రిలయన్స్ జియో రూ.448 డేటా, వాయిస్ ప్లాన్‌లో మార్పులు చేసింది. ఈ ప్లాన్ ధరను తగ్గించాలని కంపెనీ నిర్ణయించింది. అయితే ప్రయోజనాలు మునుపటిలాగే ఉన్నాయి.
అదేవిధంగా చవకైన రూ.189 ప్లాన్‌ను తిరిగి తీసుకొచ్చింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఈ మార్పులు చేసింది. కస్టమర్లు తక్కువ ధరలోనే అన్‌లిమిటెడ్ ప్రయోజనాలు లభిస్తాయి. కొత్త ధర తర్వాత ఎంత డేటా లభిస్తుంది? ప్లాన్ ధర ఎంత? తదితర వివరాలు తెలుసుకుందాం.
జియో రూ.445 ప్లాన్
జియో ఇప్పుడు డేటా ప్రయోజనాలు లేకుండా రూ.445 వాయిస్-ఓన్లీ ప్యాక్‌ను అందిస్తోంది. గతంలో ఈ ప్లాన్ రూ.448కి అందుబాటులో ఉండేది. అంటే ఇప్పుడు దీనిపై మూడు రూపాయలు తగ్గించారు. జియో రూ.445 ప్లాన్ 28 రోజుల వాలిడిటీని అందిస్తోంది. ప్లాన్‌లో రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్‌లు, రోజుకు 100 SMS వంటి ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ ప్లాన్‌లో జీ5, జియో సినిమా ప్రీమియం, సోనీ లివ్, డిస్కవర్ ప్లస్, సన్ నెక్స్ట్, ఫ్యాన్ కోడ్, ప్లానెట్ మరాఠీ వంటి ప్రముఖ ఓటీటీ యాప్‌లకు యాక్సెస్ లభిస్తుంది. వీటితో పాటు, జియో టీవీ, జియో క్లౌడ్ కూడా అందుబాటులో ఉన్నాయి.
జియో రూ .189 ప్లాన్
జియో రూ.189 ప్లాన్‌ను తిరిగి తీసుకొచ్చింది. మరోసారి టెలికాం కంపెనీ వెబ్‌సైట్‌లో లిస్టింగ్ చేసింది. ఇందులో, ఏ నెట్‌వర్క్‌లోనైనా 28 రోజుల వాలిడిటితో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్‌లు అందుబాటులో ఉంటాయి. అలాగే 300 ఎస్ఎమ్ఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్ జియో టీవీ, జియో సనిమా, జియో క్లౌడ్ యాక్సెస్‌ను అందిస్తుంది.
అయితే, ప్లాన్‌లో జియో సినిమాకు ప్రీమియం ఉండదు. జియోకు చెందిన అత్యంత సరసమైన ప్యాక్ ఇదే. కస్టమర్‌లు ప్రత్యామ్నాయంగా రూ.199 ప్లాన్‌ని ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ 18 రోజుల సర్వీస్ వాలిడిటీ, 1.5GB రోజువారీ డేటా,100 SMSలను అందిస్తుంది. అదేవిధంగా, జియో రూ.1958 వాయిస్-ఓన్లీ ప్యాక్ ధరను రూ.1748కి తగ్గించింది, ఈ ప్లాన్ 365 రోజులకు బదులుగా 336 రోజుల వాలిడిటీని అందిస్తోంది.