ఈ పండు గురించి మీరు విన్నారా? ఆస్తమా మరియు ఆర్థరైటిస్ బాధితులకు ఇది ఒక వరం?

 ప్రకృతి మనకు ప్రసాదించిన మొక్కల్లో అద్భుతమైన పండ్లను ఇచ్చే మొక్కలు ఉన్నాయి. ఇలాంటి పనులు చాలా అరుదుగా ఉంటాయి. దీని ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు.


ఈ పండు పేరు లసోడా… ఈ పండు పేరు ఎప్పుడైనా విన్నారా.. పండును సెల్వత్ అని కూడా పిలుస్తారు. ఇంకా,ఆన్లైన్లో ఈ పండుతో చేసిన పచ్చడి లభిస్తుంది. ఈ పండు ద్వారా కలిగే ఆరోగ్య తెలిస్తే మీరు షాక్ అవుతారు… దీని ప్రయోజనాల గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

ఈ పండు చాలా అరుదుగా దొరుకుతుంది. ఈ పండును ఇండియాలో సెల్వత్ లేదా లసోడా అని పిలుస్తారు. ఎక్కువగా మధ్యప్రదేశ్ లోని బాలఘాట్ ప్రాంతంలో సమృద్ధిగా కనిపించే అరుదైన పండు. ఈ పండులో రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో ప్రత్యేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఈ పండు విచిత్రం ఏమిటంటే… దీన్ని కూరగాయ లాగా… ఇంకా పండులాగా… పచ్చడి లాగా కూడా ఉపయోగిస్తారట. అంతే కాదు, దీనికి అతుక్కునే లక్షణం ఉండడంతో,దీన్ని నుంచి గమ్ము కూడా తయారుచేస్తారు.

Lasoda Fruit ఈ పండులోని ఆరోగ్య ప్రయోజనాలు

ఈ లసోడా పండులో.. ఆక్సిడెంట్లు విటమిన్లు,ఖనిజాలు, పుష్కలంగా ఉంటాయి.అందుకే,ఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అని చెబుతున్నారు నిపుణులు.ఈ పండు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందించడమే కాక,ఆస్తమా, కీల నొప్పులు తెప్పించే ఆర్థరైటిస్ వంటి వ్యాధులకు చికిత్సగా ఉపయోగపడుతుంది. ఈ సెల్వతు చెట్టు సాధారణంగా బాలఘాట్ లోని గ్రామాలలో కనిపిస్తుంది. ఈ చెట్ల సంఖ్య వేగంగా తగ్గిపోతుంది. కాబట్టి, పండ్లు మరింత అరుదైనవిగా మారుతున్నాయి. లోకల్ 18 బృందం మలాజి కండులోని సుఖాత్రా గ్రామాన్ని సందర్శించినప్పుడు, స్థానిక నివాసి సురేష్, ఈ విషయం అక్కడి చెట్టు గురించి విలువైన సమాచారాన్ని అందించారు. సెల్వతు చెట్టు మధ్యస్థ ఎత్తు కలిగి,అనేక కొమ్మలతో ఉంటుంది. ఈ కొమ్మలకు పండ్లు దారాళంగా కాస్తాయి. ఈ పండు నుంచి ఒక బలమైన గమ్ము లాంటి పదార్థం ఉత్పత్తి అవుతుంది. జిగురు లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ జిగురు స్థానికంగా వివిధ అవసరాలకు ఉపయోగపడుతుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.