Cross Voting: కడపలో సంచలనం నమోదు కానుందా.. జగన్ ఆశలు సగమే నెరవేరనున్నాయా.. వైఎస్సార్ రక్తం పంచుకుని బిడ్డలకు ఓటర్లు తమ ఓటును కూడా పంచుతున్నారా..
ఔననే అంటున్నారు పరిశీలకులు. కడప జిల్లా ఓటర్లు వైఎస్సాఆర్ సెంటిమెంట్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే భారీస్థాయిలో క్రాస్ ఓటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. కడప అసెంబ్లీ ఎన్నికల్లో ఓటును వైసీపీకి.. కడప లోక్ సభ ఓటును వైఎస్ షర్మిలకు వేస్తున్నట్టు చర్చ జరుగుతోంది.
వైఎస్సార్ కూతురుగా, జగన్ చెల్లెలుగా షర్మిల సరికొత్త వ్యూహంతో రాజకీయం చేస్తున్నారని.. వ్యవహారాలను చక్కగా.. తెలివిగా నడిపించారని విశ్లేషకులు భావిస్తున్నారు. తల్లి వైఎస్ విజయమ్మ పిలుపు కూడా షర్మిలకు మద్దతు తెలపడం కలిసి వస్తోందంటున్నారు. ఎవరు ఓడినా కూడా వేరే సందేశం వెళ్తుందనే భావనతో కడప ఓటర్లు వైఎస్ వారసులకు చెరిసగం ఓట్లు ఇచ్చారని చర్చ జరుగుతోంది. కడప లోక్‌సభ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న షర్మిలకు వైఎస్సార్ ఓటర్ల మద్దతు పెరిగినట్టు సమాచారం.
దీనికితోడు రాహుల్ గాంధీ ప్రచారం, బ్రదర్ అనిల్‌కుమార్ ఎన్నికల ప్రచారం కూడా షర్మిలకు తోడయిందని భావిస్తున్నారు. అనిల్ కారణంగా క్రైస్తవ వర్గమంతా షర్మిల వెంట నడుస్తోంది. క్రైస్తవ వర్గమంతా ఓట్లన్నీ షర్మిలకు పడుతున్నాయని పోలింగ్ సరళి స్పష్టం చేస్తోంది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి అభిమానులు, వారసులు కూడా షర్మిలకు అండగా నిలుస్తున్నారు. కాగా ఇవన్నీ వైఎస్సార్‌సీపీకి చేటు చేసే అవకాశం ఉంది. జగన్‌పై అభిమానంతోపాటు సంక్షేమ పథకాలు కడప ఓటర్లు అసెంబ్లీకి పడగా.. లోక్‌సభ విషయానికి వస్తే మాత్రం ఓటర్లు, వైఎస్ కుటుంబ అభిమానులు మాత్రం షర్మిలకు అండగా నిలుస్తున్నట్టు తెలుస్తోంది.