Sunday, November 17, 2024

Viral Video : ఇన్నాళ్లు ఎక్కడున్నావయ్యా.. ఇన్ని వేరియేషన్స్‌.. ఇలా బౌలింగ్‌ చేస్తే ప్రపంచకప్‌లు అన్నీ మనవే?

సాధారణంగా ఒక్కొ బౌలర్‌కు ఒక్కొరకమైన బౌలింగ్ యాక్షన్ ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో తీసుకున్నట్లయితే.. జస్‌ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగా వంటి బౌలర్ల శైలి మిగతా బౌలర్ల కంటే కాస్త భిన్నంగా ఉంటుంది.
కాగా.. టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు, ఆఫ్ స్పిన్నర్‌ను ఓ బౌలర్ యాక్షన్‌ను చూసి ఆశ్చర్యపోయాడు. అంతేకాదు అతడికి తాను ఫ్యాన్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఎవరా బౌలర్‌? అశ్విన్‌ను ఇంప్రెస్ చేసేంతగా అతడు ఎలా బౌలింగ్ చేశాడు? అన్న సంగతి సంగతి ఇప్పుడు చూద్దాం.

అతడి పేరు కే బాలాజీ. అతడు ఓ మీడియం పేసర్. తమిళనాడులో జరుగుతున్న ఎస్ఎస్ రాజన్ టీ20 టోర్నమెంట్‌లో అతడు.. ఓవర్‌లోని ఆరు బంతులను ఆరు రకాలుగా విసిరాడు. తిరువవూరు, తిరుపత్తూర్ మధ్య సేలం వేదికగా ఓ మ్యాచ్ జరిగింది. 18వ ఓవర్‌ను బాలాజీ వేశాడు. ఒక్కో బంతిని ఒక్కో రకమైన బౌలింగ్ యాక్షన్‌తో వేశాడు.
తొలి బంతిని చాహల్ మాదిరిగా వేసిన అతడు రెండో బంతిని బుమ్రా మాదిరి రనప్‌తో వచ్చి వేశాడు. మూడో బంతిని ఓవర్ ది వికెట్ వచ్చి సగం బాడీని కిందకు వంచి పరిగెత్తుగా వచ్చి వేశాడు. నాలుగో బంతిని రెండు చేతులను చాపుతూ, ఐదో బంతిని సాధారణ మీడియం పేసర్ మాదిరిగా, ఆరో బంతి కుడి చేతిని పూర్తిగా పైకెత్తి రనప్‌లో వచ్చి వేశాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను అశ్విన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసి ‘బాలాజీ ఈజ్ మై న్యూ అడిక్షన్’ అంటూ రాసుకొచ్చాడు. కాగా.. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదెక్కడి బౌలింగ్ రా బాబు.. ఇన్ని రోజులుగా ఎక్కడ ఉన్నావ్, ఇలా బౌలింగ్ చేస్తే ప్రపంచకప్‌లు అన్నీ మనవే అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

bijili Mahadev mandir -బిజిలి మహాదేవ్ మందిర్-12 ఏళ్ళకు ఒకసారి శివలింగంపై పిడుగు పడుతుంది….దెబ్బకు శివలింగం తునాతునకలైపోతుంది. కానీ తెల్లవారేసరికి మళ్లీ అతుక్కుపోయి యథావిధిగా కనిపిస్తుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పటివరకు శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోతున్నారు.

ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడుతుంది ఆ దెబ్బకు శివలింగం తునాతునకలైపోతుంది. కానీ తెల్లవారేసరికి మళ్లీ అతుక్కుపోయి యథావిధిగా కనిపిస్తుందికొన్ని రహస్యాలు ఎప్పటికీ అంతుచిక్కవు. అలాంటిది శివలింగంపై పిడుగు పడడం కూడా. ప్రతి 12 ఏళ్లకోసారి మహాదేవుడి మందిరంపై పిడుగు పడుతుంది. ఆ దెబ్బకు శివలింగం తునాతునకలైపోతుంది. కానీ తెల్లవారేసరికి మళ్లీ అతుక్కుపోయి యథావిధిగా కనిపిస్తుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పటివరకు శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోతున్నారు.

ఉరుములు… మెరుపులు… పెళపెళమంటూ పిడుగు పడుతుంది. ఆ పిడుగు మహాదేవుడి మందిరాన్నే గురిపెడుతుంది. అందులోని శివలింగంపైనే పడి తునాతునకలు చేస్తుంది.
ఆ వికృత శబ్ధానికి చుట్టుపక్కల కొండలు కంపిస్తాయి. జనం వణికిపోతారు. పశుపక్ష్యాదులు పారిపోతాయి. పిడుగు దెబ్బకు శివలింగం తునాతునకలైపోతుంది.

కానీ మందిరం చెక్కుచెదరదు. కొండపై ఉన్న బండరాళ్లు కూడా కిందపడవు. మరుసటి రోజు ఆ గుడికి వెళ్లిన పూజరి… తునాతునకలైన ముక్కలను ఒక్కచోటికి చేర్చి అభిషేకం చేస్తారు. ఆ రోజు గడిచేసరికే శివలింగం తిరిగి యధారూపంలోకి వచ్చేస్తుంది. అంతకుముందు ఎలా ఉండేదో అలాగే మారిపోతుంది. అక్కడ ఏమీ జరగనట్లు కనిపిస్తుంది. దీన్ని వింత అనాలో… శివలీల అనాలో అర్థంకాని పరిస్థితి భక్తులది.

ఇలా ఒకటి రెండుసార్లు కాదు… వందల ఏళ్ల నుంచి వస్తోంది. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే అద్భుతం ఇది.ఈ ఆలయం పేరు బిజిలి మహాదేవ్ మందిర్. ఈ ఈశ్వరుడి ఆలయం హిమాచల్ ప్రదేశ్‌లోని కులూ వ్యాలీలో ఉంది. ఇలా జరగడానికి కారణాలు వివరించే ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం కులూ వ్యాలీలో మహాబలవంతుడైన ఓ రాక్షసుడు ఉండేవాడట. ఈ వ్యాలీలో కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి. అయితే అక్కడి జనాన్ని, పశుపక్షులను నాశనం చేయడానికి ఆ రాక్షసుడు పెద్ద సర్పంగా మారుతాడు. బియాస్ నది నీటి ప్రవాహానికి అడ్డుపడి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలను ముంచేయడానికి ప్రయత్నిస్తుంటాడు. దీన్ని చూసి ఆగ్రహించిన ఈశ్వరుడు తన త్రిశూలంతో ఆ రాక్షసుడిని సంహరిస్తాడు. చనిపోతూనే ఆ రాక్షసుడు పెద్ద కొండగా మారిపోతాడు.

అలా ఏర్పడిందే ఈ కొండ అని పురాణాల కథనం. అయినప్పటికీ ప్రజలకు ముప్పు పొంచివుండడంతో శివుడు ఇదే కొండపై వెలిశాడని ప్రతీతి. అయితే ఆ రాక్షసుడి దేహాన్ని నాశనం చేయడానికి ఆ కొండపై పిడుగు వేయాల్సిందిగా ఇంద్రుడిని శివుడు ఆదేశించారట. కానీ పిడుగుపడితే అక్కడున్న జనం, పశుపక్షాదులు నాశనం అయిపోతాయి. అందుకే తనపై పిడుగు పడేలా చేసి దాన్ని శివుడు నివారిస్తారనేది పురాణాల కథనం. మహాదేవుడి ఆజ్ఞ ప్రకారమే 12 ఏళ్లకు ఒకసారి పిడుగు పడుతుందని… ఆ వెంటనే శివలింగం అతుక్కుంటుందని ప్రతీతి.

12 ఏళ్లకు ఒకసారి శివలింగంపై పిడుగు పడడం, అది తిరిగి అతుక్కోవడం మన దేశంలోనే అత్యంత అద్భుతంగా చెబుతారు. అయితే ఈ మహాదేవుడి ఆలయాన్ని చేరుకోవడం అంత ఈజీకాదు. ఇది కొండపై సముద్ర మట్టానికి 2 వేల 450 మీటర్ల ఎత్తులో కొండపై ఉంది. రాళ్లు రప్పల మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్లాలి. అదృష్ఠవంతులకు మాత్రమే ఈ కొండపై మహాదేవుడి దర్శనం లభిస్తుందట. పర్వతంపైకి వెళ్తున్నకొద్దీ ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఇక ఈ భోళాశంకరుడికి ఏడాదికి ఒకసారి ఉత్సవం నిర్వహిస్తారు. కొండపై నుంచి లోయ వరకు ఊరేగింపు నిర్వహించడం కూడా ఇక్కడి ఆనవాయితీ.

ఒంటి కాలి దైవం.. మీరు ఎప్పుడైనా చూసారా.!

సాధారణంగా ఏ దేవుడు లేదా దేవత అయినా నిల్చొనో, కూర్చోనో దర్శనమిస్తారు. లేదా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం శయన స్థితిలో దర్శనమిస్తారు. అయితే ఇక్కడ స్వామి వారు మాత్రం ఎడమ కాలి మీద నిల్చుని కుడి కాలిని గాలిలోకి ఎత్తిన భంగిమలో కనపడుతుంది.ఇక్కడి దైవాన్ని చూసిన ఎవరికైనా ఈ స్వామి వారు ఎందుకు ఇలా దర్శనమిచ్చారు.అనే సందేహం తో పాటు ఆశ్చర్యం కూడా కలుగుతాయి. ఈ స్వామి వారు ఇలా ఎందుకు ఉన్నారో దీనికి గల స్థల పురాణము గురించి తెలుసుకోవాలంటే ఈ ఆలయం ఎక్కడ వుందో, ఆ క్షేత్ర విశేషాలు ఏమిటో చూద్దాం.

వివరాలు ప్రకారం ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలో విలుప్పురం జిల్లాలో తిరుక్కోవల్లూర్ అనే గ్రామం లో ఉంది. విల్లిప్పురానికి 45 కి .మి దూరంలో ఉంది.
మన భారత దేశంలో అతి ముఖ్యమైన 108 విష్ణు ఆలయాల్లో ఇది ఒకటి. దీనిని రెండు వేల సంవత్సరాల క్రితం పల్లవ రాజులు కట్టించారు అని ప్రశస్తి.ఈ ఆలయం లో నాలుగు స్తంభాలు ఉన్నాయి. వీటిల్లోతూర్పు వైపుగా ఉన్న స్తంభం 195 అడుగుల ఎత్తు ఉంటుంది.ఇది దక్షిణ భారత దేశం లోనే అత్యంత ఎత్తయిన స్తంభం.పూర్వం బలి చక్రవర్తిని పాతాళం లోకి తొక్కిన తరువాత విష్ణు మూర్తి ఇక్కడ వెలసినట్లు స్థల పురాణం.

ఈ స్వామి వారిని తమిళంలో అయ్యన్నార్,అమ్మవారిని పుస్పవల్లియార్ అని పిలుస్తారు.ఈ ఆలయానికి ఇంకో ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయానికి ఆనుకుని పెన్నా నది ప్రవహిస్తుంది. ఐయితె ఒకప్పుడు బ్రహ్మ దేవుడు ఈ నదిలో కాళ్ళు కడుక్కొని తీరు విక్రమ పెరుమాళ్ వారిని ఆరాధించేవారు. అందుకే ఈనదిని కూడా గంగా నది అంతా పవిత్రమైనది అని భావిస్తారు. ఈ పెన్నా నదిని దర్శించిన వారికి సర్వ పాపాలూ హరిస్తాయి. ఋషులు ముక్తి పొందిన స్థలంగా,మరియు భూలోక స్వర్గం గా తీరు విక్ర పెరుమాళ్ ను పేర్కొంటారు.

Talkad Temple – ఎడారిగా మారిన పుణ్యక్షేత్రం – తలకాడు రహస్యాలు

ఎడారిగా మారిన పుణ్యక్షేత్రం – తలకాడు!

పక్కనే కావేరీ నది… కానీ ఆ ఊరు మాత్రం ఎడారిని తలపిస్తుంది. వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఆ ఊరు ఓ రాణి శాపం కారణంగా అలా మారిపోయిందని చెబుతారు. ఇంతకీ ఎక్కడిదా ఊరు? ఎవరా రాణి? ఆమెకీ మైసూరు రాజ్యానికీ మధ్య సంబంధం ఏమిటి? తెలుసుకోవాలంటే తలకాడు గురించి చదవాల్సిందే..

కర్ణాటకలోని మైసూరుకి కేవలం 45 కిలోమీటర్ల దూరంలో ‘తలకాడు’ అనే పుణ్యక్షేత్రం ఉంది. క్రీ.శ మూడో శతాబ్దం నుంచే ఈ ప్రాంతం అనేక రాజులకు ముఖ్యనగరంగా ఉండేదని చరిత్ర చెబుతోంది. అసలు ఈ ప్రాంతానికి తలకాడు అన్న పేరు రావడం వెనుక ఓ స్థలపురాణాన్ని చెబుతుంటారు. ఒకప్పుడు సోమదత్తుడు అనే రుషి తన శిష్యులతో కలిసి తీర్థయాత్ర చేస్తున్నాడట. ఆ యాత్రలో భాగంగా కావేరీ తీరం వెంబడి వెళ్తుండగా, వారిని అడవి ఏనుగలు చంపేశాయట. శివభక్తి పరాయణులైన సోమదత్తుడు, అతని శిష్యులు మరుజన్మలో అడవిఏనుగులుగా జన్మించి అక్కడే శివుని ప్రార్థించసాగారు. ఒక బూరుగు చెట్టులో పరమేశ్వరుని చూసుకుంటూ ఆ చెట్టుకి పూజలు చేయసాగారు.
కాలం ఇలా గడుస్తుండగా తల, కాడు అనే ఇద్దరు కిరాతులు అక్కడకు చేరుకున్నారు. పచ్చపచ్చగా కళకళలాడుతున్న ఆ బూరుగుచెట్టుని చూసి వారికి ఆశ పుట్టింది. వెంటనే దానిని నరకడం మొదలుపెట్టారు. కానీ గొడ్డలి వేటు పడగానే ఆ చెట్టు నుంచి రక్తం కారడం చూసి వాళ్లని నోటమాటరాలేదు. ఆ సమయంలో ఆకాశవాణి ఒకటి వారికి వినిపించింది. తాను పరమేశ్వరుడిననీ, తనని పూజిస్తున్న సోమదత్తుని కోసం బూరుగు చెట్టులోనే నివసిస్తున్నాననీ… ఆ వాణి తెలిపింది. ఆ ఘటనకు సాక్ష్యంగా నిలిచిన తల, కాడులతో పాటుగా ఏనుగుల రూపంలో ఉన్న భక్తులందరూ కూడా కైవల్యాన్ని పొందారు. తనకు కలిగిన గాయాన్ని తానే నయం చేసుకునే శక్తికలవాడు కావడం చేత అక్కడ వెలసిన పరమేశ్వరుని ‘వైద్యనాథుని’గా కొలుచుకోసాగారు. క్రమేపీ ఆ ప్రదేశాన్ని ‘తలకాడు’ అని పిల్చుకుంటూ, అక్కడ వైద్యనాథునికి వైభవోపేతమైన ఆలయాన్ని నిర్మించారు.
తలకాడు అనేక రాజ్యాలకు ముఖ్యనగరంగా మారడంతో ఇక్కడ వైద్యనాథుని ఆలయంతో పాటుగా మరో నాలుగు శివాలయాలనీ నిర్మించారు. పాతాళేశ్వర, అర్కేశ్వర, మరులేవ్వర, మల్లికార్జున, వైద్యనాథ ఆలయాలే ఈ అయిదు శివాలయాలు. ఈ అయిదు శివాలయాలనీ కలిపి పంచలింగాలుగా పిలుచుకుంటారు. వీటితో పాటుగా మరో పాతిక బ్రహ్మాండమైన ఆలయాలు ఈ తలకాడులో ఉన్నాయి. వాటిలో రామానుజాచార్యులు నిర్మించారని చెబుతున్న ‘కీర్తినారాయణ’ ఆలయం ప్రముఖమైనది.
ప్రస్తుతానికి ఈ ఆలయాలలో చాలావరకు ఇసుకదిబ్బల కింద కూరుకుపోయి ఉన్నాయి. వైద్యనాథ ఆలయం వంటి అతి కొద్ది కట్టడాలలోకి మాత్రమే ప్రవేశించే వీలు ఉంది. వేల ఏళ్ల చరిత్ర కలిగి, నదీతీరాన ఉండి కూడా ఈ ప్రాంతం ప్రస్తుతం ఎడారిగా మారిపోయింది.

Laughing Buddha ఇంట్లో పెట్టుకున్నారా..అయితే ప్రతిరోజు ఇలా చేయడం మరవద్దు..కోట్లు రావడం ఖాయం..

Laughing Buddha: ఫెంగ్ షుయ్ లో ముందుగా మనకు గుర్తొచ్చేది… లాఫింగ్ బుద్ధ. ఐశ్వర్యం, ఆనందం ఈ రెంటినీ లాఫింగ్ బుద్ధ అందిస్తుంది. అటు ఇంట్లో ఇటు మీ వ్యాపార సంస్థలో లాఫింగ్ బుద్ధను ఉంచుకోవడం వల్ల కుటుంబపరంగా, వ్యాపారపరంగా మీకు మంచి మేలు జరుగుతుంది. సౌత్ ఈస్ట్ లో లాఫింగ్ బుద్ధను ఉంచితే జీవితంలో అబివృద్ధి, అదృష్టం. రెండు ద్విగుణం బహుళం అవుతాయి. వ్యాపారం కలిసొస్తుంది. ఆర్ధికంగా పరిస్థతి ఎంతో మెరుగుపడుతుంది. సౌత్ ఈస్ట్ లో లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్, బెడ్ రూమ్, ఆఫీస్ లలో ఉంచుకోవచ్చు. తూర్పు విభాగంలో లాఫింగ్ బుద్ధను ఉంచడం వల్ల కుటుంబానికి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందిస్తుంది. మీ కుటుంబాన్ని వేధించే ఎన్నో సమస్యల్ని దూరం చేస్తుంది.

పడమర విభాగంలో లాఫింగ్ బుద్ధను ఉంచితే వ్యాధుల నివారణకు ఉపకరిస్తుంది. మీ వెన్ను వెనుక జరిగే రకరకాల కుతంత్రాల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.

ఉత్తరంలో లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్, ఆఫీసులలో ఉంచితే మీ కెరీర్ బాగుంటుంది. మీకు అదృష్టాన్ని సైతం అందిస్తుంది. లాఫింగ్ బుద్ధను మీకు అతితరుచుగా కనిపించే విధంగా ఎత్తయిన చోట అమర్చుకోడి. అంతే తప్ప భూమిపై ఉంచకండి. ఆఫీసులో అయితే. మీ ఆఫీసు టేబుల్ పైనే ఉంచుకోండి.టాయిలెట్ లో, బాత్ రూమ్ లో లాఫింగ్ బుద్ధను ఉంచకూడదు. టాయిలెట్ కు ఎదురుగా కూడా లాఫింగ్ బుద్ధను ఉంచకూడదు. ఈ లాఫింగ్ బుద్ధ ప్రతిమను పవిత్రంగా భావించాలని పెంగ్ షుయ్ తెలియచేస్తుంది.

ప్రతిరోజూ ఒక్కసారైనా లాఫింగ్ బుద్ద టమ్మీని తప్పకుండా కుడిచేత్తో రబ్ చేయటం ఎట్టి పరిస్థితిలో మర్చిపోకండి. లాఫింగ్ బుద్ధను ప్రతిమలు పలురకాలున్నాయి. వాటి ఉపయోగం మాత్రం ఒక్కటే. ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం.

దేవుడికి ఇచ్చిన హారతిని కళ్లకు అద్దుకోకూడదు. ఎందుకంటే.?

దేవుడికి ఇచ్చిన హారతిని కళ్లకు అద్దుకోకూడదు. ఎందుకంటే.?
హిందూ సంప్రదాయం ప్రకారం రోజు దేవుడికి పూజ చేసి హారతి ఇస్తూ ఉంటారు. ఇళ్లల్లో, దేవాలయాల్లో కూడా హారతి తప్పనిసరి. నిత్య పూజల్లో, ప్రత్యేక పూజల్లో కూడా హారతిని ఇవ్వడం ఒక పద్దతి. ఇది నిన్నో మొన్నో వచ్చినది కాదు. ఎప్పటి నుండో ఈ పద్దతిని మనం పాటిస్తూనే ఉన్నాం. అలా హారతి ఇచ్చి గంట కొడతారు. ఇది అందరికీ తెలిసినదే. దీనిలో ఏమి చెప్పాల్సిన సంగతి లేదు. కానీ చాల మందికి తెలియనిది ఏమిటంటే..?

హారతిని కళ్లకు అద్దుకోకూడదట. అవును ఇది నిజం. దీనికి గల కారణాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడే పూర్తిగా చదివి కారణాలు తెలుసుకోండి. మామూలుగా పూజ చేసి పూజ ఆఖరి లో కర్పూరం తో లేదా ఏదైనా దీపం తో హారతి ఇస్తారు. అయితే దేవుడికి పూజ చేసి ఆఖరిని దిష్టి తీయడానికి హారతి ఇస్తారు అని అంటున్నారు పండితులు.
అయితే హారతి మనకి శుభాలు కలగడానికి కాదని అందుకే అద్దుకోకూడదు అని పండితులు అంటున్నారు. హారతిని రెండు చేతుల తో దండం పెట్టుకోవచ్చు కావాలంటే. అలానే చాల మంది తీర్ధం తీసుకుని ఆ చేతులని తలకి రాసుకుంటారు. అలా కూడా తల కి రాసుకోకూడట. కనుక ఎప్పుడు ఇలా చెయ్యకండి.

Mangalagiri Cheekati Koneru: మంగళగిరిలో చీకటి కోనేరు రహస్యం

Mangalagiri Cheekati Koneru: మంగళగిరిలో చీకటి కోనేరు రహస్యం

దక్షిణ భారత దేశంలోనే ఎత్తైన మంగళగిరి గాలి గోపురానికి, చీకటి కోనేరుకు ఉన్న సంబంధం ఏంటి..? గాలి గోపురానికి వంద అడుగుల దూరంలోనే కోనేరును ఎందుకు తవ్వారు.
చీకటి కోనేరు అభివృద్ధి పనులతో బయటపడుతున్న నిజాలేంటి..? మంగళగిరి గోపురం భద్రతపై నీలిమేఘాలు కమ్ముకున్న దశలో చీకటి కోనేరులో దాగి ఉన్న వాస్తవాలు ఏంటో తెలుసుకుందాం..?

మంగళగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి గాలిగోపురం దక్షిణ భారత దేశంలోనే ఎత్తయినది. రెండు శతాబ్దాలను పూర్తిచేసుకుంది. 11 అంతస్తులతో 157 అడుగుల ఎత్తును కలిగి కేవలం 49 అడుగుల పీఠభాగంతో,… గాలిలో ఠీవిగా నిలబడినట్టు కనిపిస్తూ సందర్శకులను అబ్బురపరిచే అద్వితీయ నిర్మాణమిది. దీనిని 1807-1809 కాలంలో నాటి ధరణికోట జమిందారు శ్రీ రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు నిర్మించారు. ఈ గోపుర పీఠభాగం పూర్తిగా రాతిచే నిర్మితమైంది. అయితే, గత కొంతకాలంగా గాలిగోపురం పడిపోయే స్థితిలో ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2012 నుండి ఈ గోపురాన్ని కాపాడుకునేందుకు స్థానికులు, అధికారులు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. నెల రోజుల క్రితం కొన్ని పెళ్లలు విరిగి పడటంతో మరోసారి గోపురం భద్రతపై ప్రశ్నలు తలెత్తాయి. ఈ ఘటన జరిగిన వెంటనే దేవాలయం మూఢ వీధుల్లో హెవీ వెహికిల్స్‌తో పాటు వాహనాలు ఏవీ తిరగకుండా గడ్డర్స్‌ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత శిథిలావస్థలకు చేరుకున్న చీకటి కోనేరును అభివృద్ధి చేస్తున్నారు. చీకటి కోనేరును శుభ్రం చేస్తున్న క్రమంలోనే వేంకటేశ్వర స్వామి పంచలోహ విగ్రహం బయటపడింది. వినాయకుడి విగ్రహం కూడా చీకటి కోనేరులో ఉన్నట్లు కనుక్కొని ప్రత్యేక పూజలు చేశారు. అయితే, అసలు చీకటి కోనేరుకు గాలి గోపురానికి సంబంధం ఏంటీ.. అన్న ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి.

అత్యంత ఎత్తైన గాలి గోపురం నిర్మాణం చేస్తున్న సమయంలోనే గోపురం ఉత్తరం వైపుకు వంగిపోయిందని స్థానికులు చెబుతారు.. దాన్ని సరి చేసేందుకు గోపుర నిర్మాణ కర్తలు కొంతమంది తమిళనాడులోని కాంచీపురం పంపించారని చెప్పారు. దేవాలయాల ఆర్కిటెక్చర్‌లో కాంచీపురం శిల్పులు అప్పటికే ప్రసిద్ధి చెందారని, వారిచ్చిన సలహాతోనే చీకటి కోనేరును తవ్వినట్లు చెప్పారు. గోపురానికి ఈశాన్య దిశలో వంద అడుగుల దూరంలో గోపురం ఎత్తు అంత లోతులో కోనేరు తవ్వాలని అక్కడి వారు సలహా ఇచ్చారట…. దీంతో ఈశాన్య దిశలో 153 అడుగుల లోతులో చీకటి కోనేరును నిర్మించారని, ఆ తర్వాతే గోపురం ఎటువంటి వంకలు లేకుండా సరైనట్లు చెబుతారు.. చీకటి కోనేరు కూడా గోపురాన్ని తల కిందులుగా చేసినట్లు నిర్మించారట… లోతుకు పోయే కోద్దీ వెడల్పు తగ్గించుకుంటూ పోయారు. గోపురం కింద నుండి పైకి ఉంటే కోనేరు అందుకు వ్యతిరేకంగా నిర్మించారంటున్నారు.

చరిత్రలో భాగమైన గోపురాన్ని కాపాడుకునేందుకు అందరూ కట్టుబడి ఉండాలని స్థానికులు చెబుతున్నారు.. గతంలోనూ గోపురం భద్రతపై అనుమానాలు కమ్ముకున్నాయని ఒకానోక దశలో పడేసేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు.. అయితే స్థానికుల ఆందోళన తర్వాత పడేయాలన్న ఆలోచన విరమించుకోని ఏ విధంగా కాపాడుకోవాలో ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. గోపురం పునాదులు గతంలో తడికే రూపంలో వెడల్పుగా వేసేవారని, గోపురం పక్కనే ఉన్న రోడ్డు కింద కూడా పునాదులున్నాయని చెబుతున్నారు. భారీ వాహనాలు తిరగడంతోనే పునాదులు దెబ్బతిని గోపురం భద్రత ప్రశ్నార్థకమైందన్నారు. చీకటి కోనేరును అభివృద్ధి చేయడం మంచిదేనన్నారు. అయితే ఇటలీలోని పీసా టవర్‌ పడిపోకుండా రీట్రో ఫిట్టింగ్‌ టెక్నాలజీని వాడారని అటువంటి సాంకేతిక ద్వారా గోపురాన్ని కాపాడుకోవచ్చునంటున్నారు… 2012 లో చెన్నై ఐఐటీ నిపుణులు ఇచ్చిన నివేదిక బయటపెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గోపురం చుట్టు పక్కల చిన్నచిన్న గుంతలు ఏర్పాటు చేసి అందులో కాంక్రీట్‌ ఫిల్లింగ్‌ చేయాలన్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టి గోపురాన్ని కాపాడాలని డిమాండ్‌ చేస్తున్నారు.

చీకటి కోనేరును అభివృద్ధి చేయడంతో పాటు గోపురాన్ని కాపాడుకోవటానికి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

Tirumala: శ్రీవారి ఆలయంలో ఒక మూలకు వచ్చేసరికి.. చాలా మంది భక్తులు.. ఆగి.. తలెత్తి.. చూస్తుంటారు ఎందుకంటే

Tirumala: శ్రీవెంకటేశ్వర స్వామి(Sri Venkateswara Swami) కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి (Tirupati). అనేక వింతలు, విశేషాలకు ఆలవాలయం. స్వామివారిని దర్శించుకోవాలని దేశ విదేశాలనుంచి భారీ సంఖ్యలో వస్తారు.
శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు. కొండమీద ప్రతి ఒక్క నిర్మాణానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. అయితే స్వామివారి క్షేత్రంలో, ఆలయంలో ఉన్న ప్రాంతాలు, నిర్మాణంలో ఉన్న విశేషాలు చాలా మంది భక్తులకు తెలియదు. ఈ నేపథ్యంలో తిరుమల క్షేత్రంలోని స్వామివారి ఆలయం మీద దర్శనమిచ్చే విమాన వెంకటేశ్వర స్వామి (Vimana Venkateswara Swami) గురించి ఈరోజు తెలుసుకుందాం..

కోరిన కోర్కెలు తీర్చే కోనేటిరాయుడిని దర్శనం చేసుకుని.. బయటకు వచ్చిన అనంతరం స్వామివారి తీర్ధం, శఠారి తీసుకుని సాష్టాంగ నమస్కారం చేసుకుని.. బయటకు నడుస్తుంటే.. ఆలయంలో ఒక మూలకు వచ్చేసరికి.. చాలా మంది భక్తులు.. ఆగి.. తలెత్తి.. చూస్తుంటారు. భక్తులు అక్కడ దర్శించుకునేది విమాన వేంకటేశ్వర స్వామిని.

శీవారి ఆలయ గోపురం పేరు “ఆనందనిలయం”.. ఈ బంగారు గోపురం మూడు అంతస్తులుగా వుంటుంది. గోపురం ఎత్తు, కలశంతో కలిపి.. 65అడుగుల 2 అంగుళాలు. మొదటి అంతస్థులో లతలు, తీగలు, మకరతోరణాలు వంటివి కనిపిస్తాయి. ఇక మూడవ (గుండ్రని) అంతస్తు లో 20 బొమ్మలు వుంటాయి. మహపద్మం, 8 సింహాలు. అయితే గోపురం రెండో అంతస్థులో మకర తోరణాలతో పాటు దేవుళ్ళ విగ్రహాలు ఉంటాయి. నరసింహస్వామి, వరాహస్వామి, అనంతుడు, వైకుంఠనాథుడు, ఇంకా అనేక విష్ణురూపాలు, జయ విజయులు, విష్వక్సేనుడు.. ఇలా మొత్తం 40 దేవుళ్ళ విగ్రహాలు ఉంటాయి. అంతేకాదు ఆలయంలో రెండో అంతస్థు వాయవ్యం మూల.. ఉత్తరముఖంగా విమాన వేంకటేశుడు ఉంటారు. ఈయన పక్కన బాల కృష్ణుడు, గరుత్మంతుడు, ఆంజనేయస్వామి వుంటారు .

గోపురంలో..వెండి మకరతోరణంలో..వెలిగిపోతున్న స్వామియే..విమాన వేంకటేశ్వరుడు. లోపల వున్న మూలమూర్తిని పోలివుంటారు. దీంతో లోపల వున్న వెంకన్న దర్శనం బాగా అవలేదే అని మధన పడే భక్తులకు స్వాంతన ఇచ్చే స్వామి విమానా వెంకటేశ్వర స్వామి. అంతేకాదు ఈ విమాన వేంకటేశుడి దర్శనం .. తిరుపతి యాత్రా ఫలితం ఇస్తుంది అని భక్తుల నమ్మకం. 16వ శతాబ్దంలో వ్యాసతీర్థులు విమాప వెంకటేశ్వరుడిని ఆరాధించి మోక్షం పొందినట్టు స్థల పురాణం. ఈ విమాన వేంకటేశ్వరుణ్ణి భక్తులందరూ సులభంగా గుర్తించేందుకు వీలుగా టి.టి.డి ఆలయాల ముఖ్య కార్యనిర్వాహణాధికారిగా పనిచేసిన పి.వి.ఆర్.కె.ప్రసాద్ ఒక వెండి తోరణాన్ని తయారు చేయించి.. ఈ విగ్రహానికి అతికించారు. కనుక స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చే ముందు.. విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

Laxmi Devi : మహిళలు చేసే ఈ తప్పుల వల్లే ఇంట్లో నుంచి లక్ష్మీ దేవి వెళ్లిపోతుంది..!

Laxmi Devi : ఇంట్లో సుఖ శాంతులు కలగాలంటే ఆడవారు కొన్ని నియమాలను పాటించాలని మన పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. మహిళలు ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో సుఖ శాంతులు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని వారు చెబుతుంటారు.
భర్త అనురాగం పొందడానికి, సంతాన సాఫల్యానికి, ఇంట్లో వారికి వ్యాధులు రాకుండా ఉండడానికి ఈ నియమాలను కచ్చితంగా పాటించాలని పెద్దలు చెబుతుంటారు. ఇంట్లో సుఖ శాంతులు నెలకొనడానికి మహిళలు పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చాలా మందికి ఉన్న చెడ్డ అలవాట్లల్లో ఒకటి మంగళ సూత్రానికి పిన్నీసులను ఉంచడం. మనలో చాలా మంది మంగళ సూత్రానికి పిన్నీసులను, జడకు పెట్టుకునే పిన్నులను పెడుతుంటారు. ఇలా చేయడం వల్ల భర్త అనారోగ్యానికి గురవుతాడని, భార్యా భర్తల మధ్య సమస్యలు వస్తాయని పెద్దలు చెబుతున్నారు. వేద మంత్రాల సాక్షిగా భర్త ఆయువు మంగళ సూత్రం రూపంలో భార్య హృదయానికి వచ్చి చేరుతుంది. అంతే కాకుండా మంగళ సూత్రాన్ని లక్ష్మీ దేవి స్వరూపంగా కూడా భావిస్తారు. మంగళ సూత్రానికి దివ్య శక్తులను ఆకర్షించే శక్తి ఉందని, పిన్నీసులను, పిన్నులను పెట్టడం వల్ల మంగళ సూత్రంలో ఉండే శక్తిని ఈ పిన్నీసులు ఆకర్షించుకుంటాయని చెబుతున్నారు. దీంతో చెడు జరుగుతుంది. కనుక ఎట్టి పరిస్థితిలోనూ మంగళ సూత్రానికి ఇనుముతో చేసిన పిన్నీసులను, పిన్నులను పెట్టకూడదు.
ప్రస్తుత కాలంలో మహిళలు రకరకాల గాజులను ధరిస్తున్నారు. కానీ వారు మట్టి గాజులను ధరించడమే చాలా మంచిదని పెద్దలు చెబుతున్నారు. మట్టి గాజుల నుండి వచ్చే శబ్దం ఐశ్వర్యాన్ని, భార్యా భర్తల అనురాగాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ఎరుపు, ఆకుపచ్చ రంగు గాజులను ధరించడం వల్ల శుభాలు కలుగుతాయని చెబుతున్నారు. కొందరు ఇండ్లల్లో అందంగా ఉన్నాయని గుర్రపు బొమ్మలను, ఫోటోలను పెట్టుకుంటారు. ఇలా ఇంట్లో గుర్రపు బొమ్మలను ఉంచడం అంత మంచిదని కాదని వారు చెబుతున్నారు. గుర్రం చాలా వేగంగా పరిగెత్తుతుంది. గుర్రం ఎంత వేగంగా పరిగెత్తుతుందో అంతే వేగంగా ఇంట్లో ఉండే ధనం కూడా ఖర్చవుతుందని, కనుక వీటిని ఇంట్లో ఉంచుకోవడం అంత మంచిది కాదని అంటున్నారు.

మహిళలు పాటించాల్సిన నియమాలలో మరొకటి సంపదను ప్రదర్శించడం. అనగా భర్త స్థితిగతులు, సంపాదన భార్య ధరించిన నగలు, వస్త్రాల ద్వారా అందరికీ తెలుస్తుంది. మహిళలు ఎక్కువగా నగలను, పట్టు వస్త్రాలను ధరించడం వల్ల నర దిష్టి, నర ఘోష తగులుతుందని వీటి వలన అనేక రకాల సమస్యలు వస్తాయని అంటున్నారు. కనుక మహిళలు వీలైనంత తక్కువగా అలంకరించుకుని నలుగురిలోకి వెళ్లాలని చెబుతున్నారు.

ప్రస్తుత కాలంలో చాలా మంది తల్లులు.. పిల్లలు తమ మాట వినడం లేదని చెబుతున్నారు. ఈ సమస్య నుండి బయట పడడానికి కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఆడ పిల్లలు తమ మాట వినడం కోసం ఐదు పోగుల ఎర్ర దారాన్ని తీసుకుని వారి కుడి భుజానికి కట్టాలి. దీంతోపాటు వారికి కుంకుమను పెట్టుకోవడం అలవాటు చేయాలి. ఇలా చేయడం వల్ల ఆడపిల్లలు మన మాట వింటారు. అదే విధంగా మగ పిల్లలు మన మాట వినడం కోసం 9 పోగుల ఆకుపచ్చ దారాన్ని తీసుకుని వారి కుడి భుజానికి కట్టి వారికి గంధం బొట్టును పెట్టుకునే అలవాటు చేయాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు పెద్దల మాట వింటారు.

కొందరి మహిళలు ఎప్పుడూ ఆడపడుచులతో, అత్తతో గొడవ పడి మనశ్శాంతికి దూరం అవుతారు. అలాంటి సమయంలో అత్త లేదా ఆడపడుచు పడుకునే దిండు కింద తులసి వేరును ఉంచడం వల్ల వారితో గొడవలు తగ్గడమే కాకుండా వారు మీ పై విపరీతమైన ప్రేమను, అప్యాయతను పెంచుకుంటారని వారు చెబుతున్నారు.

అలాగే చాలా మంది మహిళలు స్నానం చేయకుండా ఎక్కువగా మాట్లాడుతూ, చికాకులో, కోపంతో వంట చేస్తుంటారు. ఈ విధంగా వంటను అస్సలు చేయకూడదట. శుభ్రంగా స్నానం చేసి చాలా ప్రశాంతంగా , దైవ నామ స్మరణ చేస్తూ వంట చేయాలని తద్వారా వంట రుచిగా ఉండడమే కాకుండా ఇంట్లోని వారు అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారట. మహిళలు ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో సుఖ శాంతులు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

దేవుడి ఉంగరాలు పెట్టుకుంటున్నారా.. అయితే ఈ విషయాల గురించి తప్పక తెలుసుకోవాలి..?

సాధారణంగా ప్రతి ఒక్కరూ అలంకరణ కోసం నగలు ఎలా ఉపయోగిస్తారో..ఉంగరాలు కూడా అలంకరణ కోసం ఉపయోగిస్తారు.
కొంతమంది వివిధ రకాల డిజైన్లతో ఉన్న ఉంగరాలను ధరిస్తే మరి కొంతమంది జాతకం ప్రకారం వివిధ రకాల రంగురాళ్లు ఉన్న ఉంగరాలను ధరిస్తారు.

అలాగే మరి కొంతమంది తమ ఇష్టదైవాలకు సంబంధించిన ఉంగరాలను ధరిస్తూ ఉంటారు. అయితే దేవుడి ప్రథమతో ఉన్న ఉంగరాలను ధరించినప్పుడు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి.

అలా నియమాలు పాటించని యెడల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలను ధరించేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సాధారణంగా దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలను ధరించేటప్పుడు దేవుడి తల ఎటువైపు ఉండాలి? కాళ్లు ఎటువైపు ఉండేలా ధరించాలి అని చాలామందికి సందేహం ఉంటుంది.

అలాంటి సమయంలో దేవుడి కాళ్ళు మనికట్టు వైపు, దేవుడి తల వేళ్ళ గొర్ల వైపు ఉండేలా ఉంగరం ధరించాలి. ఇలా ధరించటానికి కూడా ఒక కారణం ఉంది.

ఎందుకంటే మన చేతి వేళ్ళు ఎప్పుడు భూమిని చూస్తూ ఉంటాయి కాబట్టి ఉంగరాన్ని అలా ధరించాలి. అలాగే దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలను ధరించినప్పుడు ఉదయం లేవగానే వాటిని కళ్ళకు అద్దుకుంటారు. అలాంటి సమయంలో మన చేతిని ముడిచి ఉంగరాన్ని కళ్ళకు అద్దుకోవాలి.

అలాగే మహిళలు ఇలాంటి ఉంగరాలను ధరించినప్పుడు నెలసరి సమయంలో వాటిని తీసి పక్కన పెట్టాలి. అలాగే మాంసాహారం తింటున్న సమయంలో కూడా ఇలా దేవుడి ప్రతిమ ఉంగరాలను ధరించకూడదు.

ఇలా దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలను ధరించడమే కాకుండా మెడలో కూడా దేవుడి ప్రతిమ ఉన్న లాకెట్లు ధరిస్తూ ఉంటారు.

వారు కూడా ఇలాంటి మాంసం మద్యపానం సేవించకూడదు. ఇక మహిళలు కూడా నెలసరి సమయంలో దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలు లాకెట్లు, తీసి పక్కన పెట్టాలి.

Ahobilum – ఆహోబిలం వెనక దాగివున్న ఒక చారిత్రక సత్యం

అహోబిలాన్ని మీరు చూసే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాలో ఉంటుంది. నల్లమల కొండల్లో ఉండే అద్భుతమైన ప్రదేశం. కర్నూలు-కడప హైవే మీద ఉన్న ఆళ్లగడ్డ పట్టణానికి ఆనుకుని ఉంటుంది. ఇక్కడికీ చేరుకోవడం చాలా సులభం. ఇక్కడ ఉండే దేవుడు లక్ష్మీ సమేత నరసింహ స్వామి. ఆలయం ప్రకృతి సౌందర్యం మధ్య ఉంటుంది. ఆలయానికీ చేరుకోవడం, చేరుకున్నాక మీ కోసం అబ్బుర పరిచే విషయాలెన్నో ఎదురు చూస్తుంటాయి అక్కడ. ఇవన్నీ మీకు మ్యాగజైన్ లలో, బ్లాగులలో దొరుకుతాయి. అందుకే నేను ఆలయం, అక్కడి అందమైన పరిసరాల జోలికి వెళ్లకుండా అహోబిలం గురించి ఒక కొత్త విషయం చెబుతున్నా.

దక్షిణ భారత దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రాముడు,కృష్ణుడు తర్వాత ఎక్కువ వినిపించే దేవుడి పేరు నరసింహుడిదే.
ఒక పది పన్నెండు మంది తెలుగు వాళ్లను ర్యాండమ్ గా ఎంపిక చేస్తే అందులో ఒకరైనా లక్ష్మీ నరసింహస్వామిని గుర్తు చేసే పేర్లు యాదగిరి, యాదమ్మ, యాదయ్య, ఓబులమ్మ ఓబులేసు, ఓబులరెడ్డి, సింహాచలం, సింహాద్రి, చలం వంటివి తగులుతాయి. అంతెందుకు ఒక నరసింహుడు ప్రధానిగా, మరొర నరసింహుడు గవర్నర్ గా ఉండేవారు.

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతాలలో నరసింహస్వామి అరాధన (Cult of Lord Narasimha) చాలా ఎక్కువ ఉండటమే దీనికి కారణం. ఈ ప్రాంతాల్లో ఉన్న లక్ష్మీనరసింహ ఆలయాలు ఎంత ప్రసిద్ధి చెందాయో అహోబిలం,యాదగిరి గుట్ట ,సింహాచలం,కదిరి, అంతర్వేది, మంగళగిరి లలోని ఆలయాలు సాక్ష్యం.

అయితే, ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన అనేది మొదలయింది అహోబిలం ను రాష్ట్రాలనుంచే. ఇది ప్రదేశం తెలుగు వాళ్లు గర్వపడాల్సిన విషయం ఇది. ఒదిశా వాళ్లకు జగన్నాథుడెలాగో తెలుగు వారికి లక్ష్మీ నరసింహస్వామి అంతే. లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన అహోబిలంలో మొదలై ఇతర ప్రాంతాలకు విస్తరించిందని చరిత్రకారులు చెబుతున్నారు.

నరసింహ స్వామి ఆరాధన ఉత్తర భారతంలో బాగా తక్కువ. లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు బాగా అరుదు. కొన్ని చారిత్రక ఆధారాలు (కింది ఫోటో. మథుర. గుప్తుల కాలం) దొరికినా ఉత్తర భారత ప్రజల్లో నరసింహ స్వామి ఆరాధన తక్కువ.

నరసింహ స్వామి ఆరాధనకు సంబంధించి ఆది శంరకాచార్యులు రచించిన కరావలంబ స్తోత్రం ప్రధానమైనది. రామానుజాచార్య కూడా లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకుడే. హోయసల రాజు విష్ణువర్ధనుడు అనేక లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు నిర్మించేందుకు కారణం ఆయనే నని చెబుతారు. మధ్వాచార్యుడు కూడా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధనను బాగా ప్రాచుర్యంలోకి తెచ్చారు.

చరిత్రకారుల పరిశోధనల ప్రకారం, నరసింహస్వామి (విష్ణుదేవుని దశావతారాల్లోఒకరు) ఆరాధన రాయలసీమలోని అహోబిలం లో మొదలయింది. అక్కడి నుంచి అన్ని ప్రాంతాలకు విస్తరించింది. (కింది ఫోటో కర్నాటక మేల్కోటే , యోగ నరసింహాలయం)

ఈ లెక్కన లక్ష్మీ నరసింహాస్వామి ఆలయాలలో తెలుగు నాట అంత్యంత పురాతనమయినది కర్నూలు జిల్లాలోకి అహోబిలమే. నరసింహస్వామికి సంబంధించిన ప్రముఖమయిన ఆలయాలుండేది తెలంగాణ, ఆంధ్రలోనే. తర్వాతి స్థానం తమిళనాడుది. ఒరిస్సా లో కూడా ఈ సంప్రదాయం కొద్దిగా కనిపిస్తుంది. పూరీ జగన్నాథ ఆలయ ప్రాంగణంలో నరసింహాస్వామి ఆలయం కూడా కనిపిస్తుంది.

దశావతారాలు గుర్తున్నాయా? ఇందులో మొదటి మూడు అవతారాలు (మత్స్య, కూర్మ, వరాహా) జంతువులకు సంబంధించినవి. తర్వాత వచ్చే నరసింహ అవతారం జంతువు-మనిషిల కలయిక. ఇందులో ఒక పరిణామం కనిపించడం లేదూ

పూర్వకాలంలో నాటి తెగల్లో ఉన్న సింహారాధన నుంచి క్రమంగా నరసింహారాధన వచ్చిందని కొందరు చెబుతారు అంటారు. నరసింహస్వామి భార్య చెంచులక్ష్మి. అహోబిలం చెంచు తెగలుండే ప్రాంతం. పై ఆహోబిలం, కింది అహోబిలంల మధ్య ప్రాంతం ఆయన సంచరించిన లీలా స్థలం గా విశ్వసిస్తారు. హిరణ్యకశ్యపుడిని సంహరించాక ఉగ్రనరసింహుడిగా నరసింహస్వామి నల్లమల అడవుల్లో సంచరిస్తున్నపుడు ఆయన ఉగ్రరూపం చూసి దేవతలు భయపడ్డారు. అపుడు లక్ష్మీ దేవిని కలసి, ఆయన కోపం చల్లారేలా చేయాలని కోరారు. అపుడు లక్ష్మీదేవి చెంచుకన్య రూపం ధరించి నల్ల మల అడవుల్లో సంచరిస్తూ నరసింహ స్వామి కంటపడింది. ఆమెనుచూశాక తనని వివాహం చేసుకోవాలని కోరారు. లక్ష్మీదేవి ఆయనకు అనేక పరీక్షలు పెట్టి చివర వివాహమాడేందుకు అంగీకరించింది. ఆమెయే చెంచు లక్ష్మిఅయ్యిందనేది పురాణగాథ. (కింది ఫోటో చోళుల కాలం నాటి పంచలోహ విగ్రహం)

నరసింహస్వామి ఆరాధన మీద బాగా పరిశోధన చేసిన ఎ. ఎస్ మన్ ( Anncharlott Eschmann ) తెలంగాణ, ఆంధ్రప్రాంతంనుంచే నరసింహ ఆరాధన మొదలయిందని వాదిస్తున్నారు. ప్రొఫెసర్ ఎష్మన్ పూరీ జగన్నాథ, నరసింహస్వామి ఆరాధన మీద చాలా పరిశోధన చేశారు.

నరసింహస్వామి ఆరాధన చరిత్ర ప్రకారం గంటూరు జిల్లా కొండమోటు దగ్గిర దొరికిన ఒక పలకం మీద కనిపించిన నరసింహుడి బొమ్మ (కిందిఫోటో) ఈ అవతారానికి సంబంధించిన ఆధారాలలో పురాతనమయింది ఇదే నని చరిత్రకారులు చెబతారు.ఇందులో నరసింహుడి రెండు చేతుల్లో గద , చక్రం ఉంటాయి.ఇది క్రీ.శ3 వశతాబ్దం కాలానిదని, అందులో కూడదా శాతవాహనుల కాలానిదని చెబుతారు.

4-6 శతాబ్దాల కాలంలో గుప్తుల కాలంలో నరసింహారాధన దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించింది. గుప్త చక్రవర్తులలో ఒకరిపేరు నరసింహగుప్త. హిరణ్య కశ్యపుడి కథ లో ఉండే స్థంభం గుప్తుల అనంతర కాలంలో జోడయిందని చెబుతున్నారు.

యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి ఆలయం

ప్రొఫెసర్ సువిరా జైస్వాల్ 1973లో హిస్టరీ కాంగ్రెస్ లో సమర్పించిన ఒక పరిశోధనాపత్రం ప్రకారం నరసింహస్వామి ఆరాధన తెలంగాణ, ఆంధ్ర,ఒదిషా,చత్తీష్ గడ్ ప్రాంతాలలోని తెగల నుంచి వచ్చింది. వారి స్థంభారాధన క్రమంగా వైష్ణవ సంప్రదాయంలోకి చొరబడిందని ఆయన అభిప్రాయం. పూరిజగన్నాథ స్వామి కూడా ఆలయం ఒకపుడు నరసింహాలయమే. (కింది ఫోటో పూరీ యజ్ఞ నరసింహ ఆలయం)

అయితే, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలతోపాటు రాజస్తాన్ నుంచి కేరళ దాకా నరసింహస్వామి ఆలయాలున్నా, ఇప్పటికీ నరసింహారాధన ఎక్కువగా ఉన్న ప్రదేశాలు తెలుగు రాష్ట్రాలే. అక్కడి ఆలయాలు అంత ప్రాముఖ్యం లేనివి.

పెద్దవి చిన్నవి కలిపి ఆంధప్రదేశ్ లో మొత్తంగా 350 నరసింహాలయాలున్నాయి. తెలంగాణలో 169 ఆలయాలు ఉన్నాయి. ఇందులో కొన్ని అటవీ ప్రాంతాల్లో ఉంటాయి. కొన్ని మైదాన ప్రాంతాలలో ఉంటాయి.

నరసింహస్వామికి సంబంధించిన తెలుగు నాట ఉన్న ప్రఖ్యాత ఆలయాలు:

ఆహోబిలం (కర్నూలు జిల్లా), సింహాచలం(విశాఖపట్టణం జిల్లా), మంగళగిరి (గుంటూరు జిల్లా), మట్టపల్లి(గుంటూరు జిల్లా), కేతవరం (గుంటూరు జిల్లా), వేదాద్రి(కష్ణా జిల్లా), అంతర్వేది(తూర్పుగోదావరి జిలా), సింగరాయకొండ (ప్రకాశం జిల్లా) మాలకొండ (ప్రకాశం జిల్లా),కోరుకొండ (తూర్పుగోదావరి జిల్లా), ఆగిరిపల్లి (కృష్ణా జిల్లా) కదిరి (అనంతపురం జిల్లా) పెన్నహోబిలం( అనంతపురం జిల్లా), తిరుమల యోగనరసింహ స్వామి (చిత్తూరు జిల్లా) వాడపల్లి (నల్గొండ జిల్లా) యాదగిరి గుట్ట (యాదాద్రి జిల్లా), ధర్మపురి (కరీంనగర్ జిల్లా). ఇవి కాకుండా చిన్న చిన్న ఆలయాలు లెక్కలేనన్ని ఉన్నాయి.

Eye Sight : కంటి చూపు లోపానికి…ఆ రెండు విటమిన్లు కారణం

కంటి చూపు ఎంత జాగ్రత్తగా కాపాడుకొంటామో మనం మన ఆస్తిని అంతగా కాపాడుకొన్నట్లు లేక. మనదేశంలో చాలా మంది కంటి చూపు మందగించడానికి ప్రధాన కారణం రెండు విటమిన్ల లోపమని వైద్యులు చెబుతున్నారు.
‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ అని ఊరికే అనలేదు. మెదడుకు ప్రపంచాన్ని పరిచయం చేసేవి కళ్లే. మానవదేహంలోని అవయవాల్లో కళ్లు అత్యంత కీలకమైనవి.

అయితే మారుతున్న జీవనశైలి కారణంగా కంటి చూపు తగ్గుతోందంటూ ఆసుపత్రులకు వచ్చేవారి సంఖ్య బాగా పెరుగుతోంది. 50 ఏళ్ల లోపు వారు కూడా పాక్షిక అంధుల్లా మారుతున్నారు.

కంటిచూపు తగ్గడానికి వివిధ కారణాలతో పాటు రెండు కీలక విటమిన్ల లోపం కూడా కారణం అయ్యుండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మానవదేహంలోని వ్యవస్థలు సజావుగా పనిచేయాలంటే విటమిన్లు, ఖనిజలవణాలు, సూక్ష్మపోషకాలు ఎంతో అవసరం. మొత్తం 13 విటమిన్లు శారీరక ఆరోగ్యానికి ఉపకరిస్తాయి.

అయితే వీటిలో విటమిన్ ఏ, విటమిన్ బీ12 లోపిస్తే కంటిచూపు మందగిస్తుందట. ఈ రెండు విటమిన్ల లోపం కళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని నిపుణులు పేర్కొన్నారు.

విటమిన్ ఏ లోపం వల్ల కంటిలోని కార్నియా ఎండిపోయినట్టుగా మారుతుందని, దాంతో రెటీనా కూడా దెబ్బతింటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. తద్వారా అంధత్వం కలుగుతుందని వివరించింది.

ప్రతి ఏటా 2.5 లక్షల నుంచి 5 లక్షల మంది వరకు చిన్నారులు విటమిన్ ఏ లోపంతో అంధత్వం బారినపడుతున్నారని తెలిపింది. వారిలో సగం మంది ఏడాదిలోపే మృత్యువాత పడుతున్నారని కూడా డబ్ల్యూహెచ్ఓ సంచలన వాస్తవాలు వెల్లడించింది.

విటమిన్ బీ12 కూడా చూపు కోల్పోవడానికి కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు. మెదడు, నాడీ కణాల అభివృద్ధిలో విటమిన్ బీ12దే కీలకపాత్ర. ఈ విటమిన్ లోపించడం వల్ల ఆప్టిక్ న్యూరోపతీ (కంటి నరాల వాపు-నాడీ కణజాలం దెబ్బతినడం) సంభవిస్తుందట.

ఇది తాత్కాలికంగా కంటి చూపును కోల్పోయేలా చేస్తుందని, దీర్ఘకాలంలో మాత్రం నష్టం తీవ్రంగా ఉంటుందని ఆప్టోమెట్రీ అసోసియేషన్ పేర్కొంది. అందుకే, కంటిచూపు తగ్గినవారు విటమిన్ బీ12 లోపించిందేమోనని పరీక్ష చేయించుకోవాలని సూచిస్తోంది.

ఈ రెండు విటమిన్ల లోపం నుంచి తగిన ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా మనల్ని మనం కాపాడుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

గుడ్లు, కొవ్వుతో ఉన్న చేపలు, జున్ను, పాలు, పెరుగు, కాలేయం వంటివి ఆహారంలో చేర్చుకుంటే విటమిన్ ఏ లోపం నుంచి బయటపడొచ్చని వివరిస్తున్నారు.

ఇక, బీ12 విటమిన్ ప్రధానంగా గొడ్డు మాంసం, పంది మాంసం, కోడిమాంసం, గుడ్లు, మటన్, టూనా, హాడాక్ వంటి చేపల్లోనూ, నత్తలు, పీతల వంటి సముద్ర జీవుల్లోనూ, పాలు, పాల ఉత్పత్తుల్లోనూ సమృద్ధిగా ఉంటుందట.

Brinjal Fry : వంకాయలను ఇలా ఫ్రై చేస్తే.. ముక్క కూడా వదిలిపెట్టకుండా తింటారు..

Brinjal Fry : మనం ఆహారంగా తీసుకునే కూరగాయలల్లో వంకాయలు ఒకటి. వంకాయలను తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది.

షుగర్ వ్యాధిని నియంత్రించడంలో వంకాయలు ఎంతో సహాయపడతాయి. వంకాయలలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కనుక బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మంచి ఆహారంగా చెప్పవచ్చు. వంకాయలను తరచూ ఆహారంగా తీసుకోవడం వల్ల అజీర్తి, మలబద్దకం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఎర్ర రక్త కణాల పెరుగుదలకు ఉపయోగపడే ప్లోటేట్స్ వంకాయలల్లో అధికంగా ఉంటాయి.

వంకాయలల్లో సోడియం తక్కువగా ఉంటుంది. కనుక బీపీ వ్యాధి గ్రస్తులు కూడా వంకాయలను ఆహారంగా తీసుకోవచ్చు. వంకాయలను తరచూ ఆహారంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వంకాయలతో మనం రకరకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. వంకాయలతో చేసే వంటలల్లో వంకాయ ఫ్రై ఒకటి. వంకాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే వంకాయ ఫ్రై కు బదులుగా కింద చెప్పిన విధంగా కూడా వంకాయలను ఫ్రై చేయవచ్చు. ఇలా చేసిన వంకాయ ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది. ఎంతో రుచిగా వంకాయ ఫ్రై ని ఎలా తయారు చేసుకోవాలి.. దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వంకాయ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..

వంకాయలు – పావు కిలో, వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్‌, ఎండు మిరపకాయలు – 7, వెల్లుల్లి రెబ్బలు – 6, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్‌.

తాళింపుకు కావల్సిన పదార్థాలు..

పొడుగ్గా సన్నగా తరిగిన ఉల్లిపాయ – ఒకటి, తరిగిన పచ్చి మిర్చి -2, జీలకర్ర – అర టీ స్పూన్‌, ఆవాలు – అర టీ స్పూన్‌, శనగపప్పు – ఒక టీ స్పూన్, ఎండు మిర్చి – 1, పసుపు – అర టీ స్పూన్‌, వెల్లుల్లి రెబ్బలు – 4, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – రెండు టేబుల్ స్పూన్స్‌, కరివేపాకు – ఒక రెబ్బ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.

వంకాయ ఫ్రై తయారీ విధానం..

ముందుగా వంకాయలను చిన్న ముక్కలుగా చేసుకుని ఉప్పు నీళ్లలో వేసుకోవాలి. ఇప్పుడు ఒక జార్ లో ఎండు మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, నువ్వులు, పొట్టు తీసుకున్న పల్లీలను వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి కాగాక పసుపు, ఉప్పు, కొత్తిమీర తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు సగం వరకు వేగాక ముందుగా ముక్కలుగా చేసి పెట్టుకున్న వంకాయలను, పసుపు, రుచికి సరిపడా ఉప్పును వేసి కలుపుకోవాలి. ఇలా కలిపిన తరువాత మూత పెట్టి, మధ్యస్థ మంటపై వంకాయలు పూర్తిగా ఉడికే వరకు ఉంచుకోవాలి.

వంకాయ ముక్కలు ఉడికిన తరువాత మూత తీసి 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. 5 నిమిషాల తరువాత ముందుగా బరకగా మిక్సీ పట్టుకున్న ఎండు మిరపకాయల మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తరువాత 2 నిమిషాల పాటు వేయించి, చివరగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే వంకాయ ఫ్రై తయారవుతుంది. వంకాయ ఫ్రైను నేరుగా అన్నంతో లేదా పప్పు, సాంబార్ వంటి వాటితో కలిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. అలాగే వంకాయలో ఉండే పోషకాలు శరీరానికి లభిస్తాయి.

Allam Chutney : అల్లం మన శరీరానికి ఎంతో ఉపయోగకరం.. దాంతో చట్నీని ఇలా తయారు చేయండి..!

Allam Chutney : మనం కూరలను తయారు చేయడానికి ఉపయోగించే వాటిల్లో అల్లం ఒకటి. ఎక్కువగా మనం అల్లాన్ని.. వెల్లుల్లితో కలిపి పేస్ట్ లా చేసి ఆ మిశ్రమాన్ని కూరల్లో వాడుతూ ఉంటాం.

అల్లాన్ని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అల్లం జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. తల తిరగడాన్ని తగ్గిస్తుంది. అల్లం యాంటీ బాక్టీరియల్ పదార్థంగా కూడా పని చేస్తుంది. ఆర్థరైటిస్ వల్ల కలిగే నొప్పులను తగ్గించడంలో అల్లం ఎంతో సహాయపడుతుంది. మహిళల్లో నెలసరి సమయంలో వచ్చే నొప్పులను తగ్గించడంలో కూడా అల్లం ఉపయోగపడుతుంది. అల్లాన్ని తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల క్యాన్సర్, అల్జీమర్స్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

గుండె పని తీరును మెరుగుపరచడంలోనూ అల్లం దోహదపడుతుంది. అల్లంతో టీ ని కూడా తయారు చేస్తూ ఉంటాం. అల్లంతో తయారు చేసే ఆహార పదార్థాలలో అల్లం చట్నీ ఒకటి. అల్లం చట్నీ చాలా రుచిగా ఉంటుంది. అల్లం చట్నీని ఎక్కువగా ఇడ్లీ, దోశ వంటి వాటిని తినడానికి ఉపయోగిస్తూ ఉంటాం. హోటల్స్ లో అల్లం చట్నీని ఎంతో రుచిగా తయారు చేస్తూ ఉంటారు. హోటల్స్ లో తయారు చేసే విధంగా మనం ఇంట్లో కూడా అల్లం చట్నీని తయారు చేసుకోవచ్చు. అల్లం చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో.. ఎలా తయారు చేయాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.

అల్లం చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..

అల్లం ముక్కలు – 20 గ్రా., చింతపండు – 15 గ్రా., బెల్లం తురుము – 10 గ్రా., శనగ పప్పు – ఒక టేబుల్ స్పూన్‌, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్‌, ఎండు మిర్చి – 50 గ్రా., నూనె – ఒక టీ స్పూన్‌, ఉప్పు – రుచికి సరిపడా, నీళ్లు – తగినన్ని.

అల్లం చట్నీ తయారీ విధానం..

ముందుగా చింతపండును నీటిలో నానబెట్టుకోవాలి. కళాయిలో నూనె వేసి కాగాక ఎండు మిర్చి వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇవి వేగాక ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో అల్లం ముక్కలు, ధనియాలు, శనగపప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక జార్ లో ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు మిరపకాయలను వేసి మిక్సీ పట్టుకోవాలి. అందులోనే నానబెట్టిన చింతపండు, బెల్లం తురుము, రుచికి సరిపడా ఉప్పు, ముందుగా వేయించి పెట్టుకున్న అల్లం ముక్కలు, ధనియాలు, శనగ పప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లను పోసి మళ్లీ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే అల్లం చట్నీ తయారవుతుంది. ఇడ్లీ , దోశ వంటి వాటితోనే కాకుండా అన్నంతో కూడా అల్లం చట్నీని కలిపి తినవచ్చు. ఇలా తరచూ అల్లం చట్నీని తయారు చేసుకుని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.

Hair Tips : ఎంత పల్చగా అయిన జుట్టు అయినా సరే దీనిని రాస్తే మీ జుట్టు ఒత్తుగా, పొడవుగా, దృఢంగా పెరగాల్సిందే.!

Hair Tips : ప్రస్తుతం చాలామంది వయసు తరహా లేకుండా ప్రతి ఒక్కరు జుట్టు రాలే సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నారు.
అయితే ఈ సమస్యని తగ్గించుకోవడం కోసం ఎన్నో రకాల కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ ని వాడుతూ ఎన్నో వేల ఖర్చుచేసిన ఈ సమస్య నుంచి ఎటువంటి ఉపశమనం కలగడం లేదు

కొందరిలో ఈ సమస్య పెరిగిపోయి జుట్టు చాలా పల్చగా తోకల తయారవుతుంది. ఈ సమస్యకి కారణాలు సరియైన ఆహారం తీసుకోకపోవడం, ఒత్తిడికి గురి అవ్వడం, పొల్యూషన్ ఇలా కొన్ని రకాల కారణాలతో ఈ సమస్యలు రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి.

ఇలాంటి వాళ్లకి ఇప్పుడు మనం తయారు చేయబోయే హెయిర్ ఆయిల్ చాలా బాగా సహాయపడుతుంది. ఈ ఆయిల్ లో ఉపయోగించేవి అన్ని నేచురల్ గా దొరికేవి కావున ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగవు.

ఈ ఆయిల్ ని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు వాడుకోవచ్చు. ఈ నూనెను తయారు చేయడానికి మొదటగా ఒక గిన్నెను తీసుకొని దానిలో మూడువందల ml కొబ్బరినూనె వేసుకోవాలి.

ఆ గిన్నెను స్టవ్ పై పెట్టి స్టవ్ ని సిం లో పెట్టి దానిలో మొదటిగా ఒక చెంచా ఆవాలు వెయ్యాలి. ఆ తదుపరి ఒక చెంచా మెంతులు కూడా వేయాలి. ఆ తర్వాత నాలుగు లవంగాలు కూడా వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలను కూడా వెయ్యాలి.

తర్వాత మందార పువ్వులుని ఒక ఐదు వేసుకోవాలి. తర్వాత ఎండి ఉసిరి ముక్కలను ఒక గుప్పెడు వేయాలి. ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేయాలి. తర్వాత గరిక ఆకులని ఒక గుప్పెడు వేసుకోవాలి.

Hair Tips A bunch of curry leaves

ఆ తదుపరి నాలుగు ఆకుల తులసి ఆకులని కూడా వేసి, తర్వాత గుప్పెడు మందర ఆకుల్ని కూడా వేసుకోవాలి. గుప్పెడు గోరింట ఆకులను కూడా తీసుకొని దాన్లో వేయాలి.

ఇలా అన్నిటిని వేసిన తర్వాత సన్నని సెగపై నూనె కలర్ మారేవరకు బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిన ఆయిల్ ని వేడిగా ఉన్నప్పుడే వేరే గిన్నెలోకి వడపోసుకోవాలి.

ఈ విధంగా తయారు చేసుకున్న ఆయిల్ నిత్యము మనం జుట్టు కుదుల నుంచి చివరి వరకు బాగా అప్లై చేసుకోవాలి. ఇలా వాడడం వలన 15 రోజుల్లోనే కొత్త జుట్టు రావడం ప్రారంభమవుతుంది.

దీనిని వారానికి రెండుసార్లు ఇలా అప్లై చేసుకున్న తర్వాత వారంలో రెండుసార్లు గాఢత తక్కువ ఉన్న షాంపూ ని ఉపయోగించి తలస్నానం చేయాలి.

ఈ విధంగా చేయడం వలన మీ జుట్టు ఎంతో ఫాస్ట్ గా ,ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది. ఈ ఆయిల్ వలన ఉపయోగించడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు..

Remove White Hair Colour: జుట్టు నెరిసిపోతుందా? ఇలా చేస్తే జీవితాంతం నల్లగా నిగనిగలాడుతుంది..

మీ జుట్టు బలహీనంగా ఉండి తెల్లబడటం ప్రారంభించినట్లయితే.. ఈ వార్త మీకు ఉపయోగపడుతుంది. శామగడ్డ రూట్ అంటారు. ఇది జుట్టు ఆరోగ్యానికి అద్భుతమైనది.
జుట్టు రాలడం, నిర్జీవమైన జుట్టును వదిలించుకోవడమే కాకుండా శామగడ్డ అనేక విధాలుగా జుట్టుకు ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు తెల్లగా మారడం ప్రారంభించిన వెంటనే, మీ అందం వాడిపోతుంది.

అంతేకాదు చిన్న వయస్సులో తెల్ల జుట్టు సమస్య మరింత ఇబ్బందిగా మారుతుంది. అయితే చిన్న వయసులోనే జుట్టు ఎందుకు తెల్లగా మారుతుందో తెలుసా? మీరు జుట్టుకు గల కారణాలను తెలుసుకుంటారు.

అదే సమయంలో, జుట్టు జీవితాంతం నల్లగా ఉండాలంటే జుట్టులో (వైట్ హెయిర్ సొల్యూషన్) ఏమి రాయాలో మీకు తెలుస్తుంది.

వైట్ హెయిర్ కలర్: జుట్టు తెల్లని రంగును తొలగించడానికి శామగడ్డ జిగురును అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుందని మీకు తెలియకపోవచ్చు, కానీ శామ గడ్డ హెయిర్ అప్లై చేయడం ద్వారా ఎప్పటికీ నల్లగా మార్చుకోవచ్చు.

శామలో ఉండే విటమిన్ ఇ, ఫాస్పరస్, మెగ్నీషియం, మాంగనీస్ జుట్టును మూలాల నుంచి బలపరుస్తుంది. దీని వల్ల జుట్టు రాలే సమస్య కూడా దూరమవుతుంది. అరబిక్‌ని జుట్టుకు అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.

అర్బీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టును తెల్లగా చేసే ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేస్తుంది. ఈ ఫ్రీ రాడికల్స్ మన జుట్టు ఆకృతిని, స్కాల్ప్ కణాలను దెబ్బతీస్తాయి. బూడిద జుట్టుకు దారితీస్తాయి.

అర్బీలో జుట్టుకు ప్రయోజనకరమైన ఫోలేట్, ఐరన్ కూడా ఉన్నాయి. ఇది జుట్టును రూట్ నుంచి బలంగా చేయడం ద్వారా జుట్టు రాలడాన్ని ఆపుతుంది.

అదే సమయంలో, శామ జుట్టు పెరుగుదలలో కూడా సహాయపడుతుంది. స్కాల్ప్‌లో బ్లడ్ సర్క్యులేషన్‌ని పెంచడం ద్వారా జుట్టు పొడవుగా మారుతుంది.

మీకు పొడి జుట్టు లేదా చుండ్రు సమస్య ఉన్నప్పటికీ, శామని అప్లై చేయడం ద్వారా తొలగించవచ్చు. ఎందుకంటే, శామగడ్డ జుట్టు, తలకు తేమను అందిస్తుంది.

తెల్ల జుట్టు సమస్యకు శామ గడ్డ:

తెల్ల జుట్టును ఆపడానికి అరబిక్ ఎలా అప్లై చేయాలి..? తెల్ల జుట్టును నివారించడానికి మీరు శామ హెయిర్ మాస్క్‌ని అప్లై చేయాలి. మీరు వారానికి ఒకసారి ఈ హెయిర్ మాస్క్‌ని ఉపయోగించవచ్చు. ఎలాగో తెలుసుకుందాం.

శామని పీల్ చేసి అర గిన్నె శమని కట్ చేసుకోండి.

ఈ శామని కడిగి, పూర్తిగా మెత్తబడే వరకు బాగా ఉడికించాలి.

ఇప్పుడు ఈ అర్బీని మెత్తగా చేసి, దానికి కొంచెం మజ్జిగ వేసి పేస్ట్‌లా చేయండి.

ఈ పేస్ట్‌ను జుట్టు, స్కాల్ప్‌పై బాగా అప్లై చేసి తర్వాత కడిగేయాలి.

Big Breaking: సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) నోటీసులు జారీచేసింది. తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు (Note for Vote Case) విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కు మార్చాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
హైదరాబాద్ నుంచి కేసు విచారణ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు మార్చాలని ట్రాన్స్ఫర్ పిటిషన్‌ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ జరిపింది. కేసు విచారణను భోపాల్‌కు బదిలీ చేయాలన్న వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి, ఇతర ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు ఇచ్చింది.

 

ఇదీ అసలు సంగతి..

సీఎం, హోం మంత్రిగా ఒకరే బాధ్యతలు నిర్వహిస్తున్నారని వెంటనే ట్రయల్ కూడా మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు ట్రయల్ మొదలైతే విచారణపై ప్రభావం చూపే అవకాశం ఉందని పిటిషనర్ జగదీష్ రెడ్డి తరపు న్యాయవాది మోహిత్ రావు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఒకవేళ ట్రయల్‌పై అలాంటి ప్రభావం ఉందనుకుంటే తాము ఎలా చూస్తూ ఉంటామని జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. ఈ కేసులో ట్రయల్‌ని నిలుపుదల చేస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా పిటీషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సీఎం రేవంత్‌ రెడ్డిపై 88 క్రిమినల్‌ కేసులు నమోదైనట్లు పిటిషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

 

స్పందన ఎలా ఉంటుందో..?

కాంగ్రెస్ అధికారం చేపట్టిన 100 రోజుల్లో గత ప్రభుత్వం చెప్పినట్లు విన్న పోలీసు అధికారులందరిని నగ్నంగా పరేడ్ చేస్తా అని గతంలో రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వివరాలను కూడా ధర్మాసనంకు పిటిషనర్‌ అందజేశారు. పిటిషనర్ వాదనలు పరిగణనలోకి తీసుకున్న అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి, వ్యక్తిగతంగా సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ప్రతివాదులకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు నాలుగు వారాల్లో స్పందించాలని అందులో పేర్కొంది. అయితే.. రేవంత్, తెలంగాణ ప్రభుత్వం ఈ నోటీసులను ఎలా తీసుకుంటుంది..? స్పందన తర్వాత ఏం జరగబోతోంది..? అనే దానిపై కాంగ్రెస్ శ్రేణుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

శివుడి మెడలో పాము ఎందుకు ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న కథ ఏంటంటే..

Maha shivaratri : లయకారుడు సర్వాంతర్యామి అని శివుడిని పిలుస్తారు. ఎప్పుడు ధ్యాన ముద్రలో శివుడి కనిపిస్తాడు. శరీరం మీద పులి చర్మం కప్పుకుని, మెడలో పాముని కంఠాభరణంగా ధరించి, శరీరం అంతా విభూది ధరించి ఉంటాడు.
అయితే శివుడు మెడలో పాము ఎందుకు ఉంటుందని సందేహం చాలా మందికి ఉంటుంది. అయితే పరమాత్ముడు ధరించే ప్రతీ దాని వెనుక ఒక్కో అర్థం ఉంటుంది.

మెడలో పాము ఎందుకు ఉంటుందంటే..

ఈశ్వరుడు మెడలో ఉండే మహా సర్పం వాసుకి. అన్ని వేళలా స్వామి వారి మెడలో ఉండి ఆయన్ని సేవిస్తూ తరిస్తాడు. వాసుకి శివుని మెడలో ఉండటం వెనుక ఒక చిన్న కథ ఉంటుంది.

కశ్యప ప్రజాపతికి పద్నాలుగు మంది భార్యలలో వినత, కద్రువ ఇద్దరు. వినతకు గరుత్మంతుడు, అనూరుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అనూరుడు సూర్యుని రథ సారథిగా ఉంటాడు. కద్రువకి వెయ్యి మంది సర్పాలు సంతానం. వాళ్ళలో ఆదిశేషువు పెద్దవాడు. పాల సముద్రంలో ఉన్న గుర్రాన్ని దూరం నుంచి చూసిన కద్రువ తన సోదరి వినతతో దాని తోక నల్లగా ఉందని చెప్పింది. అదెలాగా గుర్రం తోక తెల్లగా కదా ఉండేది నల్లగా ఉందని చెప్తావ్ ఏంటని వినత తన మాటలు నమ్మలేదు. ఈ విషయం గురించి ఇద్దరి మధ్య వాదన జరిగింది.

తోక నల్లగా ఉంటే అక్క తన దగ్గర వెయ్యి సంవత్సరాలు పరిచారికగా ఉండాలని.. ఒకవేళ తోక తెల్లగా ఉంటే తానే వినత దగ్గర వెయ్యి సంవత్సరాలు బానిసగా ఉంటానని కద్రువ చెప్తుంది. పరిశీలిద్దామని వెళ్దామనుకునేసరికి చీకటి పడుతుంది. ఇప్పుడు కాదు పొద్దునే వచ్చి పరీక్షిద్దామని వెళ్లిపోతారు. కానీ వినతకి తెలియకుండా కద్రువ వచ్చి చూస్తుంది. గుర్రం తోక తెల్లగానే ఉండటంతో ఈ పందెంలో ఎలాగైనా తనే గెలవాలనే ఆశతో ఒక చెడు ఆలోచన చేస్తుంది. తన కుమారులని పిలిచి నల్లగా ఉన్న పాములన్నీ వెళ్ళి గుర్రం తోకను చుట్టుకోవాలని చెప్తుంది. కానీ తల్లి చెప్పిన మాటకు కొడుకులు ఒప్పుకోరు.
ఇది అధర్మ మార్గమని ఎంత చెప్పినా కూడా కద్రువ వినిపించుకోదు. తన మాట కాదని అన్నందుకు కొడుకులని శపిస్తుంది. భవిష్యత్ లో జరిగే సర్పయాగంలో పడి అందరూ చనిపోతారని శాపం విధిస్తుంది. దీంతో భయపడిపోయిన కొన్ని సర్పాలు తల్లి మాట ప్రకారం వెళ్ళి గుర్రం తోకను చుట్టుకుంటారు. గుర్రం తోక తెల్లగా కాకుండా నల్లగా ఉందని వినతి నమ్ముతుంది. ఇచ్చిన మాట ప్రకారం కద్రువ దగ్గర దాసీగా చేస్తుంది. ఆమెకు ఆమె రెండో కుమారుడు గరుత్మంతుడు బానిస బంధాల నుంచి విముక్తి కలిగిస్తాడు.

ఆదిశేషువు అలా.. వాసుకి ఇలా

కద్రువు మాట అంగీకరించని ఆది శేషువు శాపానికి గురి కావడం వల్ల దాని నుంచి బయట పడేందుకు మహా విష్ణువు కోసం తపస్సు చేస్తాడు. తపస్సుకి మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమై మృత్యు భయం లేకుండా చేసేందుకు తన శేషతల్పంగా ఉండమని వరం ఇస్తాడు. ఇక రెండో కుమారుడు వాసుకి శివుడి కోసం తపస్సు చేశాడు. ఆయన తపస్సుని మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై తన మెడలో కంఠాభరణంగా ఉండమని చెప్తాడు. శివుడు మృత్యుంజయుడు. ఆయన దగ్గర ఉంటే వాసుకికి కూడా ఎలాంటి ప్రమాదం దరి చేరదు. అలా వాసుకి అప్పటి నుంచి శివుడి మెడలో ఉండిపోయాడు.

BREAKING : తెలుగు తేజం మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారత రత్న. మరో ఇద్దరు మాజీ ప్రధానులకు భారతరత్న.. ప్రకటించిన కేంద్రం

భారతమాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీ ప్రకటించారు.
విశిష్ట పండితుడు మరియు రాజనీతిజ్ఞుడిగా, నరసింహారావు భారతదేశానికి వివిధ హోదాలలో విస్తృతంగా సేవలందించారని ప్రధాని మోడీ అన్నారు. ఏపీ సీఎంగా, కేంద్ర మంత్రిగా, అనేక సంవత్సరాల పాటు ఎంపీగా, ఎమ్మెల్యేగా ఆయన చేసిన కృషిని దేశం గుర్తుంచుకుంటుందన్నారు.

భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో అతని దూరదృష్టి గల నాయకత్వం కీలక పాత్ర పోషించిందన్నారు. కాగా 1991 – 96 వరకు భారత ప్రధానిగా పీవీ నర్సింహారావు పనిచేశారు. 1972లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పీవీ నర్సింహారావు సేవలందించారు. పీవీ వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో జన్మించారు. పీవీతో పాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్‌, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్. స్వామినాథన్ కు సైతం కేంద్రం భారత రత్న ప్రకటించింది.

Episode-14: From The Desk of Principal Secretary School Education Programme YouTube Live

Episode-14: From The Desk of Principal Secretary School Education Programme YouTube Live

 

https://youtu.be/7wxKoz2zmm

https://youtu.be/7wxKoz2zmms

Episode-14: From The Desk of Principal Secretary School Education Programme YouTube Live

Direct YouTube Live Link :

https://youtu.be/7wxKoz2zmms

Honorable Secretary, School Education ,Govt .of Andhra Pradesh Shri Praveen Prakash IAS Sir will address All Head Masters and teachers of all schools ,all MEOs ,staff of DEOs, RJDs office, staff of all HODs office of School Education Department ,secretariat staff of SE department, Village & Ward Welfare & Educational Assistants of all Over State Today i.e 09/02/24 at 03.00 pm from SCERT you tube channel . All are requested to view this video at 3.00PM of 09/02/24 without fail.

VIDEO LINK IN SCERT YOUTUBE CHANNEL:

https://youtu.be/7wxKoz2zmms

Dear all,

The 14th episode of the programme “From the Desk of Principal Secretary” will be streamed from the SCERT YouTube channel at 03.00 p.m. Request SCERT Director to share the link with all concerned. Request all HoDs (including MD, APEWIDC and Commissioner, Intermediate Education) and the senior field officers to share the information and ensure that everybody watches it. The main purpose of this program is to ensure that every person who is part of the School Education Department (Permanent, Contract or outsourcing) is on the same page as far as the implementation of flagship programs of the government is concerned.

This is the part of the new program called “From The Desk of Principal Secretary School Education”. Request to login to the channel.Request HoDs ,and DEOs to forward this msg to all the Teachers ,HMs,and all other colleagues mentioned above

With regards

Praveen

Direct YouTube Live Link :

https://youtu.be/7wxKoz2zmms

బాల్కసుమన్‌పై కేసు నమోదు.. మాజీ ఎమ్మెల్యే కోసం గాలిస్తున్న పోలీసులు

బీఆర్ఎస్ చీఫ్, ప్రతిపక్ష నేతపై ఘాటు విమర్శలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిని దూషించిన వ్యవహారంలో చెన్నూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై మంచిర్యాల పోలీసు స్టేషన్ కేసు నమోదైంది.
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కోసం రెండు రోజులుగా పోలీసులు గాలిస్తున్నారు. కాగా, కేసీఆర్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్‌గా మంచిర్యాల నియోజకవర్గం సమీక్షా సమావేశంలో రేవంత్ రెడ్డిని చెప్పు తీసుకుని కొడతానంటూ బాల్క సుమన్ వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఖబడ్దార్ అంటూ సవాల్ విసిరిన విషయం తెలిసిందే.

Aadhaar Card: ఆధార్ కార్డు భద్రతకు ముప్పు! ఈ పనులు అస్సలు చేయకండి..

ఆధార్ కార్డు.. భారతదేశంలోని ప్రతి పౌరుడికి తప్పనిసరిగా ఉండాల్సిన గుర్తింపు పత్రం. ఇటీవల కాలంలో అన్ని ఆధార్ ధ్రువీకరణతోనే సాగుతున్నాయి. ప్రభుత్వం సేవలు, బ్యాంకింగ్, టెలికాం ఇలా ఏది చేయాలన్నా తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాల్సిందే.
అది ఆన్ లైన్ అయినా, ఆఫ్ లైన్ అయినా ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఆధార్ కార్డును భద్రంగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాస్తవానికి ఈ ఆధార్ కార్డును యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) జారీ చేస్తుంది. ఇదే సంస్థ దానిని సురక్షితంగా కాపాడుకునేందుకు సాంకేతికంగా అనువైన వాతావరణాన్ని అందిస్తుంది. వ్యక్తుల నుంచి ఆధార్ నంబర్ ను సేకరించే కొన్ని సంస్థలు ఉంటాయి. అవి తప్పనిసరిగా సమాచారాన్ని సురక్షితంగా, చట్టపరమైన అవసరాలకు అనుగుణంగా నిర్వహించాలని, నిల్వ చేయాలని ఆధార్ చట్టం, దాని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో నివాసితులు, మీ ఆధార్ నంబర్‌ను ఆయా సంస్థలు లేదా ఇతర వ్యక్తులకు ఇస్తున్నప్పుడు, కొన్ని చేయవలసినవి, చేయకూడనివి కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం..

ఇవి చేయాలి..

ఆధార్ అనేది మీ డిజిటల్ గుర్తింపు. ఏదైనా విశ్వసనీయ సంస్థతో మీ ఆధార్‌ను షేర్ చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలి.
మీ ఆధార్‌ను కోరుతున్న సంస్థలు మీ సమ్మతిని పొందవలసి ఉంటుంది. అది ఏ ప్రయోజనం కోసం తీసుకుంటున్నారో తప్పనిసరిగా పేర్కొనాలి. దాని కోసం పట్టుబట్టండి.
మీరు ఎక్కడైనా మీ ఆధార్ నంబర్‌ను షేర్ చేయకూడదనుకుంటే, యూఐడీఏఐ వర్చువల్ ఐడెంటిఫైయర్ (వీఐడీ)ని రూపొందించే సదుపాయాన్ని అందిస్తుంది. మీరు సులభంగా వీఐడీని రూపొందించవచ్చు. మీ ఆధార్ నంబర్ స్థానంలో ప్రామాణీకరణ కోసం దాన్ని ఉపయోగించవచ్చు. క్యాలెండర్ రోజు ముగిసిన తర్వాత ఈ వీఐడీని మార్చవచ్చు.
మీరు యూఐడీఏఐ వెబ్‌సైట్ లేదా ఎం-ఆధార్ యాప్‌లో గత ఆరు నెలలుగా మీ ఆధార్ ప్రమాణీకరణ చరిత్రను చూడవచ్చు. క్రమానుగతంగా అదే తనిఖీ చేయండి.
యూఐడీఏఐ ఈ-మెయిల్ ద్వారా ప్రతి ప్రమాణీకరణ గురించి తెలియజేస్తుంది. కాబట్టి, మీ ఆధార్ నంబర్‌తో మీ అప్‌డేట్ అయిన ఈ-మెయిల్ ఐడీని లింక్ చేయడం వలన మీ ఆధార్ నంబర్ ప్రామాణీకరించబడిన ప్రతిసారీ మీకు సమాచారం అందుతుందని నిర్ధారిస్తుంది.
ఓటీపీ ఆధారిత ఆధార్ ప్రమాణీకరణతో అనేక సేవలను పొందవచ్చు. కాబట్టి, మీ మొబైల్ నంబర్‌ను ఎల్లప్పుడూ ఆధార్‌తో అప్‌డేట్ చేసుకొని ఉండండి.
యూఐడీఏఐ ఆధార్ లాకింగ్, బయోమెట్రిక్ లాకింగ్ కోసం సదుపాయాన్ని అందిస్తుంది. మీరు కొంత సమయం వరకు ఆధార్‌ని ఉపయోగించలేనట్లయితే, మీరు ఆ సమయానికి మీ ఆధార్ బయోమెట్రిక్‌లను లాక్ చేయవచ్చు. అదే సమయంలో అవసరమైనప్పుడు సౌకర్యవంతంగా తక్షణమే అన్‌లాక్ చేయవచ్చు.
మీ ఆధార్‌ను అనధికారికంగా ఉపయోగిస్తున్నారని మీరు అనుమానించినట్లయితే లేదా ఏదైనా ఇతర ఆధార్ సంబంధిత ప్రశ్న ఉన్నట్లయితే, యూఐడీఏఐని 24*7 అందుబాటులో ఉన్న టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ 1947లో సంప్రదించాలి. లేదా help@uidai.gov.in కి ఈ-మెయిల్ చేయొచ్చు.
ఇవి అస్సలు చేయకండి..

మీ ఆధార్ లెటర్/పీవీసీ కార్డ్ లేదా దాని కాపీని గమనించకుండా ఉంచవద్దు.
పబ్లిక్ డొమైన్‌లో ప్రత్యేకించి సోషల్ మీడియా (ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మొదలైనవి), ఇతర పబ్లిక్ ప్లాట్‌ఫారమ్‌లలో మీ ఆధార్‌ను బహిరంగంగా షేర్ చేయవద్దు.
మీ ఆధార్ ఓటీపీని ఏ అనధికార సంస్థకు వెల్లడించవద్దు.
మీ ఎం-ఆధార్ పిన్ ని ఎవరితోనూ పంచుకోవద్దు.

Indian Coast Guard Recruitment 2024: భారత తీర రక్షక దళంలో 260 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

మొత్తం పోస్టుల సంఖ్య: 260రీజియన్‌/జోన్‌ల వారీగా ఖాళీలు: నార్త్‌-79, వెస్ట్‌-66, నార్త్‌ ఈస్ట్‌-68, ఈస్ట్‌-33, నార్త్‌ వెస్ట్‌-12, అండమాన్‌-నికోబార్‌-03.
అర్హత: 10+2(మ్యాథ్స్, ఫిజిక్స్‌) ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు: 18 నుంచి 22 ఏళ్లు ఉండాలి.
ప్రారంభ వేతనం: నెలకు రూ.21,700.

ఎంపిక విధానం: స్టేజ్‌-1, స్టేజ్‌-2, స్టేజ్‌-3, స్టేజ్‌-4 పరీక్షలు, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశాలన ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 13.02.2024
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 27.02.2024

  1. వెబ్‌సైట్‌: https://joinindiancoastguard.cdac.in/

డాక్టర్లే షాక్ : సైకిల్ గురు.. సైకిల్ యోగి కద్సూర్ గుండెపోటుతో మృతి

అతని పేరు అనిల్ కద్సూర్.. వయస్సు 45 ఏళ్ల మాత్రమే. బెంగళూరు వాసి.. ఇతనికి మరో పేరు కూడా ఉంది.. సైకిల్ గురు, సైకిల్ యోగి, సెంచరీ సైకలిస్ట్.. అవును ఇతను సైకిల్ తొక్కటాన్ని ప్రోత్సహించాడు..
అతను ఆఫీసుకు కూడా సైకిల్ పైనే వెళతాడు.. అన్ని పనులు సైకిల్ ద్వారానే చక్కబెట్టుకుంటాడు. దీని వల్ల ఆరోగ్యంగా ఉన్నానని.. ఆరోగ్యానికి సైకిల్ అనేది చాలా చాలా మంచి చేస్తుందని చెబుతూ ప్రపంచ దృష్టికి ఆకర్షించాడు. ఇప్పటి వరకు అనీల్ కద్సూర్ 2 లక్షల 71 వేల కిలోమీటర్లు సైకిల్ పై తిరిగాడు.. అవును.. అక్షరాల 2 లక్షల 71 వేల కిలోమీటర్లు.. కొన్ని నెలలుగా.. ప్రతి రోజూ 100 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతున్నాడు.. అలాంటి సైకిల్ గురు గుండెపోటుతో చనిపోయారు.. అది కూడా 45 ఏళ్ల వయస్సులోనే.. ఇప్పుడు ఇదే డాక్టర్ల ప్రపంచాన్ని షాక్ కు గురి చేస్తుంది. ఫిట్ నెస్ ట్రైనర్ గానూ ఎంతో గుర్తింపు పొందారు అనీల్.

నరాల బలానికి, కండరాల బలానికి సైకిల్ తొక్కటం అనేది ఎంతో ఉపయోగం అని.. గుండె ఆరోగ్యాన్ని పెంచుతుందని ఎంతో మంది డాక్టర్లు చెబుతూ వస్తున్నారు. అంతెందుకు ప్రముఖ కార్డియాలజిస్టులు, న్యూరాలిస్టులు రన్నింగ్, వాకింగ్, సైకిలింగ్ చేయటం ద్వారా గుండె సంబంధం వ్యాధుల నుంచి బయటపడొచ్చని.. ఆరోగ్యంగా ఉండొచ్చని చెప్పటం సహజం.. మరి అలాంటి సైకిలింగ్ ద్వారా ఎంతో బలంగా.. ఆరోగ్యంగా ఉన్న అనీల్ కద్సూర్ గుండెపోటుతో చనిపోవటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

దీనిపై చాలా మంది డాక్టర్లు ఇప్పుడు చెబుతున్నది ఏంటో తెలుసా.. అతి వ్యాయామం కూడా ప్రమాదకరం అని.. ఎక్కువగా సైకిల్ తొక్కటం కూడా ప్రమాదం అని చెబుతున్నారు. ప్రతి రోజూ ఎక్సర్ సైజ్ చేసే వారు.. అప్పుడప్పుడు రిలాక్స్ అవ్వాలని.. కొన్ని రోజులు వ్యాయామానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అతిగా సైకిలింగ్ చేయటం ద్వారా నిద్రలేమి వస్తుందని.. ఇదే అనీల్ కద్సూర్ మరణానికి కారణం అయ్యి ఉంటుందని కొంత మంది డాక్టర్లు చెబుతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా సైకిలింగ్ లో ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న అనీల్ కద్సూర్ గుండెపోటు మరణం డాక్టర్లను సైతం విస్మయానికి గురి చేసింది.

Lady Bhagirath: నాటి ‘భగీరథుడు’ నేడు ‘గౌరి’ రూపంలో వచ్చాడా?

మహిళలు.. పురుషుల కంటే తక్కువని ఎవరన్నారు?.. ‘గౌరి’ గురించి తెలిస్తే ఇటువంటి మాటలు మాట్లాడేవారు ఇక జన్మలో ఎప్పటికీ స్త్రీలను తక్కువగా చూడరు.
నింగినున్న గంగను భూమిపైకి తెచ్చిన భగీరథుని గురించి మనకు తెలుసు. కొండను తవ్వి రోడ్డును వేసిన బీహార్‌కు చెందిన దర్శత్ మాఝీ గురించి కూడా మనం వినేవుంటాం. అంతటి స్థాయిని దక్కించుకున్న ‘గౌరి’ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కర్ణాటకకు చెందిన ‘గౌరి’ నీటి ఎద్దడిని పరిష్కరించడంలో నిపుణురాలిగా పేరు తెచ్చుకుంది. ఈమె ఇప్పటి వరకు రెండు బావులను తవ్వి, ఇప్పుడు మూడో బావిని తవ్వడం మొదలు పెట్టింది. స్థానికులు ఆమెను అపర భగీరథ అని అభివర్ణిస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఉత్తర కన్నడ జిల్లాలోని గణేష్ నగర్‌కు చెందిన 55 ఏళ్ల మహిళ అంగన్‌వాడీలకు వచ్చే పిల్లలు దాహంతో అలమటించకూడదనే ఉద్దేశంతో స్వయంగా బావిని తవ్వడం ప్రారంభించింది.

గౌరి చంద్రశేఖర్ నాయక్ తన ఇంటి సమీపంలోని అంగన్ వాడీ కేంద్రం వద్ద నాలుగు అడుగుల వెడల్పు కలిగిన బావిని తవ్వే పనిని వారం రోజుల క్రితం ప్రారంభించింది. రోజూ ఒకటిన్నర అడుగుల లోతు తవ్వుతూ వస్తోంది. పలుగు, పార, బుట్ట, తాడు మొదలైన వస్తువుల సాయంతో ఆమె మట్టిని బయటకు తోడుతోంది. అంగన్ వాడీకి మంచి నీటి సౌకర్యం కల్పించేందుకు నెల రోజుల్లో బావిని సిద్ధం చేయాలని ‘గౌరి’ లక్ష్యంగా పెట్టుకుంది.

బావిని తవ్వడం వెనుక తనకు కలిగిన స్ఫూర్తి గురించి గౌరి చంద్రశేఖర్ నాయక్ మాట్లాడుతూ ‘గణేష్ నగర్‌లో నీటి కొరత ఉంది. అంగన్‌వాడీలకు వచ్చే చిన్నారులకు తాగునీరు లేదు. దాహం తీర్చుకునేందుకు పిల్లలు చాలా కష్టపడాల్సి వస్తోంది. ఇటువంటి దుర్భర పరిస్థితే నాలో బావులు తవ్వేందుకు ప్రేరణ కల్పించింది’ అని పేర్కొంది. గౌరి బావిని తవ్వడం ఇదేమీ మొదటి సారికాదు. 2017, 2018లో రెండు బావులు తవ్వింది. జనం తాగునీటికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఆమె ఇటువంటి మంచి పని చేస్తోంది.

Health Care Tips: ఈ ఒక్క కూరగాయ తింటే చాలు.. మంచి హెల్త్ మీ సొంతం అవుతుంది!

ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మనం తీసుకునే ఆహారమే మనల్నీ ఆరోగ్యంగా ఉంచుతుంది. చాలా మంది కూరగాయలు తినడానికి ఇష్ట పడరు. కానీ కూరగాయాల్లో మంచి పౌష్టికాహారాలు ఉంటాయి.
ఇంకొంత మంది ఈజీగా అయ్యే కూరగాయలనే వండుతారు. మిగిలిన వాటి గురించి మర్చిపోతారు. ఇలా చాలా మంది తినకుండా ఉండే వాటిల్లో కంద గడ్డ కూడా ఒకటి. చాలా మందికి అసలు ఈ కూరగాయ గురించే తెలీదు. కంద గడ్డలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అంతే కాకుండా ఈ కంద గడ్డ తింటే చాలా అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. మరి కంద గడ్డతో కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొలెస్ట్రాల్:

చాలా మంది ఇప్పుడు శరీరంలో కొలెస్ట్రాల్‌ పెరిగి ఇబ్బంది పడుతున్నారు. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వల్ల గుండె సమస్యలు, బరువు పెరగడంతో పాటు ఇతర సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. కంద గడ్డ తింటే కొలెస్ట్రాల్ లెవల్స్‌ తగ్గించుకోవచ్చు. కందగడ్డలో ఫైబర్ కంటెంట్ అనేది అధికంగా ఉంటుంది. ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది.
చర్మం అందంగా ఉంటుంది:

కంద గడ్డల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి పుష్కలంగా లభిస్తాయి. ఇందులో విటమిన్లు సి, బి6, బీటా కెరొటీన్ వంటివి ఉంటాయి. దీన్ని వల్ల మీ చర్మం సాఫ్ట్‌గా, ముడతలు లేకుండా ఉంటుంది. అదే విధంగా జుట్టు పెరుగుదలకు కూడా ఎంతో సహాయ పడుతుంది. ఈ కంద గడ్డను క్రమం తప్పకుండా తీసుకుంటే.. మీరు అందంగా కనిపిస్తారు.

డయాబెటీస్:

డయాబెటీస్‌తో బాధ పడేవారు కంద తింటే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. కంద గడ్డలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది. కాబట్టి మధు మేహం ఉన్నవారు కంద గడ్డ తింటే షుగర్ లెవల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి.
శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతుంది:

కంద గడ్డ తింటే శరీరంలో ఉన్న మలినాలు, విష పదార్థాలను బయటకు వెళ్లిపోతాయి. ఫైల్స్ వంటి సమస్యలకు కూడా కంద కడ్డ మంచి ఔషధంలా పని చేస్తుంది. కంద గడ్డను తరచూ తింటే.. పేగులు, లివర్, పొట్ట శుభ్రంగా క్లీన్ అవుతాయి.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.

చింత చెట్టును శపించిన రాధా రాణి ? కారణం ఏంటో తెలుసా

శ్రీ కృష్ణ పరంధాముడు అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది బృందావనం, ద్వారకా. అయితే ప్రతి ఏడాది శ్రీ కృష్ణుని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి బృందావనానికి విచ్చేస్తూ ఉంటారు.
శ్రీ కృష్ణుని ఒక్కో ఆలయంలో ఒకో లీల, ఒక్కో రహస్యం దాగి ఉంటుంది. ఈ లీలలు విన్నా, తలచుకున్నా భక్తుల జన్మ తరిస్తుంది. అలాంటి ఎన్నో అద్భుతమైన దేవాలయాలు, ప్రదేశాలు బృందావనంలో అనేకం ఉన్నాయి. ఇక్కడ కిట్టయ్య బాల్యంలో గడిపిన ఎన్నో గురుతులు నేటికీ కనిపిస్తాయి. అలాంటి అద్భుతమైన ఆలయాల్లో ఇమ్లితాలా ఒకటి. ఈ ప్రాంతంలోని మొక్కలు, మనుషులు రాధాదేవి శాపానికి గురయ్యారని చెబుతుంటారు. వాటిలో చింత చెట్టు కూడా ఒకటి. అసలు రాధారాణి ఎందుకు ఈ వృక్షాలను శపించిందో దాని వృత్తాంతం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రాధా రాణి అలంకరణను చెడగొట్టిన చింత చెట్టు

ఇమ్లి తాలా ఆలయం బృందావనం లోని జుగల్ ఘాట్ సమీపంలో నెలకొని ఉంది. ఈ ప్రదేశం 5500 ఏండ్ల పురాతనమైనదని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయం లోపల చింత చెట్టు ఉంది. ద్వాపర యుగంలో ఈ చెట్టుకు విపరీతంగా చింతపండ్లు కాసేవని చెబుతారు. ఒకసారి రాధాదేవి యమునా నాదిలో స్నానం చేసి ముచ్చటగా అలంకరించుకుని ఈ చెట్టు కిందకు వెళుతోంది. అదే సమయంలో ఈ చెట్టు నుండి చింతపండు పడడంతో దానిపై అడుగువేసిన రాధారాణి ఒక్కసారిగా జారి పడిపోయింది. దాంతో కారణంగా ఆమె అలంకరణ చెడిపోయింది. దీంతో కోపం తెచ్చుకున్న రాధారాణి ఈ చింత చెట్టును శపించింది. ఈ శాపం కారణంగా ఈ చెట్టుకు ఇప్పటి వరకు చింతపండు కాయలేదు.

Health: నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్‌కు కారణమేంటి..? దీని నుంచి బయటపడటం ఎలా..?

భారతదేశంలో ఫ్యాటీ లివర్ కేసులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఇది చాలా తీవ్రమైన సమస్యగా మారుతోంది. కొన్ని సందర్భాల్లో, ఈ వ్యాధి కాలేయ సిర్రోసిస్, దీర్ఘకాలిక కాలేయ వైఫల్యానికి దారితీస్తుంది.
ఆల్కహాల్, స్ట్రీట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు మద్యం సేవించని వారు కూడా ఫ్యాటీ లివర్ వ్యాధి బారిన పడుతున్నారని తేలింది. ఈ రకమైన వ్యాధిని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. అటువంటి పరిస్థితిలో, మద్యం సేవించని వ్యక్తులు కొవ్వు కాలేయ వ్యాధి బారిన ఎందుకు పడుతున్నారు అన్నది ఇప్పుడు చాలా పెద్ద ప్రశ్న.

నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ పేలవమైన జీవనశైలి, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఫ్యాటీ లివర్‌ అనేది ఇప్పుడు 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు వారిలో వస్తోంది. ఈ వ్యాధి వచ్చినవారికి కాలేయంలో కొవ్వు పేరుకుపోయి మంట, మచ్చలు ఏర్పడతాయి. తర్వాతి దశలో ఇది కాలేయ వైఫల్యానికి దారితీస్తుంది. WHO నివేదిక ప్రకారం, అమెరికా జనాభాలో 25 శాతం మందికి నాన్ ఆల్కహాలిక్ వ్యాధి ఉంది. భారతదేశంలో కూడా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కేసులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. పెరుగుతున్న ఫాస్ట్ ఫుడ్ ట్రెండ్, వ్యాయామం లేకపోవడం కూడా దీనికి ప్రధాన కారణం అని గుర్తుంచుకోవాలి.

నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ రాకుండా ఉండాలంటే ఆహారంలో ఉప్పు, పంచదార, మైదా తగ్గించాలని ఢిల్లీలోని ఎయిమ్స్ డా. నీరజ్ కుమార్ చెప్పారు. దీని కోసం, ఫాస్ట్ ఫుడ్ మానుకోవాలని.. జీవనశైలిని చక్కగా మార్చుకోవాలని సూచిస్తున్నారు. రోజుకు కనీసం 15 నిమిషాలు వ్యాయామం చేయాలని.. పుష్కలంగా నీరు త్రాగాలని నిపుణులు చెబుతున్నారు. పసుపు, గోరువెచ్చని నీరు కలుపుకుని తాగడం లేదా పసుపు, తేనె కలుపుకుని తీసుకోవడం, పసుపు, నారింజ తొక్క కలిపి తీసుకోవడం ద్వారా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్‌కు చెక్ పెట్టవచ్చు.
(ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. మీకు ఏ సమస్య ఉన్నా డాక్టర్లను సంప్రదించండి)

ఉదయాన్నే ఈ 2 మంత్రాలను పఠిస్తే.. మీరు అనుకున్నది సాధిస్తారు!

ఉదయం నిద్రలేచిన వెంటనే మంత్రాలను చదవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అవి మనల్ని రోజంతా పాజిటివ్ మూడ్‌లో ఉంచుతాయి. శారీరకంగా, మానసికంగా మిమ్మల్ని సంతోషపరుస్తుంది.
మంత్రాలను చదవడం వలన చేయడం వల్ల మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మన ఆలోచనలను కేంద్రీకరించడం వల్ల మన శక్తి పెరుగుతుంది. ఉదయాన్నే మంత్రాలను పునరావృతం చేయడం వల్ల మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మన లక్ష్యాలను సాధించడానికి చురుకుగా పని చేయడానికి మమ్మల్ని ప్రేరేపిస్తుంది. ఇది భవిష్యత్తులో మనకు విజయాన్ని ఇస్తుంది. ఉదయాన్నే మంత్రాలను పఠించడం వల్ల సానుకూల శక్తి, మన మనసు మంచితనంతో నిండి ఉంటుంది. మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ రెండు మంత్రాలను పఠించండి.

1. విజయం కోసం ఈ మంత్రాన్ని పఠించండి

“ఓం ఆదిత్యాయ విద్మహే దివాకరాయ దీమహి”

తను సూర్య ప్రచూదయాత్ ||

ఈ మంత్రానికి అర్థం:
మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మీ రోజు సానుకూలత,విజయంతో నిండి ఉంటుంది. ఈ మంత్రం మీ లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయం చేస్తుంది, అలాగే, సూర్య భగవానుడి ఆశీర్వాదాల నుండి ప్రయోజనం పొందుతుంది.

2. సానుకూల శక్తిని పొందడానికి ఈ మంత్రాన్ని చదవండి

మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ మంత్రాన్ని పఠించండి. దీన్ని మీ రోజువారీ జీవితంలో భాగం చేసుకోవడం వల్ల మీ మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మంత్రం:
ఓం సహ నవవతు ।

సహ నౌ భునక్తు |

సహ వీర్యం కరవావహై |

తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై ।

ఓం శాంతిః శాంతిః శాంతిః ||

ఈ మంత్రానికి అర్థం: “మనం అందరం కలిసి నడుద్దాం, కలిసి తిందాం, మనమందరం మన శక్తిని ఉపయోగించుకుందాం ,కలిసి పెరుగుదాం.” జీవిత ప్రయాణం సాదాసీదాగా, ప్రేమగా ఉండాలి. ఎప్పుడూ గొడవపడకండి, మాట్లాడకండి, అబద్ధం చెప్పకండి, శాంతి, శాంతి, శాంతి. “

Steel Water bottles: స్టీల్ వాటర్ బాటిల్స్ కంపు కొడుతున్నాయా? మీరు చేస్తున్న తప్పు ఏంటంటే..

పర్యావరణంపై శ్రద్ధ ఉన్న చాలా మంది ప్లాస్టిక్ మంచినీళ్ల బాటిల్‌కు బదులు స్టీల్ నీళ్ల బాటిల్స్ వాడుతుంటారు. పదే పదే వాడేందుకు, ప్రయాణాలప్పుడు అనువుగా ఉండటంతో స్టీల్ వాటర్ బాటిల్స్‌ను ఇష్టపడతారు.
అయితే, పదే పదే వాడటంతో ఈ వాటర్ బాటిల్స్ ఒక్కోసారి దుర్వాసన వెదజల్లడం ప్రారంభిస్తాయి. వాటిని శుభ్రపరిచే క్రమంలో జరిగే పొరపాట్లే ఈ పరిస్థితికి కారణమని చెబుతున్నారు. ఈ సమస్యను నివారించేందుకు పలు పరిష్కారాలు కూడా సూచిస్తున్నారు (Tips for washing steel water bottles).

అనుభవజ్ఞులు చెప్పే దాని ప్రకారం, స్టీల్ బాటిల్స్ కడిగేందుకు వేడిగా ఉన్న సబ్బు నీళ్లే వాడాలి. ముందుగా బాటిల్ నిండా వేడి నీళ్లు నింపి అందులో కొన్ని మైల్డ్ డిష్ వాష్ చుక్కలు వేయాలి. ఆ తరువాత 15 నిమిషాలు బాటిల్‌ను అలాగే ఉండనిచ్చి ఆ తరువాత మంచి స్క్రబ్‌తో శుభ్రంగా తోమాలి. బాటిల్ బ్రష్ వాడితే ఇంకా ఉత్తమం. బాటిల్ బయట కూడా ఇలాగే తొమితే జిడ్డు మొత్తం వదిలిపోతుంది.

మరకలు, వాసన వదలకుండా ఉంటే వెనిగర్ మిశ్రమాన్ని కూడా వాడొచ్చు. వైట్ వెనిగర్‌కు నీటిని కలిపి అందులో బాటిల్‌ను రాత్రంతా నానబెట్టాలి. వెనిగర్ లోని యాసిడ్ లక్షణాల కారణంగా ఎంతటి దుర్వాసన అయినా ఇట్టే వదిలిపోతుంది.

మరకలు, దుర్వాసనను తొలగించేందుకు బేకింగ్ సోడా కూడా ఎంతో ఉత్తమం. ఈవిధానంలో కూడా గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో కొద్దిగా బేకింగ్ సోడా వేయాలి. ఆ తరువాత స్పాంజ్‌ను నీళ్లల్లో ముంచి బాటిల్ మొత్తం తోమాలి. దీంతో, సమస్య వెంటనే పరిష్కారమవుతుంది.

నిమ్మరసంలో కాస్తంత ఉప్పు వేసి అందులో స్క్రబ్ ముంచి బాటిల్‌ను శుభ్రపరచాలని కూడా అనుభవజ్ఞులు చెబుతున్నారు. దీంతో, కూడా మెరుగైన ఫలితాలు ఉంటాయని అంటున్నారు. నిమ్మరసంలోని యాసిడ్ లక్షణాలకు ఉప్పు కూడా తోడవడంతో జిడ్డు, దుర్వాసనా ఈజీగా వదిలిపోతాయట.

బాటిల్ మూతను కూడా ఇలాంటి పద్ధతుల్లో కడిగితే స్టీలు నీళ్ల బాటిల్స్ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంటాయని చెబుతున్నారు.

Health

సినిమా