భారత స్టార్ క్రికెటర్ కు కోర్టు బిగ్ షాక్.. ప్రతి నెల రూ.4 లక్షలు చెల్లించాలని ఆదేశం..

విడాకుల కేసులో టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీకి కోల్ కతా హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. భరణం విషయంలో షమీకి ఎదురుదెబ్బ తగిలింది.

భార్య హసీన్ జహాన్ కు నెలకు 4 లక్షల రూపాయలు భరణం చెల్లించాలని షమీని కోర్టు ఆదేశించింది. ఇందులో భార్యకు లక్ష 50వేలు ఇవ్వాలి. కూతురి మెయింటెన్స్ కు 2లక్షల 50 వేలు ఇవ్వాలి. 2018 నుంచి షమీ, హసీన్ విడిగా ఉంటున్నారు. దీంతో అప్పటి నుంచి తన భార్యకు భరణం చెల్లించాల్సి ఉంటుందని షమీకి స్పష్టం చేసింది న్యాయస్థానం.

భార్య, కూతురికి నెలకు రూ.4 లక్షలు నిర్వహణ ఖర్చులుగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఉత్తర్వు ప్రకారం.. హసీన్ జహాన్ నెలకు రూ.1.50 లక్షలు, కుమార్తెకు రూ.2.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని ఏడు సంవత్సరాల క్రితం నాటి నుండి వసూలు చేస్తారు. ఆరు నెలల్లోపు కేసును పరిష్కరించాలని దిగువ కోర్టును కోల్ కతా హైకోర్టు ఆదేశించింది. ‘గృహ హింస నుండి మహిళల రక్షణ’ చట్టం కింద ఈ కేసు దాఖలు చేయబడింది.

గత సంవత్సరం, మహమ్మద్ షమీ తన కుమార్తె ఐరాను కలిశారు. ఆ సమయంలో చాలా ఎమోషన్ అయ్యారు. “చాలా కాలం తర్వాత నా కూతురిని మళ్ళీ చూసినప్పుడు సమయం ఆగిపోయినట్లు అనిపించింది. మాటల్లో చెప్పలేనంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, బెబో,” అని షమీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కు గంటలోనే 1.60 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి.

తన కూతురిని షమీ కలిసిన సందర్భంపై హసీన్ జహాన్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ”ఇది కేవలం గొప్పలు చెప్పుకోవడానికే. నా కూతురి పాస్‌పోర్ట్ గడువు ముగిసింది. కొత్త పాస్‌పోర్ట్ కోసం షమీ సంతకం అవసరం. అందుకే ఆమె తన తండ్రిని కలవడానికి వెళ్ళింది. కానీ షమీ సంతకం చేయలేదు. అతను తన కూతురితో కలిసి షాపింగ్ మాల్‌కు వెళ్లాడు. షమీ అడ్వర్ టైజ్ చేసే కంపెనీ నా కూతురిని తీసుకెళ్లింది. నా కూతురు ఆ దుకాణం నుంచి బూట్లు, బట్టలు కొనుక్కుంది. షమీ అక్కడి నుంచి ఏదైనా కొంటే డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. అందుకే ఆమెను అక్కడికి తీసుకెళ్లారు. నా కూతురికి గిటార్, కెమెరా కావాలి, అతను ఆమెకు ఆ వస్తువులు కొనలేదు” అని హసీన్ జహాన్ ఆరోపించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.