Laxmi Devi : మహిళలు చేసే ఈ తప్పుల వల్లే ఇంట్లో నుంచి లక్ష్మీ దేవి వెళ్లిపోతుంది..!

Laxmi Devi : ఇంట్లో సుఖ శాంతులు కలగాలంటే ఆడవారు కొన్ని నియమాలను పాటించాలని మన పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. మహిళలు ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో సుఖ శాంతులు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని వారు చెబుతుంటారు.
భర్త అనురాగం పొందడానికి, సంతాన సాఫల్యానికి, ఇంట్లో వారికి వ్యాధులు రాకుండా ఉండడానికి ఈ నియమాలను కచ్చితంగా పాటించాలని పెద్దలు చెబుతుంటారు. ఇంట్లో సుఖ శాంతులు నెలకొనడానికి మహిళలు పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

చాలా మందికి ఉన్న చెడ్డ అలవాట్లల్లో ఒకటి మంగళ సూత్రానికి పిన్నీసులను ఉంచడం. మనలో చాలా మంది మంగళ సూత్రానికి పిన్నీసులను, జడకు పెట్టుకునే పిన్నులను పెడుతుంటారు. ఇలా చేయడం వల్ల భర్త అనారోగ్యానికి గురవుతాడని, భార్యా భర్తల మధ్య సమస్యలు వస్తాయని పెద్దలు చెబుతున్నారు. వేద మంత్రాల సాక్షిగా భర్త ఆయువు మంగళ సూత్రం రూపంలో భార్య హృదయానికి వచ్చి చేరుతుంది. అంతే కాకుండా మంగళ సూత్రాన్ని లక్ష్మీ దేవి స్వరూపంగా కూడా భావిస్తారు. మంగళ సూత్రానికి దివ్య శక్తులను ఆకర్షించే శక్తి ఉందని, పిన్నీసులను, పిన్నులను పెట్టడం వల్ల మంగళ సూత్రంలో ఉండే శక్తిని ఈ పిన్నీసులు ఆకర్షించుకుంటాయని చెబుతున్నారు. దీంతో చెడు జరుగుతుంది. కనుక ఎట్టి పరిస్థితిలోనూ మంగళ సూత్రానికి ఇనుముతో చేసిన పిన్నీసులను, పిన్నులను పెట్టకూడదు.
ప్రస్తుత కాలంలో మహిళలు రకరకాల గాజులను ధరిస్తున్నారు. కానీ వారు మట్టి గాజులను ధరించడమే చాలా మంచిదని పెద్దలు చెబుతున్నారు. మట్టి గాజుల నుండి వచ్చే శబ్దం ఐశ్వర్యాన్ని, భార్యా భర్తల అనురాగాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ఎరుపు, ఆకుపచ్చ రంగు గాజులను ధరించడం వల్ల శుభాలు కలుగుతాయని చెబుతున్నారు. కొందరు ఇండ్లల్లో అందంగా ఉన్నాయని గుర్రపు బొమ్మలను, ఫోటోలను పెట్టుకుంటారు. ఇలా ఇంట్లో గుర్రపు బొమ్మలను ఉంచడం అంత మంచిదని కాదని వారు చెబుతున్నారు. గుర్రం చాలా వేగంగా పరిగెత్తుతుంది. గుర్రం ఎంత వేగంగా పరిగెత్తుతుందో అంతే వేగంగా ఇంట్లో ఉండే ధనం కూడా ఖర్చవుతుందని, కనుక వీటిని ఇంట్లో ఉంచుకోవడం అంత మంచిది కాదని అంటున్నారు.

మహిళలు పాటించాల్సిన నియమాలలో మరొకటి సంపదను ప్రదర్శించడం. అనగా భర్త స్థితిగతులు, సంపాదన భార్య ధరించిన నగలు, వస్త్రాల ద్వారా అందరికీ తెలుస్తుంది. మహిళలు ఎక్కువగా నగలను, పట్టు వస్త్రాలను ధరించడం వల్ల నర దిష్టి, నర ఘోష తగులుతుందని వీటి వలన అనేక రకాల సమస్యలు వస్తాయని అంటున్నారు. కనుక మహిళలు వీలైనంత తక్కువగా అలంకరించుకుని నలుగురిలోకి వెళ్లాలని చెబుతున్నారు.

Related News

ప్రస్తుత కాలంలో చాలా మంది తల్లులు.. పిల్లలు తమ మాట వినడం లేదని చెబుతున్నారు. ఈ సమస్య నుండి బయట పడడానికి కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఆడ పిల్లలు తమ మాట వినడం కోసం ఐదు పోగుల ఎర్ర దారాన్ని తీసుకుని వారి కుడి భుజానికి కట్టాలి. దీంతోపాటు వారికి కుంకుమను పెట్టుకోవడం అలవాటు చేయాలి. ఇలా చేయడం వల్ల ఆడపిల్లలు మన మాట వింటారు. అదే విధంగా మగ పిల్లలు మన మాట వినడం కోసం 9 పోగుల ఆకుపచ్చ దారాన్ని తీసుకుని వారి కుడి భుజానికి కట్టి వారికి గంధం బొట్టును పెట్టుకునే అలవాటు చేయాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు పెద్దల మాట వింటారు.

కొందరి మహిళలు ఎప్పుడూ ఆడపడుచులతో, అత్తతో గొడవ పడి మనశ్శాంతికి దూరం అవుతారు. అలాంటి సమయంలో అత్త లేదా ఆడపడుచు పడుకునే దిండు కింద తులసి వేరును ఉంచడం వల్ల వారితో గొడవలు తగ్గడమే కాకుండా వారు మీ పై విపరీతమైన ప్రేమను, అప్యాయతను పెంచుకుంటారని వారు చెబుతున్నారు.

అలాగే చాలా మంది మహిళలు స్నానం చేయకుండా ఎక్కువగా మాట్లాడుతూ, చికాకులో, కోపంతో వంట చేస్తుంటారు. ఈ విధంగా వంటను అస్సలు చేయకూడదట. శుభ్రంగా స్నానం చేసి చాలా ప్రశాంతంగా , దైవ నామ స్మరణ చేస్తూ వంట చేయాలని తద్వారా వంట రుచిగా ఉండడమే కాకుండా ఇంట్లోని వారు అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారట. మహిళలు ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో సుఖ శాంతులు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

Related News