ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

ఏపీ ప్రభుత్వం(AP Govt) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్(Library Corporation Chairman ), సభ్యులను తొలగించింది.


అదే విధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల గ్రంథాలయ ఛైర్మన్లను సైతం తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు భర్తీ చేసే అవకాశాలు ఉండటంతో.. గత వైసీపీ ప్రభుత్వంలో నియమించిన వీరందరినీ తొలగించినట్టు తెలుస్తోంది