మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ మూవీ వార్ 2లో నటిస్తున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఎన్టీఆర్ మొదటిసారి బాలీవుడ్ సినిమాలో నటించనుండటంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వచ్చిన వార్ సినిమాలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించారు
ఎన్టీఆర్ లుక్స్ అదిరిపోయాయి. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ అప్డేట్స్ కోసం తారక్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ మూవీ అప్డేట్ వచ్చేసింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ తెలుపుతూ.. అదిరిపోయే వీడియోను విడుదల చేశారు.
గతంలో స్పై థ్రిల్లర్ యాక్షన్ డ్రామాగా వచ్చిన వార్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. ఇందులో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. అదే వార్ 2. ఇందులో హృతిక్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ పాత్ర ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ లో ఉంటుందని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ మూవీ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొ