జియో రెండు లాంగ్ వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. 336 రోజుల వ్యాలిడిటీ, 200 రోజుల వ్యాలిడిటీతో లభ్యమవుతున్నాయి.
రిలయన్స్ జియో తమ యూజర్ల కోసం అద్భుతమైన ప్లాన్లను తీసుకొచ్చింది. ప్రత్యేకించి ఎయిర్‌టెల్‌కు పోటీగా జియో (Jio Offer) లాంగ్ వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. జియో కస్టమర్ బేస్‌లో టాప్‌లో ఉండటమే కాదు.. వైడ్ రేంజ్ రీఛార్జ్ ప్లాన్‌లను కూడా అందిస్తుంది.
ప్రస్తుతం జియో రెండు ప్రత్యేక ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. జియో అందించే లాంగ్ టైమ్ ప్లాన్‌లలో కంపెనీ 84 రోజులు, 90 రోజులు, 98 రోజులు, 365 రోజులు వ్యాలిడిటీతో అందుబాటులో ఉన్నాయి. 336 రోజుల వ్యాలిడిటీతో పాటు 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్లను ఓసారి పరిశీలిద్దాం..
జియో 336 రోజుల వ్యాలిడిటీ :
జియో 336 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్. రూ. 1,748 ధరకు ఏడాది పొడవునా పొందొచ్చు. ఈ ప్లాన్ అన్ని నెట్‌వర్క్‌లలో అన్‌లిమిటెడ్ కాలింగ్స్ అనుమతిస్తుంది.