ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జట్లు.. కెప్టెన్లు, వైస్ కెప్టెన్లు వీరే

క్రికెట్‌ లవర్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 (ICC Champions Trophy 2025) వన్డే సమరానికి సమయం దగ్గర పడుతోంది. మినీ వన్డే వర‍ల్డ్‌కప్‌గా భావించే చాంపియన్స్‌ ట్రోఫీలో మొత్తం 8 జట్లు తలపడనున్నాయి.


వన్డే ప్రపంచకప్‌-2023లో సత్తా చాటి ఏడు టీమ్‌లు అర్హత సాధించగా, ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్‌కు నేరుగా ఎంట్రీ లభించింది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు పాకిస్థాన్‌, దుబాయ్‌ వేదికగా ఈ మెగాటోర్ని జరగనుంది. ఎనిమిదేళ్ల తర్వాత ఈ టోర్నమెంట్‌ జరుగుతుండడంతో క్రికెట్‌ అభిమానులు (Cricket Fans) ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 2017లో చివరిగా చాంపియన్స్‌ ట్రోఫీ జరిగిన సంగతి తెలిసిందే.

రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో చాంపియన్స్‌ ట్రోఫీ జరుగుతుంది. 8 జట్లను రెండు గ్రూపులుగా (ఏ, బీ) విభజించారు. ప్రతి జట్టు తమ గ్రూపులోని ప్రతి ఇతర జట్టుతో తలపడుతుంది. ఒక్కో గ్రూపు నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకుంటాయి. సెమీ ఫైనల్‌లో విజేతలుగా నిలిచిన రెండు టీమ్‌లు ఫైనల్‌లో ఢీకొంటాయి. నాకౌట్‌ చేరేందుకు ప్రతిజట్టు గట్టిగానే ప్రయత్నించే అవకాశం ఉన్నందున ఈసారి మ్యాచ్‌లు క్రికెట్‌ అభిమానులకు రెట్టింపు​ వినోదాన్ని పంచనున్నాయి. గ్రూప్‌ ఏలో ఇండియా, (India) న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ టీమ్‌లున్నాయి. గ్రూప్‌ బీలో ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్‌ ఉన్నాయి.

ఫిబ్రవరి 19న కరాచిలో జరిగే తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ జట్లు పోటీపడతాయి. ఫిబ్రవరి 20 నుంచి టీమిండియా (Team India) మ్యాచ్‌లు ఉంటాయి. భారత్‌ ఆడే మ్యాచ్‌లన్నీ తటస్థ వేదికైన దుబాయ్‌లోనే జరుగుతాయి. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఫిబ్రవరి 23న టీమిండియా తలపడుతుంది. మార్చి 2న న్యూజిలాండ్‌తో మన మ్యాచ్‌ ఉంటుంది. మార్చి 4న దుబాయ్‌లో మొదటి సెమీఫైనల్‌, మార్చి 5న లాహోర్‌లో రెండో సెమీఫైనల్‌ జరగనున్నాయి. టైటిల్‌ విజేతను తేల్చే ఫైనల్‌ మ్యాచ్‌ మార్చి 9న జరుగుతుంది. కాగా, పాకిస్థాన్‌ తప్ప మిగతా దేశాలు తమ జట్లను ఇప్పటికే ప్రకటించాయి.

Group A
ఇండియా
కెప్టెన్: రోహిత్ శర్మ
వైస్ కెప్టెన్: శుభమన్ గిల్
స్టార్ ప్లేయర్లు: విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా

భారత పూర్తి జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్ (విసి), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.
ట్రావెలింగ్‌ రిజర్వ్స్‌: వరుణ్‌ చక్రవర్తి, ఆవేశ్‌ ఖాన్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి

న్యూజిలాండ్
కెప్టెన్: మిచెల్ సాంట్నర్
కీలక ఆటగాళ్లు: కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్, మాట్ హెన్రీ

న్యూజిలాండ్ పూర్తి జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ’రూర్క్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, విలియమ్సన్, విల్ యంగ్.

పాకిస్తాన్
కెప్టెన్: బాబర్ ఆజం
వైస్ కెప్టెన్: మహ్మద్ రిజ్వాన్
కీలక ఆటగాళ్లు: షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్

పాకిస్థాన్ జట్టు (అంచనా):
బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, కమ్రాన్ గులామ్, నోమన్ అలీ, సాజిద్ ఖాన్, నసీమ్ షా, ఇహ్సానుల్లా, మహ్మద్ వసీం జూనియర్, హరీస్ రవూఫ్, అఘా సల్మాన్, ఉస్మాన్ ఖాదిర్, తయ్యాబ్ తాదిర్, హసన్ అలీ

బంగ్లాదేశ్
కెప్టెన్: నజ్ముల్ హొస్సేన్
కీలక ఆటగాళ్లు: ముష్ఫికర్ రహీమ్, తస్కిన్ అహ్మద్, మహ్మదుల్లా

బంగ్లాదేశ్ పూర్తి జట్టు:
నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), సౌమ్య సర్కార్, తంజిద్ హసన్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, మహమూద్ ఉల్లా, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, రిషద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, పర్వేజ్ హోస్సై ఎమోన్, నసుమ్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్, నహిద్ రానా

Group B
ఇంగ్లండ్
కెప్టెన్: జోస్ బట్లర్
వైస్-కెప్టెన్: హ్యారీ బ్రూక్
కీలక ఆటగాళ్లు: జో రూట్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్

ఇంగ్లండ్ పూర్తి జట్టు:
జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్‌

ఆస్ట్రేలియా
కెప్టెన్: పాట్ కమిన్స్
కీలక ఆటగాళ్లు: స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్

ఆస్ట్రేలియా పూర్తి జట్టు:
పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్‌, స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ షార్ట్, ఆరోన్ హార్డీ, మిషెల్ హార్డీ, హాజిల్‌వుడ్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా

దక్షిణాఫ్రికా
కెప్టెన్: టెంబా బావుమా
కీలక ఆటగాళ్లు: కగిసో రబడ, హెన్రిచ్ క్లాసెన్, రాస్సీ వాన్ డెర్ డుసెన్

దక్షిణాఫ్రికా పూర్తి జట్టు:
టెంబా బావుమా (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), ర్యాన్ రికిల్టన్ (వికెట్ కీపర్), ఐడెన్ మార్క్‌రమ్, ట్రిస్టన్ స్టబ్స్, టోనీ డి జోర్జి, వాన్ డెర్ డుసెన్, డేవిడ్ మిల్లర్, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షమ్సీ, కగిసో రబడ, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే

అఫ్గానిస్థాన్‌
కెప్టెన్: హష్మతుల్లా షాహిదీ
వైస్ కెప్టెన్: రహమత్ షా
కీలక ఆటగాళ్లు: రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, ఫజల్ హక్ ఫరూఖీ

అఫ్గానిస్థాన్‌ పూర్తి జట్టు:
హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహ్మత్ షా (వైస్ కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెడిఖుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీబ్, మహ్మద్ నబీబ్, రహమ్మద్ నబీబ్, గజన్‌ఫర్, నూర్ అహ్మద్, ఫజల్ హక్ ఫరూఖీ, నవీద్ జద్రాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్.

రిజర్వ్‌ ఆటగాళ్లు: దర్విష్ రసూలీ, నంగ్యాల్ ఖరోటీ, బిలాల్ సామి

వేదికలు
కరాచీ నేషనల్ స్టేడియం
లాహోర్: గడాఫీ స్టేడియం
రావల్పిండి క్రికెట్ స్టేడియం
దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
మ్యాచ్‌లన్నీ మధ్యాహ్నం 2.30కు ప్రారంభమవుతాయి.