Business Idea: రూ.2 లక్షల పెట్టుబడితో నెలకు రూ.10 లక్షల రాబడి.. కష్టపడే వారికి సువర్ణావకాశం..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

ప్రస్తుత రోజుల్లో యువత ఆలోచనా ధోరణి మారుతుంది. గతంలో కష్టపడి చదివి మంచి ఉద్యోగం సంపాదిస్తే జీవితం సెట్‌ అయ్యిపోతుందని అనుకునే వారు. అయితే ఆలోచనా ధోరణులు మారడంతో ఉద్యోగం అంటే ఒకరి కింద పని చేయాలి?
అదే వ్యాపారమైతే ఒకరితో మాట పడాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో యువత వ్యాపారాల వైపు మళ్లుతున్నారు. అయితే ఈ సమయంలో పెట్టుబడి అనేది కీలకపాత్ర పోషిస్తుంది. అందువల్ల తక్కువ పెట్టుబడితో ఆకర్షణీయ రాబడినిచ్చే వ్యాపార అవకాశాల గురించి అన్వేషిస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి వారికి అమూల్‌ ఫ్రాంచైజీ మంచి ఎంపికగా ఉంటుంది. అమూల్ అనేది దేశవ్యాప్తంగా ప్రజలకు తెలిసిన మంచి డెయిరీ ఫామ్‌. ప్రధాన నగరాలు, చిన్న పట్టణాలు రెండింటిలోనూ విస్తృతమైన కస్టమర్ బేస్ ఉన్న కంపెనీ. కష్టపడి వ్యాపారం చేద్దామనుకునే వారికి అమూల్ బిజినెస్ ఫ్రాంచైజ్ మీకు ఒక ఎంపికగా ఉంటుంది. ఇక్కడ మీరు కంపెనీ డెయిరీ వ్యాపారంలో భాగమై నెలకు రూ. 5 నుంచి రూ. 10 లక్షల వరకు సంపాదించవచ్చు. కాబట్టి అమూల్‌ ఫ్రాంచైజీ గురించి వివరాలను ఓ సారి తెలుసుకుందాం.

అమూల్ కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారికి రెండు పెట్టుబడి ఎంపికలను అందిస్తుంది. ముఖ్యంగా రూ.2 లక్షల వరకు ప్రారంభ పెట్టుబడితో అమూల్ అవుట్‌లెట్‌ని ఎంచుకోవచ్చు లేదా సుమారు రూ.5 లక్షల పెట్టుబడితో ఫ్రాంఛైజీ అవకాశాన్ని పొందవచ్చు. మీరు అమూల్ బిజినెస్ ఫ్రాంచైజీతో చాలా ఉదారంగా కమీషన్ పొందవచ్చు. ఉదాహరణకు మీరు పాల ప్యాకెట్లపై 2.5 శాతం, పాల ఉత్పత్తులపై 10 శాతం, ఐస్ క్రీమ్ విక్రయాలపై 20 శాతం కమీషన్ పొందుతారు. ఇంకా మీరు రెసిపీ ఆధారిత ఐస్ క్రీమ్‌లు, షేక్‌లు, పిజ్జాలు, శాండ్‌విచ్‌లు మరియు హాట్ చాక్లెట్ డ్రింక్స్‌పై 50 శాతం భారీ కమీషన్‌ను కూడా పొందవచ్చు. మీ అమూల్ బిజినెస్ ఫ్రాంచైజ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు అమూల్ అవుట్‌లెట్ కోసం సుమారు 150 చదరపు అడుగుల స్థలం అవసరం. అలాగే మీరు ఐస్ క్రీమ్ పార్లర్ ఫ్రాంచైజీని ప్రారంభించాలని చూస్తున్నట్లయితే, మీకు దాదాపు 300 చదరపు అడుగుల స్థలం అవసరం.
ఒప్పందంపై సంతకం చేసే సమయంలో జీసీఎంఎంఎఫ్‌ లిమిటెడ్‌ పేరుతో జారీ చేసిన చెక్కు లేదా డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో మాత్రమే రూ. 25,000 రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటుందని అమూల్ జోడించింది. మా అధీకృత ప్రతినిధులు కాబోయే భాగస్వాములను వ్యక్తిగతంగా కలుసుకుని నిర్ణీత ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత మాత్రమే చెల్లింపు తీసుకుంటారు. అమూల్ పార్లర్ డిపాజిట్ కోసం మేము ఆర్టీజీఎస్‌/నెఫ్ట్‌ ద్వారా ఎలాంటి చెల్లింపును తీసుకోమని అమూల్‌ చెబుతుంది. అమూల్ డిస్ట్రిబ్యూటర్‌గా మారడానికి ఎటువంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదని అమూల్‌ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

దరఖాస్తు ప్రక్రియ

Related News

అమూల్ బిజినెస్ ఫ్రాంచైజ్ కోసం దరఖాస్తు చేయడానికి మీరు అమూల్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. అలాగే ఫ్రాంచైజ్ అవకాశాల గురించి సంబంధిత సమాచారాన్ని అన్వేషించవచ్చు. అమూల్ డిస్ట్రిబ్యూటర్‌గా నియామకం కోసం డిస్ట్రిబ్యూటర్‌షిప్ కోసం అన్ని రకాల విచారణల కోసం మీరు అమూల్ అధికారిక కస్టమర్ కేర్ 022-6852666 నెంబర్‌కు కాల్ చేయవచ్చు దరఖాస్తులను ఆమోదించడానికి ఏ ఇతర వెబ్‌సైట్ లేదా టోల్-ఫ్రీ నంబర్ లేదని అమూల్‌ చెబుతుంది. మరి ఇంకెందుకు తక్కువ పెట్టుబడి వ్యాపారం చేయాలనేకునే వారు అమూల్‌ డిస్ట్రిబ్యూషన్‌ను సంప్రదిస్తే సరి.

Related News