విస్కీ తాగితే ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

విస్కీ తాగితే ఎన్ని లాభాలున్నాయో తెలుసా?


ఏదైనా మితంగా తీసుకోవాలి. లేదంటే ఆరోగ్యానికి చేటు. ఆల్కహాల్ అయినా మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే.

విస్కీని మితంగా తీసుకోవడంవల్ల రక్త ప్రసరణతోపాటు మెదడులోని కొన్ని ప్రాంతాలను ఉత్తేజపరుస్తుంది. విస్కీని పులియబెట్టిన ధాన్యాల నుంచి తయారుచేస్తారు. ఇందులో 40 శాతం ఆల్కహాల్ ఉంటుంది. దీన్ని మితంగా తీసుకోవడంవల్ల వ్యాధి నిరోధక శక్తి పెరగడంతోపాటు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జలుబు కూడా తగ్గుతుంది. ఇంకా ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.

గుండె ఆరోగ్యానికి మేలు

పరిమిత మోతాదులో విస్కీ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గి మంచి కొలెస్ట్రాల్ (HDL) పెరుగుతుంది. ఇది రక్త నాళాలను వ్యాకోచింప చేయడంతోపాటు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. గుండె జబ్బులు తగ్గడంతోపాటు గుండెపోటు వచ్చే ప్రమాదం తప్పుతుంది. విస్కీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులో ఉండే యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జలుబు లక్షణాలను తగ్గిస్తాయి.

దగ్గు, ఛాతీ నొప్పి తగ్గుతుంది

విస్కీ శ్వాస మార్గాల్లోని శ్లేష్మం కరిగిపోయేలా చేయడంతోపాటు దగ్గు, ఛాతీ నొప్పిని తగ్గిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ఒత్తిడి, ఆందోళనలను తగ్గించడంలో సహాయపడుతుంది. విస్కీని మోతాదులో తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగుపడతాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు. ఈ ప్రయోజనాలన్నీ విస్కీని పరిమితంగా తీసుకోవడంవల్లనే లభిస్తాయి. ఎక్కువగా తీసుకుంటే వర్తించవు. వైద్యుల సూచనలు, సలహాల మేరకే ఆల్కహాల్ ను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.