తాజాగా అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంపై ఎంతోమంది సినీ సెలెబ్రిటీలు,రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్ లు స్పందించారు.ఇందులో భాగంగా ఏపీ లో ఎమ్మెల్సీగా బాధ్యతలు తీసుకున్న మెగా బ్రదర్ నాగబాబు ఈ ప్రమాదం గురించి మాట్లాడుతూ.. అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం గురించి చెప్పాలంటే మాటలు రావడం లేదు. కన్నీళ్లు రావడం లేదు.గొంతు పూడుకు పోయింది.ఈ వీడియో చూస్తేనే గుండె తరుక్కుపోతుంది. ఎంతోమంది కోటి ఆశలతో ఫ్లైట్ ఎక్కి గమ్యాన్ని చేరుతున్నాం అనుకున్నారు. ఎంతోమంది చిన్న పిల్లలు తల్లి ఒడిలో ఉన్న వాళ్లే ప్రపంచం కూడా తెలియని వాళ్ళు మరణించారు. చాలామంది యువత తమ కలలను సహకారం చేసుకోవడానికి ఆ ఫ్లైట్ ఎక్కారు కావచ్చు. ఎంతోమంది వృద్ధులు రిటైర్మెంట్లు తీసుకొని జీవిత చరమాంకంలో హ్యాపీగా గడపాలని ఎక్కడికైనా వెళ్తున్నారు కావచ్చు.
మహిళలు,వృద్ధులు,యువత,చిన్న పిల్లలు ఇలా ఎంతోమంది మరణించారు. అంతేకాదు అసలు విమాన ప్రమాదంతో సంబంధమే లేని మెడికల్ విద్యార్థులు కూడా ఈ ప్రమాదంలో మరణించారు. భోజనం చేస్తుండగా హఠాత్తుగా పిడుగు వచ్చి పడినట్టు విమానం కాలేజీ పై కుప్పకూలడంతో విమాన ప్రమాదంతో సంబంధమే లేని మెడికోలు కూడా మరణించారు. ఈ శతాబ్దంలోనే ఈ ప్రమాదం పెద్దదని,ఇలాంటి ప్రమాదం మరోసారి రాకూడదని కోరుకుంటున్నాను. ఇక ఈ విమానంలో అన్ని మతాలకు సంబంధించి దేవున్ని నమ్మేవారు ఉండే ఉంటారు. కానీ ఆ దేవుడు వీరందరినీ ఎందుకు కాపాడలేకపోయారు అంటూ ఓ సంచలన పోస్ట్ పెట్టారు నాగబాబు.
అంతేకాదు తన అన్నయ్యచిరంజీవి సుస్మిత గురించి కూడా చెబుతూ..గతంలో మా అన్నయ్యచిరంజీవి సుస్మిత ఇద్దరు చెన్నై నుండి తిరుపతి వెళ్లే ఫ్లైట్ ఎక్కారు. ఆ టైంలో ఫ్లైట్ తిరుపతిలో ల్యాండ్ అవ్వకుండా ఎక్కడో పొలాల్లో ల్యాండ్ అయింది.అయితే ఫ్లైట్ ప్రమాదంలో ఉంది అనే విషయం తెలియగానే మేమందరం భయాందోళనకు గురయ్యాం. కానీ ఆ తర్వాత ఫ్లైట్ సేఫ్ గా ల్యాండ్ అయిందని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నాం. ఇప్పుడు ఈ విమాన ప్రమాదం జరిగిన సమయంలో నాకు ఆరోజు జరిగిన ప్రమాదం గుర్తుకొచ్చింది అంటూ నాగబాబు తన ఎక్స్ ఖాతాలో ఎమోషనల్ ట్వీట్ చేశారు.