Monday, November 18, 2024

School Holidays: మహా శివరాత్రికి వరుసగా సెలవులు ప్రకటించిన తెలుగు రాష్ట్రాలు, ఎన్ని రోజులంటే?

మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాలు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించాయి. వివరాల ప్రకారం ఈ ఏడాది మార్చి 8న మహాశివరాత్రి వస్తోంది.

కానీ మహాశివరాత్రి ప్రతి సంవత్సరం మూడు రోజులు జరుపుకుంటారు. కానీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం శివరాత్రి మొదటి రోజున మాత్రమే ఉద్యోగులు మరియు విద్యార్థులకు సెలవు ప్రకటించింది.

మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా పబ్లిక్ హాలిడేను ప్రభుత్వం ప్రకటించగా.. అయితే ఆ రోజు శుక్రవారం రావడం.. మరుసటి రోజు రెండవ శనివారం, ఆదివారం రావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి.
ఈ మేరకు విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది.

మహాశివరాత్రి అంటే..

ప్రతి చాంద్రమానంలో 14వ రోజు లేదా అమావాస్య ముందు రోజును శివరాత్రి అంటారు. క్యాలెండర్లోని ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. పంచాంగ సంవత్సరంలోని పన్నెండు శివరాత్రాలలో, ఫిబ్రవరి మరియు మార్చిలకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. మహాశివరాత్రి హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగ. ఈరోజు శివపార్వతుల పెళ్లిరోజు.

ఈ రాత్రి శివుడు తాండవం చేసే రోజు. ఈ పర్వదినాన శివుడిని ప్రధానంగా బిల్వ ఆకులతో పూజిస్తారు. ఈ రోజున శివభక్తులు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి పూజలు చేసి ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు భోజనం చేస్తారు. రాత్రంతా శివపూజలు, అభిషేకాలు, అర్చనలు, శివలీలా కథాపారాయణలు నిర్వహిస్తారు.
ఈ రాత్రి, భూమి యొక్క ఉత్తర అర్ధగోళం యొక్క స్థానం ఏదైనప్పటికీ, మనిషిలో శక్తి సహజంగా పెరుగుతుంది. దీన్ని ఉపయోగించుకోవడానికి, ఈ సంస్కృతి రాత్రంతా పండుగను ఏర్పాటు చేసింది. మన వెన్నుముకలను నిటారుగా మరియు అప్రమత్తంగా ఉంచడం ద్వారా ఈ శక్తులు సహజంగా పెరగడానికి మరియు తగ్గడానికి మనం సహాయపడవచ్చు.
అతను యోగ శాస్త్రానికి మూలకర్త అయిన ఆదియోగి లేదా ఆదిగురువుగా చూడబడ్డాడు. అనేక వేల సంవత్సరాలు ధ్యానంలో ఉన్న తర్వాత అతను ఒకరోజు పూర్తిగా నిశ్చలమయ్యాడు. ఆ రోజు మహాశివరాత్రి. అతనిలో కదలికలన్నీ ఆగిపోయి పూర్తిగా నిశ్చలంగా మారాయి. అందుకే సన్యాసులు మహాశివరాత్రిని నిశ్చలతకు ప్రతీకాత్మక రాత్రిగా చూస్తారు. శాస్త్రీయ సంగీతం మరియు నృత్యం వంటి వివిధ రంగాలకు చెందిన కళాకారులు రాత్రంతా జాగరణ చేస్తారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి మహాశివరాత్రి చాలా ప్రసిద్ధి.

జగన్ ఇచ్చిన ఆఫర్‌పై బీజేపీ హైకమాండ్ తర్జన భర్జన ?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మూడు రోజుల కిందట అమిత్ షా, జేపీ నడ్డాలతో ఢిల్లీలో సమావేశం అయ్యారు. ఈ భేటీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరిక అంశంపై మాత్రమేనని ప్రత్యేకంగా చెప్పాల్సినపని లేదు.
ఆయన ఢిల్లీలో ఉండగానే జగన్ పరుగున ఢిల్లీకి వెళ్లి ప్రధానితో భేటీ అయ్యారు. వెంటనే .. వైసీపీ అధినేత జగన్ ఎన్డీఏలో చేరుతారన్న అంశంపై కొంత కాలంగా ఢిల్లీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం లో ఉంది. అయితే రాజకీయ సిద్ధాంతాలు, ఓటు బ్యాంకుల పరంగా చూస్తే.. బీజేపీ, జగన్ పొత్తులు అనేవి సరిపడవు. అదే చేస్తే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లేనని ఎక్కువ మంది విశ్లేషిస్తున్నారు.

జగన్ మోహన్ రెడ్డి ప్రదాన ఓటు బ్యాంక్ ముస్లింలు, దళితులు. వీరిలో బీజేపీపై వ్యతేరికత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు బీజేపీతో జగన్మోహన్ రెడ్డి కలిస్తే వారిలో ఓ పది శాతం కాంగ్రెస్ వైపు మళ్లినా జగన్ కు జరిగే నష్టాన్ని అంచనా వేయడం కష్టం. కానీ రాజకీయాల సమీకరణాలు కేవలం ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల మీదనే ఆధారపడి ఉండవు. అంతకు మించిన ఎక్స్ ట్రా అంశాలు కూడా ఉంటాయి అందుకే జగన్మోహన్ రెడ్డి ఎన్డీలో చేరేందుకు తన ఆసక్తిని బీజేపీ హైకమాండ్ ముందు పెట్టారని చెబుతున్నారు.
టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ ఎన్నికలకు వెళ్తే ఆ తర్వాత తాను ఎదుర్కొబోయే రాజకీయ పరిణామాలను ఊహించడం కష్టమని.. అలాంటి కష్టం రాకుండా ఉండాలంటే.. ఖచ్చితంగా మూడో సారి కేంద్రంలో అధికారంలోకి వస్తున్న బీజేపీ అండ ఉండాలని జగన్ గట్టిగా భావిస్తున్నారు. అందుకే.. రాజకీయంగా ఏపీలో తనకు నష్టం జరిగినా సరే.. బీజేపీ అండ ఉండేందుకు ఎన్డీఏలో చేరేందుకు సిద్ధమయ్యారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే విషయాన్ని ప్రధానమంత్రి ముందు ప్రతిపాదించారని.. ఇక బీజేపీ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెబుతున్నారు.

బీజేపీతో శత్రుత్వం తెచ్చుకునే పరిస్థితి లేకుండా రాజకీయంగా నష్టం లేకుండా ఎన్డీఏ కూటమిలో చేరేందుకు జగన్ సిద్ధమయి ఉంటే.. బీజేపీ చేర్చుకుంటుందా లేదా అన్నది కీలక అంశం. చేర్చుకునేందుకు సిద్ధమైతే ఏపీలో రాజకీయాలు భిన్నంగా మారతాయి. అప్పుడు బీజేపీ, వైసీపీ వర్సెస్ టీడీపీ, జనేసన అన్నట్లుగా మారుతాయి.

Gold Price Today : వరుసగా మూడోరోజు తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today : బంగారం ధరలు మూడో తగ్గాయి. శుభకార్యాల వేళ బంగారం ధరలు తగ్గుతుండడం కొనుగోలుదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. వెండి ధరలు సైతం తగ్గాయి.
అంతర్జాతీయం బంగారం ధరలు స్పాట్ గోల్డ్ ఔన్స్ కు 2025 డాలర్లు నమోదైంది. సిల్వర్ ఔన్స్ కు 22.68 డాలర్ల ట్రేడ్ అవుతోంది. 2024 ఫిబ్రవరి 12వ తేదీన ధరలు ఎలా ఉన్నాయంటే?

బులియన్ మార్కెట్ ప్రకారం.. ఫిబ్రవరి 10న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,690గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.62,940 గా ఉంది. ఫిబ్రవరి 11న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,700తో విక్రయించారు. ఆదివారం కంటే సోమవారం రూ.10 తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,840 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.63,090గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,690 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.62,940 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.58,290 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,590తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,690 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,940తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,690తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,940తో విక్రయిస్తున్నారు.

బంగారం ధరలతో పాటు వెండి ధరలూ తగ్గాయి. సోమవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.74,900గా నమోదైంది. ఆదివారంతో పోలిస్తే సోమవారం వెండి ధరలు రూ.100 తగ్గింది న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.74,900గా ఉంది. ముంబైలో రూ..74,900, చెన్నైలో రూ.76,400, బెంగుళూరులో 72,100, హైదరాబాద్ లో రూ.76,400తో విక్రయిస్తున్నారు.

Stickers On Fruits: ఫ్రూట్స్‌పై స్టిక్కర్స్‌ లైట్‌ తీసుకోవద్దు.. ఎంత సమాచారం ఉందో తెలుసా?

Stickers On Fruits: పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సీజనల్‌గా లభించే పండ్లు తినడం చాలా మందచిదని వైద్యులు సూచిస్తారు. అయితే ఈ మధ్య సీజన్‌తో సంబంధం లేకుండా మర్కెట్‌లో పండ్లు లభిస్తున్నాయి.
ఇక ఈ పండ్లపై స్టిక్కర్లు ఉంటున్నాయి. మీరు వీటిని గమనించే ఉంటారు. కానీ, ఆ స్టిక్కర్‌ కంపెనీ పేరు అయి ఉంటుందని చాలా మంది లైట్‌ తీసుకుంటారు. కానీ, ఆ పండుకు సంబంధించిన సమాచారమంతా ఫ్రూట్‌లోనే ఉంటుంది. దానిని గమనించడం ద్వారా మన ఫ్రూట్‌ క్వాలిటీ తెలుసుకోవచ్చు. అదెలాగో చూద్దాం రండి..

స్టిక్కర్‌లో వివరాలు..

మార్కెట్‌లో మనకు చాలా రకాల పండ్లు లభిస్తాయి. మనం గమనిస్తే ప్రతీ పండుపై స్టిక్కర్‌ ఉంటుంది. ఆ స్టిక్కరే ఆ పండు క్వాలిటీని తెలియజేస్తుంది. ఈ స్టిక్కర్లలో వేర్వేరు నంబర్లు ఉంటాయి. వాటి ఆధారంగానే పండు క్వాలిటీ తెలుసుకోవచ్చు.

నంబర్‌ ఐదు అంకెలు ఉండి అది 9 తో ప్రారంభం అయితే దానిని ఆర్గానిక్‌ ఫాంలో పండించారని, 100 శాతం నాచురల్ అని అర్థం. దీనిని మనం కొనుగోలు చేయవచ్చు.

ఇక ఐదు అంకెలు ఉండి 8 నంబర్‌తో ప్రారంభం అయితే.. దాని అర్థం ఆ పండు సగం ఆర్గానికి, సగం కెమికల్స్‌ వేసి పండించారన్నమాట. దీనిని కూడా కొనుగోలు చేయవచ్చు.

ఇక పండుపై నాలుగు అంకెలు ఉండి అది 4 నంబర్‌తో ప్రారంభమైతే అది పూర్తిగా ఇన్‌ఆర్గానిక్‌ అన్నమాట. పూర్తిగా ఆ పండును రసాయన మందులతో పండించారని అర్థం. ఇది ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు.

అప్పుల బాధతో సతమవుతున్నారా? అయితే, ఈ ఆకుతో ఇలా చేస్తే మీ బాధలన్నీ పోతాయి!

హిందూ పురాణాలలో రావి ఆకులకు చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ ఆకులను దేవతలుగా భావిస్తారు, ముఖ్యంగా ఈ చెట్టులో బ్రహ్మ, విష్ణు, మహేషులు ఉంటారని నమ్ముతుంటారు.
అందుకే ఈ చెట్టును పూజించడం వల్ల మీ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే ప్రతిరోజూ ఈ రావి చెట్టు ముందు నెయ్యి దీపం వెలిగిస్తే.. జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయని పూర్వీకులు చెబుతున్నారు. అంతేకాదు ఈ ఆకులను ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. వారు వినియోగించడం వల్ల సులభంగా పరిష్కారం లభిస్తుంది

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు వినియోగించడం వల్ల సులభంగా పరిష్కారం లభిస్తుంది. ఎందుకంటే, ఈ రావి చెట్టు ఆకులకు అద్భుత శక్తులు ఉన్నాయని హిందువులు విశ్వాసం. రావి ఆకులను వాడితే శుభం కలుగుతుందని నమ్ముతున్నారు. ఈ ఆకుల పరిహారాలు పాటించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ చూద్దాం..
రావి ఆకుల రెమెడీస్:

1. జ్యోతిష్యం ప్రకారం రావి ఆకులను దిండు కింద పెట్టుకుని నిద్రిస్తే అప్పుల బాధలు తీరుతాయి. అంతే కాకుండా ఆర్థిక సమస్యలను కూడా సులభంగా పరిష్కరించుకోవచ్చు.

2. ముఖ్యంగా ప్రతిరోజూ దిండు కింద రావి ఆకును పెట్టుకుని పడుకుంటే అప్పుల బాధలు కూడా తీరుతాయి. జీవితంలో ఎదురయ్యే సమస్యలు కూడా పరిష్కారమవుతాయని జ్యోతిష్య నిపుణులు పేర్కొన్నారు.

3. ఆయుర్వేద నిపుణులు సూచించిన వివిధ మార్గాల్లో ఈ ఆకును ఉపయోగించడం వల్ల ఆరోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.

Poco x6 neo: పోకో నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. తక్కువ బడ్జెట్‌లోనే సూపర్ ఫీచర్స్‌

ఈ స్మార్ట్ ఫోన్‌ను వచ్చే నెలలో లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు కంపెనీ ఈ ఫోన్‌ ఫీచర్లకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే నెట్టింట వైరల్‌ అవుతోన్న సమాచారం మేరకు ఈ ఫోన్‌లో ఉండనున్న ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లీక్స్‌ ఆధారంగా…
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం పోకో భారతమార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. పోకో ఎక్స్6 నియో పేరుతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకురానున్నారు. పోకో నుంచి ఇప్పటికే వచ్చిన పోకో ఎక్స్‌6, పోకో ఎక్స్‌ ప్రోలో కొనసాగింపుగా ఈ ఫోన్‌ను తీసుకురానున్నారు.ఈ స్మార్ట్‌ ఫోన్‌ను రెడ్‌మీనోట్‌ 13ఆర్‌ ప్రో స్మార్ట్‌ ఫోన్‌కు రీబ్రాండెడ్‌గా లాంచ్‌ చేయనున్నారు.
ఇదిలా ఉంటే ఈ స్మార్ట్ ఫోన్‌ను వచ్చే నెలలో లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు కంపెనీ ఈ ఫోన్‌ ఫీచర్లకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే నెట్టింట వైరల్‌ అవుతోన్న సమాచారం మేరకు ఈ ఫోన్‌లో ఉండనున్న ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లీక్స్‌ ఆధారంగా ఈ స్మార్ట్‌ ఫోణ్లో 6.67 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌రేట్ ఈ స్మార్ట్ ఫోన్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు.

ఇక పోకో ఎక్స్‌6 నియో స్మార్ట్‌ ఫోన్‌లో మీడియాటెక్‌ డైమెన్సిటీ 6080 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. ఇక 33 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించనున్నారు. ఇక ఈ ఫోన్‌లో ఐపీ54 రేట్‌ డస్ట్‌, స్ప్లాష్‌ రెసిస్టెంట్స్‌ను ఇవ్వనున్నారు. ఇక 3.5 ఎమ్‌ఎమ్‌ ఆడియో జాక్‌ వంటి కనెక్టివిటీ ఫీచర్‌ను ఇవ్వనున్నారు.
ఇక రెడ్‌మీ నోట్‌ 13ఆర్‌ ప్రోకి రీబ్రాండ్‌గా రానున్నట్లు తెలుస్తోన్న ఈ ఫోన్‌లో అచ్చం రెడ్‌మీ నోట్‌ 13ఆర్‌ ప్రో ఫీచర్లు ఉండనున్నట్లు సమాచారం. రెడ్‌మీ మోడల్‌లో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం ఇందులో 16 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇక ధర విషయానికొస్తే రెడ్‌మీన నోట్ 13 ప్రో ఆర్‌ ఫోన్‌ను రూ. 23,000గా నిర్ణయించారు. మరి పోకో ఎక్స్‌6 నియోలో ఎలాంటి ఫీచర్స్‌ ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.

కాళ్లు ఇలా మారిపోయి కనిపిస్తున్నాయా ? అయితే జాగ్రత్త.. హార్ట్ ఎటాక్ రావచ్చు..

రోజూ మనం తినే ఆహారాలు, తాగే ద్రవాలతోపాటు పాటించే జీవనశైలి కారణంగా మన శరీరంలో కొలెస్ట్రాల్ చేరుతుంటుంది. ఇందులో రెండు రకాలు ఉంటాయి.
ఒకదాన్ని హెచ్‌డీఎల్ అంటారు. ఇదే మంచి కొలెస్ట్రాల్. దీని వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. అందువల్ల హెచ్‌డీఎల్ ఎక్కువగా ఉండాలి. ఇక చెడు కొలెస్ట్రాల్‌నే ఎల్‌డీఎల్ అంటారు.

ఇది తక్కువగా ఉండాలి. ఇది మనకు హాని చేస్తుంది. కనుక శరీరంలో ఇది పేరుకుపోకుండా చూసుకోవాలి. అయితే ఎల్‌డీఎల్ స్థాయిలు పెరిగితే మనకు అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టినట్లు అవుతుంది.

దీంతో రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. ఫలితంగా గుండెపై ఒత్తిడి అధికంగా పడుతుంది. దీంతో హార్ట్ ఎటాక్‌లు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. కనుక కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగకుండా ఎప్పటికప్పుడు పరీక్షించుకుని చికిత్స తీసుకోవాలి.

అయితే శరీరంలో ఎల్‌డీఎల్ స్థాయిలు పెరిగితే మనం సులభంగా గుర్తు పట్టవచ్చు. ఎలాగంటే.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే రక్త సరఫరాకు ఆటంకం కలుగుతుంది కనుక కాళ్లకు రక్తం సరిగ్గా చేరదు.

దీంతో ఆ భాగాల్లో నొప్పులు ఉంటాయి. కాసేపు నడిచినా సరే బాగా అలసట వస్తుంది. కాళ్ళల్లో నొప్పులు వస్తాయి. అలాగే రక్త సరఫరా సరిగ్గా జరగదు కనుక కాళ్లు పాలిపోయినట్లు లేదా నీలి రంగులోకి మారుతాయి.

ఈ లక్షణాలు కనుక కనిపిస్తే వెంటనే అప్రమత్తమవ్వాలి. శరీరంలో రక్త సరఫరా సరిగ్గా జరగడం లేదని తెలుసుకోవాలి. వెంటనే డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. సమస్య ఉన్నట్లు తేలితే చికిత్స తీసుకోవాలి. దీంతో రక్త నాళాల్లో ఉండే కొలెస్ట్రాల్‌ను తొలగించుకోవచ్చు. ఫలితంగా గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

Legs

ఇక ఎల్‌డీఎల్ స్థాయిలు పెరిగితే పలు ఇతర లక్షణాలు కూడా మనకు కనిపిస్తాయి. అవేమిటంటే.. కాళ్లకు సంబంధించిన గోర్లు, కాళ్లపై కింది భాగంలో ఉండే వెంట్రుకలు పెరగవు. అలాగే శృంగార సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. దీంతోపాటు కాళ్లల్లో స్పర్శ సరిగ్గా ఉండదు. కాస్త దూరం నడిచినా చాలు.. ఆయాసం వస్తుంది. బరువు అసలు మోయలేరు. ఛాతిలో ఎడమ వైపు తరచూ నొప్పిగా ఉంటుంది. చేతులు, కాళ్లతో ఏ పని చేసినా నొప్పులుగా ఉంటాయి. కాస్త సేపు పని చేసినా ఆయా భాగాల్లో నొప్పి కలుగుతుంది.

ఇలా ఇవన్నీ ఎల్‌డీఎల్ స్థాయిలు పెరిగాయని చెప్పేందుకు కనిపించే లక్షణాలే. అందువల్ల ఈ లక్షణాలు ఎవరిలో అయినా కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. ఒక వేళ సమస్య ఉందని తేలితే చికిత్స తీసుకోవచ్చు. దీంతో గుండె జబ్బులు లేదా హార్ట్ ఎటాక్‌లు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. ఇలా జాగ్రత్త పడితే ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి సమస్యలు రావు.

Dry Coconut Milk : దీన్ని వారంలో మూడు సార్లు తీసుకోండి.. దెబ్బకు కీళ్ల నొప్పులు, నీరసం, నరాల బలహీనత తగ్గుతాయి..

Dry Coconut Milk : వయస్సు మీద పడడం వల్ల ఎవరికైనా సరే సహజంగానే కీళ్ల నొప్పులు వస్తుంటాయి. దీనికి తోడు నీరసంగా కూడా ఉంటుంది. ఇక కొందరికి అయితే నరాల బలహీనత కూడా వస్తుంది.
అయితే ఇవన్నీ ఒకప్పుడు మన పెద్దలకు మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు మారిన జీవనశైలి కారణంగా చిన్న వయస్సులో ఉన్నవారికి కూడా ఈ సమస్యలు వస్తున్నాయి. దీంతో అనేక అవస్థలు పడాల్సి వస్తోంది. అయితే కింద తెలిపిన విధంగా ఓ చిట్కాను పాటించడం వల్ల ఆయా సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు. మరి ఆ చిట్కా ఏమిటంటే..

స్టవ్‌ మీద పాత్ర పెట్టి అందులో ఒక టీస్పూన్‌ నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక అందులో కొద్దిగా గసగసాలు వేసి వేయించాలి. తరువాత అందులో ఒక గ్లాస్‌ పాలను పోయాలి. పాలు కొద్దిగా వేడి కాగానే అందులో అర టీస్పూన్‌ సోంపు, రుచికి సరిపడా పటిక బెల్లం వేయాలి. తరువాత అర టీస్పూన్‌ ఎండు కొబ్బరి తురుము వేయాలి. దీన్ని 8 నిమిషాల పాటు మరిగించాలి. పాలు బాగా మరిగాక స్టవ్‌ ఆఫ్‌ చేయాలి. తరువాత పాలు గోరు వెచ్చగా అయ్యాక వాటిని అలాగే తాగేయాలి.

Dry Coconut Milk
ఇలా పైన తెలిపిన విధంగా పాలతో మిశ్రమాన్ని తయారు చేసి వారంలో కనీసం మూడు సార్లు తాగాలి. ఈ విధంగా చేయడం వల్ల శరీరానికి పుష్కలంగా పోషకాలు అందుతాయి. దీంతోపాటు కాల్షియం, మెగ్నిషియం వంటి పోషకాలు లభిస్తాయి. ఈ క్రమంలోనే కీళ్ల నొప్పులు, నీరసం, అలసట, నరాల బలహీనత వంటి సమస్యలు అన్నీ తగ్గుతాయి.

గసగసాలలో ఉండే ఔషధ గుణాల వల్ల శరీరానికి కాల్షియం బాగా లభిస్తుంది. దీంతోపాటు నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. సోంపులో ఉండే కాల్షియం, విటమిన్లు, ఐరన్‌, మెగ్నిషియం వల్ల నొప్పులు తగ్గుతాయి. అలాగే జీర్ణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కనుక ఈ మిశ్రమాన్ని వారంలో మూడు సార్లు తాగితే ప్రయోజనాలను పొందవచ్చు.

Soaked Fenugreek Water: మెంతులు నానబెట్టిన నీటిని ఇలా తాగండి.. మీ శరీరంలో ఊహించని అద్భుతాలు

Soaked Fenugreek Water: మెంతులు నానబెట్టిన నీటిని ఖాళీ కడుపుతో తాగితే.. 5 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..

మనం వివిధ వంటకాల్లో జీలకర్ర, ఆవాలు, మిరియాలు, లవంగాల వంటి రకరకాల దినుసులను వాడుతుంటాం.

ఈ వంట దినుసుల్లో మెంతులు (Fenugreek seeds) కూడా ప్రధానంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు (Health Benefits) తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. మెంతులు రక్తాన్ని పలుచన చేసి రక్తప్రసరణ మెరుగుపరస్తాయి. కీళ్ల నొప్పుల్ని దూరం చేసే శక్తి వీటికి ఉంది. అలానే మూత్రనాళ, శ్వాస సంబంధిత రుగ్మతలను పోగొడతాయి. అయితే ఈ మెంతులను నానబెట్టి (Soaked Fenugreek Seeds) నీటితో తీసుకుంటే ఐదు ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట గోరువెచ్చని నీటిలో మెంతులను నానబెట్టి.. ఆ మిశ్రమాన్ని ఖాళీ కడుపుతో తాగితే 5 అద్భుతమైన ప్రయోజనాలు పొందొచ్చని అంటున్నారు. మరి ఆ ప్రయోజనాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

జీర్ణక్రియకు ఎంతో మేలు

మెంతులు సహజమైన యాంటాసిడ్‌గా పనిచేస్తూ జీర్ణక్రియలో దోహదపడతాయి. ఎసిడిటీ, ఉబ్బరం, గ్యాస్ వంటి అజీర్తి సమస్యలతో సతమతమవుతున్న వారు ఖాళీ కడుపుతో నానబెట్టిన మెంతుల నీటిని తాగితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. వర్షాకాలం, చలికాలంలో నానబెట్టిన మెంతుల నీటిని తీసుకోవడం మంచిది. అయితే ఈ డ్రింక్ ఒంట్లో వేడిని పెంచుతుంది కాబట్టి వేసవి కాలంలో తీసుకోకూడదు.

చెడు కొలెస్ట్రాల్‌కు చెక్

మెంతుల నీటిని తీసుకుంటే శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగుపడతాయి. మెంతుల్లో సమృద్ధిగా లభించే ఫ్లేవనాయిడ్స్‌ మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలతో బాధపడేవారు రోజూ ఈ హెల్తీ డ్రింక్‌ను తీసుకుంటూ మంచి ప్రయోజనాలను పొందొచ్చు.

నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం

మెంతుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఈ లక్షణాలు నెలసరి నొప్పులతో సహా ఇతర సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మెంతుల నీటిలో ఉండే ఆల్కలాయిడ్స్ వల్ల పీరియడ్ సమయంలో నొప్పి అనేది చాలా వరకు తగ్గుతుందని అధ్యయనాలు తేల్చాయి.

బరువు తగ్గేందుకు దోహదం

మెంతులు బరువు తగ్గడంలోనూ దోహదం చేస్తాయి. మెంతులను తరచూ తీసుకుంటే జీర్ణక్రియ శక్తి పెరుగుతుంది. డైటింగ్ చేస్తున్న వారు మెంతుల నీటిని ఖాళీ కడుపుతో డిటాక్స్ డ్రింక్‌గా తీసుకోవచ్చు. అయితే వీటిని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.

జుట్టు, చర్మ ఆరోగ్యానికి మంచిది

మెంతులలో డయోస్జెనిన్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇవన్నీ కూడా చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉండేలా సహాయపడతాయి.

*మెంతులు ఎలా నానబెట్టాలి..?

రాత్రిపూట ఒక ఫ్లాస్క్‌లో 1 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేయాలి. ఈ ఫ్లాస్క్‌లో 1 గ్లాసు వేడినీరు పోయాలి. గట్టిగా మూత పెట్టి మెంతులను రాత్రంతా నాననివ్వాలి. ఉదయాన్నే లేచి ముందుగా ఆ నీరు తాగాలి. తర్వాత మెంతులను నమిలి మింగాలి. మెంతులు బాగా చేదుగా ఉన్నాయనుకుంటే.. ఆ మిశ్రమాన్ని వడగట్టి ఆ నీటిని మాత్రమే తాగవచ్చు. లేదంటే పెనం మీద మెంతులను కాస్త వేడి చేసి వాటిని మెత్తగా మిక్సీ పట్టాలి. ఈ పొడిని 1 టీస్పూన్ గోరువెచ్చని నీటిలో కలిపి పొద్దున్నే తాగవచ్చు.

Walnuts Benefits: Nuts అన్నిటిలో ది బెస్ట్..ఇదే..! గుండెకు మంచిది.. షుగర్ కంట్రోలవుతుంది..

మనమందరం వాల్‌నట్‌లను డ్రై ఫ్రూట్స్‌గా ఉపయోగిస్తాము .
వాల్‌నట్‌ల ప్రయోజనాల గురించి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఇది మెదడుకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తారు, కానీ వాస్తవానికి వాల్‌నట్‌లు మన మొత్తం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైన డ్రై ఫ్రూట్స్ . వాల్ నట్స్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

ఇందులో ప్రొటీన్లు, విటమిన్లు అలాగే ఐరన్, కాల్షియం, కాపర్, ఫాస్పరస్, మెగ్నీషియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి అనేక ఇతర అంశాలు ఉంటాయి. ఇవన్నీ మన శరీరానికి వివిధ వ్యాధులతో పోరాడడంలో సహాయపడతాయి, ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. అవి శరీరానికి చాలా ప్రయోజనాలను కూడా తెస్తాయి.

నానబెట్టిన వాల్ నట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..

1. బ్లడ్ షుగర్ నియంత్రిస్తుంది – వాల్‌నట్స్ తినడం డయాబెటిక్ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. ఇది మాత్రమే కాదు, మీకు మధుమేహం లేకపోతే, దీని వినియోగం టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

2. మలబద్ధకం వల్ల ప్రయోజనం ఉంది – ప్రతి ఇతర వ్యక్తి మలబద్ధకం గురించి ఫిర్యాదు చేయడం కనిపిస్తుంది. మీరు మలబద్ధకంతో కూడా ఇబ్బంది పడుతుంటే, నానబెట్టిన వాల్‌నట్‌లను తీసుకోవడం వల్ల మీకు ప్రయోజనం చేకూరుతుంది. వాల్‌నట్స్‌లో చాలా ఫైబర్ ఉంటుంది. దీని వల్ల మన జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. దీనితో పాటు, నానబెట్టిన వాల్‌నట్‌లను జీర్ణం చేయడం కూడా సులభం.

3. గర్భిణీ స్త్రీలకు ప్రయోజనకరమైనది – గర్భధారణ సమయంలో అక్రోట్లను తినడం చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి, ఇది శిశువు మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది. అయితే గర్భధారణ సమయంలో వాల్‌నట్‌లను డాక్టర్‌ని సంప్రదించిన తర్వాతే తీసుకోవాలి.

4. రోగనిరోధక శక్తిని పెంచుతుంది – మీరు ప్రతిరోజూ వాల్‌నట్‌లను తీసుకుంటే, మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది చాలా సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది వ్యాధుల నుండి మనలను రక్షిస్తుంది.

5. బరువు అదుపులో ఉంటుంది – నానబెట్టిన వాల్ నట్స్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కూడా బరువు అదుపులో ఉంటుంది. మీరు అధిక బరువు కలిగి ఉంటే ,మీరు క్రమం తప్పకుండా వాల్‌నట్‌లను తీసుకుంటే, అది మీ బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. వాల్‌నట్‌లను తినడం వల్ల మన శరీరంలోని జీవక్రియ పెరుగుతుంది, ఇది అదనపు కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.

6. నిద్ర మంచిది – మీకు నిద్రలేమి సమస్య ఉంటే, వాల్‌నట్‌ల వినియోగం మీ నిద్రను మెరుగుపరుస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. వాల్‌నట్స్‌లో మెలటోనిన్ ఉంటుంది, దీని వల్ల మంచి నిద్ర వస్తుంది

Billa Ganneru : రక్తనాళాల్లో ఉండే కొవ్వును కరిగించే మొక్క ఇది.. బీపీ పూర్తిగా తగ్గిపోతుంది..!

Billa Ganneru : మనం ఇంటి ముందు అలంకరణ కోసం అనేక రకాల పూల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం. ఇంటి ముందు పెంచుకోవడానికి వీలుగా ఉండే మొక్కల్లో బిళ్ల గన్నేరుమొక్క కూడా ఒకటి.

ఈ మొక్క మనకు ఎక్కడ పడితే అక్కడ కనబడుతుంది. కేవలం అలంకరణకే కాకుండా ఈ మొక్క ఔషధంగా కూడా మనకు ఉపయోగపడుతుంది. మనకు వచ్చే వివిధ అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఈ మొక్కను ఔషధంగా ఉపయోగిస్తారు. బిళ్ల గన్నేరు మొక్కను ఉపయోగించి ఏయే అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో.. ఇప్పుడు తెలుసుకుందాం.

మనకు గాయాలు తగిలినప్పుడు ఈ బిళ్ల గన్నేరు మొక్క ఆకులను ముద్దగా నూరి గాయంపై ఉంచడం వల్ల గాయాల నుండి రక్తం కారడం ఆగుతుంది. ఇలా ఉంచడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. శరీరంలో వేడి ఎక్కువైనప్పుడు ముక్కు నుండి రక్తం కారుతుంది. అలాంటప్పుడు బిళ్ల గన్నేరు పువ్వులను, దానిమ్మ చెట్టు మొగ్గలను కలిపి నూరి రసాన్ని తీయాలి.

ఆ రసాన్ని ముక్కు రంధ్రాలలో రెండు చుక్కల చొప్పున వేయాలి. ఇలా వేయడం వల్ల ముక్కు నుండి రక్తం కారడం ఆగుతుంది. ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యలల్లో షుగర్ వ్యాధి కూడా ఒకటి. షుగర్ వ్యాధిని తగ్గించే ఔషధ గుణాలు బిళ్ల గన్నేరు మొక్కలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధితో బాధపడుతున్న వారు రోజూ ఉదయం పరగడుపున రెండు బిళ్ల గన్నేరు మొక్క ఆకులను, పువ్వులను తినడం వల్ల షుగర్ వ్యాధి క్రమంగా తగ్గుతుంది.

Billa Ganneru

అంతేకాకుండా ఈ మొక్క వేరును శుభ్రంగా కడిగి ఎండబెట్టి పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. రోజూ రెండు పూటలా భోజనం చేసిన తరువాత ఈ పొడిని అర టీ స్పూన్ మోతాదులో తీసుకుని దానికి అర టీ స్పూన్ తేనెను కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకున్నా కూడా షుగర్ వ్యాధి తగ్గు ముఖం పడుతుంది.

అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు బిళ్ల గన్నేరు మొక్క ఆకులను దంచి రసాన్ని తీసుకోవాలి. ఈ రసాన్ని రోజూ ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుంటూ ఉండడం వల్ల బీపీతోపాటు గుండె సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. రక్తనాళాల్లో ఉండే కొవ్వు కరిగి హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి.

ఈ ఆకుల రసాన్ని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడడంతోపాటు కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా బిళ్ల గన్నేరు మొక్క ఆకుల రసాన్ని తాగడం వల్ల పలు రకాల క్యాన్సర్ లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. బిళ్ల గన్నేరు మొక్క వేరు రసాన్ని తీసుకుని దానికి తేనెను కలిపి ఇస్తే మద్యం సేవించేవారు ఆ అలవాటును క్రమంగా మానేస్తారు.

ముఖంపై మొటిమలు, మచ్చలతో బాధపడే వారు బిళ్ల గన్నేరు ఆకులను, వేప చెట్టు ఆకులను సమపాళ్లలో తీసుకుని పొడిలా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని తగిన మోతాదులో తీసుకుని దానికి పసుపును, నీళ్లను కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి రాసుకుని ఒక గంట తరువాత కడిగేయాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.

మానసిక ఒత్తిడి కారణంగా బాధపడుతున్న వారు ఈ మొక్క పూలను సేకరించి దంచి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని ఒక టీ స్పూన్ మోతాదులో రాత్రి పడుకునే ముందు తాగడం వల్ల ఒత్తిడి తగ్గి చక్కగా నిద్రపోతారు. వర్షాకాలంలో పురుగులు, కీటకాలు ఎక్కువగా బయటకు వస్తాయి.

అవి అనుకోకుండా మనల్ని కుట్టినప్పుడు చర్మంపై దురదలు, దద్దుర్లు వంటివి వస్తాయి. ఈ బిళ్ల గన్నేరు మొక్క ఆకుల రసాన్ని పురుగులు, కీటకాలు కుట్టిన చోట రాయడం వల్ల దురదుల, దద్దుర్లు తగ్గుతాయి. ఈ విధంగా బిళ్ల గన్నేరు మొక్క మనకు ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

Salt : ఉప్పు తినడం పూర్తిగా మానేశారా ? అయితే జరిగే అనర్థాలు ఇవే..!

Salt : మనం రోజూ అనేక రకాల వంటల్లో ఉప్పును వేస్తుంటాం. అసలు ఉప్పు వేయనిదే ఏ వంటకమూ పూర్తి కాదు. ఉప్పుతోనే వంటలకు రుచి వస్తుంది.
అయితే కొందరు అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి ఉప్పును తినడం పూర్తిగా మానేస్తుంటారు.

వాస్తవానికి ఇలా చేయడం ప్రమాదకరమట. ఈ మేరకు వైద్యులు పలు కీలక విషయాలను వెల్లడిస్తున్నారు.

అసలు ఉప్పును తినడం పూర్తిగా మానేయరాదని.. అలా మానేస్తే అనేక అనర్థాలు సంభవిస్తాయని వారు చెబుతున్నారు. ఇంతకీ అసలు వారు ఏమంటున్నారంటే..

మన శరీరానికి కావల్సిన పలు ముఖ్యమైన పోషకాల్లో ఉప్పు ఒకటి. దీని వల్ల కండరాల కదలికలు, నాడుల్లో సమాచార ప్రవాహం, హృదయ స్పందనలు, మెటబాలిజం వంటి పనులు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతాయి.

ఈ క్రమంలోనే ఉప్పు అంటే సోడియం క్లోరైడ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో 39 శాతం సోడియం, 61 శాతం క్లోరిన్ ఉంటాయి.

రెండింటినీ కలిపి సోడియం క్లోరైడ్ లేదా ఉప్పుగా పరిగణిస్తుంటాం. ఇక మన శరీర బరువులో ఉప్పు 0.5 శాతం మేర ఉంటుంది.

Salt

మన శరీరంలో ఉప్పు సోడియం, క్లోరైడ్ అయాన్స్‌గా విడిపోతుంది. ఈ క్రమంలోనే సోడియం కణాల లోపల, బయట ద్రవాలను నియంత్రణలో ఉంచుతుంది. దీంతో నాడులు, కండరాలు సరిగ్గా పనిచేస్తాయి.

అయితే ఎప్పుడైతే వరుసగా 10 రోజుల పాటు ఉప్పును తినరో అప్పుడు కణాల లోపల, బయట ఒత్తిడి పెరుగుతుంది. దీంతో ద్రవాల సమతుల్యం తప్పుతుంది. ఫలితంగా నీరు కణాల్లోకి చేరుతుంది.

ఈ క్రమంలోనే కణాలు వాపులకు గురి కావడం జరుగుతుంది. దీంతో శరీరం అంతా ఉబ్బిపోతుంది. అలాగే ఈ పరిస్థితి ఎక్కువైతే కణాలు పగిలిపోతాయి. అదే జరిగితే ప్రాణమే పోతుంది.

కనుక ఉప్పును తీసుకోవడం పూర్తిగా మానేయకూడదని.. రోజులో తీసుకోవాల్సిన ఉప్పులో కాస్త తగ్గించి అయినా తీసుకోవాలి కానీ.. ఉప్పు తినడం మానేస్తే తీవ్ర అనర్థాలు సంభవిస్తాయని అంటున్నారు.

మన శరీరానికి తగినంత ఉప్పు లేకపోతే స్పృహ తప్పి పడిపోవడం, తలతిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో షాక్‌, కోమా లేదా మరణం వంటి విపరీతమైన పరిస్థితులకు కూడా దారి తీయవచ్చు.

కనుక ఉప్పు తినడం మానేయాలని చూస్తున్నవారు ఆ ఆలోచనను విరమించుకోవాలి. కాకపోతే రోజులో తీసుకునే ఉప్పు శాతాన్ని కాస్త తగ్గించుకోవచ్చు. అంతేకానీ పూర్తిగా మానేయరాదు.

ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం మన శరీరానికి రోజుకు 2 గ్రాముల సోడియం అవసరం. అంటే అది 5 గ్రాముల ఉప్పు ద్వారా లభిస్తుంది.

అంటే 1 టీస్పూన్ అన్నమాట. రోజుకు ఒక టీస్పూన్ మేర అయితే ఉప్పును తినవచ్చు. అంతకు మించకుండా చూసుకోవాలి. ఇలా ఉప్పును రోజూ సురక్షితమైన మోతాదులో తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండవచ్చు.

Guntagalagara Aku : మన చుట్టూ పరిసరాల్లో పెరిగే మొక్క ఇది.. తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది..!

Guntagalagara Aku : ప్రస్తుత కాలంలో మనలో చాలా మందిని వేధిస్తున్న సమస్యలలో తెల్ల జుట్టు సమస్య కూడా ఒకటి. ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువవుతోంది.

పూర్వకాలంలో 40 సంవత్సరాలు పై బడిన వారిలో మాత్రమే మనకు తెల్ల జుట్టు కనబడేది. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది చిన్న వయస్సులోనే తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారు. మన శరీరంలో 40 సంవత్సరాల తరువాత మెలనిన్ శాతం తగ్గి జుట్టు తెల్ల బడుతుంది. కానీ ప్రస్తుత తరుణంలో 40 కంటే తక్కువ వయస్సులోనే జుట్టు తెల్లగా మారుతోంది. చిన్న వయస్సులోనే జుట్టు తెల్లగా మారడానికి అనేక కారణాలు ఉంటాయి.

తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి మార్కెట్ లో దొరికే రకరకాల డైలను, హెన్నా పౌడర్ ల వాడుతూ ఉంటారు. వీటిని ఎక్కువగా వాడడం వల్ల చర్మ సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదం ద్వారా మనం తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. జుట్టును నల్లగా మార్చుకోవడానికి ఆయుర్వేదంలో ఎటువంటి పరిష్కారాలు ఉన్నాయి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన ఇంటి పరిసరాలలో ఉండే గుంటగలగరాకును ఉపయోగించి మనం తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ఈ మొక్క మనకు విరివిరిగా కనిపిస్తూనే ఉంటుంది. చూడడానికి పిచ్చి మొక్కలా ఉండే ఈ గుంటగలగరాకును ఉపయోగించి మనం తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.
Guntagalagara Aku

అంతేకాకుండా మనకు వచ్చే అన్ని రకాల జుట్టు సమస్యలను నయం చేయడంలో కూడా ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మొక్క నీరు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఎక్కువగా పెరుగుతుంది. గుంటగలగరాకు మొక్కను సమూలంగా సేకరించి శుభ్రంగా కడిగాలి. అనంతరం దాన్ని మెత్తగా నూరి దానిని కొబ్బరి నూనెలో వేసి చిన్న మంటపై నూనె నల్లగా అయ్యే వరకు మరిగించాలి. తరువాత వడకట్టి చల్లగా అయ్యే వరకు ఉంచి నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను ప్రతిరోజూ రాసుకోవడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడం తగ్గి జట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఈ నూనెను వాడడం వల్ల ఎటువంటి దుష్పభ్రావాలు ఉండవు. సహజ సిద్దంగా గుంటగలగరాకును ఉపయోగించి మనం తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడమే కాకుండా జుట్టు సమస్యలన్నింటినీ నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Walk : నడక బరువు తగ్గడానికే కాదు.. అలా కూడా ఉపయోగపడుతుంది!

ఇటీవల రోజుల్లో చాలా మంది అధిక బరువు సమస్యతో తీవ్రంగా సతమతం అవుతున్నారు. ఈ క్రమంలోనే పెరిగిన బరువును తగ్గించుకోవడం కోసం వాకింగ్‌ను డైలీ రొటీన్‌లో భాగం చేసుకుంటున్నారు.
అయితే నడక బరువు తగ్గడానికి మాత్రమే కాదు.. మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఆ ప్రయోజనాలు ఏంటో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

బిజీ లైఫ్ స్టైల్, ఒత్తిడి వంటి కారణాల వల్ల కోట్లాది మంది చిన్న వయసులోనే మతిమరపు, ఆలోచన శక్తి సన్నగిల్లడం వంటి సమస్యలను ఫేస్ చేస్తున్నారు.

అయితే వీటి నుంచి రక్షణ కల్పించడంలో నడక అద్భుతంగా సహాయపడుతుంది. ప్రతి రోజు కనీసం ఓ ముప్పై నిమిషాల పాటు ప్రశాంతంగా వాకింగ్ చేస్తే మెదడు కణాలు ఉత్తేజంగా మారతాయి. ఫలితంగా జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి.. రెండు రెట్టింపు అవుతాయి.

అలాగే ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోవడం, నడుము చుట్టూ అధికంగా కొవ్వు పేరుకుపోవడం, కొలెస్ట్రాల్ స్థాయిల్లో అసమతుల్యత ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తుతాయి.

అయితే ఈ సమస్యల నుంచి తప్పించుకోవాలంటే తప్పకుండా నడకను అలవాటు చేపుకోవాలి. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల వచ్చే ప్రమాదకర ప్రభావాలను తగ్గించగల సామర్థ్యం నడకకు ఉంది.

ఇక కొందరు తరచూ జీర్ణ సంబంధిత సమస్యలతో ఆగమాగం అయిపోతుంటారు. నడక ద్వారా జీర్ణ వ్యవస్థ చురుకుదనం పెరుగుతుంది.

ప్రతి రోజు కాసేపు నడిస్తే గ్యాస్‌, ఎసిడిటీ, అజీర్తి, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి. అంతేకాదు, రెగ్యులర్‌గా వాకింగ్ చేస్తే ఆయుష్షు పెరుగుతుంది.

ఊపిరితిత్తులు బలంగా, ఆరోగ్యంగా మారతాయి. రోగ నిరోధక వ్యవస్థ స్ట్రోంగ్‌గా మారుతుంది. మరియు క్యాన్సర్ వచ్చే ముప్పు సైతం తగ్గుతుంది.

కాబట్టి, అధిక బరువు ఉన్న వారు మాత్రమే కాదు.. ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని భావించే ప్రతి ఒక్కరూ వాకింగ్‌ను తమ డైలీ రొటీన్‌లో చేర్చుకోవాలి.

Mulla Thotakura : దీన్ని పిచ్చి మొక్క అనుకుంటే.. మీరు పొరపాటు పడినట్లే.. లాభాలు తెలిస్తే.. వెంటనే ఇంటికి తెచ్చుకుంటారు..

Mulla Thotakura : ముళ్ల తోటకూర.. దీనిని చాలా మంది చూసే ఉంటారు. ఇది మనకు విరివిరిగా కనిపిస్తుంది. ముళ్ల తోటకూర ఎక్కడపడితే అక్కడ పెరుగుతుంది.
దీని కొమ్మల చివర్లు ముళ్లు ముళ్లుగా ఉంటాయి. ముళ్ల తోటకూర ఆకుపచ్చ, ఎరుపు, తెలుపు రంగులలో మనకు లభిస్తుంది. ఆకుపచ్చగా ఉండే ముళ్ల తోటకూర ఎక్కువగా మనకు దొరుకుతుంది. ఎరుపు రంగులో ఉండే ముళ్ల తోటకూర కొంచెం తక్కువగా దొరుకుతుంది. తెల్లగా ఉండే ముళ్ల తోటకూర ఉత్తర భారతదేశంలో ఎక్కువగా దొరుకుతుంది. ఈ తోటకూరను కూడా చాలా మంది ఆహారంగా తీసుకుంటారు. ఈ ముళ్ల తోటకూర కూడా అనేక రకాల పోషకాలను కలిగి ఉంటుంది. దీనిని ఆయుర్వేదంలో ఔషధంగా కూడా ఉపయోగిస్తారు.

ఈ ముళ్ల తోటకూర వేరును సేకరించి కడిగి ఎండబెట్టి నిల్వ చేసుకోవాలి. దీనిని అవసరమయినప్పుడు నీటితో కలిపి మెత్తగా నూరి ఆ గంధాన్ని పావు టీ స్పూన్ మోతాదులో తీసుకుని అర కప్పు నీటిలో కలిపి ఆహారానికి అర గంట ముందు తీసుకుంటూ ఉంటే సెగరోగాలు తగ్గుతాయి. ఈ చెట్టు వేరు పొడిని పావు టీ స్పూన్ మోతాదులో తీసుకుని కొద్దిగా నీటిలో వేసి కలిపి ఆ నీటిని గోరు వెచ్చగా చేసి భోజనానికి అర గంట ముందు రెండు పూటలా 40 రోజుల పాటు తీసుకుంటూ ఉండడం వల్ల మూత్రపిండాలలో రాళ్లు పడిపోతాయి. ముళ్ల తోటకూర మొక్క మొత్తాన్ని తీసుకుని ముక్కలుగా చేసి ఎండబెట్టాలి. ఈ ముక్కలను కాల్చి బూడిద చేసి నిల్వ చేసుకోవాలి. ఈ బూడిదను గోరు వెచ్చని నీటిలో కలిపి మెత్తగా నూరి ముఖానికి పై పూతగా రాసి అది ఎండే వరకు ఎండలో కూర్చోవాలి. ఈ లేపనం ఎండిన తరువాత గోరు వెచ్చని నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల ముఖం పై ఉండే మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి.

ముళ్ల తోటకూర వేరు పొడి పావు టీ స్పూన్, తేనె ఒక టీ స్పూన్, పటిక బెల్లం పొడి ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని వీటిని ఒక కప్పు బియ్యం కడిగిన నీటితో కలిపి తీసుకుంటూ ఉండడం వల్ల ఎర్రబట్ట వ్యాధి తగ్గుతుంది. పాము కాటుకు గురి అయినప్పుడు ఈ మొక్క మొత్తాన్ని దంచి తీసిన రసాన్ని శారీరక బలానికి తగినట్టుగా పావు కప్పు నుండి అర కప్పు మోతాదులో ఇవ్వడం వల్ల పాటు విషం హరించుకుపోతుంది.

జుట్టును ఒత్తుగా పెంచే నల్ల నువ్వులు.. ఎలా వాడాలంటే?

నల్ల నువ్వులు.. భారతీయ వంటకాల్లో వీటిని విరి విరిగా ఉపయోగిస్తుంటారు. చక్కటి రుచిని కలిగి ఉండే నల్ల నువ్వులు.. తెల్ల నువ్వుల కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి.

అందుకే వీటిని డైట్‌లో చేర్చుకుంటే బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చని నిపుణులు చెబుతుంటారు. అయితే ఆరోగ్యానికే కాదు జుట్టు సంరక్షణకూ నల్ల నువ్వులు ఉపయోగపడతాయి. ముఖ్యంగా హెయిర్ ఫాల్‌ను తగ్గించి జుట్టును ఒత్తుగా పెరిగేలా చేయడంలో నల్ల నువ్వులు అద్భుతంగా సహాయపడతాయి. మరి ఇంతకీ కేశాలకు నల్ల నువ్వులను ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగైదు టేబుల్ స్పూన్ల నల్ల నువ్వులను వేసుకుని వాటర్‌తో ఒక సారి వాష్ చేసుకోవాలి. కడిగిన నువ్వుల్లో ఒక కప్పు వాటర్ పోసి గంట పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో నానబెట్టుకున్న నువ్వులు వాటర్‌తో సహా వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఈ నువ్వుల పేస్ట్ నుంచి జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ జ్యూస్‌లో వన్ టేబుల్ స్పూన్ పెరుగు, రెండు టేబుల్ స్పూన్ల అలోవెర జెల్‌, వన్ టేబుల్ స్పూన్ నువ్వుల నూనె, హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్‌ వేసుకుని అన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. ఆపై ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ పెట్టేసుకోవాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయాలి. ఇలా వారంలో రెండంటే రెండు సార్లు చేస్తే గనుక నల్ల నువ్వుల్లో ఉండే ప్రత్యేకమైన సుగుణాలు హెయిర్ ఫాల్ సమస్యను క్రమంగా తగ్గించేసి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరిగేలా చేస్తాయి. అలాగే ఈ హెయిర్ ప్యాక్ వాడటం వల్ల వైట్ హెయిర్ సమస్య త్వరగా రాకుండా కూడా ఉంటుంది.

Oats Dosa : గుండెకు ఎంతో మేలు చేసే ఓట్స్‌.. వాటితో దోశలను ఇలా వేసుకోండి..!

Oats Dosa : మనకు అందుబాటులో ఉన్న తృణ ధాన్యాల్లో ఓట్స్ ఒకటి. ఇవి మనకు అద్భుతమైన పోషకాలను, ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఓట్స్‌ను రోజూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు కరుగుతుంది.
గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు. ఇంకా ఓట్స్ వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఓట్స్‌ను నేరుగా తినడం కొందరికి ఇష్టం ఉండదు. కానీ వీటితో దోశలను వేసుకుని తినవచ్చు. ఇవి రుచిగా ఉండడమే కాదు.. మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఇక ఓట్స్ తో దోశలను ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Oats Dosa
ఓట్స్ దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..

ఓట్స్ – అర కప్పు, బియ్యం పిండి – అర కప్పు, జీలకర్ర – ఒక టీస్పూన్‌, బొంబాయి రవ్వ – పావు కప్పు, పెరుగు – అర కప్పు, అల్లం తురుము – ఒక టీస్పూన్‌, పచ్చి మిర్చి తురుము – 2 టీస్పూన్లు, మిరియాల పొడి – అర టీస్పూన్‌, కొత్తిమీర తురుము – 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు, ఉప్పు – తగినంత, నీళ్లు – మూడు కప్పులు, నూనె – వేయించడానికి సరిపడా.

ఓట్స్ దోశ తయారు చేసే విధానం..

ఓట్స్‌ను మిక్సీలో వేసి పొడి చేయాలి. తరువాత దానికి బియ్యం పిండి, రవ్వ, పెరుగు జోడించి కలపాలి. తరువాత జీలకర్ర, అల్లం తురుము, పచ్చి మిర్చి తురుము, కొత్తిమీర తురుము, మిరియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు అన్నీ వేసి కలపాలి. ఇప్పుడు నీళ్లు పోసి కలిపి 20 నిమిషాల పాటు నానబెట్టాలి. తరువాత పెనం వేడి చేసి కొద్దిగా నూనె రాసి పిండి మిశ్రమాన్ని గరిటెతో రవ్వదోశ మాదిరిగానే వేయాలి. బాగా కాలిన తరువాత రెండో వైపు కూడా కాల్చి తీసి ఇష్టమైన చట్నీ లేదా కూరతో తినాలి. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. పైగా ఓట్స్‌లోని పోషకాలన్నీ మనకు లభిస్తాయి. ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.

Viral Video: వావ్ .. ఈ గాజులమ్మ ఇంగ్లీషు అదరగొట్టింది

ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడాలని ఎవరికి ఇష్టం ఉండదు? అయితే ఎక్కువగా ఇంగ్లీషులో మాట్లాడితే ఏ పొరపాట్లు జరుగుతాయో అని, ఇతరులు ఎగతాళి చెస్తారేమోనే భయంతో ఉంటాం.కాని గాజులు, ముత్యాలు అమ్మే మహిళ ఇంగ్లీషులో అదరగొట్టింది.
ఆమె ఇంగ్లీషులో గోవా గురించి చక్కగా వివరించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది.

వివరాల్లోకి వెళ్తే…

నేటి కాలంలో ఆంగ్ల భాషకు అధిక ప్రాధాన్యత పెరిగింది. భాష నైపుణ్యాలలో ఇంగ్లీష్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంగ్లీష్లో మాట్లాడమంటే చాలా కష్టం.. దానికి మొదటి నుంచి ఇంగ్లీష్ పై పట్టు ఉండాలి.. లేదంటే ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో చదువుకుని ఉంటే.. ఇంగ్లీష్ మాట్లాడలేము. డిగ్రీ, పీజీలు చదువుకున్న వాళ్లు కూడా ఇంగ్లీషులో మాట్లాడేందుకు అప్పుడప్పుడు తడబడుతుంటారు. కానీ.. ఒక గాజులు అమ్ముకునే మహిళ ఇంగ్లీష్ మాట్లాడటం చూస్తే.. ఆశ్చర్యపోతారు. ఈ మహిళ గోవాలో గాజులు, ముత్యాలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తుంది. అయితే ఈ మహిళ ఇంగ్లీష్ మాట్లాడుతున్న వీడియో వైరల్‌ అవుతుండగా.. ఆమె గోవా గురించి ఇంగ్లీష్‌లో అనర్గళంగా చెబుతోంది. ఈమె మాట్లాడే ఇంగ్లీషు మాటలు విని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఈ వీడియో ఇన్స్టాలో der_alpha_mannchenలో ఖాతాతో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఓ మహిళ ఇసుకపై కూర్చుని ఇంగ్లీషులో మాట్లాడుతోంది. కోవిడ్ తర్వాత గోవా బీచ్‌లలో ఎలాంటి మార్పులు జరిగాయో ఆమె స్పష్టమైన ఆంగ్లంలో వివరించింది. ఆమె ఎంతకాలం నుంచి అక్కడ ఉందో.. అక్కడ ఎలాంటి మార్పులు జరిగాయో చెప్పింది. ఆ మహిళ ఏ మాత్రం తడబడకుండా ఆంగ్లంలో సమాధానం చెబుతోంది. ఆమె మాట్లాడే విధానం కూడా చాలా స్టైలిష్‌గా ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా లైక్ అవుతోంది.

Gastric Problem: ఇవి తీసుకుంటే గ్యాస్‌ సమస్య ఉండదు..!

Gases Immediately After Eating: ఆధునిక జీవనశైలిలో మారిన ఆహార అలవాట్ల కారణంగా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఎసిడిటీ, మలబద్దం వంటి సమస్యల బారిన పడుతున్నారు.
మనలో చాలా మంది తిన్నవెంటనే గ్యాస్‌ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యలకు ఇంట్లో లభించే కొన్ని ఆహార పదార్థాల వల్ల పరిష్కారం లభిస్తుంది.

సోంపు:

మీరు ఆహారం తిన్న తర్వాత సోంపు తీసుకుంటున్నారా. సోంపు తీసుకోవడం వల్ల ఎసిడిటీ సమస్యలు దూరం అవుతాయి.సోంపు నేరుగా తీసుకోవచ్చు. లేదా టీ తయారు చేసుకొని తాగవచ్చు. దీని గోరువచ్చని నీటిలో మరిగించి కూడా పరగడుపున తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

గోరువెచ్చని:

గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల కూడా ఎసిడిటీ సమస్య తగ్గుతుంది. ఇందులో నల్ల మిరియాలు కూడా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. లేదంటే గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ వేసి ఉంచడం వల్ల గ్యాస్ సమస్య దూరం అవుతుంది.

జీలకర్రనీరు:

జీలకర్రలో అనేక ఆరోగ్య ఔషధ గుణాలు ఉన్నాయి. జీలకర్ర యాసిడ్‌ రిప్లెక్స్‌ గ్యాస్‌ను దూరం చేయడంలో సహాయపడుతుంది. గ్యాస్‌ సమస్య ఉన్నప్పుడు జీలకర్రను ఉపయోగించడం చాలా మంది.

గ్రీన్ టీ తీసుకోవడం చాలా మంచిది. ఇందులో ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా లభిస్తాయి. ఇది జీర్ణవ్యవస్థలో ఆక్సీకరణ భారాన్ని సమతుల్యం చేయడానికి యాంటీఆక్సిడెంట్‌గా చేస్తుంది. దీని వల్ల గ్యాస్‌ సమస్య తగ్గుతుంది.

పెరుగు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.పెరుగుతో పాటు వేయించిన జీలకర్ర తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా ఎసిడిటీని తగ్గించడంలో ఎంతో మేలు చేస్తుంది.

జంక్‌ ఫూడ్‌, మసాలా వంటి ఆహారం తీసుకోవడం వల్ల కూడా గ్యాస్‌ సమస్య బారిన పడాల్సి ఉంటుంది. దీని కన్నా ఫైబర్‌ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు. భోజనం చేసిన తర్వాత ఓట్‌ మీల్, ఓట్స్‌ లాంటివి తీసుకుంటే మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

కొత్త కార్/బైక్ కొన్నప్పుడు..”కీస్” కి ఈ ట్యాగ్ ఎందుకు ఉంటుంది.? ఉపయోగం తెలిస్తే అస్సలు పడేయరు.!

మనలో చాలామంది కొత్త వాహనాలు కొంటూ ఉంటాం. కొన్న సమయంలో ఆ కార్లు, బండ్లు షోరూమ్ వాళ్ళు మనకు తాళం చెవులు అందిస్తూ ఉంటారు. ఆ వాహనానికి సంబంధించిన మాస్టర్ కి తో పాటు మరొక తాళంని కూడా మనకి అందిస్తారు.మనలో చాలామంది ఒకటి బండి దగ్గర ఉంచుకొని మరొకటి లోపల దాచుకుంటూ ఉంటాం.


అయితే చాలామందికి తాళం చెవులు ఎక్కడో పెట్టి మర్చిపోయే అలవాటు ఉంటుంది…లేదా తెలియకుండా పడేయవచ్చు. అటువంటి సమయంలో మన దగ్గర ఉన్న స్పేర్ కీ వాడుకుంటూ ఉంటాం. చాలామంది దగ్గర అటువంటి స్పేర్ కి కూడా లేని సమయంలో దానికి డూప్లికేట్ కీ తయారు చేస్తూ ఉంటారు. అంటే మన బండి తాళాలను పోలిన తాళాలు తయారు చేయడం అన్నమాట. ఆ డూప్లికేట్ తాళాలు ఒరిజినల్ ఉన్నంత భద్రంగా ఉండవు. ఇలాంటి అప్పుడు మనం పోగొట్టుకున్న తాళాలను మళ్ళీ పొందే అవకాశం ఉందని మీకు తెలుసా…

మనం బండి లేదా కారు కొన్నప్పుడు మన ఒరిజినల్ తాళాలకి ఒక ట్యాగ్ వేసి ఇస్తారు. ఆ ట్యాగ్ మీద ఒక సంఖ్య ఉంటుంది. ఆ సంఖ్య మన బండి తాళానికి సంబంధించిన సంఖ్య. ఆ ట్యాగ్ ను భద్రంగా దాచుకుంటే మన తాళం పడిపోయినప్పుడు ఆ ట్యాగ్ ను పట్టుకొని షో రూమ్ వద్ద చూపిస్తే సేమ్ అలాంటి ఒరిజినల్ కీ నే మళ్ళీ మనకి తయారు చేసి ఇస్తారు. అందువలన ట్యాగ్ ఎంతో భద్రంగా దాచుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనలో చాలామందికి ఆ ట్యాగ్ ఎందుకో తెలియక పారేస్తూ ఉంటాం. ఇకపై దాన్ని పడేయకుండా దాచుకుంటే భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం ఉంటుంది.

“వైయస్ షర్మిల” లవ్ స్టోరీ గురించి తెలుసా..? వీరి ప్రేమ కథ ఎలా మొదలయ్యింది అంటే..?

వైఎస్ షర్మిల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె దివంగత ఏపీ ముఖ్యమంత్రి వై. యస్. రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా సుపరిచితమే. గతంలో వైయస్ జగన్ తరఫున ఎలెక్షన్స్ ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ అంతట పాదయాత్రలో పాల్గొన్న షర్మిల, తర్వాతి కాలంలో తెలంగాణలో వైయస్సార్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు.


తెలంగాణలో పాదయాత్రలు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోటీ నుండి తప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. రాజకీయంగా వైఎస్ షర్మిల గురించి తెలిసినా, ఆమె పర్సనల్ లైఫ్ గురించి మాత్రం కొద్ది మందికే తెలుసు. షర్మిల బ్రదర్ అనిల్ కుమార్ ని ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. వీరి పరిచయం మరియు లవ్ స్టోరీ గురించి వైఎస్ షర్మిల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
వైయస్ షర్మిల చదువుకునే రోజుల్లో ఫ్రెండ్స్ తో హైదరాబాదులోని దాభాకు వెళ్ళినపుడు మొదటిసారి బ్రదర్ అనిల్ కుమార్ ని కలిశారట. షర్మిల ఫ్రెండ్స్ ఏర్పాటు చేసిన మీటింగ్ కు అనిల్ కుమార్ కూడా వచ్చారంట. ఆ మీటింగ్ తరువాత అప్పుడప్పుడు ఇద్దరు కలుస్తూ ఉండేవారంట. అనిల్ కుమార్ ముందుగా ప్రపోజ్ చేశారట.


అయితే ఆ సమయంలో అతను క్రైస్తవ మతంలోకి మారలేదు. అనిల్ కుమార్ బ్రాహ్మణ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కావడంతో ఈ పెళ్లికి షర్మిల తండ్రి వై యస్ రాజశేఖర్ రెడ్డి ముందుగా అంగీకరించలేదట. అతను బ్రాహ్మణ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి అని, ఇరు కుటుంబాల అలవాట్లు, పద్దతులు వేరు, ఇప్పుడు బాగున్నట్టే ఉంటుంది. కానీ ఆ తరువాత ఉండలేవు అని షర్మిలకి నచ్చ చెప్పారట.
అయినప్పటికీ తాను ఉండగలనని నమ్మకంతో అనిల్ కుమార్ ని వివాహం చేసుకున్నట్లుగా వెల్లడించారు. షర్మిల నాన్ వెజ్ తినడంలో తమకి ఎలాంటి ఇబ్బంది లేదని బ్రదర్ అనిల్ కూడా చెప్పారని, తమ జీవితం సంతోషంగా కొనసాగుతుందని తెలిపారు. తన రాజకీయా జీవితానికి కూడా బ్రదర్ అనిల్ కుమార్ పూర్తిగా సపోర్ట్ చేస్తారని చెప్పుకొచ్చారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

శ్రీరాముడు పూజించిన ఈ చెట్టును మీ ఇంట్లో పెంచుకోండి… దీని ప్రాముఖ్యత తెలుసా…?

హిందూ మతానికి ప్రకృతికి ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ప్రకృతిలో ఉండే రకరకాల చెట్లను జంతువులను హిందూమతంలో పూజిస్తూ ఉంటారు. కొన్ని జంతువుల అయితే దేవుడి వాహనాలుగా కొలుస్తూ ఉంటారు. ఇక ప్రత్యేకించి తులసి, రావి, జమ్మి వంటి చెట్లను ఇంటి పరిసరాల్లో పాతుకుని ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. ఈ చెట్లలో జమ్మి చెట్టుకు ప్రత్యేకమైన ఆవశ్యకత ఉంది. శ్రీరాముడు వనవాసం చేసే సమయంలో జమ్మి చెట్టుకు పూజలు చేసేవారు అని చెబుతారు. ఈ చెట్టుని పూజించడం లేదా ఇంటి వద్ద నాటుకోవడం వల్ల అంతా మంచే జరుగుతుందని నమ్ముతారు.
పురాణాల ప్రకారం శ్రీ రాముడు వనవాసం చేసే సమయంలో జమ్మి వృక్షాన్ని పూజించేవాడు. శమీ వృక్షాన్ని హిందూ మతంలో ఎంతో పూజ్యనీయంగా భావిస్తారు. చాలా మంది దీనిని తమ ఇంట్లో పెంచుకుని పూజిస్తారు. ఇక శివుడికి కూడా ఇష్టమైన చెట్టుగా జమ్మిని పరిగణిస్తారు.జమ్మీ ఆకులతో శివుడికి పూజలు కూడా చేస్తారు. జమ్మి ఆకుల వల్ల పర్యావరణం కూడా శుద్ధి అవుతుంది. జమ్మి ఆకు చట్టం ఇంటిలో పెంచుకున్న ఆకులతో పూజలు చేసిన శని దేవుడిని శాంతింప చేయొచ్చని చెబుతారు. తద్వారా వైవాహిక జీవితం ఆనందంగా మారి కుటుంబాలలో కలహాలు తగ్గుతాయని అంటున్నారు.

ఇంటి ఆవరణలోని ప్రధాన ద్వారం వద్ద ఈశాన్య మూలలో జమ్మి చెట్టుని పెంచుకోవాలి. ఈ ప్రదేశం శమీ వృక్షానికి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ప్రదేశంలో శమీ మొక్కను పెంచుకోవడం ద్వారా లక్ష్మీ దేవి ఆశీర్వాదం లభించి ఇంట్లో సంతోషం నెలకొంటుందని నమ్మకం.

ఎట్టకేలకు నాగచైతన్యకు రెండో పెళ్లి చేయబోతున్న నాగార్జున.. అమ్మాయి ఎవరంటే?

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య, సమంత బ్యూటిఫుల్ కపుల్‌గా ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు. వీరిద్దరు ‘ఏమాయ చేసావే’ సినిమాతో ప్రేమలో పడ్డారు.
కొద్ది కాలం తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఎప్పటికైనా నాగచైతన్య-సమంత కలవకపోతారా? అనే ఆశతో అభిమానులంతా ఎదురుచూస్తున్నారంటే అతిశయోక్తి కాదు.

అయితే విడాకుల తర్వాత నాగచైతన్య ఒంటరిగా ఉంటూ తన కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టాడు. వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీ అయిపోయాడు. ఇక సమంత విషయానికి వస్తే మయోసైటీస్ రావడంతో ఇండస్ట్రీకి దూరమై ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుంది. అయితే గత కొద్ది కాలంగా వీరిద్దరికి సంబంధించిన వార్తలు మాత్రం నిత్యం నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.

తాజాగా, నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని న్యూస్ వైరల్ అవుతుంది. నాగార్జున బంధువుల అమ్మాయితో చై పెళ్లి చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారట.ఈ ఏడాది చివరకు, లేదంటే వచ్చే ఏడాది మొదట్లో పెళ్లి చేయాలనే పట్టుదలతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అఖిల్, చై ఇద్దరిలో ఎవరో ఒకరి పెళ్లి చేస్తే కుటుంబం సంతోషంగా ఉంటుందని భావిస్తున్నారట. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఫ్యాన్స్ మాత్రం నిరాశ చెందుతున్నారు. సమంత, చై కలిసిపోతారని అనుకుంటుంటే చై రెండో పెళ్లి చేసుకోవడమేంటని ఆందోళన చెందుతున్నారు.

ఆర్‌బీఐ రూల్స్‌ : క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగిస్తున్నారా?,అయితే ఇది మీకోసమే!

ఎప్పుడు బ్యాంకులు సామాన్యుల దగ్గరి నుంచి పెనాల్టీల మీద పెనాల్టీలు వసూలు చేస్తుంటాయి. కానీ బ్యాంకులు చేసే తప్పులకు కూడా కస్టమర్లు పెనాల్టీల రూపంలో డబ్బుల్ని వసూలు చేయోచ్చు.
ఎలా అంటారా?

ఉదాహరణకు రమేష్‌ అనే వ్యక్తి ‘ఏ’ అనే బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగిస్తున్నాడు. దానిని ఆగస్ట్‌ 2023లో క్లోజ్‌ చేయాలని సదరు బ్యాంక్‌కు రిక్వెస్ట్‌ పెట్టాడు. బ్యాంక్ వాళ్లు మాత్రం నవంబర్‌ 2023కి క్రెడిట్‌ కార్డ్‌ను క్లోజ్‌ చేశారు.

ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం..
జూలై 01, 2022 నుండి అమల్లోకి వచ్చిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ – ఇస్సుఎన్స్ అండ్ కండక్ట్ ) ఆదేశాల ప్రకారం.. కస్టమర్‌ తన క్రెడిట్‌ కార్డ్‌ను క్లోజ్‌ చేయాలని బ్యాంక్‌కు రిక్వెస్ట్‌ పెట్టిన వారం రోజుల వ్యవధిలో క్లోజ్‌ చేయాలి. అలా చేయకపోతే.. ఎన్ని రోజులు ఆలస్యం చేస్తే అన్ని రోజులకు గాను ప్రతి రోజు రూ.500 చొప్పున బ్యాంక్‌ నుంచి వసూలు చేయోచ్చు.

బ్యాంకులు సకాలంలో స్పందించకపోవడం, ఆర్‌బీఐ కంప్లెయిట్‌ విభాగంలో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు ఆర్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌ విధించిన కొన్ని నియమ, నిబంధనలు ఇలా ఉన్నాయి. వాటిల్లో..

►ఆర్‌బీఐ ఆదేశాలు ప్రకారం, క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్‌ చేయాలని కోరిన అభ్యర్ధనను బ్యాంక్‌లు ఏడు వర్కింగ్‌ డేస్‌లో పూర్తి చేయాలి. కార్డ్‌ హోల్డర్‌ సైతం బకాయిలన్నింటిని చెల్లించాలి.

►క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్‌ చేస్తున్నట్లు కార్డ్ హోల్డర్‌కు ఇమెయిల్‌, ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం అందివ్వాలి.

►క్రెడిట్ కార్డ్ జారీచేసిన బ్యాంక్‌లు క్రెడిట్ కార్డ్‌ను మూసివేస్తూ చేసే రిక్వెస్ట్‌ను బ్రాంచ్‌, మొబైల్‌, ఆన్‌లైన్‌, కాల్‌ సెంటర్‌, ఏటీఎం ఇలా అన్నీ విభాగాలకు తక్షణమే తెలపాలి.

►క్రెడిట్‌ కార్డ్‌ను క్లోజ్‌ చేయాలనే అభ్యర్ధనను పోస్ట్‌ లేదా ఇతర మార్గాల ద్వారా పంపాలని ఎట్టిపరిస్థితుల్లో కస్టమర్లను ఇబ్బంది పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల క్రెడిట్‌ కార్డ్‌ను క్లోజ్‌ చేసేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది.

►ఏడు పనిదినాల్లోగా క్రెడిట్ కార్డ్‌ను మూసివేసే ప్రక్రియలో బ్యాంకులు విఫలమైతే.. కస్టమర్‌ ఇప్పటికే బాకీలన్ని చెల్లించినట్లైతే సదరు కార్డు దారులకు రోజుకు రూ.500 అదనపు ఛార్జీలు చేయాలి.

►ఏడాది అంతకంటే ఎక్కువ రోజుల పాటు క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించుకుని ఉంటే సంబంధిత కార్డ్‌ క్లోజింగ్‌ సమాచారాన్ని యూజర్‌కు అందించి అప్పుడు క్లోజ్‌ చేయొచ్చు.

►30 రోజుల వ్యవధిలోగా కార్డ్ హోల్డర్ నుండి ఎటువంటి ప్రత్యుత్తరం రాకపోతే, బ్యాంక్‌లు క్రెడిట్‌ కార్డ్‌ను క్లోజ్‌ చేయొచ్చు.

►కార్డ్ జారీచేసేవారు 30 రోజుల వ్యవధిలో క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీతో కార్డ్ మూసివేతను అప్‌డేట్ చేయాలి.

►క్రెడిట్ కార్డ్ అకౌంట్‌ను క్లోజ్‌ చేసిన తర్వాత, క్రెడిట్ కార్డ్ ఖాతాలో ఏదైనా క్రెడిట్ బ్యాలెన్స్ అందుబాటులో ఉంటే, అది కార్డ్ హోల్డర్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయాల్సి ఉంటుందని ఆర్‌బీఐ తెలిపింది.

10 లక్షల మంది ఎగబడి మరీ ఈ కారు కొనేశారు – ఎందుకింత డిమాండ్..

Maruti Ertiga One Million Sales: కాలం మారుతోంది.. చిన్న కార్లతో పాటు పెద్ద కార్లకు డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు దేశీయ విఫణిలో ఫ్యామిలీ కార్స్ కూడా విరివిగా లాంచ్ చేస్తున్నాయి.
కొత్త కార్లు ఎన్ని వచ్చినప్పటికీ కొంత మంది నమ్మికైన బ్రాండ్స్ మాత్రమే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇందులో ఒకటి ‘మారుతి సుజుకి’ (Maruti Suzuki) కంపెనీకి చెందిన మూడు వరుసల ఎంపివీ ‘ఎర్టిగా’ (Ertiga).

10 లక్షల సేల్స్..

మారుతి ఎర్టిగా 2012లో భారతీయ విఫణిలో అడుగుపెట్టినప్పటి నుంచి, ఈ కారు ఏకంగా ఒక మిలియన్ అమ్మకాలను (10 లక్షలు) పొందగలిగింది. దీన్ని బట్టి చూస్తే ఎర్టిగా కారుకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందని ఇట్టే అర్థమైపోతోంది. నిజానికి ప్రారంభంలో ఈ MPV గొప్ప అమ్మకాలను పొందనప్పటికీ.. 10 లక్షల యూనిట్లు అమ్ముడు కావడానికి ఎనిమిది సంవత్సరాల తొమ్మిది నెలల సమయం పట్టినట్లు సమాచారం. అయితే చివరి లక్ష యూనిట్లు సేల్ కావడానికి కేవలం ఎనిమిది నెలల సమయం మాత్రమే పట్టిందని కంపెనీ వెల్లడించింది.

ప్రారంభంలో డీజిల్ ఇంజిన్

మారుతి ఎర్టిగా 2012లో లాంచ్ అయినప్పుడు.. అప్పట్లో ఖరీదైన టయోటా కంపెనీ యొక్క ఇన్నోవాకు కొంత పోటీ ఇస్తూ అమ్మకాల పరంగా దాని ప్రత్యర్థులను అధిగమించగలిగింది. ప్రారంభంలో ఎర్టిగా 1.3 లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగి ఉండేది. ఈ ఇంజిన్ ఆప్షన్ కలిగి ఉండటం అమ్మకాలు పెరుగుదలకు కారణమైంది.

2018లో సెకండ్ జనరేషన్ ఎర్టిగా విడుదలైనప్పుడు, అందులో 1.3 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌తో పాటు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ కూడా అందుబాటులోకి వచ్చింది. కానీ బిఎస్ 6 ఉద్గార ప్రమాణాల అమలులోకి రావడం వల్ల డీజిల్ ఇంజిన్ కార్ల ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో ఎర్టిగా పెట్రోల్ మరియు CNG ఆప్షన్‌లతో అందుబాటులోకి వచ్చింది.

ప్రత్యర్థులకు గట్టి పోటీ..

మారుతి ఎర్టిగా ప్రస్తుతం 1.5 లీటర్ పెట్రోల్ మరియు CNG పవర్‌ట్రైన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. కియా కారెన్స్, రెనో ట్రైబర్ వంటి వాటికి గట్టి పోటీ ఇస్తూ అమ్మకాల్లో దూసుకెళ్తున్న ఎర్టిగా చాలామందికి ఫ్యామిలీ కార్స్ కొనుగోలుదారులకు మొదటి ఎంపికగా నిలుస్తూ ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తోంది.

వేరియంట్స్ & ధరలు

ఎల్ఎక్స్ఐ (ఓ), వీఎక్స్ఐ (ఓ), జెడ్ఎక్స్ఐ (ఓ) మరియు జెడ్ఎక్స్ఐ ప్లస్ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తున్న మారుతి ఎర్టిగా ధరలు రూ. 8.69 లక్షల నుంచి రూ. 13.03 లక్షల మధ్య ఉన్నాయి. ఎర్టిగాకు శక్తినిచ్చే 1.5 లీటర్ కే సిరీస్ పెట్రోల్ ఇంజిన్ మైల్డ్ హైబిడ్ సిస్టమ్‌తో 5 స్పీడ్ మాన్యువల్ లేదా టార్క్ కాన్వర్టర్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

భవిష్యత్ మారుతి ఎలక్ట్రిక్ కార్లు..

ఇదిలా ఉండగా మారుతి సుజుకి భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసే యోచన చేస్తోంది. ఇందులో భాగంగానే eVX మరియు మరికొన్ని హైబ్రిడ్ మోడల్స్ రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ కార్లుగా మార్కెట్లో విడుదలకానున్నాయి.

మారుతి సుజుకి భారతీయ మార్కెట్లో తన ఉనికిని మరింత విస్తరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కార్లను లేదా అప్డేటెడ్ కార్లను లాంచ్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే గత ఏడాది దేశీయ విఫణిలో అడుగుపెట్టిన ఫ్రాంక్స్ ఇప్పటికే మంచి అమ్మకాలను నమోదు చేసింది. అంతే కాకుండా గత నెలలో మారుతి బాలెనొ, స్విఫ్ట్, బ్రెజ్జా వంటి కార్లు ఉత్తమ అమ్మకాలు పొందిన టాప్ 10 కార్ల జాబితాలో కూడా స్థానం సంపాదించాయి.

దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ‘తెలుగు డ్రైవ్‌స్పార్క్’ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవ్వండి.

Nervous Weakness : నరాల బలహీనత తగ్గాలంటే ఈ ఒక్క ఆకుకూర చాలు.!

Nervous Weakness : మనం ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా ఆకుకూరలు తినాలి. కానీ మనం వాటిని చూస్తేనే మొహం తిప్పేస్తాము.. ఎందుకంటే ఆకుకూరలు నోటికి రుచిగా ఉండవనికొందరి ఫీలింగ్..
ఆవిధంగాఆకు కురలని నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే ఆకుకూరల్లో ఉండే ఉపయోగాలు గురించి సరిగ్గా అవగాహన లేకపోవడమే.. కొందరికి తెలిసిన తినరు.. అలాగే చిన్నపిల్లలు కూడా ఆకుకూరలు అస్సలు తినరు.. ఆకుకూరల్లో అతి ముఖ్యమైన వాటిలో బచ్చల కూర కూడా ఒకటి. ఈ బచ్చలకురను ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు.. లేదంటే పప్పులో కూడా వేసుకోవచ్చు.

అయితే ఇప్పుడు బచ్చలకూర వల్ల పలు ప్రయోజనాలను తెలుసుకుందాం. ముఖ్యంగా బచ్చలి కూర శరీరానికి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. రక్తహీనతతో బాధపడే వారికి కూడా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా అధిక రక్తపోటు సమస్య ఉన్నవారికి కూడా తీసుకోవడం వల్ల వాటి నుంచి విముక్తి పొందవచ్చు.. ప్రతిరోజు ఈ ఆకుకూరలు తినడం వల్ల రక్తపోటు నియంతంలో ఉంటుందట. రక్తపోటు అదుపులో ఉంచుకోవచ్చు. ఈ కూరను ప్రతిరోజు ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వును పదార్థాలను శాతం కరిగిస్తుంది.

ఇందులో ఒమేగా త్రీ ఆమ్లాలు, సెలీనియం అధికంగా ఉంటాయి. ఇది నరాల బలహీనత ఉండే వారికి నీరసంగా ఉండే వారికి చాలా ఉపయోగపడుతుంది. ఇక అంతేకాకుండా మెదడు ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఈ బచ్చలకూర చాలా సహాయపడుతుంది. మూత్రంలో ఇన్ఫెక్షన్ వంటి సమస్యతో ఇబ్బంది పడేవారు ప్రతిరోజు ఈ బచ్చల కూర తీసుకోవాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. అంతేకాకుండా కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలకు ఇబ్బంది పడేవారు ఈ ఆకులు తరచూ తినడం వల్ల సమస్య నుండి విముక్తి పొందవచ్చు.. అయితే ఈ బచ్చల కూరను పప్పులతో సహా కలుపుకొని ఫ్రై చేసుకుని తినడం వల్ల మరిన్ని పోషకాలు లభిస్తాయి.

పక్షుల్లా ఎగిరే పాములు.. అక్కడికి వెళ్లిన వారు ఎవరూ తిరిగిరాలేదు.. అంత డేంజర్..!

పాము పేరు వింటనే మనలో చాలా మందికి ఒళ్లు జలదరిస్తుంది. పాము కనిపిస్తేనా.. పైప్రాణాలు పైనే పోతాయి. భయంతో గజగజా వణికిపోతాం. వెంటనే అక్కడి నుంచి దూరంగా పరుగులు పెడతాం.
ఒక్క పామును చూస్తేనే ఇలా అనిపిస్తే.. మరి వేల సంఖ్యలో పాములుంటే పరిస్థితి ఏంటి…? ఊహించుకోవడానికి కూడా భయంకరంగా ఉంది కదా..! కానీ ఈ భూప్రపంచంలో ఒక ప్రాంతముంది. అక్కడ పాములు తప్ప ఇంకేమీ ఉండవు. అవి కూడా మామూలు పాములు కాదు. అత్యంత విషపూరితమైన పాములు (Venomous Snakes’ Island). కాటేస్తే.. క్షణాల్లో ప్రాణాలు పోతాయి. మరి అదెక్కడుంది? దాని విశేషాలను ఇక్కడ తెలుసుకుందాం.

బ్రెజిల్‌లోని సావోపాలో (Sao Paulo) ప్రాంతంలో Ilha da Queimada Grande అనే ఐలాండ్ (Brazil Snake Island) ఉంది. దానిని పాముల దీవిగా కూడా పిలుస్తారు. ఎందుకంటే అక్కడ పాములే ఉంటాయి. అవి పదులు వందల్లో కాదు.. వేలాది రకాల పాముల అక్కడ నివసిస్తున్నాయి. ఈ ద్వీపం ఎన్నో ఏళ్లుగా విషపూరితమైన పాములకు నిలయంగా ఉంది. అందుకే అక్కడి మనుషుల ప్రవేశం లేదు. టూరిస్టులపైనా నిషేధం విధించారు. ఈ దీవి సావో పాలో నుంచి 32 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఉండే పాములు చాలా ప్రమాదకరమైనవి. విషపూరితమైనవి. ప్రపంచంలోనే అత్యంత అరుదైన, విషపూరితమైన పాము గోల్డెన్-హెడ్ గోల్డెన్ లాన్స్‌హెడ్ వైపర్ పాము.. ఈ ద్వీపంలో మాత్రమే కనిపిస్తుంది.

ఇక్కడ కొన్ని రకాల పాములున్నాయి. అవి పక్షులపై దూకి కాటేస్తాయి. తక్కువ ఎత్తులో నుంచి ఏవైనా పక్షులు వెళ్తే.. వాటిపై దూకి చంపేస్తాయి. ఈ పాములు కాటేస్తే.. మనుషులు ఉక్కిరిబిక్కరవుతారు. క్షణాలోనే చనిపోతారని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇల్హా క్విమడా గ్రాండె ద్వీపానికి మనషులను అనుమతించడం లేదు. సాధారణ ప్రజలు, పర్యాటకులపై నిషేధం విధించారు.

బ్రెజిలియన్ నేవీ, చికో మెండిస్ ఇన్స్టిట్యూట్ ఫర్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ (Chico Mendes Institute for Biodiversity Conservation) ఎంపిక చేసిన పరిశోధకులు మాత్రమే ఈ స్థలాన్ని సందర్శిస్తారు. 1909 నుంచి 1920 సంవత్సరాల మధ్య లైట్ హౌస్ ఆపరేషన్ కోసం కొంతమంది నివసించారు. ఆ తర్వాత సాధారణ ప్రజలెవరూ అక్కడికి వెళ్లలేదు. అరుదైన పాములను చంపేందుకు.. వేటగాళ్లు వస్తున్నారని కొన్ని పుకార్లు వచ్చినప్పటికీ… కానీ ఇందులో నిజం లేదని అక్కడి అధికారులు వెల్లడించారు.

Fake Messages: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్ పేరుతో మెసేజ్‌.. స్పందించారో దోచేస్తారు.!

Fake Messages: నిరుద్యోగ యువతే టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో వారికి గాలం వేస్తూ వేలల్లో దోచుకుంటున్నారు.
దీనికి ఆకర్షితులైన యువత డబ్బులు పోగొట్టుకుని లబోదిబో మంటా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఆన్‌లైన్‌లో కనిపించే ఆకర్షణీయమైన ప్రకటనల్లో ఏది నిజమో, ఏది నకిలీదో తెలియని గందరగోళం నెలకొంది. ప్రధానంగా ఉద్యోగం కోసం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతీ, యువకులు ఈ ఉచ్చులో పడుతున్నారు.

ఇటీవల ఓ యువతిని వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా నకిలీ వెబ్‌సైట్ లింక్‌ను పంపడం ద్వారా సుమారు రూ. లక్ష వరకు చెల్లించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం నిజాంపేటకు చెందిన నవ్యశ్రీ అనే యువతి బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకుతోంది. ఈ క్రమంలో ఈనెల 2న నవ్యశ్రీకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ గుర్తుతెలియని వ్యక్తి ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ జాబ్ పేరుతో లింక్ పంపాడు. లింక్ ఓపెన్ చేసి కొన్ని పనులు చేస్తే డబ్బులు వస్తాయని నమ్ముతున్నారు. నిజమే అనుకున్న నవ్యశ్రీ లింక్ ఓపెన్ చేసి వారు ఇచ్చిన టాస్క్ లు పూర్తి చేసింది. అయితే దీని కోసం ముందుగా కొంత డబ్బు చెల్లించాలని, తాము చెల్లించిన దానికంటే ఎక్కువ తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు. అది నిజమని నమ్మిన యువతి మొత్తం రూ. ఆలోచించకుండా ఏడు విడతల్లో రూ.91,100 ఆమె ఖాతా నుంచి పంపించారు. డబ్బు పంపిన తర్వాత అవతలి వైపు నుంచి వచ్చిన స్పందన ఒక్కసారిగా షాక్ తిన్నారు.
అంతకు రెట్టింపు ఇస్తామని చెప్పిన వ్యక్తులు డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చింది. తాను పంపిన డబ్బును వెంటనే వెనక్కి పంపాలని కోరింది. అవతలి వ్యక్తి రూ.83 వేలు పన్ను చెల్లిస్తే తిరిగి ఖాతాలో డబ్బులు వస్తాయని బదులిచ్చారు. మోసపోయానని భావించిన బాధితురాలు అదే రోజు సైబర్ క్రైమ్ 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి ఘటనలు ఇటీవల సర్వసాధారణమైపోయాయి. ఉద్యోగం కోసం వెతుకులాటలో చేతిలో ఉన్న కొద్దిపాటి డబ్బు కూడా కోల్పోయే దుస్థితి నెలకొంది. అందుకే తస్మాత్ జాగ్రత్త! వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలను విపరీతంగా ఉపయోగిస్తున్న యువతీ, యువకులు తాము చూసే ఆకర్షణీయమైన ప్రకటనలన్నీ నిజమేనని నమ్మి మోసపోకూడదని సూచించారు.

రాబోయే 10 సంవత్సరాలు మీరు ఆరోగ్యంగా ఉండాలంటే.. వెంటనే ఈ 4 పనులు చేయటం అలవాటు చేసుకోండి..!

మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు పూర్తిగా అనారోగ్య భరితంగా మారాయి. ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది తినేస్తున్నారు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, తెల్లవారుజామున లేవడం, ఆహారం పేరుతో ఏది దొరికితే అది తినడం మన నిత్య అలవాట్లు అయిపోయాయి.
మనకు వచ్చే ప్రతి చిన్నా పెద్దా వ్యాధికి మూలం మన అలవాట్లే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కానీ, ఆరోగ్యకరమైన జీవనశైలి మన జీవితంలోని అనేక సమస్యలను దూరం చేస్తుందని చెబుతున్నారు.. మన దినచర్యలో కొన్ని ప్రత్యేక పద్ధతులు పాటిస్తే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చని సూచిస్తున్నారు. కొన్ని అలవాట్లు మనల్ని వ్యక్తులకు దగ్గర చేస్తాయి. మన మానసిక స్థితిని చక్కగా ఉంచుతాయి. రాబోయే పదేళ్లపాటు మనల్ని ఆరోగ్యంగా ఉంచే నాలుగు అలవాట్లు ఏవో నిపుణుల నుంచి తెలుసుకుందాం.

వ్యాయామంతో రోజు ప్రారంభించండి..

మీరు మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే, వ్యాయామంతో మీ రోజును ప్రారంభించండి. ఉదయం పూట తేలికపాటి వ్యాయామం చేయడం ద్వారా ఫిట్‌గా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. మీరు కొంత సమయం పాటు వాకింగ్‌, యోగా అలవాటు చేసుకోవాలి. మీరు చేసే ఈ చిన్న చిన్న పనులు మీ గుండెతో పాటు మీ శరీరాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. మీరు ఉదయం కాకుండా సాయంత్రం వర్కవుట్ చేయడానికి ఇష్టపడితే, మీరు ఉదయం కొన్ని ప్రత్యేకమైన శరీర కార్యకలాపాలను చేయాలి.

ఉదయం నిద్రలేచిన తర్వాత మీరు కొన్ని స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయవచ్చు. ఉదయాన్నే పని చేయడం వల్ల జీవక్రియను పెంచడమే కాకుండా కేలరీలు వేగంగా బర్న్ అవుతాయి. ఉదయాన్నే తేలికపాటి వ్యాయామం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

ఉదయాన్నే కాసేపు తేలికపాటి సూర్యరశ్మిలో ఉండాలి..

శరీరం, మెదడు ఆరోగ్యంగా ఉండటానికి, సూర్యకాంతి కూడా చాలా ముఖ్యం. ఉదయాన్నే గోరువెచ్చని సూర్యకాంతిలో కాసేపు ఉండటం వల్ల శరీరంలో విటమిన్ డి లోపం తీరుతుంది. విటమిన్ డి కాల్షియం శోషణ, ఎముకలను బలోపేతం చేయడం, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. సూర్యకాంతి సిర్కాడియన్ రిథమ్‌ను నిర్వహిస్తుంది. సిర్కాడియన్ రిథమ్ నిద్ర, మేల్కొలుపు చక్రాలను నియంత్రించే శరీరం అంతర్గత గడియారం వంటిది.

వీలైనంత వరకు కుటుంబం, స్నేహితులతో సమయం గడపండి..

కుటుంబం, స్నేహితులతో మీ బలమైన సంబంధాలు ఒత్తిడి నుండి మిమ్మల్ని కాపాడతాయని మీకు తెలుసా..? మెరుగైన మానసిక ఆరోగ్యం కోసం ఒత్తిడికి దూరంగా ఉండటం చాలా ముఖ్యం. మీ భాగస్వామితో సంతోషంగా, ప్రశాంతంగా గడిపే సమయం మీలోని ఒత్తిడిని తగ్గిస్తుంది. దీంతో మీ మానసిక స్థితిని మెరుగుపరుచుకోవచ్చు. మీ మెరుగైన మానసిక స్థితి మీ పనిని మెరుగుపరుస్తుంది. మీ కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపడానికి, వారితో కలిసి రాత్రి భోజనం చేయండి, వాకింగ్‌కు వెళ్లండి. ఇలా మీ ప్రియమైన వారితో సన్నిహితంగా ఉండటం ద్వారా
మీరు మీ సంబంధాలను మెరుగుపరచుకోవడమే కాకుండా మీ జీవితాన్ని ఆరోగ్యవంతంగా మార్చుకుంటారు. సామాజిక పరస్పర చర్యలు భావోద్వేగ వ్యక్తీకరణకు అద్భుతమైన అవకాశాలను అందిస్తాయి. ఒంటరితనం మీలోని భావాలను తగ్గిస్తుంది.

చదవడం అలవాటు చేసుకోండి..

ఏదైనా చదవడం అలవాటు చేసుకోండి… ప్రతిరోజూ కనీసం 10 పేజీలు . చదివే అలవాటు కూడా మీ ఫిట్‌నెస్‌కి సంబంధించినది. ప్రతిరోజూ మీకు నచ్చినవి మాత్రమే . చదివే అలవాటు మానసిక దృఢత్వాన్ని పెంపొందించే గొప్ప మానసిక వ్యాయామం అంటున్నారు నిపుణులు. పఠనం మెదడును ఉత్తేజపరుస్తుంది, జ్ఞానాన్ని విస్తరిస్తుంది. అభిజ్ఞా పనితీరును పెంచుతుంది. పఠనానికి ఏకాగ్రత అవసరమని, ఇది మెదడు నాడీ మార్గాలను వ్యాయామం చేస్తుంది. మానసిక దృఢత్వానికి దోహదం చేస్తుందని హెల్త్‌ నిపుణులు వివరించారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపు కావచ్చు. క్యాన్సర్ కారణంగా బరువు చాలా వేగంగా తగ్గుతుంది. శరీరంలో ఈ లక్షణాలు కనిపించిన వెంణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇక ఆ పరీక్షలు కూడా తెలుగులోనే..

నిరుద్యోగ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ వంటి పారామిలటరీ దళాల్లో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షలు ఇక నుంచి తెలుగులోనే జరగనున్నాయి.
ఫిబ్రవరి 20 నుంచి మార్చి 7 వరకు జరిగే ఈ పరీక్షలను తొలి సారిగా తెలుగు సహా మరో 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది.
దేశవ్యాప్తంగా 128 నగరాల్లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పరీక్షకు సుమారు 48 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతున్నారని ఎంహెచ్ఏ ఒక ప్రకటనలో తెలిపింది. సాధారణంగా వీటిని ఇంగ్లీష్, హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లోనే జరుగుతుంటాయి. అయితే వాటిని ఇప్పటికే ఉన్న రెండు భాషలతో పాటు మరో ప్రాంతీయ 13 భాషల్లోనూ నిర్వహించాలని గత ఏడాది ఏప్రిల్ లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కేంద్ర సాయుధ పోలీసు దళాల్లో స్థానిక యువత భాగస్వామ్యాన్నిపెంచడానికి, ప్రాంతీయ భాషలను ప్రోత్సహించాలనే హోం మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు హోం శాఖ వెల్లడించింది. ఈ నిర్ణయంతో హిందీ, ఇంగ్లీష్ తో పాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి, కొంకణి భాషల్లో ప్రశ్నపత్రాలను తయారు చేయనున్నారు.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) నిర్వహించే ప్రతిష్ఠాత్మక పరీక్షల్లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) రిక్రూట్మెంట్ టెస్ట్ ఒకటి. ఈ ఉద్యోగం కోసం దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది యువత ప్రయత్నిస్తుంటుంది. పరీక్షను 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించేందుకు వీలుగా ఎంహెచ్ఏ, ఎస్ఎస్సీలు ఎంవోయూపై సంతకాలు చేశాయి. దీని ప్రకారం పరీక్ష నిర్వహణకు ఎస్ఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది యువత తమ మాతృభాష లేదా ప్రాంతీయ భాషలో పరీక్షకు హాజరవుతారు. దీని వల్ల ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న మరింత మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజయ్యే అవకాశం ఉంటుందని, అధిక శాతం యువతకు ఉపాధి దక్కుతుందని హోం శాఖ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ చొరవ వల్ల దేశవ్యాప్తంగా ఉన్న యువత తమ మాతృభాషలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్సెస్ లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పరీక్షలో పాల్గొని దేశసేవలో తమ భవిష్యత్ రూపొందించుకునే సువర్ణావకాశం లభించిందని హెం శాఖ వెల్లడించింది.

Health

సినిమా