Champions Trophy Semi Final: ఈ సారైనా ‘హెడ్’ విధ్వంసానికి ఆపగలమా.. 2023 వరల్డ్ కప్ ప్రతీకారం తీరనుందా..?

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమ్ ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగే తొలి సెమీఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ముందుకు సాగాలని రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి. కానీ ఇప్పుడు అందరి దృష్టి ఆసీస్ విధ్వంసకర బ్యాటర్ హెడ్‌పైనే ఉంది. వన్డేల్లో టీమ్ ఇండియాపై హెడ్‌కు మంచి రికార్డు ఉంది. భారత్‌తో 9 వన్డేలు ఆడిన హెడ్, 43.12 సగటుతో 345 పరుగులు చేశాడు. వాటిలో, అతను ఒక సెంచరీ మరియు ఒక అర్ధ సెంచరీ చేశాడు. అత్యధిక స్కోరు 137 పరుగులు. టెస్టుల్లో, అతను భారత్‌పై 27 మ్యాచ్‌లు ఆడి 46.52 సగటుతో 1163 పరుగులు చేశాడు.