బాబా వంగా జ్యోతిష్య అంచనాలు టెన్షన్ సృష్టిస్తున్నాయి.. 2025 ఇలాగే ఉంటుందా!

ల్గేరియా కు చెందిన బాబా వంగ తన కంటి చూపును కోల్పోయిన తర్వాత భవిష్యత్తును చూడగలిగే జ్ఞానదృష్టి పొందాలని అప్పటినుంచి ఆమె చేసిన జ్యోతిష్య అంచనాలు దాదాపు నిజమయ్యాయని చెబుతారు.


2025 సంవత్సరంలో కూడా బాబా వంగా చేసిన జ్యోతిష్య అంచనాలు దాదాపు నిజమవుతున్నాయి అని చెబుతున్నారు. ప్రస్తుతం బాబా వంగ జ్యోతిష్య అంచనాలపైన ప్రతి ఒక్కరిలోనూ ఆందోళన కలుగుతుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో అన్న ఆందోళన ప్రతిఒక్కరిలో వ్యక్తమవుతుంది.

2025 సంవత్సరంలో ప్రపంచం అంతమవుతుందన్న బాబా వంగా

2025 సంవత్సరంలో కొన్ని భయానక సంఘటనలు జరుగుతాయని బాబా వంగ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. 2025 సంవత్సరంలో ప్రపంచం అంతమవుతుందని బాబా వంగ వెల్లడించారు. అయితే గతంలో కూడా 2012 సంవత్సరంలో ప్రపంచం అంతమవుతుందని బాబా వంగా చెప్పినప్పటికీ అది నిజం కాలేదు. అయితే మానవజాతి 5079 వ సంవత్సరంలో భూమి నుండి అంతరించిపోతుందని బాబా వంగ చెప్పారు.

భారీ యుద్ధాలు, ఘర్షణలు చూస్తామన్న బాబా వంగా

బాబా వంగ అంచనాల ప్రకారం 2025 లో ప్రపంచం భారీ యుద్ధాలను, ఘర్షణలను చూస్తుందని చెప్పారు. ప్రస్తుతం అదే విధంగా ప్రపంచం భారీ యుద్ధాలను చూస్తోంది. ఐరోపాలో యుద్ధం జరిగే అవకాశం ఉందని, ఐరోపా దేశాలు భారీగా నష్టపోతాయని బాబా వంగ ముందే ఊహించి చెప్పారు. అయితే ప్రస్తుతం ప్రపంచంలో అనేక దేశాల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతున్న విషయం చూస్తున్నాం.

ప్రపంచంలో యుద్ధ వాతావరణం

ప్రస్తుతం ఇజ్రాయిల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ప్రపంచంలో యుద్ధాల కారణంగా ప్రపంచ జనాభా గణనీయంగా తగ్గుతుందని మానవ మనుగడ కోసం మానవులు కొత్త వనరులను వెతకాల్సిన పరిస్థితి వస్తుందని ఆ తర్వాత పరిస్థితులు మరింత భయానకంగా ఉంటాయని బాబా వంగ అంచనా వేశారు. మానవులు 2028లో శుక్ర గ్రహాన్ని చేరుకుంటారని చెప్పారు.

2130లో గ్రహాంతరవాసులు, మానవుల మధ్య సంబంధాలు

2033 లో మంచు ముక్క కరిగి సముద్ర మట్టం పెరుగుతుందని దీనివల్ల సునామీలు వస్తాయని బాబా వంగ తెలిపారు. ఇలా ప్రముఖ బల్గేరియన్ జ్యోతిష శాస్త్రవేత్త బాబా వంగ తెలిపిన అనేక విషయాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.బాబా వెంగా 2130లో గ్రహాంతరవాసులు, మానవుల మధ్య సంబంధాలు ఏర్పడతాయని అంచనా వేశారు. వాతావరణ మార్పుల కారణంగా 2170 నాటికి భూమిపై కరువు వస్తుందని, మానవ జీవితం నాశనం అవుతుందని ఆమె పేర్కొన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.