మీ శరీరంలో ఈ మార్పులు కనబడితే cancer వచ్చినట్లే..99 శాతం మందికి తెలియనది ఇదే

ప్రతి ఏటా ఫిబ్రవరి 4న వరల్డ్ క్యాన్సర్ డే నిర్వహించబడుతుంది. ప్రజల్లో క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడం, ఈ ప్రాణాంతక వ్యాధితో పోరాడటానికి ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలను బలపేతం చేయడం దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం.


చెడు ఆహారపు అలవాట్లు చెడు జీవనశైలి కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బారిన పడుతున్నవారి సంఖ్య భారీగా పెరుగుతుంది.

ఈ ప్రాణాంతక వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించగలిగితే విజయవంతంగా జయించవచ్చు. నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రాణాలు కోల్పోక తప్పదు. అయితే ప్రారంభ దశలోనే క్యాన్సర్ లక్షణాలను గుర్తుపట్టడం అంత ఈజీ కాదు. ఎందుకంటే 99 శాతంమందికి అవి క్యాన్సర్ లక్షణాలు అని తెలియదు.

క్యాన్సర్ వస్తే కనిపించే లక్షణాలు ఇవే

బరువు తగ్గిపోవడం

అమెరికన్ క్యాన్సర్ సొసైటీ తెలిపిన వివరాల ప్రకారం..క్యాన్సర్ సోకినవారిలో చాలామంది వేగంగా బరువు తగ్గిపోతుంటారు.పాంక్రియాస్, కడుపు, ఊపిరితిత్తులు, అన్న వాహిక క్యాన్సర్ లు వచ్చినప్పుడు ఇలా జరుగుతుంటది.

తరచూ జ్వరం

క్యాన్సర్ రోగుల్లో జ్వరం అనేది సాధారణ లక్షణం. క్యానర్స్ పుట్టిన దగ్గర నుంచి ఇతర అవయువాలకు వ్యాప్తి చెందేటప్పుడు జ్వరం వస్తుంది.

అలసట

క్యాన్సర్ లక్షణాల్లో అలసట కూడా ఒకటి. విశ్రాంతి తీసుకున్నా కూడా రోగులు అలసట నుంచి బయటపడలేరు. లుకేమియా వంటి కొన్ని క్యాన్సర్ లలో అలసటే తొలి లక్షణం. పెద్ద పేగు లేదా కడుపు క్యాన్సర్లు రక్తహీనతకు కారణమవుతాయి.

చర్మ మార్పులు

చర్మంపై కొత్త మచ్చలు, పుట్టుమచ్చలలో మార్పులు లేదా చర్మం రంగు మారడం వంటివి క్యాన్సర్ యొక్క లక్షణాలు కావచ్చు.

గాయాలు మానకపోవడం

శరీరంపై ఏర్పడిన గాయాలు చాలా కాలం పాటు మానకపోతే అది క్యాన్సర్ సంకేతంగా పరిగణించబడుతుంది.

గొంతు బొంగురుపోవడం

గొంతు బొంగురుపోవడం లేదా మింగడంలో ఇబ్బంది క్యాన్సర్ యొక్క లక్షణం కావచ్చు. ముఖ్యంగా ఇది చాలా కాలం పాటు కొనసాగితే డాక్టర్ ని సంప్రదించడం అవసరం.

దగ్గు

నిరంతర దగ్గు, దగ్గులో రక్తం లేదా శ్లేష్మం రావడం ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు కావచ్చు.

మలబద్ధకం లేదా విరేచనాలు

మలబద్ధకం లేదా విరేచనాలలో మార్పులు, మలంలో రక్తం రావడం పెద్ద ప్రేగు క్యాన్సర్ యొక్క లక్షణాలు కావచ్చు.

మూత్రంలో మార్పులు

మూత్రవిసర్జనలో నొప్పి, మూత్రంలో రక్తం లేదా తరచుగా మూత్రవిసర్జన చేయడం వంటివి మూత్రపిండాల లేదా మూత్రాశయ క్యాన్సర్ యొక్క లక్షణాలు కావచ్చు.

రొమ్ము మార్పులు

రొమ్ములో గడ్డలు, రొమ్ము చర్మంపై మార్పులు లేదా రొమ్ము నుండి ద్రవం రావడం రొమ్ము క్యాన్సర్ లక్షణాలు కావచ్చు.

నాలుకపై తెల్లని మచ్చలు

నాలుకపై తెల్లని మచ్చలు కనిపించినా దాన్ని క్యాన్సర్‌కు ముందు కనిపించే లక్షణంగా అనుమానించవచ్చు. కాబట్టి నాలుకపై తెల్ల మచ్చలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. ఇది కూడా స్టేజ్ జీరోలో కనిపించే సాధారణ లక్షణం. అయితే ఈ తెల్ల మచ్చలకు నోటి ఆరోగ్య సమస్యలు కూడా కారణం కావచ్చు.

ఈ లక్షణాలు కనబడితే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ ని సంప్రదించడం ఉత్తమం.