ఎయిర్‌టెల్ వినియోగదారులకు బంపర్ గుడ్ న్యూస్.. 6 నెలల పాటు 100 GB ఉచితం, పూర్తి వివరాలు ఇవే

ఎయిర్‌టెల్ యూజర్లకు బంపర్ గుడ్ న్యూస్. అతి పెద్ద ప్రైవేట్ దిగ్గజ టెలికం కంపెనీ తమ యూజర్లకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. ప్రధానంగా లిమిటెడ్ డివైస్ స్టోరేజ్ ఉన్న వారికి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. అయితే వైఫై పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు ఈ 100 జీబీ గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ ఉచితంగా ఎలాంటి రుసుము చెల్లించకుండా 6 నెలలపాటు అందిస్తుంది.


ఎయిర్‌టెల్ తమ యూజర్ల కోసం ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ నేపథ్యంలో 100 జీబీ గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ కూడా ఉచితంగా అందిస్తుంది. దీనికి ఎలాంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆరు నెలల పాటు 100 జీబీ గూగుల్ స్టోరేజీ ఫ్రీగా పొందవచ్చు. ఈ ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం..

ఎయిర్‌టెల్ 6 నెలల పాటు 100 జీబీ గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ ఎలాంటి ఫీజు లేకుండా తీసుకుంటుంది. అయితే రూ.125 నెలకు కస్టమర్ నెలవారీ బిల్లులో మాత్రం వసూలు చేస్తుంది. అయితే వినియోగదారులు ఈ ప్లాన్ అవసరం లేకుంటే చెల్లించాల్సిన అవసరం లేదు. పెరుగుతున్న డేటా స్టోరేజ్ నేపథ్యంలో ఫోటోలు, వీడియోలు, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లు ఎక్కువగా నిలువ చేసుకోలేని వారికి ఇది బంపర్ బెనిఫిట్‌ అందిస్తుంది.

అయితే ఈ ప్లాన్ ఎంచుకుంటే మాత్రం ఎక్కువగా స్టోరేజ్ డిలీట్ చేయకుండా మీరు సులభంగా 100 జీబీ ఆరు నెలల పాటు క్లౌడ్ స్టోరేజ్ నిల్వ ఉంటుంది. ఇది వైఫై పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు వర్తిస్తుంది. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్‌  కస్టమర్లకు ఎంతో బెనిఫిట్స్ అందిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ.399 బ్లాక్ బాక్స్‌ ప్లాన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. తద్వారా ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ సర్వీస్ లో తన సత్తా చాటుతోంది. ఇందులో హై స్పీడ్ ఇంటర్నెట్ డేటా డీటీహెచ్ సర్వీసులు కూడా పొందుతారు.

అదనంగా ఐపీటీవీ ఎయిర్‌టెల్ కస్టమర్లకు కొన్ని షోలు కూడా ఉచితంగా పొందుతారు. 29 పాపులర్ స్ట్రీమింగ్ యాప్స్ ఉంటాయి. నెట్ ఫ్లిక్స్, యాపిల్ టీవీ, అమెజాన్ ప్రైమ్ ఇలాంటివి అందుబాటులోకి తీసుకువస్తుంది. 600 ఛానల్ వరకు ఉచితంగా వీక్షించవచ్చు.