EPS-95 పెన్షనర్లకు బంపర్ గిఫ్ట్.. కనీస పెన్షన్ ఒకేసారి భారీగా పెంపు

EPS-95 పెన్షన్‌దారులకు కేంద్రం ప్రభుత్వం సూపర్ న్యూస్ చెప్పింది. EPS-95 పథకం కింద కొంతకాలంగా కనీస పెన్షన్ పెంచాలని పెన్షనర్లు విజ్ఞప్తి చేస్తుండగా.. కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంది. EPS-95 కింద కనీస పెన్షన్ నెలకు రూ.7,500 గా నిర్ణయించింది. దీంతో పదవీ విరమణ చేసిన వారికి ఆర్థికంగా ఎంతో చేయూతగా మారనుంది.


గతంలో EPS-95 పథకం కింద కనీస పెన్షన్ రూ.1,000 మాత్రమే ఇచ్చేవారు.  ఇప్పుడు ప్రభుత్వం ఈ మొత్తాన్ని నెలకు రూ.7,500 కు పెంచింది. దీంతో EPS-95 కింద పెన్షన్‌కు అర్హులైన వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వచ్చే నెల (జూన్ 2025) నుంచి EPS-95 పెన్షనర్లకు సవరించిన కనీస పెన్షన్ మొత్తం 7,500 రూపాయలను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో నేరుగా జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

మోదీ సర్కారు నిర్ణయంతో లక్షలాది మంది EPS-95 లబ్ధిదారులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తుంది. దాదాపు 78 లక్షలకు పైగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.

EPS-95 పెన్షన్‌ స్కీమ్‌ను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిర్వహిస్తోంది. వ్యవస్థీకృత రంగంలో పనిచేసి పదవీ విరమణ చేసిన వారికి ఈ స్కీమ్‌ కింద నెలవారీ పెన్షన్‌ను అందజేస్తారు.

ప్రతి నెలకు రూ.15 వేల కంటే ఎక్కువ జీతం పొందుతున్న ఉద్యోగులు ఈపీఎస్‌ స్కీమ్‌కు అర్హులు అవుతారు. EPS-95 పథకం కింద పదవీ విరమణ తర్వాత నెలవారీ పెన్షన్ పొందాలంటే.. కనీసం 10 సంవత్సరాలు ఉద్యోగం చేసి ఉండాలి.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.