ఇండియన్ రైల్వే(Indian Railways)కు వందల ఏళ్ల చరిత్ర ఉంది. బ్రిటిష్ కాలంనాడే దేశంలో రైళ్లు ప్రారంభమయ్యాయి. క్రమంగా రైల్వే వ్యవస్థ అభివృద్ధి చెందుతూ వచ్చింది. ప్రపచంలో ఐదో అతిపెద్ద రైల్వే వ్యవస్థ మనది. ఇప్సుడు సెమీ హైస్పీడ్(High Speed) రైళ్లు వందే భారత్ పట్టాలపై పరుగెడుతున్నాయి. త్వరలో గంటకు 400 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తే రైలు రాబోతోంది.
ఇండియాలో హై స్పీడ్ రైళ్లు ప్రస్తుతకాలంలో అభివృద్ధి చెందుతున్నాయి. దేశంలో కొన్ని ప్రాజెక్టులు ఇప్పటికే ప్రారంభమైనవి, మరికొన్ని ప్రణాళికలలో ఉన్నాయి. ఈ రైళ్లు ప్రయాణ సమయాన్ని కుదించడం, సమర్థవంతమైన రవాణా వ్యవస్థను అందించడం, ప్రయాణికులకు మెరుగైన అనుభవాన్ని ఇవ్వడం అనే లక్ష్యాలను సాధించేందుకు రూపొందించబడినవి. ప్రస్తుతం దేశంలో రైళ్లు గరిష్టంగా గంటకు 250 కిలో మీటర్ల నుంచి 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైళ్లు మాత్రమే ఉన్నాయి.
ముఖ్యమైన హై స్పీడ్ రైలు ప్రాజెక్టులు:
బుల్లెట్ రైలు..
ఈ ప్రాజెక్ట్ ఇండియాలో హై స్పీడ్ రైల్స్ యొక్క మొదటి ప్రాజెక్ట్‌గా గణనీయమైనది. ఇది ముంబై నుండి అహ్మదాబాద్ వరకు 508 కిలోమీటర్ల దూరాన్ని 3 గంటల లోపు ముగించేందుకు రూపొందించబడింది. ఈ ప్రాజెక్ట్ కోసం జపాన్ సపోర్ట్ అందిస్తోంది.
డెల్హీ – వుసీ హై స్పీడ్ రైలు:
ఈ రైలు ప్రాజెక్టు కూడా వేగంగా సాగిపోతుంది. ఈ ప్రాజెక్ట్‌లో 160 కిలోమీటర్ల/గంట వేగంతో రైలు పయనించేందుకు ఏర్పాట్లు చేయబడతాయి.
హైదరాబాద్ – బెంగుళూరు హై స్పీడ్ రైలు:
ఈ రైలు ప్రాజెక్టు ప్రణాళికలో ఉంది. ఇది 300 కిలోమీటర్ల/గంట వేగంతో ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది.
గంటకు 400 కి.మీ వేగంతో..
ఇక జపాన్‌లో ఇప్పటికే బుల్లెట్ ట్రైన్ అందుబాటులో ఉండగా, వీటిని ఇండియాలోనూ పరిచయం చేయనుంది. hinkansen E5 మోడల్ బుల్లెట్ రైలును 2029–30 మధ్య ఇండియాలో ప్రారంభించేలా ఒప్పందం కుదిరింది. ఈ అధునాతన రైలు గంటకు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అంతేకాకుండా 400 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీనిని జపాప్‌తోపాటు ఇండియాలోనూ ఒకేసారి ప్రారంభించే అవకాశం ఉంది.