మాంసాహారం తినేవాళ్లు చాలామంది చేపలను ఇష్టంగా తింటారు. మాంసాహారంలో చికెన్, మటన్ కంటే చేపల్లోనే మనకు ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే ఎన్నో పోషకాలు ఉంటాయని చెబుతారు.
ఇక చేపలను నిత్య ఆహారంలో భాగంగా చేర్చుకుంటే ఆరోగ్యంగా ఉంటామని కూడా చాలామంది నమ్ముతారు. చేప గుడ్లు తినటం మంచిదేనా.. చేపలలో ఉండే పోషకాల కారణంగా చేపలు మనకు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి అన్న మాట వాస్తవమే. అయితే చేప గుడ్లు కూడా మన ఆరోగ్యానికి ప్రయోజనాన్ని చేకూరుస్తాయా? చేప గుడ్లను తినడం వల్ల శరీరంలో ఏం జరుగుతుంది? ముఖ్యంగా జన అని చెప్పి చేప గుడ్లను తినడం మంచిదేనా? అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.
చేపలతో పాటు చేప గుడ్లలో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. చేప గుడ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది మన అధిక రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది. చేప గుడ్లను తింటే గుండె సంబంధిత సమస్యలు కూడా దగ్గరకు రాకుండా ఉంటాయి . గుండె సంబంధిత సమస్యలు రాకుండా మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే గొప్పగుణం చేప గుడ్లకు ఉంది చేప గుడ్లలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. చేప గుడ్లను తింటే మన జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇక చేప గుడ్లను తింటే కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అంతేకాదు చేప గుడ్లను రెగ్యులర్ గా తీసుకునే వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. మహిళలకు వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా చేప గుడ్లు చేస్తాయని చెప్పవచ్చు.
మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే గొప్పగుణం చేప గుడ్లకు ఉంది. ఇక చేప గుడ్లలో మెగ్నీషియం, క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ డి వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చేప గుడ్లు మన ఎముకలను బలోపేతం చేయడానికి ఎంతగానో దోహదం చేస్తాయి. చేప గుడ్లు తిన్న వారిలో దంతాల సమస్యలు రాకుండా ఉంటాయి. మన బాడీ ఇమ్యూనిటీని పెంచడంతో పాటు మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తున్న చేప గుడ్లను ఆహారంలో భాగం చేసుకోవడం ఎంతో మంచిది.