెడితే.. కొన్ని రోజుల్లోనే ఫలితం కచ్చితంగా వస్తుంది. సీటీఎమ్ తో ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు.
అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
సీటీఎమ్ అంటే ఏమిటి.. ?
సీటీఎమ్ అంటే క్లెన్సింగ్, టోనింగ్ అండ్ మాయిశ్చరైజింగ్ అని అర్థం. చర్మాన్ని రోజువారీగా శుభ్రపరచడం, తేమను నిర్వహించడం చాలా ముఖ్యం. మీరు సీటీఎమ్ ని అనుసరించకపోతే, చర్మంలో అనేక రకాల సమస్యలు కనిపిస్తాయి.
CTM ఎలా చేయాలి..?
CTM కింద, మీరు మొదట చర్మాన్ని శుభ్రపరచాలి. వెంటనే మాయిశ్చరైజర్‌ను అప్లై చేయాలి. దీనితో పాటు, రాత్రిపూట CTM దినచర్యను అనుసరించాలి. రాత్రిపూట ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందుకోసం రాత్రి పడుకునే ముందు ఫేస్ వాష్‌తో చర్మాన్ని శుభ్రపరుచుకుని, ఆ తర్వాత ఇంట్లోనే టోనర్‌తో టోనింగ్ చేయాలి. మీ చర్మ రకాన్ని బట్టి CTMలో ఉపయోగించే ఉత్పత్తులను కొనుగోలు చేయండి.
CTM ప్రయోజనాలు..
మీరు ప్రతిరోజూ CTM చేస్తే, మీ చర్మంపై మృతకణాలు పేరుకుపోవు. శుభ్రపరచడం వల్ల చర్మం చాలా శుభ్రంగా మారుతుంది. మీరు మీ చర్మాన్ని మెరిసేలా చేయాలనుకుంటే, CTM రొటీన్‌ను అనుసరించండి. CTMలో మాయిశ్చరైజర్‌ను అప్లై చేయడం వల్ల చర్మం హైడ్రేట్‌గా ఉంటుంది. దీని వల్ల చర్మానికి సంబంధించిన అనేక సమస్యలు దూరమవుతాయి.
High BP కంట్రోల్ చేసుకోకపోతే కిడ్నీలు దెబ్బ తినడం ఖాయం.. ఏం చేయాలో తెలుసుకోండి..
పెరుగుతున్న హై బీపీ పరిస్థితి శరీరంలోని అనేక భాగాలకు హానికరం. ఇది సాధారణంగా గుండె జబ్బులకు ప్రధాన కారణం అని పిలుస్తారు. అయితే ఇది మీ కళ్ళు, మూత్రపిండాలు నరాలకు సంబంధించిన సమస్యలను కూడా పెంచుతుంది.
హై బీపీ పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఈ సమస్య తరచుగా కొనసాగితే, ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బీపీ 140/90 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే హై బీపీ గా పరిగణిస్తారు. హై బీపీ వల్ల గుండె, మెదడు, కిడ్నీ, కళ్లు వంటి కీలక అవయవాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శుభవార్త ఏమిటంటే.. చాలా సందర్భాలలో మీ హై బీపీ ను కంట్రోల్ చేయడం ద్వారా అనారోగ్య సమస్యల ముప్పును తగ్గించవచ్చు. హై బీపీ సమస్యలో సాధారణ ఇంటి నివారణలు కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటాయి.
హై బీపీ ను ఎలా నియంత్రించాలో తెలుసుకుందాం?
అధిక హై బీపీ లక్షణాల గురించి తెలుసుకోండి;
అధిక హై బీపీ విషయంలో చాలా సందర్భాలలో ఎటువంటి లక్షణాలు ఉండవని వైద్యులు చెబుతున్నారు. అయితే, కొంతమందికి తలనొప్పి, ఊపిరి ఆడకపోవడం, నెర్వస్‌నెస్, ఛాతీ నొప్పి వంటి సమస్యలు కూడా ఉండవచ్చు. అటువంటి సమస్యలను సకాలంలో గుర్తించడం వాటిని నిర్వహించడానికి చర్యలు తీసుకోవడం అవసరం. నిరంతర అధిక హై బీపీ ప్రాణాంతక ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. దీని నివారణకు ఈ మూడు చర్యలు ప్రత్యేకంగా ఉపయోగపడతాయి.
ఆహారంలో సోడియం తక్కువగా ఉండేలా చూడండి:
సోడియం (ఉప్పు) అధికంగా తీసుకోవడం వల్ల హై బీపీ పెరగడానికి కారణం కావచ్చు. ఇతర వ్యక్తుల కంటే ఎక్కువ ఉప్పు తీసుకునే వ్యక్తులు అధిక హై బీపీ కు గురయ్యే ప్రమాదం ఉందని పరిశోధకులు కనుగొన్నారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నుండి నిపుణుల సిఫార్సుల ప్రకారం, ఒక రోజులో 2,300 మిల్లీగ్రాముల (ఒక టేబుల్ స్పూన్) ఉప్పు కంటే ఎక్కువ తినకూడదు, ఇది హై బీపీ ప్రమాదానికి దారితీస్తుంది.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి:
శారీరక శ్రమ వ్యాయామాలు మిమ్మల్ని శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి. హై బీపీ ను నియంత్రించడంలో వ్యాయామాన్ని అలవాటు చేసుకోవడం కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. నరాల గుండె ఆరోగ్యంగా ఉంచడంలో వ్యాయామం అలవాటును సృష్టించడం కూడా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు కనుగొన్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రతి ఒక్కరూ రోజూ 30 నిమిషాల వ్యాయామం చేయాలి.
పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం:
పొటాషియం గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి హై బీపీ స్థాయిలను నియంత్రించడానికి ఉత్తమమైన ఖనిజాలలో ఒకటి. ఇది ఉప్పు వల్ల కలిగే దుష్ప్రభావాలను కూడా తగ్గిస్తుంది. రక్తనాళాల గోడలలో ఒత్తిడిని తగ్గించడానికి పొటాషియం అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవడం కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. అరటి, టొమాటో, అవకాడో, పాలు, పెరుగు, బీన్స్, నట్స్ మొదలైన వాటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
Health Tips – షుగర్ వ్యాధి గ్రస్తుల పాలిట వరం ఈ కూరగాయ..ఇన్సులిన్ మందు కన్నా తక్కువేమీ కాదట..
షుగర్ ఒక ప్రమాదకరమైన వ్యాధి. దీంతో రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. షుగర్ ఒక నయం చేయలేని వ్యాధి. కానీ సరైన ఆహారం ,ఆరోగ్యకరమైన జీవనశైలి సహాయంతో ఈ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు.
ప్రస్తుతం చెడు ఆహారపు అలవాట్లు, చెడు అలవాట్ల కారణంగా ఈ వ్యాధి చాలా మందిని తన గుప్పిట్లోకి తీసుకుంటోంది. షుగర్ నయం చేయలేని వ్యాధి కావచ్చు, కానీ దానిని అదుపులో ఉంచుకోవడం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. మీ ఆహార కోరికలను నియంత్రించడం ద్వారా, మీరు ఈ వ్యాధిని సులభంగా ఎదుర్కోవచ్చు.
షుగర్ వ్యాధిగ్రస్తులు తమ రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి ఫైబర్ , ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. బీన్స్ వంటి బ్లడ్ షుగర్ స్థాయిని నియంత్రించగల కొన్ని కూరగాయలు షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడంతో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. బీన్స్ డయాబెటిక్ రోగులకు సూపర్ ఫుడ్. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం, బీన్స్ చాలా తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. ఇది చక్కెర స్థాయిని నియంత్రించడానికి కారణం. బీన్స్‌లో ప్రోటీన్ , ఫైబర్ కూడా పుష్కలంగా లభిస్తాయి.
డయాబెటిక్ రోగులకు బీన్స్ ఎందుకు ప్రయోజనకరంగా ఉంటాయి?
న్యూట్రిషన్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, పింటో బీన్స్, బ్లాక్ బీన్స్ లేదా రెడ్ కిడ్నీ, బీన్స్ తిన్న టైప్-2 డయాబెటిస్ ఉన్న రోగుల రక్తంలో చక్కెర పెరుగుదల కనిపించలేదు. బీన్స్ తిన్న 90, 120 , 150 నిమిషాల తర్వాత కూడా రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. బీన్స్‌లో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల బ్లడ్ షుగర్ ఉన్న రోగులకు మేలు జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. వాటిలో ఫైబర్ కూడా గణనీయమైన స్థాయిలో ఉంటుంది. బీన్స్ బియ్యం లేదా బంగాళదుంపల కంటే ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ కలిగి ఉంటుంది.
బీన్స్ ఎలా తినాలి?
వైద్యులు ప్రకారం, బీన్స్ అన్నం లేదా రోటీతో వడ్డించుకోవచ్చు. కొంతమంది దీనిని సైడ్ డిష్‌గా కూడా ఉపయోగిస్తారు. అంతే కాదు, బీన్స్‌ను సలాడ్‌లు, సూప్‌లు కూడా వాడుకోవచ్చు. అయితే, దీనిని పరిమిత పరిమాణంలో తీసుకోవడం అవసరం. బీన్స్ నుండి ఎక్కువ ప్రయోజనాలను పొందడానికి, వెల్లుల్లి , అల్లంతో కలిపి తినాలని కొందరు వైద్యులు అంటున్నారు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
Moto G24 Power Sale: రూ.10 వేలలోపే 16 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఫోన్ .. ఈ సూపర్ ఫోన్ కోనేసేయండి
Moto G24 Power Flipkart Sale: మోటో జీ24 పవర్ (Moto G24 Power) స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్పై ఈ ఫోన్ పని చేయనుంది.
8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. ఇన్ని ఫీచర్లు ఉన్నప్పటికీ దీని ధర రూ.10 వేలలోపే ఉండటం విశేషం.
మోటో జీ24 పవర్ ధర (Moto G24 Power Price in India)
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,999గా ఉంది. ఇక 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.9,999గా నిర్ణయించారు. గ్లేసియర్ బ్లూ, ఇంక్ బ్లూ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్కార్ట్, మోటొరోలా అధికారిక వెబ్ సైట్లతో పాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో దీని సేల్ ప్రారంభం అయింది.
మోటో జీ24 పవర్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Moto G24 Power Specifications)
ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.56 అంగుళాల హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, పీక్ బ్రైట్నెస్ 537 నిట్స్గా ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్పై మోటో జీ24 పవర్ రన్ కానుంది. ర్యామ్ బూస్ట్ టెక్నాలజీ ద్వారా ఏకంగా 16 జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. అంటే 16 జీబీ ర్యామ్ ఉన్న ఫోన్ రూ.10 వేలలోపే కొనేయచ్చన్న మాట. 3డీ ఏక్రిలిక్ గ్లాస్ బిల్డ్ను మోటో జీ24 పవర్ కలిగి ఉండటం విశేషం.
ఇక కెమెరాల విషయానికి వస్తే… ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఇందులో క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీ ఉంది. దీంతో పాటు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 128 జీబీ వరకు స్టోరేజ్ ఉంది. దీన్ని మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
బ్లూటూత్, జీపీఎస్, ఏ-జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, ఎల్టీఈపీపీ, ఎస్యూపీఎల్, బైదు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, వైఫై, యూఎస్బీ టైప్-సీ పోర్టు కూడా అందించారు. ఐపీ53 రేటెడ్ వాటర్ రెపెల్లెంట్ బిల్డ్తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్, సెన్సార్ హబ్, ఎస్ఏఆర్ సెన్సార్ కూడా అందుబాటులో ఉన్నాయి.
బయోమెట్రిక్ ఆథెంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్కభాగంలో ఉంది. డాల్బీ అట్మాస్ను సపోర్ట్ చేసే స్టీరియో స్పీకర్లు కూడా ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్ కాగా, 33W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.89 సెంటీమీటర్లు కాగా, బరువు 197 గ్రాములుగా ఉంది.
Valli Sudheer: ‘వల్లీ టీచర్.. వెరీ స్పెషల్’.. స్పెషల్ టీచర్ అనేది ఉద్యోగమే కాదు.. అకుంఠిత దీక్షతో నిర్వహించే సేవ
భగవంతుడు కొంత మంది పిల్లలను భూమ్మీదకు ప్రత్యేకంగా పంపిస్తాడు. కల్మషం తెలియని ఆ స్పెషల్ కిడ్స్‌కి పాఠం చెప్పే టీచర్‌లు కూడా అంతే స్వచ్ఛమైన మనసు కలిగిన వారై ఉండాలి.
ఆ టీచర్‌లు ప్రతి బిడ్డకూ అమ్మగా మారి తల్లిప్రేమను పంచాలి. స్పెషల్ టీచర్ అనేది ఉద్యోగం కాదు, అకుంఠిత దీక్షతో నిర్వహించే సేవ. నాలుగు దశాబ్దాలకు పైగా అలాంటి సేవకు తనను అంకితం చేసుకున్న మనీషి వల్లీసుధీర్. స్పెషల్ కిడ్స్‌కు సేవ చేయడానికి తన జీవితాన్ని అంకితం చేస్తానని ప్రమాణం చేసుకున్న మహోన్నతమైన వ్యక్తి ఆమె. తాను స్పెషల్ టీచర్‌గా మారిన వైనాన్ని సాక్షితో పంచుకున్నారు వల్లీసుధీర్.
సినిమారీళ్లన్ని మలుపులు!
‘నేను స్పెషల్ టీచర్ కావడం వెనుక సినిమా కథలో ఉన్నన్ని మలుపులున్నాయి. మాది తెలుగు కుటుంబమే. కానీ పుట్టింది చెన్నైలో. మా నాన్న కెవీఎస్ శర్మ నటులు. ఎన్టీఆర్‌తో కలిసి చదువుకున్నారు, ఆయనతో కలిసి చెన్నైకి వెళ్లారు, ఆయనతో కలిసి సినిమాలు చేశారు. అమ్మానాన్నలకు నేను ఏకైక సంతానం. నాకు నాలుగేళ్లున్నప్పుడు నాన్న హటాత్తుగా పోయారు. దాంతో నేను, అమ్మ మా అమ్మమ్మగారింటికి విజయవాడకు వచ్చేశాం. టెన్త్ క్లాసు పూర్తయ్యేసరికి తాతగారు కూడా పోయారు.
ఇక నేను, అమ్మ హైదరాబాద్‌లోని పిన్ని వాళ్లింటికి వచ్చాం. పూర్తిగా వాళ్ల మీద ఆధారపడిపోకుండా ఏదో ఒక ఉద్యోగం చేయాలనుకున్నాను. స్వీకార్, ఉప్‌కార్ లో పిల్లలకు శిక్షకుల కోసం చూస్తున్నారని తెలిసింది. అలా స్పెషల్ చిల్డ్రన్ కోసం పని చేయాల్సిన రంగంలోకి అడుగుపెట్టాను. మొదటిరోజు నాకు ఇద్దరు కవల పిల్లలనిచ్చి చూసుకోమన్నారు. పిల్లల అవసరాలు తెలుసుకుని సముదాయించగలిగిన వయసు కాదది. ఇందులో ఇమడలేననుకుని, బాబాయ్‌కి చెప్తే ‘భయపడి వదిలేయడం కాదు, నీ వంతు ప్రయత్నం చెయ్యి. తర్వాత చూద్దాం’ అన్నారు. అలా కొనసాగుతున్న సమయంలో స్వీకార్ వాళ్లు నన్ను శిక్షణ కోసం మణిపాల్‌కి పంపించారు. ఆ శిక్షణ నా మీద అంతటి ప్రభావం చూపిస్తుందని ఏ మాత్రం ఊహించలేదు.
అమ్మకు పరీక్షలు పెట్టానట!
పిల్లలు మానసిక సమస్యలతో పుట్టడానికి దారి తీసే కారణాలను వివరించారు. నొప్పులు మొదలైన తర్వాత ప్రసవం జరగడానికి ఎక్కువ సమయం తీసుకోవడం, ఉమ్మనీరు పోవడం, పుట్టిన వెంటనే బిడ్డ ఏడవకపోవడం… వంటి సమస్యలను వివరిస్తూ ప్రసవం సమయంలో తల్లిమాత్రమే కాదు బిడ్డ కూడా తీవ్రమైన శారీరక, మానసిక ఒత్తిడికి లోనవుతుందని చెప్పారు. ఎక్కువ సమయం ఆక్సిజన్ అందక పోవడంతో ఎదురయ్యే పరిణామాలను వివరించారు.
అంతే.. నా గురించి అమ్మ ఎప్పుడూ చెప్పే ఒక విషయం గుర్తు వచ్చింది. ‘నేను పుట్టినప్పుడు మా అమ్మ రెండు రోజులు నొప్పులు పడిందట. నార్మల్ డెలివరీ కాదని సిజేరియన్ చేశారు. ఉమ్మనీరు తాగడంతోపాటు, ఆక్సిజన్ అందక దేహం నీలిరంగులోకి మారిపోయిందట. పైగా పుట్టగానే ఏడవలేదు’. ఇన్ని కాంప్లికేషన్స్ మధ్య నేను నార్మల్‌గా పుట్టడం ఒక మిరకిల్.
అవన్నీ మణిపాల్ శిక్షణ సమయంలో ఒక్కసారిగా రీలు తిరిగినట్లు కళ్ల ముందు మెదిలాయి. నాకు తెలియకుండానే చెంపల మీద కన్నీళ్లు కారిపోయాయి. భగవంతుడికి మనసులోనే దణ్ణం పెట్టుకుని, నార్మల్‌గా పుట్టించినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ… ‘నా చివరి ఊపిరి వరకు స్పెషల్ కిడ్స్‌కి సర్వీస్ ఇస్తాను’ అని ఒట్టుపెట్టుకున్నాను. అప్పటి నుంచి స్పెషల్ చిల్డ్రన్‌కి సర్వీస్ ఇవ్వడానికి అవసరమైన నైపుణ్యాలను పెంచుకోవడం మీద మాత్రమే దృష్టి పెట్టాను. గ్రాడ్యుయేషన్, డీఎమ్‌ఆర్, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్, సైకాలజీలో పీజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మరో పీజీతోపాటు లండన్‌లో ‘కోర్స్ ఆఫ్ ఇంట్రడక్షన్’ కోర్సు చేశాను.
స్వతంత్రులుగా నిలబెట్టాలి!
స్పెషల్ చిల్డ్రన్ గురించి సమగ్రంగా చదివిన తరవాత హైదరాబాద్‌లో’శ్రద్ధ సెంటర్ ఫర్ స్పెషల్ చిల్డ్రన్’ స్థాపించాను. ఈ పిల్లలు ప్రతి పనికీ ఒకరి మీద ఆధారపడకుండా తమ పనులు సొంతంగా చేసుకునేటట్లు తయారు చేయడం ప్రథమ లక్ష్యంగా పెట్టుకున్నాను. పర్సనల్ నీడ్స్… అంటే సొంతంగా తినడం, కాలకృత్యాలకు వెళ్లడం, శుభ్రం చేసుకోవడం వంటి పనులకు ఎవరి మీదా ఆధారపడకూడదు. రెండవది డొమెస్టిక్ స్కిల్స్, అంటే.. తల దువ్వుకోవడం, దుస్తులు ధరించడం, చెప్పులు సరిగ్గా వేసుకోవడం వంటివి.
ఇక మూడవది కాగ్నిటివ్ స్కిల్స్, అంటే.. ప్రమాదాల గురించి తెలియచేయడం, అగ్నిప్రమాదం, జల ప్రమాదాలకు దూరంగా ఉండడం ఎలాగో నేర్పించడం, ప్రమాదాలు ఎదురైతే తప్పించుకోవడంలో శిక్షణనివ్వడంతోపాటు ఒక వస్తువు కొనడం, దుకాణానికి వెళ్లి డబ్బు ఇచ్చి కొనుగోలు చేసిన తరవాత చిల్లర డబ్బు తీసుకుని లెక్క చూసుకోవడం వంటి వాటిలో శిక్షణనివ్వడం అన్నమాట. ఈ మేరకు తర్ఫీదు ఇస్తే ఇక వాళ్లు జీవితంలో ఎవరికీ భారంగా పరిణమించరు. అందుకే ఈ మూడింటినే ప్రధానంగా తీసుకున్నాను.
కానీ ముందే చెప్పాను కదా!
నా జీవితంలో సినిమాకంటే ఎక్కువ మలుపులున్నాయని. నా ప్రయత్నం ఒకదారిలో పడే సమయానికి అమ్మ ఆరోగ్యం క్షీణించింది. ఇక నేను ఈ సెంటర్ మీద పూర్తి సమయం కేటాయించడం కుదిరేపని కాదని నా ఫ్రెండ్‌కి అప్పగించాను. శ్రద్ధ సెంటర్‌లో పిల్లలకు ఏ ఇబ్బంది లేకుండా చేయగలిగాను. కానీ నాకు రోజులు గడిచేదెలా? అమ్మకు వైద్యం చేయించేదెలా? అప్పుడు ‘గీతాంజలి దేవశాల’ స్పెషల్ స్కూల్‌లో చేరాను. అందులో 24 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. స్వీకార్ ఉప్‌కార్ నుంచి చూసుకుంటే 44 ఏళ్లు పూర్తయ్యాయి.
పిచ్చి టీచర్ అనేవాళ్లు!
సమాజంలో అప్పటికీ ఇప్పటికీ కొంత మార్పు వచ్చిన మాట నిజమే, కానీ రావలసినంత మార్పు రాలేదనే చెప్పాలి. అప్పట్లో మా గుర్తింపు ‘పిచ్చి టీచర్’, ఇప్పుడు స్పెషల్ ఎడ్యుకేటర్ బాధ్యత ఎంత క్లిష్టమైనదో అర్థం చేసుకుని మమ్మల్ని గౌరవంగా చూస్తున్నారు. ఈ సున్నితత్వం స్పెషల్ చిల్డ్రన్ విషయంలోనూ రావాలి. అప్పటిలాగ దూరం పెట్టడం లేదు కానీ దగ్గరకు రానివ్వడంలో ఒకింత సందిగ్ధంగానే ఉంటున్నారు. తమ పొరుగింట్లో స్పెషల్ కిడ్ ఉంటే ఆ కిడ్‌ని సానుభూతితో చూస్తున్నారు తప్ప, తమ పిల్లలతో ఆడుకోవడానికి అనుమతించలేకపోతున్నారు.
విద్యావ్యవస్థ మాత్రం స్పెషల్ కిడ్స్ కోసం ఒక విభాగం ఉండాలనే నియమంతో ఓ ముందడుగు వేసిందనే చెప్పాలి. ఇద్దరు పిల్లల్లో ఒకరు స్పెషల్ కిడ్, ఒకరు నార్మల్ కిడ్ అయితే ఆ తల్లిదండ్రులు పిల్లలతో ఎలా వ్యవహరించాలి, స్పెషల్ కిడ్ తల్లి ఇరుగుపొరుగు వారితో, వారి పిల్లలతో ఎలా మెలగాలి వంటివన్నీ చెప్పడానికి ఒక వేదిక ఉంటే బావుణ్నని చూస్తున్నాను. ఇన్నాళ్లూ నా సర్వీస్‌కి వేదిక గీతాంజలి దేవశాల. ఇప్పుడు టెక్నాలజీ సాయంతో చెప్పాలా లేక వేరే మాధ్యమాలలో ప్రయత్నించాలా అనేది ఇంకా ఆలోచించలేదు. నాకు నేను పెట్టుకున్న ఒట్టు ప్రకారం చివరి శ్వాస వరకు స్పెషల్ కిడ్స్ కోసం పని చేస్తూనే ఉంటాను” అన్నారు వల్లీసుధీర్.
ఎవరికి వాళ్లు ప్రత్యేకమే!
ఇన్నేళ్ల నా అనుభవంలో తెలుసుకున్నదేమిటంటే.. స్పెషల్ చిల్డ్రన్‌కి శిక్షణ ఇవ్వడానికి రూపొందించిన కోర్సులన్నీ ఒకరకమైన సాధనాలు మాత్రమే. వాటిని పిల్లవాడికి ఎలా అన్వయింపచేయాలనేది టీచర్ స్వీయ విచక్షణతో తెలుసుకుని ఆచరించాలి. ఒక సూత్రం ఏ ఇద్దరు పిల్లలకూ వర్తించదు. ఎవరికి వాళ్లు ప్రత్యేకమే. మా దగ్గరకు వచ్చిన పిల్లలకు ప్రేమ పంచాలి, బాధ్యతగా శిక్షణనివ్వాలి. అలా నేర్పిస్తూ పాతిక మందిని ఓపెన్ స్కూలింగ్‌లో టెన్త్ క్లాస్ పరీక్షకు సిద్ధం చేశాం. ఆటల్లో శిక్షణనిచ్చి పోటీలకు తీసుకెళ్లాం. మా దగ్గర శిక్షణ పొందిన పిల్లలు స్పోర్ట్స్ అథారిటీ సహకారంతో ఇంగ్లండ్‌లో క్రీడల పోటీలకు కూడా వెళ్లారు. – వల్లీ సుధీర్, స్పెషల్ టీచర్