తల దువ్విన తరువాత ఇలా చేస్తున్నారా..? దరిద్రానికే దరిద్రం

చాలామంది తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు . అలాంటి తప్పులల్లో ఇది ప్రధానంగా ఎప్పుడు ముందు వరుసలో ఉంటుంది . చాలామంది బెడ్రూమ్స్ లో డ్రెస్సింగ్ టేబుల్ ముందు తల దువ్వుకుంటూ ఉంటారు .
అలా తలదువుకోవడంలో తప్పులేదు. తల దువ్వుకున్న తర్వాత ఆ దువ్వెన నుంచి వెంట్రుకలను తీసేస్తూ అక్కడికక్కడే పడేస్తూ ఉంటారు. ఇది చాలామందికి ఒక అలవాటుగా ఉంటుంది . ఎవరో కొంతమంది మాత్రమే రేర్ గా అలా తల దువ్విన తర్వాత దువ్వెన లో నుంచి వెంట్రుకలను బయట తీసి పడేస్తూ ఉంటారు . చాలామంది అలానే రూమ్ లోనే వెంట్రుకలు వేసేస్తూ ఉంటారు .


ఇల్లు చిమ్మేటప్పుడు పనిమనిషి తీసేస్తుందిలే అని కారణంగా కొంతమంది అలా చేస్తూ ఉంటారు . కానీ అది చాలా చాలా తప్పు అంటున్నారు పెద్దవాళ్లు . వాస్తు శాస్త్రం ప్రకారం కూడా అలా ఇంట్లో వెంట్రుకలు వేయడం మహామహా పాపము అంటున్నారు . ఇంట్లో వెంట్రుకలు మూలన గాలికి తిరుగుతూ ఉంటే అది మరింత ప్రమాదకరంగా మారుతుందట. లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉండడానికి అస్సలు ఇష్టపడదట . అంతేకాదు అలా చిక్కుతువ్విన వెంట్రుకలు మూలల తిరుగుతూ ఉంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లు భావించాలట.

మరీ ముఖ్యంగా తల దువ్విన తర్వాత ఆ వెంట్రుకలను అలానే ఎక్కడపడితే అక్కడ వేసేసి వారాలు వారాలు సరిగ్గా రూమ్ క్లీన్ చేసుకోకుండా ఆ వెంట్రుకలు అలా తిరుగుతూ తిరుగుతూ ఉంటే కచ్చితంగా ఆ ఇంట్లో చికాకులు ఉంటాయట. ఆ ఇంటికి పెద్దగా కలిసి రాదు అని పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ఇళ్లల్లో అలా వెంట్రుకలు మూల తిరగడం మహామహా డేంజర్ అంటున్నారు . కొన్ని కొన్ని సార్లు పిల్లలు అలా వెంట్రుకలని నోట్లో కూడా పెట్టేసుకుంటారు. తద్వారా వాళ్లకి విరోచనాలు కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు డాక్టర్లు . అంతేకాదు చిన్నపిల్లలు ఉన్న ఇల్లు చాలా శుభ్రంగా ఉండడం చాలా చాలా మంచిది . మరీ ముఖ్యంగా జుట్టు దువ్విన తర్వాత వెంట్రుకలను అసలు ఇంట్లోనే ఉంచుకోకూడదట . చాలామంది ఆ వెంట్రుకలు దాచిపెట్టుకుంటూ ఉంటారు. అది దరిద్రం అని ఏళ్లనాటి శనిదాచిపెట్టినట్టే అని చెప్పుకొస్తున్నారు పండితులు..!!

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.